అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (International Monetary Fund - IMF)
స్థాపన: 1944
ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్ డి.సి.
సభ్య దేశాలు: 190
మేనేజింగ్ డైరెక్టర్: క్రిస్టలీనా జార్జియేవా
ఉద్దేశం: అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థను స్థిరీకరించడం.
ఆసియా అభివృద్ధి బ్యాంకు (Asian Development Bank - ADB)
స్థాపన: 1966, డిసెంబరు 19
ప్రధాన కార్యాలయం: మనీలా (ఫిలిప్పీన్స్)
అధ్యక్షుడు: మససుగు అసకావా (Masatsugu Asakawa)
క్షేత్ర కార్యాలయాలు: 31
లక్ష్యం: రవాణా, ఇంధనం, పట్టణ - ప్రభుత్వరంగ నిర్వహణ, వ్యవసాయం, సహజవనరులు, మానవవనరుల అభివృద్ధి.
సభ్యదేశాలు: 68

అసోసియేషన్ ఆఫ్ సౌత్‌ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ASEAN)
స్థాపన: 1967, ఆగస్టు 8
ప్రధాన కార్యాలయం: జకార్తా, ఇండోనేసియా
సభ్యదేశాలు: 10
బ్రూనై, కంబోడియా, ఇండోనేసియా, లావోస్ ్బలితివీళ్శీ, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం
లక్ష్యాలు: ఆర్థికాభివృద్ధి, సామాజిక పురోగతి, శాంతియుత వాతావరణం
సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ (SAARC)
స్థాపన: 1985, డిసెంబరు 8
ప్రధాన కార్యాలయం: ఢాకా (బంగ్లాదేశ్)
సభ్య దేశాలు: 8
మాల్దీవులు, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, భారత్, నేపాల్
లక్ష్యం: ఆసియా దేశాల్లో ప్రాంతీయ సంఘటిత, అభివృద్ధి.
న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (NDB) లేదా BRICS
స్థాపన: 2014, జులై 15
ప్రధాన కార్యాలయం: షాంఘై (చైనా)
సభ్యదేశాలు: 9. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఈజిప్ట్, ఉరుగ్వే.
అధ్యక్షుడు: మార్కోస్ ట్రోయ్జో
విధులు: బ్యాంకు నియమాల ప్రకారం అభివృద్ధి రుణాలు, హామీలు, ఈక్విటీ సాధనాల ద్వారా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం.
ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (AIIB)
స్థాపన: 2016, జనవరి 16
ప్రధాన కార్యాలయం: బీజింగ్ (చైనా)
అధ్యక్షుడు: జిన్ లిక్న్
సభ్యదేశాలు: 105
లక్ష్యం: ఆసియా దేశాల ఆర్థిక, సామాజిక ఫలితాలను మెరుగుపరచడం.
ప్రపంచ వాణిజ్య సంస్థ (World Trade Organisation - WTO)
స్థాపన: 1995, జనవరి 1
ప్రధాన కార్యాలయం: జెనీవా (స్విట్జర్లాండ్)
సభ్యదేశాలు: 164
డైరెక్టర్ జనరల్: Ngozi Okonjo-Iweala
విధులు:
అంతర్జాతీయంగా వాణిజ్య ఒప్పందాలను నిర్వహించడం.

జాతీయ వాణిజ్య విధానాలను పర్యవేక్షించడం.

ఇతర అంతర్జాతీయ సంస్థలకు సహకారాన్ని అందించడం.

ఆర్థిక వ్యవస్థ రకాలు
ఒక దేశంలో లేదా సమాజంలో లభ్యమయ్యే వనరులను సమర్థవంతంగా ఉపయోగించి వస్తు, సేవలను ఉత్పత్తి చేసి, పంపిణీ చేసే పద్ధతిని ‘ఆర్థిక వ్యవస్థ’ అంటారు.
గతంలో ఆర్థిక శాస్త్రవేత్తలు ఉత్పత్తి కారకాలుగా భూమి (సహజ వనరులు), శ్రమ, మూలధనం, వ్యవస్థాపకుడు అనే నాలుగు అంశాలను పేర్కొన్నారు. ప్రస్తుత ఆధునిక శాస్త్రవేత్తలు ‘సమాచారం’ అనే కారకాన్ని వీటికి అదనంగా చేర్చారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఆర్థిక వ్యవస్థలు
1. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
2. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
3. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
4. ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ
5. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ
6. సంప్రదాయ ఆర్థిక వ్యవస్థ
7. కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ
8. స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థ
9. ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ
10. గిగ్ ఆర్థిక వ్యవస్థ
పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
భూమి, భవనాలు, యంత్రాలు లాంటి ఆస్తిని కలిగి ఉండే, కొనుగోలు చేసే, విక్రయించే హక్కులు ప్రైవేట్ వ్యక్తులకు ఉండి, ప్రభుత్వం ఈ విషయాల్లో జోక్యం చేసుకోక పోవడాన్ని ‘పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ’ అని అంటారు. ఇందులో ఉత్పత్తి, వినియోగ సంబంధ నిర్ణయాలు ప్రైవేట్ వ్యక్తులకే ఉంటాయి.
ఇందులో ప్రభుత్వ ప్రమేయం తక్కువగా ఉంటుంది.
దీన్నే ‘స్వేచ్ఛాయుత మార్కెట్ వ్యవస్థ’ అని కూడా అంటారు.
ఉదా: అమెరికా, జపాన్
సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
ఒక దేశంలోని ఉత్పత్తి సాధనాలైన భూమి, సహజ వనరులు, పెట్టుబడి మొదలైన వాటిపై యాజమాన్యాన్ని, నియంత్రణను సమాజపరం చేసి, వీటిని ప్రజల శ్రేయస్సుకు ఉపయోగించడాన్ని ‘సామ్యవాదం’ అంటారు.

ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఎక్కువగా ఉంటుంది.

స్వేచ్ఛా, సమానత్వం, న్యాయం, వర్గరహిత సమాజం, సహకారం లాంటి అంశాలకు ‘సామ్యవాదం’ ప్రాముఖ్యతను ఇస్తుంది.

వ్యక్తి అవసరం, శక్తి ఆధారంగా ప్రతిఫలం లభించాలని ‘సామ్యవాదం’ పేర్కొంటుంది.

సామ్యవాదంలో రెండు అంశాలు ఉన్నాయి. అవి:
1. దృక్పథం: ఆశయాలు, లక్ష్యాలు, విలువలు మొదలైనవి.
2. సంస్థలు - ఆచరణ పద్ధతులు: సామ్యవాద దృక్పథం, దాని అమలుకు తోడ్పడే సంస్థలు, ఆచరణ పద్ధతులు.
మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు రెండూ కలసి పని చేస్తున్న ఆర్థిక వ్యవస్థను ‘మిశ్రమ ఆర్థిక వ్యవస్థ’ అంటారు.
ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంది.
ఉదా: భారత్
భారతదేశ అవసరాలకు అనుగుణంగా సామ్యవాద స్వరూపాన్ని నిర్ణయించారు. దీని కారణంగానే మన ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కొనసాగుతున్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వరంగ సంస్థలతో పాటు, ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ప్రజలకు కావాల్సిన వస్తువులను తయారుచేసి, స్థూల జాతీయోత్పత్తి, జాతీయాదాయాలను పెంచడానికి పని చేస్తాయి.
ప్రభుత్వ రంగ సంస్థల వద్ద ఆర్థికాభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు తగినంత లేనప్పుడు ప్రైవేట్ రంగం వాటిని సమకూరుస్తుంది.
ప్రభుత్వ రంగం సేవాభావంతో పనిచేస్తే, ప్రైవేట్ రంగం లాభాపేక్షతో ఉంటుంది.
ప్రభుత్వ నిబంధనలకు, నియంత్రణకు లోబడే ప్రైవేట్ రంగ సంస్థలు పనిచేస్తాయి.
991లో సరళీకృత విధానం అమలయ్యాక భారత ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగ ప్రాధాన్యం పెరిగింది.
గమనిక: కొనుగోలు శక్తి విషయంలో ప్రపంచ దేశాల్లో భారతదేశం మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది.
ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ
దేశాభివృద్ధికి అవసరమైన ఆర్థిక కార్యకలాపాలను నిర్దిష్ట కాలంలో అమలు చేసేందుకు ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికలను రూపొందించింది. అయిదేళ్ల కాలవ్యవధిలో సాధించాల్సిన లక్ష్యాలను వీటిలో నిర్ణయించారు.

ప్రణాళికా సంఘం: 1950, మార్చి 15న భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని మూలధనాన్ని, మానవ వనరులను సమర్థవంతంగా ఉపయోగించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించడం దీని లక్ష్యం.
జాతీయ అభివృద్ధి మండలి: 1952, ఆగస్టు 6న జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. ప్రణాళికా సంఘం తయారు చేసిన ముసాయిదా ప్రణాళికలను పరిశీలించడం దీని లక్ష్యం. జాతీయ లేదా రాష్ట్రస్థాయి పంచవర్ష ప్రణాళికలు చివరగా ‘జాతీయ అభివృద్ధి మండలి’ ఆమోదం పొందాకే పార్లమెంట్‌కు పంపుతారు.
నీతి ఆయోగ్ విజన్ (2017-32): కేంద్రం 2014, ఆగస్టు 17న ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి దాని స్థానంలో 2015, జనవరి 1న ‘నీతి ఆయోగ్’ను ఏర్పాటు చేసింది. ఫలితంగా 12వ పంచవర్ష (2012-17) ప్రణాళిక తర్వాత 15 ఏళ్ల కాలానికి నీతి ఆయోగ్ విజన్‌ను రూపొందించింది.
వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రధాన పాత్ర పోషిస్తోంది.
195181 వరకు మనదేశంలోని 72.1% జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడగా, 1991 నాటికి వీరి శాతం 66.8% శాతానికి తగ్గింది.
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అంచనా ప్రకారం 2018లో దేశంలో 44% జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారు.
2019-20 భారత ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం 70% శాతం గ్రామీణ కుటుంబాలకు వ్యవసాయమే ప్రాథమిక జీవనాధారం. 82% మంది చిన్న, సన్నకారు, ఉపాంత రైతులు.
1950-51లో స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా 53.1% ఉండగా, 2020-21 నాటికి 20 శాతానికి తగ్గింది.
భారత ప్రభుత్వం మొదటి పంచవర్ష ప్రణాళిక (1951-56)లో వ్యవసాయాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చి, అనేక కార్యక్రమాలు అమలు చేసింది.
1966-69 మధ్యకాలంలో అనుసరించిన నూతన వ్యవసాయ వ్యూహం హరిత విప్లవ సాధనకు ఉపయోగపడింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి, ముఖ్యంగా గోధుమ దిగుబడి గణనీయంగా పెరిగింది.
మెట్ట వ్యవసాయం విస్తరించింది.
నీటి వసతి సౌకర్యాలు పెరిగి, సాగు భూమి విస్తీర్ణం అధికమైంది. పంటల తీరులో మార్పు వచ్చి, వాణిజ్య పంటల ప్రాధాన్యం పెరిగింది.