• facebook
  • whatsapp
  • telegram

భారతీయ సమాజ నిర్మాణం

మాదిరి ప్రశ్నలు

1. త్రివర్గాలు అంటే ఏమిటి?
     ఎ) ధర్మం, కామం, మోక్షం    బి) ధర్మం, అర్థం, మోక్షం
     సి) అర్థం, కామం, మోక్షం    డి) ధర్మం, అర్థం, కామం
     జవాబు: డి

 

2. భారతీయ హిందూ సమాజంలో ఏ అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు?
     ఎ) ధర్మం    బి) అర్థం    సి) కామం    డి) మోక్షం
     జవాబు: డి

 

3. ఏ ఆశ్రమాన్ని గృహస్థ, సన్యాస ఆశ్రమాలకు వారధిగా పేర్కొంటారు?
     ఎ) వానప్రస్థం    బి) బ్రహ్మచర్యం    సి) గృహస్థం    డి) సన్యాసం
     జవాబు:

 

4. ఉపనయన సమయంలో వైశ్యులకు ఉపదేశించే మంత్రం ఏది?
     ఎ) గాయత్రీ మంత్రం    బి) త్రిష్టుబ్ మంత్రం    సి) జగతీ మంత్రం    డి) ఏదీకాదు
     జవాబు: సి

 

5. 'భాగవతం' ఒక ... ?
     ఎ) శ్రుతి    బి) స్మృతి    సి) పురాణ గ్రంథం    డి) ఇతిహాస గ్రంథం
     జవాబు: సి

 

6. ద్విజులు అంటే ఏమిటి?
     ఎ) రెండు జన్మలు కలిగినవారు
     బి) ఉపనయన సంస్కారం కలిగినవారు
     సి) పై రెండూ    డి) ఏదీకాదు
     జవాబు: సి

 

7. కిందివారిలో ద్విజులు ఎవరు?
     ఎ) బ్రాహ్మణులు    బి) క్షత్రియులు    సి) వైశ్యులు    డి) పై అందరూ
     జవాబు: డి

 

8. వినడం ద్వారా, గురుముఖంగా, మననం చేసుకోవడం ద్వారా నేర్చుకునేవి ఏవి?
     ఎ) స్మృతులు    బి) శ్రుతులు    సి) పురాణాలు    సి) ఇతిహాసాలు
     జవాబు: బి

 

9. ఎంత పురాతనమైనవైనా నిత్యనూతనంగా ఉండేవి ఏవి?
     ఎ) ఇతిహాసాలు    బి) పురాణాలు    సి) వేదాలు    డి) ఉపనిషత్తులు
     జవాబు: బి

 

10. సమాజాన్ని ముందుకు కొనసాగించడం, నూతన వ్యక్తులను సమాజంలో భాగస్వామ్యం చేయడం అనే ధర్మం ఏ ఆశ్రమంలో కనిపిస్తుంది?
     ఎ) బ్రహ్మచర్యం    బి) గృహస్థం    సి) వానప్రస్థం    డి) సన్యాసం
     జవాబు: బి

 

Posted Date : 12-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కుటుంబం

తరతరాలకూ తరగని బంధం!

 

సామాజిక జీవితంలో అత్యంత ప్రధానమైనది కుటుంబం. మనిషి మనుగడకు మూలం అక్కడి నుంచే మొదలవుతుంది. తరతరాలకు తరగని అనుబంధాలతో సాగుతుంది. పుట్టుక లేదా వివాహంతో బంధం ఏర్పడి ఒకే ఇంటిలో నివసించే సమూహమే కుటుంబం. సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత పురోగతులకు ఇదే పునాది. ప్రపంచంలో పలు రకాల కుటుంబ వ్యవస్థలున్నాయి. వీటిలో పాటించే భిన్న ఆచారాలు, సంప్రదాయాలు, వ్యక్తుల బాధ్యతలు ఆసక్తికరంగా ఉంటాయి. ‘సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజావిధానాలు/పథకాలు’ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఆ వివరాలను తెలుసుకోవాలి. 

 

కుటుంబం ఒక విశిష్ట సంస్థ. వివిధ పరిస్థితులు, సందర్భాలకు అనుగుణంగా కుటుంబం వ్యక్తిగతమైందిగా లేదా ప్రజలకు సంబంధించిందిగా మారుతూ ఉంటుంది. మన జీవితంలో అధికభాగం కుటుంబంతోనే గడుస్తుంది. మానవ సామాజిక జీవితానికి పునాది కుటుంబ వ్యవస్థ. దానికి వివాహం పునాది వేస్తుంది. ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ లేని సమాజం లేదు. వ్యక్తి, సమాజానికి కుటుంబం ఒక ముఖ్యమైన సాంఘిక సమూహం. ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఏదో ఒక కుటుంబంలో భాగంగా ఉంటాడు. మన జీవితం మొత్తం కుటుంబంతోనే ముడిపడి ఉంటుంది. 

 

కుటుంబం ఒక విశిష్ట సంస్థ. వివిధ పరిస్థితులు, సందర్భాలకు అనుగుణంగా కుటుంబం వ్యక్తిగతమైందిగా లేదా ప్రజలకు సంబంధించిందిగా మారుతూ ఉంటుంది. మన జీవితంలో అధికభాగం కుటుంబంతోనే గడుస్తుంది. మానవ సామాజిక జీవితానికి పునాది కుటుంబ వ్యవస్థ. దానికి వివాహం పునాది వేస్తుంది. ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ లేని సమాజం లేదు. వ్యక్తి, సమాజానికి కుటుంబం ఒక ముఖ్యమైన సాంఘిక సమూహం. ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఏదో ఒక కుటుంబంలో భాగంగా ఉంటాడు. మన జీవితం మొత్తం కుటుంబంతోనే ముడిపడి ఉంటుంది. 

 

"Family" అనే పదం రోమన్‌ పదం ఫాములస్‌ (Famulus) నుంచి వచ్చింది. ఫాములస్‌ అంటే సేవకుడు. Family అనే పదం ఫెమీలియా (Familiya) అనే లాటిన్‌ పదం నుంచి ఏర్పడిందని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. ఫెమీలియా అంటే కుటుంబం. కుటుంబానికి ప్రాధాన్యాన్నిస్తూ మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుతున్నారు. కుటుంబాలు అనే భావన గురించి మొదట చెప్పినవారు అరిస్టాటిల్, ప్లేటో.

నేటి సమాజంలో కుటుంబం అంటే భార్య, భర్త, వారి సంతానం మాత్రమే. 19వ శతాబ్దం తొలి రోజుల్లో ఆదిమ సమాజాల్లో కుటుంబ వ్యవస్థ ఉందా అనే చర్చ బలంగా వెలుగులోకి వచ్చింది. ఏంగెల్స్, కార్ల్‌మార్క్స్, మోర్గాన్‌ లాంటి శాస్త్రవేత్తలు కుటుంబం ఒక పరిణామ క్రమంలో బలపడిన బంధంగా భావించారు. సామాజికంగా ఆమోదం పొందిన స్త్రీ, పురుషుల ప్రత్యుత్పత్తి లేదా జీవ వ్యవస్థను కుటుంబం అంటారు. స్త్రీ, పురుషులు ఒకే ప్రదేశంలో నివసించడం వల్ల కుటుంబాలు ఏర్పడినట్లు మోర్గాన్‌ అనే సామాజికవేత్త అభిప్రాయపడ్డాడు.

నిర్వచనాలు

1955కు ముందు కుటుంబ నిర్వచనాలను తొలి నిర్వచనాలు అని, 1955 తర్వాత వచ్చిన నిర్వచనాలను ఆధునిక నిర్వచనాలు అని పేర్కొంటారు.

తొలి నిర్వచనాలు:  వైవాహిక సంబంధాలు, బాధ్యతలు, విధులు, కలిసి నివసించడం, తల్లిదండ్రులు వారి సంతానాల మధ్య పరస్పర సంబంధాలు అనే వాటిపై ఆధారపడే సమూహమే కుటుంబం - రాబర్ట్‌ హెచ్‌.లూయీ. 

వివాహం, తల్లిదండ్రుల విధులు-బాధ్యతలు, వారి సంతానం కలిసి నివసించడమే కుటుంబం - రాల్ఫ్‌లింటన్‌. లూయూ, లింటన్‌ల అభిప్రాయం ప్రకారం కుటుంబం ఉనికి సర్వసాధారణమైంది.

* జార్జిపీటర్‌ ముర్డాక్‌ అనే మానవ శాస్త్రవేత్త 192 సమాజాలను పరిశీలించి ఒకేచోట నివసించడం, ఆర్థిక సహకారం, ప్రత్యుత్పత్తి అనే లక్షణాలను కలిగి ఉండే సమూహమే కుటుంబమని అభిప్రాయపడ్డారు.

ఆధునిక నిర్వచనాలు:  వివాహం, చట్టబద్ధమైన పితృత్వ, మాతృత్వాలు, దంపతులు పరస్పరం ఒకరిపై మరొకరు లైంగికపరమైన ఆధిపత్యాన్ని కలిగి ఉండటమే కుటుంబం - లీచ్‌. 

* ప్రాథమిక బంధువర్గ సమూహం; లైంగిక, ప్రత్యుత్పత్తి, ఆర్థిక, విద్యాపరమైన విధుల్ని నిర్వహించేదే కుటుంబం - మెల్‌ఫోర్డ్, స్మిత్‌గ్రీన్, ప్రిన్స్‌పీటర్, కాథలిన్‌ గఫ్‌.

* స్టీఫెన్స్‌ ప్రకారం వివాహ ఒప్పందం 4 ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.1) భార్య, భర్తల మధ్య ఉండే పరస్పర సంబంధం 2) కలిసి నివసించడం 3) తల్లిదండ్రుల హక్కులు 4) బాధ్యతలు

 

కుటుంబం విధులు

జార్జి ముర్డాక్‌ ప్రకారం..

దైహిక విధులు: లైంగికపరమైన ఆనందం, సహచర్యం, ప్రేమానురాగాలను తృప్తిపరుచుకుంటూ సంతానాన్ని కని, వారిని సంరక్షించి, బాధ్యతాయుత సమాజ సభ్యులుగా తీర్చిదిద్దడం.

సామాజిక విధులు: సామాజిక నియంత్రణలో కుటుంబం ప్రధానపాత్ర పోషిస్తుంది. సంస్కృతిని నేర్పిస్తుంది. పరస్పర మైత్రి, అన్యోన్య సహకారం, రక్షణ, సామాజిక నియంత్రణను కలిగి ఉంటుంది.

ఆర్థిక విధులు: ఆర్థిక భద్రత ఇస్తుంది. శ్రమ విభజన కలిగి ఉంటుంది. ప్రాథమిక అవసరాలైన ఆహారం, నివాసం, వస్త్రాలు, అంతస్థు, అధికారాలను కలిగి ఉంటుంది.

లైంగిక విధి: భార్య, భర్తల మధ్య సంబంధం.. ఆమోదం పొందిన లైంగిక సంబంధానికి సాధనంగా ఉండటంతో పాటు, కుటుంబ వ్యవస్థ రూపొందేందుకు పునాది అవుతుంది. కొన్ని గిరిజన తెగల్లో మాత్రం దాంపత్య సంబంధం కుటుంబం ఏర్పడేందుకు కారణం కాకపోవచ్చు. ఉదా: న్యూ గినియాలోని బనారో తెగ, తూర్పు ఐరోపాలోని కొన్ని తెగలు (ఒక వ్యక్తి భార్య ఆమె మామ గారి బంధువు ద్వారా ఒక శిశువుకు జన్మనిచ్చే వరకు ఆ వ్యక్తి (భర్త) భార్యను సమీపించకూడదు).

విద్యావిధులు: కుటుంబం విద్యాపరమైన విధులను కూడా నిర్వర్తిస్తుంది.

ప్రత్యుత్పత్తి విధి: కుటుంబాల ద్వారానే ప్రత్యుత్పత్తి జరుగుతుంది.

సాంస్కృతిక విధి: కుటుంబం సాంస్కృతిక వారసత్వ కేంద్రంగా పనిచేస్తుంది. అలవాట్లు, పద్ధతి, జీవనశైలి, ఆచారాలు, విద్య - విజ్ఞాన అంశాలు, సాంస్కృతిక అంశాలు, కళలు, విద్యా అవకాశాలను కుటుంబం కల్పిస్తుంది.

మైకేవర్‌ ప్రకారం కుటుంబ విధులు రెండు రకాలు. 

ఆవశ్యకమైనవి: పిల్లల్ని కనడం, పెంచడం, గృహ సదుపాయం.

అనావశ్యకమైనవి: మత బోధన, విద్య, ఆర్థిక, ఆరోగ్యం, వినోదం.

 

లక్షణాలు

ఆర్‌.ఎం. మైకేవర్‌ తను రాసిన ‘సొసైటీ’ అనే గ్రంథంలో కుటుంబ లక్షణాలను కింది విధంగా పేర్కొన్నాడు.

* విశ్వవ్యాపితం - కుటుంబం విశ్వమంతా వ్యాపించి ఉంది. 

* పరిమిత ప్రమాణం - అన్ని సామాజిక వ్యవస్థల కంటే కుటుంబం పరిమాణంలో చిన్నది. 

* కుటుంబ సభ్యుల మధ్య బాధ్యత - కుటుంబ సభ్యులందరి అభివృద్ధి, సంక్షేమం కోసం బాధ్యతగా కృషి చేస్తారు.

* అధ్యయన కేంద్రం - కుటుంబం మానవుడి ప్రాథమిక పాఠశాల. సమాజంలోని పద్ధతుల్ని కుటుంబంలోనే నేర్చుకుంటారు.

* సాంఘిక నియంత్రణ -  నైతిక విలువల్ని, వ్యక్తిత్వాన్ని నేర్పుతుంది.

* శాశ్వతత్వం, పరివర్తన - కుటుంబాన్ని ఒక సామాజిక వ్యవస్థగా తీసుకుంటే, అది మానవజాతి పుట్టుక నుంచి ఇప్పటివరకు శాశ్వతంగా ఉంటూ వస్తున్న సంస్థ.

శాస్త్రవేత్తల అభిప్రాయాలు

* మైకేవర్‌: పిల్లల్ని కనడం, పెంచడం, విధుల్ని నిర్వహించడానికి, స్థిరమైన లైంగిక సంబంధాలు గల సమూహమే కుటుంబం. 

* రీమాండ్‌ఫర్‌: ఈయన కుటుంబానికి త్రికోణ స్వరూపాన్ని ఇచ్చాడు. ఈ నమూనాలో ఒకవైపు భర్త, మరోవైపు భార్య, మూడో వైపు వారి సంతానం ఉంటుంది.

* బర్డస్, లాక్‌: వివాహబంధం, రక్తసంబంధం లేదా దత్తతతో ఏకమై ఒకే ఇంటిలో నివసించేదే కుటుంబం.

* ఐరావతి కార్వే: ఒకే పైకప్పు కింద నివసిసున్న, ఒకే వంటగదిలో చేసిన ఆహారాన్ని తింటూ, ఒకే ఆస్తిని కలిసి అనుభవిస్తూ కుటుంబ ప్రార్థనలో అందరూ పాల్గొంటూ, ఒకరికొకరు బంధువులయ్యే వ్యక్తుల సమూహమే ఉమ్మడి కుటుంబం.

* సమ్నర్, మోర్గాన్‌: వీరి అధ్యనాల ప్రకారం పూర్వం మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉండేది.

* ఫ్రెడరిక్‌ ఏంగిల్స్‌: ది ఆరిజన్‌ ఆఫ్‌ ఫ్యామిలీ, ప్రైవేట్‌ ప్రాపర్టీ అండ్‌ ది స్టేట్‌  అనే రచనల్లో కుటుంబంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

రచయిత: వట్టిపల్లి శంకర్‌ రెడ్డి

 

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

‣ గిరిజన సమూహాలు

 బంధుత్వం - అనుబంధం

 భారతీయ సమాజ నిర్మాణం

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 03-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఎడతెగని సామాజిక బంధం!

    భారతీయ సమాజంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న సమూహాలు గిరిజన తెగలు. వీటికి సామాజికంగా, సాంస్కృతికంగా ప్రత్యేకతలున్నాయి. వీటితోపాటు వైవిధ్య చరిత్ర, సంస్కృతులున్నాయి. జన జీవన స్రవంతిలో భాగంగా కొందరు.. దూరంగా ఇంకొందరు జీవనం సాగిస్తున్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోనూ భిన్న తెగలకు చెందిన గిరిజనులున్నారు. భారత్‌లోని గిరిజన తెగల సంస్కృతి.. సంప్రదాయాలు.. జీవన వైవిధ్యం.. తదితర అంశాలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం సమాజశాస్త్ర శాఖాధిపతి, టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యులు ఆచార్య గణేశ్ విశ్లేషణ 'ఈనాడు ప్రతిభ'కు ప్రత్యేకం.
    ఆదివాసీలు, గిరిజనులు ఏ దేశానికైనా మూలవాసులన్నది మానవ శాస్త్రవేత్తల భావన. ప్రస్తుత భారత జనాభాలో దాదాపు 8-9 శాతం ప్రజలు వివిధ గిరిజన సమూహాలకు చెందినవారే. భారతీయ సమాజంలో గిరిజన సమూహాలన్నీ ప్రత్యేకమైన మత విశ్వాసాలను కలిగి ఉన్నాయి. గిరిజన సమాజమనేది కొన్ని ప్రత్యేక లక్షణాలతో కూడుకున్న సమూహం. ఆంథ్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనం ప్రకారం ఒక్కో గిరిజన తెగ ఒక నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతానికి పరిమితమై ఉంటుంది. ఒక గిరిజన తెగ విభిన్న రాష్ట్రాల్లో విస్తరించి ఉండటం అరుదు. ప్రతి గిరిజన సమూహానికి ఒక నిర్దిష్టమైన పేరుంటుంది. ఒకే రకమైన భాష, సంస్కృతి ఉంటాయి. ఒకేరకమైన ఆచార వ్యవహారాలు కలిగి ఉంటారు. ఒకే న్యాయం, ఒకే చట్టం ఉంటాయి. అంతర్వివాహ పద్ధతిని ఆచరిస్తారు. గిరిజన సమూహాలకు ప్రత్యేకమైన మత విశ్వాసాలు, ఆరాధన పద్ధతులు ఉంటాయి. ముఖ్యంగా ప్రకృతి శక్తులను ఆరాధిస్తారు. వీటితోపాటు ప్రతి గిరిజన సముదాయానికి ఒక స్వయం ప్రతిపత్తి గల రాజకీయ వ్యవస్థ ఉంటుంది. ఈనాటికీ చాలా తెగలు ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో ప్రవేశించినా, తమనుతాము నియంత్రించుకునే స్వీయ రాజకీయ వ్యవస్థను (ఆదివాసీ మండలి) కొనసాగిస్తున్నాయి. ఆయా తెగల పెద్దలు ఇందులో సభ్యులుగా ఉంటారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలను వీరే నియంత్రిస్తుంటారు. అన్నింటికీ మించి ఇవి ఏకరూపత కలిగిన సమూహాలు. వీటన్నింటిలోనూ గోత్ర వ్యవస్థ అంతస్సూత్రంగా పనిచేస్తుంది. గిరిజన సమాజంలోని సభ్యుల ప్రవర్తనను గోత్రవ్యవస్థ నియంత్రిస్తుంటుంది. స్వగోత్రికులు రక్తబంధువులనే భావన కలిగి ఉంటారు. అందుకే స్వగోత్రీకులు పెళ్లిళ్లు చేసుకోరు.

పవిత్ర టోటెమ్
ప్రతి గోత్రానికి ఓ టోటెమ్ ఉంటుంది. టోటెమ్ అంటే మతపరమైన చిహ్నం. గోత్ర సభ్యులంతా ఆ మతపరమైన చిహ్నం నుంచి ఉద్భవించామనే భావనతో దాన్ని పవిత్రంగా భావిస్తారు.. ఆరాధిస్తారు. ఈ చిహ్నం ఒక వ్యక్తి కావొచ్చు, జంతువు, చెట్టు లేదా ప్రకృతిలోని ఏదైనా కావొచ్చు. అది వారి తెగకు గుర్తు.

మూడు రకాల తెగలు
    భారత్‌లో మనకు 3 రకాల గిరిజన తెగలు కనిపిస్తాయి.
1. దట్టమైన అటవీ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో జీవించేవారు. వీరు జనజీవన స్రవంతికి దూరంగా ఉంటారు. అడవులు, అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తారు. ఆర్థికంగా, రాజకీయంగా స్వతంత్రంగా జీవించినప్పటికీ ఆర్థికంగా వెనకబడిన తెగలివి.
2. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నా, వ్యవసాయం ప్రధానంగా చేసే ఆదిమ తెగలు. వీరికి పాక్షికంగా గిరిజనేతరులతో సంబంధాలుంటాయి. సామాజిక, వ్యాపార సంబంధాలుండే అవకాశముంది.

3. మైదాన ప్రాంతాల్లోని గిరిజన సమూహాలు. జనజీవన స్రవంతిలో భాగంగా ఉండి ఆధునిక జీవన విధానానికి దగ్గరగా ఉంటారు. ప్రభుత్వం కల్పించే చాలా అభివృద్ధి పథకాలు ఈ మైదాన ప్రాంతాల్లో స్థిరపడిన, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దగ్గరగా ఉన్న తెగలు ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. అందుకే వారిలో విద్య, ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. ఉదాహరణకు ఉత్తర భారతదేశంలో తీసుకుంటే బిల్లులు, సంతాల్(మధ్యప్రదేశ్)లు, ముండాలు (బిహార్), మహారాష్ట్ర, తెలంగాణల్లోని రాజ్‌గోండులు, లంబాడీలు జనజీవన స్రవంతికి చాలా దగ్గరగా ఉండే సమూహాలు. అందుకనే వీరిలో రాజకీయ, ఆర్థిక, విద్యాపరమైన అభివృద్ధి కనిపిస్తుంటుంది. అదే చెంచు లాంటి తెగలను చూస్తే వారింకా జనజీవన స్రవంతికి దూరంగానే ఉన్నారు.

ఈశాన్య భారతంలో..
సామాజిక, మానవ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భారత్‌లో దాదాపు 450కి పైగా గిరిజన సమూహాలున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో వీరి జనాభా శాతం ఎక్కువ. దాదాపు 80 నుంచి 90 శాతం దాకా ఈశాన్య రాష్ట్రాల మొత్తం జనాభాలో గిరిజనులే. వీటిలో జనాభా పరంగా చూస్తే, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణల్లో విస్తరించిన గోండు తెగ అత్యధిక జనాభాతో ఉంది. ఈ గోండుల్లో కూడా రకరకాల వారున్నారు. ఉదాహరణకు మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఎక్కువగా కనిపించేవారు మరియా గోండులు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా పరిధిలో కనిపించే వారు రాజ్‌గోండులు. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో ప్రధానమైన తెగ భిల్లులు. బిహార్, ఒడిశా, పశ్చిమ్ బంగ, మధ్యప్రదేశ్ (పాక్షికంగా)ల్లో సంతాల్‌లు; ఝార్ఖండ్‌లో ముండాలు అత్యధిక జనాభా ఉన్న గిరిజన సమూహాలు. మధ్యభారత ప్రాంతాల్లో ముఖ్యంగా మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్‌లలో గిరిజన జనాభా ఎక్కువగా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం అక్కడి జనాభాలో అత్యధిక శాతం గిరిజన తెగకు చెందినవారే. ఉదాహరణకు మిజోరాంను చూస్తే స్థానిక జనాభాలో 95 శాతం గిరిజన సమూహాలే. అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయల్లోని జనాభాలో 80 శాతం గిరిజనులే. నాగాలాండ్‌లో 85 శాతం పైగా, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో 25 శాతం వంతున గిరిజన జనాభానే. గుజరాత్‌లో 14, రాజస్థాన్‌లో 12, అసోం, బిహార్‌ల్లో 10 శాతం గిరిజన జనాభా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

గిరిజన సమూహాలు.. జోన్లు

    భారత్‌లో భౌగోళికంగా వివిధ గిరిజన సమూహాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయనేది ఆసక్తికరం. దీనిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ ఫర్ రిసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్), ఎల్‌పీ విద్యార్థి అనే సామాజిక మానవ శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ఓ సర్వే నిర్వహించింది. భారత్‌లోని వివిధ గిరిజన సమూహాల భౌగోళిక విస్తరణను అధ్యయనం చేసిన విద్యార్థి వీరిని నాలుగు జోన్లుగా విభజించారు.

1. హిమాలయ ప్రాంతం
2. మధ్య భారత ప్రాంతం
3. పశ్చిమ భారత ప్రాతం
4. దక్షిణ భారత ప్రాంతం

    భారతదేశ జనాభాలో గిరిజన జనాభా 9-10 శాతం ఉంటుందని అంచనా. మొత్తం గిరిజన జనాభాలో.. హిమాలయ పర్వత ప్రాంతాల్లో 11 శాతం ఉంటే.. 57 శాతం మధ్య భారతంలోనూ, 25 శాతం పశ్చిమ భారతంలోనూ, 7 శాతం దక్షిణ భారతంలోనూ ఉన్నట్లు విద్యార్థి అంచనా. ఇతడి సర్వే ప్రకారం ఆయా ప్రాంతాల్లోని ప్రధాన తెగలను చూస్తే..

1. హిమాలయ ప్రాంతంలో..
    జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో ప్రధానంగా కనిపించేవి భోట్, గుజ్జర్, గద్ది తెగలు. ఉత్తర్ ప్రదేశ్‌లోని తెరాయి ప్రాంతంలో ప్రధానమైన తెగ తారూ. అసోంలో - మిజో, గారో, ఖాసీలతో పాటు బోడోలు.. మేఘాలయలో - ఖాసా, ఖాసీలు.. నాగాలాండ్‌లో - నాగాలు.. మణిపూర్‌లో - మావో, కూకీలు.. త్రిపురలో - త్రిపురి తెగ.

2. మధ్య భారత ప్రాంతంలో..
    పశ్చిమ్ బంగ, బిహార్, జార్ఖండ్‌ల్లో - సంతాల్, ముండా, ఒరావణ్, హో తెగలు.. ఒడిశాలో - ఖోండులు, గోండులు.

3. పశ్చిమ భారత ప్రాంతంలో..
    రాజస్థాన్‌లో - భిల్లులు, మీనాలు ఘరాసియాలు.. మధ్యప్రదేశ్‌లో - సంతాల్‌లు, భిల్లులు.. గుజరాత్‌లో - భిల్లులు, దుబ్లాలు, ధోడియాలు.. మహారాష్ట్రలో - భిల్లులు, కోలీలు, మహదేవ్‌లు, కోక్నాలు ప్రధాన తెగలు.

4. దక్షిణభారత ప్రాంతంలో..
    ఆంధ్రప్రదేశ్‌లో - కోయ, కొండదొర, సవర, కొండరెడ్డి.. తెలంగాణలో - రాజ్‌గోండులు, లంబాడీలు, చెంచులు, ఎరుకలు, గుత్తికోయ, కోలమ్, నాయక్‌పోడ్.. తమిళనాడులో - ఇరుల, తోడా, కురుంబా, కడార్‌లు.. కర్ణాటకలో - నాయికాడ, మరాటీలు.. కేరళలో - కుళయన్, పనియన్.. అండమాన్, నికోబార్ దీవుల్లో - అండమానీలు, జారవాలు, నికోబారీలు ప్రధాన తెగలు. రకరకాల కారణాల వల్ల జారవా అనే తెగతో పాటు అండమానీలు జనాభా పరంగా దాదాపు అంతరించే స్థితిలో ఉన్న తెగలు.

కులం - తెగ
    ప్రతి తెగ సజాతీయ సమాజం. తెగలో ఏకరూపత ఉంటుంది. భౌగోళికపరంగా ఉన్న సమూహమిది. కులం అలా కాదు. కులం ఏకరూపత కలిగిన సమూహం కాదు. కులానికి చెందినవారు వేర్వేరు భాషలు మాట్లాడొచ్చు. వారికి వేర్వేరు సంస్కృతులుండొచ్చు. కులానికి వారసత్వంగా ఉండే వృత్తి ఉంటుంది. కానీ గిరిజనులకు ఆయా భౌగోళిక ప్రాంతాల్లోని వనరులను బట్టి జీవనోపాధి ఉంటుంది. ప్రతి తెగకు ఓ నిర్దిష్టమైన భాష ఉంటుంది. గిరిజన భాషలకు చాలామేర లిపి లేదు. కులానికి నిర్దిష్టమైన భాష అంటూ ఉండదు. కులానికి, తెగలకు ఉన్న ఏకైక ప్రధాన సారూప్యత ఏమైనా ఉందంటే అది రెండూ అంతర్‌వివాహ సమూహాలే.

తెలంగాణ గిరిజనం
    తెలంగాణలో దాదాపు 10-12 శాతం గిరిజన జనాభా ఉన్నట్లు అంచనా. ఇక్కడ నివసిస్తున్న ప్రధాన తెగలు - లంబాడీలు, రాజ్‌గోండులు, చెంచులు, ప్రధాన్‌లు, కోలమ్‌లు, నాయక్‌పోడ్, ఎరుకలు, గుత్తికోయలు. సామాజికంగా, సాంస్కృతికంగా జనజీవన స్రవంతిలో సమ్మిళితమైన తెగలు - లంబాడీలు, గోండులు (రాజ్‌గోండులు). ఆదిలాబాద్ జిల్లాలోని రాజ్‌గోండులు తాము క్షత్రియసంతతి వారమని అంటుంటారు. వీరు కొంతమేరకు విద్యాపరంగా, ఇటీవలి కాలంలో రాజకీయంగా కూడా భాగస్వామ్యాన్ని పొందారు. వీరితో పాటు లంబాడీ తెగ కూడా ఆ ఫలాలను అందుకుంటోంది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో విస్తరించిన తెగ లంబాడీ తెగ. ఇటీవలి కాలంలో లంబాడీలు కూడా తాము క్షత్రియులమనే వాదన తెస్తున్నారు. రాజ్‌గోండులతో పాటు ఆదిలాబాద్‌లో ప్రముఖంగా ఉన్నవారు ప్రధానులు, కోలమ్‌లు, నాయక్‌పోడ్‌లు. తెలంగాణలో బాగా వెనకబడిన తెగ చెంచులు. వీరు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంటారు. ఇప్పటికీ ఆహార సేకరణ ప్రధానవృత్తిగా ఉన్న తెగ ఇది. వరంగల్‌లాంటి చోట ఎరుకల తెగవారెక్కువ. వీరు జన జీవన స్రవంతిలో భాగంగానే జీవనం గడుపుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో మథుర అనే తెగ ఉంది. రాజస్థాన్ నుంచి వలస వచ్చిన తెగకు చెందిన వారు. వీరి ప్రధాన వృత్తి పశుపోషణ. గోవులను పెంచడం, వ్యవసాయం వీరి ప్రధాన జీవనాధారం. వైష్ణవ సంప్రదాయాన్ని ఆచరించడం వీరి ప్రత్యేకత. శ్రీకృష్ణుడి సంతతి నుంచి వచ్చామని అంటుంటారు. కామారెడ్డి గాంధారి మండలంలో ఈ మథుర తెగ కనిపిస్తుంది. తెలంగాణలోని చాలా తెగల్లో వెనకబాటుతనం కనిపిస్తుంది. ప్రభుత్వాలు గిరిజన తెగల అభివృద్ధి కోసం ఐటీడీఏ ద్వారా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో దీనిద్వారా అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఫలితంగా కొన్ని తెగల్లో అభివృద్ధి కనిపిస్తోంది.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతీయ సమాజం

మాదిరి ప్రశ్నలు

1. కేరళలో కదర్, ఇరుల తెగలు, తమిళనాడులో పునియన్‌లు ఏ జాతిని పోలి ఉంటారు?
ఎ) నీగ్రిటో బి) మంగోలాయిడ్ సి) నార్డిక్ డి) పశ్చిమ బ్రాకీ సెఫాల్స్
జ: (ఎ)

 

2. సింధు నాగరకత ప్రజలు ఏ జాతిని పోలి ఉంటారు?
ఎ) నీగ్రిటో బి) మెడిటేరియన్‌లు సి) నార్డిక్ డి) మంగోలాయిడ్
జ: (బి)

 

3. సంతాలీ, హో, గదబ, సవర భాషలు కింది ఏ భాషా కుటుంబానికి చెందినవి?
ఎ) ఆర్యన్ బి) నీగ్రిటో సి) ఆస్ట్రిక్ డి) సినో టిబెటిన్
జ: (సి)

 

4. 'బోడో' ఏ భాషా కుటుంబానికి చెందింది?
ఎ) నీగ్రిటో బి) ఆస్ట్రిక్ సి) ద్రవిడ డి) సినో టిబెటిన్
జ: (డి)

 

5. ఏకత్వం అనేది ఏ భావన?
ఎ) సామాజిక భావన బి) లౌకిక భావన
సి) మానసిక భావన డి) సామాజిక - మానసిక భావన / స్థితి
జ: (డి)

 

6. నల్లపూసలను మొదట ఎవరు ధరించేవారు?
ఎ) ముస్లిం స్త్రీలు   బి) హిందూ స్త్రీలు
సి) సిక్కు స్త్రీలు     డి) కైస్త్రవ స్త్రీలు
జ: (ఎ)

 

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతీయ సమాజం

    భిన్నత్వంలో ఏకత్వం - భారతీయ సమాజ విశిష్ట లక్షణాల్లో ఒకటి. వివిధ దేశాల నుంచి భిన్నమతాలు, కులాలు, జాతులు, భాషలకు చెందిన ప్రజలు ఇక్కడికొచ్చి మన సంస్కృతితో మమేకమయ్యారు. అందుకే భారతీయ సమాజం సాంస్కృతిక భిన్నత్వానికి అద్దం పడుతుంది. భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు భిన్నత్వాన్ని.. ఏకత్వానికి దోహదం చేస్తున్న అంశాలను తెలుసుకోవాలి. వీటిపై సమగ్ర అవగాహన కల్పించే అధ్యయన సమాచారం..

    భిన్నత్వం అంటే - ఒక అంశంతో మరొక అంశం విభేదించడం, పోలిక లేకపోవడం. సమాజంలో ఉండే వివిధ విభాగాలు లేదా అంశాలు ఒకదానితో ఒకటి పోలిక లేకుండా విభేదీకరణ కలిగి ఉండటం లేదా విడివిడిగా ఉండటాన్ని భిన్నత్వం అంటారు. అంటే సామాజిక సంస్థలు(సోషల్ ఇన్‌స్టిట్యూషన్స్) ఒకటే అయినప్పటికీ వాటి విధానాలు, ఆచారాలు, సంస్కారాలు, పద్ధతులు, సంప్రదాయాలు ఒకదానితో ఒకటి విభేదిస్తాయి. ఉదాహరణకు వివిధ మతాల్లో ఉండే వివాహ నియమాలు, ఆచారాలను భిన్నత్వంగా చెప్పుకోవచ్చు.

ఐక్యత అంటే..?
    ఐక్యత అంటే కలిసి ఉండటం. ఇది ఒక సామాజిక మానసిక స్థితి. సమాజంలో ఉండే వివిధ రకాల వ్యక్తులు తామంతా ఒక్కటే అనే సామాజిక, మానసిక స్థితి (సోషియో సైకలాజికల్ కండిషన్) భావనను ఐక్యత అంటారు.

భిన్నత్వంలో ఏకత్వం
    వివిధ మతాలు, కులాలు, భాషలు, జాతులు, భౌగోళిక ప్రాంతాలు, సంస్కృతులకు చెందినప్పటికీ మనమంతా ఒక్కటే అనే సామాజిక, మానసిక భావనను భిన్నత్వంలో ఏకత్వం అంటారు.

సాంస్కృతిక భిన్నత్వం
    ఒక సమాజంలో ఉండే మతం, భాష, ఆహారపు అలవాట్లు, వేషధారణ, ఆచారాలు, సంప్రదాయాలు.. ఇవన్నీ సంస్కృతిలో భాగం. భారతదేశంలో వివిధ మతాలు, కులాలు, భాషలు, జాతులకు చెందిన ప్రజలు నివసించడం వల్ల సాంస్కృతిక భిన్నత్వం కనిపిస్తుంది. ఈ సాంస్కృతిక భిన్నత్వాన్ని భారతీయ సమాజ భిన్నత్వ లక్షణంగా చెప్పుకుంటాం.

భౌగోళిక భిన్నత్వం
    కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు వివిధ భౌగోళిక పరిస్థితులున్నాయి. నిమ్నోన్నతి, ఉష్ణోగ్రత, వర్షపాతం, అటవీ సంపద, నదులు, సముద్రతీరాలు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు కనిపిస్తాయి. ఇవి ఆ ప్రాంతపు ప్రజల వృత్తులు, ఆహారపు అలవాట్లు, వేషభాషలు, సంప్రదాయాలు, ఆచారాలపై ప్రభావాన్ని చూపిస్తాయి. అందువల్ల భౌగోళిక భిన్నత్వం ఇతర భిన్నత్వాలపై ప్రభావం చూపుతుంది.

భిన్నత్వంలో ఏకత్వానికి దోహదపడుతున్న వివిధ అంశాలివి..
1. భౌగోళిక రాజకీయ ఐక్యత: భారతీయ సమాజంలో విభిన్నత ప్రదర్శితమవుతున్నప్పటికీ దేశమంతా భౌగోళికంగా, రాజకీయంగా ఐక్యతను ప్రదర్శిస్తుంది. దీన్ని భౌగోళిక రాజకీయ ఐక్యత అంటారు.

2. పుణ్యక్షేత్ర సందర్శన వ్యవస్థ (ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ పిలిగ్రిమేజ్): కుల మతాలతో సంబంధం లేకుండా ఇతర మతాల వారు వేరే మతాల వారి పుణ్యక్షేత్రాలను సందర్శించడం ఐక్యతకు నిదర్శనం.
* హిందువులు దర్శించే ముస్లిం పవిత్ర స్థలం - అజ్మరీ షరీఫ్
* వినాయక చవితి ఉత్సవాల్లో ముస్లిం తారలు తదితరులు పాల్గొనడం.
* ఇతర మతాలవారు దర్గాలు, చర్చిలను సందర్శించడం ఇందుకు నిదర్శనాలు.

3. ఆదరణ స్వభావం - సంస్కృతీకరణ: భారతీయ సమాజం అన్ని మతాలను, కులాలను, జాతులను ఆదరించింది. అంతేకాకుండా ఉన్నత కులాల, ఇతర మతాల సంస్కృతిని మిగిలిన కులాలు వారు, వేరే మతాల వారు స్వీకరించి ఆదరించారు.
* పరదా పద్ధతి
* నల్లపూసలు (ముస్లిం సంస్కృతి) ధరించడాన్ని హిందూ స్త్రీలు స్వీకరించడం.
* ఉర్దూ, ఇతర భాషలు స్వీకరించడం, అనుసరించడం
* ఉపవాస, ఆహార నియమాలు పాటించడం
* పేర్ల పక్కన, కులం పక్కన 'బ్రాహ్మణ' పదం చేర్చడం.
ఉదా: నాయిబ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు
ఇవన్నీ ఐక్యతకు దోహదపడే అంశాలే.

4. సంప్రదాయ పరస్పరాధారిత సమాజం - జాజ్‌మానీ వ్యవస్థ: సంప్రదాయ భారతీయ సమాజంలో ఒక కులం వారు మరొక కులంపై ఆధారపడ్డారు. పరస్పరం సహకారం అందించుకున్నారు. కులవృత్తుల వారు యజమానికి సేవలు అందించి వస్తురూపంలో ప్రతిఫలం స్వీకరించారు. ఇది ఐక్యతకు దోహదపడిన అంశం.

5. జాతీయ భావన: వివిధ కులాలు, మతాలు, జాతులు, భాషలకు చెందిన విభజన జరిగినప్పటికీ మనమంతా భారతీయులం అనే భావన ఐక్యతకు దారితీసింది. ఈ జాతీయ భావన కింది అంశాల్లో కనిపిస్తుంది.
* జాతీయ జెండా
* జాతీయ గీతం
* జాతీయ చిహ్నాలు - పుష్పం, జంతువు, చెట్టు, ఫలం
* భారత రాజ్యాంగం - లౌకిక భావన

6. కామన్ సివిల్ కోడ్, జాతీయ చట్టాలు: భారతీయ సమాజంలో వ్యక్తులందరికీ వర్తించేలా ఉండే కామన్ సివిల్ కోడ్, జాతీయ చట్టాలు.. ఐక్యతకు దోహదపడుతున్నాయి. అన్ని మతాల ఔన్నత్యాన్ని కాపాడుకునేలా ప్రజలందరికీ వర్తించేలా ఉమ్మడి న్యాయ చట్టాలు రూపొందాయి.

7. అంతర్జాల వ్యవస్థ - ఆధునిక పరిజ్ఞానం: భారతీయులంతా కుల, మత, ప్రాంత, భాషలకు అతీతంగా అంతర్జాల సమూహాల(ఇంటర్‌నెట్ గ్రూప్స్)ను ఏర్పాటు చేసి ఐక్యతకు తోడ్పడుతున్నారు. ఆధునిక పరిజ్ఞానం ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

8. వసుదైక కుటుంబ భావన: భారతదేశంలో జరిగిన పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ కులాల మధ్య అంతరాన్ని తగ్గించింది. మతాలు, జాతులు, భాషలు, ప్రాంతాలకు అతీతంగా సమాజంలో వ్యక్తులంతా ఏకమై సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ, అభివృద్ధీకరణ భావనలు భిన్నత్వాలను దూరం చేసి సమాజంలో ఉన్న వ్యక్తులందరినీ ఐకమత్యంగా ఉండేలా చేస్తున్నాయి.


ఏకత్వ అంశాలు
భారతీయ సమాజంలో అనేక రకాల భిన్నత్వాలు కనిపిస్తున్నప్పటికీ కింది అంశాలు ఏకత్వానికి దోహదం చేస్తున్నాయి. అవి..
* భౌగోళిక రాజకీయ ఐక్యత
* పుణ్యక్షేత్ర సందర్శన వ్యవస్థ
* ఆదరణ స్వభావం - సంస్కృతీకరణ
* సంప్రదాయ పరస్పరాధారిత సమాజం - జాజ్‌మానీ వ్యవస్థ
* జాతీయ భావన
* కామన్ సివిల్ కోడ్ - జాతీయ చట్టాలు
* అంతర్జాల వ్యవస్థ - ఆధునిక పరిజ్ఞానం
* పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ

గ్రూప్-Iలో రాదగిన ప్రశ్నలు
1. భారతీయ సమాజంలోని భిన్నత్వాలను వివరించి, ఏకత్వానికి దోహదపడుతున్న అంశాలను చర్చించండి.
2. భారతీయ సమాజంలో భిన్నత్వం ప్రదర్శితం అవుతున్నప్పటికీ ఆధునికీకరణ, ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ భావనలు ఏ విధంగా ప్రభావం చూపాయో వివరించండి.
3. జాజ్‌మానీ వ్యవస్థ, సంస్కృతీకరణ భావనలు భారతీయ సమాజంలో ఏవిధంగా ఏకత్వానికి దోహదపడుతున్నాయి?

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతీయ సమాజ నిర్మాణం

విశిష్ట సమాజం.. విలువల జీవనం

భారతీయ సమాజం సమున్నత విలువలు, ఆదర్శాల సమ్మిళితం. వ్యక్తి సామాజిక జీవనం ఈ విలువలు, ఆదర్శాలతోనే ముడిపడి ఉంటుంది. ఉన్నతంగా జీవించడానికి పాటించాల్సిన ధర్మాలు.. ఆచరించాల్సిన సిద్ధాంతాలు.. అవసరమైన గుణాలు.. లాంటివన్నీ మన సమాజ మూలాల్లో కనిపిస్తాయి. వీటిని అధ్యయనం చేస్తే ఆ సమాజ నిర్మితిని అర్థం చేసుకోవచ్చు.
    ఎక్కడైనా సమాజ నిర్మితిని అధ్యయనం చేయాలంటే ముందు ఆ సమాజం మూలాలను అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆ సమాజంలోని సమస్యలు, విశిష్ట లక్షణాలపై అవగాహన ఏర్పడుతుంది. భారతీయ సమాజం ఆదర్శాలు, విలువలతో కూడుకున్నది. దీని గురించి తెలుసుకోవాలంటే ముందు హిందూ సమాజం పునాదుల నుంచి అధ్యయనం మొదలుపెట్టాలి. ఆ మూలాలను పరిశీలిస్తే...
1. చతుర్విధ పురుషార్థాలు
2. ఆశ్రమ ధర్మాలు
3. రుణాలు
4. కర్మ సిద్ధాంతం
5. త్రిగుణాలు
6. శ్రుతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు


1. చతుర్విధ పురుషార్థాలు
వీటిని చతుర్విధ పురుషార్థాలు అని పిలుస్తారు. ఇవి నాలుగు. సమాజంలో నివసిస్తున్న వ్యక్తి అంతర్గత, బాహ్య ప్రవర్తనను నియంత్రించడానికి వీటిని నిర్దేశించారు. వీటి ప్రకారం వ్యక్తులు వివిధ దశల్లో క్రమశిక్షణతో, ధర్మబద్ధంగా జీవించాల్సి ఉంటుంది. తద్వారా సమాజం వ్యవస్థీకృతం అవుతుంది. అసంఘటిత పరిస్థితులకు దూరంగా ఉంటుంది. ఈ లక్ష్యం సాధించడానికి కింది పురుషార్థాలను అనుసరించాల్సి ఉంటుంది.
1) ధర్మం   2) అర్థం (సంపద)   3) కామం (కోరికలు)   4) మోక్షం


ధర్మం: 'ధృ' అనే సంస్కృత ధాతువు నుంచి 'ధర్మం' అనే పదం వచ్చింది. కలిపి ఉంచు లేదా నిలబెట్టు అని దీనర్థం. ధర్మం అనే పదం రుగ్వేదంలో 'రుత' అనే భావాన్ని తెలియజేస్తుంది. అంటే 'క్రమం' అని అర్థం. సమాజంలోని ప్రతి వ్యక్తి తన ధర్మాన్ని నిర్వర్తిస్తే సమాజం వ్యవస్థీకృతం అవుతుంది. ధర్మంతో కూడిన అర్థం (సంపద), కామం (కోరికలు) మోక్షానికి చేరుస్తాయి. భారతీయ హిందూ సమాజంలో మోక్షానికి అత్యంత ప్రాధాన్యం ఉంది.
ధర్మాన్ని పాటించడం వల్ల సమాజంలో వ్యక్తులంతా తమ వృత్తులు, ప్రవృత్తుల ద్వారా వ్వవస్థీకృత పరిస్థితులను ఏర్పరుస్తారు. వర్ణ, ఆశ్రమ, గుణ ధర్మాలను వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు. దేశ, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ధర్మాన్ని మార్చుకుంటూ సత్యం, అహింస, మనోనిగ్రహం, సహనాన్ని ఆచరించాల్సి ఉంటుంది.

