• facebook
  • whatsapp
  • telegram

జీవవైవిధ్యం

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో భారత జాతీయ జలచరం (అక్వాటిక్ ఆనిమల్) ఏది?
ఎ) డాల్ఫిన్ బి) తాబేలు సి) తిమింగలం డి) ఏదీకాదు
జ: (ఎ)

 

2. సమాజంలో అన్ని స్థాయి జీవుల మధ్య విభిన్నతను ఏమంటారు?
ఎ) పర్యావరణం బి) జీవ వైవిధ్యం సి) సమాజం డి) వైవిధ్యం
జ: (బి)

 

3. జీవ వైవిధ్య క్రమానుగత స్థాయులు ఎన్ని రకాలు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
జ: (బి)

Posted Date : 28-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం - జీవ వైవిధ్యం

* జీవులు, వాటి ఆవాసాల మధ్య ఉండే సంబంధాల అధ్యయనాన్ని ఆవరణ శాస్త్రం (Ecology) అంటారు.  ఈ పదం Oekos (ఆవాసం), Logos (అధ్యయనం) అనే రెండు గ్రీకు పదాల నుంచి ఆవిర్భవించింది.
* ఆవరణ శాస్త్రం అనే పదాన్ని మొదటిసారిగా ఎర్నెస్ట్ హెకెల్ ఉపయోగించారు.
* భూమిపై ఉన్న జీవులు, అవి విస్తరించిన ప్రాంతాలన్నింటితో కలిపి జీవావరణం ఏర్పడింది.
* IUCN (International Union For Conservation of Nature & Natural Resources) ప్రకారం ప్రతిజాతి జీవులు, విభిన్న జాతి జీవులు, అవి నివసిస్తున్న ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్న వైవిధ్యాన్ని జీవ వైవిధ్యం (Bio Diversity) అంటారు.
* ప్రపంచంలో బ్రెజిల్, చైనా, కొలంబియా, ఆస్ట్రేలియా, కాంగో, ఈక్వెడార్, ఇండోనేషియా, మడగాస్కర్, మలేషియా, మెక్సికో, పపువా న్యూగినియా, పెరూ, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెనెజులా, భారతదేశం మెగా డైవర్స్ కంట్రీస్ (అత్యధిక జీవ వైవిధ్యత ఉన్న దేశాలు)గా ప్రసిద్ధిగాంచాయి.
* ప్రపంచ భూభాగంలో 2.4% భూభాగాన్ని ఆక్రమిస్తున్న భారతదేశం ఇప్పటివరకు గుర్తించిన వాటిలో సుమారు 7.8% జీవ జాతులను కలిగి జీవ వైవిధ్యంతో అలరారుతోంది.  దీనిలో 45000 రకాలకు పైగా వృక్ష జాతులు (వీటిలో 15000కు పైగా పూల మొక్కలు), సుమారు 2500 రకాలకుపైగా చేప జాతులు, 1200కు పైగా పక్షి జాతులు భారతదేశంలో ఉన్నాయి.
* భారతదేశంలో ప్రధానంగా పశ్చిమ కనుమలు, నల్లమల కొండలు, శేషాచల కొండలు, హిమాలయాలు, భారతదేశ ఈశాన్య ప్రాంతం విభిన్న జీవ జాతులకు నిలయంగా ఉన్నాయి.
* ఇప్పటికీ ఏటా పశ్చిమ కనుమలు, ఈశాన్య ప్రాంతంలో అనేక కొత్త జీవ జాతులను కనుక్కుంటున్నారు.
* ఈ ఆవరణ వ్యవస్థలు ఇదివరకెప్పుడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో ప్రమాదాలను ఎదుర్కొంటున్నట్లు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ గుర్తించింది.
* సహజ వనరుల అధిక దుర్వినియోగం ద్వారా ప్రధానంగా కలప కోసం అడవుల నరికివేత, వ్యవసాయ భూముల విస్తరణ, మైనింగ్, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, రోడ్డు, రైలు మార్గాలు, డ్యామ్‌లు, విద్యుత్ అవసరాలను తీర్చడానికి విద్యుత్ కేంద్రాల నిర్మాణం లాంటి మానవ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఆవరణ వ్యవస్థలు ఎన్నో ఒడుదుడుకులకు లోనవుతున్నాయి. 
* భారతదేశంలో మొత్తం 18 బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి. 


 

భారతదేశంలో జీవవైవిధ్యత పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు
* వన్యజీవుల పర్యవేక్షణ, పరిరక్షణ కోసం 1952లో Indian Board for Wildlife ను ఏర్పాటు చేశారు.  1972లో వన్య మృగ సంరక్షణా చట్టం చేశారు.
* 1982లో డెహ్రాడూన్ కేంద్రంగా Wildlife Institute of India ను ప్రారంభించారు.
*  1983లో ప్రభుత్వం National Wildlife Action Plan ను ప్రారంభించింది. 
* 2002లో జీవ వైవిధ్య పరిరక్షణ కోసం జీవ వైవిధ్య చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దీన్ని అమలుచేయడానికి చెన్నై కేంద్రంగా National Bio Diversity Authority ని ఏర్పాటు చేశారు.

Posted Date : 14-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆవరణ వ్యవస్థ - పర్యావరణ క్షీణత

భూఉపరితలంపై క్రీ.పూ.10 వేల సంవత్సరాల కిందట వ్యవసాయం ప్రారంభమైనప్పుడు కేవలం 40 లక్షల జనాభా ఉండేది. క్రమానుగతంలో 1750 నాటికి 50 కోట్లు, 1900 నాటికి 100 కోట్లు, 1950 నాటికి 250 కోట్లు ఉంటే ప్రస్తుతం 700 కోట్లకు పెరిగింది. ఇది 2100 సంవత్సరం నాటికి 1000 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా. ఈ విధంగా జనాభా విస్ఫోటనం వల్ల మానవ అవసరాలు పెరగడంతో అనేక పరిశ్రమలను స్థాపించారు. వీటి నుంచి వెలువడే ఉద్గారాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు పర్యావరణ కాలుష్యం పెరుగుతోంది.
        భూగోళంపై శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం అనే నాలుగు ఆవరణాలు ఉన్నాయి. ఈ ఆవరణాల మధ్య భూఉపరితలంపై అత్యధికంగా జలావరణంలో జీవావరణం ఆవరించి ఉంది. ఇది జంతు, వృక్ష, ప్రాణులను కలిగి ఉంటుంది.
* జీవుల ఆధారంగా జీవావరణాన్ని 3 వర్గాలుగా విభజించవచ్చు. అవి:
1) ఉత్పత్తిదారులు (Producers)
2) వినియోగదారులు (Consumers)
3) విచ్ఛిన్నకారులు (Decomposers)

ఉత్పత్తిదారులు: కిరణజన్య సంయోగక్రియ (సూర్యరశ్మి, నీరు) ద్వారా తమంతట తామే ఆహారాన్ని తయారు చేసుకొని స్వయం పోషకంగా జీవించే వాటిని ఉత్పత్తిదారులు అంటారు.
ఉదా: మొక్కలు, గడ్డి, లెగ్యుమినేసి జాతులు
వినియోగదారులు: ఉత్పత్తిదారులు తయారుచేసిన వాటిపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడి జీవించే వాటిని వినియోగదారులు అంటారు. ఇవి నాలుగు రకాలు.
1) శాఖాహారులు (Herbivores): ఇవి ఉత్పత్తిదారులపై ఆధారపడి ఉంటాయి.
ఉదా: మిడత, చిమ్మెట, ఉడుత, కుందేలు, జిరాఫీ, పశువులు.
2) మాంసాహారులు (Carnivores): ఇవి శాఖాహారులపై ఆధారపడి జీవిస్తాయి.
ఉదా: తేలు, పాము, చిరుత, పులి, సింహం.
3) సర్వభక్షకులు (Omnivores): ఇవి శాఖాహార, మాంసాహారులపై ఆధారపడి జీవిస్తాయి.
ఉదా: ఎలుక, పిల్లి, కుక్క, డేగ, మానవుడు (అతి ప్రధాన సర్వభక్షకుడు).
4) పూతికాహారులు (Detritivores): ఇవి మలిన జీవులపై ఆధారపడి జీవిస్తాయి.
ఉదా: చెదపురుగులు, చీమలు.
విచ్ఛిన్నకారులు: ఇవి విగత జీవులు (మరణించిన), వ్యర్థాలపై ఆధారపడి జీవిస్తాయి.
ఉదా: బ్యాక్టీరియా, శిలీంద్రాలు.

ఆవరణ వ్యవస్థ
        ఆవరణ శాస్త్రాన్ని ఆంగ్లంలో ఇకాలజీ (Ecology) అంటారు. ఇది గ్రీకు భాషలోని ఓయికస్ (ఇల్లు), లోగోస్ (అధ్యయనం) అనే రెండు పదాల నుంచి వచ్చింది. అంటే మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను అధ్యయనం చేయడం అని అర్థం. ఇకాలజీ అనే పదాన్ని మొదట 1866లో జర్మనీకి చెందిన హెర్నెస్ట్ హెకెల్ అనే జీవ శాస్త్రవేత్త ఉపయోగించాడు. ఆ తర్వాత బ్రిటన్‌కు చెందిన ట్రాన్స్‌లే ఆవరణ వ్యవస్థను వెలుగులోకి తెచ్చాడు. భౌతిక పరిసరాల్లోని జీవుల మధ్య సంబంధాన్ని తెలియజేసేదే ఆవరణ వ్యవస్థ అని పేర్కొన్నాడు.
పర్యావరణం
        పరిసరాల నుంచి పర్యావరణం అనే పదం వచ్చింది. పర్యావరణం 'ఎన్విరాన్' (Environ) అనే ఫ్రెంచ్ భాషా పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం మనచుట్టూ ఉన్న ప్రాంతం. మానవుడి జీవనం, మొక్కలు, జంతు, వృక్ష; జీవ, నిర్జీవ అంశాలను అధ్యయనం చేసేదే పర్యావరణం.
* పర్యావరణంలో రెండు అణుఘటకాలు ఉంటాయి.
     1) నిర్జీవ అణుఘటకాలు (Abiotic Compounds)
     2) జీవ అణుఘటకాలు (Biotic Compounds)

 

నిర్జీవ అణుఘటకాలు: ఇవి ప్రకృతి నుంచి ఉద్భవించిన సహజ వనరులు.
ఉదా: గాలి, నీరు, నేల, ఆకాశం, అగ్ని.

జీవ అణుఘటకాలు: ఇవి సహజ వనరులపై ఆధారపడతాయి.
ఉదా: వీటిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, శిఖరాగ్ర వినియోగదారులు ఉంటాయి.

 

జీవావరణ పిరమిడ్
చార్లెస్ హెల్టన్ ఆహార గొలుసు ఆధారంగా జీవావరణ పిరమిడ్‌ను తయారుచేశాడు. దీనిలో కింది నుంచి పైస్థాయికి ఉత్పత్తి ప్రవాహం తగ్గుతుంది. అలాగే పై నుంచి కింది స్థాయికి సంపద సంఖ్య తగ్గుతుంది.


                                             

పర్యావరణ కాలుష్యాలు
మానవుడి దైనందిన జీవన కార్యకలాపాల ద్వారా ఘన, ద్రవ, వాయు వ్యర్థాలు జీవావరణ సమతౌల్యం దెబ్బతినే స్థాయిలో విడుదలవడాన్ని పర్యావరణ క్షీణత లేదా కాలుష్యం అంటారు. రసాయనాలు, ఖనిజాలు, పేపర్, చక్కెర లాంటి భారీ మౌలిక పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యాలు అనేక సమస్యలకు కారణమవుతున్నాయి.

 

వాయు కాలుష్యం
భూగోళాన్ని ఆవరించి ఉన్న గాలిపొరను వాతావరణం అంటారు. ఇది భూగోళం చుట్టూ 6 కి.మీ. ఎత్తులో అత్యధికంగా వ్యాపించి భూభ్రమణ, గురుత్వాకర్షణ వల్ల సంకోచం, వ్యాకోచం చెందుతుంది. సహజ వాతావరణంలో అనేక వాయువులు ఉన్నప్పటికీ ప్రధానంగా 17 వాయువుల మిశ్రమం ఉంటుంది. వీటిలో.......
       నత్రజని - 78.084%
       ఆక్సిజన్ - 20.947%
       కార్బన్ డై ఆక్సైడ్ - 0.0314%
       మీథేన్ - 0.002%
       హైడ్రోజన్ - 0.00005%

        ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్, గ్జినాన్ అనే వాయువులు నామమాత్రంగా ఉంటాయి. నత్రజని జడవాయువు కొన్ని బ్యాక్టీరియాలకు తప్ప జీవకోటి అవసరాలకు పనికి రాదు. ఆమ్లజని (ఆక్సిజన్) జీవకోటికి అత్యంత అవసరమైన వాయువు. బొగ్గుపులుసు వాయువు (CO2) కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వృక్ష జాతుల్లో పిండి పదార్థాల తయారీకి ఉపయోగపడుతుంది. పరిశ్రమలు, ఖనిజాలు, బొగ్గు, చమురు లాంటివి వాడటం వల్ల కార్బన్లు, నైట్రోజన్, సల్ఫర్, ఫ్లోరైడ్, కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువులు గాలిలో అధిక పరిమాణంలో కేంద్రీకృతమై పర్యావరణానికి హాని కలిగించడాన్నే వాయు కాలుష్యం అంటారు.
ప్రధానంగా గ్రీన్‌హౌస్ వాయువుల్లో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం; మాంసం, జీవవ్యర్థాల నుంచి వెలువడే మీథేన్ పెరగడం; భూఉపరితల ఉష్ణోగ్రత అధికమై మంచుకొండలు, కొండచరియలు, సముద్ర మట్టం పెరగడం, వరదలు, తుపాన్లు లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రాణ నష్టం సంభవిస్తుంది. దీన్నే భూతాపం (గ్లోబల్ వార్మింగ్) అంటారు. అలాగే వాతావరణంలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మిశ్రమాల వల్ల ఆమ్ల వర్షాలు కురుస్తున్నాయి. సల్ఫర్ డై ఆక్సైడ్ పెరిగి వివిధ పత్రాలు, లైబ్రరీ పుస్తకాలు పసుపు రంగులోకి మారుతున్నాయి.
        భూఉపరితలానికి 30 - 35 కి.మీ. ఎత్తులో ఉన్న స్ట్రాటో పొర అతినీలలోహిత కిరణాల నుంచి జీవరాశిని రక్షిస్తుంది. దీన్నే ఓజోన్ పొర (O3) అంటారు. రిఫ్రిజిరేటర్లు, ఏసీ, మిక్సీలు, క్లీనింగ్ సాల్వెంట్లు, క్లోరోఫ్లోరో కార్బన్‌ల (CFCs) వల్ల ఓజోన్ పొర పలచబడి దానికి రంధ్రాలు ఏర్పడుతున్నాయి. ఈ కారణంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు తీవ్రనష్టం జరుగుతుంది. వాయు కాలుష్యం వల్ల చర్మ, శ్వాసకోశ, మెదడు, గుండె, కంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయి.

నేల కాలుష్యం
        వివిధ వ్యర్థ పదార్థాల మిశ్రమం వల్ల భూమి యొక్క జీవ - భౌతిక - రసాయన ధర్మాల్లో మార్పులు ఏర్పడి, భూమి ఉత్పత్తి సామర్థ్యం తగ్గి నేల కాలుష్యం ఏర్పడుతుంది. భూ నాణ్యత కోల్పోవడాన్ని భూమి క్షీణత/కాలుష్యం అంటారు.
        భూమికోత, ఎడారీకరణ, లవణీకరణ, ఆమ్లీకరణ, అధిక పరిమాణంలో రసాయనాలు భూమిలోకి చొచ్చుకుపోయి భూసారం కోల్పోవడం వల్ల భూమి నాణ్యత క్షీణిస్తుంది. భూఉపరితలంపై ఉన్న సారవంతమైన పొర కొట్టుకుపోవడాన్ని భూమికోత అంటారు. విచక్షణా రహితంగా అడవులను నరికి పంటపొలాలుగా మార్చడం వల్ల ఇది ఏర్పడుతుంది.

 

ఎడారీకరణ
ఎడారి భూములు నిస్సారంగా, ఇసుకతో ఉండి కఠినమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. పశువులు మేయడం, వృక్షాలను వంటచెరుకుగా ఉపయోగించడం, అడవులను నరకడం, క్షారీకరణ, లవణీకరణ వల్ల భూములు ఎడారులుగా మారుతున్నాయి.

 

లవణీకరణ
భూమిలో లవణాలు కేంద్రీకృతమవడం సహజంగా లేదా మానవ చర్యల వల్ల జరుగుతుంది. సముద్ర తరంగాలు, వాయుగుండాలు, వరదల వల్ల నేల లవణీకరణం చెందుతుంది. దీనితో పాటు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం; కృత్రిమ నీటి సదుపాయాలైన కాలువలు, గొట్టపుబావుల ద్వారా సేద్యం చేయడం వల్ల లవణీకరణ ఏర్పడుతుంది.

 

ఆమ్లీకరణ
వాతావరణంలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ పెరగడంతో ఆమ్లవర్షాలు కురిసి భూఉపరితలంపై ఆమ్లీకరణ జరుగుతుంది. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు భూమిలోకి చొచ్చుకుపోవడం, భూ నాణ్యతను కాపాడే బ్యాక్టీరియా, వానపాములు లాంటి సూక్ష్మజీవులు అంతరించడం వల్ల భూ కాలుష్యం ఏర్పడుతుంది.

