• facebook
  • whatsapp
  • telegram

జీవ‌వైవిధ్యం

1. జీవ సమాజంలో జీవుల మధ్య ఉండే విభిన్నతను ఏమంటారు?

ఎ) జీవవైరుధ్యం    బి) జీవవైవిధ్యం 

సి) జీవసారూప్యం   డి) జీవసహవాసం 


2. కింది తడి ప్రాంతాలను (వెట్‌లాండ్స్‌), అవి ఉండే రాష్ట్రాలతో జతపరచండి.

  తడి ప్రాంతం          రాష్ట్రం

a) లోక్‌తక్‌ సరస్సు    i) రాజస్థాన్‌

b) దీపార్‌బీల్‌          ii) పంజాబ్‌

c) రోఫార్‌                iii) అసోం

d) సాంబర్‌            iv) మణిపూర్‌

ఎ) a-iv, b-iii, c-ii, d-i

బి) a-ii, b-iv, c-i, d-iv

సి) a-iii, b-iv, c-iii, d-ii

డి) a-iv, b-ii, c-iii, d-i


3. కిందివాటిలో ఒడిశా రాష్ట్రంలో లేని ఎలిఫెంట్‌ రిజర్వ్‌ ఏది? 

ఎ) మయూర్‌భంజ్‌  బి) సంబల్‌పూర్‌

సి) మహానంది     డి) కమోంగ్‌


4. కిందివాటిలో మన దేశంలో బయోస్ఫియర్‌ రిజర్వ్‌లుగా పేర్కొనదగినవి ఏవి?

i) శేషాచలం కొండలు    ii) గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌   iii) మానస  iv) అగస్తమలై 

ఎ) i, ii, iii, iv     బి) i, ii, iv 

సి) ii, iii, iv     డి) iii, iv 


5. కిందివాటిని సరిగా జతచేయండి. 

 టైగర్‌ రిజర్వ్‌         రాష్ట్రం

a) పెరియర్‌        i)  రాజస్థాన్‌

b) సహ్యాద్రి         ii)  ఒడిశా

c) సిమ్లిపాల్‌       iii) మహారాష్ట్ర

d)సరిస్కా          iv)  కేరళ


ఎ) a-iii, b-iii, c-ii, d-ii 

బి) a-iv, b-iii, c-i, d-ii
సి) a-iv, b-iii, c-ii, d-i

డి) a-i, b-ii, c-iii, d-iv


6. జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఎక్కడ ఉంది?  

ఎ) మధురై     బి) కోల్‌కతా 

సి) గోవా     డి) అహ్మదాబాద్‌


7. కర్నూలులోని రోళ్లపాడు పక్షుల సంరక్షణ కేంద్రంలో ఏ పక్షిజాతిని సంరక్షిస్తున్నారు? 

ఎ) బట్టమేక పిట్ట    బి) లకుముకి పిట్ట 

సి) వడ్రంగి పిట్ట    డి) పిచ్చుక


8. కిందివాటిలో అంతరించిన జాతికి ఉదాహరణ

ఎ) ఎడారి పిల్లి     బి) రెడ్‌ ఫాక్స్‌ 

సి) డైనోసర్‌లు     డి) ఆర్కిడ్‌లు


9. కిన్నెరసాని జంతు సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?  

ఎ) వరంగల్‌     బి) మెదక్‌ 

సి) హైదరాబాద్‌     డి) ఖమ్మం


10. భారత ప్రభుత్వం ఏర్పాటుచేసిన బయోస్ఫియర్‌ రిజర్వ్‌ల సంఖ్య ఎంత?  

ఎ) 28    బి) 18     సి) 16    డి) 10


11. కిందివాటిలో స్వస్థానీయ సంరక్షణా విధానంలోకి రానిది? 

ఎ) జాతీయ పార్కులు   బి) రిజర్వ్‌ అడవులు   సి) విత్తన బ్యాంకులు    డి) బయోస్ఫియర్‌ రిజర్వ్‌లు


12. జీవవైవిధ్య ఒప్పందం - కన్వెన్షన్‌ ఆన్‌ బయోడైవర్సిటీ ్బదితీద్శీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 

ఎ) 1992    బి) 1994   సి) 1971   డి) 1982


13. దేశంలో ఉభయచర, సరీసృప జాతుల వైవిధ్యం అధికంగా ఉన్న ప్రాంతం ఏది?  

ఎ) తూర్పు కనుమలు    బి) పశ్చిమ కనుమలు  

సి) తూర్పు హిమాలయాలు   డి) ఉత్తర కాశీ ప్రాంతం


14. మన దేశంలో ఎక్కువ సంఖ్యలో జాతీయ పార్కులు, అభయారణ్యాలు ఉన్న రాష్ట్రం?  

ఎ) పశ్చిమ్‌ బెంగాల్‌    బి) రాజస్థాన్‌ 

సి) మధ్యప్రదేశ్‌        డి) ఉత్తర్‌ ప్రదేశ్‌


15. బయోస్ఫియర్‌ రిజర్వ్‌లలో మానవ చర్యలను అనుమతించే భాగం ఏది?  

ఎ) పరివర్తన మండలం బి) కోర్‌ మండలం సి) బఫర్‌ మండలం డి) ప్రధాన మండలం


16. కిందివాటిలో జాతివైవిధ్యతను తక్కువగా ప్రదర్శించే సహజ ఆవాస మండలం ఏది?  

ఎ) సముద్రం            బి) టండ్రా 

సి) సతతహరితారణ్యం    డి) పచ్చికబయళ్లు


17. పాకాల జంతుసంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? 

ఎ) చిత్తూరు     బి) ప్రకాశం 

సి) వరంగల్‌     డి) మెదక్‌


18. నందన్‌-కానన్‌ జూ దేనికి ప్రసిద్ధి? 

ఎ) హిప్పోపోటామస్‌    బి) తెల్లపులి

సి) నీలగిరి టార్‌      డి) నీలి తిమింగలం


సమాధానాలు

1-బి  2-ఎ 3-డి 4-ఎ 5-సి 6-బి 7-ఎ 8-సి 9-డి 10-బి 11-సి 12-ఎ 13-బి 14-సి 15-ఎ 16-బి 17-సి 18-బి.

Posted Date : 03-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