అర్థం: సమాజంలో సుఖమయ జీవనానికి గృహస్థ ధర్మాలను, ఇతర బాధ్యతలను నిర్వర్తించడానికి వ్యక్తికి సంపద లేదా ఐశ్వర్యం చాలా అవసరం. దీన్నే 'అర్థం' అంటారు. సమాజంలో ధర్మబద్ధంగా సంపాదించిన ఆస్తి మూలంగా వ్యక్తికి అంతస్తు లభిస్తుంది. కౌటిల్యుడి ప్రకారం.. సుఖానికి మూలం ధర్మం, ధర్మానికి మూలం అర్థం, అర్థానికి మూలం రాజ్యం. అర్థం అంటే భౌతిక లాభం పొందడం. ధర్మం సాధించడం, ఆనందం అనుభవించడం అనేవి భౌతిక లాభం మీదనే ఆధారపడతాయి. కాబట్టి ధర్మబద్ధంగా అర్థం సంపాదించడం ఆనందానికి మూలం.

కామం: భారతీయ హిందూ సమాజంలో గృహస్థ ఆశ్రమానికి ప్రాధాన్యం ఇచ్చారు. కామం ద్వారా వ్యక్తి ఇంద్రియ వాంఛలు తీర్చుకుని సత్‌సంతానాన్ని పొంది సమాజాన్ని ముందుకు కొనసాగిస్తాడు. ప్రాథమిక సమూహం అయిన కుటుంబాన్ని ఏ విధంగా క్రమబద్ధీకరించాలో.. కుటుంబం, సమాజంలో వివిధ వ్యక్తుల నడవడి ఏ విధంగా ఉండాలో కామం వివరిస్తుంది. సమాజంలో వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి ధర్మంతో కూడిన అర్థం, కామం అవసరం. ధర్మాన్ని వివరించేది ధర్మశాస్త్రం. అర్థాన్ని వివరించేది అర్థశాస్త్రం, కామాన్ని వివరించేది కామశాస్త్రం. ఈ మూడింటినీ 'త్రివర్గాలు' అని పిలుస్తారు.


మోక్షం: పురుషార్థాల్లో చివరిది, అత్యంత ప్రధానమైంది మోక్షం. భారతీయ హిందూ సమాజంలో మోక్షానికి ప్రాధాన్యం ఇచ్చారు. వ్యక్తి జీవితంలో అంతిమ లక్ష్యం మోక్షం. అర్థాన్ని, కామాన్ని ధర్మబద్ధంగా నిర్వర్తించడం ద్వారా మోక్షాన్ని చేరుకుంటారు. ప్రతి వ్యక్తి సమాజంలో మోక్షం కోసం చేసే ప్రయత్నంలో ధర్మబద్ధమైన జీవితాన్ని ఆచరించాలి. తద్వారా సమాజంలో వ్యవస్థీకృత పరిస్థితులు నెలకొంటాయి. మోక్షం వ్యక్తి జీవితానికి పరిపూర్ణతను ప్రసాదిస్తుంది.

2. ఆశ్రమ ధర్మాలు
 వీటిని వర్ణాశ్రమ ధర్మాలు అని పిలుస్తారు. వర్ణ ధర్మాన్ని బట్టి బ్రాహ్మణులు జ్ఞానాన్ని పొంది ఇతరులకు బోధించాలని, క్షత్రియులు రాజ్యాన్ని సంరక్షించి పాలన చేయాలని, వైశ్యులు వ్యయసాయం, పశుపోషణ, వ్యాపారం చేయాలని, శూద్రులు పై వర్ణాల వారికి సేవ చేయాలని పేర్కొన్నారు.
    వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో పురుషార్థాలను నియమబద్ధంగా ఏ విధంగా సాధించాలో ఇవి వివరిస్తాయి. ఆశ్రమ ధర్మాలు సమాజంలో వ్యక్తి నడవడికను, ప్రవర్తనను క్రమబద్ధీకరిస్తాయి. ఆశ్రమాలు నాలుగు. అవి..
1) బ్రహ్మచర్యాశ్రమం    2) గృహస్థాశ్రమం  3) వానప్రస్థా శ్రమం   4) సన్యాసాశ్రమం.
వ్యక్తి జీవితాన్ని ఇలా వివిధ దశలుగా విభజించి.. ఆయా దశల్లో వారు నిర్వర్తించాల్సిన విధులు, నడవడికను తెలియజేశారు. ఈ చర్యలు వ్యక్తి ప్రవర్తనను క్రమబద్ధీకరించి మోక్షం దిశగా నడిపిస్తాయి.


బ్రహ్మచర్యాశ్రమం: ప్రతివ్యక్తి పుట్టినప్పుడు శూద్రుడిగా పుడతాడు. ఉపనయన సంస్కారం జరిగిన తర్వాత మాత్రమే ద్విజులుగా మారతారు. ద్విజులు అంటే రెండు జన్మలు కలిగినవారు అని అర్థం. పుట్టుకతో లభించేది ఒక జన్మ అయితే ఉపనయన సంస్కారంతో లభించేది రెండో జన్మ. ఉపనయన సంస్కార సమయంలో బ్రాహ్మణులు గాయత్రీ మంత్రం, క్షత్రియులు త్రిష్టుబ్ మంత్రం, వైశ్యులు జగతీ మంత్రం స్వీకరిస్తారు.
బ్రహ్మచర్య ఆశ్రమంలో గురువు ఇంటి వద్దనే ఉండి వేదాధ్యయనం చేయాలి. గురువు ఇంటివద్ద పశువులు మేపడం, వంట చెరకు సేకరించడం, కర్మకాండలకు కావాల్సిన సామగ్రిని ఏర్పాటు చేయడం లాంటి పనులతో గురువును ప్రసన్నం చేసుకుని వేదాధ్యయనం ప్రారంభిస్తారు. బ్రహ్మచారిగా ఇంద్రియ నిగ్రహాన్ని పాటించి జ్ఞాన యజ్ఞం చేస్తారు.

గృహస్థాశ్రమం: ఒక వ్యక్తి వివాహం చేసుకోవడం ద్వారా బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాడు. ధర్మాచరణ, సంతానోత్పత్తి ద్వారా సమాజం ముందుకు కొనసాగడానికి తోడ్పడతాడు. గృహస్థాశ్రమంలో కింది పంచ మహాయజ్ఞాలు చేయాలి. అవి..

బ్రహ్మ యజ్ఞం: వేదాధ్యయనం

పితృ యజ్ఞం: తర్పణం, శ్రాద్ధక్రియలు

దైవ యజ్ఞం: కర్మకాండలు, హోమాలు

భూత యజ్ఞం: బలి, అర్పణలు

నృయజ్ఞం: అతిథులకు, పేదవారికి సేవ చేయడం

* గృహస్థాశ్రమంలో వ్యక్తి కుటుంబ జీవనం కొనసాగిస్తాడు. ధర్మాచరణను ఆచరిస్తాడు. సంతానోత్పత్తి, లైంగిక అవసరాలను తీర్చుకుంటాడు. యజ్ఞయాగాదులు, కర్మకాండలు విధిగా నిర్వర్తిస్తాడు.

వానప్రస్థాశ్రమం: పిల్లలకు వివాహం జరిపించి, వారి సంతానంతో గడిపిన తర్వాత వ్యక్తి వానప్రస్థంలోకి ప్రవేశిస్తాడు. భార్యతో సహా అడవులకు వెళ్లి నివాసం ఏర్పరుచుకుంటాడు. భార్యతో ఉన్నప్పటికీ సంసార సంబంధాన్ని కొనసాగించకుండా ఆమెకు శారీరకంగా దూరంగా ఉంటూ వానప్రస్థ విధులను నిర్వర్తిస్తాడు. హోమాలు చేస్తూ దైవచింతనలో గడుపుతాడు. భర్తకు కావాల్సిన హోమ సామగ్రిని భార్య సమకూరుస్తూ వంట చేసి పెడుతుంది. శారీరక సుఖాలను వదిలేసి, నార వస్త్రాలను ధరించి కుటుంబ జీవనం నుంచి దూరంగా జీవితాన్ని గడుపుతాడు. ఇంటికి వచ్చిన అతిథులకు సత్కారాలు చేస్తాడు. గృహస్థ, సన్యాసాశ్రమాలకు వారధిగా వానప్రస్థాశ్రమం ఉంటుంది.

సన్యాసాశ్రమం: ఈ ఆశ్రమంలో పూర్వపు జీవితంతో పూర్తిగా బంధాన్ని తెంచుకుంటాడు. భార్యను కూడా విడిచి ఒంటరిగా సన్యాసాశ్రమంలోకి ప్రవేశిస్తాడు. కఠినమైన ఆహార నియమాలు ఉంటాయి. భిక్షాటన చేయడం ద్వారా ఆహారం తినాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని సన్యాసిలా జీవించాలి. పూర్తి సమయాన్ని దైవచింతనలో గడపాలి. అడవుల్లో కాకుండా ఊరూరా తిరుగుతూ ఆదర్శ బోధనలు చేస్తూ దైవానికి దగ్గరవ్వాలి. ఈ విధంగా జీవితంలో ధర్మ, అర్థ, కామాలను సాధించి దైవచింతనతో శేషజీవితం గడుపుతూ మోక్షానికి దగ్గర అవుతాడు.

3. రుణాలు
    పుట్టిన ప్రతివ్యక్తి తీర్చుకోవాల్సిన రుణాలు కొన్ని ఉన్నాయి. ఇవి ఒక వ్యక్తికి ఎదుటివారి పట్ల ఉన్న బాధ్యతలను తెలియజేస్తాయి. అవి..
1) పితృ రుణం   2) గురు రుణం   3) దైవ రుణం

పితృ రుణం: ఒక వ్యక్తి జన్మకు కారణం అతడి తల్లిదండ్రులు. సమాజంలో వ్యక్తి మనుగడకు, సాంఘికీకరణకు కుటుంబం తోడ్పడుతుంది. కాబట్టి జన్మనిచ్చిన తండ్రి రుణం తీర్చుకోవడాన్ని పితృ రుణంగా చెబుతారు. పుత్రులు లేనివారు పున్నామ నరకానికి చేరుతారు అనే నమ్మకం హిందూ సమాజంలో ఉంది. తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు వారిని సుఖసంతోషాలతో ఉంచడం, మరణించిన తర్వాత పిండప్రదానాలు, కర్మకాండలు నిర్వర్తించడం ద్వారా పితృ రుణం తీర్చుకుంటారు.

గురు రుణం: గురు శుశ్రూష (సేవ) చేయడం, గురు దక్షిణ చెల్లించడం, గురువుకు మంచి కీర్తిని సంపాదించి పెట్టడం ద్వారా విద్యను ప్రసాదించిన గురువు రుణం తీర్చుకుంటాడు.

దైవ రుణం: మానవ జన్మ ప్రసాదించినందుకు భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకోవడాన్ని దైవ రుణం తీర్చుకోవడం అంటారు. నవవిధ భక్తి మార్గాలతో భగవంతుడిని ఆరాధించడం, యజ్ఞయాగాదుల నిర్వహణతో దేవుడిని తృప్తిపరచడం ద్వారా దైవ రుణం తీర్చుకుంటారు.


4. కర్మ సిద్ధాంతం
భారతీయ హిందూ సమాజంలో కర్మ భావన ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది కార్యకారణ సంబంధాలను వివరిస్తుంది. మంచి చెడుల ద్వారా ఎదురయ్యే ఫలితాలను తెలుపుతూ సమాజంలో వ్యక్తి ప్రవర్తనను నియంత్రిస్తుంది. కర్మ అనే పదం మొదట రుగ్వేదంలో కనిపించింది. అధర్వణ వేదంలోనూ కనిపిస్తుంది. సమాజంలో ఒక వ్యక్తి చేసే మంచి పనులకు మంచి ఫలితాలు, చెడు పనులకు చెడు ఫలితాలు ఎదురవుతాయని కర్మ సిద్ధాంతం చెబుతుంది. వ్యక్తి బాహ్య, అంతర్గత ప్రవర్తనలను నియంత్రించడం దీని ముఖ్యోద్దేశం. పునర్జన్మ కారణాలను, ఫలితాలను వివరిస్తుంది. కర్మ నాలుగు చర్యల ద్వారా వ్యక్త మవుతుంది. అవి..
1) ఆలోచనలు      2) సద్భావన కలిగిన మాట    3) మనం చేసే పనులు   4) మనం ఇతరులతో చేయించే పనులు.


5. త్రిగుణాలు
 వ్యక్తి ప్రవర్తనా రీతుల ఆధారంగా గుణాలను వివరించారు. సంప్రదాయ హిందూ సమాజంలో తొలివేద కాలంలో గుణకర్మలను బట్టి వర్ణవ్యవస్థలో వర్ణాలను కేటాయించారు. వీటిని ఆధారంగా చేసుకుని ఒకే ఇంటిలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను చూడవచ్చు. తర్వాతి కాలంలో వర్ణవ్యవస్థ కూడా జటిలమైంది.
గుణాలను మూడు రకాలుగా విభజించారు. అవి..

సత్వ గుణం: స్వచ్ఛమైంది. బ్రాహ్మణులు కలిగి ఉంటారని పేర్కొన్నారు.

రజో గుణం: వీరత్వం, మక్కువలకు ప్రతీక. క్షత్రియులు కలిగి ఉంటారన్నారు.

తమో గుణం: సోమరితనానికి ప్రతీక. శూద్రులు కలిగి ఉంటారని చెప్పారు.

6. శ్రుతులు, స్మృతులు, పురాణాలు...
శ్రుతులు: శ్రుతి (వినికిడి) ద్వారా నేర్చుకునేవి. గురు ముఖంగా ఆయన నోటి నుంచి వినడం, మననం చేసుకోవడం ద్వారా విషయాన్ని నేర్చుకుంటారు. వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలను శ్రుతులు అంటారు.

స్మృతులు: స్మరణ చేసుకోవడం ద్వారా నేర్చుకునేవి. గ్రంథ రూపంలో అధ్యయనం చేసేవి. విశ్లేషణ, చర్చల ద్వారా నేర్చుకుంటారు. మనుస్మృతి, గృహ్య సూత్రాలు, ధర్మ సూత్రాలు, పలువురు రుషులు రాసిన సూత్ర గ్రంథాలను స్మృతులు అంటారు.

పురాణాలు: పురాతనమైనవైనా నిత్య నూతనంగా ఉండే వాటిని పురాణాలు అంటారు. శ్రుతులు, స్మృతుల్లోని విషయాలను కథల రూపంలో ఉపదేశం చేసే వాటిని పురాణాలు అంటారు. అష్టాదశ పురాణాలను వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే భాగవతం ఒక పురాణం.

ఇతిహాసాలు: చరిత్రకు కల్పనలను జోడించి కథల రూపంలో రాసేవే ఇతిహాసాలు. రామాయణం, మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. ఇతిహాసాలు మానవ జీవనాన్ని, జీవన విధానాన్ని నిర్దేశించేవి, మార్గదర్శకం చేసేవి.

దర్శనాలు: వీటిని షడ్దర్శనాలు అంటారు. ఇవి ఆరు. అవి సాంఖ్య, న్యాయ, యోగ, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస, వైశేషికం. దర్శనాలు అంటే రుషులు దర్శించి వారు జ్ఞానబోధ చేసినవి.
పైన వివరించిన అంశాలతో భారతీయ హిందూ సమాజంలో వ్యక్తుల జీవన విధానం, ప్రవర్తనా రీతులు ముడిపడి ఉన్నాయి. వీటిని భారతీయ సమాజం మూలాలుగా పేర్కొన్నారు.


గ్రూప్ - 1 నమూనా ప్రశ్నలు
1. భారతీయ సమాజం మూలాలను వివరించండి.
2. భారతీయ సమాజంలో వర్ణాశ్రమ ధర్మాలు, పురుషార్థాల ప్రాముఖ్యాన్ని తెలియజేయండి.
3. భారతీయ సమాజ నిర్మితిలో హిందూ సంస్కృతి మూలాలను వివరించండి.
4. ఆశ్రమ ధర్మాలు, పురుషార్థాలు, ఇతర మూలాలు సంప్రదాయ హిందూ సమాజంలో వ్యక్తి జీవితంపై చూపిన ప్రభావాన్ని వివరించండి.

 

మరింత సమాచారం ... మీ కోసం!

* భారతదేశంలో ఆదివాసీలు, గిరిజనుల విలక్షణత

గిరిజన సమూహాలు

భారతీయ సమాజం

 

Posted Date : 12-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఇస్లాం మతం-వివాహం

బాధ్యతలతో ముడిపడే బంధం!


సామాజిక వ్యవస్థలో భాగమైన వివాహం ఒక్కో మతంలో ఒక్కోరకంగా ఉంది. ఇస్లాం మతంలో కొన్ని బాధ్యతలను నిర్వర్తించడానికి అవసరమైన బంధంగా పెళ్లిని భావిస్తారు. అందుకోసం సంప్రదాయబద్ధమైన నిబంధనలు పాటిస్తారు. దంపతులు విడిపోవాలనుకున్నప్పుడూ నిర్ణీత విధానాలను అనుసరిస్తారు. సమాజనిర్మాణం అధ్యయనంలో భాగంగా ఈ వివరాలను అభ్యర్థులు పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 

 

ఇస్లాం మతం-వివాహం

ముస్లింలలో వివాహం ఒక ఒప్పంద రూపంలో ఉంటుంది. దీన్ని సునా అంటారు. పెళ్లి చేసుకోబోయే ఇరు పక్షాలు అమలు చేయాల్సిన బాధ్యతగా వివాహాన్ని పరిగణిస్తారు. మహ్మద్‌ప్రవక్త ప్రకారం సంతానాన్ని పొందడానికి, మానవ జాతిని కొనసాగించడానికి, స్త్రీ ప్రేమను స్వీకరించడానికి ఒక మార్గం వివాహం. దీన్ని నిఖా అంటారు. సంతానోత్పత్తి, సంతానాన్ని చట్టబద్ధం చేయడం వివాహ లక్ష్యాలుగా ముస్లింలు భావిస్తారు.

 

వివాహ వ్యవస్థ

ఇస్లాం మతంలో వివాహం కొన్ని నిబంధనలు కలిగి ఉంటుంది.

* ప్రతిపాదన, అంగీకారం ఒకేసారి జరగాలి.

* స్త్రీ, పురుషులిద్దరూ లైంగిక అర్హతను కలిగి ఉండాలి.

* ముస్లిం పురుషుడు పోషించగలిగితే కొన్ని నియమాలను అనుసరించి నాలుగు వివాహాలు చేసుకోవచ్చు. 

* వధూవరులు అక్రమ సంబంధాలు కలిగి ఉండకూడదు.

* ముస్లిం యువతి, ముస్లిం యువకుడిని మాత్రమే వివాహం చేసుకోవాలి. కానీ ముస్లిం యువకుడు భర్త చనిపోయిన యువతిని, క్రైస్తవ, పార్సీ స్త్రీలను కూడా వివాహం చేసుకోవచ్చు.

* తీర్థయాత్రల సమయంలో వివాహాలు నిర్వహించకూడదు.

* తండ్రి సోదరుడి కుమార్తెను, తల్లి సోదరుడి కుమార్తెను వివాహం చేసుకోవచ్చు.

* వధూవరులకు 15 సంవత్సరాలు నిండాలి. లేకపోతే సంరక్షుల అనుమతి తప్పనిసరిగా పొందాలి.

* వధూవరులిద్దరూ సక్రమమైన మానసికస్థితిని కలిగి ఉండాలి.

* మధ్యవర్తిగా ఒక వ్యక్తి వ్యవహరించాలి. అతడిని వలి అని పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో ఖలీఫా, సుల్తాన్‌ అని కూడా అంటారు. వలిగా వ్యవహరించే వ్యక్తి వారికి దగ్గరి బంధువై ఉండాలి. 

 

వలి లక్షణాలు: 

* ఇస్లాం మతస్థుడై, స్వతంత్ర వ్యక్తిగా ఉండాలి.

* మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి.

* పురుషుడై ఉండాలి.

* సక్రమ ప్రవర్తనతో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.

* నిబంధనల ప్రకారం వయసు నిండి ఉండాలి.

 

వివాహం జరిగే విధానం

ముస్లిం వివాహం సాధారణంగా వధువు గృహంలో జరుగుతుంది. వరుడు బంధుమిత్ర సపరివారంగా వివాహం రోజున వధువు గృహానికి వెళతాడు. వధూవరుల కుటుంబ పెద్దలను పిలిచి ఇమామ్‌ వివాహపరమైన సాక్షి సంతకం చేయిస్తాడు. అనంతరం పెళ్లి ఒప్పంద నిబంధనలు తెలియజేసి అంగీకారం తీసుకుని ప్రార్థన చేస్తాడు. వివాహ వేడుకలో ఖురాన్‌లోని మొదటి అధ్యాయాన్ని చదువుతారు. సహజంగా వివాహానికి పూర్వం వధూవరులు ఒకరినొకరు చూసుకోరు.

 

వివాహం - రకాలు

బీనా వివాహం: మాతృస్వామిక సామాజిక కాలంలో అరబ్బు స్త్రీ తనకు నచ్చిన పురుషుడిని భర్తగా ఎన్నుకునే అర్హత కలిగి ఉండేది. భర్తను తన గృహంలో ఉంచుకోవచ్చు లేదా తోసిపుచ్చవచ్చు.

బాల్‌ వివాహం: పితృస్వామిక సమాజ కాలంలో ఉండేది. భార్య, భర్తతో భర్త గృహాంలోనే జీవించాలి. స్త్రీ అధికారాలన్నీ పురుషుడి అధీనంలో ఉంటాయి.

ముతా వివాహం: దీనిలో కాల ఒప్పందం ముఖ్యమైంది. ఇది ఒక రకమైన తాత్కాలిక వివాహం. వధూవరులు స్వచ్ఛందంగా కొంతకాలాన్ని నిర్ణయించుకొని వివాహం చేసుకుంటారు. ఈ నిర్ణీత కాలపరిమితి తీరిన తర్వాత వివాహం రద్దవుతుంది. ఒకవేళ ఇరువురికి అంగీకారమైతే కాలపరిమితిని పెంచుకోవచ్చు. కాలపరిమితి ఒకరోజు నుంచి అనేక సంవత్సరాలు ఉండవచ్చు. ఈ వివాహాన్ని సున్నీశాఖ ముస్లింలు అంగీకరించరు. షియా శాఖలో ఇది అమల్లో ఉంది.

నిఖా వివాహం: ఈ రకమైన వివాహంలో వధూవరులకు కొన్ని హక్కులు, నిబంధనలను కల్పించారు. ఈ వివాహం ప్రస్తుతం అధికశాతం అమల్లో ఉంది. 

మెహర్‌: ముస్లిం వివాహ వ్యవస్థలో ఇది ప్రాముఖ్యమైన అంశం. మెహర్‌ అంటే వివాహ సమయంలో  వరుడి నుంచి వధువు పొందే కట్నం వంటిది. దీన్ని కన్యాశుల్కంగా భావించకూడదు. తనను భర్తగా అంగీకరించినందుకు పురుషుడు స్త్రీపై చూపించే గౌరవంగా చూడాలి. 

 

మెహర్‌ను కింది విధంగా వర్గీకరిస్తారు.

నిర్ణయమైన మెహర్‌: ఈ రకమైన మెహర్‌ను వివాహానికి పూర్వమే నిర్ణయిస్తారు.

మెహర్‌ మోజ్‌ల్‌: ఇది వివాహానికి, వివాహం అనంతరం భార్య కోరికపై ఆధారపడి ఉంటుంది. 

యువజ్జల్‌ మెహర్‌: దీని ప్రకారం వివాహం జరిగిన వెంటనే నిర్ణయించి భార్యకు ఇస్తారు.

వివాహం రద్దయిన తర్వాత మెహర్‌: ఇది మరణం లేదా విడాకుల ద్వారా గానీ వివాహం రద్దవడంతో నిర్ణయించే మెహర్‌.

యుక్త వయసు పొందిన తర్వాత ఇచ్చే అవకాశం: ఖురాన్‌ (హిదయ) ప్రకారం బాలబాలికలకు యుక్త వయసు 12, 9 సంవత్సరాలు నిర్ణయించారు. ఈ వయసు వారికి వివాహం జరిపిస్తే, యుక్త వయసు వచ్చిన తర్వాత వారికి ఇష్టం లేకపోతే ఆ వివాహాన్ని రద్దు చేసుకునే హక్కు ఇద్దరికీ ఉంటుంది. దీన్నే ఆప్షన్‌ ఆఫ్‌ ప్యూబర్టీ అంటారు.

 

మహమ్మద్‌ ప్రవక్త 

మహమ్మద్‌ ప్రవక్త ఇస్లాం మతాన్ని స్థాపించారు. క్రీ.శ.570 లో మక్కాలో జన్మించారు. ఈయన అల్‌అమీన్‌ (దేవుడితో సమానం) ఖురైషి వంశంలో జన్మించారు.  బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. 25 ఏళ్ల వయసులో 40 ఏళ్లు నిండిన ఖదీజా అనే సంపన్న వితంతువును వివాహం చేసుకున్నారు. తనకు 40 ఏళ్లు వచ్చే వరకు సామాన్య గృహస్థ జీవనం గడిపిన తర్వాత ఉన్నత సత్యాలు, మత సమస్యల గురించి ధ్యానం చేశారు. దేవుడు ఒక్కడేనని, అతడే విశ్వసృష్టి కర్త అని బోధించారు. క్రీ.శ.612లో ఇస్లాం మతాన్ని స్థాపించారు. అయితే ఈయన స్థాపించిన ఇస్లాం ప్రభోదాలకు అప్పటి సమాజంలో వ్యతిరేకభావం పెరగడంతో ఎత్‌రిబ్‌కు వలస వెళ్లాడు. తర్వాత ఆ ప్రదేశానికి మదీనా అని పేరు పెట్టారు. మొదటి మసీదును ఇక్కడే నిర్మించారు. మహమ్మద్‌ ప్రవక్త వారసుడిని ‘ఖలీఫా’ అంటారు. ప్రవక్తకు కుమారులు లేరు. తన మామ కుమారుడు అలీని వారసుడిగా గుర్తించి కూతురు ఫాతిమాను ఇచ్చి వివాహం చేశారు. ప్రవక్త మిరాజ్‌ (స్వర్గం నుంచి పిలుపు) దశకు చేరేవరకు అలీలో ఖలీఫా అయ్యే లక్షణాలు కనిపించలేదు. దాంతో ప్రవక్త భార్య అయేషా తండ్రి అబుబాకర్‌ను ఖలీఫాగా ప్రకటించారు. దీని వల్ల ఇస్లాంలో చీలిక ఏర్పడింది. అబుబాకర్‌ ప్రవక్త ప్రవచనాలను సేకరించి పుస్తకంగా (ఖురాన్‌) మలిచాడు. 

* ఖురాన్‌లో 30 భాగాలు, 114 సూరాలున్నాయి. ఖురాన్‌ (అల్లావాణి), సున్నత్‌ (ఆచారం)ను కలిపి ముస్లిం చట్టం అంటారు. 

* క్రీ.శ.7వ శతాబ్దంలో ఆదిమ అరబ్బీ సమాజం నుంచి ఇస్లాం మతం ఉద్భవించింది. ఏకో భగవాన్, సర్వమానవ సమానత్వం, సహోదరత్వం ఈ మతానికి మూలాధారాలు.

 

మతం - సూత్రాలు

* అల్లా ఒక్కడే భగవంతుడు.

* ఈ లోకంలో మహమ్మద్‌ అల్లాహ్‌ పంపిన ప్రవక్త.

* ఖురాన్‌ పవిత్ర గ్రంథం.

* ప్రతిరోజు అయిదుసార్లు నమాజ్‌ చేయాలి.

- ఫజర్‌ - సూర్యోదయం ముందు (6:30)

- జుహర్‌ - మధ్యాహ్నం (12:30)

- అసర్‌ - సాయంత్రం (04:30)

- మఖరిబ్‌ - సూర్యాస్తమయం తర్వాత (06:30)

- ఇషా - రాత్రివేళ (08:00)

(ప్రాంతాన్ని బట్టి నమాజ్‌వేళల్లో మార్పు ఉంటుంది)

* రంజాన్‌లో నెలపాటు రోజా పాటిస్తారు.

* ప్రతి ముస్లిం తన జీవితకాలంలో మక్కాయాత్ర (హజ్‌) చేయాలి. కాబా అత్యంత పవిత్రమైంది. దీని చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు.

* ఆదాయంలో 1/40వ వంతు దానధర్మాలకు వినియోగించాలి.

 

ఇస్లాం మతం - శాఖలు

ఇస్లాం మతంలో శాఖలు ఏర్పడటానికి ప్రధాన కారణం ఖలీఫా పదవి. 

సున్నీలు: అబుబాకర్‌ను, అతడి వారసులను ఖలీఫాలుగా ఆమోదించిన వారిని సున్నీలు అంటారు. మహమ్మద్‌ మాటలు, చర్చలను అనుసరిస్తూ వచ్చిన ఆచారాన్నే సున్నీగా పిలుస్తారు. ప్రవక్త ప్రవచనాల్లో అంగీకార యోగ్యమైన వాటిని నిర్ణయించడాన్ని ఇజ్‌మా అంటారు. వీరు అరేబియా, జోర్డాన్, సిరియా, ఆసియా మైనర్, ఈజిప్టు, అఫ్గానిస్థాన్‌, భారత్, చైనా, ఆఫ్రికాలో ఉన్నారు. సున్నీల్లో సయ్యద్‌లు, షేక్‌లు, మొగలులు, పఠాన్‌లు ఉంటారు. ప్రపంచంలో సున్నీ శాఖవారే అత్యధికంగా ఉన్నారు. క్రైస్తవ మతం ప్రపంచంలో అతిపెద్ద మతం కాగా రెండోది ముస్లింలలోని సున్నీ శాఖ.

షియాలు: అబుబాకర్, అతడి వారసులను ఖలీఫాలుగా అంగీకరించని వారిని షియాలు అంటారు. అలీ వారసుడు ఇమామ్‌ ముస్లింలకు ఆధ్యాత్మిక నాయకుడు. ఆయన నిర్ణయాలను పాటించాలని, ఆయనకు దైవ లక్షణాలు ఉన్నాయని షియాల నమ్మకం. షియాలు ఇజ్‌మాను నిరాకరించారు. ఇరాన్, భారత్‌లలో వీరు ఎక్కువగా ఉండి సూఫీ వాదాన్ని (మనసును పవిత్రం చేసుకోవడానికి కోరికలకు దూరంగా ఉండటం) పాటిస్తారు.

* మొహర్రం రోజున హైదరాబాదులోని ‘బీబికా ఆలం’ ప్రాంతంలో మాతం (రక్తతర్పణం) నిర్వహిస్తారు. 

ఖవంజు శాఖ: మత విశ్వాసంతో యోగ్యమైన జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే ఖలీఫా పదవికి అర్హుడని వీరు నమ్ముతారు. ఇవేకాకుండా ఖదరు, మర్జీ శాఖలు కూడా ఉన్నాయి. 

 

వివాహం - విడాకులు

ఒకే భార్యను కలిగి ఉండాలని ఖురాన్‌ తెలియజేసింది. కానీ తర్వాత కాలంలో బహు భార్యత్వాన్ని ఆమోదించింది. అయితే సమాజ సంక్షేమం దృష్ట్యా భార్యల సంఖ్యను నాలుగుకు పరిమితం చేసింది. ముస్లిం వివాహ వ్యవస్థలో స్త్రీ విడాకులు పొందడం చాలా కష్టం. పురుషుడు తేలికగా స్త్రీకి విడాకులు ఇవ్వగలడు. 

తలాక్‌ అహ్‌సాన్‌: ఈ విధానంలో భర్త, భార్యతో తలాక్‌ అని చెప్పిన మూడు నెలల వరకు ఇరువురి మధ్య లైంగిక సంబంధం లేకపోతే విడాకులు అమలైనట్లు భావిస్తారు. 

తలాక్‌ ఇహసాన్‌: ఇందులో బహిష్టు కాలసమయం లోపల భార్యతో భర్త మూడు సార్లు తలాక్‌ అనే పదాన్ని చెప్పి విడాకులు పొందవచ్చని పేర్కొన్నారు.

జీహార్‌: ఈ రకమైన విడాకుల్లో భార్యని తన తల్లిగా, సోదరిగా భావిస్తూ ఆమెతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉండడు. ఈ భావనను భర్త మార్చుకోలేనప్పుడు విడాకులు అమలు చేస్తారు. 

ఇలా: భర్త నాలుగు నెలల పాటు భార్యతో లైంగిక సంభోగం జరపనని ప్రమాణం చేసి దానికి కట్టుబడి ఉంటే వివాహం రద్దవుతుంది. 

లియాన్‌: భర్త లేదా భార్య ఒకరిపై ఒకరు వ్యభిచార నేరారోపణ చేసుకొని, వాటిని విరమించుకోకపోతే వారి వివాహం రద్దవుతుంది.

ఖులా:  భార్య తనను వివాహ బంధం నుంచి విముక్తిరాలిని చేయమని భర్తకు కొంత ధనం ఇస్తుంది. అందుకు అతడు అంగీకరిస్తే వివాహం రద్దవుతుంది. 

ముభారత్‌: భార్య, భర్త పరస్పర అవగాహన ద్వారా విడాకులు అమలు చేస్తారు. 

ముస్లిం వివాహచట్టం 1939 ప్రకారం ఇస్లాం కింది పరిస్థితుల్లో విడాకులు పొందే హక్కులను స్త్రీకి కల్పించింది.

* భర్త నాలుగేళ్లపాటు కనిపించకపోవడం.

* రెండేళ్లపాటు భార్యను భర్త పోషించలేనప్పుడు.

* భర్తకు ఏడేళ్ల కారాగార శిక్ష పడినప్పుడు.

* సరైన కారణం లేకుండా భార్యతో భర్త లైంగిక సంబంధాలను కలిగిలేనప్పుడు.

* భర్త లైంగిక సంపర్కానికి అనర్హుడిగా ఉన్నప్పుడు. మతిస్థిమితం సరిగా లేనప్పుడు.

* భర్త క్రూర ప్రవర్తన కలిగి, దీర్ఘకాలిక రోగాలు కలిగి ఉన్నప్పుడు.

 

బంధుత్వం - వారసత్వం

ముస్లిం సామాజిక వ్యవస్థలో పురుషుడు కుటుంబ పెద్దగా వ్యవహరిస్తాడు. కుటుంబ పోషణ బాధ్యతను అతడే స్వీకరించాలి. ఖురాన్‌ ప్రకారం కుటుంబసభ్యులు తమ అధికారాలను చెడు కోసం వాడకూడదు. కుటుంబ సభ్యుల అవసరాల్ని తీరుస్తూ ఇస్లాం మత ప్రభోదాన్ని సభ్యులకు తెలియజేయాలి.

వారసత్వం: తండ్రి ఆస్తిలో కుమార్తెకు 1/3వ వంతు ఆస్తి సంక్రమిస్తుంది. భర్త మరణించినప్పుడు భార్యకు సంతానం లేకపోతే 1/45వ వంతు, సంతానం ఉంటే 1/8వ వంతు ఆస్తిని పొందుతుంది. 

 

ఇస్లాం -  స్త్రీలు

ఇస్లాంలో స్త్రీ పురుషుడితో సమానంగా గౌరవించబడుతుంది. 

పర్ధా: ముస్లింలలో పర్ధా కట్టుబాటు మతపరమైంది. తమను తాము కాపాడుకోవడానికి వీలుగా ఎల్లప్పుడు ముసుగు ధరించాలని ఖురాన్‌ పేర్కొంది. మధ్యయుగ కాలంలో పర్ధా కట్టుబాటు ప్రభావం హిందూ స్త్రీలపై పడటం వల్ల వారూ ముసుగులు ధరించారు. 

* ముస్లిం స్త్రీలు కూడా విద్యనభ్యసించవచ్చు, ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చూడవచ్చు. 

రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣ భారతీయ సమాజ నిర్మాణం

‣  కుటుంబం

‣ భారతీయ సమాజం

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

Posted Date : 16-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పెళ్లి.. నాటి ప్రమాణాలు

    సమాజాల్లో కుటుంబ వ్యవస్థతో పాటు అత్యంత కీలకమైంది వివాహం. సమాజాభివృద్ధికి మూలం వివాహ వ్యవస్థలో ఉంది. భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థ పరిణామ క్రమం ఏమిటి? అందుకు కారణాలేమిటి? బంధుత్వం ఎలా ఏర్పడుతుంది? బంధుత్వ ప్రాధాన్యమేంటి? బంధుత్వ విధినిషేధాలేమిటి? - ఉస్మానియా విశ్వవిద్యాలయం సమాజశాస్త్రశాఖ అధిపతి, టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యులు ఆచార్యగణేశ్ అందిస్తున్న విశ్లేషణ 'ఈనాడు ప్రతిభ'కు ప్రత్యేకం.

    సామాజిక ఆమోదంతో లేదా చట్టపరమైన అంగీకారంతో స్త్రీ, పురుషులిద్దరూ కలసి జీవించడం.. వారిమధ్య సామాజిక బంధాన్ని ఏర్పరచుకునే పద్ధతిని వివాహం అంటారు. భార్యాభర్తల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలను.. ముఖ్యంగా శారీరక సంబంధాలను, తద్వారా సంతానాన్ని పొందడాన్ని, వారిద్దరి ఉమ్మడి నివాసాన్ని వివాహం ద్వారా సమాజం ఆమోదిస్తుంది. భారతీయ సమాజంలో స్త్రీ, పురుషులిద్దరూ వివాహం ద్వారానే సంతానాన్ని పొందాలి. కుటుంబ వ్యవస్థను కొనసాగించాలి

వివాహ రకాలు
1. ఏకవివాహం: ఒక పురుషుడు ఒక స్త్రీని లేదా ఒక స్త్రీ ఒక పురుషుడిని వివాహమాడటం.
2. బహువివాహం: హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం బహుభార్యత్వం, బహుభర్తృత్వం నిషిద్ధం. బహు వివాహంలో రెండు పద్ధతులు. ఒకటి.. బహుభార్యత్వం - ఒక పురుషుడు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోవడం. ఇది కొన్ని గిరిజన తెగల్లో (నాగాలు, గోండులు, బైగాల్లో) కనిపిస్తుంది.

    రెండోది.. బహుభర్తృత్వం - ఒక స్త్రీ ఒకరికంటే ఎక్కువమందిని భర్తలుగా కలిగి ఉండటం. ఇందులో మళ్లీ రెండు రకాలు. 1 - సోదర బహుభర్తృత్వం. 2 - సోదరేతర బహుభర్తృత్వం. ఒక స్త్రీ భర్తలంతా ఒకే కుటుంబానికి చెంది, సోదరులైతే దాన్ని సోదర బహుభర్తృత్వం అంటారు. అలాకాకుండా స్త్రీ భర్తలంతా వివిధ కుటుంబాల వారైతే దాన్ని సోదరేతర బహుభర్తృత్వం అంటారు. నీలగిరి కొండల్లో నివసించే తోడా తెగల్లో ఈ బహుభర్తృత్వ పద్ధతి ఉంది.
స్త్రీ, పురుషుల జనాభాలో అసమతౌల్యం.. స్త్రీల జనాభా తక్కువగా ఉండటం.. బాలికాశిశుమరణాల రేటు ఎక్కువగా ఉండటం.. లాంటివాటి వల్ల బహుభర్తృత్వం అనేది వచ్చింది. అలా, ఓలీ అనే సంప్రదాయాలు కూడా ఇందుకు కారణం. ఓలీ అనేది గిరిజన సంప్రదాయం. పురుషుడు స్త్రీని వివాహం చేసుకోవాలంటే వధువు తల్లిదండ్రులకు ధనం చెల్లించాలి. ఒకరు చెల్లించడం కష్టం. అంత స్తోమత ఉండదు. కాబట్టి ఇద్దరు ముగ్గురు కలసి చెల్లించి వివాహం చేసుకుంటారు. ఇలాంటి సామాజిక, ఆర్థిక, మతపరమైన కారణాల వల్ల ఈ వ్యవస్థలు ఏర్పడతాయి.

 

    ఈ రెండింటితోపాటు కొన్ని గిరిజన సమాజాల్లో మరో రెండు వివాహ పద్ధతులు కనిపిస్తుంటాయి.
1. దేవర న్యాయం: స్త్రీ భర్త చనిపోతే, మరిది(చనిపోయిన భర్త సోదరుడి)ని వివాహం చేసుకునే పద్ధతి. గిరిజన సమాజాల్లో స్త్రీకి సామాజిక, ఆర్థిక సంరక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆ సమాజంపై ఉంటుంది. కాబట్టి ఆ కుటుంబ పురుషులు రక్షణ కల్పించాలనేది ఉద్దేశం.
2. భార్యాభగినీ న్యాయం: ఒక వ్యక్తి భార్య చనిపోతే, ఆమె అవివాహిత సోదరిని పెళ్లి చేసుకోవడం. కుటుంబంలో ఆర్థిక, సామాజిక రక్షణ కల్పించే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు.

 

వివాహ సంప్రదాయాలు
హిందూ సమాజంలో 8 రకాలైన సంప్రదాయ వివాహ పద్ధతులున్నాయి. అవి..
1. బ్రాహ్మం 2. దైవం 3. ఆర్షం 4. ప్రజాపత్యం 5. అసురం 6. గాంధర్వం 7. రాక్షసం 8. పైశాచికం
వీటిలో మొదటి నాలుగింటిని ప్రశస్త వివాహాలంటారు. హిందూ ధర్మశాస్త్రాలు ఆమోదించినవి. మిగిలిన నాలుగింటిని అప్రశస్తమైనవిగా భావిస్తారు.
బ్రాహ్మం - విద్య, సదాచారాలున్న యువకుడికి కన్యాదాత స్వయంగా పిలిచి, వస్త్రాలంకారాలతో కన్యనిచ్చి చేసే వివాహం. కన్య తండ్రి తన ఇష్టప్రకారం అల్లుడిని ఎంచుకునే పద్ధతి.
దైవం - యజ్ఞయాగాదులు నిర్వహించగలిగే తెలివితేటలు, జ్ఞానం కలిగిన వ్యక్తికి కూతురునిచ్చి చేసే వివాహం.
ఆర్షం - కన్య తండ్రి వరుడి నుంచి రెండు గోవులను బహుమానంగా తీసుకొని, దానికి ప్రతిఫలంగా కూతురినిచ్చి చేసే వివాహం. కన్యాదాత వరుడి నుంచి గోవులను తీసుకోవడాన్ని ధర్మార్థంగా భావిస్తారు.
ప్రజాపత్యం - కన్యాదాత వధూవరులిద్దరూ ధర్మబద్ధంగా జీవితాన్ని గడపండని ఆశీర్వదిస్తూ కన్యాదానం చేస్తూ చేసే వివాహం.
ఈ నాలుగింటిలోనూ సూక్ష్మమైన తేడాలున్నా వధువు తండ్రి తన ఇష్టప్రకారం, అన్ని సలక్షణాలున్న వరుడికి కుమార్తెనిచ్చి వివాహం చేసే పద్ధతి వీటిలో కనిపిస్తుంది. అందుకే వీటిని ప్రశస్తమైనవిగా పేర్కొన్నారు.
హిందూ సమాజంలో మిగిలిన నాలుగు పద్ధతులు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తాయి. అవి..
అసుర వివాహం - వరుడు కన్యాదాత(మామ)కు కొంత డబ్బిచ్చి వధువును తీసుకొని వెళ్లి వివాహం చేసుకోవడం.
గాంధర్వం - వధూవరులిద్దరూ ఇష్టపడి, తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా చేసుకునే వివాహం.
రాక్షసం - స్త్రీ అంగీకారం లేకుండా, అవసరమైతే ఆమె బంధువులను పక్కకు తప్పించి, బలవంతంగా తీసుకెళ్లి వివాహం చేసుకోవడం.
పైశాచికం - స్త్రీ నిద్రాణస్థితిలో లేదా అపస్మారకస్థితిలో ఉన్నప్పుడు బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం.
ఈ నాలుగు వివాహాలు కూడా హిందూ సమాజంలో జరిగినట్లు ఆధారాలున్నాయి.


పవిత్ర కార్యం
హిందూ వ్యవస్థలో వివాహాన్ని పవిత్ర కార్యంగా భావిస్తారు. హిందూ వివాహం ప్రధాన ఉద్దేశాలు మూడు. 1. ధర్మం 2. ప్రజ 3. రతి. హిందూ శాస్త్రం ప్రకారం వివాహం చేసుకున్న స్త్రీ పురుషులిద్దరూ ధర్మబద్ధంగా జీవితాన్ని గడపాలి. వివాహ బంధం ద్వారా సంతానాన్ని పొందాలి. ఆ విధంగా సంతానాన్ని పొందడం ద్వారా సమాజం నిరంతరం కొనసాగేలా చూడాలి. ధర్మబద్ధంగా శారీరక సంబంధాన్ని పాటించాలనేది వీటి అర్థం.

