• facebook
  • twitter
  • whatsapp
  • telegram

దానశీలము

ప్రాజెక్టు పని 

వివిధ పండగల సందర్భంగా వివిధ మతాలవారు చేసే దానధర్మాలను తెలుసుకోండి. సమాచారం సేకరించండి. పట్టికను రాసి ప్రదర్శించండి.

 పండగ       దానధర్మాల విశిష్టత / ప్రత్యేకత
 తొలి ఏకాదశి  హిందువుల పండగల్లో తొలి పండగ. ఆ రోజు పిండి వంటలు చేసి పెద్దలకు నైవేద్యం పెడతారు. ఇంటికి వచ్చిన వారికి దానం చేస్తారు. అలా చేయడం వల్ల పుణ్యప్రాప్తి కలుగుతుందంటారు.
 వినాయక చవితి  వినాయక చవితి నాడు చేసిన పాయసాన్ని భగవంతుడికి నైవేద్యం పెట్టి పంచుతారు. అంతేకాకుండా అన్నదానం చేస్తారు. దాని ద్వారా సర్వసుఖాలూ లభిస్తాయని ప్రతీతి.
 పెద్దల అమావాస్య (పెత్తరామస)  హిందువులు పెద్దల అమావాస్య నాడు బ్రాహ్మణులకు బియ్యం, ఉల్లిగడ్డలు, కూరగాయలు, చింతపండును దానం చేస్తారు. అలా చేస్తే పెద్దలకు స్వర్గప్రాప్తి కలుగుతుందని వారి నమ్మకం.
 రంజాన్  మహ్మదీయులు ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ మాసంలో పేదలకు దానధర్మాలు చేస్తారు. సంపాదించిన దానిలో నుంచి దానం చేస్తే భగవంతుడు సంతోషిస్తాడని అలా చేస్తారు.
 క్రిస్టమస్  క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా దానధర్మాలు చేస్తారు. మన సంపాదన నుంచి కొద్ది మేర దానం చేస్తే క్రీస్తుకెంతో ఇష్టం. అందువల్ల వారు దానధర్మాలు చేస్తారు.



రచయిత: జి. అంజాగౌడ్

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

telugu

OTHER SUBJECTS

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