• facebook
  • whatsapp
  • telegram

జాతీయ మహిళా కమిషన్‌

    సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైంది. అలాంటి మహిళలను అన్ని రంగాల్లో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉంది. వీరి ప్రాధాన్యాన్ని గుర్తించి భారత రాజ్యాంగం మహిళల రక్షణ, సంక్షేమానికి అనేక చట్టాలను రూపొందించింది. భారత ప్రభుత్వం వీటన్నింటినీ సమీక్షించి మహిళల ప్రగతికి కృషి చేయడానికి జాతీయ మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

జాతీయ మహిళా కమిషన్‌ ఏర్పాటు
 మహిళల శ్రేయస్సే లక్ష్యంగా 1990లో భారత పార్లమెంటు ‘జాతీయ మహిళా కమిషన్‌’ చట్టాన్ని ఆమోదించింది. దీనికి 1990, ఆగస్టు 30న రాష్ట్రపతి ఆమోదం లభించగా; 1992, జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది చట్టబద్ధమైన సంస్థ.

నిర్మాణం, నియామకం, కాల పరిమితి
జాతీయ మహిళా కమిషన్‌లో ఒక అధ్యక్షురాలు, అయిదుగురు సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు. వీరందరినీ కేంద్ర కేబినెట్‌ సిఫార్సులపై రాష్ట్రపతి నియమిస్తారు. సభ్యుల్లో ఎస్సీ, ఎస్టీల నుంచి ఒక్కొక్కరిని తప్పనిసరిగా నియమించాలి. వీరి పదవీకాలం 3 సంవత్సరాలు.
ప్రముఖ సంఘసంస్కర్త దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ కృషితో 1953లో మహిళా సంక్షేమం కోసం కేంద్ర సాంఘిక సంక్షేమ మండలిని ఏర్పాటుచేశారు.

* 1985లో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖలో మహిళలు, బాలల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఈ విభాగం 2006లో మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖగా మారింది.

సుప్రీంకోర్టు తీర్పులు
దిల్లీ డొమెస్టిక్‌ వర్కింగ్‌ వుమెన్స్‌ ఫోరమ్‌ Vs ( యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1995)
అత్యాచారం కేసుల్లో విచారణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. లైంగిక వేధింపుల ఫిర్యాదుదారులకు ఉచిత న్యాయ సహాయం అందించాలని, అత్యాచారం కేసుల్లో బాధితురాలి పేరు బయటకు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నేర నిర్ధారణ జరిగిన తర్వాత బాధితురాలికి ఆర్టికల్‌ 21 ప్రకారం తగిన పరిహారం చెల్లించాలని ఈ కేసులో తీర్పు ఇచ్చింది.

విశాఖ స్వచ్ఛంద సంస్థ జు( స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌  కేసు (1997)
ఈ కేసులో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించడానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వెలువరించింది.
* ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వేతర సంస్థల యజమానులు పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకుని వాటికి బాధ్యత వహించాలి.
* లైంగిక వేధింపులు అంటే శరీరాన్ని తాకడం, లైంగికపరమైన అవసరం తీర్చమని కోరడం, లైంగికపరమైన అర్థం వచ్చే మాటలు మాట్లాడడం, అసభ్యకర చిత్రాలను చూపడం.
* బాధితులకు తమను వేరేచోటికి బదిలీచేయమని అడిగే హక్కు లేదా నేరానికి పాల్పడిన వ్యక్తిని బదిలీ చేయమని కోరే హక్కు ఉండాలి.

నిర్భయ చట్టం, 2013
న్యూదిల్లీలోని ఒక పారా మెడికల్‌ విద్యార్థినిపై 2012, డిసెంబరు 16న జరిగిన దారుణ సంఘటన కారణంగా మహిళలపై హింసను అరికట్టి, ప్రస్తుత చట్టాలను సమీక్షించి మార్పులను సూచించడానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ వర్మ అధ్యక్షతన కేంద్రప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఈ కమిషన్‌ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం 2013, ఫిబ్రవరి 3న మహిళల రక్షణ కోసం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. దీన్ని ‘నేరన్యాయ సవరణ చట్టం’గా పార్లమెంటు ఆమోదించింది. ఇదే  నిర్భయ చట్టం.మహిళల సంరక్షణకు కీలక చట్టాలు
*  హిందూ వివాహ చట్టం, 1955
* హిందూ వారసత్వ చట్టం, 1956
* స్త్రీలు, బాలికల అక్రమ వ్యాపార నిరోధక చట్టం, 1956
* మహిళల ప్రసూతి సౌకర్యాల చట్టం, 1961
* వరకట్న నిషేధ చట్టం, 1961
* గర్భవిచ్ఛిత్తి చట్టం, 1971
* కుటుంబ కోర్టుల చట్టం, 1984
* సతీసహగమన నిరోధక చట్టం, 1987
* మహిళా సమృద్ధి యోజన, 1993
* గృహహింస నిరోధక చట్టం, 2005
* బాల్య వివాహాల నిషేధ చట్టం, 2006
* లైంగిక నేరాల నిరోధక చట్టం, 2010
* బాలలపై లైంగిక దాడుల నియంత్రణ చట్టం, 2012
* నేరన్యాయ సవరణ చట్టం, 2013

అధికారాలు - విధులు
* మహిళల రక్షణ కోసం అమల్లో ఉన్న చట్టాలను సమీక్షించి అవసరమైతే వాటికి సవరణలు సూచించడం.
* రాజ్యాంగం, చట్టపరంగా మహిళలకు కల్పించిన రక్షణల అమలును పర్యవేక్షించడం.
* అన్యాయానికి గురైన మహిళలకు భరోసా కల్పించి, వారికి చట్టపరంగా పరిహారాన్ని అందేలా కృషిచేయడం.
* కేంద్ర, రాష్ట్ర స్థాయిలో మహిళల ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడం.
* ‘పరివారక్‌ మహిళా అదాలత్‌’ల ద్వారా కుటుంబానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడం.
* వరకట్న నిషేధ చట్టం (1961), గృహ హింస  నిరోధక చట్టం (2005) అమలుకు కృషిచేయడం.
* మహిళా సాధికారత సాధనకు; బాల్య వివాహాలు, మహిళల అక్రమ రవాణా నియంత్రణకు కృషిచేయడం.
* దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి అవసరమైన సిఫార్సులు చేయడం.
* మహిళల సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో కొన్ని కేసులను సుమోటోగా స్వీకరించడం; ఈ కమిషన్‌ సివిల్‌కోర్టుతో సమానమైన అధికారాలు, విధులను కలిగి ఉంటుంది.
* మహిళలకు సంబంధించిన అంశాలపై సాక్షులను విచారించడానికి కమిషన్‌ ముందు హాజరు కావాలని సమన్లు జారీచేయడం.
* వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పించడం.

ఇతర కీలకాంశాలు
 జాతీయ మహిళా కమిషన్‌ నిర్వహించే ప్రాంతీయ సమావేశాలకు ‘వాయిస్‌ ఆఫ్‌ ది వాయిస్‌లెస్‌’ అని పేరు పెట్టారు.
 మనదేశంలో 2013 నుంచి ఏటా జనవరి 24న దేశవ్యాప్తంగా జాతీయ బాలికా, శిశు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
 కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత జాతీయ విధానాన్ని 2001లో రూపొందించింది.
 నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ వుమెన్‌ - హెల్ప్‌లైన్‌ టోల్‌ ఫ్రీ నంబరు: 011 - 13237166
 వుమెన్‌ హెల్ప్‌లైన్‌ టోల్‌ఫ్రీ నంబరు: 1091
 యాంటీ గర్ల్‌ ఛైల్డ్‌ మ్యారేజెస్‌: 1800 4252908

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జాతీయ షెడ్యూల్డు కులాల, తెగల కమిషన్‌

1950, నవంబరు 18న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఎస్సీ, ఎస్టీ కమిషనర్‌ను నియమించారు. 
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 338 ప్రకారం షెడ్యూల్డు కులాలు, తెగలకు కల్పించిన రక్షణలు, ప్రయోజనాలను పరిరక్షించే లక్ష్యంతో మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా 1978లో ఎస్సీ, ఎస్టీ కమిషనర్‌ స్థానంలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల కమిషన్‌ను ఏర్పాటుచేసింది. దీని మొదటి ఛైర్మన్‌ బోళ పాశ్వాన్‌ శాస్త్రి.
1987లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల కమిషన్‌ను ‘నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డు క్యాస్ట్స్‌ అండ్‌ షెడ్యూల్డు ట్రైబ్స్‌’గా రూపొందించింది. 

రాజ్యాంగ భద్రత
విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం 65వ రాజ్యాంగ సవరణ చట్టం - 1990 ద్వారా ‘నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డు క్యాస్ట్స్‌ అండ్‌ షెడ్యూల్డు ట్రైబ్స్‌’కు రాజ్యాంగ భద్రత కల్పించింది. ఇది 1992, మార్చి 12 నుంచి అమల్లోకి వచ్చింది. 

జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజన
అటల్‌బిహారి వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 89వ రాజ్యాంగ సవరణ చట్టం, 2004 ద్వారా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రెండుగా విభజించింది. 
1) ఆర్టికల్‌ 338 ప్రకారం - నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డు క్యాస్ట్స్‌  
2) ఆర్టికల్‌ 338్బత్శి ప్రకారం - నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డు ట్రైబ్స్‌  

జాతీయ ఎస్సీ కమిషన్‌ - రాజ్యాంగ వివరణ
ఆర్టికల్‌ 338(1): షెడ్యూల్డు కులాల ప్రయోజనాల సంరక్షణకు జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్‌ ఏర్పాటు.

ఆర్టికల్‌ 338(2): పార్లమెంటు రూపొందించిన చట్టంలోని నియమ నిబంధనలను అనుసరించి జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఒక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరి సర్వీసు నిబంధనలు, పదవీకాలం రాష్ట్రపతి నిర్ణయించిన నియమాల ప్రకారం ఉంటాయి. వీరి పదవీకాలం 3 సంవత్సరాలు.

ఆర్టికల్‌ 338(3): జాతీయ ఎస్సీ కమిషన్‌ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సభ్యులను రాష్ట్రపతి స్వయంగా సంతకం చేసిన అధికార పత్రం ద్వారా నియమిస్తారు. మొత్తం సభ్యుల్లో ఒక మహిళ తప్పనిసరిగా ఉండాలి.


ఆర్టికల్‌ 338(4): జాతీయ ఎస్సీ కమిషన్‌ స్వతంత్ర సంస్థగా పనిచేస్తూ తన పని విధానాన్ని తానే నియంత్రించుకుంటుంది. 

ఆర్టికల్‌ 338(5): జాతీయ ఎస్సీ కమిషన్‌ అధికార, విధులను తెలియజేస్తుంది.

ఛైర్మన్, సభ్యుల సౌకర్యాలు, జీతభత్యాలు
జాతీయ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ కేంద్ర కేబినెట్‌ మంత్రి హోదాతో సమానమైన హోదాను కలిగి ఉంటారు. డిప్యూటీ ఛైర్మన్‌ కేంద్ర సహాయమంత్రితో సమానమైన, సభ్యులు భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాతో సమానమైన సౌకర్యాలు, జీతభత్యాలను పొందుతారు. పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ్యులు జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, సభ్యులుగా నియమితులైతే వారికి ఎలాంటి జీతభత్యాలు ఉండవు.

పని విధానం
జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్‌ ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. ఈ కమిషన్‌ అధీన కార్యాలయాలను వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. ప్రధాన కార్యాలయంలో 4 విభాగాలున్నాయి. 
1) పాలనా సమన్వయ విభాగం: ఇది జాతీయ ఎస్సీ కమిషన్‌ చేపట్టే వివిధ కార్యక్రమాలను సమన్వయపరుస్తుంది.

2) సేవా పరిరక్షణ విభాగం:  ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఎస్సీ వర్గాలకు సమకూర్చిన సౌకర్యాల అమలును పర్యవేక్షిస్తుంది.
3) పౌరహక్కుల పరిరక్షణ విభాగం: ఇది పౌరహక్కుల పరిరక్షణ, కనీస వేతనాల అమలు, వెట్టిచాకిరీ నిషేధం లాంటి చట్టాల అమలుతీరును పర్యవేక్షిస్తుంది.
4) సామాజిక, ఆర్థిక అభివృద్ధి విభాగం: ఇది షెడ్యూల్డు కులాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తుంది.

* షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్‌ ‘అనుసూచిత్‌ జాతివాణి’ పేరుతో ప్రతి మూడు నెలలకోసారి 
‘ఈ - మ్యాగజీన్‌’ను విడుదల చేస్తుంది.

అధికారాలు - విధులు
* షెడ్యూల్డు కులాల రక్షణ, హక్కులకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి విచారించడం. 
* షెడ్యూల్డు కులాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే ప్రణాళికల రూపకల్పనలో తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం; వారి అభివృద్ధి పురోగతిని సమీక్షించడం.
* ఎస్సీలకు రాజ్యాంగ పరంగా, చట్టపరంగా కల్పించిన ప్రత్యేక హక్కులకు సంబంధించిన అంశాలన్నింటినీ విచారించడం, పర్యవేక్షించడం, మూల్యాంకనం చేయడం.
షెడ్యూల్డు కులాలకు కల్పించే పరిరక్షణల అమలు గురించి రాష్ట్రపతికి వార్షిక నివేదికను సమర్పించడం. 
* ఏ ప్రభుత్వ అధికారినైనా కమిషన్‌ ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని, అఫిడవిట్‌ను సమర్పించాలని కోరడం. 
* వివిధ న్యాయస్థానాలు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి అవసరమైన పబ్లిక్‌ రికార్డులు, ఇతర నకళ్లను పొందడం.
* పౌరహక్కుల పరిరక్షణ చట్టం - 1976; షెడ్యూల్డు కులాల, తెగల అకృత్యాల నిరోధక చట్టం - 1989 అమలుకు కృషి చేయడం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గాల సంక్షేమం కోసం తీసుకునే చర్యల అమలుకు కృషి.
* రాష్ట్రపతి నిర్ణయించిన మేరకు షెడ్యూల్డు కులాల రక్షణ, సంక్షేమం, ప్రగతి కోసం ఇతర విధులను నిర్వహించడం.
* సివిల్‌కోర్టుకు సమానమైన అధికారాలను కలిగి ఉంటుంది.
* జాతీయ ఎస్సీ కమిషన్‌ తన నివేదికలను రాష్ట్రపతికి సమర్పించగా, రాష్ట్రపతి వాటిని పార్లమెంటుకు అందజేస్తారు. 
* జాతీయ ఎస్సీ కమిషన్‌ సమర్పించిన నివేదికలోని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి ఉంటే ఆ ప్రతిని రాష్ట్రపతి గవర్నర్‌కు పంపిస్తారు. గవర్నర్‌ వాటిని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడతారు.

Posted Date : 26-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

న్యాయ వ్యవస్థ 

1. భారత రాజ్యాంగానికి సంరక్షకులు?

1) పార్లమెంటు        2) సుప్రీంకోర్టు         3) రాష్ట్రపతి         4) అటార్నీ జనరల్‌


2.    భారత్‌లో న్యాయ వ్యవస్థను అభివృద్ధిపరిచి ‘న్యాయవ్యవస్థకు పితామహుడి’గా పేరొందినవారు? 

1) కారన్‌వాలీస్‌              2) వారన్‌ హేస్టింగ్స్‌ 
3) నానీ పాల్కీవాలా           4) డాక్టర్‌. బి.ఆర్‌. అంబేడ్కర్‌


3. మన దేశంలో 1774లో తొలి సుప్రీంకోర్టును ఏ చట్టం ప్రకారం కలకత్తాలో ఏర్పాటుచేశారు?

1) 1793 చార్టర్‌ చట్టం         2) 1773 రెగ్యులేటింగ్‌ చట్టం 
3) 1784 పిట్స్‌ ఇండియా చట్టం     4) 1858 భారత ప్రభుత్వ చట్టం


4.కలకత్తాలో ఏర్పాటైన సుప్రీంకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి?

1) సర్‌జాన్‌ హైడ్‌     2) రాబర్ట్‌ చాంబర్స్‌     3) సీజర్‌ లైమెస్టర్‌       4) సర్‌ ఎలిజాఇంఫే


5. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కలకత్తాలో ఉన్న  సుప్రీంకోర్టును ‘ఫెడరల్‌ కోర్టు’గా మార్పు చేసి ఎక్కడ ఏర్పాటుచేశారు?

1) ముజీరాబాద్‌     2) న్యూఢిల్లీ     3) ముంబయి    4్) చెన్నై


6. న్యూఢిల్లీ కేంద్రంగా ప్రస్తుత సుప్రీంకోర్టు ఎప్పటి నుంచి పనిచేస్తుంది?

1) 1950, జనవరి 28           2) 1951, జనవరి 28 
3) 1952, జనవరి 28         4) 1954, జనవరి 28


7. మన దేశంలో సుప్రీంకోర్టును రాజ్యాంగ నిర్మాతలు ఏ ఉద్దేశంతో ఏర్పాటుచేశారు?

1) రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు     2) రాజ్యాంగానికి అర్థవివరణ ఇచ్చేందుకు
3) రాజ్యాంగ ఆధిక్యతను కాపాడేందుకు    4) అన్నీ


8. భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో సుప్రీంకోర్టు గురించి పేర్కొన్నారు?

1) Vవ భాగం - ఆర్టికల్‌ 124 - 147     2) VIవ భాగం - ఆర్టికల్‌ 134 - 149 
3) VIIవ భాగం - ఆర్టికల్‌ 232 - 239   4) IXవ భాగం - ఆర్టికల్‌ 243 - 254 


9. న్యాయవ్యవస్థకు సంబంధించి ‘కొలీజియం’ అంటే? 

1) రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఉన్న 5 మంది న్యాయమూర్తుల మండలి
2) అటార్నీ జనరల్‌తో కూడిన 5 మంది న్యాయమూర్తుల మండలి
3) భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన 5 మంది న్యాయమూర్తుల మండలి
4) ప్రధానమంత్రితో కూడిన 5 మంది న్యాయమూర్తుల మండలి


10. ‘కొలీజియం’ వ్యవస్థ ప్రధాన విధి/సిఫారసు?

1) న్యాయమూర్తుల నియామకం           2) న్యాయమూర్తుల బదిలీలు 
3) న్యాయమూర్తులపై క్రమశిక్షణా చర్యలు     4) అన్నీ


11. కిందివాటిలో సరికానిది?

1) సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి - హరిలాల్‌ జె. కానియా
2) సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి - రంజన్‌ గొగోయ్‌
3) సుప్రీంకోర్టు మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి - కె.జి. బాలకృష్ణన్‌
4) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేసినవారు - ఎస్‌.ఎం. సిక్రీ


12. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను పార్లమెంటు ఎంత మెజార్టీతో తొలగించగలదు?

1) 1/3వ వంతు   2) 2/3వ వంతు     3) 1/2వ వంతు      4) 1/4వ వంతు        


13. ఆర్టికల్‌ 125 ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాలను ఎవరు నిర్ణయిస్తారు?

1) సుప్రీంకోర్టు      2) రాష్ట్రపతి       3) కొలీజియం     4) పార్లమెంటు


14. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు?

1) 60 సంవత్సరాలు         2) 62 సంవత్సరాలు      
3) 65 సంవత్సరాలు        4) 66 సంవత్సరాలు


15. సుప్రీంకోర్టులో నియమితులయ్యే తాత్కాలిక న్యాయమూర్తుల పదవీకాలం?

1) ఒక సంవత్సరం      2) రెండేళ్లు        3) మూడేళ్లు         4) అయిదేళ్లు


16.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే శాసనాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవని న్యాయవ్యవస్థ తీర్పు ఇవ్వడాన్ని ఏమంటారు? 

1) న్యాయ సమీక్ష       2) కొలీజియం        3) పునః సమీక్ష         4) రెమిషన్‌


17. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తే వివాదాలను సుప్రీంకోర్టు ఏ అధికారాల్లో భాగంగా విచారిస్తుంది?

1) ఒరిజినల్‌/ ప్రారంభ విచారణాధికారాలు     2) అప్పీళ్ల విచారణాధికారాలు 
3) ప్రత్యేక అధికారాలు         4) సలహారూపక అధికారాలు


18. సుప్రీంకోర్టు ‘కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌’ గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ వివరిస్తుంది?

1) ఆర్టికల్‌ 126        2) ఆర్టికల్‌ 127         3) ఆర్టికల్‌ 128         4) ఆర్టికల్‌ 129


19. ‘కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌’ అంటే? 

1) సుప్రీంకోర్టు ఏర్పాటుకు సంబంధించిన రికార్డులు
2) సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను రికార్డుల రూపంలో భద్రపరచడం
3) సుప్రీంకోర్టు కంటే ముందు ఉన్న ఫెడరల్‌ కోర్టు రికార్డులు 
4) సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన వివిధ కమిటీల నివేదికల రికార్డు


20. భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్‌ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయ సలహాను పొందవచ్చు?

1) ఆర్టికల్‌ 143       2) ఆర్టికల్‌ 144       3) ఆర్టికల్‌ 145       4) ఆర్టికల్‌ 146


21. మన రాజ్యాంగ నిర్మాతలు ‘న్యాయ సమీక్ష’ అధికారాన్ని ఏ దేశం నుంచి గ్రహించారు?

1) బ్రిటన్‌        2) జర్మనీ         3) అమెరికా         4) జపాన్‌


22. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి?

1) ఫాతిమా బీబీ        2) గిరిజా మిశ్రా       3) అమరేశ్వరి    4)  రీతూ మీనన్‌


23. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే భావనను తొలిసారిగా ఏ దేశ న్యాయ వ్యవస్థలో ప్రవేశపెట్టారు?

1) భారత్‌      2) బ్రిటన్‌        3) అమెరికా       4) ఫ్రాన్స్‌


24. మన దేశంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాలను అంగీకరించిన తొలి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు?


1) ఎస్‌.హెచ్‌. కపాడియా, పి.ఎన్‌. భగవతి     2) పి.ఎన్‌. భగవతి, వి.ఆర్‌. కృష్ణ అయ్యర్‌ 
3) కె.జి. బాలకృష్ణన్, వి.ఎన్‌.ఖరే     4) హెచ్‌.ఎల్‌.దత్తు, పి.ఎన్‌. భగవతి


25. ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించాలని పేర్కొంటున్న ఆర్టికల్‌?


1) ఆర్టికల్‌ 36(A)         2) ఆర్టికల్‌ 37(A)        3) ఆర్టికల్‌ 38(A)         4) ఆర్టికల్‌ 39(A)


26. సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్‌ ప్రకారం ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం 5 రకాల రిట్లు జారీ చేస్తుంది?

1) ఆర్టికల్‌ 32     2) ఆర్టికల్‌ 33     3) ఆర్టికల్‌ 34     4) ఆర్టికల్‌ 35


27.  భారత ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారు?

1) రాష్ట్రపతి         2) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 
3) అటార్నీ జనరల్‌         4) అడ్వకేట్‌ జనరల్‌


28. 1861 ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం ప్రకారం 1862లో మన దేశంలో తొలి హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు?

1) ముంబయి        2) కలకత్తా          3) మద్రాస్‌           4) న్యూఢిల్లీ


సమాధానాలు: 1-2; 2-1; 3-2; 4-4; 5-2; 6-1; 7-4; 8-1; 9-3; 10-4;  11-4;  12-2; 13-4; 14-3;  15-2;  16-1; 17-1;  18-4;  19-2; 20-1;  21-3;  22-1;  23-3; 24-2;  25-4;  26-1;  27-3;  28-2. 

Posted Date : 19-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

హైకోర్ట్ - రాష్ట్ర న్యాయ వ్యవస్థ

* భారతదేశంలో తొలి మహిళా హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీలాసేథ్ - హిమాచల్‌ప్రదేశ్.
*  హైకోర్ట్‌లో ఒక్కరోజు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసింది - బి.పి.ఝా.
*  హైకోర్ట్ తొలి న్యాయమూర్తిగా పనిచేసిన మహిళ - అన్నా చాంది (కేరళ).
*  ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తొలి ప్రధాన న్యాయమూర్తి - కోకా సుబ్బారావు.
*  ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్‌లో పనిచేసిన తొలి మహిళా జస్టిస్ న్యాయమూర్తి  - అమరేశ్వరి.
*  భారత రాజ్యాంగంలోని 214 నిబంధన ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక ఉన్నత న్యాయస్థానం ఉంటుంది. దాన్నే హైకోర్ట్ అంటారు
*  మన దేశంలో హైకోర్ట్ చట్టాన్ని 1861లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టారు. దాని ప్రకారం తొలి హైకోర్ట్‌ను 1862 జులైలో కలకత్తాలో ప్రారంభించారు. 1862, అక్టోబరు 26న బొంబాయి, మద్రాసులో హైకోర్ట్‌లను ప్రారంభించారు.
*  రాజ్యాంగంలోని VI భాగంలో ఉన్న 214 నిబంధన నుంచి 237 నిబంధన వరకు, హైకోర్ట్ నిర్మాణం, అధికారాలు, అధికార పరిధి మొదలైనవి వివరించారు.
*  పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఒక రాష్ట్రానికి లేదా రెండు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒక హైకోర్ట్‌ను ఏర్పాటు చేయవచ్చని 1956లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు. (ఆర్టికల్ 231) ఈశాన్య రాష్ట్రాలైన అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ ఈ నాలుగింటికి కలిపి గౌహతిలో ఒక హైకోర్ట్‌ను ఏర్పాటు చేశారు.
* 2013లో ఏర్పడిన మణిపూర్, మేఘాలయ, త్రిపుర హైకోర్ట్‌లతో కలిపి ప్రస్తుతం దేశంలో 24 హైకోర్ట్‌లున్నాయి. 1966లో కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీలో హైకోర్ట్‌ను ఏర్పాటు చేశారు.
* ఆంధ్ర రాష్ట్రంలో హైకోర్ట్‌ను 1953లో ఒక ప్రధాన న్యాయమూర్తి, 11 మంది ఇతర న్యాయమూర్తులతో గుంటూరులో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ప్రస్తుతం ఒక ప్రధాన న్యాయమూర్తి, 34 మంది ఇతర న్యాయమూర్తులతో హైదరాబాద్‌లో పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్ట్ 10 సంవత్సరాలు హైదరాబాద్‌లో ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం నూతన హైకోర్ట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
* రాజ్యాంగ నిబంధన 216 ప్రకారం హైకోర్ట్‌లో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులుంటారు. న్యాయమూర్తుల సంఖ్య రాష్ట్ర అవసరాలను బట్టి ఉంటుంది. ఎక్కువ మంది న్యాయమూర్తులు అలహాబాద్ హైకోర్టులో ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ (1 + 57). అతి తక్కువ మంది న్యాయమూర్తులున్న హైకోర్ట్‌లు మేఘాలయ, మణిపూర్, త్రిపుర (1 + 2).
* నిబంధన 217 ప్రకారం హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. హైకోర్ట్ న్యాయమూర్తిగా ఎంపిక కావాలంటే భారత పౌరుడై ఉండాలి, కేంద్ర, రాష్ట్ర న్యాయ సర్వీసుల్లో 10 సంవత్సరాలు న్యాయాధికారిగా, ఏదైనా హైకోర్టులో న్యాయవాదిగా కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.
* హైకోర్ట్ న్యాయమూర్తులు 62 సంవత్సరాలు వచ్చేంతవరకు పదవిలో కొనసాగవచ్చు. వయో పరిమితిని 65 సంవత్సరాలకు పెంచేందుకు ఉద్దేశించిన 114వ రాజ్యాంగ సవరణ ఆమోదం పొందలేదు.
* రాజ్యాంగం 3వ షెడ్యూల్‌లో హైకోర్ట్ న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం గురించి వివరించారు. 219 నిబంధన ప్రకారం గవర్నర్ లేదా అతడి ప్రతినిధి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.
* హైకోర్ట్ న్యాయమూర్తుల వేతనాలను నిబంధన 221 ప్రకారం పార్లమెంట్ నిర్ణయిస్తుంది. వేతనాలను రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. పింఛన్‌ను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
* రాజ్యాంగ నిబంధన 222 ప్రకారం హైకోర్ట్ న్యాయమూర్తులను ఒక కోర్ట్ నుంచి వేరొక కోర్ట్‌కు బదిలీచేయవచ్చు.
* ఏదైనా హైకోర్ట్ న్యాయమూర్తులు తాత్కాలికంగా విధులను నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నిబంధన 223 ప్రకారం తాత్కాలిక న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించవచ్చు. వీరు 65 సంవత్సరాల వయోపరిమితి నిండిన తర్వాత పదవిలో కొనసాగడానికి వీలులేదు.
* ఏదైనా హైకోర్ట్‌లో పనిభారం ఎక్కువగా ఉన్నప్పుడు నిబంధన 224 ప్రకారం రాష్ట్రపతి అదనపు తాత్కాలిక న్యాయమూర్తులను నియమించవచ్చు. వీరి పదవీ కాలం 2 సంవత్సరాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్  ప్రధాన న్యాయమూర్తి టి. బి. రాధాకృష్ణన్.
* అవినీతి, అధికార దుర్వినియోగం, అసమర్థత, ఆరోపణలున్న న్యాయమూర్తులను సుప్రీంకోర్ట్ న్యాయమూర్తుల మాదిరిగా పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా పదవి నుంచి తొలగించవచ్చు.

