• facebook
  • whatsapp
  • telegram

వర్గ సమీకరణాలు 

సమాధానం: 3


 


⇒ 56x2 + 56 = 113x

⇒ 56x2 − 113x + 56 = 0

⇒ 56x2 − 49x − 64x + 56 = 0

⇒ 7x(8x − 7) − 8(8x − 7) = 0

⇒ (8x − 7)(7x − 8) = 0

⇒ 8x − 7 = 0 లేదా  7x − 8 =0

సమాధానం: 3




3. (b − c)x2 + (c − a)x + (a − b) = 0 మూలాలు సమానం. అయితే కింది వాటిలో ఏది సత్యం?

1) b = a + c    2) a + b = c    3) 2b = a − c     4) 2b = a + c

సాధన: (b − c)x2 + (c − a)x +(a − b) = 0 మూలాలు సమానం అయితే విచక్షణి ‘0’ అవుతుంది.

⇒(c − a)2 − 4(b − c) (a − b) = 0

⇒ c2 + a2 − 2ac − 4ab + 4b2 + 4ac − 4bc = 0

⇒ a2 + 4b2 + c2 − 4ab − 4bc + 2ac = 0

⇒ (a − 2b + c)2 = 0

⇒ a − 2b + c = 0

⇒ 2b = a + c

సమాధానం: 4




4. ఒక చదరంగం బోర్డు 64 సమాన చదరపు గడులను కలిగి ఉంది. ఒక్కొక్క చదరం వైశాల్యం 6.25 సెం.మీ2. ఆ బోర్డు చుట్టూ 2 సెం.మీ. వెడల్పు ఉన్న ఖాళీ స్థలం వదిలారు. అయితే ఆ చదరంగం బోర్డు భుజం పొడవు ఎంత? (సెం.మీ.లలో)

1) 24      2) 36       3) 20    4) 28

సాధన: చదరంగం బోర్డు భుజం పొడవు = x సెం.మీ. అనుకోండి.  

64 చదరపు గడుల వైశాల్యం = (x − 4)2

⇒ 64 × 6.25 = (x - 4)2

⇒ (x - 4)2 = 400

⇒ x2 - 8x + 16 = 400

⇒ x2 - 8x - 384 = 0

⇒ x2 - 24x + 16x - 384 = 0

⇒ x(x - 24) + 16(x - 24) = 0

⇒ (x - 24) (x + 16) = 0

⇒ x - 24 = 0 లేదా  x + 16 = 0

⇒ x = 24 లేదా x = -16

x = 24 సెం.మీ.

సమాధానం: 1





5. ఒక దుకాణదారుడు పుస్తకం ధరను రూ.5 తగ్గించడం ద్వారా రూ.300కు అదనంగా మరొక 5 పుస్తకాలు కొన్నాడు. అయితే ఒక్కొక్క పుస్తకం ప్రకటన వెల ఎంత?

1) రూ.25      2) రూ.20

3) రూ.30      4) రూ.15

సాధన: ఒక్కొక్క పుస్తకం ప్రకటన వెల = రూ.x అనుకోండి.

రూ.300 లకు లభించే పుస్తకాల సంఖ్య = 300/x   

ధర రూ.5 తగ్గించడం ద్వారా లభించే పుస్తకాల సంఖ్య = 

⇒ x2 - 5x = 300

⇒ x2 - 5x - 300 = 0

⇒ x2 - 20x + 15x - 300 = 0

⇒ x(x - 20) + 15(x - 20) = 0

⇒ (x -20) (x + 15) = 0

⇒ x = 20 లేదా x = -15

⇒ x = రూ.20

సమాధానం: 2




6. (a2 + b2)x2-2(ac + bd)x + (c2+ d2) = 0 వర్గ సమీకరణం మూలాలు సమానమైతే కిందివాటిలో సరైంది ఏది?

1) ab = cd   2) ac = bd   3) ad = bc    

సాధన: (a2 + b2)x2 - 2(ac + bd)x +(c2 + d2) = 0  మూలాలు సమానమైతే విచక్షణి ‘0’ అవుతుంది.

(−2(ac + bd))2 = 4(a2 + b2)(c2 + d2) 4(a2c2 + b2d2 + 2(ac)(bd))

= 4(a2c2 + a2d2 + b2c2 + b2d2)

a2c2 + b2d2 + 2(ac)(bd) 

= a2c2 + a2d2 + b2c2 + b2d2

2(ac)(bd) =  a2d2 + b2c2
2(ad)(bc) = (ad)2 + (bc)2
(ad)2 + (bc)2 − 2 (ad)(bc) = 0
(ad − bc)2 = 0
ad − bc = 0
ad = bc

సమాధానం: 3




7. ఒక రెండంకెల సంఖ్యలోని అంకెల లబ్ధం 24. ఆ సంఖ్యకు 18 కూడితే ఆ సంఖ్యలోని అంకెల స్థానాలు తారుమారు అవుతాయి. అయితే ఆ సంఖ్య....

