• facebook
  • whatsapp
  • telegram

ఎగువ పెరుందారం.. దిగువ సిరుందారం!

చోళులు

 

 

మధ్యయుగంలో దక్షిణ భారతదేశాన్ని ఏకం చేసి సుదీర్ఘకాలం పాలించిన రాజవంశీయుల్లో చోళులకు ప్రముఖ స్థానం ఉంది. కావేరి నది పరీవాహక ప్రాంతాన్ని కేంద్రంగా ప్రారంభించి, రాజ్యాన్ని ఖండాంతరాలకు విస్తరించిన ఘనత వీరిది. దేశంలోని గొప్ప సామ్రాజ్యాలలో ఒకటిగా చోళనాడు వెలిగింది. ఈ పాలకులు ప్రాచీన కళలు, సంస్కృతిని పరిరక్షించి భావితరాలకు అందించారు. గ్రామ స్థాయి నుంచే వ్యవస్థీకృత పాలనను అందించడమే కాకుండా అద్భుతమైన   ఆలయాలను నిర్మించి చరిత్రకెక్కారు. చోళుల చరిత్ర, రాజ్యం పరిధి, పరిపాలనా విధానం,   పాలనా విభాగాలు, వారి విజయాలను తెలియజేసే శాసనాల గురించి పోటీపరీక్షలు రాసేవారు చదువుకోవాలి. నాటి సామాజిక పరిస్థితులు, సంస్కృతీ సాహిత్యాల వికాసంతో పాటు చోళుల్లో గొప్ప రాజులు, వీరికి పాండ్యులు, హోయసాలులతో ఉన్న వైరంపై అవగాహనతో ఉండాలి.

 


1.  ప్రాచీన చోళుల గురించి ఆధారాలు ఏవి?

1) అశోకుడి శాసనాలు    2) సంగమ సాహిత్యం 

3) 1, 2    4) గుప్తుల శాసనాలు


2.     9వ శతాబ్దంలో చోళ రాజ్య స్థాపకుడు ఎవరు?

1) రాజరాజ చోళ          2) రాజేంద్ర చోళ 

3) విజయాలయ చోళ       4) కులోత్తంగ చోళ


3.     ప్రవచనం (ఎ): మొదటి రాజరాజ చోళ రాజధాని తంజావూరు.

ప్రవచనం (బి): మొదటి రాజేంద్ర చోళ రాజధాని గంగైకొండ చోళపురం.

1) ప్రవచనాలు ఎ, బి లు సరైనవి.    2) ప్రవచనాలు ఎ, బి లు సరికానివి.

3) ప్రవచనం ఎ సరైంది, బి సరికాదు.     4) ప్రవచనం ఎ సరికాదు, బి సరైంది.


4.     ఆగ్నేయ ఆసియా దేశాలు, గంగానది లోయ వరకు రాజ్యం విస్తరించిన రాజు?

1) మొదటి రాజేంద్రచోళ   2) మొదటి రాజరాజచోళ 

3) విజయాలయ చోళ     4) కులోత్తంగ చోళ


5.     తంజావూరు వద్ద బృహదీశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు?

1) మొదటి రాజరాజచోళ  2) మొదటి రాజేంద్ర చోళ

3) విజయాలయ చోళ      4) మొదటి పరాంతక


6.     కిందివాటిలో సరైంది?

ఎ) చోళుల కాలంనాటి మంత్రిమండలి - ఊడంకుట్టం

బి) చోళుల కాలంలో ప్రభుత్వంలో పెద్ద అధికారి - ఓలైనాయగన్‌

సి) చోళుల కాలంలో ఉన్నత అధికారులు - పెరుందారం

డి) చోళుల కాలంలో దిగువస్థాయి అధికారులు - సిరుందారం

1) ఎ, బి, సి, డి      2) ఎ, బి, సి   

3) బి, సి, డి       4) ఎ, సి, డి


7.     మండలం, వలనాడు, నాడు అనేవి ఏ రాజుల కాలంనాటి విభాగాలు?

1) పాండ్యులు       2) చోళులు    

3) చేర      4) కాకతీయ


8.     చోళుల కాలంనాటి పరిపాలన గురించి తెలిపే శాసనం?

1) తంజావూరు శాసనం           2) ఉత్తర మేరూర్‌ శాసనం

3) గంగైకొండ చోళపుర శాసనం     4) పైవన్నీ


9. చోళుల కాలం నాటి గ్రామ కమిటీ సభ్యుడు (కుదువోలై)కి ఉండాల్సిన అర్హతలు

ఎ) 35 - 70 ఏళ్ల మధ్యలో ఉండాలి    బి) సొంత భూమి ఉండాలి

సి) సొంత ఇల్లు ఉండాలి   డి) వేదాలు, ధర్మ శాస్త్రాలు తెలిసి ఉండాలి

1) ఎ, బి, సి       2) ఎ, బి, సి, డి  

3) బి, సి, డి       4) ఎ, సి, డి


10. చోళుల కాలం నాటి భూదానాలను జత చేయండి.

