• facebook
  • whatsapp
  • telegram

వెన్ చిత్రాలు

          వెన్ చిత్రాల విభాగం నుంచి వచ్చే ప్రశ్నలు రెండు రకాలు. మొదటి రకంలో 3 వృత్తాలు ఉంటాయి. వీటిలోని సంబంధం అర్థంచేసుకొని దానికి సరిపోయే వెన్ చిత్రాన్ని గుర్తించాలి.
 

1)  పొడవైన మనుషులు, నల్లటి వెంట్రుకలున్న మనుషులు, భారతీయుల మధ్యఉన్న సంబంధాన్ని తెలిపే రేఖా చిత్రం ఏది?
జవాబు: 
సాధన: కొంతమంది పొడవైన వారికి నల్లని వెంట్రుకలు ఉండవచ్చు. కొంతమంది నల్లని వెంట్రుకలు ఉన్నవారు భారతీయులు కావచ్చు. కొంతమంది పొడవైన వారు భారతీయులై ఉండవచ్చు. ఈ మూడురకాలు కొంత భాగం కలిగి ఉండవచ్చు.
          

2) భూమిపై, నీటిలో నివసించే జంతువులను రెండు పెద్ద వృత్తాలు; నీటిలో, భూమిపై నివసించే జంతువులను     ఒక చిన్న వృత్తంతో సూచిస్తున్నారు. ఈ మూడు అంశాల మధ్య ఉన్న సంబంధం ఏది?

జవాబు: 
సాధన:
భూమిపై ఉండే కొన్ని జంతువులు నీటిలో కూడా ఉంటాయి. నీటిలో ఉండే కొన్ని జంతువులు భూమిపై కూడా ఉంటాయి. కాబట్టి
       

 

3) స్త్రీలు, తల్లులు, డాక్టర్ల మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే రేఖా చిత్రం ఏది?
జవాబు: 

సాధన: సర్వసాధారణంగా తల్లులు అంటే స్త్రీలే. అంటే ఒక వృత్తం పూర్తిగా మరొక వృత్తంలో ఉంటుంది. డాక్టర్లలో కొంతమంది తల్లులు ఉండవచ్చు, కొంతమంది (తల్లులు కాకపోయినా) స్త్రీలు ఉండవచ్చు. కొంతమంది పురుషులూ ఉండవచ్చు. కాబట్టి
                          

 

4)  దొంగ, జడ్జి, క్రిమినల్ మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే రేఖా చిత్రాన్ని గుర్తించండి.
జవాబు:  
సాధన:
క్రిమినల్స్ అంటే అందులో అన్ని రకాల నేరస్తులూ ఉంటారు. దొంగలు క్రిమినల్స్‌లో ఒక భాగం. జడ్జికి, వారికి ఎలాంటి సంబంధం ఉండదు.
                                                     

5) టీ, కాఫీ, పానీయాల మధ్య సంబంధాన్ని తెలియజేసే రేఖా చిత్రం-  
జవాబు: 
సాధన:
టీ, కాఫీలు రెండూ కూడా పానీయాలు, కానీ రెండూ విభిన్న రకాల పానీయాలు. వీటిలో ఇవికాకుండా వేరేవి కూడా ఉంటాయి.
                     

 

6)  భారతదేశంలోని కింది వర్గాల సంబంధాన్ని సరిగ్గా ఏది తెలియజేస్తుంది?
    టెన్నిస్ అభిమానులు, క్రికెట్ఆటగాళ్లు, విద్యార్థులు?
జవాబు: 


సాధన:
కొందరు విద్యార్థుల్లో క్రికెట్ ఆటగాళ్లు ఉండవచ్చు. కొందరు క్రికెట్ ఆటగాళ్లు టెన్నిస్ అభిమానులుగా ఉండవచ్చు. కొందరు విద్యార్థులు టెన్నిస్ అభిమానులుగా ఉండవచ్చు.
                      

