మాదిరి ప్రశ్నలు
1. మొదటి బహదూర్షాపై తిరుగుబాటు చేసిన సిక్కుల గురువు ఎవరు?
జ: బందాబహదూర్
2. కిందివారిలో ఛత్రసాల్ ఎవరి నాయకుడు?
ఎ) జాట్లు బి) రాజపుత్రులు సి) బుందేలులు డి) సిక్కులు
జ: సి(బుందేలులు)
3. మొదటి బహదూర్షా అసలు పేరు?
జ: మువజ్జం
4. జహందర్ షా ఎవరి మద్దతుతో మొగలు చక్రవర్తి అయ్యాడు?
జ: జుల్ఫికర్ ఖాన్
5. ఏ మొగల్ చక్రవర్తిని సయ్యద్ సోదరులు హతమార్చారు?
జ: ఫరూక్సియార్
6. సయ్యద్ సోదరులను ఏ మొగల్ చక్రవర్తి కాలంలో చంపేశారు?
జ: మహమ్మద్ షా
7. 'రంగీలా'గా పేరు పొందిన మొగల్ చక్రవర్తి ఎవరు?
జ: మహమ్మద్ షా
8. ఏ ప్రాంతంలో నిజాం ఉల్ ముల్క్ స్వతంత్య్ర రాజ్యాన్ని స్థాపించాడు?
జ: హైదరాబాద్
9. కింది వారిలో 'ఇరాన్ నెపోలియన్'గా పేరుగాంచింది ఎవరు?
ఎ) అహమ్మద్ షా అబ్దాలీ బి) మొదటి డేరియస్ సి) నాదిర్షా డి) ఇతిమద్ ఉద్దౌలా
జ: సి(నాదిర్షా)
10. నాదిర్షాకు, మొగల్ సైన్యానికి మధ్య 1739 ఫిబ్రవరిలో యుద్ధం ఎక్కడ జరిగింది?
జ: కర్నాల్
11. అహమ్మద్షా అబ్దాలీ ఏ తెగకు చెందినవాడు?
జ: అబ్దాలి
12. రెండో అలంఘీర్ అసలు పేరు?
జ: అజీజుద్దీన్
13. మూడో పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
జ: 1761
14. బ్రిటిషర్లు ఢిల్లీని ఎప్పుడు ఆక్రమించారు?
జ: 1803
15. చివరి మొగల్ చక్రవర్తి ఎవరు?
జ: రెండో బహదూర్షా
16. రామమోహన్రాయ్కు 'రాజా' అనే బిరుదు ఇచ్చిన మొగలు చక్రవర్తి ఎవరు?
జ: రెండో అక్బర్