• facebook
  • whatsapp
  • telegram

తొలి సమాజంలో ఆ కానుకలపై హక్కులు ఆడవారికే!

తొలి సమాజం - మతోద్యమాలు

 

భారతదేశంలో ప్రాచీన కాలం నుంచే సనాతన సంస్కృతి వర్ధిల్లి హిందూ మతం విస్తరించింది. అనంతరం అభ్యుదయభావాలతో కూడిన బౌద్ధ, జైన మతాలు ఆవిర్భవించాయి. పురాతన ధర్మంలోని లోపాలను, వర్ణం, మత ఆధారిత వివక్షలను ప్రశ్నించాయి. ఈ పరిణామ క్రమాన్ని, సమాజంలో వచ్చిన మార్పులను అభ్యర్థులు తెలుసుకోవాలి. గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుల జీవిత విశేషాలు, వారి బోధనలు, మతవ్యాప్తి పద్ధతులు, సంబంధిత ప్రాంతాల గురించి సమగ్ర అవగాహన పెంచుకోవాలి.

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 


1. సత్యాన్వేషణకు స్థిరనివాసం లేకుండా ఒక గ్రామం నుంచి మరొక గ్రామం; ఒక అరణ్యం నుంచి మరొక అరణ్యానికి తిరుగుతూ ఉండేవారిని ఏమంటారు?

1) పరివ్రాజకులు        2) భిక్షువులు    

3) తిరిగేవాళ్లు       4) పైవారందరూ


2. కిందివారిలో పరివ్రాజకులు కానివారు?

1) మక్కలి గోసల        2) అజిత కేశకంబలి

3) కౌటిల్యుడు        4) గౌతమ బుద్ధుడు


3. ‘పుట్టుక చావు అనే చక్రబంధం నుంచి విమోచన ఎలా’ .... అని అన్వేషణ చేసినవారు?

1) వర్ధమాన మహావీరుడు    2) అజిత కేశకంబలి

3) బుద్ధుడు             4) గోసల


4. ‘పాపాల నుంచి విముక్తిని పొందడానికి శరీరాన్ని కఠోర శ్రమకు గురిచేయాలి’ అని చెప్పినవారు-

1) వర్ధమాన మహావీరుడు     2) కంబలి     

3) బుద్ధుడు         4) గోసల


5. ‘ప్రపంచమంతా దుఃఖమయం.. దుఃఖాన్ని జయించడం ఎలా’ అని అన్నదెవరు?

1) వర్ధమాన మహావీరుడు   2) అజిత కేశకంబలి

3) గౌతమ బుద్ధుడు         4) మక్కలి గోసల


6. గౌతమ బుద్ధుడు ప్రబోధించిన మార్గం?

1) ప్రారంభ మార్గం        2) మధ్యేమార్గం

3) అంతిమ మార్గం        4) బోధనలు


7. బుద్ధుడి అనుచరులు అతడి బోధనలను ఏ పేరుతో సంకలనం చేశారు?

1) గ్రంథాలు       2) బోధనలు  

3) త్రిపీఠకాలు       4) పంచవ్రతాలు


8. క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి ఆర్యులు ఏ ప్రాంతమంతటా విస్తరించారు?

1) మధ్య భారతదేశం   2) ఉత్తర భారతదేశం

3) దక్షిణ భారతదేశం   4) నైరుతి భారతదేశం


9. క్రీ.పూ.6వ శతాబ్దంలో 60 మత శాఖలు ఉన్నాయని పేర్కొన్న చరిత్రకారులు?

1) ఆర్‌.డి.బెనర్జీ      2) సర్‌ జాన్‌ మార్షల్‌

3) నీలకంఠ శాస్త్రి      4) రోమిల్లా థాపర్‌


10. పురుష సూక్తంలో ప్రజాపతి దేహం నుంచి నాలుగు వర్ణాలు ఆవిర్భవించినట్లు ఉంది. వాటిలో తప్పుగా జత చేసింది? 

1) బ్రాహ్మణులు తల    2) క్షత్రియులు దేహం

3) వైశ్యులు పొట్ట 4) శూద్రులు పాదాలు


11. గోత్రం అనే పదం ఏ కులం నుంచి పుట్టింది?    

