• facebook
  • whatsapp
  • telegram

‘సులభంగా తెచ్చుకో.. భద్రంగా దాచుకో!’

ద్రవ్యం

 


 

ఏది కొనాలన్నా డబ్బు, ఏది కావాలన్నా డబ్బు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు? ఎవరు పుట్టించారు? నాగరిక సమాజం కనిపెట్టిన వినిమయ సాధనాల్లో ప్రధానమైంది డబ్బు. దీన్నే ఆర్థిక పరిభాషలో ద్రవ్యం అంటారు. ప్రభుత్వాలు ముద్రించే నాణేలు, నోట్లు ద్రవ్యంగా చెలామణి అవుతాయి. పూర్వం వస్తుమార్పిడితో జరిగిన లావాదేవీలు, ఆధునిక కాలంలో ద్రవ్యం ద్వారా సాగుతున్నాయి. మార్కెట్‌ మొత్తానికి ఆధారమై నడిపిస్తున్న ఆ ద్రవ్యం పుట్టుపూర్వోత్తరాలు, విధులు, రకాలు, లక్షణాలు, స్వభావాలు, సరఫరా, నియంత్రణ తీరుతెన్నులను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 


1.     వస్తుమార్పిడి పద్ధతికి మరొక పేరు?

1) వస్తు పంపిణీ విధానం           2) వస్తు వినియోగ పద్ధతి

3) వస్తు వినిమియ విధానం       4) వస్తు ఉత్పత్తి విధానం


2.     వస్తుమార్పిడి పద్ధతిలో సరైంది?

1) మానవుడి కోరికలు పరిమితంగా ఉండటం    2) ఆర్థిక కార్యకలాపాలు పరిమితంగా ఉండటం

3) వినిమయ మాధ్యమం ఉండదు.            4) పైవన్నీ


3.     వస్తుమార్పిడి పద్ధతిలో ఉండే లోపాల్లో సరికానిది?

1) కోర్కెల సమన్వయం లేకపోవడం             2) వాయిదా చెల్లింపులకు వీలు లేకపోవడం

3) విలువ కొలిచే కొలమానం ఉండటం         4) కాల సమన్వయం లేకపోవడం


4.     ‘ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అది ద్రవ్యం’ అని నిర్వచించింది ఎవరు?    

1) సెలిగ్‌ మన్‌        2) క్రౌధర్‌    

3) వాకర్‌              4) డాల్టన్‌


5.     కిందివాటిలో మిల్టన్‌ ఫ్రీడ్‌మన్‌ నిర్వచనం?

1) సర్వాంగీకారం పొందిన వస్తువే ద్రవ్యం           2) తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం ద్రవ్యం

3) విలువ కొలమానంగా ఉపయోగపడేదే ద్రవ్యం       4) వినిమయ సాధనంగా పనిచేసేదే ద్రవ్యం


6.     కింది ద్రవ్య పరిణామ క్రమంలో సరైంది?    

1) వస్తు ద్రవ్యం, లోహ ద్రవ్యం, కాగితపు ద్రవ్యం

2) కాగితపు ద్రవ్యం, లోహ ద్రవ్యం, వస్తు ద్రవ్యం

3) లోహ ద్రవ్యం, వస్తు ద్రవ్యం, కాగితపు ద్రవ్యం

4) కాగితపు ద్రవ్యం, వస్తు ద్రవ్యం, లోహ ద్రవ్యం


7.     లోహాలతో మొదటిసారిగా నాణేలు తయారుచేసినవారు?

1) రోమన్లు                2) లిడియన్లు  

3) ఫ్రెంచ్‌వారు         4) గ్రీకులు


8.     ‘పణా’ అనే వెండి నాణేలను తయారుచేసినవారు?

1) రోమన్లు          2) గ్రీకులు          3) మౌర్యులు         4) గుప్తులు


9.     కిందివాటిలో సమీప ద్రవ్యానికి సమానమైనవి?

