• facebook
  • whatsapp
  • telegram

లాభ‌న‌ష్టాలు

* కొన్న వెల (Cost Price) కంటే అమ్మిన వెల (Selling Price) ఎక్కువగా ఉంటే లాభం (Profit) వస్తుంది.
    లాభం = అమ్మిన వెల - కొన్న వెల
* కొన్న వెల కంటే అమ్మిన వెల తక్కువగా ఉంటే నష్టం (Loss) వస్తుంది.
   నష్టం = కొన్న వెల - అమ్మిన వెల
* లాభశాతం లేదా నష్టశాతాన్ని ఎప్పుడూ కొన్న వెల మీదే లెక్కించాలి.



* కొన్న వెల, లాభశాతం లేదా నష్టశాతం తెలిసినప్పుడు...

* అమ్మిన వెల, లాభశాతం లేదా నష్టశాతం తెలిసినప్పుడు....

* ఒక వ్యక్తి రెండు వస్తువులను ఒకే ధరకు అమ్మడం వల్ల ఒక వస్తువుపై x% లాభం, మరొక వస్తువుపై x% నష్టం వస్తే, మొత్తం మీద అతడికి  నష్టం వస్తుంది.
* లాభశాతం


1. కిందివాటిలో ఎక్కువ లాభశాతం దేనిలో ఉంది? 
      C.P. (రూ.)         లాభం (రూ.)
ఎ)     36      -----       17
బి)     50     -----       24
సి)     40     -----        19
డి)     60     -----        29
వివరణ: 
లాభ శాతం కావాలంటే

         
దీని ప్రకారం 

 (ఎక్కువ లాభ శాతం ఉంది)

2. ఒక వస్తువును రూ.900 లకు అమ్మడంవల్ల 10 శాతం లాభం వస్తుంది. అయితే ఆ వస్తువు కొన్న ధర ఎంత?
జ: రూ.810
వివరణ: అమ్మిన ధర = 900, లాభశాతం = 10%
కొన్నధర = ?
సూత్రప్రకారం,  కొన్న ధర = అమ్మిన ధర - లాభం
                                     = 900 - 10% of 900
                                     = 900 -  900 
                900 - 90 = 810

 

3. ఒక వస్తువును రూ. 990కి అమ్మడం వల్ల 10% నష్టం ఉంది. అయితే ఆ వస్తువు కొన్న ధర ఎంత?
జ:  రూ. 1089
వివరణ: కొన్న ధర = అమ్మిన ధర + నష్టం
                             = 990 + 10% of 990      
కొన్న ధర = 990 +  990 = 1089

 

4. 12 పుస్తకాలు కొన్నధర 8 పుస్తకాలు అమ్మిన ధరకు సమానం అయితే లాభశాతం ఎంత?
జ:  50% 
వివరణ: ఒక్కో పుస్తకం కొన్న ధర రూ. 1.   8 పుస్తకాలు కొన్న ధర = రూ. 8.  
8 పుస్తకాలు అమ్మిన ధర = రూ.12. 
8 పుస్తకాల అమ్మిన ధర =   = 50%
   లాభ శాతం =   = 50%

 

5. ఒక వస్తువు కొన్న ధర, అమ్మిన ధరల మధ్య నిష్పత్తి 4 : 5 అయితే లాభశాతం ఎంత?
జ:  25% 
వివరణ: ఒక వస్తువు కొ.వె. = రూ. 4 x     
అ.వె = రూ. 5x అనుకోండి.
లాభం = అ.వె - కొ.వె
          = 5x - 4x = రూ. x 
  లాభ శాతం 

  
 

6. ఒక వ్యాపారి వస్తువు కొన్న ధరపై 20% ఎక్కువ ధరను ముద్రించి దానిపై 10% డిస్కౌంట్ ఇస్తే అతడికి లాభశాతం ఎంత?
జ:  8%
వివరణ: వస్తువు కొ.వె. = రూ. 100 అనుకోండి.
ముద్రించిన ధర = రూ. (100 + 20) = రూ. 120
డిస్కౌంట్ = 10% of 120
               = 120 = రూ. 12   
  తగ్గిన ధర = రూ. 120 - రూ. 12  = రూ. 108
  లాభ శాతం = 108 - 100 = 8%
Short cut:  లాభ శాతం = 20 - 10 - 20     = 20 - 12 = 8%

7. కౌశిక్ ఒకపాత స్కూటర్ రూ.4700కు కొని రూ.800తో రిపేర్ చేయించి దాన్ని రూ.5800కు అమ్మాడు. అయితే అతడికి వచ్చిన లాభ శాతం ఎంత?
జ:   
వివరణ: 
స్కూటర్ కొన్న ధర = రూ. (4700 + 800) = రూ. 5500
అమ్మిన ధర = రూ. 5800,
లాభం = అ.వె - కొ.వె = 5800 - 5500 = రూ. 300
లాభ శాతం    
 లాభ శాతం  

 

