• facebook
  • whatsapp
  • telegram

విత్త వ్యవస్థ - భాగాలు

 

విత్త వ్యవస్థలో నాలుగు భాగాలు ఉంటాయి. అవి:


1. విత్త సంస్థలు

2. విత్త సాధనాలు (Financial Instruments) 

3. విత్త ఆస్తులు (Financial Securities) 

4. విత్త మార్కెట్లు


విత్త సంస్థలు 


వీటిలో రెండు రకాలు ఉన్నాయి. 


ఎ) బ్యాంకేతర విత్తసంస్థలు 


(Non-Banking Financial Institutions ( NBFIs):  ఇవి కింది విధంగా ఉంటాయి.


i. అభివృద్ధి విత్త సంస్థలు (Development Financial Corporations n- DFCs) 

ii. బ్యాంకేతర విత్త కంపెనీలు  (Development Financial Corporations n- DFCs) 

iii. గృహనిర్మాణ విత్త కంపెనీలు (Non-Banking Financial Companies - NBFCs) 
 

బి) బ్యాంకింగ్‌ సంస్థలు:


i. టర్మ్‌ విత్తసంస్థలు


ఉదా: ఐడీబీఐ, ఐసీఐసీఐ, ఐఎఫ్‌సీఐ మొదలైనవి. 


ii. స్పెసిఫైడ్‌ విత్త సంస్థలు


ఉదా: ఎగ్జిమ్‌ బ్యాంక్, టూరిజం ఫైనాన్స్‌ కార్పొరేషన్స్‌.


iii. రంగాలవారీ విత్తసంస్థలు


ఉదా: నాబార్డ్, నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌.


iv. పెట్టుబడి సంస్థలు 


ఉదా: యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌


 బీమా సంస్థలు. ఉదా: ఎల్‌ఐసీ, జీఐసీ


i. రాష్ట్ర స్థాయి సంస్థలు. 

ఉదా: రాష్ట్ర విత్త సంస్థలు


విత్త సాధనాలు 

ఒక వ్యక్తి లేదా సంస్థ విత్త సంస్థల నుంచి పొందిన రుణాన్ని వడ్డీ రూపంలో చెల్లించేందుకు విత్త సాధనాలు అవసరం. భవిష్యత్తులో ఒక నిర్ణీత తేదీన లేదా కొంత కాలవ్యవధిలో వడ్డీ/ డివిడెండ్‌ రూపంలో కొంత ద్రవ్యాన్ని చెల్లించే విధంగా రాసే క్లెయిమ్‌ను విత్త సాధనం అంటారు. వీటిని విత్త సెక్యూరిటీలు అని కూడా అంటారు. 

ఉదా: కాగితం సంపద, వాటాలు, డిబెంచర్లు, బాండ్లు.


 ఒక నిర్దిష్ట కాలం తర్వాత, నిర్దిష్ట ద్రవ్యంపై చెల్లించే వడ్డీ లేదా డివిడెండ్‌ క్లెయిమ్‌ పత్రాన్ని విత్త ఆస్తి అంటారు. 

ఉదా: బ్యాంకు డిపాజిట్లు, ప్రభుత్వ బాండ్లు, కంపెనీ వాటాలు, రుణ పత్రాలు మొదలైనవి.

 

విత్త ఆస్తులు 


నిధులను రుణంగా స్వీకరించడానికి, సెక్యూరిటీలను కొనడానికి, అమ్మడానికి, చెల్లింపులు చేయడానికి విత్త మార్కెట్‌లో నష్టభయాన్ని అదుపుచేయడానికి ఉపకరించేవే విత్త ఆస్తులు.

విత్త మార్కెట్లు 


ఇవి రెండు రకాలు: 

1 ద్రవ్య మార్కెట్‌  


2 మూలధన మార్కెట్‌

ద్రవ్య మార్కెట్‌


ద్రవ్య మార్కెట్‌ను స్థూలంగా రెండు రకాలుగా విభజించారు. అవి:


1. సంఘటిత ద్రవ్య మార్కెట్‌ (Organised money market) 


2. అసంఘటిత ద్రవ్య మార్కెట్‌  (Un-organised money market) 


సంఘటిత ద్రవ్య మార్కెట్‌


భారతీయ సంఘటిత ద్రవ్య మార్కెట్‌లో ఆర్‌బీఐ, ఎస్‌బీఐ దాని అనుబంధ బ్యాంకులు, జాతీయ బ్యాంకులు, అభివృద్ధి బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రైవేట్‌ రంగంలోని స్వదేశీ - విదేశీ బ్యాంకులు భాగంగా ఉంటాయి. 


