• facebook
  • whatsapp
  • telegram

బౌద్ధ మతం

* బుద్ధుడి తొలి జీవితం గురించి బౌద్ధ జాతక కథలు వివరిస్తాయి.
* బౌద్ధ మత పవిత్ర గ్రంథాలైన త్రిపీఠకాలు పాళీ భాషలో ఉన్నాయి.
* భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతం ప్రపంచ మతంగా అభివృద్ధి చెందింది.
* వినయ పీటకం బౌద్ధ సంఘ నియమ నిబంధనలను, సుత్త పీటకం బుద్ధుడి బోధనలను, అభిదమ్మ పీటకం బౌద్ధ దమ్మ వేదాంతాన్ని వివరిస్తాయి.
* బౌద్ధ మతానికి చెందిన ముఖ్య నిర్మాణాలు
1. స్తూపం
2. చైత్యం
3. విహారం
* బుద్ధుడి ధాతువులపై నిర్మించిన పొడవైన స్తంభాన్ని స్తూపం అంటారు. ఇది బుద్ధుడి మహా నిర్యాణానికి ప్రతీక.
* బౌద్ధ మతస్తుల పూజా గృహాన్ని చైత్యం అంటారు. ఇది మహాయానులకు చెందింది.
* బౌద్ధ భిక్షువుల విశ్రాంతి గృహాలను విహారాలు అంటారు.
* స్తూప, చైత్య, విహారాలు ఒకే చోట ఉంటే దాన్ని బౌద్ధ ఆరామంగా పేర్కొన్నారు.
* బౌద్ధ ఆరామాలు నాడు ప్రసిద్ధ విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.
* భారతదేశంలో తొలి బౌద్ధ విశ్వవిద్యాలయంగా నాగార్జున కొండ విశ్వవిద్యాలయం పేరొందింది.
* భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయం తక్షశిల, ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయం నలంద.
* విహార దేశంగా పేరొందిన రాష్ట్రం బిహార్
* గాంధార, అమరావతి శిల్ప కళలు బౌద్ధ మత ప్రేరణతో అభివృద్ధి చెందాయి.
* సాంచీ స్తూపం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ దగ్గర ఉంది.
* సారనాథ్ స్తూపం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
* పిప్రావహని భారతదేశంలో అతి ప్రాచీన స్తూపం అని పేర్కొంటారు.
* ఆంధ్రదేశం / దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన స్తూపంగా భట్టిప్రోలు పేరుగాంచింది.
* బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గం వల్ల బౌద్ధ మతాన్ని మధ్యేమార్గంగా పేర్కొంటారు.
* బుద్ధుడు చెప్పిన సిద్ధాంతాన్ని ప్రతీయ - సముత్పాద సిద్ధాంతం అంటారు.
* బుద్ధుడి జననం, జ్ఞానోదయం కలగడం, మహాపరినిర్యాణం పౌర్ణమి రోజునే జరిగాయి.
* బుద్ధుడి మరణం తర్వాత బౌద్ధ మత అభివృద్ధి కోసం నిర్వహించిన సభలను బౌద్ధ సంగీతులు అంటారు (మొత్తం నాలుగు బౌద్ధ సంగీతులు జరిగాయి.)
* మొదటి బౌద్ధ సంగీతి - రాజగృహం - అజాతశత్రువు కాలం - మహాకాశ్యపుడు అధ్యక్షుడు.
* రెండో బౌద్ధ సంగీతి కాలాశోకుడి కాలంలో వైశాలిలో జరిగింది. సబకామి దానికి అధ్యక్షుడు.
* మూడో బౌద్ధ సంగీతి అశోకుడి కాలంలో పాటలీపుత్రంలో జరిగింది. మొగ్గలిపుతతిస్స అధ్యక్షుడు.
* నాలుగో బౌద్ధ సంగీతి కనిష్కుడి కాలంలో కశ్మీర్/ కుందనవనంలో జరిగింది. వసుమిత్రుడు అధ్యక్షుడు.
* మాధ్యమిక సాంప్రదాయ వాదాన్ని ఆచార్య నాగార్జునుడు ప్రబోధించారు.
* మైత్రేయనాథుడు యోగాచారవాదాన్ని ప్రారంభించాడు.
