• facebook
  • whatsapp
  • telegram

దక్కన్, దక్షిణ భారతదేశం

పిశాచాలను ఆరాధించిన ప్రాచీన తమిళులు!

ప్రాచీన భారతదేశంలో దక్షిణాదిన ఆవిర్భవించి, విస్తరించిన రాజ్యాలెన్నో చరిత్రపై చెరగని ముద్ర వేశాయి. ప్రగతిÄ, పాలనాదక్షతల్లో తర్వాతి తరాలకు ఆదర్శంగా నిలిచాయి. ఉత్తరాది ప్రభావాన్ని నిరోధించి, దక్కన్‌ సంస్కృతి అభివృద్ధికి, ద్రవిడ భాషల వికాసానికి పునాదులు వేశాయి. తెలుగు నేలపై శాతవాహనులు, తమిళనాట చోళులు, పాండ్యులు ఆర్థిక, సాంస్కృతిక, వాణిజ్య రంగాల్లో అద్భుత విజయాలు సాధించి అజేయులుగా నిలిచారు. నాటి సామాజిక పరిస్థితులు, ఆచార వ్యవహారాల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. దక్షిణ ప్రాంతాలను పాలించిన రాజవంశాల క్రమం, సమకాలీనుల్లో గొప్ప పాలకులు, వారి మధ్య ఉన్న సంబంధాలపై అవగాహన పెంచుకోవాలి.

 

1.  దక్కను భౌగోళిక సరిహద్దులను ఏ సంవత్సరంలో హైదరాబాద్‌లో జరిగిన ‘భారతదేశ చరిత్ర సమావేశం’లో నిర్ణయించారు?

1) 1954    2) 1945   3) 1964    4) 1974

 

 

2. సంగమ యుగంలోని తమిళ రచనల్లో ప్రముఖ వ్యాకరణ గ్రంథమైన ‘తొల కప్పియం’ను రచించింది.

1) తిరుక్కురల్‌    2) తొలకప్పియర్‌   

 3) తిరువళ్లువార్‌   4) నందనార్‌

 

 

3.  తమిళ దేశానికి బైబిల్‌ లాంటి ‘తిరుక్కురల్‌’ అనే గ్రంథాన్ని రచించినవారు?

1) తిరువళ్లువార్‌      2) పెరియాళ్వార్‌  

3) సంబంధర్‌      4) నందనార్‌

 

 

4.  కిందివాటిని జత చేయండి.

1) మొదటి మహేంద్రవర్మ  a) మత్త విలాస ప్రహసనం

2) భారవి    b) దశకుమార చరిత్ర

3) దండి     c) కిరాతార్జునీయం

4) అమోఘవర్షుడు   d) కవిరాజు మార్గం

                   e) మానసోల్లాసం

1) 1-A, 2-B, 3-C, 4-D

2) 1-E, 2-D, 3-C, 4-A

3) 1-A, 2-C, 3-B, 4-D

4) 1-E, 2-C, 3-B, 4-D


 

 

5.     రెండో పులకేశి, హర్షవర్ధనుడిపై విజయాన్ని తెలిపే శాసనం-

1) నాసిక్‌      2) నానాఘాట్‌  

3) ఐహోల్‌ శాసనం    4) అలహాబాదు శాసనం

 

 

6.  చోళుల కాలం నాటి స్థానిక పరిపాలనను వివరించే శాసనం?

1) ఉత్తర మేరూరు శాసనం - రాజేంద్రచోళ  

2) ఉత్తర మేరూర్‌ శాసనం - రాజరాజు

3) మహాబలిపురం శాసనం - మొదటి పరాంతకుడు   

4) ఉత్తర మేరూర్‌ శాసనం - మొదటి పరాంతకుడు

 

 

7.  ‘సంగం’ అనే పదం మొదటిసారిగా ఏ భిక్షువుల గురించిన విషయాల్లో వాడారు?

