• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాక విస్తీర్ణం, జనాభా పరిమాణం పరంగా దేశంలో 12వ పెద్ద రాష్ట్రంగా ఉంది. మనరాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1,14,840 చ.కి.మీ. 2011 జనాభా లెక్కల ప్రకారం 3,51,93,978 మంది ప్రజలు తెలంగాణలో నివసిస్తున్నారు (2022 నాటికి 3.79 కోట్లు - సెన్సెస్‌ ఆఫ్‌ ఇండియా అంచనా). రాష్ట్రానికి ఉత్తరాన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌; పశ్చిమాన కర్ణాటక; దక్షిణాన, తూర్పున ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులుగా ఉన్నాయి. ఇది దక్కన్‌ పీఠభూమి ప్రాంతంలో నెలకొని ఉంది. వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంటుంది.

రెండు పెద్ద జీవనదులైన కృష్ణా, గోదావరి తెలంగాణ మీదుగా ప్రవహిస్తున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతం 79% కాగా, కృష్ణా పరీవాహక ప్రాంతం 68.5%.

ఈ నదీ జలాల్లో రాష్ట్రం ఉపయోగించుకునే వాటా చాలా తక్కువ. 

​​​​​​​ రాష్ట్ర పౌరుల్లో ఎక్కువ మంది గ్రామీణులే. జనాభాలో 61.33% గ్రామాల్లో, 38.67% పట్టణాల్లో  నివసిస్తున్నారు. 

​​​​​​​ 200111 దశాబ్దంలో రాష్ట్ర జనాభా వృద్ధి రేటు 13.58% ఉంది. 19902000 దశకంలో ఈ వృద్ధి 18.77 శాతంగా నమోదైంది. 

​​​​​​​ రాష్ట్రంలో పట్టణ జనాభా గణనీయంగా వృద్ధి చెందుతోంది. 200111 దశాబ్దంలో పట్టణ జనాభా వృద్ధి 38.12% ఉండగా, 19902000లో ఈ రేటు 25.13%. 

​​​​​​​ 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ జనాభా 2.13% మాత్రమే వృద్ధి చెందింది. 

​​​​​​​ 2011 జనాభా లెక్కల ప్రకారం 29% పైగా జనాభా హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు.

​​​​​​​ ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. 

​​​​​​​ తెలంగాణ ప్రస్తుత జనసాంద్రత ప్రతి చ.కి.మీ.కి 312 మంది.

 

వ్యవసాయ రంగం

 ‘‘వ్యవసాయం అంటే కొందరు అనుకున్నట్టు కేవలం పంటలు వేయడం కాదు. అది భూమి, నీరు సాయంతో ఆహారాన్ని, గ్రాసాన్ని ఉత్పత్తి చేయడం. వ్యవసాయం లేకుండా నగరం, స్టాక్‌ మార్కెట్, బ్యాంకు, విశ్వవిద్యాలయం, సైన్యం ఏవీ మనుగడ సాధించలేవు. నాగరికతకూ, సమస్త సుస్థిర ఆర్థిక వ్యవస్థకూ వ్యవసాయమే పునాది’’ అని ఫ్రాన్స్‌ మాజీ మంత్రి అలెన్‌ సవారే పేర్కొన్నారు.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. వ్యవసాయరంగం ప్రధానంగా వర్షాధారమైంది. నానాటికీ తరిగిపోతున్న భూగర్భజలాలపై అది ఎక్కువగా ఆధారపడుతోంది.

తెలంగాణ జనాభాలో దాదాపు 55.49% మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. పేదరికాన్ని తగ్గించడానికి (Poverty  Eradication), సంపద వృద్ధిని నికరంగా సాగించడానికి వ్యవసాయ ఆదాయాలను పెంచడం ముఖ్యం. 

‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (MGNREGS), గ్రామీణ జీవనోపాధి కల్పన లాంటి  పథకాల అమలు ద్వారా ప్రజలకు ఆహార భద్రతతో పాటు స్థిర ఆదాయాన్ని కల్పిస్తున్నారు.

వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న వివిధ రంగాలను విస్తరించడం ద్వారా, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచి, సేద్యాన్ని లాభసాటిగా మార్చాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా రాష్ట్రంలో విత్తనాభివృద్ధికి ప్రోత్సాహం కల్పించింది. తెలంగాణను ‘విత్తన భాండాగారం’గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

2014 - 15లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (SGSDP)లో జీవ ఉత్పత్తులు సుమారు మూడోవంతు ఉన్నాయి. 

