• facebook
  • whatsapp
  • telegram

అతడే అత్యంత వివాదాస్పద చక్రవర్తి!

ఢిల్లీ సుల్తానుల యుగం

 

మధ్యయుగంలో మూడు శతాబ్దాల పాటు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని కొందరు సుల్తానులు సువిశాల సామ్రాజ్యాన్ని  పాలించారు. వీరిలో అయిదు వంశాల పాలకులు ఉన్నారు.  వారంతా భారత ఉపఖండాన్ని ఏకం చేయడంలో విఫలమైనప్పటికీ, మంగోలుల దురాక్రమణలను అడ్డుకున్నారు. దేశంలో సామాజిక, ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. సాంస్కృతిక వికాసానికి కృషి చేశారు. ఆ పాలకుల వంశ క్రమం, ప్రత్యేకతలు, స్థానికంగా తీసుకొచ్చిన మార్పులు, నిర్మించిన పట్టణాలు, కట్టడాలు, వాటి విశేషాల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. సుల్తానుల పాలనాపరమైన ప్రయోగాలు వికటించిన తీరు, పతనానికి దారితీసిన పరిస్థితులను అర్థం చేసుకోవాలి.

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

1.    ‘ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలించిన ఇస్లాం రాజవంశాలు వరుసగా-

ఎ) బానిస  బి) సయ్యద్‌   సి) ఖిల్జీ  డి) తుగ్లక్‌

1) ఎ, బి, సి, డి      2) ఎ, సి, డి, బి   

3) ఎ, బి, డి, సి        4) డి, బి, ఎ, సి


2. భారతదేశంలో బానిస వంశ స్థాపకులు?

1) కుతుబుద్దీన్‌ ఐబక్‌       2) బాల్బన్‌

3) ఇల్‌-టుట్‌-మిష్‌       4) రజియా సుల్తానా


3.     బానిస వంశంలో ఖలీఫా ద్వారా గుర్తింపు పొందిన చక్రవర్తి?

1) ఐబక్‌       2) బాల్బన్‌       

3) ఇల్‌-టుట్‌-మిష్‌       4) రజియా సుల్తానా


4. బానిస వంశ పాలనా కాలం?

1) క్రీ.శ.1206 - 1290      2) క్రీ.శ.1206 - 1285

3) క్రీ.శ.1192 - 1290       4) క్రీ.శ.1206 - 1526


5. ఖిల్జీ వంశ స్థాపకుడు?

1) అల్లావుద్దీన్‌ ఖిల్జీ       2) జలాలుద్దీన్‌ ఖిల్జీ 

3) ఫిరోజ్‌ షా ఖిల్జీ       4) మహ్మద్‌ ఖిల్జీ


6. తుగ్లక్‌ వంశ స్థాపకుడు?

1) మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌      2) ప్రిన్స్‌ జునాఖాన్‌

3) ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌      4) మహ్మద్‌ తుగ్లక్‌


7. సయ్యద్‌ వంశ స్థాపకుడు?

1) ఖిజిర్‌ ఖాన్‌         2) ఫిరోజ్‌ ఖాన్‌

3) మహ్మద్‌ ఖాన్‌       4) బహాలాల్‌ లోడీ


8. లోడీ వంశ స్థాపకుడు?

1) ఖిజిర్‌ ఖాన్‌       2) ఇబ్రహీం లోడీ  

3) మహ్మద్‌ ఖాన్‌      4) బహలూల్‌ ఖాన్‌ లోడీ


9. కుతుబుద్దీన్‌ ఐబక్‌ పరిపాలనా కాలం?

1) క్రీ.శ.1192 - 1206    2) క్రీ.శ.1206 - 1210   

3) క్రీ.శ.1191 - 1210      4) క్రీ.శ.1206 - 1226


10. ఐబక్‌పై తిరుగుబాటు చేసిన బెంగాల్‌ ప్రాంత పాలకుడు?    

1) అలీ మర్ధాన్‌       2) మహ్మద్‌ షేరాన్‌  

3) 1, 2       4) ఉద్దీన్‌ షా


11. ఐబక్‌పై తిరుగుబాటు చేసిన గజినీ రాజ్యాధినేత?

