• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నగరగీతం

నిర్మాణాత్మక మూల్యాంకనం

భాషా కార్యకలాపాలు/ ప్రాజెక్టు పని
* భారతదేశంలోని ప్రధాన నగరాల వివరాలు వాటి ప్రత్యేకతలు, జీవన విధానాల వైవిధ్యాన్ని సేకరించి ఒక పట్టికగా రూపొందించి 'భిన్నత్వంలో ఏకత్వం' ను నిరూపించేలా ప్రదర్శించండి.

భారతదేశం - ప్రధాన నగరాలు - ప్రత్యేకతలు

 ప్రధాన నగరాలు                   

ప్రత్యేకతలు  జీవన విధానం
 ఢిల్లీ  ఇది మన దేశానికి రాజధాని. పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, ఇండియాగేట్ లాంటి ప్రదేశాలు ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలవారు ఉంటారు. విదేశీయులు ఎక్కువగా వస్తారు.  అన్ని ప్రాంతాలవారు కలిసి ఉంటారు. అన్ని ప్రాంతాల ఆహారాలు లభిస్తాయి. భారతీయతా భావం ఉంటుంది.
 ముంబయి  ఇది భారతదేశానికి ఆర్థిక రాజధాని. సముద్ర తీరంలో ఉంది. వాణిజ్య నగరం కాబట్టి అన్ని ప్రాంతాలవారు ఉంటారు. పరిశ్రమలకు నిలయం. ఎయిర్‌పోర్టు ప్రత్యేక ఆకర్షణ.  రొట్టెలు తినడం వీరికి అలవాటు. నగరంలో అన్ని వృత్తులవారు దర్శనమిస్తారు. కార్మికులు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. విలాసవంతమైన జీవనం సాగించేవారూ ఉంటారు.
 హైదరాబాద్  భారతదేశ ఐ.టి. నగరాల్లో పేరొందింది. సచివాలయం, ట్యాంక్‌బండ్, ఛార్మినార్, రామోజీ ఫిలింసిటీ, సాలార్‌జంగ్ మ్యూజియం, బిర్లా మందిరం చూడదగినవి. దక్షిణ భారతదేశంలో పెద్ద నగరం. అన్ని ప్రాంతాలవారు కలిసి ఉంటారు. ఉర్దూ మాట్లాడతారు. పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి.  హిందూ, ముస్లింలు కలిసి ఉంటారు. వరి వీరి ప్రధాన ఆహారం. అన్ని రకాల పనులు దొరుకుతాయి. ఉపాధిని ఆశ్రయించి జీవిస్తుంటారు.జీవనంలో వైవిధ్యం కనిపిస్తుంది. అన్ని పండగలను మతాలకు అతీతంగా జరుపుకుంటారు.
 చెన్నై  తమిళనాడు రాష్ట్ర రాజధాని. తమిళ భాషకు పాముఖ్యత ఇస్తారు. శాస్త్ర సాంకేతిక రంగంలో ముందుంది. సంప్రదాయాలకు నిలయం. సముద్ర తీరం ఆనందాన్ని ఇస్తుంది. సినిమా పరిశ్రమ ప్రత్యేక ఆకర్షణ.  సంప్రదాయ దుస్తులకు ప్రాధాన్యం. అన్ని వృత్తులవారు జీవిస్తుంటారు. 'అన్నం' తినడానికి ప్రాధాన్యత ఇస్తారు. విలాసంగా జీవిస్తారు. పండగలను కలిసి నిర్వహించుకుంటారు.
 కలకత్తా  భారతదేశ వ్యాపారాలకు నిలయమైన నగరం. హౌరాబ్రిడ్జి చూడదగ్గది. జనాభా ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. పెద్ద రైల్వేస్టేషన్, కాళీమాత దేవాలయం ఉన్నాయి.  వివిధ వృత్తులవారు ఉంటారు. వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తారు. పేదవారు, మధ్యతరగతివారు, ధనికులు జీవిస్తుంటారు.

భిన్నత్వంలో ఏకత్వం: మనదేశంలో ఎన్నో నగరాలు ఉన్నాయి. ఆయా నగరాల్లో వివిధ సంప్రదాయాలు పాటించేవారు, అన్ని భాషలవారు ఉంటారు. అనేక మతాలు, కులాలు ఉన్నా ఒకరినొకరు గౌరవించుకుంటారు. ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతుంటారు. సమానత్వాన్ని సాధించేందుకు కృషి చేస్తారు. జాతీయ సమైక్యత కోసం పాటుపడతారు. ఎన్ని రకాల ప్రత్యేకతలు ఉన్నా, ఎన్నో విధాల జీవన వైవిధ్యం ఉన్నా 'భారతీయులం' అనే భావనతో కలిసి ఉంటారు. అదే మన దేశ గొప్పతనం. భిన్న వాతావరణం, భాషలు, ఆచారాలు, విభిన్న సంప్రదాయాలు ఉన్నా ఏకత్వాన్ని చాటుతున్నారు. ప్రపంచమంతా తమవైపు చూసేలా భారతీయులు వ్యవహరిస్తున్నారు. వేదభూమిగా, పుణ్యభూమిగా వర్థిల్లిన ఈ భారతదేశం ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ వస్తోంది. ఆయా నగరాలు సమానంగా దేనికదే గొప్ప అనే స్థాయిలో విస్తరిస్తున్నాయి. నగరాల్లో 'భిన్నత్వంలో ఏకత్వం' కనిపిస్తుంది. అందుకు తగిన విధంగా నగరాలు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.
 


రచయిత: జి. అంజాగౌడ్

Posted Date : 19-03-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

telugu

OTHER SUBJECTS