పంటసేద్యం (వ్యవసాయం, ఉద్యానవన పోషణ కలిపి), దాని అనుబంధ రంగాల్లో జీవ ఉత్పత్తులు, అటవీ సంపద, మత్స్య పరిశ్రమ రంగాలను చేర్చారు.

 2014 - 15లో బిళీజుతిలో వ్యవసాయ రంగం వాటా 16% ఉండగా, 201920 నాటికి 17%, 202021 నాటికి 21 శాతానికి పెరిగింది.

సోషియో ఎకనామిక్‌ అవుట్‌లుక్‌ 2015 నివేదిక ప్రకారం, రాష్ట్ర జీఎస్‌డీపీలో 201617 నుంచి 202021 మధ్య సగటు వ్యవసాయ రంగ వృద్ధి రేటు 14.5 శాతంగా ఉంది.

రాష్ట్రంలో నికర సేద్య భూమి 201415లో 108 లక్షల ఎకరాలు ఉండగా, 201920లో 136 లక్షల ఎకరాలకు (26 శాతం) పెరిగింది. మొత్తం అడవుల విస్తీర్ణం 26,969 చ.కి.మీ. (24%) ఉంది.

రాష్ట్రంలో ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న (Maize), పత్తి, వేరుశెనగ, రెడ్‌గ్రామ్, బెంగాల్‌ గ్రామ్, సోయాబీన్‌ మొదలైనవి. 

 

భూకమతాలు (2015 - 16)

వ్యవసాయ కమతాల గణన, 201011 ప్రకారం రాష్ట్రంలో భూకమతాలు సాగు చేస్తోన్న వారి సంఖ్య 55.54 లక్షలు. 

ఈ కమతాల కింద ఉన్న మొత్తం భూమి పరిమాణం 61.97 లక్షల హెక్టార్లు. 

రాష్ట్రంలో సగటు భూకమతా పరిమాణం 201011లో 1.12 హెక్టార్లు ఉండగా, 201516 నాటికి 1 హెక్టారుకు తగ్గింది. 

(201011లో ఆంధ్రప్రదేశ్‌లో 1.06 హెక్టార్లు ఉండగా, 201516లో 0.94 హెక్టార్లకు తగ్గింది.)

 

వర్షపాతం 

రాష్ట్రంలో సగటు వర్షపాతం సుమారు 906 మి.మీ. దీనిలో 80% నైరుతి రుతుపవనాల (జూన్‌ - సెప్టెంబరు మధ్య) నుంచి లభిస్తుంది.

 

వ్యవసాయ ప్రోత్సాహకాలు 

 రైతుబంధు పథకం: దీన్ని తెలంగాణ ప్రభుత్వం 2018, మే 10న కరీంనగర్‌ జిల్లా ధర్మరాజుపల్లిలో ప్రారంభించింది. రైతులు పంట వేసేందుకు పెట్టుబడి సాయం అందించి, వారు అప్పులపాలు కాకుండా చూడాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం.

వానాకాలంలో, యాసంగిలో ఏడాదికి రెండు సార్లు ఎకరానికి రూ.5000 చొప్పున సహాయంగా ఇస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా సంబంధిత రైతు బ్యాంకు ఖాతాలో జమచేస్తారు.

 విత్తనాలు (Seeds): 202021లో తెలంగాణ ప్రభుత్వం రైతులకు సబ్సిడీ కింద 2.2 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసింది.

 ఎరువుల వినియోగం:  వ్యవసాయ ఉత్పాదకాల్లో ఎరువుల వినియోగం ముఖ్యమైంది. మనరాష్ట్రంలో సగటు ఎరువుల వినియోగం ఏడాదికి ఎకరాకు 99.3 కేజీలుగా ఉంటే, మొత్తం భారతదేశంలో ఈ విలువ 53.9 కేజీలుగా ఉంది.

 

జిల్లాల వారీగా ఎరువుల వినియోగం:

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా ఎరువుల వినియోగాన్ని పరిశీలిస్తే మొదటి స్థానంలో వరంగల్‌ - అర్బన్‌ (617 కేజీలు/ ఎకరం) ఉంది. 

మేడ్చల్‌ - మల్కాజ్‌గిరి (532 కేజీ/ ఎకరం) రెండో స్థానంలో ఉంది. 

నిర్మల్‌ జిల్లా (71 కేజీలు/ ఎకరం) చివరి ర్యాంకు పొందింది.

​​​​​​​

 

 

Posted Date : 05-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - తెలంగాణ ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