• facebook
  • whatsapp
  • telegram

ఆసక్తికి అభిరుచికి ప్రాధాన్యం !

కన్నబిడ్డలను ఉన్నత స్థానాల్లో చూసుకోవాలనుకోవడం మంచిదే. అయితే పిల్లలకు ఇష్టమున్నా లేకున్నా తమ ఆకాంక్షలను వారు తీర్చాలని ఆశించడమే అపశ్రుతి. కెరీర్ ఎంపికలో పిల్లల ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యం, విలువ ఇస్తూ, తల్లిదండ్రులు మార్గదర్శక పాత్ర వహించాలనే అభిప్రాయానికి ఇప్పుడిప్పుడే మద్దతు పెరుగుతోంది. 

''నిజానికి నేను ఏరోనాటిక్స్ చదవాలనుకున్నాను. మా నాన్నగారి కోరిక మీద సి.ఎ. చేయక తప్పలేదు. వృత్తిలో ఎంత రాణించినా కోరుకున్న చదువు చదవలేకపోయాననే బాధ మాత్రం ఉండిపోయింది...!ఇవాళ ఉదయం ఆడిటర్ తనతో అన్న మాటలు గుర్తొచ్చి శ్రీకాంత్ మనసు భారమైంది. తన జీవితంలోనూ అదే జరిగింది! తన లక్ష్యాలు, ఆశయాలు వేరు. ఐఏఎస్ కావాలన్న కోరికతో ఆంగ్ల సాహిత్యం చదువుతానంటే నాన్న విస్తుపోయాడు. సెలెక్ట్ కాకపోతే ఏం చేస్తావన్నాడు. ఏదో ఒక జూనియర్ కాలేజీలో పాఠాలు చెప్పుకుంటావా అని ఎగతాళి చేశాడు. ఇంజినీరింగ్ తప్పదన్నాడు. చివరికి ఆయన మాటే నెగ్గింది! ఇంజినీరుగా మిగిలాడు. పెద్ద కంపెనీలో ఉద్యోగం. అయిదంకెల జీతం. కానీ మనసులో ఒక మూల ఎప్పటికీ పూడని ఖాళీ. ఈ పొరపాటు తన పిల్లల విషయంలో మాత్రం జరగకూడదు. వారికేది ఇష్టమో అదే చదువుకోవాలి. బలవంతం మీద కాక ఆసక్తి ఉన్న సబ్జెక్టు ఇష్టంగా చదువుకోవాలి వాళ్లు, కష్టంగా కాదు. ఈ విషయమై భార్యతో విభేదించడానికి కూడా వెనకాడలేదు. కొడుకు హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతానంటే 'సరే అన్నాడు. అంతే కాదు, అతడి అభిరుచి ప్రకారం సంగీతం నేర్చుకోమన్నాడు. కొడుకు ఇష్టాలకు, అభిప్రాయాలకు తాను విలువిస్తున్నప్పుడు వాడి కళ్లలో తన పట్ల కనిపించే ఇష్టం శ్రీకాంత్‌కెంతో నచ్చుతుంది. 
తల్లిదండ్రులంతా శ్రీకాంత్‌లా ఆలోచిస్తే చాలా బాగుంటుంది. అయితే అలాంటి వాతావరణం ఏ ఇంట్లోనూ కనిపించదు. పిల్లల కెరీర్‌ను పెద్దలే ఎంచుకుంటున్నారు. ఏ గ్రూప్ తీసుకోవాలి? ఏ కాలేజీలో చేరాలి అనేది ముందే నిర్ణయించేస్తారు. రెండు మూడు దశాబ్దాల కిందట ఒక సంప్రదాయం ఉండేది. డాక్టర్ కొడుకు డాక్టరే కావడం, లెక్చరర్ల పిల్లలు విద్యారంగంలోనే స్థిరపడటం.. ఇలా! తరాలు మారడంతో చదువు పట్ల, కెరీర్ పట్ల ఎంతో శ్రద్ధ పెరిగింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. ఇంజినీరింగ్‌లో ఎన్నో శాఖలు! ప్రతి శాఖకూ ఎన్నెన్నో ఉద్యోగావకాశాలు! 
తమ పిల్లలు ఉన్నతోద్యోగాల్లో స్థిరపడాలనీ, త్వరగా ఆర్థిక స్థిరత్వం సాధించి జీవితంలో సుఖపడాలనీ కన్నవాళ్లు కోరుకోవడం సహజమే! వారిలో ఇలాంటి ఆలోచనా ధోరణి వ్యక్తమయ్యే కొద్దీ విద్యా సంస్థల వ్యాపార ధోరణి కూడా ఆ స్థాయిలోనే పెరిగిపోయింది. ఐఐటీకి ఫౌండేషన్ కోర్సు ఆరో తరగతిలోనే చదవాల్సిన రోజులు మొదలయ్యాయి. ఈ చదరంగంలో పిల్లలే పావులు! పెరిగిపోతున్న సిలబస్ ఒకపక్క, మరో పక్క ఈ ప్రత్యేక 'శిక్షణ వారిలో ఒత్తిడిని పెంచుతున్నాయి. 
కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లో తొమ్మిదో తరగతే లేదంటే నమ్మకం కలగదు కానీ అది నిజం! పదోతరగతిలో అత్యధిక మార్కులు సంపాదించే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలంటే వారికి రెండేళ్లపాటు ఒకటే సిలబస్ బోధించి, నిద్రలో లేపి అడిగినా ప్రతి ప్రశ్నకూ జవాబు చెప్పేలా తయారు చేయాలి. విద్యా సంస్థల్లో పెరిగిపోతున్న ఈ అక్రమ విధానాలకూ, వ్యాపార ధోరణికీ తల్లిదండ్రుల ఉదాసీనతా, అత్యాశలే పునాదులని చెప్పాలి. పిల్లల ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యం, విలువ, గౌరవం ఇవ్వాలనే కథాంశంతో వచ్చిన హిందీ సినిమా ''త్రీ ఇడియట్స్ అద్భుత విజయం సాధించింది. ఎందుకంటే- చాలా మంది విద్యార్థులు అందులోని పాత్రల్లో తమని తాము చూసుకున్నారు!