వివాహ వ్యవస్థలో మార్పులు తెచ్చిన చట్టాలు
హిందూ వివాహ వ్యవస్థలో కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయి. సమాజ ఆమోదం లేని కొన్ని సంప్రదాయాలు వివాహ వ్యవస్థలో ఏర్పడ్డాయి. అవి.. సతీ సహగమనం, బాల్య వివాహాలు; వితంతు పునర్‌వివాహాలను ఆమోదించకపోవడం. ఇలాంటి పద్ధతుల్లో మార్పులు తేవడానికి బ్రిటిష్ హయాంలో, తర్వాత కూడా కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. హిందూ వివాహ వ్యవస్థలో మార్పులకు ఈ చట్టాలు దోహదపడ్డాయి.
1. సతీ సహగమన నిషేధ చట్టం (1829)
2. హిందూ విధవ పునర్‌వివాహ చట్టం (1856).. దీని ప్రకారం వైధవ్యం పొందిన స్త్రీ మళ్లీ వివాహం చేసుకునే హక్కు పొందింది.
3. ప్రత్యేక వివాహ చట్టం (స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ - 1872).. దీని ప్రకారం హిందూ వివాహం మతపరమైన సంస్కారమైనా, ఇది పౌర సంబంధమైన వివాహం కూడా. స్త్రీ పురుషుల మధ్య సామాజిక బంధాన్ని ఏర్పరిచే పద్ధతి. కాబట్టి కులాంతర, మతాంతర వివాహాలు ఆమోదయోగ్యమని చెబుతోందీ చట్టం.
4. బాల్య వివాహ నిషేధం చట్టం (1929).. ఈ చట్టం ప్రకారం బాలబాలికల వివాహాలు నిషిద్ధం. హిందూ వివాహ చట్టం (1955)లో కూడా వీటిని చేర్చారు.
5. హిందూ వివాహ చట్టం (1955).. దీని ప్రకారం వివాహం చేసుకోవాలంటే పురుషుడికి 21 సంవత్సరాలు, మహిళకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
6. వరకట్న నిషేధ చట్టం (1961).. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండూ చట్టపరంగా నిషేధాలే.


ముస్లిం వివాహ వ్యవస్థ
భారతీయ సమాజంలో హిందువుల తర్వాత అధిక సంఖ్యలో ఉన్నది ముస్లింలు, క్రైస్తవులు. ముస్లింలలో వివాహాన్ని సామాజిక ఒప్పందంగా భావిస్తారు. ఈ వివాహంలో ప్రధానంగా నాలుగు అంశాలుంటాయి.
1. స్త్రీ పురుషుల మధ్య వివాహమంటే ప్రతిపాదన, ఆమోదం ఉండాలి. కాబట్టి వివాహం చేసుకోవాలనుకునే పురుషుడు ప్రతిపాదించడం, దానికి వధువు అంగీకరించడం అవసరం. ఇవి రెండూ ఉన్నప్పుడే వివాహం.
2. వివాహం చేసుకోవాలనుకున్న వ్యక్తి వయోజనుడై ఉండాలి (అంటే బాల్య వివాహాలుండవు) పటిష్ఠమైన మానసిక స్థితిలో ఉండటం తప్పనిసరి.
3. సమానమైన సామాజిక అంతస్తుల మధ్య వివాహం జరిగితే బాగుంటుంది.
4. ఏ రకమైన చట్టపరమైన సమస్యలు లేకుండా, ముస్లిం చట్ట పరిధిలోనే వివాహం జరగాలి.
ముస్లిం వివాహ వ్యవస్థలో కనిపించే ఓ పద్ధతి మెహర్. వివాహం చేసుకునే వ్యక్తి స్త్రీపై గౌరవభావంగా ఆమెకు కొంత ధనాన్ని లేదా ఆస్తిని చెల్లిస్తారు. దీన్ని వివాహ నిశ్చయం సందర్భంలో పెద్దల సమక్షంలో నిర్ణయిస్తారు. దీన్ని వధువుకే చెల్లిస్తారు. వివాహ సమయంలో లేదా వివాహానంతరం చెల్లిస్తారు. దీనిపై వధువుకే సర్వహక్కులుంటాయి.
ఇస్లాం ప్రకారం విడాకులకు అవకాశముంది. మూడు రకాలుగా విడాకులు తీసుకోవచ్చు.
1. ముస్లిం మత చట్టం ప్రకారం (కోర్టు ప్రమేయం లేకుండా)..
2. షరియాత్ చట్టం 1937 ప్రకారం (దీని ప్రకారం పురుషుడు విడాకులు తీసుకోవచ్చు)..
3) ది డిసలూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1939 (దీని ప్రకారం మహిళలు విడాకులు కోరవచ్చు).


క్రైస్తవ వివాహాలు
ఈ సమాజంలో కూడా వివాహాన్ని పౌర ఒప్పందంగా భావిస్తారు. మత ఆచారాల ప్రకారం ఫాదర్ (మతగురువు), సాక్షుల సమక్షంలో వివాహం నిర్వర్తిస్తారు. వివాహం చేసుకోవాలనుకునే స్త్రీ, పురుషులిద్దరూ ఏ చర్చిలో సభ్యులో, ఆ చర్చి మతగురువుకు తమ వివాహానికి సంబంధించిన వివరాలను ముందే అందజేయాలి. ఆ వివరాలను చర్చిలో మూడు వారాల ముందు ప్రకటిస్తారు. సమాజంలో ఎవరికైనా ఈ వివాహంపై ఆక్షేపణ ఉంటే తెలియజేసే అవకాశం ఇస్తారు. ఎలాంటి ఆక్షేపణ లేకుంటే వారు నిర్ణయించుకున్న తేదీ నాడు వివాహం జరిపిస్తారు. క్రైస్తవంలో ఏక వివాహ నియమం ఉంది. ఏకకాలంలో బహు వివాహం నిషిద్ధం. క్రైస్తవ పెళ్లిళ్లను క్రమబద్ధీకరించడానికి రెండు చట్టాలున్నాయి.
1. ది ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872 (భారత్‌లో క్రైస్తవుల వివాహ విషయాల్ని నియంత్రించడానికి ఈ చట్టం).
2. ఇండియన్ డైవోర్స్ యాక్ట్ 1869 (క్రైస్తవులు కోర్టు ద్వారా విడాకులు తీసుకోవాలనుకుంటే ఈ చట్టం ప్రకారం, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో విడాకులు తీసుకోవచ్చు).


బంధుత్వం
భారతీయ సమాజంలో వివాహం, కుటుంబంతోపాటు ప్రధానమైంది బంధుత్వ వ్యవస్థ. కుటుంబ సభ్యుల మధ్య లేదా కుటుంబాల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను క్రమబద్ధీకరించే, ఏకీకృతం చేసేది బంధుత్వ వ్యవస్థ. సమాజశాస్త్ర పరంగా చూస్తే ఇద్దరు వ్యక్తులు లేదా రెండు సమూహాల మధ్యగల సామాజిక సంబంధాలను సూచించేదే బంధుత్వం. బంధుత్వం వివాహం ద్వారా లేదా రక్తసంబంధం ద్వారా ఏర్పడుతుంది. వైవాహిక బంధువులు, రక్తబంధువులు ఉంటారు. ఉదాహరణకు భార్యాభర్తలది వైవాహిక బంధుత్వం. కోడలు, మామ, అత్తల మధ్య బంధుత్వం వైవాహిక బంధుత్వం. కుటుంబంలో తల్లిదండ్రులకు, పిల్లలకు, పిల్లల మధ్య ఉండే సంబంధం రక్తసంబంధం.
వీటి ప్రాతిపదికన భారతీయ సమాజంలో 4 రకాలైన బంధు సమూహాలు కనిపిస్తాయి. 1. వంశం 2. గోత్రం 3. గోత్రకూటమి 4. ద్విశాఖి
    వంశం, గోత్రం హిందూ సమాజంలో కనిపిస్తే.. గోత్రకూటమి, ద్విశాఖిలు భారతీయ సమాజంలోని గిరిజన సమూహాల్లో ఉన్నాయి. ఒకే పూర్వీకుల నుంచి ఉద్భవించిన సమూహాన్ని వంశం అంటారు. ఏకరక్త బంధుత్వం కలిగిన కుటుంబాల కలయిక వల్ల ఏర్పడిందీ వంశం. ఒక వంశంలో మూడు నాలుగు తరాలకు సంబంధించిన వ్యక్తులుంటారు. వీరందరికీ సమష్టి ఆచారాలు, సంప్రదాయాలుంటాయి. వారందరినీ రక్తబంధువులుగా భావిస్తారు. అందువల్లే ఒకే వంశానికి చెందిన వ్యక్తుల మధ్య వివాహాలు నిషిద్ధం. తమ పూర్వీకులెవరో కచ్చితంగా నిర్దారించే అవకాశం వంశంలో ఉంటుంది. ఈ వంశం అనేది చాలా విస్తృతమైనప్పుడు ఏర్పడేదే గోత్రం. గోత్రంలోని సభ్యులు కూడా తామంతా ఒకే మూలపురుషుడి నుంచి ఉద్భవించామనే భావన కలిగి ఉంటారు. కానీ గోత్రానికి సంబంధించిన మూలపురుషుడి స్పష్టమైన వివరాలు గోత్ర సభ్యులకు తెలియకపోవచ్చు. ఒక కల్పితమైన పూర్వీకుడి నుంచి ఉద్భవించిన రక్తబంధువులందరినీ స్వగోత్రీకులంటారు. అందుకే స్వగోత్ర వివాహం నిషిద్ధమని నియమం పెట్టుకున్నారు. ఈ గోత్రాలు హిందూసమాజంలో, గిరిజన సమూహాల్లో ఉంటాయి. ఇందులోనూ పితృ వంశీయ, మాతృ వంశీయ గోత్రాలుంటాయి. ఇవి కాకుండా కొన్ని గిరిజన సమూహాల్లో గోత్ర కూటములు కనిపిస్తాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ గోత్రాలున్న ఏక వంశానుక్రమ సమూహాలను గోత్రకూటములంటారు. ఒకే రకమైన సంప్రదాయాలు, ఆచారాలు, మూలపురుషుడు కలిగిన గోత్రాలు కలిసినప్పుడు ఈ గోత్రకూటములు ఆవిర్భవిస్తాయి. నాగాలాండ్‌లోని ఆవోనాగా తెగలో, తెలంగాణలోని రాజ్‌గోండ్‌ల్లో ఈ గోత్రకూటములు కనిపిస్తాయి. ఇదో ప్రత్యేక లక్షణం. మరియాగోండ్, రాజ్‌గోండ్, ఆవోనాగాల్లో పితృవంశీయ గోత్ర కూటములు. హోపీ, లవాహో అనే గిరిజన తెగల్లో మాతృవంశీయ గోత్ర కూటములున్నాయి.
    వీటితోపాటు గిరిజన తెగ రెండు బంధు సమూహాలుగా విభక్తమైతే దాన్ని ద్విశాఖి అంటారు. ఒకే విభాగానికి చెందిన వ్యక్తులు అదే విభాగానికి చెందిన వారిని వివాహం చేసుకోకూడదు. అంటే వేరే శాఖవారిని చేసుకోవాలి. గోండ్‌లు, నాగాల్లో ఈ ద్విశాఖి కనిపిస్తుంటుంది.


బంధుత్వ ఆచరణలు
    బంధువుల మధ్య సంబంధాలను క్రమబద్ధీకరించటానికి కొన్ని ఆచారాలు వచ్చాయి. వ్యక్తుల సామాజిక సంబంధాలకు సంబంధించిన విధి నిషేధాలివి.
1. వైదొలగు నడవడి
    ఒక కుటుంబంలోని బంధువులు ఏవిధమైన ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండకూడదో తెలిపేదిది. ఉత్తర భారతంలో, కొన్ని గిరిజన సమాజాల్లో ఉంటాయివి. ఉదాహరణకు కోడలు మామతో ప్రత్యక్షంగా మాట్లాడకుండటం. మామ కుటుంబానికి కర్త, పెద్ద. పితృస్వామ్య వ్యవస్థలో కర్తకు ఎదురుగా వెళ్లి మాట్లాడటం సంప్రదాయ విరుద్ధమనే భావన. అలాగే అత్త అల్లుడితో ప్రత్యక్షంగా మాట్లాడటానికి వీల్లేదు. ఇదే వైదొలగు నడవడి.

2. పరిహాస సంబంధం
    పరిహాస సంబంధాలు ఎవరిమధ్య ఉండొచ్చు, ఎవరి మధ్య ఉండకూడదనేది ఈ పద్ధతి చెబుతుంది. సంప్రదాయ హిందూ కుటుంబ వ్యవస్థలో పిల్లలు తండ్రితో పరిహాసమాడటానికి వీల్లేదు. కానీ తాత మనవడితో పరిహాసం ఆడొచ్చు. లేదా ఓ వ్యక్తి తన బావమరిదితో, మరదలితో పరిహాసం ఆడొచ్చు.

3. సంకేతిక సంబోధన
    కుటుంబంలో ఒక బంధువు మరో బంధువును నేరుగా పేరు పెట్టిపిలవడం నిషేధం. కొన్ని సమూహాల్లో భార్య భర్తను పేరుతో పిలవడానికి వీల్లేదు. చాలా గిరిజన సమాజాల్లో, సంప్రదాయ హిందూ సమాజాల్లో కూడా భార్య భర్తను పేరుతో పిలిస్తే ఆయనకు ఆయుష్షుక్షీణమనే నమ్మకం ఉంది. అందుకే ఉత్తరభారతంలో పిల్లల పేరుతో కలిపి భర్తను పిలుస్తారు. అలాగే కొన్ని సమూహాల్లో కోడలు అత్తను నేరుగా సంబోధించడం కుదరదు.

4. మాతులాధికారం
    వ్యక్తి జీవన వ్యవహారాల్లో తల్లి సోదరుడికి (మేనమామకు) అత్యంత ప్రాధాన్యం ఇవ్వడాన్ని మాతులాధికారం అంటారు.

5. పితృశ్వాధికారం
    వ్యక్తి జీవన వ్యవహారాల్లో తండ్రి సోదరి (మేనత్త)కి అత్యంత ప్రాధాన్యమిస్తే దాన్ని పితృశ్వాధికారం అంటారు.

6. కుహనా ప్రసూతి
    భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త - ఆమె కష్టాల్లో పాలుపంచుకోవడం, ఆమె బాధను తాను కూడా పడుతున్నట్లు (నీరసంగా ఉండటం) ఉండటం. ముఖ్యంగా ప్రసవ సమయంలో భార్య బాధను పంచుకునే పద్ధతి. తద్వారా భార్యకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాననే భావన కలిగించడం దీని ఉద్దేశం. ముఖ్యంగా ఖాసీ, తోడా తెగల్లో కుహనా ప్రసూతి పద్ధతి కనిపిస్తుంది. తోడాల్లో బహుభర్తృత్వం ఉంది. స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరనేది నిర్ధారించటానికి కుహనా ప్రసూతిని ఉపయోగిస్తారు. గర్భం ధరించి ప్రసవించే దాకా భర్తల్లో ఎవరైతే ఆమెకు తోడుగా ఉంటారో వారినే ఆ సంతానానికి తండ్రిగా భావిస్తారు. ప్రసూతి అనంతరం బాణం విల్లంబుల ఉత్సవం (బో అండ్ యారో సెర్మనీ) చేసి తెగకు సంబంధించిన వారందరికీ విందు ఇస్తారు. ఎవరైతే ఆ విందు ఇస్తారో ఆ వ్యక్తిని బిడ్డకు తండ్రిగా పరిగణిస్తారు. బహుభర్తృత్వంలో స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడల్లా ఎవరో ఒకరు ఈ పద్ధతిని పాటిస్తారు.


కాలక్రమం
వివాహ వ్యవస్థ అనేది ఉన్నట్టుండి పుట్టుకొచ్చింది కాదు. ఎడ్వర్డ్ వెస్టర్ మార్క్, ఎల్‌హెచ్ మోర్గాన్ అనే మానవశాస్త్రవేత్తల అభిభాషణ ప్రకారం వివాహ వ్యవస్థ పరిణామ క్రమంలో ఏర్పడింది. అనేక మార్పులు చెందుతూ వస్తోంది. వెస్టర్ మార్క్ రాసిన 'హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్' అనే ప్రసిద్ధ గ్రంథం ప్రకారం.. సమాజం ఏర్పడిన తొలినాళ్లలో ఉన్నది స్వైరిత వ్యవస్థ. ఏ రకమైన నియమ నిబంధనలు లేనటువంటి వ్యవస్థ అది. ఆ స్వైరిత వ్యవస్థలోంచి సామూహిక వివాహం వచ్చింది. అంటే కొంతమంది పురుషులు, మరికొందరు స్త్రీలను వివాహం చేసుకునే పద్ధతి మొదలైంది. అనంతర కాలంలో బహు వివాహం ఏర్పడింది. స్త్రీలు బహుభర్తలను కలిగి ఉండటం.. మరి కొంతకాలం పురుషులు బహుభార్యలను కలిగి ఉండే కాలం ఉండేది. అవన్నీ దాటి ఇప్పుడు ఏక వివాహ పద్ధతి ఏర్పడింది. ఇలా వివాహ పద్ధతి మార్పులు చెందుతూ వస్తోంది.

ప్రశస్త సప్తపది
బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రజాపత్య వివాహాల సందర్భాల్లో కొన్ని సంస్కారాలు నిర్వహిస్తారు. వాటిని హిందూ సమాజంలో చాలా ప్రశస్తమైనవిగా భావిస్తారు. అవి 1. కన్యాదానం 2. వివాహ హోమం (లాజహోమం) 3. పాణిగ్రహణం 4. అగ్నిప్రణయనం 5. ఆశ్వారోహణం 6. సప్తపది 7. అరుంధతీ దర్శనం. వీటితోపాటు మాంగల్యధారణ కూడా ఉంటుంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వీటిలో పాణిగ్రహణం, సప్తపది తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన సంస్కారాలంటారు. వీటిని హిందూ సంప్రదాయ వివాహానికి సూచికలుగా చెబుతారు. అందుకే తప్పనిసరిగా నిర్వర్తించాలంటారు.

మూడు నియమాలు
భారత్‌లో వివాహానికి సంబంధించి మూడు నియమాలు కనిపిస్తాయి. అవి..

1. అంతర్‌వివాహం
    ఒక సమూహంలోని వ్యక్తి అదే సమూహంలోని వారిని వివాహమాడాలి. ఒక కులం వారు అదే కులం వారిని, ఒక మతం వారు అదే మతం వారిని వివాహమాడటం. దాదాపు అన్ని మత, కుల, గిరిజన సమూహాలు భారతీయ సమాజంలో ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. కులం, తెగలను చూస్తే గోత్రాలు కనిపిస్తాయి. ఒకే పూర్వీకుల నుంచి ఉద్భవించారన్న భావన కలిగి ఉన్న సమూహాన్ని గోత్రం అంటాం. అంటే ఒక గోత్రీకులంతా ఒకే రక్తసంబంధీకులనే నమ్మకం. అందుకే స్వగోత్ర వివాహాలను ఆమోదించని ధోరణి భారతీయ సమాజంలోనూ, అనేక గిరిజన తెగల్లోనూ కనిపిస్తుంది. కులం అంతర్‌వివాహ సమూహమైతే అందులోని భాగమైన గోత్రం బహిర్ వివాహ సమూహం.

2. బహిర్‌వివాహం
    ఒక సమూహానికి చెందిన స్త్రీ లేదా పురుషుడు వేరే సమూహంలోని వ్యక్తిని వివాహం చేసుకోవడం. గోత్రం బహిర్‌వివాహ సమూహం.
    భారతీయ హిందూ, ముస్లిం, గిరిజన సమూహాల్లో మేనరిక వివాహాలు, సమాంతర పిత్రీయ వివాహాలు అని ఉంటాయి. వీటినే అధిగణన వివాహాలంటారు. హిందూ కులవ్యవస్థలో మేనరిక వివాహాలు (క్రాస్ కజిన్ మ్యారేజస్) లేదా మేనమామ-మేమకోడలు వివాహాలు దక్షిణభారతంలో (ఉదాహరణకు కోస్తాంధ్రలో) కనిపిస్తాయి. ఉత్తరభారతంలో ఇవి ఉండవు. అలాగే ముస్లింలలో అన్నదమ్ముల పిల్లలు, అక్కాచెల్లెళ్ల పిల్లలు వివాహం చేసుకోవచ్చనే నియమం సమాంతర పిత్రీయ సంతతి వివాహానికి ఉదాహరణలు. ఇవి దక్షిణభారతంలో కనిపిస్తాయి.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గిరిజన సమూహాలు

 భారతీయ సమాజంలో భిన్న ప్రాంతాల్లో భిన్న తెగలుగా జీవనం సాగిస్తున్న గిరిజనులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. జన జీవన స్రవంతిలో భాగంగా ఉన్నవారు.. దూరంగా ఉన్నవారూ ఇబ్బందులు పడుతున్నారు. భౌగోళికాంశాల ప్రభావం, నిరక్షరాస్యత, కొందరి దోపిడీ స్వభావం.. తదితర కారణాలతో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమస్యలతో జీవనం సాగిస్తున్నారు. 
    దేశ వ్యాప్తంగా భిన్న ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న భిన్న తెగలకు చెందిన గిరిజనులు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. వారి అభ్యున్నతికి ప్రభుత్వాలు కూడా విశేషంగా కృషి చేస్తున్నాయి. గిరిజన సమూహాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తే..

1. జాగ్రఫికల్ సెపరేషన్
    గిరిజన సమూహాలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైంది భౌగోళికంగా వేరుపడి ఉండటం (జాగ్రఫికల్ సెపరేషన్). చాలా తెగలు భౌగోళికంగా దట్టమైన అటవీ, పర్వత ప్రాంతాల్లో నివసించడం వల్ల జన జీవన స్రవంతికి దూరంగానే ఉంటున్నాయి. ఇప్పటికీ చాలా తెగలు ఒంటరిగానే జీవిస్తున్నాయి. అటవీ సంపదపై ఆధారపడి జీవించే పరిస్థితి ఇంకా ఉంది. గిరిజనేతరులతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేకపోవడం వల్ల సామాజికంగా, ఆర్థికంగా వెనకబాటుతనం కొనసాగుతోంది. చాలా గిరిజన సమూహాలకు ఏరకమైన అవస్థాపనా సౌకర్యాలు కూడా లేవు. ఉదాహరణకు రహదారులు, రవాణా, విద్య, ఆరోగ్యపరమైన వసతుల్లేవు.

2. ఆర్థిక సమస్యలు
    పేదరికం, నిరుద్యోగం, రుణగ్రస్తత, ఆర్థిక వెనుకబాటుతనం.. చాలా గిరిజన సమాజాల్లో కనిపిస్తాయి. వీటికి కారణం - చాలా గిరిజన సముదాయాలు అటవీ సంపదపై ఆధారపడి జీవించడం. కొన్ని తెగలు ఇప్పటికీ పోడు వ్యవసాయం చేస్తున్నాయి. మరికొన్ని గిరిజన తెగలు స్థిర వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయి. అయినా గిరిజన సమూహాలకున్న భూమి తక్కువ. వీరిలో చాలామంది చిన్న రైతులు, లేదంటే ఉపాంత రైతులు. చాలామందికి ఒకట్రెండు ఎకరాలే ఉంటాయి. పెద్ద ఎత్తున భూమి ఉండేది చాలా తక్కువ. స్వయం పోషక ఆర్థిక వ్యవస్థ కాబట్టి.. తమకు చేతనైనంత వరకే భూమిని తమ దగ్గర ఉంచుకుంటారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులనే అనుసరించడం వల్ల వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితి.

3. 'దోపిడీ' వలయంలో..
    ఎక్కడైతే గిరిజనేతరులతో సామాజిక బంధం ఏర్పడిందో అక్కడ సమస్యలూ ఏర్పడ్డాయి. చాలామంది భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, అటవీ గుత్తేదార్లు గిరిజనులను ఆర్థికంగా దోపిడీ చేశారు. వీటికితోడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని అటవీ చట్టాల కారణంగా అనేకచోట్ల గిరిజనులు అనాదిగా తమకున్న జీవనోపాధి వసతులను కోల్పోయే పరిస్థితి ఉత్పన్నమైంది. నిజానికి గిరిజనులు తమకు అడవిపైనా, అటవీ ఉత్పత్తులపైనా సహజమైన హక్కుందని భావిస్తారు. కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటవీ చట్టాల వల్ల, ఆ సహజహక్కును కోల్పోవాల్సి వస్తోంది. ఆర్థిక వెనుకబాటుతనం కారణంగా గిరిజనేతరుల నుంచి అప్పులు తీసుకోవడం మొదలైంది. క్రమంగా గిరిజనుల భూమి గిరిజనేతరులకు బదలాయింపు చేయడం.. భూమి అన్యాక్రాంతం కావడం మొదలైంది. బ్రిటిష్ పరిపాలన కాలంతోపాటు స్వాతంత్య్రానంతర కాలంలో కూడా ఇది జరిగింది. గిరిజనుల భూములను రక్షించే చట్టాలు వచ్చేదాకా ఈ దోపిడీ కొనసాగి, భూములు గిరిజనేతరుల పరమయ్యాయి. ఈ విధంగా భూమిని కోల్పోవడం, ఉపాధి వసతులను కోల్పోవడం, సహజసంపదపై తమకున్న హక్కులను కోల్పోవడం వల్ల ఆర్థిక సమస్యలు మరింత జఠిలమయ్యాయి. అందుకే గిరిజనుల తిరుగుబాట్లు, గిరిజన ఉద్యమాలు తలెత్తాయి. గిరిజన ఉద్యమాల్లో ప్రధానాంశం అటవీసంపదపై హక్కులు. ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో బ్యాంకింగ్ సౌకర్యాలు (పరపతి సౌకర్యాలు) లేకపోవడం వల్ల కూడా అనివార్యంగా వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సిన పరిస్థితి. వారి దోపిడీ కారణంగా కూడా గిరిజనులకు ఆర్థికంగా ఎదిగే అవకాశం రాలేదు. అందుకే గిరిజనులు వ్యవసాయ రుణాల నుంచి విముక్తి చేసే చట్టం కావాలని కోరుకుంటున్నారు. ఈ అప్పులను మాఫీ చేసి, తమ నుంచి తీసుకున్న భూములను తమకిస్తే తమ జీవితాలు తాము గడుపుతామనేది వారి కోరిక. ఉద్యమ కాంక్ష.

పరిమిత ఆర్థిక జీవనం
    పర్వత ప్రాంతాల్లోని గిరిజనుల ఆర్థిక వ్యవస్థ పశుపోషక ఆర్థిక వ్యవస్థ. పశువులను పెంచడం, తద్వారా వచ్చే ఆదాయంతో జీవించడం.. ఇదేమీ లాభసాటిగా లేకపోవడంతోపాటు జీవనోపాధికి అవసరమైన ఆర్థిక వనరులు పరిమితంగా ఉండటంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిజనుల్లో తక్కువ మంది మాత్రమే వ్యవసాయేతర రంగాల్లో ఉన్నారు. చాలా తక్కువ మంది పారిశ్రామిక రంగంలో ఉన్నట్లు అంచనా. ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 3 శాతం గిరిజనులు మాత్రమే పరిశ్రమల రంగాల్లో పనిచేస్తున్నారు. 5 శాతం వరకు సేవారంగంలో పనిచేస్తున్నారు. మిగిలిన వారంతా వ్యవసాయం లేదా వారి సాంప్రదాయిక వృత్తులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దీనివల్ల వారెంత వెనకబడి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

సామాజిక సమస్యలెన్నో..
    ఆర్థిక సమస్యల తర్వాత గిరిజనులను వేధించే సమస్యలు సామాజికమైనవి. ప్రధానమైంది నిరక్షరాస్యత. గిరిజనుల్లో అక్షరాస్యత రేటు చాలా తక్కువ. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లోని గిరిజనుల్లో, మహిళల్లో నిరక్షరాస్యత రేటు చాలా ఎక్కువగా ఉంది. అనేక నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. విద్య లేకపోవడం వల్ల వారు వివిధ రకాలైన సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరమైన అవగాహన ఉండటం లేదు. ఆర్థికంగా అభివృద్ధి చెందడం తెలియదు. జన జీవన స్రవంతిలో కలవడం లేదు. నిరక్షరాస్యతతో పాటు ఉన్న మరో సమస్య బాల్య వివాహాలు. చాలా గిరిజన సమూహాల్లో ఇప్పటికీ ఈ సమస్య కనిపిస్తుంది. మతపరమైన మూఢ విశ్వాసాలు వాటికి తోడవుతున్నాయి. మంత్రాలు, తంత్రాలు, చేతబడులు, జంతుబలులు.. ఇలాంటి వాటిని విశ్వసించడం తదితర సమస్యలకు దారి తీస్తున్నాయి.

సాంస్కృతిక సమస్యలు
    జన జీవన స్రవంతికి దూరంగా ఉన్నవారికి ఒకరకమైన సమస్యలుంటే జన జీవన స్రవంతిలో ఉన్నవారిలోనూ కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఎక్కడైతే గిరిజనులు గిరిజనేతరులతో సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉన్నారో అక్కడ గిరిజనులపైన గిరిజనేతరులు తమ సాంస్కృతిక ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఈశాన్య భారతంలోని తెగలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సర్వాత్మవాదం, జీవాత్మవాదం, ప్రకృతి ఆరాధనావాదం, టోటెమిజం లాంటి మతరూపాలు గిరిజనుల్లో కనిపిస్తాయి. వీరు హిందూ, ఇస్లాం, క్రైస్తవం లాంటి మత విధానాల్లోకి రాలేదు. గిరిజనుల మత విశ్వాసాలన్నీ విభిన్నమైనవి. కానీ ఎక్కడైతే గిరిజనేతరులకు దగ్గరగా జీవిస్తున్నారో అక్కడ హిందూ, క్రైస్తవ మతాల్లోకి మార్చే ప్రక్రియ మొదలైంది. అంటే గిరిజన సమూహాలను తమ మత సంస్కృతిలో భాగం చేసే ప్రయత్నం. దీన్నే హైందవీకరణ, క్రైస్తవీకరణ అంటారు. మధ్య భారతంలో హైందవీకరణ.. ఈశాన్య భారతంలో క్రైస్తవీకరణ జరిగింది. ఉదాహరణకు నాగాలాండ్‌లో నాగాలను తీసుకుంటే.. నాగాలంతా తాము క్రైస్తవులమని భావిస్తున్నారు. మరో సమస్య భాషాపరమైంది. సాంస్కృతిక బంధం కారణంగా గిరిజనేతర సమాజాల భాషను, వారి సంస్కృతిని అలవర్చుకున్నారు. ఇలా తమ మతం, సంస్కృతి, భాషలపై దాడి జరిగిందనే భావన గిరిజన సమూహాల్లో ఏర్పడింది. తాము ఆర్థికంగానే కాకుండా సాంస్కృతిక పరమైన దోపిడీకి గురవుతున్నామని గిరిజన సమూహాలు భావించాయి. ఇదే కొనసాగితే తాము అస్తిత్వాన్ని కోల్పోతామనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.

విద్య, ఆరోగ్యం!?
    చాలామేర గిరిజనులు నిరక్షరాస్యులే కాగా.. మైదాన ప్రాంతాల్లోని గిరిజనుల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసినా విద్య ఆవశ్యకతను తెలియజెప్పడంలోనూ, నాణ్యమైన విద్యను అందజేయాలనే ఆలోచనలోనూ వైఫల్యాలు సుస్పష్టం. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పాటు చేసినా వసతులు, ఉపాధ్యాయులు లేకపోవడం, ఉన్నా బోధన సరిగ్గా లేకపోవడం వల్ల విద్యాపరంగా వెనకబాటుతనం కొనసాగుతోంది. వీటికితోడు ఆరోగ్య సమస్యలూ వారిని చుట్టుముట్టే ఉంటాయి. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పరిజ్ఞానం లేకపోవడం; వసతుల లేమి; ఉన్న వాటిని వినియోగించుకో లేకపోవడం వల్ల మరణాల రేటు ఎక్కువ. జీవనకాలం తక్కువ. మాతామరణాలు, శిశుమరణాల రేటు కూడా ఎక్కువ. జాతీయ సగటు కంటే ఇది ఎక్కువగా ఉంది. పౌష్టికాహార లోపం ఎక్కడ చూసినా కనిపిస్తుంటుంది.

అభివృద్ధికి బలి...
    అభివృద్ధికి గీటురాళ్లుగా మారిన భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్తు, గనుల విషయంలో భూ నిర్వాసితులవుతున్న వారిలో అత్యధికులు గిరిజనులు, ఆదివాసీలే. వారికి సరైన నష్టపరిహారాన్ని చెల్లించి, పునరావాసం కల్పించాలనేది డిమాండ్.

గిరిజన ఉద్యమాలు
    స్వాతంత్య్రానికి ముందు నుంచే గిరిజన ఉద్యమాలు వచ్చాయి. బ్రిటిష్ పరిపాలన కాలంలో ఝార్ఖండ్‌లో వచ్చిన బిర్సాముండా ఉద్యమం, సంతాల్ తిరుగుబాటు, గోండు ఉద్యమాలతో పాటు ఝార్ఖండ్, బోడోలాండ్ ఉద్యమాలన్నీ గిరిజనుల సమస్యల నేపథ్యంలో వచ్చినవే. వీటిలో కొన్ని రాజకీయ స్వయంప్రతిపత్తి కోసం వచ్చినవైతే మరికొన్ని వ్యవసాయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి, అటవీ హక్కుల కోసం, మతపరమైన అంశాలపై వచ్చినవి. తానా భగత్ ఉద్యమం - సాంఘిక మత ఉద్యమం. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని బిల్లులు ఈ ఉద్యమం తెచ్చారు. నైజాం ప్రభుత్వ కాలంలోనే గోండు తిరుగుబాటు చోటుచేసుకుంది. దీంతో నిజాం ప్రభుత్వం హైమన్‌డార్ఫ్ అనే బ్రిటిష్ సామాజిక మానవ శాస్త్రవేత్తను పిలిపించి వారి సమస్యలపై అధ్యయనం చేయాల్సిందిగా కోరింది. ఆయన ఆదిలాబాద్‌లోని గోండులతో కలసి జీవించి, వారి భాష నేర్చుకుని వారి సమస్యలపై ఓ నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగానే అప్పుడున్న నిజాం ప్రభుత్వం గిరిజనుల విద్య, అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి కోసం చర్యలు చేపట్టింది. భారత్‌లో గిరిజనుల గురించి జరిగిన తొలి అధ్యయనం అదే అని చెప్పొచ్చు.

మూడు దృక్పథాలు
    బ్రిటిష్ పాలన కాలం నుంచి ఇప్పటిదాకా గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో భారత్‌లో 3 రకాలైన దృక్పథాలు కనిపిస్తాయి.
1. ఏకీకరణ వాదం (పాలసీ ఆఫ్ ఐసోలేషన్)
2. విలీనీకరణ వాదం (పాలసీ ఆఫ్ అసిమిలేషన్)
3. ఏకీకృత విధానం (పాలసీ ఆఫ్ ఇంటిగ్రేషన్)
    జేహెచ్ హట్టన్ (1931లో సెన్సెస్ కమిషనర్), వెరియర్ ఎల్విన్ (లాస్ ఆఫ్ నర్వ్ అనే పుస్తకంలో ఈ ఏకీకరణ వాదం గురించి చెప్పారు) అనే సామాజిక శాస్త్రవేత్తలు ఏకీకరణ వాదాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం ఎక్కడైతే గిరిజనులకు గిరిజనేతరులతో సామాజిక బంధం ఏర్పడిందో అక్కడ చాలా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. గిరిజనులు తమ సంస్కృతి, భాష, మతపరమైన అస్తిత్వాన్ని కాపాడుకోవాలను కుంటున్నారు కాబట్టి, వాటికి భంగం కలిగించే ఎలాంటి చర్యలను ప్రభుత్వం తీసుకోకూడదు. వారు స్వేచ్ఛగా జీవించే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలి. ప్రభుత్వం గిరిజనుల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవన విధానంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోకూడదు. గిరిజనులు నివసించే ప్రాంతాలను రిజర్వ్‌డ్ ప్రాంతాలుగా ప్రకటించి, వాటిలోకి గిరిజనేతరులకు ప్రవేశం కూడా కల్పించకూడదు. గిరిజనుల ప్రాంతాలను జాతీయ పార్కులుగా ప్రకటించాలని ఎల్విన్ చెప్పారు. బ్రిటిష్ ప్రభుత్వం దాదాపు ఈ పద్ధతినే పాటించింది. కానీ దీనివల్ల గిరిజనులు శాశ్వతంగా జనజీవన స్రవంతికి దూరమై, ఆర్థికంగా వెనకబడిపోతారని విమర్శలు వచ్చాయి. కాబట్టి దీంతో విభేదిస్తూ... రెండో వాదం విలీనీకరణ వచ్చింది.


విలీనీకరణ వాదం
   జీఎస్ ఘుర్యే అనే సమాజ శాస్త్రవేత్త ఈ వాదాన్ని ముందుకు తెచ్చారు. భారత్‌లో హిందువులు, గిరిజనులు వేరు కాదని ఆయన వాదించారు. భారత్‌లోని గిరిజనులు హిందువుల్లోని వెనకబడిన హిందూ కులాలని ఘుర్యే చెప్పారు. హిందూ మతంలో గిరిజనులు సంపూర్ణంగా ఏకీకృతం, విలీనం జరగని కారణంగానే ఈ వెనకబాటుతనం వచ్చిందన్నది ఘుర్యే వాదన. ఆయన వాదన ప్రకారం.. హిందూ సమాజంలో వారంతా సమ్మిళితమైతే ఆర్థికంగా అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే వివిధ కులవృత్తులను స్వీకరించవచ్చు. ఆధునిక జీవన విధానాల్లో భాగం కావొచ్చు.
    విలీనీకరణ ప్రక్రియ కొంతమేర స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రం తర్వాత కొనసాగింది. కొన్ని హిందూ సంస్థలు, క్రైస్తవ సంస్థలు ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాయి. ఎక్కడైతే ఈ హైందవీకరణ, క్రైస్తవీకరణలు చోటు చేసుకున్నాయో అక్కడ సాంస్కృతికపరమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు బిర్సాముండా ఉద్యమాన్ని తీసుకుంటే (బిర్సా నాయకుడు) అందులో క్రైస్తవంలోకి మారిన బిర్సాముండాలకు, క్రైస్తవంలోకి మారని బిర్సాముండాలకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ విధంగా చాలా తెగల్లో మతమార్పిడైన తెగకు, చెందని వారికి మధ్య ఘర్షణలు చెలరేగాయి. అందువల్ల విలీనీకరణను కూడా చాలామంది వ్యతిరేకించారు. ఈ రెంటికీ మధ్యస్థంగా ఉండే విధానాన్ని కనుక్కునే క్రమంలో స్వాతంత్య్రం వచ్చాక అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పంచ సూత్రాలను ప్రతిపాదించారు. ఇవి ఏకీకరణను, విలీనీకరణను సమర్థించకుండా తటస్థంగా ఉంటాయి.


సంక్షేమానికి చర్యలు
గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం మన దేశంలో మూడు రకాల చర్యలు తీసుకున్నారు. అవి..
1. రాజ్యాంగపరమైన రక్షణలు కల్పించడం
2. హక్కులను పరిరక్షించేలా చట్టాల రూపకల్పన
3. గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు రూపొందించి అమలు చేయడం


రాజ్యాంగ పరమైన రక్షణలు
* ఆర్టికల్ 15 ప్రకారం ప్రభుత్వం అందరికీ సమానమైన హక్కులు, అవకాశాలు కల్పించాలి.
* ఆర్టికల్ 16 (4) 320 (4), 335ల ప్రకారం ఉద్యోగాల్లో గిరిజనులకు రిజర్వేషన్ వసతి కల్పించాలి.
* ఆర్టికల్ 330, 332, 334ల ప్రకారం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో గిరిజనులకు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా సీట్లను రిజర్వ్ చేయాలి.
* ఆర్టికల్ 275 ప్రకారం భారత సమీకృత నిధి నుంచి గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు పెద్దమొత్తంలో ధనాన్ని ఖర్చు చేయవచ్చు.
* ఆర్టికల్ 275 (1) ప్రకారం కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే గిరిజన సంక్షేమ పథకాలకు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇవ్వాలి.
* ఆర్టికల్ 164 ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలు, సమీక్ష కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి.
* ఆర్టికల్ 46 ప్రకారం ఆర్థిక, విద్యాపరమైన అవకాశాలను సంరక్షించాలి.
ఆర్టికల్ 338 ప్రకారం భారత రాష్ట్రపతి గిరిజన సంక్షేమ కార్యకలాపాలను సమీక్షించడానికి, పర్యవేక్షించడానికి ఓ కమిషనర్‌ను నియమించవచ్చు.
* ఆర్టికల్ 339(2) ప్రకారం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు గిరిజన సంక్షేమం, అభివృద్ధి అంశాల్లో నిర్దేశకత్వం ఇవ్వొచ్చు.
* ఆర్టికల్ 224 ప్రకారం గిరిజన ప్రాంతాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి.


చట్టపరమైన రక్షణలు
    గిరిజనులపై ఏ రకమైన అత్యాచారాలు జరగకుండా ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం-1989. దీంతోపాటు వెట్టి రద్దు (బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్-1976); బాలకార్మిక నిరోధ, నియంత్రణ చట్టం-1986; అటవీ హక్కుల చట్టం - 1980; జాతీయ గిరిజన ప్రణాళికలో భాగంగా వచ్చిన పంచాయత్ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరణ) చట్టం-1996 వల్ల గిరిజనులకు రక్షణలు కలిగాయి.

నెహ్రూ పంచ సూత్రాలు
1. మెజార్టీ ప్రజల (గిరిజనేతరుల) సంస్కృతిని గిరిజనులపై రుద్దే ప్రయత్నం చేయకూడదు. గిరిజనులను అభివృద్ధి చేస్తూనే వారిపై గిరిజనేతరుల పెత్తనం లేకుండా చూడాలి.
2. అటవీ సంపదపై, అటవీ భూములపై గిరిజనుల హక్కులను గౌరవించాలి.
3. గిరిజన సమూహాలకు చెందిన నాయకులను గుర్తించి, వారికి పరిపాలన పరమైన, అభివృద్ధి కార్యకలాపాల్లో శిక్షణ ఇవ్వాలి. క్రమంగా గిరిజనుల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించడంలో ఇదొక భాగం.
4. గిరిజనులు నివసించే ప్రాంతాల్లో విపరీతమైన పాలనా వ్యవస్థను రుద్దకూడదు.
5. గిరిజనులు తమ జీవన విధానాన్ని కొనసాగిస్తూనే, వారి అభివృద్ధికి అవసరమైన అవకాశాలను, చర్యలను తీసుకోవాలి. ఈ ప్రక్రియలో డబ్బు ఎంత ఖర్చయిందని కాకుండా, వారిలో ఎంత పరిణితి, పరివర్తన తీసుకొచ్చామనేది ఆలోచించాలి.
ఈ అంశాల ప్రాతిపదికగా ఏకీకృత విధానాన్ని అవలంబించడంతో పాటు, 1960 తర్వాత నుంచి ఇదే దృక్పథాన్ని కొనసాగిస్తున్నారు.


సంక్షేమ, అభివృద్ధి పథకాలు
* 1960లో షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ (యుఎన్ దేభార్ సారథ్యంలో) సూచనల మేరకు 1980 నుంచి గిరిజన ఉపప్రణాళిక (ట్రైబల్ సబ్‌ప్లాన్) ప్రారంభించారు. దీనిలో భాగంగా షెడ్యూల్డ్ తెగల సామాజిక, ఆర్థిక అభివృద్ధి; గిరిజనులు దోపిడీకి గురికాకుండా రక్షణ కల్పించడం ప్రధాన ఉద్దేశాలు. ప్రభుత్వ శాఖలన్నింటి బడ్జెట్‌లోనూ గిరిజన జనాభా నిష్పత్తికి అనుగుణంగా కేటాయింపులు జరిపి, ఆ బడ్జెట్‌ను అందుకే ఉపయోగిస్తే త్వరితగతిన అభివృద్ధి జరుగుతుందని భావించారు. ఈ ఉపప్రణాళికలో ప్రధానంగా కొన్నింటిపై దృష్టి సారించారు.
* ఉపాధి, విద్య, ఆరోగ్యం, గృహవసతి.. (ఉపాధిలో కుటుంబ ఆధారిత ఉపాధి కల్పన పథకాలు ప్రవేశపెట్టాలి. వ్యవసాయం, పశుపోషణ, సహకార రంగం, గిరిజన వృత్తులు, నైపుణ్యాలపై ప్రధానంగా దృష్టి సారించాలి) తర్వాతి కాలంలో గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు చేపట్టారు.
* పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా, అన్నింటిలోనూ కేంద్రం నుంచి ఆర్థిక పరమైన సహకారం రాష్ట్రాలకు అందించే ప్రయత్నం చేశారు. సమీకృత గిరిజనాభివృద్ధి పథకం (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు)ను అయిదో పంచవర్ష ప్రణాళికలో భాగంగా (1974-79) ప్రారంభించారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రత్యేకమైన ఐటీడీఏను ఏర్పాటు చేశారు. ఐటీడీఏ కింద గిరిజనుల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేశారు.
* గిరిజనుల ఆర్థిక అభివృద్ధి కోసం సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయాభివృద్ధికి కావాల్సిన పనిముట్లు, విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులను - ల్యాంప్స్ (లార్జ్‌సైజ్డ్ మల్టీపర్పస్ కో ఆపరేటివ్ సొసైటీలు) సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు.
* గిరిజనుల ఉత్పత్తులను విక్రయించడానికి, మార్కెటింగ్ సౌకర్యం కోసం ట్రైఫెడ్ (ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఏర్పాటు చేశారు. గిరిజనులు మోసపోకుండా, వాళ్ల ఉత్పత్తులకు మార్కెట్ ధర లభించేందుకు దీని ద్వారా సహాయ సహకారాలు అందించారు.
* ఉపాధి రంగాలకు కావాల్సిన వృత్తి నైపుణ్యం అందించేందుకు వృత్తి నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు.
* గిరిజన విద్యార్థినులకు విద్యావసతి కల్పించేందుకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు) ఏర్పాటు చేశారు.
* పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
* జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్‌హెచ్ఎం)లో భాగంగా గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం.
* గ్రామీణ గిరిజన ప్రాంతాల మహిళలను, చిన్నారులను దృష్టిలో ఉంచుకుని జననీ సురక్ష యోజన (జేఎస్‌వై), జననీ శిశు సంరక్షణ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. శిక్షణ పొందిన వైద్యుల పర్యవేక్షణలో ప్రసవాలు జరిగి మాతాశిశుమరణాలను తగ్గించడం వీటి ఉద్దేశం.
* వ్యాధులకు చికిత్సలందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను పంపుతున్నారు.
* భారతదేశంలో గిరిజన సమూహాల సమస్యలను అధ్యయనం చేయడానికి గిరిజన పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేశారు.
* ప్రభుత్వంతోపాటు చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా గిరిజనుల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నాయి.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బంధుత్వం - అనుబంధం

సమాజ నిర్మితిలోని ప్రధానాంశాల్లో బంధుత్వాలు ఒకటి. ఇవి మనుషుల మధ్య సంబంధాలను ఏర్పరుస్తాయి. బంధాలను పెంచుతాయి, పటిష్టం చేస్తాయి. ఇలాంటి బంధుత్వాలు అనేక విధాలుగా ఏర్పడతాయి. బంధుత్వాలంటే ఏమిటి? ఎన్ని రకాలుగా ఏర్పడతాయి? వీటి ప్రాధాన్యం ఏమిటి? తదితర అంశాలపై అధ్యయన సమాచారం టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం..
         ప్రపంచంలోని అన్ని సమాజాల్లో బంధుత్వం ఉంది. బంధుత్వం ఒక సామాజిక సంస్థ (Social Institution). కుటుంబం, కులం, గోత్రం, వివాహం, జాతి, మతం లాంటి వ్యవస్థలున్న ప్రతి సమాజంలోనూ సమాజ నిర్మాణానికి (నిర్మిత), సామాజిక సంబంధాలకు బంధుత్వమే ప్రధాన భూమిక.

