• facebook
  • whatsapp
  • telegram

భారత దేశంలో బ్రిటిష్‌ సంస్కరణలు

‘అభిరుచులను.. విలువలను మార్చేందుకే ఆంగ్లవిద్య’ 

 

 

భారతదేశంలో బ్రిటిష్‌ వలసవాద పాలన సృష్టించిన అనర్థాల్లో విద్యాపరంగా చేపట్టిన సంస్కరణలకు దీర్ఘకాలిక ప్రాధాన్యం ఉంది. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ, స్వావలంబనకు దోహదపడే భారతీయ విద్య వెన్ను విరిచిన వలస పాలకులు, దాని స్థానంలో న్యూనతా భావాన్ని పెంచే విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ పరిణామం దేశంలో అనేక సామాజిక, సాంస్కృతిక మార్పులకు దారితీసి, భారత జాతిని బలహీనం చేసింది. ఆ క్రమంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తులు, వచ్చిన మార్పుల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. వలస పాలకులకు నాటి భారతదేశంపై, ఇక్కడి ప్రజలపై ఉన్న అభిప్రాయాలతో పాటు భారతీయ గ్రంథాలు, సాహిత్యం మరుగున పడకుండా జాతీయ నాయకులు చేసిన కృషిని గుర్తుంచుకోవాలి.

 

1. విలియం జోన్స్‌ భారతదేశానికి ఎప్పుడు వచ్చారు?

1) 1783  2) 1784  3) 1873  4) 1825


2. కిందివాటిలో విలియం జోన్స్‌కి సంబంధించి సరైన వాక్యాలు?

ఎ) కంపెనీ స్థాపించిన సుప్రీంకోర్టులో జోన్స్‌   జూనియర్‌ జడ్జిగా నియమితులయ్యారు.

బి) జోన్స్‌ బహుభాషావేత్త.

సి) గ్రీకు, లాటిన్‌ భాషలను ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేశారు.

డి) పర్షియన్, అరబిక్‌ భాషలను స్నేహితుల నుంచి నేర్చుకున్నారు.

1) ఎ, డి        2) ఎ, సి  

3) ఎ, బి, సి, డి      4) ఎ, బి, డి


3. విలియం జోన్స్‌ అధ్యయనం చేసిన భారతీయ గ్రంథాలు-

1) న్యాయ శాస్త్రం        2) తత్వ శాస్త్రం  

3) రాజనీతి శాస్త్రం, అంకగణితం  4) పైవన్నీ


4. భారతీయ సాహిత్యం పరిశోధించడంలో ప్రావీణ్యం పొందిన ప్రముఖులు?

1) హెన్రీథామస్‌ కోల్‌బ్రూక్‌ 2) నథానియల్‌ హాల్హెడ్‌ 3) 1, 2      4) రాబర్ట్‌ క్లైవ్‌


5. ‘ఏషియాటిక్‌ సొసైటీ’, ‘ఏషియాటిక్‌ రిసెర్చ్‌’ అనే పత్రికలు ప్రారంభించినవారు?

1) కోల్‌బ్రూక్‌       2) హాల్హెడ్‌    

3) విలియం జోన్స్‌        4) విలియం బెంటిక్‌


6. విలియం జోన్స్, కోల్‌బ్రూక్‌ల అభిప్రాయాలకు సంబంధించి సరైనవి-

ఎ) విలియం జోన్స్, హెచ్‌.టి.కోల్‌బ్రూక్‌లకు పాశ్చాత్య, ప్రాచీన భారత సంస్కృతి పట్ల గౌరవం లేదు.

బి) భారతీయ నాగరికత పురాతన కాలంలోనే  అత్యున్నత శిఖరాలు అధిరోహించింది.

సి) భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి దాని ప్రాచీన ఆధ్యాత్మిక, న్యాయశాస్త్ర గ్రంథాలు అధ్యయనం చేయాలి.

డి) ప్రాచీన గ్రంథాలు హిందూ, ఇస్లాం వాస్తవమైన ఆలోచనలు, చట్టాలను బహిర్గతం చేయగలవు.

1) ఎ, బి, సి, డి       2) ఎ, సి, డి    

3) ఎ, బి, సి        4) బి, సి, డి 


7. అరబిక్, పర్షియన్, ఇస్లామిక్‌ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి కలకత్తాలో ఆంగ్లేయులు    మదర్సాను స్థాపించిన సంవత్సరం?

1) 1871  2) 1781  3) 1891  4) 1791


8. మదర్సా అనేది ఏ భాషా పదం?

1) ఉర్దూ       2) అరబిక్‌   

3) పారశిక       4) పాళీ


9. ప్రాచీన సంస్కృత గ్రంథాల అధ్యయనానికి బెనారస్‌ హిందూ కళాశాలను స్థాపించిన సంవత్సరం?

1) 1781       2) 1771   

3) 1791        4) 1891


10. 1830లో రిచర్డ్‌ వెస్ట్‌ మాకోట్‌ ఎవరి స్మారక చిహ్నాన్ని స్థాపించాడు?

