• facebook
  • whatsapp
  • telegram

సిలోజిజం

ఈ విభాగంలో ప్రకటనలు, తీర్మానాలు ఇస్తారు. ఇచ్చిన ప్రకటనల దృష్ట్యా ఏ తీర్మానాలు సరైనవో గుర్తించమని అడుగుతారు. ప్రకటనల పరిమాణం, గుణముల ఆధారంగా వాటిని ప్రధానంగా నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి;   అన్ని, ఏదీకాదు, కొన్ని, కొన్నికావు.

    ప్రతి ప్రకటనలో రెండు పదాలు అంటే.. వ్యక్తులు, వస్తువులు మొదలైన వాటి పేర్లు గానీ, లక్షణాలు గానీ ఇస్తారు. అభ్యర్థికి ప్రకటనలోని అర్థాన్ని సహజంగా చూస్తే తప్పుగా అనిపిస్తుంది. కానీ వాటిని సత్యమే అని భావించి వాటి నుంచి ఏ తీర్మానాలు సరైనవో నిర్ధారించగలగాలి.


ఉదా: అన్ని కలాలు దుకాణాలు.

పై ప్రకటన సహజంగా చూస్తే తప్పు. కానీ దాన్ని సత్యమే అని భావించి, దాన్నుంచి ఏయే తీర్మానాలు సత్యమవుతాయో గుర్తించగలగాలి. ప్రకటనల నుంచి సరైన తీర్మానాలను గుర్తించేందుకు వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు. 


వెన్‌ చిత్రాల పద్ధతి  

కొన్ని ప్రకటనలను ఒకటి కంటే ఎక్కువ వెన్‌ చిత్రాల రూపాల్లో దాని భావాన్ని వ్యక్తపరచవచ్చు. అయితే ‘కనీసం కలిసి ఉండే  పద్ధతి’ ( Minimum Overlopping Concept ) ఆధారంగా ఒక సాధారణ చిత్రాన్ని గీస్తూ జవాబులు రాబట్టడానికి ప్రయత్నించాలి.

ఉదా: ప్రకటనలకు ఉండే అన్ని అవకాశాలు

 

సంక్షిప్త పద్ధతులు

I)  అన్ని A లు B లు


             

1. అన్ని సత్యమైతే అందులో ఉన్న కొన్ని కూడా సత్యమవుతాయి.

2. కొన్ని సత్యమైతే అన్ని సత్యమవ్వాలని లేదు.

3. కొన్ని సత్యమైతే కొన్ని కావు అనేది సత్యమవ్వాలని లేదు.


II) ఏ A, B కాదు   
         


4. ఏదీకాదు సత్యమైతే కొన్ని కావు అనేది సత్యమవుతుంది.


III) కొన్ని Aలు Bలు 


5. కొన్ని సత్యమైతే కొన్ని కావు అనే వాక్యం కచ్చితంగా సత్యమే అని చెప్పలేం. కావొచ్చు/ కాకపోవచ్చు కూడా.


మాత్రమే అనే పదం ప్రకటనలో ఉంటే..

IV) కొన్ని A లు మాత్రమే B లు


కొన్ని A లు మాత్రమే Bలు అన్నప్పుడు మిగతా Aలు Bలు కావు అని అర్థం.


V)  కొన్ని తిలు మాత్రమే తీలు కావు


కొన్ని A లు మాత్రమే B లు కావు. అంటే మిగతావి అవుతాయి అని అర్థం.


VI)  A లు మాత్రమే B లు 


A లు మాత్రమే B లు అంటే  B లు అన్ని A లు అని అర్థం.


ముఖ్యమైన పదాలు

1. చాలామట్టుకు లేదా ఎక్కువ లేదా 90% లేదా 99% = కొన్ని అని అర్థం

2. కనీసం కొన్ని = కొన్ని అని అర్థం

3. కాకపోవచ్చు లేదా కావచ్చు లేదా అవకాశం ఉంది = possibility సందర్భం అని అర్థం.

*  కింద ఇచ్చిన ప్రకటనల దృష్ట్యా ఏ తీర్మానాలు సరైనవో గుర్తించండి.

1. ప్రకటనలు:  

  i) అన్ని వాహనాలు బస్సులు

  ii) అన్ని బస్సులు కార్లు

తీర్మానాలు:

   1) అన్ని వాహనాలు కార్లు

   2) అన్ని కార్లు వాహనాలు 

  3) కొన్ని బస్సులు వాహనాలు

  4)  కొన్ని కార్లు బస్సులు కావు

a) 1 మాత్రమే సరైంది  b)  1, 2  సరైనవి     c)  1, 3  సరైనవి        d) అన్నీ సరైనవే

వివరణ: 

 

                                                    సమాధానం: c


2. ప్రకటనలు:

i) అన్ని బలపాలు పెన్నులు

ii) ఏ పెన్ను కాగితం కాదు

తీర్మానాలు:

1) కొన్ని బలపాలు కాగితాలు 

2) ఏ బలపం కాగితం కాదు 

3) కొన్ని బలపాలు కాగితాలు కావు

4) ఏ కాగితం బలపం కాదు

a) 1, 2, 3 సరైనవి     b) 2, 3, 4 సరైనవి     c) 4 మాత్రమే సరైంది    d)  పైవన్నీ సరైనవే

3. ప్రకటనలు:

i) ఏ పలక బలపం కాదు 

ii) అన్ని బలపాలు పెన్నులు

తీర్మానాలు:

1) కొన్ని పలకలు పెన్నులు కావు 

2) ఏ బలపం పలక కాదు

3) కొన్ని పెన్నులు పలకలు కావు

4) అన్ని పెన్నులు బలపాలు

a) 1, 2 సరైనవి                     b) 2, 3 సరైనవి 

c) కేవలం 3 మాత్రమే సరైంది    d)కేవలం 2 మాత్రమే సరైంది

 
 

4. ప్రకటనలు:

i) కొన్ని P లు Q లు    

ii) అన్ని Q లు R లు

తీర్మానాలు:

1) కొన్ని P లు R లు       

2) అన్ని R లు P లు

 A) 1 మాత్రమే సరైంది 

B) 2 మాత్రమే సరైంది  

C) 1 లేదా 2 సరైంది   

D) రెండూ సరైనవి కావు

 


5. ప్రకటనలు:

i) కొన్ని A లు B లు    

ii) అన్ని తీ లు ది లు 

iii) కొన్ని ది లు దీ లు

తీర్మానాలు:

1) కొన్ని A లు C లు కావు

2) కొన్ని B లు D లు 

3) కొన్ని B లు D లు కావొచ్చు

a) 1, 3 సరైనవి      b) 1, 2 సరైనవి   c) 3 మాత్రమే సరైంది  d)ఏదీ సరైంది కాదు

వివరణ:

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎన్టీపీసీ

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