1) దేవదాన     ఎ) దేవాలయ నిర్వహణ భూమి    

2) శాలభోగ     బి) జైన మతస్థుల భూమి

3) వెల్లన్‌వాగై    సి) బ్రాహ్మణేతరుల భూమి

4) పల్లించ్చందం  డి) పాఠశాల నిర్వహణ భూమి

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి        2) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి

3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి       4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి


11. చోళుల పరిపాలన విభాగాలను ఆరోహణ క్రమంలో అమర్చండి.

ఎ) వలనారులు      బి) నాడులు   

సి) మండలాలు       డి) కుర్రాలు 

1) ఎ, బి, డి, సి       2) సి, డి, బి, ఎ   

3) ఎ, బి, సి, డి       4) డి, బి, ఎ, సి


12. కిందివాటిని జతచేయండి. 

1) ఉర్‌ ఎ) ఒక పట్టణ సభ
2) సభ బి) చెరువు భూమి
3) నగరం సి) సాధారణ గ్రామ, సాధారణ సభ 
4) ఎరివత్తి డి) బ్రాహ్మణుల సాధారణ సభ
  ఇ) పచ్చిక భూమి

1)  1-బి, 2-సి, 3-ఎ, 4-డి       2) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ

3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి   4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి


13. చోళులు రాజకీయ వివాహ సంబంధాలను ఎవరితో కొనసాగించేవారు? 

1) మధురైకి చెందిన పాండ్యులతో    2) బాదామికి చెందిన చాళుక్యులతో

3) వేంగికి చెందిన చాళుక్యులతో  4) కల్యాణికి చెందిన చాళుక్యులతో


14. ఏ రెండు రాజ్యాలను కులోత్తంగుడు విలీనం చేశాడు?

1) చోళ - తూర్పు గంగుల రాజ్యాలు     2) పల్లవ - చోళ రాజ్యాలు

3) చోళ - తూర్పు చాళుక్య రాజ్యాలు    4) చోళ - పాండ్య రాజ్యాలు


15. కిందివాటిలో రాజేంద్ర చోళుడి బిరుదు?

1) గంగైకొండ       2) సింగలాంతక 

3) రాజాధిరాజ        4) పైవన్నీ


16. చోళుల ఆలయాల్లో కనిపించే ముఖ్య లక్షణం?

1) స్తంభాలు       2) విమానాలు   

3) గోపురాలు       4) విగ్రహాలు 


17. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి. 

ఎ) చోళ రాజుల బిరుదులు ‘చక్రవర్తిగల్‌’.

బి) చోళుల మొదటి రాజధాని తంజావూరు, రెండోది గంగైకొండ చోళపురం.

1) ఎ, బి లు సరైనవి        2) ఎ, బి లు సరికావు

3) ఎ సరైంది, బి సరికాదు       4) ఎ సరికాదు, బి సరైంది


18. సింహళాన్ని జయించి 12 వేల మంది ఖైదీలను తీసుకొచ్చి వారితో కావేరి నది ఆనకట్ట నిర్మించినవారు?

1) మొదటి రాజేంద్ర చోళ   2) కరికాల చోళుడు   

3) మొదటి రాజరాజ చోళ       4) మొదటి పరాంతక చోళ 


19. పరాంతకుడికి సంబంధించి సరైనవి గుర్తించండి. 

ఎ) ఇతడు క్రీ.శ.907లో రాజ్యానికి వచ్చాడు.

బి) ఇతడు పాండ్యరాజు అయిన నాలుగో జయసింహుడిని ఓడించాడు. 

సి) పరాంతకుడి బిరుదు వీరచోళ.

డి) పరాంతకుడి సవతి సోదరుడు కన్నర దేవుడు. 

1) ఎ, బి, సి, డి        2) ఎ, బి, సి     

3) ఎ, బి, డి          4) ఎ, సి, డి 


20. సింహళంలోని ఉత్తర భాగాన్ని జయించి దానికి ‘ముమ్మడిచోళ మండలం’ అని నామకరణం చేసిన చోళ రాజు?

1) మొదటి రాజేంద్ర చోళ 2) మొదటి రాజరాజ చోళ

3) పరాంతకుడు       4) కరికాలుడు


21. రాజేంద్ర చోళుడు అనేక ప్రాంతాలపై దాడి చేసి విగ్రహాలు తెచ్చి తన ఆలయంలో ప్రతిష్ఠించాడు. విగ్రహాలు, అవి తెచ్చిన రాజ్యాలను జతచేయండి.

1) నిలబడిన సూర్యుడి విగ్రహం   ఎ) పశ్చిమ చాళుక్యులు

2) నంది, వినాయకుడి   బి) తూర్పు చాళుక్యులు విగ్రహాలు     

3) కాళీమాత విగ్రహం   సి)     బెంగాల్‌

4) భైరవుడి విగ్రహం    డి) ఒడిశా

1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ     2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

3) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి     4) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి


22. ప్రకటన (A): రాజేంద్రచోళ కాలంలో చోళ - చైనాల మధ్య దౌత్య సంబంధాలు ఉన్నాయి.