* మాధ్యమికవాదాన్నే శూన్యవాదంగా కూడా పేర్కొంటారు.
* యోగాచార వాదాన్ని విజ్ఞానవాదంగా కూడా పేర్కొంటారు.
* యోగాచార వాదం హీనయానానికి చెందిన వాస్తవిక వాదాన్ని పూర్తిగా తిరస్కరించి, పరమ ఆదర్శవాదాన్ని అంగీకరిస్తుంది.
* ఆచార్య నాగార్జునుడు రచించిన ప్రజ్ఞాపారమితిక శాస్త్ర మహాయానుల పవిత్ర గ్రంథంగా పేరుగాంచింది.
* అసంగుడు, వసుబంధు లాంటి రచయితలు కూడా మహాయాన సంప్రదాయాన్ని అనుసరించారు.
* సూత్రాలంకార గ్రంథాన్ని రాసింది అసంగుడు.
* మహాయానులు సంస్కృత భాషలో ఉన్న సొంత త్రిపీటకాలను అభివృద్ధి చేసుకున్నారు.
* మహాయానులు వైపుల్య సూత్రాలను బుద్ధుడి ప్రకటనలుగా భావించి వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
* సధర్మపుండరీకం, లలిత విస్తార, వజ్రచేధిక, సుఖవతి లాంటి గ్రంథాలను పవిత్రంగా భావించి, అనుసరించారు.
* బౌద్ధ మతంలో వజ్రయానం అనే మరొక శాఖ తర్వాత కాలంలో ఏర్పడింది.
 ఇంద్రజాలిక శక్తులు పొందడం ద్వారా మోక్షం సాధించడం ఈ వాదం వారి ఆశయం.
* వజ్రయాన శాఖవారు బౌద్ధులు, బోధిసత్వుల భార్యలైన తారలను ప్రధాన దైవాలుగా భావించి పూజించారు.
* వీరు తాంత్రిక పూజా విధానానికి ప్రాధాన్యం ఇచ్చారు (తంత్ర నిర్వహణ ద్వారా మంత్రం వల్లెవేయడం)
* పాల వంశీయులు, సేన వంశీయుల కాలంలో తూర్పు భారతదేశంలో వజ్రయాన శాఖ బాగా విస్తరించింది.
* సరాహుడు రచించిన దోహకోశ వజ్రయానానికి చెందిన ప్రసిద్ధ గ్రంథం.
* కనిష్కుడు మహాయాన బౌద్ధాన్ని ఆచరించాడు.
* గాంధార శిల్పకళ కనిష్కుడి కాలంలో మహాయాన బౌద్ధ మతం ప్రేరణతో అభివృద్ధి చెందింది.
* భాగవతుడు అంటే ఆరాధనీయమైన వారిని ఆరాధించేవ్యక్తి అని అర్థం. చాందోగ్యోపనిషత్తు కృష్ణ వాసుదేవుడిని దేవకీ పుత్రుడిగా పేర్కొంది.
* పాణిని రచన అష్టాధ్యాయిలోను, మెగస్తనీస్ ఇండికా (హెరాక్లెస్) లోను, బెస్‌నగర్ స్తంభ శాసనంలో భాగవత మత ఆరాధన గురించిన ప్రాస్తావన ఉంది.
* బెస్ నగర స్తంభ శాసనాన్ని కాశీపురానికి చెందిన శుంగరాజు భాగభద్రుడు వేయించాడు.
* బెస్ నగర స్తంభ శాసనం గ్రీకు రాయబారి హీలియో డోరస్‌ను భాగవతుడిగా పేర్కొంది.
* గుప్తుల కాలంలో భాగవత మతం అభివృద్ధి చెందింది.
* నాగులు, యక్షులు, గ్రామదేవతల ఆరాధన నుంచి బ్రాహ్మణవాదం అభివృద్ధి చెందింది.
* పంచాయతన పూజా విధానంలో గణేశుడికి అగ్రస్థానం ఇచ్చారు.
* గుప్తయుగానంతరం భాగవత మతాన్ని వైష్ణవ మతంగా పేర్కొన్నారు. అవతార సిద్ధాంతానికి అధిక ప్రాధాన్యం లభించింది.
* భాగవత మతం భగవద్గీత మీద ఆధారపడింది. వైష్ణవానికి క్రమంగా భాగవత పురాణం, విష్ణు పురాణాలు ప్రధాన గ్రంథాలుగా మారాయి.
* క్రీ.శ. 100వ సంవత్సరంలో 'శాండిల్యుడు' పంచరాత్రాలను ప్రబోధించారు. ఇందులో వాసుదేవ కృష్ణుడి కుటుంబం మొత్తాన్ని తాదాత్మ్యీకరించారు.