1) గజినీ మహ్మద్‌     2) షబుక్తజీన్‌  

3) అలప్తజీన్‌        4) తాజ్‌ - ఉద్దీన్‌ - యల్‌డజ్‌


12. 1210లో ఐబక్‌ ‘చౌగాన్‌’ ఆడుతూ ప్రమాదవశాత్తు గుర్రం మీద నుంచి పడి మరణించిన ప్రాంతం?

1) లాహోర్‌  2) ఢిల్లీ  3) అజ్మీర్‌  4) యల్‌డజ్‌


13. లాఖ్‌ బక్ష్గా పేరొందిన ఢిల్లీ సుల్తాన్‌?

1) ఇల్‌-టుట్‌-మిష్‌       2) బాల్బన్‌

3) మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌     4) కుతుబుద్దీన్‌ ఐబక్‌


14. కుతుబుద్దీన్‌ ఐబక్‌ నిర్మాణాలు?

1) కుతుబ్‌మినార్‌    2) ఢిల్లీలోని కువ్వత్‌ - ఉల్‌-ఇస్లాం

3) అజ్మీర్‌లోని అర్హదిన్‌ - కాండోప్పా మసీదు    4) పైవన్నీ


15. ఇల్‌-టుట్‌-మిష్‌ ఏ తెగకు చెందినవాడు?

1) ఖురేషి       2) ఇల్బారీ    

3) ఇస్లాం       4) మంగోలియా


16. అల్లావుద్దీన్‌ ఖిల్జీ సంస్కరణల్లో సరైనవి?

ఎ) గుర్రాలకు ముద్రలు వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు.

బి) ధరలు నియంత్రించి సైనికులకు నిత్యావసరాలు అందుబాటులోకి తెచ్చాడు.

సి) మార్కెటింగ్‌ సంస్కరణల పర్యవేక్షణ కోసం మాలిక్‌-యాకూబ్‌ అనే అధికారిని నియమించాడు.

డి) ఖిల్జీ ప్రారంభించిన ధరలు నియంత్రించే శాఖ దివాన్‌-ఇ-రియాఫత్‌

1) ఎ, బి, సి, డి       2) ఎ, బి, సి 

3) బి, డి            4) బి, సి, డి


17. అల్లావుద్దీన్‌ ఖిల్జీ సైనికులకు చెల్లించిన జీతం టంకాల్లో?

1) 234    2) 432   3) 324   4) 215


18. అల్లావుద్దీన్‌ ఖిల్జీ మార్కెటింగ్‌ సంస్కరణలను మధ్యయుగ సమకాలీన చరిత్రలో ఒక అద్భుత ప్రయోగంగా వర్ణించినవారు?

1) డి.ఎస్‌.డే       2) ఆర్‌.ఎస్‌.శర్మ

3) ఆర్‌.ఎస్‌.త్రిపాఠి      4) ఆర్‌.డి.బెనర్జీ


19. అల్లావుద్దీన్‌ ఖిల్జీ నిర్మాణాలు?

1) సిరికోట      2) అలయ్‌ దర్వాజా

3) కుతుబ్‌మినార్‌ గేట్‌ వే     4) పైవన్నీ


20. అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఆస్థానంలోని ఘాజా మాలిక్‌ ఏ ప్రాంతానికి వైస్రాయ్‌గా పనిచేశాడు?

1) దీపాల్‌పుర్‌     2) బెంగాల్‌   

3) ఢిల్లీ       4) తుగ్లకాబాద్‌


21. తుగ్లకాబాద్‌ అనే పట్టణాన్ని నిర్మించినవారు?

1) ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌      2) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌

3) అల్లావుద్దీన్‌ తుగ్లక్‌      4) ఘియాజుద్దీన్‌ బరౌనీ


22. 1323లో వరంగల్‌పై దాడి చేసిన ఘియాజుద్దీన్‌ కుమారుడు?

1) ప్రిన్స్‌ జునాఖాన్‌       2) మాలిక్‌ కపూర్‌  

3) నస్రత్‌ ఖాన్‌       4) పైఅందరూ


23. వరంగల్‌కు ఢిల్లీ సుల్తానులు మార్చిన పేరు?

