• facebook
  • whatsapp
  • telegram

అడుగడుగునా ఆసరా!

పిల్లల చదువు, కెరీర్ విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఒకప్పుడు పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడది విస్తృతమైంది. పిల్లలు విద్యార్థులుగా ఉన్నపుడు ప్రతి దశలోనూ వారికి తల్లిదండ్రుల అండ అవసరంగా మారింధి. భావోద్వేగాల పరంగా కూడా ఆసరా ఇవ్వాల్సిన పరిస్తితులు  కనిపిస్తున్నాయి.. 

జ్యోతి, శ్రీరామ్ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు కిరణ్. వాడి చదువు గురించి ఇద్దరూ ఒకటే ఆందోళన పడుతుంటారు. వాడు పదోతరగతి పూర్తి చేశాక ఆ దంపతుల ఆందోళన రెండింతలైంది. ముందే ఎన్నో కాలేజీల గురించి వాకబు చేశారు. కొన్నింటికి స్వయంగా వెళ్లి పరిశీలించారు. కొన్ని కాలేజీల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి మాట్లాడారు. ఏ గ్రూపు తీసుకోవాలనే విషయంపై రెండేళ్ల కిందటి నుంచే చర్చలు నడుస్తున్నాయి ఇద్దరి మధ్యా! కిరణ్‌కి దేనిమీద ఆసక్తి ఉంది? అసలతను ఏం చదవాలనుకుంటున్నాడు? తన మనసులో ఏం ఉందో తెలుసుకుందామనే ధ్యాస ఇద్దరికీ లేదు. పిల్లవాడి భవిష్యత్తు గురించి మాత్రం వాళ్లలో వాళ్లు తర్జన భర్జన పడుతూ ఉన్నారు. చాలా వరకు మనకు ఇలాంటి తల్లిదండ్రులేకనిపిస్తుంటారు.

పిల్లల చదువు గురించి తల్లిదండ్రుల వైఖరిలో ఇదివరకటి కంటే ఇప్పుడు మార్పు వచ్చింది. పరిమిత కుటుంబాల కారణంగా ఉన్న ఒకరిద్దరు పిల్లలు, వాళ్ల చదువుల మీద శ్రద్ధ చూపించే అవకాశం దొరుకుతోంది. గంపెడు పిల్లలుండే ఒకప్పటి కుటుంబాల్లో ప్రతి ఒక్కరి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించే అవకాశం మాట అటుంచితే చదివించడమే కష్టంగా ఉండేది. ఇప్పుడు ఆపరిస్తితులు కనిపించడంలేదు.

అప్రమత్తత అత్యవసరం 

ఇప్పటి తల్లిదండ్రులకు ఒకప్పుడు వాళ్లు విద్యార్థులుగా ఉన్నపుడు పదోతరగతి ఫలితాలు వచ్చే వరకూ ఇంటర్లో ఏ గ్రూపు తీసుకోవాలనే విషయం మీద సృష్టత ఉండేది కాదు. లెక్కలు బాగా చేయగలిగితే ఎంపీసీ లేకపోతే సీఈసీ! ఇలా దేనికో ఒకదానికి ఓటెయ్యక తప్పేది కాదు. ఫలానా గ్రూపు తీసుకుంటే భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయనే విషయం తల్లిదండ్రులూ, విద్యార్థులూ కూడా అంతగా ఆలోచించేవారు కాదు. ఇప్పుడున్నంత పోటీతత్వం, సాంకేతిక పరిజ్ఞానం, ఉద్యోగావకాశాలు అప్పట్లో లేకపోవడం దానికి ప్రధాన కారణం. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం 'ఏదో ఒక స్కూలు, ఏదో ఒక గ్రూపు' అన్న ధోరణి ఎంత మాత్రం పనికి రాదు. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి.

ముందుజాగ్రత్త ముఖ్యం!