దీన్ని వివిధ ఉపమార్కెట్ల కింద విభజించారు. అవి:


1. Call money market

2. బిల్లుల మార్కెట్‌  

3. వాణిజ్య పత్రాలు


4. డిపాజిట్‌ సర్టిఫికెట్లు


5. ద్రవ్యమార్కెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌

 

బిల్లుల మార్కెట్‌


  ఇందులో రెండు రకాలు ఉన్నాయి. అవి:


ఎ) ట్రెజరీ బిల్లుల మార్కెట్‌ 


బి) వాణిజ్య బిల్లుల మార్కెట్‌ 


ట్రెజరీ బిల్లుల మార్కెట్‌: భారత ప్రభుత్వం తాత్కాలిక ద్రవ్య నిధుల అవసరాల కోసం ట్రెజరీ బిల్లులపై ఆధారపడుతుంది. ప్రభుత్వం స్వల్పకాలిక రుణాలు పొందడానికి ఉపయోగించే సాధనాలే కోశ బిల్లులు లేదా ట్రెజరీ బిల్లులు. వీటిని కేంద్ర ప్రభుత్వ స్వల్పకాలిక రుణ సాధనాలుగా పేర్కొంటారు.

ట్రెజరీ బిల్లులు 3 రకాలు:


1) 91 రోజుల ట్రెజరీ బిల్లులు  


2)182 రోజుల ట్రెజరీ బిల్లులు 


3) 364 రోజుల ట్రెజరీ బిల్లులు 


 ఒకప్పుడు కేవలం చట్టబద్ధమైన ద్రవ్యత్వ నిష్పత్తి కాపాడేందుకు మాత్రమే వాణిజ్య బ్యాంకులు ట్రెజరీ బిల్లులను కొనేవి. ప్రస్తుతం స్వల్పకాలిక ద్రవ్య నిర్వహణకు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి.


ట్రెజరీ బిల్లులను పోలి ఉండే ఇతర మార్కెట్లు:


నగదు నిర్వహణ బిల్లులు(Cash management bills) : వీటి కాలవ్యవధి 91 రోజుల కంటే తక్కువ. ఇవి కేంద్ర ప్రభుత్వ తాత్కాలిక అవసరాల కోసం ఆర్‌బీఐ విక్రయించే సెక్యూరిటీలు. వీటిని చట్టబద్ధ ద్రవ్యత్వ నిబంధన కింద బ్యాంకులు తమ వద్ద ఉంచుకుంటాయి.


వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌: వీటిని తాత్కాలిక  ట్రెజరీ బిల్లుల స్థానంలో ప్రవేశపెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక అవసరాల కోసం ఆర్‌బీఐ ఇచ్చే రుణాలు/ ఓవర్‌డ్రాఫ్ట్‌ను వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌గా పేర్కొంటారు. కాలవ్యవధి 10-14 ఏళ్లు.


తేదీ ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీలు: చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తిని బ్యాంకులు కొంత కాలవ్యవధికి తగ్గించాలని ఎం. నరసింహం కమిటీ సిఫార్సు చేసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 5, 10 ఏళ్ల కాలపరిమితి ఉన్న సెక్యూరిటీలను ఈ కొత్త విధానంలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.


వాణిజ్య బిల్లుల మార్కెట్‌: వ్యాపార నిమిత్తం ఒక సంస్థ మరొక దాని పేరుపై విడుదల చేసే బిల్లును వాణిజ్య బిల్లు అంటారు. దీని కాలవ్యవధి సాధారణంగా 3 నెలలు. కొనుగోలుదారుడు చెల్లింపును వాయిదా వేసినప్పుడు ఈ విధమైన బిల్లు అమ్మకందారుడు లేదా వ్యాపారి పొందుతాడు. దీని కాలవ్యవధి ముగిసేలోగా వ్యాపారి దాన్ని మరొకరికి అమ్మి డబ్బు పొందుతాడు.


రకాలు:


i డిమాండ్‌ బిల్లులు: డిమాండ్‌ చేసినప్పుడు చెల్లించాల్సిన బిల్లులు.


ii కాలపరిమితి బిల్లులు: బిల్లులో రాసిన నిర్దిష్ట సమయం తర్వాత చెల్లించే బిల్లులు.


iii వ్యాపార బిల్లులు: వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పత్రాలను జతచేసిన బిల్లులు. 


i ద్రవ్య/ విత్త బిల్లులు: ఏ విధమైన వ్యాపార లావాదేవీలకు సంబంధం లేని పత్రాలను  జతచేసిన బిల్లులు. ఇవి కేవలం సర్దుబాటు(Accommodation) బిల్లులు. వీటిని క్లియర్‌ బిల్స్‌ అని కూడా అంటారు.