1) హిందూ - జైన    2) బౌద్ధ - శైవ  

3) జైన - బౌద్ధ      4) సిక్కు - జైన

 

 

8.  ‘సంగం’ అనే పదానికి తమిళంలో సమాన అర్థం కలిగిన పదం?

1) కన్నడ్‌  2) కూడల్‌  3) కన్నన్‌  4) కూడిక

 

 

9. తమిళంలో కవిపండిత పరిషత్‌ను ఏమంటారు?

1) సంగం     2) సమాజం 

3) కూటమి     4) సంఘం

 

 

10. తమిళనాడులో ‘సంగం’ అనే పదాన్ని త్రిపుత్తూరు   తిరుత్తనందంలో వాడినవారు?

1) తిరునావక్కరసు      2) కూడల్‌  

3) తొలకప్పియర్‌      4) నమ్మాళ్వార్‌

 

 

11. సంగం వాజ్మయంలోని స్వతంత్ర రాజ్యాలు?

1) చోళ  2) చేర  3) పాండ్య  4) పైవన్నీ

 

 

12. మెగస్తనీస్‌ ఇండికా గ్రంథంలో పేర్కొన్న సంగమ రాజ్యాలు?

1) చోళ   2) చేర  3) పాండ్య  4) పైవన్నీ

 

 

13. కింది రాజ్యాలు, సరిహద్దుల్లో సరైన దాన్ని గుర్తించండి.

1) చోళ రాజ్యం - ఆర్కాట్‌ నుంచి తిరుచునాపల్లి వరకు

2) చేర రాజ్యం - ఉత్తరాన కొచ్చిన్‌ నుంచి దక్షిణాన తిరువళ్లూరు వరకు

3) పాండ్య రాజ్యం - పుదుక్కోట నుంచి కన్యాకుమారి వరకు

1) 1, 2       2) 3 మాత్రమే   

3) 1, 2, 3      4) 1, 3, 4 

 

 

14. చేర రాజ్యానికి రాజధాని?

1) ఉరయూర్‌    2) వంజి  

 3) మధురై      4) మహాబలిపురం

 

 

15. పాండ్య రాజ్యానికి రాజధాని?

1) మధురై     2) ఉరయూర్‌  

 3) వంజి      4) మహాబలిపురం

 

 

16. ప్రాచీన చోళుల్లో గొప్పవాడు?

1) మొదటి పరాంతకుడు    

2) మొదటి రాజేంద్రుడు 

3) కరికాల చోళుడు      

4) రాజరాజ చోళుడు

 

 

17. పూహర్‌ (కావేరి పట్టణం) అనే నూతన రాజధానిని, కావేరి నదిపై ఆనకట్టను నిర్మించిన చోళరాజు?

1) మొదటి పరాంతకుడు     2) మొదటి రాజేంద్రుడు      3) కరికాల చోళుడు    4) రాజరాజ చోళుడు

 

 

18. చేర రాజుల్లో గొప్పవాడు, యుద్ధవీరుడు?

1) నెడుంజెరల్‌      2) అడన్‌  

3) ఉదయం జెరల్‌      4) కుట్టువన్‌

 

 

19. అధిరాజు, ఇమయవిరంజన్‌ పరమేశ్వర అనే బిరుదులున్న చేర రాజు?

1) నెడుంజెరల్‌ అడన్‌      2) ఉదయం జెరల్‌  

3) కుట్టువన్‌      4) సెంగుట్టవన్‌

 

 

20. చేర వంశానికి చెందిన నెడుంజెరల్‌ సోదరుల్లో ప్రముఖులు?

1) కుట్టువన్‌     2) సెంగుత్తవన్‌  

3) 1, 2      4) ఉదయం జెరల్‌

 

 

21. మనగుడి మరుదున్, నక్కీరార్‌ అనే కవులు ఏ చేర రాజు గురించి కొనియాడారు?

