• facebook
  • whatsapp
  • telegram

తొమ్మిది పొరల నగరం.. మృతులదిబ్బ! 

ప్రాచీన నాగరికత, సంస్కృతులు

 

 

క్రీస్తు పూర్వమే భారతదేశంలో నాగరికత వర్ధిల్లింది. ప్రాచీన శిలాయుగం నుంచే ఇక్కడ మనుషుల సంచారం ఉంది. వేల సంవత్సరాలుగా వ్యవసాయం, పశుపోషణ, పరదేశీయులతో వాణిజ్యంతో పాటు ప్రకృతి ఆరాధన, కళలకు ప్రాధాన్యం కొనసాగుతోంది. ఆ పరిణామక్రమం, ఉపఖండంలో తొలి నాగరిక సమాజాలు విలసిల్లిన ప్రాంతాలు, నేటికీ ఉన్న ఆనాటి ఆనవాళ్ల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. సింధూ నాగరికత వెలుగుచూసిన ప్రాంతాలు, అక్కడి ప్రజల జీవనవిధానం, నగర నిర్మాణాల తీరు, హరప్పా, మొహంజోదారో వంటి ప్రసిద్ధ ప్రాంతాల విశేషాలు, అక్కడి సంస్కృతులతో పాటు దేశవ్యాప్తంగా ప్రాచీన మానవుడి గుర్తులు ఉన్న ప్రదేశాల గురించి అవగాహన కలిగి ఉండాలి.


1.    ఎ) ప్రాచీన శిలాయుగం మానవుడి పనిముట్లు రాజస్థాన్, గుజరాత్, బిహార్, దక్షిణ భారతదేశంలో లభించాయి?

బి) నవీన శిలాయుగం మానవుడి పనిముట్లు భారతదేశమంతటా లభించాయి.

1) ఎ, బి లు సరైనవి కావు 2) ఎ, బి లు సరైనవి 

3) బి సరైంది కాదు ఎ సరైంది 4) బి సరైంది


2.     సూక్ష్మ రాతి పనిముట్లు లభించిన ‘గుడియం’ గుహలున్న రాష్ట్రం?

1) ఝార్ఖండ్‌     2) జమ్ము-కశ్మీర్‌ 

3) తమిళనాడు     4) మధ్యప్రదేశ్‌


3.     చనిపోయిన వారిని దహనం చేసే ఆచారం కలిగిన ప్రాంతం?

1) మక్రాన్‌ దక్షిణ ప్రాంతం     2) నాల్‌ ఉత్తర ప్రాంతం 

3) జోల్‌ పశ్చిమ ప్రాంతం   4) పైవన్నీ


4.     పరిమళ ద్రవ్యాలను కుర్ణీ సంస్కృతి ప్రజలు ఏ ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు?

1) మెసపటోమియా     2) పర్షియా 

3) ఈజిప్టు     4) రోమన్‌


5.     కిందివాటిలో సరికాని జత? 

ఎ) నెల్లూరు జిల్లా - పురాతన రాతి గొడ్డలి 

బి) జమ్ము-కశ్మీర్‌ - రాతితో చెక్కిన పరికరాలు

సి) ముచ్చట్ల చింతమాను గవి గుహ - రాతి పరికరాలు 

డి) చింతకుంట - ఆదిమానవుడు చిత్రించిన చిత్రాలు

1) ఎ, బి, డి   2) బి      3) సి   4) బి, సి


6.     కిందివాటిలో సరైన వాక్యాలు?

ఎ) వై.ఎస్‌.ఆర్‌. కడప జిల్లాలో చింతకుంట గ్రామం ఉంది.

బి) చింతకుంట గ్రామం వద్ద 200పైగా చిత్రాలున్నాయి.

సి) 200 పైగా చిత్రాల్లో పది ఎరుపు రంగులో ఉన్నాయి.

డి) ఈ ప్రాంతంలో జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, మానవుల బొమ్మలు లేవు.

1) ఎ, బి, సి, డి  2) ఎ, బి, డి 3) బి, సి    4) ఎ, బి 


7.     నిశ్చితం (A): 12,000 ఏళ్ల కిందట ఆదిమానవుడు వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. 