నిజానికి ప్రాథమిక స్థాయిలో ఏ స్కూల్‌లో చేర్పించాలనే విషయంలోనే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ముందుముందు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అగత్యం తప్పుతుంది. ఆకర్షణీయంగా కనిపించే హోర్డింగ్‌లు, బ్రోచర్లలో చూపించే అంతర్జాతీయ ప్రమాణాలు, పత్రికల్లో ఇస్తున్న రంగురంగుల ప్రకటనలు చూసి తల్లిదండ్రులు బోల్తాపడుతుంటారు! గొప్ప ర్యాంకులు పండిస్తాయని పేరుగాంచిన కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు అసలు ప్రభుత్వ అనుమతే లేదని తేలింది. కొన్ని పాఠశాల భవనాలకు నిర్మాణ అనుమతులు లేవు. పొరపాటున ఇలాంటి స్కూళ్లబారిన పడితే పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరమే అవుతుంది. అందుకే పిల్లలను చేర్పించబోయే స్కూల్‌కి విద్యాశాఖ నుంచి తగిన అనుమతులున్నాయా, వసతులున్నాయా లాంటి ప్రాథమిక విషయాలు తెలుసుకోవాలి. 
చాలా పాఠశాలల్లో కనీస అర్హతలు లేని ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అందుకే పిల్లలను చేర్పించబోయే పాఠశాలల్లో పని చేస్తున్న సిబ్బందికి బోధనాపరమైన విద్యార్హతలున్నాయో లేదో తెలుసుకోవడం తప్పనిసరి. ఇలాంటి విషయాలను నేరుగా స్కూలు యాజమాన్యాన్నే అడిగి తెలుసుకోవడం మంచిది. 
ఇదే పద్ధతి కాలేజీలకు కూడా వర్తిస్తుంది. ర్యాంకుల పటాటోపాలు పక్కన పెట్టి అక్కడ పని చేస్తున్న అధ్యాపకుల విద్యార్హతలు, అనుభవం లాంటి విషయాల మీద దృష్టి పెట్టాలి. జ్ఞానం తర్వాతే ర్యాంకులనే విషయం తల్లిదండ్రులు గుర్తెరగాలి. 
స్కూళ్లలో, కాలేజీల్లో జరిగే తల్లిదండ్రులు - టీచర్ల సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవ్వాలి. ఇది పిల్లల చదువు మీద ఎంత శ్రద్ధగా చూపిస్తున్నారో రుజువు చేస్తుంది. హాజరుశాతం, క్లాసులో తోటి విద్యార్థులతో మెలిగే తీరు ఎలా ఉంటోంది లాంటి విషయాలను టీచర్లతో కూలంకషంగా చర్చించాలి. ఏదైనా సరిగా లేదనిపిస్తే దానికి కారణాలను వీలైనంత త్వరగా గుర్తించి, సరిదిద్దే మార్గాలను అన్వేషించాలి.

అన్ని విషయాల్లో అండగా..

టీనేజ్ పిల్లలతో మెలగడం తల్లిదండ్రులకు కత్తిమీద సాము లాంటిది. ఒక్కోసారి వారు దేనికి సంతోషిస్తారో, దేనికి కోపం తెచ్చుకుంటారో కూడా తెలుసుకోవడం కష్టం! పిల్లల విషయాల్లో అతి జోక్యం పనికిరాదు. అలాగని అవసరమైన విషయాల్లో నిర్లక్ష్యం వహించినా ముప్పే. పిల్లల స్నేహితుల గురించి ఆరా తీసినట్లు మాట్లాడటం, వారి స్వభావాల గురించి అనుమాన దృక్కులతో చర్చించడం లాంటివి ఎంత త్వరగా మానేస్తే అంత మంచిది. ఇంటికి రావడం కాస్త ఆలస్యమైతే ''ఎక్కడికెళ్లావు, ఏం చేశావు'' లాంటి ప్రశ్నలతో తల్లిదండ్రులుగా మీమీద వాళ్లకున్న విశ్వాసాన్ని పోగొట్టుకునే ప్రయత్నాలు మానేయాలి. అలాగని పిల్లలు ఎలాంటి స్నేహాలు చేస్తున్నా ''వాళ్లే తెలుసుకుంటారులే'' అన్న ధోరణితో చూసీ చూడనట్లు ఊరుకోవడం కూడా మంచిది కాదు. వారి చదువు గురించి చర్చిస్తున్నప్పుడే స్నేహితుల స్వభావాల గురించి సానుకూల ధోరణితో మాట్లాడి తెలుసుకోవాలి. పిల్లల స్నేహితులతో కూడా తరచూ మాట్లాడుతూ ఉండటం ఉత్తమం! 
పదోతరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు నిజానికి విశ్రాంతికి అవకాశం తక్కువ. లెక్కకు మించిన అసైన్‌మెంట్లు, ప్రాజెక్టులు. వారి ఆరోగ్యం వినోదం, విశ్రాంతి ఈ మూడూ తల్లిదండ్రులు శ్రద్ధగా పట్టించుకోవాల్సిన విషయాలు. ఇది కాక మరొకటుంది. అది వికాసం! చదువు కాకుండా వారికి ఆసక్తి ఉన్న ఇతర విషయాలపై కూడా కొద్దిపాటి శ్రద్ధ అవసరం! ఆటలు, సంగీతం, సాహిత్యం లాంటి సృజనాత్మక మనోవికాస సాధనాల మీద పిల్లలకున్న శ్రద్ధను గ్రహించి ఆ దిశగా వారిని ప్రోత్సహించాలి.