1) దౌలతాబాద్‌       2) సుల్తాన్‌పుర్‌   

3) ఓరుగల్లు       4) హనుమకొండ


24. ‘ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ను మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ హత్య చేసి సింహాసనం అధిష్ఠించాడు’ అని అన్న సమకాలీన చరిత్రకారుడు?

1) ఇసామీ 2) పెరిస్టా 3) బరౌనీ 4) అబుల్‌ ఫజల్‌


25. అత్యంత వివాదాస్పద చక్రవర్తిగా పేరుగాంచిన మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ ఆస్థానంలో ఉన్న చరిత్రకారులు?

ఎ) బరౌనీ     బి) ఇసామీ 

సి) ఇబన్‌ బటూట     డి) పెరిస్టా

1) ఎ, బి, సి, డి        2) ఎ, బి, డి   

3) బి, డి        4) బి, సి, డి


26. మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ఆలోచన విధానాన్ని, సంస్కరణలను ప్రశంసించిన సమకాలీన చరిత్రకారులు?

1) లేన్‌పూల్‌       2) హబీబుల్లా   

3) కె.ఎ.నైజామీ       4) పైఅందరూ


27. మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ సంస్కరణల్లో ముఖ్యమైనవి?

ఎ) రాయచూర్‌ - అంతర్వేది, దోబ్‌ ప్రాంతాల్లో భూమి శిస్తు పెంచడం

బి) రాజధాని నగరం దిల్లీ నుంచి దేవగిరికి మార్చడం

సి) రాగి నాణేలు ముద్రించడం

డి) ప్రిన్స్‌ ఆఫ్‌ మనీయర్స్‌గా పేరుపొందడం

1) ఎ, సి, డి       2) ఎ, బి, డి   

3) ఎ, బి, సి, డి       4) సి, డి


28. కింది వాక్యాలను చదివి సమాధానం గుర్తించండి.

ఎ) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ వ్యవసాయదారులను ప్రోత్సహించడానికి దివాన్‌-ఇ-కోహీ అనే వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు.

బి) 60 వేల చదరపు మైళ్ల బంజరు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చారు.

1) ఎ మాత్రమే సరైంది 2) ఎ, బి సరికావు

3) ఎ, బి సరైనవి     4) బి సరైంది, ఎ సరికాదు


29. మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ రాజధాని మార్పు చేసిన సంవత్సరం (ఢిల్లీ నుంచి దౌలతాబాద్‌కి)

1) 1327  2) 1328  3) 1332  4) 1330


30. 1351లో గుజరాత్‌లోని థట్టా వద్ద అనారోగ్యంతో మరణించిన ఢిల్లీ సుల్తాన్‌?

1) ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌    2) మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ 

3) అల్లావుద్దీన్‌ ఖిల్జీ        4) ఫిరోజ్‌ షా తుగ్లక్‌


31. షరియత్‌ ప్రకారం రాజ్యపాలన చేసిన ఢిల్లీ సుల్తాన్‌-

1) ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌      2) మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌

3) అల్లావుద్దీన్‌ ఖిల్జీ         4) ఫిరోజ్‌ షా తుగ్లక్‌


32. ఫిరోజ్‌ షా తుగ్లక్‌ అభివృద్ధి చేసిన నీటిపారుదల వసతులు-

1) యమునా నది నుంచి ఫిరోజాబాద్‌కు కాలువ

2) సట్లెజ్‌ నది నుంచి ఘాఘర్‌ వరకు కాలువ

3) మాండవ నది నుంచి హిస్సార్‌ వరకు కాలువ

4) పైవన్నీ


33. ఫిరోజ్‌ షా తుగ్లక్‌ పేదల సంక్షేమం కోసం స్థాపించిన శాఖ?

1) దివాన్‌-ఇ-ఖైరాత్‌     2) దార్‌-ఉల్‌-షిఫా

3) దివాన్‌-ఇ-కోహి     4) పైవన్నీ


34. కిందివాటిలో ఫిరోజ్‌ షా తుగ్లక్‌కు సంబంధించి సరైంది?

ఎ) దార్‌-ఉల్‌-షిఫా అనే వైద్యశాలను నిర్మించాడు.

బి) యాత్రికుల సౌకర్యార్థÄం 200 సరాయిలు నిర్మించాడు.