7) వయసు, సంఖ్య, పదమూడుల మధ్య సంబంధాన్ని తెలియజేసే రేఖా చిత్రం- 
జవాబు: 
సాధన:
కొందరి వయసు పదమూడు ఉంటుంది. కొన్ని సంఖ్యలు పదమూడు ఉంటాయి. అప్పుడు-
                           

 

8) Canines, dogs, pups మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసే రేఖా చిత్రం-
జవాబు: 


సాధన:

Pups అంటే కుక్క పిల్లలు. అవి పెద్ద అయితే కుక్కలు అవుతాయి. Canines అంటే తోడేలు లేదా కుక్క కావచ్చు.    

9) ఒక విందు భోజనంలో చేపలు, మాంసం వడ్డించారు. కొందరు చేపలు మాత్రమే తిన్నారు. కొందరు మాంసం, కొందరు శాకాహారం మాత్రమే తిన్నారు. మిగిలిన వారు చేపలు, మాంసం రెండింటినీ తిన్నారు. వీరికి సరిపోయే రేఖాచిత్రం ఏది?
జవాబు: 
సాధన:
కొందరు చేపలు, మాంసం తిన్నారు. అంటే కొంత భాగం చేపల్లో మరికొంత భాగం మాంసంలో ఉంటుంది. కొందరు శాకాహారం మాత్రమే అంటే ఈ రెండింటికీ ఎలాంటి సంబంధం ఉండదు. అప్పుడు
 
                            


10) హిందీ, ఇంగ్లిష్, ఫ్రెంచ్‌ల మధ్య సంబంధాన్ని తెలియజేసే రేఖా చిత్రం-
జవాబు: 
సాధన:
హిందీ, ఇంగ్లిష్, ఫ్రెంచ్ అనేవి భాషలు. కానీ మూడూ కూడా వేరువేరు భాషలు. అప్పడు
                          

 

11. ట్రక్, షిప్, గూడ్స్ మధ్య సంబంధాన్ని తెలియజేసే రేఖా చిత్రం-
జవాబు:  

12. ఇచ్చిన వెన్ చిత్రాన్ని చదివి ఆర్ట్స్, కామర్స్ చదువుతూ ఎకనమిక్స్ చదవని విద్యార్థులను సూచించే ప్రాంతాన్ని గుర్తించండి.     

జవాబు: V
సాధన: ఎకనమిక్స్‌ను సూచించే వృత్తానికి బయట ఉండి ఆర్ట్స్, కామర్స్‌లను సూచించే వృత్తాల ఛేదన ప్రాంతం ఆర్ట్స్, కామర్స్.  చదువుతూ ఎకనమిక్స్ చదవని విద్యార్థులను సూచిస్తుంది. కింది ఛాయా ప్రాంతం ఆర్ట్స్, కామర్స్ చదువుతూ ఎకనమిక్స్, చదవని విద్యార్థులను సూచిస్తుంది.
                                                             


13. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల మధ్య ఉన్న సంబంధాలను తెలియజేసే వెన్ చిత్రాన్ని గుర్తించండి.
జవాబు: 
సాధన:
సూర్యుడు ఒక నక్షత్రం, చంద్రుడు నక్షత్రం కాదు. కాబట్టి ఈ రెండింటికీ ఎలాంటి సంబంధం ఉండదు. అప్పుడు  

       

15. ఘన, ద్రవ, వాయు పదార్థాల సంబంధాన్ని సూచించే వెన్ చిత్రాన్ని గుర్తించండి?
జవాబు: 
సాధన:
ఘన, ద్రవ, వాయు పదార్థాలు మూడు ఒకదానికొకటి విభిన్నాలు. అప్పుడు

                             

సూచనలు (ప్ర. 1-5 వరకు) : కింది ప్రతి ప్రశ్నలో మూడు పదాలు ఇచ్చారు. వాటి సహజ స్వభావం ఆధారంగా వాటిమధ్య ఉన్న సంబంధాన్ని సరిగ్గా వ్యక్తపరిచే వెన్‌ చిత్రాన్ని పైవాటిలో నుంచి ఎన్నుకోండి.

