• facebook
  • whatsapp
  • telegram

గడియారాలు

ఏకీభవించినా... ఎదురెదురుగా ఉన్నా!

  సాధారణంగా గడియారాల్లో మూడు రకాల ముళ్లు నిరంతరం తిరుగుతూ కాలాన్ని కొలుస్తుంటాయి. గంటలు, నిమిషాలు, సెకన్లలో సమయాన్ని లెక్కగడుతుంటాయి. అందులోని పెద్ద ముల్లు, చిన్నముల్లు ఏకీభవించినా, ఎదురెదురుగా ఉన్నా కొన్ని విశేషాలు ఏర్పడతాయి. అనుక్షణం అందరి మదిలోనూ మెదిలే ఈ టైమ్‌ను రీజనింగ్‌ దృష్టితో అర్థం చేసుకుంటే పరీక్షల్లో కొన్ని మార్కులు సంపాదించుకోవచ్చు. 

 

  గడియారంలో ప్రధానంగా గంటల ముల్లు, నిమిషాల ముల్లు గురించి చర్చిస్తాం. 


గంటల ముల్లు: గడియారంలో గంటల ముల్లు 12 గంటల్లో ఒక పూర్తి భ్రమణం అంటే 360ా కోణాన్ని ఏర్పరుస్తుంది. 

  గడియారంలోని గంటల ముల్లు గంటలో 30o కోణాన్ని ఏర్పరుస్తుంది. 

   గడియారంలోని గంటల ముల్లు నిమిషంలో ల కోణం ఏర్పరుస్తుంది. 

నిమిషాల ముల్లు: గడియారంలోని నిమిషాల ముల్లు గంటలో ఒక పూర్తి భ్రమణం అంటే 360o కోణాన్ని ఏర్పరుస్తుంది. 

గడియారంలోని నిమిషాల ముల్లు నిమిషంలో 6o కోణం ఏర్పరుస్తుంది.

 

సాపేక్ష వేగం: గడియారంలోని నిమిషాల ముల్లు గంటల ముల్లు కంటే నిమిషంలో ల కోణం అధికంగా చేస్తుంది. దీన్నే ఆ ముళ్ల సాపేక్ష వేగం అంటారు.  

 

  గడియారంలో గంటల ముల్లు, నిమిషాల ముల్లు తిరుగుతున్నప్పుడు ప్రధానంగా మూడు సందర్భాలు ఎదురవుతాయి. 

1) ముళ్ల్లు ఏకీభవించడం (0o

2) ముళ్లు వ్యతిరేకంగా ఉండటం (180o

3) ముళ్లు లంబంగా ఉండటం (90o

 

ముళ్లు ఏకీభవించడం

  ముళ్లు ఏకీభవించడం, ఒకదానిపైన మరొకటి ఉండటం లేదా ముళ్ల మధ్యకోణం 0ా ఉండటం అన్నీ ఒకటే. 

  గడియారంలోని రెండు ముళ్ల ప్రతి గంటకు ఒకసారి మాత్రమే ఏకీభవిస్తాయి. కానీ 12 గంటల సమయానికి మాత్రం 11 సార్లు, రోజులో (24 గంటల్లో)  22 సార్లు మాత్రమే ఏకీభవిస్తాయి. 

 

  గడియారంలోని రెండు ముళ్లు రోజులో ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి? 

1) 11    2) 24    3) 22    4) 44

జవాబు: 3 

గమనిక: 11 నుంచి 12 గంటలు, 12 నుంచి ఒంటి గంట మధ్య కేవలం ఒకసారి మాత్రమే రెండు ముళ్లు ఏకీభవిస్తాయి. 

 

ముళ్లు వ్యతిరేకంగా ఉండటం

  ముళ్లు వ్యతిరేకంగా ఉండటం లేదా వాటి మధ్య కోణం 180ా ఉండటం రెండూ ఒకటే. 

  గడియారంలోని రెండు ముళ్లు ప్రతీ గంటకు ఒకసారి మాత్రమే వ్యతిరేకదిశలో ఉంటాయి. కానీ 12 గంటల సమయంలో 11 సార్లు, రోజులో 22 సార్లు మాత్రమే వ్యతిరేక దిశలో ఉంటాయి. 

 

  గడియారంలోని రెండు ముళ్లు రోజులో ఎన్నిసార్లు వ్యతిరేక దిశలో ఉంటాయి? 

1) 24    2) 11    3) 44    4) 22


జవాబు: 4

గమనిక: 5 నుంచి 6, 6 నుంచి 7 గంటల సమయంలో కేవలం ఒకసారి మాత్రమే వ్యతిరేకదిశలో ఉంటాయి. 

 

ముళ్లు లంబంగా ఉండటం 

  ముళ్లు లంబంగా ఉండటం లేదా ముళ్ల మధ్యకోణం 90o ఉండటం రెండూ ఒక్కటే. 

 గడియారంలోని రెండు ముళ్ల గంట కాలంలో 2 లంబకోణాలు ఏర్పరుస్తాయి కానీ 12 గంటల కాలంలో 22 లంబకోణాలు, రోజులో 44 సార్లు మాత్రమే లంబకోణాలను ఏర్పరుస్తాయి. 

 

 గడియారంలోని రెండు ముళ్లు 12 గంటల కాలంలో ఎన్ని లంబకోణాలను ఏర్పరుస్తాయి?

1) 11    2) 22    3) 44    4) 33

జవాబు: 2 

 

గమనిక: 2 నుంచి 3, 3 నుంచి 4 గంటల మధ్య మూడు సార్లు, 8 నుంచి 9, 9 నుంచి 10 గంటల మధ్య మూడు సార్లు మాత్రమే లంబకోణాలను ఏర్పరుస్తాయి. 

 రెండు ముళ్లు ఏకీభవించినప్పుడు వాటి మధ్య సున్నా నిమిషాల అవధి ఉంటుంది. 

 రెండు ముళ్లు వ్యతిరేక దిశలో ఉన్నపుప్పడు వాటి మధ్య 30 నిమిషాల అవధి ఉంటుంది. 

 రెండు ముళ్లు లంబంగా ఉన్నప్పుడు వాటి మధ్య 15 నిమిషాల అవధి ఉంటుంది.

గడియారం అంశంలో వచ్చే ముఖ్యమైన సూత్రం 

M = నిమిషాలు, H = ప్రారంభ గంట,  = ముల్లుల మధ్యకోణం 

 ప్రారంభ గంట 12గా ఉన్నప్పుడు H = 0 గా తీసుకోవాలి.

 

* గడియారంలోని గంటల ముల్లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంతకోణంలో తిరుగుతుంది? 

1) 150o    2) 130o    3) 160o    4) 180o 

జవాబు: 4 

సాధన: 

 

* గడియారంలోని గంటల ముల్లు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 : 10 గంటల వరకు ఎంతకోణంలో తిరుగుతుంది? 

1) 155o     2) 160   3) 175o   4) 135o

జవాబు: 1

సాధన: 

 

* ఆగిపోయిన గడియారం రోజులో ఎన్నిసార్లు సరైన సమయాన్ని సూచిస్తుంది? 

1) 1    2) 3    3) 2    4) సూచించదు

జవాబు: 3  

 

రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  రక్త సంబంధాలు

 అనలిటికల్ పజిల్స్

‣ మిస్సింగ్ నంబర్స్

 

‣ ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 21-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