1) 38   2) 46    3) 83    4) 64

సాధన: రెండంకెల సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని అంకె =  y అనుకోండి.

పదుల స్థానంలోని అంకె = x అనుకోండి.

ఆ సంఖ్య = 10x + y

లెక్కప్రకారం, xy = 24,

10x + y + 18 = 10y + x

ఇప్పుడు, 10x + y + 18 = 10y + x

⇒ 10x − x + 18 = 10y − y

⇒ 9x + 18 = 9y

⇒ x + 2 = y

ఆ సంఖ్య, = 10x + y

= 10(4) + 6

= 46

సమాధానం: 2




8. (2k + 1)x2 − (7k + 9)x + (k + 2) = 0 వర్గసమీకరణానికి ఒక మూలం మరొకదాని వ్యుత్క్రమం అయితే k విలువ...

1) 4    2) 3    3) 2    4) 1

సాధన: (2k + 1)x2- (7k + 9)x +(k + 2) = 0 ను ax2 + bx + c = 0 తో పోలిస్తే,a = 2k + 1, b = −(7k + 3),c = (k + 2)

ax2 + bx + c = 0 మూలాలు ఒకదానికి మరొకటి వ్యుత్క్రమం అయితే మూలాల లబ్ధం = 1

సమాధానం: 4




9. మొదటి n సరి సహజసంఖ్యల మొత్తం 342. అయితే - విలువ ఎంత?

1) 16     2) 18    3) 20     4) 19

సాధన: మొదటి n సరిసంఖ్యల మొత్తం = n(n + 1)

⇒ n(n + 1) = 342

⇒ n2 + n − 342 = 0

⇒ n2 + 19n − 18n − 342 = 0

 n = 18
⇒ (n + 19) (n − 18) = 0
⇒ n = − 19 లేదా  n = 18

సమాధానం: 2


 


10. ఒక లంబకోణ త్రిభుజం కర్ణం పొడవు అతిచిన్న భుజం పొడవు రెట్టింపు కంటే 3 మీ. ఎక్కువ. మూడో భుజం పొడవు కర్ణం పొడవు కంటే 1 మీ. తక్కువ అయితే ఆ త్రిభుజ భుజాల కొలతలు...        

1) 5 మీ., 12 మీ., 13 మీ.    

2) 6 మీ., 14 మీ., 15 మీ.    

3) 7 మీ., 16 మీ., 17 మీ.    

4) 8 మీ., 18 మీ., 19 మీ.

సాధన: లంబకోణ త్రిభుజంలో అతిచిన్న భుజం పొడవు = x మీ. అనుకోండి.

కర్ణం =  2x +3 మీ.

మూడో భుజం =(2x + 3) − 1
= (2x + 2) మీ.

పైథాగరస్‌ సిద్ధాంతం ప్రకారం, 

కర్ణం = భుజం2 + భుజం2

⇒  (2x + 3)2 = (2x + 2)2 + x2
⇒  4x2 + 12x + 9
= 4x2 + 8x + 4 + x2
⇒  x2 − 4x − 5 =0
⇒  (x − 5) (x + 1) = 0
⇒  x = 5 లేదా x = −1 ⇒ x = 5 మీ.
2x + 2 = 2(5) + 2 = 12
2x + 3 = 2(5) + 3 = 13

 ఆ త్రిభుజ భుజాలు 

=  5 మీ., 12 మీ., 13 మీ. 

సమాధానం: 1


* 3 తో ప్రారంభమైన n వరుస బేసి సహజ సంఖ్యల మొత్తం 120 అయితే n విలువ....

1) 8    2) 10    3) 12     4) 14

సాధన: 3 + 5 + 7 + .......+(2n + 1) = 120

n/2 [3 + 2 + 1] = 120

⇒ n[2n + 4] = 240

⇒ 2 × n[n + 2] = 240

⇒ n[n + 2] = 120

⇒ n2 + 2n − 120 = 0

⇒ n2 + 12 (n − 10)n − 120 = 0

⇒ (n + 12)(n − 10) = 0

⇒ n = −12  లేదా 10

⇒ n = 10      

సమాధానం: 2

Posted Date : 09-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