సి) బానిసల కోసం అనేక ఏర్పాట్లు చేశాడు.

డి) ఒరిస్సాపై దాడి చేసి జ్వాలాముఖి ఆలయాన్ని దోచుకున్నాడు.

1) ఎ, బి, సి, డి     2) ఎ, బి, సి   

3) బి, డి మాత్రమే     4) బి, సి మాత్రమే


35. ఫిరోజ్‌ షా తుగ్లక్‌ జారీ చేసిన వెండి, రాగి మిశ్రమ లోహాలు?

1) అధా    2) బిఖ్‌   3) 1, 2    4) ఫారా


36. చివరి తుగ్లక్‌ సుల్తాన్‌?

1) దౌలత్‌ ఖాన్‌     2) ఫిరోజ్‌ షా 

3) ఖిజిర్‌ ఖాన్‌     4) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌


37. సయ్యద్‌ వంశంలో చివరివాడు?

1) అల్లావుద్దీన్‌ ఆలమ్‌ షా     2) ఫిరోజ్‌ షా

3) ముబారక్‌ షా          4) ఫరీద్‌


38. లోడీ వంశంలో చివరివాడు?

1) బహులాల్‌     2) సికిందర్‌ 

3) ఇబ్రహీం లోడీ     4) ఫిరోజ్‌ షా


39. బాబర్‌ను భారతదేశంపై దాడి చేయమని ఆహ్వానించింది?

1) పంజాబ్‌ గవర్నర్‌ దౌలత్‌ ఖాన్‌  2) ఇబ్రహీం మామ ఆలంఖాన్‌

3) ఇబ్రహీం లోడీ     4) 1, 2


40. ఢిల్లీ సుల్తానుల పతనానికి కారణాల్లో సరైనవి?

ఎ) సైన్యంలో క్రమశిక్షణ లేకపోవడం

బి) తైమూర్‌ దండయాత్రలు

సి) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ విధానాలు

డి) అధిక పన్నుల భారం

1) ఎ, బి, సి, డి        2) సి, డి    

3) ఎ, సి, డి        4) బి, సి, డి


41. ఢిల్లీ సుల్తానులు రాష్ట్రాలను ఎలా విభజించారు?

1) ఇనాము  2) ఇక్తా  3) నాడు  4) నాయంకర


42. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి రాజ్య విభాగాలు వరుసగా గుర్తించండి.    

ఎ) రాజ్యం     బి) ఇక్తా       సి) షిక్‌     

డి) పరగణ     ఇ) గ్రామం

1) ఎ, బి, సి, డి, ఇ    2) బి, డి, సి, ఎ, ఇ

3) సి, డి, బి, ఎ, ఇ    4) ఇ, సి, ఎ, బి, డి


43. ఢిల్లీ సుల్తానుల కాలంలో పరగణాల స్థాయిలో ఉన్న ఉద్యోగులు-

1) అమీను             2) మున్సిఫ్, కనుంగో

3) కారూకన్, కోశాధికారి     4) పై అందరూ


44. ‘ఢిల్లీ సుల్తానుల కాలంలో నీరు పుష్కలంగా ఉండి, సారవంతమైన ప్రాంతాల్లో రైతులు ఏడాదికి మూడు పంటలు పండించారు.’ అని అన్న చరిత్రకారుడు ఎవరు?

1) అల్‌ బేరూనీ      2) అమీర్‌ ఖుస్రూ 

3) ఇబన్‌ బటూటా    4) ఇసామీ


45. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి ముఖ్య వ్యాపార కేంద్రాలు-

1) ముల్తాన్, లాహోర్‌    2) దేవగిరి, ఢిల్లీ    

3) సింధ్‌       4) పైవన్నీ



సమాధానాలు

1-2; 2-1; 3-3; 4-1; 5-2; 6-3; 7-1; 8-4; 9-2; 10-1; 11-4; 12-1; 13-4; 14-4; 15-2; 16-1; 17-1; 18-1; 19-4; 20-1; 21-2; 22-1; 23-2; 24-1; 25-1; 26-4; 27-3; 28-3; 29-1; 30-2; 31-4; 32-4; 33-1; 34-1; 35-3; 36-1; 37-1; 38-3; 39-4; 40-1; 41-2; 42-1; 43-4; 44-3; 45-4.