 

అభిశంసన ఎదుర్కొన్న హైకోర్ట్ న్యాయమూర్తులు
*
2010లో కలకత్తా హైకోర్ట్ న్యాయమూర్తి షమిత్ ముఖర్జీని పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా తొలగించారు.
* 2011, ఆగస్టు 18న రాజ్యసభ కలకత్తా హైకోర్ట్ న్యాయమూర్తి సౌమిత్ర సేన్‌పై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించింది. లోక్‌సభలో చర్చకు రాకముందే సెప్టెంబరు 1న ఆయన రాజీనామా చేశారు.
* తమిళనాడు హైకోర్ట్ న్యాయమూర్తి పి.డి. దినకరన్‌పై 2009లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆరోపణలు నిజమని కమిటీ నిర్ధారించడంతో 2011, జులై 29న ఆయన రాజీనామా చేశారు.
* 2016 - 17లో దళితుడైన సుంకు రామకృష్ణను హింసించారనే ఆరోపణతో ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తి సి.వి. నాగార్జున రెడ్డిపై అభిశంసనకు ప్రయత్నించి విరమించుకున్నారు.
* సుప్రీంకోర్ట్ సమన్లు ధిక్కరించినందుకు కలకత్తా హైకోర్ట్ న్యాయమూర్తి సి.ఎస్. కర్ణన్‌పై నిషేధాన్ని విధించారు.

 

ఇతర అంశాలు
* సుప్రీంకోర్ట్ న్యాయమూర్తుల మాదిరిగా హైకోర్ట్ న్యాయమూర్తులు కూడా స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి కొన్ని రక్షణలను కల్పించారు. అభిశంసన తీర్మాన చర్చ సమయంలో తప్ప వీరి ప్రవర్తనపై చర్చించకూడదు. పదవీ విరమణ తర్వాత సుప్రీంకోర్ట్‌లో, పనిచేసిన హైకోర్ట్‌లో కాకుండా ఇతర హైకోర్ట్‌లలో వాదించవచ్చు.
* పదవీకాలంలో జీతభత్యాలు తగ్గించకూడదు.
* హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని నియమించేటప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని, ఆ రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదిస్తారు. ఇతర న్యాయమూర్తుల నియామక సమయంలో హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తారు.
* ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.2,50,000 ఇతర న్యాయమూర్తులకు రూ.2,25,000 చెల్లిస్తారు.

 

అధికారాలు - విధులు
* ప్రాథమిక హక్కులకు సంబంధించిన అన్ని వివాదాలు హైకోర్ట్ పరిధిలోకి వస్తాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల వివాదాలు, హిందూ వివాహం, విడాకులు, ఆస్తికి సంబంధించిన వివాదాలు కూడా హైకోర్ట్ పరిధిలోకి వస్తాయి.
* జిల్లా న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులపై వచ్చిన అప్పీళ్లను హైకోర్ట్ విచారిస్తుంది. సివిల్ వివాదాల్లో ఆస్తి విలువ ఎక్కువ ఉంటే హైకోర్ట్‌కు అప్పీలు చేసుకోవచ్చు.
* దిగువ స్థాయి కోర్ట్ ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా జిల్లా కోర్ట్ తీర్పు ఇచ్చినప్పుడు, హైకోర్ట్‌లో రెండో అప్పీలు చేసుకోవచ్చు. రెండో అప్పీలు విషయంలో కేవలం చట్టానికి సంబంధించిన అంశాలనే పరిశీలిస్తారు.
* క్రిమినల్ కేసుల విషయంలో (7 సంవత్సరాలకు మించి శిక్ష పడినట్లయితే) సెషన్స్ కోర్ట్ తీర్పుపై హైకోర్ట్‌కు అప్పీలు చేసుకోవచ్చు.
* ట్రైబ్యునల్ తీర్పు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిందని భావించినప్పుడు హైకోర్ట్‌లో అప్పీలు చేసుకోవచ్చు. హైకోర్ట్‌కు ట్రైబ్యునల్‌పై సాధారణ నియంత్రణ కూడా ఉంటుంది.
* దిగువ స్థాయి న్యాయస్థానాల నిర్వహణ, తీరుతెన్నులపై హైకోర్ట్‌కు అజమాయిషీ ఉంటుంది. కింది కోర్ట్‌ల నిర్వహణకు అవసరమైన నియమ నిబంధనలను హైకోర్ట్ రూపొందించవచ్చు.
* హైకోర్ట్ ప్రత్యేక ఉత్తర్వులతో కింది న్యాయస్థానాల్లోని వివాదాలను ఒక కోర్టు నుంచి ఇంకొక కోర్టుకు బదిలీచేయవచ్చు లేదా స్వయంగా విచారణకు స్వీకరించవచ్చు.
* పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణకు, సాధారణ హక్కుల రక్షణకు నిబంధన 226 ప్రకారం ప్రత్యేక రిట్‌లను జారీచేయవచ్చు.
 

లోక్ అదాలత్ (ప్రజా న్యాయస్థానం)
     కొన్ని కారణాల వల్ల న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారంలో జాప్యం జరుగుతుండటంతో సత్వర పరిష్కారానికి, శాశ్వత ప్రాతిపదికన లోక్ అదాలత్‌లకు వీలుకల్పించే లీగల్ సర్వీసెస్ ఆర్బిట్రేషన్ చట్టాన్ని 2002లో రూపొందించారు. సులభంగా పరిష్కరించదగిన కొన్ని రకాల కేసులను పెద్ద మనుషుల మధ్యవర్తిత్వంతో పరిష్కరించడానికి చట్టబద్ధమైన ప్రతిపత్తిని కల్పిస్తూ 'లోక్ అదాలత్' పేరుతో ప్రజా న్యాయస్థానాల వ్యవస్థను ఏర్పాటుచేశారు.
* ఈ వ్యవస్థ పేదలకు ఉచితంగా న్యాయం అందించడానికి కూడా కృషిచేస్తుంది. మన రాష్ట్రంలో సుమారు 70 లోక్ అదాలత్‌లు పనిచేస్తున్నాయి.
* సాధారణ న్యాయస్థానాల్లో పనిచేస్తున్న న్యాయ మూర్తులు లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు. ప్రజలకు సత్వరమే, సంతృప్తికరమైన న్యాయాన్ని అందించడమే వీటి ముఖ్య ఉద్దేశం.
* మోటారు వాహనాల వివాదాలు, ఇన్సూరెన్స్ క్లైమ్‌లు మొదలైన విషయాల్లో లోక్ అదాలత్ తీర్పుతో సంతృప్తి చెందనివారు సాధారణ న్యాయస్థానాలకు వెళ్లవచ్చు.
* వినియోగదారుల ఫోరాలు 1986లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని చేశాయి. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఈ ఫోరంలను ఏర్పాటు చేశారు.
* ఇవి మూడు స్థాయుల్లో పనిచేస్తాయి. 20 లక్షల రూపాయల విలువ ఉన్న కేసులు జిల్లా స్థాయిలో జిల్లా ఫోరంల పరిధిలోకి వస్తాయి. 20 లక్షలు దాటిన, కోటి రూపాయల్లోపు రాష్ట్ర ఫోరంల పరిధిలోకి వస్తాయి. కోటి రూపాయల విలువ దాటిన కేసులను జాతీయ స్థాయుల్లో ఉన్న ఫోరాలు పరిష్కరిస్తాయి.
* వినియోగదారులు రూ.100 ఫీజు చెల్లించి ఫిర్యాదు చేయవచ్చు. సాధారణ న్యాయస్థానాల మాదిరిగా న్యాయ ప్రక్రియలు ఉంటాయి.
* 1987లో కుటుంబంలో ఏర్పడిన వివాదాల పరిష్కారానికి దేశంలోనే తొలిసారిగా అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుటుంబ కోర్టులను ఏర్పాటు చేశారు. 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగం - ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, స్త్రీలు

వర్గాల వివరణ
షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ జాతులు (ఎస్టీ): రాజ్యాంగం ప్రజలను వీరు ఈ కులానికి, ఈ తెగకు చెందినవారని ఎక్కడా పేర్కొనలేదు. ఈ విషయంలో ఆ అధికారాన్ని రాష్ట్రపతికి విడిచిపెట్టింది. ప్రతి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఏ కులం లేదా ఏ తెగను ఎస్సీ లేదా ఎస్టీగా పరిగణించాలనే అంశాన్ని రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ప్రకరణం 341 ప్రకారం రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించి షెడ్యూల్డ్ కులాలను, ప్రకరణం 342 ప్రకారం షెడ్యూల్డ్ తెగలను నిర్ణయిస్తారు. ఎస్సీ, ఎస్టీల జాబితా అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకే విధంగా ఉండదు. రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించి నోటిఫికేషన్ విడుదల చేసినా, ఆ నోటిఫికేషన్ నుంచి ఏదైనా కులాన్ని లేదా తెగను తొలగించాలన్నా, లేదా పొందుపరచాలన్నా పార్లమెంటు ఆమోదం అవసరం. రాష్ట్రపతి తదుపరి నోటిఫికేషన్ ద్వారా ఈ మార్పులను చేయలేరు.

వెనుకబడిన తరగతులు (బీసీ): రాజ్యాంగం ప్రత్యేకించి వీరు వెనుకబడిన తరగతులకు చెందినవారని పేర్కొనలేదు. అదేవిధంగా వారికి ఒకే సారూప్య విశేష లక్షణాలను కూడా ఆపాదించలేదు. బీసీలు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఎస్సీలు, ఎస్టీలు కాకుండా మిగిలిన వెనుకబడిన తరగతులకు చెందిన పౌరులుగా పేర్కొంది. ఈ సందర్భంలో ఎస్సీలు, ఎస్టీలు కూడా వెనుకబడిన తరగతులే. కాబట్టి బీసీలను ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ)గా పరిగణించవచ్చు.

మైనారిటీలు (అల్పసంఖ్యాక వర్గాలు): రాజ్యాంగంలో 'మైనారిటీ' అనే పదాన్ని ప్రకరణం 29 లో ప్రస్తావించినప్పటికీ, దానికి ప్రత్యేకమైన నిర్వచనం లేదు. సాధారణంగా దేశ జన సంఖ్యలో తక్కువ శాతంలో ఉండే వర్గాలను మైనారిటీలు అంటారు. వీరిని రెండు రకాలుగా వర్గీకరించారు.


ఎ. మతపరమైన అల్ప సంఖ్యాక వర్గాలు:
జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం 1992 ప్రకారం ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్శీలు (జొరాస్టియన్లు) అనే ఐదు వర్గాలను జాతీయ స్థాయిలో మతపరమైన అల్ప సంఖ్యాకవర్గాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2014 లో జైనులకు కూడా మతపరమైన మైనారిటీ హోదాను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది.


బి. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలు:
రాష్ట్రవ్యాప్తంగా లేదా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లోని అధిక సంఖ్యాకులు మాట్లాడే భాషకు భిన్నమైన భాషను మాతృభాషగా కలిగిన అల్పసంఖ్యాక వర్గాన్ని 'భాషాపరమైన మైనారిటీ'లుగా పరిగణిస్తారు. ఈ రకమైన మైనారిటీని రాష్ట్ర స్థాయిలోనే గుర్తిస్తారు. ఇది రాష్ట్రాన్ని బట్టి మారుతుంది.

రాజ్యాంగ నిబంధనలు
 

1. ఎస్సీ, ఎస్టీలు:
రాజ్యాంగ నింబంధన 15(1) - పౌరుల విషయంలో జాతి మత, కుల, లింగ, జన్మస్థల పరంగా వివక్ష చూపకూడదు.
15(2) - ప్రజా ఉపయోగ ప్రదేశాల్లో అందరికీ సమాన ప్రవేశం కల్పించాలి.
15(4) - ఈ వర్గాలకు సామాజిక, విద్యారంగంలో ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు. (మొదటి రాజ్యాంగ సవరణ చట్టం -1951).
15(5) - ప్రైయివేటు విద్యాసంస్థలతో సహా అన్ని విద్యాసంస్థల్లో వీరి ప్రవేశానికి ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేయవచ్చు (93 వ రాజ్యాంగ సవరణ చట్టం - 2005).
16(1) - ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల, మత, లింగ వివక్ష చూపకూడదు.
16(4) - ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ వర్గాలకు ప్రత్యేక మినహాయింపులు.
16(4A) - ప్రభుత్వ ఉద్యోగ పదోన్నతుల్లో ప్రత్యేక రిజర్వేషన్లు (77 వ రాజ్యాంగ సవరణ చట్టం 1995)
16(4B) - ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ కోటా భర్తీ కాకపోతే మిగిలినవాటిని తర్వాతి సంవత్సరం రిజర్వేషన్ కోటాలో కలుపుతారు. తద్వారా రిజర్వేషన్లు 50% మించినా చెల్లుబాటవుతాయి. (81 వ రాజ్యాంగసవరణ చట్టం - 2000)
17 - అంటరానితనం నిషేధం
19(1)(e) - ప్రతి పౌరుడికి తనకు నచ్చిన ప్రదేశంలో నివాసం
19(1) (g) - ప్రతి పౌరుడూ తనకు నచ్చిన వృత్తిని ఎంపిక చేసుకోవచ్చు
23 - మనుషుల క్రయవిక్రయాలు, బలవంతపు వెట్టిచాకిరి నిషేధం
25(2) (b) - హిందూ దేవాలయాల్లోకి అన్ని వర్గాలకు ప్రవేశం
29(2) - ప్రభుత్వ విద్యాలయాల్లో కుల, మత, భాషా వివక్ష చూపకూడదు.
46 - ఆర్థికంగా, విద్యాపరంగా షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి శ్రద్ధ చూపాలి.
164 - ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి.
243(D) - పంచాయతీ వ్యవస్థలో రిజర్వేషన్లు (73 వ రాజ్యాంగ సవరణ చట్టం1992)
243 (T) - మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు (74 వ రాజ్యాంగ సవరణ చట్టం 1992)
275 (1) - వీరి సంక్షేమం కోసం కేంద్రం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయ నిధులను కేటాయించవచ్చు.
244 - 5 వ షెడ్యూల్‌లో ప్రస్తావించిన షెడ్యూల్డ్ ప్రాంతాలకు ప్రత్యేక హక్కులు.
244(2) - అసోంలోని గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక హక్కులు, జిల్లా కౌన్సిల్‌లను ఏర్పాటు చేయడం.
330 - లోక్‌సభలో ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు.
332 - విధానసభలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు.
334 - ఈ నిబంధనను అనుసరించి ఎస్సీ, ఎస్టీలకు లోక్‌సభ, విధానసభల్లో రిజర్వేషన్లను జనవరి 26, 2020 వరకు పొడిగించారు (మరొక పది సంవత్సరాలు) (95 వ రాజ్యాంగ సవరణ చట్టం - 2009).
335 - ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, ప్రమోషన్లలోనూ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అర్హత మార్కులను ప్రభుత్వం తగ్గించవచ్చు
338 - ఎస్సీల స్థితిగతుల అధ్యయనానికి జాతీయ కమిషన్
338 - (A) ఎస్టీల స్థితిగతుల అధ్యయనానికి జాతీయ కమిషన్
339 - ఈ వర్గాల పాలనకు సంబంధించి రాష్ట్రపతి ప్రత్యేక నివేదిక కోరవచ్చు.

 

2. ఇతర వెనుకబడిన తరగతులు

ప్రకరణలు: 15(1), 16, 16(4), 46.
 ఎస్సీ, ఎస్టీలకు వర్తించే పై ప్రకరణలు వీరికీ వర్తిస్తాయి.
 ప్రకరణ-340: సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతులను విచారించి, వారి అభివృద్ధికి అవసరమైన సూచనలు చేయడానికి ఒక జాతీయ కమిషన్‌ను రాష్ట్రపతి ఆదేశం ద్వారా ఏర్పాటు చేయవచ్చు.


గమనిక:

ఇతర వెనుకబడిన తరగతులను గుర్తించడానికి కేంద్రం 1953 లో కాకా కలేల్కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ తన నివేదికను 1955 లో సమర్పించింది.
  బి.పి. మండల్ నాయకత్వంతో రెండో బీసీ కమిషన్‌ను 1978 లో మొరార్జీదేశాయ్ (జనతా ప్రభుత్వం) ఏర్పాటు చేశారు. 1980 లో కమిషన్ నివేదికను సమర్పించింది.
  నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం (వి.పి.సింగ్) 13 ఆగస్టు 1990 న మండల్ కమిషన్ సిఫారసులను ఆమోదించింది. దీన్ని సవాలు చేస్తూ ఇందిరా సహానీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. (ఇందిరా సహానీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా) దీన్నే మండల్ కేసు అని కూడా అంటారు.
‣  ఈ కేసులో సుప్రీంకోర్టు కొన్ని షరతులతో ఓబీసీలకు 27% రిజిర్వేషన్లకు రాజ్యాంగబద్ధతను కల్పించింది. అయితే వెనుకబడిన తరగతుల్లో ఉన్నత వర్గాలను (క్రీమీ లేయర్) రిజర్వేషన్ల సదుపాయాల నుంచి మినహాయించాలని, ఇతర వెనుకబడిన తరగతులకు ఒక శాశ్వత చట్టబద్ధ సంస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కోరింది.
  ఓబీసీల్లో క్రీమీ లేయర్‌ను గుర్తించడానికి ప్రభుత్వం రామ్ నందన్ కమిటీని నియమించింది. 1993 లో ఈ కమిటీ నివేదిక సమర్పించగా, ప్రభుత్వం ఆమోదించింది.


3. అల్ప సంఖ్యాక వర్గాలు (మైనారిటీలు)

 29 (1) - ప్రకరణ: భారతదేశంలో నివసిస్తున్న పౌరుల్లో ఏ వర్గం వారైనా తమ విశిష్ట భాష, లిపి, సంస్కృతిని కాపాడుకునే హక్కు.
29 (2) - రాజ్యం నిర్వహిస్తున్న లేదా రాజ్య ఆర్థిక సహాయం పొందుతున్న విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని మత, జాతి, కుల, భాషా ప్రాతిపదికపై ఏ పౌరుడికీ నిరాకరించరాదు.
30 - మత, భాషా అల్ప సంఖ్యాక వర్గాల వారందరూ తమకు నచ్చిన విధంగా విద్యా సంస్థలను నెలుకొల్పుకునే, నిర్వహించుకునే హక్కుంది.
30 (1)(a) - అల్ప సంఖ్యాక వర్గాల విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే వారికి చెల్లించాల్సిన నష్టపరిహారం విషయంలో వారికి సంక్రమించిన హక్కులకు ఎలాంటి భంగం కలిగించకూడదు.
30(2) - అల్ప సంఖ్యాక వర్గాల నిర్వహణలోని విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం మంజూరు చేసే సందర్భంలో రాజ్యం ఎలాంటి వివక్ష చూపకూడదు.
347 - ఏదైనా ఒక రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న జనాభా తాము మాట్లాడే భాషను సదరు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సిందిగా రాష్ట్రపతిని కోరవచ్చు. రాష్ట్రపతి ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవచ్చు.
350 - ఏ వ్యక్తయినా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించే ఏ భాషలోనైనా తనకున్న సమస్యను సంబంధిత అధికారికి విన్నవించుకోవచ్చు. ఆ విన్నపాన్ని అధికార భాషలో లేదనే కారణంగా తిరస్కరించకూడదు.
350 A - భాషాపరమైన అల్ప సంఖ్యాక వర్గాలవారికి ప్రాథమిక స్థాయిలో వారి మాతృభాషలోనే విద్యాబోధన జరిగేందుకు సదుపాయాలు కల్పించాలి.
350 B (1) - భాషాపరమైన మైనారిటీల కోసం ప్రత్యేక అధికారిని రాష్ట్రపతి నియమించాలి.
350 B (2) - పై ప్రత్యేక అధికారి సంబంధిత నివేదికను రాష్ట్రపతికి సమర్పించాలి.


4. మహిళలు
ప్రకరణ 14- చట్టం ముందు అందరూ సమానులే.
15 - పౌరులకు సంబంధించి జాతి, మత, కుల, లింగ, జన్మస్థలం పరంగా వివక్ష చూపకూడదు.
15(3) - మహిళలకు ప్రత్యేక మినహాయింపులు
16 - ప్రభుత్వ ఉద్యోగాల్లో లింగ వివక్ష చూపకూడదు.
23 - స్త్రీలను అసభ్య, అశ్లీల, అవినీతి కార్యకలాపాలకు వినియోగించకూడదు.
39 (A) - పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించాలి.
39(D) - స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం
42 - మహిళలకు ప్రసూతి సౌకర్యాలు
51 (A) (e) - మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతులను విడిచిపెట్టాలి
243 (D) - పంచాయతీల్లో మహిళలకు 1/3 వ వంతు స్థానాలను రిజర్వు చేయాలి.
243 (T) - మున్సిపాలిటీల్లో మహిళలకు 1/3 వ వంతు స్థానాలను రిజర్వు చేయాలి.


ఎస్సీ, ఎస్టీ చట్టాలు - సంక్షేమ పథకాలు
ఎస్సీ, ఎస్టీ చట్టాలు:
 అస్పృశ్యతా నిషేధచట్టం - 1955
 పౌరహక్కుల పరిరక్షణ చట్టం - 1976
 ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాల నిషేధ చట్టం - 1989
 జాతీయ అటవీ విధానం - 1988
 పంచాయతీ ఎక్స్‌టెన్షన్ షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ (PESA) - 1996
 గిరిజన సంప్రదాయ హక్కుల పరిరక్షణ చట్టం - 2006


ఎస్సీ సంక్షేమ పథకాలు:
 వీరి సంక్షేమానికి కేంద్రంలో సామాజిక న్యాయ మంత్రిత్వశాఖను 1998 లో ఏర్పాటు చేశారు. ప్రస్తుత మంత్రి ధావర్‌చంద్ గెహ్లాట్ (Thawarchand Gehlot)
 1979 నుంచి ఎస్సీ ఉపప్రణాళికలో భాగంగా వనరులను కేటాయిస్తున్నారు.
 దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారి ఉపాధి కోసం జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ స్థాపన (1989)
 ఎస్సీ బాలబాలికలకు వసతి గృహస్థాపనకు బాబూ జగ్జీవన్‌రామ్ ఛాత్రవాస్ యోజన 2008
 రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్స్ 2005
 ఎస్సీ బాలికల అక్షరాస్యతా అభివృద్ధి పథకం - 2003
 పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత విద్యా పథకం - 2003
‣ ఎస్సీల సంక్షేమానికి పార్లమెంటులో స్థాయీ సంఘం ఏర్పాటు - 1998

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

న్యాయసమీక్ష - న్యాయవ్యవస్థ - క్రియాశీలత 

        భారత రాజ్యాంగ నిర్మాతలు న్యాయ సమీక్ష అనే భావనను అమెరికా నుంచి గ్రహించారు. 1803లో అమెరికాలో మార్బరీ Vs మాడిసన్ కేసు సందర్భంగా అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్‌మార్షల్ ఇచ్చిన తీర్పు న్యాయ సమీక్ష భావనకు ఆధారమైంది.


* కేంద్ర, రాష్ట్ర శాసన వ్యవస్థలు రూపొందించే శాసనాలు, ప్రభుత్వం జారీ చేసే సూత్రాలు, అమలు చేసే విధానాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవని న్యాయస్థానం తీర్పు ఇవ్వడాన్ని న్యాయసమీక్ష (Judicial Review) అంటారు.
* ప్రాథమిక హక్కుల పరిరక్షణ, సమాఖ్య స్ఫూర్తి పరిరక్షణ, రాజ్యాంగ ఆధిక్యతను కాపాడటం, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థ సాధనకు న్యాయ సమీక్షాధికారం దోహదపడుతుంది.
* శాసనం ద్వారా నిర్ణయించిన పద్ధతిలో ప్రాథమిక హక్కుల పరిరక్షణకు న్యాయ సమీక్షాధికారం అనివార్యమని కె.ఎమ్. మున్షీ పేర్కొన్నారు.

* ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన శాసనాలు, ఆదేశాలు, ఇతర నోటిఫికేషన్లు చెల్లవని ఆర్టికల్ - 13 ప్రకారం సుప్రీంకోర్టు రద్దు చేయడాన్నే న్యాయసమీక్షాధికారం అంటారు.
* భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ - 13(2) ద్వారా న్యాయసమీక్షాధికారాన్ని న్యాయవ్యవస్థకు కల్పించారు.

 

జె.సి. జోహారి అనే రాజనీతి వేత్త ప్రకారం న్యాయ సమీక్షకు ఆధారాలైన సిద్ధాంతాలు
1) శాసన సామర్థ్య సిద్ధాంతం - (Doctrine of Legislative Competence)
2) రాజ్యాంగ పురోభావన సిద్ధాంతం - (Doctrine of Prospectivism)
3) క్రియాశీల సిద్ధాంతం - (Doctrine of Dynamism)
4) అనుభవాత్మక నిర్ణయ సిద్ధాంతం - (Doctrine of Empirical)
5) వేర్వేరు భాగ సిద్ధాంతం - (Doctrine of Severability)
6) రాజ్యాంగ చైతన్య సిద్ధాంతం - (Doctrine of Spirit of Constitutionalism)

 

భారత్‌లో న్యాయసమీక్ష అభివృద్ధి క్రమం
* 1951లో చంపకం దొరై రాజన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు సందర్భంగా మద్రాసు రాష్ట్రంలో వైద్య కళాశాలల్లో కొన్ని కులాలకు రిజర్వేషన్ కల్పించడాన్ని మద్రాస్ హైకోర్టు కొట్టివేయగా, ఆ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
* 1951లో ఎ.కె. గోపాలన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో సెమినార్ పత్రిక సంపాదకుడైన రమేష్ థాపర్‌ను కారణాలు చెప్పకుండా నిర్భందించడం వ్యక్తి స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని, అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది.

* 1952లో శంకరీ ప్రసాద్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, 1965లో సజ్జన్ సింగ్ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉందని, రాజ్యాంగ సవరణలు న్యాయసమీక్ష పరిధిలోకి రావని పార్లమెంటు చేసే సాధారణ చట్టాలు మాత్రమే న్యాయసమీక్ష పరిధిలోకి వస్తాయని పేర్కొంది.
* 1967లో గోలక్‌నాథ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ఆర్టికల్, 368 ప్రకారం జరిగే రాజ్యాంగ సవరణలు కూడా ఆర్టికల్, 13లో భాగంగా న్యాయసమీక్ష పరిధిలోకి వస్తాయని పేర్కొంది. ఆ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు.
* 1969లో ఆర్.సి. కూపర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దుకోసం జారీ చేసిన ఆర్డినెన్సులు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని, అవి చెల్లవని పేర్కొంది.
* 1973లో కేశవానందభారతి Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉందని, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపం ఉల్లంఘించరాదని పేర్కొంది. ఆ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎమ్. సిక్రీ
* 1980లో మినర్వామిల్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, న్యాయసమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో అంతర్భాగమని పేర్కొంది.

* 1994లో ఎస్.ఆర్. బొమ్మై Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ప్రవేశికలోని లౌకికతత్వం అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోకి వస్తుందని, దాన్ని రద్దు చేసే అధికారం లేదని పేర్కొంది. ఈ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎమ్.ఎన్. వెంకటాచలయ్య.
* 1997లో చంద్ర కుమార్ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తూ న్యాయసమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని పునరుద్ఘాటించింది.
* 1975లో ఇందిరా గాంధీ Vs రాజ్‌నారాయణ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, 39వ రాజ్యాంగ సవరణ చట్టం చట్ట సమానత్వానికి విరుద్ధమైందని, అది చెల్లదని పేర్కొంది.
* 1978లో మేనకాగాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, అమెరికాలో అమల్లో ఉన్న Due Process of Law అనే సూత్రాన్ని వినియోగిస్తూ, సహజ న్యాయ సూత్రాలను ప్రాథమిక హక్కులకు వర్తింపజేయాలని పేర్కొంది.
* 1992లో ఇందిరాసహాని Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది.
* 2007లో అశోక్ కుమార్ ఠాకూర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, కేంద్రప్రభుత్వ విద్యా సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్టికల్ - 15(5)ను చేర్చడం రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది.

* 2007లో ఐ.ఆర్. కొల్హోయ్ Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, తమిళనాడులో రిజర్వేషన్లు 69% పెంచడానికి సంబంధించి 9వ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలను వ్యతిరేకించింది. 1973 తర్వాత 9వ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలేవైనా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని న్యాయ సమీక్షకు గురిచేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది.
* న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించేపటప్పుడు న్యాయస్థానం ఇచ్చే తీర్పులను 2 రకాలుగా విభజించవచ్చు. అవి:
1) ఇంట్రావైర్స్: శాసన శాఖ శాసనాలు, కార్యనిర్వాహక శాఖ పరిపాలనా చర్యలు రాజ్యాంగానికి అనుగుణంగా, రాజ్యాంగబద్ధంగా ఉన్నట్లయితే వాటిని ఇంట్రావైర్స్ అంటారు.
2) అల్ట్రావైర్స్: శాసన శాఖ శాసనాలు, కార్యనిర్వాహక శాఖ పరిపాలనా చర్యలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే వాటిని అల్ట్రావైర్స్ అంటారు.
* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా న్యాయస్థానాల న్యాయ సమీక్ష అధికారంపై అనేక పరిమితులు విధించింది.
* మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం 1977లో 43వ రాజ్యాంగ సవరణ ద్వారా, 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయస్థానాల న్యాయ సమీక్షాధికారాన్ని పునరుద్ధరించింది.
* భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష పరిధి నుంచి మినహాయించింది.

