ప్రాజెక్టు పని
వివిధ పండగల సందర్భంగా వివిధ మతాలవారు చేసే దానధర్మాలను తెలుసుకోండి. సమాచారం సేకరించండి. పట్టికను రాసి ప్రదర్శించండి.
పండగ | దానధర్మాల విశిష్టత / ప్రత్యేకత |
తొలి ఏకాదశి | హిందువుల పండగల్లో తొలి పండగ. ఆ రోజు పిండి వంటలు చేసి పెద్దలకు నైవేద్యం పెడతారు. ఇంటికి వచ్చిన వారికి దానం చేస్తారు. అలా చేయడం వల్ల పుణ్యప్రాప్తి కలుగుతుందంటారు. |
వినాయక చవితి | వినాయక చవితి నాడు చేసిన పాయసాన్ని భగవంతుడికి నైవేద్యం పెట్టి పంచుతారు. అంతేకాకుండా అన్నదానం చేస్తారు. దాని ద్వారా సర్వసుఖాలూ లభిస్తాయని ప్రతీతి. |
పెద్దల అమావాస్య (పెత్తరామస) | హిందువులు పెద్దల అమావాస్య నాడు బ్రాహ్మణులకు బియ్యం, ఉల్లిగడ్డలు, కూరగాయలు, చింతపండును దానం చేస్తారు. అలా చేస్తే పెద్దలకు స్వర్గప్రాప్తి కలుగుతుందని వారి నమ్మకం. |
రంజాన్ | మహ్మదీయులు ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ మాసంలో పేదలకు దానధర్మాలు చేస్తారు. సంపాదించిన దానిలో నుంచి దానం చేస్తే భగవంతుడు సంతోషిస్తాడని అలా చేస్తారు. |
క్రిస్టమస్ | క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా దానధర్మాలు చేస్తారు. మన సంపాదన నుంచి కొద్ది మేర దానం చేస్తే క్రీస్తుకెంతో ఇష్టం. అందువల్ల వారు దానధర్మాలు చేస్తారు. |
రచయిత: జి. అంజాగౌడ్