 దేశీయ బిల్లులు: దేశీయ వ్యాపారానికి ద్రవ్యం సమకూర్చే బిల్లులు.


i విదేశీ బిల్లులు: అంతర్జాతీయ వ్యాపారానికి డబ్బు సమకూర్చే బిల్లులు. వీటిలో ఎగుమతి, దిగుమతి బిల్లులు అని రెండు రకాలు ఉన్నాయి.


 భారతదేశం అనాదిగా ఆచరణలో ఉన్న వ్యాపార బిల్లులను ‘హుండీలు’ అంటారు. ఇవి ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారంలో వాడుకలో ఉన్నాయి. హుండీల్లో డిమాండ్‌ బిల్లులను దర్శని అని, వ్యాపార బిల్లులను ముద్దతి అని పిలుస్తారు. హుండీల్లో ఎక్కువ భాగం ద్రవ్య, విత్త బిల్లులే.


ద్రవ్య మార్కెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ 


 ద్రవ్య మార్కెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాన్ని 1992, ఏప్రిల్‌ 1న ప్రారంభించారు. వ్యక్తిగతంగా పెట్టుబడి పెట్టేవారికి అదనపు, స్వల్పకాలిక పెట్టుబడి అవకాశాన్ని ఇవ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 


 బ్యాంకులు, ప్రభుత్వ విత్త సంస్థలు, ప్రైవేట్‌ రంగంలోని సంస్థలు ప్రజల నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ను సేకరించవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


వాణిజ్య పత్రాలు  ( Commercial Papers)

వాఘల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సిఫార్సు మేరకు 1989, మార్చిలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వాణిజ్య పత్రాలను ప్రవేశ పెట్టింది. 1990, జనవరి 1 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. మంచి క్రెడిట్‌ రేటింగ్‌ ఉన్న కంపెనీలు వ్యాపార బిల్లులను ప్రామిసరీ నోట్ల రూపంలో వాణిజ్య పత్రాలుగా జారీ చేయొచ్చు. కంపెనీ మార్కెట్‌ విలువ ఆధారంగా వాటిపై డిస్కౌంట్‌ రేటు ఉంటుంది. వీటిని స్వేచ్ఛగా బదిలీ చేయొచ్చు. ఒక్కొక్క పత్రం 


రూ.25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. కనీసం రూ.కోటి విలువకు జారీ చేయాలి.


 డిపాజిట్‌ సర్టిఫికెట్లు


 వాఘల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సిఫార్సు మేరకు 1989, జూన్‌లో వీటిని ప్రవేశపెట్టారు.


 వ్యక్తులు లేదా సంస్థలు బ్యాంకుల్లో ఉంచే డిపాజిట్లకు సంబంధింత బ్యాంకులు సర్టిఫికేట్‌ ఆఫ్‌ డిపాజిట్లు జారీ చేశాయి. వీటిని డిస్కౌంట్‌ ప్రాతిపదికన జారీ చేస్తారు. 


 డిస్కౌంట్‌ లేదా వడ్డీ రేటు మార్కెట్‌ను అనుసరించి ఉంటుంది. వీటిని మార్కెట్‌లో విక్రయించవచ్చు.

 

 Call money market 


 వివిధ బ్యాంకుల మధ్య నిధుల బదిలీ ఈ మార్కెట్‌ లక్ష్యం. దీని ద్వారా మిగులు డబ్బు ఉన్న బ్యాంకుల నుంచి తాత్కాలికంగా నగదు కొరత ఏర్పడిన బ్యాంకులకు నిధులు సమకూరుస్తారు. 


 దీన్ని అంతర బ్యాంకుల తక్షణ ద్రవ్య మార్కెట్‌ (Inter bank call money market) లేదా తక్షణ/ అల్పవ్యవధి ద్రవ్యమార్కెట్‌ (Call/ Short notice money market) అంటారు.


 తక్షణ రుణం కాలపరిమితి ఒకరోజు. అల్పవ్యవధి రుణం కాలపరిమితి 14 రోజులు. తక్షణ ద్రవ్య మార్కెట్‌లో తాత్కాలికంగా మిగులు ద్రవ్యం ఉన్న బ్యాంకులు రుణదాతలుగా వ్యవహరిస్తాయి. అన్ని రకాల బ్యాంకులు ఈ మార్కెట్‌లో పాల్గొంటాయి. 


 

 

 


 

 


 

 

 


 

Posted Date : 16-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