* అమెరికా సుప్రీంకోర్టుకు రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా సమీక్ష చేసే అధికారం ఉంది. అమెరికాలో న్యాయశాఖకు ఆధిక్యత ఉంది.
* What is law is - What the Judges say (న్యాయమూర్తులు చెప్పిందే న్యాయం) అనేది అమెరికాలో అమల్లో ఉన్న నానుడి.
* భారత్‌లో న్యాయ శాఖ ఆధిక్యత కంటే రాజ్యాంగ ఆధిక్యత ఎక్కువ. అంటే భారత్‌లో న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్షాధికారం నిరపేక్షమైంది కాదు.
* మన దేశంలో హైకోర్టులకు రాజ్యాంగ సవరణలను విచారించే అధికారం లేదు.

 

మన దేశంలో న్యాయసమీక్షకు అవకాశం లేని అంశాలు
* ఆర్టికల్, 53 - దేశపాలనాధికారాలు మొత్తం రాష్ట్రపతి ద్వారా నిర్వహించడం.
* ఆర్టికల్, 74(1) - ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి రాష్ట్రపతికి ఇచ్చే సలహాలు.
* ఆర్టికల్ 77(1) - రాష్ట్రపతి పేరు మీద, రాష్ట్రపతి ద్వారా మాత్రమే పాలన నిర్వహించడం.
* ఆర్టికల్, 105 - పార్లమెంటు సభ్యులకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలు, వసతులు.
* ఆర్టికల్, 122 - పార్లమెంటు వ్యవహారాలపై న్యాయస్థానాల జోక్యంపై పరిమితులు.
* ఆర్టికల్, 82 - డిలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ) కమిషన్ సూచనలను అనుసరించి లోక్‌సభ, శాసనసభల నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించడం.

* ఆర్టికల్, 154 - రాష్ట్రాల పరిపాలన మొత్తం గవర్నర్ల పేరు మీద నిర్వహించడం.
* ఆర్టికల్, 163(1) - రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్‌కు పాలనలో అందించే సలహాలు
* ఆర్టికల్, 166(1) - రాష్ట్రాల పరిపాలన మొత్తం గవర్నర్ల పేరు మీద నిర్వహించడం.
* ఆర్టికల్, 194 - శాసన సభ్యులకు కల్పించిన ప్రత్యేక రక్షణలు, సౌకర్యాలు.
* ఆర్టికల్, 212 - రాష్ట్ర శాసన సభ వ్యవహారాలు
* ఆర్టికల్, 341 - షెడ్యూల్డు కులాల జాబితాపై భారత పార్లమెంటు రూపొందించిన చట్టాలు.
* ఆర్టికల్, 342 - షెడ్యూల్డు తెగలకు సంబంధించి భారత పార్లమెంటు రూపొందించే చట్టాలు.
* ఆర్టికల్, 329 - ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన తర్వాత దాని కార్యకలాపాల్లో ....
* ఆర్టికల్, 361 - రాష్ట్రపతి, గవర్నర్లకు కల్పించిన ప్రత్యేక మినహాయింపులు.
* ఆర్టికల్, 392(2) ప్రకారం 1935 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించి, ఏవైనా అంశాలను ప్రస్తుత రాజ్యాంగంలోకి తీసుకోవడానికి రాష్ట్రపతి జారీచేసే ఉత్తర్వులను పార్లమెంటులో ప్రవేశపెట్టే విషయాలు.
* 2వ షెడ్యూల్‌లో పేర్కొన్న రాజ్యాంగ ఉన్నత పదవులు, వారి జీతభత్యాలు.
* 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న భూసంస్కరణలకు సంబంధించిన అంశాలు.

 

న్యాయ సమీక్షకు అవకాశం కల్పించే అంశాలు
* రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అన్వయించడంలో తలెత్తే వివాదాలు.
* ఆర్టికల్, 13 - ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండే శాసనాలు.
* ఆర్టికల్, 73 - కేంద్ర ప్రభుత్వ అధికార పరిధి విషయంలో తెలెత్తే వివాదాల సమీక్ష.
* ఆర్టికల్, 162 - రాష్ట్రప్రభుత్వ అధికార పరిధి విషయంలో తలెత్తే వివాదాల సమీక్ష.
* ఆర్టికల్, 131 - కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య తలెత్తే వివాదాలు.
* ఆర్టికల్, 132 - రాజ్యాంగబద్ధమైన అప్పీళ్లను విచారించడం.
* ఆర్టికల్, 137 - సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పులను తానే పునఃసమీక్ష చేయడం.
* ఆర్టికల్, 147 - రాజ్యాంగానికి అర్థవివరణ, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం.
* ఆర్టికల్, 246 - పార్లమెంటు, శాసనసభల శాసనాధికార పరిధి.
* ఆర్టికల్, 248 - అవశిష్టాధికారాలను నిర్ణయించడం.
* ఆర్టికల్, 254 - ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య తలెత్తే విభేదాలు.
* ఆర్టికల్, 368 - రాజ్యాంగ సవరణకు సంబంధించిన వివాదాలు.
* ఆర్టికల్, 352 - జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన వివాదాలు.
* ఆర్టికల్, 356 - రాష్ట్రాల్లో విధించిన రాష్ట్రపతి పాలన
* ఆర్టికల్, 123 - రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్స్‌లు.
* ఆర్టికల్, 213 - రాష్ట్రాల గవర్నర్లు జారీచేసే ఆర్డినెన్స్‌లు.
* ఆర్టికల్, 11 - పౌరసత్వానికి సంబంధించి భారత పార్లమెంటు రూపొందించే చట్టాలు.
* మన దేశంలో న్యాయ వ్యవస్థకు ఉన్న న్యాయ సమీక్షాధికారాన్ని బ్రిటన్‌తో పోల్చినప్పుడు ఉన్నతంగా, అమెరికాతో పోల్చినప్పుడు పరిమితంగా ఉంటుంది.
* బ్రిటన్‌లో ఆ దేశ పార్లమెంటు చేసిన శాసనాలను న్యాయ సమీక్షకు గురిచేసే అధికారం ఆ దేశ న్యాయవ్యవస్థకు లేదు.
* అమెరికాలో శాసన వ్యవస్థ రూపొందించే శాసనాలను, కార్యనిర్వాహక వ్యవస్థ చర్యలను ఆ దేశ న్యాయవ్యవస్థ న్యాయ సమీక్షకు గురిచేయగలదు.

 

న్యాయశాఖ - క్రియాశీలత
* జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ ప్రకారం 'ప్రతి న్యాయమూర్తి కూడా ఒక క్రియాశీలి. అది అనుకూలంగా కావచ్చు లేదా వ్యతిరేకంగా కావచ్చు'.

* న్యాయశాఖ క్రియాశీలత అంటే న్యాయవ్యవస్థ తన అధికారాలు, విధులను మరింత చొరవగా, క్రియాశీలకంగా, ఉదారంగా వినియోగించడం. న్యాయాన్ని ప్రజలకు అందించే క్రమంలో నూతన పద్ధతులను, ప్రక్రియలను వినియోగించి సమన్యాయపాలనకు అవసరమైన చర్యలను చేపట్టడం.
* శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ తమ రాజ్యాంగ లక్ష్యాల సాధనలో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల నెలకొనే పరిస్థితుల్లో ప్రజల హక్కులను కాపాడటానికి; న్యాయవ్యవస్థ స్పందించి శాసన, కార్యనిర్వాహక శాఖలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడానికి, వాటిపై ప్రభావం చూపుతూ అవి క్రియాశీలకంగా వ్యవహారించడానికి న్యాయశాఖ తీసుకునే చర్యలనే న్యాయశాఖ క్రియాశీలతగా పేర్కొంటారు.

 

న్యాయశాఖ క్రియాశీలత - ప్రాధాన్యం
* సామాన్య ప్రజలకు న్యాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం.
* సమన్యాయపాలను, పరిపాలనలో జవాబు దారీతనాన్ని పారదర్శకతను పెంపొందించడం.
* రాజ్యాంగ లక్ష్యాలు, ఆదర్శాలు, ఆశయాలను సాధించడం.
* భారత సమాఖ్య వ్యవస్థలోని సమస్యల పరిష్కారం కోసం కృషి.
* అణగారిన, వివక్షతకు గురైన వర్గాలకు న్యాయాన్ని అందించడం.
* సున్నితమైన అంశాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకుండా, పరిష్కరించకుండా ఉన్న సందర్భంలో ప్రజలు అసంతృప్తికి గురికాకుండా పరిష్కారం చూపడంలో న్యాయశాఖ క్రియాశీలత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

* దత్త శాసనాధికారాల వల్ల కార్యనిర్వాహక శాఖ అధికారాలు విస్తృతమై అధికార దుర్వినియోగం, జవాబుదారీతనం లోపించడం.
* ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల దీర్ఘకాలిక, నిర్మాణాత్మక, అభిలషణీయమైన నిర్ణయాలను ప్రభుత్వాలు రూపొందించడంలో విఫలం కావడంతో, ప్రజల కనీస అవసరాలు తీరకపోవడం.
* ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (PIL) ద్వారా లోకస్ స్టాండి (న్యాయ అర్హతా నియమం)లో మార్పులు చేయడం, బాధితుల తరఫున వాదించడం కోసం న్యాయస్థానం అమికస్ క్యూరీని నియమించడం.
* సుమోటో కేసులను ప్రోత్సహించడం ద్వారా
* సామాజిక స్ఫూర్తి ఉన్న ప్రజా ప్రయోజనాలను ఆశించే వ్యవస్థలను ప్రోబోనో పబ్లికోగా వర్ణిస్తారు. అలాంటి వారి వాదనను న్యాయస్థానాలు అనుమతించడం ద్వారా న్యాయశాఖ క్రియశీలత వర్థిల్లుతుందని చెప్పవచ్చు.

 

న్యాయశాఖ క్రియాశీలత - కేసులు 

ఎమ్.సి. మెహతా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
* తాజ్‌మహల్ చుట్టూ కాలుష్యాన్ని వెదజల్లే 18 రకాలైన పరిశ్రమలను వెంటనే మూసివేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

సునీల్ భాత్రా Vs ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్:
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ తీహార్ జైలులో నిర్బంధించిన ఖైదీలను మానవీయ విలువలకు విరుద్ధంగా, శిక్షా గది పేరుతో క్రూరంగా పరిగణించడం ప్రాథమిక హక్కులకు విరుద్ధమని పేర్కొంది.

 

లక్ష్మీకాంత్ పాండే Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, భారతీయ బాలబాలికలను విదేశీయులు దత్తత తీసుకునే సందర్భంలో బాలల రాజ్యాంగ, చట్టపరమైన హక్కుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొంది.

 

వినాసేత్ Vs స్టేట్ ఆఫ్ బిహార్ కేసు
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, కార్యనిర్వాహక శాఖ నిర్లక్ష్యం వల్ల విచారణలో ఉన్న ఖైదీలు 20 నుంచి 30 ఏళ్ల వరకు జైలులో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని, వారిని వెంటనే విడుదల చేయాలని జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

 

ఓల్గా టెల్లిస్ Vs బాంబే మున్సిపల్ కార్పొరేషన్ కేసు
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఫుట్‌పాత్‌లపై నివసించే పేదలను ముందుగా నోటీస్ ఇచ్చి ఖాళీ చేయించడంతోపాటు వారు నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన పరిస్థితులను ప్రభుత్వం కల్పించాలని పేర్కొంది.

 

విశాఖ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పినిస్తూ మహిళలు పనిచేసే ప్రదేశాల్లో వారిపై అత్యాచారాలు, లైంగిక వేధింపులను నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలపై అనేక మార్గదర్శక సూత్రాలను జారీచేసింది.

 

ఇతర కేసులు - వివాదాలు 
* బిహార్‌లో పశుగ్రాసం కేసు
* కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఆర్. బొమ్మై తొలగింపు వివాదం
* ఫరీదాబాద్ గనుల్లో పనిచేసే బాల కార్మికుల స్థితిగతులపై బంధువా ముక్తి మోర్చా అనే స్వచ్ఛంద సంస్థ చేసిన ఫిర్యాదు
* ఝార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి వివాదం
* కామన్ కాజ్ కేసు సందర్భంగా పెట్రోల్ బంకుల కేటాయింపు
* వాహనాలపై ఎర్ర బుగ్గలు, సైరన్‌ల వాడకం
* రామసేతు వివాదంలో తమిళనాడు అధికార డీఎంకే ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 కిందికి ప్రకారం రద్దుచేస్తామని హెచ్చరించడం.
* వినీతా నారాయణ్ కేసులో జైన్ హవాలా కుంభకోణంలో జైన్ సోదరుల డైరీలో పేర్కొన్న రాజకీయ నాయకులపై కేసును నమోదు చేయాలని సీబీఐని ఆదేశించడం.
* డి.కె. బసు కేసు సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన పోలీసు సంస్కరణలు

 

ప్లీ బార్గెయ్‌నింగ్ (Plea Bargaining)
* దీన్ని 2006 నుంచి అమలు చేస్తున్నారు. దీని ప్రకారం నిందితులు నేరాన్ని అంగీకరిస్తే న్యాయస్థానం విచారణను ఆపి, అతడికి తక్కువ శిక్షను విధించవచ్చు. ఈ పద్ధతి ద్వారా కేసులు తొందరగా పరిష్కారం అవుతాయి.

 

సామాజిక న్యాయ బెంచ్ (Social Justice Bench)
 దీన్ని 2014, డిసెంబరు 12న ప్రారంభించారు. ప్రజల సామాజిక సమస్యలను, ప్రభుత్వం ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులను త్వరితగతిన విచారించడానికి సుప్రీంకోర్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగమే సామాజిక న్యాయ బెంచ్. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ బెంచ్ సమావేశం అవుతుంది. ఇది సుప్రీంకోర్టులో సామాజిక న్యాయానికి సంబంధించి, పెండింగ్‌లో ఉన్న కేసులతోసహా కొత్త కేసులను కూడా విచారిస్తుంది.

 

నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్
 1992లో యూఎన్‌వో పర్యావరణ, అభివృద్ధి సమావేశం రియో డీ జనిరోలో చేసిన తీర్మానాల ఆధారంగా పార్లమెంటు 2010లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చట్టాన్ని రూపొందించింది.

 

ముఖ్యాంశాలు
* ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ దీనిలో ఒక ఛైర్మన్, 10 మంది సభ్యులకు తక్కువ కాకుండా 20 మంది సభ్యులకు మించకుండా, జ్యూడిషియల్ మెంబర్స్ ఉంటారు.
* దీని ఛైర్మన్, సభ్యుల పదవీ కాలం 5 ఏళ్లు.

* సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఛైర్మన్ లేదా జ్యూడిషియల్ సభ్యులుగా నియమితులైతే వారి పదవీ విరమణ వయసు 75 సంవత్సరాలు.
* హైకోర్టు న్యాయమూర్తులు జ్యూడిషియల్ సభ్యులుగా నియమితులైతే వారి పదవీ విరమణ వయసు 67 సంవత్సరాలు.
* ఇతర నిష్ణాతులైన సభ్యుల పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు.

 

అధికారాలు - విధులు
* పర్యావరణానికి సంబంధించిన అన్ని ముఖ్య వివాదాలు దీని పరిధిలోకి వస్తాయి.
* అటవీ పరిరక్షణ చట్టం, జీవ వైవిద్య పరిరక్షణ చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం లాంటి వాటిని విచారిస్తుంది.
* ఈ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును ప్రత్యేక సందర్భాల్లో 90 రోజుల వ్యవధిలో సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు.

 

లోక్ అదాలత్
* దీన్ని ప్రజాన్యాయస్థానం, సంచార న్యాయస్థానం అంటారు.
* మన దేశంలో న్యాయవ్యవస్థలో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించి, తక్కువ ఖర్చుతో, తక్కువ వ్యవధిలో తక్షణ న్యాయాన్ని అందించడం దీని లక్ష్యం.
* లోక్ అదాలత్ విధానాన్ని 1987లో ప్రవేశపెట్టారు.

* దీని అమలు కోసం 1987లో లీగల్ ఏడ్ అథారిటీని ఏర్పాటు చేశారు.
* ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 39(A) ప్రకారం పేదలకు ఉచిత న్యాయసహాయాన్ని అందించాలి.
* మధ్యవర్తుల సహకారంతో, రాజీమార్గం ద్వారా ఇరువర్గాల సమ్మతితో కేసులు పరిష్కారమవుతాయి.
* 2002లో లీగల్ ఏడ్ అథారిటీ యాక్ట్‌కు సవరణలు చేసి, లోక అదాలత్‌లను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేశారు.
* దేశంలోని ఉన్నత న్యాయస్థానాలు మొదలుకొని, జిల్లా సెషన్స్ కోర్టు, ఇతర సబార్డినేట్ కోర్టులు కూడా లోక్ అదాలత్‌లను నిర్వహిస్తాయి.
* మోటారు వాహనాలకు సంబంధించిన కేసులు, ఇన్య్సూరెన్స్ క్లైమ్స్, ఆస్తి వివాదాలు, వివాహం, విడాకులు, భూసేకరణ లాంటి కేసులను లోక్ అదాలత్‌లో విచారిస్తారు.

 

గ్రామ న్యాయాలయాల చట్టం
* డి.ఎ. దేశాయ్ కమిషన్ సిఫారసు మేరకు చిన్న కేసులను సత్వరం విచారించే లక్ష్యంతో 2008లో భారత పార్లమెంటు గ్రామ న్యాయాలయాల చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం దేశ వ్యాప్తంగా 5067 న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేశారు.
* హైకోర్టును సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేస్తాయి.
* గ్రామ న్యాయాలయాలు 2009, అక్టోబరు 2 నుంచి అమల్లోకి వచ్చాయి.

* ఈ చట్టం జమ్మూకశ్మీర్, సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు, ఆదివాసీ ప్రాంతాలు మినహా దేమంతటా వర్తిస్తుంది.
* క్రిమినల్, సివిల్ కేసులకు మరణశిక్ష, యావజ్జీవ కారాగారశిక్ష, 2 ఏళ్లకు పైబడి శిక్ష విధించే అవకాశం ఉన్న కేసులను మినహాయించి, మిగిలిన అన్నిరకాల వివాదాలపై విచారణ నిర్వహిస్తాయి.

 

ఫ్యామిలీ కోర్టులు
* 1984లో కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా కుటుంబ సంబంధ వివాదాలను సత్వరం పరిష్కరించే లక్ష్యంతో ఫ్యామిలీ కోర్టులను ఏర్పాటు చేశారు.
* వివాహం, విడాకులు, వారసత్వం లాంటి అంశాలపై తలెత్తే సివిల్ వివాదాలను పరిష్కరించే నేపథ్యంలో ఈ కోర్టులను ఏర్పాటు చేశారు.
* 2014లో గాంధీ నగర్ ఫ్యామిలీ కోర్టు మాజీ క్రికెటర్ దల్వీర్ సింగ్ కేసులో భార్యనే భర్తకు భరణం చెల్లించాలని అరుదైన తీర్పును ఇచ్చింది.

 

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు
* 11వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2000లో మనదేశంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు.
* అపరిష్కృతంగా ఉన్న కేసులను త్వరితగతిన విచారణ చేసేందుకు వీటిని ఏర్పాటు చేశారు.

* 2000లో మనదేశంలో 492 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం వాటి సంఖ్య 1192.
* ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 242 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఉన్నాయి.
* రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత ఖర్చులతో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను నిర్వహిస్తున్నాయి.

 

జాతీయ న్యాయ సర్వీసుల సంస్థ (National Legal Services Authority)
* 1987లో జాతీయ న్యాయసలహా సేవల చట్టాన్ని పార్లమెంటు రూపొందించింది. ఈ చట్టం ప్రకారం 1998లో జాతీయ న్యాయసేవల అధికార సంస్థ ఏర్పడింది. దీనికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధాన పోషకులుగా జాతీయ స్థాయిలో వ్యవహరిస్తారు. ఆర్టికల్, 39(A) ప్రకారం పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడం దీని లక్ష్యం.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జాతీయ, రాష్ట్రీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు

జాతీయ షెడ్యూల్డు కులాల, తెగల కమిషన్
* భారత రాజ్యాంగంలోని ఆర్టికల్, 338 ప్రకారం ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలను కాపాడటానికి 1978లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా జాతీయ షెడ్యూల్డు కులాల, తెగల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీని మొదటి ఛైర్మన్ బోళ పాశ్వాన్ శాస్త్రి.
* ఈ కమిషన్‌ను 1987లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 'నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్‌'గా మార్చింది.
* దీనికి వి.పి. సింగ్ ప్రభుత్వం 65వ రాజ్యాంగ సవరణ చట్టం (1990) ద్వారా రాజ్యాంగ భద్రతను కల్పించడంతో 1992, మార్చి 12 నుంచి నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ అమల్లోకి వచ్చింది.

నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్లు
* రామ్‌ధన్                  -     1992 - 1995
* ఎం. హనుమంతప్ప     -    1995 - 1998
* దిలీప్‌సింగ్ భూరియా      -    1998 - 2002
* విజయ్ శంకర్ శాస్త్రి         -    2002 - 2004
* అటల్ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం 89వ రాజ్యాంగ సవరణ చట్టం, 2004 ప్రకారం నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రెండుగా విభజించి, ఆర్టికల్, 338 ప్రకారం నేషనల్ ఎస్సీ కమిషన్‌ను; ఆర్టికల్, 338(A) ప్రకారం నేషనల్ ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

నేషనల్ ఎస్సీ కమిషన్ (ఆర్టికల్ 338)
* ఆర్టికల్, 338(1) - షెడ్యూల్డు కులాల వారికి జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.
* ఆర్టికల్, 338(2) - పార్లమెంటు రూపొందించిన చట్టంలోని నిబంధనలను అనుసరించి ఎస్సీ కమిషన్‌కు ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు ఉంటారు.
* వీరి సర్వీసు నిబంధనలు, పదవీ కాలపరిమితి రాష్ట్రపతి నిర్ణయించిన నిబంధనల ప్రకారం ఉంటాయి. పదవీ కాలం 3 సంవత్సరాలు.
* ఆర్టికల్, 338(3) - ఎస్సీ కమిషన్‌కు అధ్యక్ష, ఉపాధ్యక్ష, ఇతర సభ్యులను రాష్ట్రపతి స్వయంగా సంతకం చేసిన అధికార పత్రం ద్వారా నియమిస్తారు. సభ్యుల్లో ఒకరు తప్పనిసరిగా మహిళై ఉండాలి.
* ఆర్టికల్, 338(4) - ఎస్సీ కమిషన్ స్వతంత్ర సంస్థ. అంటే తన పని విధానాన్ని తానే నియంత్రించుకునే అధికారాన్ని కలిగి ఉంటుంది.

అధికారాలు - విధులు
      ఆర్టికల్, 338(5) ప్రకారం నేషనల్ ఎస్సీ కమిషన్ కింది విధులను నిర్వహిస్తుంది
* షెడ్యూల్డు కులాల రక్షణ, హక్కులకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి, విచారించడం.
* షెడ్యూల్డు కులాల ఆర్థిక, సామాజిక, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే ప్రణాళికల రూపకల్పనలో తగిన సలహాలు ఇవ్వడం, వారి అభివృద్ధి పురోగతిని మూల్యాంకనం చేయడం.
* షెడ్యూల్డు కులాల వారికి రాజ్యాంగపరంగా, చట్టపరంగా కల్పించిన ప్రత్యేక హక్కులకు సంబంధించిన అన్ని అంశాలను విచారించడం, పర్యవేక్షించడం, మూల్యాంకనం చేయడం.
* షెడ్యూల్డు కులాల వారికి కల్పించిన పరిరక్షణల అమలుతీరు గురించి రాష్ట్రపతికి వార్షిక నివేదికలను సమర్పించడం లేదా అవసరాన్ని బట్టి ఇతర సమయాల్లో కూడా నివేదికలను పంపడం.
* రాష్ట్రపతి నిర్ణయించిన మేరకు షెడ్యూల్డు కులాల రక్షణ, సంక్షేమం, అభివృద్ధి, పురోగతి కోసం ఇతర విధులను నిర్వహించడం.
* అధికారాల నిర్వహణలో 'సివిల్ కోర్టు' అధికారాలను కలిగి ఉండటం.
* ఏ అధికారినైనా తన ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని కోరవచ్చు లేదా అఫిడవిట్‌ను సమర్పించాలని కోరవచ్చు. ఎలాంటి రికార్డులనైనా పరిశీలించవచ్చు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గాల సంక్షేమాన్ని ఉద్దేశించి తీసుకునే చర్యల అమలు తీరును మాత్రమే కాకుండా నూతనంగా వీరికోసం అమలుచేసే పథకాల గురించి ఎస్సీ కమిషన్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి.
* 1976 నాటి పౌరహక్కుల పరిరక్షణ చట్టం, 1989 నాటి ఎస్సీ, ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టం అమలు తీరును ఈ కమిషన్ సమీక్షిస్తుంది.
* కోర్టులు, కార్యాలయాల నుంచి అవసరమైన పబ్లిక్ రికార్డులు, ఇతర నకళ్లను పొందడం.
* ఎస్సీ కమిషన్ అందించే నివేదికలను రాష్ట్రపతి పార్లమెంటుకు సమర్పిస్తారు.
* ఎస్సీ కమిషన్ సమర్పించిన నివేదికలోని అంశాలు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి ఉంటే దాని ప్రతిని రాష్ట్రపతి గవర్నర్‌కు పంపగా, గవర్నర్ దాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడతారు.

ఛైర్మన్ సభ్యుల జీతభత్యాలు
* ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేంద్ర కేబినెట్ మంత్రి హోదా, డిప్యూటీ ఛైర్మన్ కేంద్ర సహాయమంత్రి హోదా, సభ్యులు భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాతో సమానమైన సౌకర్యాలను కలిగి ఉంటారు.
* ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, సభ్యులు భారత ప్రభుత్వ కార్యదర్శి జీతంతో సమానమైన వేతనాలు పొందుతారు.
* పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులను ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, సభ్యులుగా నియమిస్తే వారికి ఎలాంటి జీతభత్యాలు ఉండవు.
* జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్ ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. ఈ కమిషన్ అధీన కార్యాలయాలను వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ప్రధాన కార్యాలయంలో 4 విభాగాలు ఉన్నాయి. అవి:
1. పాలనా సమన్వయ విభాగం: ఇది కమిషన్ చేపట్టే వివిధ కార్యక్రమాలను సమన్వయ పరుస్తుంది.
2. సేవా పరిరక్షణ విభాగం: ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఎస్సీ వర్గాలకు సమకూర్చిన సౌకర్యాల అమలును పర్యవేక్షిస్తుంది.
3. పౌరహక్కుల పరిరక్షణ విభాగం: ఇది వివిధ చట్టాల అమలు తీరును పర్యవేక్షిస్తుంది.
4. సామాజిక, ఆర్థిక అభివృద్ధి విభాగం: షెడ్యూల్డు కులాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తుంది.

నేషనల్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌లు
1. సూరజ్‌భాన్          -      2004 - 2007
2. భూటాసింగ్           -     2007 - 2010
3. పి.ఎల్. పునియా   -    2010 - 2013
4. పి.ఎల్. పునియా   -      2013, అక్టోబరు 22 నుంచి పునర్ నియామకం
* షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్ 'అనుశుచిత్ జాతివాణి' పేరుతో ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక 'ఈ-మాగజైన్‌'ను విడుదల చేస్తుంది.
* హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేములను దళితుడిగా పి.ఎల్. పునియా నేతృత్వంలోని నేషనల్ ఎస్సీ కమిషన్ ధ్రువీకరించింది.
* రోహిత్ దళితుడు కాదని అతడి ఆత్మహత్యకు కారణాలు తెలుసుకోవాలని ఏర్పాటు చేసిన 'రూపన్‌వాల్ కమిషన్‌'ను ఎస్సీ కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. కులంపై తుది నిర్ధారణ అధికారి జిల్లా కలెక్టర్ అని పేర్కొంది.
* ఎస్సీ వర్గాల సంక్షేమం కోసం 1968లో ఒక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. దీన్ని 1978లో స్థాయీ సంఘంగా మార్పు చేశారు. దీనిలో 20 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు.

ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల, తెగల కమిషన్
* ఆంధ్రప్రదేశ్‌లో 2003లో చేసిన చట్టం ప్రకారం షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఒక ఛైర్మన్, 5 మంది సభ్యులు ఉంటారు. వీరిలో ఒక మహిళా సభ్యురాలు ఉంటారు. సభ్యులందరూ ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం కృషి చేసేవారై ఉండాలి.
* సభ్యులు, ఛైర్మన్ పదవీకాలం 3 సంవత్సరాలు.