Posted Date : 14-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆవరణ వ్యవస్థ - పర్యావరణ క్షీణత

మాదిరి ప్రశ్నలు

1. మేఘమథనం లేదా కృత్రిమ వర్షం కురిపించడానికి వాడే మిశ్రమాలు
    1) డ్రై ఐస్     2) సిల్వర్ అయోడైడ్     3) సాల్ట్ పౌడర్     4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

2. జీవావరణం అత్యధికంగా ఉండే ఆవరణం?
జ: జలావరణం

 

3. కిందివాటిలో సరైంది.
    a) ఎన్విరాన్ అనే పదం ఫ్రెంచ్ భాష నుంచి వచ్చింది.
    b) ఎన్విరాన్ అంటే చుట్టూ జీవులతో కూడిన ప్రాంతం అని అర్థం.
జ: a, b సరైనవి

 

4. ఇకాలజీ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించిన శాస్త్రవేత్త?
జ: హెకెల్

 

5. కిందివాటిలో స్వయం పోషకాలు?
    1) వినియోగదారులు     2) విచ్ఛిన్నకారులు    3) ఉత్పత్తిదారులు     4) ఏదీకాదు
జ: 3 (ఉత్పత్తిదారులు)

 

6. పత్రాలు, పుస్తకాలు పసుపు రంగులోకి మారడానికి కారణం?
జ: సల్ఫర్ డై ఆక్సైడ్

 

7. జీవావరణ పిరమిడ్‌ను తయారుచేసిన శాస్త్రవేత్త
జ: చార్లెస్ హెల్టన్

 

8. అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించే ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంది?
జ: స్ట్రాటో ఆవరణం


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడటానికి కారణం? (పోలీస్ కానిస్టేబుల్ 2016, సబ్ ఇన్‌స్పెక్టర్ 2018)
జ: క్లోరోఫ్లోరో కార్బన్లు

 

2. ఆవరణ వ్యవస్థ ఆహార గొలుసు పిరమిడ్ మొదటి మెట్టులో ఉండేది? (గ్రూప్-1, 2017)
జ: ఉత్పత్తిదారులు

 

3. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఉపయోగించినవారు? (ఏఈ, 2015)
జ: ట్రాన్స్‌లే

 

4. కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి.
    a) అతినీలలోహిత కిరణాలు సూర్యుడి నుంచి భూఉపరితలానికి చేరతాయి.
    b) పరారుణ కిరణాలు భూఉపరితలం నుంచి పరావర్తనం చెందుతాయి.
జ: a, b సరైనవి

 

5. ఆమ్ల వర్షానికి కారణమయ్యే వాయువు (గ్రూప్-4, 2012; డీఎస్సీ 2017)
జ: సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్

Posted Date : 28-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భూకంపాలు - భూపాతాలు

భూగోళంలోని అన్ని ప్రదేశాల్లో భూకంపాలు నిరంతరం వస్తుంటాయి. కొన్నింటిని మనం కనీసం గుర్తించలేం కూడా. భూకంపాలు సంభవించినప్పుడు పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇలాంటి భూకంపాల వల్ల భవనాలకు, వంతెనలకు, ఆనకట్టలకు, ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. కొన్ని సందర్భాల్లో భూకంపాల వల్ల వరదలు, కొండ చరియలు విరిగి పడటం, సునామీ రావడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది.
ఉదా: 2004, డిసెంబరు 24న హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ వల్ల భారతదేశ తూర్పు తీరప్రాంతంలో, అండమాన్ నికోబార్ దీవుల్లో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది.

 

భూకంపం ఎందుకు వస్తుంది?
భూమి అంతర్భాగంలో ఎక్కడైనా ఒకచోట ఆకస్మిక అలజడి వచ్చినప్పుడు కంపనాలు ఉపరితలాన్ని చేరడాన్నే భూకంపం అంటారు. అంటే భూ ఉపరితల భూభాగం కొన్ని పొరలతో నిర్మితమై ఉంటుంది. ఇలా భూమి పొరల్లో అన్నింటి కంటే పెద్దదైన 'భూపటలం' అంతర్భాగంలో అత్యధిక శక్తి వల్ల ఏర్పడే అలజడితో భూకంపాలు ఏర్పడతాయి. వీటినే 'పలక చలనాలు' అంటారు.

భూమి లోపల ఉన్న పలకల కదలికల వల్ల కొన్ని ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు రావడానికి అవకాశం ఉంటుంది. భూకంపాలు ఆ ప్రాంత ఉపరితలాన్ని బలహీన ప్రాంతంగా మారుస్తాయి. ఇలాంటి బలహీన ప్రాంతాలను 'సిస్మిక్ ప్రాంతాలు' లేదా 'భూకంప ప్రభావిత ప్రాంతాలు' అంటారు.
 

భూకంపాలు - కారణాలు
భూకంపాలు ఎప్పుడు, ఎక్కడ సంభవిస్తాయో ముందుగా చెప్పడం కష్టం. అయితే కింది కారణాల వల్ల భూకంపాలను కొంతవరకు గుర్తించవచ్చు.
అవి: 1) అగ్నిపర్వతాల ఉద్భేదన ప్రక్రియ
     2) అంతర్భాగంలో జరిగే కేంద్రక విస్ఫోటనం
     3) గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టడం
     4) భూ అంతర్భాగంలో పలక చలనాలు (ప్లేట్స్ ఆఫ్ టెక్టానిక్స్)
పై కారణాల వల్ల భూ అంతర్భాగంలో ఎక్కడైన అత్యధిక శక్తి విడుదలైనప్పుడు కంపనాలు ప్రారంభమైన మూల స్థానాన్ని 'భూకంపనాభి' అంటారు. నాభి నుంచి ఉపరితలానికి చేరే ప్రాంతాన్ని 'అధికేంద్రం' అంటారు. భూకంప నాభి నుంచి ప్రకంపనాలు పరావర్తనం చెంది వక్రీభవిస్తాయి.

 

భూకంప కదలికలు - తరంగాలు
భూ అంతర్భాగంలో కదలికలు/ పలక చలనాలు భూ ఉపరితలంపై తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. వీటినే 'సిస్మిక్ తరంగాలు' అంటారు. వీటిని భూకంప లేఖిని ద్వారా గుర్తిస్తారు.
ఇవి మూడు రకాలు:
ఎ) భూమిలో ప్రారంభమయ్యే మొదటి తరంగాలను 'p' లేదా ప్రాథమిక తరంగాలు అంటారు. ఇవి ఒత్తిడితో కూడిన శబ్ద తరంగాలు. అన్ని మాధ్యమాల ద్వారా ప్రయాణిస్తాయి.
బి) రెండో తరంగాలను 's' లేదా గౌణ తరంగాలు అంటారు. ఇవి నిటారుగా/ ఊర్థ్వ వ్యాప్తంగా, ఘన పదార్థాల్లో మాత్రమే ప్రయాణిస్తాయి. భూ కేంద్రం ద్వారా ప్రయాణించవు.
సి) 'p', 's' తరంగాల వల్ల వచ్చే ఉపరితల తరంగాలను 'L' లేదా దీర్ఘ తరంగాలు అంటారు. వీటి వల్ల భూ ఉపరితల నష్టం తీవ్రంగా ఉంటుంది.

 

భూకంపాలు - విస్తరణ
* భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి.
* ఇవి అగ్నిపర్వత ప్రాంతాల్లో, ముడుత పర్వతాలు ఉన్నచోట ఎక్కువగా సంభవిస్తాయి.
* ఇప్పటివరకు భూకంపాలను గుర్తించని ప్రాంతం ఆస్ట్రేలియా.
* భూకంపాలను ముందుగా పిల్లులు, పాములు, పశువులు గుర్తిస్తాయి.
* ప్రపంచంలో భూకంపాలు 68% పసిఫిక్ మహాసముద్రం, 21% మధ్యదరా ప్రాంతాలు, 11% ఇతర ప్రాంతాల్లో సంభవిస్తాయి.

భూకంపాలు - పరికరాలు
* భూకంపాలను నమోదు చేసే పరికరాన్ని సిస్మోగ్రాఫ్/ భూకంప లేఖిని అంటారు. దీన్నే మెర్కెలి స్కేలు అని పిలుస్తారు. ఈ స్కేలును  ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ఉపయోగించవచ్చు.
* భూకంపం సంభవించిన ప్రదేశాన్ని, సమయాన్ని గుర్తించేదే భూకంప దర్శిని.
* భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేలుతో గుర్తిస్తారు. దీన్ని ట్రైనైట్రోటోల్యూన్ (TNT) పదార్థం ఆధారంగా లెక్కిస్తారు. రిక్టర్ స్కేలుపై 09 పాయింట్లు ఉంటాయి. అయితే రిక్టర్ స్కేలు కొలత 7.0 కంటే ఎక్కువ న‌మోదైన‌ప్పుడు తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది.
* భూకంప తీవ్రతను మరో పద్ధతి ద్వారా 'భ్రామక పరిమాణ' స్కేలును ఉపయోగించి కనుక్కోవచ్చు.

 

రిక్టర్ స్కేలు రీడింగ్ - భూకంప ప్రభావం
      రిక్టర్‌స్కేలు           -              భూకంప ప్రభావం

ఎ) 3.5 కంటే తక్కువ   -      మానవులు గుర్తించలేరు. రోజుకు 1000 సార్లు సంభవిస్తాయి.
బి) 3.5 - 5.4             -     కిటికీలు, కిచెన్ వస్తువులు కదులుతాయి. ఏడాదికి 49 వేల సార్లు వస్తాయి. విధ్వంసం ఉండదు.
సి) 5.5 - 6.0            -     భవనాలు, నాణ్యతలేని నిర్మాణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఏడాదికి 6,200 సార్లు వస్తాయి.
డి) 6.1 - 6.9           -    100 కి.మీ. వైశాల్యంలో తీవ్రత ఉంటుంది.
ఇ) 7.0 - 7.9           -    పెద్ద భూకంపాలు, ఆస్తి, ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది.
ఎఫ్) 8.0 కంటే ఎక్కువ  -  తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది. ఏడాదికి ఒకసారి వస్తుంది. అతి పెద్ద భూకంపాలు

ఇప్పటివరకు రిక్టర్‌స్కేలుపై 9.0 వచ్చిన భూకంపాలు
1) 1960 చిలీ  2) 1964 అలస్కా 3) 2004 ఇండోనేసియా, భారతదేశం

 

భూకంపాలు - ఫలితాలు
* భూకంపాలు నిర్ణీత వ్యవధిలో (ఒక నిమిషంలోపే) వస్తాయి.
* భూకంపాలకు పగలు, రాత్రి సమయాలుండవు. అన్ని వేళల్లో సంభవిస్తాయి. వీటివల్ల ప్రాణ నష్టం అధికంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య  ఉంటాయి.
* భూకంపాల వల్ల చమురు బావులు, గ్యాస్ పైపులు పగిలి అగ్ని ప్రమాదం సంభవించవచ్చు. సునామీ కూడా సంభవిస్తుంది.

 

భారతదేశంలో భూకంపాలు
* భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా హిమాలయ పర్వత పాదాల వద్ద సంభవిస్తాయి. దేశంలో తరచుగా అసోం, గుజరాత్, మహారాష్ట్ర, జమ్మూ, బిహార్‌లో వస్తున్నాయి.
ఉదా: 1897లో ఈశాన్య షిల్లాంగ్‌లో రిక్టర్ స్కేలుపై 8.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.
* జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ హైదరాబాద్ భూకంపాలను 5 జోన్లుగా నిర్ధారించింది. 2002లో జోన్ - I ను జోన్ - II లో విలీనం చేశారు. ప్రస్తుతం 4 జోన్లు ఉన్నాయి. వీటిలో జోన్ V అత్యంత తీవ్రమైన విధ్వంసం కలిగిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర జమ్మూ, బిహార్, ఉత్తరాఖండ్, పశ్చిమ గుజరాత్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవులు జోన్ - V లో ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీ 4వ జోన్ పరిధిలో ఉంది.
* భారత భౌగోళిక ప్రాదేశిక ప్రాంతంలో భూకంపాల వల్ల సుమారు 59% దుర్బలత్వం సంభవిస్తుంది.
ఉదా: 1) 2001, జనవరి 26 - గుజరాత్ భుజ్ భూకంపం
     2) 2005, అక్టోబరు 8 - జమ్మూ కశ్మీర్ ఉరి, తంగదర్ భూకంపం
     3) 2011, అక్టోబరు 5 - సిక్కిం భూకంపం
     4) 2015, ఏప్రిల్ 25 - కాఠ్‌మాండూ, బిహార్ భూకంపం
* ప్రాంతీయ భూకంప ప్రమాదాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయ ప్రాంతంలోని చిత్తూరు, కడప, నెల్లూరు, కృష్ణా, గోదావరి మైదానాలు 3వ జోన్‌లోనూ, హైదరాబాద్ నగరం 2వ జోన్‌లోను ఉన్నాయి.

 

భూకంప అధ్యయనాలు - పరిశోధన
* భూకంపాలను సిస్మాలజీ ద్వారా అధ్యయనం చేస్తారు.
* సమాన భూకంప ప్రాంతాలను కలిపే రేఖలను 'ఐసో సిస్మిల్స్' అంటారు.
* అంతర్జాతీయ భూకంప అధ్యయన కేంద్రం - లండన్.
* జాతీయ భూకంప పరిశోధన సమాచార కేంద్రం - న్యూదిల్లీ.
* ఇండో రష్యా భూకంప పరిశోధన కేంద్రం - న్యూదిల్లీ.
¤* జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ - హైదరాబాద్.
¤* 1898లో మొదటి భూకంప అధ్యయన కేంద్రాన్ని కోల్‌కతాలో ఏర్పాటు చేశారు.
* రూర్కీ (ఉత్తర్ ప్రదేశ్)లోని కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ భూకంపం వచ్చినప్పుడు తట్టుకునే భవన నిర్మాణ ప్రణాళికలను రూపొందించింది.

భూపాతాలు
* వాలుగా ఉండే నిర్మాణ ప్రదేశాల్లో ప్రకృతి కారకాల వల్ల కొంత భాగం విడివడి బయటకు కొట్టుకుని పోయి క్రమక్షయం చెందడాన్ని 'భూపాతం' అంటారు. వీటినే కొండ చరియలు విరిగి పడటం లేదా పదార్థ నాశనం అంటారు. ఇటీవల 2018 ఆగస్టులో కేరళలో అధిక వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
* ఇవి ఎక్కువగా పర్వత వాలు ప్రదేశాలు, నదీ వక్రతల ప్రాంతాలు, అధిక వర్షం కురిసే కొండ ప్రాంతాల్లో సంభవిస్తాయి. అందుకే ఇలాంటి ప్రదేశాల్లో గృహ నిర్మాణం 'పిరమిడ్' ఆకారంలో ఉండటం వల్ల భూపాతాల నుంచి రక్షణ పొందవచ్చు.
* భారతదేశంలో వీటి వల్ల 15 శాతం దుర్బలత్వం ఏర్పడుతుంది. ఉత్తర భారతదేశంలోని హిమాలయాలు 7 పొరల అవక్షేప శిలలతో ఏర్పడి ఉన్న కారణంగా ప్రపంచ భూపాతాల్లో అధికంగా 30 శాతం ఇక్కడే సంభవిస్తున్నాయి.
ఉదా: 2013, జూన్ 16, 17 తేదీల్లో ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ప్రాంతంలో కొండచరియలు ఎక్కువగా విరిగిపడ్డాయి.
* దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండల్లో అధిక వర్షం, అడవులను నరికివేయడం వల్ల ఎక్కువగా భూపాతాలు ఏర్పడుతున్నాయి.
* భూపాతాలను 'లాండ్‌స్త్లెడ్ జోనేషన్ మ్యాపింగ్ పద్ధతి' ద్వారా ముందే గుర్తిస్తారు. 2004 నుంచి భూపాతాలకు నోడల్ ఏజెన్సీగా జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్‌కతా బాధ్యత వహిస్తుంది.

హిమపాతాలు:
* వీటినే మంచుకొండలు విరిగి పడటం అంటారు. ఇవి ఎక్కువగా అతి శీతల, ఎత్తయిన ప్రాంతాల్లో భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల పర్వతం పైభాగం నుంచి కిందికి జాలువారుతూ తీవ్రమైన ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయి.
* ఈ రకమైన మంచు లేదా హిమపాతాలు సాధారణంగా ద్రాస్, ఫెర్ పంజాల్, స్పిటి, లేహ్, బద్రీనాథ్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
* హిమాలయ ప్రాదేశిక ప్రాంతంలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌లోని చంబా, కులు, స్పిటి, కిన్నార్; ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ, చమోలీ ప్రాంతాల్లో హిమపాతాలు సంభవిస్తాయి.

 

ఉరుములు, మెరుపులు:
మేఘాలు ప్రయాణించేటప్పుడు గాలిలోని కణాలతో ఘర్షణ వల్ల ఆవేశపూరితం అవుతాయి. ఒక ఆవేశపూరిత మేఘానికి దగ్గరగా మరో మేఘం వచ్చినప్పుడు అది రెండో మేఘంపై వ్యతిరేక ఆవేశాన్ని ప్రేరేపిస్తుంది. అందువల్ల ధన, రుణ ఆవేశాల మధ్య ఉత్సర్గం (discharge) జరిగి పెద్ద ఎత్తున వెలుగు చారికలు/ రేఖలతో పాటు ధ్వని ఉత్పత్తి అవుతుంది. వీటినే మెరుపులు, ఉరుములు అంటారు. ఈ ప్రక్రియను 'విద్యుత్ ఉత్సర్గం' అంటారు. ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ మేఘాల మధ్య జరుగుతుంది. ఇవి ఎక్కువగా వర్షం వచ్చే ముందు వస్తాయి. వీటిని 'లైట్నింగ్ డిటెక్టర్ల' ద్వారా 90 శాతం కచ్చితత్వంతో కనిపెట్టవచ్చు. దీని ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని పుణెలో ఉంది. లైట్నింగ్ డిటెక్టర్లను ఫిన్‌లాండ్ తయారు చేస్తుంది. పిడుగులు/ మెరుపుల నుంచి పెద్ద భవనాలను, కట్టడాలను రక్షించడానికి 'తటి ద్వాహకం' (Lightning) లను ఉపయోగిస్తారు.

