• facebook
  • whatsapp
  • telegram

దిశానిర్దేశ ప‌రీక్ష‌

మానసికసామర్థ్యం'పరీక్షలోభాగంగా 'దిశానిర్దేశనపరీక్ష' (డైరెక్షన్టెస్ట్) విభాగంనుంచితప్పనిసరిగాప్రశ్నలువస్తుంటాయి. ముఖ్యంగారెండురకాలైనప్రశ్నలకుసమాధానాలనుకనుక్కోవాల్సిఉంటుంది. అవి-
 

i) రెండుప్రదేశాలమధ్యదూరంకనుక్కోవడం.
ii) దిశనుగుర్తించడం.
ప్రశ్నలోఇచ్చినసమాచారంఆధారంగాబొమ్మనుగీసుకుంటేసమాధానాన్నితేలిగ్గాగుర్తించవచ్చు. అభ్యర్థిపరిశీలన, దిశనిర్ధరణసామర్థ్యాలనుపరీక్షించడానికిఇలాంటిప్రశ్నలుఇస్తుంటారు. 'దిశానిర్దేశనపరీక్ష' విభాగంనుంచివచ్చేప్రశ్నలకుసరైనజవాబులువేగంగాగుర్తించాలంటేఅభ్యర్థికిదిక్కులపైఅవగాహనఅవసరం. ఒకవ్యక్తినిర్దిష్టదిశలోనడుస్తున్నప్పుడుఅతడికుడి, ఎడమల్లోదిక్కులువస్తాయోతెలిసిఉండాలి. కిందిపటంద్వారాదిక్కులపైఅభ్యర్థిపట్టుసాధించవచ్చు.


ముఖ్యమైన అంశాలు:
ఈ ప్రశ్నల్లో సాధారణంగా ఉత్తర, దక్షిణ దిశను నిలువు (Vertical Direction) గా, తూర్పు, పడమర దిశను, సమాంతర దిశ (Horizontal Direction) గా గుర్తిస్తారు.
ఒక నిర్దేశిత స్థానం నుంచి ఒక వ్యక్తి కొంతదూరం X కి.మీ. ప్రయాణించి, తర్వాత నిలువుగా తిరిగి Y కి.మీ.
దూరం ప్రయాణిస్తే, తొలి, తుది స్థానాల మధ్య దూరం   కి.మీ. అవుతుంది.

ఉదా: 1) రవితనఇంటినుంచితూర్పుదిశగా 3 కి.మీప్రయాణించిఅక్కడినుంచికుడివైపుతిరిగి 4 కి.మీ. ప్రయాణించాడు. అయితేరవితనఇంటినుంచిఎంతదూరంలోఉన్నాడు.

జవాబు: ABC లంబకోణత్రిభుజంకాబట్టిపైథాగరస్సిద్ధాంతంప్రకారం

రవి తన ఇంటినుంచి 5 కి.మీ.ల దూరంలో ఉన్నాడు.

ఉదా : 2)ఒకవ్యక్తితనఇంటినుంచిబయలుదేరిపడమరదిశగా 8 మీ. ప్రయాణించినతర్వాతఎడమవైపుతిరిగి 6 మీ.లుప్రయాణించాడు. మళ్లీఅక్కడనుంచి 8 మీ. పడమరదిశగాప్రయాణించినతర్వాతదక్షిణదిశగా 4 మీటర్లునడిచాడు. చివరగా, అతడుతనకుడివైపుతిరిగి 5 మీటర్లుప్రయాణించాడు. అతడుతనఇంటినుంచిసమాంతరంగాఎంతదూరంప్రయాణించాడు?

జవాబు:వ్యక్తిసమాంతరంగాప్రయాణించినమొత్తందూరం
= FE + CD + AB
= (5 + 8 + 8)
మీ.
= 21 మీటర్లు.

ఉదా: 3) ఒక విద్యార్థి తన ఇంటినుంచి స్కూలుకి నడుచుకుంటూ ఈ విధంగా బయలుదేరాడు. మొదట ఆ విద్యార్థి తూర్పు దిశగా 5 మీ. ప్రయాణించిన తర్వాత ఎడమ వైపు తిరిగి 10 మీ. ప్రయాణించిన తర్వాత మళ్లీ తన కుడివైపు తిరిగి 8 మీ. ప్రయాణించాడు. ఆ తర్వాత అతడు 2 మీ. ఉత్తరం వైపు ప్రయాణించి, చివరగా తూర్పు వైపు 3 మీ.లు ప్రయాణించిన స్కూలుకి చేరాడు. అయితే స్కూలుకు, ఇంటికి మధ్య ఉన్న దూరం ఎంత?

చిత్రంలో Aను ఇల్లుగా, C ను స్కూలుగా తీసుకుంటే, పాఠశాలకు, ఇంటికి మధ్యనున్న దూరం AC అవుతుంది.
AB = 5 + 8 + 3
= 16 మీ.
BC = 10 + 2
= 12 మీ. అవుతుంది.

Δ ABC లంబకోణ త్రిభుజంలో
  
=  20 మీటర్లు.

 

కాబట్టి, విద్యార్థిఇంటినుంచిపాఠశాలకుమధ్యనున్నదూరం 20 మీటర్లు.

ఉదా: 4) రాజు తన ఇంటి నుంచి 80 మీటర్ల దూరం ఉత్తర దిశగా ప్రయాణించి, తర్వాత కుడివైపు తిరిగి 65 మీటర్లు ప్రయాణించాడు. మళ్లీ ఉత్తర దిశగా తిరిగి 43 మీటర్లు ప్రయాణించాడు. చివరగా రాజు గడియారపు సవ్యదిశలో 45జీలు తిరిగి ప్రయాణిస్తే, అతడు ఏ దిశలో వెళ్తున్నాడు.

జవాబు: రాజు A నుంచి ప్రారంభమై, B దిశలో ప్రయాణిస్తున్నాడు. అంటే ఈశాన్య దిశ (NE)లో వెళ్తున్నాడు.

ఉదా: 5) హనీషా పడమరవైపు అభిముఖంగా ఉంది. తను నిల్చున్న స్థానం నుంచి గడియారపు సవ్యదిశలో 120ºలు తిరిగి, తర్వాత 155ºలు గడియారపు అపసవ్య దిశలో తిరిగింది. హనీషా ఏ దిశలో నిల్చుంది?
జవాబు: చిత్రం ఆధారంగా హనీషా నైరుతి (South West) దిశలో నిలిచి ఉంది.

ఉదా: 6) గడియారంలోసమయం 5.30 నిమిషాలుఅయింది. నిమిషాలముల్లుతూర్పునుసూచిస్తుంటే, గంటలముల్లుదిశనుసూచిస్తుంది?
జవాబు:గడియారంలోసమయం 5.30 నిమిషాలుఅయినప్పుడుగంటలముల్లుకు, నిమిషాలముల్లుకుమధ్యకోణం 45ºలుఉంటుంది.

Posted Date : 03-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