* కృష్ణుడి సోదరుడు సంకర్షణ, కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడు, కృష్ణుడి మనువడు అనిరుద్ధుడు.
* విఖాననుడు ప్రబోధించిన వైఖానన సంప్రదాయాన్ని అత్రి, మరీచి, భృగు, కశ్యపుడు అనే మహార్షులు ప్రచారం చేశారు.
* వైఖానన సంస్కార సిద్ధాంతం విష్ణువుకు చెందిన అయిదు రూపాల భావనపై ఆధారపడి ఉంది.
* బ్రహ్మ, పురుషుడు, సత్యం, అచ్యుతం, అనిరుద్ధుడు అనేవి విష్ణువు అయిదు రూపాల భావనలు.
* తిరుపతి వేంకటేశ్వరస్వామి దేవాలయం, కంచి దేవాలయాలలో సంస్కృత భాషలో పూజలు నిర్వహిస్తున్న పూజారులు వైఖాననశాఖకు చెందినవారే.
* దక్షిణ భారతదేశంలో వైష్ణవ భక్తులను ఆళ్వారులు అంటారు. వీరు మొత్తం పన్నెండుమంది.
* నమ్మాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్ వారిలో ముఖ్యమైనవారు.
* ఆళ్వార్‌లలో ఉన్న ఏకైక మహిళ ఆండాళ్.
* ఆండాళ్ అనే తమిళ కవయిత్రి గురించి శ్రీకృష్ణ దేవరాయలు తన 'ఆముక్తమాల్యద' గ్రంథంలో ప్రస్తావించారు.
* ఆళ్వార్లు రాసిన పద్యాలు, పాటలను పాశురాలు లేదా 'ప్రబంధాలు' అంటారు.
* 'తండ్రివి నీవే ఓ పరమాత్మా! అగ్ని, నీరు, ఆకాశం నీ సృష్టేనయ్యా!' అనే పాటను నమ్మాళ్వార్ రాసి పాడారు.
* నాకేల ఇవ్వవు నీ దర్శన భాగ్యము? దాగుడు మూతలు ఏల' అని నమ్మాళ్వార్ భగవంతుడిని ప్రశ్నిస్తూ పద్యాలు రాశారు.
* శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మద్వాచార్యులు, త్రిమతాచార్యులు/ వైష్ణవాచార్యులుగా పేరొందారు.
* శంకరాచార్యులు 'అద్వైత' మత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. (కేరళలో జన్మించారు, 8వ శతాబ్దం.)
* 'జీవాత్మ, పరమాత్మ ఒకటే. మోక్షసాధనకు జ్ఞానమార్గం అనుసరించడం ఒక్కటే మార్గం' అని శంకరాచార్యులు ప్రబోధించారు.
* రామానుజాచార్యులు క్రీ.శ. 11వ శతాబ్దంలో విశిష్టాద్వైతాన్ని ప్రబోధించారు.
* 'విష్ణువు మీద గాఢమైన భక్తి కలిగి ఉండటమే ముక్తికి ఉన్న ఏకైక మార్గం' అని రామానుజాచార్యులు పేర్కొన్నారు.
* రామానుజాచార్యులపై ఆళ్వార్లు అధిక ప్రభావాన్ని చూపారు.
* భారతదేశంలో భక్తి ఉద్యమ ప్రారంభికుడిగా, నిమ్నకులాల వారికి దేవాలయ ప్రవేశం కల్పించిన తొలి వ్యక్తిగా రామానుజాచార్యులు పేరొందారు.
* రామానుజులు ప్రచారం చేసిన విశిష్టాద్వైతాన్ని 'శ్రీవైష్ణవం' అని పేర్కొంటారు. మధ్వాచార్యులు ద్వైత మతాన్ని, వల్లభాచార్యుడు శుద్ధా ద్వైతాన్ని, నింబార్కుడు ద్వైతాద్వైతాన్ని ప్రచారం చేశారు.
* బౌద్ధమతంలో చేరిన తొలి మహిళ ప్రజాపతి గౌతమి.
* బౌద్ధమతంలో చేరిన వేశ్యగా ఆమ్రపాలిని పేర్కొంటారు.
* బుద్ధుడు అంగుళీమాలుడు అనే బందిపోటు దొంగను బౌద్ధమతంలో చేర్చుకున్నాడు.
* బుద్ధుడు కపిలవస్తు నగరంలో ఆనందుడు, దేవదత్తుడు, ఉపాలి (మంగలి) అనే వారిని బౌద్ధ సంఘంలో చేర్చుకున్నాడు.
* బుద్ధుడి తొలి శిష్యుడిగా ఆనందుడిని పేర్కొంటారు.
* బుద్ధుడి ప్రధాన శిష్యులు ఆనందుడు, ఉపాలి.

* బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు

* బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు (శాక్యముని, తథాగతుడు, అంగీరసుడు అనేవి ఇతర పేర్లు)

* గౌతమబుద్ధుడి తండ్రి శుద్ధోధనుడు, తల్లి మాయాదేవి

* బుద్ధుడు కపిలవస్తు రాజ్యానికి చెందినవాడు, శాక్య వంశస్థుడు.

* సిద్ధార్థుడు క్రీ.పూ.563లో లుంబిని వనంలో జన్మించాడు. లుంబిని ప్రస్తుతం నేపాల్‌ దేశంలో ఉంది.

* క్రీ.పూ.483లో నేటి ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుశి నగరంలో నిర్యాణం చెందాడు.

* బుద్ధుడి జీవితంలో జరిగిన 5 ప్రధాన సంఘటనలను పంచ కల్యాణాలు అంటారు.

* బుద్ధుడిని పెంచిన తల్లి - ప్రజాపతి గౌతమి

* బుద్ధుడికి 19వ ఏట యశోధరతో వివాహం జరిగింది. వారికి రాహులుడు అనే కుమారుడు జన్మించాడు.

* కపిలవస్తు నగరంలో ఒకేరోజు ఒక వృద్ధుడిని, వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని, శవాన్ని, సన్యాసిని చూసిన బుద్ధుడు పరివర్తన చెందాడు. అనంతరం తన 29వ ఏట ఇల్లు విడిచి వెళ్లాడు. దీన్నే మహాభినిష్క్రమణం అంటారు.

* బుద్ధుడి ప్రధాన గురువులు - అలరక, ఉద్ధారక

* బుద్ధుడు అలారకలామ అనే గురువు వద్ద సాంఖ్యదర్శనాన్ని నేర్చుకున్నాడు.

* రుద్రలీ రామపుత్ర అనే గురువు వద్ద యోగాభ్యాసం అధ్యయనం చేశాడు.

* బుద్ధగయలో సుజాత అనే కర్షక బాలిక బుద్ధుడికి క్షీరాన్నం (గంజి) ఇచ్చింది.

* సిద్ధార్థుడు తన 35వ ఏట 40 రోజుల ధ్యానం అనంతరం జ్ఞానోదయం పొందాడు. దీన్నే సంబోధి అంటారు.

* సిద్దార్థుడు నేటి బిహార్‌లోని గయలో రావిచెట్టు కింద 40 రోజులు తపస్సు చేశాడు.

* బుద్ధుడి తపస్సును భగ్నం చేసేందుకు మార అనే దుష్టశక్తి ప్రయత్నించగా భూదేవి వచ్చి మారను శిక్షించింది. ఈ విషయాన్నే బౌద్ధ సాహిత్యంలో భూస్పర్శముద్రగా పేర్కొన్నారు.