                                                                                                              ‌

Posted Date : 14-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భూకంపాలు - భూపాతాలు

మాదిరి ప్రశ్నలు

1. భారత ప్రాదేశిక విస్తీర్ణంలో ఎంత శాతం భూకంప దుర్బలత్వం ఉంది?
జ: 59%

 

2. ఉరుములు, మెరుపులను గుర్తించే సాధనం?
జ: లైట్నింగ్ డిటెక్టర్

 

3. దిల్లీ, హైదరాబాద్‌లు ఏ భూకంప జోన్‌లలో ఉన్నాయి?
జ: జోన్ - 4, 2

 

4. కిందివాటిలో దేన్ని నియంత్రించడానికి 'లాండ్ స్త్లెడ్ జోనేషన్ మ్యాపింగ్ పద్ధతి'ని ఉపయోగిస్తారు?
     1) భూకంపాలు       2) కొండచరియలు విరిగిపడటం      3) హిమపాతాలు      4) సహజ అటవీ కార్చిచ్చు
జ: 2 (కొండచరియలు విరిగిపడటం)

 

5. హిమలయ ప్రాంతాల్లో తరచుగా హిమపాతాలు ఎక్కడ సంభవిస్తాయి?
     1) జమ్మూకశ్మీర్      2) హిమాచల్‌ ప్రదేశ్      3) ఉత్తరాఖండ్      4) అన్నీ
జ: 4 (అన్నీ)    

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భూకంపాలు అతి తీవ్రంగా సంభవించే జోన్ -V లో ఉన్న ప్రాంతం ఏది? (ఏఎస్‌వో - 2017)
జ: షిల్లాంగ్

 

2. ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు, సునామీల శాతం ఎంత? (గ్రూప్ - 4, 2012)
జ: 8 శాతం

 

3. హిమాలయ ప్రాంతంలో భూకంపాలు రావడానికి కారణం? (గ్రూప్ - 1, 2017, ఏపీ)
జ: భూపటంలో పలకలు ఢీకొట్టడం

 

4. భూకంప సమయంలో ఏ నేల ఎక్కువగా ప్రకంపిస్తుంది? (హాస్టల్ వెల్ఫేర్ - 2017)
జ: మెత్తటి నేల

 

5. కొండ చరియలు తరచుగా ఏ రాష్ట్రంలో విరిగి పడతాయి? (గ్రూప్ - 2, 2016)
జ: ఉత్తరాఖండ్

      

Posted Date : 14-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చక్రవాతాలు - సునామీ

ప్రపంచంలో చక్రవాతాల ప్రభావం 21% ఉండి ఆయాదేశాల్లో అధిక నష్టాన్ని కలిగిస్తుంది. భూ ఉపరితలంపై ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి (1970) పరిశీలిస్తే గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అమెరికా, చైనా, ఫిలిప్పీన్స్ దేశాలు అత్యధిక చక్రవాతాలకు గురవుతున్నాయి. అత్యధిక ప్రాణ, ఆస్తి నష్టం ఆసియా ఖండంలోని బంగ్లాదేశ్‌లో సంభవించింది. 1970, నవంబరు 12న బంగ్లాదేశ్‌లో సంభవించిన 'బోలా' తుపాన్ వల్ల 5 లక్షల మంది మరణించారు.
* భూ ఉపరితలం 71% నీటితో విస్తరించి 5 మహాసముద్రాలుగా విభజితమైంది. ఈ మహాసముద్రాల పరిధిలో 177 దేశాలు తీరప్రాంతాలతో విస్తరించి ఉండటం వల్ల వాటిపై చక్రవాతాల ప్రభావం అధికంగా ఉంటుంది. చక్రవాతాలను అల్పపీడన ద్రోణి లేదా వాయుగుండం అంటారు. ఇవి 98% సముద్రాలు, 2% భూ ఉపరితలంపై నుంచి ప్రయాణిస్తాయి.

 

చక్రవాతం
       చక్రవాతాన్ని సైక్లోన్ అంటారు. ఈ పదాన్ని మొదటగా హెన్రీ పిడింగ్‌టన్ ఉపయోగించారు. సైక్లోన్ గ్రీకు భాషా పదమైన 'కైక్లోన్' నుంచి వచ్చింది. కైక్లోన్ అంటే తిరుగుతున్న నీరు లేదా చుట్టుకున్న పాము అని అర్థం.

చక్రవాతం/సైక్లోన్ ఏర్పడే విధానం
 

       సముద్రాలపై అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడే ప్రాంతంలో నీరు వేడెక్కి, వ్యాకోచించి అల్పపీడనంగా మారుతుంది. ఈ అల్పపీడనం వైపు నలు దిశల నుంచి అధిక పీడన వ్యవస్థలు కేంద్రీకృతం కావడాన్ని చక్రవాతం అంటారు. చక్రవాతాలు జేర్కిన్ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటాయి.
జేర్కిన్ సిద్ధాంతం ప్రకారం చక్రవాతాలు 2 రకాలు
అవి: 1) ఉష్ణమండల చక్రవాతాలు
       2) సమశీతోష్ణ చక్రవాతాలు  
ఉష్ణమండల చక్రవాతాలు (Tropical Cyclones): ఇవి 0° - 23  కర్కట, మకరరేఖల మధ్య అధిక ఉష్ణోగ్రతల వల్ల సంభవిస్తాయి. ప్రపంచంలో వీటి ప్రభావం 90% వరకు ఉంటుంది.
సమశీతోష్ణ చక్రవాతాలు (Temperate Cyclones): ఇవి 35° - 66  ఆర్కిటిక్, అంటార్కిటిక్ మధ్య ప్రాంతంలో సంభవిస్తాయి.
* ఈ విధంగా భూమధ్య రేఖ నుంచి ఉష్ణ వాయురాశులు, ధృవాల నుంచి శీతల వాయురాశులు వీస్తాయి. ఈ ఉష్ణ, శీతల వాయురాశులు కలిసే ప్రాంతాన్నే 'వాతాగ్రం' అంటారు. దీని వద్ద గాలి అవ్యవ్యాకోచం చెంది ఉరుములు, మెరుపులు ఏర్పడే ప్రాంతాన్ని 'కేంద్రకుడ్యం' అంటారు. అది తీర ప్రాంతంలో తుపాన్‌గా మారడాన్ని 'లాండ్‌ఫాల్' అంటారు. చక్రవాతం ఏర్పడే ప్రాంతం వద్ద వ్యాసం 30 కి.మీ. - 370 కి.మీ., గాలివేగం గంటకు 31 కి.మీ. - 221 కి.మీ. వరకు ఉంటుంది.

* అమెరికాలో 2017, సెప్టెంబరులో ఇర్మా తుపాన్ 279 కి.మీ./గంట; ఒడిశాలో 1999, అక్టోబరులో 268 కి.మీ./గంట వేగంతో సైక్లోన్ సంభవించింది.
 

సైక్లోన్ మండలాలు
 

        ప్రపంచంలో ప్రతి ఏడాది సగటున 97 తుపాన్లు సంభవిస్తున్నాయి. వీటి ఉద్ధృతి మే, నవంబరు నెలల మధ్య ఉంటుంది. ఉద్ధృతిని బట్టి ఆయా దేశాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.

టోర్నడో: ఇది ప్రపంచంలోనే అత్యంత భయానకమైంది. 98% టోర్నడోలు అట్లాంటిక్ మహాసముద్రం, అమెరికాలో సంభవిస్తాయి. స్పానిష్ భాషలో టోర్నడో అంటే 'ఉరుముల తుపాన్' అని అర్థం. దీని వేగాన్ని, తీవ్రతను 'ఫుజితా స్కేలు' తో కొలుస్తారు.
 

తుపాన్
 

భారతదేశానికి మూడువైపుల సముద్రం ఉండి, 7516 కి.మీ. మేర తీరరేఖ వ్యాపించి ఉంది. దేశ భౌగోళిక వైశాల్యంలో ప్రధాన తీర ప్రాంత భూభాగం 5400 కి.మీ., అండమాన్ నికోబార్ దీవులు 1900 కి.మీ., లక్షదీవులు 132 కి.మీ. మేర తుపాన్ తీవ్రతను కలిగి ఉన్నాయి.
       ప్రపంచ ఉష్ణమండల తుపాన్లలో భారత తీరప్రాంతంలో సంభవించే తుపాన్లు 10% కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి. మన దేశంలో సగటున ఏటా 6 తుపాన్లు సంభవిస్తున్నాయి. వీటి తీవ్రత మే - జూన్; అక్టోబరు - నవంబరు మధ్య ఎక్కువగా ఉంటుంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపాన్ల తీవ్రత 4 : 1 నిష్పత్తిలో ఉంటుంది. ప్రధానంగా బంగాళాఖాతం పరిధిలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బంగలోనూ; పుదుచ్చేరి తూర్పు తీరంలోనూ; పశ్చిమ తీర ప్రాంతం (అరేబియా సముద్రం) పరిధిలోని గుజరాత్‌లోనూ తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తుపాన్ వచ్చినప్పుడు సముద్రంలోని అలలు 6 మీ. ఎత్తుకు లేస్తాయి. వీటిని గుర్తించడానికి టైడ్‌గేజ్ నెట్‌వర్క్ లేదా రాడార్‌లను ఉపయోగిస్తారు.
       ఆంధ్రప్రదేశ్‌లోని 9 జిల్లాల్లో 974 కి.మీ. మేర బంగాళాఖాత తీరరేఖ వ్యాపించి ఉంది. ఈ ప్రాంతంలోని 44% భూభాగం తుపాన్ ప్రభావానికి గురవుతుంది. వీటి వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో అక్టోబరు డిసెంబరు మధ్య అధిక నష్టం వాటిల్లుతుంది. తెలంగాణ భూపరివేష్టిత రాష్ట్రం కాబట్టి దీనిపై తుపాన్ ప్రభావం ఉండదు.

 

ఇటీవల ఏర్పడిన తుపాన్లు


* 2017 సెప్టెంబరులో ఫ్లోరిడా, క్యూబా దేశాల్లో - ఇర్మా హరికేన్,
* 2016 డిసెంబరులో దక్షిణ భారత్, అండమాన్, థాయిలాండ్‌లలో - వార్ధా తుపాన్,
* 2015 ఆగస్టులో భారత్, బంగ్లా, బర్మా దేశాల్లో - కొమెన్ తుపాన్,
* 2014 అక్టోబరులో విశాఖపట్నం, నేపాల్‌లో - హుద్‌హుద్ తుపాన్ సంభవించాయి.

సునామీ
సముద్ర అంతర్భాగంలో భూకంపాలు ఏర్పడినప్పుడు అలలు తీరప్రాంతాన్ని చేరి తుపానుగా మారడాన్నే 'సునామీ' అంటారు. ఆ సమయంలో అలలు పదుల అడుగుల ఎత్తులో పైకి ఎగసి తీరప్రాంతంలోని భూభాగాన్ని తీవ్ర నష్టానికి గురిచేస్తాయి. ఒక పెద్ద భూకంపం తర్వాత సునామీ ముప్పు అనేక గంటలపాటు ఉంటుంది. ఆ సమయంలో ప్రమాదకరమైన పెద్ద అలలు ఏర్పడతాయి.
* సునామీ అనే పదం జపనీస్ భాష నుంచి వచ్చింది. జపాన్ భాషలో 'సు' (Tsu) అంటే రేవు/సముద్రం, 'నామి' (Nami) అంటే అలలు/తరంగం/కెరటాలు అని అర్థం. సముద్ర ఉపరితల నీరు తరంగాల ద్వారా ఉప్పొంగడాన్నే సునామీగా భావిస్తారు.
* సునామీలను జపాన్‌లో హర్బర్ వేవ్, ఆంగ్లంలో సిస్మిక్ సీ వేవ్, తెలుగులో సముద్ర ఉప్పెన, తమిళంలో అజిహిపెరాలై అని అంటారు.
* సునామీ వచ్చినప్పుడు సముద్ర ఉపరితలంపై రెండు శృంగాల మధ్య దూరం 100 కి.మీ., తరంగాల ఎత్తు 30 మీ., తరంగ ప్రయాణ వేగం 800 కి.మీ./గంట ఉంటుంది. మైదాన ప్రాంతంలో సునామీ గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఇవి ఏ సమయంలోనైనా సంభవించవచ్చు.

 

కారణాలు:
1. సముద్రంలో భూకంపాలు ఏర్పడటం.
2. అగ్ని పర్వతాలు పేలడం.
3. కొండ చరియలు (భూపాతాలు) విరిగిపడటం.

     వీటిలో 80% సునామీలు భూకంపాల వల్ల వస్తాయి. ఈ కారణాల వల్ల పెద్దపెద్ద అలలు ఏర్పడి తీరప్రాంతాలను అతలాకుతలం చేయడాన్ని 'సునామీ' అంటారు.
 

విస్తరణ:
* 75% సునామీలు పసిఫిక్ మహాసముద్రం, దాని దీవుల్లో సంభవిస్తున్నాయి. అందువల్ల పసిఫిక్‌ను 'అగ్నివలయం' (Ring Fire) అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో అధికంగా సుగామీచే, హవాయి దీవులు, జపాన్, ఓషియానీయ దీవులు ఉంటాయి.
* 25% మధ్యదరా, కరేబియన్, పశ్చిమ, తూర్పు పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రంలో సంభవిస్తున్నాయి.
ఉదా: అమెరికాలోని అలస్కా, హవాయి దీవుల్లోని 'హిలో' అనే ప్రాంతంలో ఎత్తయిన అలలతో తీవ్రమైన సునామీలు సంభవిస్తాయి.

 

భారతదేశంలో సునామీ
       మనదేశంలో సునామీ తీవ్రత హిందూ మహాసముద్ర ప్రభావం వల్ల 1% మాత్రమే ఉంటుంది. దేశం మొత్తం తీరప్రాంతంలో 300 కి.మీ. పొడవున దీని ప్రభావం ఉంది.
* తూర్పుతీర బంగాళాఖాతంలో తమిళనాడు నుంచి అండమాన్ - నికోబార్, ఇండోనేషియా దీవుల వరకు; పశ్చిమ తీర అరేబియాలో గుజరాత్, పాక్ మాక్రీన్ దీవుల నుంచి మాల్దీవుల వరకు ఉంటుంది.
ఉదా: 2004, డిసెంబరు 26న రిక్టర్ స్కేలుపై 9.0 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల హిందూ మహాసముద్రంలో సునామీ ఏర్పడింది. దీని వల్ల 11 దేశాల్లో మొత్తం 2,30,000 ప్రాణనష్టం జరిగింది. భారత్‌లో అండమాన్ దీవులు, తమిళనాడులోని కడలూర్ జిల్లా అత్యధిక నష్టానికి గురయ్యాయి.
* 2011, మార్చి 11న జపాన్‌లో ఫుకుషిమా వద్ద పెద్ద సునామీ వచ్చింది.

నివారణ చర్యలు:
* 1920లో మొదటిసారిగా హవాయి దీవుల్లో సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
* 1946లో 'పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్‌'ను హవాయి దీవుల్లోని హోనొలులు సమీపాన ఏర్పాటు చేశారు.
* 1999లో హైదరాబాద్ కేంద్రంగా ఎర్త్ మినిష్టర్ ఆధ్వర్యంలో 'ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్‌మేషన్ సర్వీస్' (INCOIS) ను ప్రారంభించారు. ఇది పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్ర సమాచారాన్ని అందిస్తుంది.
* సునామీలను ముందుగా గుర్తించడానికి ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో హెచ్చరికలు జారీ చేయవచ్చు. కేబుళ్ల ద్వారా భూమికి అనుసంధానం చేసిన సునామీ డిటెక్టర్లను సముద్రంలో 50 కి.మీ. అడుగున ఉంచుతారు. ఇవి ఉపరితల అలజడులను గుర్తించి ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.
* 2015 డిసెంబరులో తొలి విపత్తు ఎఫ్ఎం (107.8) రేడియోను తమిళనాడులోని కడలూర్‌లో ప్రారంభించారు.

Posted Date : 14-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చక్రవాతాలు - సునామీ

1. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
    a) స్పానిష్ భాషలో టోర్నడో అంటే 'ఉరుముల తుపాన్' అని అర్థం.
    b) గ్రీకు భాషలో కైక్లోన్ అంటే 'తిరుగుతున్న నీరు' అని అర్థం.
జ: a, b సరైనవి

 

2. కిందివాటిని జతపరచండి.

  ప్రాంతాలు   సైక్లోన్
 a) జపాన్, చైనా  i) బ్లిజార్డ్స్
 b) ఆస్ట్రేలియా  ii) హరికేన్లు
 c) వెస్టిండీస్   iii) విల్లీ - విల్లీ
 d) అంటార్కిటికా  iv) టైఫూన్లు
   v) టోర్నడోలు

జ: a-iv, b-iii, c-ii, d-i

3. దేశంలో తొలి విపత్తు రేడియోను ఎక్కడ ఏర్పాటు చేశారు?
జ: కడలూర్

 

4. ప్రపంచ చక్రవాతాల్లో భారతదేశ తీర ప్రాంతంలో ఎంత శాతం తుపాన్లు సంభవిస్తున్నాయి?
జ: 10%

 

5. సునామీలు ఎక్కువగా ఎప్పుడు సంభవిస్తాయి?
  1) పగలు         2) రాత్రి       3) పగలు, రాత్రి         4) అన్ని వేళల్లో
జ: 4 (అన్ని వేళల్లో)

 

6. పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ ఎక్కడ ఉంది?
జ: హోనొలులు

 

7. 2017 సెప్టెంబరులో ఫ్లోరిడా, క్యూబాను తీవ్రంగా నష్టపరిచిన హరికేన్?
జ: ఇర్మా

 

8. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపాన్లు ఏ నిష్పత్తిలో సంభవిస్తాయి?
జ: 4 : 1

 

గత పోటీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

 

1. 2011, మార్చి 11న ఏ దేశంలో సంభవించిన సునామీ వల్ల వేలాది మంది మరణించారు?  (గ్రూప్ - 4, 2012)
జ: జపాన్

 

2. భారతదేశంలో ఎంత మేర తీరప్రాంతం తుపాన్లు, గాలివానలు, సునామీలకు గురవుతుంది? (గ్రూప్ - 4, 2012)
జ: 5700 కి.మీ.