బంధుత్వం అంటే..!
వివాహం ద్వారా లేదా ప్రత్యుత్పత్తి ద్వారా వ్యక్తుల మధ్య ఏర్పడే సంబంధమే బంధుత్వం. దత్తత ద్వారా ఏర్పడే బంధుత్వం వివాహ బంధుత్వమో, రక్త సంబంధ బంధుత్వమో కానప్పటికీ అది చట్టం దృష్టిలో బంధుత్వమే. ఒకే పూర్వికుడి వంశంలో పుట్టిన వారంతా బంధువులు అవుతారు. సమాజంలో వివిధ రూపాల్లో బంధుత్వ విధానాలు కనిపిస్తాయి. అవి..
1. వైవాహిక బంధుత్వం (Affinal Kinship)
2. ఏకరక్త బంధుత్వం (Consanguineal Kinship)
3. దత్త బంధుత్వం (Adopt Kinship)


వైవాహిక బంధుత్వం

    వివాహం ద్వారా ఏర్పడిన బంధువులు వైవాహిక బంధువులు. దీని ద్వారా పరిచిత లేదా అపరిచిత కుటుంబాల మధ్య వైవాహిక బంధుత్వం ఏర్పడుతుంది.
ఉదా: భార్య-భర్త, అత్త-మామలు, బావా-మరుదులు, వదిన-మరదళ్లు లాంటి బంధుత్వాలు వైహిక బంధం ద్వారా ఏర్పడినవే.


ఏక రక్త బంధుత్వం
    ఈ బంధుత్వం రక్తసంబంధం ద్వారా ఏర్పడుతుంది. అంటే ఒకే తల్లి / తండ్రి ద్వారా ఏర్పడిన సంబంధాలను ఏకరక్త బంధువులంటారు.
ఉదా: తల్లి-కొడుకు, తండ్రి-కూతురు, సోదరుడు, సోదరి.


దత్త బంధుత్వం
    దత్తత తీసుకోవడం ద్వారా ఒకటయ్యే బంధువుల మధ్య ఉండే సంబంధాన్ని దత్త బంధుత్వం అంటారు.
    నీలగిరిలో నివసించే తోడాలు బహుభర్తృత్వం (Polyandry)ను పాటిస్తారు. వీరిలో బహుభర్తృత్వ బంధుత్వం కనిపిస్తుంది. వీరికి జైవిక తండ్రి ఎవరో తెలియదు. సామాజికంగా గుర్తించిన తండ్రి మాత్రమే ఉంటారు. తోడాలు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో నిర్ధారించడానికి ధనుర్బాణోత్సవం నిర్వహిస్తారు.

బంధుత్వ సంబంధాల చిత్రం

* పై చిత్రంలో X1, X2 లు భార్యాభర్తలు. వీరిది వైవాహిక బంధుత్వం. వీరికి X అనే కుమారుడున్నాడు. X అనే వ్యక్తి X1, X2 లకు ఏకరక్త బంధువు అవుతాడు.
* అదేవిధంగా Y1, Y2లు భార్యాభర్తలు. వీరిది వైవాహిక బంధుత్వం. వీరికి Y అనే కుమార్తె ఉంది. Y అనే ఆమె Y1, Y2లకు ఏకరక్త బంధువు అవుతుంది.
* X, Yలు వివాహం చేసుకోవడం ద్వారా X, Yల మధ్య వైవాహిక బంధుత్వం ఏర్పడింది.
(X1, X2); (Y1, Y2)లు X, Yలకు అత్తమామలు అవుతారు. అంటే వీరిమధ్య వైవాహిక బంధుత్వం ద్వారా రెండు కుటుంబాల మధ్య బంధుత్వ సంబంధాలు ఏర్పడ్డాయి.


బంధుత్వ స్థాయులు
(బంధుత్వ స్థానం - డిగ్రీస్ ఆఫ్ కిన్‌షిప్)
భారతీయ సమాజంలో మనకు కింది 3 స్థాయుల్లో బంధుత్వ సమూహాలు కనిపిస్తాయి..
1. ప్రాథమిక బంధువులు (Primary Kins)
2. ద్వితీయ బంధువులు (Secondary Kins)
3. తృతీయ బంధువులు (Tertiary Kins)

ప్రాథమిక బంధువులు: ఒక వైయుక్తిక కుటుంబంలో సభ్యులను ప్రాథమిక బంధువులుగా పిలుస్తారు. వీరిమధ్య ఉండే బంధుత్వమే ప్రాథమిక బంధుత్వం. ఇది రెండు రకాలు.


1. ప్రాథమిక ఏకరక్త బంధువులు
ఉదా: తల్లిదండ్రులకు పిల్లలకు; పిల్లలకు పిల్లలకు మధ్య ఉండే బంధుత్వం.

2. ప్రాథమిక వైవాహిక బంధువులు
ఉదా: భార్యాభర్తలు.
* ప్రాథమిక బంధుత్వంలో ముఖాముఖి సంబంధాలు నిరంతరంగా ఉంటాయి.
* ప్రాథమిక బంధుత్వ సమూహాల్లో ఏడు రకాల బంధుత్వాలు కనిపిస్తాయి.
* ప్రాథమిక బంధుత్వాన్ని పక్క చిత్రంలో చూపించవచ్చు.
A, Bలు = వైవాహిక బంధువులు (భార్యాభర్తలు)
C, Dలు = A, Bలకు ఏకరక్త బంధువులు (పిల్లలు)
X1, X2లు = A యొక్క తల్లిదండ్రులు (రక్త బంధువులు)

ద్వితీయ బంధువులు: దీన్ని లెక్కించేటప్పుడు 'నేను (ఈగో/సెల్ఫ్)' నుంచి లెక్కించాలి. 'అహం' నుంచి లెక్కించినప్పుడు అహంకు చెందిన కుటుంబ సభ్యులంతా ప్రాథమిక బంధువులవుతారు. ఉదా: A, B, Cలు ప్రాథమిక బంధువులు. ఇక్కడ C ని అహం అనుకుంటే, ABలు C కి తల్లిదండ్రులు అవుతారు.C కు D అనే భార్య E అనే కుమారుడు ఉన్నారు. అంటే ప్రాథమిక బంధువు C ప్రాథమిక బంధువులు ABలకు ద్వితీయ బంధువులవుతారు. దీన్ని పక్క చిత్రంలో చూడొచ్చు.
C = అహం
ABC = ప్రాథమిక బంధువులు
CDE = ప్రాథమిక బంధువులు
ABలకు E = ద్వితీయ బంధువు
ABలకు D = ద్వితీయ బంధువు

* ఈ విధంగా ద్వితీయ బంధుత్వంలో 33 రకాల బంధుత్వాలు కనిపిస్తాయి.
* ఉదాహరణ అమ్మమ్మ, తాతయ్య, మనవడు, మనవరాళ్లు, కోడళ్లు, అల్లుళ్లు.

తృతీయ బంధువులు: అహం ద్వితీయ బంధువుల ప్రాథమిక బంధువులు తృతీయ బంధువులవుతారు. లేదా అహం ప్రాథమిక బంధువుల గౌణ బంధువును తృతీయ బంధువు అంటారు.
పక్క చిత్రంలో C, Dల ప్రాథమిక బంధువు E, ద్వితీయ బంధువు G. G ప్రాథమిక బంధువు I
C, Dలకు I తృతీయ బంధువు అవుతాడు.
* సుమారు 151 తృతీయ బంధుత్వాలు మనకు కనిపిస్తాయి.


బంధుత్వం ఆచరణలు (Kinship Usages)
ప్రాథమిక, ద్వితీయ, తృతీయ బంధువుల మధ్య వివిధ ప్రవర్తనలు కనిపిస్తాయి. వాటినే బంధుత్వ ఆచరణలు అంటారు. అవి
1. పరిహాస సంబంధాలు (Joking Relations)
2. వైదొలగు నడవడి
3. మాతులాధికారం
4. పితృష్యాధికారం
5. కుహనా ప్రసూతి
6. సాంకేతిక సంబోధన


పరిహాస సంబంధాలు
ఇందులో ఒకరినొకరు పరిహసించుకుంటారు. ఇవి రెండు రకాలుగా జరుగుతాయి. అవి..

1. సౌష్ఠవ పరిహాసం: ఇద్దరు బంధువులు సమానంగా పరిహాసం చేసుకుంటారు.
ఉదా: బావామరదళ్లు, బావామరుదులు

2. అసౌష్ఠవ పరిహాసం: ఒక బంధువుకు మరో బంధువును పరిహసించే స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆ బంధువుకు తిరిగి పరిహసించే స్వేచ్ఛ ఉండదు.
ఉదా: తాత-మనవరాలు


వైదొలగు నడవడి
బంధుత్వ సమూహాల్లో కొంతమంది ఎదురుపడినప్పుడు వారిని తప్పుకుని నడవడం, ప్రవర్తించడం జరుగుతుంది. వీరు ముఖాముఖిగా కూడా మాట్లాడరు.
ఉదా: మామ-కోడలు, అత్తా-అల్లుడు.


మాతులాధికారం
ఒక వ్యక్తికి తండ్రి కంటే అన్ని విషయాల్లో మేనమామ ప్రముఖపాత్ర వహిస్తే దాన్ని మాతులాధికారం అంటారు. మాతుల స్థానీయ నివాసం, మేనమామ నుంచి ఆస్తిని పొందడం లాంటివి.

పితృష్యాధికారం
ఒకరి జీవితంలో అతడి తండ్రి సోదరి (మేనత్త) ప్రముఖపాత్ర పోషించడాన్ని పితృష్యాధికారం అంటారు. పితృ స్థానీయ నివాసం, మేనత్త నుంచి ఆస్తి పొందడం లాంటివి.

కుహనా ప్రసూతి
భార్య ప్రసవించేటప్పుడు ఆమె భర్త రోగిలా నటించాలి. ఆమెలా ఆహార నియమాలు, పథ్యం పాటించాలి. ఇది తోడా, ఖాసీ తెగల్లో కనిపిస్తుంది.

సాంకేతిక సంబోధన
బంధువుని పేరుపెట్టి లేదా బంధుత్వంతో పిలుస్తారు. వారికి సంబంధించిన వ్యక్తులను వీరికి బంధుత్వ అనుసంధానం చేసి పిలుస్తారు. ఇది చాలా తక్కువగా కనిపిస్తుంది.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

క్రైస్తవ మతం 

ప్రేమ.. క్షమాపణ.. పశ్చాత్తాపం!


అందరిపట్ల ప్రేమను కలిగి ఉండటం, అపకారం చేసిన వారినీ క్షమించడం, చేసిన పాపాలకు పశ్చాత్తాప పడటం వంటి అంశాలను ప్రధానంగా ప్రబోధించే క్రైస్తవం ప్రపంచంలోనే అతి పెద్ద మతం. అనేక శాఖలుగా విస్తరించి విశ్వానికి శాంతి సందేశాలను అందిస్తోంది.  ప్రత్యేక వివాహ వ్యవస్థను కలిగి ఉంది. స్త్రీలకు పురుషులతో సమానస్థాయిని కల్పిస్తోంది. ఈ మతం ఆవిర్భావం, ప్రధాన బోధనలు, వివాహం తదితర వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 

క్రైస్తవ మతం

 

ప్రపంచ జనాభాలో అధిక శాతం క్రైస్తవులే. దాదాపు అన్ని సమాజాల్లో క్రైస్తవ మతం ఉంది. క్రైస్తవులు ఏసుక్రీస్తును దేవుడిగా విశ్వసిస్తారు.ఆయన బోధనలను ప్రబోధించే దే క్రైస్తవ మతం. ఆ మత గ్రంథం బైబిల్‌. దాన్ని రెండు ప్రధాన భాగాలుగా విభజించారు. క్రీస్తు పుట్టుకకు పూర్వం రాసిన గ్రంథం పాత నిబంధన. దీనిలో సృష్టి ఆరంభం, దేవుడు మానవులను సృష్టించడం లాంటి అంశాలు ఉంటాయి. క్రీస్తు పుట్టుక, ప్రబోధాలు, ఆయన మరణం, పునరుత్థానం (మరణాన్ని జయించి రావడం), క్రైస్తవ మత సిద్ధాంతాలను వివరించేది కొత్త నిబంధన. ‘జెరూసలెమ్‌’ (యెరూషలెం)లోని బెత్లెహేమ్‌ గ్రామంలో ‘యేసేపు’ అనే వ్యక్తికి భార్య అయిన కన్య ‘మరియ’ గర్భాన క్రీస్తు మానవుడిగా జన్మించారు. క్రీస్తు ముప్ఫై మూడున్నరేళ్లు జీవించి, చివరి మూడున్నరేళ్లు బోధనలు చేశారని లేఖనాలు తెలియజేస్తున్నాయి. క్రీస్తు ‘యూదా’ వంశస్థుడు. ఆయన బోధనలు ఆనాటి పాలకులను కలవరపరిచాయి.

* క్రీస్తు తన సేవ కొనసాగించడానికి 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. వారిలో ఒకరైన  ‘యూదా’ 30 వెండి నాణేలకు క్రీస్తును మత పెద్దలకు అమ్మాడు.

* పాలకులు ఏసుక్రీస్తుపై నేరం మోపి శిలువ మరణ దండన విధిస్తారు. మూడు రోజుల తర్వాత ఆదివారం ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారని క్రైస్తవులు నమ్ముతారు. కొద్దిరోజుల తర్వాత తన శిష్యులు మరికొందరు చూస్తుండగా పరలోకానికి వెళ్లినట్లుగా చెబుతారు. పరలోకానికి వెళ్లిన క్రీస్తు మళ్లీ రెండో రాక ద్వారా భూమ్మీదకు వచ్చి అందరికీ శాంతి, సంతోషాలను అందిస్తారని క్రైస్తవులు విశ్వసిస్తారు.

 

10 ఆజ్ఞలు 

1. దేవుడు ఒక్కడే.

2. దేవుడి పేరును వ్యర్థంగా వాడకూడదు.

3. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి 

4. తల్లిదండ్రులను సన్మానించాలి.

5. నరహత్య చేయకూడదు.

6. వ్యభిచారం చేయకూడదు.

7. దొంగతనం చేయకూడదు.

8. ఇతరులపై అబద్ధపు సాక్ష్యం చెప్పకూడదు.

9. పొరుగువాడి ఇల్లు ఆశించకూడదు.

10. పొరుగువాడికి సంబంధించిన దేనినైనా ఆశించకూడదు.

ఈ ఆదేశాలను క్రైస్తవులు తప్పనిసరిగా పాటించాలి. 

నిన్ను నీవు ప్రేమించుకున్న‌ట్లుగా నీ పొరుగువారినీ ప్రేమించాలని, అపకారం చేసిన వారిని క్షమించాలని, శాంతియుతంగా జీవించాలని ఈ మతం ప్రధానంగా బోధిస్తోంది. పాపం చేసినప్పుడు పశ్చాతాపం అవసరమని పేర్కొంటోంది. కపటత్వాన్ని విస్మరించాలని చెబుతోంది. 

 

పండగలు: క్రీస్తు పుట్టినరోజైన డిసెంబరు 25ను క్రిస్మస్‌ పండగగా క్రైస్తవులు నిర్వహిస్తారు. క్రీస్తు మరణించిన రోజును ‘మహా శుక్రవారం’గా ఆచరిస్తారు. ఆయన పునరుత్థానం (మరణాన్ని జయించి రావడం)ను ‘ఈస్టర్‌’ పండగగా జరుపుతారు. కొన్ని శాఖల వారు శనివారాన్ని విశ్రాంతి దినంగా పరిగణిస్తారు. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు. మహాశుక్రవారం పండగ (గుడ్‌ ఫ్రైడే) రోజు ముందు 40 రోజులు ఉపవాసం పాటిస్తారు.

 

రెండు శాఖలు

క్రైస్తవ మతంలో ప్రధానంగా రెండు శాఖలు ఉన్నాయి. 

క్యాథలిక్కులు: ప్రపంచ క్రైస్తవ జనాభాలో వీరు అధిక శాతం ఉన్నారు. ఈ మత శాఖ అధిపతి ‘పోప్‌’ (వాటికన్‌ నగరం).

ఈ శాఖ ప్రబోధాలు, క్రైస్తవ సిద్ధాంతాలు బైబిల్‌ గ్రంథానికి వ్యతిరేకంగా ఉన్నాయని డాక్టర్‌ మార్టిన్‌ లూథర్‌ అనే జర్మనీ దేశస్థుడు భావించాడు. ఆ ప్రబోధాల్లోని తప్పులను బహిరంగం చేశారు. దాంతో క్యాథలిక్‌ శాఖ ఆయనను బహిష్కరించింది. లూథర్‌ను అనుసరించిన వారిని ‘ప్రొటెస్టంట్లు’ అని పిలిచారు. ఆ విధంగా క్రైస్తవ మతంలో రెండో శాఖ ప్రారంభమైంది. తర్వాత కాలంలో అనేక శాఖలు ఏర్పడ్డాయి.

ప్రొటెస్టంట్లు: దీనిలో కొన్ని వందల శాఖలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. క్రీస్తు మరణించిన తర్వాత ఆయన 12 మంది శిష్యుల్లో ఒకరైన ‘తోమాసు’ భారతదేశానికి వచ్చి క్రైస్తవ మతాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చాడు. ఇతడు కేరళ ప్రాంతంలో అగ్ర కులాల వారిని క్రైస్తవులుగా మార్చాడు. దాంతో కొందరు ఇతడిని మద్రాసులో హతమార్చారు. ఆ కాలంలో క్రైస్తవులుగా మారిన వారిని సిరియన్‌ క్రైస్తవులని పిలుస్తారు. వీరు కాకుండా కేరళ రాష్ట్రంలో మారత్‌మా క్రైస్తవ శాఖ, జాకోబైట్ల క్రైస్తవ శాఖ మొదలైనవి ఉన్నాయి.

మత శాఖలు: లూథరన్‌ శాఖ, చర్చ ఆఫ్‌ ది సౌత్‌ ఇండియా, బాప్టిస్టు శాఖ, ఆంగ్లికన్‌ శాఖ, మెథడిస్ట్‌ శాఖ, పెంతెకొస్తు శాఖ, సాల్వేషన్‌ ఆర్జ్మిశాఖ, సెవెన్త్‌ డే ఎడ్వంటిస్ట్‌ శాఖ, విశ్వాసుల శాఖ వంటివి వివిధ దేశాల నుంచి వచ్చాయి. ఇవన్నీ స్వతంత్ర వ్యవస్థలను కలిగి ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి ఐక్య క్రైస్తవ సంఘ శాఖగా స్థాపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

మతం - స్వీకారం 

‘ఈ లోకంలో ఇక నుంచి నేను దేవుడి కోసం బతుకుతాను’ అని తనను తాను దేవుడికి అంకిత చేసుకోవడాన్ని ‘బాప్టిజం’ అంటారు. చర్చిలో పాస్టరు ఈ బాప్టిజం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొన్ని శాఖల్లో చిన్న వయసులోనే దీన్ని జరిపిస్తారు. మరికొన్ని శాఖల్లో యుక్తవయసులో చేపడతారు. బాప్టిజం జరిపించే పద్ధతిలో కూడా శాఖల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి.

నీళ్లు చిలకరించడం: కొన్ని శాఖల్లో ‘తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామాన్ని’ చెబుతూ బాప్టిజం తీసుకునే వ్యక్తి తలపై ఫాదర్‌ మూడు సార్లు నీళ్లు చిలకరిస్తారు.

నీటిలో ముంచడం: ‘తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామాన్ని’ చెబుతూ బాప్టిజం తీసుకునే వ్యక్తి తలను మూడుసార్లు నీటిలో ముంచి లేపుతారు.

జెండా కింద నడవడం: ‘తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం’ ఆవిష్కరించిన జెండా కింద నడిచి వెళ్లడం ద్వారా ఈ కార్యక్రమం ముగుస్తుంది. 

 

వివాహ వ్యవస్థ: క్రైస్తవ సామాజిక వ్యవస్థలో, మతంలో వివాహానికి ప్రత్యేకస్థానం ఉంది. దాని గురించి ‘బైబిల్‌’లో ప్రస్తావన ఉంది. క్రీస్తు స్వయంగా ‘కానా’ అనే గ్రామంలో వివాహానికి హాజరైనట్లుగా బైబిల్‌ చెబుతోంది. 

వివాహ నిబంధనలు: * ఇద్దరూ క్రైస్తవ మతస్థులై ఉండాలి. నిర్ణయించిన వయసు కలిగి ఉండాలి.  

*మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. 

* ఇరువురు వివాహితులై ఉండకూడదు. లేదా విడాకులు పొంది ఉండాలి.

* సంఘ గురువుల నుంచి ధ్రువపత్రాన్ని తీసుకుని ఇతర సంఘ గురువులకు ఇవ్వాలి. 

* భారత క్రైస్తవ వివాహ చట్టం - 1872 ఈ కింది నిబంధనలను తెలియజేస్తోంది.

- వివాహం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటలలోపు జరగాలి.

- విధిగా చర్చిలోనే జరగాలి. 

- వివాహం జరిపించే మతగురువుకు వివాహ లైసెన్స్‌ ఉండాలి.

 

హిందూ సంస్కృతి ప్రభావం: భారత క్రైస్తవులపై హిందూ సంస్కృతి ప్రభావం ప్రతి అంశంలోనూ కనిపిస్తుంది. క్రైస్తవ వివాహంలో వాడే తాళిబొట్టు, పసుపు బియ్యం, వరకట్నం లాంటివి పాశ్చాత్య క్రైస్తవ వివాహ వ్యవస్థలో లేవు. కానీ భారత క్రైస్తవులు ఇక్కడి సంస్కృతి ప్రభావంతో ఆ సంప్రదాయాలను ఆచరిస్తున్నారు. 

విడాకులు: బైబిల్‌ ప్రకారం విడాకులు తీసుకోవడం పాపం.భారత విడాకుల చట్టం 1896 ప్రకారం కింది పరిస్థితుల్లో విడాకులు మంజూరు చేస్తారు. అలాగే కింది పరిస్థితుల్లో భర్త నుంచి క్రైస్తవ స్త్రీ విడాకులు పొందవచ్చు.

* భర్త క్రైస్తవ మతాన్ని విడిచి వేరే మతాన్ని స్వీకరించినప్పుడు. 

* భర్త వదిలేసినప్పుడు.

* భర్త వివాహేతర సంబంధం కలిగి ఉన్నప్పుడు.

* వేరే స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు.

* భార్యతో బలవంతంగా లైంగిక సంభోగం జరిపినప్పుడు.

* భర్త రెండు సంవత్సరాలు కనిపించకుండా పోయినప్పుడు.

* క్రూరత్వం కలిగి ఉన్నప్పుడు

క్రైస్తవ వివాహచట్టం - 1872 ప్రకారం భార్య నుంచి పురుషుడు విడాకులు పొందవచ్చు. ఈ వివాహ వ్యవస్థలో బాల్యవివాహాలు జరిగినట్లుగా ఆధారాలు లేవు. వితంతువులు పునర్వివాహాలు చేసుకోవచ్చు.

 

క్రైస్తవ స్త్రీ అంతస్థు: బైబిల్‌ ప్రకారం స్త్రీ, పురుషులు సమానం. వితంతు పునర్వివాహాలు, విడాకుల హక్కును క్రైస్తవ స్త్రీలు కలిగి ఉంటారు.  వీరు అన్ని రంగాల్లో పురుషులతోపాటు సమానంగా పాల్గొనవచ్చు.

 

ముఖ్యాంశాలు: * క్యాథలిక్కుల క్రైస్తవ మత వ్యాప్తికి ప్రధాన కేంద్రం రోమన్‌ చర్చి.

* 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో క్రైస్తవులు 2.3 శాతం (2.78 కోట్లు) 

* భారత్‌లో 3వ పెద్ద మతం క్రైస్తవం.

* క్యాథలిక్‌ విధానాలకు వ్యతిరేకంగా ఏర్పడిన మత శాఖ ప్రొటెస్టంట్లు.

* రోమన్‌ క్యాథలిక్‌ శాఖ 16వ శతాబ్దంలో పోర్చుగీసు, ఇటలీ దేశాల నుంచి మనదేశంలోకి ప్రవేశించింది.

* భారత్‌లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది ప్రొటెస్టంట్‌ సంఘాలు

* పాప పరిహార పత్రాల పేరు ఇండల్జన్‌.

సంఘాలు: * చర్చ్‌ ఆఫ్‌ నార్త్‌ ఇండియా * చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా * ప్రెస్బిటేరియన్‌ చర్చ్‌ ఇండియా

దర్శనీయ స్థలాలు
                                       

చర్చి పేరు ప్రదేశం
మెదక్‌ చర్చి తెలంగాణ
సీకేథడ్రల్‌ గోవా
మళమత్తుర్‌ కేరళ
వేలంకని చర్చి తమిళనాడు
వల్లార్‌ పదమ్‌ కొచ్చిన్‌ (కేరళ)
సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కొచ్చిన్‌(కేరళ)
పెరుమల తిరుమేని మన్నార్, కేరళ
బాసిలికా ఆఫ్‌ బామ్‌ జీసస్‌ గోవా

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌ రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣ తెలంగాణ సామాజిక పరిస్థితులు

‣  భారతీయ సమాజం

‣ బంధుత్వం - అనుబంధం

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 02-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

తెలంగాణ సామాజిక పరిస్థితులు

వెట్టిచాకిరి... వలసల తాకిడి!

  తెలంగాణ సమాజం చాలా ప్రత్యేకతలను సంతరించుకుంది. అందుకు పలు చారిత్రక, భౌగోళిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ‘సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజావిధానాలు/పథకాలు’ అధ్యయనంలో భాగంగా ఆ వైవిధ్యాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా వెట్టిచాకిరి, బాలకార్మికులు, జోగిని వ్యవస్థ వంటివి  ప్రబలటానికి దోహదపడిన పరిస్థితులను, వాటి నిర్మూలనకు జరిగిన పోరాటాలను, ఇతర ప్రయత్నాలను అర్థం  చేసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలపైనా అవగాహన పెంచుకోవాలి.    

  శతాబ్దాలుగా తెలంగాణలో నెలకొన్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని రకాల సమస్యలు తల్తెత్తాయి. భౌగోళికంగా ఈ ప్రాంతం దక్కన్‌ పీఠభూమిలో ఉంది. దాదాపు రెండు వందల సంవత్సరాలకుపైగా నిజాంల పాలన సాగింది. ముస్లిం మత ప్రభావం కూడా ఈ సమాజంపై ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో ఇతర ప్రాంతాల కంటే  భిన్నమైన పరిస్థితులు ఏర్పడి ప్రజాజీవనాన్ని ప్రభావితం చేశాయి. తెలంగాణ సామాజిక నిర్మాణంలో  భూస్వామ్య లేదా ఉన్నత కులాల ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తుంది. వీరు తక్కువ లేదా నిమ్న కులాల వారిని రకరకాల పనుల కోసం వినియోగించేవారు.  వివిధ వృత్తులు చేసేవారిని తమ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకునేవారు. ప్రతిఫలంగా తోచింది ఇచ్చేవారు. శ్రమకు తగిన ఫలితం నిమ్నకులాల వారికి అందేది కాదు. నిర్ణీత మొత్తాన్ని వాళ్లకు చెల్లించాలనే సంప్రదాయం కూడా ఉండేది కాదు. చాలావరకు ఉచితంగా పనులు చేయించుకునేవారు. ఆ వెట్టిచాకిరి, శ్రమదోపిడి తదనంతర కాలంలో సాయుధ రైతుల పోరాటం తీవ్రంగా జరగడానికి ప్రాతిపదికలుగా మారాయి.

  తెలంగాణలో మరో ముఖ్యమైన సమస్య బాలకార్మిక వ్యవస్థ. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ వ్యవస్థ ఉన్నప్పటికీ తెలంగాణలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ జీవనం ప్రధానంగా భూమి ఆధారంగా సాగుతుంది. ఆ భూములన్నీ ప్రాబల్య కులాల చేతుల్లో ఉన్నాయి. వాటిలో నిమ్న కులాలకు చెందిన వారంతా కూలీలుగా పని చేస్తున్నారు. దీంతో అత్యంత పేదరిక పరిస్థితుల్లో జీవనం సాగుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కూలీల కుటుంబాల్లోని పిల్లలూ పనికి వెళుతున్నారు. ఫలితంగా బాలకార్మిక వ్యవస్థ పెరిగిపోయింది. 

  ఆడవారిని పరోక్షంగా వ్యభిచార వృత్తిలోకి దించే సంప్రదాయం ఒకటి ఉంది. దాన్నే తెలంగాణలో జోగిని లేదా దేవదాసి వ్యవస్థ అంటారు. ఆంధ్రప్రాంతంలోనూ ఈ దేవదాసి విధానం ఉంది. నిజానికి మహిళలు తమను తాము దేవుడికి సమర్పించుకోవడం జోగిని వ్యవస్థ. అంటే దేవాలయాలకు తమను అర్పించుకోవడం అని చెప్పుకోవచ్చు. కానీ దేవుడి సేవలకు బదులుగా వారిని వ్యభిచారంలోకి దించేవారు. దీని వల్ల చాలా రకాల సామాజిక సమస్యలు తలెత్తాయి. 

 

ఒక్కో రీతిలో... ఒక్కో చోటికి!

  తెలంగాణ సమాజంలో ప్రముఖంగా కనిపించే మరో సమస్య వలసలు. దేశంలోని చాలా ప్రాంతాల్లో రకరకాల పనుల్లో ఇక్కడి ప్రజలు కనిపిస్తుంటారు. పాత కరీంనగర్, నల్గొండ జిల్లాల్లోని చేనేత వృత్తులవారు దేశంలోని పలు ప్రాంతాలకు వలసలు వెళ్లారు. మన మహబూబ్‌నగర్‌ శ్రామికులు కట్టిన ఇళ్లు, రోడ్లు, ఇంకా ఇతర నిర్మాణాలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. మెదక్‌ నుంచి వలసలు వెళ్లేవారిలో వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉన్నారు. ఈ విధంగా ఒక్కో జిల్లా నుంచి ఒక్కోరకంగా ఈ ప్రాంత ప్రజలు వలస వెళ్లారు. వ్యవస్థీకృతమైన సాగునీటి వ్యవస్థ దీనికి ఒక ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు.పంటలన్నీ వర్షాధారం లేదంటే భూగర్భజలాలతో సాగవుతాయి. దీంతో ఎక్కువమంది నష్టాలకు గురవుతున్నారు. ఆర్థిక సమస్యలు పెరిగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చేనేత కార్మికులు సాంస్కృతికంగా చాలావరకు తమ వృత్తులకే అలవాటు పడిపోయారు. వీరు వేరే పనులు చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. దీని వల్ల కూడా ఆర్థిక సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకునేవారిలో ఎక్కువగా రైతులు, చేనేత కార్మికులే ఉంటున్నారు. ఈ విధంగా తెలంగాణ సమాజం భౌగోళిక, చారిత్రక, రాజకీయ పరిస్థితులతో ప్రభావితమై అనేక సమస్యలతో సతమతమవుతోంది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది.  

Posted Date : 14-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వర్ణం - కులం

కులం... సజాతి సమూహం!

 కులం అసమానతలకు బలమైన సామాజిక మంత్రం. ఆధునిక యుగంలోనూ అది కొనసాగుతూనే ఉంది. ఎన్నోరకాల ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరిణామాలకు, పరిస్థితులకు ప్రాతిపదికగా మారింది. అసలు ఈ కులం అంటే ఏమిటి? ఎలా రూపుదిద్దుకుంది? దీని వెనుక ఉన్న సిద్ధాంతాలు, భావనలు, నిర్వచనాలు, ప్రభావాలు ఏవిధంగా ఉన్నాయి? ఈ అంశాలపై అభ్యర్థులు కనీస అవగాహన పెంపొందించుకోవాలి. 

కులం భారతీయ సామాజిక స్తరీకరణలో అత్యంత కీలకమైన పాత్ర నిర్వహిస్తుంది. భారతీయుల సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితంలో మౌలికమైన పాత్రను పోషిస్తుంది. భారతీయ సమాజంపై కుల వ్యవస్థ ప్రభావాన్ని చూపుతుంది.
వర్ణం - భావన: సాధారణ వాడుకలో వర్ణ అంటే హిందూ సమాజంలోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర విభాగాలు. పి.ఎన్‌.ప్రభు అనే సామాజికవేత్త వర్ణం అనే పదాన్ని ఉపయోగించే వారికి దాని గురించి సంపూర్ణ జ్ఞానం లేదని పేర్కొన్నారు. ఆర్యులు, దస్యులకు శరీర ఛాయల్లో ఉండే భేదాల కారణంగా రెండు వర్ణాలు ఏర్పడ్డాయని ఆయన వివరించారు. వర్ణం అంటే రంగు అని అర్థం. హిందూ సమాజంలో ఈ అర్థంతోనే వర్ణ విభజన జరిగినట్లు తెలుస్తుంది. కొంతకాలం తర్వాత ‘శతపథ బ్రాహ్మణం’లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల గురించి చర్చించారు. ఈ నాలుగు రకాల వర్ణ విభజనకు కూడా శరీర ఛాయ కారణమని భావిస్తున్నారు. 
* తెలుపు రంగు శరీర ఛాయ - బ్రాహ్మణులు  
* ఎరుపు రంగు శరీర ఛాయ - క్షత్రియులు 
* పసుపు రంగు శరీర ఛాయ - వైశ్యులు  
* నలుపు రంగు శరీర ఛాయ - శూద్రులు  
కాలక్రమేణా మనుషుల విభజన శరీర ఛాయను బట్టి కాదని, పుట్టుకతో ప్రతి వ్యక్తి శూద్రుడని, అతడు సముపార్జించుకునే గుణాల ఆధారంగా ఆ వ్యక్తి ఈ నాలుగు వర్ణాల్లో ఏదో ఒకదానికి చెందుతాడని హిందూ శాస్త్రకారులు వివరించారు. 
భగవద్గీతలో సత్యగుణాలు కలవారు బ్రాహ్మణులు, సత్య - రజోగుణాలు ఉన్నవారు క్షత్రియులు, రజో - తామస గుణాలు కలవారు వైశ్యులు, తామస గుణాలు కలవారు శూద్రులని పేర్కొన్నారు. ఈ వివరాల ప్రకారం వర్ణం అనేది వ్యక్తి సాధించుకునే స్వేచ్ఛా వ్యవస్థ అని అర్థం అవుతుంది. కానీ మనుధర్మశాస్త్రంలో ఈ నాలుగు వర్ణాలు బ్రహ్మ అంగాల నుంచి ఉద్భవించాయని వివరిస్తూ వర్ణం పుట్టుక వల్ల వచ్చేదని సమర్థించారు.  
బ్రాహ్మణులు - బ్రహ్మ తల నుంచి జన్మిస్తారు. వీరికి 8 లేదా 12 ఏళ్ల వయసులో ఉపనయనం నిర్వహిస్తారు.  
క్షత్రియులు - బ్రహ్మ భుజాల నుంచి జన్మిస్తారు. వీరికి 10 లేదా 14 ఏళ్ల వయసులో ఉపనయనం చేస్తారు. 
వైశ్యులు - బ్రహ్మ తొడ భాగం నుంచి జన్మిస్తారు. వీరికి 12 లేదా 16 ఏళ్ల వయసులో ఉపనయనం నిర్వహిస్తారు. 
శూద్రులు - బ్రహ్మ పాదం నుంచి జన్మిస్తారు. వీరికి ఎలాంటి ఉపనయనం ఉండదు. 
(చాతుర్‌ వర్ణ వ్యవస్థను పురుషసూక్త శ్లోకంలో పైవిధంగా చెప్పారు)

సిద్ధాంతాలు  

వర్ణం లేదా కుల వ్యవస్థ పుట్టు పూర్వోత్తరాల గురించి తెలిపే వివిధ సిద్ధాంతాలు   
దైవదత్త సిద్ధాంతం: పురుషసూక్తం, భగవద్గీత లాంటి హిందూ మత గ్రంథాల ఆధారంగా చాతుర్‌ వర్ణాలు, వాటికి అనుగుణమైన కుల వ్యవస్థ భగవత్‌ నిర్మితాలని దైవదత్త సిద్ధాంతం తెలియజేస్తుంది. ఈ సిద్ధాంతం ఏర్పడటానికి ప్రధాన కారణం వేదాలు.
వృత్తి సిద్ధాంతం: దీన్ని నెస్‌ఫీల్డ్‌ ప్రతిపాదించగా ఇబ్బెస్టన్‌ బలపరిచారు. ప్రజలు ఆచరించే వృత్తులు కులానికి మూలం అని, జాతి, మతం కారణం కాదని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. వృత్తి సంఘాలు కుల వ్యవస్థ నిర్మాణానికి దారితీశాయని పేర్కొంటుంది. 
జాతి సిద్ధాతం: దీన్ని ప్రతిపాదించినవారు హెర్బర్ట్‌ రిస్లీ. వ్యక్తుల శారీరక లక్షణాలు పొట్టి, పొడవు, శరీర ఛాయ, ముక్కు ఆకారం, కళ్లు  లాంటి వాటిపై ఆధారపడి సమాజంలోని వ్యక్తులు వివిధ సమూహాలుగా ఏర్పడ్డారు. ఆ సమూహాలే కాలక్రమేణా కులాలుగా రూపొందాయని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది.  
సంస్కార సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు ఎ.ఎం.హోకర్ట్, సెనార్ట్‌. భారతదేశం మత సంస్కారాలకు కేంద్రం. మంత్రాలు చదవడం, ప్రదేశాన్ని శుభ్రం చేయడం, అలంకరించడం, మేళతాళాలు లాంటి వాటి ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి. 
భౌగోళిక సిద్ధాంతం: దీన్ని గిల్బర్ట్‌ ప్రతిపాదించారు. దేశ భౌగోళిక అంశాలైన శీతోష్ణస్థితి, సముద్ర తీర ప్రాంతాలు, నదీ మైదానాలు, పర్వత ప్రాంతాలు, మెట్ట ప్రాంతాల్లో ప్రజలు సమూహాలుగా ఏర్పడి వివిధ వృత్తులను అవలంబిస్తారు.  
జాతి - వృత్తి సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు పి.ఎఫ్‌.స్లేటర్‌. ఈయన ప్రకారం దక్షిణ భారతదేశంలో కుల వ్యవస్థ ఉత్తర భారతదేశంలో కంటే బలంగా ఉంది. కాబట్టి ఆర్యులు రాకముందే భారత్‌లో కుల వ్యవస్థ వృత్తుల విభజనకు దారితీసింది. 
మను సిద్ధాంతం: దీన్ని ప్రతిపాదించినవారు హటన్‌. మానవాతీత శక్తులపై నమ్మకం వల్ల కుల వ్యవస్థ ఏర్పడిందని ఇతడి అభిప్రాయం. 

ప్రస్తుత భారతదేశంలో కుల వ్యవస్థ 

స్వాతంత్య్రానంతరం భారతీయ సామాజిక వ్యవస్థలో వివిధ కారణాల వల్ల అనేక పరివర్తనలు వచ్చాయి. అందులో భాగంగా కుల వ్యవస్థలో మార్పులు  రావడానికి కింది పరిస్థితులు దోహదం చేశాయి. 
* సాంఘిక సంస్కర్తల కృషి ఫలితంగా భారత ప్రభుత్వం అస్పృశ్యత నివారణ చట్టాన్ని చేసింది. పర్యవసానంగా భారతీయ సమాజంలో అంటరానితనం కాలక్రమేణా తగ్గుతూ వచ్చింది. విద్యాభివృద్ధి కారణంగా ఈ విషయంలో ప్రజల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. 
* ఆధునిక విద్యా విధానం కూడా కుల వ్యవస్థను సమర్థించడం లేదు.
* పారిశ్రామికీకరణ వల్ల అనేక కొత్త వృత్తులు ఉద్భవించాయి. నగరీకరణ వల్ల బస్సులు, హోటళ్లు, ఆఫీసుల్లో కుల నిబంధనలు పాటించడానికి వీలు కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. 
* కొత్త చట్టాలు కూడా కుల వ్యవస్థ లక్షణాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. 
ఉదా:  ప్రత్యేక వివాహ చట్టం కులాంతర వివాహాలను న్యాయబద్ధంగా సమర్థించింది. 
* కులాన్ని హిందూ మత ఉక్కు కవచం అని ఎ.ఆర్‌.దేశాయ్‌ అనే సామాజికవేత్త పేర్కొన్నారు. 
* జి.ఎస్‌.షుర్యే కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహిస్తే కులాన్ని నిర్మూలించవచ్చు అని పేర్కొన్నారు. 
* ఈనాటికి కూడా హరిజనులు గ్రామాల్లో సమాన హోదా పొందడం లేదు. 

కులం - భావన 

కులం (caste) అనే పదం స్పానిష్‌ భాషలోని కాస్టా (casta) అనే పదం నుంచి వచ్చింది. కాస్టా అంటే జాతి, వ్యవస్థ, వారసత్వ లక్షణాల సముదాయం అని అర్థం. కులం అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించినవారు పోర్చుగీసుకు చెందిన గ్యార్సియా డీ ఓర్టా (1563). భారత్‌లో కులం అనే పదాన్ని పోర్చుగీసువారు ఉపయోగించారు. Caste అనే పదం కాస్టస్‌ (castus) అనే లాటిన్‌ భాషా పదం నుంచి ఏర్పడి ఉండవచ్చని కొందరు సామాజికవేత్తల అభిప్రాయం. కాస్టస్‌ అంటే పరిశుద్ధం అని అర్థం.

లక్షణాలు  

* పుట్టుక కులాన్ని నిర్ణయిస్తుంది - వ్యక్తి అంతస్తు, వృత్తి, విద్య, ఆస్తి లాంటి వాటిలో అనేక మార్పులు వచ్చినప్పటికీ ఆ వ్యక్తి కులం, అంతస్తు మాత్రం మారవు. 
* కులం అంతర్వివాహ సమూహం - ఏ కులానికి చెందిన వ్యక్తి ఆ కులానికి చెందిన వారిని మాత్రమే వివాహం చేసుకోవాలి. కులానికి అతి ముఖ్యమైన లక్షణం ఇదే అని వెస్టర్‌ మార్క్‌ అభిప్రాయపడ్డారు. 
* కుల వృత్తిని పాటించడం - సర్వసాధారణంగా ప్రతి కులానికి ఏదో ఒక వృత్తి కేటాంయింపు ఉంటుంది. కుటుంబంలో చిన్నతనం నుంచే ఆ వృత్తికి సంబంధించిన శిక్షణ ఇస్తారు. 
* ఆహారపు అలవాట్లకు సంబంధించిన నిబంధనలు - కొన్ని ఆహార పదార్థాలు కొన్ని కులాల వారు తీసుకోకూడదని నిబంధనలు ఉన్నాయి. అంతేకాకుండా తన కులస్థులతో మాత్రమే సహపంక్తి భోజనం చేయాలి. వండిన ఆహార పదార్థాలను తన కంటే తక్కువ కులస్థుల వారి నుంచి స్వీకరించకూడదు.
* కుల పంచాయితీలు - కుల సంబంధమైన నిబంధనలు పరిశీలించడానికి, కులస్థుల మధ్య తగాదాలు తీర్చడానికి, వారి అవసరాలను పరిరక్షించడానికి కుల పంచాయితీలు సహాయం చేస్తాయి. 
* సామాజిక సంబంధాల విషయంలో నిషేధం - కులాల మధ్య సంబంధాలను కఠినతరం చేశారు. ముఖ్యంగా కొన్ని కులాల వారిని అంటరానివారిగా భావిస్తారు.  