కారణం (R): 12,000 సంవత్సరాల కాలంలో వాతావరణంలో మార్పులు వచ్చి ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గిపోయాయి.

1) A, R లు సరైనవి. A కు R సరైన వివరణ కాదు

2) A, R లు సరైనవి. A కు R సరైన వివరణ. 

3) A సరైంది కాదు, R సరైంది. 4) A సరైంది, R సరైంది కాదు


8.    కిందివాటిని జతపరచండి. 

1) మహారాష్ట్ర ఎ) నవస
2) మధ్యప్రదేశ్‌ బి) నంద్రా
3) ఆంధ్రప్రదేశ్‌ సి) బేతంచర్ల
4) తమిళనాడు డి) గుడియం
ఇ) రామ్‌గఢ్‌  

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి    2) 1-బి, 2-సి, 3-ఇ, 4-ఎ

3) 1-ఎ, 2-బి, 3-ఇ, 4-డి    4) 1-ఎ, 2-ఇ, 3-సి, 4-డి


9.     కిందివాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి.

ఎ) 9000 ఏళ్ల కిందట బెలూచిస్థాన్‌ వద్ద వ్యవసాయం చేశారు.

బి) 5000 ఏళ్ల కిందట దక్షిణ భారతదేశంలో జంతు పోషణ జరిగింది.

సి) 6000 ఏళ్ల కిందట కశ్మీర్‌ వద్ద వ్యవసాయం చేశారు.

డి) 5000/4000 ఏళ్ల కిందట బిహార్‌ వద్ద వ్యవసాయం చేశారు.

1) డి     2) సి     3) బి, సి    4) ఎ 


10. పాకిస్థాన్‌లోని పశ్చిమ పంజాబ్‌ ప్రాంతంలో హరప్పా నాగరికతను కనుక్కున్న సంవత్సరం?    

1) 1921  2) 1922  3) 1923  4) 1924 


11. కిందివాటిలో సింధూ నాగరికత సరిహద్దులకు సంబంధించి సరికానిది? 

ఎ) ఈ నాగరికత దక్షిణ సరిహద్దు - గుజరాత్‌లోని భగట్రావ్‌ 

బి) ఈ నాగరికత ఉత్తర సరిహద్దు - పంజాబ్‌లోని రూపర్‌ 

సి) ఈ నాగరికత పశ్చిమ సరిహద్దు - సుట్కాజందూర్‌ 

డి) ఈ నాగరికత తూర్పు సరిహద్దు - ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌

1) ఎ, బి     2) బి, డి        3) ఎ    4) డి 


12. ఇటీవల జరిపిన తవ్వకాల ఆధారంగా సింధూ నాగరికత ఏ ప్రాంతాలకు విస్తరించిందని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు? 

ఎ) మహారాష్ట్రలోని నవస, దైమాబాద్‌ బి) జమ్ము-కశ్మీర్‌లోని శ్రీనగర్‌ 

సి) జమ్ము-కశ్మీర్‌లోని మండ    డి) మహారాష్ట్రలోని దైమాబాద్‌

1) ఎ, బి, సి, డి 2) ఎ, సి    3) సి, డి  4) ఎ, సి, డి 


13. సింధూ నాగరికతలో ప్రధానమైన రెండు నగరాలు?

1) పంజాబ్‌లోని హరప్పా, హరియాణాలోని ఒనవాలీ 

2) గుజరాత్‌లోని లోథాల్, పంజాబ్‌లోని హరప్పా

3) సింధూలోని మొహంజోదారో, రాజస్థాన్‌లోని కాలీభంగన్‌ 

4) సింధూలోని మొహంజోదారో, పంజాబ్‌లోని హరప్పా


14. కిందివాటిలో సింధూ నాగరికతకు సంబంధించి సరైన వాక్యం?

1) ఈ నాగరికత 2400 ఏళ్ల కిందట 900 సంవత్సరాల పాటు వర్ధిల్లింది.

2) ఈ నాగరికత  క్రీ.శ.4600 లో 900 సంవత్సరాల పాటు వర్ధిల్లింది.