 

3. సముద్రాల్లో సునామీ సంభవించినప్పుడు దాని తరంగ/అలల ప్రయాణ వేగం ఎంత? (పంచాయతీ సెక్రటరీ, 2013)
జ: 800 కి.మీ./గంట

 

4. 1999లో ఒడిశాలో సంభవించిన తీవ్ర తుపాన్ వేగం ఎంత? (హాస్టల్ వెల్ఫేర్, 2017)
జ: 260 - 270 కి.మీ./గంట

 

5. కిందివాటిలో విపత్తు కానిది? (ఏఎస్‌వో - 2017, ఏపీ)
     1) ప్రాణ నష్టంలేని తుపాన్               2) ఆర్థిక నష్టంలేని తుపాన్
     3) ప్రాణ, ఆర్థిక నష్టంలేని తుపాన్     4) గాలి లేని, వర్షాలకు కారణమయ్యే అల్పపీడన ద్రోణి
జ: 4 (గాలి లేని, వర్షాలకు కారణమయ్యే అల్పపీడన ద్రోణి)

 

6. ఉష్ణమండల తుపాన్లను గుర్తించడానికి ఉపయోగించే సాధనం? (ఏఎస్‌వో - 2017)
జ: తీరప్రాంత రాడార్‌లు

 

7. 2014లో విశాఖపట్టణాన్ని తీవ్రంగా నష్టపరిచిన తుపాన్? (డీఎల్ - 2017)
జ: హుద్‌హుద్

 

8. జపాన్ భాషలో సునామీ అంటే? (డిప్యూటీ సర్వేయర్ - 2017)
జ: హర్బర్ వేవ్

Posted Date : 28-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కరవులు - వరదలు

మాదిరి ప్రశ్నలు

1. జాతీయ వరద నియంత్రణ మండలిని (NFCB) ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1954

 

2. భారతదేశ భౌగోళిక వైశాల్యంలో ఎంత శాతాన్ని 'కరవు పీడిత' ప్రాంతంగా గుర్తించారు?
జ: 68%

 

3. భారత వాతావరణ శాఖ (IMD) న్యూదిల్లీ కరవును ఎన్ని రకాలుగా వర్గీకరించింది?
జ: 5

 

4. ఆకస్మిక వరదలు (Flash Floods) ఎప్పుడు వస్తాయి?
    a) ఉరుములు, తుపాన్లు వచ్చినప్పుడు
    b) అధిక వర్షం వల్ల నదులు ఉప్పొంగినప్పుడు
జ: a, b సరైనవి

 

5. 'జాతీయ వ్యవసాయ కమిషన్' ప్రకారం మృత్తిక తేమ కోల్పోవడం ఏ రకమైన కరవు?
జ: వ్యవసాయ కరవు

6. భారతదేశంలో ఆకస్మిక వరదలు ఎక్కువగా ఏ నది వల్ల సంభవిస్తుంటాయి?
జ: బ్రహ్మపుత్ర

 

7. 'హాలోజెన్' బిళ్లలను దేనికి ఉపయోగిస్తారు?
జ: నీటిని శుద్ధిచేయడానికి

 

8. వరదలు వస్తున్నప్పుడు భూజల తలాన్ని కొలవడానికి, ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడానికి ఉపయోగించే సాధనం?
జ: నైలో మీటర్

 

9. ఒక ప్రాంతంలో కరవును ఎంత శాతం వర్షపాతం నమోదైతే చాలా తక్కువ అని (-) గుర్తిస్తారు?
జ: సగటు కంటే 60% నుంచి 99% తక్కువ వర్షం

 

10. ప్రభుత్వం కరవు ప్రభావాన్ని తగ్గించడానికి కింది ఏ పథకాల ద్వారా కృషి చేస్తుంది?
      (a) సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకం
      (b) భూగర్భ జలాలను పెంచడానికి ఇంకుడు గుంతల పథకం
జ: a, b సరైనవి

 

11. పట్టణ వరదలు ఏ మంత్రిత్వ శాఖ నిర్వహణలో ఉంటాయి?
జ: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ

12. భూ ఉపరితలంపై ఎంత మొత్తం నీరు ఉప్పొంగినప్పుడు వరదగా నమోదు చేస్తారు?
జ: 12 అంగుళాలు

 

13. కరవు అనేది?
జ: నిదాన ప్రక్రియ


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
 

1. కిందివాటిలో నిదానంగా విస్తరించే విపత్తు? (ఏఎస్ఓ-2017)
     1) రసాయనిక                 2) భూకంపం         3) కొండ చర్యలు విరగడం         4) కరవు
జ: 4 (కరవు)

 

2. కిందివాటిలో మానవ ప్రేరేపిత విపత్తు ఏది? (ఏఎస్ఓ-2017)
    1) చెన్నై వరదలు              2) చెన్నై సునామీ         3) కేదార్‌నాథ్ వరద          4) తక్కువ వర్షం
జ: 1 (చెన్నై వరదలు)

 

3. క్షామం వల్ల ఎవరు ఎక్కువగా బాధపడతారు? (గ్రూప్-4, 2012)
జ: మహిళలు

4. భారతదేశంలో కరవు దేనితో ముడిపడి ఉంది? (పంచాయతీ కార్యదర్శి - 2013)
జ: రుతు పవనాలు

 

5. కిందివాటిలో ఏది కరవు నివారణా చర్య కాదు? (గ్రూప్-2, 2011)
1) చెక్‌డ్యామ్‌ల నిర్మాణం                            2) చెరువులు పూడిక తీయడం 
3) పొలంలో ఇంకుడు గుంత తవ్వడం         4) మొక్కలు నాటడం
జ: 4 (మొక్కలు నాటడం)

 

6. ''విపత్తులన్నీ ఆపదలే, కానీ ఆపదలన్నీ విపత్తులు కావు" ఈ ప్రకటన - (డిప్యూటీ సర్వేయర్-2017)
జ: నిజమైంది

 

7. భారతదేశంలో వరదలకు గురయ్యే ప్రదేశం సుమారు ఎంత శాతం ఉంది? (గ్రూప్-2, 2012)
జ: 12%

 

8. 2016 కరవు నిర్వహణ కరదీపిక ప్రకారం దీర్ఘకాలిక కరవును ఎంత వర్షపాతం ఉంటే ప్రకటిస్తారు? (గ్రూప్-1, 2017)
జ: 750 mm కంటే తక్కువ

Posted Date : 15-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తు నిర్వహణ చట్టం - 2005

2005, మే 30న కార్యనిర్వహక ఉత్తర్వు ద్వారా ప్రధాని ఛైర్మన్‌గా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటుచేశారు. దీన్ని యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం 'ప్రకృతి వైపరీత్యాల నష్ట నివారణ' అనే పేరుతో 2005, డిసెంబరు 23న పార్లమెంట్‌లో ఆమోదించింది. ఈ చట్టంపై 2006, జనవరి 9న రాష్ట్రపతి సంతకం చేశారు.
* 2006, సెప్టెంబరు 27న ఛైర్మన్, తొమ్మిది మంది సభ్యులతో కూడిన 'జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ - NDMA' లాంఛనంగా అమల్లోకి వచ్చింది.
* జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మొదటి ఛైర్మన్ డాక్టర్ మన్మోహన్ సింగ్, వైస్ ఛైర్మన్ డాక్టర్ మర్రి శశిధర్ రెడ్డి. వీరు 2014లో రాజీనామా చేశారు.
* 2014 డిసెంబరులో ఎన్‌డీఏ ప్రభుత్వం నూతన విపత్తు నిర్వహణలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సభ్యులను తగ్గించింది. ప్రస్తుతం ఒక ఛైర్మన్, అయిదుగురు సభ్యులు ఉన్నారు.
* ప్రస్తుత NDMA ఛైర్మన్ నరేంద్ర మోదీ; సభ్యులు కమల్ కిశోర్, డి.ఎన్. శర్మ, ఎన్.సి. మర్వా, ఆర్.కె. జైన్.
* విపత్తు నిర్వహణ చట్టాన్ని 2009, అక్టోబరు 22న కేంద్రమంత్రి మండలి ఆమోదించి దేశ వ్యాప్తంగా అమలు చేసింది. దీన్నే జాతీయ విపత్తు నిర్వహణ విధానం (నేషనల్ పాలసీ ఫర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ - NPDM) అంటారు.
* జాతీయ విపత్తు మొదటి సమావేశాన్ని 2006, నవంబరు 29న; రెండో సమావేశాన్ని 2009, నవంబరు 6న దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించారు. విపత్తు పరిహారాన్ని 2015, ఏప్రిల్ 1 నుంచి అందిస్తున్నారు. నూతన విధానం ప్రకారం ఒక వ్యక్తి విపత్తు వల్ల మరణిస్తే రూ.4 లక్షలు, 60% గాయాలైతే రూ.2 లక్షలు నష్ట పరిహారంగా ఇస్తారు.

 

జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ - NDMP):
2016, జూన్ 1న దిల్లీలో నూతన జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను నరేంద్ర మోదీ ప్రభుత్వం విడుదల చేసింది ఈ ప్ర‌ణాళిక‌ను కింది స‌ద‌స్సుల ల‌క్ష్యాల‌కు అనుగుణంగా రూపొందించారు.
a) 2015 మార్చి - జపాన్ (సెండాయ్) - అంతర్జాతీయ విపత్తు కుదింపు సదస్సు (DRR - Disaster Risk Reduction)
b) 2015 సెప్టెంబరు - అమెరికా (న్యూయార్క్) - సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సదస్సు (SDG - Sustainable Development Goals)
c) 2015 డిసెంబరు - ఫ్రాన్స్ (పారిస్) - వాతావరణ మార్పు సదస్సుల (COP - 21)
            ఈ ప్రణాళిక 2015 - 2030 వరకు స్పల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికల్లో మొత్తం 14 లక్ష్యాలను సాధించాలని నిర్ణయించింది. స్పల్పకాలిక 5 సంవత్సరాలు, మధ్యకాలిక 10 సంవత్సరాలు, దీర్ఘకాలిక 15 సంవత్సరాలుగా నిర్ణయించారు.       

* 2005 విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 11 ప్రకారం జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (NDMP) దేశం మొత్తానికి చట్ట/న్యాయ బద్ధమైంది. సెక్షన్ 37 ప్రకారం దేశంలోని అన్ని మంత్రిత్వ శాఖలకు ఇది వర్తిస్తుంది.
 

విపత్తు నిర్వహణ స్థాయి (Levels of Disasters):
విపత్తు నిర్వహణ అత్యున్నతాధికారి కమిటీ (HPC) - 2001 నివేదిక ప్రకారం 2016లో జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికలో విపత్తు దుర్బలత్వాన్ని తగ్గించడానికి వివిధ కేటగిరీలుగా విభజించారు. ఒక సాధారణ కేటగిరీని కూడా రూపొందించారు.
స్థాయి - 1 (L1) - జిల్లా స్థాయిలో విపత్తు ప్రణాళికలను నిర్వహిస్తూ, రాష్ట్రస్థాయి విపత్తు నిర్వహణ సహాయాన్ని కలిగి ఉండటం
స్థాయి - 2 (L2) - రాష్ట్రస్థాయి విపత్తు నిర్వహణ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ నిర్వహణ సహాయాన్ని కలిగి ఉండటం
స్థాయి - 3 (L3) - రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఒకే సమయంలో దీర్ఘకాలిక విపత్తు సంభవించినప్పుడు
స్థాయి - 0 (L0) - ఒక ప్రాంతం సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు
* జాతీయ విపత్తు నిర్వహణ కో ఆర్డినేటర్ - కేంద్ర హోంమంత్రి.

 

జాతీయ విపత్తు నిర్వహణ విధాన నిర్ణయ కమిటీలు (National Level Decision Making bodies for DM) 

 

విపత్తు ఉపశమనం/నోడల్ మంత్రిత్వ నిర్వహణ (Nodel Ministry for Management/Mitigation of Disasters)  

 

జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం (NDRF)
2005 విపత్తు చట్టం సెక్షన్ 44 ప్రకారం 2006లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని ఏర్పాటు చేశారు. ఇది హోంమత్రి నిర్వహణలో ఉంటుంది. దీనికి ఒక డైరెక్టర్ జనరల్ ఉంటాడు. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ (ఐపీఎస్). ప్రస్తుతం దేశంలో మొత్తం 5 దళాల్లో 12 బెటాలియన్లు, ప్రతి బెటాలియన్‌లో 1149 మంది ఉంటారు. ఈ బెటాలియన్లకు ప్రకృతి, రేడియోలాజికల్, న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్ విపత్తులపై బాధ్యత ఉంటుంది. ఇందులో BSF-3, ITBP-2, CRPF-3, CISF-2, SSB-2 ఉంటాయి. 

Posted Date : 15-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వరద విపత్తులు

మాదిరి ప్రశ్నలు

1. బిహార్‌లో ఎక్కువగా ఏ నదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి?
ఎ) సోన్, శారద బి) శారద, కోసి సి) కోసి, గండక్ డి) కోసి, శారద
జ: కోసి, గండక్

 

2. వరదలు ఏ రకమైన విపత్తు?
ఎ) భౌగోళిక బి) నీటి వాతావరణ సంబంధిత సి) ప్రమాద డి) రసాయన
జ: నీటి వాతావరణ సంబంధిత

 

3. వరదలు ఏ రకమైన వైపరీత్యం?
ఎ) సహజ విపత్తు బి) మానవకారక విపత్తు సి) సహజ, మానవకారక విపత్తు డి) ఏదీకాదు
జ: సహజ, మానవకారక విపత్తు

 

4. వరదల విపత్తును కింది ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది?
ఎ) జలవనరుల మంత్రిత్వశాఖ బి) నీటిపారుదల శాఖ సి) గ్రామీణాభివృద్ధి శాఖ డి) ఏదీకాదు
జ: జలవనరుల మంత్రిత్వశాఖ

 

5. 'జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది?
ఎ) ముంబయి బి) కోల్‌కత సి) దిల్లీ డి) బెంగళూరు
జ: కోల్‌కత

 

6. అంతర్జాతీయ వాతావరణ సంస్థ ఎక్కడ ఉంది?
ఎ) జెనీవా బి) మనీలా సి) వాషింగ్టన్ డి) టోక్యో
జ: జెనీవా

 

7. రెడ్‌క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ఎక్కడ ఉంది?
ఎ) వాషింగ్టన్ బి) మలేసియా సి) లండన్ డి) జెనీవా
జ: జెనీవా

 

8. ఎత్తయిన ప్రాంతంలో ఇల్లు నిర్మించుకోవడం ... ?
ఎ) వరద నివారణ చర్య బి) భూకంప నివారణ చర్య సి) కరవు నివారణ చర్య డి) ఏదీకాదు
జ: వరద నివారణ చర్య

 

Posted Date : 15-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప‌ర్యావ‌ర‌ణ ఉద్యమాలు

మాదిరి ప్రశ్నలు

1. తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ఎవరు?
ఎ) జోగు రామన్న బి) అజ్మీరా చందూలాల్ సి) జూపల్లి కృష్ణారావు డి) కొప్పుల ఈశ్వర్
జ: (ఎ)

 

2. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ ఎవరు?
ఎ) బహుగుణ బి) రాజీవ్‌శర్మ సి) అనురాగ్‌శర్మ డి) ఎ.కె.చాందా
జ: (బి)

 

3. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 2014, జులై 6 బి) 2015, జులై 6 సి) 2014, ఆగస్టు 6 డి) 2015, ఆగస్టు 6
జ: (ఎ)

 

4. ప్రాంతీయ సామాజిక ఉద్యమాలు ఏ దశకం నుంచి ప్రారంభమయ్యాయి?
ఎ) 1980 బి) 1990 సి) 2000 డి) 1970
జ: (ఎ)

 

5. తెలంగాణలో యురేనియం నిక్షేపాలున్న జిల్లా ఏది?
ఎ) రంగారెడ్డి బి) మహబూబ్‌నగర్ సి) నల్గొండ డి) మెదక్
జ: (సి)

 

6. 'సిటిజన్స్ ఆగైనిస్ట్ పొల్యూషన్' అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 1986 బి) 1987 సి) 1988 డి) 1989
జ: (ఎ)

 

7. 'ఛత్రీ, గమన, పుకార్, చెలిమి' అనేవి ఏమిటి?
ఎ) వ్యాపార సంస్థలు బి) ప్రకటన సంస్థలు సి) స్వచ్ఛంద సంస్థలు డి) ప్రభుత్వ సంస్థలు
జ: (సి)

 

8. మూసీనది కాలుష్య వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇచ్చిన పర్యావరణవేత్త ఎవరు?
ఎ) బాబా ఆమ్టే బి) మేధా పాట్కర్ సి) రాజేంద్ర సింగ్ డి) బహుగుణ
జ: (బి)

 

9. 2000, జూన్ 24న ఏర్పడిన 'ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్' కన్వీనర్ ఎవరు?
ఎ) ఎం.వేదకుమార్ బి) డాక్టర్ కిషన్‌రావు సి) కె.పురుషోత్తంరెడ్డి డి) రామారావు
జ: (ఎ)

 

10. నల్గొండలో యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమానికి మద్దతునిచ్చిన గిరిజన సమాఖ్య నాయకుడు ఎవరు?
ఎ) రవీంద్రనాయక్ బి) నాగేశ్వర్‌రావు సి) వీరేంద్రనాయక్ డి) ధరేంద్రసింగ్
జ: (ఎ)

 

11. నల్గొండ జిల్లాలో 'యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం' అనే స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 2005 బి) 2006 సి) 2007 డి) 2008
జ: (బి)

 

12. మూసీ నది వెంబడి ఉద్యానవనం అభివృద్ధి చేసేందుకు ప్రారంభించిన ప్రాజెక్టు ఏది?
ఎ) హరితపత్రం బి) నందనవనం సి) మిత్రవనం డి) జలవనమండలి
జ: (బి)

 

13. 2006 నవంబరు 21న హైదరాబాద్‌లో కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు 'హైదరాబాద్ బచావో' అనే నినాదంతో పాదయాత్ర ఎక్కడ నిర్వహించారు?
ఎ) మియాపూర్ నుంచి ఎల్బీనగర్      బి) జూబ్లీహిల్స్ నుంచి ఫలక్‌నుమా
సి) పురానా పూల్ నుంచి అంబర్‌పేట   డి) అంబర్‌పేట నుంచి మలక్‌పేట
జ: (సి)

 

14. 'వాటర్ మెన్ ఆఫ్ ఇండియా, జోహడ్ వాలా బాబా' అనే బిరుదులు ఎవరివి?
ఎ) వందనా శివా బి) సునీతా నారాయణ్ సి) అన్నాహజారే డి) రాజేంద్రసింగ్
జ: (డి)

 

15. టైమ్ మ్యాగజైన్ 'పర్యావరణ హీరో'గా ఎవరిని అభివర్ణించింది?
ఎ) సునీతా బి) అన్నాహజారే సి) వందనాశివ డి) మాధవ్ ప్రియదాస్
జ: (సి)

 

16. 'జలమందిర్ యాత్ర' పేరుతో గుజరాత్‌లో ప్రజలను చైతన్యపరిచిన జానపద గాయకుడు ఎవరు?
ఎ) రామ్‌బియా బి) మాధూరిప్రియ సి) రామ్‌లీలావాలా డి) మనోహర్‌బియా
జ: (ఎ)

Posted Date : 15-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవవైవిధ్యం

 

    ప్రకృతిలో ఎన్నో ప్రత్యేకతలు.. మరెన్నో వైవిధ్యాంశాలు. మొక్కలు, జంతువులు, జీవరాశులు.. లక్షలాది రకాల్లో ఉండే ఇవన్నీ ప్రకృతిలో భాగమే. ఇలాంటి విభిన్న అంశాల జీవ వైవిధ్యం (బయో డైవర్సిటీ) ఎంత ఎక్కువగా ఉంటే పర్యావరణానికి అంత ప్రయోజనకరం. 'ఆధునికీకరణ' ప్రభావంతో జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు బయో డైవర్సిటీకి పెద్దపీట వేస్తున్నాయి. భారతదేశం దీనికి మరింత ప్రాధాన్యం ఇస్తూ అనేక రకాలుగా జీవ వైవిధ్యాన్ని అభివృద్ధి చేసే చర్యలు చేపడుతోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న జీవ వైవిధ్యానికి సంబంధించిన ప్రత్యేక అధ్యయన సమాచారం టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం..
    జీవ సమాజంలోని జీవుల మధ్య ఉండే విభిన్నతను 'జీవ వైవిధ్యం' అంటారు. ఆవరణ వ్యవస్థలకు సంబంధించిన జీవుల సంఖ్య, భిన్నత్వ ం, మార్పు చెందే తత్వాలన్నీ జీవ వైవిధ్యానికి సంబంధించినవే. అందుకే ప్రకృతిని గమనిస్తే విభిన్న రకాల వృక్షాలు, జంతువులు, జీవులు కనిపిస్తాయి.