* బుద్ధుడి గుర్రం పేరు కంఠక. రథసారథి చెన్నడు. 

* బుద్ధుడు తన తొలి ఉపదేశాన్ని సారనాథ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌) లోని జింకతోట/మృగదావనంలో తన పూర్వ సహచరులైన అయిదుగురు స్నేహితులకు బోధించాడు. దీన్నే ధర్మచక్ర పరివర్తన అంటారు.

* బుద్ధుడి బోధనలను ఆర్య సత్యాలు(Nobel Truths) అంటారు

 ఆర్య సత్యాలు నాలుగు అవి;

1) ప్రపంచం దుఃఖమయం

2) దుఃఖానికి కారణం కోరికలు

3) దుఃఖం పోవాలంటే కోరికలు అంతమవ్వాలి

4) కోరికల అంతానికి అష్టాంగమార్గాన్ని అనుసరించాలి.

* దుఃఖ నివారణ, మోక్ష సాధనకు బుద్ధుడు చూపిన మార్గం లేదా చెప్పిన సూత్రాలే అష్టాంగ మార్గం.

* అష్టాంగ మార్గంలోని ఎనిమిది సూత్రాలు

1) సరైన జీవనం         2) సరైన వాక్కు 

3) సరైన క్రియ         4) సరైన ధ్యానం 

5) సరైన నిశ్చయం     6) సరైన దృష్టి 

7) సరైన ఆలోచన     8) సరైన శ్రమ.

 

 బౌద్ధమత గ్రంథాలను త్రిపీటకాలు అంటారు. అవి;

1) వినయ      2) సుత్త      3) అభిదమ్మ

* బుద్ధుడు, ధర్మం, సంఘంలను బౌద్ధ త్రిరత్నాలుగా పేర్కొంటారు. (గమనిక: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి)

* బౌద్ధమతంలో చేరిన తొలి మహిళ ప్రజాపతి గౌతమి.

* ఆమ్రపాలి అనే వేశ్య, అంగులీమాలుడు అనే బందిపోటు దొంగ బౌద్ధ మతంలో చేరినట్లు పేర్కొంటారు.

 బుద్ధుడు కపిలవస్తు నగరంలో ఆనందుడు, దేవదత్తుడు, ఉపాలి (మంగలి) అనే వారిని బౌద్ధ సంఘంలో  చేర్చుకున్నాడు.

* బుద్ధుడి తొలి శిష్యుడిగా ఆనందుడిని పేర్కొంటారు.

* బుద్ధుడి ప్రధాన శిష్యులు ఆనందుడు, ఉపాలి.

* బుద్ధుడి తొలి జీవితం గురించి బౌద్ధజాతక కథలు  వివరిస్తాయి.

* బౌద్ధ మతంలో పవిత్ర గ్రంథాలైన త్రిపీటకాలు పాళీభాషలో ఉన్నాయి.

* భారతదేశంలో పుట్టిన బౌద్ధమతం ప్రపంచమతంగా అభివృద్ది చెందింది.

* వినయ పీటిక బౌద్ధ సంఘ నియమ నిబంధనలను; సుత్త పీటిక బుద్ధుడి బోధనలను; అభిదమ్మ పీటిక బౌద్ధదమ్మ (బౌద్ధ ధర్మం) వేదాంతాన్ని వివరిస్తాయి.

 బౌద్ధమతానికి చెందిన ముఖ్య నిర్మాణాలు

1) స్తూపం      2)  చైత్యం      3) విహారం

* బుద్ధుడి ధాతువులపై నిర్మించిన పొడవైన స్తంభాన్ని స్తూపం అంటారు. ఇది బుద్ధుడి మహా నిర్యాణానికి ప్రతీక.

* బౌద్ధమతస్థుల పూజాగృహాన్ని చైత్యం అంటారు. ఇది మహాయానులకు చెందింది.

* బౌద్ధ భిక్షువుల విశ్రాంతి గృహాలే విహారాలు.

