• facebook
  • whatsapp
  • telegram

కొత్త స్కూల్లో చేర్పిస్తున్నారా!

పిల్లలు కాస్త పెద్ద వాళ్లయ్యాక తరచూ స్కూలు మార్చాల్సి వచ్చినప్పుడు వాళ్లకు చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

స్కూల్‌ మార్చాలని ముందే నిర్ణయించుకుంటే ఆ విషయాన్ని వీలైనంత త్వరగా వాళ్లకు చెబితే, మానసికంగా దానికి సిద్ధపడతారు. పాత స్నేహితుల ఫోన్‌ నెంబర్లు తీసుకుని, వాళ్లకూ ముందే విషయం చెప్పే అవకాశమూ పిల్లలకు ఉంటుంది.

పాత స్నేహితులను కలుసుకునేందుకు వాళ్లూ కొన్ని ఆలోచనలతో సన్నద్ధమవుతారు. 

*¤ స్కూల్‌ ఎందుకు మార్చాలనుకుంటున్నారో స్పష్టమైన కారణాలను వాళ్లకు చెప్పండి. ఒకవేళ వేరే ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్‌ అయితే, అక్కడి వాతావరణం, పరిస్థితుల గురించి ముందే వివరించాలి. తెలియని ప్రాంతంలోని స్కూల్లో అడుగుపెట్టడానికి ముందే ఆ ప్రాంతం, స్కూల్‌ పైనా వాళ్లకు సానుకూల దృక్పథం కలిగేలా మీ మాటలుండాలి. అంతేకానీ.. 'కొత్త స్కూల్లో నీ ఆటలేమీ కుదరవు' లాంటి మాటలు వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా కొత్త స్కూల్‌లో చేరడానికి అస్సలు ఇష్టపడని పరిస్థితీ ఎదురవుతుంది.

మార్పుకి సంబంధించి వాళ్లకు ఏవైనా భయాలుంటే, వాళ్లతో మాట్లాడి వాటిని పోగొట్టడం మీ బాధ్యతే. ఆ విషయంలో మీ చిన్నప్పటి అనుభవాలనూ, లేదా తెలిసిన వాళ్ల ఉదాహరణలనూ చెప్పడానికి ప్రయత్నించాలి. కొత్త స్కూల్లో ఎంత మంచి సౌకర్యాలున్నాయో చెప్పి దానిపైన ఉత్సాహం కలిగించాలి.

స్కూల్లో చేరిన కొత్తల్లో స్నేహితులూ, అక్కడి వాతావరణం గురించి పిల్లల్ని అడగండి. అలానే స్కూల్లో వాళ్ల ప్రవర్తన గురించీ కొన్ని రోజుల పాటు టీచర్ల దగ్గరా వాకబు చేస్తూ ఉండండి. ఏదైనా సమస్య ఉంటే మొదట్లోనే పరిష్కరించుకోవడం మంచిది. ఆలస్యం చేస్తే స్కూల్‌కి వెళ్లాలంటేనే నిరుత్సాహం కలిగే ప్రమాదముంది.

Posted Date: 16-12-2019

తల్లిదండ్రుల పాత్ర