1) హుండీలు                 2) బాండ్లు  

3) ట్రెజరీ బిల్లులు         4) పైవన్నీ


10. మన దేశంలో పూర్తి ప్రామాణికత ఉన్న వెండి నాణం ఎప్పుడు అమల్లో ఉండేది?

1) 1835 - 93              2) 1845 - 93   

3) 1855 - 93             4) 1835 - 94


11. కిందివాటిలో లోహ ద్రవ్యం ఎన్ని రకాలుగా ఉంటుంది?

1) పూర్తిప్రమాణ ద్రవ్యం             2) తక్కువ ప్రమాణ ద్రవ్యం

3) ప్రాతినిధ్య ద్రవ్యం                 4) పైవన్నీ


12. జారీ చేసిన కాగితపునోట్లు బంగారు, వెండి లోహాల్లోకి మార్చుకునే వీలు లేకపోతే అది ఏ ద్రవ్యం?

1) పరివర్తన కాగితపు ద్రవ్యం             2) అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం

3) ప్రాతినిధ్య కాగితపు ద్రవ్యం           4) పైవన్నీ


13. ప్రజల వద్ద ఉండే నాణేలు, కరెన్సీ నోట్లు, బ్యాంకుల వద్ద ఉండే డిమాండ్‌ డిపాజిట్లు ఏ ద్రవ్యానికి సమానం?

1) సమీప ద్రవ్యం            2) సామాన్య ద్రవ్యం

3) పరపతి ద్రవ్యం           4) బ్యాంకు ద్రవ్యం


14. వినియమ మాధ్యమం అనే విధికి ప్రాధాన్యం ఇచ్చిన ఆర్థికవేత్త?

1) ఫిషర్‌        2) వాకర్‌          3) సెలిగ్‌మన్‌        4) డాల్టన్‌


15. కింది ద్రవ్య విధి అయిన విలువ కొలమానంలో సరైంది?

1) ఈ విధి వల్ల వస్తువుల మధ్య వినిమయం సులభమైంది.

2) దీనివల్ల వ్యాపార ఖాతాలు సులభమైనవి.

3) వస్తుసేవల సాపేక్ష ధరలు గణించేందుకు ఉపయోగపడుతుంది.            4) పైవన్నీ


16. ‘ద్రవ్యాన్ని సులభంగా తీసుకుపోవచ్చు, దాచుకోవచ్చు, నిల్వ చేయడానికి ఎక్కువ ప్రదేశం అవసరం లేదు’ అని తెలిపే ద్రవ్యవిధి?

1) వినిమయ మాధ్యమం              2) విలువ కొలమానం

3) విలువ నిధి                   4) పైవన్నీ


17. ఆచార్య కిన్లే వర్గీకరించని ద్రవ్యవిధి?

1) ప్రాథమిక                     2) గౌణ  

3) అనుషంగిక                 4) వినియోగం


18. మంచి ద్రవ్యానికి ఉండే లక్షణం?

1) ఆమోదయోగ్యత                    2) సజాతీయత  

3) మన్నిక                         4) పైవన్నీ


19. కింది గ్రేషమ్‌ సూత్రంలో సరైంది?

1) నాసిరకం ద్రవ్యం మేలైన ద్రవ్యాన్ని చెలామణి నుంచి తరిమివేస్తుంది.

2) మేలైన ద్రవ్యం నాసిరకం ద్రవ్యాన్ని చెలామణి నుంచి తరిమివేస్తుంది.

3) నాసిరకం, మేలైన ద్రవ్యాలు రెండూ చెలామణిలో ఉంటాయి.

4) నాసిరకం ద్రవ్యం మాత్రమే చెలామణిలో ఉంటుంది.


20. కిందివాటిలో సంప్రదాయ ఆర్థికవేత్తల ద్రవ్య సమీకరణం?

1) M = C + DD + TD              2) M = C + DD

3) M =C                            4) MC = DD


21. ప్రజల వద్ద కరెన్సీ, బ్యాంకు డిమాండ్‌ డిపాజిట్లు, ఆర్‌బీఐ వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు ఉండే ద్రవ్య సప్లయి?