నిర్వచనాలు 

* ఒకే వారసత్వ వృత్తిని పాటించే, అంతర్‌ వివాహం మాత్రమే చేసుకునే, ఒకే పేరుతో చెలామణి అయ్యే కొన్ని కుటుంబాలు లేదా బంధు సమూహాల సమూహమే కులం అని హెచ్‌.హెచ్‌.రిస్లే పేర్కొన్నారు. 
* వారసత్వ లక్షణాల సముదాయమే కులం అని సి.హెచ్‌.కూలే పేర్కొన్నారు. 
* వారసత్వం, వివాహం, సంప్రదాయ వృత్తి సంబంధాలను కలిగి ఉండి స్థానిక సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన అంతస్తును కలిగి ఉండే అంశమే కులం అని ఎమ్‌.ఎన్‌.శ్రీనివాసన్‌ తెలిపారు. 
* కులం ఒక బంధిత సమూహం అని డి.ఎన్‌.మజుందార్, టి.ఎన్‌.మదన్‌లు పేర్కొన్నారు.  
* కులాలు నిర్మితులు అని ఎఫ్‌.జి.బెయిరీ, ఎమ్‌.ఎన్‌.శ్రీనివాసన్‌ తెలిపారు. 
* కులం భారత్‌కే పరిమితమైన విశిష్ట అంశం అని హట్టన్‌ నిర్వచించారు.  
* కులం భారత్‌కు మాత్రమే పరిమితం కాదని క్రోబర్, రిస్లీ పేర్కొన్నారు. ప్రాచీనకాలంలో ఈజిప్ట్, మధ్యయుగంలో యూరప్, ప్రస్తుతం యునైటైడ్‌ స్టేట్స్‌లో కూడా కులం అనే భావన కనిపిస్తుంది.  
* కులం అనేది ఒక సజాతి సమూహం అని బ్లంట్‌ అన్నారు.
* కాథలిన్‌ గఫ్‌ కులాలు జన్మ ద్వారా ఏర్పడిన సమూహాలని తెలిపారు.
* వంశపారంపర్యంగా వచ్చేదే కులం అని భోగ్‌ పేర్కొన్నారు. 

తిరుగుబాట్లు

*డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కుల నిర్మూలన కోసం ఎన్నో పోరాటాలు చేశారు.  
* రాజస్థాన్‌లోని గుజ్జర్లు తమను ఎస్టీలో చేర్చాలని, ఆంధ్రప్రదేశ్‌లోని కాపులు తమను ఓబీసీలో చేర్చాలని, తెలంగాణలోని వాల్మీకులు/బోయ వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని ఉద్యమిస్తున్నారు.  
* యునిసెఫ్‌ ప్రకారం కుల వివక్ష ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ వివక్ష ఆసియా (భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, జపాన్‌), ఆఫ్రికా ఖండాల్లో ప్రబలింది. 
* ఆచార్య ఎమ్‌.ఎన్‌.శ్రీనివాసన్‌ పంచవర్ష ప్రణాళికలు, ఓటుహక్కు, ఉచిత విద్య, వెనుకబడిన వర్గాల కోసం సంక్షేమ కార్యక్రమాలు లాంటివి కులాన్ని నిర్మూలించడంలో తోడ్పడతాయని తెలిపారు. 

కులం - ప్రకార్యాలు 

వృత్తిని నిర్ణయిస్తుంది: హిందూ కుల వ్యవస్థలో ఒక్కో కులంలో పుట్టిన వారికి ఒక్కో వృత్తిని నిర్ణయించడం వల్ల ఆ వ్యక్తులు చిన్నతనం  నుంచి తమ కులవృత్తిలో నిమగ్నమై, నైపుణ్యాన్ని పెంపొందించుకుంటున్నారు.  
సాంఘిక భద్రత - నియంత్రణ: ఏ కుల సభ్యుడికైనా అన్యాయం జరిగితే నిస్సహాయుడైన అతడిని ఆ కులంలోని వారంతా ఆదరించి  భద్రత కల్పిస్తారు.  
శ్రమ విభజన: వివిధ కులాలకు రకరకాల వృత్తులను కేటాయించడం ద్వారా కుల వ్యవస్థ శ్రమ విభజన యంత్రంగా పనిచేస్తుంది. కుల విధుల నిర్వహణలో ఒక కులం వారు మరొక కులంతో సన్నిహిత సామరస్య భావాలతో పరస్పరం సహకరించుకునేవారు. 
మత పరిరక్షణ: కుల వ్యవస్థ అనేది హిందూ మతానికి మూలస్తంభం.
సంస్కృతి పరిరక్షణ: ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు, విలువలు, నమ్మకాలు ఉండటం వల్ల ప్రతి కులం ఒక ప్రత్యేక సాంస్కృతిక వర్గంగా రూపొంది సంస్కృతిని స్థిరంగా ఉంచే విధిని నిర్వహిస్తుంది. 

ప్రాబల్య కులం   

ప్రాబల్య కులం అనే భావన ఎమ్‌.ఎన్‌.శ్రీనివాస్‌ వివరించిన సంస్కృతీకరణ ప్రక్రియలో ఎక్కువగా ప్రాముఖ్యతను పొందింది. ఈయన ‘ది డామినెంట్‌ క్యాస్ట్‌ ఇన్‌ రాంపుర’ అనే పుస్తకంలో ప్రాబల్య కుల లక్షణాలను పేర్కొన్నారు. అవి 
* ఒకే కులానికి చెందినవారు. 
* అధిక సంఖ్యాకులుగా ఉండటం. 
* స్థానిక కుల క్రమశ్రేణిలో ఉన్నత స్థానాన్ని కలిగి ఉండటం.
* పాశ్చాత్య విద్యను కలిగి ఉండటం.
* పరిపాలనా రంగంలో ఉద్యోగాలు చేస్తుండటం.

రచయిత: వట్టిపల్లి శంకర్‌ రెడ్డి

Posted Date : 27-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కుటుంబం రకాలు

ధ్యాంతి పుట్టిల్లు... ర్యాంతి మెట్టినిల్లు!

  కుటుంబాలు, అందులోని బంధాలు, మూలపురుషులు, వంశ క్రమాలు రకరకాలుగా ఉన్నాయి. వాటిలోని సభ్యులు భిన్నమైన సామాజిక విధులు, బాధ్యతలు నిర్వహిస్తుంటారు. పరిమిత సభ్యుల కనిష్ఠ కుటుంబాల నుంచి తరతరాలూ కలిసి ఉండే విస్తృత కుటుంబాల వరకు ఉన్న లక్షణాలను, వైవిధ్యాలను అభ్యర్థులు పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 

 

  మనిషి సామాజిక జీవనానికి కుటుంబమే మూలం. పుట్టుకతో, పెళ్లితో ఆ బంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో భాగమైన వ్యక్తి రకరకాల విధులు నిర్వహిస్తారు. అందులో దైహిక, సామాజిక, ఆర్థిక, లైంగిక, విద్య, సాంస్కృతిక సంబంధమైనవి ఎన్నో ఉంటాయి. ఈ నేపథ్యంలో కుటుంబానికి కొన్ని నిర్వచనాలతోపాటు, లక్షణాలను కూడా శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. వాటిపై అవగాహన పెంచుకున్న తర్వాత కుటుంబంలోని రకాలు, జీవన విధానాలు, మరికొన్ని సిద్ధాంతాలను అధ్యయనం చేయాలి. 

 

ప్రాథమిక కుటుంబం (వ్యష్ఠి/కనిష్ఠ కుటుంబం): దంపతులు, వారి బిడ్డల వల్ల ఏర్పడిన సామాజిక సమూహం. ఈ కుటుంబంలో పెరిగే పిల్లలు వారి సమాజ ఆచారాలు, కట్టుబాట్లను ప్రథమంగా తెలుసుకుంటారు. 

 

సమ్మిశ్ర కుటుంబం (Composite family): సంతానానికి వివాహం అయితే కుటుంబం ప్రాథమిక గుణాన్ని కోల్పోయి సమ్మిశ్ర కుటుంబంగా మారుతుంది. వివాహం తర్వాత పుట్టింట్లో కూతుర్లు ఉండాలా, కుమారులు ఉండాలా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఎప్పుడూ అధికంగా ఉంటుంది.

 

విస్తృత కుటుంబం: నివాస స్థల విధానాన్ని అనుసరించి విస్తృత కుటుంబంలోని పలు రకాలు ఉంటాయి.

 

నివాస స్థల సూత్రం (Rule Of Residence)

విస్తృత కుటుంబ స్వరూపం (The Farm of extended family)

1. పతి స్థానిక నివాసం (Patrilocal Residence)

1. పతి స్థానిక విస్తృత కుటుంబం (Patrilocal extended family)

2. పత్నిస్థానిక నివాసం (Matrilocal Residence) 2. పత్నిస్థానిక విస్తృత కుటుంబం (Matrilocal extended family)
3. ద్విస్థానిక నివాసం (Bilocal Residence) 3. స్థానిక విస్తృత కుటుంబం (Bilocal extended family)
4. మాతుల స్థానిక నివాసం (Avunculocal Residence) 4. మాతుల స్థానిక విస్తృత కుటుంబం (Avunculocal extended family)

* విస్తృత కుటుంబంలో రెండు లేదా మూడు లేదా అంతకంటే ఎక్కువ తరాలవారు ఉంటారు.

 

పతి స్థానిక విస్తృత కుటుంబం: ఒకరు లేదా ఇద్దరు సోదరులు, వారి భార్యలు, వారి అవివాహితులైన కొడుకులు, కూతుళ్లు, వివాహితులైన కొడుకులు, వారి భార్యలు, కొడుకుల సంతానం ఉంటారు. ఈ రకమైన కుటుంబానికి తండి లేదా తండ్రి అన్న కుటుంబానికి పెద్దగా ఉంటారు. సమష్టి సంపాదనను కుటుంబం కోసం ఖర్చు చేస్తారు. 

 

పత్ని స్థానిక విస్తృత కుటుంబం: ఒకరు లేదా ఇద్దరు అక్కాచెల్లెలు ఉంటారు. అవివాహితులైన, వివాహితులైన ఆడబిడ్డలు, వారి బిడ్డల బిడ్డలు ఉంటారు. ఈ కుటుంబంలో స్త్రీలలో జేష్ఠురాలిదే అధికారం. 

 

ద్విస్థానిక విస్తృత కుటుంబం: దంపతులు, వారి కుమారుల్లో కొంతమంది, కూతుళ్లలో కొంతమంది, వారి మనుమలలో కొంతమంది, మనుమరాలు సభ్యులుగా ఉంటారు. ఈ రకమైన కుటుంబాలు చాలా అరుదుగా ఉంటాయి. 250 సమాజాల్లో కేవలం 10 సమాజాల్లోనే ఇలాంటి కుటుంబాలున్నాయని జార్జ్‌పీటర్‌ ముర్డాక్‌ తెలిపారు.

 

మాతుల స్థానిక విస్తృత కుటుంబం: ఈ కుటుంబంలో దంపతులు, వారి సంతానంతో పాటు అతడి అక్క, చెల్లెళ్ల కొడుకుల్లో చాలామంది అతడి కూతురిని వివాహం చేసుకొని వారి సోదరి కొడుకుతో కలిసి ఒకే నివాసంలో ఉంటారు. 

 

బహుభార్యత్వ కుటుంబం: 

చుక్చీ, కిప్సీజీ, లఖోర్, లసు (మాతుల ప్రకారం తమ భర్తలతో కాపురం చేస్తారు), మర్న్‌గిన్, బైగా, మరియ, తనాల వంటి గిరిజన తెగల్లో కనిపిస్తుంది.  

1) లైంగిక సంబంధాల వల్ల ఒకరి భార్యలంతా సమానమైన హక్కులతో ఉంటారు. 

2) ప్రతి భార్యకు ప్రత్యేక నివాస స్థలం/ అందరూ ఒకే గృహంలో కాపురం చేయవచ్చు. 

3) పెద్ద భార్యకు ప్రత్యేక అధికారం, హక్కులు ఉండొచ్చు. 

 

బహుభర్తృత్వ కుటుంబం: ఖాసా, తోడాలు, తియ్యాన్‌ అనే గిరిజన తెగల్లో ఇది కనిపిస్తుంది. 

 

కేంద్రక కుటుంబం (Nuclear Family): ఇందులో భార్య, భర్త, అవివాహిత పిల్లలు ఉంటారు.

 

ప్రకార్య ఉమ్మడి కుటుంబం (Functional Joint Family): రక్త సంబంధం ఉన్న రెండు కుటుంబాలు, విడివిడిగా ఉన్నప్పటికీ ఒకే ఉమ్మడి అధికారం కింద కార్యకలాపాలు సాగిస్తారు. 

 

ప్రకార్య, గణనీయ ఉమ్మడి కుటుంబం (Functional & Substantial Family): ఆస్తి విషయంలో ఉమ్మడిగా కార్యకలాపాలు సాగించడం దీని ప్రధాన లక్షణం.

 

ఉపాంత ఉమ్మడి కుటుంబం: రెండు తరాల కుటుంబ సభ్యులు కలిసి ఉంటారు. 

 

సంప్రదాయ ఉమ్మడి కుటుంబం: రెండు లేదా మూడు తరాలవారు కలిసి ఉండటం దీని ప్రత్యేకత.

 

వంశానుక్రమం

 

పితృ వంశీయ కుటుంబం: తండ్రిని మూలజనకుడిగా పరిగణించి తన సంతానానికి తండ్రి బంధువులతో పొత్తు పెట్టుకొని తండ్రి వంశకర్తగా ఉంటారు. 

 

మాతృ వంశీయ కుటుంబం: తల్లి వంశకర్తగా ఉంటారు.

 

ద్వంద్వ వంశానుక్రమం: ఒక వ్యక్తి తన మాతృ వర్గం, పితృ వర్గంతో పొత్తు కుదుర్చుకొని రెండు పక్షాల వారిని మూలపురుషులుగా గ్రహించే కుటుంబం.

 

మరికొన్ని వివరాలు

 

సహజీవనం: వివాహం చేసుకోకుండా కలిసి జీవించడం. 

 

డింక్‌ కుటుంబాలు: ఆర్థిక భద్రత ఉన్న కొందరు వివాహితులు, ఉద్యోగాలు చేసే దంపతులు సంతానాన్ని వద్దనుకోవడం.

 

కిబ్బట్జ్‌ కుటుంబ వ్యవస్థ: పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా పిల్లల గృహంలో నివసించడం. ఈ రకమైన వ్యవస్థ ఇజ్రాయెల్‌లో ఉంది.

 

జన్మప్రాప్త: వ్యక్తి తాను జన్మించిన కుటుంబంలో సభ్యుడిగా ఉండటం.

 

ధ్యాంతి: ఖాసా తెగ స్త్రీని పుట్టింట్లో పిలిచే విధానం.

 

ర్యాంతి: ఖాసా తెగ స్త్రీని అత్తవారింట్లో పిలిచే విధానం

 

ఘోస్ట్‌ మ్యారేజ్‌: దీన్ని న్యూయెర్లు, ఇవాన్‌ ఫ్రిచెర్డ్‌ అధ్యయనం చేశారు. 

 

ఈంగ్‌: ఖాసి తెగలోని కుటుంబం పేరు. 

 

ఇల్లోమ్‌: ఇది నంబూద్రి సమూహంలోని కుటుంబం.

 

స్త్రీల మార్పిడి: స్త్రీలను పరస్పరం మార్చుకునే లక్షణం బర్మాలోని కచ్చిన్‌ కొండ ప్రాంతాల్లో కనిపిస్తుంది. 

 

సిద్ధాంతాలు

 

స్వైర వివాహ కుటుంబ సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని ప్రతపాదించినవారు ప్లీస్‌ 

 

పితృ వంశీయ కుటుంబ సిద్ధాంతం: దీన్ని అరిస్టాటిల్, ప్లేటో, హెన్రీ మెయిన్‌ ప్రతిపాదించారు. 

 

మాతృ వంశీయ కుటుంబ సిద్ధాంతం: బ్రిఫాల్డిస్‌ ప్రతిపాదించారు. 

 

పరిణామక్రమ కుటుంబ సిద్ధాంతం: మోర్గాన్‌ ప్రతిపాదించారు. 

 

ఏకపత్ని కుటుంబ సిద్ధాంతం: వెస్టర్‌ మార్క్‌ ప్రతిపాదించారు. 

 

బహుళ కారక కుటుంబ సిద్ధాంతం: మైకేవర్, రాల్ఫ్‌లింటన్‌ ప్రతిపాదించారు.

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌ రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

  గిరిజన సమూహాలు

  భారతీయ సమాజం

  తెలంగాణ సామాజిక పరిస్థితులు

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

Posted Date : 09-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వివాహం

పరస్పర అనురాగ పయనం

 

  రెండు జీవితాలు కలిసి, మరో రెండు కుటుంబాలను కలిపి ఎన్నో బంధుత్వాలను ఏర్పరిచే విశిష్ట వేడుక వివాహం. దీంతో కొత్త కుటుంబం ప్రారంభమవుతుంది. ప్రపంచంలోని దాదాపు అన్ని సమాజాల్లో పెళ్లి ఉంది. అదో సామాజిక అవసరంంగా మొదలై, పరస్పర అనురాగంతో సాగే అద్భుతమైన సంస్కారం. సమాజ నిర్మాణం అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు వివాహం, దాని లక్షణాలు, వివిధ రకాల వివాహాలు, అందులో భాగస్వాముల వివరాలను తెలుసుకోవాలి. 

  భారతీయ సమాజ నిర్మాణ మూలస్తంభాల్లో వివాహ బంధం ఒకటి. వివాహం పవిత్రమైంది. భగవంతుడు మనకు అప్పగించిన బాధ్యతల్ని నిర్వహించడానికే వివాహం చేసుకుంటామని భారతదేశంలో భావిస్తారు.

  స్త్రీ, పురుషులనే రెండు జీవనయానపు విభాగాలు వివాహం ద్వారా ఒకటవుతాయి. భార్యాభర్తలు సంసారమనే రథానికి రెండు చక్రాలు. వీరిద్దరి మధ్య సంఘర్షణ ఏమీ ఉండదు. ఒకరికొకరు పరస్పరపూరకంగా ఉంటారు. వివాహం ఒక జైవిక అవసరమే కాదు, ఒక పవిత్ర సంస్కారం, రెండు భాగాలు మానసికంగా మమేకం అయ్యే వ్యవస్థ. వివాహం అనేది జన్మజన్మల బంధం.

  వివాహం ఒక సామాజిక వ్యవస్థ (Marriage is a Social Institution). ఇది విశ్వజనీనం(Marriage is Universe). ప్రపంచంలోని అన్ని సమాజాల్లో ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. వివాహం ఒక సామాజిక కలయిక. దీని ద్వారా వీరి మధ్య కొన్ని హక్కులు, బాధ్యతలు, బంధాలు ఏర్పడతాయి. అవి: 1) భార్యాభర్తలు 2) దంపతులు, పిల్లలు 3) దంపతుల అత్తమామలు

* మతాచారాలు, సంప్రదాయాలు, చట్టం గుర్తించిన రీతిలో ఒక్కరు లేదా అంతకంటే ఎక్కువ మందితో స్త్రీ, పురుషులు కొన్ని హక్కులకు, బాధ్యతలకు లోబడి ఏర్పరచుకున్న  బంధమే ‘వివాహం’ అని వెస్టర్‌మార్క్‌ పేర్కొన్నారు. ఈయన వివాహం పుట్టుపూర్వోత్తరాలను పరిశీలించాడు. ‘సంతానోత్పత్తి, పిల్లల పోషణ కోసం ఏర్పాటు చేసుకున్న ఒక ఒప్పందమే వివాహం’ అని మలినోస్కి చెప్పారు.

* ‘వివాహం సామాజిక వ్యవస్థ. ఇహలోకంలో, పరలోకంలో సుఖంగా ఉండాలంటే వివాహం అవసరం’ అని మను చెప్పాడు.వివాహంతో సంతానం పొందినవారే పరిపూర్ణులని విశ్లేషించాడు. 

 

వివాహం - లక్షణాలు


నియమావళి (Charter): పెళ్లి ఎందుకు? దాని ఆశయాలు ఏమిటో తెలుపుతుంది.

 

జీవిత భాగస్వామి ఎంపిక (Mate Selection): భాగస్వామికి ఎంత వయసు ఉండాలి, శారీరక పరిస్థితులు ఏమిటి?

మను ప్రకారం: 24 ఏళ్ల పురుషుడికి 8 ఏళ్ల అమ్మాయి సరిజోడు అవుతుంది. అదే 30 ఏళ్ల పురుషుడికి 12 ఏళ్ల అమ్మాయి సరిపోతుంది. అనారోగ్య చరిత్ర ఉన్న కుటుంబం, మగ సంతానం లేని కుటుంబం నుంచి వధువును స్వీకరించకూడదు. అలాగే చర్మంపై దళసరి రోమాలున్న వధువునూ స్వీకరించకూడదు.

వివాహం విధానం: * కన్యాదానం   * వివాహ హోమం   * పాణిగ్రహణం   * లాజహోమం   * అగ్నిపరిణయనం   * అశావిరోహణం   * సప్తపది    * అరుంధతి.

ఆర్థిక వ్యవహారాలు

* ఆదిమ, రైతు సమాజాల్లో ఇప్పటికీ కన్యాశుల్కం పేరుతో వధువు తల్లిదండ్రులకు వరుడు కొంత సొమ్ము చెల్లించడం లేదా వరకట్నం కింద వరుడికి కొంత సొమ్మును వధువు తల్లిదండ్రులు ఇవ్వడం ఆచారంగా ఉంది. హిందూ వారసత్వ చట్టం - 1956 ప్రకారం స్త్రీ ధనంపై సంపూర్ణ అధికారం మహిళకే ఉంటుంది.

 

ఆచారాలు: వివాహ సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు, రంగులు పూసుకోవడం, బంతి ఆట మొదలైనవి.

 

నిర్ధిష్ట నిమయావళి: ఏ వ్యక్తుల మధ్య వివాహం బంధం ఉండకూడదో తెలియజేస్తుంది.

* తల్లి, కొడుకు, తండ్రి, కూతురు. 

* అన్న, చెల్లి, అక్క, తమ్ముడు.

 

నివాసం: వివాహమైన జంట నివసించే ప్రదేశం.

 

అధికారం: పెళ్లి తర్వాత సంక్రమించే అధికారం.

 

స్థిరత్వం: స్థిరత్వానికి, విడాకులకు మధ్య విలోమ సంబంధం ఉంటుంది.

 

వివాహం - రూపాలు

బ్రహ్మ వివాహం: తండ్రి తన కుమార్తెను శాస్త్ర ప్రకారం వరుడికి ఇచ్చి వివాహం చేయడం.

దైవ వివాహం: యజ్ఞం చేసినప్పుడు, కర్మకాండలు జరిగే సమయంలో తండ్రి తన కూతురుని పూజారికి ఇచ్చి వివాహం చేయడం.

అర్స వివాహం: పెళ్లి కుమారుడి నుంచి ఆవు/ఎద్దును స్వీకరించి ధర్మబద్ధంగా పెళ్లి కుమార్తె తండ్రి వధువును దానం చేయడం.

ప్రజాపాత్య: ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా వివాహం చేసుకోవడం. వధూవరులిద్దరూ ధర్మబద్ధంగా జీవితాన్ని గడపాలని ఆశీర్వదించి కన్యాదానం చేసే వివాహం. 

గాంధర్వ వివాహం: వధూవరులిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం. 

అసుర వివాహం: పెళ్లి కుమార్తెను ధనం కోసం వరుడికి అమ్మడం.

రాక్షస వివాహం: వధువును బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం.

పైశాచిక వివాహం: వధువు నిద్రలో లేదా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు బలవంతంగా తీసుకెళ్లి వివాహం చేసుకోవడం.

 

 

ఏకవివాహం: ఒక వ్యక్తి ఏకకాలంలో ఒకే వ్యక్తిని వివాహం చేసుకుంటే ఆ వివాహాన్ని దంపత్‌ వివాహం/ఏక వివాహం అంటారు.

ఉదా: ఖాసీ, చెంచు, లఖర్, అంగామి, అవో, డాఫ్ల

 

i) ఏకకాలిక ఏకవివాహం: భార్య లేదా భర్త మరణించిన‌ప్పుడు లేదా విడాకులతో విడిపోయినప్పుడు ఒక్కరే ఉండి, వారు మళ్లీ వివాహం చేసుకుంటే అది ఏకకాలిక ఏకవివాహం.

ఉదా: హిందూ సమాజం

ii) జీవితాంతపు ఏకవివాహం: జీవితాంతం ఒకే భాగస్వామితో ఉంటే దాన్ని జీవితాంతపు ఏక వివాహం అంటారు. 

ఉదా: సనాతన హిందూ సమాజం

 

బహువివాహం: ఇందులో ఒక స్త్రీ అనేక మంది భర్తలను, ఒక పురుషుడు అనేక మంది స్త్రీలను కలిగి ఉంటారు. 

i) బహుభార్యత్వం: ఒక పురుషుడికి ఏకకాలంలో పలువురు భార్యలు ఉంటారు. ఇది మళ్లీ 2 రకాలు.

* భగినీ బహుభార్యత్వం: పురుషుడి భార్యలందరూ అక్కాచెల్లెళ్లు అయి ఉంటారు. 

ఉదా: బైగా, భగత, నాగా, గోండు 

* అభగినీ బహుభార్యత్వం: భార్యలందరూ అక్కాచెల్లెళ్లు అయి ఉండరు. 

ఉదా: గోండు తెగ, నాగాలు, ముత్తవన్, పళియన్‌ 


ii) బహుభర్తృత్వం: ఒక స్త్రీకి ఏకకాలంలో పలువురు భర్తలు ఉంటారు.

ఉదా: తోడా (పాండవుల వంశానికి చెందినవారిగా పేర్కొంటారు), ఖాసాలు, లెఫ్చాలు, నాయర్లు 

ఇవి మూడు రకాలు: 

* సోదర బహుభర్తృత్వం: ప్రాచీన కాలంలో అతిసాధారణమైన వివాహ రూపం. దీనిప్రకారం అన్నదమ్ములు అందరూ ఒకే మహిళను వివాహం చేసుకుంటారు.

ఉదా: తోడా 

* అసోదర బహుభర్తృత్వం: ఈ వివాహంలో ఒక స్త్రీ ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఆ స్త్రీని కల్యాణం చేసుకునే వారంతా సోదరులు కావాల్సిన పనిలేదు, స్త్రీని వివాహం చేసుకున్నవారంతా ఒకే గోత్రానికి చెందిన వారైతే దీన్ని స్వగోత్రీయ బహుభర్తృత్వం అంటారు.

ఉదా: జౌన్సర్‌ బవార్‌ ప్రాంతపు ఖాసా తెగ. 

* కుటుంబ బహుభర్తృత్వం: ఇది తోడా, నాగా, ఖాసీల్లో ఉంది.

 

iii) బహుభార్యభర్తృత్వం: కొన్ని తెగల్లో బహు భార్యత్వం, బహు భర్తృత్వం రెండూ కలిసి ఉంటాయి. ఈ రకమైన పద్ధతిని బహుభార్యభర్తృత్వం అంటారు.

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

‣ కుటుంబం రకాలు

‣ పెళ్లి.. నాటి ప్రమాణాలు 

‣ బంధుత్వం - అనుబంధం

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 14-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మతం

విశిష్ట జీవన విలువలే అభిమతం!

  మనిషి జీవితం సన్మార్గంలో, సమున్నతంగా సాగేందుకు సరైన జీవన విధానాన్ని అందించేదే మతం. ఇందులో అనేక విశ్వాసాలు, సంస్కారాలు, సంప్రదాయాలు ఉంటాయి. వాటి ద్వారా వ్యక్తుల ప్రవర్తనలను అదుపు చేసి సామాజిక వ్యవస్థ నిర్మాణానికి మార్గదర్శనం చేస్తుంది. మన దేశంలో విశిష్ట జీవన విలువలే అభిమతంగా ఏర్పడిన ఈ మతాలు, మత విభాగాలు, వాటి కార్యకలాపాల గురించి అభ్యర్థులు అవగాహన ఏర్పరుచుకోవాలి. 

  

అలౌకిక శక్తులను విశ్వసించడాన్ని మతం అంటారు. మతం ఒక సామాజిక వ్యవస్థ. ఒక విధమైన మానవ ప్రవర్తన. మతంలో మానవాతీత శక్తులకు సంబంధించిన విశ్వాసాలు, సంస్కారాలు ఉంటాయి. ఇది మానవ సంస్కృతిలో అంతర్భాగం.

 

నిర్వచనాలు

టైలర్‌: మతం నాగరిక సమాజాలకే పరిమితం. ఆదిమ సమాజాల్లోనూ మతం ఉందని, అది నాగరిక సమాజాల్లోని మతం కంటే భిన్నమైంది కాదు (గ్రంథం - ప్రిమిటివ్‌ కల్చర్‌ - 1871). 

ఎమైలీ డర్క్‌హైమ్‌: నమ్మకాలను ఉమ్మడిగా పాటించడం (ది ఎలిమెంటరీ టీమ్స్‌ ఆఫ్‌ ద లైఫ్‌).

మకైకర్, ఫేజ్‌: మనిషికీ - మనిషికీ, మనిషికీ - ఉన్నత శక్తులకు మధ్య సంబంధం.

మిల్లర్, వైట్జ్‌: జీవితాలను శాసించే నమ్మకాలు, క్రియలను కలిగి ఉండే సాంఘిక క్రియ.

* మతం అనేది మత్తు పదార్థం లాంటిదని కారల్‌మార్క్స్‌ పేర్కొన్నారు.

 

మతం - పుట్టుక సిద్ధాంతాలు

సర్వాత్మవాదం: ఆత్మను నమ్మడం అనేది అన్ని మతాలకు మూలం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు ఈ.బి.టైలర్‌. 

జీవాత్మవాదం: ఈ సిద్ధాంతాన్ని ఫ్రాయిస్, మాక్స్‌ముల్లర్‌ ప్రతిపాదించారు. దీన్ని అభివృద్ధి చేసినవారు ఆర్‌.ఆర్‌.మారెట్‌.

ప్రకృతి ఆరాధన: ప్రకృతిని ఆరాధించడమే మతం ప్రారంభ దశ. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు మాక్స్‌ ముల్లర్‌.

టోటెమ్‌ వాదం: ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు దుర్క్‌హైమ్‌.

ప్రకార్యవాదం (నిర్మిత వాదం): మత ఆవిర్భావానికి కారణమయ్యేవి. దీన్ని వివరించినవారు మలినోస్కీ, రాడ్‌క్లిఫ్‌ బ్రౌన్‌. 

 

భారతీయ సమాజంలో మత సంయోజన విలువలు (2011)

మతం మత గ్రంథం స్థాపకుడు/మత గురువు జనాభా శాతం  జనాభా (కోట్లలో)
హిందూమతం భగవద్గీత,ఇతిహాసాలు వేదాలు 79.8% 96.63
ఇస్లాం ఖురాన్‌ మహ్మద్‌ ప్రవక్త 14.2% 17.22
క్రైస్తవం బైబిల్‌ యేసుక్రీస్తు 2.29% 02.78
సిక్కుమతం ఆది గురుగ్రంథ్‌ సాహెబ్‌ గురునానక్‌ 1.70% 02.08
బౌద్ధం  త్రిపీఠకాలు గౌతమ బుద్ధుడు 0.70% 00.84
జైనం అంగాలు స్థాపకుడు వృషభనాథుడు, చరిత్రాత్మక స్థాపకుడు పార్శ్వనాథుడు, నిజమైన స్థాపకుడు వర్ధమాన మహావీరుడు  0.40% 00.45
పార్సీ జెండా అవెస్తా జరాత్రుస్టా - -
ఇతరులు - - 0.70% 00.84


హిందూమతం

  హిందూమతం కొన్ని తాత్విక సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడింది. జన్మ, పునర్జన్మ, కర్మ, ధర్మం, ముక్తి, మోక్షం తదితర సిద్ధాంతాలను బోధిస్తుంది. విభిన్న విశ్వాసాలు, ఆచరణలు కనిపిస్తాయి. హిందూ మతం కొన్ని ప్రపంచ మతాలకు, బౌద్ధ, జైన, సిక్కు మతాలకు జన్మనిచ్చింది. మనదేశ చరిత్ర గమనం, సంస్కృతిలో మతం ప్రధానపాత్ర పోషిస్తోంది. దేశ ఆచారాలు, చట్టాలు రెండూ మత వైవిధ్యం, సామరస్యాన్ని స్థాపిస్తున్నాయి. భారత రాజ్యాంగం పౌరులకు మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా ప్రసాదించింది.

  హిందూ సమాజం అతిపురాతనమైంది. అనేక మత సంబంధమైన సిద్ధాంతాలు, నమ్మకాలు, విలువలు, లక్ష్యాలపై ఆధారపడి ఏర్పడింది. వ్యక్తులకు ఒక క్రమబద్ధమైన జీవన విధానం, విలువలు, ప్రమాణాలను అందించి అభివృద్ధికి పాటుపడుతోంది. 

 

ఆశ్రమ ధర్మాలు

  హిందూ సామాజిక జీవితంలో ఆశ్రమ ధర్మాలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ప్రతి హిందువు ఒక క్రమబద్ధమైన జీవితాన్ని గడపడానికి ఆశ్రమ ధర్మాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆశ్రమం అనే పదం సంస్కృత భాషలోని శ్రమ అనే పదం నుంచి వచ్చింది. సాహిత్యపరంగా ఆశ్రమం అనే పదానికి అర్థం విశ్రాంతి స్థలం. మోక్ష సాధన అనే మహ్వోన్నత ప్రయాణంలో ఒక చోట ఆగి ప్రయాణానికి సిద్ధం కావడానికి తీసుకునే విశ్రాంతిని ఆశ్రమం అంటారు. ప్రతి హైందవుడు తన జీవితకాలంలో నాలుగు దశల ద్వారా ప్రయాణించి మోక్షం పొందాలని హిందూ మతం బోధిస్తోంది.

* బ్రహ్మచర్య ఆశ్రమం - 25 సంవత్సరాలు

* గృహస్థ ఆశ్రమం - 25 - 50 సంవత్సరాలు

* వానప్రస్థ ఆశ్రమం - 50 - 75 సంవత్సరాలు

* సన్యాస ఆశ్రమం - 75 - 100 సంవత్సరాలు

  బ్రహ్మను చేరుకోవడానికి ఈ నాలుగు ఆశ్రమాలు 4 మెట్లు కలిగిన నిచ్చెన లాంటివని మహాభారతంలో భీష్ముడు పేర్కొన్నాడు. ఆశ్రమ పద్ధతి క్రీ.పూ.100 ప్రాంతంలో అమల్లోకి వచ్చిందని ఆల్టేకర్‌ తెలిపాడు. మొదట మూడు ఆశ్రమాలే ఉండేవని వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలను ఒకే ఆశ్రమంగా భావించేవారని పండరి నాథ్‌ ప్రభు తెలిపాడు. మొదటి మూడు ఆశ్రమాలు దాటిన వ్యక్తిని సన్యాసి అని శ్వేతాస్వతరోపనిషత్తు తెలియజేస్తోంది. 

 

బ్రహ్మచర్య ఆశ్రమం: సర్వసాధారణంగా ఈ ఆశ్రమం ఉపనయనం తర్వాత ప్రారంభమవుతుంది. బాల్యదశ నుంచి ప్రాపంచిక విషయాలు నేర్చుకునే సమయంలో వ్యక్తి ఎలా ఉండాలి, ఏ విధమైన నియమ, నిష్ఠలతో మెలగాలో ఉపనయనం వివరిస్తుంది. ఇలా తెలుసుకుంటే ఆ వ్యక్తి ద్విజుడు (రెండు జన్మలు కలిగినవాడు) అవుతాడు. అంటే ఉపనయన జ్ఞానాన్ని పొందడం ద్వారా మరో జన్మ ఎత్తినట్లు భావిస్తారు. బ్రాహ్మణులు - 8 లేదా 12 సంవత్సరాల వయసులో, క్షత్రియులు - 10 లేదా 14, వైశ్యులు - 12 లేదా 16 సంవత్సరాల వయసులో ఉపనయనం నిర్వహిస్తారు. శూద్రులకు ఉపనయనం లేదు

ఈ ఆశ్రమంలో వ్యక్తి ఉపాధ్యాయుడి గృహంలో విద్యార్థిగా ప్రవేశిస్తాడు. కానీ గురువు వెంటనే విద్యను మొదలుపెట్టడు. విద్యార్థి ఈ సమయంలో గురువు ఇంటిపనులు చూడటం, పశువులను మేపడం, వంట చెరకు సమకూర్చడం, గురువు కోసం భిక్షను యాచించడం చేస్తాడు. ఇలాంటి సేవల ద్వారా సంతృప్తి చెందితే అప్పుడు గురువు విద్యను మొదలుపెడతాడు. పుట్టిన ప్రతి మనిషి మూడు రుణాలు చెల్లించాలని హిందూ మతం బోధిస్తోంది. వేదాలు చదవడం ద్వారా రుషులకు, యజ్ఞాలు నిర్వహణతో దేవుళ్లకు, కర్మకాండలతో పూర్వీకులకు రుణాలు చెల్లించాలి

 

గృహస్థ ఆశ్రమం: ఇది జీవితంలో అత్యంత కీలక దశ.ఈ సమయంలో వివాహం ద్వారా కుటుంబాన్ని ఏర్పరచుకుంటారు. వివాహ లక్ష్యాలు ధర్మం, అర్థం, కామం. ధర్మాచరణ, సంతానోత్పత్తి వివాహ ప్రయోజనాలు.

 

వానప్రస్థాశ్రమం: కుటుంబంతో సంపూర్ణంగా, సమగ్రంగా గడిపిన తర్వాత భార్యతో పాటు అడవుల్లో నివాసం ఏర్పరచుకోవడాన్ని వానప్రస్థాశ్రమం అంటారు. అమావాస్య, పౌర్ణమికి కర్మకాండలు చేస్తారు. హోమాలు నిర్వహిస్తారు, అతిథులను గౌరవిస్తారు. ఈ దశలో వ్యక్తి సాంఘిక జీవనానికి కృషి చేస్తాడు

 

సన్యాసాశ్రమం: మనుసంహిత ప్రకారం ఒక వ్యక్తి గృహస్థ ఆశ్రమం నుంచి నేరుగా సన్యాసాశ్రమాన్ని పొందుతాడు. ఈ దశలో వ్యక్తి ఎవరి సహాయం పొందకుండా జీవిస్తాడు. రోజుకు ఒకసారి భిక్షాటన చేస్తాడు. భిక్ష లభ్యమైనా, కాకపోయినా ఒకే మానసిక స్థితిని కలిగి ఉండాలి. ఇది మోక్ష సాధనకు తోడ్పడుతుంది. ఈ దశలో వ్యక్తి ఇంటిపేరు, తనపేరు త్యజిస్తాడు. వానప్రస్థ, సన్యాస ఆశ్రమంలోని వారు తాము జీవిస్తూ, కృషి చేస్తూ నిస్వార్థ సామాజిక వ్యవస్థ/సేవ చేయడానికి ఇష్టపడతారు. సన్యాసి ఒక మహోత్తరమైన సాంఘిక పాత్రను నిర్వహిస్తున్నాడని కపాడియా అనే సామాజిక వేత్త తెలిపాడు.

 

పురుషార్థాలు

ఇవి హిందూ సామాజిక వ్యవస్థ నిర్మాణంలో మార్గదర్శకంగా వ్యవహరిస్తాయి. వ్యక్తి ప్రవర్తనను అదుపు చేయడంలో తోడ్పడతాయి. పురుషార్థాలు నాలుగు. 

 

ధర్మం: ఈ పదాన్ని అనేక సందర్భాల్లో వేర్వేరు అర్థాలతో ఉపయోగించారు. ఉదాహరణకు మహాభారతంలో దేవత అన్నారు. ఐతరేయ బ్రాహ్మణంలో మొత్తం బాధ్యతగా, ఛాందోగ్యోపనిషత్‌లో ఆశ్రమ ధర్మాలను ఆచరించడంగా పేర్కొన్నారు. వేదాలు సూచించే లేదా ఆశించిన ఫలితం లేదా ఆశయం అని జైమిని వివరించారు. పక్షపాతరహితంగా, నీతి నిజాయతీలతో, రాగద్వేషాలను విడిచి మనసావాచా కర్మణా జీవించే పవిత్ర జీవన విధానమే ధర్మమని మనుస్మృతి చెబుతోంది. మనిషి ఆచరించాల్సిన 9 ధర్మగుణాలను యాజ్ఞవల్కుడు వివరించాడు. అవి అహింస, నిర్మలత్వం, నీతి, పరిశుభ్రత, ఇంద్రియ నిగ్రహం, దానం, ఆత్మనిగ్రహం, ప్రేమ, సహనం. ఈ ధర్మ గుణాల్లో మొదటి ఆరు సహజ మనుగడకు, మిగిలినవి వ్యక్తి ప్రవర్తనకు తోడ్పడతాయి. 

 

అర్థం: వ్యక్తి అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే సంపద, ఐశ్వర్యం అర్థం. ఇవి మనిషి ఆశలు, ఆశయాల సాధనోపకరణాలు. అవి ధర్మబద్ధంగా ఉండాలని ధర్మశాస్త్రం బోధిస్తోంది.

 

కామం: మనిషి ఇంద్రియ వాంఛలను సంతృప్తి పరుచుకోవడమే కామం లేదా కోరిక.ధర్మాచరణతో కూడిన కామం అంగీకారయోగ్యం, ఉత్తమం. 

అర్థ, కామం విలువలను సాధించడంలో ధర్మం మార్గదర్శిగా, నియంత్రణ సాధనంగా ఉంటుంది. ధర్మ, అర్థ, కామాలను త్రివర్గాలు అంటారు.

 

మోక్షం: మోక్షం అంటే ముక్తి పొందడం. ఇది మనిషి జీవితంలో చిట్టచివరి మెట్టు. ధర్మ, అర్థ, కామాల పరిపూర్ణత ఇందులో ఉంటుంది. భగవద్గీతలో మోక్షాన్ని పరగతిగా వర్ణించారు. కర్మ, జ్ఞానం, భక్తి అనే మూడు మార్గాల ద్వారా ముక్తి సిద్ధిస్తుందని భగవద్గీత పేర్కొంటోంది. 

 

హిందూ వివాహం- పవిత్ర సంస్కారం

హిందూ వివాహం అనేక సంస్కారాలతో కూడిన ఒక పవిత్ర బంధం. హిందూ వివాహ వ్యవస్థలో వివిధ రకాల మతపరమైన సంస్కారాలను ఆచరిస్తారు. దీనిలో ముఖ్యమైనవి హోమం, పాణిగ్రహణం, సప్తపది. వివాహ సమయంలో పురోహితుడు వధూవరులతో అగ్నిహోమం జరిపిస్తారు. ఈ కారణంగానే హిందూ వివాహాన్ని అగ్నిసాక్షి వివాహం అంటారు. పాణిగ్రహణం అంటే వధువు కుడిచేతిని, వరుడు తన కుడిచేతితో గ్రహించడం. ఆ తర్వాత మంగళసూత్ర ధారణ జరిగి అతి ముఖ్యమైన సప్తపది జరుగుతుంది. అంటే వధూవరులు కలిసి ఏడడుగులు నడవటం. దీని తర్వాత నక్షత్ర దర్శనంతో హిందూ వివాహ తంతు పూర్తవుతుంది. 

 

హిందూ వివాహ లక్ష్యాలు:

 * లైంగిక వాంఛలను సంతృప్తిపరచడం

 * సంతానోత్పత్తి 

* ధర్మ నిర్వహణ

 

వివాహ వ్యవస్థలో మార్పులు: ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు, భార్యాభర్తల మధ్య సర్దుబాటు లేకపోవడం, వరకట్నం, విడాకులు లాంటివి కూడా వివాహ వ్యవస్థలో వచ్చిన మార్పులు.

 

సామాజిక శాసనాలు: బ్రిటిషర్లు మన దేశంలోని వివాహ వ్యవస్థకు సంబంధించిన విషయాలపై కొన్ని శాసనాలు/చట్టాలు చేశారు. స్వాతంత్య్రానంతరం కొన్ని చట్టాలను రూపొందించారు. 

* సతీసహగమన నిరోధ చట్టం - 1829

* హిందూ వితంతు పునర్‌ వివాహ చట్టం - 1856

* బాల్య వివాహ నిరోధ చట్టం - 1929

* హిందూ వివాహ చట్టం - 1955

* ప్రత్యేక వివాహ చట్టం - 1956

* వారసత్వ చట్టం - 1956

* వరకట్న నిషేధ చట్టం - 1961

* ప్రత్యేక వివాహ చట్టం - 1872

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 భారతీయ సమాజ నిర్మాణం

‣  కుటుంబం

 భారతీయ సమాజం

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 03-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వివాహాలు - రకాలు

బొట్టు పెట్టినా... చేయి పట్టినా పరిణయమే!

  భారత సమాజంలోని విభిన్న జాతులు, తెగల్లో అనేక రకాలుగా వివాహాలు జరుగుతాయి. కొందరు కన్యాశుల్కం చెల్లిస్తారు. ఇంకొందరు వధువు కుటుంబానికి సేవలు చేసి మెప్పిస్తారు. నచ్చిన యువకుడి ఇంట్లోకి యువతి నేరుగా ప్రవేశిస్తుంది. ఎంత హింసించినా బయటకి వెళ్లదు. ఆఖరికి కోడలిగా మారిపోతుంది. యువకులు జాతరలు, సంతల్లో కాపుకాసి నచ్చిన యువతి నుదుటిపై బొట్టు పెట్టేస్తారు. మెచ్చినవారి చేతిని పట్టుకుంటే పరిణయంగా భావిస్తారు. ఈ వివాహరీతులపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. 

 

  వివాహం ఒక జీవన అవసరం. రెండు జీవితాలను కలిపి ఉంచే పవిత్ర సంస్కారం. సమాజ నిర్మాణంలో మూలస్తంభం. ఇందులో నిర్దిష్ట నియమాలను అనుసరించి జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. ఆచార వ్యవహారాలను పాటిస్తారు. సంప్రదాయాల ప్రకారం ఏకమవుతారు. ఇది అనేక రకాలుగా జరుగుతుంది. 

సంప్రదింపుల వివాహం (Consultancy Marriage): సంప్రదింపుల ద్వారా జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం. ఈ రకమైన వివాహంలో అవసరాన్ని బట్టి వరుడి తల్లిదండ్రులు లేదా వధువు అమ్మానాన్నలు ప్రతిపాదనలు చేసి సంప్రదింపులు ప్రారంభిస్తారు. భార్య చనిపోయినప్పుడు భార్య చెల్లెల్ని పెళ్లాడి తీరాలా, భర్త చనిపోయినప్పుడు భర్త సోదరుడిని పెళ్లి చేసుకోవాలా అనే విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు.ఈ సంప్రదింపుల్లో కట్నం ప్రధానంగా ఉంటుంది. 

