• facebook
  • whatsapp
  • telegram

మధుర శిల్పకళలో జ్ఞాన చక్రం!

మౌర్యానంతర యుగం

 

 

మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత భారత ఉపఖండంలో అనేక కొత్త శక్తులు ఆవిర్భవించాయి. విదేశీయుల దండయాత్రలు మొదలయ్యాయి. శకులు, కుషాణులు, గుప్తులు, శాతవాహనులు పాలకులుగా అవతరించి సామ్రాజ్యాలను స్థాపించారు.  మౌర్యుల క్షీణత నుంచి గుప్తుల పెరుగుదల వరకు ‘మౌర్యుల అనంతర యుగం’గా వ్యవహరించే కాలంలో చోటుచేసుకున్న రాజకీయ, సాంస్కృతిక మార్పులను అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. ఈ కాలంలో శుంగ, కణ్వ వంశాల పాలనాశైలి, వివిధ రంగాల్లోని నాటి ప్రముఖులు, వెలువడిన గ్రంథాలు, ఆదరణ పొందిన కళలు, వాటి ప్రత్యేకతల గురించి అవగాహన పెంచుకోవాలి.

 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

1.    కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి.

ఎ) భరద్వాజ గోత్రానికి చెందిన పుష్యమిత్రశుంగ శుంగ వంశాన్ని స్థాపించాడు.

బి) శుంగ వంశంలో గొప్పవాడు అగ్నిమిత్ర.

సి) పుష్యమిత్రుడు అశ్వమేధ యాగం నిర్వహించాడు.

డి) పుష్యమిత్రుడు హిందూమత అభిమాని.

1) ఎ, బి, సి, డి        2) ఎ, బి, సి 

3) ఎ, సి, డి        4) ఎ, బి, డి 


2.     కిందివాటిని పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి.

ప్రకటన - A: పుష్యమిత్రుడి కుమారుడు అగ్నిమిత్రుడు, విదర్భ రాకుమారి మాళవికల ప్రేమ గురించి రాసినవారు కాళిదాసు.

ప్రకటన - B: శుంగ వంశంలో చివరివాడైన ‘భాగభద్ర’ను చంపి కణ్వ వంశాన్ని స్థాపించినవాడు వాసుదేవ కణ్వ.

1) ప్రకటనలు A, Bలు సరైనవి   

2) ప్రకటనలు A, Bలు సరికానివి 

3) ప్రకటన A సరైంది కాదు B సరైంది    

4) ప్రకటన A సరైంది, B సరైంది కాదు


3. నాలుగో బౌద్ధ సమావేశానికి అధ్యక్షుడైన వసుమిత్రుడి వంశం?    

1) శుంగ  2) కణ్వ  3) కుషాణు  4) పార్థియన్లు


4. కిందివాటిలో సరైంది?

ఎ) శుంగవంశ రాజైన భాగవతుడి ఆస్థానంలోని ఇండో గ్రీకు రాయబారి హెలియోడోరస్‌.

బి) హెలియోడోరస్‌ భాగవత మతం స్వీకరించినట్లు తెలిపే శాసనం బేస్‌నగర్‌ శాసనం.

సి) హెలియోడోరస్‌ విదిశ సమీపంలోని విష్ణు దేవాలయం వద్ద గరుడధ్వజం నిర్మించాడు.

డి) బేస్‌నగర్‌ శాసనంలో ప్రస్తావించిన శుంగ వంశ రాజు భాగభద్రుడు.

1) ఎ, బి, సి, డి     2) ఎ, సి, డి  

3) ఎ, బి, డి      4) ఎ, డి 


5.     కణ్వ వంశానికి చెందిన నలుగురు రాజులు 45 ఏళ్లు పరిపాలించారు. వారిని వరుసక్రమంలో అమర్చండి.

ఎ) వాసుదేవ కణ్వ        బి) సుశర్మ     

సి) నారాయణ           డి) భూమిమిత్ర

1) ఎ, సి, బి, డి         2) డి, సి, బి, ఎ        

3) ఎ, బి, సి, డి          4) ఎ, డి, బి, సి 


6. కింది వాక్యాల్లో సరైనవి?

ఎ) బాక్ట్రియా అంటే - హిందూకుష్‌ - ఆక్సస్‌ -  హీరట్‌ల మధ్య ఉన్న ప్రాంతం.