* స్తూప, చైత్య, విహారాలు ఒకేచోట ఉంటే దాన్ని బౌద్ధ ఆరామంగా పేర్కొంటారు. ఈ ఆరామాలు అప్పట్లో ప్రసిద్ధ విద్యాకేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.

* భారతదేశంలో తొలి బౌద్ధ విశ్వవిద్యాలయంగా నాగార్జునకొండ విశ్వవిద్యాలయం పేరొందింది.

* భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయం తక్షశిల కాగా ప్రసిద్ధి చెందింది నలంద.

* విహార దేశంగా పేర్కొన్న రాష్ట్రం బిహార్‌.

* గాంధార, అమరావతి శిల్పకళలు బౌద్ధమత ప్రేరణతో అభివృద్ధి చెందాయి.

* మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ దగ్గర సాంచీ స్తూపం ఉంది.

* సారనాథ్‌ స్తూపం ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉంది.

* భారతదేశంలో అతి ప్రాచీన స్తూపంగా పేరొందింది పిప్రావహ.

* ఆంధ్రదేశం/దక్షిణ భారతదేశంలో అతిప్రాచీన స్తూపం భట్టిప్రోలు.

* బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గం వల్ల బౌద్ధమతాన్ని మధ్యేమార్గంగా పేర్కొంటారు.

* బుద్ధుడి సిద్ధాంతాన్ని ప్రతీయ - సముత్పాద సిద్ధాంతం అంటారు.

* బుద్ధుడి జననం, జ్ఞానోదయం కలగడం, మహాపరి నిర్యాణం పౌర్ణమి రోజే జరిగాయి.

 బుద్ధుడి మరణానంతరం బౌద్ధమత అభివృద్ధి కోసం నిర్వహించిన సభలను బౌద్ధ సంగీతులు అంటారు. (మొత్తం నాలుగు బౌద్ధ సంగీతులు జరిగాయి.)

* మొదటి బౌద్ధ సంగీతిలో వినయ, సుత్త పీటకాలను సంకలనం చేశారు.

* వినయ పీటకాన్ని ఆరామ స్మృతి అని పేర్కొంటారు. సుత్త పీటకంలో బుద్ధుడి బోధనలు ఉన్నాయి.

* రెండో బౌద్ధ సంగీతిలో బౌద్ధులు స్థవిరవాదులు/థెరవాదులు, మహాసాంఘికులుగా విడిపోయారు.

* మూడో బౌద్ధ సంగీతిలో అభిదమ్మ పీటకాన్ని సంకలనం చేశారు. (దీంతో త్రిపీటకాల సంకలనం పూర్తయ్యింది.)

* నాలుగో బౌద్ధ సంగీతిలో బౌద్ధమతం హీనయానం, మహాయానంగా విడిపోయింది.

* సభలో చర్చలు పాళీ భాషలో కాకుండా సంస్కృత భాషలో జరిగాయి.

* బుద్ధుడిని మాములు బోధకుడిగా (మనిషిగా) భావించి, విగ్రహారాధనను వ్యతిరేకించిన వర్గం హీనయానులు.

* హీనయానులు మత ప్రచారానికి, సాహిత్య రచనకు పాళీ భాషను వినియోగించారు.

* హీనయానులు స్వీయ క్రమశిక్షణ, ధ్యానం ద్వారా మోక్షం పొందవచ్చని విశ్వసించారు.

* పాళీ ధర్మశాస్త్ర గ్రంథాలైన త్రిపీటకాలను పవిత్ర గ్రంథాలుగా భావిస్తారు.(హీనయానులు)

* త్రిపీటకాల్లో అతిముఖ్యమైంది, పెద్దది - సుత్త పీటకం.

 సుత్త పీటకాన్ని అయిదు నికాయలుగా విభజించారు. అవి:

1) దీర్ఘ నికయ         2) మాధ్యమ నికయ 
3) సంయుక్త నికయ    4) అంగుత్తర నికయ    5) ఖుద్దాక నికయ

*  జాతక కథలు, దమ్మపదం లాంటి భాగాలు ఖుద్దాక నికయలో ఉన్నాయి.