 

* ఓలీ చెల్లించడం ద్వారా వివాహం: ఒక స్త్రీని వివాహం చేసుకోవాలంటే ఆమెకు తగిన విలువ ధన రూపంలో చెల్లించగలగాలి. 

 

* కన్యాశుల్కం చెల్లించి వివాహం చేసుకున్న భార్య మరొకరితో వెళ్లిపోయినప్పుడు ఆమె రెండో భర్త మొదటి భర్తకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. 

ఉదా: నాగా, పోలు క్రోట, హిదట్టాలు (ఆదిమ తెగలు)

 

* సేవా వివాహం (Service Marriage): వధువుకు సేవ చేయడం ద్వారా జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం సేవా వివాహం. వివాహానికి ముందు లేదా తర్వాత లేదా వివాహకాలంలో వధువు కుటుంబం కోసం కొంతకాలం పాటు అంటే 2 - 3 సంవత్సరాలు సేవ చేయాల్సి ఉంటుంది. 

ఉదా: మధ్యప్రదేశ్‌ - గోండులు, ఆంధ్రప్రదేశ్‌ - భగత, సవర 


*  వధువు కుటుంబానికి వరుడు ఎప్పుడు (వివాహానికి ముందు/తర్వాత/వివాహ కాలంలో) తన సేవ ప్రారంభించాలనేది తెలుపుతుంది.  


* వరుడు చిన్న పనులు చేయాల్సి రావచ్చు లేదా కొద్ది వారాల నుంచి కొన్ని సంవత్సరాల వరకు పూర్తికాలం సేవ చేయాల్సి రావచ్చు. 


* సేవాకాలం పూర్తయిన తర్వాతనే వివాహం జరుగుతుంది. అప్పటి వరకు వధూవరులు పరాయివారుగానే ఉంటారు. 

 

* వినిమయ వివాహం (Exchange Marriage): వరుడి కుటుంబం కట్నానికి బదులుగా తమ ఇంటి ఆడపిల్లను ఇస్తారు. వరుడి చెల్లెల్ని లేదా మరొక బంధువును ఇచ్చి వివాహం చేస్తారు. అంటే ఇరు కుటుంబాల మధ్య రెండు వివాహాలు జరుగుతాయి. 

ఉదా: గోండులు, మురియా, బైగాలు, బగద, కోయ, సవర

 

* అనాహుత వివాహం (By Intrusion): స్త్రీ తనకు నచ్చిన యువకుడి ఇంట్లో నేరుగా ప్రవేశించి ఆ యువకుడికి ఇష్టం లేకపోయినా ఆ ఇంటి కోడలిగా ప్రవర్తిస్తుంది. వరుడి తల్లిదండ్రులు ఆమెను హింసించినా ఇల్లు వదలదు. చివరకు వారు ఆమెను కోడలిగా అంగీకరిస్తారు. 

ఉదా: కమార్, హో (మధ్యప్రదేశ్‌)

 

* పరీక్షావధి వివాహం (By Probationary): స్త్రీ పురుషులిద్దరూ తాత్కాలికంగా కలిసి ఉండి పరస్పరం అర్థం చేసుకున్న తర్వాతే శాశ్వత వివాహబంధంలోకి ప్రవేశిస్తారు. ఈ నియమంలో భార్యాభర్తల మధ్య అన్ని రకాల సంబంధాలు ఉంటాయి. ఒకవేళ విడిపోవాల్సి వస్తే తాత్కాలికంగా భార్యగా ఉన్నందుకు ఆమెకు కొంత డబ్బు చెల్లిస్తారు. 

ఉదా: కుకీ (మణిపుర్‌)

 

* అపహరణ పద్ధతి ద్వారా వివాహం (By Capture): వధువును అపహరించి వివాహం చేసుకోవడం. శత్రువుల గ్రామాలపై దాడి చేసి స్త్రీలను అపహరించి వివాహం చేసుకుంటారు.

ఉదా: నాగా 

 

* కొన్ని తెగల్లో యువతులకు యువకులు ప్రేమ రాయబారం పంపిస్తారు. అంగీకరించకపోతే బలవంతంగా ఎత్తుకువెళ్లి వివాహం చేసుకుంటారు. 

ఉదా: హోలు (బిహార్‌), భిల్లులు (రాజస్థాన్‌), భగత (తమిళనాడు), సవర (ఆంధ్రప్రదేశ్‌)

 

* కొన్ని తెగల్లో వధూవరులు ప్రేమించుకున్నప్పుడు వివాహం చేసే స్థోమత లేకపోతే వధువు తల్లిదండ్రులే దీన్ని ప్రోత్సహిస్తారు. వధువు ప్రతిఘటించినట్లు నటిస్తుంది. 

ఉదా: గోండులు (మధ్యప్రదేశ్‌)

 

* తాము కోరిన యువతి కోసం యువకులు జాతరలు, సంతల్లో కాచుకొని ఆమె రాగానే నుదుటన బొట్టు పెడతారు. 

ఉదా: గోండులు (మధ్యప్రదేశ్‌)

సహపలాయనం ద్వారా వివాహం (By Elopment): ప్రేమించుకున్న ఇద్దరు వ్యక్తులు తల్లిదండ్రులను వ్యతిరేకించి ఎవరికీ తెలియకుండా దూరంగా పారిపోయి రహస్యంగా వివాహం చేసుకోవడం. ఉదా: గోండు, సవర, భగత

భౌతిక పరిగ్రహణ వివాహం (By Physical Caputre): తాను ఇష్టపడిన వ్యక్తిని భౌతికంగా చేయిపట్టుకొని ఎత్తుకుపోవడం. ఉదా: నాగా, గోండు, హో, ముత్తవన్‌

ప్రయోగ వివాహం (By Experimental Marriage): రాజస్థాన్‌లోని భిల్లులు హోళీ పండుగ రోజున జరుపుకునే వివాహ వేడుక. దీని ప్రకారం గ్రామం మధ్యలో ఒక చెట్టును లేదా స్తంభాన్ని పెట్టి దానికి గ్రీజు లేదా ఆయిల్‌ పూస్తారు. ఆ స్తంభం/చెట్టుపై ఒక తెల్లని వస్త్రంలో కొబ్బరికాయ, బెల్లం ముక్కను ఉంచుతారు. యువకులు పైకి ఎక్కి ఆ బెల్లం, కొబ్బరి ముక్కను తిని కిందకు రావాలి. వారు పైకి ఎక్కేటప్పుడు జుట్టు పట్టుకొని లాగడం, చొక్కా లాగడం లాంటి అవాంతరాలు కలిగిస్తారు. వీటన్నింటినీ అధిగమించిన యువకుడు కింద వరుసగా నిల్చొని ఉన్న యువతుల్లో ఒకరిని ఎంపిక చేసుకుంటాడు. 

 

సిద్ధాంతాలు

మానసిక విశ్లేషణ సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ ప్రతిపాదించారు. దీని ప్రకారం కొడుకు తల్లివైపు, కూతురు తండ్రి వైపు ఆకర్షితులవుతారు. పెద్దల భయం వల్ల పిల్లలు తమ కోరికలను బలవంతంగా అణుచుకుంటారు. 

బాల్య స్నేహ సిద్ధాంతం (Childhood familiarity theory): దీన్ని వెస్టర్‌ మార్క్‌ ప్రతిపాదించారు. దీని ప్రకారం ఒకే కుటుంబంలో నివసించే పిల్లలు ఒకరినొకరు ఆకర్షించుకోలేకపోయినా పరిచయం బాగా ఉండటం వల్ల ఒకరి లోటుపాట్లు మరొకరికి తెలుస్తాయి. 

ప్రజనన సిద్ధాంతం (Inbreeding theory): స్వగోత్రికులు లేదా ఇతర బందువులతో సంతానోత్పత్తి జరపడం. దీన్ని డేవిడ్‌ అబెరుల్‌ ప్రతిపాదించారు. జంతువుల్లో కనిపించే ఈ స్థితి ప్రభావం మానవ సమాజంపై ఉంటుంది. 

కుటుంబ చీలికా సిద్ధాంతం (Family disruption theory): తండ్రి కూతురిని, తల్లి కుమారుడిని, అన్న చెల్లెలిని, తమ్ముడు అక్కను వివాహం చేసుకోరాదు. ఇలా వివాహం చేసుకోవడం ద్వారా కుటుంబం చీలిపోతుంది. దీన్ని మలినోస్కీ ప్రతిపాదించారు.  

సహకార సిద్ధాంతం (Cooperation theory): కుటుంబంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరికొకరు బంధువులై ఉండటమే సహకార సిద్ధాంతం. దీన్ని టైలర్‌ ప్రతిపాదించారు. లెస్లీవైట్‌ విశ్లేషించారు. 

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌ రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  గిరిజన సమూహాలు

‣ బంధుత్వం - అనుబంధం

‣ తెలంగాణ సామాజిక పరిస్థితులు

 

‣ ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

Posted Date : 21-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బంధుత్వం

అనుబంధాల బంధం!

  అన్నా అంటూ అనురాగం కురిపించినా, అత్తా అని ఆప్యాయంగా పలకరించినా, మామా అని మమతను వ్యక్తం చేసినా.. అన్నీ బంధుత్వాలే, అనుబంధాల రూపాలే. సమాజం మొత్తం మానవ సంబంధాల సమాహారం. ఈ బంధాలు ఎలా ఏర్పడతాయి? ఎన్ని రకాలుగా ఉన్నాయి? వాటి ఆచరణ విధానం ఏమిటి? తదితర వివరాలను అభ్యర్థులు పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 

 

  బంధుత్వం అనేది వివాహం లేదా ప్రత్యుత్పత్తి ద్వారా వ్యక్తుల మధ్య ఏర్పడే సంబంధం. ప్రపంచంలో ఉనికిలో ఉన్న సముదాయాలన్నింటిలో బంధుత్వం ఉంది. ఒక సామాజిక శాస్త్రవేత్త ప్రకారం సమాజం అంటే బంధుత్వాల అల్లిక, మానవ సంబంధాల సాలెగూడు. కుటుంబం, కులం, గోత్రం, వివాహం, జాతి, మతం లాంటి వ్యవస్థలు ఉన్న ప్రతి సమాజంలో అక్కడి సమాజ నిర్మాణం, సామాజిక సంబంధాలకు బంధుత్వమే ప్రధాన కారణం. బంధుత్వం వ్యక్తుల మధ్య సంబంధాలను ఏర్పరిచి, వారిని క్రమపద్ధతిలో పేర్చి సమూహాన్ని ఏర్పరుస్తుంది.

 

నిర్వచనాలు

మర్డాక్‌: సంక్లిష్టమైన పరస్పర సంబంధం ఉన్న బంధువుల మధ్య ఉండే సంబంధాల నిర్మితీయ వ్యవస్థే బంధుత్వం.

సెకల్సర్‌: జైవిక సంబంధాలు, వివాహం, దత్తత, సంరక్షణలకు సంబంధించిన చట్టపరమైన నియమాల లాంటి కారకాలపై ఆధారపడిన సామాజిక సంబంధాల గుచ్ఛమే బంధుత్వం.

హారి.ఎం.జాన్సన్‌: లైంగికత, తరాలు; వైవాహిక, జ్ఞాతి సంబంధాలు బంధుత్వానికి ఆధారాలు.

* బంధుత్వం అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించినవారు హెన్రీ మెయిన్‌. ఈయన 1861లో ఏన్షియంట్‌ లా (Ancient Law) అనే పుస్తకాన్ని రచించారు.

* బంధుత్వం ప్రాముఖ్యతను విశ్లేషించినవారు మెక్‌లెనన్‌. ఈయన 1865లో ప్రిమిటివ్‌ మ్యారేజ్‌ (Primitive Marriage) అనే పుస్తకాన్ని రచించారు.

 

బంధుత్వం - రకాలు

 

వైవాహిక బంధుత్వం: వివాహం ద్వారా ఏర్పడేది.

ఉదా: భార్యాభ‌ర్త‌లు

 

రక్త సంబంధ బంధుత్వం: ఒకే రక్త సంబంధం కలిగిన వ్యక్తుల మధ్య ఏర్పడేది.

ఉదా: తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు

 

 

ఐరావతి కార్వే అనే మహిళా సామాజికవేత్త 1953లో నాలుగు సాంస్కృతిక మండలాలను తులనాత్మకంగా పరిశీలించారు. 

1) ఒక ప్రాంతంలో వివిధ ప్రాంతీయ నమూనాలు

2) క్రమానుగత శ్రేణి

3) కులాల మధ్య ఒంటరితనం

4) కులాల మధ్య వైవిధ్యం

 

 ఐరావతి కార్వే 3000 సంవత్సరాల చరిత్ర కాలాన్ని పరిశీలించి దేశంలో బంధుత్వం ఆవశ్యకత గురించి తెలియజేశారు.

* భారతీయ భాషలోని బంధుత్వ పదాలు

* భాషాపరమైన సందర్భం, ప్రవర్తన

* వంశానుక్రమం, వారసత్వ నియమాలు

* వివాహం, కుటుంబ నియమాలు

* ఉత్తర, ద్రవిడియన్‌ ప్రాంతాల మధ్య తేడాలు

 

బంధుత్వ స్థానం

బంధువులను మూడు రకాలుగా వర్గీకరిస్తారు.

 

ప్రాథమిక బంధుత్వం: ప్రాథమిక సమూహంలోని వ్యక్తుల మధ్య ఉన్న బంధుత్వాన్ని ప్రాథమిక బంధుత్వం అంటారు. ఒక వ్యక్తి కనిష్ఠ కుటుంబంలోని వ్యక్తులు అతడికి ప్రాథమిక బంధువులు అవుతారు. ఏ వ్యక్తికి అయినా తన జీవిత భాగస్వామితోపాటు తల్లిదండ్రులు, పిల్లలు ప్రాథమిక బంధువులుగా ఉంటారు. అంటే వివాహం, రక్త సంబంధాల ద్వారా ఏర్పడే తొలి బంధువులను ప్రాథమిక బంధువులు అంటారు. కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ఏడు రకాల ప్రాథమిక బంధువులు ఉంటారు.

 

ద్వితీయ/గౌణ బంధుత్వం: ఒక వ్యక్తి ప్రాథమిక బంధువుకి ఉన్న ప్రాథమిక బంధువులంతా ఆ వ్యక్తికి ద్వితీయ బంధువులు అవుతారు. ప్రతి వ్యక్తికి మొత్తం 33 రకాల ద్వితీయ బంధువులు ఉంటారు.

 

తృతీయ బంధుత్వం: ఒక వ్యక్తి ద్వితీయ బంధువుకి ఉన్న ప్రాథమిక బంధువులంతా ఆ వ్యక్తికి తృతీయ బంధువులవుతారు. ముత్తాతలు, మునిమనుమలు ఈ కోవలోకి వస్తారు. ప్రతి వ్యక్తికి ఇలాంటి 151 రకాల తృతీయ బంధువులు ఉంటారు.

 

 

1) సాధారణ ఏక వంశానుక్రమం

 ఏక వంశానుక్రమంలో తండ్రి వంశానుక్రమం నుంచి లేదా తల్లి వంశానుక్రమం నుంచి ఒక వ్యక్తి సభ్యత్వాన్ని నిర్ణయిస్తారు. 

పితృ వంశానుక్రమం: ప్రతి తరం సంతతి తమ తండ్రి, తండ్రి-తండ్రి వంశానికి చెందుతారు. అంటే ఇక్కడ పురుషుడు వంశకర్త. ఆ సమూహపు సభ్యత్వం మాత్రం పురుషుల ద్వారానే ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమిస్తుంది.

మాతృ వంశానుక్రమం: ప్రతి తరం సంతతి తమ తల్లి, తల్లి-తల్లి వంశానికి చెందుతారు. ఇక్కడ స్త్రీ వంశకర్తగా ఉంటారు. ఆ సమూహ సభ్యత్వం స్త్రీల ద్వారానే ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమిస్తుంది. వివాహం అయ్యేంత వరకు మాత్రమే పురుషులు తమ తల్లి వంశానికి చెందుతారు.

 

2) సంక్లిష్ట ఏక వంశానుక్రమం 

ద్వంద్వ వంశానుక్రమం: ఇందులో ఒక వ్యక్తి కొన్ని ప్రయోజనాల కోసం తల్లి వంశానుక్రమాన్ని, మరికొన్ని ప్రయోజనాలకు తండ్రి వంశానుక్రమాన్ని స్వీకరిస్తాడు. 

ఉదా: అషాంటి, యాకో, తోడా 

 

* ఏక వంశానుక్రమ సమూహాల్లోని రకాలు 

1) వంశం 2) గోత్రం 3) గోత్ర కూటమి 4) ద్విశాఖ

 

ఏక వంశానుక్రమం కాని సమూహాలు:

యాంబీలీనియల్‌: ఈ తరహా సమాజాల్లో కొంతమంది తల్లి నుంచి కూతురికి, మరికొంతమంది తండ్రి నుంచి కుమారుడికి వంశానుక్రమాన్ని అందిస్తారు. అంటే మాతృ, పితృ వంశానుక్రమాలు రెండింటినీ పాటిస్తారు. ఈ సమూహంలోని సభ్యులు తామంతా ఒకే వంశపూర్వీకుడి నుంచి వచ్చినట్లుగా భావిస్తారు. అయితే వంశవృక్షంలోని అన్ని శాఖలను గుర్తించరు.

ఉదా: దక్షిణ పసిఫిక్‌లోని సమోవన్లు 

 

* సమోవన్లలో ఏక వంశానుక్రమ సమూహాల్లోని గోత్రం - ఉపగోత్రం మాదిరి రెండు యాంబీలీనియల్‌ డీసెంట్‌ గ్రూప్‌లు ఉంటాయి. ఈ రెండు బహిర్‌ వివాహాన్ని పాటిస్తాయి.

 

ద్విపార్శ్వ బంధుత్వం (కిండ్రెడ్‌): అనేక సమాజాలు మాతృ వంశీయ, పితృ వంశీయ లేదా రెండింటిలో ఏదో ఒక పార్శ్వాన్నే బంధువర్గంగా గుర్తించరు. ఇందులో ఒక వ్యక్తి తన తల్లి వైపు, తండ్రి వైపు ఇద్దరి బంధువులను సమానంగానే గుర్తిస్తారు.

ఉదా: సగాడా ఇక్రత్‌ - ఫిలిప్పీన్స్, గిస్పర్డ్‌ ద్వీప వాసులు - పసిఫిక్‌

 

బంధుత్వ పరిభాష

బంధువు అనేది సరళమైన పదం అయినప్పటికీ బంధుత్వ ప్రాధాన్యం అతికీలకమైంది. బంధుత్వంలో పరిభాషకు చాలా ప్రాధాన్యం ఉంది. బంధుత్వ పదాలు విలువలు, ఆచరణలు, సూచనలను కలిగి ఉంటాయి. 

 

మోర్గాన్‌ (1877) వర్గీకరణ

బంధుత్వ ప‌రిభాష‌ను మోర్గాన్  రెండు ర‌కాలుగా వ‌ర్గీక‌రించారు.

 

1) వర్ణనాత్మక వ్యవస్థ: వివిధ సంబంధీకులందరినీ ఒకే వర్గంలో చేర్చడంతో పాటు వారిని ఒకే పదంతో సంబోధిస్తారు. 

ఉదా: ‘మామ’ ఒక వర్ణణాత్మక పదం

 

సంబోధన పదాలు: ఒక వ్యక్తి తన బంధువులతో సంభాషిస్తున్నప్పుడు వాడే పదాలు.

ఉదా: ఒక వ్యక్తి తన తండ్రితో సంభాషిస్తున్నప్పుడు నాన్న అని, తల్లితో సంభాషిస్తున్నప్పుడు అమ్మ అని పిలవడం. 

 

అన్వయ పదాలు: ఒక వ్యక్తి మూడో వ్యక్తితో తన బంధువుల్లో ఒకరి గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే సంభాషణ.

ఉదా: ఒక వ్యక్తి తన సోదరుడి గురించి మరో వ్యక్తితో చెప్పినప్పుడు ‘నా పెద్దన్న’ అని పిలవడం.

 

టెక్నానమి: కొన్నిసార్లు కుటుంబంలోని ఒక బంధం గురించి మూడో వ్యక్తికి చెప్పినప్పుడు అతడి పేరు పెట్టి చెప్పకుండా ఒక ప్రత్యేకమైన బంధుత్వ పదాన్ని వాడటం.

ఉదా: ఒక మహిళ ఆమె భర్త గురించి మూడో వ్యక్తికి చెప్పేటప్పుడు అతడిని వారి పిల్లల తండ్రిగా పేర్కొంటుంది.

 

2) వివరణాత్మక వ్యవస్థ: ఇందులో ఒక సంబంధానికి ఒక పదాన్ని మాత్రమే సూచిస్తారు.

 

* ప్రాథమిక పదాలు: కుటుంబంలోని దగ్గరి బంధువులను పిలవడానికి ఉపయోగిస్తారు. 

ఉదా: తండ్రి, తల్లి

 

ఉత్పన్న పదాలు: వీటిలో ఒక ప్రాథమిక పదం మరొక ఉత్పన్న పదం కలిసి ఒక కొత్త పదం ఏర్పడుతుంది.

ఉదా: చిన్నమ్మ (చిన్న + అమ్మ)

 

వివరణాత్మక పదం: రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాథమిక పదాల కలయిక వల్ల ఏర్పడుతుంది. 

ఉదా: నాన్నమ్మ (నాన్న + అమ్మ), జేజమ్మ (అమ్మ + అమ్మ + అమ్మ)

 

బంధుత్వ ఆచరణలు

బంధు సమూహంలోని వ్యక్తుల మధ్య కొన్ని నిర్దిష్టమైన ప్రవర్తనలు కనిపిస్తాయి. వాటినే బంధుత్వ ఆచరణలు అంటారు. వాటిలో ముఖ్యమైనవి.  

 

1) పరిహాస సంబంధాలు: ఒకరిని ఒకరు పరిహసించుకోవడం, చిన్న చిన్న వస్తువులను నష్టపరచడం లాంటి చనువు తీసుకుంటారు. ఇవి రెండు రకాలు.

సౌష్ఠవ పరిహాసం: ఇందులో ఒకరు పరిహాసం చేస్తే మరొకరికి అదేస్థాయిలో పరిహాసం చేసే హక్కు ఉంటుంది. ఉదా: బావమరదళ్లు 

అసౌష్ఠవ పరిహాసం: ఒక బంధువు రెండో బంధువును పరిహసించవచ్చు కానీ వారు తిరిగి మొదటి బంధువును పరిహసించకూడదు. 

ఉదా: తాత - మనుమరాలు

 

2) వైదొలుగు నడవడి: ఇంటి కోడలు, అత్తమామల నుంచి తప్పించుకొని తిరగడం, ముఖాముఖిగా మాట్లాడకపోవడం, ఎక్కువ పరిచయం పెట్టుకోకపోవడం లాంటివి.

సిగ్మండ్‌ ఫ్రాయిడ్, జేమ్స్‌ ఫ్రేజర్‌ అనే సామాజిక శాస్త్రవేత్తల ప్రకారం ఆగమ్యగమన సంబంధాలు ఏర్పడకుండా ఉండటానికి ఈ పద్ధతిని ఆచరించారు.

 

3) మాతులాధికారం: ఒక వ్యక్తి జీవిత విశేషాల్లో తల్లి కంటే మేనమామ ముఖ్యం అనే ఆచారం ఉంటుంది. మేనమామ అన్ని బాధ్యతలు నిర్వహిస్తారు. మాతుల స్థానీయ నివాసం, మేనమామ నుంచి ఆస్తి పొందడం లాంటివన్నీ మాతులాధికారంగా పేర్కొంటారు.

 

4) కుహనా ప్రసూతి: భార్య ప్రసూతి సమయంలో భర్త ఆమె ప్రసవ వేదనను నటిస్తాడు. ఇది తోడా, ఖాసీ తెగల్లో ఇలాంటి ఆచారం ఉంటుందని మలినోస్కి తెలిపారు. 

 

5) పితృస్వాధికారం: ఒక వ్యక్తి జీవిత విశేషాల్లో తల్లి కంటే మేనత్త ముఖ్యం. పితృస్థానీయ నివాసం, మేనత్త నుంచి ఆస్తి పొందడం లాంటి ఆచారాలు పితృస్వాధికారంలో ఉంటాయి.

 

బంధుత్వ సమూహాల

ఒక ఇంట్లో లేదా ఒక కుటుంబంలో కలిసి ఉండే సమూహాలను బంధుత్వ సమూహాలుగా పేర్కొంటారు.

 

1) వంశం: ఒకే రక్త సంబంధం కలిగిన కుటుంబాల కలయిక. వివాహం సొంత వంశంలోని వారితో జరగదు.

మాతృ వంశం: దీనిలో స్త్రీ వంశకర్తగా ఉంటుంది. ఉదా: నాయర్‌ (కేరళ), శ్రీలంకలోని కొన్ని ప్రాంతాలు

పితృ వంశం: వంశకర్తగా పురుషుడు ఉంటాడు. ఉదా: అన్ని దేశాలు

తరవంశం: ఒక్కో తరానికి చెందినవారు ఒక్కొక్కరిని వంశకర్తగా భావిస్తారు. 

 

2) గోత్రం: ఏక వంశానుక్రమ సమూహాన్నే గోత్రం అంటారు. గోత్రం అంటే ఏకరక్త సంబంధం ఉన్న వంశాలు. ఇది  ఊహాజనిత వంశక్రమం. ప్రతి గోత్రానికి ఒక చిహ్నం ఉంటుంది.

ఉదా: వైశ్యుల గోత్రాలు - పెండ్లికుల, పడిగశిల, బుధనకుల; శూద్రుల గోత్రాలు - జంతువుల పేర్లు, చెట్ల పేర్లు (గోండులు - నాగుపాము)

 

3) గోత్ర కూటమి: రెండు లేదా అంతకంటే ఎక్కువ గోత్రాలు కలిసి ఏర్పడేది. 

ఉదా: రాజ్‌గోండ్స్, గోండ్స్‌

 

4) ద్విశాఖ: తండ్రి నుంచి ఒక శాఖను, తల్లి నుంచి ఒక శాఖను స్వీకరిస్తే అది ద్విశాఖ అవుతుంది. ఉదా: నీలగిరి (తోడా) - తైవాళియర్, తర్తారియర్‌ 

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  బంధుత్వం - అనుబంధం

‣  గిరిజన సమూహాలు

భారతీయ సమాజం

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

 

Posted Date : 29-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

షెడ్యూల్డ్‌ కులాలు

తరాల అణచివేతకు సజీవ సాక్ష్యాలు!

  మన దేశంలో అనాదిగా పాతుకుపోయిన కులవ్యవస్థలో కొన్ని వర్గాలు సామాజిక అణచివేతకు గురవుతున్నాయి. అందులో ప్రధాన వర్గం షెడ్యూల్డ్‌ కులాలు. తరాలుగా ఉన్నత వర్గాలు నిర్దేశించిన అహేతుక ఆంక్షలతో వీరికి అనేక ప్రయోజనాలు, అభివృద్ధి అవకాశాలు దూరమయ్యాయి. సమాజ నిర్మాణం-సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తీరు అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఈ అంశంపై అవగాహన పెంచుకోవాలి.

  

షెడ్యూల్‌ కులాలకు చెందిన వారిని ప్రాచీన కాలంలో పంచములు, అస్పృశ్యులు, మ్లేచ్ఛులు, అవర్ణులు అనేవారు. 1931 జనాభా లెక్కల్లో వీరిని అణగారిన వర్గాలుగా పేర్కొన్నారు. 1936లో జాబితాను పునఃసమీక్షించి భారత ప్రభుత్వం కొత్త జాబితాను రూపొందించింది. రాజ్యాంగంలోని 341వ అధికరణను అనుసరించి రాష్ట్రపతి షెడ్యూల్డ్‌ కులాల  (ఎస్సీ) జాబితాను ప్రకటించారు. 20వ శతాబ్దం ప్రారంభకాలంలో గుజరాత్‌లో నర్సింగ్‌ మెహతా అనే సాధువు షెడ్యూల్డ్‌ కులాల వారిని ‘హరిజన్‌’ అనే పదంతో సంబోధించారు. ఆ పదాన్ని మహాత్మా గాంధీ ఉపయోగించండంతో ఎక్కువ జనాదరణ పొందింది. హరిజన్‌ అనే పత్రికను కూడా గాంధీ నడిపారు. 1965 - 75 మధ్య కాలంలో హరిజనులను దళితులు, దళిత పాథర్లని అన్నారు. నాటి నుంచి హరిజన, దళిత పదాలను షెడ్యూల్డ్‌ కులాల వారందరికీ వర్తింపజేస్తున్నారు. 341వ అధికరణను అనుసరించి అస్పృశ్యులుగా పరిగణించిన వారందరినీ ఎస్సీలుగా పేర్కొంటున్నారు. రాష్ట్రపతి ప్రకటించిన జాబితాలో ఏవైనా మార్పులు చేయాలంటే పార్లమెంటు ఆమోదం తప్పనిసరి.

 

భౌగోళిక విస్తరణ

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో షెడ్యూల్డ్‌ కులాలవారి విస్తరణ ప్రాతిపదికగా మూడు ప్రాంతాలను గుర్తించారు.

 

1) అధిక సంఖ్యలో నివసిస్తున్న ప్రాంతాలు: ఎ) గంగా - సింధూ నదుల పరీవాహక ప్రాంతాలు బి) తీరప్రాంతం. 

సారవంతమైన భూములు, మంచినీటి సరఫరా, వ్యవసాయానికి తగిన వాతావరణం ఉండటంతో గంగా - సింధూ నదీ పరీవాహక ప్రాంతంలో అధిక జనాభా ఉంటుంది. ఇక్కడ ఎన్నోరకాల పంటలు పండిస్తూ సంప్రదాయ వ్యవసాయాన్ని ప్రజలు సాగిస్తుంటారు. ఇక్కడ అధిక సంఖ్యలో షెడ్యూల్డ్‌ కులాల వారూ ఉన్నారు. వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. వారికి ఈ ప్రాంతంలో వ్యవసాయపరంగా సంవత్సరమంతా ఏదో ఒక పని లభిస్తుంటుంది.

2) మధ్యస్థంగా ఎస్సీలు ఉన్న ప్రాంతాలు: దక్షిణ భారత మైదాన ప్రాంతాల్లోనూ ఎస్సీలు నివసిస్తున్నారు. తూర్పున ఒడిశా తీరం నుంచి దక్షిణంగా ఆంధ్ర, తమిళనాడు; పశ్చిమంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో వీరి విస్తరణ ఉంది. ఇక్కడ వ్యవసాయ పనులు సాధారణంగా ఉంటాయి. దాంతో ఎస్సీ జనాభా గంగా - సింధూ నదీ పరీవాహక ప్రాంతంతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. కోస్తా ప్రాంతాల్లో సారవంతమైన వ్యవసాయ భూములు ఉండటంతో రైతులు అధికంగా నివసిస్తుంటారు. వ్యవసాయ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి. దాంతో షెడ్యూల్డ్‌ కులాల జనాభా కూడా ఇక్కడ మధ్యస్థంగా విస్తరించింది. 

3) అతి స్వల్ప ఎస్సీ జనాభా ఉన్న ప్రాంతాలు: షెడ్యూల్డ్‌ కులాలవారు మధ్య వింధ్య, చోటానాగపుర్‌ ప్రాంతాల్లో తక్కువగా ఉంటున్నారు. రాజస్థాన్‌లోని పశ్చిమ ప్రాంతం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొండ ప్రాంతాలు, హిమాచల్‌ప్రదేశ్‌లోని పర్వతారణ్యాలు, కర్ణాటక, మహారాష్ట్రలోని తీర ప్రాంతాల్లో కొద్దిసంఖ్యలో కనిపిస్తారు.

 

వివిధ కులాలు

  భారతదేశంలోని ఎస్సీలను వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. చమార్లు, భంగీ, నామశూద్ర, మాలి, దుసాద్, కోలి, మహార్, పాసి, ఆది ద్రవిడ, ఆది కర్ణాటక, మాదిగ, మాల లాంటి పేర్లు వ్యవహారంలో ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎస్సీల జాబితా ఉంటుంది. దేశంలో 1208 షెడ్యూల్డ్‌ కులాలు ఉన్నాయి. కర్ణాటకలో (101 కులాలు) అధికంగా, దాద్రానగర్‌ హవేలీలో (4 కులాలు) తక్కువగా ఉన్నాయి 


 

షెడ్యూల్డ్‌ కులాల జనాభా

  2011లో షెడ్యూల్డ్‌ కులాల జనాభా 20.14 కోట్లు. దేశ జనాభాలో వీరు 16.6 శాతంగా ఉన్నారు. 1961లో ఉన్న జనాభా కంటే ఇది సుమారు మూడు రెట్లు ఎక్కువ. సాధారణ జనాభాలో షెడ్యూల్డ్‌ కులాల నిష్పత్తి కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. పంజాబ్‌లో 31.9%, హిమాచల్‌ప్రదేశ్‌లో 25.2%, పశ్చిమ బెంగాల్‌లో 23.5%గా ఉంది. షెడ్యూల్డ్‌ కులాల మొత్తం జనాభాలో 84% గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, కౌలుదార్లు, ఉపాంత రైతులుగా ఉన్నారు.

 

జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ జనాభా వివరాలు

 

రకరకాల అశక్తతలు

షెడ్యూల్డ్‌ కులాల ప్రజలు ప్రాచీన కాలం నుంచి నేటి వరకు అనేక రకాల అశక్తతలకు (వెనుకబాటుతనాలకు) గురవుతున్నారు. స్థూలంగా వాటిని అయిదు రకాలుగా వర్గీకరించారు.

* సామాజిక అశక్తతలు

* విద్యాపరమైన అశక్తతలు

* ఆర్థిక అశక్తతలు

* రాజకీయ అశక్తతలు

* మతపరమైన అశక్తతలు

 

సామాజిక అశక్తతలు: షెడ్యూల్డ్‌ కులాల వారిని అస్పృశ్యులుగా భావించడంతో కులశ్రేణిలో అట్టడుగు వర్గంగా చేర్చారు. దాంతో వారిని తాకితే మైలపడిపోతామనే అపోహలతో సామాజికంగా వేరుచేశారు. ఉన్నత, షెడ్యూల్డ్‌ కులాల వారి మధ్య ఎంతదూరం ఉండాలనే విషయాన్నీ కులవ్యవస్థ నిర్ణయించేది. తిరువనంతపురంలో ఉన్నత కులాల వారి నుంచి  ఎస్సీలు దాదాపు 40 - 80 అడుగుల దూరంలో ఉండాలనే నియమం ఉండేది. ఇంకా అనేక రకాల ఆంక్షలు విధించేవారు. షెడ్యూల్డ్‌ కులాల వారు గుర్రపు స్వారీ చేయకూడదు. విలువైన దుస్తులు ధరించకూడదు. గొడుగు వాడకూడదు. నవదంపతులు పల్లకిలో ఊరేగకూడదు. వారు తాకితే నీరు మైలపడుతుందంటూ ఊరి బావి నుంచి నీటిని తోడకూడదనే ఆంక్షలు అమలు చేసేవారు. కొన్ని ప్రాంతాల్లో వీరు బావి వరకు వెళ్లే అవకాశం ఉండేది. కానీ అందరికీ ఉపయోగపడే గుంటలు, జలాశయాలను మాత్రం ఉపయోగించుకునే  వీలు ఉండేది కాదు. ఈ నేపథ్యంలో కొంతమంది ఎస్సీలు బ్రిటిష్‌ పాలనలో క్రైస్తవ మతాన్ని, స్వాతంత్య్రానంతరం బౌద్ధమతాన్ని స్వీకరించారు. దాంతో వారికి సమాజంలో కొంతమేరకు గౌరవం లభించడం మొదలైంది.

 

విద్యాపరమైన అశక్తతలు: షెడ్యూల్డ్‌ కులాల వారికి విద్య లేకపోవడం మరొక అశక్తత. కులవ్యవస్థ నియమాలను అనుసరించి వారికి విద్య లేకుండా చేశారు. షెడ్యూల్డ్‌ కులాల వారి పిల్లలు పాఠశాలలో చేరితే ఉన్నత కులాలకు చెందిన పిల్లలు ఆ పాఠశాలలో చేరేవారు కాదు.

ఉదా: తమిళనాడులో పరయ కులానికి చెందిన పిల్లలను, మహారాష్ట్రలో మహర్‌ కులానికి చెందిన పిల్లలను పాఠశాలలోకి రానిచ్చేవారు కాదు. పర్యవసానంగా వారు  నిరక్షరాస్యులుగా మిగిలిపోయారు

 

ఆర్థిక అశక్తతలు: షెడ్యూల్డ్‌ కులాల వారు సాంఘిక, విద్యాపరమైన అశక్తతలకే కాకుండా ఆర్థిక అశక్తతలకు కూడా లోనయ్యారు. వారు అశూచి వృత్తిని చేపట్టారు. వీరు కొన్ని చోట్ల చెత్తా చెదారం తీసివేసే కార్మికులుగా, మరికొన్ని చోట్ల మానవ మలాన్ని తీసే శ్రామికులుగా, పశువుల మృత కళేబరాలను తీసే వారిగా ఉంటూ వృత్తిపరంగా తక్కువ స్థాయిలో ఉండిపోయారు. దక్షిణ భారతదేశంలో షెడ్యూల్డ్‌ కులాల వారు భూమిని అమ్మాలనుకుంటే దాన్ని ఉన్నత కులాల వారికి మాత్రమే అమ్మాలని, అది కూడా తక్కువ ధరకే ఇవ్వాలని అలా చేయకపోతే వారి పంటలకు నీటి వసతి లేకుండా చేసేవారు. 


రాజకీయ అశక్తతలు: షెడ్యూల్డ్‌ కులాల వారు అనేక రాజకీయ అశక్తతలకూ గురయ్యారు. గ్రామంలో లేదా బస్తీలో లేదా నగరాల్లోని పాలక వర్గాల్లో వారికి సభ్యత్వం ఉండేది కాదు. అందువల్ల సామాజిక, రాజకీయ కార్యకలపాల్లో భాగస్వాములు కాలేకపోయేవారు. పరిపాలనలోనూ ఎస్సీలకు స్థానం లభించేదికాదు. ఆంగ్లేయుల పాలనలో ఓటు హక్కు కల్పించినప్పటికీ దాన్ని వారు ఎప్పుడూ సద్వినియోగం చేసుకోలేకపోయారు.ఆ విధంగా దేశ రాజకీయాల్లో పాలుపంచుకునే అవకాశం లేకుండా పోయింది

 

మతపరమైన అశక్తతలు: ఎస్సీలు మతపరమైన వివక్షలకు గురయ్యారు. వారికి దేవాలయ ప్రవేశం ఉండేది కాదు. శ్మశాన వాటికలు, స్నాన వాటికలను ఉపయోగించకూడదనే నియమం ఉండేది. వేదాలు, పురాణాలు లాంటి ధార్మిక గ్రంథాలను చదవకూడదనే ఆంక్షలు పెట్టేవారు. 

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌ రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 తెలంగాణ సామాజిక పరిస్థితులు

  భారతీయ సమాజం

 బంధుత్వం - అనుబంధం

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 24-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతీయ సమాజం-మత, సాంస్కృతిక భిన్నత్వం

బహు భాషలు.. బహుళ జాతులు!

భౌగోళికంగా భూగోళం మొత్తాన్ని తలపించే వాతావరణ పరిస్థితులతో భారత ద్వీపకల్పం ఉపఖండంగా ప్రసిద్ధి చెందింది. దాంతోపాటు రకరకాల జాతులు, భాషలు, సంస్కృతులు, జీవన విధానాలతో వేల సంవత్సరాలుగా వర్థిల్లుతోంది. ఇంతటి వైవిధ్యం ఎలా సాధ్యమైంది? చూడగానే ఎవరు ఏ ప్రాంతానికి చెందినవారో తేలిగ్గా గుర్తించగలిగేట్లుగా జనాభా అభివృద్ధి ఏవిధంగా జరిగింది? సమాజ నిర్మాణం అధ్యయనంలో భాగంగా ఈ అంశాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. 

 

భారత భూభాగానికి ఇండియా అనే పేరు ఇండస్‌ నది నుంచి వచ్చింది. ఇది పంజాబ్‌లో ఉంది. వేదకాలం నాటి ఆర్యులు దీన్ని హిందూ అని పిలిచేవారు. ఆంగ్లేయుల వల్ల అది ఇండియాగా మారింది. భరతుడు పరిపాలించిన దేశం కాబట్టి భారతదేశంగా పిలుస్తున్నారు. మన దేశానికి వలస వచ్చిన ఆర్యుల్లో ‘భారత’ అనే సుప్రసిద్ధ తెగవారు పరిపాలించారు కాబట్టి భారతదేశం అనే పేరు వచ్చిందని కూడా చెబుతుంటారు.

 

భారత సమాజం అతి పురాతనమైంది. పూర్వం నుంచి వివిధ కాలాల్లో బయటి నుంచి విభిన్న జాతి, భాష, మత సమూహాలకు చెందిన ప్రజలు మన దేశానికి వచ్చి స్థిరపడ్డారు. అందువల్ల భారతదేశంలో వివిధ జాతులు, భాషలు, మతాలు, సంస్కృతి, సమూహాల మధ్య వైవిధ్యం కనిపిస్తుంది. భారత సమాజ మౌలిక లక్షణాల్లో సమష్టి కుటుంబం, కులవ్యవస్థ, గ్రామీణ సముదాయాలు ముఖ్యమైనవి. భారతీయ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో నేటికీ ఈ లక్షణాలు ప్రాధాన్యాంశాలుగా ఉన్నాయి.

* ప్రస్తుతం సుమారు 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని అయిదు ప్రధాన సంస్కృతి సమూహాలుగా విభజించారు. 

1) ఉత్తర ప్రాంతం: దీనిలో పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన సంస్కృతులు ఉన్న సమూహాలు ఉన్నాయి.

2) దక్షిణ ప్రాంతం: ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి.

3) తూర్పు ప్రాంతం: ఇందులో మరాఠీ, గుజరాతీ సంస్కృతులు ఉన్నాయి.

4) పశ్చిమ ప్రాంతం: ఇక్కడ మరాఠీ సంస్కృతి ఉంది.

5) ప్రత్యేక సమూహం: భారతదేశంలో ఉన్న ఆదిమ తెగను ప్రత్యేక సాంస్కృతిక సమూహంగా చెప్పవచ్చు.

    వివరించిన ఈ భేదాలే కాకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీలతో పాటు వివిధ మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఇలాంటి భిన్నత్వ లక్షణాలు భారతీయ సమాజంలోనే కనిపిస్తాయి.

 

లక్షణాలు

భౌగోళిక వైవిధ్యం: భారతదేశం ఆసియా ఖండంలో దక్షిణ మధ్య భాగంలో ఉన్న ద్వీపకల్ప దేశం. దీని విస్తీర్ణం 30,53,597 చ.కి.మీ. భారత్‌కు ఉత్తరాన హిమాలయ పర్వతాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా మహాసముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. ప్రధాన భూభాగంలో సువిశాల గంగా సింధూ మైదానం, ఎడారులు, వింధ్య పర్వతాలు, దక్కన్‌ పీఠభూమి ఉన్నాయి. అనేక జీవనదుల పుట్టిల్లు. అందుకే దీన్ని ప్రపంచ సంగ్రహ స్వరూపంగా అభివర్ణించారు. ఇక్కడ శీతోష్ణస్థితి, వర్షపాతం, రుతుపవనాలు ప్రాంతాల వారీగా భిన్నంగా ఉంటాయి. ప్రజల జీవన విధానంలోనూ వైవిధ్యం కనిపిస్తుంది.

 

సామాజిక నిర్మితి: సామాజిక లక్ష్యాలను సాధించడానికి వ్యక్తులు నిర్ణీత ప్రమాణాలను అనుసరిస్తూ, అనుబంధ పాత్రలను నిర్వహిస్తూ అనేక సంబంధాలు రూపొందించుకుంటారు. ఇలా ఏర్పడిన సామాజిక సంబంధాల సమూహాన్నే సామాజిక నిర్మితి అంటారు. భారతీయ సమాజంలో అనేక సంస్థలు, సమూహాలు, సంఘాలు, సముదాయాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి భారతీయ సామాజిక నిర్మితిగా పేర్కొంటారు. 

 

జాతి విభాగాలు: శరీర రంగు, తల వెంట్రుకలు, ముక్కు లాంటి భాగాలకు చెందిన జైవిక లక్షణాలు, భాష, సంస్కృతుల్లో ప్రత్యేకతను కలిగి, ఒక నిర్ణీత భౌగోళిక ప్రాంతానికి చెందిన మానవ సమూహాన్ని జాతి అంటారు. రేమండ్‌ ఫిర్త్‌ అభిప్రాయంలో జాతి అంటే అనువంశికంగా పొందే కొన్ని ప్రత్యేక శారీరక లక్షణాలు ఉన్న సమూహం.

* బి.ఎస్‌.గుహ ప్రకారం భారతదేశంలో ఆరు ప్రధాన జాతులు ఉన్నాయి. అవి నిగ్రిటో, ప్రోటో అస్ట్రలాయిడ్, మంగోలాయిడ్,  మెడిటరేనియన్‌ లేదా మెడిటరేనియస్, వెస్ట్రన్‌ బ్రాకీసెఫాలిక్, నార్డిక్‌.

* మన దేశంలో అధిక సంఖ్యాకులు కాకసాయిడ్‌ జాతికి చెందుతారు. ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడులోని బ్రాహ్మణులు; పంజాబ్‌లోని సిక్కులు, గుజరాత్‌లోని నాగర బ్రాహ్మణులు ఈ జాతికి చెందినవారే. వీరి శరీరం కొద్దిపాటి తేడాలతో తెలుపు నుంచి గోధుమ వర్ణంలో ఉంటుంది. తల వెంట్రుకలు మృదువుగా ఉంటాయి. కంటిపాపలు నీలం లేదా గోధుమ రంగులో ఉంటాయి. నాసిక (ముక్కు) ఎత్తుగా, సన్నగా ఉంటుంది.