అధికారాలు - విధులు
* రాజ్యాంగ పరంగా, చట్టపరంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి కల్పించిన సదుపాయాలు, అమలు జరుగుతున్న తీరును విచారించి, నివేదికను గవర్నర్‌కు సమర్పిస్తుంది. ఈ నివేదికను గవర్నర్ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడతారు.
* ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.
* కమిషన్ సమక్షంలో ఉండే ఏదైనా ప్రొసీడింగ్‌ను ఐపీసీ ప్రకారం జ్యుడీషియల్ ప్రొసీడింగ్‌గా భావించాలి.
* వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు.

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ అధ్యక్షుడు
* కె. పున్నయ్య - 2003 - 2006
* ఎమ్. నాగార్జున - 2007 - 2009
* 2010 నుంచి కమిషన్‌కు ఛైర్మన్, సభ్యులను నియమించలేదు.
* 2013లో ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను విభజించి, వేర్వేరు కమిషన్‌లుగా ఏర్పాటు చేశారు.
* ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌గా 2016లో కారెం శివాజీ నియమితులయ్యారు.

జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్
* ఆర్టికల్, 338(A) ప్రకారం 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్‌ను 2004, ఫిబ్రవరి 19న ఏర్పాటు చేశారు.
* నేషనల్ ఎస్టీ కమిషన్ ప్రధాన కార్యాలయం 'న్యూదిల్లీ'లో ఉంది. దీనికి భోపాల్, భువనేశ్వర్, షిల్లాంగ్, జయపుర, రాయ్‌పూర్, రాంచీలలో ఆరు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

ఆర్టికల్, 338(A)(1): షెడ్యూల్డు తెగల కోసం ఒక షెడ్యూల్డు తెగల జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.

ఆర్టికల్, 338(A)(2): నేషనల్ ఎస్టీ కమిషన్‌లో ఒక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు.
* అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇద్దరు సభ్యులు షెడ్యూల్డు తెగలకు చెందినవారై ఉండాలి. మిగిలిన ఒకరు కచ్చితంగా షెడ్యూల్డు తెగలకు చెందిన మహిళై ఉండాలి. వీరందరి పదవీకాలం 3 సంవత్సరాలు.
* అధ్యక్షుడు - కేంద్ర కేబినెట్ మంత్రితో సమానమైన హోదాను, జీతభత్యాలను పొందుతారు.
* ఉపాధ్యక్షుడు - కేంద్ర సహాయ మంత్రితో సమానమైన హోదాను, జీతభత్యాలను పొందుతారు.
* సభ్యులు - భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాను, జీతభత్యాలను పొందుతారు.

ఆర్టికల్, 338(A)(3): అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.

ఆర్టికల్, 338(A)(4): ఎస్టీ కమిషన్ తన పని విధానాన్ని తానే నియంత్రించుకుంటుంది.

నేషనల్ ఎస్టీ కమిషన్ అధికారాలు - విధులు
* షెడ్యూల్డు తెగల సామాజిక, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికా ప్రక్రియలో పాల్గొనడం. ఈ తెగలకు సంబంధించిన విధాన ప్రక్రియలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వడం.
* ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగంలో పేర్కొన్న రక్షణ, ప్రత్యేక హక్కులను పరిరక్షించడం.
* ఎస్టీల సంక్షేమం, సామాజిక, ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, వాటిని సమర్థంగా అమలు చేయడం గురించి తగిన సలహాలు ఇవ్వడం.
* ఎస్టీల రాజ్యాంగ పరిరక్షణ పనితీరుపై రాష్ట్రపతికి వార్షిక నివేదికలను సమర్పించడం. ఈ నివేదికలను రాష్ట్రపతి పార్లమెంటులో ప్రవేశపెడతారు.
* ఎస్టీ కమిషన్ పంపిన నివేదికలో కొంత భాగం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందైతే, ఆ నివేదిక ప్రతిని సంబంధిత రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించాలి. దాన్ని గవర్నర్ శాసనసభలో ప్రవేశపెడతారు.
* ఎస్టీ వర్గాల హక్కులు, రక్షణలకు భంగం వాటిల్లితే వాటికి సంబంధించిన ఫిర్యాదులను విచారించడం.
* ఎస్టీ కమిషన్ కేసుల విచారణ ప్రక్రియలో భాగంగా సివిల్‌కోర్టులా వ్యవహరిస్తుంది.
* గిరిజనులు అనాదిగా అనుసరిస్తున్న 'పోడు వ్యవసాయ పద్ధతిని' నివారించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా చేయడం.
* PESA Act (Panchayat Raj Extension to the Scheduled Areas)ను షెడ్యూల్డు ప్రాంతాలకు వర్తింపచేయడానికి కృషి చేయడం.
* అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా నిర్వాసితులైన గిరిజనులకు పునరావాసం కల్పించడం.
* గిరిజనులకు చెందిన భూమిని అన్యాక్రాంతం కాకుండా నివారించడం.
* చట్టరీత్యా ఆదివాసీలకు ఖనిజ, జల వనరులపై తగిన హక్కులను కల్పించడం.
* ఎస్టీ వర్గాల హక్కుల ఉల్లంఘనల ఫిర్యాదుల ఆధారంగా లేదా సుమోటోగా విచారణ జరపడం.
* గిరిజనులకు జీవనోపాధి సంబంధిత అవకాశాలను పెంపొందించడం.
* ఏదైనా న్యాయస్థానం నుంచి లేదా ప్రభుత్వ కార్యాలయం నుంచి పబ్లిక్ రికార్డును లేదా దాని కాపీని పొందవచ్చు.
* అఫిడవిట్లపై సాక్ష్యాలను సేకరించడం. సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించమని ఉత్తర్వులను జారీచేయడం.
* వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు కమిషన్ ముందు హాజరవ్వాలని సమన్లు జారీ చేసి, అవి అమలయ్యేలా చూడటం.
* ఎస్టీ వర్గాలపై ప్రభావం చూపే అన్ని ముఖ్యమైన, విధానపరమైన అంశాలకు సంబంధించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా కమిషన్‌ను సంప్రదించాలి.

నేషనల్ ఎస్టీ కమిషన్ ఛైర్మన్లు
* కున్వర్ సింగ్ - 2004 - 2007
* ఊర్మిళా సింగ్ - 2007 - 2010
* రామేశ్వర్ ఓరాన్ - 2010 - 2013
* రామేశ్వర్ ఓరాన్ - 2013, నవంబర్ 1 నుంచి పునర్ నియామకం.
* భారత ప్రభుత్వం నేషనల్ ట్రైబల్ పాలసీని 2010లో రూపొందించింది.

ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు తెగల కమిషన్
* ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను విభజించి, ఎస్టీల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రాష్ట్ర షెడ్యూల్డు తెగల కమిషన్‌కు సంబంధించిన బిల్లును 2013, జూన్ 19న శాసనసభలో ప్రవేశపెట్టారు.
* రాష్ట్ర ఎస్టీ కమిషన్‌లో ఛైర్మన్‌తోపాటు అయిదుగురు సభ్యులు ఉంటారు.
* గిరిజన వర్గాలకు చెందిన ప్రముఖ వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించాలి.
* సభ్యుల్లో తప్పనిసరిగా ఇద్దరు మహిళలు ఉండాలి.
* మైదాన ప్రాంతం నుంచి ఒక సభ్యుడిని, ఏజెన్సీ ప్రాంతం నుంచి మిగిలిన వారిని నియమిస్తారు.
* ఛైర్మన్, సభ్యుల పదవీ కాలం 3 సంవత్సరాలు. వీరందరినీ గవర్నర్ నియమిస్తారు. వీరు తమ రాజీనామాలను గవర్నర్‌కు సమర్పిస్తారు.అధికారాలు - విధులు
* రాష్ట్ర ఎస్టీ కమిషన్ సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు, విధులను చెలాయిస్తుంది.
* ఎవరైనా వ్యక్తికి సమన్లు జారీచేసి తన ముందు హాజరు కావాలని ఆదేశిస్తుంది.
* గిరిజనుల హక్కులపై ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు, గిరిజనుల సంక్షేమానికి నూతన సిఫారసులను చేయడం.
* గిరిజనుల ప్రగతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన విధానాల అమలుతీరును పర్యవేక్షించడం.
* తన నివేదికను రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించడం. గవర్నర్ ఈ నివేదికను రాష్ట్ర శాసనసభకు సమర్పిస్తారు.
* గిరిజనుల సామాజిక, ఆర్థిక రాజకీయ ప్రగతి కోసం కృషి చేయడం.

జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్
* బి.పి. మండల్ కమిషన్ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతుల వారికి 27% రిజర్వేషన్లు కల్పించడాన్ని ఇందిరాసహాని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించిన విషయాలను పరిశీలించడానికి శాశ్వత సంఘాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది.
* ఈ తీర్పు ఆధారంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్, 340 ప్రకారం భారత ప్రభుత్వం 1993లో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టాన్ని రూపొందించింది.
* ఈ చట్టం 1993, ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచ్చింది.
* బీసీ కమిషన్‌లో ఒక అధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. పదవీ కాలం 3 సంవత్సరాలు.
* ఛైర్మన్, సభ్యులు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ల ఛైర్మన్, సభ్యులు పొందే హోదాను, జీతభత్యాలను పొందుతారు.

బీసీ కమిషన్ అధికారాలు - విధులు
* సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం రాజ్యాంగం కల్పించే రక్షణలు, ప్రభుత్వం రూపొందించిన చట్టాలను అమలు చేసేందుకు కృషి చేయడం.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేయడం.
* వెనుకబడిన తరగతుల స్థితిగతులను అధ్యయనం చేసి, వాటిని మెరుగుపరిచేందుకు సూచనలు చేయడం.
* బీసీ వర్గాల ప్రగతికోసం రూపొందించిన సిఫారసులను ఒక నివేదిక రూపంలో రాష్ట్రపతికి అందజేయడం, రాష్ట్రపతి ఈ నివేదికను పార్లమెంటుకు సమర్పిస్తారు.
* కమిషన్ తన విధులను నిర్వహించే విషయంలో సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది.
* వెనుకబడిన కులాల కేంద్ర జాబితాలో మార్పులు, చేర్పులను సిఫారసు చేస్తుంది.
* 1953లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం కాకాసాహెబ్ కాలేల్కర్ అధ్యక్షతన మొదటి బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 1931 జనాభా లెక్కల ఆధారంగా బీసీ వర్గాల జనాభా 31 నుంచి 69 శాతం ఉన్నట్లు పేర్కొంది.
* బీసీలకు రిజర్వేషన్ కల్పించిన మొదటి రాష్ట్రం బిహార్.
* 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై సిఫారసులు చేసేందుకు బి.పి. మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది.
* 1979లో జనతాప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడంతో మండల్ కమిషన్ సిఫారసులు అమలుకాలేదు. 1990లో వి.పి. సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫారసులను అమలుచేసింది.
* 1963లో ఎం.ఆర్. బాలాజీ కేసులో, 1964లో దేవదాసన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% మించరాదు. కాబట్టి, ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇవ్వాలని మండల్ కమిషన్ సిఫారసు చేసింది.
* మండల్ కమిషన్ సిఫారసులను ఇందిరాసహాని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు కొన్ని అంశాలను ప్రస్తావించింది. అవి:
* ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లు సమర్థనీయమే.
* ఓబీసీల్లోని సంపన్న శ్రేణి (క్రిమీలేయర్)ని రిజర్వేషన్‌ల నుంచి మినహాయించాలి.
* జాతీయ స్థాయిలో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.
* రిజర్వేషన్లు 50% మించకూడదు.
* 93వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. దీన్ని 2008లో సుప్రీంకోర్టు సమర్థించింది.
* 2007లో నేషనల్ శాంపిల్ సర్వే సేకరించిన వివరాల ప్రకారం మన దేశంలో 41.36% ఓబీసీలు ఉన్నారు.
* జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ క్రిమిలేయర్ ఆదాయ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది.

నేషనల్ బీసీ కమిషన్ ఛైర్మన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1993లో వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టాన్ని రూపొందించి, దీని ద్వారా వెనుకబడిన తరగతుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇది 1994, మార్చి 31 నుంచి అమల్లోకి వచ్చింది.
* రాష్ట్ర బీసీ కమిషన్‌లో ఒక అధ్యక్షుడు, నలుగురు సభ్యులు ఉంటారు. వీరిని గవర్నర్ నియమిస్తారు. పదవీ కాలం 3 సంవత్సరాలు.

అధికారాలు - విధులు
* ఏదైనా వెనుకబడిన తరగతిని వెనుకబడిన తరగతి జాబితాలో ఎక్కువ హోదాలో చేర్చడానికి సంబంధించి లేదా తక్కువ హోదాలో చేర్చడానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, తగిన సలహాలను ప్రభుత్వానికి ఇవ్వడం.
* బీసీ కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి.
* ఏదైనా వర్గానికి చెందిన పౌరులు తమను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చమని కోరినప్పుడు దాన్ని పరిశీలించి తగిన సలహాను ప్రభుత్వానికి ఇవ్వడం.
* మనోహర్ ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ సిఫారసుల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో 1968లో బీసీ వర్గాల వారికి 27% రిజర్వేషన్లు కల్పించడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయగా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును రద్దు చేసింది. రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది.
* మురళీధర రావు కమిషన్ సిఫారసుల మేరకు 1985లో ఎన్‌టీఆర్ ప్రభుత్వం బీసీ వర్గాలకు 44% రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు పరిచింది.

ఏపీలో బీసీ కమిషన్ ఛైర్మన్లు
* జస్టిస్ కె. పుట్టుస్వామి      -    1994 - 1997, 1997 - 2000
* దాల్వ సుబ్రహ్మణ్యం          -    2004 - 2007, 2008 - 2011
* కె.ఎల్. మంజునాథ            -    2016, జనవరి 18 నుంచి - ప్రస్తుతం

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత్‌లో సంక్షేమ యంత్రాంగం - ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ప్రొవిజన్స్‌ - ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు - ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం

రూస్కో పౌండ్ అభిప్రాయం ప్రకారం 'ఆధునిక రాజ్యాలన్నీ సంక్షేమ రాజ్యాలే. సంక్షేమ రాజ్యాలే శ్రేయోరాజ్యాలు'.
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అభిప్రాయం ప్రకారం 'భారత ప్రభుత్వ ప్రధాన లక్ష్యం దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న సామాన్య ప్రజల ఆర్థిక, సామాజిక, విద్య, వైజ్ఞానిక రంగాల్లో వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నించడం'.
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, అభిలషణీయ విధానాల ద్వారా ప్రజలందరికీ మెరుగైన వసతులను కల్పించడం, అన్ని వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన విధి.
దీన్ని సాకారం చేసేందుకు షెడ్యూల్డు కులాలు, తెగలు, వెనుకబడిన కులాలు, మహిళలు, మైనార్టీలు, కార్మికులు, వికలాంగులు, బాలబాలికలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.


రాజ్యాంగంలో సంక్షేమ మూలాలు
భారత రాజ్యాంగ ప్రవేశికలో ఇందిరా గాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చింది.
సామ్యవాదం అనే పదం ద్వారా ధనిక, పేద వర్గాల మధ్య వ్యత్యాసాలను తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అవి:
జవహర్‌లాల్‌నెహ్రూ ప్రభుత్వం 1957లో దేశంలోని జీవిత బీమా సంస్థలన్నింటినీ జాతీయం చేసి ఎల్ఐసీ నియంత్రణలోకి తీసుకొచ్చింది.
ఇందిరా గాంధీ ప్రభుత్వం 1969లో 14 బ్యాంకులను, 1980లో 6 బ్యాంకులను జాతీయం చేసింది. 1970లో రాజభరణాలను రద్దుపరచింది. 1975లో 20 సూత్రాల ఆర్ధిక కార్యక్రమాన్ని ప్రకటించింది.
భారత రాజ్యాంగంలోని 16వ భాగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు కల్పించిన ప్రత్యేక సదుపాయాలను వివరించారు.
ఆర్టికల్ 15 (3) ప్రకారం మహిళలకు, బాలలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి.
ఆర్టికల్ 46 ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా ప్రగతికి ప్రత్యేక పథకాలను చేపట్టాలి.
 ఆర్టికల్ 243 (D) ప్రకారం పంచాయతీరాజ్ ఎన్నికల్లోనూ, ఆర్టికల్ 243 (T) ప్రకారం నగర/ పట్టణ ప్రభుత్వాల ఎన్నికల్లోనూ ఎస్సీ, ఎస్టీ, మహిళా వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి.
ఆర్టికల్ 338 - జాతీయ ఎస్సీ కమిషన్.
 ఆర్టికల్ 338 (A) - జాతీయ ఎస్టీ కమిషన్
‣  ఆర్టికల్ 340 - జాతీయ బీసీ కమిషన్
1989లో షెడ్యూల్డు కులాల, తెగల అకృత్యాల నిరోధక చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది.


ఎస్సీ వర్గాల సంక్షేమం
‣  షెడ్యూల్డు కులాల (ఎస్సీ) వారికి 1979 నుంచి పంచవర్ష ప్రణాళికలో ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నారు.
1989లో నిరుపేదలైన ఎస్సీ వర్గాల స్వయం ఉపాధి కార్యక్రమాల అమలుకు నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను నెలకొల్పారు.
ఎస్సీ వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా వసతిగృహాల స్థాపనకు 2008లో బాబూ జగ్జీవన్‌రామ్ ఛాత్రావాస్ యోజనను ప్రారంభించారు.
 డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఫౌండేషన్ కార్యక్రమం ద్వారా ఎస్సీ వర్గాల వారికి కిడ్నీ, లివర్ వ్యాధులు, క్యాన్సర్ చికిత్స కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
 హరిజనవాడల్లో అంబేడ్కర్ జలధార పథకం ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తున్నారు.

ఆర్టికల్ 16 (4A): రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఎస్సీ, ఎస్టీలకు సరైన ప్రాతినిధ్యం లేదని ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లయితే కొన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి సీనియారిటీతో కూడిన పదోన్నతిని కల్పించడానికి ఆయా వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుందని, సీనియార్టీకి రిజర్వేషన్ వర్తించదని 2015 సెప్టెంబరు 12న సుప్రీంకోర్టు పేర్కొంది.

ఆర్టికల్ 17: దీని ప్రకారం అంటరానితనం నిషేధం. అంటరానితనం పాటించడాన్ని నేరంగా పరిగణిస్తారు. 1955లో భారత పార్లమెంటు అస్పృశ్యత నేర నిషేధ చట్టాన్ని రూపొందించింది. దీన్ని పార్లమెంటు 1976లో పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా మార్చింది.

ఆర్టికల్ 23: దీని ప్రకారం మనుషుల క్రయవిక్రయాలు, వెట్టిచాకిరీని నిషేధించారు. జోగిని, దేవదాసీ లాంటి సాంఘిక దురాచారాలను నిషేధించారు. 1976లో వెట్టిచాకిరీ నిషేధ చట్టం, కనీస వేతనాల అమలు చట్టం, సమాన పనికి సమాన వేతన చట్టాలను రూపొందించారు.

ఆర్టికల్ 330: ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి లోక్‌సభలో కొన్ని సీట్లు రిజర్వ్ చేయాలి. ఆర్టికల్ 332 ప్రకారం రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కొన్ని సీట్లను రిజర్వ్ చేయాలి.

 

ఆర్టికల్ 335: ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతులు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీల అర్హత మార్కులను ప్రభుత్వం తగ్గించవచ్చు.

అంబేడ్కర్ ఓవర్‌సీస్ విద్యానిధి పథకం: షెడ్యూల్డు కులాలకు చెందిన పేద విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి సహాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
జాతీయ సఫాయి కర్మచారి కమిషన్: పారిశుద్ధ్య కార్మికులను వారి వృత్తుల నుంచి విముక్తి చేసి ప్రత్యామ్నాయ సదుపాయాలను ఏర్పాటు చేయడం దీని లక్ష్యం.
2004 - 05 సంవత్సరం నుంచి బాబాసాహెబ్ అంబేడ్కర్ జాతీయ ఉపకార వేతనాలను అందిస్తున్నారు.


గిరిజన ప్రాంతాలు, గిరిజనుల (ఎస్టీ) సంక్షేమం
భారత రాజ్యాంగంలోని 5, 6వ షెడ్యూళ్లలో షెడ్యూల్డు తెగల (ఎస్టీ) పరిపాలనాంశాలను పొందుపరిచారు.
ఆర్టికల్ 366 (25) ప్రకారం హిందు, బౌద్ధ, సిక్కు మతాలను అనుసరించేవారు, ఆదిమ మత పద్ధతులను అనుసరించేవారిని షెడ్యూల్డు తెగలుగా పరిగణిస్తారు.
ఆర్టికల్ 342 ప్రకారం రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర గవర్నరును సంప్రదించిన తర్వాత షెడ్యూల్డు తెగల నిర్వచనాన్ని తెలియజేస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు. ఈ నోటిఫికేషన్ ఆధారంగానే పార్లమెంటు చట్టాలు చేస్తుంది.
2007, మే 11న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రపతి ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన నిర్వచనాన్ని తెలియజేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ న్యాయ సమీక్ష పరిధిలోకి రాదు.


5వ షెడ్యూల్ ముఖ్యాంశాలు

దీనిలో షెడ్యూల్ ప్రాంతాల పరిపాలనను చేర్చారు.
ఆర్టికల్ 244 (1) ప్రకారం సంబంధిత రాష్ట్ర గవర్నరుతో సంప్రదించిన అనంతరం రాష్ట్రపతి ఒక ప్రాంతాన్ని 'షెడ్యూల్డు ప్రాంతం'గా ప్రకటిస్తారు.
గవర్నర్లు ప్రతి సంవత్సరం తమ రాష్ట్రాల్లోని షెడ్యూల్డు ప్రాంతాల పరిపాలనపై రాష్ట్రపతికి నివేదిక పంపాలి.
రాష్ట్రపతి ఆదేశం మేరకు షెడ్యూల్డు ప్రాంతాలున్న ప్రతి రాష్ట్రంలో షెడ్యూల్డు తెగల సలహా మండలిని ఏర్పాటు చేయాలి.
ఈ మండలిలో సభ్యుల సంఖ్య 20 మంది. వీరిలో వ వంతు మంది షెడ్యూల్డు తెగలకు చెందిన శాసనసభ్యులై ఉండాలి.
షెడ్యూల్డు తెగల శాసనసభ్యులు తగినంతమంది లభించని పక్షంలో మిగిలిన స్థానాలను షెడ్యూల్డు తెగల పౌరులతో నింపాలి.


6వ షెడ్యూల్ ముఖ్యాంశాలు

‣ దీనిలో గిరిజన ప్రాంతాలను చేర్చారు.
అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర లాంటి 4 రాష్ట్రాలను చేర్చారు.
ఈ రాష్ట్రాల్లో స్వయంప్రతిపత్తి ఉన్న జిల్లాలు ఉన్నాయి.


గిరిజన జిల్లా కౌన్సిళ్లు
ఆర్టికల్ 244 (2), ఆర్టికల్ 275 (1) ప్రకారం స్వతంత్ర ప్రతిపత్తి గల జిల్లాలు, ప్రాంతాల ఏర్పాటు ద్వారా జిల్లా కౌన్సిళ్లు, ప్రాంతీయ కౌన్సిళ్ల ఏర్పాటు ద్వారా అసోంలోని గిరిజన ప్రాంతాల్లో పరిపాలన జరగాలని నిర్దేశించారు.
గిరిజనేతరుల వడ్డీ వ్యాపారాలను, ఇతర వాణిజ్య కార్యకలాపాలను నియంత్రించడానికి జిల్లా కౌన్సిళ్లకు అధికారాలు కల్పించారు.
కేంద్ర, రాష్ట్రాల చట్టాలు తమ జిల్లాలకు వర్తించకుండా నిరోధించే అధికారాలు ఈ కౌన్సిళ్లు కలిగి ఉన్నాయి.
ఈ కౌన్సిళ్లు క్రమం తప్పకుండా ఆదాయ, వ్యయ ఖాతాలను నిర్వహించాలని రాజ్యాంగం నిర్దేశించింది.
ఈ కౌన్సిళ్ల పనితీరును మదింపు చేయడానికి అవసరమైతే గవర్నర్ ఒక కమిషన్‌ను నియమించవచ్చు.
‣ ఈ కౌన్సిళ్ల కార్యకలాపాల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లవచ్చని సందేహం కలిగినప్పుడు వీటిని రద్దు చేసే అధికారం గవర్నరుకు ఉంది.


జిల్లా మండళ్లు, ప్రాంతీయ మండళ్లల నిర్మాణం
ప్రతి స్వయంప్రతిపత్తి జిల్లాకు ఒక జిల్లా మండలి ఉంటుంది.
జిల్లా మండలిలో 30 మంది సభ్యులు ఉండాలి.
వీరిలో 26 మంది వయోజన ఓటు ద్వారా ఎన్నికవుతారు.
మిగిలిన నలుగురిని గవర్నర్ నామినేట్ చేస్తారు.
‣  ప్రతి స్వతంత్ర ప్రాంతానికి ఒక ప్రాంతీయ మండలి ఉంటుంది.
 ప్రతి జిల్లా మండలిని ఆ జిల్లా పేరుతో పిలుస్తారు.
 ప్రాంతీయ మండలిని ఆ ప్రాంతం పేరుతో పిలుస్తారు.
 స్వయంప్రతిపత్తి జిల్లా పరిపాలన మొత్తం జిల్లా కౌన్సిల్ చేతుల్లో ఉంటుంది.
 జిల్లాలోని స్వతంత్ర ప్రాంతాల పరిపాలన మాత్రం ప్రాంతీయ మండలి పరిధిలో ఉంటుంది.
 రాష్ట్ర గవర్నర్ ఆయా తెగల ప్రాతినిధ్య సంఘాలు, తెగల మండళ్లతోనూ సంప్రదించి జిల్లా మండలి, స్వతంత్ర మండళ్ల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను రూపొందిస్తారు.
జిల్లా మండలి సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు.
 నామినేటెడ్ సభ్యుల పదవీ కాలం మాత్రం గవర్నర్ అభీష్టంపై ఆధారపడి ఉంటుంది.


షెడ్యూల్డు తెగల అభివృద్ధి చట్టాలు
 నేచర్ - మ్యాన్ - స్పిరిట్ భావన ప్రకారం ప్రకృతి, మానవుడు, ఆరాధనల మధ్య విడదీయలేని సంబంధం ఉంది.
‣  కొన్ని తెగల్లో వివాహానికి ముందుగా మామిడి చెట్లను వివాహం చేసుకునే ఆచారం ఇప్పటికీ ఉంది.


అటవీ చట్టం - 1878
 ఈ చట్టం ద్వారా అడవులపై రాష్ట్రాలకు ఉండే అధికారాన్ని మరింత విస్తృతపరిచారు.
 అడవుల్లో సంచరించడం, పశుపోషణ లాంటి కార్యకలాపాలను నిషేధించారు.
‣  భారతదేశ మొదటి అటవీ విధానాన్ని 1894లో ప్రకటించారు.భారత 


అటవీ చట్టం - 1927
ఈ చట్టం ద్వారా ఏర్పాటైన అటవీ శాఖ అధికారులు, అటవీ గార్డులు, ఐఎఫ్ఎస్ అధికారులతో కూడిన కార్యనిర్వాహక వ్యవస్థకు అధికారాలు సమకూర్చారు.
ఈ చట్టం ప్రకారం అటవీ వనరులకు నష్టం చేకూర్చే ఏ వ్యక్తినైనా వారంట్ లేకుండా అరెస్టు చేసే అధికారం అటవీ శాఖ అధికారులకు ఉంది.
1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం అడవులు అనే అంశాన్ని రాష్ట్ర జాబితాలోకి బదిలీ చేశారు.


గిరిజన భూముల అన్యాక్రాంత నిరోధక చట్టం - 1959
ఈ చట్టాన్ని 1/70 అంటారు.
దీన్ని ఆంధ్రప్రదేశ్‌లో 1959లో అమల్లోకి తెచ్చారు.


ఈ చట్టంలోని కీలకాంశాలు
గిరిజనేతరులు గిరిజనుల భూములను కొనకూడదు.
గిరిజనేతరులు తమ భూములను అమ్మాల్సి వస్తే గిరిజనులకే అమ్మాలి.
గిరిజనులు తమ భూములను తమవే అని నిరూపించుకోవాలి.


PESA చట్టం 1996
Panchayats Extension to the Scheduled Areas Act - PESA 1996, డిసెంబర్ 24 నుంచి అమల్లోకి వచ్చింది.
రాజ్యాంగంలోని 9వ భాగంలో ఆర్టికల్ 243 ప్రకారం పంచాయతీలకు సంబంధించిన అంశాలను షెడ్యూల్డు ప్రాంతాలకు కూడా వర్తించేలా చేసిన చట్టం ఇది.
దిలీప్‌సింగ్ భూరియా కమిటీ సిఫార్సుల మేరకు ఈ చట్టాన్ని చేశారు.
దిలీప్‌సింగ్ భూరియా కమిటీ గిరిజన ప్రాంతాల్లో స్వపరిపాలనకు 3 అంచెల వ్యవస్థను సిఫారసు చేసింది. అవి:
ఎ) గ్రామసభ: ఇది గిరిజనులు నివసించే సహజ ప్రాంతంపై ఆధిపత్యం కలిగి ఉండి, ఆ ప్రాంతంలో నివసించే ప్రజల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది.
బి) గ్రామ పంచాయతీ: ఇది గ్రామ సభ నుంచి ఎన్నికైన ప్రతినిధులతో ఏర్పడుతుంది.
సి) బ్లాకు/ తాలూకా: ఇది అత్యున్నత స్థాయి సంస్థ.  జిల్లా కౌన్సిల్‌లా ఉండే సంస్థ.