1. దొంగ, నేరస్థుడు, జడ్జి

1) I       2)  II       3)  III       4) IV

2. పురుషులు, పిల్లలు, తండ్రులు

1) I       2)  II       3)  V       4) IV

3. వైద్యులు, స్త్రీలు, తల్లులు

1) III       2)  I       3)  V      4) IV

4. ఆటోమొబైల్స్, కారు, బైకు

1) I       2)  II       3)  III       4) IV

5. కణం, కేంద్రకం, కణజాలం

1) I       2)  II       3)  III      4) పైవేవీకావు


సూచనలు (ప్ర. 6 - 10 వరకు)

కింది ప్రతి ప్రశ్నలో ఇచ్చిన పదాల మధ్య ఉన్న సంబంధాన్ని వ్యక్తపరిచే వెన్‌చిత్రాన్ని పైవాటిలో నుంచి ఎన్నుకోండి?

6. బలం, జ్ఞానం, ఉద్వేగం

1) II        2) III        3) IV        4) V

వివరణ: మూడూ వేర్వేరు అంశాలు

                                           సమాధానం: 2


7. ప్రొఫెసర్, పిల్లలు, రచయిత

1) V       2) 5       3) 1         4) II


8. ఇల్లు, ఇటుకలు, బ్రిడ్జి

1) I      2) III         3) IV        4) V

9. బాలురు, విద్యార్థులు, అథ్లెట్స్‌

1) I       2) II         3) III      4) V

వివరణ: కొందరు బాలురు విద్యార్థులు కావొచ్చు, విద్యార్థులు అథ్లెట్స్‌ కావొచ్చు, అథ్లెట్స్‌ బాలురు  కావొచ్చు.

                                    సమాధానం: 2


10. భూమి, అడవులు, పర్వతాలు

1)  IV     2) V         3) II        4) I


11. ఒక తరగతిలో 46 మంది విద్యార్థులున్నారు. అందులో 18 మంది ఫుట్‌బాల్‌ ఆడతారు. 17 మంది క్రికెట్, వీరిలో  ఆరుగురు ఫుట్‌బాల్‌ కూడా ఆడతారు. 16 మంది హాకీ, వీరిలో నలుగురు క్రికెట్‌ కూడా ఆడతారు, కానీ ఫుట్‌బాల్‌ ఆడరు. అయిదుగురు క్యారమ్స్‌ ఆడతారు. కానీ ఏ మైదాన క్రీడను ఆడరు. అయితే పైవాటన్నింటినీ సూచించే పటాన్ని గుర్తించండి?

12. నీటిలో నివసించే జంతువులను, భూమిపై నివసించే జంతువులను పెద్ద వృత్తాలతో, నీటిలో మరియు భూమిపై రెండింటిలోనూ నివసించే జంతువులను చిన్న వృత్తంతో సూచించారు. అయితే ఈ మూడింటి 

మధ్య సంబంధాన్ని సూచించే పటాన్ని గుర్తించండి?


సూచనలు (ప్ర. 13-15 వరకు)

కింది పటాన్ని పరిశీలించి, దాని ఆధారంగా  ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించండి.

13. పై పటంలో గాయకులు కాని భారతీయ నాయకులను సూచించేది?

1) 2         2) 3        3) 4        4) 5

వివరణ: గాయకులు కాకుండా, భారతీయులు మరియు నాయకులు కలిసిన ప్రాంతంలో  '2' ఉంది.     

                                                      సమాధానం: 1

14. గాయకులైన భారతీయ నాయకులను సూచించేది?

1) 2         2)  3        3) 4        4) 5

వివరణ: మూడూ కలిసిన ప్రాంతంలో  '3' ఉంది.

                                                   సమాధానం: 2


15. భారతీయులు కాక, నాయకులు కాక గాయకులు మాత్రమే అయిన వారెందరు?

1) 2         2) 4        3) 6        4) 7

వివరణ: దేనితో సంబంధం లేకుండా గాయకులు మాత్రమే కలిగిన ప్రాంతంలో '7'ఉంది.

                                                   సమాధానం: 4


సూచనలు (ప్ర. 16-19 వరకు)

పటంలో త్రిభుజం గ్రామీణ స్త్రీలను, చతురస్రం నిరుద్యోగ స్త్రీలను, వృత్తం విద్యావంతులైన స్త్రీలను సూచిస్తుంది. దీని ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు తెలపండి.

16. విద్యావంతులైన, ఉద్యోగులైన గ్రామీణ స్త్రీలను సూచించేది ఏది?

