• facebook
  • whatsapp
  • telegram

ఏకకాలంలో ప్రిపరేషన్‌ ఏంతో మేలు!

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ సన్నద్ధత వ్యూహం

 

 

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువత.. ముఖ్యంగా గ్రూప్‌-1 పోస్టుల ఆశావహుల స్వప్నం త్వరలోనే సాకారం కాబోతోంది. ఒకేసారి 503 గ్రూప్‌-1 ఉద్యోగాలను ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించటం, ఆర్థిక శాఖ ఆమోదం తెలపటం జరిగిపోయాయి. ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలకు కలిపి ఏకకాలంలో ఇంటిగ్రేటెడ్‌గా ప్రిపేర్‌ అవ్వాలనేది అభ్యర్థులు గమనించవలసిన విషయం!

 

ఇంత భారీ స్థాయిలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రానుండటం అరుదైన విషయం. ఈ పోస్టుల ప్రకటన ఇప్పుడు చేజార్చుకుంటే.. మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్‌ వస్తుందో చెప్పలేం. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ పోస్టుల సంఖ్య చాలా తక్కువగానే ఉండొచ్చు. అందువల్ల అభ్యర్థులు రానున్న నోటిఫికేషన్‌ లక్ష్యంగా చేసుకుని సన్నద్ధతలో నిమగ్నం కావాలి.  గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు సంబంధించి కేవలం ‘తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం’ అనే సబ్జెక్టుపై 150 మార్కులకుగాను ఒక పేపరు పూర్తిగా ఉంటుంది (పేపర్‌-6). పై సబ్జెక్టుల నుంచి 50 - 100 మార్కులు జనరల్‌ ఎస్సే, మిగిలిన అంశాల నుంచి పేపర్‌-2, పేపర్‌-3 (మెయిన్స్‌)లో మరో 100 మార్కులు కలుస్తాయి. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్‌లో దాదాపు సగం మార్కులు పై సబ్జెక్టుల నుంచే ఉంటాయని గమనించాలి. గ్రూప్‌-1 పరీక్షలో కీలక పాత్ర వహించేది ‘తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం’. అందుకే ముందుగా ఈ సబ్జెక్టును చదివి నోట్సును సమగ్రంగా ప్రిపేర్‌ చేసుకోండి. 

 

సంపూర్ణ అవగాహన  

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో.. 

‘ఈ కిందివాటిలో ‘పెద్ద మనుషుల ఒప్పందం’లో లేని అంశం ఏది?’ అనే ప్రశ్న వస్తే.. దానికి సరైన సమాధానాన్ని గుర్తించాలంటే అందులోని అన్ని అంశాలూ తెలిసి ఉండాలి. ఇదే విషయంపై మెయిన్స్‌లో వచ్చే ప్రశ్న ఈవిధంగా ఉండొచ్చు. 

‘పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాల అమలులో మొదటి 12 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఉల్లంఘనలు జరిగాయో విమర్శనాత్మకంగా, సోదాహరణంగా వివరించండి’ (Critically evaluate the violations of the Gentlemen Agreement in the first twelve years after the formation of Andhra Pradesh State?)

ఈ విధంగా ప్రిలిమ్స్‌లోనూ, మెయిన్స్‌లోనూ వచ్చే ప్రశ్నలను పరిశీలిస్తే సబ్జెక్టును పూర్తిగా, సమగ్రంగా చదవాల్సిందేనని అర్థమవుతుంది. ఇదేవిధంగా మిగిలిన సబ్జెక్టుల్లో కూడా ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ఆ దిశలో సన్నద్ధమై సబ్జెక్టుపై పట్టు సాధించడం చాలా ముఖ్యం. 

జనరల్‌ ఎస్సేకు సంబంధించి హిందూ లాంటి ప్రామాణిక జాతీయ ఆంగ్ల దినపత్రిక ప్రాంతీయంగా ప్రామాణికమైన తెలుగు వార్తాపత్రిక (ఈనాడు)లోని వ్యాసాలనూ, వార్తా కథనాలనూ సమగ్రంగా చదవాలి. నోట్సు తయారు చేసుకునే క్రమంలో రైటింగ్‌ సాధన చేస్తే, రాతలో వేగాన్ని మెరుగుపరుచుకోవచ్చు. 

 

లక్షలమంది పోటీ

యూపీఎస్‌సీ సివిల్స్‌ పరీక్ష తరహాలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో ఒక పోస్టుకు దాదాపు 12- 13 మంది అభ్యర్థులను మెరిట్‌ ప్రాతిపదికన మెయిన్స్‌ పరీక్షకు ఎంపిక చేయవచ్చు. అంటే 503 పోస్టులకుగానూ దాదాపు 6 వేల నుంచి 7 వేల మందిని ఎంపిక చేసే అవకాశం ఉంది.  ప్రిలిమ్స్‌ పరీక్షకు పోటీపడే అభ్యర్థుల సంఖ్య దాదాపు ఐదు లక్షల వరకు ఉండవచ్చునని అంచనా. ఇక మెయిన్స్‌ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల నుంచి 1000 మంది మాత్రమే ఇంటర్వ్యూకు అర్హత సాధించి అంతిమంగా 503 మంది అభ్యర్థులు మాత్రమే ఏదైనా గ్రూప్‌-1 పోస్టును సాధించగలుగుతారు.

కాబట్టి గ్రూప్‌-1 ఆశావహులందరూ ఈ తీవ్రమైన పోటీని గుర్తించి వెంటనే ప్రణాళికాబద్ధంగా తమ సన్నద్ధతను ప్రారంభించవలసి ఉంటుంది. ఈ సందర్భంలో ‘The early bird catches the worm’ అనే ఆంగ్ల సామెతను గుర్తు తెచ్చుకోండి.  

 

స్టడీమెటీరియల్
 

1. వర్తమానాంశాలు – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు
2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
3. జనరల్ సైన్స్ – శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత దేశం సాధించిన విజయాలు
4. పర్యావరణ అంశాలు – విపత్తు నిర్వహణ – నివారణ, ఉపశమనం కోసం వ్యూహాలు
5. భార‌తదేశ ఆర్థిక‌, సామాజిక అభివృద్ధి
6. ప్రపంచ భూగోళ శాస్త్రం, భారత భూగోళ శాస్త్రం, తెలంగాణ రాష్ట్ర భూగోళ శాస్త్రం
7. భారత దేశ చరిత్ర, సంస్కృతి – వారసత్వం
8. భారత ‌రాజ్యాంగం, రాజ‌కీయ వ్యవ‌స్థ
9. భారతదేశంలో ప‌రిపాల‌న‌, ప్రభుత్వ విధానాలు
10. తెలంగాణ రాష్ట్ర విధానాలు
11. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
12 .సామాజిక మిన‌హాయింపు/ వెలి ; లింగ, కుల‌, తెగ‌ల‌, వైక‌ల్యం మొద‌లైన హ‌క్కులు, స‌మ్మళిత విధానాలు
13 .లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ ప్రిటేషన్

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆ సగం సిలబస్‌ ఇప్పుడే చదివేస్తే మేలు!

‣ ఆ విభాగాలపై పట్టు విజయానికి తొలిమెట్టు!

‣ విశ్వాసం సడలకుండా..!

‣ సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌లు సిద్ధం!

 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