1) బ్రాహ్మణ  2) క్షత్రియ  3) వైశ్య  4) శూద్ర


12. గోత్రం అనే పదం ఏ జంతువుకు సంబంధించింది?

1) ఆవు   2) ఎద్దు   3) పులి   4) పాము


13. మనుస్మృతిలో ఎన్ని రకాల వివాహ పద్ధతులు ఉన్నాయి?    

1) 7     2) 8      3) 6      4) 4


14. కిందివాటిలో తొలి సమాజ కాలానికి సంబంధించి తప్పుగా ఉన్న వాక్యం?

ఎ) రక్త సంబంధీకులను వివాహం చేసుకునే ఆచారం ఉండేది కాదు.

బి) కులం కుటుంబాలను, వంశం పుట్టుకను తెలియజేస్తుంది.

సి) పితృస్వామిక వ్యవస్థ అమల్లో ఉండేది.

డి) కన్యాదానం చేయడం ఆచారంగా ఉండేది.

1) బి మాత్రమే       2) ఎ మాత్రమే

3) బి, డి         4) ఎ, డి


15. బహు భార్యత్వం ఉండటాన్ని ఏమంటారు?

1) పాలిగమీ       2) పాలియాండ్రి

3) ఎండోగమీ       4) ఎక్సోగమీ


16. కిందివాటిలో సరైన వాక్యాలు?

ఎ) తొలి సమాజ కాలంలో పుట్టుకను బట్టి వర్ణం నిర్ణయమవుతుంది.

బి) తొలి సమాజ కాలంలో వర్ణ ధర్మాలను బట్టి సివిల్, క్రిమినల్‌ శిక్షల్లో హెచ్చుతగ్గులు ఉండేవి.

సి) శూద్రులు ద్విజులకు బానిసలుగా, కూలీలుగా ఉండేవారు.

డి) తొలి సమాజాల కాలంలో వర్ణ ధర్మాలను బట్టి గౌరవం, పదవులు ఉండేవి కావు

1) ఎ, బి, సి, డి      2) బి, సి, డి   

3) ఎ, బి, సి       4) ఎ, సి, డి


17. తొలి సమాజ కాలంలో వ్యవసాయదారులుగా పురోగమించిన వర్ణం? 

1) వైశ్యులు       2) శూద్రులు   

3) క్షత్రియులు       4) బ్రాహ్మణులు


18. తొలి సమాజ కాలంలో పురుషులు, స్త్రీలు ఎన్ని పద్ధతుల్లో ఆస్తిని కలిగి ఉండేవారు (వరుసగా)?

1) 6 - 7   2) 7 - 6   3) 8 - 7   4) 8 - 6


19. తొలి సమాజ కాలంలో వివాహ సందర్భంలో స్త్రీకి ఇచ్చే కానుకలపై ఎవరికి హక్కు ఉండేది?    

1) భర్తకు              2) స్త్రీకి మాత్రమే 

3) భార్యాభర్తలిద్దరికీ       4) స్త్రీ తల్లిదండ్రులకు


20. స్త్రీలు బయట సమూహం నుంచి వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు?

1) ఎండోగమీ       2) పాలియాండ్రి  

3) పాలిగమీ       4) ఎక్సోగమీ


21. బౌద్ధమత గ్రంథాల ప్రకారం క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఎన్ని మతాలుండేవి?

1) 60     2) 62     3) 63    4) 363


22. ‘ఏదీ మానవుడి చేతిలో లేదు జరగాల్సింది జరిగి తీరుతుంది’ అని చెప్పినవారు?

1) బుద్ధుడు         2) వర్ధమాన మహావీరుడు   

3) మక్కలి గోసల     4) ఆరుణి


23. పురాణ కశ్యపుడు ఏ వ్యక్తికి గురువు?

1) మక్కలి గోసల       2) వర్ధమానుడు   

3) బుద్ధుడు       4) ఉద్దాలక


24. కర్మ సిద్ధాంతాలను నమ్మని మతం?

