• facebook
  • whatsapp
  • telegram

మౌర్య సామ్రాజ్యం

మాదిరి ప్రశ్నలు

1. ఇండికా గ్రంథాన్ని రాసింది ఎవరు?
1) కౌటిల్యుడు     2) మెగస్తనీస్‌      3) సెల్యూకస్‌ నికేటర్‌     4) కౌటిల్యుడు


2.  ‘యుద్ధంలో విజయం సాధించి యుద్ధాన్ని విరమించుకున్న ఏకైక చక్రవర్తి అశోకుడే’ అని ఎవరు అన్నారు?

1) ఆర్‌.ఎస్‌.త్రిపాఠి     2) లారెన్స్‌ బనియన్‌      3) హెచ్‌.జి.వెర్స్‌      4) ఉపగుప్తుడు


3. అశోకుడి బౌద్ధమత గురువు?

1) ఉపగుప్తుడు      2) కౌటిల్యుడు       3) మొగలిపుతతిస్స      4) ఎవరూకాదు


4. తొలి భారతదేశ జాతీయ చక్రవర్తిగా పేరొందింది ఎవరు?

1) ధననందుడు      2) మహాపద్మనందుడు      3) చంద్రగుప్తమౌర్యుడు        4) అశోకుడు


5. కళింగ యుద్ధం గురించి సరికానిది?
    ఎ) క్రీ.పూ. 261లో కళింగయుద్ధం జరిగింది. 
    బి) ఈ యుద్ధం గురించి 12వ శిలాశాసనంలోఉంది.
    సి) అప్పటి కళింగ పాలకుడు అనంత పద్మనాభుడు. 
    డి) అశోకుడు రాజుగా ఉన్న ఎనిమిదో సంవత్సరంలో కళింగ యుద్ధం చేశాడు.

1) ఎ, బి       2) బి, సి       3) డి మాత్రమే      4) బి మాత్రమే 


6. అశోకుడు మూడో బౌద్ధసంగీతిని నిర్వహించిన ప్రాంతం?

1) కళింగ       2) పాటలీపుత్ర       3) శ్రీనగర్‌       4) రాజగృహం 


7. శ్రీనగర్‌ను అశోకుడు నిర్మించాడని పేర్కొనే గ్రంథం ఏది?

1) రాజస్థాన్‌ కథావళి       2)  ఇండికా       3) అర్థశాస్త్రం       4) రాజతరంగణి


8. చివరి మౌర్య వంశ పాలకుడు?

1) దశరథుడు      2) కునాలుడు      3) బృహద్రధుడు      4) జలౌకుడు


9. అమిత్రఘాత బిరుదుతో ప్రసిద్ధి చెందిన మౌర్య చక్రవర్తి ఎవరు?

1) చంద్రగుప్త మౌర్యుడు     2) బింబిసారుడు     3) అశోకుడు     4) బిందుసారుడు


10.  అశోకుడు ధర్మమహామాత్రులు అనే ఉద్యోగులను ఎందుకోసం నియమించాడు?

1) ప్రజాసంక్షేమం                 2) రహదారుల నిర్మాణం 
3) బౌద్ధమత ప్రచారం        4) నైతిక నియమాల ప్రచారం 


11. మౌర్య సామ్రాజ్య స్థాపనలో చంద్రగుప్త మౌర్యుడికి సహాయం చేసింది ఎవరు?

1) కౌటిల్యుడు     2) విష్ణుగుప్తుడు     3) చాణుక్యుడు     4) పై అందరూ


12. అశోకుడి పేరును తెలియజేసిన శాసనం ఏది?

1) మస్కి     2) బబ్రు     3) 13వ శిలా శాసనం    4) 5వ శిలాశాసనం


13. అశోకుడి శాసనాల్లోని బ్రాహ్మీ లిపిని చదివిన వ్యక్తి ఎవరు?

1) జేమ్స్‌ అగస్టస్‌        2) సర్‌ జాన్‌ మార్షల్‌     3) జేమ్స్‌ ప్రిన్సిఫ్‌     4) చార్లెస్‌ గ్రాంట్‌


14. మూడో బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించింది ఎవరు?

1) మొగలిపుత తిస్స     2) మహాకశ్యప     3) సబకామి     4) వసుమిత్రుడు


15. శాసన్నాల్లో ఎవరిని అశోకుడి కుమారుడిగా పేర్కొన్నారు?

1) కుణాలుడు     2) తివార     3) సబకామి     4) జలౌకుడు

 

16.  మౌర్యయుగం నాటి సమాజంలో 7 ప్రధాన కులాలు/ వర్గాలు ఉన్నాయని పేర్కొన్న గ్రంథం ఏది?
 1) కథాసరిత్సాగరం      2) అర్థశాస్త్రం      3)  ఇండికా    4) ముద్రారాక్షసం


17. సాంచీస్తూపం ఎక్కడ ఉంది?
1) మహారాష్ట్ర        2) మధ్యప్రదేశ్‌     3) ఉత్తర్‌ప్రదేశ్‌     4) ఆంధ్రప్రదేశ్‌


18. మౌర్యుల కాలంలోని తీర్థుల గురించి తెలిపింది ఎవరు?
1) మెగస్తనీస్‌        2) శూద్రకుడు       3) కౌటిల్యుడు     4) విశాఖదత్తుడు


19. భారత జాతీయ చిహ్నాన్ని ఎక్కడి నుంచి స్వీకరించారు?
1) సాంచీ        2) రాంపూర్వ     5) తక్షశిల     5) సారనాథ్‌


20. మౌర్యుల కాలం నాటి క్రిమినల్‌ న్యాయస్థానాలకు ఏమని పేరు?
1) కంఠక శోధన     2) ధర్మస్థీయ     3) సత్రిన్‌     4) రజ్జుకలు


21. మౌర్యుల కాలం నాటి రాతిస్తంభాల నిర్మాణ నిపుణులు ఏ ప్రాంతంలో శిక్షణ పొందేవారు?
1) పాటలీపుత్ర     2) తక్షశిల     3) గిర్నార్‌     4) సౌరాష్ట్ర


సమాధానాలు: 1-2; 2-3; 3-1; 4-4; 5-4; 6-2; 7-4; 8-3; 9-4; 10-4; 11-4; 12-1; 13-3; 14-1; 15-2; 16-3; 17-2; 18-3; 19-4; 20-1; 2-12.

 

 

Posted Date : 20-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