*  మిళింద పన్హా గ్రంథంలో గ్రీకు రాజు మీనాండార్‌కు, బౌద్ధ సన్యాసి నాగసేనుడికి మధ్య జరిగిన చర్చల సారాంశ వివరణ ఉంది.

*  హీనయానులు మిళింద పన్హా, దీప వంశం, మహావంశం లాంటి గ్రంథాలను అనుసరించారు.

* మహాయానులు బుద్ధుడిని దైవ స్వరూపంగా భావించి విగ్రహారాధనను సమర్థించారు.

* బుద్ధుడి ప్రతిమలను పెట్టి పూజించే చైత్యాలు మహాయానులకు చెందినవి.

* మహాయానులు మత ప్రచారానికి సంస్కృత భాషను వినియోగించారు. వీరు బుద్ధులు, బోధిసత్వుల దయ, సహాయాల ద్వారానే మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు.

* గౌతముడు, అమితాభుడు, మైత్రేయనాథులను బుద్ధులుగా; అవలోకితేశ్వరుడు, మంజుశ్రీ, వజ్రపాణి లాంటి వారిని బోధిసత్వులుగా పేర్కొంటారు. అంటే మహాయానులు బుద్ధులు, బోధిసత్వుÄల విగ్రహాలను పూజిస్తారు.

* మహాయానంలో మాధ్యమిక వాదం, యోగాచార వాదం అనే రెండు ప్రధాన సంప్రదాయాలు ఉన్నాయి.

* మాధ్యమిక సంప్రదాయ వాదాన్ని ఆచార్య నాగార్జునుడు ప్రబోధించారు. మాధ్యమిక వాదాన్ని శూన్యవాదంగా కూడా పేర్కొంటారు.

* యోగాచార వాదాన్ని మైత్రేయనాథుడు ప్రారంభించారు. యోగాచార వాదాన్ని విజ్ఞానవాదంగా పిలుస్తారు. ఇది  హీనయానానికి చెందిన వాస్తవికవాదాన్ని పూర్తిగా తిరస్కరించి, పరమ ఆదర్శవాదాన్ని అంగీకరిస్తుంది.

* ఆచార్య నాగార్జునుడు రచించిన ప్రజ్ఞా పారమితిక శాస్త్ర మహాయానుల పవిత్ర గ్రంథంగా పేరొందింది.

* అసంగుడు, వసుబంధు లాంటి రచయితలు కూడా మహాయాన సంప్రదాయాన్ని అనుసరించారు.

* సూత్రాలంకార గ్రంథాన్ని రాసింది అసంగుడు.

* మహాయానులు సంస్కృత భాషలో ఉన్న సొంత త్రిపీటకాలను అభివృద్ధి చేసుకున్నారు.

* మహాయానులు వైపుల్య సూత్రాలను బుద్ధుడి ప్రకటనలుగా భావించి, వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

* సధర్మ పుండరీకం, లలిత విస్తార, వజ్ర ఛేదిక, సుఖవతి లాంటి గ్రంథాలను పవిత్రంగా భావించి, అనుసరించారు.

* తర్వాతి కాలంలో బౌద్ధ మతంలో వజ్రయానం అనే మరో శాఖ కూడా ఏర్పడింది. ఇంద్రజాలిక శక్తులు పొందడం ద్వారా మోక్షం పొందడం ఈ వాదం వారి ఆశయం.

* వజ్రయాన శాఖకు చెందినవారు బుద్ధుల, బోధిసత్వుల భార్యలైౖన తారలను ప్రధాన దైవాలుగా భావించి పూజిస్తారు. వీరు తాంత్రిక పూజా విధానానికి ప్రాధాన్యం ఇచ్చారు (తంత్ర నిర్వహణ ద్వారా మంత్రం వల్లె వేయడం.)

* పాల, సేన వంశీయుల కాలంలో తూర్పు భారతదేశంలో వజ్రయాన శాఖ బాగా విస్తరించింది.

* సరాహుడు రచించిన దోహకోశ వజ్రయానానికి చెందిన ప్రసిద్ధ గ్రంథం. 

* కనిష్కుడు మహాయాన బౌద్ధాన్ని ఆచరించాడు.