 

జీవ వైవిధ్య స్థాయులు

జీవ వైవిధ్య క్రమానుగత స్థాయి ప్రకారం ప్రధానంగా 3 రకాలు. అవి..
1. జన్యుపర జీవ వైవిధ్యం (జెనిటిక్ బయోడైవర్సిటీ)
2. జాతిపర జీవవైవిధ్యం (స్పీసిస్ బయోడైవర్సిటీ)
3. ఆవరణ వ్యవస్థల జీవవైవిధ్యం (ఇకో సిస్టమ్ బయోడైవర్సిటీ)

 

జన్యుపర జీవవైవిధ్యం

    ఇది ఒక జాతిలో ఉండే జీవవైవిధ్యం. అంటే ఒకే జాతికి చెందిన జీవుల మధ్య ఉన్న విభిన్నతలకు సంబంధించింది. జీవుల జీవకణాల్లోని క్రోమోజోముల్లోని జన్యువులు ఆ జీవి వ్యక్తిగత లక్షణాలను నిర్ధారిస్తాయి.
ఉదా: జన్యుపర జీవవైవిధ్యం కారణంగా కొందరు సన్నగా, లావుగా, పొడవుగా, పొట్టిగా, తెల్లటి చర్మంతో, వివిధ రంగుల్లో ఉండటం; ఒకే జాతికి చెందిన కుక్కలు, పిల్లులూ, పుష్పాలు మొదలైనవి.

 

జాతిపర జీవ వైవిధ్యం

    శాస్త్ర, సాంకేతిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించినా, నేటికీ భూగోళంపై కచ్చితంగా ఎన్ని జాతులకు చెందిన జీవులున్నాయో ఎవరికీ తెలియదు.
* భూమ్మీద 10-14 మిలియన్ల జాతులు/ జీవులున్నట్లు అంచనా. ఇవి చాలావరకు కీటకాలు, సూక్ష్మజీవులే.

ఆవరణ వ్యవస్థల జీవ వైవిధ్యం

    దీనిలో ఒక భౌగోళిక ప్రాంతంలోని అరణ్యాలు, పచ్చిక బయళ్లు, ఎడారులు లాంటి భౌమావరణ వ్యవస్థలు; నదులు, సరస్సులు, నదీ ముఖద్వారాలు, తీర ప్రాంతాలు, మహా సముద్ర ప్రాంతాలు లాంటి జలావరణానికి చెందిన విభిన్న ఆవాసాలకు సంబంధించిన జీవ వైవిధ్యం ఉంటుంది. ఇందులో శీతోష్ణస్థితి ప్రముఖ పాత్ర వహిస్తుంది.
ఉదా: భూమధ్యరేఖ వర్షారణ్యంలో జీవ వైవిధ్యం అధికస్థాయిలో ఉండగా, అందుకు భిన్నంగా ఉష్ణ ఎడారులు, ధ్రువ ప్రాంతాల్లో చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది.
* ఆహారం, నివాసం, ఆరోగ్యం కోసం అనాదిగా మానవులు భూగోళపు జీవ వైవిధ్యంపై ఆధారపడుతున్నారు.

 

కాలుష్య ప్రభావం

    జీవ వైవిధ్యం సహజ, వ్యవసాయ వ్యవస్థల ఉత్పాదకతలను పెంపొందిస్తుంది. ఆధునిక నాగరకత ఫలితంగా ఉత్పన్నమవుతున్న కాలుష్యం మానవుడు నివసిస్తున్న ప్రాంతాలన్నింటిలోని జీవ వైవిధ్యంపై అనేక రకాల వ్యతిరేక ప్రభావాలను చూపుతోంది.
ఉదా: అటవీ ప్రాంతాలను పంట భూములు, రహదారులు, క్వారీలు, గనులుగా మారుస్తున్నారు.

 

జీవావరణ సమతౌల్యం

    ఒక జీవ సంఘంలో కాలానుగుణంగా జీవావరణం ద్వారా క్రమంగా సంభవించే మార్పులుంటాయి. ఇవి మినహా జన్యుపరమైన.. జాతులు, ఆవరణ వ్యవస్థల మధ్య ఉండే జీవ వైవిధ్యం స్థిరంగా ఉండి, అది సహజసిద్ధమైన క్రియాశీల సమతాస్థితిలో ఉంటే, అలాంటి స్థితిని జీవావరణ సమతౌల్యం అంటారు.
* ఈ సమతౌల్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో శీతోష్ణస్థితిలో వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ ప్రభావం మరీ ముఖ్యమైంది.
* భూకంపాలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరగడం, హిమ సంపాతాలు, వరదలు, కరవు కాటకాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఆయా ప్రభావిత ప్రాంతాల్లో జీవావరణ సమతౌల్యాన్ని ప్రభావితం చేస్తాయి.
* జీవావరణ సమతౌల్య పరిరక్షణ కోసం అనుసరణీయ, దీర్ఘకాలిక, శాస్త్రీయ అవలోకనంతో వెంటనే చర్యలు చేపట్టాలి.

 

జాతిపర జీవ వైవిధ్యంలో మ్యాపింగ్

    బ్రిట్స్, పాల్ విలియమ్స్, డికీయిర్‌రైట్, చారిస్ హంప్ రేజర్ శాస్త్రవేత్తలు ప్రపంచంలో జీవవైవిధ్య పటాలను మొదటిసారి తయారు చేశారు. వీరు జీవ వైవిధ్య మ్యాప్‌లో 'వరల్డ్ మ్యాప్‌'ను అభివృద్ధి చేశారు. దీనిలో మూడు రకాలున్నాయి.
 

1. ఆల్ఫా పటాలు (ఆల్ఫా మ్యాప్స్)

    ఇందులో ప్రత్యేక ప్రాంతాల్లో మొత్తం జాతిపర సంఖ్యలను పొందుపరిచి, విశ్లేషణాత్మకమైన వివిధ ప్రాంతాల్లో జీవ వైవిధ్య అధ్యయన పటాల్లో గుర్తించారు.
 

2. బీటా పటాలు (బీటా మ్యాప్స్)

    ఇందులో జీవ వైవిధ్య నిర్మాణాలు, జాతిపర నిర్మాణాలు, పోలికలు, సంఘాలు, కొలతలు, ఆవరణ సమతౌల్యంలో జాతిపర మార్పులను ఈ పటాల్లో గుర్తించారు.
 

3. గామా పటాలు (గామా మ్యాప్స్)

    ఇందులో భౌగోళిక ప్రాంతాల్లో జాతిపర మార్పుల గణాంకాలు, వాటికి అయిన ఖర్చుల్లాంటి వివరాలను ఈ పటాల్లో పొందుపరిచారు.
 

తడి భూభాగాలు (వెట్ ల్యాండ్స్)

    భూమి ఉపరితలంపై నీటితో ఉన్న ప్రాంతాల్లో ఆవరణ వ్యవస్థలను సంరక్షించడానికి, వివిధ జీవులను, వృక్షాలను, నేలలను, వన్య ప్రాణులను కాపాడటానికి ఈ ప్రాంతాలు ఉపయోగపడతాయి.
రామ్‌సర్ సమావేశం (రామ్‌సర్ కన్వెన్షన్): ఇరాన్‌లో 1971, ఫిబ్రవరి 2న అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యత్వం ఉన్న దేశాలు రామ్‌సర్ ఒప్పందంపై సంతకం చేశాయి. 1975, డిసెంబరు 21న ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కొన్ని తడి ప్రాంతాలను గుర్తించారు. (వివరాలను పట్టిక-1లో చూడండి.)

వన్యమృగ సంరక్షణపై అంతర్జాతీయ సమావేశం

    ప్రపంచంలో జరిగిన 5 ప్రధాన అంతర్జాతీయ వన్యప్రాణి సమావేశాల్లో భారత్ పాల్గొంది. మనదేశంలో పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.
* అంతర్జాతీయ వ్యాపార అటవీ వృక్ష జాతులు (Flora), జంతు జాతులు (Fauna) సమావేశంలో 1976, జులై 20న భారతదేశం సంతకం చేసింది.
* మానవ, జీవావరణ కార్యక్రమాన్ని (ఎంఏబీ- మ్యాన్ అండ్ బయోడైవర్సిటీ) యునెస్కో 1971లో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో 2012 నాటికి 117 దేశాల్లో 598 బయోస్ఫియర్ సంస్థలు సభ్యత్వం తీసుకున్నాయి.
* జీవవైవిధ్య సమావేశం 1992, జూన్ 5న రియో డీ జెనీరోలో జరిగింది.

 

భారతదేశంలో జీవవైవిధ్యం

    ప్రపంచంలో భారతదేశం 12వ మెగా జీవవైవిధ్య దేశం. మన దేశం ప్రపంచంలో 2.5 శాతం భౌగోళిక వైశాల్యం కలిగి ఉంది. ప్రపంచంలో 7.8 శాతం జాతిపర వైవిధ్యం భారత్ సొంతం. ఇదో రికార్డు. ప్రపంచంలో ఇండో-మళాయన్ అత్యంత విస్తీరణ ప్రాంతం.
* మన దేశంలో వృక్ష సంబంధ జాతులు 46,000 ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 7 శాతం. ఇందులో 33 శాతం వ్యాధుల బారిన పడుతున్నాయి.
* మన దేశంలో సుమారు 15,000 రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 6 శాతం. ఇందులో 1500 రకాలు జాతిపర వ్యాధుల బారిన పడుతున్నాయి.
* దేశంలో సుమారు 81,000 జంతుపర జాతులున్నాయి. ప్రపంచ జంతు సంపదలో ఇది 6.5 శాతం. (జంతు జాతుల వివరాలకు పట్టిక-2 చూడండి.)


* భారత్ 1972లో వన్య మృగ సంరక్షణ చట్టాన్ని చేసింది. అంతకు ముందు 5 జాతీయ హోదా కలిగిన పార్కులు ఉండేవి.
* వన్యమృగ సంరక్షణ సవరణ చట్టాన్ని 2006లో చేశారు. అదే ఏడాది సెప్టెంబరు 4 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా జాతీయ పులుల అటవీ అథారిటీ, వన్యమృగ క్రైమ్ కంట్రోల్ బ్యూరోలను ఏర్పాటు చేశారు.

 

జాతీయ వన్యమృగ ఆచరణ ప్రణాళిక

    జాతీయ వన్యమృగ బోర్డును 1982లో కేంద్రం ఏర్పాటు చేసింది. మొదటి జాతీయ వన్యమృగ ఆచరణ ప్రణాళికను 1983లో ప్రారంభించారు.
 

జాతీయ జీవ వైవిధ్య చట్టం

    ఈ చట్టాన్ని 2002లో చేశారు. 2003, అక్టోబరు 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కిందకు
1. జాతీయ జీవ వైవిధ్య అథారిటీ (ఎన్‌బీఏ),
2. జాతీయ జీవ వైవిధ్య బోర్డ్(ఎస్‌బీబీ),
3. జీవ వైవిధ్య నిర్వహణ కమిటీ (బీఎంసీ) వస్తాయి. జాతీయ జీవ వైవిధ్య అథారిటీ సంస్థను చట్టబద్ధ హోదాతో చెన్నై (2003)లో ఏర్పాటు చేశారు. భారత్‌లోని పలు జీవ వైవిధ్య సంస్థల వివరాలివి..

* వన్యమృగ సంస్థ - 1996లో డెహ్రాడూన్‌లో ఏర్పాటు.
* భారత వన్యమృగ బోర్డు - 2001 డిసెంబరు 7న పునర్‌నిర్మాణం
* జంతు సంక్షేమ డివిజన్లు - 2002 జులై నుంచి అమలు
* జంతు సంక్షేమ జాతీయ సంస్థ (ఎన్ఐఏడబ్ల్యూ) - ఫరీదాబాద్ (1960 చట్టం ప్రకారం ఏర్పడింది)
* బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా - 1890 ఫిబ్రవరి 13న స్థాపించారు
* జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - 1916 (కోల్‌కతా)లో ఏర్పాటు

 

భారతదేశంలో జీవ వైవిధ్య సంరక్షణలు

1. ఎలిఫెంట్ ప్రాజెక్టు: 1992 ఫిబ్రవరిలో ఎలిఫెంట్ ప్రాజెక్టును స్థాపించారు. దేశంలో ప్రస్తుతం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సుమారు 32 ఎలిఫెంట్ ప్రాజెక్టులున్నాయి. ఇవి ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ఉన్నాయి. (భారత్‌లోని ఎలిఫెంట్ ప్రాజెక్టు / రిజర్వ్ వివరాలు పట్టిక-3లో చూడండి.)

టైగర్ ప్రాజెక్టు

భారత ప్రభుత్వం 1973, ఏప్రిల్ 1న పులుల (టైగర్ రిజర్వ్) ప్రాజెక్టును ప్రారంభించింది. దేశంలో మొదటి ప్రాజెక్టు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. (మన దేశంలోని టైగర్ రిజర్వ్ ప్రాంతాల వివరాలు పట్టిక-4లో చూడండి.)

బయోస్ఫియర్ రిజర్వ్

    ప్రాదేశిక, తీర ప్రాంత ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటానికి యునెస్కో చట్రం కింద మానవ, జీవావరణ కార్యక్రమంలో భాగంగా మనదేశంలో 1986లో బయోస్ఫియర్‌ను స్థాపించారు. దేశంలో మొదటి బయోస్ఫియర్ నీలగిరి. ప్రస్తుతం దేశంలో 18 బయోస్ఫియర్ రిజర్వ్‌లున్నాయి. వీటిలో 9 ప్రపంచ బయోస్ఫియర్ నెట్‌వర్క్‌లో ఉన్నాయి. దేశంలోని 7 బయోస్ఫియర్‌లను యునెస్కో దత్తత తీసుకుంది. (భారతదేశంలోని బయోస్ఫియర్ రిజర్వ్‌ల వివరాలు పట్టిక-5లో చూడవచ్చు.)

మెరైన్ నేషనల్ పార్క్‌లు

    మన దేశంలో 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గుజరాత్ ప్రభుత్వం అటవీశాఖ ఆధ్వర్యంలో గల్ఫ్ ఆఫ్ కచ్‌లో; జామ్‌నగర్ జిల్లా ఓకా, జోదియాల వద్ద 1982లో 270 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో మెరైన్ నేషనల్ పార్కు ప్రారంభించింది. ఇది దేశంలోనే మొదటి జాతీయ మెరైన్ పార్కు.
    దేశంలో ప్రధాన ప్రవాళభిత్తిక (కోరల్ రీఫ్) కోసం గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ అఖాతం, గల్ఫ్ ఆఫ్ కచ్, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో ఏర్పాటు చేశారు. వివరాలివి..
1. పాక్ అఖాతం - తమిళనాడు (రామేశ్వరం)
2. గల్ఫ్ ఆఫ్ మన్నార్ - తమిళనాడు (ట్యూటికోరిన్)
3. అండమాన్, నికోబార్ - బంగాళాఖాతం
4. గల్ఫ్ ఆఫ్ కచ్ - గుజరాత్
5. లక్షద్వీప్ - అరేబియా సముద్రం

 

భారతదేశంలోని ప్రవాళ భిత్తికల పరిశోధనా సంస్థలు

    డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్‌మెంట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్- అహ్మదాబాద్
జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - కోల్‌కతా
కేంద్ర మెరైన్ ఫిషరీస్ పరిశోధన సంస్థ - మదురై
సెంటర్ ఫర్ ఎర్త్ స్టడీస్ - త్రివేండ్రం
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ - గోవా

 

Posted Date : 15-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కరవులు - వరదలు

           

ప్రస్తుత ప్రపంచంలో జనాభా విస్ఫోటనం, వన నిర్మూలన, మానవ జీవ వ్యర్థాలు, అధిక పరిశ్రమల వ్యర్థాల వల్ల కార్బన్ల సంఖ్య అధికమై పర్యావరణం క్షీణించి అనేక ఖండాలు, దేశాల్లో భూతాపం పెరిగి కరవులు, వరదలు సంభవిస్తున్నాయి. ప్రత్యేకంగా పశ్చిమ పసిఫిక్‌లో ఎల్‌నినో, లానినో పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా అధిక కరవు కాటకాలు, వరదలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా వివిధ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పోటీ పరీక్షల్లో విపత్తు నిర్వహణ - పర్యావరణ అంశాలపై ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు.