బి) భారతదేశంపై దాడి చేసి, ఆక్రమించిన బాక్ట్రియా రాజు డెమిట్రియస్‌.

సి) ఇండో-గ్రీకుల కాలంలో మొదటి చారిత్రక నాణేలను ముద్రించారు.

డి) డెమిట్రియస్‌ గ్రీకు ఖరోష్టి లిపి ఉన్న నాణేలను జారీ చేశాడు.

1) ఎ, బి, డి       2) ఎ, బి, సి  

3) ఎ, సి, డి       4) ఎ, బి, సి, డి


7. ఇండో - గ్రీకు రాజుల్లో అగ్రగణ్యుడు ఎవరు?

1) మీనాండర్‌           2) డెమిట్రియస్‌         

3) హెలియోడోరస్‌         4) అలెగ్జాండర్‌


8. కిందివాటిలో సరికానివి?

ఎ) ఇండో-గ్రీకు రాజు అయిన మీనాండర్‌ రాజధాని పెషావర్‌.

బి) మీనాండర్‌ విజయాల గురించి పేర్కొన్నవారు స్ట్రాబో, ప్లూటార్క్, జస్టిన్‌.

సి) మీనాండర్‌ ఆస్థానంలోని ప్రముఖ బౌద్ధ మత పండితుడు నాగసేనుడు.

డి) నాగసేనుడు, మీనాండర్‌ మధ్య జరిగిన చర్చల గురించి తెలిపే గ్రంథం మిళింద పన్హా.    

1) ఎ, డి     2) ఎ మాత్రమే   

3) డి మాత్రమే          4) ఎ, సి


9. ‘మిళింద పన్హా’ అనే గ్రంథం ఏ భాషలో ఉంది?

1) సంస్కృతం 2) పాళీ  3) హిందీ  4) బెంగాలీ


10. కిందివాటిలో సరైంది?

ప్రకటన-A: శకులకు మరొక పేరు - సింథియన్‌లు. వీరు తొకారియన్‌ అనే తెగకు చెందినవారు.

ప్రకటన-B: గ్రీకుల దాడులను ఎదుర్కోలేక బోలాన్‌ కనుమల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించారు.

1) ప్రకటనలు A, B లు సరికావు               2) ప్రకటన A సరైంది, B సరైంది కాదు

3) ప్రకటనలు A, B లు సరైనవి        4) ప్రకటన B సరైంది, A సరైంది కాదు


11. క్షహరాటుల్లో గొప్పవాడైన నహపాణుడిని ఓడించిన శాతవాహన రాజు?    

1) శ్రీముఖుడు       2) గౌతమీపుత్ర శాతకర్ణి  

3) రెండో శాతకర్ణి       4) హాలుడు


12. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి.

ఎ) పార్ధియన్‌ రాజులను పహ్లవులు అని కూడా అంటారు.

బి) పార్ధియన్‌లలో గొప్పవాడు గోండోపెర్నెస్‌.

సి) గోండోపెర్నెస్‌ కాలంలో భారతదేశాన్ని సందర్శించిన క్రైస్తవ సన్యాసి సెయింట్‌ థామస్‌.

డి) గోండోపెర్నెస్‌ శాసనం పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఉంది.

1) ఎ, డి         2) ఎ, బి, డి    

3) ఎ, బి, సి, డి       4) ఎ, బి, సి


13. కుషాణుల వంశ స్థాపకుడు, రాజధానిని వరుసగా గుర్తించండి.    

1) కనిష్కుడు - పురుషపురం        2) పెషావర్‌ - వీమాకాడ్‌ కాడ్‌ఫిసెస్‌ 

3) కుజుల కాడ్‌ఫిసెస్‌ - పురుషపురం        4) కనిష్కుడు - పెషావర్‌


14. కిందివాటిలో వీమాకాడ్‌ ఫిసెస్‌ బిరుదులు?

1) సర్వలోకేశ్వర        2) మహేశ్వర   

3) కుమార       4) 1, 2 


15. కిందివాటిలో వీమాకాడ్‌ ఫిసెస్‌కు సంబంధించి సరైనవి?

ఎ) వీమాకాడ్‌ ఫిసెస్‌ శివుడిని ఆరాధించాడు.

బి) వీమాకాడ్‌ ఫిసెస్‌ జారీ చేసిన నాణేలపై శివుడి ప్రతిమ ఉంది.

సి) వీమాకాడ్‌ ఫిసెస్‌ నాణేలపై ప్రముఖంగా కనిపించే బొమ్మ నంది.