1) M1 ద్రవ్యం         2) M2 ద్రవ్యం 

3) M3 ద్రవ్యం         4) M4 ద్రవ్యం


22. కిందివాటిలో విశాల ద్రవ్య కొలమానం

1) M1            2) M2          3) M3            4) M4


23. M1, M2 ద్రవ్యాల మధ్య తేడా?

1) బ్యాంకుల వద్ద ఉన్న కాల డిపాజిట్లు   

2) పోస్టాఫీసులో ఉన్న మొత్తం డిపాజిట్లు

3) బ్యాంకుల వద్ద ఉన్న పొదుపు డిపాజిట్లు  

4) పోస్టాఫీసుల్లోని పొదుపు డిపాజిట్లు


24. 1997లో నూతన ద్రవ్య సప్లయికి సంబంధించి సరైంది?

ఎ) పోస్టాఫీసుల్లోని డిపాజిట్లను తొలగించారు.

బి) బ్యాంకుల్లోని కాలపరిమితి డిపాజిట్లను రెండు రకాలుగా వర్గీకరించారు.

సి) వాణిజ్య బ్యాంకుల్లోని సర్టిఫికెట్‌ డిపాజిట్లను పరిగణనలోకి తీసుకున్నారు.

1) ఎ మాత్రమే                   2) బి మాత్రమే   

3) ఎ, బి మాత్రమే              4) పైవన్నీ 


25. ఆర్‌బీఐ వర్కింగ్‌ గ్రూప్‌ ద్రవ్య వనరులను ఎన్ని రకాలుగా వర్గీకరించింది?

1) రెండు        2) మూడు            3) నాలుగు           4) అయిదు


26. L2 ద్రవ్య వనరుల్లో సరైనవి?

1) విత్తసంస్థల కాలడిపాజిట్లు   

2) విత్త సంస్థలు జారీ చేసిన డిపాజిట్‌ సర్టిఫికెట్లు

3) విత్త సంస్థల టర్మ్‌ బారోయింగ్స్‌                             4) పైవన్నీ


27. ద్రవ్య గుణకం సమీకరణం-


28. అధిక శక్తిమంతమైన ద్రవ్యానికి మరో పేరు?

1) మూలాధార ద్రవ్యం           2) ప్రాథమిక ద్రవ్యం

3) రిజర్వు ద్రవ్యం              4) పైవన్నీ


29. ఒక నిర్ణీత కాలంలో ఒక యూనిట్‌ ద్రవ్యం ఎన్నిసార్లు వస్తుసేవలు కొనడానికి చేతులు మారడాన్ని తెలియజేసేది-

1) ద్రవ్య గుణకం                 2) ద్రవ్య డిమాండ్‌  

3) ద్రవ్య ప్రసారవేగం              4) ద్రవ్య మార్పిడి


30. నోటీస్‌ మనీ కాలపరిమితి ఎన్ని రోజులు? 

1) 14         2) 15           3) 20       4) 30


31. ఒక దేశంలో వడ్డీ రేటు తగ్గడం వల్ల అధిక వడ్డీ రేటు ఉన్న దేశంలోకి పెట్టుబడులు తరలిపోవడాన్ని తెలిపే ద్రవ్యం?    

1) కాల్‌ మనీ            2) హాట్‌ మనీ  

3) టైట్‌ మనీ             4) చీప్‌ మనీ


32. కీన్స్‌ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతంలో ద్రవ్యత్వాభిరుచి కింది ఏ అంశంపై ఆధారపడుతుంది?

ఎ) దైనందిన వ్యవహార ఉద్దేశం  

బి) ముందు జాగ్రత్త కోసం

సి) అంచనా వ్యాపారం కోసం

1) ఎ, బి           2) సి           3) బి         4) ఎ, బి, సి


33.  ఫ్రీడ్‌మన్‌ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతంలో ద్రవ్య డిమాండ్‌ను నిర్ణయించే అంశం?