రచయిత: గద్దె నరసింహారావు 
 

 

 

 

‘భూమండలంపై భగవంతుడి నీడ!’

మధ్యయుగంలో సుమారు నాలుగు శతాబ్దాల పాటు భారతదేశాన్ని పాలించిన ఢిల్లీ సుల్తానులు సంప్రదాయ షరియాను అనుసరిస్తూ, పరిపాలనలో ఎన్నో మార్పులు, సంస్కరణలు ప్రవేశపెట్టారు. అంతర్గత కలహాల మధ్యనే హిందూ రాజ్యాలపై నిరంతరం దాడులు, దోపిడీలు కొనసాగించారు. భారతావనిపై మంగోలుల దండయాత్రలను సమర్థంగా నిలువరించారు. వీరి పాలనలో చోటుచేసుకున్న పరిణామాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. రాజ్యాధికారం చేపట్టిన మొదటి మహిళగా, ముస్లిం పాలకురాలిగా చరిత్రలో నిలిచిపోయిన రజియా సుల్తానా, నిరంకుశుడిగా ముద్రపడిన బాల్బన్, మార్కెటింగ్‌ సంస్కరణలకు ఆద్యుడైన అల్లావుద్దీన్‌ ఖిల్జీ, దేశంలో ముస్లిం పాలనకు పటిష్ఠ పునాదులేసిన ఇల్‌-టుట్‌-మిష్‌Ã తదితరుల గురించి వివరంగా తెలుసుకోవాలి.

 


 

1.    ‘భారతదేశంలో ముస్లిం సార్వభౌమాధికారం నెలకొల్పింది ఇల్‌-టుట్‌-మిష్‌’ అని అన్నది?

1) ఈశ్వర ప్రసాద్‌         2) ఆర్‌.పి.త్రిపాఠి  

3) నీలకంఠ శాస్త్రి          4) ఆర్‌.డి.బెనర్జీ


2.    1217 నాటికి ఇల్‌-టుట్‌-మిష్‌ అధికారం విస్తరించిన ప్రాంతాలు?

1) ఢిల్లీ                                     2) ముల్తాన్, సింధ్‌

3) ఉచ్, గ్యాలియర్, మాళ్వా     4) పైవన్నీ


3. 1229లో భారతదేశపు తొలి ముస్లిం సుల్తాన్‌గా మిష్‌ను గుర్తించిన ఖలీఫా?

1) ఖలీఫా వాలిద్‌                       2) ఖలీఫా ఉమ్మయ్యద్‌    

3) ఖలీఫా-అల్‌-మస్తాన్‌-బిల్హ      4) ఖలీఫా మహమ్మద్‌


4.     ‘ఢిల్లీలో వాస్తవంగా ముస్లిం రాజ్యాధికారాన్ని స్థాపించింది ఇల్‌-టుట్‌-మిష్‌’ అని అన్నది?

1) ఆర్‌.ఎస్‌.శర్మ           2) ఆర్‌.పి.త్రిపాఠి  

3) ఈశ్వర ప్రసాద్‌         4) ఆర్‌.డి.బెనర్జీ


5.     మంగోల్‌ నాయకుడు చంఘీజ్‌ఖాన్‌ ప్రమాదాన్ని చాకచక్యంగా తప్పించుకున్న ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌        2) ఇల్‌టుట్‌మిష్‌  

3) ఐబక్‌            4) అల్లావుద్దీన్‌ 


6.     కుతుబ్‌ మినార్‌ నిర్మాణం ప్రారంభించిన, పూర్తిచేసినవారు వరుసగా?

1) బాల్బన్‌-ఇల్‌ టుట్‌ మిష్‌       2) ఐబక్‌-ఇల్‌ టుట్‌ మిష్‌

3) ఐబక్‌ - రజియా సుల్తానా       4) ఐబక్‌ - అల్లావుద్దీన్‌


7.     ‘చిహల్‌ గని’ అనే 40 మంది సర్దారుల ముఠా ఎవరి కాలంలో ఏర్పడింది?