కారణం (R): క్రీ.శ.1016, 1033, 1037లలో మొదటి రాజేంద్ర చోళుడు చైనాకు రాయబారులను పంపాడు.

1) ప్రకటన A కి కారణం R సరైంది.    2) ప్రకటన A కి కారణం R సరికాదు. 

3) ప్రకటన A  సరైంది, R సరికాదు.  4) ప్రకటన A సరికాదు, R సరైంది.


23. పాండ్యరాజు అయిన కులశేఖరుడు రాజు కావడానికి కారణమైనవాడు?

1) మొదటి రాజాధిరాజ    2) రెండో రాజాధిరాజ 

3) రాజేంద్ర చోళ           4) రాజరాజు


24. ప్రకటన (A): చోళ రాజ్యం ‘చోళ మండలం’ అనే పేరుతో పాండ్య రాజ్యంలో రక్షిత రాజ్యంగా మారిపోయింది.

కారణం (R): జటావర్మ సుందరాపాండ్యుడు చోళరాజ్యం ఆక్రమించడం.

1) ప్రకటన Aకి కారణం R సరికాదు.    2) ప్రకటన Aకి కారణం R సరైంది.

3) ప్రకటన A సరైంది, కారణం R సరికాదు.  4) ప్రకటన A సరికాదు, కారణం R సరైంది.


25. కిందివాటిలో సరికాని జత?

ఎ) అధిగరైగళ్‌ - రాజుకి సలహా ఇచ్చే సభ

బి) పెరుంఓరమ్‌ - తక్కువ తరగతికి చెందిన ఉద్యోగులు

సి) సిరున్‌తరమ్‌ - ఎక్కువ వర్గానికి చెందిన ఉద్యోగులు  డి) రాజగురు - పెద్ద పురోహితుడు

1) ఎ, బి   2) సి, డి   3) బి, సి    4) ఎ, డి


26. రాజ్యంలోని సైనిక స్థావరాలు, రాజ సైనికుల పేర్లకు సంబంధించి సరైంది.

1) కైక్కోలార్‌ - కడగమ్‌  2) కడగమ్‌ - కైక్కోలార్‌

3) కడగమ్‌ - కోల్కార్‌   4) నాయగమ్‌ - కైక్కోలార్‌


27. కిందివాటిలో సరైన సమాధానం గుర్తించండి.    

ఎ) వరిన్‌ పోట్టగమ్‌ - భూమిశిస్తు రికార్డులు (చోళుల కాలం)

బి) తిరుమందరబలై - రాజు నోటి నుంచి వెలువడిన ప్రతి ఆజ్ఞను లిఖిత రూపంలో రాసేవారు

1) ఎ సరైంది, బి సరికాదు 2) ఎ సరికాదు, బి సరైంది

3) ఎ, బి సరైనవి      4) ఎ, బి సరికానివి


28. చోళుల కాలంనాటి వెల్లాల కులస్థుల బిరుదులు?

1) మువ్వేంద వెలెన్‌     2) అరయ్యార్‌       

3) 1, 2           4) రాజాధిరాజ


29. చోళుల కాలం నాటి వరియమ్‌ అనే కమిటీల గురించి తెలిపే శాసనం?

1) తంజావూరు శాసనం 2) శ్రీనివాసనల్లారు శాసనం 

3) ఉత్తరమేరూర్‌ శాసనం 4) కావేరిపట్టణం శాసనం


30. కిందివాటిని జతపరచండి. (చోళుల దేవాలయాలు)

1) బాలసుబ్రమణ్య ఆలయం    ఎ) కుంభకోణం

2) నారీశ్వరస్వామి ఆలయం    బి) తొండయానాడు

3) ఆదిల్లేశ్వర ఆలయం        సి) కన్ననూర్‌

4) నుందలేశ్వర ఆలయం      డి) తిరుక్కట్టలై

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి     2) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి

3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ      4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ


31. చోళుల కాలం నాటి దేవాలయాలు?

1) పూజా కేంద్రాలు          2) సామాజిక, సాంస్కృతిక కేంద్రాలు

3) ఆర్థిక కేంద్రాలు    4) పైవన్నీ



సమాధానాలు

1-3; 2-3; 3-1; 4-1; 5-1; 6-1; 7-2; 8-2; 9-2; 10-2; 11-4; 12-3; 13-4; 14-3; 15-1; 16-3; 17-1; 18-2; 19-1; 20-2; 21-2; 22-1; 23-2; 24-2; 25-3; 26-2; 27-3; 28-3; 29-2; 30-2; 31-4.

 


రచయిత: గద్దె నరసింహారావు 
 

Posted Date : 08-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