3) ఈ నాగరికత 4600 ఏళ్ల కిందట 900 సంవత్సరాల పాటు వర్ధిల్లింది.

4) ఈ నాగరికత క్రీ.పూ.4600 లో 900 సంవత్సరాల పాటు వర్ధిల్లింది.


15. సిటాడెల్‌ (దుర్గం) లేని సింధూ నాగరికత నగరం?    

1) కాలీభంగన్‌     2) చన్హుదారో

3) మొహంజోదారో     4) హరప్పా


16. సింధూ నాగరికత లిపిని తొలిసారిగా, పూర్తిగా కనుక్కున్న సంవత్సరాలు వరుసగా?    

1) 1835, 1923     2) 1835, 1925 

3) 1858, 1923     4) 1853, 1923


17. సింధూ నాగరికత లిపికి సంబంధించిన కింది అభిప్రాయాల్లో సరైనవి?    

ఎ) ఇది ద్రవిడ లిపికి చెందింది.

బి) ఈ లిపి ప్రోటో ద్రవిడ లిపి.

సి) ఈ లిపి సుమేరియన్‌ లిపి అని కొందరి అభిప్రాయం. 

డి) ఇది సంస్కృత లిపి అని కొందరి అభిప్రాయం.

1) ఎ, బి  2) ఎ, డి 3) ఎ, బి, సి, డి  4) బి, సి


18. సింధూ నాగరికత లిపిని ప్రోటో ద్రవిడ భాష అని అన్నవారు?    

1) సర్‌ జాన్‌ మార్షల్‌     2) మధుసూదన్‌ మిశ్రా 

3) ఆచార్య మహాదేవన్‌     4) ఆర్‌.డి.బెనర్జీ


19. కిందివాటిలో సింధూ నాగరికత నగర నిర్మాణానికి సంబంధించి సరైన వాక్యాలు?

ఎ) నగర నిర్మాణ ప్రధాన వీధులు ఉత్తర - దక్షిణానికి ఉన్నాయి. 

బి) గ్రిడ్‌ పద్ధతిలో రహదారులు నిర్మించారు.

సి) లోతట్టు ప్రాంతాల్లో గుహలు, ఎత్తయిన వేదికలపై నిర్మాణాలు ఉన్నాయి.

డి) గృహాల ప్రధాన ద్వారాలు ప్రధాన రహదారికి కాకుండా ఉప వీధుల్లో ఉండేవి.

1) ఎ, బి, సి  2) ఎ, బి, సి, డి      3) బి, సి, డి    4) సి


20. సింధూ నాగరికతను కనుక్కున్న సర్‌ జాన్‌ మార్షల్‌ ఏ దేశానికి చెందినవారు?

1) బ్రిటన్‌   2) జర్మనీ  3) ఫ్రాన్స్‌  4) భారత్‌ 


21. హరప్పా నాగరికతలో వాడిన ఇటుకలు ఏ ఆకారంలో ఉండేవి?

1) L      2)  T       3)  S  4) పైవవ్నీ


22. హరప్పాను మొదటిసారిగా కనుక్కున్నవారు? 

1) ఆర్‌.డి.బెనర్జీ     2) దయారాం సహాని 

3) ఎమ్‌.జి.మజుందార్‌     4) నీలకంఠ శాస్త్రి


23. కిందివాటిలో ఏ నగరం 9 పొరలతో కూడి ఉంది, దీన్ని మృతుల దిబ్బ అని కూడా అంటారు?

1) కాలీభంగన్‌     2) హరప్పా 

3) బన్వాలీ     4) మొహంజోదారో 


24. ప్రత్యేక పర్వదినాల సమయంలో పతాకాలు కట్టి ఊరేగింపులు జరిపిన ప్రజలు?

1) ఆర్యులు     2) సింధూ ప్రజలు 

3) పర్షియన్లు    4) గ్రీకులు 


25. సింధూ ప్రజలు ఏ జాతికి చెందినవారు? 

1) మెడిటరేనియన్‌     2) మంగోలాయిడ్స్‌ 

3) ఆలోఫెన్, ప్రొటో-ఆస్ట్రలాయిడ్స్‌  4) పైవన్నీ 


26. సింధూ ప్రజల ప్రధాన వృత్తి?