1) కుతుబుద్దీన్‌             2) ఇల్‌టుట్‌మిష్‌  

3) రజియా సుల్తానా      4) బాల్బన్‌


8.     తాజుద్దీన్, మెన్హజ్‌- ఉస్‌ - సిరాజ్‌లు ఏ ఢిల్లీ సుల్తాన్‌ పోషణలో ఉన్నారు?

1) ఐబక్‌                       2) ఇల్‌టుట్‌మిష్‌  

3) రజియా సుల్తానా     4) బాల్బన్‌


9.     ఇల్‌టుట్‌మిష్‌ ముద్రించి వాడుకలోకి తెచ్చిన నాణేలు?

1) వెండి టంకా               2) రాగి జిటాల్‌ 

3) బంగారు శతమానం     4) 1, 2


10. ‘ఇల్‌టుట్‌మిష్‌ భారతదేశంలో బానిస వంశ అధికారాన్ని వాస్తవంగా నెలకొల్పిన సుల్తాన్‌’ అని అన్నది?

1) ఈశ్వరీ ప్రసాద్‌       2) ఆర్‌.ఎస్‌.శర్మ   

3) ఆర్‌.పి.త్రిపాఠి      4) ఆర్‌.డి.బెనర్జీ


11. భారతదేశ చరిత్రలో మొదటి మహిళా పాలకురాలు?

1) రుద్రమదేవి             2) మనుబాయి   

3) రజియా సుల్తానా      4) ఇందిరా గాంధీ


12. రజియా సుల్తానా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన సంవత్సరం?

1) 1236      2) 1326     3) 1623     4) 1240


13. రజియా సుల్తానా పరిపాలనను వ్యతిరేకించినవారు?

1) చిహాల్‌గనీలు       2) సర్దారులు   

3) సయ్యద్‌లు       4) ఖలీఫాలు


14. రజియా సుల్తానా అధికారం అంతం చేయడానికి ప్రయత్నించినవారు?

1) లాహోర్‌ రాష్ట్ర పాలకుడు మాలిక్‌-అల్లాఉద్దీన్‌-జైనీ

2) ముల్తాన్‌ రాష్ట్ర గవర్నర్‌ మాలిక్‌-ఇజాఉద్దీన్‌-క్రన్జన్‌

3) హాన్సీ రాష్ట్ర పాలకుడు మాలిక్‌-సఫీ-ఉద్దీన్‌          4) పైవారంతా.


15. రజియా సుల్తానా పారిపోయిన ప్రాంతం?

1) ఢిల్లీ    2) లాహోర్‌     3) భటిండా      4) ముల్తాన్‌


16. బాల్బన్‌ పరిపాలనా కాలం?

1) 1226 - 1287      2) 1266 - 1287  

3) 1266 - 1278      4) 1267 - 1287


17. బాల్బన్‌ మధ్య ఆసియాలోని ఏ తెగకు చెందినవాడు?    

1) మంగోల్‌     2) ఖురేషి     3) ఇల్బారీ    4) మొగల్‌


18. ‘చిహాల్‌గనీ ముఠా’లో కీలకపాత్ర పోషించిన ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌            2) ఆలం షా  

3) బహరాం షా       4) పైవారంతా


19. 1260లో ఢిల్లీపై మంగోల్‌ దాడులను తిప్పికొట్టింది?    

1) బాల్బన్‌            2) ఆలం షా   

3) బహరాం షా       4) పైవారంతా


20. ఘియాజుద్దీన్‌ బాల్బన్‌కు సంబంధించిన సరైన వాక్యాలు?

ఎ) 1230లో సామాన్య నీరు మోసే కూలీగా జీవితం ప్రారంభించాడు.

బి) 1233 నాటికి మిష్‌ ప్రోత్సాహంతో ఖాస్‌దార్‌ పదవి పొంది రజియా కాలంలో అమీర్‌ - ఇ- షికార్‌ హోదా పొందాడు.

సి) బానిస వంశ రాజు అయిన నాసిరుద్దీన్‌ కుమార్తెను వివాహం చేసుకున్నాడు.

డి) నాసిరుద్దీన్‌ కాలంలో నాయబ్‌-ఇ-మమాలిక్‌ (ఉపప్రధాని)గా పనిచేశాడు.

