• facebook
  • whatsapp
  • telegram

నిరుద్యోగం

మాదిరి ప్రశ్నలు

1. ‘నిరుద్యోగం సమస్యలకే సమస్య’ అన్నది?

1) వి.వి.గిరి       2) కలాం       3) పి.వి. నరసింహారావు      4) ఎవరూ కాదు


2. సార్థక డిమాండ్‌ కొరత వల్ల ఏర్పడే నిరుద్యోగిత ఏది?

1) స్వచ్ఛంద        2) పూరక        3) ప్రచ్ఛన్న       4) నిస్వచ్ఛంద


3. తాత్కాలిక నిరుద్యోగితను తెలిపేది?

1) సంఘృష్ట నిరుద్యోగిత      2) స్వచ్ఛంద నిరుద్యోగిత    
3) చక్రీయ నిరుద్యోగిత        4) వ్యాపార నిరుద్యోగిత


4. వ్యాపార చక్రాల వల్ల ఏర్పడే నిరుద్యోగిత ఏది?

1) చక్రీయ       2) సంఘృష్ట     3) స్వచ్ఛంద       4) ఏదీకాదు


5. నిస్వచ్ఛంద నిరుద్యోగితకు కారణం?

1) అధిక డిమాండ్‌       2) అల్ప డిమాండ్‌     
3) అధిక సప్లయ్‌         4) అల్ప సప్లయ్‌


6. శ్రామిక శక్తి వయసు ఏది?

1) 15 సంవత్సరాల లోపు         2( 60 సంవత్సరాల పైన 
3) 10  50 సంవత్సరాలు          4) 15  60 సంవత్సరాలు


7. ఉపాంత శ్రామికుల ఉపాంత ఉత్పత్తి?

1) అనంతం       2) గరిష్ఠం       3) అల్పం         4) శూన్యం


8. ఇంజినీరింగ్‌ పూర్తయిన అభ్యర్థి టీచర్‌గా పనిచేయడాన్ని తెలిపే ఉద్యోగిత? 

1) అధిక ఉద్యోగిత      2) అల్ప ఉద్యోగిత     3) చక్రీయ ఉద్యోగిత       4) ఏదీకాదు


9. భారత్‌లో నిరుద్యోగితను మొదటగా అంచనా వేసింది?

1) భగవతి        2) అమర్త్యసేన్‌       3) వి.కె. రావు       4) ఎవరూ కాదు


10. భారత గ్రామీణ నిరుద్యోగిత (2015 - 16) UPS ప్రకారం ఎంత?

1) 5.1          2) 9.1        3) 10.1        4) 8.8


11. నిరుద్యోగిత నిర్మూలన చర్యకానిది ఏది?

1) వ్యవసాయ వృద్ధి         2) ప్రాంతీయ అసమానతల వృద్ధి
3) పారిశ్రామిక వృద్ధి          4) అభివృద్ధి కేంద్రీకరణ

 

12. పని చేయాలనే కోరిక, సామర్థ్యం ఉన్నవారికి మార్కెట్‌ రేటు ప్రకారం వేతనం లభించని స్థితిని ఏమంటారు?

1) పేదరికం        2) నిరుద్యోగం

3) 1, 2               4) ఆర్థిక అసమానతలు

 

13. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న సమయంలో పనిమార్పు వల్ల ఏర్పడే తాత్కాలిక నిరుద్యోగిత.....

1) సంఘృష్ట నిరుద్యోగిత                       2) చక్రీయ నిరుద్యోగిత

3) వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత                4) అల్పఉద్యోగిత

 

14. ఆర్థిక తిరోగమనం, మాంద్యం వల్ల ఏర్పడే  నిరుద్యోగిత....

1) విద్యావంతుల్లో నిరుద్యోగిత 

2) చక్రీయ నిరుద్యోగిత

3) సాంకేతికపరమైన నిరుద్యోగిత          4) పైవన్నీ

 

15. పెరుగుతున్న శ్రామిక జనాభా రేటు కంటే ఉద్యోగావకాశాల పెరుగుదల రేటు తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే నిరుద్యోగిత.....

1) చక్రీయ నిరుద్యోగిత                  2) బహిరంగ నిరుద్యోగిత 

3) సాధారణ నిరుద్యోగిత  

4) వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత


సమాధానాలు: 1-1; 2-4; 3-1; 4-1; 5-2; 6-4; 7-4; 8-2; 9-1; 10-1; 11-2; 12-2; 13-1; 14-2; 15-4.

 

మ‌రిన్ని ప్ర‌శ్న‌లు

 

* అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్న ప్రధాన సాంఘిక, ఆర్థిక సమస్యలు ఏవి?

జ: నిరుద్యోగం, పేదరికం


* ‘నిరుద్యోగం సమస్యలకే సమస్య’ అన్నది ఎవరు?

జ: వి.వి.గిరి


* నిరుద్యోగిత అంటే?

జ: పనిచేసే శక్తి, సమర్థత, కోరికతో ఉండి మార్కెట్‌ వేతనాల వద్ద పని దొరకని స్థితి.


* అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న నిరుద్యోగిత రకాలు ఏవి?