1) విలియం బెంటిక్‌       2) వారన్‌ హేస్టింగ్స్‌   

3) కారన్‌ వాలిస్‌       4) రాబర్ట్‌ క్లైవ్‌


11. 1830లో రిచర్డ్‌ వెస్ట్‌ మాకోట్‌ నిర్మించిన స్మారక చిహ్నం ఎక్కడ ఉంది?

1) కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్‌         2) ఢిల్లీలోని మ్యూజియం

3) లండన్‌లోని విక్టోరియా అండ్‌ ఆల్బర్ట్‌ మ్యూజియం  4) పుణెలోని మ్యూజియం


12. మున్షి అంటే ఎవరు?

1) పర్షియన్‌ చదవగలవారు        2) పర్షియన్‌ రాయగలవారు    

3) పర్షియన్‌ బోధించగలవారు     4) పర్షియన్‌ చదవగల, రాయగల, బోధించగలవారు


13. ఆసియా భాష, సంస్కృతంలో పాండిత్యం ఉన్న  వారిని ఏమంటారు?

1) తీరవాదులు        2) ప్రాచ్యవాదులు    

3) విదేశీయులు        4) పండితులు


14. ‘ఆంగ్లేయులు భారతీయుల హృదయంలో స్థానం పొందడానికి, వారిని సంతోషపెట్టడానికి వారు కోరుకున్నది ఇవ్వకూడదు, వారు కోరుకున్నది బోధించకూడదు’ అని అన్నది?

1) కారన్‌ వాలిస్‌         2) మెకాలే     

3) జేమ్స్‌ మిల్‌        4) కానింగ్‌


15. 1830లో థామస్‌ బాబింగ్టన్‌ మెకాలే అభిప్రాయంలో సరైంది.

ఎ) భారత దేశం ఒక అనాగరిక దేశం.

బి) ఇంగ్లండ్‌ సాధించిన విజ్ఞానం భారత దేశపు ఏ శాస్త్ర జ్ఞానంతోనూ సరిపోల్చలేనంత గొప్పది.

సి) ఇండో అరబిక్‌ సాహిత్యం యూరప్‌లోని మంచి గ్రంథాలయం ఒక అరలోని సాహిత్యంతో     సరిపోదు.

డి) భారతదేశ సాహిత్యం ఆచరణాత్మకం కానిది.

1) ఎ, బి, డి      2) ఎ, బి, సి   

3) ఎ, బి, సి, డి         4) బి, సి, డి


16. ఆంగ్ల భాష బోధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఆంగ్లేయుడు?

1) కానింగ్‌        2) జేమ్స్‌ మిల్‌    

3) మెకాలే           4) రాజా రామ్‌మోహన్‌ రాయ్‌


17. ‘భారతీయులకు యావత్‌ ప్రపంచపు అత్యుత్తమ సాహిత్యం చదవడానికి ఇంగ్లిష్‌ భాషా పరిజ్ఞానం అవసరం’ అని అన్నది?

1) విలియం బెంటిక్‌   2) రాజా రామ్‌మోహన్‌ రాయ్‌    

3) మెకాలే       4) కానింగ్‌


18. ‘భారత ప్రజలను నాగరికులుగా చేయడానికి, వారి అభిరుచులు, విలువలు, సంస్కృతిని మార్చడానికి ఆంగ్ల బోధన ఒక రహదారి’ అన్నది ఎవరు?

1) కానింగ్‌           2) లార్డ్‌ మెకాలే    

3) విలియం బెంటిక్‌     4) రాజా రామ్‌మోహన్‌ రాయ్‌


19. ‘అవి అంధకార మందిరాలు. ఆ సంస్థలు వాటంతటవే శిథిలావస్థకు చేరి అంతర్థానమవుతాయి.’ అని ఏ సంస్థల గురించి పేర్కొన్నారు?

1) కలకత్తా మదర్సా         2) బెనారస్‌ సంస్కృత కళాశాల   

3) ఢిల్లీలోని విశ్వవిద్యాలయం      4) 1, 2


20. ‘ఉడ్స్‌ డిస్పాచ్‌’ను ఈస్ట్‌ ఇండియా కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1856       2) 1855   

3) 1854       4) 1852


21. ఉడ్స్‌ డిస్పాచ్‌లోని ఆచరణాత్మక ప్రయోజనాలు ఏమిటి?

1) ఆర్థికపరమైన ప్రయోజనం      2) నైతిక విలువలు మెరుగుపరచడం    

3) స్వతంత్ర సాధనకు ప్రోత్సాహం  4) 1, 2


22. ఉడ్స్‌ డిస్పాచ్‌ను అమలు చేస్తూ ఆంగ్లేయులు తీసుకున్న చర్యలను గుర్తించండి.

ఎ) విద్యా విషయాలు నియంత్రించడానికి విద్యా శాఖను ఏర్పాటు చేశారు.

బి) విశ్వవిద్యాలయాల విద్యావ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

సి) కలకత్తా, మద్రాసు, బొంబాయిలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు.

డి) పాఠశాల విద్యా వ్యవస్థలో మార్పులు చేపట్టారు.