కరవు ఎలా వస్తుంది?
            కరవు అనేది వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం. ఒక ప్రాంతంలో కురవాల్సినంతగా వర్షం కురవకపోతే ఆ ప్రాంతం పొడిగా మారుతుంది. దాన్నే కరవు అంటారు. కరవును క్షామం, అనావృష్టి అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో అవి ఉన్న భౌగోళిక స్థితుల వల్ల తక్కువ వర్షపాతం పడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నప్పుడు వాటిని 'కరవు పీడిత ప్రాంతాలు' అంటారు.
ఉదా: తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ప్రతి అయిదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరవు ఏర్పడే అవకాశం ఉంది.
* ఒక ప్రాంతంలో అధిక లేదా అల్ప వర్షపాతాన్ని (70 - 100 సంవత్సరాల) సగటు సాధారణ వర్షపాతంతో పోల్చి కింది విధంగా చెబుతారు.
a) అధిక: + సగటు వర్షపాతం కంటే 20% ఎక్కువ.
b) సాధారణ: + సగటు వర్షపాతం కంటే 19% ఎక్కువ నుంచి 19% తక్కువ.
c) అల్ప: - సగటు వర్షపాతం కంటే 20% నుంచి 59% తక్కువ.
d) అత్యల్ప: - సగటు వర్షపాతం కంటే 60% తక్కువ.
* జాతీయ వ్యవసాయ కమిషన్ (National Commission for Agriculture) కరవును మూడు రకాలుగా పేర్కొంది.
a) వాతావరణ కరవు: ఈ రకమైన కరవు సాధారణ అవపాతంలో (వర్షం) 10% కంటే ఎక్కువ అవపాతం లోపించడం.
b) వ్యవసాయ కరవు: మృత్తికల్లో తేమ లోపించడం, నేలలు సరిగా లేకపోవడం.
c) జల సంబంధ కరవు: భూగర్భ జలాలు ఇంకిపోవడం, మృత్తికలు అంతర్ భౌమ జలాలను గ్రహించకపోవడం.

* 2016 డిసెంబరు జాతీయ కరవు నిర్వహణ కరదీపిక (Manual of Drought Management) లో కరవును నాలుగు రకాలుగా పేర్కొన్నారు.
a) 750 mm కంటే తక్కువ వర్షం - దీర్ఘకాలిక కరవు - 33%
b) 750 mm - 1125 mm మధ్య వర్షం - కరవు పీడిత ప్రాంతం - 35%
c) 1126 mm - 2000 mm అధిక వర్షం - సాధారణ కరవు - 24%
d) 2000 mm కంటే అధిక వర్షం - కరవులేని ప్రాంతం - 8% గా దేశభౌగోళిక వైశాల్యంలో కలిగి ఉంది.
* భారత వాతావరణ శాఖ (IMD) న్యూదిల్లీ కరవును 5 రకాలుగా వర్గీకరించింది. భారతదేశభౌగోళిక వైశాల్యంలో 68% కరవులు సంభవిస్తున్నాయి.

 

కరవు ప్రభావం
కరవు సంభవించిన ప్రాంతాల్లో దాని ప్రభావం క్రమేణ తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.
* భూగర్భ జల నీటి మట్టం పడిపోవడం, తాగు నీటి కొరత.
* పంటల విస్తీర్ణం తగ్గడం, వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గిపోవడం.
* ఆహార ధాన్యాల, పశుగ్రాస కొరత; పశువులు చనిపోవడం.
* పోషకాహార లోపం ప్రత్యేకించి చిన్న పిల్లల్లో అతిసారం, కలరా లాంటి రోగాలు; ఆహార కొరత వల్ల కంటి చూపు దెబ్బతినడం, పని కోసం ప్రజలు వలస వెళ్లడం.

 

కరవు నివారణ, దాన్ని ఎదుర్కోవడం
* కరవు ఒక్కసారిగా సంభవించే ప్రమాదం కాదు. అది నిదానంగా వస్తుంది. దీన్నే Creeping Disaster అంటారు.

* మన దేశంలో ఇప్పటివరకు 25 ప్రధాన కరవులు సంభవించాయి.
* బెంగాల్ కరవు వల్ల 1770లో మొత్తం జనాభాలో 33% ( 1/3వ వంతు) మంది మరణించారు.
* 1943 - 44లో మన దేశంలో 3 - 4 మిలియన్ల మంది ప్రజలు కరవు బారిన పడ్డారు.
* మన దేశంలో తరచూ రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరవులు ఏర్పడతాయి.
* కరవును నివారించడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక అధికారులు నీటి సంరక్షణ విధానాలపై అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు.
* వర్షపు నీటిని ఇంకుడు గుంతల్లోకి మళ్లించడం ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చు.
* కరవు ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం సమగ్ర వాటర్‌షెడ్ యాజమాన్య పథకాలను (IWMP) అమలు చేస్తుంది.

 

వరదలు (Floods)
ఒక ప్రాంతంలో కొంతకాలం పొడిగా ఉండి అకస్మాత్తుగా అధిక వర్షాలతో ఆ ప్రాంతం పొంగి పొర్లడాన్ని వరదలు అంటారు. అంటే కురవాల్సిన వర్షం కంటే అధిక వర్షం రావడాన్ని 'వరద బీభత్సం' లేదా 'అతివృష్టి' అంటారు.
సాధారణంగా వాతావరణ శాఖ (IMD) ప్రకారం భూ ఉపరితలంపై 12 అంగుళాల వర్షం కురిసినప్పుడు వరదగా ప్రకటిస్తారు.

 

ప్రధానంగా వరదలు అనేవి
a) అధిక వర్షం కురిసే మైదాన ప్రాంతాల్లో

b) పర్వత వాలు ప్రదేశాల్లో
c) నదీ వక్రత, తీర ప్రాంతాల్లో
d) పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.
* ప్రకృతి విపత్తుల్లో వరదలు అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి ఆయా దేశాలను అకస్మాత్తుగా ముంచేస్తాయి. ఇవి ఆరు అంగుళాల వరదలో మనిషిని ప్రమాదంలోకి నెట్టి వేస్తాయి.
* ప్రపంచంలో ఎక్కువగా వరదలు ఆసియా తూర్పు దేశాల్లో (80%) సంభవిస్తున్నాయి.
* వరదల నుంచి కాపాడటానికి ఆయా ప్రాంత ప్రజలను హెచ్చరించేందుకు 'నైలో మీటర్' సాధనాన్ని ఉపయోగిస్తారు.
* గ్రామీణ ప్రాంతంలోని మైదాన వరదల కంటే పట్టణ ప్రాంతంలోని వరదలు వైశాల్యంలో 6 రెట్లు, ఎత్తులో 8 రెట్లు ఎక్కువగా వస్తాయి. కారణం పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీ సరిగా లేకపోవడం, ఇరుకు రోడ్లు, భూమి నీటిని పీల్చుకోకపోవడం.

 

భారతదేశం - వరదలు

మన దేశంలో వరదలు ప్రధానంగా అతిపెద్ద నదులైన గంగా - సింధూ - బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థల్లో వస్తున్నాయి. వాటిలో ఆకస్మిక వరదలు ఎక్కువగా బ్రహ్మపుత్ర నది వల్ల సంభవిస్తున్నాయి.
A) ఉత్తర భారతదేశంలో 60% వరదలు గంగా - బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థల వల్ల సంభవిస్తున్నాయి.

గంగా నది  దాని ఉపనది ప్రాంతాలైన ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, బెంగాల్‌లో అత్యధిక భౌగోళిక వైశాల్యం వరద ప్రమాదంలో ఉంది. అలాగే గంగా - బ్రహ్మపుత్ర నదుల వల్ల తరచుగా అసోం, బెంగాల్, ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్‌లో వరదలు వస్తున్నాయి.
ఉదా: 2013 జూన్ 17 నాటి ఉత్తరాఖండ్ వరదల వల్ల సుమారు 5 వేల మంది మరణించారు.
2016 సెప్టెంబరు 3 - 6 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జీలం నది వరద వల్ల 300 మంది మరణించారు.
B) ద్వీపకల్ప భారత్‌లో 40% వరదలు స్థానిక నదుల వల్ల వస్తున్నాయి. దక్షిణ భారత్‌లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఎక్కువగా వరదలు వస్తాయి.
ఉదా: 2009లో తుంగభద్ర నది వల్ల కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన వరదలు వచ్చాయి.
మన దేశంలో సగటున ప్రతి సంవత్సరం 7.5 మిలియన్ హెక్టార్లలో వరదలు వస్తున్నట్లు జాతీయ వరద కమిషన్ పేర్కొంది. దేశ  భౌగోళిక వైశాల్యంలో 40 మిలియన్ హెక్టార్ల భూభాగంలో వరద ప్రమాదం ఉన్నట్లు గుర్తించింది.  జాతీయ విపత్తు వరద అంచనా ప్రకారం భౌగోళిక ప్రాంతంలో 12% వరదలు వస్తున్నట్లు పేర్కొంది. 2016 UNISDR ప్రకారం ప్రతి సంవత్సరం 5% వరదలను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నట్లు, విపత్తులకు ఖర్చు చేసే వ్యయంలో కేవలం వరదలకే 33% వెచ్చిస్తున్నట్లు అంచనా వేసింది.

 

వరదలు - నివారణ చర్యలు
* 1937లో బ్రిటిష్‌వారు వరదలను నివారించడానికి ఒక సివిల్ సర్వెంట్ ద్వారా 'ఫ్లడ్ రిలీఫ్ కమిషన్‌'ను ఏర్పాటు చేసి నివారణ చర్యలు చేపట్టేవారు.

* 1954లో 'జాతీయ వరద నియంత్రణ మండలి'ని (National Flood Control Board - NFCB) ఏర్పాటు చేశారు.
* 1980లో జాతీయ వరద కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* 2010లో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీని NDMA మార్గదర్శకాల ప్రకారం పట్టణ వరద విపత్తు నివారణ (UFDM)ను రూపొందించారు.
* వరదలు వస్తున్నట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) హెచ్చరిస్తుంది.
* ప్రతి సంవత్సరం వరదల వల్ల 8.1 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమి, 3.6 మిలియన్ హెక్టార్ల పంటలు నష్టపోతున్నాయి.
* వరదలను నివారించడానికి 2007-12 మధ్య 11వ ప్రణాళికలో రూ.8 వేల కోట్లను కేటాయించారు.


వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

a) మరిగించిన నీటిని తాగాలి.
b) డయేరియా ప్రబలినప్పుడు టీ - డికాషన్లు, గంజి, లేతకొబ్బరి నీరు తీసుకోవాలి.
c) వ్యాధులు వ్యాప్తి చెందకుండా చుట్టుపక్కల బ్లీచింగ్ పౌడర్ చల్లాలి.
d) నీటిని శుద్ధి చేయడానికి హాలోజన్ (Halogen) బిళ్లలు ఉపయోగించాలి.

 

Posted Date : 15-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తు నిర్వహణ చట్టం - 2005

1. పారిశ్రామిక రసాయన విపత్తులు ఏ నోడల్ మంత్రి నిర్వహణలో ఉంటాయి?
జ: పర్యావరణ, అటవీ మంత్రి

 

2. ఆసియా విపత్తుల ప్రతిస్పందన సంస్థ ఎక్కడ ఉంది?
జ: బ్యాంకాక్

 

3. NDRF 10వ బెటాలియన్ ఎక్కడ ఉంది?
జ: విజయవాడ

 

4. విపత్తుల్లో జిల్లా ప్రణాళిక విపత్తు అభివృద్ధి స్థాయి
జ: L1

 

5. 2015, సెప్టెంబరు 25న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సదస్సు (SDG)ను ఎక్కడ నిర్వహించారు?
జ: న్యూయార్క్

 

6. 2015 - 2030 వరకు జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక విపత్తు కుదింపులో ఎన్ని లక్ష్యాలను పేర్కొంది?
జ: 14

 

7. కిందివారిలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీలో (NDMA) సభ్యులు కానివారు?
    1) జె.సి. పంత్      2) డి.ఎన్. శర్మ   3) ఎన్.సి మర్వా  4) కమల్ కిశోర్
జ: 1 (జె.సి. పంత్)

 

8. NRSA భూతల కేంద్రం (ఎర్త్ స్టేషన్) ఎక్కడ ఉంది?
జ: షాద్‌నగర్

 

9. ఇటీవల 2015 అంతర్జాతీయ (UNO) విపత్తు కుదింపు సదస్సు ఎక్కడ జరిగింది?
జ: జపాన్ - సెండాయ్

 

10. ఇటీవల విపత్తు నిర్వహణలో నూతనంగా ఏర్పాటు చేసిన NDRF దళం
జ: SSB

 

11. జాతీయ నిర్వహణ విపత్తు కమిటీ ఛైర్మన్
జ: హోంశాఖ కార్యదర్శి

 

12. జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ ఛైర్మన్
జ: క్యాబినేట్ కార్యదర్శి

 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భారతదేశంలో ఎన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు విపత్తులను ఎదుర్కొంటున్నాయి? (2011, గ్రూప్ 1)
జ: 25


2. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఎక్స్ అఫీషియో ఛైర్మన్? (2011, గ్రూప్ 2)
జ: ప్రధానమంత్రి


3. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) ఎవరి నిర్వహణలో ఉంటుంది? (2016, గ్రూప్ 2)
జ: హోంమంత్రి


4. జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (NDMP)ను ప్రధాని ఎప్పుడు విడుదల చేశారు? (2016 డిప్యూటీ సర్వేయర్)
జ: 2016, జూన్ 1


5. సార్క్ విపత్తు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (2012, గ్రూప్ 4)
జ: కాఠ్‌మాండూ


6. నేషనల్ సివిల్ డిఫెన్స్ సర్వీస్ కాలేజ్ ఎక్కడ ఉంది? (2012, గ్రూప్ 4; 2013, పంచాయతీ సెక్రటరీ)
జ: నాగ్‌పుర్


7. జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? (2011, గ్రూప్ 1)
జ: 2005, డిసెంబరు 23

Posted Date : 15-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప‌ర్యావ‌ర‌ణ ఉద్యమాలు

   పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యాలుగా తెలంగాణలో పలు సామాజిక ఉద్యమాలు జరిగాయి. వీటిలో నల్గొండ జిల్లాలో యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా.. రాజధాని నగరంలో మూసీ నది ప్రక్షాళన దిశగా నిర్వహించిన ఉద్యమాలు ప్రధానమైనవి. స్థానికుల నుంచి వ్యక్తమైన నిరసనలు ఉద్యమాలుగా మారాయి. వీటికి పలు సంస్థలు,
ప్రముఖుల నుంచి మద్దతు లభించడంతో కొంతమేర విజయవంతమయ్యాయి. ఈ ఉద్యమాల వివరాలు తెలుసుకుందాం..
   మన దేశంలో పర్యావరణ ఉద్యమాలు గ్రామస్థాయి నుంచి 1970లలోనే ప్రారంభమయ్యాయి. 1980వ దశకం నుంచి తెలంగాణలో సామాజిక ఉద్యమాలు మొదలయ్యాయి. 1990వ దశకం నుంచి ఉద్యమాలు తీవ్రమయ్యాయి. ప్రపంచీకరణ, నయా ఉదారవాదం పేర్లతో చోటు చేసుకున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పర్యావరణ ఉద్యమాలు ఊపందుకున్నాయి. ప్రాంతీయంగా కూడా పర్యావరణం, మానవ హక్కుల పరిరక్షణ దిశగా సాగిన సామాజిక ఉద్యమాలు అనేక అంశాలను లేవనెత్తాయి. ఇలాంటి ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా.. ఒక ఆశయం కోసం పనిచేస్తాయి. ప్రజాస్వామిక విధానాల్లోనే కార్యక్రమాలను రూపొందిస్తాయి.

 

యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం

భారత యురేనియం సంస్థ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ - యూసీఐఎల్) తెలంగాణలో నల్గొండ జిల్లా నాగార్జున జలాశయం సమీపంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు గుర్తించింది. దీని సమీప గ్రామాల్లో సుమారు 1303 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు యూసీఐఎల్ నిర్ధారించింది. 2001 ఫిబ్రవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం మైనింగ్, శుద్ధి కర్మాగారాన్ని స్థాపించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించింది.
* 2002 సెప్టెంబరులో నల్గొండ జిల్లాలోని పెద్దగట్టు, లంభాపురం గ్రామాల్లో యురేనియం గనుల తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద 795 ఎకరాల్లో సుమారు రూ.315 కోట్లతో దాదాపు 20 ఏళ్ల వరకు తవ్వకాలు చేయడానికి నిర్దేశించింది. అనుమతుల అనంతరం నమూనాల కోసం తవ్వకాలను ప్రారంభించడంతో అప్పట్లో స్థానికులు దీన్ని వ్యతిరేకించారు.
* 2005లో దేవరకొండ పరిధిలో యురేనియం తవ్వకాలకు ప్రయత్నించగా అక్కడి స్థానికుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో తవ్వకాలను నిలిపివేశారు. 2006లో 'యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం' అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పెద్దఎత్తున స్థానికులు ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమానికి గిరిజన సమాఖ్య అధ్యక్షుడు రవీంద్రనాయక్ మద్దతు తెలిపారు. పర్యావరణవేత్తలు, జన విజ్ఞాన వేదిక, పౌరహక్కుల సంఘం నాయకులు కూడా మద్దతిచ్చారు.
* 2007లో లంభాపురం, పెద్దగట్టు, శేరుపల్లి, చిట్రియాల, పెద్దమూల, కాచరాజుపల్లి గుట్టల్లోని అటవీ ప్రాంతంలో దేశ రక్షణ, అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే యురేనియం నిక్షేపాలున్నట్లు యురేనియం సంస్థ పరిశోధనలో తేలింది. దీంతో 2007లో మళ్లీ యురేనియం శుద్ధి కర్మాగార నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులను అక్కడి స్థానికులు పెద్దఎత్తున అడ్డుకున్నారు. ప్రజలకు మద్దతుగా 20 స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఇది చివరికి ప్రజా ఉద్యమంగా మారి నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనుకంజ వేసి పనులను వాయిదా వేసింది.