* హిమాలయ పర్వత ప్రాంతాల్లో నివసించే భారతీయులు మంగోలాయిడ్‌ జాతికి చెందినవారు. వీరి శరీర ఛాయ పసుపు రంగు నుంచి లేత గోధుమ రంగులో ఉంటుంది. కళ్లు రెండు సన్నని చీలికలుగా ఉంటాయి. తల గుండ్రంగా, ముక్కు పొట్టిగా అణిగి ఉంటుంది. వీరిని సులభంగా గుర్తించవచ్చు.

* ప్రస్తుతం నీగ్రో జాతి లక్షణాలున్నవారు భారతదేశంలో తక్కువగా ఉన్నారు. వీరి శరీర ఛాయ గోధుమ రంగు నుంచి నలుపు రంగు వరకు కొద్దిపాటి తేడాలతో ఉంటుంది. శిరోజాలు మెలికలు తిరిగి ఉంటాయి. ముక్కు వెడల్పుగా, నోరు పెద్దదిగా, పెదవులు పైకి తిరిగి లావుగా ఉంటాయి. అండమాన్‌ దీవుల్లో నివసించే తెగలు, కేరళలోని కొడార్, మధుర ప్రాంతంలోని ఫలియాన్, ఆంధ్రప్రదేశ్‌లోని చెంచులు, మహారాష్ట్రలోని నిభిల్‌ తెగల వారిలో నీగ్రో జాతి లక్షణాలు కనిపిస్తాయి.

 

భాషాపరమైన సంయోజనం: సంస్కృతి వికాసం, సామాజిక సమైక్యత, భావప్రాసారానికి తోడ్పడే సాధనాల్లో భాష ప్రధానపాత్ర పోషిస్తుంది. బహుళ భాషా సమూహాలతో ఉన్న మన దేశంలో 1652 భాషలు, మాండలికాలు ఉన్నాయి. వీటిలో 23 భాషలు మాట్లాడే ప్రజలే దేశ జనాభాలో 97% ఉన్నారు. ఈ భాషలనే రాజ్యాంగం గుర్తించింది. భారతీయులు మాట్లాడే భాషలు అయిదు భాషా కుటుంబాలకు చెందినవి.

* ఆస్ట్రిన్‌ 

* ఇండో-ఆర్యన్‌ 

* ద్రావిడ 

* సైవో-టిబెటన్‌

* యూరోపియన్‌

 

    ఇండో-ఆర్యన్‌ భాషలు మాట్లాడేవారు 73 శాతం, ద్రావిడ భాషలు మాట్లాడేవారు 20 శాతం; ఆస్ట్రిన్, యూరోపియన్‌ భాషలు మాట్లాడేవారు 13 శాతం, సైనో-టిబెటన్‌ భాషలు మాట్లాడేవారు 0.08 శాతం ఉన్నారు. ఇతర భాషలు మాట్లాడేవారు 4.47 శాతం ఉన్నారు.

ఆస్ట్రిన్‌ భాషా కుటుంబం: భారతదేశంలో మధ్య, ఈశాన్య ప్రాంతాల్లోని గిరిజనులు మాట్లాడే భాషల మాండలికాలు ఈ భాషా కుటుంబానికి చెందినవే. వీటిని మాట్లాడే వారిలో సంతాల్, ముండా, హూ, భిల్లులు, గోండులు ఉన్నారు.

ఇండో-ఆర్యన్‌ భాషా కుటుంబం: దేశ జనాభాలో అధికశాతం ఈ భాషా కుటుంబానికి చెందినవారే. దీనిలో హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, రాజస్థానీ, అస్సామీ, సంస్కృతం, సింధీ, కశ్మీరీ, ఉర్దూ లాంటి భాషలు ఉన్నాయి.

ద్రావిడ భాషా కుటుంబం: ఈ భాషా కుటుంబంలో దక్షిణ భారతదేశంలోని ప్రజలు మాట్లాడే భాషల మాండలికాలు ఉంటాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇందులోనివే.

సైనో-టిబెట్‌ భాషా కుటుంబం: దీనిలో ఈశాన్య భారతానికి చెందిన కొన్ని ఆదిమ తెగల భాషల మాండలికాలు ఉన్నాయి.

యూరోపియన్‌ భాషా కుటుంబం: ఇందులో ఇంగ్లిష్, పోర్చుగీస్, ఫ్రెంచి భాషలు ఉన్నాయి. గోవాలో పోర్చుగీసు, పుదుచ్చేరిలో ఫ్రెంచి భాషలు వాడుకలో ఉన్నాయి.

         హిందీని జాతీయ భాషగా, అధికార భాషగా; ఇంగ్లిష్‌ను అసోసియేట్‌ భాషగా గుర్తించారు. గతంలో సంస్కృతంలా ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌ భాషలు భారతీయ భాషల మధ్య వారధిగా ఉపకరిస్తున్నాయి. జాతీయ సమైక్యతను పెంపొందించడంలో వీటి పాత్ర గణనీయమైంది.

2011 లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో హిందీ మాట్లాడేవారు 52.83 కోట్లు (43.63%), బెంగాలీ మాట్లాడేవారు 9.72 కోట్లు (8.03%), మరాఠి మాట్లాడేవారు 8.30 కోట్లు (6.86%), తెలుగు మాట్లాడేవారు 8.11 కోట్లు (6.70%), తమిళం మాట్లాడేవారు 6.90 కోట్లు (5.70%), ఉర్దూ మాట్లాడేవారు 5.07 కోట్లు (4.19%), గుజరాతి మాట్లాడేవారు 5.54 కోట్లు (4.58%), మలయాళం మాట్లాడేవారు 3.48 కోట్లు (2.88%), పంజాబీ మాట్లాడేవారు 3.31 కోట్లు ( 2.74%), కన్నడ మాట్లాడేవారు 4.37 కోట్లు (3.61%) మంది ఉన్నారు. 

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌ రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

‣ కుటుంబం రకాలు

‣ పెళ్లి.. నాటి ప్రమాణాలు 

‣ బంధుత్వం - అనుబంధం

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

Posted Date : 16-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వ్యక్తులు, సమూహాలు, సముదాయాలు, సామాజిక సంస్థలు, సంబంధాలు

మాదిరి ప్రశ్నలు

1. కుటుంబం అనేది ఒక ... ?
ఎ) ప్రాథమిక సమూహం బి) ప్రాథమిక సమితి సి) గౌణ సముదాయం డి) ప్రాథమిక సముదాయం
జ: (ఎ)

 

2. కిందివాటిలో సామాజిక సంస్థలు కానిది ఏది?
ఎ) బంధుత్వం బి) మతం సి) జైలు డి) వివాహం
జ: (సి)

 

3. కులం అనేది ఒక ... ?
ఎ) బహిర్వివాహ సముదాయం బి) బహిర్వివాహ సమూహం సి) అంతర్వివాహ సముదాయం డి) అంతర్వివాహ సమూహం
జ: (డి)

 

4. భారతీయ సమాజంలో దిగువ కులాలు, ఆదిమ తెగలకు చెందిన కొందరు ఉన్నత కులాల జీవన విధానం వైపు పయనించే ప్రక్రియను ఏమంటారు?
ఎ) పాశ్చాత్యీకరణ బి) ఆధునికీకరణ సి) లౌకికీకరణ డి) సంస్కృతీకరణ
జ: (డి)

 

5. 'ఎఫినల్ కిన్‌షిప్' అనే బంధుత్వం ఏవిధంగా ఏర్పడుతుంది?
ఎ) దత్తత తీసుకోవడం బి) రక్త సంబంధం సి) వివాహ బంధం డి) సహజసిద్ధంగా
జ: (బి)

 

6. మతాన్ని ఒక సామాజిక దృగ్విషయంగా, వైయక్తిక అనుభవంగా పేర్కొన్నది ఎవరు?
ఎ) ఎం.ఎన్.శ్రీనివాస్ బి) మలినోస్కి సి) మదన్ మజుందర్ డి) మెకైవర్
జ: (బి)

 

7. ఒక వ్యక్తి గ్రూప్-2 అధికారిగా పాత్ర నిర్వహించడాన్ని కిందివాటిలో ఏ అంతస్తుగా చెప్పవచ్చు?
ఎ) ఎస్క్రైబ్‌డ్ స్టేటస్ బి) సహజ అంతస్తు సి) ఎచీవ్డ్ స్టేటస్ డి) ఏదీకాదు
జ: (సి)

 

8. ఉమ్మడి కుటుంబంలో పెద్దను ఏమని పిలుస్తారు?
ఎ) ప్రవక్త బి) కుటుంబ పెద్ద సి) కర్త డి) నియుక్త
జ: (సి)

 

9. నాయర్‌లలో ఉమ్మడి కుటుంబాన్ని ఏమని పిలుస్తారు?
ఎ) పర్వాడ్ బి) గోటుల్ సి) ఉమ్మడి కుటుంబం డి) తార్వాడ్
జ: (డి)

 

10. ఏకరక్త బంధుత్వాన్ని ఏమని పిలుస్తారు?
ఎ) కన్‌సాంగ్వీనీయల్ కిన్‌షిప్ బి) అఫినల్ కిన్‌షిప్ సి) అడాప్టెడ్ కిన్‌షిప్ డి) ఏదీకాదు
జ: (ఎ)

Posted Date : 13-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వ్యక్తులు, సమూహాలు, సముదాయాలు, సామాజిక సంస్థలు, సంబంధాలు

సమాజం.. సమాజ నిర్మితిని అర్థం చేసుకోవాలంటే అందులోని ప్రాథమిక భావనలు, అనుబంధ అంశాల గురించి తెలుసుకోవాలి. ప్రాథమిక భావనలైన వ్యక్తులు, సమూహాలు, సముదాయాలు, సామాజిక సంస్థలు, సంబంధాలు, ఇతర అనుబంధ విషయాలను అర్థం చేసుకోవాలి. కులం, వివాహం, కుటుంబం, బంధుత్వం, మతం వంటివాటిపై అవగాహన అవసరం. వీటిని అధ్యయనం చేయడం ద్వారా ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
కొద్దిమంది వ్యక్తులు కలిసి ఒక సమూహంగా ఏర్పడతారు. దీన్నే 'గ్రూప్' అని పిలుస్తారు. కుటుంబం ఒక ప్రాథమిక సమూహం. ఒకే విధమైన అభిరుచులున్నవారు సమూహంగా ఏర్పడితే దాన్ని 'గౌణ సమూహం'గా పిలవొచ్చు. కొన్ని సమూహాలను కలిపి సముదాయంగా పేర్కొంటారు.
ఉదా: గ్రామీణ, నగర, పట్టణ సముదాయాలు. సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా కొన్ని ప్రాథమిక భావనలపై అవగాహన ఉండాలి. అవి..
1. వ్యక్తులు (ఇండివిడ్యువల్స్)
2. సమూహం (గ్రూప్)
3. సముదాయం (కమ్యూనిటీ)
4. సామాజిక సంబంధాలు (సోషల్ రిలేషన్స్)
5. సామాజిక సంస్థలు (సోషల్ ఇన్‌స్టిట్యూషన్స్)


వ్యక్తులు
వ్యక్తి సమాజానికి పునాది. సంఘజీవిగా ప్రఖ్యాత శాస్త్రవేత్తలు చెప్పే ఈ వ్యక్తులతోనే సమాజం నిర్మితమవుతుంది.

సమూహం
కొద్దిమంది వ్యక్తుల కలయికే సమూహం. కుటుంబం ఒక ప్రాథమిక సమూహం. ఈ సమూహంలో వ్యక్తుల మధ్య ముఖాముఖి పరిచయాలుంటాయి. వ్యక్తులు తమ అభిరుచులకు అనుగుణంగా వివిధ సంఘాల్లో సభ్యులుగా ఉంటారు. వీటిని గౌణ / ద్వితీయ సమూహాలుగా పేర్కొంటారు. విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు మొదలైనవి వీటికి ఉదాహరణ.

సముదాయం
కొన్ని సమూహాల కలయికను సముదాయంగా పేర్కొంటారు. నగర, గ్రామీణ, పట్టణ సముదాయాలను ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రాథమిక, గౌణ సమూహాల్లోని సభ్యులు సముదాయంలో భాగంగా ఉంటారు. సముదాయాలు సమూహాల కంటే పెద్ద పరిమాణంలో ఉంటాయి. నగరాలు, పట్టణాల్లో ఉండే కమ్యూనిటీ భవనాలను సముదాయాల్లోని సభ్యుల అవసరాల కోసం నిర్మిస్తారు.

సామాజిక సంబంధాలు
సమూహం, సముదాయాల్లో సభ్యులుగా ఉన్న వ్యక్తులు వివిధ పాత్రలను నిర్వర్తిస్తారు. ఉదాహరణకు తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, ఉపాధ్యాయుడు, సంఘ సభ్యుడు ఛైర్మన్. ఒక వ్యక్తి వివిధ పాత్రలను పోషిస్తూ ఇతరులతో సంబంధాలను కలిగి ఉంటాడు. ఈ పరస్పర సంబంధాలను 'సామాజిక సంబంధాలు' అని అంటారు. అందుకే సమాజాన్ని సామాజిక సంబంధాల అల్లికగా నిపుణులు అభివర్ణిస్తారు. ఈ సామాజిక సంబంధాలను కలిపితే ఒక వలలా లేదా సాలెగూడులా కనిపిస్తుంది.

సామాజిక సంస్థలు
ఇవి సమాజంలోని వ్యక్తులు, సమూహాలు, సముదాయాలను కలుపుతూ, క్రమబద్ధీకరిస్తూ, ప్రవర్తనను నియంత్రిస్తూ ఉంటాయి. ఉదాహరణకు కుటుంబం, వివాహం, బంధుత్వం, మతం, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ. ఈ సామాజిక సంస్థలు వేల సంవత్సరాలకు పైగా కొనసాగుతుంటాయి.
* కార్మిక లేదా విద్యార్థి సంఘాలు వంటి ఇతర సంస్థలు / సంఘాలు వ్యక్తి మేధోపరమైన లేదా ఇతర అవసరాలను తీరుస్తుంటాయి. వీటి ఉనికి కొద్ది సంవత్సరాలు లేదా సామాజిక సంస్థలతో పోలిస్తే తక్కువ కాలం ఉంటుంది.
* కచ్చితమైన నియమ నిబంధనలతో సామాజిక సంస్థలు తరతరాలుగా కొనసాగుతాయి. ఇతర సంఘాలు / సంస్థల్లో నియమ నిబంధనలున్నప్పటికీ ఎక్కువ కాలం కొనసాగలేవు.


ప్రాతిపదికలు
వివిధ రకాల సామాజిక సంస్థలను కింది అంశాల ప్రాతిపదికన వివరించవచ్చు. అవి..
1. కులం, 2. వివాహం, 3. బంధుత్వం, 4. కుటుంబం, 5. మతం, 6. రాజకీయ వ్యవస్థ, 7. ఆర్థికవ్యస్థాపన 8. సంస్కృతి


కులం
ఇది అంతర్వివాహ సమూహం. ఇందులో క్రమానుగతశ్రేణి, ఆహార, సామాజిక సంబంధాల్లో కట్టుబాట్లు, వృత్తి, వివాహాల్లో నిర్బంధాలు కనిపిస్తాయి.
లక్షణాలు: స్తరీకరణ, క్రమానుగత శ్రేణి, ఆహార నియమాలు, సామాజిక కట్టుబాట్లు, వృత్తి నిర్బంధాలు, వివాహ నిర్బంధాలు - నియమాలు వంటివి.
కుల ఆవిర్భావ సిద్ధాంతాలు: దైవ సిద్ధాంతం, వృత్తి సిద్ధాంతం, జాతి సిద్ధాంతం, భౌగోళిక సిద్ధాంతం, సంస్కార సిద్ధాంతం, బ్రాహ్మణ సిద్ధాంతం, సంఘర్షణ సిద్ధాంతం
కులవ్యవస్థలో మార్పులు: బ్రిటిషర్ల, సంఘ సంస్కర్తల ప్రభావం.. పారిశ్రామికీకరణ.. కులవృత్తులు, ఆధునిక జీవన విధానం, రాజకీయ-ఆర్థిక రంగాలు, వివాహ నియమాలు - వీటిలో మారుతున్న పరిణామాలు.. తదితర కారణాల వల్ల కులవ్యవస్థలో మార్పులొచ్చాయి. సంస్కృతీకరణ, పాశ్చాత్యీకరణ, లౌకికీకరణలు కూడా కులవ్యవస్థలో విపరీతమైన మార్పులకు కారణమయ్యాయి.


వివాహం
ప్రపంచంలోని అన్ని సమాజాలు, తెగల్లోనూ వివాహం ఉంది. ఒక్కోచోట ఒక్కోరీతిలో వివాహాలు జరుగుతాయి. వ్యక్తి తన భౌతిక, లైంగిక అవసరాలను తీర్చుకోవడానికి వివాహ వ్యవస్థను ఏర్పరుచుకున్నాడు. వివాహాల్లో నియమావళి, ఆర్థిక వ్యవహారాలు, ఆచారాలు కనిపిస్తాయి.

బంధుత్వం
కుటుంబంలోని వ్యక్తికీ వ్యక్తికీ మధ్య, సముదాయంలో వివిధ వ్యక్తుల మధ్య ఉండే సంబంధాలను బంధుత్వం అంటారు. బంధుత్వమనేది వివాహం, ప్రత్యుత్పత్తి ద్వారా వ్యక్తుల మధ్య ఏర్పడే సంబంధం. ఇది రెండు విధాలుగా ఏర్పడుతుంది.
1. వైవాహిక బంధుత్వం: వివాహం ద్వారా ఏర్పడే బంధుత్వాన్ని వైవాహిక బంధుత్వం అంటారు. దీన్ని 'ఎఫినల్ కిన్‌షిప్' అంటారు.
ఉదా: భార్య, భర్త, అత్త, మామ.
2. ఏకరక్త బంధుత్వం: జన్మతహా ఏర్పడే బంధుత్వాన్ని ఏకరక్త బంధుత్వం అంటారు. అంటే ఏక రక్తసంబంధమున్న వ్యక్తుల మధ్య ఉండే బంధుత్వం.
ఉదా: తండ్రి, కొడుకు, సోదరుడు, సోదరి. ఈ బంధుత్వాన్ని 'కన్‌సాంగ్వినీయల్ కిన్‌షిప్' అంటారు. ఇవే కాకుండా దత్తత తీసుకోవడం ద్వారా దత్త బంధుత్వం ఏర్పడుతుంది.


కుటుంబం
వ్యక్తి సామాజిక జీవనానికి పునాది కుటుంబం. ఈ వ్యవస్థకు పునాది వివాహం. ఇది ఒక ముఖ్యమైన సామాజిక సంస్థ, ప్రాథమిక సమూహం.
లక్షణాలు: విశ్వజనీనత, శాశ్వతత్వం-మార్పు, పరిమిత పరిమాణం, ఉమ్మడి నివాసం, ఆర్థిక సహకారం
కుటుంబ విధులు: లైంగిక సంబంధాల క్రమబద్ధీకరణ, ప్రత్యుత్పత్తి, సాంఘికీకరణ, ఆర్థిక, సాంస్కతిక విధులు.

మతం
మతం విశ్వజనీనమైన విశ్వాసం. ఇ.బి.టేలర్ దీన్ని 'నిరాకార శక్తులపై విశ్వాసం'గా పేర్కొంటే.. మలినోస్కి 'సామాజిక దృగ్విషయం'గా, వైయక్తిక అనుభవంగా అభివర్ణించాడు.
మతం విధులు: ఇది సామాజిక క్రమాన్ని (సోషల్ ఆర్డర్) కొనసాగిస్తుంది. వ్యక్తి భావోద్వేగాలను సమన్వయం చేస్తుంది. సాంస్కృతిక విలువలను పరిరక్షిస్తుంది. భయాలను తొలగించి, కారణాలను వివరిస్తుంది. సమగ్రతకు తోడ్పడుతుంది. సమాజంలో మతం పుట్టుకకు సంబంధించి వివిధ సిద్ధాంతాలున్నాయి. వాటిలో సర్వాత్మవాదం, జీవాత్మవాదం, ప్రకృతివాదం, టోటెంవాదం, ప్రకార్యవాదం ముఖ్యమైనవి.


రాజకీయ వ్యవస్థ
సమాజంలో నియంత్రణ యంత్రాంగంలో రాజకీయ వ్యవస్థ ప్రధానమైంది. ఆధునిక సమాజంలో ఉన్న పోలీసులు, న్యాయస్థానాలు, జైళ్లు, శిక్షలు.. సామాజిక నియంత్రణగా పని చేస్తున్నాయి. ఇవన్నీ వ్యవస్థీకృతమైన నియమనిబంధనల ప్రకారం విధులను నిర్వర్తిస్తాయి. మొత్తం రాజకీయ / రాజ్యవ్యవస్థను సామాజిక సంస్థగా పేర్కొంటారు. జానపద, సామాజిక రీతులు; కట్టుబాట్లు, సామాజిక ఆమోదాలు, ఆచారాలు, విధివిధానాలు, చట్టాలు ఇందులో భాగంగా ఉంటాయి. మొత్తం పరిపాలన, రాజ్య వ్యవస్థలను కలిపి సామాజిక సంస్థగా పేర్కొంటారు.

ఆర్థిక వ్యవస్థాపన
ఆర్థిక సంబంధాలు ఒక సమాజ సముదాయక, సాంస్కృతిక నిర్మాణాన్ని రూపుదిద్దడంలో దోహదపడతాయి. ఒక సమాజ సాంస్కృతిక జీవనాన్ని అధ్యయనం చేయడానికి ఆర్థిక వ్యవస్థాపన ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని సామాజిక సంస్థల్లో భాగంగా అధ్యయనం చేస్తారు. ఆదిమ ఆర్థిక వ్యవస్థలో మారకం ప్రధాన పాత్ర పోషిస్తే, ఆధునిక సమాజాల్లో పంపిణీ, వర్తకం ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

సంస్కృతి
ఇది సంస్కారమనే పదానికి పర్యాయ పదంగా వాడుకలో ఉంది. సంస్కృతి ఒక సమాజాన్ని ఇతర సమాజాల నుంచి వేరు చేస్తుంది. ఒక్కో సమాజం ఒక్కో రకమైన సంస్కృతిని కలిగి ఉంటుంది.
భాష, ఆహార అలవాట్లు, వేషధారణ, వృత్తులు, కళలు, రవాణా సదుపాయాలు, యుద్ధసామగ్రి, కర్మకాండలు మొదలైన ఇతర సామాజిక సంస్థలు సంస్కృతిలో భాగంగా ఉంటాయి.


ఇతర ముఖ్య భావనలు
సమాజాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు భారతీయ సంప్రదాయ, ఆధునిక సమాజాల్లో కనిపించే ఇతర ముఖ్య భావనలను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అవి..
1. సంస్కృతీకరణ
2. జాజ్‌మానీ వ్యవస్థ
3. స్తరీకరణ
4. పాత్ర
5. అంతస్తు


సంస్కృతీకరణ: ఈ భావనను ప్రవేశపెట్టిన భారతీయ సామాజిక శాస్త్రవేత్త ఎం.ఎన్.శ్రీనివాస్. ఆయన తన పుస్తకం 'రిలీజియన్ అండ్ సొసైటీ ఎమాంగ్ కూర్గుస్‌'లో ఈ పదాన్ని వివరించారు. సంస్కృతీకరణ అంటే దిగువ కులాలు, ఆదిమ తెగలకు చెందిన కొందరు తమ మతపరమైన కర్మకాండలు, ఆచార, పద్ధతులను మార్చి అగ్ర కులాల (ఉపనయన సంస్కారం కలిగిన) వారి జీవన విధానాలను అవలంబిస్తూ అగ్ర కులాలవారి దిశగా పయనించే ప్రక్రియ.

జాజ్‌మానీ వ్యవస్థ: 'జాజ్‌మానీ' అంటే యజమాని అని అర్థం. సంప్రదాయ గ్రామీణ సమాజంలో ఈ జాజ్‌మానీ వ్యవస్థ ఉండేది. గ్రామాల్లో ఉండే వ్యవసాయాధారిత ఉమ్మడి కుటుంబం, సంప్రదాయ వృత్తులకు చెందిన ఇతర కులాలవారు పరస్పరం ఆధారపడి జీవించేవారు. కమ్మరి, కుమ్మరి, రజక, క్షురక, స్వర్ణకార, వడ్రంగి, చర్మకార వృత్తి కులాలవారు సేవల రూపంలో వ్యవసాయ ఉమ్మడి కుటుంబానికి సేవలు చేస్తే సంవత్సరాంతాన ధాన్యాన్ని ప్రతిఫలంగా చెల్లించేవారు. ఈ విధమైన పరస్పరాధారిత వ్యవస్థను జాజ్‌మానీ వ్యవస్థ అంటారు.

స్తరీకరణ: సమాజాన్ని ఒక క్రమానుగత శ్రేణిలో పొరల్లా విభజించడాన్ని స్తరీకరణ అంటారు. ఇందులో ఉన్నత, నిమ్న స్థాయులు కనిపిస్తాయి. భారతీయ సమాజంలో కుల వ్యవస్థను స్తరీకరించిన వ్యవస్థగా లేదా స్తరీకరణకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

పాత్ర: సమాజంలో వ్యక్తులు వివిధ పాత్రలను నిర్వర్తిస్తారు. ఒక వ్యక్తి తండ్రి, కుమారుడు, భర్తగా ప్రాథమిక సమూహంలో వ్యవహరిస్తాడు. అదే వ్యక్తి ఉద్యోగస్థుడిగా మరొక పాత్రను, ఒక సంస్థకు సెక్రటరీగా ఇంకో పాత్రను పోషించవచ్చు. ఈవిధంగా ప్రతి వ్యక్తి తన అభిరుచులకు అనుగుణంగా కొన్ని పాత్రలను పోషిస్తాడు. వ్యక్తి నిర్వర్తించే విధులు, ప్రకార్యాలతో కూడుకున్నదే పాత్ర.


అంతస్తు: వ్యక్తుల వయసు, లింగం, వృత్తి, వైవాహిక స్థితి, ఆర్థిక, సాంస్కృతిక, మత, రాజకీయ స్థితులను బట్టి అంతస్తును కలిగి ఉంటారు. సామాజిక వ్యవస్థలో ఒక వ్యక్తి పొందిన స్థితిని అంతస్తు (స్టేటస్) అని పిలుస్తారు. వ్యక్తులు అంతస్తును రెండు రకాలుగా సంపాదిస్తారు. అవి.. ఆరోపించిన అంతస్తు (ఎస్క్రైబ్‌డ్ స్టేటస్), సంపాదించిన అంతస్తు (ఎచీవ్డ్ స్టేటస్).
* వ్యక్తి పుట్టుక, జైవిక, సామాజిక స్థితులను బట్టి అప్రయత్నంగా, సంప్రదాయంగా లభించిన దాన్ని 'ఆరోపించిన అంతస్తు'గా పిలుస్తారు.ఉదా: కులం, మతం, వయసు, లింగభేదం వంటివి.
* సాధించిన అంతస్తు అంటే వ్యక్తి అర్హత, గుణగణాలను బట్టి పొందిన అంతస్తు. ఉదా: డాక్టర్, ఇంజినీర్, లెక్చరర్ వంటి వృత్తులు.

మానవుడు సామాజిక జంతువు (సంఘ జీవి) - అరిస్టాటిల్
వారసత్వం, అంతర్వివాహ నియమం, సంప్రదాయ వృత్తి సంబంధాలతో కూడిన.. స్థానిక సముదాయ క్రమశ్రేణిలో ఒక ప్రత్యేకమైన అంతస్తును కలిగిన సమూహమే కులం - ఎం.ఎన్.శ్రీనివాస్
స్త్రీ పురుషుల లైంగిక సంబంధాల పర్యవసానంగా ఏర్పడే సామాజిక, ఆర్థిక సంబంధాల్లో పాల్గొనడానికి మత క్రతువు ద్వారా.. లేదా చట్టాలు రూపొందించిన ఇతర పద్ధతుల్లో.. ఒక్కటై, సమాజ ఆమోదం పొందితే దాన్ని వివాహంగా చెప్పవచ్చు - మజుందార్
ఒకేచోట నివసిస్తూ.. ఆర్థిక సహకారం, ప్రత్యుత్పత్తి లక్షణాలున్న ప్రాథమిక సమూహమే కుటుంబం - జి.పి.మర్డాక్
విజ్ఞానం, నమ్మకాలు, కళలు, నీతినియమాలు, చట్టం, ఆచారాలు.. మానవుడు సమాజ సభ్యుడిగా ఉంటూ సముపార్జించుకున్న శక్తి సామర్థ్యాలు, అలవాట్లు.. వీటన్నింటి సంశ్లిష్టతల మొత్తమే సంస్కృతి - ఇ.బి.టేలర్
విజ్ఞానం, నమ్మకాలు, కళలు, నీతినియమాలు, చట్టం, ఆచారాలు.. మానవుడు సమాజ సభ్యుడిగా ఉంటూ సముపార్జించుకున్న శక్తి సామర్థ్యాలు, అలవాట్లు.. వీటన్నింటి సంశ్లిష్టతల మొత్తమే సంస్కృతి - ఇ.బి.టేలర్
సమాజాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే సమాజ శాస్త్రం
సామాజిక సంబంధాల అల్లికే సమాజం -మెకైవర్

 

 

Posted Date : 13-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో స్త్రీలు

 దయనీయ దశదాటి.. సాధికారత దిశగా!

 

 

కనీస మానవ హక్కులు లేవు, అనుకున్నది చేసే స్వేచ్ఛ లేదు, ఆర్థిక స్వాతంత్య్రం లేదు, అధికారం అసలే లేదు. జనాభాలో సగం ఉన్నా పీడనలు, దౌర్జాన్యాలకు గురికాక తప్పడంలేదు. అడుగడుగునా ఆంక్షలు, అణచివేతలు, అసమానతలతో అనాది కాలం నుంచి ఆధునిక యుగం వరకు అతివలు అనేక విధాలుగా వివక్షకు గురవుతూనే ఉన్నారు. వేదకాలంలో మహిళలు ఉన్నతమైన గౌరవాన్ని అందుకున్నప్పటికీ, ఇతిహాస యుగాల్లో వారి స్థాయి క్షీణించింది. మధ్యలో కొద్దిగా మార్పు వచ్చినా బ్రిటిష్‌ పాలనలో మళ్లీ దిగజారింది. స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ రక్షణలతో పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇప్సుడు స్త్రీలు ఆ దయనీయ దశలను దాటి సాధికారత దిశగా సాగుతున్నారు. ఈ పరిణామాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. 

 

 

చారిత్రక అధ్యయనాలు, పౌరాణిక సాహిత్యాల ప్రకారం వైదిక యుగం తొలి దశలో (క్రీ.పూ. 2000-1000) భారతీయ స్త్రీలకు సమాజంలో ఉన్నత స్థానం ఉండేది. రుగ్వేద కాలంలోనూ సమాజం స్త్రీ, పురుషులకు సమాన హోదా కల్పించింది. అప్పట్లో వివాహం తప్పనిసరి కాదు. కేవలం సామాజిక, మతపరమైన విధి.

పురాణ, ఇతిహాసాల కాలంలో స్త్రీల స్థాయి తగ్గిపోయింది. స్త్రీ, పురుష సమానత్వం లేదు. వైదిక విజ్ఞానం స్త్రీలకు అందుబాటులో లేకుండా పోయింది. సీతాదేవి, సతీ అనసూయ, సావిత్రి, దమయంతి లాంటి ఆదర్శప్రాయమైన స్త్రీలకు గౌరవం లభించింది. బౌద్ధ, జైన మతాలు తొలుత స్త్రీల పట్ల ఉదాసీనత చూపించాయి. బుద్ధుడు మొదట మహిళలను బౌద్ధ మతంలో చేర్చుకోడానికి సుముఖత చూపలేదు. తర్వాత కాలంలో బౌద్ధ, జైన మతాల్లో స్త్రీలకు ప్రాధాన్యం పెరిగింది.

15వ శతాబ్దం నాటికి పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. భారతీయ సమాజంలో పునరుజ్జీవన ప్రయత్నాలు జరిగాయి. ఈ విషయంలో భక్తి ఉద్యమం ప్రధాన పాత్ర పోషించింది. భక్తి ఉద్యమకారులు స్త్రీ, పురుష సమానత్వాన్ని; స్త్రీలకు పురుషులతో సమాన అవకాశాలు కల్పించడాన్ని తమ రచనల్లో, కార్యక్రమాల్లో ప్రచారం చేశారు. పరిపాలనా రంగంలోనూ అతివలు విజయవంతంగా పాల్గొన్నారు. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రుద్రమదేవి గురించి మార్కోపోలో తన రచనల్లో పేర్కొన్నాడు.

రజియాబేగం, నూర్జహాన్, మెహరున్నీసా, మాహం అంగా, చాంద్‌బీబీ, తారాబాయి, అహల్యాబాయి వోల్కర్‌ లాంటి స్త్రీలు కూడా రాజ్యాలను పరిపాలించారు. ఆ కాలంలో ప్రసిద్ధి చెందిన వనితల్లో జహనారా, రోషనారా, జేబున్నీసా (ఔరంగజేబు కుమార్తె), జిజియాబాయి (శివాజీ తల్లి) లాంటి వారిని సమర్థ భారత నారీమణులకు ప్రతినిధులుగా ప్రస్తావిస్తారు. 

 

స్త్రీల సాధికారత

సాధికారత అంటే హక్కులను పొందడం, మూర్తిమత్వాభివృద్ధి, స్వయంగా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ. చట్టం ముందు సమానత్వం లేకపోతే సాధికారత ఒక మిథ్యగానే మిగిలిపోతుంది. దేశాభివృద్ధికి స్త్రీల సమానత్వం ఒక మౌలిక అవసరం. మహిళల హోదా దేశ ప్రజాస్వామ్యం, మానవ హక్కుల సక్రమ అమలుకు ఒక సూచిక.

దేశ జనాభాలో సగ భాగం స్త్రీలే. కానీ అక్షరాస్యత రేటు, శ్రామికశక్తి, సహభాగిత రేటు, ఆదాయం లాంటి అంశాల్లో పురుషులతో పోలిస్తే ఎంతో వెనుకబడి ఉన్నారు. భారత ప్రభుత్వం స్త్రీల సామాజిక ఆర్థిక పురోగతి, అభివృద్ధి కోసం వివిధ పథకాలను అమలుచేస్తోంది.

స్త్రీ సాధికారత అంటే స్త్రీలు ఆర్థికంగా, స్వతంత్రంగా ఉండేటట్లు, వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో ఏ క్లిష్ట పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనేలా చేయడం. అది ఒక గతిశీల ప్రక్రియ.

స్త్రీల సాధికారత ప్రయత్నాలు/ ఉద్దేశాలు:  1) స్త్రీల హక్కుల పట్ల అవగాహన పెంచడం. 2) జీవన ప్రమాణాలను మెరుగుపరచడం. 3) ఉత్పాదక వనరులను సమానంగా పొందే విధంగా చేయడం. 4) స్త్రీకి, ఆమె పిల్లలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ. 5) అధిక అక్షరాస్యత స్థాయి, విద్య. 6) ఆర్థిక, వాణిజ్య రంగాల్లో భాగాస్వామ్యాన్ని పెంచడం. 7) ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంపు.

స్త్రీల సాధికారతా జాతీయ పథకం-2001: ఈ పథకం ఉద్దేశాలలో ముఖ్యమైనవి. 1) మహిళలు సంపూర్ణంగా అభివృద్ధి చెందేందుకు కావాల్సిన ఆర్థిక, సామాజిక పరిస్థితులు కల్పించడం. 2) స్త్రీల పట్ల అన్నిరకాల వివక్షలను నిర్మూలించేగలిగే విధంగా న్యాయవ్యవస్థను బలోపేతం చేయడం. 3) అభివృద్ధి ప్రక్రియలో లింగభేద కోణాన్ని వెలుగులోకి తీసుకురావడం. 4) స్త్రీలు, బాలికలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న అన్నిరకాల హింసను నిర్మూలించడం.

 

రాజ్యాంగ రక్షణలు

భారత రాజ్యాంగం స్త్రీలకు సమానత్వాన్ని కల్పించింది. మహిళల అనుకూల/పక్షపాత కార్యక్రమాలు చేపట్టే అధికారాన్ని ప్రభుత్వాలకు ఇచ్చింది. 1993లో 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక పరిపాలనా సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు కేటాయించారు.

స్త్రీల హక్కుల రక్షణ కోసం చేసిన కొన్ని చట్టాలు: 1) హిందూ వివాహ చట్టం - 1955 2) హిందూ ఆస్తి సంక్రమణ చట్టం - 1956 3) వరకట్న నిషేధ చట్టం - 1961 4) గర్భస్రావ చట్టం (మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెస్సీ యాక్ట్‌) - 1971 5) సమాన వేతనాల చట్టం - 1976 6) బాల్య వివాహ నిరోధక చట్టం - 1976

స్త్రీ సాధికారత కోసం భారత ప్రభుత్వం చేపట్టిన కొన్ని సంక్షేమ పథకాలు: 1) ఉపాధి శిక్షణ కార్యక్రమం - 1987 2) మహిళా సమృద్ధి యోజన - 1993 3) రాష్ట్రీయ మహిళా కోశ్‌ - 1993 4) ఇందిరా మహిళా యోజన - 1995

* 2001, జులై 12న మహిళా సమృద్ధి యోజన, ఇందిరా మహిళా యోజనలను ఐక్యం చేసి ‘‘స్వయం సిద్ధ’’ అనే స్వయం సహాయక సమూహ కార్యక్రమాన్ని రూపొందించారు.

 

వివిధ మతాల్లో స్త్రీల స్థాయి

హిందూ మతం: 

ఇతిహాస కాలంలో:  రామాయణం, మహాభారతాల్లో స్త్రీల స్థాయిని వివరించారు. శ్రీరాముడి తల్లి కౌసల్య ‘సృష్టి’ యాగం నిర్వహించింది. సీత మంత్రయుక్తంగా సంధ్యావందనం చేసేది. స్త్రీలను గౌరవిస్తే దేవతలను పూజించినట్లేనని భీష్ముడు పేర్కొన్నాడు. వీటిని బట్టి ఇతిహాసం కాలంలో స్త్రీకి ఉన్నత హోదా ఉండేదని అర్థమవుతోంది.

స్మృతుల కాలంలో: ‘మను’ స్త్రీలను గౌరవించాలని పేర్కొన్నాడు. స్త్రీలు సుఖంగా ఉన్నచోట అన్ని రకాల సుఖశాంతులు ఉంటాయని, ఎక్కడ స్త్రీలు బాధపడతారో అక్కడ వినాశనం వాటిల్లుతుందని చెప్పాడు.

వాత్సాయనుడు: స్త్రీకి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఇవ్వకూడదన్నాడు.

గౌతముడు: బాల్య వివాహాలను ప్రోత్సహించాడు.

బౌద్ధం, ఇస్లాం మతాల ప్రభావం: * మనుషులంతా సమానమని ఇస్లాం బోధించింది. * స్త్రీలు, పురుషులు సమానమని బౌద్ధులు భావించారు. బౌద్ధ సన్యాసులుగా ఉండటానికినికి కూడా స్త్రీకి అర్హత లభించింది.* ఇస్లాం ప్రభావం భారతీయులపై అధికంగా పడింది. పర్దా వంటి పద్దతులను హిందూ మహిళలు అలవరుచుకున్నారు.

బ్రిటిష్‌ పరిపాలనా కాలంలో: బ్రిటిష్‌ కాలంలో హిందూ స్త్రీలకు విద్యావకాశాలు చాలా తక్కువ, లేదా అసలు ఉండేవి కావు. సమాజంలో హిందూ స్త్రీ పాత్ర దయనీయంగా ఉండటాన్ని గ్రహించిన వారిలో రాజా రామ్మోహన్‌ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, దయానంద సరస్వతి మొదలైన వారున్నారు. వీరంతా సతీసహగమనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సమాజంలో స్త్రీ అంతస్తు దిగజారిపోవడానికి కారణం అజ్ఞానమని, ఆ అజ్ఞానాన్ని నిర్మూలించేందుకు స్త్రీలంతా చదువుకోవాలని నొక్కిచెప్పారు.జాతీయోద్యమాలు మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచి, ధైర్యాన్నిచ్చాయి

స్వాతంత్య్రానంతరం: సమాజంలో స్త్రీల అంతస్తు లేదా స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం విశేష కృషి చేసింది. విద్యావకాశాలు పెరిగాయి. విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో కొన్ని స్థానాలను స్త్రీలకు కేటాయించారు. ప్రత్యేకంగా మహిళా విశ్వవిద్యాలయాలూ వెలిశాయి.* 1955లో హిందూ వివాహచట్టం ప్రకారం బహు వివాహాలను నిషేధించారు. * 20వ శతాబ్దంలో స్త్రీలు తమ హక్కులు, అధికారాల పట్ల అపూర్య చైతన్యం ప్రదర్శించడం ప్రారంభమైంది. ప్రత్యేక సంఘాలు ఏర్పాటై మహిళా ఉద్యమాలు పెరిగాయి. స్త్రీలు ఆర్థికంగా, రాజకీయంగా ఆధిక్యత సంపాదించారు. పరిపాలన చేపట్టారు. లింగ సమానత్వం భావన దేశంలో విస్తృతమైంది.* 21వ శతాబ్దంలో స్త్రీ విద్యను ప్రోత్సహించారు. తద్వారా హక్కుల పోరాటాలు ఉద్ధృతమయ్యాయి.

* అంతర్జాతీయ మహిళా సంవత్సరం -- 1975

* అంతర్జాతీయ మహిళా దశాబ్దం -- 1975-85

* అంతర్జాతీయ మహిళా సాధికారత సంవత్సరం 2001.

 సాధికారత అంటే పీడన, దౌర్జన్యం లేని స్థితి. అతివలకు స్వేచ్ఛ, నచ్చిన మార్గాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వడం. సమాన హక్కులు, అధికారం, గౌరవం వంటివాటిని సమకూర్చడం.

-  సరళా గోపాలన్, కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి


 

రచయిత: వట్టిపల్లి శంకర్‌ రెడ్డి

 

Posted Date : 21-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతీయ సామాజిక నిర్మితి

మూలాల్లో భిన్నత్వం.. మనుగడలో ఏకత్వం!


భారతీయ సమాజం విశిష్ట లక్షణం భిన్నత్వం. ఇతర ఏ దేశ సమాజంలోనూ లేనన్ని సాంఘిక, సాంస్కృతిక, భాష, మతపరమైన భేదాలు ఇక్కడ ఉన్నాయి. అనాదిగా ఇతర దేశాల నుంచి కొనసాగిన విభిన్న జాతులు, తెగల వలసలు, దేశంలోని భౌగోళిక వైవిధ్యం తదితర కారణాలతో రకరకాల ప్రజా సమూహాలు ఈ నేలపై స్థిరపడిపోయాయి. ఎన్ని తేడాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సమాజ సహజ లక్షణమైంది. ఇక్కడి జాతుల పుట్టుపూర్వోత్తరాలు, శారీరక లక్షణాలు, సంస్కృతుల తీరు, వారు నివసిస్తున్న ప్రాంతాల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.

భారత సమాజం అతిపురాతనమైంది. పూర్వం నుంచి వివిధ కాలాల్లో బయటి నుంచి విభిన్న జాతి, భాష, మత సమూహాలకు చెందిన ప్రజలు మన దేశం వచ్చి స్థిరపడ్డారు. కాలక్రమంలో ఆ సమూహాలన్నీ పరస్పరం కలిసిపోయి, కొత్త ఉపజాతులుగా రూపొందాయి. ఈ కారణంగా భారతదేశంలో వివిధ జాతి, భాష, మత, సంస్కృతి, సమూహాల మధ్య వైవిధ్యం కనిపిస్తుంది. భారత సమాజ మౌలిక లక్షణాల్లో సమష్టి కుటుంబం, కులవ్యవస్థ, గ్రామీణ సదుపాయాలు ముఖ్యమైనవి. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో నేటికీ ఈ లక్షణాలు ప్రభావంతంగా ఉన్నాయి. దేశంలోని జాతుల పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకోవడానికి పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడి జాతుల లక్షణాల గురించి స్పష్టంగా చెప్పడానికి తగినన్ని ఆధారాలు లేవు. దీనిపై సామాజికవేత్తలు పలు సిద్ధాంతాలను రూపొందించారు.


వర్గీకరణలు:  1) రిస్లే వర్గీకరణ 2) రుగ్గిరీ వర్గీకరణ 3) హేడన్‌ వర్గీకరణ 4) ఇక్‌స్టెడ్‌ వర్గీకరణ 5) గుహా వర్గీకరణ 6) సర్కార్‌ వర్గీకరణ


1) రిస్లే వర్గీకరణ: భారతదేశ జనాభాను మొదటిసారిగా సర్‌ హెర్బర్ట్‌ హోప్‌ రిస్లే 7 శాస్త్రీయ దృక్పథాలుగా వర్గీకరించారు.


1. టర్కీ-ఇరానియన్‌లు: ఈ జాతి వారు వాయవ్య సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్నారు.


శారీరక లక్షణాలు: తెలుపు రంగు, శరీరంపై తక్కువ రోమాలు, కంటి రంగు నలుపు, శరీర ఉష్ణోగ్రత ఎక్కువ.


2. ఇండో ఆర్యన్‌లు: వాయవ్య సరిహద్దు ప్రాంతాల్లో జీవిస్తున్నారు.


లక్షణాలు: తెలుపు రంగు, శరీరంపై తక్కువ రోమాలు, కంటి రంగు నలుపు, శరీర ఉష్ణోగ్రత ఎక్కువ.


3. స్కీలో-ద్రవిడియన్‌లు: వీరు స్కీధియన్‌లు,    ద్రవిడియన్ల కలయికతో ఏర్పడ్డారు.


లక్షణాలు: ముఖం మీద రోమాలు తక్కువ, మధ్య రకం ముక్కు, దళసరి పెదవులు.