డి) వీమాకాడ్‌ ఫిసెస్‌ కుషాణు వంశంలో గొప్పవాడు.

1) ఎ, బి, సి, డి       2) బి, సి, డి   

3) ఎ, బి, డి       4) ఎ, బి, సి


16. కిందివాటిలో కనిష్కుడి బిరుదులు గుర్తించండి.

1) దేవపుత్ర       2) సీజర్‌   

3) రెండో అశోకుడు        4) పైవన్నీ


17. కిందివాటిలో అశ్వఘోషుడి రచనలు గుర్తించండి.

1) బుద్ధచరితం     2) సౌందర నందనం 

3) శారిపుత్ర ప్రకరణం     4) పైవన్నీ


18. కనిష్కుడి ఆస్థాన వైద్యుడు?

1) శంకు       2) చరకుడు     

3) ధన్వంతరి        4) పతాంజలి


19. ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ బుద్ధిజం’గా ఏ గ్రంథాన్ని పిలుస్తారు?

1) బుద్ధచరితం        2) సుహృల్లేఖ    

3) వినయ పీఠిక        4) మహావిభాష శాస్త్రం


20. కిందివాటిలో నాలుగో బౌద్ధమత సమావేశానికి సంబంధించి సరైనవి?

ఎ) ఈ సమావేశం క్రీ.శ.1000లో జరిగింది.

బి) ఈ సమావేశం కశ్మీర్‌ వద్ద జరిగింది.

సి) ఈ సమావేశానికి ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు.

డి) ఈ సమావేశం నిర్వహించినవారు కనిష్కుడు.

1) ఎ, బి, సి, డి         2) ఎ, బి, సి   

3) బి, సి, డి       4) ఎ, సి, డి 


21. కిందివాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రతిపాదన A: గాంధార శైలిని ఇండో-గ్రీకు శైలి అని కూడా పిలుస్తారు.

కారణం R: గాంధార కళాశైలి గ్రీకు రోమన్‌ సంప్రదాయం వల్ల ప్రభావితమైంది.

1) A, R లు రెండూ సరైనవి,  Aకి R సరైన వివరణ కాదు 

2) A సరైంది, R సరైంది కాదు

3) A సరైంది కాదు,  R సరైంది

4) A, R లు సరైనవి, Aకి R సరైన వివరణ


22. కనిష్కుడు బౌద్ధమతం స్వీకరించడానికి ప్రధాన కారకుడు?

1) వసుమిత్రుడు     2) అశ్వఘోషుడు 

3) నాగార్జునచార్య     4) ఆనందుడు


23. గాంధార శిల్పకళను ఆదరించిన కుషాణు రాజు?

1) వీమా కాడ్‌ఫిసెస్‌        2) కుజుల కాడ్‌ఫిసెస్‌

3) కనిష్కుడు       4) పైవారందరూ 


24. గాంధార శిల్పకళ లక్షణాలను గుర్తించండి.

ఎ) ఉంగరాల జుట్టు       బి) వాస్తవికత

సి) సున్నితమైన పనితనం    డి) సరైన కొలతలు

1) ఎ, బి, సి, డి       2) ఎ, సి, డి

3) ఎ, బి, సి        4) ఎ, డి


25. గాంధార శిల్పకళ అభివృద్ధి చెందిన ప్రాంతం?

1) తక్షశిల, దాని పరిసర ప్రాంతాలు

2) పాటలీపుత్రం దాని పరిసర ప్రాంతాలు

3) సువర్ణగిరి దాని పరిసర ప్రాంతాలు

4) వైశాలి దాని పరిసర ప్రాంతాలు


26. మధుర శిల్పకళ లక్షణాన్ని గుర్తించండి.

ఎ) ఈ శిల్పకళ కౌసంభి, ప్రయాగ, మధురల వద్ద వ్యాప్తి చెందింది.

బి) ఇది పూర్తి స్వదేశీ శైలి.

సి) తల వెనుక భాగంలో జ్ఞాన చక్రం ఉంటుంది.

డి) అలంకరణకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది.

1) ఎ, సి, డి      2) ఎ, బి, సి, డి    

3) సి, డి        4) బి, సి, డి 


27. అమరావతి శిల్పకళకు సంబంధించి సరైనవి?

ఎ) శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలానికి చెందింది.

బి) తెల్లని పాలరాయిని ఉపయోగించారు.