1) నెడుంజెరల్‌      2) సెంగుట్టవన్‌  

3) ఉదయంజెరల్‌      4) కుట్టువన్‌

 

 

22. సంగం యుగం కాలం నాటి కులవ్యవస్థలో సరైంది?

1) వనం, వరైని      2) తుడియం  

3) కడంబన్‌      4) పైవన్నీ

 

 

23. ప్రాచీన తమిళులు ప్రధానంగా ఎవరిని ఆరాధించారు?

1) ప్రకృతి శక్తులు       2) సర్పాలు  

3) పిశాచాలు      4) పైవన్నీ

 

 

24. ప్రాచీన తమిళులు ఆరాధించిన శైవ దేవతలు-

1) శివుడు      2) వినాయకుడు  

3) సుబ్రహ్మణ్యస్వామి      4) 1, 3

 

 

25. తమిళ వ్యాకరణ గ్రంథం?

1) కురల్‌      2) పెరియ పురాణం 

3) తొలకప్పియం      4) పైవన్నీ

 

 

26. కురల్‌ (నైతిక విలువలు) అనే ప్రసిద్ధ కావ్యాన్ని ఎవరు రచించారు?

1) తిరువళ్లువార్‌      2) కుట్టువన్‌  

3) సెంగుట్టవన్‌      4) ఆండాళ్‌

 

 

27. కిందివాటిని జత చేయండి.

1) హాలుడు    a) రసరత్నావళి

2) గుణాఢ్యుడు     b) లీలావతి

3) కుతూహలుడు      c) బృహత్కథ

4) నాగార్జునుడు       d) గాథాసప్తసతి

                 e) కాతంత్ర వ్యాకరణం

1) 1-A, 2-C, 3-E, 4-D

2) 1-D, 2-C, 3-B, 4-A

3) 1-A, 2-B, 3-C, 4-D

4) 1-D, 2-C, 3-E, 4-A

 

 

28. చివరి కణ్వపాలకుడైన సుశర్మ నుంచి సింహాసనం స్వాధీనం చేసుకున్న శాతవాహన రాజు?

1) మొదటి శాతకర్ణి      2) గౌతమీపుత్ర శాతకర్ణి  

3) శ్రీముఖుడు       4) హాలుడు

 

 

29. శకరాజు అయిన నహపాణుడిని ఓడించిన శాతవాహన రాజు?

1) మొదటి శాతకర్ణి      2) రెండో శాతకర్ణి  

3) గౌతమీపుత్ర శాతకర్ణి      4) శ్రీముఖుడు

 

 

30. గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన శాసనం?

1) నానాఘాట్‌       2) మ్యాకదోని  

3) నాసిక్‌      4) అమరావతి

 

 

31. గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదులు?

1) ఆగమ నిలయ      

2) క్షత్రియ దర్పమాన మర్దన  

3) త్రిసముద్రలోయ పీతవాహన   

4) పైవన్నీ

 

 

32. శాతవాహనులు తమ రాజ్యాన్ని ....... అనే రాష్ట్రాలుగా విభజించారు.

1) వాడలు 2) రాష్ట్రాలు 3) సభాలు 4) ఆహారాలు

 

 

33. శాతవాహనుల కాలంనాటి న్యాయాధికారులను ఏమంటారు?

1) రజకులు      2) న్యాయవాధీశులు  

3) ప్రదేశి       4) సంచారక్‌

 

 

34. శాతవాహనుల కాలంలో సమాజాన్ని ఎన్ని వర్గాలుగా విభజించారు?

1) 4      2) 6      3) 3     4) 8

 

 

35. శాతవాహనుల కాలం నాటి ప్రధాన వర్తక స్థావరాలు?

1) ఫైథాన్‌   2) నాసిక్‌    3) ధాన్యకటకం    4) పైవన్నీ

 

 

36. శాతవాహనులు, రోమన్ల మధ్య వర్తకం గురించి వివరించిన గ్రంథం?