8. రాకేష్ ఒక గడియారాన్ని రూ. 450కు అమ్మడంవల్ల 20% నష్టం వచ్చింది. అతడికి 20% లాభం రావాలంటే
దాన్ని ఎంత ధరకు అమ్మాలి?
జ:  రూ. 675 
వివరణ:  రాకేష్  గడియారాన్ని కొ.వె. = రూ.100% అనుకోండి. కానీ, అతడికి 20% నష్టం వచ్చింది. అంటే 80%
విలువకు సమానం. 
80%   ------   450
120% -------   ?
     అమ్మిన ధర =     450 = రూ. 675

 

9. ఒక వ్యక్తి రెండు వస్తువులను ఒక్కొక్కటి రూ.990 కు అమ్మితే మొదటి వస్తువుపై 10% లాభం, రెండో దానిపై 10% నష్టం వచ్చింది. అయితే ఆ రెండు వస్తువుల కొన్న ధర ఎంత?
జ: రూ. 2000  
వివరణ:  మొదటి వస్తువు అమ్మిన ధర = రూ. 990,
లాభం = 10%,   అ.వె = 110% of  కొ.వె
990 =  కొ.వె    
  కొన్నవెల   = రూ. 990
రెండో వస్తువు అమ్మిన ధర = 990,
నష్టం = 10%,   అ.వె = 90% of  కొ.వె
990 =  కొ.వె.  
  కొన్న వెల    = రూ. 1100
*  రెండు వస్తువుల కొన్న ధర = 900 + 1100 = రూ.2000
Shortcut:  Total CP  

 

10. వరుస డిస్కౌంట్లు 10%, 12%, 15% లకు సమానమైతే ఒకే డిస్కౌంటు ఎంత?
జ:  32.68%
వివరణ:  ఒక వస్తువుపై ముద్రించిన ధర = రూ.100 అనుకోండి.  
అమ్మినధర = 90% of  88% of  85 of 100     = రూ. 67.32
ఒకే  డిస్కౌంట్ = (100 - 67.32)% = 32.68


11. ఒక వస్తువు ముద్రించిన ధర రూ. 80 దానిపై రెండు వరుస డిస్కౌంట్లు 5% చొప్పున ఇచ్చిన తర్వాత దాన్ని అమ్మితే ధర ఎంత?

జ:  రూ. 72.20
వివరణ:  ఒక వస్తువుపై ముద్రించిన ధర = రూ. 80 రెండు వరుస డిస్కౌంట్‌లు 5% చొప్పున
అమ్మిన ధర = 95%  of  95%  of  80
                   =  

  
                   = రూ. 72.20
 

12. ఒక వ్యాపారి ఒక వస్తువుపై 30% ఎక్కువ ముద్రించి దానిపై 30% డిస్కౌంట్ ఇస్తే అతడికి లాభమా, నష్టమా? ఎంత?
జ:  9 శాతం నష్టం
వివరణ:  వస్తువు ధర = రూ. 100 అనుకోండి.        
ముద్రించిన ధర = (100 + 30) = రూ. 130
డిస్కౌంట్ ఇచ్చింది = 30% of 130
                             =    130 = 39
          అమ్మిన ధర = 130 - 39 = 91
             నష్ట శాతం = 100 - 91 = 9%
Shortcut:      = -9%        
- అంటే నష్టం.

13. ఒక వ్యాపారి వస్తువుపై వరుస డిస్కౌంట్ 12%, 5% చొప్పున ఇచ్చి రూ. 209 అమ్మాడు. అయితే దాని పూర్వ (Original) ధర ఎంత?
జ:  రూ. 250 
వివరణ:  పూర్వ ధర = రూ. x అనుకోండి.
దానిపై రెండు డిస్కౌంట్లు 12%, 5% అయితే 88% of 95% of x = 209 

          
         = రూ. 250
(ముందుగా 11, 19, 5 లతో కొట్టివేయాలి.)

 

14. ఒక వ్యాపారి రూ. 5 కు 6 నిమ్మకాయల చొప్పున కొని, వాటిని రూ. 6 కు 5 చొప్పున అమ్మాడు. అయితే
ఆ వ్యాపారికి లాభశాతం ఎంత?
జ:  44%
వివరణ:  వస్తువు    ధర
              6(a)        5(b)        
              5(c)         6(d)   =    

          
 

15. ఒక వ్యాపారి రూ. 1 కి 20 వస్తువులను అమ్మడం ద్వారా 20% లాభం పొందాడు. అయితే, ఆ వ్యాపారి రూ.1 కి ఎన్ని వస్తువులు కొని ఉంటాడు?
జ:  24 
వివరణ:  రూ. 1 =      =  24.

 

16. ఒక గడియారం ముద్రించిన ధర రూ. 720. దానిపై రెండు వరుస డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత దాన్ని
రూ. 550.80కు అమ్మాడు. మొదటి డిస్కౌంట్ 10% అయితే రెండో డిస్కౌంట్ ఎంత?
జ:  14% 
వివరణ: రెండో డిస్కౌంట్ x% అనుకోండి. అయితే 90% of (100 - x)% of  720 = 550.80 

 
100 - x = 85
100 - 85 = x
  రెండో డిస్కౌంట్  =  15%

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