1) ధరల స్థాయి              2) ఆదాయ స్థాయి 

3) ప్రస్తుత వడ్డీరేటు           4) పైవన్నీ 


34. ద్రవ్య ప్రసార వేగాన్ని నిర్ణయించే అంశం?

1) పరపతి సంస్థలు               2) నగదు వ్యవహారాలు 

3) వేతన విధానం                  4) పైవన్నీ


35. మనదేశంలో M3 ద్రవ్యసప్లయి కొలమానం దేన్ని తెలుపుతుంది?

1) M1 + పోస్టాఫీసులో మొత్తం డిపాజిట్లు

2) M1 + వాణిజ్య బ్యాంకుల్లో కాలపరిమితి డిపాజిట్లు

3) M1 + పొదుపు డిపాజిట్లు

4) ఏదీకాదు


36. సమీప ద్రవ్యం అంటే ఏ రకమైన ఆస్తులు?

1) వినిమయ మాధ్యంగా, విలువల నిధిగా ఉపయోగపడేవి. 

2) విలువల నిధిగా ఉపయోగపడుతూ, తాత్కాలిక వినిమయ మాధ్యమంగా ఉపయోగపడేవి.

3) విలువల నిధిగా ఉంటూ 100 శాతం ద్రవ్యత్వం కలిగింది.

4) విలువల నిధి అనే విధిని సంతృప్తి పరిచేవి, వినిమయ మాధ్యమంగా వెంటనే మార్పు చెందేవి.


37. ఫిషర్‌ ద్రవ్యరాశి సిద్ధాంతం సమీకరణ-

1) MV + M1V1 = PT                2) M1V1 + PT

3) MV = PT                      4) PT = MV


38. ద్రవ్య డిమాండ్‌ ఆధారంగా ద్రవ్యరాశి సిద్ధాంతం చెప్పిన ఆర్థికవేత్తలు

1) ఫిషర్‌                     2) చికాగో ఆర్థికవేత్తలు

3) కేంబ్రిడ్జి ఆర్థికవేత్తలు       4) ఫ్రీడ్‌మన్‌ 


39. ఫిషర్‌ ప్రకారం ద్రవ్య సప్లయికి, ధరల స్థాయికి మధ్య సంబంధం-

1) విలోమ                2) అనులోమ  

3) రెండూ                  4) ఏదీకాదు 


40. బేమల్‌ ప్రకారం ద్రవ్య డిమాండ్‌ దేనిపై ఆధారపడుతుంది?

1) ఆదాయం             2) వడ్డీరేటు     

 3) 1, 2                 4) వ్యాపారం


41. కిందివారిలో కోశ విధానాన్ని ఎవరు నియంత్రిస్తారు?

1) రిజర్వ్‌ బ్యాంకు                2) స్టేట్‌ బ్యాంకు   

3) కేంద్ర ప్రభుత్వం               4) ఆర్థిక సంఘం


42. కింది కోశ విధాన పాత్రలో లేని అంశం?

1) నల్లధనం                 2) ఉద్యోగిత  

3) స్థిరత్వం                  4) బ్యాంకింగ్‌


43. కోశ విధాన సాధనాలు ఏమిటి?

1) పన్నులు                   2) వ్యయం   

3) రుణం                    4) పైవన్నీ


44. ద్రవ్యోల్బణ కాలంలో ఏ బడ్జెట్‌ను అవలంబిస్తారు?

1) లోటు బడ్జెట్‌                2) మిగులు బడ్జెట్‌  

3) సంతులిత బడ్జెట్‌          4) పైవన్నీ


45. 2023-24 బడ్జెట్‌లో రెవెన్యూ లోటు ఎంత?

1) 2.3%         2) 2.9%           3) 5.9%        4) 6.4%

 


సమాధానాలు

13; 24; 33; 43; 52; 61; 72; 83; 94; 101; 114; 122; 132; 141; 154; 163; 174; 184; 191; 202; 211; 223; 234; 244; 252; 264; 271; 284; 293; 301; 312; 324; 334; 344; 352; 364; 371; 383; 391; 403; 413; 424; 434; 442; 452. 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

Posted Date : 12-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