పిల్లల అభిప్రాయాలను గౌరవించండి 

ప్రతి తల్లిదండ్రులకీ పిల్లల మీద ఆశలూ, ఆకాంక్షలూ ఉంటాయి. వారి భవిష్యత్ జీవన చిత్రాలు కళ్ల ముందు రంగు రంగుల్లో కనిపిస్తుంటాయి. అది సహజం! ఇందులో తప్పులేదు. 
కానీ ఈ తరం పిల్లలు తమకంటూ సొంత అభిప్రాయాలు, దృక్పథాలు కలిగి ఉంటున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వారికంటూ సొంత వ్యక్తిత్వం ఉంటుందని గుర్తించాలి. పిల్లలు తమ భవిష్యత్ ప్రణాళికల పట్ల ఏమి ఆలోచిస్తున్నారో, వారి ప్రాధాన్యాలేమిటో, వాళ్ల మనోభావాలేమిటో తెలుసుకోవాలి. వారు చెప్పకుండానే గ్రహిస్తే ఇంకా ఉత్తమం! లేదా తల్లిదండ్రులతో ఈ విషయాలు మనసు విప్పి చెప్పగలిగే వాతావరణం ఇంట్లో నెలకొనేలా ఉండాలి. పిల్లలు బయటపడకపోతే అడిగి మరీ తెలుసుకోవడం అవసరం కూడా!

 ప్రత్యేకంగా వారికోసం..

పిల్లల సర్వతోముఖాభివృద్ధిలో టీచర్ల పాత్రతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా ఎనలేనిది. స్కూల్లో చేర్పించి, ఫీజులు కట్టడంతోనే తమ బాధ్యత ముగిసిందని భావించడం సరికాదు. బాధ్యత మొత్తాన్నీ స్కూలు మీదో కాలేజీ మీదో వదిలి వేయడం భావ్యం కాదు. స్కూల్లో, కాలేజీలో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లల కోసం గరిష్ఠ సమయాన్ని వినియోగించడానికి వీలుగా తమను తాము సిద్ధం చేసుకోవాలి.

సమాచారాన్నిపంచుతూ...

పిల్లలతో నిరంతరం కాకపోయినా సమయం దొరికినప్పుడు వారి చదువు, స్నేహితులు, అభిరుచులు, ఇతర ఆసక్తులు, భవిష్యత్ ప్రణాళికలు, కెరీర్ అవకాశాలు, ప్రస్తుతం ఉద్యోగావకాశాలు తీరుతెన్నులు, అభివృద్ధికి అవకాశాలు, ఇతరత్రా కోర్సులు లాంటి విషయాల గురించి మాట్లాడటం మంచి పద్ధతి. 
అయితే ఇది పనిగట్టుకుని చేస్తున్నట్లు కాకుండా వీలైనంత సహజంగా ఉండేట్లు చూడాలి. తమకు అందిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పిల్లలతో పంచుకుంటూ ఉండాలి. పిల్లలూ అలాగే తమతో అన్ని విషయాలు పంచుకునే వాతావరణాన్ని ఇంట్లో ఏర్పరచాలి. పిల్లలు విద్యార్థులుగా ఉన్నపుడు ప్రతి దశలోనూ వారికి అండగా ఉండాలి. భావోద్వేగాల పరంగా ఆసరా (ఎమోషనల్ సపోర్ట్) అందించాలి. తల్లిదండ్రుల సహకారం ఉన్న పిల్లల విద్యా ప్రగతినీ, అది లేని పిల్లలనూ పోల్చి చూస్తే పెద్దవారి ప్రభావం పిల్లల జీవితాల్లో ఎలాంటి మార్పుతీసుకు రాగలుగుతుందో అర్థమవుతుంది. 

Posted Date: 11-03-2020

తల్లిదండ్రుల పాత్ర