1) ఎ, సి, డి 2) ఎ, బి, సి 3) బి, డి 4) ఎ, బి, సి, డి


23. సెరాంపుర్‌ మిషనరీ స్థాపించడంలో సాయపడింది?

1) మెకాలే     2) విలియం జోన్స్‌     

3) విలియం క్వారీ    4) జేమ్స్‌ మిల్‌


24. ఎప్పటి వరకు ‘ఈస్టిండియా కంపెనీ’ భారత దేశంలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలను వ్యతిరేకించింది?

1) 1812  2) 1813   3) 1814  4) 1815


25. సెరంపుర్‌ వద్ద ప్రింటింగ్‌ ప్రెస్, కళాశాల స్థాపించిన సంవత్సరాలు వరుసగా..

1) 1810, 1813     2) 1800, 1813

3) 1800, 1818    4) 1813, 1818


26. విలియం ఆడమ్స్‌ 1830లో పర్యటించిన ప్రాంతాలు?

1) బెంగాల్‌ 2) బిహార్‌ 3) రాజస్థాన్‌ 4) 1, 2


27. విలియం ఆడమ్స్‌ నివేదికలోని అంశాలు గుర్తించండి.

ఎ) బెంగాల్, బిహార్‌లలో లక్ష పాఠశాలలు ఉన్నాయి.

బి) ఒక్కో పాఠశాలలో 20 కంటే తక్కువ, 20 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు.

సి) పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల సంఖ్య 20 లక్షలకు పైగా ఉంది.

డి) ఈ విద్యా సంస్థలను సంపన్నులు లేదా స్థానిక సమాజం స్థాపించాయి.

1) ఎ, బి, సి, డి      2) బి, సి, డి     3) ఎ, బి, డి         4) ఎ, బి, సి


28. ఫ్రాంకోయిస్‌ సోల్విన్‌ ఏ దేశానికి చెందినవారు?

1) ఇంగ్లండ్‌         2) ఫ్రాన్స్‌    

3) డచ్‌         4) డెన్మార్క్‌


29. బొంబాయిలో విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తి నింపడానికి 1908, జనవరి 15న ప్రసంగించినవారు?

1) అరవింద ఘోష్‌           2) బాలగంగాధర్‌ తిలక్‌    

3) బిపిన్‌ చంద్రపాల్‌      4) లాలా లజపతి రాయ్‌


30. ‘వలసవాద విద్య భారతీయుల్లో న్యూనతాభావాన్ని సృష్టించింది’ అని అన్నదెవరు?

1) రవీంద్రనాథ్‌ ఠాకుర్‌       2) బాలగంగాధర్‌ తిలక్‌     

3) గాంధీజీ             4) సుభాష్‌ చంద్రబోస్‌


31. భారతీయుల ఘనతను, ఆత్మ గౌరవాన్ని కాపాడే విద్యను కోరుకున్నవారు?

1) గాంధీజీ         2) ఠాకుర్‌    

3) అరబింద ఘోష్‌        4) సుభాష్‌ చంద్రబోస్‌


32. కిందివాటిలో పాశ్చాత్య విద్య గురించి మహాత్మా గాంధీ అభిప్రాయం కానిది-

1) బోధనామాధ్యమంగా భారతీయ భాషలే ఉండాలి.

2) ఆంగ్లంలో విద్య భారతీయులను కుంగదీసింది.

3) పాశ్చాత్య విద్య మౌఖిక జ్ఞానం కంటే చదవడం, రాయడం పైనే అధిక దృష్టి సారించింది.

4) పాశ్చాత్య విద్య నిజజీవిత అనుభవాలు, ఆచరణాత్మక జ్ఞానానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది.


33.    రవీంద్రనాథ్‌ ఠాకుర్‌ శాంతినికేతన్‌ను ఎప్పుడు స్థాపించారు?

1) 1901  2) 1902  3) 1903   4) 1905


34. ‘సహజ వాతావరణం మాత్రమే సృజనాత్మక   అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది’ అని అన్నది?

1) గాంధీజీ         2) ఠాకుర్‌    

3) గోపాలకృష్ణ గోఖలే      4) అరవింద ఘోష్‌


35. విద్యా చట్టం ప్రవేశపెట్టిన సంవత్సరం?

1) 1870   2) 1880   3) 1890  4) 1780


36. రగ్బి అనే ప్రైవేట్‌ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేసినవారు?

1) థామస్‌ జాఫర్‌             2) థామస్‌ ఆర్నాల్డ్‌

3) థామస్‌ గిబ్స్‌        4) థామస్‌ మన్రో

 

సమాధానాలు

1-1, 2-3, 3-4, 4-3, 5-3, 6-4, 7-2, 8-2, 9-3, 10-2, 11-1, 12-4, 13-2, 14-3, 15-3, 16-3, 17-3, 18-2, 19-4, 20-3, 21-4, 22-4, 23-3, 24-2, 25-3, 26-4, 27-1, 28-3, 29-1, 30-3, 31-1, 32-4, 33-1, 34-2, 35-1, 36-2.  

Posted Date : 31-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