• facebook
  • whatsapp
  • telegram

విత్త వ్యవస్థ - మూలధన మార్కెట్‌

స్టాక్‌ ఎక్స్స్ఛేంజ్‌/ స్టాక్‌ మార్కెట్‌   (Stock Exchange/ Stock Market)

ప్రధాన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు


 ఇంగ్లండ్‌లోని లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. ఇది ప్రపంచంలో మొదటి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. దీన్ని 18వ శతాబ్దంలో నెలకొల్పారు.


 అమెరికాలోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌  ( National Association of Securities Dealers Automated Quotations Stock Market  (NASDAQ). దీన్ని 1971, ఫిబ్రవరి 8న నెలకొల్పారు. 


 జపాన్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూప్‌ - టోక్యో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూప్, ఒకాసా సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ను కలిపి జపాన్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూప్‌గా ఏర్పాటు చేశారు. ఇది 2023, జనవరి 1 నుంచి తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది.


భారతదేశంలో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల చరిత్ర


1939 నాటికి దేశంలో ఏడు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు ఉండగా, 1945 నాటికి వీటి సంఖ్య 21కి పెరిగింది. 1956 సెక్యూరిటీల కాంట్రాక్ట్‌ (రెగ్యులేషన్‌) చట్టం ప్రకారం, ప్రస్తుతం స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) దేశంలో ఎనిమిది స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు గుర్తింపు ఇచ్చింది. వీటిలో శాశ్వతమైనవి అయిదు. అవి:


1) బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (1875)


2) అహ్మదాబాద్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (1894)


3) కోల్‌కతా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (1908)


4) మగధ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (1986)


5) నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (1992)


బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ)


( ఇది భారత్‌లోనే కాకుండా ఆసియాలో ఏర్పాటైన మొదటి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌.


( దీన్ని 1875, జులై 9న అప్పటి బొంబయిలో ‘ది నేషనల్‌ షేర్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ అసోసియేషన్‌’ పేరుతో ఏర్పాటు చేశారు. స్థాపకుడు ప్రేమ్‌చంద్‌ రాయ్‌చంద్‌. 


( తర్వాతి కాలంలో ఇదే బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌గా మారింది. ఇది దేశంలో శాశ్వత ప్రాతిపదికన గుర్తించిన తొలి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. 


( ఇది ప్రపంచ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉంది.


( తర్వాత అహ్మదాబాద్, చెన్నై, దిల్లీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరు, లూథియానా, కాన్పూర్‌ నగరాల్లో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లను స్థాపించారు.


నేషనల్‌ స్టాక్‌ ఎక్స్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌ఈ)   దీన్ని 1992 నవంబరులో నెలకొల్పారు.


 1991లో మనోహర్‌ జె.ఫెర్మానీ కమిటీ సూచన మేరకు దీన్ని ఏర్పాటు చేశారు.


 ఎన్‌ఎస్‌ఈ 1994, జూన్‌ 30 నుంచి విధులు ప్రారంభించింది.  దీని ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది.


 ఈకిట్వీ మార్కెట్‌ విభాగం 1994, నవంబరు 3 నుంచి లావాదేవీలు ప్రారంభించింది.  స్టాక్‌ మార్కెట్‌ సూచికలు


ప్రపంచంలో ప్రఖ్యాత స్టాక్‌ మార్కెట్‌ సూచికలు: డోజోన్స్‌ (న్యూయార్క్‌); నిక్కీ (టోక్యో); హంగ్‌సెంగ్‌ (హాంగ్‌కాంగ్‌); డోలెక్స్, సెన్సెక్స్, నిఫ్టీ ఫిఫ్టీ (ముంబయి)


మన దేశంలో ప్రధాన స్టాక్‌ మార్కెట్‌లు   అనుసరించే సూచికలు: 


సెన్సెక్స్‌: దీన్నే సెన్సిటివ్‌ ఇండెక్స్‌ అంటారు. ఇది బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి చెందింది. ఇందులో ప్రాతినిధ్య సంస్థల సంఖ్య 30. ఆధార సంవత్సరం 1978-79.


నేషనల్‌ ఇండెక్స్‌: బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి చెందిన మరొక సూచిక. దీని ప్రాతినిధ్య సంస్థల సంఖ్య 100. ఆధార సంవత్సరం 1983-84.


