• facebook
  • whatsapp
  • telegram

ప్రాచీన నాగరికత,  సంస్కృతులు

అరణ్యకాలు.. బ్రాహ్మణాలకు అనుబంధాలు!

 ప్రాచీన నాగరికత, సంస్కృతులకు భారతదేశం పుట్టిల్లు. మనిషి ఆవిర్భావం అనంతరం ప్రారంభ నాగరికతల్లో ఒకటైన సింధు నాగరికత ఇక్కడ వర్ధిల్లింది. ఆ తర్వాత ఆర్యుల వలసలతో వైదిక సమాజం, సంస్కృతి విస్తరించాయి. ఈ క్రమంలోనే జాతి, రాజ్యం, శాసనాలు, నియమాలు రూపుదిద్దుకున్నాయి. దేవతా పూజలు, కుల వ్యవస్థ, పితృస్వామిక సమాజం లాంటి కట్టుబాట్లు, అలవాట్లు స్థిరపడ్డాయి. హరప్పా నాగరికత మొదలు తొలి వేద, మలి వేద కాలాల్లో సమాజ గమనం, జీవనశైలి, మనుషుల నడవడిక, కాలానుగుణంగా జరిగిన మార్పులను పరీక్షార్థులు తెలుసుకోవాలి. నాటి పరిస్థితులపై, వేదాలు, ఉపనిషత్తుల్లోని ముఖ్యాంశాలపై అవగాహన పెంచుకోవాలి.1.   నిశ్చితం (ఎ): ప్రాచీన కాలం ప్రజలు అవసరమైతే తప్ప జంతు వేట చేసేవారు కాదు.

కారణం (ఆర్‌): ఈ కాలం నాటి ప్రజలు జంతువులను పవిత్రంగా పూజించేవారు.

1) ఎ కి ఆర్‌ సరైన వివరణ కాదు.     

2) ఎ, ఆర్‌ లు విరుద్ధ వాక్యాలు.

3) ఎ కి ఆర్‌ సరైన వివరణ.          

4) ఎ సరికాదు, ఆర్‌ సరైంది.

 

 

2.  కిందివాటిలో భింబెట్కా వద్ద ఉన్న వర్ణచిత్రం-

1) అడవి దున్న    2) అడవి పంది 

3) ఎద్దు     4) ఆవు

 

 

3.     కింది వాక్యాలు పరిశీలించి భిన్నమైన దాన్ని కనుక్కోండి.

ఎ) వేట - సేకరణ (ఆదిమానవుడు) సమాజం వారి మత విధానాలు తెలుసుకునేందుకు చెంచు జాతి మత విధానాలు అధ్యయనం చేయాలి.

బి) ఈ సమాజం వారు చనిపోయినవారితో వారి సమాధుల్లో కొన్ని వస్తువులు ఉంచే ఆచారం కలిగి లేరు.

సి) చెంచులు నృత్యాలు చేసేవారు.

డి) చెంచులు మైసమ్మ/ గంగమ్మను పూజించారు.

1) డి    2) ఎ, బి    3) బి    4) ఏదీకాదు 

 

 

4.  చెంచు జాతి పూజించిన దేవతలు?

1) మల్లికార్జున స్వామి - శ్రీశైలం  

2) నరసింహస్వామి - అహోబిలం 

3) శివుడు - గుడిమల్లం      

4) 1, 2 

 

 

5.  భక్త కన్నప్ప కథ ఉన్న తమిళ ‘పెరియ పురాణం’ ఏ శతాబ్దం నాటిది?

1) 11వ   2) 12వ   3) 13వ   4) 14వ 

 

 

6.   కాల్చిన బంకమట్టి విగ్రహం మెహర్‌ నగర్‌లో ఉంది. అది ఎన్ని వేల సంవత్సరాల నాటిది?

1) 4600  2) 6400  3) 3000  4) 5000

 

 

7.   దక్కను ప్రాంతంలో బూడిద దిబ్బలను మండించిన పశుపోషకులు, ఆ మంటలను ఏ సమయాల్లో మండించారు?