Give me some sun shine
give me some rain
give me another chance I want to grow up once again

- అని మొదలయ్యే ఒక పాట ప్రతి ఒక్కరినీ ఆలోచనలో పడేసి తీరుతుంది. అవును, ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ మళ్లీ పెరిగే అవకాశం వస్తే, తమ జీవితాన్ని ప్రస్తుతం కంటే మెరుగ్గా తీర్చిదిద్దుకుంటారు.

ఈ వ్యాసం కోసం ''నిజంగా ఏం చదవాలనుకున్నారు? పెద్దయ్యాక ఏం కావాలనుకున్నారు అని పదహారుమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను ప్రశ్నించాం. పదహారు రకాల సమాధానాలు వినిపించాయి.
వీళ్లలో ఇద్దరు గ్రూప్స్ రాసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్నారు. ఒకసారి ప్రిలిమ్స్‌లో విఫలమయ్యారో లేదో ఇంట్లో నిరసనలు ఎదురయ్యాయి. ''మళ్లీ ఏం రాస్తావులే, మార్కెట్ బాగుంది, సాఫ్ట్‌వేర్‌లోనే ప్రయత్నించు అన్నారు. ఇక ఉద్యోగంలో చేరాక గ్రూప్స్ సాధ్యంకాదులెమ్మని ఇందులోనే స్థిరపడిపోయారు.
ఒకరు మెకానికల్ ఇంజినీరింగ్ చదవాలని ఆశపడి తండ్రి బలవంతం మీద ఐటీ పూర్తిచేశారు.
ఇలాగే మరో ఇద్దరు ఏదో చదువుదామనుకుని బలవంతంగా మరేదో చదివారు. ఒకరికి అసలు ఉద్యోగం అంటే ఇష్టం లేదు. వ్యాపారం చేయాలని ఉంది. ''మనకు అలాంటివి అచ్చిరావు అంటూ ఉద్యోగంలో ప్రవేశపెట్టారు.
ఒకమ్మాయి గృహిణిగా స్థిరపడి, గృహిణుల్లో సామర్థ్యాలు వెలికితీసే ఒక చైతన్య వేదిక నెలకొల్పాలని అనుకుంది. ఆర్థికావసరాల వల్ల ఉద్యోగంలో చేరక తప్పలేదు. ప్రతి ఒక్కరి వెనకా ఏదో ఒక అసంతృప్తి దాగుంది.

''నిజానికి నేను ఏరోనాటిక్స్ చదవాలనుకున్నాను. మా నాన్నగారి కోరిక మీద సి.ఎ. చేయక తప్పలేదు. వృత్తిలో ఎంత రాణించినా కోరుకున్న చదువు చదవలేకపోయాననే బాధ మాత్రం ఉండిపోయింది...!
ఇవాళ ఉదయం ఆడిటర్ తనతో అన్న మాటలు గుర్తొచ్చి శ్రీకాంత్ మనసు భారమైంది. తన జీవితంలోనూ అదే జరిగింది! తన లక్ష్యాలు, ఆశయాలు వేరు. ఐఏఎస్ కావాలన్న కోరికతో ఆంగ్ల సాహిత్యం చదువుతానంటే నాన్న విస్తుపోయాడు. సెలెక్ట్ కాకపోతే ఏం చేస్తావన్నాడు. ఏదో ఒక జూనియర్ కాలేజీలో పాఠాలు చెప్పుకుంటావా అని ఎగతాళి చేశాడు. ఇంజినీరింగ్ తప్పదన్నాడు. చివరికి ఆయన మాటే నెగ్గింది! ఇంజినీరుగా మిగిలాడు. పెద్ద కంపెనీలో ఉద్యోగం. అయిదంకెల జీతం. కానీ మనసులో ఒక మూల ఎప్పటికీ పూడని ఖాళీ. ఈ పొరపాటు తన పిల్లల విషయంలో మాత్రం జరగకూడదు. వారికేది ఇష్టమో అదే చదువుకోవాలి. బలవంతం మీద కాక ఆసక్తి ఉన్న సబ్జెక్టు ఇష్టంగా చదువుకోవాలి వాళ్లు, కష్టంగా కాదు. ఈ విషయమై భార్యతో విభేదించడానికి కూడా వెనకాడలేదు. కొడుకు హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతానంటే 'సరే అన్నాడు. అంతే కాదు, అతడి అభిరుచి ప్రకారం సంగీతం నేర్చుకోమన్నాడు. కొడుకు ఇష్టాలకు, అభిప్రాయాలకు తాను విలువిస్తున్నప్పుడు వాడి కళ్లలో తన పట్ల కనిపించే ఇష్టం శ్రీకాంత్‌కెంతో నచ్చుతుంది. 

Posted Date: 16-12-2019