1) ఎ, బి, సి, డి        2) ఎ, బి, సి  

3) బి, సి                  4) బి, సి, డి


21. చిహల్‌గని ముఠాతో ప్రముఖ నాయకుడిగా వ్యవహరించి తను రాజు అయిన తరువాత చిహల్‌గని వ్యవస్థను నిర్మూలించినవారు?

1) ఆమీర్‌ ఖాన్‌            2) నాసిరుద్దీన్‌ 

3) బాల్బన్‌                  4) షేర్‌ఖాన్‌


22. ‘రాజరికం దైవదత్తం’ అని ప్రగాఢంగా విశ్వసించిన బానిస రాజు?

1) ఇల్‌-టుట్‌-మిష్‌           2) బాల్బన్‌    

3) ఐబక్‌                           4) రజియా సుల్తానా


23. ‘నియాబత్‌-ఇ-ఖుదాయి (కింగ్‌ ఈజ్‌ ది వైస్‌ రిజెన్సీ ఆఫ్‌ గాడ్‌ ఆన్‌ ఎర్త్‌) ‘‘రాజు భూమండలంపై భగవంతుని నీడ’ అని అభిప్రాయపడినవారు?

1) ఇల్‌టుట్‌మిష్‌            2) బాల్బన్‌  

3) ఐబక్‌                          4) రజియా సుల్తానా 


24. బాల్బన్‌ తన కుమారుడు బుగ్రాఖాన్‌కు రాజరికానికి సంబంధించి ఏమని బోధించాడు?

1) రాజరికం దైవదత్తం            2) రాజరికం నిరంకుశత్వానికి ప్రతిబింబం  

3) రాజరికం ప్రజాదీవెన          4) రాజరికం అంటే రాజ్యంపై అధికారం


25. బాల్బన్‌ రాజదర్బారులో ఆచరణలో ఉంచిన పర్షియా సుల్తానుల విధానం?

1) జమిన్‌బోస్‌                2) పాయిబోస్‌  

3) 1, 2                            4) రాజును చూసిన వెంటనే ధనం ఇవ్వడం.


26. బహిరంగ ప్రదేశాల్లో నవ్వని ఢిల్లీ సుల్తాన్‌?

1) అల్లావుద్దీన్‌                2) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌    

3) బాల్బన్‌                      4) ఐబక్‌ 


27. చెలామణిలో ఉన్న నాణేలపై ఖలీఫా పేరు ముద్రించిన ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌                   2) మహ్మద్‌ బీన్‌ ఖాసీమ్‌ 

3) అల్లావుద్దీన్‌ ఖిల్జీ      4) ఐబక్‌


28. బానిస వంశంలో చివరి రాజు?

1) కైకుబాద్‌             2) మహ్మద్‌   

3) బాల్బన్‌              4) జలాలుద్దీన్‌


29. బాల్బన్‌ కాలంలో జలాలుద్దీన్‌ ఏ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేశాడు?

1) బెంగాల్‌     2) సమారా     3) అవద్‌    4) ఉజ్జయిని


30. జలాలుద్దీన్‌ ఖిల్జీ అధికారుల్లో ప్రముఖులు?

1) మాలిక్‌ ఫక్రుద్దీన్‌          2) ఖ్వాజా ఖతర్‌ 

3) గర్షాన్స్‌ మాలిక్‌             4) పైవారంతా


31. అల్లావుద్దీన్‌-ఖిల్జీ దేవగిరిపై దాడి చేసిన సంవత్సరం?

1) 1260       2) 1270       3)1280      4) 1290


32. మార్కెటింగ్‌ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌                     2) అల్లావుద్దీన్‌ ఖిల్జీ   

3) ఇల్‌-టుట్‌-మిష్‌         4) ఐబక్‌


33. 1297లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ గుజరాత్‌పై దాడికి వీరిని పంపారు?

1) ఉల్గూఖాన్‌              2) నస్రత్‌ఖాన్‌   

3) 1, 2                       4) జాఫర్‌ మఖాన్‌


34. 1297లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ గుజరాత్‌పై దాడి చేసే సమయంలో ఆ ప్రాంత పాలకుడు, వంశం వరుసగా?