1) హిందూ       2) ఇస్లాం   

3) అజీవక        4) బౌద్ధ, జైన


25. లోకాయుతులు లేదా చార్వాకుల మత శాఖ స్థాపకుడు?

1) బృహస్పతి       2) అజిత కేశకంబలి 

3) పకుద కాత్యాయన       4) గౌతముడు


26. ఆత్మ సిద్ధాంతాన్ని ఖండించిన మతం-

1) బౌద్ధమతం       2) జైనమతం       

3) చార్వకమతం       4) హిందూమతం


27. లోకాయుత మత ప్రధాన ప్రచారకుడు

1) చార్వాకుడు       2) బృహస్పతి   

3) గోసల       4) అజితకేశ కంబలి


28. లోకాయుతులు చెప్పిన వాస్తవిక భౌతిక వాదం ఏ శాస్త్ర ఆవిర్భావానికి దారితీసింది?

1) భూగోళశాస్త్రం       2) గణితశాస్త్రం   

3) సామాన్య విజ్ఞానశాస్త్రం    4) పౌరశాస్త్రం


29. రుగ్వేద శ్లోకాల్లో ప్రస్తావించిన జైనమత తీర్థంకరులు?

1) వృషభనాథుడు, వర్ధమానుడు       2) వర్ధమానుడు, పార్శ్వనాథుడు

3) వృషభనాథుడు, అరిష్టనేమి   4) అరిష్టనేమి, వర్ధమానుడు


30. కిందివాటిని జతపరచండి.

1) ఒకటో తీర్థంకరుడు ఎ) వర్ధమాన మహావీరుడు
2) రెండో తీర్థంకరుడు బి) అరిష్టనేమి
3) 23వ తీర్థంకరుడు సి) వృషభనాథుడు
4) 24వ తీర్థంకరుడు డి) పార్శ్వనాథుడు
  ఇ) అజితనాథుడు

1) 1-సి, 2-ఇ, 3-డి, 4-ఎ     2) 1-సి, 2-ఎ, 3-డి, 4-ఇ

3) 1-ఇ, 2-బి, 3-డి, 4-ఎ     4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ


31. కిందివాటిలో సరికానిది?

ఎ) వర్ధమాన మహావీరుడు క్రీ.పూ.450లో జన్మించాడు.

బి)  వర్ధమాన మహావీరుడు కుంద గ్రామంలో జన్మించాడు.

సి) వర్ధమాన మహావీరుడి తండ్రి సిద్ధార్థుడు.

డి) వర్ధమాన మహావీరుడి వంశం జ్ఞాత్రిక.

1) ఎ, సి      2) ఎ, డి   

3) ఎ మాత్రమే       4) సి మాత్రమే


32. మహావీరుడు ఇంటి నుంచి వెళ్లే సమయానికి అతడి వయసు ఎన్నేళ్లు?

1) 29     2) 40    3) 30    4) 39 


33. వర్ధమాన మహావీరుడు ఎన్నేళ్లు తపస్సు చేశాడు?

1) 29     2) 10    3) 12    4) 7


34. వర్ధమాన మహావీరుడు 42 ఏళ్ల వయసులో కైవల్యాన్ని పొందిన ప్రాంతం?

1) కుందగ్రామం - వేపవృక్షం     2) జృంభిక గ్రామం - సాలవృక్షం

3) కుశీనగరం - మర్రివృక్షం 4) పావపురి - రావివృక్షం


35. వర్ధమాన మహావీరుడి (జైనమతం) పంచ వ్రతాల్లో లేనిది?

1) అస్తేయా, అపరిగ్రహ     2) జీవహింస చేయరాదు 

3) అసత్యం ఆడరాదు     4) బ్రహ్మచర్యం పాటించరాదు


36. జైన మతానికి చెందిన త్రిరత్నాల్లో లేనిది?

1) సరైన క్రియ     2) సరైన నమ్మకం 

3) సరైన జ్ఞానం     4) సరైన శీలం


37. మహావీరుడు ద్వైత సిద్ధాంతాన్ని విశ్వసించాడు. దీన్ని ఏమంటారు?