కీలకాంశాలు
గ్రామ ఓటరు జాబితాలో పేరు నమోదు అయిన వ్యక్తులతో కూడిన గ్రామసభ ఉంటుంది.
గ్రామసభ తమ ఆచార, సంప్రదాయాలు, సాంస్కృతిక గుర్తింపు, సామాజిక వనరులు, వివాద పరిష్కారాలు మొదలైన వాటిని భద్రంగా నిలిపి ఉంచడానికి, సంరక్షించుకోవడానికి అధికారాలు కలిగి ఉంటుంది.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుప్రీంకోర్టు

దేశానికి ధర్మపీఠం!

  దేశానికి అత్యున్నత న్యాయస్థానం. న్యాయం కోసం అందరూ ఆశ్రయించే ఆఖరి స్థానం. రాజ్యాంగం అమలులో వ్యక్తులు, వ్యవస్థలు అతిక్రమణలకు పాల్పడితే పర్యవేక్షించి పరిరక్షించే ప్రతిష్ఠాత్మక పీఠం. పౌరుల హక్కులకు సంపూర్ణ భద్రతనిచ్చే సమున్నత వేదిక. అక్కడ వచ్చే తీర్పు తిరుగులేనిది, విలువైనది, విశిష్టమైనది. ఆ ఉతృష్ట ధర్మక్షేత్రం రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది. ప్రభుత్వాలు లెవనెత్తే విభేదాలను విచారిస్తుంది. రాష్ట్రపతికి న్యాయసలహాదారుగా వ్యవహరిస్తుంది. ఆ వివరాలన్నింటినీ ఆర్టికల్స్‌తో సహా అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 

  భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. రాజ్యాంగం ప్రకారం పూర్తి స్వయంప్రతిపత్తితో ఏర్పాటైన ఉన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులు దేశంలోని ప్రతి ఒక్కరికి శిరోధార్యం. పార్లమెంటు రూపొందించే శాసనాలు, కార్యనిర్వాహక వర్గం అనుసరిస్తున్న విధానాలు రాజ్యాంగం ప్రకారం కొనసాగే విధంఆ పర్యవేక్షించే బాధ్యతను రాజ్యాంగ నిర్మాతలు సుప్రీంకోర్టుకు అప్పగించారు.

 

చారిత్రక నేపథ్యం

భారతదేశంలో న్యాయవ్యవస్థను ప్రవేశపెట్టింది వారన్‌ హేస్టింగ్స్‌. దాన్ని అభివృద్ధిపరిచి న్యాయవ్యవస్థ పితామహుడిగా ప్రసిద్ధి చెందింది కారన్‌ వాలీస్‌. ఈస్టిండియా కంపెనీ మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో 1773లో రూపొందించిన రెగ్యులేటింగ్‌ చట్టం ప్రకారం 1774, మార్చి 16న కలకత్తాలోని ఫోర్ట్‌ విలియంలో తొలిసారిగా సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. తొలి ప్రధాన న్యాయమూర్తిగా సర్‌ ఎలిజా ఇంఫే, ఇతర న్యాయమూర్తులుగా సీజర్‌ లైమెస్టర్, జాన్‌హైడ్, రాబర్ట్‌ ఛాంబర్స్‌ నియమితులయ్యారు. ఈ కోర్టును భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం ఫెడరల్‌ కోర్టుగా మార్పు చేసి 1937లో దిల్లీలో ఏర్పాటు చేశారు. ఫెడరల్‌ కోర్టులో తొలి ప్రధాన న్యాయమూర్తిగా సర్‌ మారిస్‌ గ్వేయర్‌ నియమితులయ్యారు. స్వాతంత్య్రానంతరం ఈ ఫెడరల్‌ కోర్టు 1950, జనవరి 28 నుంచి దిల్లీ కేంద్రంగా సుప్రీంకోర్టుగా మారింది. ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు ఇతర న్యాయమూర్తులతో అత్యున్నత న్యాయవ్యవస్థ ప్రస్థానం ప్రారంభమైంది. తొలి చీఫ్‌ జస్టిస్‌గా హరిలాల్‌ జె కానియా వ్యవహరించారు.

 

* మనదేశం ఏకీకృత, సమీకృత న్యాయవ్యవస్థను అనుసరిస్తుంది. దాని ప్రకారం జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు, దానికి దిగువన రాష్ట్ర స్థాయిలో హైకోర్టులు, వాటికి దిగువన జిల్లా స్థాయిలో సబార్డినేట్‌ కోర్టులు కొనసాగుతున్నాయి. దేశంలోని న్యాయస్థానాలన్నీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తాయి.

 

సుప్రీంకోర్టు ఏర్పాటుకు కారణాలు: * భారత రాజ్యాంగ ఆధిక్యతను కాపాడటం.

* ప్రాథమిక హక్కులను సంరక్షించడం.

* భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షించడం.

* రాజ్యాంగానికి అర్థ వివరణ ఇవ్వడం, వ్యాఖ్యానించడం.

 

రాజ్యాంగ వివరణ: రాజ్యాంగం Vవ భాగంలోని 124 - 147 మధ్య ఆర్టికల్స్‌ సుప్రీంకోర్టు నిర్మాణం, న్యాయమూర్తుల అర్హతలు, నియామకం, అధికారాలు, విధుల గురించి వివరిస్తున్నాయి.

 

ఆర్టికల్‌ 124: సుప్రీంకోర్టు ఏర్పాటు, నిర్మాణం గురించి తెలియజేస్తుంది.

 

ఆర్టికల్‌ 124(1): దీని ప్రకారం సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, కొందరు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. న్యాయమూర్తుల సంఖ్యను పెంచడానికి పార్లమెంటు కింది సంవత్సరాల్లో చట్టాలను రూపొందించింది.

 

సంవత్సరం    

న్యాయమూర్తుల సంఖ్య

(ప్రధాన, ఇతర న్యాయమూర్తులు)

1950 1 + 7
1956  1 + 10
1960 1 + 13
1978 1 + 17
1986  1 + 25
 2009   1 + 30
 2019   1 + 33

 

ఆర్టికల్‌ 124(3): న్యాయమూర్తుల నియామకానికి ఉండాల్సిన అర్హతలు:

* భారతీయ పౌరుడై ఉండాలి.

* రాష్ట్రపతి దృష్టిలో ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదుడై ఉండాలి.

* హైకోర్టు న్యాయమూర్తిగా అయిదేళ్లు లేదా హైకోర్టులో న్యాయవాదిగా 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి.


ఆర్టికల్‌ 124(2): న్యాయమూర్తుల నియామకం: సాధారణంగా ప్రధాని నేత్పత్వంలోని కేంద్ర మంత్రిమండలి సిఫార్సుల మేరకు రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు. రాష్ట్రపతి సంతకం, సీలు వేసిన వారెంటు ద్వారా ఈ నియామకాలు జరుగుతాయి.

 

న్యాయమూర్తుల నియామక ప్రక్రియ - సుప్రీంకోర్టు విభిన్న తీర్పులు

 

ఎస్‌.పి.గుప్తా Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1982): న్యాయమూర్తుల నియామకం సమయంలో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియంను రాష్ట్రపతి సంప్రదించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీన్ని ‘ఫస్ట్‌ జడ్జస్‌ కేసు’గా పేర్కొంటారు.

 

సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1993): న్యాయమూర్తుల నియామకం సమయంలో రాష్ట్రపతి తప్పనిసరిగా కొలిజీయంను సంప్రదించాలని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి మరో ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులను సంప్రదించి తన అభిప్రాయాన్ని తెలియజేయాలని పేర్కొంది. దీన్ని ‘సెకండ్‌ జడ్జస్‌ కేసు’గా పేర్కొంటారు.

1998లో నాటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ కొలీజియం వ్యవస్థపై ఆర్టికల్‌ 143 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయసలహా కోరారు. 1999లో తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొలీజియం వ్యవస్థకు సంబంధించి వివరణ ఇచ్చింది. దాని ప్రకారం..

* కొలీజియం అంటే ప్రధాన న్యాయమూర్తితో (సీజేఐ) పాటు మరో నలుగురు సీనియర్‌ న్యాయమూర్తుల సముదాయం. సాధారణంగా కొలీజియం ఏకాభిప్రాయం ఆధారంగా తన నిర్ణయాన్ని తెలియజేస్తుంది. 

* రాష్ట్రపతి కొలీజియం సలహాను తప్పనిసరిగా పాటించాలి. కొలీజియంను సంప్రదించిన తర్వాత న్యాయమూర్తులను నియమించాలి.

 

జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్‌ (NJAC) :  డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 120వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా న్యాయమూర్తుల నియామకం కోసం జడ్జస్‌ అపాయింట్‌మెంట్‌ కమిటీ (JAC) ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించి విఫలమైంది.

  నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 120వ రాజ్యాంగ సవరణ బిల్లును ఉపసంహరించి, దాన్ని 121వ రాజ్యాంగ సవరణ బిల్లుగా రూపొందించింది. దీన్ని న్యాయమూర్తుల నియామకం కోసం ఉద్దేశించిన జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్‌ (ఎన్‌జేఏసీ) ముసాయిదాను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీన్ని పార్లమెంటు 2/3 ప్రత్యేక మెజార్టీతో ఆమోదించింది. తర్వాత దేశంలోని 15 రాష్ట్రాలు కూడా అంగీకారాన్ని తెలిపాయి. తర్వాత అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అధికార ముద్ర వేయడంతో అది ‘99వ రాజ్యాంగ సవరణ చట్టం, 2014’గా మారింది. ఎన్‌జేఏసీ 2015, ఏప్రిల్‌ 13 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం న్యాయమూర్తుల నియామకం సమయంలో రాష్ట్రపతి కొలీజియంకు బదులుగా ఎన్‌జేఏసీని సంప్రదించాల్సి ఉంటుంది.

 

సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు, 2015: ఎన్‌జేఏసీ ఏర్పాటు చెల్లుబాటు కాదని, అది రాజ్యాంగ విరుద్ధమని 2015, అక్టోబరు 16న సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీని ఫలితంగా న్యాయమూర్తుల నియామకం సమయంలో రాష్ట్రపతి ఎన్‌జేఏసీకు బదులుగా తిరిగి సీజేఐ నేతృత్వంలోని కొలీజియంనే సంప్రదించాలి.

 

ప్రధాన న్యాయమూర్తి నియామకం: * సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమిస్తారు. 1950 నుంచి 1973 వరకు సీనియర్‌ న్యాయమూర్తిని మాత్రమే ప్రధాన న్యాయమూర్తిగా నియమించే విధానం కొనసాగింది. 1973లో ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో సీనియర్‌ న్యాయమూర్తులైన జె.ఎం.షేలట్, ఎ.ఎన్‌.గ్రోవర్, కె.ఎస్‌.హెగ్డేలను విస్మరించి 4వ స్థానంలో ఉన్న ఎ.ఎన్‌.రే ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. 

* 1977లో మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వ కాలంలో సీనియర్‌ న్యాయమూర్తి అయిన హెచ్‌.ఆర్‌.ఖన్నాను విస్మరించి ఎమ్‌.హెచ్‌.బేగ్‌ను సీజేఐగా నియమించారు.

* 1993లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సీనియర్‌ న్యాయమూర్తిని మాత్రమే ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలి.

 

తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి:  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 126 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి అనుకోని పరిస్థితుల్లో ఖాళీ అయినా, ప్రధాన న్యాయమూర్తి ఏ కారణంతోనైనా తన విధులు నిర్వహించలేకపోయినా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరిని రాష్ట్రపతి ‘తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి’గా నియమిస్తారు.

 

తాత్కాలిక న్యాయమూర్తులు (Adhoc Judges): ఆర్టికల్‌ 127 ప్రకారం సుప్రీంకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తులను రాష్ట్రపతి అనుమతితో ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారు. ఈ విధంగా నియమితులైనవారికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పొందే అధికారాలు, వేతనాలు లభిస్తాయి. వీరి పదవీ కాలం 2 సంవత్సరాలు.

 

ప్రమాణ స్వీకారం

ఆర్టికల్‌ 124(6) ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు రాష్ట్రపతి సమక్షంలో రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్‌లో పేర్కొన్న పద్ధతిలో కింది విధంగా ప్రమాణస్వీకారం చేస్తారు.

‘రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను కలిగి ఉంటానని.. రాజ్యాంగాన్ని, శాసనాలను సంరక్షిస్తానని, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను పరిరక్షిస్తానని, సంపూర్ణ విశ్వాసంతో, పూర్తి సామర్థ్యంతో ఎలాంటి పక్షపాతం, భయం లేకుండా విధులు నిర్వహిస్తానని’ ప్రమాణం చేస్తారు.

 

రాజీనామా: ఆర్టికల్‌ 124(A) ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.

 

పదవీకాలం: సుప్రీంకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులందరి పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు.

 

జీతభత్యాలు: ఆర్టికల్‌ 125 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల జీతభత్యాల గురించి వివరిస్తుంది. జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి సమయంలో తప్ప మిగిలిన సందర్భాల్లో వీరి జీతభత్యాలు తగ్గించకూడదు.

* 2018లో చేసిన చట్టం ప్రకారం ప్రధాన న్యాయమూర్తి నెల వేతనం రూ.2.8 లక్షలు, ఇతర న్యాయమూర్తుల వేతనం రూ.2.5 లక్షలు. ఉచిత నివాసం, వైద్యం, రవాణా, టెలిఫోన్‌ సదుపాయం ఉంటుంది. పదవీ విరమణ అనంతరం వారు చివరిసారిగా పొందిన జీతభత్యంలో 50% నెలసరి పెన్షన్‌గా పొందుతారు.

 

తొలగింపు ప్రక్రియ

  అవినీతి, అసమర్థత, దుష్ప్రవర్తన వంటి కారణాలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పార్లమెంటు 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో తొలగించవచ్చు. వీరిని తొలగించే అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఈ అభిశంసన తీర్మాన నోటీసును లోక్‌సభలో ప్రవేశపెట్టాలంటే 100 మంది లోక్‌సభ సభ్యుల సంతకాలు, రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే 50 మంది రాజ్యసభ సభ్యుల సంతకాలు అవసరం. 14 రోజుల ముందస్తు నోటీసుతో తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెడతారో ఆ సభాధిపతి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ విచారణ అనంతరం ఇచ్చే నివేదికపై ఆ సభ చర్చించి 2/3వ వంతు మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదిస్తే, రెండో సభకు పంపుతారు. అక్కడా 2/3వ వంతు మెజార్టీతో ఆమోదిస్తే సదరు న్యాయమూర్తిని రాష్ట్రపతి తొలగిస్తారు. తొలగింపు తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెడతారో ఆ సభ తీర్మానాన్ని తిరస్కరిస్తే రెండో సభకు పంపాల్సిన అవసరం లేదు. ఒక సభ ఆమోదించిన తీర్మానాన్ని రెండో సభ తిరస్కరిస్తే తీర్మానం రద్దవుతుంది. మన దేశంలో ఇంతవరకు ఈ తీర్మానం ద్వారా ఎవరినీ తొలగించలేదు. 1991లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామస్వామిపై ఈ తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ అది వీగిపోయింది. తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

 

* సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌.జె.కానియా.

* సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ.

* మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె.జి.బాలకృష్ణన్‌.

* సీజేఐగా పనిచేసిన తొలి తెలుగు వ్యక్తి జస్టిస్‌ కోకా సుబ్బారావు.

* ఎక్కువ కాలం సీజేఐగా పనిచేసినవారు జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌ (7 సంవత్సరాల 14 రోజులు) 

* తక్కువ కాలం సీజేఐగా పనిచేసినవారు జస్టిస్‌ కె.ఎన్‌.సింగ్‌ (18 రోజులు)

* సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఫాతిమాబీబీ

 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 19-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జాతీయ మహిళా కమిషన్‌

మాదిరి ప్రశ్నలు

1. జాతీయ మహిళా కమిషన్‌ మన దేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

1) 1990 జనవరి 31        2) 1991 జనవరి 31       3) 1992 జనవరి 31       4) 1993 జనవరి 31


2. జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్, సభ్యుల పదవీకాలం ఎంత?

1) 3 సంవత్సరాలు          2) 4 సంవత్సరాలు       3) 5 సంవత్సరాలు        4) 6 సంవత్సరాలు


3. కిందివారిలో జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనివారు?

1) జయంతి పట్నాయక్‌       2) మోహిని గిరి        3) విభా పార్థసారథి        4) అనుపమ కౌర్‌


4.     ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌?

1) రేఖాశర్మ         2) లలితా కుమార మంగళం 
3) మమతాశర్మ         4) గిరిజా వ్యాస్‌


5. మహిళల సంరక్షణకు కేంద్రప్రభుత్వం రూపొందించిన చట్టాలకు సంబంధించి సరికానిది? 

1) హిందూ వివాహ చట్టం, 1955         2) వరకట్న నిషేధ చట్టం, 1961 
3) ప్రసూతి సౌకర్యాల చట్టం, 1961   
   4) గర్భవిచ్ఛిత్తి చట్టం, 1966


6. భారత ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది?

1) 2005            2) 2006         3) 2007             4) 2008


7. మనదేశంలో ఎవరి కృషి మేరకు 1953లో మహిళా సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర సాంఘిక సంక్షేమ మండలిని ఏర్పాటు చేశారు?

1) విజయలక్ష్మి పండిట్‌          2) సరోజినీ నాయుడు 
3) దుర్గాబాయి దేశ్‌ముఖ్‌         4) యామినీ పూర్ణతిలకం


8. సుప్రీంకోర్టు పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించడానికి అవసరమైన మార్గదర్శకాలను ఏ కేసు సందర్భంగా వెలువరించింది?

1) రూప్‌కన్వర్‌ జు( భారత ప్రభుత్వం        2) డేరాబాబా జు( భారత ప్రభుత్వం 
3) విశాఖ స్వచ్ఛంద సంస్థ ( స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌)        4) లియోకర్ణన్‌ ( బాంబేస్టేట్‌)


9. నిర్భయ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

1) 2012          2) 2013           3) 2014             4) 2015


10. జాతీయ మహిళా కమిషన్‌ నిర్వహించే ప్రాంతీయ సమావేశాలను ఏమని పేర్కొంటారు?

1) వాయిస్‌ ఆఫ్‌ ది వాయిస్‌లెస్‌        2) వాయిస్‌ ఆఫ్‌ ది వాయిస్‌ 
3) వాయిస్‌ ఓవర్‌ ది వాయిస్‌        4) బిగ్‌ వాయిస్‌


సమాధానాలు: 1-3; 2-1; 3-4; 4-1; 5-4; 6-1; 7-3; 8-3; 9-2; 10-1.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జాతీయ షెడ్యూల్డు కులాల, తెగల కమిషన్‌

మాదిరి ప్రశ్నలు

1. 1978లో ఏ ప్రధాని కాలంలో కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా షెడ్యూల్డు కులాలు, తెగల కమిషన్‌ను ఏర్పాటుచేశారు?

1) ఇందిరా గాంధీ           2) మొరార్జీ దేశాయ్‌       3) చరణ్‌సింగ్‌        4) రాజీవ్‌ గాంధీ

2. 1978లో ఏర్పాటైన షెడ్యూల్డు కులాల, తెగల కమిషన్‌ మొదటి ఛైర్మన్‌?

1) బోళ పాశ్వాన్‌ శాస్త్రి         2) రఘుపతి నాయక్‌         3) దిలీప్‌సింగ్‌ భూరియా        4) భూటాసింగ్‌


3. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల కమిషన్‌ను 1987లో ఏ ప్రధాని కాలంలో జాతీయ షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల కమిషన్‌గా రూపొందించారు?

1) విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌        2) ఇందిరా గాంధీ      3) రాజీవ్‌ గాంధీ        4) చంద్రశేఖర్‌


4. విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ ప్రభుత్వం ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు రాజ్యాంగ భద్రతను కల్పించింది?

1) 65వ          2) 66వ          3) 67వ          4) 68వ 


5. రాజ్యాంగ భద్రతను పొందిన జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మనదేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

1) 1990, మార్చి 12        2) 1991, మార్చి 12       3) 1991, ఏప్రిల్‌ 1        4) 1992, మార్చి 12


6. కిందివారిలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించనివారు?

1) రామ్‌ధన్‌          2) హనుమంతప్ప     3) భూటాసింగ్‌         4) దిలీప్‌సింగ్‌ భూరియా


7. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు చివరి ఛైర్మన్‌?

1) విజయ్‌శంకర్‌ శాస్త్రి        2) దిలీప్‌సింగ్‌ భూరియా       3) సూరజ్‌ భాన్‌         4) హనుమంతప్ప


8. అటల్‌బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను 2004లో జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్, జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్‌గా విభజించింది?

1) 86వ          2) 87వ          3) 88వ              4) 89వ 


9. జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్‌ గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?

1) ఆర్టికల్‌ 337        2) ఆర్టికల్‌ 338         3) ఆర్టికల్‌ 339         4) ఆర్టికల్‌ 338(A)


10. కిందివాటిలో జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్‌కు సంబంధించి సరికానిది?

1) ఒక ఛైర్మన్, ఒక డిప్యూటీ ఛైర్మన్‌ ఉంటారు.
2) ముగ్గురు సభ్యులు ఉంటారు.
3) తప్పనిసరిగా ఒక మహిళా సభ్యురాలు ఉండాలి.
4) ఛైర్మన్‌ సభ్యులందరినీ నియమిస్తారు.


11. జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్‌ ఛైర్మన్, సభ్యుల పదవీకాలం?

1) ఆరేళ్లు        2) అయిదేళ్లు       3) నాలుగేళ్లు         4) మూడేళ్లు


12. షెడ్యూల్డు కులాల, తెగల అకృత్యాల నిరోధక చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?

1) 1987         2) 1988           3) 1989          4) 1990


సమాధానాలు:  1-2; 2-1; 3-3; 4-1; 5-4; 6-3; 7-1; 8-4; 9-2; 10-4; 11-4; 12-3. 

Posted Date : 26-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

లా కమిషన్‌

దేశంలో న్యాయ పాలనను సమర్థవంతంగా నిర్వహించడానికి, సామాజిక న్యాయాన్ని ప్రజలందరికీ అందించడానికి, అవసరమైన అంశాలపై శాస్త్రీయ అధ్యయనాన్ని నిర్వహించి, తగు సూచనలు, సిఫార్సులు చేసేందుకు ‘లా కమిషన్‌’ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ నేపథ్యం, నిర్మాణం, విధులపై పోటీ పరీక్షార్థులకు అవగాహన అవసరం.


నేపథ్యం

* మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు ఆంగ్లేయుల పాలనా కాలంలో చార్టర్‌ చట్టం  1833 ప్రకారం 1834లో లార్డ్‌ మెకాలే అధ్యక్షతన తొలిసారిగా లా  కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* దీని తర్వాత 1853, 1861, 1879లలో వివిధ లా    కమిషన్‌లు ఏర్పాటయ్యాయి. వీటి సిఫార్సుల మేరకు మనదేశంలో 1859లో సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌; 1860లో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌; 1861లో క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లను రూపొందించారు.


స్వాతంత్య్రానంతరం..

* స్వాతంత్య్రం తర్వాత మనదేశంలో మొదటి లా కమిషన్‌ను 1955లో ఎంసీ సెతల్‌వాడ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ను కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీన్ని మూడేళ్లకోసారి పునర్‌వ్యవస్థీకరిస్తున్నారు.
* దేశంలో ఇప్పటి వరకు 21 లా కమిషన్‌లను ఏర్పాటు చేశారు.
* న్యాయ మంత్రిత్వశాఖకు సలహాదారుగా వ్యవహరించడం దీని ఉద్దేశం.
* ఈ కమిషన్‌లో ఛైర్మన్‌ (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి), నలుగురు సభ్యులు ఉంటారు. 

 

20వ లా కమిషన్‌ - ప్రధాన సిఫార్సులు:

* ఎన్నికల సంస్కరణల అమలుపై 255వ నివేదికను కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు సమర్పించింది.
* ఉరిశిక్ష రద్దుకు సంబంధించి 262వ నివేదికలో కీలక సూచనలు చేసింది. దీని ప్రకారం ఉగ్రవాదం, దేశంపై యుద్ధం ప్రకటించడం మొదలైనవి మినహాయించి ఇతర అన్ని రకాల నేరాలకు ఉరిశిక్షను రద్దు చేయాలని పేర్కొంది.


21వ లా కమిషన్‌ - ప్రధాన సిఫార్సులు:

* ఇది తన 268వ నివేదికను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సమర్పించి, కింది సిఫార్సులు చేసింది.
* తప్పుచేసే న్యాయవాదులకు శిక్షలు విధించాలి. 
* న్యాయవాదులు సమ్మె చేయడం వల్ల కక్షిదారులకు నష్టం జరిగితే సంబంధిత న్యాయవాదులే పరిహారం చెల్లించాలి. ఈ అంశాల పర్యవేక్షణకు ఒక చట్టబద్ధ సంస్థను ఏర్పాటు చేయాలి.
* అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరు వివాహ వయోపరిమితులు లేకుండా, ఇద్దరికీ కనీస వివాహ వయసును 18 ఏళ్లుగా నిర్ణయించాలి.
* వివాహమైన దంపతుల్లో ఆస్తిని ఎవరు సమకూర్చినా దాన్ని వారి ఉమ్మడి ఆస్తిగానే పరిగణించాలి. వారు విడాకులు తీసుకుంటే స్త్రీకి సమాన వాటా ఇవ్వాలి. 
* క్రికెట్‌తో సహా ఇతర అన్ని క్రీడలపై బెట్టింగ్, జూదాన్ని చట్టబద్ధం చేయాలి.
* బెట్టింగ్‌ను చట్టబద్ధం చేశాక మ్యాచ్‌ ఫిక్సింగ్‌ మోసాలు జరగకుండా కఠినమైన నిబంధనలు రూపొందించాలి.


వేతన కమిషన్‌ (Pay Commission) 

* ప్రభుత్వ ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్రం వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తోంది.ఇది మారుతున్న కాల పరిస్థితులు, నిత్యావసర సరకుల ధరల పెరుగుదల ఆధారంగా ఉద్యోగులు, పింఛన్‌దార్ల వేతనాలు, ఇతర అంశాలపై అధ్యయనం చేసి  ప్రభుత్వానికి తగు సూచనలు చేస్తుంది.
* మనదేశంలో ఇప్పటివరకు 7 వేతన సవరణ కమిషన్‌లు ఏర్పాటయ్యాయి.

వేతన సవరణ సంఘం సంవత్సరం ఛైర్మన్‌
1వ 1946 శ్రీనివాస వరదాచారియార్‌
2వ 1957 జగన్నాథ్‌ దాస్‌
3వ 1970 రఘువీర్‌ దయాళ్‌
4వ 1983 పి.ఎన్‌.సింఘాల్‌
5వ 1994 రత్నవేల్‌ పాండ్యన్‌
6వ 2006 జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ
7వ 2014 జస్టిస్‌ ఎ.కె.మాథూర్‌

                

లా కమిషన్‌ విధులు
* కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వివిధ అంశాలపై అధ్యయనాలు నిర్వహించి, సంస్కరణలను సూచిస్తుంది. దేశంలో అమల్లో ఉన్న వివిధ చట్టాల పనితీరును అధ్యయనం చేస్తుంది.
* ఏదైనా విషయంలో సంస్కరణలు అవసరమని భావిస్తే కమిషన్‌ స్వయం పరిశీలన చేయొచ్చు. సమాజంలోని విభిన్న వర్గాల సామాజిక స్థితిగతులు, ఆచార సంప్రదాయాలను అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేస్తుంది.
* సామాజిక, రాజకీయ, న్యాయ అంశాలపై అభిలషణీయమైన నివేదికలు రూపొందించి, ప్రభుత్వానికి నివేదిస్తుంది.


వివిధ లా కమిషన్‌లు, ఛైర్మన్‌ల వివరాలు

లా కమిషన్‌ ఛైర్మన్‌ పదవీకాలం
1వ జస్టిస్‌ ఎంసీ సెతల్వాడ్‌ 1955-58
2వ జస్టిస్‌ వెంకట్రామ అయ్యర్‌ 1958-61
3వ జస్టిస్‌ జేఎల్‌ కపూర్‌ 1961-64
4వ జస్టిస్‌ జేఎల్‌ కపూర్‌ 1964-68
5వ జస్టిస్‌ కేవీకే సుందరం (ఐసీఎస్‌ అధికారి) 1968-71
6వ జస్టిస్‌ పీబీ గజేంద్ర గడ్కర్‌ 1971-74
7వ జస్టిస్‌ పీబీ గజేంద్ర గడ్కర్‌ 1974-77
8వ జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నా 1977-79
9వ జస్టిస్‌ పీవీ దీక్షిత్‌ 1979-80
10వ జస్టిస్‌ కేకే మాథ్యూ 1981-85
11వ జస్టిస్‌ డీఏ దేశాయ్‌ 1985-88
12వ జస్టిస్‌ ఎంపీ ఠక్కర్‌ 1988-91
13వ జస్టిస్‌ కేఎన్‌ సింగ్‌ 1991-94
14వ జస్టిస్‌ కే జయచంద్రారెడ్డి 1995-97
15వ జస్టిస్‌ బీపీ జీవన్‌రెడ్డి 1997-2000
16వ జస్టిస్‌ బీపీ జీవన్‌రెడ్డి
ఎం. జగన్నాథరావు
2000-01
2002-03
17వ  జస్టిస్‌ ఎం జగన్నాథరావు 2003-06
18వ జస్టిస్‌ ఏఆర్‌ లక్ష్మణ్‌ 2006-09
19వ జస్టిస్‌ పి వెంకట్రామిరెడ్డి 2009-12
20వ జస్టిస్‌ డీకే జైన్‌ (రాజీనామా చేశారు) 
జస్టిస్‌ అజిత్‌ ప్రకాశ్‌ షా

2012-13
2013-15

21వ జస్టిస్‌ బల్బీర్‌సింగ్‌ చౌహాన్‌ 2015-18

                         
నమూనా ప్రశ్నలు

1. 1834లో ఏర్పాటైన లా కమిషన్‌కు అధ్యక్షులుగా ఎవరు వ్యవహరించారు?