1) కర్ణదేవుడు-వాఘేల             2) కర్ణదేవుడు-చహమాను

3) భీమదేవుడు-వాఘేల           4) భీమదేవుడు- చహమాను

 

35. అల్లావుద్దీన్‌ ఖిల్జీకి సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) 1298లో ఉల్గూఖాన్, నస్రత్‌ ఖాన్‌ నేతృత్వంలోని సైన్యం రణతంబోర్‌ ప్రాంతంపై దాడి చేసింది.

బి) ఈ యుద్ధంలో అల్లావుద్దీన్‌ విజయం సాధించాడు. ఉల్గూఖాన్, రాణాహం వీరుడు మరణించారు.

సి) 1303లో అల్లావుద్దీన్‌ మేవాడ్‌ రాజు రాణా రతన్‌ సింగ్‌పై దాడి చేశాడు.

డి) సుమారు 7 నెలల తర్వాత ఖిల్జీ చిత్తోడ్‌ను ఆక్రమించాడు.

1) ఎ, బి, సి, డి          2) బి, సి, డి    3) ఎ, బి         4) ఎ, బి, సి


36. అల్లావుద్దీన్‌ ఖిల్జీ చిత్తోడ్‌ అనే ప్రాంతానికి పెట్టిన పేరు?

1) ఖిజరాబాద్‌            2) పద్మపురం  

3) దౌలతాబాద్‌         4) ఖిల్జిపుర్‌


37. అల్లావుద్దీన్‌ ఖిల్జీకి సమకాలీనులు అయిన దక్షిణ భారతదేశ రాజులు కానివారు?

1) దేవగిరి - యాదవులు    2) ద్వార సముద్రం - హోయసాలులు

3) మధురై - పాండ్యులు        4) విజయనగరం - విజయనగర రాజులు


38. దక్షిణ భారతదేశ దండయాత్రలకు నేతృత్వం వహించిన అల్లావుద్దీన్‌ ప్రతినిధి?

    1) ఉల్గూఖాన్‌      2) నస్రత్‌ఖాన్‌ 

    3) మాలిక్‌ కపూర్‌     4) జాఫర్‌ మఖాన్‌


39. కిందివాటిలో ఖిల్జీకి సంబంధించి సరైనవి?

    ఎ) 1313లో దేవగిరి రాజ్యంపై దాడి చేసి రామచంద్ర దేవుని ఓడించాడు.

    బి) 1308లో రెండో ప్రతాపరుద్రుడు ఓడి ఖిల్జీకి కప్పం చెల్లించడానికి అంగీకరించారు.

    సి) హోయసాల రాజు అయిన మూడో వీర బల్లాలుడు ఓటమిపాలై ఖిల్జీకి కప్పం చెల్లించాడు.

    డి) పాండ్య రాజ్యంలో జరిగిన అంతర్యుద్దంలో  పాల్గొన్నారు.

    1) బి, డి                        2) బి, సి, డి   

    3) ఎ, బి, సి, డి             4) ఎ, బి, సి


40. అల్లావుద్దీన్‌ ఖిల్జీ రాజ్య సరిహద్దులను జత చేయండి.

   

1) ఉత్తరం ఎ) ముల్తాన్‌
2) దక్షిణం బి) ద్వార సముద్రం
 3) తూర్పు సి) సోనార్‌గర్‌ 
4) పశ్చిమం డి) థట్టా

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి    2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి

3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి    4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ


41. అల్లావుద్దీన్‌ ఖిల్జీ పరిపాలనా సంస్కరణలకు సంబంధం లేనిది?

ఎ) సంపన్న సర్దారుల జాగీర్లను రద్దు చేశాడు

బి) హిందువులపై ఆంక్షలు తొలగించాడు

సి) మద్యం, మత్తు పదార్థాలు నిషేధించాడు

డి) సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించాడు

1) బి, సి    2) సి    3) బి     4) బి, డి 



సమాధానాలు

12; 24; 33; 41; 52; 62; 72; 82; 94; 101; 113; 121; 131; 144; 153; 162; 173; 181; 191; 201; 213; 222; 232; 242; 253; 263; 271; 281; 292; 304; 314; 322; 333; 341; 351; 361; 374; 383; 393; 401; 413. 

 


ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...
 

Posted Date : 06-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