* కనిష్కుడి కాలంలో మహాయాన బౌద్ధమతం ప్రేరణలో గాంధర శిల్పకళ అభివృద్ధి చెందింది.

* మొదటి బౌద్ధ సంగీతి అజాతశత్రువు కాలంలో రాజగృహంలో మహాకాశ్యపుడి అధ్యక్షతన జరిగింది.  

* కాలాశోకుడి కాలంలో వైశాలిలో జరిగిన రెండో బౌద్ధ సంగీతికి సబకామి అధ్యక్షత వహించాడు.

* మూడో బౌద్ధ సంగీతి అశోకుడి కాలంలో పాటలీపుత్రంలో జరిగింది. అధ్యక్షుడు - మొగలిపుత్త తిస్స 

* నాలుగో బౌద్ధ సంగీతి కనిష్కుడి కాలంలో కాశ్మీర్‌/కుందలవనంలో జరిగింది. వసుమిత్రుడు అధ్యక్షుడు

* బుద్ధుడి జననానికి ప్రతీక గుర్తు - తామరపువ్వు/ పద్మం

* బుద్ధుడు ఇంటి నుంచి వెళ్లిపోవడానికి (మహాభినిష్క్రమణం) గుర్తు - గుర్రం

* బుద్ధుడికి జ్ఞానోదయం కలగడం (సంబోధి)  - బోధి వృక్షం

* బుద్ధుడి తొలి ఉపదేశం (ధర్మచక్ర పరివర్తన)  - ధర్మచక్రం 

* బుద్ధుడి మరణం లేదా పరినిర్యాణం - స్తూపం

 

ఇతర మత శాఖలు

* అజీవక మతాన్ని గోశాల మస్కరిపుత్ర (మక్కలిపుత్ర/ మఖలగోసలుడు) స్థాపించాడు. ఈ మతానికి చెందిన వారు నియతి అనే విధిని విశ్వసిస్తారు. అశోక వృక్షాన్ని పూజిస్తారు. మౌర్యుల కాలంలో ఈ మతశాఖ వృద్ధి చెందింది.

* భూమి, గాలి, నీరు లాగే సంతోషం, దుఃఖం జీవితం అనేవి విధ్వంసనీయం కావని పకుధ కాత్యాయనుడు ప్రబోధించాడు. ఇతడి ప్రబోధాల నుంచి వైశేషిక సంప్రదాయం ఆవిర్భవించింది.

* శరీరం, ఆత్మ వేర్వేరు అని ప్రబోధించిన పురాణ కశ్యప ప్రభావంతో సాంఖ్యతత్వ సంప్రదాయం ఆవిర్భవించింది.

* సంపూర్ణ భౌతికవాదానికి సంబంధించిన మొదటి ప్రబోధకుడు - అజితకేశ కంబలిన్‌. ఇతడు సర్వనాశన వాదం/ ఉచ్ఛేదనాన్ని ప్రచారం చేశాడు. ఇతడి ప్రభావంతోనే చార్వాక సంప్రదాయం/లోకాయుత సంప్రదాయం తలెత్తింది.

* కృష్ణ వాసుదేవుడిని విష్ణుమూర్తిగా కొలిచే భక్తి సంప్రదాయాన్ని భాగవత మతంగా పేర్కొంటారు. భాగవతుడు అంటే ఆరాధనీయమైనవారిని ఆరాధించే వ్యక్తి అని అర్థం. చాందోగ్యోపనిషత్తు కృష్ణ వాసుదేవుడిని దేవకీ పుత్రుడిగా పేర్కొంది.

* పాణిని రచన అష్టాధ్యాయిలో, మెగస్తనీస్‌ ఇండికా (హెరాక్లెస్‌)లో, బెస్‌ నగర స్తంభ శాసనంలో భాగవత మత ఆరాధన గురించి ప్రస్తావన ఉంది.

* బెస్‌ నగర స్తంభ శాసనాన్ని కాశీపురానికి చెందిన శుంగరాజైన భాగభద్రుడు వేయించాడు.

* బెస్‌ నగర స్తంభ శాసనం గ్రీకు రాయబారి హీలియోడోరస్‌ను భాగవతుడిగా పేర్కొంది.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