1) లీలావతి  2) పెరిప్లస్‌ ఆఫ్‌ ది ఎరిత్రియన్‌ సి  

3) గాథాసప్తసతి      4) సుహృలేఖ

 

 

37. శాతవాహనుల చరిత్రకు ప్రధాన ఆధారమైన అమరావతి స్తూపం ఏ నది ఒడ్డున ఉంది?

1) గోదావరి  2) పెన్నా  3) కృష్ణా  4) శబరి

 

 

38. కాంచీపురం పల్లవులకు సంబంధించి సరైంది.    

ఎ) ఈ పల్లవులు బాదమీ చాళుక్యులకు, మధురై పాండ్యులకు సమకాలీనులు.

బి) తమిళ, కన్నడ ప్రాంతాలను పరిపాలించారు.

సి) కావేరి, తుంగభద్ర డెల్టాలపై అధికారం సాధించారు.

డి) వీరి కాలంలో తమిళ, కన్నడ భాషల్లో అనేక రచనలు వచ్చాయి.

1) ఎ, బి, సి, డి     2) ఎ, సి, డి

3) సి, డి      4) బి, సి

 

 

39. పల్లవుల్లో అత్యంత బలవంతుడు సింహ విష్ణు కుమారుడైన మహేంద్రవర్మ - రెండో పులకేశి మధ్య యుద్ధం ఎప్పుడు జరిగింది?

1) క్రీ.శ.710   2) క్రీ.శ.610   

3) క్రీ.శ.510   4) క్రీ.శ.410

 

 

40. మహేంద్రవర్మ ఆస్థానంలో ఉన్న ప్రముఖ శైవ కవి?

1) అప్పార్‌     2) నందనర్‌ 

3) సంబంధర్‌      4) మాణిక్య వాచకర్‌

 

 

41. ‘మత్త విలాస ప్రహసనం’ అనే గ్రంథాన్ని రచించింది?

1) మహేంద్రవర్మ     2) సింహ విష్ణువు 

3) అప్పార్‌     4) రెండో పులకేశి

 

 

42. పల్లవ రాజు అయిన మహేంద్రవర్మ బిరుదులు?

1) మత్త విలాస      2) విచిత్ర చిత్త 

3) చిత్రకారపులి     4) పైవన్నీ

 

 

43. బాదామి చాళుక్య రాజు అయిన రెండో పులకేశిని ఓడించిన పల్లవ రాజు?

1) వీరకుర్చ వర్మ    2) మహేంద్ర వర్మ 

3) సింహ విష్ణువు    4) మొదటి నరసింహ వర్మ

 

 

44. బాదామి చాళుక్యరాజు అయిన రెండో పులకేశి ఓడిపోయిన యుద్ధం?

1) మణిమంగల యుద్ధం    2) పుల్లలూరి యుద్ధం

3) తపతి నది యుద్ధం    4) కావేరినది యుద్ధం

 

 

45. కింది వాటిలో సరైంది-

ఎ) సోమదేవసూరి రచించిన గ్రంథం - నీతి వాక్యామృతం

బి) మూడో సోమేశ్వరుడి రచన - మానసోల్లాసం

1) ఎ, బి       2) సి, డి  

3) బి మాత్రమే      4) ఎ మాత్రమే 


సమాధానాలు

1-2; 2-2; 3-1; 4-3; 5-3; 6-4; 7-3; 8-2; 9-1; 10-1; 11-4; 12-4; 13-3; 14-2; 15-1; 16-3; 17-3; 18-3; 19-1; 20-3; 2-11; 22-4; 23-4; 24-4; 25-3; 26-1; 27-2; 28-3; 29-3; 30-3; 31-4; 32-4; 33-1; 34-1; 35-4; 36-2; 37-3; 38-1; 39-2; 40-1; 41-1; 42-4; 43-4; 44-1; 45-1. 

Posted Date : 25-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