1) మధ్యేమార్గం     2) సామ్యవాదం 

3) స్వాదవాదం     4) తపస్సు


38. మహావీరుడి శిష్యుల సంఖ్య?

1) 9     2) 10     3) 11     4) 12


39. మహావీరుడి శిష్యులను ‘గాంధారులు’ అని అంటారు. వారిలో ముఖ్యమైనవాడు?

1) చంద్రగుప్త మౌర్యుడు     2) సధాకర శాస్త్రి 

3) తులసీదాస్‌     4) ఆర్య సుధారామన్‌


40. వర్ధమాన మహావీరుడి తర్వాత జైన మతం కింది ఏ విధంగా విడిపోయింది?

1) తీర్థంకరులు - దిగంబరులు     2) శ్వేతంబరులు - గాంధారులు

3) శ్వేతంబరులు - దిగంబరులు     4) శ్వేతంబరులు - తీర్థంకరులు


41. ‘సృష్టిలో ఉన్న ప్రతివాటికి ఆత్మ ఉంటుంది’ అని బోధించిన మతం-    

1) బౌద్ధం  2) హిందూ  3) జైనం  4) అజవిక


42. జైనమత సమావేశాలు జరిగిన ప్రాంతాలు, వాటి అధ్యక్షులను పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి.

ఎ) ఒకటో సమావేశం - పాటలీపుత్రం - స్థూల భద్ర

బి) రెండో సమావేశం - వల్లభి - దేవార్ధి క్షమాశ్రమణ

1) ఎ సరైంది, బి సరికాదు         2) బి సరైంది, ఎ సరికాదు

3) ఎ, బిలు రెండూ సరైనవి     4) ఎ, బిలు రెండూ సరికావు


43. జైనమత ప్రచారానికి సహాయం చేసిన మగధ రాజు?

1) చంద్రగుప్త మౌర్యుడు     2) ఆరో బిందుసారుడు

3) అజాత శత్రువు     4) మహాపద్మనందుడు


44. జైనమతాన్ని పోషించిన ప్రముఖ రాజవంశీయులు?

1) కళింగ, గాంగులు  2) కదంబులు, చాళుక్యులు 

3) రాష్ట్ర కూటులు    4) పైవారందరూ


45. జైనమతంలో చేరిన సామాజిక వర్గం?

1) వ్యవసాయదారులు     2) వ్యాపారులు 

3) దళితులు     4) క్షత్రియులు

 

46. జైనమతంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు?

ఎ) గిర్నార్‌ (రాజ్‌గిరి)             బి) మౌంటు అబు (మధుర) 

సి) చంద్రగిరి (భువనేశ్వర్‌)       డి) శ్రావణ బెళగొళ (కర్ణాటక)

1) ఎ, బి, సి, డి     2) డి మాత్రమే 

3) బి, డి మాత్రమే     4) సి మాత్రమే


47. ఏ భాష వల్ల ప్రాంతీయ భాషలు ఆవిర్భవించాయి?

1) సంస్కృతం     2) ప్రాకృతం 

3) ద్రావిడం     4) తెలుగు


48. ‘శూరసేన’ అనే భాష నుంచి ఉద్భవించిన భాష?

1) మరాఠి     2) మలయాళం 

3) తమిళం     4) గుజరాతీ


49. కిందివాటిలో సరైన వాక్యాలు?

ఎ) సిద్ధార్థ గౌతముడు - బౌద్ధ మత స్థాపకుడు

బి) బుద్ధుడి తల్లి మాయాదేవి, తండ్రి శుద్ధోదనుడు

సి) బుద్ధుడి భార్య యశోధర, కుమారుడు రాహులుడు

డి) బుద్ధుడు కపిలవస్తు రాజ్య వంశానికి చెందినవాడు

1) ఎ, బి, సి, డి    2) బి, సి, డి 

3) సి, డి     4) ఎ, బి, సి


50. బుద్ధుడికి సంబంధించిన కింది సంఘటనలను వరుస క్రమంలో అమర్చండి.