1) లార్డ్‌ మెకాలే         2) చార్లెస్‌ హాప్‌కిన్స్‌
3) థామస్‌ ఉడ్స్‌         4) ఎలిన్‌బరో


2. కిందివాటిలో సరికానిది ఏది?
1) సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ను 1859లో రూపొందించారు.
2) ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ను 1860లో రూపొందించారు.
3) క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ను 1861లో రూపొందించారు.
4) కామన్‌ సివిల్‌ కోడ్‌ను 1866లో రూపొందించారు.


3. మనదేశంలో స్వాతంత్య్రం తర్వాత 1955లో ఏర్పడిన మొదటి లా కమిషన్‌కు అధ్యక్షులుగా వ్యవహరించింది?
1) ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్‌
2) ఎం.సి.సెతల్‌వాడ్‌ 
3) శ్రీనివాస అయ్యంగార్‌  
4) వరదాచారి అయ్యర్‌


4. కిందివాటిలో సరైంది ఏది?
1) సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లా కమిషన్‌కు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
2) సాధారణంగా మూడేళ్లకోసారి లా కమిషన్‌ను పునర్‌వ్యవస్థీకరిస్తారు.
3) మనదేశంలో ఇప్పటివరకు 21 లా కమిషన్‌లు తమ నివేదికలను సమర్పించాయి.
4) పైవన్నీ సరైనవే


5. వివిధ లా కమిషన్‌లు వాటి అధ్యక్షులకు సంబంధించి సరికానిది ఏది? 
1) 14వ లా కమిషన్‌ - జస్టిస్‌ కె.జయచంద్రారెడ్డి
2) 15వ లా కమిషన్‌ - జస్టిస్‌ బి.పి.జీవన్‌రెడ్డి
3) 16వ లా కమిషన్‌ - జస్టిస్‌ కె.ఎన్‌.సింగ్‌
4) 18వ లా కమిషన్‌ - జస్టిస్‌ ఎ.ఆర్‌.లక్ష్మణ్‌


6. 21వ లా కమిషన్‌కు అధ్యక్షులుగా ఎవరు నియమితులయ్యారు?
1) జస్టిస్‌ బల్బీర్‌సింగ్‌ చౌహాన్‌ 2) జస్టిస్‌ డి.కె.జైన్‌
3) జస్టిస్‌ పి.వెంకట్రామిరెడ్డి
4) జస్టిస్‌ అజిత్‌ ప్రకాశ్‌ షా

 

7. 21వ లా కమిషన్‌ సిఫార్సును గుర్తించండి.
1) న్యాయవాదుల సమ్మె వల్ల కక్షిదారులు నష్టపోతే, సంబంధిత న్యాయవాదులే పరిహారం చెల్లించాలి.
2) క్రికెట్‌తో సహా అన్ని క్రీడలపై బెట్టింగ్, జూదాన్ని చట్టబద్ధం చేయాలి.
3) ఉరిశిక్షను మరిన్ని రంగాలు/ నేరాలకు విస్తరించాలి.
4) 1, 2


8. 21వ లా కమిషన్‌ సిఫార్సులకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి.
1) అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరు వివాహ వయోపరిమితులు ఉండటం సరికాదు.
2) అమ్మాయిలు, అబ్బాయిల వివాహ వయోపరిమితి 18 సంవత్సరాలుగా ఉండాలి.
3) వివాహమైన దంపతుల్లో ఆస్తిని ఎవరు సంపాదించినా, దాన్ని వారి ఉమ్మడి ఆస్తిగానే పరిగణించాలి.
4) పైవన్నీ సరైనవే


9. ఉగ్రవాదం, దేశంపై యుద్ధం ప్రకటించడం లాంటి నేరాలు తప్ప, ఇతర అన్ని రకాల నేరాలకు ఉరిశిక్షను రద్దు చేయాలని 262వ నివేదికలో పేర్కొన్న లా  కమిషన్‌ ఏది?
1) 21వ లా కమిషన్‌     2) 20వ లా కమిషన్‌
3) 19వ లా కమిషన్‌     4) 18వ లా కమిషన్‌


10. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల జీతభత్యాలు, ఇతర అంశాలపై అధ్యయనం కోసం మనదేశంలో ఇప్పటి వరకు ఏర్పాటైన వేతన సవరణ కమిషన్‌లు?
1) 5       2) 6       3) 7       4) 8


11. వివిధ వేతన సవరణ కమిషన్‌లు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి.
1) ఒకటో వేతన సవరణ కమిషన్‌ -   శ్రీనివాస వరదాచారియార్‌
2) రెండో వేతన సవరణ కమిషన్‌ -    రత్నవేల్‌ పాండ్యన్‌
3) ఆరో వేతన సవరణ కమిషన్‌ -   జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ
4) ఏడో వేతన సవరణ కమిషన్‌ -   జస్టిస్‌ ఎ.కె.మాథూర్‌


12. 20వ లా కమిషన్‌ ఎన్నికల సంస్కరణ అమలుపై కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు సమర్పించిన నివేదిక ఎన్నోది? 
1) 239వ నివేదిక          2) 251వ నివేదిక
3) 255వ నివేదిక          4) 265వ నివేదిక


సమాధానాలు: 1-1; 2-4; 3-2; 4-4; 5-3; 6-1; 7-4; 8-4; 9-2; 10-3; 11-2; 12-3.

Posted Date : 06-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుప్రీంకోర్టు - అధికారాలు - విధులు

విధులు విస్తృతం... అధికారాలు సర్వోన్నతం


భారత రాజ్యాంగ అమలును పరిపూర్ణ బాధ్యతతో పర్యవేక్షించడంతోపాటు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే అత్యున్నత విధులను సుప్రీంకోర్టు నిర్వహిస్తోంది. అందుకోసం రాజ్యాంగం కల్పించిన విస్తృత అధికార పరిధిని వినియోగించుకుంటుంది. పౌర హక్కులు మొదలు శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య తలెత్తే వివాదాలకు అంతిమ తీర్పును ప్రకటిస్తుంది. సర్వోన్నత న్యాయస్థానానికి సంబంధించిన ఈ విశిష్ట అంశాలను పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. మన న్యాయవ్యవస్థ నిర్మాణం బ్రిటన్‌ న్యాయవ్యవస్థను, పనితీరు అమెరికా న్యాయవ్యవస్థను పోలి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన సుప్రీంకోర్టు స్వయంప్రతిపత్తితో వ్యవహరిస్తూ దేశపరిపాలనను రాజ్యాంగబద్ధంగా కొనసాగించడంలో తనకున్న అధికారాలను వినియోగిస్తుంది.

ప్రారంభ/ప్రాథమిక/ఒరిజనల్‌ విచారణాధికారాలు:  ఆర్టికల్‌ 131 ప్రకారం మన దేశ సమాఖ్య స్వభావాన్ని కాపాడటం సుప్రీంకోర్టు అధికార పరిధిలోకి వస్తుంది. సమాఖ్య వివాదాలన్నింటినీ సుప్రీంకోర్టులోనే పరిష్కరించుకోవాలి. అవి: 

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తే వివాదాలు.

* కేంద్ర ప్రభుత్వం ఒక వైపు, రాష్ట్ర ప్రభుత్వాలు మరో వైపు ఉన్నప్పుడు తలెత్తే వివాదాలు. 

* దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలు.

* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు. 

* ఏవైనా రాజ్యాంగబద్ధతను నిర్ణయించే అంశాలు.

ఉదా: * 1957లో భారత ప్రభుత్వం ‘బొగ్గు గనుల ప్రాంతాల అభివృద్ధి చట్టం’ చేసింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా భారత ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తొలిసారిగా ప్రారంభ/ఒరిజినల్‌ విచారణాధికార పరిధిని వినియోగించుకుంది.

* 1981లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించేందుకు భారత ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడం సమంజసమేనని సుప్రీంకోర్టు పేర్కొంది.

 

ప్రాథమిక/ఒరిజినల్‌ విచారణాధికార పరిధి నుంచి మినహాయించిన అంశాలు: 

ఆర్టికల్‌ 81: నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ చేసిన సిఫార్సులను అనుసరించి లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై పార్లమెంటు రూపొందించిన చట్టాలు.

ఆర్టికల్‌ 246: కేంద్ర జాబితాలోని అంశాలపై వివాదాలు.

ఆర్టికల్‌ 253: భారత ప్రభుత్వం విదేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలు.

ఆర్టికల్‌ 262: అంతర్రాష్ట్ర నదీజలాల పంపకం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పులు/అవార్డులను అనుసరించి పార్లమెంటు చేసిన చట్టాలు.

ఆర్టికల్‌ 275: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మంజూరు చేసే సహాయక గ్రాంట్లు.

ఆర్టికల్‌ 280: కేంద్ర ఆర్థిక సంఘం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వనరులను పంపిణీకి చేసిన సిఫార్సులకు సంబంధించిన అంశాలు.

ఆర్టికల్‌ 290: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు.

ఆర్టికల్‌ 304: అంతర్రాష్ట్ర వ్యాపార, వాణిజ్యానికి సంబంధించిన చట్టాలు


అప్పీళ్ల విచారణ


సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత అప్పీళ్ల కోర్టు. హైకోర్టులు ఇచ్చిన తీర్పుల పట్ల అసంతృప్తి చెందినవారు సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయాలంటే సంబంధిత హైకోర్టు అనుమతి ఉండాలి. దీనినే అప్పీళ్ల విచారణాధికార పరిధి అంటారు. సుప్రీంకోర్టు స్వీకరించే అప్పీల్‌ వివాదాలను వివిధ రకాలుగా పేర్కొనవచ్చు.


రాజ్యాంగపరమైన అప్పీళ్లు (ఆర్టికల్‌ 132): రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలు రాజ్యాంగబద్ధతను ప్రశ్నించే విధంగా ఉన్నప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుల విషయంలో రాజ్యాంగాన్ని మరింత లోతుగా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ధ్రువీకరిస్తే అలాంటి వాటిని సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చు.

ఉదా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రద్దు చేయగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది.


సివిల్‌ అప్పీళ్లు (ఆర్టికల్‌ 133): ఆస్తికి సంబంధించిన సివిల్‌ వివాదంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో చట్టానికి సంబంధించిన లోతైన అంశం లేదా రాజ్యాంగపరమైన అంశం ఇమిడి ఉందని భావించినప్పుడు హైకోర్టు ఇచ్చే ధ్రువీకరణతో సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చు.

* 30వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆస్తి విలువపై పరిమితిని తొలగించారు. కానీ ఆర్టికల్‌ 134(A) ప్రకారం హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలంటే హైకోర్టు అనుమతి తప్పనిసరి.


క్రిమినల్‌ అప్పీళ్లు (ఆర్టికల్‌ 134): వివిధ క్రిమినల్‌ కేసుల్లో హైకోర్టులు ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చు. జిల్లా సెషన్స్‌ కోర్టు ఏదైనా కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించినప్పుడు అదే కేసును హైకోర్టు విచారించి నిందితుడికి ఉరిశిక్ష/యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చు. అలాగే దిగువ న్యాయస్థానం విధించిన మరణశిక్షను పునఃసమీక్షించి హైకోర్టు మరణశిక్షను రద్దు చేసిన సందర్భంలోనూ సంబంధిత వ్యక్తులు సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చు.


* 1970లో పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారం పది సంవత్సరాల కంటే ఎక్కువ కాలం శిక్ష పడిన వ్యక్తులు నేరుగా సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చు. 

ప్రత్యేక అప్పీళ్లు (ఆర్టికల్‌ 136): వివిధ కేసుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవడానికి హైకోర్టు తిరస్కరించినప్పుడు ప్రత్యేకమైన అప్పీళ్లకు అవకాశం కల్పిస్తారు. సంబంధిత కేసుల్లో ఏదైనా న్యాయపరమైన ప్రత్యేక అంశం ఇమిడి ఉన్నప్పుడు హైకోర్టు ఏదైనా అంశాన్ని పరిగణనలోకి తీసుకోని సందర్భంలో సుప్రీంకోర్టులో ప్రత్యేక అప్పీళ్లకు వీలు కల్పిస్తారు. సుప్రీంకోర్టు స్క్రీనింగ్‌ కమిటీ వీటిని పరిశీలించి అనుమతిస్తుంది. ఈ అప్పీళ్లను కేవలం హైకోర్టుకే కాకుండా ఇతర కోర్టులు, ట్రైబ్యునల్స్‌కు వ్యతిరేకంగా కూడా అనుమతిస్తారు.

కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌ (ఆర్టికల్‌ 129): సుప్రీంకోర్టుకు ‘కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌’ అధికారం ఉంది. వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది. కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌నే ‘అనుపూర్వికాలు’ అని కూడా అంటారు. కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌ అనేది భవిష్యత్తులో కోర్టులు ఇచ్చే తీర్పులు, పార్లమెంటు చేసే చట్టాలకు మార్గదర్శకంగా ఉంటుంది. వీటిని దిగువస్థాయి న్యాయస్థానాల్లో సాక్ష్యాలు, ఆధారాలుగా పరిగణిస్తారు. దీన్ని ఏ న్యాయస్థానం కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. కోర్ట్‌ ఆఫ్‌ రికార్డును ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కార నేరంగా పరిగణిస్తారు. కోర్టు ధిక్కార నేరాల నిరోధక చట్టం, 1971 ప్రకారం కోర్టు ధిక్కార నేరానికి పాల్పడిన వారికి రూ.2 వేల జరిమానా లేదా 6 నెలల సాధారణ జైలుశిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉంది.


మహ్మద్‌ సలీం ఇస్మాయిల్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు: అయోధ్యలో వివాదాస్పద ప్రాంతం పరిరక్షణలో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్స్‌ కౌన్సిల్, సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమవడం కారణంగా ఒక రోజు జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది.

ధిక్కారాలు రెండు రకాలు

కోర్టు ధిక్కారాల నిరోధక చట్టం, 1971 ప్రకారం కోర్టు ధిక్కారం రెండు రకాలు

సివిల్‌ ధిక్కారం: న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఉద్దేశపూర్వకంగా తిరస్కరించడం, విమర్శించడం.


క్రిమినల్‌ ధిక్కారం: న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా లేదా కోర్టు గౌరవాన్ని భంగపరిచే విధంగా లేదా న్యాయస్థాన పాలనకు ఆటంకపరిచే విధంగా ఏదైనా సమాచారాన్ని ప్రదర్శించడం.

తీర్పుల పునఃసమీక్ష (ఆర్టికల్‌ 137): సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పులను తానే పునఃసమీక్ష చేసుకునే అధికారం కలిగి ఉంది. అంటే సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పులు, అభిప్రాయాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు.

ఉదా: 1960లో బెరుబారి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ‘రాజ్యాంగ ప్రవేశిక’ రాజ్యాంగంలో అంతర్భాగం కాదని పేర్కొంది. 1973లో కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో ‘రాజ్యాంగ ప్రవేశిక’ రాజ్యాంగంలో అంతర్భాగమని పేర్కొంది.


* 1967లో గోలక్‌నాథ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని పేర్కొంది. 1973లో కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించకుండా పార్లమెంటు వ్యవహరించాలని తెలిపింది.

 

రాష్ట్రపతికి సలహాలు 

ఆర్టికల్‌ 143 ప్రకారం రాష్ట్రపతి రెండు సందర్భాల్లో సుప్రీంకోర్టు నుంచి న్యాయసలహాను కోరవచ్చు. దీనినే సుప్రీం కోర్టుకు ఉన్న సలహాపూర్వక అధికార పరిధి అంటారు. 
* చట్టానికి సంబంధించిన వివాదం లేదా ప్రజా ప్రాముఖ్యం కలిగిన అంశం. 

ఈ సందర్భంలో సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించవచ్చు లేదా నిరాకరించవచ్చు. 

ఉదా: 1993లో రామ జన్మభూమి వివాదం నేపథ్యంలో రాష్ట్రపతి సలహా కోరినప్పుడు సుప్రీంకోర్టు నిరాకరించింది.

* రాజ్యాంగం అమల్లోకి రాకముందు కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించిన వివాదాలు. 

ఈ సందర్భంలో సుప్రీంకోర్టు తప్పనిసరిగా తన సలహాను వ్యక్తీకరించాలి. 

ఈ రెండు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాను రాష్ట్రపతి పాటించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అయితే సుప్రీంకోర్టు వెలువరించిన అభిప్రాయాలను దిగువ న్యాయస్థానాలు తప్పనిసరిగా పాటించాలి.

ఆర్టికల్‌ 143 ప్రకారం ఇప్పటివరకు పలు అంశాలపై భారత రాష్ట్రపతులు సుప్రీంకోర్టు న్యాయసలహాను పొందారు.

* ఢిల్లీ న్యాయ చట్టం, 1951

* కేరళ విద్యా బిల్లు, 1958

* బెరుబారి యూనియన్, 1960

* సీ - కస్టమ్స్‌ చట్టం, 1963

* శాసనసభలు, ప్రత్యేక హక్కులు - కేశవసింగ్‌ వివాదం, 1964

* రాష్ట్రపతి ఎన్నికలు, 1974

* ఇందిరాగాంధీపై విచారణకు ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టుల చట్టం, 1978

* జమ్మూకశ్మీర్‌ పునరావాస చట్టం, 1992

* కావేరి నదీజలాల ట్రైబ్యునల్‌ వివాదం, 1992

* రామజన్మభూమి వివాదం, 1993

* కొలీజియం వ్యవస్థ, 1998

* సహజవాయువు, ద్రవరూప సహజవాయువు లాంటి అంశాలపై కేంద్ర, రాష్ట్రాల శాసన అర్హతల విషయం, 2001

* గుజరాత్‌ శాసనసభ ఎన్నికలు, కేంద్ర ఎన్నికల సంఘం, 2002

* పంజాబ్‌ నదీజలాల ఒప్పందం, 2004

* 2-జీ స్పెక్ట్రమ్, సహజవనరుల వేలం వివాదాలు, 2012

* నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌), 2016  


రిట్స్‌ జారీ (ఆర్టికల్‌ 32): ప్రాథమిక హక్కుల సంరక్షణకు సుప్రీంకోర్టు అయిదు రకాల రిట్స్‌ను జారీ చేస్తుంది. అవి హెబియస్‌ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ, కోవారెంటో

న్యాయసమీక్షాధికారం: పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలు రూపొందించే శాసనాలు, ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలు రాజ్యాంగ నియమాలకు లోబడి ఉన్నాయా లేదా అనే అంశాన్ని విచారించి అవి వ్యతిరేకంగా ఉంటే చెల్లవని న్యాయసమీక్షాధికారం ద్వారా సుప్రీంకోర్టు ప్రకటిస్తుంది.

రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారం: రాజ్యాంగానికి సంబంధించి సుప్రీంకోర్టు అత్యున్నత వ్యాఖ్యాత. ఈ క్రమంలో రాజ్యాంగంలోని నిబంధనలకు తుది వివరణ ఇస్తుంది. సుప్రీంకోర్టు వివిధ సిద్ధాంతాల ఆధారంగా రాజ్యాంగాన్ని వ్యాఖ్యానిస్తుంది.

ఉదా: Doctrine of Pith and Substance
Doctrine of Eclipse
Doctrine of Ancillary Powers
Doctrine of Colourable Legislation


రచయిత: బంగారు సత్యనారాయణ

మరిన్ని అంశాలు ... మీ కోసం!

సుప్రీంకోర్టు

జాతీయ మహిళా కమిషన్‌

* కేంద్ర రాష్ట్ర సంబంధాలు - గవర్నర్‌ పాత్ర

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

 

Posted Date : 20-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుప్రీంకోర్టు - చారిత్రక నిర్ణయాలు

తిరుగులేని తీర్పులు!

  పాలన రాజ్యాంగం ప్రకారం సాగకపోయినా, పౌరహక్కులకు భంగం కలిగినా, సమానత్వం ప్రమాదంలో పడినా అంతిమంగా రక్షించేందుకు అత్యున్నత న్యాయస్థానం ఉంది. రాజకీయం రాజ్యాంగం గీత దాటితే, ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగితే, సామాజిక న్యాయానికి అడ్డంకులు ఎదురైతే ఆ ధర్మపీఠం ఆదుకుంటుంది. చెల్లని చట్టాలను నిర్దాక్షిణ్యంగా కొట్టేస్తుంది. అవసరమైన శాసనాల రూపకల్పనకు మార్గదర్శనం చేస్తుంది. తిరుగులేని తీర్పులతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుంది. 

 

  భారతదేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రాజ్యాంగానికి సంరక్షణకర్తగా వ్యవహరిస్తుంది. దేశ పరిపాలనను రాజ్యాంగ నియమాలకు అనుగుణంగా కొనసాగే విధంగా పర్యవేక్షిస్తుంది.తన తీర్పుల ద్వారా శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలకు మార్గనిర్దేశం చేస్తుంది. వివిధ కేసుల సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు దేశ పరిపాలనలో కీలక మలుపులకు కారణమయ్యాయి.

 

శంకరీ ప్రసాద్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1951): పార్లమెంటు 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. ఈ సవరణ చట్టం రాజ్యాంగంలోని 3వ భాగంలో ఉన్న ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉందని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఆర్టికల్‌ 368 ప్రకారం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులోనే సుప్రీంకోర్టు తొలిసారిగా న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌.జె.కానియా.

 

గోలక్‌నాథ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసు (1967): ఈ కేసులో పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ సంస్కరణల చట్టాన్ని సవాలు చేశారు. సుప్రీంకోర్టు గత తీర్పులకు భిన్నంగా పార్లమెంటుకు రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదని, రాజ్యాంగ సవరణ కూడా ఆర్టికల్‌ 13(2)లో పేర్కొన్న ‘చట్టం’ అనే పదం పరిధిలోకి వస్తుందని పేర్కొంది. పార్లమెంట్‌ ప్రాథమిక హక్కులను సవరించాలంటే ‘ప్రత్యేకంగా రాజ్యాంగ పరిషత్‌’ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసు సమయంలో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ కోకా సుబ్బారావు ఉన్నారు.

 

కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు (1973):  ఈ కేసును విచారించడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎమ్‌.సిక్రీ నేతృత్వంలో 13 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏర్పడింది. మత స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు, 24, 25వ రాజ్యాంగ సవరణ చట్టాలు మొదలైన వాటిపై విచారణ జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగ మౌలిక స్వరూపం గురించి పేర్కొంది. 

ముఖ్యాంశాలు: * రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించకుండా రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా పార్లమెంటు సవరించవచ్చు.

* ఆస్తి హక్కుపై పరిమితులను విధించవచ్చు.

* న్యాయసమీక్ష, ప్రాథమిక హక్కుల మూలతత్వం, రాజ్యాంగ ఔన్నత్యాన్ని సంరక్షించాలి.

* ప్రజాస్వామ్య ప్రభుత్వం, గణతంత్ర రాజ్యభావన, సమాఖ్య భావన కొనసాగాలి.

 

మినర్వా మిల్స్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1980): ఈ కేసులో ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో చేసిన 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సవాలు చేశారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి చేర్చిన ఆర్టికల్‌ 368(4), ఆర్టికల్‌ 368(5)లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ రెండు క్లాజులు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు ప్రయత్నించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది.

* ఆర్టికల్‌ 368(4) ప్రకారం రాజ్యాంగ సవరణ చట్టాలను న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదు. ఆర్టికల్‌ 368(5) ప్రకారం పార్లమెంటుకి ఉన్న రాజ్యాంగ సవరణ అధికారంపై ఎలాంటి పరిమితులు ఉండకూడదు. ఈ రెండు ఆర్టికల్స్‌ను ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చింది. కానీ సుప్రీంకోర్టు వాటిని రద్దు చేసింది.

 

ఎస్‌.పి. గుప్తా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1981): ఈ కేసు ద్వారా మనదేశంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌ - పిల్‌)కు సంబంధించి కొత్త అధ్యాయం మొదలైంది. జస్టిస్‌ పి.ఎన్‌.భగవతి ‘పిల్‌’కు సరైన నిర్వచనం ఇచ్చారు. న్యాయ లేదా రాజ్యాంగపరమైన హక్కులు ఉల్లంఘనకు గురైతే ఎవరైనా ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టులో, ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులో పిల్‌ వేయవచ్చని పేర్కొన్నారు.

 

ఇందిరా సహాని వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1992): ఈ కేసులో మండల్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాల వారికి (ఓబీసీ) 27 శాతం రిజర్వేషన్‌ కల్పించడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సమర్థిస్తూ ‘సంక్షేమ స్వభావం’, ‘సమన్యాయం’ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని తీర్పునిచ్చింది.

 

ఎస్‌.ఆర్‌. బొమ్మై వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1994): ఆర్టికల్‌ 356 ప్రకారం కర్ణాటకలో విధించిన రాష్ట్రపతి పాలనను సవాలు చేస్తూ ఎస్‌.ఆర్‌.బొమ్మై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో న్యాయస్థానం తీర్పునిస్తూ ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సమగ్రత, సమాఖ్య విధానం, సామాజిక న్యాయం అనేవి రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని పేర్కొంది. రాష్ట్రపతి పాలనకు సంబంధించి పలు మార్గదర్శకాలను వెలువరించింది.

ముఖ్యాంశాలు: * రాష్ట్రాల్లో విధించిన రాష్ట్రపతి పాలనపై న్యాయసమీక్ష జరపవచ్చు.

* రాష్ట్రపతి పాలనను న్యాయస్థానం రద్దు చేస్తే, రద్దయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలి.

* రాష్ట్ర ప్రభుత్వం మెజార్టీని కలిగి ఉందా? లేదా? అనే అంశాన్ని శాసనసభలోనే పరీక్షించాలి.

* రాష్ట్రపతి పాలన విధించేందుకు తగిన ఆధారాలున్నాయా? లేదా? అనేది కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి.

 

విశాఖ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ కేసు (1997):  పనిచేసే ప్రదేశాల్లో ఉద్యోగినుల పట్ల అనుచిత ప్రవర్తన, లైంగిక వేధింపులను నివారించడానికి అవసరమైన మార్గదర్శక సూత్రాలను ఈ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు జారీ చేసింది. ఈ తీర్పు అమలు కోసం ప్రభుత్వం ‘పని ప్రదేశాల్లో మహిళల అమర్యాదకర పరిస్థితుల (నివారక, నిషేధ) చట్టం- 2013’ని రూపొందించింది.

 

భారతీయ ముస్లిం ఆందోళన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు(2017):  జస్టిస్‌ కేహర్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం 2017, ఆగస్టు 22న తీర్పునిస్తూ ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదని పేర్కొంది. 

ముఖ్యాంశాలు:

* తలాక్‌ - ఎ - బిద్ధత్‌ ప్రక్రియలో వెంటవెంటనే మూడు సార్లు ‘తలాక్‌’ అని చెప్పి విడాకులు ఇవ్వడం చెల్లదు.

* ఎవరైనా ముస్లిం పురుషుడు తలాక్‌ - ఎ - బిద్ధత్‌ పద్ధతిలో భార్యకు విడాకులు ఇవ్వడం మహిళల పట్ల చూపుతున్న వివక్షగా పరిగణించవచ్చు.

* ఈ తీర్పును అమలు చేయడానికి భారత ప్రభుత్వం ‘తలాక్‌ చట్టం (ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం) 2019’ని రూపొందించింది.

 

జోసఫ్‌ షైనీ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (2018):  ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ)లోని సెక్షన్‌ 497ని సవాలు చేస్తూ వేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది. 

ముఖ్యాంశాలు: * వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీలోని సెక్షన్‌ 497 చెల్లదు.

* ఇష్టపూర్వక శృంగారం మహిళల హక్కు.

* భర్తకు మహిళ వ్యక్తిగత ఆస్తి కాదు.

 

యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు (2018): కేరళలోని శబరిమలై ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నియంత్రించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు కాగా, జస్టిస్‌ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది.

ముఖ్యాంశాలు:  * వయసుతో సంబంధం లేకుండా మహిళలందరూ ఆలయంలోకి ప్రవేశించవచ్చు.

* అయ్యప్ప స్వామి భక్తులది హిందూమతమే. శారీరక పరిస్థితి కారణంగా చూపి మహిళల గౌరవాన్ని భంగపరుస్తూ ఉండే ఎలాంటి మతపర సంప్రదాయమైనా రాజ్యాంగ విరుద్ధమే.