1) D     2) E      3) F      4) G

వివరణ: నిరుద్యోగులు కాకుండా విద్యావంతులైన గ్రామీణ స్త్రీలు = G   

                                              సమాధానం: 4


17. విద్యావంతులైన నిరుద్యోగ స్త్రీలను  సూచించేది ఏది?

1) B & C     2) D & E     3) E & F     4) G & E

వివరణ: విద్యావంతులు మరియు నిరుద్యోగ స్త్రీలు = E & F      

                                           సమాధానం: 3

18. విద్యావంతులైన నిరుద్యోగ గ్రామీణ స్త్రీలను సూచించేది ఏది?

1) A    2) B    3) D      4) E

వివరణ: విద్యావంతులు, నిరుద్యోగులైన గ్రామీణ స్త్రీలు = E     

                                          సమాధానం: 4


19. D దేన్ని సూచిస్తుంది?

1) నిరక్షరాస్యులైన గ్రామీణ స్త్రీలను

2) నిరక్షరాస్యులైన, నిరుద్యోగ గ్రామీణ స్త్రీలను

3) విద్యావంతులైన నిరుద్యోగ స్త్రీలను

4) విద్యావంతులైన, ఉద్యోగులైన స్త్రీలను

వివరణ: D అనేది నిరక్షరాస్యులు, నిరుద్యోగ, గ్రామీణ స్త్రీలను సూచిస్తుంది.    

                                        సమాధానం: 2

20. హిందీ (H), ఇంగ్లిష్‌ (E), సంస్కృతం (S) భాషలపై గల పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు 1000 మందిపై నిర్వహించిన సర్వేలో తేలిన విషయాలను కింది పటంలో చూపారు.


ప్ర. మూడు భాషలు మాట్లాడేవారికి, సంస్కృతం అసలు రానివారికి మధ్య నిష్పత్తి ఎంత?

వివరణ: మూడు భాషలు మాట్లాడేవారు = 100

సంస్కృతం రానివారు  =  200 + 220 + 120 = 540 

=> 100/540 = 5/27

                                             సమాధానం: 4

21. ఒక ప్రవేశ పరీక్షలో 80% మంది ఇంగ్లిష్‌లో; 72% మంది రీజనింగ్‌లో ఉత్తీర్ణులయ్యారు. 13% మంది రెండింటిలో ఫెయిల్‌ అయ్యారు. రెండు పరీక్షల్లో 312 మంది ఉత్తీర్ణులైతే, ఆ ప్రవేశ పరీక్షకు మొత్తం హాజరైన వారి సంఖ్య? 

1)  312     2)  480    3) 600     4) చెప్పలేం


 

సూచనలు (ప్ర. 22 - 23 వరకు)

22. ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో 50,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 30,000 మంది డిపార్ట్‌మెంట్‌ -1లో పని చేస్తారు. 25,000 మంది డిపార్ట్‌మెంట్‌ - 2లో పని చేస్తారు. 16,000 మంది రెండింటిలో పని చేస్తారు. అయితే డిపార్ట్‌మెంట్‌ - 1 లేదా డిపార్ట్‌మెంట్‌ - 2లో ఎంతమంది చేస్తారు?

1)  33,000     2) 35,000    3) 39,000     4) పైవేవీకావు

23. ఎంతమంది డిపార్ట్‌మెంట్‌ - 1 కి మరియు డిపార్ట్‌మెంట్‌ - 2 కి రెండింటికీ పని చేయరు?

1)  11,000     2)  39,000    3)  30,000     4) పైవేవీకావు

24. ఒక సర్వే ప్రకారం 60% మంది బిగ్‌బాస్‌ చూస్తారు. 50% మంది జబర్దస్త్‌ చూస్తారు. 47% ఢీ షో చూస్తారు. 28% మంది బిగ్‌బాస్, జబర్దస్త్‌ రెండింటినీ చూస్తారు. 23% మంది బిగ్‌బాస్, ఢీ షోలను చూస్తారు. 18% మంది జబర్దస్త్, ఢీ షోలను చూస్తారు. 8% మంది మూడింటినీ చూస్తారు. అయితే దేన్ని చూడని వారి శాతం ఎంత?

1)  4%     2)  3%     3)  10%      4) పైవేవీకావు

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