బీఎస్‌ఈ 200: ఈ సూచికలోని ప్రాతినిధ్య సంస్థల సంఖ్య 200. ఆధార సంవత్సరం 1989-90. ఇందులో 21 ప్రభుత్వరంగ సంస్థల వాటాలు నమోదై ఉన్నాయి.


డాలెక్స్‌: బీఎస్‌ఈ 200 డాలర్‌ విలువను డాలెక్స్‌ అంటారు. దీని ఆధార సంవత్సరం 1989-90.


బాంకెక్స్‌: ఇది 2003, జూన్‌ నుంచి అమల్లో ఉంది. ఇందులో 10 బ్యాంకుల వాటాలు ఉన్నాయి. అవి:


1) ఐసీఐసీఐ బ్యాంక్‌


2) ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌


3) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌


4) కెనరా బ్యాంక్‌


5) ఫెడరల్‌ బ్యాంక్‌ 


6) కొçక్‌ మహీంద్రా బ్యాంక్‌


7) యాక్సిస్‌ బ్యాంక్‌


8) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)


9) బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా


10) ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌  


నిఫ్టీ ఫిఫ్టీ: ఈ సూచికను ఎన్‌ఎస్‌ఈ ఉపయోగిస్తోంది. దీనిలో 50 ప్రాతినిధ్య సంస్థల వాటాలు ఉన్నాయి.


కమోడిటీ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ 


 మార్కెట్‌లో వస్తువుల ధరలు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండవు. వాటిలో హెచ్చుతగ్గులుంటాయి. అమ్మకందార్లు/ కొనుగోలుదార్లు భవిష్యత్తులో పెరిగే ధరలను ముందుగానే అంచనా వేస్తారు. దీనికి అనుగుణంగా వారు సంబంధిత వస్తువుకు రాబోయే కాలానికి ఒక నిర్ణీత పరిమాణం, తేదీ, ధర వద్ద కొనడం లేదా అమ్మడంపై ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇలాంటి ఒప్పందాలను కమోడిటీ ఫ్యూచర్స్‌ మార్కెట్స్‌ అంటారు.


 వ్యవసాయ ఉత్పత్తులు, బంగారం, ముడిచమురు, లోహ వస్తువులు, విమాన ఇంధనం, ధనియాలు, వెల్లుల్లి, ఉక్కు మొదలైన వస్తువులపై భవిష్యత్తు గురించిన వ్యాపారం జరుగుతుంది. ఈ మార్కెట్‌కు చెందిన ఎక్స్ఛేంజ్‌లను కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లు అంటారు. 

 భారత్‌లో పనిచేస్తున్న కమోడిటీ ఎక్సేంజ్‌లు:


1) నేషనల్‌ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎంసీఈ),  అహ్మదాబాద్‌


2) ఎంసీఎక్స్, ముంబయి


3) నేషనల్‌ కమోడిటీ అండ్‌ డెరివేటివ్స్‌ ఎక్స్ఛేంజ్‌ లిమిటెడ్‌ (ఎన్‌సీడీఈఎక్స్‌)


4) ఏసీఈ కమోడిటీ ఎక్స్ఛేంజ్, ముంబయి


క్రిసిల్‌    ( Credit Rating Information Services of India Limited - CRISIL )


ఇది భారతదేశ మొదటి రేటింగ్‌ ఏజెన్సీ. 1987లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది.


 ఇది మూడు అంశాలను మూల్యాంకనం చేసి వ్యాపార   సంస్థలకు రేటింగ్‌ ఇస్తుంది.


అవి:

1) సంస్థల వ్యాపార నష్టభయం.


2) నిర్వహణ నష్టభయం


3) ఆర్థిక (విత్త) నష్టభయం


 క్రిసిల్‌కి సంబంధించి అనేక సూచికలు ఉన్నాయి. ఇది నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌తో కలిసి క్రిసిల్‌ 500 సూచికను అభివృద్ధి చేసింది. 2015లో దీని పేరును S&P CNX 500 గా మార్చారు.


రచయిత

బండారి ధనుంజయ  విషయ నిపుణులు 

Posted Date : 21-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