సి) అమరావతి, నాగార్జున కొండ, జగ్గయ్యపేట ప్రముఖ కేంద్రాలు.

డి) బౌద్ధం ప్రకృతి అంశం

1) ఎ, బి, సి, డి       2) బి, డి  

3) ఎ, బి, డి      4) ఎ, బి, సి


28. ఏ కుషాణు చక్రవర్తి పేదలకు భోజన సామగ్రిని పంచడానికి ఖర్చుల నిమిత్తం ఒక నిధిని ఏర్పాటు చేశాడు?

1) కనిష్కుడు      2) హువిష్కుడు

3) కుజుల కాడ్‌ఫిసెస్‌      4) వీమా కాడ్‌ఫిసెస్‌


29. ప్రాచీన భారతదేశంలో ఏ వంశ రాజు ‘దేవపుత్ర’ అనే బిరుదును పొందాడు?

1) మౌర్య       2) గుప్త 

3) హోయసాల        4) కుషాణు


30. కుషాణుల రాజధాని?

1) పాటలీపుత్రం     2) పురుషపురం 

3) శ్రీవస్తి      4) ఉజ్జయిని


31. కిందివాటిలో సరికానిది?

1) బృహత్కథ - గుణాఢ్యుడు    2) గాథాసప్తశతి - హాలుడు

3) హర్షచరిత్ర - హర్షవర్ధనుడు        4) రాజశేఖర చరిత్ర - మల్లన


32. భారతదేశంలో బంగారు నాణేలు ముద్రించి అమల్లోకి తెచ్చిన రాజులు?

1) మౌర్యులు        2) గుప్తులు     

3) ఇండో-గ్రీకులు          4) కుషాణులు


33. కనిష్కుడి ఆస్థాన వైద్యుడు?

1) నాగార్జునుడు  2) శుశ్రుతుడు       

3) చరకుడు   4) వాగ్భటుడు


34. కిందివాటిలో సరైంది?

ఎ) చోళుల రాజధాని - తంజావూర్‌; రాజచిహ్నం - పులి

బి) పాండ్యుల రాజధాని - మధురై; రాజచిహ్నం - చేప

సి) చేర రాజుల రాజధాని - వంజి; రాజచిహ్నం - ధనుస్సు

1) ఎ సరైంది, బి, సి సరైనవి కావు        2) ఎ, బి, సి సరైనవి

3) ఎ, బి సరైనవి సి సరికానిది         4) ఎ, బి, సి సరికానివి


35. నేచురల్‌ హిస్టరీ గ్రంథ రచయిత?

1) మెగస్తనీస్‌   2) మీనాండర్‌      3) ప్లీనీ       4) మార్కోపోలో


36. ‘లీలావతి పరిణయం’ అనే గ్రంథం రాసినవారు?

1) హాలుడు   2) శర్వవర్మ  3) కుతూహలుడు    4) సోమదేవుడు


37. సంగమయుగంలో ప్రధాన దేవుడు?

1) అగ్ని   2) వరుణుడు   3) ప్రకృతి    4) మురుగన్‌


38. ఖారవేలుడి వంశం?

1) శాక్య      2) ఛేధి      3) జ్ఞాత్రిక       4) కుషోణు


39. ఖారవేలుడి శాసనం ఏమిటి?

1) కళింగ       2) హాథిగుంఫా      3) నాసిక్‌       4) నానాఘాట్‌


40. బాక్ట్రియాను ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు?

1) బాలీ 2) బాల్క్‌  3) శకులు  4) కాబూల్‌


41. కనిష్కుడు శకయుగాన్ని ఎప్పుడు ప్రారంభించాడు? 

1) క్రీ.శ.76   2) క్రీ.శ.78     3) క్రీ.శ.87    4) క్రీ.శ.67 

 


సమాధానాలు

1-3; 2-4; 3-1; 4-1; 5-3, 6-4; 7-1; 8-2; 9-2; 10-3; 11-2; 12-3; 13-3; 14-4; 15-4, 16-4; 17-4; 18-2; 19-4; 20-3; 21-4; 22-2; 23-3; 24-1; 25-1; 26-2; 27-1; 28-2; 29-4; 30-2;31-3; 32-3, 33-3; 34-2; 35-3, 36-3; 37-4; 38-2; 39-2; 40-2; 41-2. 


రచయిత: గద్దె నరసింహారావు

 


ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

Posted Date : 09-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