1) వ్యవసాయం        2) పశుపోషణ 

3) వ్యవసాయం, పశుపోషణ     4) వ్యాపారం


27. సింధూ ప్రజలు వరి పండించిన ఆనవాళ్లు లభించిన ప్రాంతం? 

1) కాలీభంగన్‌     2) రంగపుర్‌ 

3) హరప్పా     4) రూపర్‌


28. సురోకోతోడా వద్ద లభించిన ఎముకలు గుర్రానివి కాదు, గాడిదవి అని అభిప్రాయపడినవారు? 

1) సర్‌ జాన్‌ మార్షల్‌     2) రొమిల్లా థాపర్‌ 

3) ఆర్‌.డి.బెనర్జీ    4) దయారాం సహాని  


29. కిందివాటి సరికాని జత?

ఎ) రాజస్థాన్‌ నుంచి దిగుమతి చేసిన ఖనిజం - రాగి  

బి) కర్ణాటక నుంచి దిగుమతి చేసిన ఖనిజం - బంగారం 

సి) అఫ్గానిస్థాన్‌ నుంచి దిగుమతి చేసిన ఖనిజం - వెండి 

డి) హరప్పా ప్రజలు మారకం కోసం తయారుచేసిన నాణేలకు వాడిన ఖనిజం - బంగారం 

1) బి, డి    2) ఎ    3) డి     4) పైవన్నీ 


30. సింధూ ప్రజలు ఎవరితో వ్యాపారం నిర్వహించారు?

1) ఇరాన్‌ - గ్రీకు - అఫ్గానిస్థాన్‌ 2) ఇరాన్‌ - ఈజిప్టు - మెసపటోమియా 

3) ఇరాన్‌ - అఫ్గానిస్థాన్‌ - మెసపటోమియా 4) ఈజిప్టు - ఇరాన్‌


31. మెసపటోమియా గ్రంథంలో పేర్కొన్న వ్యాపార కేంద్రాలు?    

1) దిల్‌మన్‌   2) మకన్‌  3) టెగ్రిస్‌  4) 1, 2


32. సింధూ నాగరికతలో ప్రధాన దేవతలు?

1) పశుపతి  2) అమ్మతల్లి 3) 1, 2 4) ఇంద్రుడు 


33. సింధూ నాగరికతలో గడ్డం ఉన్న పూజారి విగ్రహం లభించిన ప్రాంతం?

1) హరప్పా      2) మొహంజోదారో  

3) లోథాల్‌     4) కాలీభంగన్‌ 


34. సింధూ నాగరికతలో నగ్నంగా నాట్యభంగిమలో ఉన్న విగ్రహాన్ని ఏ లోహంతో తయారుచేశారు?

1) రాగి   2) బంగారం   3) కంచు  4) వెండి 


35. సింధూ నాగరికతలో ఏ ప్రాంతంలో పూసల తయారీ జరిగింది?

1) చన్హుదారో - కాలీభంగన్‌     2) అలంఘీపుర్‌ - లోథాల్‌ 

3) చన్హుదారో - లోథాల్‌     4) హరప్పా - లోథాల్‌ 


36. సింధూ నాగరికత ప్రజలు ప్రధానంగా పూజించిన చెట్లు?

1) రావి   2) వేప   3) మర్రి   4) పైవన్నీ


37. హరప్పా నాగరికత ఏ శాస్త్ర అభివృద్ధికి దోహదపడింది? 

1) ఖగోళ శాస్త్రం     2) వైద్య శాస్త్రం 

3) గణిత శాస్త్రం     4) జీవశాస్త్రం


 

సమాధానాలు

1-2; 2-3; 3-1; 4-1; 5-3; 6-4; 7-4; 8-1; 9-2; 10-1; 11-4; 12-3; 13-4; 14-3; 15-2; 16-4; 17-3; 18-3; 19-2; 20-1; 21-1; 22-2; 23-4; 24-2; 25-4; 26-1; 27-1; 28-2; 29-3; 30-3; 31-4; 32-3; 33-2; 34-3; 35-3; 36-4; 37-3.

 

 

రచయిత: గద్దె నరసింహారావు 

Posted Date : 16-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