4. ఆర్యో ద్రవిడియన్‌లు: ఇండో ఆర్యన్, ద్రవిడయన్‌ల కలయిక వల్ల ఏర్పడ్డారు. వీరు ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, బిహార్‌లలో ఎక్కువగా ఉంటారు.


లక్షణాలు: గోధుమ/నలుపు రంగు శరీరం, మధ్యరకం ముక్కు, విశాలమైన నుదురు.


5. మంగోలో ద్రవిడియన్‌లు: వీరు బెంగాల్, బిహార్‌లలో ఉంటారు.


లక్షణాలు: నలుపు శరీరం. ముఖంపై వెంట్రుకలు ఉండవు. ముక్కు వెడల్పుగా ఉంటుంది. అయితే కొందరిలో సన్నగా, వెడల్పుగా ఉంటుంది.


6. మంగోలాయిడ్‌లు: వీరు అస్సాం, ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటారు.


లక్షణాలు: పసుపు పచ్చని శరీరం, శరీరంపై తక్కువ రోమాలు, కనురెప్ప ముడతపడి ఉంటుంది.


7. ద్రవిడియన్‌లు: వీరు దక్షిణ ప్రాంతాల్లో కనిపిస్తారు. మరికొందరు మధ్యప్రదేశ్, నాగాలాండ్, తమిళనాడుల్లో ఉంటారు.


లక్షణాలు: నలుపు రంగు శరీరం, ఉంగరాల జుట్టు, ముఖంపై దళసరిగా రోమాలు, ముక్కు అనిగిపోయి ఉంటుంది.


2) రుగ్గిరీ వర్గీకరణ: గుఫ్రిడా రుగ్గిరి భారతదేశ జనాభాను 5 రకాలుగా విభజించాడు.


1. నిగ్రిటోలు: దక్షిణ భారతదేశపు అడవి జాతుల వారు. ఉదా: వెడ్డాలు


2. ఆస్ట్రలాయిడ్‌ - వెడ్డాయిడ్‌: ఉత్తర, ఈశాన్య భారత్‌లో ఉంటారు. ఉదా: ఒరాన్‌లు, సంతాల్, ముండాలు


3. ద్రవిడియన్‌లు: దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తారు. ఉదా: తెలుగు, తమిళం మాట్లాడేవారు


4. ఎత్తుగా ఉండి పొడవైన తల ఉన్నవారు. 


ఉదా: తోడా (తమిళనాడు)


5. బ్రాఖీసెఫాలిక్‌ శీర్షం ఉన్నవారు. వీరు ఉత్తర ప్రాంతంలో నివసిస్తారు.ఉదా: నాగా, కుకీ తెగలు.


3) హేడన్‌ వర్గీకరణ:  భారతదేశాన్ని 3 ముఖ్యమైన భౌగోళిక ప్రాంతాలుగా విభజించాడు.


1) హిమాలయ ప్రాంతం: i) ఇండో-అఫ్గాను    ii) ఇండో- ఆర్యన్‌లు    iii) మంగోలాయిడ్‌లు


2) ఉత్తరభారత మైదాన ప్రాంతం: i) ఇండో-అఫ్గాన్లు  ii్శ రాజపుత్రులు


3) దక్కన్‌ ప్రాంతం:  i) నిగ్రిటోలు ii) ప్రి-ద్రవిడియన్‌లు    iii) ద్రవిడియన్‌లు    iv) దక్షిణ భారతదేశంలోని బ్రాఖీసెఫాలిక్‌ శీర్షం ఉన్నవారు v) పశ్చిమంలో ఉన్న బ్రాఖీసెఫాలిక్‌ శీర్షం ఉన్నవారు


గమనిక: హేడన్‌ పరిశోధన అంతా శారీరక లక్షణాలు, ఆచార వ్యవహారాలు, భాష మొదలైన వాటి ఆధారంగా సాగింది. ఈ ఆధారాలతోనే అతడు సిద్ధాంతాలను రూపొందించాడు.


4) ఇక్‌స్టెడ్‌ వర్గీకరణ: శారీరక, సాంస్కృతిక లక్షణాలు ఆధారంగా వాన్‌ ఇక్‌స్టెడ్‌ భారతదేశ జనాభాను నాలుగు రకాలుగా విభజించాడు.


1. వెడ్డిడ్‌ వర్గం: వీరు 2 రకాలు.


ఎ) గోండిడ్‌ వర్గం: శరీరం గోధుమ వర్ణం, ఉంగరాల జుట్టు, తక్కువ రోమాలున్న శరీరం. ఉదా: ఒరానులు, గోండులు, భిల్లులు


బి) మెలిడ్‌ వర్గం: పసుపు రంగు శరీరం, శరీరంపై తక్కువ రోమాలు. ఉదా: కురుంబాలు, వెడ్డాలు


2) మెలనిడ్‌: వీరు సౌత్‌మెలనిడ్, కోలిడ్‌ అని రెండు రకాలుగా ఉంటారు.


3) ఇండిడ్‌: వీరిని గ్రేసైల్‌ ఇండిడ్, నార్త్‌ ఇండిడ్‌ అని రెండు రకాలుగా పేర్కొంటారు.


4) పేలియో-మంగోలాయిడ్‌: వీరు ప్రాచీన భారతీయ సంప్రదాయానికి చెందినవారు.


5) గుహా వర్గీకరణ: ఈయన ఆరు రకాలుగా వర్గీకరించాడు. 1) నిగ్రిటోలు 2) ప్రోటో ఆస్ట్రరాయిడ్లు 3) మంగోలాయిడ్‌లు 4) మెడిటేరియన్‌లు 5) వెస్ట్రన్‌ బ్రాఖీసెఫల్స్‌ 6) నార్డిక్‌లు - నిగ్రిటోలు


నోట్‌: * భారతదేశంలో అధిక సంఖ్యాకులు కాకసాయిడ్‌ జాతికి చెందుతారు. ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడులోని బ్రాహ్మణులు; పంజాబ్‌లోని సిక్కులు, గుజరాత్‌లోని నాగర బ్రాహ్మణులు తదితరులంతా ఈ జాతికి చెందినవారే. * హిమాలయ పర్వత ప్రాంతాల్లో నివసించే భారతీయులది మంగోలాయిడ్‌ జాతి. * ప్రస్తుతం నిగ్రిటో జాతి వారు దేశంలో తక్కువగా ఉన్నారు.


6)  సర్కార్‌ వర్గీకరణ: సర్కార్‌ అనే సామాజికవేత్త ప్రకారం గిరిజన జనాభాను మూడు రకాలుగా వర్గీకరించారు.

1. ఇండో - ఆర్యన్‌లు: వీరు మొదటగా సింధూ-గంగా నదుల పరీవాహక ప్రాంతాల్లో నివసించారు. 

ఉదా: ఆదిమజాతి తెగలు


2. మీసోసెఫాల్‌లు: ఇరానో-సీథియస్‌ల కలయిక వల్ల ఏర్పడ్డారు.

3. బ్రాఖీసెఫాల్‌లు: మన దేశంలో వీరి జనాభాను సర్కార్‌ 4 రకాలుగా వర్గీకరించారు. 

1) ఇరానో సీథియన్‌ వర్గం 

2) ప్రాచీనకాలంలో ఆసియా నుంచి భారత్‌కు వచ్చిన బ్రాఖీసెఫాలిక్‌ వర్గం 

3) మంగోలియన్‌ వర్గం 

4) మలయన్‌ వర్గం


మాదిరి ప్రశ్నలు

 

1. కిందివాటిని జతపరచండి.

కుల సిద్ధాంతాలు    ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు

1) జాతి సిద్ధాతం   ఎ) రిస్లీ

2) భౌగోళిక సిద్ధాంతం   బి) నెస్‌ఫీల్డ్‌

3) వృత్తి సిద్ధాంతం   సి) గిల్బర్ట్‌

4) సంస్కార సిద్ధాంతం  డి) హట్టన్‌

5) మన సిద్ధాంతం ఇ) హోకార్ట్, సెనార్ట్‌


1) 1-ఎ; 2-సి; 3-బి; 4-డి; 5-ఇ  2) 1-ఎ; 2-బి; 3-సి; 4-డి; 5-ఇ

3) 1-ఎ; 2-సి; 3-బి; 4-ఇ; 5-డి  4) 1-ఎ; 2-ఇ; 3-సి; 4-బి; 5-డి

 

2. కిందివాటిని జతపరచండి.

1) నిర్భయ చట్టం   ఎ) మహిళలపై హింస ఘటనకు ఏర్పడింది

2) జె.ఎస్‌.వర్మ కమిషన్‌   బి) 2013, ఏప్రిల్‌ 3

3) షీ టీమ్స్‌   సి) 2014, అక్టోబరు 24

4) దిశా సంఘటన  డి) 2019, నవంబరు 27

1) 1-బి; 2-ఎ; 3-డి; 4-సి   2) 1-బి; 2-ఎ; 3-సి; 4-డి

3) 1-ఎ; 2-బి; 3-సి; 4-డి   4) 1-డి; 2-బి; 3-సి; 4-ఎ

 


3. కిందివాటిలో ట్రాన్స్‌జెండర్‌లకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. 

1) దేశంలో ఎస్‌ఆర్‌ఎస్‌ (సెక్స్‌ రీఅసైన్‌మెంట్‌ సర్జరీ) ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం తమిళనాడు.

2) ట్రాన్స్‌జెండర్‌ సర్టిఫికెట్‌ను జిల్లా మేజిస్ట్రేట్‌ జారీ చేస్తారు.

3) ట్రాన్స్‌జెండర్‌ అదనపు పేర్లు కిన్నెర, సఖి, జోగతీస్‌.

4) పైవన్నీ

 

4. 2011 జనాభా లెక్కల ప్రకారం వైకల్య జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలను వరుస క్రమంలో అమర్చండి.

1) ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌

2) ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌

3) మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌

4) పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర

 

5. 2011 జనాభా లెక్కల ప్రకారం గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం?

1) మధ్యప్రదేశ్‌   2) ఉత్తర్‌ప్రదేశ్‌  3) కేరళ   4) తెలంగాణ

 

6. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్‌ను ఎంతకు పెంచింది?

1) రూ.2500 నుంచి రూ.4000

2) రూ.3016 నుంచి రూ.4016

3) రూ.3000 నుంచి రూ.4016

4) రూ.3500 నుంచి రూ.4016

 

7. అత్యధికంగా జోగినీ వ్యవస్థ కలిగిన జిల్లా?

1) మహబూబ్‌నగర్‌  2) వరంగల్‌   3) కరీంనగర్‌  4) ఆదిలాబాద్‌


8. కిందివాటిని జతపరచండి.

 సంస్థలు               ఉన్న ప్రాంతం

1) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది విజువల్లీ హ్యాండిక్యాప్డ్‌  ఎ) సికింద్రాబాద్‌

2) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్‌   బి) డెహ్రాడూన్‌

3) పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఫిజికల్లీ హ్యండిక్యాప్డ్‌ సి) దిల్లీ

1) 1-ఎ, 2-బి, 3-సి   2) 1-సి, 2-బి, 3-ఎ

3) 1-బి, 2-ఎ, 3-సి   4) 1-సి, 2-ఎ, 3-బి

 

9. రైల్వే శక్తి టీమ్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌?

1) 138  2) 139   3) 181   4) 182

 


10. భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థపై ఏర్పడిన మొదటి కమిషన్‌?

1) గురుపాద స్వామి కమిషన్‌   2) దత్‌ కమిటీ

3) షిండే కమిటీ   4) దంతేవాలా కమిటీ

సమాధానాలు

1-2; 2-2; 3-4; 4-2; 5-1; 6-2; 7-3; 8-4; 9-2; 10-1.

రచయిత: వట్టిపల్లి శంకర్‌ రెడ్డి

 

Posted Date : 24-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కులవ్యవస్థ

సామరస్య సామాజిక సమూహాలు!

 

హిందూ సామాజిక నిర్మాణం మూలాల్లో కులవ్యవస్థ ప్రధానమైనది. వ్యక్తులను, వారి సామాజిక స్థాయిని గుర్తించేందుకు ఆర్యులు అప్పట్లో ఆ విధమైన ఏర్పాట్లు చేశారు. ఒకే తరహా జీవనవిధానం, వృత్తి, ఆహార అలవాట్లు, అంతర్వివాహాలు ఉన్న సమూహాలు కులాలుగా స్థిరపడ్డాయి. తర్వాత కాలంలో పుట్టుక ఆధారంగా కులం నిర్ణయం కావడం మొదలవడంతో, అది సామాజికంగా, రాజకీయంగా ప్రభావపూరిత శక్తిగా మారింది.  దేశంలో కులం పుట్టిన తీరు, దాని లక్షణాలు, అందులో వర్ణం, జాతి వంటి అంశాల ప్రాధాన్యం, చాతుర్వర్ణాల ఆవిర్భావం, ఇతర పరిణామాల గురించి అభ్యర్థులకు పరిజ్ఞానం ఉండాలి. సమాజంలో తలెత్తిన అసమానతలు, కులాల ఆధిపత్యం, కులవివక్ష తదితర సామాజిక సమస్యలకు మూలాలను తెలుసుకోడానికి కులవ్యవస్థ లక్షణాలు, పుట్టుకపై ఉన్న సిద్ధాంతాలనూ తెలుసుకోవాలి.

 


  భారతదేశంలో కులవ్యవస్థ రూపంలో ఒక ప్రత్యేకమైన సామాజిక స్తరీకరణ కనిపిస్తుంది. ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లోనూ కులం లక్షణాలు కొన్ని ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న కులవ్యవస్థ విశిష్టమైనది. హిందూ సామాజిక వ్యవస్థ కులవిధానం మీదే ఆధారపడి ఉంది. కులానికి సరళత ఉండదు. అందుకే ఏ వ్యక్తీ తన కులాన్ని మార్చుకోలేడు.


ప్రతి కులానికి ఒక హోదా ఉంటుంది. దాని ప్రకారం కులాలన్నీ ఒక క్రమశ్రేణిలో అమర్చి ఉంటాయి. కొన్ని కులాలు ఎక్కువ హోదాతో పై అంతస్తులో ఉంటే, కొన్ని కులాలు తక్కువ హోదాతో కింది అంతస్తులో ఉంటాయి. ఈ రెండింటి మధ్య అనేక కులాలు వివిధ అంతస్తుల్లో ఉంటాయి. కులం పుట్టుకతో సంక్రమిస్తుంది. ఆ కులంలో పుట్టినవారికి కులశ్రేణి హోదా పుట్టుకతో వస్తుంది. ప్రయత్నం, ప్రార్థన, సంపద వంటివేవీ పుట్టుకతో వచ్చిన కుల అంతస్తును మార్చలేవు. ఈ అంశంలో కులవ్యవస్థ కఠినమైనది.


వర్ణం, జాతి:  మన దేశంలో కులవ్యవస్థను పాశ్చాత్యులు మొదట జాతి సంబంధమైన, జన్మ సంబంధమైన వ్యవస్థగా పరిగణించారు. ఈ భావనతోనే మొదట పోర్చుగీసువారు, వారి భాషలో ‘కాస్ట’ అనే పదాన్ని ఉపయోగించేవారు. ‘కాస్ట’ అంటే వంశపారంపర్య లక్షణాల సంక్లిష్ట రూపం. ఆ తర్వాత వచ్చిన ఆంగ్లేయులు వాడిన ‘కాస్ట్‌’ అనే పదం ‘కాస్ట’ పదం నుంచే వచ్చింది.


 ‘‘ఒకే ఇతిహాస పూర్వీకుడి వంశంగా భావిస్తూ, వంశానుగతంగా అనేక వృత్తులు చేసి, ఒకే సామరస్యపూరిత సమూహంగా ఉంటూ, ఒకే నామం ఉన్న కుటుంబాలు లేదా సమూహాల చీలికే వర్ణం.‘‘  -హెర్బర్ట్‌ రిస్లే 


కులాన్ని వ్యవహారికంగా వర్ణం అని కూడా అంటారు. వర్ణం అంటే రంగు. 2000-1500 బి.సి మధ్య కాలంలో భారతదేశంపైకి దండెత్తి వచ్చిన ఆర్యులు, వారి భౌతిక ఆకారంలో ముఖ్యంగా రంగులో భారతీయులకు భిన్నంగా ఉన్నారు. ఆర్యులు తెలుపు రంగులో ఉంటే, స్థానికులైన భారతీయులు నల్లగా ఉన్నారు. మంచి వర్ణంలో ఉండటం ఆర్యుల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసింది. నల్ల రంగున్న స్థానికుల నుంచి దూరంగా ఉండేవారు. ఈ ధోరణి సమాజాన్ని శరీర రంగు ఆధారంగా రెండుగా తరగతులుగా విభజించింది. ఈ తరగతులనే వర్ణంగా పిలిచేవారు. ఆర్యులు తమను శ్వేతవర్ణంగా, స్థానిక ప్రజలను దస్య వర్ణంగా (నలుపు రంగు తరగతి) పేర్కొన్నారు. మొట్టమొదటి హిందూ సమాజంలో ఈ అర్థంతోనే వర్ణ విభజన జరిగినట్టు తెలుస్తోంది. ఆర్యులకు, దస్యులకు మధ్య శరీరచ్ఛాయలోని భేదం కారణంగా రెండు వర్ణాలు ఏర్పడ్డాయని ఆచార్య పి.ఎన్‌.ప్రభు వివరించాడు. ఆర్యులకు, ద్రావిడులకు ఉన్న వర్ణ విభేదాలను శూద్రులకు అన్వయింపజేసే వారని ఘర్వే పేర్కొన్నారు.


కాలక్రమంలో ఆర్యవర్గం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అనే మూడు తరగతులుగా ఏర్పడింది. బోధన వృత్తిని బ్రాహ్మణులు, విదేశీ దండయాత్రల నుంచి ప్రజలను రక్షించే బాధ్యతను క్షత్రియులు, వ్యాపార వాణిజ్యాలను వైశ్యులు స్వీకరించారు. దాసులను శూద్రులుగా పేర్కొంటూ, మొదటి మూడు తరగతుల వారికి సేవలందించాలని నిర్దేశించారు. ఉన్నత వర్ణాల వారికి సేవ చేసేందుకే శూద్రులను భగవంతుడు సృష్టించాడని పాలకులుగా ఉన్న ఆర్యులు ప్రకటించారు.


* శరీర రంగు భేదాలను ప్రకటించేందుకు మొదట్లో వాడిన ‘వర్ణం’ పదం క్రమంగా ఆ అర్థాన్ని కోల్పోయింది. ప్రకార్య విభజన కోసం సమాజంలో ఏర్పరిచిన నాలుగు తరగతులను వర్ణాలుగా పిలవడం ప్రారంభమైంది. మహాభారతంలోని శాంతి పర్వంలో భృగు మహర్షి వర్గాల పుట్టుకను వర్ణించాడు. భగవంతుడు మొట్టమొదట బ్రాహ్మణులకు మాత్రమే సృష్టించాడని, ఆ తర్వాత క్షత్రియ, వైశ్య, శూద్రులు ఏర్పడినట్లు చెప్పాడు. శ్వేతవర్ణులు బ్రాహ్మణులు, లోహిత (ఎర్ర రంగు) వర్ణులు క్షత్రియులు, పసుపు వర్ణులు వైశ్యులు, ఆశ్రిత (నల్లని) వారు శూద్రులని పేర్కొన్నాడు. తర్వాత వర్ణ విభజన చేసేది శరీర ఛాయ కాదని పుట్టుకతో ప్రతి వ్యక్తి శూద్రుడని, అతడు సముపార్జించుకునే గుణాల ఆధారంగా ఆ నాలుగు వర్ణాల్లో ఏదో ఒక వర్గానికి చెందుతాడని హిందూ శాస్త్రకారులు వివరించారు. ఈ నాలుగు వర్ణాలు బ్రహ్మ శరీర అంగాల నుంచి ఉద్భవించాయని మను ధర్మశాస్త్రం పేర్కొంటోంది. 

కులవ్యవస్థ లక్షణాలు: పురాతన, ఆధునిక భారతదేశంలో కులవ్యవస్థ అనేది ఒక ప్రత్యేక స్తరీకరణ పద్ధతి. అది భారతీయుల ఆర్థిక, రాజకీయ, సామాజిక జీవితాల్లో కీలకపాత్ర నిర్వహిస్తోంది. కులాన్ని సమాజ శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా నిర్వచించారు.


* ఒకే మూల పురుషుడిని కలిగి, ఒకే వారసత్వ వృత్తిని పాటిస్తూ, అంతర్వివాహాన్ని మాత్రమే చేసుకుంటూ, ఒకే పేరుతో చెలామణి అయ్యే కొన్ని కుటుంబాలు లేదా బంధు సమూహాలనే కులం అంటారు.


బోగెల్‌ ప్రకారం సంఘాన్ని వంశపారంపర్య సమూహాలుగా కులవ్యవస్థ విడదీస్తుంది. ఈ సమూహాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. మళ్లీ కొన్నిరకాల సంబంధాలనూ కలిగి ఉంటాయి. వాటి ముఖ్య లక్షణాలను పరిశీలిస్తే వివాహాల్లో, సంపర్కాల్లో, భోజన విషయాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇచ్చిపుచ్చుకోవడాల్లో వ్యత్యాసం ప్రదర్శిస్తాయి. శ్రమవిభజన సూత్రం ప్రకారం ప్రతి సమూహానికి సంప్రదాయసిద్ధంగా ఒక వృత్తి ఉంటుంది. ఆ వృత్తిని కొన్ని సందర్భాల్లో కొంతవరకు వదిలిపెడతాయి. ఆ విధంగా ఒకే అంతస్తుల క్రమంలో ఉన్నత, అల్పశ్రేణులుగా ఏర్పడి ఉంటాయి.


* కులం రెండు ముఖ్య లక్షణాలున్న సాంఘిక సమూహం అని కేట్కర్‌ అభిప్రాయం. మొదటిది సభ్యత్వం. సభ్యులకు జన్మించిన వాళ్లకే సభ్యత్వం ఉంటుంది. రెండోది తమ సమూహ సభ్యులు కానివారిని వివాహం చేసుకోవడం నిషిద్ధం. ప్రతి సమూహానికి ఒక నామధేయం ఉంటుంది.


* ఒక కుటుంబంలో జనన మరణాల విషయంలో రక్తసంబంధీకులంతా మైలను ఆచరించడంలో, పాటించడంలో కులానికి, కులానికి మధ్య వ్యత్యాసాలున్నాయి. దక్షిణ భారతదేశంలో శిశువు జన్మించినప్పుడు జనన ఆశుచి బ్రాహ్మణుల్లో 10 రోజులు, క్షత్రియ కులాల్లో 11 రోజులు, నాయర్‌ కులంలో 15 రోజులు, కురిచ్చియన్‌ కులంలో 28 రోజులు పాటించాలి. శ్వాసకు సంబంధించిన విశ్వాసాల ద్వారా కూడా మలినం పాటించేవారు. అందుకే రాజసేవకులు, దేవాలయాల్లో పనిచేసే కింది కులస్థులు నోటికి, ముక్కుకు అడ్డంగా వస్త్రం కట్టుకోవాలి. కులాల మధ్య సామాజిక సంబంధాలు కఠినతరంగా ఉన్నాయనేందుకు ఇది నిదర్శనం. 


కుల సంఘాలు: ప్రతి కులానికి ఒక సంఘం ఉంటుంది. కుల సంఘాలు కుల నిబంధనలను పరిరక్షిస్తుంటాయి. కులంలోని వ్యక్తుల ప్రవర్తనను నియంత్రిస్తుంటాయి. కుల సంస్కృతిని కాపాడతాయి. కుల వ్యక్తులకు రక్షణ, భద్రత కల్పిస్తాయి. సభ్యులు పాటించాల్సిన నియమ నిబంధనలను నిర్ణయిస్తాయి. వాటిని ఉల్లంఘించిన వారు శిక్షార్హులు. కుల సంఘాలు చిన్న ప్రాంతాల్లో ఉంటాయి.


కులవ్యవస్థ పుట్టుక:  కులవ్యవస్థ పుట్టుక గురించి అనేక సిద్ధాంతాలున్నాయి.


1) మతపరమైన సిద్ధాంతం: చాతుర్వర్ణాలు కులవ్యవస్థకు మూలాలు. అది దైవ నిర్మితమని హిందువుల నమ్మకం. చాతుర్వర్ణాల ప్రసక్తి హిందూ మత ప్రాచీన సాహిత్యంలో చాలాచోట్ల ఉంది. కులవ్యవస్థ, దాని పరిణామ వికాసాల ప్రస్తావన మనుసంహితలో ఉంది. నాలుగు వర్ణాలను బ్రహ్మ ఏర్పరిచాడని వివరిస్తుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు భగవంతుడి నిర్దేశాలని రుగ్వేదంలోని పురుష సూక్తం చెబుతుంది. వర్ణ వ్యవస్థను, వర్ణ ధర్మాలను భగవంతుడే నిర్ణయించినట్లు భగవద్గీతలో ఉంది. అయితే ఆ  వర్గాలే కాకుండా ఇతర కులాల పుట్టుకల గురించి మనుసంహితలో, గౌతమ సంహితలో సమాచారం దొరుకుతుంది. చాతుర్వర్ణాలే కాకుండా 134 కులాల ప్రసక్తి ప్రాచీన భారతీయ శాస్త్రాల్లో ఉన్నట్లు విల్సన్‌ పేర్కొన్నాడు.


2) వృత్తి సిద్ధాంతం: వృత్తి ప్రాతిపదికన కులవ్యవస్థ ఏర్పడిందని భావించిన వారిలో నెస్‌ఫీల్డ్‌ ముఖ్యుడు. ఇతడి అభిప్రాయంలో కులవ్యవస్థ మతప్రభావంపై ఆధారపడి సృష్టించింది కాదు. పూర్వకాలంలో ఒకే వృత్తి చేసే వారంతా కలిసి ఒక ప్రత్యేక వృత్తి సంఘంగా ఏర్పడ్డారు. కాలక్రమేణా వంశపారంపర్యంగా అదే వృత్తిని స్వీకరించడం వల్ల వృత్తుల ఆధారంగా వేర్వేరు కులాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా వృత్తుల వల్ల ఏర్పడిన కులాల అంతస్తుల్లోనూ హెచ్చుతగ్గులు ఉన్నాయి.


3) జాతి సిద్ధాంతం: హెర్బర్ట్‌ రిస్లీ అనే శాస్త్రవేత్త తన ‘ద పీపుల్‌ ఆఫ్‌ ఇండియా’ గ్రంథంలో జాతి వ్యత్యాసాల మీద కులవ్యవస్థ రూపొందిందని సిద్ధాంతీకరించాడు. శరీర ఛాయ, ఒడ్డు, పొడవు మొదలైన శారీరక లక్షణాల్లో వ్యత్యాసాలున్న వ్యక్తులు వివిధ సమూహాలుగా ఏర్పడ్డారు. ఆ సమూహాలే కులాలుగా మార్పు చెందాయి. శారీరక లక్షణాలు జాతికి సంబంధించినవి. ఈ లక్షణాల్లో వివిధ కులాల మధ్య వ్యత్యాసాలు కనిపిస్తాయి.


4) సంస్కారాల సిద్ధాంతం: ఎ.ఎమ్‌.హెకార్ట్‌ తన ‘ఇండియా అండ్‌ ది పసిఫిక్‌’ గ్రంథంలో సంస్కార సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. భారతదేశంలో కులవ్యవస్థ మత సంస్కారాల నిర్వహణలో వ్యక్తుల మధ్య ఏర్పడిన సంబంధాలపై ఆధారపడిందని అభిప్రాయపడ్డాడు. రంగులకు తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు వంటి సంజ్ఞలు ఏర్పడినట్లే మత సంస్కార సంబంధమైన విధులు నిర్వహించడానికి నిర్దేశించిన వ్యక్తులకు వారి విధుల ఆధారంగా కుల సంజ్ఞలు వచ్చాయి. ఉదాహరణకు మంత్రాలు చదవడం, మేళతాళాలు వాయించడం, నివేదనకు మట్టి పాత్రలు తయారు చేయడం, కాగడాలు పట్టడం, పల్లకీ మోయడం మొదలైన పనులు లేకుండా మతానికి సంబంధించిన ఏ ఉత్సవం జరగదు. ఈ విధులు నిర్వహించడంలో వివిధ కులాల వారు నేటికీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మత సంబంధమైన ఈ విధులను వంశానుక్రమంగా వ్యక్తులు నిర్వహించడం వల్ల కులవ్యవస్థ దృఢపడిందని ఈ సిద్ధాంతం చెబుతోంది.


5) భౌగోళిక సిద్ధాంతం: భౌగోళిక వ్యత్యాసాలే కులవ్యవస్థకు మూలమని గిల్బర్ట్‌ తన ‘ది ఆరిజన్‌ ఆఫ్‌ ది క్యాస్ట్‌’ పుస్తకంలో ప్రతిపాదించాడు. పల్లపు ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతాల్లో ప్రజలు నివసించినట్లుగా పురాతన తమిళ సాహిత్యంలో ఉంది. ఆ విధంగా నివాస ప్రాంతాలకు అనుగుణమైన వృత్తులు చేపడుతూ, ప్రత్యేకమైన ఆర్థిక, సాంఘిక వ్యవస్థల్లో ఉన్నారు. దానికి తగినట్లుగా ఆహార నియమాల్లో, సాంస్కృతిక జీవనంలో, నాగరికతలో వారి మధ్య భిన్న లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు తీర ప్రాంతాల్లో చేపలు పడుతూ జీవించే ‘బెస్త’ వారి జీవన పద్ధతులకు, కొండ ప్రాంతాల్లో ఉండే పశుకాపరుల జీవన విధానాలకు మధ్య చాలా తేడాలున్నాయి. అయితే కాలక్రమంలో ఒక ప్రాంత ప్రజలు మరో ప్రాంతానికి తరలి వెళ్లడంతో భిన్న ఆచార వ్యవహారాల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ విధంగా ఒకే ప్రాంతంలో విభిన్నమైన వృత్తులు, సంస్కృతులు ఉన్న సమూహాలే కులాలుగా రూపాంతరం చెందాయి.


* ఒక ప్రాంతానికి వలస వెళ్లినవారు కొత్త ప్రాంతంలో వారి పాత వృత్తులు కొనసాగించవచ్చు, లేదా కొత్త వృత్తులు స్వీకరించవచ్చు. ఏ వృత్తులు అనుసరించినప్పటికీ ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతం వారితో కలిసి జీవించడం వల్ల వేర్వేరు కుల సమూహాలుగా ఏర్పడ్డారు. అలాగే ఒక ప్రాంతం వారు మరో ప్రాంతానికి వెళ్లిన తర్వాత కూడా వారిని పూర్వప్రాంతాల పేరుతోనే వ్యవహరించడం వల్ల కులంగానో, ఉపకులంగానో ఏర్పడ్డారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో బ్రాహ్మణ కులంలోని చాలా ఉపకులాలు పలు ప్రాంతాల పేర్లతో ఉన్నాయి.

 


రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి

Posted Date : 24-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కుటుంబ వ్యవస్థ

సామాజిక వ్యవస్థకు ప్రాథమిక ప్రమాణం!


ఒక ఇంట్లో నివసించే కొందరు వ్యక్తుల సమూహమే కుటుంబం. వీరి మధ్య వైవాహిక, రక్తసంబంధాలు ఉంటాయి. సమాజ నిర్మాణం, సామాజిక సంస్థకు మూలమైన కుటుంబం మానవజాతి పరిణామక్రమంలో శాశ్వత బంధంగా మారింది. సామాజిక శాస్త్రంలో అతి ముఖ్యమైన భావనలైన కుటుంబం, కుటుంబ వ్యవస్థల గురించి పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. కుటుంబం పుట్టిన తీరు, దానిపై సామాజికవేత్తల అభిప్రాయాలు, కుటుంబ వ్యవస్థ ప్రధాన లక్షణాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.
 


సమాజంలోని ప్రాథమిక సమూహాల్లో కుటుంబం ముఖ్యమైంది. సమాజ శాస్త్రంలో కుటుంబం ఒక సంస్థగా, పరిమితిగా పరిగణనలో ఉంది. సమాజ నిర్మాణాన్ని స్థూలంగా పరిశీలించడంలో కుటుంబానికి అత్యంత ప్రాముఖ్యం ఉంటుంది. కుటుంబ విధానం నిర్మాణంలో, విధుల్లో చాలా మార్పులు చెందుతూ వస్తోంది. చారిత్రకంగా కుటుంబం అనేక మార్పులు చెందుతున్నా సమాజంలో దీని ప్రాముఖ్యం పెరిగింది. ప్రతి వ్యక్తి కుటుంబంలో సభ్యుడు. కుటుంబం లేనిదే వ్యక్తికి మనుగడ లేదు. సమాజంలో బాధ్యత ఉన్న వ్యక్తిగా మెలగడానికి కావాల్సిన శిక్షణ కుటుంబంలోనే లభిస్తుంది.


చారిత్రక నేపథ్యం:  కుటుంబం ఒక విశిష్ట సంస్థ. వివిధ పరిస్థితులు, సందర్భాలకు అనుగుణంగా అది వ్యక్తిగతమైందిగా లేదా ప్రజలకు సంబంధించిందిగా మారుతూ ఉంటుంది. వ్యక్తి జీవితంలో అధిక భాగం దీంతోనే గడుస్తుంది. అన్నిరకాల మానవ సమూహాల్లో అతి ప్రధానమైన ప్రాథమిక సమూహమే కుటుంబం. మానవ సామాజిక జీవితానికి పునాది ఈ వ్యవస్థ. వివాహంలాగే కుటుంబ వ్యవస్థ విశ్వజనీనమైంది. ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ లేని సమాజం లేదు. వ్యక్తి, సమాజానికి కుటుంబం ఒక ముఖ్యమైన సాంఘిక సమూహం. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఏదో ఒక కుటుంబంలో భాగంగా ఉంటాడు. కుటుంబం ఒక కేంద్ర బిందువు. దీని చుట్టూనే మొత్తం జీవితం తిరుగుతూ ఉంటుంది.


వ్యక్తులు దినచర్యను కుటుంబ సభ్యులతో ప్రారంభిస్తారు. సమాజాల్లోని సాంస్కృతిక వైరుధ్యాల కారణంగా కుటుంబ సంబంధాలు కూడా వివిధ రూపాల్లో ఉన్నాయి. సాధారణంగా దంపతులు, వారి పిల్లలు కలిసి జీవిస్తే దాన్ని కుటుంబంగా పిలుస్తుంటారు. ఆదిమ సమాజాల కుటుంబం కూడా ఇదే రకంగా ఉంటుంది. అయితే 19వ శతాబ్దం తొలి రోజుల్లో ఆదిమ సమాజాల్లో కుటుంబ వ్యవస్థ ఉందా అన్న చర్చ బలంగా వెలుగులోకి వచ్చింది. ఏంగెల్స్, కార్ల్‌మార్క్, మోర్గాన్‌ లాంటి శాస్త్రవేత్తలు కుటుంబాన్ని మానవ పరిణామ క్రమంలో బలపడిన బంధంగా పేర్కొన్నారు. 


కుటుంబం-అర్థం: ఫ్యామిలీ అనే పదం Famulus అనే రోమన్‌ పదం నుంచి ఏర్పడింది. Famulus అంటే సేవకుడని అర్థం. Familiya అనే లాటిన్‌ పదం నుంచి Family అనే పదం ఏర్పడిందని కొందరు సామాజికవేత్తల అభిప్రాయం. Familiya అంటే కుటుంబం అని, అయితే ఆ కుటుంబంలో సేవకులు లేదా బానిసలు, కుటుంబసభ్యులు కలిసి ఉండేదని అర్థం. కుటుంబ వ్యవస్థకు పునాది వివాహం. కుటుంబం అంటే ఒక గృహంలో నివసించే వ్యక్తుల సమూహం. వారి మధ్య వైవాహిక, రక్తసంబంధాల ద్వారా బంధుత్వం ఉంటుంది. సామాజిక వ్యవస్థ నిర్మాణాత్మకమైన, ప్రాథమిక మూలప్రమాణం కుటుంబం.


* అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం: మే 15.

* అంతర్జాతీయ కుటుంబ సంవత్సరం: 1994 (ఐరాస ప్రకటన)


కుటుంబం సామాజిక ప్రకార్యాలు


మానవజాతి చరిత్రలో అతి ప్రాచీనమైన, ప్రముఖమైన సామాజిక వ్యవస్థే కుటుంబం. అది పలు రకాల విధులు నిర్వహిస్తుంది.


1) ఆర్థిక ప్రకార్యం: కుటుంబానికి సుఖాన్ని ఇచ్చేవి ఆస్తిపాస్తులు. పూర్వ కాలంలో కుటుంబం తనకు కావాల్సిన వివిధ వస్తువులు ఉత్పత్తి చేసి వినియోగించుకునేది. భారతీయ సమష్టి కుటుంబంలో వ్యక్తులంతా కలిసి పనిచేసి  పరస్పర సహకారంతో ఆనందాన్ని పంచుకునేవారు.


2) ధార్మిక ప్రకార్యం: సభ్యులకు మత సంబంధమైన శిక్షణను కుటుంబం ఇస్తుంది. పెద్దల నుంచి పిల్లలు సద్గుణాలు నేర్చుకోవడానికి, మత సంబంధమైన శిక్షణ అవసరం. దైవారాధన, యజ్ఞయాగాదులు, మత ఉపదేశాలు మొదలైనవి పూర్వం ఎక్కువగా ఉండేవి. నేడు లౌకిక రాజ్యం కావడంతో వ్యక్తుల్లో మత భావాల గాఢత తగ్గింది. నాడు కుటుంబాల్లో ప్రార్థనా సమావేశాలు నిత్యం సంప్రదాయంగా జరిగేవి. ప్రస్తుతం అవి చాలా వరకు తగ్గిపోయాయి.


3) విద్యా ప్రకార్యం: ఒకప్పుడు పిల్లలకు విద్యాబోధన కుటుంబాల్లోనే అధికంగా జరిగేది. పిల్లలకు వ్యక్తిగత శిక్షణ ఇచ్చే అవకాశం ఎక్కువగా తల్లికే ఉండేది. కానీ నేడు అనేక విద్యాసంస్థలను ప్రభుత్వం, ఇతర సంస్థలు ఏర్పాటు చేయడంతో ఈ బాధ్యత కుటుంబానికి చాలావరకు తగ్గిపోయింది. నాటి వృత్తులు కులం మీద ఆధారపడటంతో వృత్తి శిక్షణ కుటుంబ సభ్యులకు అవసరమయ్యేది. ఇప్పుడు ఆ బాధ్యతను అనేక సాంకేతిక, వైజ్ఞానిక, విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాయి.


4) ఆరోగ్య ప్రకార్యం: పూర్వం ఆరోగ్య, వైద్య సంబంధమైన విధులను కుటుంబం నిర్వహించేది. సభ్యుల అనారోగ్యం, ఇతర అస్వస్థతలను  నివారించే బాధ్యత కుటుంబంపై ఉండేది. కానీ, నేడు ఆస్పత్రులు, ఆరోగ్య సదుపాయాలు అధికం కావడంతో ఆ విధులను ఆయా సంస్థలు నిర్వహిస్తున్నాయి అప్పట్లో సభ్యులకు వినోదావకాశాలను కుటుంబమే కల్పించేది. నేడు ఆ విధులను చలనచిత్రాలు, క్లబ్బులు, క్రీడాసంఘాలు మొదలైనవి నిర్వహిస్తున్నాయి.


5) నిర్వహణ: ప్రతి కుటుంబం కొంత ఆర్థిక ఉపాధితో ఉంటుంది.  కుటుంబంలో సభ్యులను పోషించడానికి భార్యాభర్తలు కృషి చేస్తూ, వీలైన సౌకర్యాలు కల్పించి తమ సంతానాన్ని పెంచి పెద్ద చేస్తారు.


6) సంక్రమణ: తల్లిదండ్రుల అనంతరం వారి ఆర్థిక, సామాజిక హోదా   పిల్లలకు సంక్రమిస్తుంది. వారు తమ కుటుంబ స్థాయికి అనుగుణంగా   సమాజంలో స్థానం పొందుతారు.


కుటుంబ వ్యవస్థ ప్రధాన లక్షణాలు
 

1) విశ్వజనీనత: మానవజాతి క్రమాభివృద్ధిలో అన్ని దశల్లోనూ కుటుంబం ఉంటుంది. ప్రతి వ్యక్తి ఏదో ఒక కుటుంబానికి చెంది ఉంటాడు. పక్షులు, జంతువుల సమాజాల్లో కూడా కుటుంబాలు ఉన్నాయనేందుకు ఆధారాలున్నాయి.


2) మిథున సంబంధం: కుటుంబ సంస్థలో ప్రధాన లక్షణం స్త్రీ పురుష సాంగత్యం. జీవిత భాగస్వాములైన భార్యాభర్తలిద్దరూ అనుబంధంతో జీవితకాలమంతా కలిసి ఉండవచ్చు లేదా కారణాంతరాల వల్ల పరిమిత కాలం వరకే దంపతులుగా ఉండవచ్చు.


3) నామకరణ పద్ధతి: ప్రతి కుటుంబాన్ని గుర్తు పట్టడానికి వీలుగా దానికి ఒక పేరు ఉంటుంది. కలిగే సంతానానికి పేర్లు పెట్టడం కూడా ఒక పద్ధతిని అనుసరించి జరుగుతుంది. పిల్లలకు పేర్లు పెట్టడంలో తల్లిదండ్రులు, మత, రాజకీయ నమ్మకాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వంశపారంపర్యాన్ని గణనలోకి తీసుకునే విషయంలో కూడా తేడాలున్నాయి. కొన్నిచోట్ల మాతృ వంశీయ విధానం ఉంటే, మరికొన్నిచోట్ల పితృవంశీయ విధానం ఉంటుంది.


4) ఆర్థిక సదుపాయాలు: భౌతిక అవసరాలు తీర్చుకోవడానికి కుటుంబానికి ఆర్థిక వనరులుంటాయి. భూవసతి, వ్యాపారం/ఉద్యోగం ఉంటాయి. ఆర్థిక స్థితిగతుల్లో కుటుంబాల మధ్య తేడాలు ఉంటాయి.


5) ఉమ్మడి నివాసం: ప్రతి కుటుంబానికి విశ్రాంతి తీసుకోవడానికి, నిత్యకృత్యాలు తీర్చుకోవడానికి, పిల్లలు, పెద్దలు నివసించడానికి ఒక నివాసం అవసరం.


6) ఆవేశ ప్రాతిపదిక: మానవుడి భౌతికావసరాలు, సుఖాలు, కోరికలు లాంటివాటిపై కుటుంబం ఆధారపడి ఉంటుంది. స్త్రీ పురుషుల సంగమం, సంతానాన్ని పొందడం, ప్రేమతో పెంచడం, భార్యాభర్తలు ప్రేమతో  గడపడం, ఆర్థిక, సామాజికపరంగా రక్షణ కల్పించుకోవడం మొదలైనవన్నీ కుటుంబ వ్యవస్థలో ప్రధానం.


7) తీర్చిదిద్దే ప్రభావం: వ్యక్తులను, వారి ప్రవర్తనలను కుటుంబం ప్రభావితం చేస్తుంది.


8) పరిమితమైన పరిమాణం:నాగరిక సమాజ సంస్థలన్నింట్లో కుటుంబం పరిమాణంలో చిన్నది. భార్యాభర్తలు, సంతానం ఆ కుటుంబంలో ఉంటారు. అందుకే అది సహజంగానే పరిమితంగా ఉంటుంది. పూర్వం సమష్టి కుటుంబాల్లో సేవకులు, బంధువులు కలిసి ఉన్నప్పుడు కుటుంబ పరిమాణం పెద్దదిగా ఉండేది.


9) సమాజంలో కీలక స్థానం: మానవ సమాజాల్లోని అనేక సంస్థలు వృద్ధి చెందుతూ, మార్పులకు లోనవుతూ ఉంటాయి. వీటన్నింటిలోకి కుటుంబ సంస్థ ప్రధానమైందే కాకుండా కేంద్ర స్థానంలో ఉంటుంది.


10) సభ్యుల బాధ్యత: కుటుంబ సభ్యులు పరస్పరం ప్రేమానురాగాలతో ఉంటూ ఒకరికోసం మరొకరు త్యాగాలు చేస్తారు. తల్లిదండ్రులు పిల్లల క్షేమమే  పరమార్థంగా జీవిస్తుంటారు.


11) సామాజిక నిబంధన: కుటుంబం తన సభ్యులను వివిధ దశల్లో నియంత్రిస్తుంది. ప్రవర్తన నేర్పుతుంది. పిల్లలను నియంత్రించడమే కాకుండా తల్లిదండ్రులను కూడా హద్దుల్లో ఉంచుతుంది. తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే విధంగా చేస్తుంది.


కుటుంబ వ్యవస్థపై సామాజికవేత్తల అభిప్రాయాలు


రక్తసంబంధాన్ని అనుసరించి మొదట్లో కొన్ని  గుంపులుండేవి.            

- సమ్నర్, కెల్లర్‌ 


మొదట్లో కుటుంబం లేదు. తల్లులు, వారి పిల్లల సమూహం మాత్రమే ఉండేది. తర్వాత కుటుంబం అభివృద్ధి చెందింది.            

- బ్రిఫాల్ట్‌


*  మొదటి నుంచే కుటుంబం ఉండేది. - వెస్టర్‌ మార్క్‌ (‘హిస్టరీ ఆఫ్‌ హ్యూమన్‌ మ్యారేజ్‌ - గ్రంథం).


కుటుంబం, సమూహం లేదా గుంపు అనేవన్నీ అవినాభావ సంబంధాలతో అభివృద్ధి చెందాయి.

 - మాలినోస్కీ


* మొదట్లో పితృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉండేది.

- హెర్నీ, సమ్నర్, మెయిన్‌


* మొదట్లో మానవజాతి స్వైరత (Promiscuity) దశలో ఉండేదని, ఆ తర్వాత మాతృస్వామిక కుటుంబ సంస్థ అభివృద్ధి చెందింది - బెకోఫెన్‌


* కుటుంబం మూడు దశలుగా అభివృద్ధి చెందింది.                      

- మోర్గాన్‌

 


రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి 

Posted Date : 15-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