జ: నిస్వచ్ఛంద, సంఘృష్ట, చక్రీయ నిరుద్యోగితలు.


* సార్థక డిమాండ్‌ కొరత వల్ల ఏర్పడే నిరుద్యోగిత ఏది?

జ: నిస్వచ్ఛంద నిరుద్యోగిత


* సార్థక డిమాండ్‌ పెంపు ద్వారా ఏ రకమైన నిరుద్యోగితను తగ్గించవచ్చు?

జ: నిస్వచ్ఛంద నిరుద్యోగిత

* శ్రామికులు ఒక రంగం నుంచి మరో రంగానికి మారే కాలంలో ఏర్పడే నిరుద్యోగిత ఏది?

జ: సంఘృష్ట నిరుద్యోగిత


* తాత్కాలికంగా ఉపాధి కోల్పోవడం వల్ల ఏర్పడే నిరుద్యోగిత ఏది?

జ: సంఘృష్ట నిరుద్యోగిత


* సంఘృష్ట నిరుద్యోగితకు ఉన్న ఇతర పేర్లు ఏవి?

జ: ఒరిపిడి/ ఒత్తిడి నిరుద్యోగిత లేదా ఘర్షణ నిరుద్యోగిత.
 

* పరిశ్రమల మార్పు వల్ల ఏర్పడే నిరుద్యోగిత ఏది?

జ: సంఘృష్ట నిరుద్యోగిత


* ప్రాంతాలు మారడం వల్ల తాత్కాలికంగా ఏ నిరుద్యోగిత ఏర్పడుతుంది?

జ: సంఘృష్ట నిరుద్యోగిత

* వ్యాపార చక్రాల వల్ల ఏర్పడే నిరుద్యోగిత?

జ: చక్రీయ నిరుద్యోగిత


* ఆర్థిక మాంద్యం వల్ల ఏర్పడే నిరుద్యోగిత ఏది?

జ: చక్రీయ నిరుద్యోగిత


* 2008లో అమెరికా ఆర్థిక మాంద్యం వల్ల ఎలాంటి నిరుద్యోగిత ఏర్పడింది?

జ: చక్రీయ నిరుద్యోగిత
 

* ప్రామాణిక సంవత్సరిక ఉద్యోగి అని ఎవరిని అంటారు?

జ: రోజుకు 8 గంటలు లేదా సంవత్సరంలో 273 రోజులు పనిచేసే వ్యక్తిని ప్రామాణిక సంవత్సరిక ఉద్యోగి అంటారు.


* అల్ప డిమాండ్‌ ఏర్పరిచే నిరుద్యోగిత ఏది?

జ: నిస్వచ్ఛంద నిరుద్యోగిత


* శ్రామిక పెరుగుదల కంటే ఉపాధిరేటు తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే నిరుద్యోగిత?

జ: వ్యవస్థాపరమైన నిరుద్యోగిత


* వ్యవస్థాపరమైన నిరుద్యోగానికి ప్రధాన కారణం ఏది?

జ: అల్ప ఆర్థికాభివృద్ధి రేటు


* వ్యవస్థాపరమైన నిరుద్యోగితకు మరో పేరు ఏది?

జ: బహిరంగ నిరుద్యోగిత


* బహిరంగ నిరుద్యోగితను మార్క్సియన్‌ నిరుద్యోగితగా పేర్కొంది ఎవరు?

జ: జాన్‌ రాబిన్సన్‌


* అవసరం కంటే ఎక్కువ శ్రామికులున్న స్థితిని ఏమంటారు?

జ: ప్రచ్ఛన్న నిరుద్యోగిత


ఉపాంత శ్రామికుల ఉపాంత ఉత్పత్తి ఎంత? 

జ: శూన్యం


* ఉపాంత శ్రామికులు అంటే?

జ: అదనంగా నియమించిన శ్రామికులు


* వ్యక్తి తన సామర్థ్యం కంటే తక్కువ స్థాయి పనిచేయడాన్ని ఏమంటారు?

జ: అల్ప ఉద్యోగిత


* ఇంజినీరింగ్‌ చదివిన వ్యక్తి టీచర్‌గా పనిచేస్తే దాన్ని ఏమంటారు?

జ: అల్ప ఉద్యోగిత


* కొన్ని రుతువుల్లో ఉపాధిలేని స్థితి ఏమిటి?

జ: రుతు సంబంధ నిరుద్యోగిత


* అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయం, చక్కెర పరిశ్రమల్లో కొద్ది కాలాల్లో ఉపాధి దొరకని స్థితి ఏది?

జ: రుతు సంబంధ నిరుద్యోగిత


* అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అసంఘటిత రంగంలోని ఉద్యోగితను ఏమని పిలుస్తారు?

జ: అనుద్యోగిత


* ఉత్పాదక సామర్థ్య లోపం వల్ల ఏ రకమైన నిరుద్యోగిత ఏర్పడుతుంది? 

జ: పరిమాణాత్మక నిరుద్యోగిత


* భారతదేశంలో నిరుద్యోగితను మొదటగా అంచనా వేసిన ఆర్థికవేత్త ఎవరు?

జ: భగవతి (1973)

Posted Date : 25-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