1) సంక్రాంతి  2) హోలీ  3) దీపావళి 4) పైవన్నీ 

 

 

8.     కిందివాటిలో సరికాని వాక్యం?

ఎ) మహారాష్ట్రలో పశుపోషకులను ‘ధంగర్‌’ అని అంటారు. 

బి) కర్ణాటకలో పశుపోషకులను ‘కురుబ’, ఆంధ్రాలో ‘కురుమ’ అంటారు.

సి) తొలి వ్యవసాయదారులు, పశుపోషకులు ఒకే విధమైన మత విధానాలు అవలంభించలేదు.

డి) మహారాష్ట్ర పశుపోషకులు విఠోభాను, ఆంధ్ర, కర్ణాటకలో రేణుకామాత, ఎల్లమ్మ మొదలైన దేవతలను పూజించారు.

1) ఎ    2) డి      3) బి, సి    4) సి 

 

 

9.   5000 ఏళ్ల నాటి కుండ పాత్రలున్న ముండిగాక్‌ ఏ ప్రాంతంలో ఉంది? 

1) ఇరాన్‌   2) ఇరాక్‌    3) అఫ్గానిస్థాన్‌    4) ఈజిప్ట్‌

 

 

10. వేదాల్లో ప్రాచీనమైన రుగ్వేదం ఎన్ని వేల ఏళ్ల కిందట సంకలనం చేశారని అంచనా?

1) క్రీ.పూ.3500     2) 3500 ఏళ్ల కిందట

3) క్రీ.శ.3500       4) 7000 సంవత్సరాల కిందట 

 

 

11. వేదకాలంలో ప్రధాన దేవతలు?

1) అగ్ని  2) ఇంద్రుడు  3) సోమలత 4) పైవన్నీ

 

 

12. ‘‘ఓ నదులారా! పర్వతాల నుంచి జలజలా కిందికి దిగిరండి.....’’ ఈ శ్లోకం పాడింది ఎవరు?

1) వశిష్టుడు     2) ఉద్దాలక ఆరుణి 

3) యాజ్ఞవల్క్యుడు     4) విశ్వామిత్రుడు

 

 

13. కిందివాటిలో సరైన వాక్యాలు-

ఎ) హిందూకుష్‌ పర్వతాలు - యమున నది మధ్యన నివసించిన ఆర్యులు మలివేదకాలపు ఆర్యులు.

బి) ఆర్య తెగల మధ్య యుద్ధాలు జరిగేవి కావు.

సి) గంగా - యమున నదుల మధ్య ఉన్న ఆర్యులు వరి, గోధుమ పంటలు పండించారు.

డి) మలి వేదకాలంలో స్త్రీలకు స్వాతంత్య్రం అంతరించింది.

1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి 3) సి, డి 4) ఎ, బి, సి

 

 

14. ‘ఆర్య’ అనే పదం నుంచి ‘ఆర్యులు’ అనే పదం వచ్చింది - ‘ఆర్య’ అనేది ఏ భాషా పదం?     

1) తమిళం 2) మరాఠి 3) సంస్కృతం 4) బెంగాలీ 

 

 

15. రుగ్వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?     

1) 1028  2) 1208  3) 1820  4) 1802 

 

 

16. కిందివాటిలో సరికాని జత?

ఎ) రుగ్వేదం - గాయత్రి మంత్రం 

బి) సామవేదం - భారతీయ సంగీతం 

సి) యజుర్వేదం - క్షుద్రపూజలు

డి) అధర్వణ వేదం - మంత్రతంత్రాలు 

1) ఎ, సి     2) సి మాత్రమే   

3) డి మాత్రమే    4) ఎ, సి, డి

 

 

17. కిందివాటిని జతపరచండి.

1) గంధర్వ వేదం  ఎ) సంగీతం 

2) బ్రాహ్మణాలు    బి) మంత్రాలను సంప్రదాయబద్ధంగా వివరిస్తాయి

3) అరణ్యకాలు     సి) ఉత్సవాలు, త్యాగాలను వివరిస్తాయి  

4) ఉపనిషత్తులు  డి) బ్రాహ్మణాలకు అనుబంధాలు

                            ఇ) పూజా విధానాలు

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఇ         

2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 

3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి         

4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి

 

 

18. కిందివాటిలో వేదాంగాల్లో లేనిది?