ఎ) రోగిని చూడటం     బి) వృద్ధుడిని చూడటం 

సి) సన్యాసిని చూడటం    డి) మృతదేహం చూడటం

1) ఎ, బి, సి, డి       2) బి, సి, ఎ, డి       

3) బి, ఎ, సి, డి       4) బి, ఎ, డి, సి


51. బుద్ధుడు ఇంటి నుంచి వెళ్లే సమయానికి అతడికి ఎన్నేళ్లు?

1) 29     2) 30    3) 40    4) 19


52. బుద్ధుడు 35 ఏళ్ల వయసులో బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందాడు. అతడు, ఎన్నేళ్లు తపస్సు చేశాడు?

1) 7      2) 9     3) 8    4) 6 1/2


53. బుద్ధుడి జనన మరణాల వరుస క్రమం-

1) క్రీ.పూ. 563 - క్రీ.పూ. 463        2) 563 సంవత్సరాల క్రితం - 463 సంవత్సరాల క్రితం

3) క్రీ.పూ. 563 - క్రీ.పూ. 483       4) క్రీ.శ. 483 - క్రీ.శ. 563


54. బుద్ధుడి జనన - మరణ ప్రాంతాలు వరుసగా    

1) కుశీ నగరం - లుంబినీ వనం  2) లుంబినీ వనం - కుశీ నగరం

3) లుంబినీ వనం - గయ    4) కుశీ నగరం - పావపురి


55. బుద్ధుడి జన్మ వృత్తాంతాలను గురించి తెలిపే కథలు?

1) పురాణాలు     2) అరణ్యకాలు 

3) జాతక కథలు     4) త్రిపీఠకాలు


56. కిందివాటిలో తప్పుగా జత చేసింది?

1) బుద్ధుడి జననం - తామర పుష్పంలో ఎద్దు

2) బుద్ధుడి మహాభినిష్క్రమణం - గుర్రం

3) బుద్ధుడి మహాపరినిర్వాణం - స్తూపం 

4) బుద్ధుడి మహాపరినిర్వాణం - చక్రం


57. కిందివాటిలో గౌతమ బుద్ధుడి బోధనలకు సంబంధించి సరైనవి?

ఎ) బుద్ధుడు వేదాలు, బ్రాహ్మణ ఆధిక్యతను ప్రశ్నించాడు.

బి) జంతు బలులను ప్రోత్సహించాడు.

సి) వర్ణ, వర్గ వ్యవస్థను వ్యతిరేకించాడు.

డి) భగవంతుడు ఉన్నాడా లేడా? అనే ప్రశ్న వ్యర్థమని బోధించాడు.

1) ఎ, బి, సి, డి     2) బి, సి, డి  

3) ఎ, సి, డి     4) ఎ, బి, సి


58. బుద్ధుడు బోధించిన ఆర్య సత్యాలు ఎన్ని?

1) 8     2) 6     3) 4     4) 12


59. దుఃఖాన్ని నిరోధించడానికి బుద్ధుడు బోధించిన మార్గం? 

1) ఆర్యసత్యాలు     2) అష్టాంగ మార్గం 

3) యోగ     4) బోధన మార్గం


60. కిందివాటిలో అష్టాంగ మార్గంలో లేనిది?

1) సరైన దృష్టి     2) సరైన వాక్కు 

3) సరైన ధ్యానం     4) సరైన జ్ఞానం


సమాధానాలు

1-4; 2-3; 3-1; 4-1; 5-3; 6-2; 7-3; 8-2, 9-4; 10-3; 11-1; 12-1; 13-2; 14-1; 15-2; 16-1; 17-2; 18-2, 19-2; 20-4; 21-2; 22-3; 23-1; 24-3; 25-1; 26-3; 27-1; 28-3, 29-1; 30-1; 31-3; 32-3; 33-3; 34-2; 35-4; 36-1; 37-3; 38-3, 39-4; 40-3; 41-3; 42-3; 43-1; 44-4; 45-2; 46-1; 47-2; 48-1, 49-1; 50-4; 51-1; 52-1; 53-3; 54-2; 55-3; 56-4; 57-3; 58-3, 59-2; 60-4.

 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

Posted Date : 27-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