* ఆరాధనలో పాటించాల్సిన సమానత్వంపై పితృస్వామ్య వ్యవస్థ భావజాలం పైచేయి సాధించలేదు.

* 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలను ఆలయంలోకి అనుమతించకూడదన్న సంప్రదాయం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25(1), 26 లకు విరుద్ధం.

* రుతుస్రావం ఆధారంగా మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం ఆర్టికల్‌ 17కి వ్యతిరేకమని, అది అంటరానితనం కిందకి వస్తుందని పేర్కొంది.

 

నవతేజ్‌సింగ్‌ జోహర్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (2018):  జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఐపీసీలోని సెక్షన్‌ 377 పై తీర్పును వెలువరించింది.

ముఖ్యాంశాలు: * ఇద్దరు మేజర్ల మధ్య స్వలింగసంపర్కం నేరంగా పేర్కొనే ఐపీసీలోని సెక్షన్‌ 377 చెల్లుబాటు కాదు.

* ఇద్దరు మేజర్ల మధ్య ఇష్టపూర్వక స్వలింగ సంపర్కం తప్పు కాదు.

* రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 14, 15, 19, 21 ప్రకారం లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్‌ (ఎల్‌జీబీటీక్యూ)లకు తమకు ఇష్టమైన లైంగిక ధోరణులను అనుసరించే స్వేచ్ఛ ఉంది.

 

కె.ఎస్‌. పుట్టు స్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (2018):  ఆధార్‌ను పౌరులకు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ‘ఆధార్‌ చట్టం-2016’ను సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని సర్వోన్నత ధర్మాసనం దీనిపై తీర్పు ఇచ్చింది. 

ముఖ్యాంశాలు: * ఆధార్‌ రాజ్యాంగబద్ధమే.

* వ్యక్తిగత గోప్యత హక్కుకు ఇది భంగం కలిగించదు.

* ప్రైవేటు సంస్థల చేతికి ఆధార్‌ డేటాను అందించే చట్టంలోని సెక్షన్‌ 57 చెల్లుబాటు కాదు.

* ఆధార్‌ ధ్రువీకరణ డేటాను ఆరు నెలలకు మించి భద్రపరచకూడదు.

* దేశ భద్రత దృష్ట్యా వ్యక్తుల ఆధార్‌ సమాచారాన్ని బలవంతంగా సేకరించడానికి ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తున్న ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌ 33 చెల్లుబాటు కాదు.

* ఆధార్‌ సమాచార పరిరక్షణ వ్యవస్థను సాధ్యమైనంత త్వరగా తీసుకురావాలి.

 

నరేంద్ర వర్సెస్‌ కె.మీనా కేసు (2016): ఈ కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిస్తూ భర్తను అతడి తల్లిదండ్రుల నుంచి బలవంతంగా వేరుచేయడం క్రూరత్వం కిందికి వస్తుందని పేర్కొంది.

 

సీమా వర్సెస్‌ అశ్వినీ కుమార్‌ కేసు (2008): ‘వివాహాలకు రిజిస్ట్రేషన్‌’ తప్పనిసరి చేయాలని సుప్రీంకోర్టు ఈ కేసు తీర్పులో పేర్కొంది.

 

అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (2018): క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులకు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేయాలా, వద్దా అనే అంశాన్ని సుప్రీంకోర్టు విచారించి తీర్పు వెలువరించింది.

ముఖ్యాంశాలు: * క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.

* ఎన్నికల్లో వారిని అనర్హులుగా ప్రకటించే అంశం కోర్టు పరిధిలో లేదు. అలాంటి చట్టం చేసేందుకు పార్లమెంటుకి మాత్రమే అధికారం ఉంది.

* ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వారి నేరచరిత్రకు సంబంధించిన సమాచారాన్ని రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రంతో సహా సమర్పించాలి.

* అత్యాచారాలు/అపహరణలు/హత్యలు/దారుణమైన నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సభ్యత్వాన్ని రాజకీయ పార్టీలు రద్దు చేయడం తప్పనిసరి చేసే విధంగా పార్లమెంటు చట్టం చేయాలి.

* అభ్యర్థుల నేరచరిత్ర వివరాలను రాజకీయ పార్టీలు తమ వెబ్‌సైట్‌లో పెట్టాలి.

 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 30-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

న్యాయవ్యవస్థ క్రియాశీలత

పదునైన న్యాయం!

  పౌరహక్కులు ప్రమాదంలో పడినప్పుడు, సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగినప్పుడు, రాజ్యాంగ ఔన్నత్యానికి అవరోధం ఏర్పడినప్పుడు, అర్హులైన వారికి సామాజిక న్యాయం అందనప్పుడు న్యాయవ్యవస్థ అనివార్యంగా జోక్యం చేసుకుంటుంది.  ప్రజా పాలనలో ప్రధానమైన శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల రాజ్యాంగ అతిక్రమణలను, అలసత్వాన్ని  నిరోధిస్తుంది. జవాబుదారీతనాన్ని పెంచుతుంది. రాజ్యాంగ పరిమితుల్లో పరిధులు విస్తరించుకొని చురుగ్గా వ్యవహరించి, పదునైన న్యాయాన్ని పంచుతుంది. 

  

దేశ పరిపాలన రాజ్యాంగబద్ధంగా కొనసాగాలంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు తమ విధులను సమర్థంగా నిర్వహించాలి. వాటిలో ఎలాంటి లోపాలు ఏర్పడినా న్యాయవ్యవస్థ క్రియాశీలకం అవుతుంది. పరిపాలనను సరిచేస్తుంది. 

 

అర్థ వివరణ

  సాధారణంగా న్యాయవ్యవస్థ క్రియాశీలతను శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల అధికార పరిధిలో జోక్యం చేసుకోవడంగా పరిగణిస్తుంటారు. వాస్తవానికి న్యాయవ్యవస్థ సాధారణ విధుల కంటే క్రియాశీలత భిన్నమైనది కాదు. సాధారణ పరిభాషలో చెప్పాలంటే క్రియాశీలత అంటే చురుగ్గా ఉండటం. ‘ప్రతి న్యాయమూర్తి పురోగమన దృక్పథంతో విధులను నిర్వహించడాన్ని క్రియాశీలతగా చెప్పవచ్చు’ అని జస్టిస్‌ కృష్ణయ్యర్‌ పేర్కొన్నారు. ఆ ప్రకారం చూస్తే న్యాయవ్యవస్థ క్రియాశీలత అనేది దృఢమైన చర్యలతో నిర్మాణాత్మకంగా మౌలిక చట్టాన్ని రూపొందించడమే అని అర్థం చేసుకోవచ్చు. న్యాయవ్యవస్థ క్రియాత్మక వైఖరి వల్ల శాసన వ్యవస్థను సజీవంగా ఉండటంతోపాటు సామాజిక, ఆర్థిక మార్పుల ప్రక్రియల్లో కీలకంగా వ్యవహరిస్తుంది. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం లాంటి భావనలను ప్రోత్సహిస్తుంది. సామాజిక పరివర్తనకు కృషి చేస్తుంది. కేవలం న్యాయనిర్ణేతగా ఉండాలనే  సంప్రదాయ భావనను దాటి, అందుకు భిన్నంగా రాజ్యాంగ సంవిధానంలో చోదకశక్తిగా వ్యవహరించడమే న్యాయవ్యవస్థ క్రియాశీలత అంతిమ లక్ష్యం.

 

‘శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల అశ్రద్ధ, అలసత్వం కారణంగా కొన్ని సందర్భాల్లో సామాజిక దోపిడికీ గురయ్యే వర్గాలకు సామాజిక న్యాయాన్ని అందించడానికి పౌర సేచ్ఛా సంస్థలు, సామాజిక సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజాప్రయోజన వ్యాజ్యాల ద్వారా ముందుకొస్తున్నాయి. ఆ వ్యాజ్యాలు న్యాయస్థానాల న్యాయసమీక్ష అధికార పరిధిని, న్యాయ పరిమితులను ఎప్పటికప్పుడు విస్తృతపరిచాయి. న్యాయస్థానాలు పోషిస్తున్న ఈ పాత్రను విమర్శించేవారు దానికి న్యాయశాఖ క్రియాశీలత అని పేరు పెట్టారు.’ 

- సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.ఎస్‌.ఆనంద్‌

 

 ‘భారత న్యాయవ్యవస్థపై న్యాయ క్రియాశీలత ఒక ఒత్తిడితో కూడిన కుదుపు లాంటిది. సరైన నిర్ణయాలను తీసుకోవడంలో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు ప్రదర్శించే అలసత్వం వల్ల న్యాయశాఖ క్రియాశీలకంగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సున్నితమైన సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలిపోయినప్పుడు ప్రజల్లో అసహనం, అసంతృప్తి పెరిగి, తగిన పరిష్కారం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు.’

- జస్టిస్‌ ఎ.ఎం.అహ్మది 

 

 ‘క్రమపద్ధతిలో కోర్టు ఆదేశాలను ఇవ్వడం, మారిన పరిస్థితులకు అనుగుణంగా శాసనాలను రూపొందించడానికి తగిన సూచనలు చేయడం, సమన్యాయాన్ని అందించడమే న్యాయ వ్యవస్థ క్రియాశీలత’ 

- ప్రముఖ న్యాయ నిపుణులు రాజీవ్‌ ధావన్‌ 

 

క్రియాశీలతకు కారణాలు

* భారత సమాఖ్య వ్యవస్థలో తలెత్తే సమస్యలు.

* రాజ్యాంగ ఔన్నత్యానికి అవరోధం ఏర్పడటం.

* మానవ, పౌర హక్కులకు భంగం కలగడం.

* సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాల వారికి న్యాయం అందకపోవడం.

* సమన్యాయ పాలనకు ఇబ్బందులు ఎదురవడం.

* పాలనా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించడం.

  పౌరహక్కుల కార్యకర్తలు, పర్యావరణ పరిరక్షణ వాదులు, బాలల హక్కుల పరిరక్షణ బృందాలు, సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పోరాడేవారు, మహిళాభ్యుదయ బృందాల్లాంటివి న్యాయవ్యవస్థ క్రియాశీలతకు దోహదపడుతున్నాయి. ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 21లో పేర్కొన్న జీవించే హక్కు పరిధిని క్రియాశీలత ద్వారా పెంచారు. దానిలో అంతర్భాగంగానే ఆర్టికల్‌ 21(A) ద్వారా 14 సంవత్సరాల్లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కును నిర్దేశించారు.

 

ప్రయోజనాలు

* ప్రాథమిక హక్కులపై విధించే ఆంక్షలను న్యాయవ్యవస్థ నివారిస్తుంది.

* శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల వైఫల్యాలను ప్రశ్నిస్తుంది.

* ప్రాథమిక హక్కులకు విస్తృతమైన వివరణను ఇస్తుంది.

* పరిపాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుంది.

* కేవలం వ్యక్తులకే పరిమితం కాకుండా సమూహాలకు న్యాయం అందుతోంది. 

* ఎన్నికల ప్రక్రియను మరింత స్వేచ్ఛగా, స్వతంత్రంగా మార్చడానికి తోడ్పడుతుంది.

* ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కోర్టు ఆదేశాన్ని అనుసరించి తమ ఆస్తులు, ఆదాయం, విద్యార్హతలు, నేరచరిత్ర లాంటి అంశాలతో కూడిన ‘అఫిడవిట్‌’ను సమర్పిస్తున్నారు. దీనిద్వారా ఉత్తమ ప్రతినిధిని ఎన్నుకోవడానికి ప్రజలకు అవకాశం లభిస్తోంది.

 

ప్రతికూల ఫలితాలు

* శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య అంతరాన్ని పెంచే అవకాశం ఉంది. 

* ప్రభుత్వ కార్యకలాపాలను నియంత్రిస్తుంది.

* రాజ్యాంగపర ఉల్లంఘనలు జరిగే ప్రమాదం ఉంది.

* ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగే వీలుంది.

 

సుప్రీంకోర్టు కేసులు 


బెన్నెట్‌ కోల్‌మన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు: ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే సమాచార స్వేచ్ఛాహక్కు అనేది ఆర్టికల్‌ 19(1)(A) లో అంతర్భాగమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

 

నందినీ శపతి వర్సెస్‌ పి.ఎల్‌.దాని కేసు: ఒక వ్యక్తిని శారీరకంగా, మానసికంగా హింసించి లేదా ఒత్తిడికి గురిచేసి సమాచారాన్ని రాబడితే అది బలవంతపు సాక్ష్యం అవుతుందని, ఈ విధానం ఆర్టికల్‌ 20(3)కి వ్యతిరేకమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

 

అబ్దుల్‌ కరీం వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక కేసు: ఒక వ్యక్తి నుంచి సమాచారం రాబట్టడం కోసం అతడి ఆరోగ్యం దెబ్బతినే విధంగా ‘నార్కో అనాలసిస్‌ పరీక్ష’ను పదేపదే వినియోగించకూడదు.

 

ఖ్వాజా అహ్మద్‌ అబ్బాస్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు: సినిమాలు భావోద్రేకాలను రెచ్చగొట్టే అవకాశం ఉండటం వల్ల, వాటిపై ముందస్తుగానే సెన్సార్‌షిప్‌ విధించడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు వ్యతిరేకం కాదు.

 

లతాసింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ కేసు: ఒక మహిళ తనకు నచ్చిన పురుషుడిని భర్తగా ఎంచుకోవడం (వివాహం) ఆర్టికల్‌ 21లో పేర్కొన్న జీవించే హక్కులో అంతర్భాగం.

 

పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు: ఆకలి, పోషకాహార లోపాలను అధిగమించడానికి ఆహార హక్కును చట్టబద్ధంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

 

అపర్ణాభట్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌ కేసు: అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో ఎలాంటి పరిస్థితుల్లోనూ నిందితులు, బాధితురాలి మధ్య రాజీ సాధ్యపడదు.

 

సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు: న్యాయమూర్తుల నియామకం కోసం 99వ రాజ్యాంగ సవరణ చట్టం-2014 ద్వారా ఏర్పాటు చేసిన ‘నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ యాక్ట్‌’ చెల్లుబాటు కాదు.

 

ప్రజాప్రయోజన వ్యాజ్యం 

  ప్రజాప్రయోజన వ్యాజ్యం (పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ లిటిగేషన్‌ - పిల్‌) భావన 1960వ దశకంలో అమెరికాలో ఆవిర్భవించింది.న్యాయవ్యవస్థ గుర్తించిన స్థాయి (Locus-Standi) కి సంబంధించిన సరళీకృత నియమాల నుంచి పుట్టుకొచ్చిందే ప్రజాప్రయోజన వ్యాజ్యం (పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌) లేదా సామాజిక చర్యా వ్యాజ్యం (సోషల్‌ యాక్షన్‌ లిటిగేషన్‌). ప్రభుత్వ అధికారం వల్ల ఒక వ్యక్తి తన చట్టబద్ధమైన హక్కులకు భంగం కలిగి నష్టపోయి గాయపడతాడో ఆ వ్యక్తి మాత్రమే న్యాయపరిహారం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాలి అనే సూత్రం సంప్రదాయ ‘గుర్తించిన స్థాయి’ నియమంపై ఆధారపడి ఉంటుంది. ప్రజాప్రయోజన వ్యాజ్యం ఈ సంప్రదాయ నియమాన్ని న్యాయవ్యవస్థ క్రియాశీలతలో భాగంగా సరళీకరించింది. ఆ సరళీకృత నియమం ప్రకారం చట్టబద్ధమైన హక్కులను నష్టపోయిన లేదా అన్యాయానికి గురైన వ్యక్తి స్వయంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించలేనప్పుడు, సామాజిక స్పృహ, చైతన్యం కలిగిన వ్యక్తుల సహాయంతో కోర్టు నుంచి న్యాయాన్ని పొందే ప్రక్రియనే ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటారు. మన దేశంలో 1980వ దశకంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.ఎన్‌.భగవతి, జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ణయ్యర్‌లు దీనికి విస్తృత ప్రాచుర్యం కల్పించారు. న్యాయ ఆదేశాలు, చట్టం, రాజ్యాంగ లక్ష్యాలు సక్రమంగా, సమర్థంగా అమలయ్యేలా చూడటం ప్రజాప్రయోజన వ్యాజ్యం లక్ష్యం.

 

‘పిల్‌’లోని మౌలికాంశాలు:

* సాధారణ, సంప్రదాయ వ్యాజ్యాలకు ఇది భిన్నమైనది. ప్రజల సమష్టి ప్రయోజనాలు దీనిలో ఇమిడి ఉంటాయి.

* సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవారు, పేదలు నిర్లక్ష్యానికి గురైన వారికి రాజ్యాంగ హక్కులు, న్యాయం అందించడానికి పిల్‌ తోడ్పడుతుంది.

* అన్యాయానికి గురై, న్యాయస్థానాలను ఆశ్రయించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజల తరఫున ఎవరైనా న్యాయస్థానంలో దీన్ని వేయవచ్చు.

* న్యాయ సహాయం కోసం సాగే ఉద్యమానికి సామాజిక అస్త్రంగా దీన్ని పరిగణించవచ్చు.

* దీని ప్రభావం పిటిషనర్‌తోపాటు ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు, న్యాయస్థానాల మీద పడుతుంది. అది వెనుకబడిన వర్గాల వారికి సామాజిక న్యాయాన్ని అందిస్తుంది.

* ప్రజల ప్రయోజనార్థం ఆదేశాలు వెలువరించే సమయంలో అప్పటికే నిర్ణయించి అమలవుతున్న విధానాల మార్పుల విషయంలో న్యాయస్థానం ఆచితూచి వ్యవహరిస్తుంది. అత్యంత జాగ్రత్తతో ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా తీర్పును వెలువరిస్తుంది.

నియమ నిబంధనల పరిధి: ప్రజాప్రయోజన వ్యాజ్యం పిటీషన్లను విచారించేందుకు 1988లో సుప్రీంకోర్టు నియమ నిబంధనలను రూపొందించింది. వీటిని 1993, 2003ల్లో సవరించారు. వాటి ప్రకారం ప్రజాప్రయోజన వ్యాజ్యానికి సంబంధించిన విచారణకు స్వీకరించే, స్వీకరించకూడని అంశాలను నిర్ణయించారు.

 

స్వీకరించే అంశాలు: 

* మహిళలపై జరిగే అత్యాచారాలు, హత్యలు, అపహరణలు లాంటి నేరాలు, వేధింపులు.

* పర్యావరణ సమతౌల్యతను దెబ్బతీసే వ్యవహారాలు, చారిత్రక, సాంస్కృతిక కట్టడాల పరిరక్షణ, పురాతన కట్టడాల సంరక్షణ, వన్యప్రాణుల, అడవుల పరిరక్షణ అంశాలు.

* నిర్లక్ష్యానికి గురవుతున్న బాలల అంశాలు.

* కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల వ్యవహారాలు.

* ముందస్తు విడుదల, 14 ఏళ్ల యావజ్జీవ శిక్ష అనుభవించిన తర్వాత విడుదల, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల లాంటి వ్యవహారాల్లో; జైళ్లలో జరిగే వేధింపులు, అనుమానాస్పద మరణాలు, విచారణను జాప్యం చేయడం లాంటి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలు.

* కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకపోవడం, కార్మిక చట్టాలను ఉల్లంఘించడం లాంటి అంశాలు.

* ఎస్సీ, ఎస్టీ వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారిపైనా పోలీసులు/ఇతరులు వేధింపులకు పాల్పడే అంశాలు.

 

పిల్‌ పరిధిలోకి రాని అంశాలు: 

* పెన్షన్, గ్రాట్యుటీ చెల్లింపులకు సంబంధించిన సేవా అంశాలు

* హైకోర్టు, దిగువస్థాయి న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల వ్యవహారాలు

* భూయజమాని, అద్దెదారు, కౌలుదారులకు సంబంధించిన వివాదాలు

* వివిధ రకాల విద్యాసంస్థల్లో జరిగే ప్రవేశాలు

 

పిల్‌ - దుర్వినియోగ నివారణకు సుప్రీంకోర్టు నియమాలు: 

* పిటిషన్‌ను విచారణకు స్వీకరించే ముందు దానిలో ప్రజాప్రయోజనం ఇమిడి ఉందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి.

* సదుద్దేశంతో వచ్చిన వాటిని మాత్రమే విచారణకు స్వీకరించాలి.

* పిటిషన్‌లో పేర్కొన్న విషయాల్లో నిజానిజాలను ప్రాథమికంగా న్యాయస్థానం నిర్ధారించుకోవాలి.

* విస్తృత ప్రజాప్రయోజనాలు ఉన్న పిటిషన్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

* అనవసరమైన పిటిషన్లు, కుట్రపూరిత ఉద్దేశాలతో కూడిన పిటిషన్లను తిరస్కరించడంతోపాటు, ఆ పిటిషనర్ల నుంచి జరిమానా పేరుతో రుసుం వసూలు చేయాలి.

* పిటిషన్‌ను స్వీకరించే ముందు ప్రతి న్యాయమూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలి.

  రాజ్యాంగపరమైన ధర్మాన్ని అమలు చేయడంలో  ప్రభుత్వాలు విఫలమైనప్పుడు, పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు, ప్రజా ప్రాముఖ్యం కలిగిన అంశాల మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు కోర్టు జోక్యం చేసుకుంటుంది. ఆ అంశాలకు సంబంధించి టెలిగ్రామ్‌ లేదా ఉత్తరం లేదా మరేదైనా రూపంలో సమాచారం న్యాయస్థానం ముందుకు వస్తే దాన్ని పిటిషన్‌గా పరిగణిస్తుంది. పత్రికలు, టీవీ ఛానెల్స్‌లో వచ్చిన వార్తలను కూడా కోర్టు తనకు తానుగా కేసు (సుమోటో)గా తీసుకొని విచారిస్తుంది. తీర్పును వెలువరిస్తుంది.

 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 15-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

హైకోర్టు

పౌరహక్కులకు ఉన్నత రక్షణ!


ఒక రాష్ట్రం పరిధిలో పౌరుల హక్కులను పరిరక్షిస్తుంది. దిగువ న్యాయస్థానాలను నియంత్రిస్తుంది. అప్పీళ్లను విచారిస్తుంది. రాజ్యాంగ వ్యతిరేక చర్యలను, ఉత్తర్వులను సమీక్షిస్తుంది. తీర్పులను భద్రపరుస్తుంది. సుప్రీం కోర్టు తర్వాత ఉన్నతంగా వ్యవహరించే ఈ హైకోర్టుల నిర్మాణం, న్యాయమూర్తుల నియామకం, తొలగింపు, విధులు, అధికారాలు తదతర అంశాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి.   

 


రాష్ట్రస్థాయిలో ‘హైకోర్టు’ అత్యున్నత న్యాయస్థానం. ఇది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటై, స్వయం ప్రతిపత్తితో వ్యవహరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, రాజ్యాంగ నియమాలకు లోబడి కొనసాగేలా చూస్తుంది.


చారిత్రక నేపథ్యం: ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861 ప్రకారం 1862 జులై 1న కలకత్తాలో తొలి హైకోర్టు ఏర్పాటైంది. దీని మొదటి ప్రధాన న్యాయమూర్తి ‘సర్‌ బార్నెస్‌ పీకాక్‌’. 1862, ఆగస్ట్‌ 14న రెండో హైకోర్టును బొంబాయిలో; 1862, ఆగస్ట్‌ 15న మూడో హైకోర్టును మద్రాస్‌లో ఏర్పాటు చేశారు. ఈ మూడు హైకోర్టులు 2011లో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. 1866, మార్చి 17న అలహాబాద్‌లో హైకోర్టు ఏర్పాటైంది.


రాజ్యాంగ వివరణ: రాజ్యాంగంలోని 6వ భాగంలో 214 నుంచి 232 ఆర్టికల్స్‌ హైకోర్టు నిర్మాణం, న్యాయమూర్తుల నియామకం, నియమ నిబంధనలు, హైకోర్టుల పరిధి, అధికారాలు, విధుల గురించి పేర్కొంటున్నాయి.


ఆర్టికల్‌ 214, 216: ఈ ఆర్టికల్స్‌ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఏర్పాటు చేయాలి. 7వ రాజ్యాంగ సవరణ చట్టం, 1956 ప్రకారం పార్లమెంటు రూపొందించిన శాసనం ద్వారా రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు/ కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి ‘ఉమ్మడి హైకోర్టు’ ఏర్పాటు చేయవచ్చు. సాధారణంగా హైకోర్టు భౌగోళిక పరిధి సంబంధిత రాష్ట్ర భూభాగ పరిధి వరకే ఉంటుంది. ఉమ్మడి హైకోర్టు భౌగోళిక పరిధి సంబంధిత రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల భూభాగ పరిధి వరకు విస్తరించి ఉంటుంది.


న్యాయమూర్తుల సంఖ్య: హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఇందుకోసం సంబంధిత రాష్ట్ర జనాభా, విస్తీర్ణం, నేరాల తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం అలహాబాద్‌ హైకోర్టులో అత్యధికంగా సుమారు 120 మంది న్యాయమూర్తులు ఉన్నారు. సిక్కిం హైకోర్టులో అత్యల్పంగా ముగ్గురు న్యాయమూర్తులే ఉన్నారు.


న్యాయమూర్తుల నియామకానికి ఉండాల్సిన అర్హతలు:

* భారతీయ పౌరుడై ఉండాలి.

* హైకోర్టులో న్యాయవాదిగా 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి.(లేదా) * జిల్లా కోర్టులో న్యాయమూర్తిగా 10 సం।।లు పనిచేసి ఉండాలి.

* రాష్ట్రపతి దృష్టిలో ప్రముఖ న్యాయకోవిదుడై ఉండాలి.

 

నియామకం (ఆర్టికల్‌ 217):

* కొలీజియం సిఫార్సుల మేరకు హైకోర్టుకు ప్రధాన, ఇతర న్యాయమూర్తుల్ని రాష్ట్రపతి నియమిస్తారు.

* హైకోర్టులో పనిఒత్తిడి ఎక్కువ ఉండి, తగిన సంఖ్యలో న్యాయమూర్తులు లేనప్పుడు రెండేళ్ల పదవీకాలానికి అదనపు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు.

 

ప్రమాణ స్వీకారం (ఆర్టికల్‌ 219): హైకోర్టు న్యాయమూర్తులు గవర్నర్‌ సమక్షంలో కిందివిధంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ‘‘భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం కల్గి ఉంటాను. భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను సంరక్షిస్తాను. నా సామర్థ్యం మేరకు రాగద్వేషాలు లేకుండా సమర్థవంతంగా పనిచేస్తాను’’ అని ప్రమాణం చేస్తారు.

 

పదవీకాలం:

* హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు. గతంలో ఇది 60 ఏళ్లుగా ఉండేది. 15వ రాజ్యాంగ సవరణ చట్టం, 1963 ద్వారా పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు.

* న్యాయమూర్తులు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.

* పార్లమెంటు సిఫార్సుల మేరకు న్యాయమూర్తులను రాష్ట్రపతి తొలగిస్తారు.

 

న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియ:

* హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే అభిశంసన తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టాలంటే కనీసం 100 మంది లోక్‌సభ సభ్యులు; రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే కనీసం 50 మంది రాజ్యసభ సభ్యులు తీర్మాన ప్రతిపై సంతకాలు చేసి ఆయా సభాధ్యక్షులకు అందించాలి.

* అసమర్థత, అవినీతి ఆరోపణలపై న్యాయమూర్తిని తొలగించే ఈ తీర్మానాన్ని లోక్‌సభ, రాజ్యసభలు విడివిడిగా 2/3 ప్రత్యేక మెజార్టీతో ఆమోదిస్తే రాష్ట్రపతి సంబంధిత న్యాయమూర్తులను తొలగిస్తారు.

* 2011లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ సౌమిత్ర సేన్‌పై రాజ్యసభలో ప్రవేశపెట్టిన తొలగింపు తీర్మానం నెగ్గింది. ఈ తీర్మానం లోక్‌సభలో ప్రవేశపెట్టక ముందే ఆయన పదవికి రాజీనామా చేశారు.

 

జీతభత్యాలు:

* హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను  చట్టం ద్వారా పార్లమెంటు నిర్ణయిస్తుంది. వాటిని సంబంధిత రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. పదవీవిరమణ అనంతరం పెన్షన్‌ను భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.

* 1950లో హైకోర్ట్‌ ప్రధాన న్యామూర్తి వేతనం రూ.4000. ఇతర న్యాయమూర్తుల వేతనం రూ.3500.

* 2018లో రూపొందించిన చట్టం ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం రూ.2,50,000. ఇతర న్యాయమూర్తుల వేతనం రూ.2,25,000.

* న్యాయమూర్తుల జీతభత్యాలకు రాజ్యాంగ భద్రత ఉంటుంది. పదవీ కాలంలో ఉన్నంత వరకు వీరి జీతభత్యాలకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదు. రాజ్యాంగంలోని రెండో షెడ్యూల్‌లో పేర్కొన్న నియమాల ఆధారంగా వీరికి జీతభత్యాలు అందుతాయి.

 

న్యాయమూర్తుల బదిలీ (ఆర్టికల్‌ 222):  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ‘కొలీజియం’ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఒక హైకోర్టు న్యాయమూర్తిని మరో హైకోర్టుకు బదిలీ చేస్తారు.