1) శిక్ష   2) కల్ప  3) అలంకారం  4) చంధస్సు

 

 

19. వేదాంగాల్లో ప్రధానమైంది?

1) శిక్ష   2) కల్ప   3) వ్యాకరణ   4) నిరుక్త 

 

 

20. షట్‌ దర్శనాలు రచయితల్లో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. 

ఎ) న్యాయదర్శనం - గీతముడు 

బి) సాంఖ్యదర్శనం - కపిలుడు

సి) ఉత్తరమీమాంస - జైమని 

డి) వైశేషిక దర్శనం - కనడ రుషి 

1) బి, సి   2) సి, డి     3) డి    4) సి 

 

 

21. వేదాలు ‘నాలుగు’ అయితే, ఉపవేదాలు ఎన్ని?

1) 2     2) 4        3) 5        4) 6

 

 

22. తొలివేద ఆర్యులు నివసించిన ప్రాంతంలో లేని నది?    

1) యమున   2) సరస్వతి   3) జీలం    4) సట్లెజ్‌ 

 

 

23. దశరాజు యుద్ధంలో విజయం సాధించినవారు?

1) దశరథుడు     2) ధర్మరాజు 

3) సుధాముడు   4) దుర్యోధనుడు 

 

 

24. తొలివేద కాలంలో రాజును రాజన్‌ అని పిలవగా, మలివేదంలో రాజు కింది బిరుదులను కలిగి ఉన్నాడు..

1) రాజవిశ్వజనన్‌     2) ఏకరాట్‌ 

3) సామ్రాట్‌     4) పైవన్నీ 

 

 

25. వేదకాలంలో రాజస్వేచ్ఛను ఎదుర్కొనే సంస్థలు? 

1) సభ    2) సమితి    3) 1, 2   4) గ్రామసభలు 

 

 

26. వేదకాలం నాటి ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించింది?

1) బంగారం  2) వెండి  3) గోవులు   4) పంటలు

 

 

27. కిందివాటిలో తప్పుగా ఉన్న వాక్యాలు?

ఎ) వేదకాలంలో పితృసామ్య వ్యవస్థ అమల్లో ఉంది. 

బి) బహుభార్యత్వం అమల్లో ఉండేది కాదు. 

సి) బాల్యవివాహాలు, సతీసహగమనం రుగ్వేద కాలంలో అమల్లో ఉండేవి.

డి) వేదకాలంలో రథాల పోటీ, గుర్రపు స్వారీ, పాచికలు, సంగీతం లాంటి వినోద కార్యక్రమాలు ఉండేవి. 

ఇ) రుగ్వేద కాలంలో స్త్రీలకు సభ, సమితిలో సభ్యత్వం ఉండేది.    

1) ఎ, సి, డి 2) సి, డి, ఇ  3) బి, సి, ఇ     4) బి, సి 

 

 

28. శూద్రులను గురించి ప్రస్తావించిన రుగ్వేదంలోని అధ్యాయం? 

1) 10     2) 18     3) 1     4) 21

 

 

29. రుగ్వేదంలో ఇంద్రుడు - యుద్ధదేవుడు కాగా, వాతావరణ దేవుడు ఎవరు?

1) అగ్ని     2) వాయుదేవుడు 

3) సోమలత     4) ఇంద్రుడు 

 

 

30. మానవుడికి, దేవతలకు మధ్య వారధిగా ఏ దేవుడిని పిలుస్తారు? 

1) అగ్ని  2) సోమలత  3) ఇంద్రుడు  4) అదితి 

 

 

31. ‘శతపథ బ్రాహ్మణం’లో ఆర్యులు ఏ ప్రాంత మైదానాలకు విస్తరించారని పేర్కొన్నారు?     

1) వాయవ్య సింధు మైదానం 

2) తూర్పు సింధు మైదానం 

3) తూర్పు గంగా మైదానం     

4) పైవన్నీ 

 

 

32. మహాభారత యుద్ధం జరిగిన సంవత్సరం (సుమారుగా) ?