 

పదవీ విరమణ అనంతరం:

* పదవీవిరమణ అనంతరం న్యాయమూర్తులు వారు పనిచేసిన హైకోర్టులో తప్ప, ఇతర హైకోర్టుల్లో గాని, సుప్రీంకోర్టులో గాని న్యాయవాద వృత్తి చేపట్టవచ్చు.

* పదవీ విరమణ పొందిన న్యాయమూర్తులు విశ్వవిద్యాలయాలకు వైస్‌ఛాన్సలర్‌ (వీసీ) గా, విచారణ సంఘాలకు ఛైర్మన్లుగా, విదేశాలకు రాయబారులుగా నియమితులవుతున్నారు.

హైకోర్టు బెంచ్‌: ఒక రాష్ట్రంలో హైకోర్ట్‌ బెంచ్‌ను అదే రాష్ట్రంలో వేరే నగరంలో ఏర్పాటు చేస్తూ పార్లమెంటు చట్టం చేయవచ్చు.

 

హైకోర్ట్‌ అధికారాలు, విధులు

ప్రాథమిక/ ప్రారంభ/ ఒరిజినల్‌ విచారణాధికార పరిధి:

* అప్పీళ్ల ద్వారా కాకుండా హైకోర్టు నేరుగా విచారించే అధికారాలు దీని పరిధిలోకి వస్తాయి. సుప్రీంకోర్టు విచారణ అధికార పరిధి, హైకోర్టు విచారణ అధికార పరిధిని పోల్చి చూసినప్పుడు హైకోర్టు విచారణ అధికార పరిధే ఎక్కువ. దీనికి కారణం వ్యక్తుల, సంస్థల హక్కుల రక్షణకు హైకోర్టు ‘నిలుపుదల ఉత్తర్వులు’ (Injunction orders) జారీ చేస్తుంది.

* పార్లమెంటు, శాసనసభ ఎన్నికల వివాదాలను విచారిస్తుంది. వివాహం, విడాకులు, వీలునామా వంటి అంశాలకు సంబంధించిన వివాదాలను విచారిస్తుంది.

 

కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌:

* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 215 ప్రకారం రాష్ట్రస్థాయిలో హైకోర్ట్‌ ‘కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌’గా వ్యవహరిస్తుంది. దీని ప్రకారం హైకోర్టు తాను ఇచ్చిన తీర్పులను రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది. రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాలు, వ్యక్తులు, సంస్థలకు కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌ శిరోధార్యం. కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌ ధిక్కరణను కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణించి శిక్షిస్తారు.

* కోర్టు ధిక్కరణ అంటే న్యాయస్థానాల అధికారాలకు విఘాతం కలిగించడం, న్యాయపాలనలో అనవసర జోక్యం చేసుకోవడం, న్యాయస్థానాల తీర్పులను విమర్శించడం.

 

అప్పీళ్ల విచారణాధికార పరిధి: రాష్ట్రస్థాయిలో అత్యున్నత అప్పీళ్ల న్యాయస్థానం హైకోర్ట్‌. దీని భౌగోళిక పరిధిలోని దిగువ న్యాయస్థానాల తీర్పులపై వచ్చిన సివిల్, క్రిమినల్‌ కేసులకు సంబంధించిన అప్పీళ్లను విచారిస్తుంది. దిగువ స్థాయి న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులతో అసంతృప్తి చెందిన వ్యక్తులు, సంస్థలు హైకోర్టును ఆశ్రయించవచ్చు. జిల్లా సెషన్స్‌ కోర్ట్‌ మరణ శిక్షను విధించినా లేదా 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధించినా అలాంటి కేసులన్నింటినీ హైకోర్టులో అప్పీలు చేయవచ్చు. అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులపై హైకోర్టులో అప్పీలు చేయవచ్చు. ట్రిబ్యునల్స్‌ హైకోర్టు పరిధిలోకి వస్తాయని 1997లో సుప్రీంకోర్టు తీర్పుఇచ్చింది.

రిట్స్‌ జారీ చేయడం: ప్రాథమిక హక్కుల సంరక్షణకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టు 5 రకాల రిట్స్‌ జారీ చేస్తుంది. అవి 1) హెబియస్‌ కార్పస్‌ 2) మాండమస్‌ 3) సెర్షియోరరీ 4) ప్రొహిబిషన్‌ 5) కోవారెంటో *హైకోర్టు ఏదైనా వ్యక్తికి/అధికారికి/ప్రభుత్వానికి ‘‘రిట్స్‌’’(Writs) జారీ చేయవచ్చు.* సుప్రీంకోర్టు, హైకోర్టుల రిట్స్‌ అధికార పరిధి రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని, దీనిని రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించే వీలులేదని 1997లో చంద్రకుమార్‌ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

 

దిగువ న్యాయస్థానాలపై నియంత్రణ:

* హైకోర్టుకు రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాలపై నియంత్రణాధికారం ఉంటుంది. జిల్లా కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీలు, ఇతర సిబ్బంది ఎంపికలో హైకోర్టు కీలక పాత్రను పోషిస్తుంది.

* దిగువ న్యాయస్థానాలు విచారించే ఏదైనా కేసులో రాజ్యాంగపరమైన, శాసనపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయని హైకోర్టు భావిస్తే సంబంధిత కేసును తనకు బదిలీ చేయించుకుని విచారిస్తుంది.

* హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలోని అన్ని దిగువ న్యాయస్థానాలకు శిరోధార్యం.

 

న్యాయ సమీక్షాధికారం:

* పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రూపొందించిన శాసనాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఉత్తర్వులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవు అని హైకోర్టు ‘న్యాయసమీక్ష’ ద్వారా ప్రకటిస్తుంది.

* 42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా హైకోర్టు న్యాయ సమీక్షాధికారాన్ని తొలగించారు. 43వ రాజ్యాంగ సవరణ చట్టం (1977) ద్వారా న్యాయసమీక్షాధికారాన్ని పునరుద్ధరించారు.

 

కీలక అంశాలు

* కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తొలి భారతీయుడు - సుంబనాథ్‌ పండిట్‌

* కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి భారతీయుడు - పి.బి.చక్రవర్తి

* మన దేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళ - అన్నాచాందీ (కేరళ)

* మన దేశంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళ - లీలా సేథ్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌)

* దిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళ - జస్టిస్‌ రోహిణి

* 1954లో గుంటూరులో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్‌ కోకా సుబ్బారావు

* 1956లో హైదరాబాద్‌లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్‌ కోకా సుబ్బారావు

* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్‌ టి.బి.ఎన్‌.రాధాకృష్ణన్‌.

* తెలంగాణ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్‌ టి.బి.ఎన్‌.రాధాకృష్ణన్‌

* ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌కు తొలి ప్రధాన న్యాయమూర్తి (తాత్కాలిక) - జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ (01-01-2019)

* ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి (పూర్తిస్థాయి) - జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి (07-10-2019)

 

ప్రస్తుతం మన దేశంలో హైకోర్టుల సంఖ్య: 25

నోట్‌: 1956లో హైదరాబాద్‌లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 2019లో తెలంగాణ హైకోర్టుగా అవతరించింది.

రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 07-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లు

ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లు


ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌


1989లో నేషనల్‌ ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. 


దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారి సమగ్రాభివృద్ధిని సాధించాలని సంకల్పించారు. 

 

 2001లో ఈ కార్పొరేషన్‌ను విభజించి ఎస్సీ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, ఎస్టీ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లను వేర్వేరుగా ఏర్పాటు చేశారు.


కార్పొరేషన్‌ - విధులు: నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం నిధులు కేటాయించడం.


యువతకు సాంకేతిక శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన.


 విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సహకారాన్ని అందించడం.


 సంబంధిత వర్గాల వారికి సూక్ష్మరుణ సదుపాయం కల్పించడం.

 

 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం.


జాతీయ షెడ్యూల్డ్‌ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ

ప్రభుత్వ కంపెనీల చట్టం, 1956లో సెక్షన్‌ 25 ప్రకారం ‘జాతీయ షెడ్యూల్డ్‌ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ’ను స్థాపించారు. ఇది ఎస్సీ వర్గాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది.


స్టాండప్‌ ఇండియా: ప్రధాని నరేంద్రమోదీ 2016 ఏప్రిల్‌ 5న ‘స్టాండప్‌ ఇండియా’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 


ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడం దీని ఉద్దేశం. 

 

దీని ప్రకారం వ్యవసాయేతర రంగంలో నూతన పరిశ్రమలను స్థాపించడానికి రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణం అందిస్తారు. 


ఈ రుణాన్ని 7 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలి. 


 స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SIDBI) పరిశ్రమలకు రూ.10,000 కోట్లతో రీఫైనాన్స్‌ చేస్తుంది. 


షెడ్యూల్డ్‌ కులాల ఉపప్రణాళిక (sc-subplan)ఎస్సీ వర్గాల వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రోత్సహించేందుకు ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే 1979లో  SC-Sub planకు నిర్దిష్ట రూపం ఇచ్చారు.


అల్పసంఖ్యాక వర్గాలు (Minorities):

 

( మనదేశంలో మతపరమైన మైనార్టీలను నిర్ధారించేందుకు దేశాన్ని యూనిట్‌గా తీసుకుంటున్నారు. 


( జాతీయ మైనార్టీ కమిషన్‌ చట్టం 1992 లోని సెక్షన్‌ 2(C)ని అనుసరించి 5 మతవర్గాలను మైనార్టీలుగా పరిగణించారు. 


అవి: 1. ముస్లిం     2. క్రైస్తవ    3. బౌద్ధ 


       4. సిక్కు     5. పార్శీ

 

( 2014లో జైనమతానికి మైనార్టీ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది.


మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ: మైనార్టీ వర్గాల సమగ్రాభివృద్ధిని సాధించే లక్ష్యంతో మనదేశంలో 2006, జనవరి 29న ‘‘మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖ’’ను ఏర్పాటు చేశారు. 


( ఇది మైనార్టీ వర్గాల సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆర్థిక రంగాల ప్రగతి కోసం కృషి చేస్తుంది.

మౌలానా ఆజాద్‌ ఫౌండేషన్‌: దీన్ని 1989, జులై 6న న్యూదిల్లీలో ఏర్పాటు చేశారు. 


( మైనార్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం పనిచేస్తుంది. ఇది స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ.

 

USTTAD: 2015, మే 14న ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ USTTADను ప్రారంభించారు. 


( USTTAD  అంటే  Upgrading the Skill & Training in Traditional Arts/ crafts for Development.   


( దీని ద్వారా మైనార్టీ వర్గాలకు చెందిన సంప్రదాయ కళలు, హస్తకళలు, ఇతర కళలను పరిరక్షించేందుకు కృషి జరుగుతుంది. ఇందుకు అవసరమయ్యే నిధులన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.


కేంద్ర వక్ఫ్‌ మండలి: ఇస్లాం మతానికి చెందిన మతధార్మిక సంస్థ. దీన్ని 1964 డిసెంబరులో ఏర్పాటు చేశారు. 


 ఇది మనదేశంలో వక్ఫ్‌ పాలనకు సంబంధించిన అంశాల్లో సలహాలను ఇస్తుంది. దీనిలో 20 మంది సభ్యులు ఉంటారు. 

 

 ఇది వక్ఫ్‌ ఆస్తుల అభివృద్ధికి కృషి చేస్తుంది. నేషనల్‌ వక్ఫ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(NAWADCO)ను 2014, జనవరి 29న ఏర్పాటు చేశారు.


DBT స్కాలర్‌షిప్‌ పథకం: ప్రత్యక్ష లాభ బదిలీ(Direct Benefit Transfer) పథకం ద్వారా మైనార్టీ విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తున్నారు. 


పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్, మెరిట్‌- కమ్‌- మీన్స్‌ స్కాలర్‌షిప్, మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ పథకాల కింద నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని బదిలీ చేస్తున్నారు.

ముస్లిం మైనార్టీల అభివృద్ధికి- 15 సూత్రాల పథకం: రాజేంద్రసింగ్‌ సచార్‌ కమిటీ సిఫార్సుల మేరకు డా. మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ముస్లింల సమగ్రాభివృద్ధి కోసం 15 సూత్రాల పథకాన్ని 2006, సెప్టెంబరు 10న ప్రకటించింది. అవి:


1. మైనార్టీ వర్గాలు నివసించే ప్రదేశంలో అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు.

 

2. మదర్సాలను ఆధునికీకరించి మెరుగ్గా నిర్వహించడం,


3. ప్రతిభావంతులైన మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరు.


4. మౌలానా ఆజాద్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ద్వారా విద్యారంగంలో మౌలిక సదుపాయాలకు కృషి.


5. ముస్లిం విద్యార్థులు ఎక్కువ ప్రవేశం పొందే విద్యాలయాల్లో ఉర్దూ ఉపాధ్యాయుల నియామకం.


6. జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ పట్టణ అభివృద్ధి పథకం కింద మౌలిక సదుపాయాల కల్పన.

 

7. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అమలవుతున్న ఉపాధిహామీ పథకాల్లో 15 శాతం నిధులు, వనరులను కేటాయించడం.


8. చిన్న తరహా, కుటీర పరిశ్రమల ఏర్పాటుకు రుణ సదుపాయాలు కల్పించడం.


9. సాంకేతిక శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం.


10. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక కోసం పోటీ పరీక్షార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడం.


11. మైనార్టీలు నివసించే ప్రాంతాల్లో బాలికల విద్య కోసం కస్తూర్భా గాంధీ విద్యాలయాల ఏర్పాటు.

 

12. మతపరమైన ఉద్రిక్తతలు నెలకొనే ప్రాంతాల్లో సమర్థులైన ప్రభుత్వ అధికారులను నియమించి, వారికి తగిన ప్రోత్సాహకాలు అందించడం.

13. ఇందిరా ఆవాస్‌ యోజన పథకం ద్వారా గృహ సదుపాయాల కల్పన.


14. మత కల్లోలాల బాధితులకు తగిన నష్టపరిహారాన్ని అందజేసి, పునరావాసం కల్పించడం.


15. మతపరమైన ఉద్రిక్తతలకు కారణమైన వారిని ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా విచారించి, నేరం రుజువైతే కఠిన శిక్షలు విధించి, అమలు చేయడం.


జియో పార్శీ పథకం: మనదేశంలో మైనార్టీ వర్గమైన పార్శీల జనాభా భారీగా క్షీణిస్తుండటంతో 2013, సెప్టెంబరు 23న మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖ జియో పార్శీ పథకాన్ని చేపట్టింది. 

 

 దీని ద్వారా పార్శీల జనాభా సంఖ్యను పెంచేందుకు కృషి జరుగుతుంది.


జాతీయ బీసీ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌


దేశంలో వెనుకబడిన వర్గాల సమగ్రాభివృద్ధి కోసం జాతీయ బీసీ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను 1992లో ఏర్పాటు చేశారు. 


 ఈ సంస్థ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.


వ్యవసాయం, చిన్నతరహా కుటీర పరిశ్రమలు, సంప్రదాయ వృత్తులు, సేవారంగం, సాంకేతిక రంగాల్లో ఓబీసీ (వీతీది) వర్గాల వారికి ఆర్థిక సహాయం అందించడం దీని లక్ష్యం.

 

1993లో జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్‌ను చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు.


 2018లో 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘‘జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్‌’’కు రాజ్యాంగబద్ధతను కల్పించారు.


జాతీయ మైనార్టీ ఆర్థికాభివృద్ధి సంస్థ 


 గోపాల్‌సింగ్‌ కమిటీ సిఫార్సుల మేరకు ‘‘జాతీయ మైనార్టీల ఆర్థికాభివృద్ధి సంస్థ’’ను 1994లో ఏర్పాటు చేశారు. 


ప్రారంభంలో ఈ సంస్థ సామాజిక, న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. 

 

2005లో ఈ సంస్థను మైనార్టీల వ్యవహారాల మంత్రిత్వశాఖకు బదిలీ చేశారు.


ఆశయాలు: మైనార్టీల ఉన్నత విద్యను ప్రోత్సహించడం.వారికి ఉపాధి అవకాశాలు, ఆర్థిక సహకారాన్ని కల్పించడం,


వివిధ రకాల చేతివృత్తులు, చిన్న తరహా, కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి అవసరమైన రుణ సదుపాయాలను కల్పించడం.


గిరిజన సహకార మార్కెటింగ్‌ అభివృద్ధి సమాఖ్య

 

గిరిజన వర్గాల (ఎస్టీ) ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు 1987లో ‘‘ట్రైబల్‌ కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా TRIFED)'ను దిల్లీలో స్థాపించారు. ఇది మనదేశంలో అతిపెద్ద సహకార సంస్థ.

 

గిరిజనులు సేకరిస్తున్న సూక్ష్మ అటవీ ఉత్పత్తులను దళారుల ప్రమేయం లేకుండా సరైన ధరలకు విక్రయించడానికి ఇది సహకరిస్తుంది.


షెడ్యూల్డ్‌ తెగల ఉపప్రణాళిక (ST-Sub plan)


షెడ్యూల్డ్‌ తెగల ఉపప్రణాళిక (st-subplan)ను 5వ పంచవర్ష ప్రణాళికా కాలం 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రారంభించింది. 


గిరిజనుల సమగ్రాభివృద్ధిని సాధించడం దీని లక్ష్యం. 


 ఇందులోని అంశాలు: కనీసం 10,000 అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 50% కంటే ఎక్కువ గిరిజనులు ఉన్న 259MADA ప్రాంతాల గుర్తింపు. 

(MADA అంటే Modified Area Development Agency

50% కంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో సమగ్ర గిరిజనాభివృద్ధి ఏజెన్సీల(ITDA) స్థాపన.


 


 


 

Posted Date : 18-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

నిర్భయ చట్టం

నేపథ్యం 


దిల్లీకి చెందిన పారామెడికల్‌ విద్యార్థినిపై 2012, డిసెంబరు 16న సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 


 భవిష్యత్తులో మహిళలపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కొత్త చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. 


 ప్రస్తుత చట్టాలను సమీక్షించి, నిందితులను కఠినంగా శిక్షించేందుకు అవసరమైన చట్టాల రూపకల్పనకు ప్రభుత్వం 2012, డిసెంబరు 23న ఒక కమిటీని నియమించింది. దీనికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జగదీశ్‌ శరణ్‌ వర్మ అధ్యక్షత వహించారు.
 

వర్మ కమిటీ


సభ్యులు: జస్టిస్‌ లీలాసేథ్‌ - హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, గోపాల్‌ సుబ్రమణియం - మాజీ సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా. 


 జస్టిస్‌ వర్మ కమిటీ 2013, జనవరి 23న 630 పేజీలతో కూడిన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఇందులోని సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 2013, ఫిబ్రవరి 1న ‘ఆర్డినెన్స్‌’ను రూపొందించింది. ఇది 2013, ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వచ్చింది. 


 ఈ ఆర్డినెన్స్‌ స్థానంలో కేంద్ర కేబినెట్‌ ‘నేర న్యాయ సవరణ బిల్లు- 2013’ను రూపొందించింది. దీన్ని 2013, మార్చి 19న లోక్‌ సభ, మార్చి 21న రాజ్యసభ ఆమోదించాయి. ఈ బిల్లుపై 2013, ఏప్రిల్‌ 2న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఇది మొదట ఆర్డినెన్స్‌ రూపంలో వచ్చింది కాబట్టి ఈ బిల్లు 2013, ఫిబ్రవరి 3 నుంచే అమల్లోకి వచ్చినట్లు పరిగణించాలి.


నిర్భయ నిధి 


బాధితులకు ఆర్థిక సహకారం, భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 


రూ.1000 కోట్లతో ‘నిర్భయ నిధి’ని ఏర్పాటు చేసింది. వీరికి అందించే ఆర్థిక సహకారం కింది విధంగా ఉంటుంది.


* అత్యాచారం - రూ.3 లక్షలు  


* యాసిడ్‌ దాడి - రూ.3 లక్షలు


* పూర్తి అంగవైకల్యం - రూ.2 లక్షలు  


* పాక్షిక అంగవైకల్యం - రూ.లక్ష


* మైనర్‌ బాలిక - రూ.2 లక్షలు


* నిర్భయ చట్టాన్ని ‘నేర న్యాయ చట్టం, 2013’గా పేర్కొంటారు. దీని ప్రకారం నిర్భయ నిందితులైన అక్షయ్‌ ఠాకూర్, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తా, ముఖేష్‌ సింగ్‌లను 2020, మార్చి 20న దిల్లీలోని తీహార్‌జైలులో ఉరి తీశారు.


బాలనేరస్తులు - వివరణ


నిర్భయ చట్టంలోని సెక్షన్‌ 2(k) ప్రకారం, 18 ఏళ్లలోపు వయసువారిని బాలనేరస్తులుగా పరిగణిస్తారు. ఈ వయసులో నేరాలు చేసిన వారిని విచారించే అధికారం జువైనల్‌ జస్టిస్‌ బోర్డుకు ఉంటుంది. వీరు తమ వయసు ధ్రువీకరణ కోసం సర్టిఫికెట్‌ను సమర్పించాలి.


 మహిళలపై జరిగిన నేరాల గురించి ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేసి, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించొచ్చు. దర్యాప్తును మాత్రం నేరం జరిగిన ప్రాంతంలోని పోలీస్‌ స్టేషన్‌ అధికారులు చేపడతారు.


 నిర్భయ ఘటన తర్వాత మహిళలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో టెలికాం విభాగం 181 ఫోన్‌ నంబరును అందుబాటులోకి తెచ్చింది.


ఉషా మెహ్రా కమిషన్‌


నిర్భయ ఘటన తర్వాత భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ప్రభుత్వం భావించింది. నిర్భయ ఘటనకు దారి తీసిన కారణాలను పరిశీలించి, ఇలాంటివి జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై, భవిష్యత్తులో మహిళకు భద్రతను కల్పించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై అధ్యయనం కోసం ప్రభుత్వం దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉషా మెహ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది.


గృహహింస నిరోధక చట్టం, 2005


మహిళలను శారీరక, మానసిక, ఆర్థిక వేధింపుల నుంచి రక్షించటానికి భారత ప్రభుత్వం 2005లో గృహహింస నిరోధక చట్టాన్ని రూపొందించింది. ఇది 2006, అక్టోబరు 26 నుంచి అమల్లోకి వచ్చింది. 


ముఖ్యాంశాలు: మహిళలపై శారీరక, మానసిక, ఆర్థిక వేధింపులను నేరంగా పరిగణిస్తారు. హింసకు గురైన మహిళకు సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ (పీఓ)ను నియమిస్తుంది.


ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ (పీఓ): వీరు ప్రభుత్వ ఉద్యోగులు/ ఎన్‌జీఓ అవ్వొచ్చు. సామాజిక రంగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి. సాధ్యమైనంతవరకు మహిళలనే పీఓగా నియమిస్తారు.


ఎవరైనా మహిళ హింసకు గురైనప్పుడు స్వయంగా లేదా ఆమె తరఫున మరొకరు ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదులను లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా ఇవ్వొచ్చు. వీటిని పీఓకు ఇవ్వాలి. మౌఖిక (oral)  ఫిర్యాదులను పీఓ రికార్డు చేసి, ఫిర్యాదుదారులకి ఉచితంగా ఒక నకలు ఇవ్వాలి. ఫిర్యాదు అందిన వెంటనే పీఓ సంబంధిత అంశాన్ని ఆ ప్రాంత మెజిస్ట్రేట్‌/ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కి పంపాలి. పీఓ తన విధి నిర్వహణలో విఫలమైతే ఏడాది జైలు శిక్ష, రూ.20,000 జరిమానా విధిస్తారు.


రకాలు: గృహహింస 4 రకాలు.


1. భౌతిక గృహహింస: గాయపరచడం, చిత్రహింసలు పెట్టడం.


2. లైంగిక గృహహింస: ఇష్టం లేకుండా లైంగిక చర్యకు బలవంతం చేయడం.


3. మానసిక గృహహింస: జంతువులు, పక్షులతో పోల్చి కించపరచడం, ప్రాథమిక అవసరాలకు దూరం చేయడం.


4. ఆర్థికపరమైన గృహహింస: మహిళల నుంచి బలవంతంగా నగదును తీసుకోవడం, ఆర్థికపరమైన స్వేచ్ఛను నియంత్రించడం.


POCSO Act, 2012

లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో  Protection of Children from Sexual Offences (POCSO) Act, 2012ను రూపొందించారు.


ఈ చట్టంలోని ముఖ్యాంశాలు:


 బాలలు అంటే 18 ఏళ్లలోపు వారు.


 బాలలపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడిన వారికి శిక్షలు విధించడం, పోర్నోగ్రఫీ నుంచి బాలలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు.


ఈ చట్టం ప్రకారం విధించే శిక్షలు..


* అశ్లీల ప్రయోజనాలకు పిల్లలను వినియోగించడం: గరిష్ఠంగా అయిదేళ్ల జైలు శిక్ష. 


* చొచ్చుకుపోయే లైంగిక వేధింపులకు: కనిష్ఠంగా పదేళ్లు, 


గరిష్ఠంగా జీవితఖైదు.


* తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక వేధింపులకు: జీవిత ఖైదు.


POCSO సవరణ చట్టం, 2019:


 2018లో జమ్మూ-కశ్మీర్‌లో కథువాలో 8 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఈ కేసులో బాధితురాలికి సత్వర న్యాయం అందించాలనే ఉద్దేశంతో 2012 నాటి POCSO చట్టాన్ని సవరించారు.


 2019లో  Amendments in the Protection of Children from Sexual Offences ను రూపొందించారు. ఈ చట్టం 2020, మార్చి 9 నుంచి అమల్లోకి వచ్చింది.


ముఖ్యాంశాలు:


ఈ చట్టం ప్రకారం, బాధితులకు 30 రోజుల్లో పరిహారాన్ని చెల్లించాలి.


 చొచ్చుకుపోయే లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి కనీస శిక్షను 7 నుంచి 10 సంవత్సరాలకు పెంచారు. 16 ఏళ్లలోపు బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన వారికి 20 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధిస్తారు.


 తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి కనీస శిక్షను 10 నుంచి 20 సంవత్సరాలుగా నిర్ణయించారు. గరిష్ఠంగా మరణశిక్ష విధిస్తారు. 


 బాలల పోర్నోగ్రఫీకి సంబంధించిన పరికరాలను నిల్వ చేసేవారికి 3 నుంచి 5 సంవత్సరాల జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు.


యాసిడ్‌ దాడుల నియంత్రణ - సుప్రీంకోర్టు మార్గదర్శకాలు


దేశంలో మహిళలపై జరుగుతున్న యాసిడ్‌ దాడులను నివారించేందుకు జస్టిస్‌ ఆర్‌.ఎం.లోథా నేతృత్వంలోని సుప్రీంకోర్టు డివిజన్‌ బెంచ్‌ వివిధ మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో ప్రధానమైంది విచ్చలవిడిగా రసాయనాలను విక్రయించడంపై నిషేధం విధించమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడం. 2014, మార్చి 31లోగా కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ మార్గదర్శకాలను జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.


మార్గదర్శకాలు: యాసిడ్‌ కొనుగోలుదారుల సమాచారాన్ని, చిరునామాను విక్రయదారులు తప్పనిసరిగా నమోదు చేయాలి.

 

 యాసిడ్‌ను వినియోగించే విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ విభాగాలు వాటి వినియోగ వివరాలను నమోదు చేయాలి.

 

 18 ఏళ్లు నిండి, చిరునామా ధ్రువపత్రాన్ని చూపించిన వారికి మాత్రమే యాసిడ్‌ను విక్రయించాలి.


 యాసిడ్‌ దాడి బాధితురాలికి చికిత్స, పునరావాసం కింద ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కనీసం రూ.3 లక్షలకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి. ఘటన జరిగిన 15 రోజుల్లోగా తక్షణ సాయం కింద రూ.లక్ష అందించాలి.


 ప్రభుత్వం జారీచేసిన ‘ఫొటో గుర్తింపు కార్డు’ కలిగిన వారికి మాత్రమే యాసిడ్‌ను విక్రయించాలి.


 యాసిడ్‌ నిల్వల వివరాలను విక్రయదారుడు సంబంధిత సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట 15 రోజుల్లోగా సమర్పించాలి. లేకపోతే రూ.50,000 జరిమానా విధించాలి.


నిర్భయ చట్టం ప్రకారం విధించే శిక్షలు


యాసిడ్‌ దాడి 10 సం. జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా.


అత్యాచారం 7 సం. జైలు శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష.


మరణం/ శాశ్వత అంగవైకల్యానికి   యావజ్జీవం లేదా మరణ శిక్ష.


మానవ అక్రమ రవాణా  7 - 10 సం. జైలు శిక్ష.


విడిపోయిన భార్యపై భర్త  అత్యాచారం చేస్తే  2 సం. జైలు శిక్ష.


అధికారం చెలాయించే వ్యక్తి   లైంగికచర్యలకు పాల్పడితే   5 - 10 సం. జైలుశిక్ష


వాయరిజమ్‌   1 - 3 సం. జైలుశిక్ష


వేధింపులు   1 - 3 సం. జైలు శిక్ష


 


బంగారు సత్యనారాయణ

విషయ నిపుణులు 

Posted Date : 27-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