1) క్రీ.శ.950     2) క్రీ.పూ.950     

3) 950 ఏళ్ల కిందట    4) 1950 ఏళ్ల కిందట 

 

 

33. జనక మహారాజు ఆస్థానంలో ఉన్న ప్రముఖ రుషి- 

1) విశ్వామిత్రుడు     2) వశిష్టుడు 

3) సుధాముడు     4) యాజ్ఞవల్క్యుడు 

 

 

34. మలి వేదకాలంలో ప్రధానంగా చేసిన యాగాలు-

1) రాజసూయ     2) అశ్వమేధ 

3) వాజపేయీ     4) పైవన్నీ 

 

 

35. మలి వేదకాలంలో విరివిగా వాడుకలోకి వచ్చిన లోహం?

1) రాగి  2) ఇనుము  3) వెండి  4) కంచు

 

 

36. ‘మలి వేద కాలంలో కూతురిని భారంగా    చూసేవారు’ అని పేర్కొన్నది?

1) ఐతరేయ బ్రాహ్మణం    2) శతపత బ్రాహ్మణం 

3) కఠోపనిషత్తు    4) మాండకోపనిషత్తు

 

 

37. ‘వైశ్య, శూద్ర పురుషులు బ్రాహ్మణ, క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకోరాదు’ అని చెప్పిన గ్రంథం?

1) ఐతరేయ బ్రాహ్మణం     2) శతపత బ్రాహ్మణం

3) కఠోపనిషత్తు          4) మాండకోపనిషత్తు

 

 

38. మలివేద కాలంలో ప్రధాన దేవతలు? 

1) త్రిమూర్తులు     2) ఇంద్రుడు 

3) అగ్ని     4) పైవారందరూ 

 

 

39. గ్రీకులు - ఆర్యులకు ఏ విషయంలో సామ్యం ఉంది?

1) పరిపాలన     

2) ప్రకృతి శక్తుల ఆరాధన 

3) భోజనపు అలవాట్లు     

4) వస్త్రధారణ

 

 

40. కిందివాటిని జత చేయండి. 

1) సింధు  ఎ) హైడాస్టస్‌ 

2) రావి      బి) పరుష్ని 

3) సట్లెజ్‌   సి) షటుద్రి 

4) అసిక్ని   డి) చినాబ్‌ 

                 ఇ) విపాస్‌

1) 1-బి, 2-డి, 3-ఇ, 4-సి      2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 

3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి      4) 1-సి, 2-ఎ, 3-డి, 4-ఇ

 

 

41. గోత్రం అనే పదం మొదటిసారిగా వాడిన వేదం? 

1) సామవేదం     2) రుగ్వేదం 

3) అధర్వణవేదం     4) యజుర్వేదం 

 

 

42. రుగ్వేద కాలంలో ప్రముఖ కవయిత్రులు?

1) అపల, ఘోష     2) విశ్వవర 

3) లోపాముద్ర     4) పైవారంతా

 

 

43. 3000 ఏళ్ల కిందట నిర్మించిన సమాధులైన రాక్షస గుళ్లు ఏ ప్రాంతంలో ఉన్నాయి?

1) దక్కను భారతదేశం   2) కశ్మీర్‌ 

3) ఈశాన్య భారత0దేశం  4) పైవన్నీ


 

 

సమాధానాలు


1-3; 2-2; 3-3; 4-4; 5-2; 6-4; 7-4; 8-4; 9-3; 10-2; 11-4; 12-4; 13-3; 14-3; 15-1; 16-2; 17-3; 18-3; 19-2; 20-4; 21-2; 22-1; 23-3; 24-4; 25-3; 26-3; 27-4; 28-1; 29-4; 30-1; 31-3; 32-2; 33-4; 34-4; 35-2; 36-1; 37-2; 38-1; 39-2; 40-2; 41-3; 42-4; 43-4.

 

 


రచయిత: గద్దె నరసింహారావు  

Posted Date : 30-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