 

మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమం

   1980వ దశకం నుంచి హైదరాబాద్ నగర శివార్లలో పారిశ్రామిక ప్రాంతాలు విస్తరించాయి. దీంతో పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలన్నీ మూసీ నదిలో కలవడం వల్ల అది ఒక మురికి కాలువగా మారింది. వాస్తవంగా.. మూసీ నది హైదరాబాద్ మీదుగా ప్రవహిస్తుండటం వల్ల నగర ప్రజల తాగునీటి అవసరాలకు ఉద్దేశించి దీని ఉపనదిపై హుస్సేన్‌సాగర్ సరస్సును పూర్వకాలంలో నిర్మించారు. అయితే కాలక్రమేణా ఈ నీరు కలుషితమైంది. హుస్సేన్‌సాగర్‌లో ప్రతిరోజూ జంట నగరాల నుంచి 350 మిలియన్ లీటర్ల మురికినీరు, పారిశ్రామిక వ్యర్థ పదార్ధాలు కలుస్తున్నట్లు గత పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో 1986లో డాక్టర్ కిషన్‌రావు, కె.పురుషోత్తమ్‌రెడ్డిల ఆధ్వర్యంలో 'సిటిజన్స్ ఆగైనిస్ట్ పొల్యూషన్' అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి స్థానిక ప్రజలను కూడగట్టారు. ఇతర పర్యావరణ సంఘాలతో కలిసి మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు. నదీ పరీవాహక ప్రాంత ప్రజల జీవించేహక్కును కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1988లో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఫలితంగా కొన్ని పరిష్కారాలను కనుక్కున్నారు. 1989లో హానికరమైన వ్యర్థపదార్ధాల నిర్వహణ, నిల్వ, పరిష్కారాల కోసం 'హానికరమైన వ్యర్థపదార్థాల' నియమావళిని ప్రభుత్వం రూపొందించింది. ఈమేరకు ఉద్యమం కొంత విజయం సాధించింది.
* 2000లో మూసీ నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీట్ కాలువ ద్వారా ప్రవహింపజేసి.. నదీ జలాల ప్రాంతాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించి తెలుగుదేశం ప్రభుత్వం 'నందనవనం' అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది సమీపంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించింది. దీంతో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 'మూసీ బచావో ఆందోళన్' అనే నినాదంతో స్థానిక సామాజిక సంస్థలు ఉద్యమం చేపట్టాయి. దీనికి పర్యావరణవేత్త మేధా పాట్కర్ మద్దతు ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది.

* 2000, జూన్ 24న 'ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్' అనే సంస్థను ప్రారంభించారు. ఈ ఫోరమ్ కన్వీనర్ ఎం.వేదకుమార్ ఆధ్వర్యంలో 'హైదరాబాద్ బచావో' అనే పర్యావరణ ఉద్యమం మొదలైంది. 2006, నవంబరు 21న కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు పురానా పూల్ వంతెన నుంచి అంబర్‌పేట వరకు పాదయాత్ర చేపట్టారు. వీరితో పాటు నగరంలోని ఛత్రీ, గమన అనే రెండు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి.


* 2007లో మూసీనదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ జలమండలి మూసీ నది పొడవునా దశలవారీగా మురుగు శుద్ధి, ప్రక్షాళన పనులను చేపట్టడానికి 10 సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను సిద్ధం చేసింది. అయితే వీటివల్ల అక్కడి జనావాసాలకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయని 'సేవ్ మూసీ రివర్ క్యాంపైన్' పేరుతో స్థానిక పర్యావరణ సెల్ 2009, జూన్ 2న ఉద్యమం ప్రారంభించింది. ఈ ఉద్యమానికి మద్దతుగా సేవ్ లేక్స్ సొసైటీ, సేవ్ రాక్స్ సొసైటీ, అక్షర, ప్రజా చైతన్య వేదిక, పుకార్, చెలిమి ఫౌండేషన్, హెరిటేజ్ వాచ్ లాంటి పర్యావరణ సంఘాలు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరిచాయి.
* 2009 నుంచి నగరం వేగంగా విస్తరిస్తున్న కొద్దీ మూసీ నది పరివాహక ప్రాంతాలు రియాల్టర్లు, కబ్జాదారుల ఆక్రమణలకు గురవుతూ వస్తున్నాయి. మలక్‌పేట, హిమాయత్‌నగర్, అజ్గంపురా, కాచీగూడ ప్రాంతాల్లో మూసీ నది ఆక్రమణలకు గురైంది. ముఖ్యంగా ఒక సంస్థ నదీ పరివాహ ప్రాంతాన్ని కబ్జాచేసి వేసిన వెంచర్ చుట్టూ ప్రహరీగోడను నిర్మించింది. దీనికి వ్యతిరేకంగా కొందరు 'మూసీ బచావో' పేరుతో పెద్ద ర్యాలీని నిర్వహించారు. పలువురు నాయకులు, ప్రజా సంఘాలు దీనికి మద్దతు తెలిపాయి. ఈ ఉద్యమకారుల డిమాండ్‌కు స్పందించి జీహెచ్ఎంసీ కబ్జాదారులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని అందించడానికి పర్యావరణ నిర్వహణ ద్వారా ఆర్ధిక వృద్ధి సాధించడమే లక్ష్యం. - టీఎస్ పీసీబీ విజ‌న్‌

 

Posted Date : 15-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సామాజిక ఉద్యమాలు

మాదిరి ప్రశ్నలు

 

1. పర్యావరణం, అడవులు అనే పదాలను మొదట ఆదేశిక సూత్రాల్లో 48(ఎ) అధికరణంలో చేర్చారు. ఈ పదాలు ఏ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు?
ఎ) 42వ సవరణ - 1972   బి) 42వ సవరణ - 1976   సి) 44వ సవరణ - 1976   డి) 44వ సవరణ - 1978
జ: (బి)

 

2. 1960 దశకం నుంచి ఏ దేశాల్లో కొత్త తరహా ఉద్యమాలు రూపుదిద్దుకున్నాయి?
ఎ) అమెరికా   బి) యూరప్   సి) 1, 2   డి) ఆఫ్రికా
జ: (సి)

 

3. మన దేశంలో పర్యావరణ అంశాలు సామాజిక ఉద్యమాల్లో ఏ దశకం తర్వాత ముందుకు కొనసాగాయి?
ఎ) 1960   బి) 1980   సి) 1990   డి) 1970
జ: (డి)

 

4. సామాజిక ఉద్యమాలు పర్యావరణ అంశాలను తమ అజెండాలో చేర్చి విస్తృతపరిచాయి. అయితే కిందివాటిలో పర్యావరణ అంశం కానిది ఏది?
ఎ) అడవులు - అటవీ ఉత్పత్తులు   బి) సముద్ర సంపదపై హక్కులు   సి) భారీనీటిపారుదల ప్రాజెక్టులు   డి) దళిత ఉద్యమాలు
జ: (డి)

 

5. బ్రిటిష్ పాలనలో అటవీ చట్టం ఎప్పుడు చేశారు?
ఎ) 1927   బి) 1937   సి) 1947   డి) 1957
జ: (ఎ)

 

6. పర్యావరణ సామాజిక ఉద్యమాల్లో ప్రధాన అజెండా అంశాలు?
ఎ) గిరిజన, మహిళా ఉద్యమాలు   బి) పౌరహక్కుల ఉద్యమాలు   సి) రైతుల, కార్మిక ఉద్యమాలు   డి) పైవన్నీ
జ: (డి)

 

7. గాంధేయ విధానాల్లో చిప్కో ఉద్యమాన్ని ఏమని పిలిచేవారు?
ఎ) అడవి సత్యాగ్రహం   బి) ఉప్పు సత్యాగ్రహం   సి) గిరిజన సత్యాగ్రహం   డి) మహిళా సత్యాగ్రహం
జ: (ఎ)

 

8. 'చిప్కో' అంటే ... ?
ఎ) చెట్లను నరికివేయడం   బి) చెట్లను పెంచడం   సి) చెట్లను పరిరక్షించడం   డి) చెట్లను ఆలింగనం చేసుకోవడం
జ: (డి)

 

9. మొదట చిప్కో ఉద్యమాన్ని చేపట్టిన గిరిజన తెగ ఏది?
ఎ) తాడలు   బి) గోండులు   సి) బిష్నోయ్   డి) బిల్లులు
జ: (సి)

 

10. 1961లో 'ఉత్తరాఖండ్ సర్వోదయ మండల్‌'ను ఎవరు నెలకొల్పారు?
ఎ) మీరా బెహన్   బి) సరళ బెహన్   సి) చండీ ప్రసాద్ భట్   డి) సుందర్‌లాల్ బహుగుణ
జ: (బి)

Posted Date : 20-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు

* నదీ జలాల్లో 'విష' ప్రవాహం

 

మానవ మనుగడ దేనిపై ఆధారపడి ఉందో ఆ పర్యావరణం కాలుష్యం దెబ్బకు విషతుల్యంగా మారుతోంది. పారిశ్రామికీకరణ ప్రభావంతో వెదజల్లుతున్న కాలుష్యం పౌర సమాజాన్ని ఊపిరి సలపనీయడం లేదు. నదీ జలాలు, పరిసర ప్రాంతాల్లో చిమ్ముతున్న విష ప్రభావానికి మూగజీవాలు చనిపోతున్నాయి. మనుషులు కూడా బలై పోతున్నారు. ఈ విపత్కర పరిస్థితిని రూపుమాపాలంటూ ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలుగా సాగిన ప్రధాన ఉద్యమాలేమిటో చూద్దాం..
పౌరహక్కుల ఉద్యమాలు తమ అజెండాలో పర్యావరణ సమస్యలకు తొలి ప్రాధాన్యం ఇచ్చాయి. కాలుష్యం లేని పర్యావరణంలో జీవించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని ఈ ఉద్యమాలు భావించాయి. ఈమేరకు పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అణుశక్తి వినియోగం, అణు విద్యుత్ కర్మాగారాల ఏర్పాటు, అణు యుద్ధాలు లాంటివాటిని వ్యతిరేకిస్తూ పౌర హక్కుల ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అలాగే భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, భారీ పరిశ్రమల ఏర్పాటు, మైనింగ్ తదితర కార్యకలాపాలకు భూసేకరణ జరిపే క్రమంలో.. కొన్ని కుటుంబాలు తమ భూములను కోల్పోతున్నాయి. ఇలాంటి నిరాశ్రయుల హక్కుల సాధన కోసం పోరాటాలు జరుగుతున్నాయి.

కాలుష్య వ్యతిరేక ఉద్యమాలు: మన దేశంలో శతాబ్దాలుగా నదులు, వాగులు, ఏరులు.. ప్రజలకు తాగునీటిని అందిస్తున్నాయి. పరిశ్రమల వాణిజ్య అవసరాలు తీరుస్తున్నాయి. మత్స్య సంపదలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే పారిశ్రామికీకరణ వల్ల ఇవి చాలామేర కలుషితం అయ్యాయి. ప్రత్యేకంగా ఉత్తరాన ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ్‌బంగ రాష్ట్రాలకు చెందిన నగరాల్లో గంగానది పొడవునా ఉన్న పంచదార, కాగితం, ఎరువులు, రసాయనాలు, రబ్బరు, పెట్రోకెమికల్స్ పరిశ్రమల నుంచి వచ్చే కలుషితాలన్నీ నదిలో కలుస్తున్నాయి. దక్షిణాన కూడా పలు పరిశ్రమలు గోదావరి, కావేరి, తుంగభద్ర నదులను కలుషితం చేస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో కాలుష్య వ్యతిరేక ఉద్యమాలు చోటు చేసుకున్నాయి. ఈ ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వాలు కొన్ని చర్యలతోపాటు పలు చట్టాలను కూడా రూపొందించాయి.

 

'సోన్'లో గరళం: మధ్యప్రదేశ్‌లోని షోడోల్ జిల్లాలో సోన్ నది పక్కనున్న అమ్లాయ్ నగరంలో 1965లో ఓరియంటల్ పేపర్ మిల్స్ అనే కాగితం పరిశ్రమ ఏర్పాటైంది. ఇది పెట్టిన రెండేళ్లకే కలుషిత పదార్థాల వల్ల నదిలోని చేపలు, పరిసర ప్రాంతాల్లో పశువులు మరణించాయి. 1970 నుంచి నది చుట్టుపక్కల ప్రాంతాల్లోని 20 గ్రామాల ప్రజలు పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం వల్లే నదీ జలాలు విషపూరితం అయ్యాయంటూ అధికారులకు, కలెక్టరుకు, మంత్రులకు విన్నవించుకున్నారు. అయినా యాజమాన్యం దీనిపై స్పందించలేదు. 1973లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ, దిల్లీ) బృందం ఈ ప్రాంతంలో సర్వే జరిపింది. పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం వల్ల పశువుల్లో పాల దిగుబడి తగ్గిందని; నదిలోని చేపలు, గ్రామాల్లోని పశువులు క్రమంగా చనిపోతున్నాయని తెలిపింది. దీంతో అక్కడి ప్రజలు పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమం చేపట్టారు. దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 1974లో నీటి కాలుష్య నియంత్రణ చట్టాన్ని రూపొందించింది.
'చాలియార్' కలుషితం: కేరళలోని చాలియార్ నది పక్కన 1958లో బిర్లా సంస్థ గ్వాలియర్ రేయాన్స్ పరిశ్రమను స్థాపించింది. దీని నుంచి విడుదలయ్యే కాలుష్యం వల్ల ఆ నదిలోని చేపలన్నీ చనిపోయాయి. నది నుంచి నీరు వెళ్లే పంట పొలాలు నాశనమయ్యాయి. పరిసర గ్రామాల ప్రజలకు చర్మ రోగాలు సోకాయి. దీంతో వీరంతా 1963లో కాలుష్యాన్ని అదుపు చేయాలని కోరుతూ పరిశ్రమ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపారు. 1975లో ఇది భారీ ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఫలితంగా 1981లో కాలుష్య నియంత్రణ మండలి కంపెనీ యాజమాన్యంపై కేసులు పెట్టింది.

 

గోవాలో ఉద్యమం: 1973లో గోవాలో జువారి ఆగ్రో కెమికల్స్ లిమిటెడ్ అనే ఎరువుల పరిశ్రమను ప్రారంభించారు. పని ప్రారంభించిన 3 నెలలకే కాలుష్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లు కూడా మాడిపోయాయి. దీంతో 1974 మార్చి 31న సలదాన్హా అనే ఉపాధ్యాయుడు స్థానిక ప్రజలతో కలిసి కాలుష్య వ్యతిరేక సంఘాన్ని ఏర్పాటు చేశారు. వీరంతా పరిశ్రమకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

 

కాలుష్య కర్మాగారం: ముంబయికి గాలి వచ్చే నైరుతి దిశలోని అలీబాగ్ ప్రాంతంలో ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు స్థాపించాయి. ఈ పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం వల్ల పర్యావరణం దెబ్బతిని, ప్రజలు కాలుష్యానికి గురవుతున్నారని అక్కడి ప్రజలు గుర్తించారు. వీరంతా దీన్ని వేరే ప్రాంతానికి తరలించాలని ఉద్యమం చేపట్టారు. ప్రజల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం దీన్ని మరోచోటుకు తరలించింది.

 

భోపాల్ దుర్ఘటన

  1984, డిసెంబరు 2 అర్ధరాత్రి భోపాల్‌లోని 'యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్' (అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ) అనే ఎరువుల తయారీ పరిశ్రమ నుంచి 'మిథైల్ ఐసోసైనేట్' అనే ప్రమాదకర విషవాయువు వెలువడింది. ఇది 3 వేల మంది మరణానికి కారణమైంది. భారతదేశంలో సంభవించిన పారిశ్రామిక దుర్ఘటనల్లో అతి భయానక విపత్తుగా ఇది చరిత్ర పుటల్లో నిలిచింది. అనంతర కాలంలో ఈ వాయువు దుష్ప్రభావం ఫలితంగా దాదాపు 15 వేల మంది మరణించారు. 5 లక్షల మంది శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురయ్యారు. లక్షలాది మంది ప్రజలు వికలాంగులు, అంధులుగా మారారు. జీవచ్చవాలుగా మిగిలిన వారు చాలామంది ఉన్నారు.

  ఈ సంఘటనలో ప్రధాన నిందితుడైన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ సీఈవో వారెన్ ఆండర్సన్‌ను 1985 ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. అయితే అతడు బెయిల్‌పై అమెరికా వెళ్లాడు. 1986లో రషీదాబీ, చంపాదేవి శుక్లా భోపాల్ బాధితులకు న్యాయం చేయాలని పెద్దఎత్తున ఉద్యమం నడిపారు. దేశప్రజల నుంచి వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

  1989లో రషీదాబీ, చంపాదేవి ఆధ్వర్యంలో 'భోపాల్ హతశేషుల ఉద్యమం' నడిచింది. దిల్లీలో వేలాది ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తమకు న్యాయం చేయమని కోరుతూ నాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి వినతి పత్రం సమర్పించారు.

  1999లో చంపాదేవి ఇతర ఉద్యమకారులతో కలిసి న్యూయార్క్ కోర్టులో 'యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్'పై ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. 2002లో రషీదాబీ, చంపా కలిసి న్యూఢిల్లీలో 19 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. భోపాల్ బాధితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. రషీదాబీ, చంపా చేసిన సేవలకు గుర్తింపుగా 2004లో వారికి 'గోల్డ్‌మన్ పర్యావరణ బహుమతి' లభించింది. ఈ పురస్కారాన్ని పర్యావరణ రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు. వీరి పోరాటానికి కొన్ని అంతర్జాతీయ సంస్థలు మద్దతు ఇచ్చాయి. అవి..

* ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ - బ్రిటన్
* భోపాల్ మెడికల్ అప్పీల్ - బ్రిటన్
* గ్రీన్‌పీస్ ఇంటర్నేషనల్ - బ్రిటన్
* అసోసియేషన్ ఫర్ ఇండియన్ - అమెరికా
* కోర్ వాచ్ - అమెరికా
* పెస్టిసైడ్ యాక్షన్ నెట్‌వర్క్ - అమెరికా
* భోపాల్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ - జపాన్
విషయం మళ్లీ 2010లో వార్తల్లోకి వచ్చింది. 2011లో కేంద్రం బాధితులకు రూ.1500 కోట్ల అదనపు ప్యాకేజీని సిఫారసు చేసింది. ఇటీవల ఈ కేసును కొట్టేశారు.
కేంద్ర ప్రభుత్వం 1984లో 'పర్యావరణ పరిరక్షణ చట్టం'ను రూపొందించింది. 1986లో పారిశ్రామిక కాలుష్య నియంత్రణ చట్టాలను అమలు చేసింది.

Posted Date : 20-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప‌ర్యావ‌ర‌ణ సంక్షోభం

మాదిరి ప్రశ్నలు

 

1. ఏ కార్ల కంపెనీలో పర్యావరణ క్షీణతకు దారితీసే వాయువులున్నాయనే అంశం ఇటీవల వార్తాల్లోకి వచ్చింది?
ఎ) స్కోడా బి) వోక్స్‌వ్యాగన్ సి) మారుతి డి) టాటా
జ: (బి)

 

2. భారత ప్రభుత్వం జాతీయ అటవీ తీర్మానాన్ని ఏ సంవత్సరంలో చేసింది?
ఎ) 1952 బి) 1953 సి) 1962 డి) 1963
జ: (ఎ)

 

3. 'బోదకాలు' వ్యాధి దేని వల్ల వ్యాప్తి చెందుతుంది?
ఎ) నీరు బి) పందులు సి) దోమలు డి) గాలి
జ: (సి)

 

4. కిందివాటిలో సజాతి ఆవరణం కానిది ఏది?
ఎ) ట్రోపో బి) స్ట్రాటో సి) మీసో డి) థర్మో
జ: (డి)

 

5. కింది ఏ ఆవరణంలో ఓజోన్ పొర ఉంటుంది?
ఎ) స్ట్రాటో బి) ట్రోపో సి) మీసో డి) ఎక్సో
జ: (ఎ)

Posted Date : 20-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ ప‌థ‌కాలు

* కాలుష్య నియంత్రణ చర్యలు
* 'స్వచ్ఛ' కార్యక్రమాల అమలు
* అడవుల పెంపకానికి కార్యాచరణ

 

  మానవ మనుగడకు ఆధారభూతమైన పర్యావరణాన్ని దారుణంగా దెబ్బతీస్తున్న కారకాల్లో కాలుష్యం ఒకటి. దీని ప్రభావంతో ప్రకృతిలోని గాలి, నీరు, భూమి కలుషితమై.. ప్రజారోగ్యం పాడైపోతోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ సమస్య తీవ్రంగా ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళుతోంది. కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ పలు కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఈదిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది. తెలంగాణలో కాలుష్యం బారి నుంచి పర్యావరణాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలు, 'స్వచ్ఛ' కార్యక్రమాలపై టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం అధ్యయన సమాచారం.

  కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నవ సామాజిక, ఆర్థిక నిర్మాణంలో ముందడుగు వేస్తున్న క్రమంలో కొన్ని సామాజిక, ఆర్థిక అడ్డంకులను ఎదుర్కోవడం సహజం. ఆ కోణంలో పరిశీలిస్తే తెలంగాణ ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుని ఉంది. కాలుష్యాన్ని నివారించే క్రమంలో ప్రభుత్వం రాష్ట్రంలో జలహారం, స్వచ్ఛ తెలంగాణ, హరితహారం, మన ఊరు-మన ప్రణాళిక లాంటి అనేక కార్యక్రమాలను ప్రజలందరి భాగస్వామ్యంలో అమలు చేస్తూ ప్రణాళికలను రూపొందించింది.

  మనచుట్టూ ఆవరించి ఉన్న జీవ, నిర్జీవ సమూహాల మొత్తాన్ని పర్యావరణం అంటారు. ఈ పర్యావరణం కాలుష్యం బారిన పడటానికి కారణమయ్యే పరిశ్రమలు అత్యధికంగా హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. వీటిద్వారా వెలువడే వ్యర్థాల వల్ల పర్యావరణం బాగా కలుషితమవుతోంది. పారిశ్రామిక, రసాయనిక, జీవ వ్యర్థాల వల్ల పర్యావరణం దెబ్బతిని, వరుసగా భూమి, జల, వాయు కాలుష్యాలు ఏర్పడుతున్నాయి. ఇందులో ఎక్కువశాతం భూగర్భజలం కలుషితమవుతోంది. రసాయన, క్రిమి సంహారక, ఔషధ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు దాదాపు 75 శాతం నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయని పర్యావరణ పరిశోధన సంస్థ అధ్యయనంలో తేలింది.

  మూసీ నదీపరివాహక ప్రాంతాలైన రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో చిన్న కార్ఖానాలు (పరిశ్రమలు) చాలా ఉన్నాయి. వీటి ద్వారా కూడా వ్యర్థ పదార్థాలు ఎక్కువ మోతాదులో విడుదలవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో జనాభా కూడా చాలా ఎక్కువ. దీంతో ఈ కలుషితాల వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌లోని కలుషిత నీటి వల్ల చుట్టూ ఉండే ప్రజలు తీవ్రమైన పర్యావరణ కాలుష్య ప్రభావానికి గురవుతున్నారు.

  పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకే రకంగా లేవు. అత్యధిక పర్యావరణ కాలుష్యానికి గురిచేసే పరిశ్రమలు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కేంద్రీకృతమై ఉండటం వల్ల అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

  2015లో ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సర్వే కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమల వివరాలు, శాతాలను ఇటీవల పేర్కొంది. ఆ వివరాలు..

  చట్ట వ్యతిరేకంగా అధిక కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలు రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉన్నాయి. ఇవి ఎక్కువగా రసాయన, జీవ వ్యర్థ పదార్థాలను సమీపంలోని కాలువలు, నదులు, డ్రైనేజీల్లోకి విడుదల చేస్తున్నాయి. దాంతో ఈ జిల్లాల పరిసర ప్రాంతాల్లోని దాదాపు 5 వేల గ్రామాల్లో ధ్వని, వాయు, రేడియోధార్మిక కాలుష్యాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కలుషితమైన భూగర్భ జలాలను వినియోగిస్తున్న ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ రకమైన కలుషిత పదార్థాల వల్ల చర్మ, శ్వాస, గుండె, నేత్ర, ఊపిరితిత్తులు, కాలేయ సంబంధిత వ్యాధులతోపాటు అల్సర్లు, కీళ్లనొప్పులు వంటివాటి బారిన పడుతున్నారు. భయంకరమైన క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా గురవుతున్నారు.

  రాష్ట్రంలో కాలుష్య నివారణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలు..

 

స్వచ్ఛ తెలంగాణ

  భారత ప్రభుత్వం 2014, అక్టోబరు 2న స్వచ్ఛభారత్ అభియాన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 4,041 పట్టణాల్లో క్లీన్ - స్ట్రీట్, రోడ్ లాంటి కార్యక్రమాలను చేపట్టారు. దీనికంటే ముందు యూపీఏ ప్రభుత్వం రూ.37,159 కోట్లతో గ్రామీణ శానిటేషన్ కోసం 'నిర్మల్ భారత్ అభియాన్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వచ్ఛభారత్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 2015, మే 16న 'స్వచ్ఛ తెలంగాణ - హైదరాబాద్‌'ను ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హైదరాబాద్‌లో ప్రారంభించారు. 'స్వచ్ఛ తెలంగాణ' కార్యక్రమాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో 68 పట్టణాల్లో అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. రాబోయే అయిదేళ్లలో కాలుష్యరహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడానికి దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. బడ్జెట్‌లో రూ. 979 కోట్లు కేటాయించారు.

ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 'స్వచ్ఛభారత్' కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 476 నగరాలను సర్వే చేయగా మైసూరు (కర్ణాటక) మొదటిస్థానంలో నిలిచింది. రాజధానులవారీగా చేసిన సర్వేలో ప్రథమ స్థానంలో బెంగళూరు, చివరిస్థానంలో పట్నా(బిహార్) ఉన్నాయి. హైదరాబాద్ 275, వరంగల్ 33 స్థానాల్లో ఉన్నాయి.

 

జలహారం

  ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమమే జలహారం. దీన్నే 'వాటర్ గ్రిడ్' పథకం అంటారు. ఈ పథకం కింద గ్రామాల్లో ప్రతి వ్యక్తికి 100 లీటర్లు, పట్టణాల్లో 130 లీటర్ల చొప్పున నీటిని అందించాలనేది లక్ష్యం. దీన్ని మొదట నల్గొండ జిల్లా చౌటుప్పల్ వద్ద ఏర్పాటు చేశారు. దీనికి జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'హడ్కో అవార్డు' లభించింది.

 

మన ఊరు - మన ప్రణాళిక

  తెలంగాణలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా 'మన ఊరు - మన ప్రణాళిక' పేరుతో అయిదేళ్లపాటు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రూ. 22,500 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇలా చెరువులను పునరుద్ధరించడం ద్వారా జీవవైవిధ్యాన్ని సమతౌల్యం చేయడానికి వీలవుతుంది. దీనివల్ల చెరువుల పరిసర ప్రాంతాల్లో పచ్చదనం, వివిధ జీవాలను పెంచడం సాధ్యమవుతుంది.

 

జీవవైవిధ్యం

పర్యావరణాన్ని పెంపొందించడానికి 2002లో రాష్ట్ర అటవీ పథకాన్ని (స్టేట్ ఫారెస్ట్ పాలసీ) తిరిగి ప్రారంభించారు. దీని ప్రకారం విజన్-2020లో వివిధ రకాల అటవీ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫారెస్ట్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రాష్ట్రంలో 3 అంచెల పద్ధతిని ప్రవేశపెట్టారు.
1) రాష్ట్ర స్థాయి - స్టేట్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎస్ఎఫ్‌డీఏ)
2) డివిజన్ స్థాయి - ఫారెస్ట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎఫ్‌డీఏ)
3) గ్రామ స్థాయి - వన సంరక్షణ సమితి (వీఎస్ఎస్)

పర్యావరణంపై అవగాహన

  నేటి తరానికి పర్యావరణం పట్ల అవగాహన కలిగించడంలో పర్యావరణ పరిరక్షణ సమూహాలు (ఇకో క్లబ్స్) ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. వీటిని దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు; విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టారు. ఇవి చేపట్టే వివిధ పర్యావరణ సానుకూల చర్యల కోసం కేంద్ర పర్యావరణ శాఖ నిధులను మంజూరు చేస్తుంది.

 

సమూహ కార్యక్రమాలు

* పర్యావరణం కలుషితమైన ప్రదేశాలు, పతనావస్థలో ఉన్న ప్రాంతాలు, వన్యప్రాణులున్న జంతు ప్రదర్శన శాలలను దర్శించడం.
* వివిధ సంస్థల్లో పర్యావరణ సమస్యలు / అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి సమావేశాలు, చర్చలు, ప్రముఖుల ప్రసంగాలు ఏర్పాటు చేయడం.
* బాణాసంచా, లౌడ్ స్పీకర్లు, ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం.
* కాలుష్య నియంత్రణలో వినూత్న మార్గాలను అన్వేషించి, వాటిని అమలు పరిచే సంస్థలకు అందించడం.
* రహదారుల అందాన్ని, పరిశుభ్రతను పెంచేందుకు చెట్లు, పూల మొక్కలు పెంచడం లాంటి కార్యక్రమాలు చేపట్టడం.

 

హరితహారం

మిశ్రమ మొక్కల పథకం కింద తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ సమతౌల్యం సాధించడానికి ప్రస్తుతం ఉన్న 25 శాతం అడవులను 33 శాతానికి పెంచడం ఈ పథకం ఉద్దేశం. 'మన ప్రణాళిక' అనే కార్యక్రమం కింద రాష్ట్రంలో 3,889 నర్సరీలను గుర్తించారు. 2015 నాటికి 40 కోట్ల మొక్కలు పెంచాలని నిర్ణయించారు.

మొదటగా ఈ పథకాన్ని 2015, జులై 3-7 వరకు చేపట్టారు. రాష్ట్రప్రభుత్వం 2014-15లో సీఏఎమ్‌పీఏ (కాంపన్సేటరీ ఎఫారిస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) కార్యక్రమాన్ని చేపట్టింది.

 

ముఖ్యాంశాలు

* అంతర్జాతీయ బయో డైవర్సిటీ దినోత్సవాన్ని మే 22న నిర్వహిస్తారు.
* ప్రపంచంలో మొత్తం 170 బయోడైవర్సిటీ బోర్డులుండగా.. తెలంగాణలోని 10 జిల్లాలోని 66 మండలాల్లోను, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ బయో డైవర్సిటీ బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
* తెలంగాణలో (2014-15) 3 జాతీయ పార్కులు, 9 వన్యప్రాణి కేంద్రాలు, 4 జింకల పార్కులు, 2 జంతు ప్రదర్శన శాలలు, 65 సాక్రెడ్ గ్రూవ్స్ ఉన్నాయి.
* కేంద్ర పర్యావరణ, అటవీశాఖ 2015లో తెలంగాణలో 'ప్రాణహిత'ను పర్యావరణ పరిరక్షణ పార్కుగా ప్రకటించింది. ఈ ప్రాంతం చుట్టూ 5 కి.మీ. పరిధిలో పలురకాల జంతువులను పెంచాలని నిర్ణయించింది.

Posted Date : 20-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ ప‌థ‌కాలు

మాదిరి ప్రశ్నలు

 

1. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?

ఎ) జూన్ 5   బి) మార్చి 21   సి) మార్చి 8   డి) మే 22
జ: (డి)

 

2. ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలంగాణలో ఏ ప్రాంతాన్ని పర్యావరణ పరిరక్షణ పార్కుగా ప్రకటించింది?
ఎ) మంజీర   బి) ప్రాణహిత   సి) అలీసాగర్   డి) కిన్నెరసాని
జ: (బి)

 

3. కిందివాటిలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో పర్యావరణంతో సంబంధం లేనిది ఏది?
ఎ) ఆసరా   బి) జలహారం   సి) స్వచ్ఛ తెలంగాణ   డి) హరితహారం
జ: (ఎ)

 

4. తెలంగాణలో అత్యధిక పారిశ్రామిక, రసాయన కేంద్రాలు ఉన్న జిల్లాలు ఏవి?
ఎ) రంగారెడ్డి   బి) మెదక్   సి) హైదరాబాద్   డి) పైవన్నీ
జ: (డి)

 

5. తెలంగాణ పర్యావరణ పరిశోధన సంస్థ అధ్యయనంలో 75% నుంచి 80% రసాయన, క్రిమి, ఔషధ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు ఏ రకమైన కాలుష్యానికి కారణమవుతున్నాయని తెలిపింది?
ఎ) నీటి   బి) వాయు   సి) ధ్వని   డి) రేడియోధార్మిక
జ: (ఎ)

 

6. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
ఎ) మే 22   బి) మార్చి 21   సి) డిసెంబరు 10   డి) జూన్ 21
జ: (బి)

 

7. 'ఫ్లోరైడ్ (F2)' సమస్య అధికంగా ఉన్న తెలంగాణ జిల్లా ఏది?
ఎ) మెదక్   బి) రంగారెడ్డి   సి) నల్గొండ   డి) వరంగల్
జ: (సి)

 

8. తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిశ్రమల మొత్తంలో కాలుష్యం లేని పరిశ్రమల శాతం ఎంత?
ఎ) 29.58%   బి) 64.98%   సి) 5.43%   డి) 0.033%
జ: (సి)

 

9. తెలంగాణలో 'స్వచ్ఛ తెలంగాణ - హైదరాబాద్' కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు?
ఎ) ఈఎస్ఎల్ నరసింహన్   బి) కె.చంద్రశేఖర్ రావు   సి) కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా   డి) రాజీవ్ శర్మ
జ: (ఎ)

 

10. తెలంగాణలో 'స్వచ్ఛ తెలంగాణ - హైదరాబాద్' కార్యక్రమాన్ని ఏ రోజున చేపట్టారు?
ఎ) 2015, మే 10 - 14   బి) 2015, మే 16 - 20   సి) 2015, మే 20 - 24   డి) 2015, మే 1 - 4
జ: (బి)

 

11. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'హడ్కో అవార్డు' కిందివాటిలో దేనికి లభించింది?
ఎ) హరితహారం   బి) స్వచ్ఛ తెలంగాణ   సి) జలహారం   డి) మన ఊరు - మన ప్రణాళిక
జ: (సి)

 

12. 'క్లీన్ ఇండియా మిషన్‌'లో ఇటీవల భారతదేశ 476 నగరాల్లో తెలంగాణలోని గ్రేటర్ వరంగల్ నగరం ఎన్నో స్థానం దక్కించుకుంది?
ఎ) 275   బి) 34   సి) 33   డి) 13
జ: (సి)

 

13. తెలంగాణలో హరితహారం కార్యక్రమం ఎప్పుడు చేపట్టారు?
ఎ) 2015, జులై 3 - 7   బి) 2015, జులై 7 - 10   సి) 2015, ఆగస్టు 3 - 7   డి) 2015, సెప్టెంబరు 7-10
జ: (ఎ)

Posted Date : 20-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చ‌క్ర‌వాతాలు

* సైక్లోన్ల జల ప్రళయం
* ఉప్పొంగే ప్రకృతి విపత్తు
* ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు

  మానవ జీవనానికి అమ్మఒడిలా ఉండే ప్రకృతి ఒక్కోసారి ప్రళయాన్ని సృష్టిస్తుంటుంది. ఇలాంటి ప్రళయాల్లో చక్రవాతాలు (సైక్లోన్లు) ఒకటి. సముద్ర జలాల్లో ఉద్భవించే ఈ తుపాన్ల ప్రభావంతో తీర ప్రాంతాలు అపార నష్టాన్ని చవిచూస్తుంటాయి. బలమైన గాలులు, కుండపోత వర్షాలతో విరుచుకుపడే ఈ విపత్తులను ముందుగానే గుర్తించగల విజ్ఞానం పెరుగుతున్నా.. ఆపగలగడం అసాధ్యం. కోట్లాది మంది నివసిస్తున్న ఉత్తర, దక్షిణ హిందూ మహాసముద్ర తీరాల్లోనూ, పశ్చిమ అట్లాంటిక్ మహాసముద్ర తీరంలోనూ, తూర్పు, దక్షిణ పసిఫిక్ మహాసముద్ర తీరాల్లోనూ ప్రతి సంవత్సరమూ చక్రవాతాల తాకిడి తప్పడం లేదు. ఏడున్నర వేల కిలోమీటర్లకు పైగా తీరరేఖ ఉన్న భారతదేశం కూడా ఈ విపత్తులను నిత్యం ఎదుర్కొంటోంది. అసలు ఏమిటీ చక్రవాతాలు? ఎందుకు ఏర్పడతాయి? వీటి ప్రభావం ఏయే ప్రాంతాల్లో ఉంటుంది? వంటి వివరాలను ఒకసారి చూద్దాం..
 

  కుంభవృష్టి వర్షాన్ని కుమ్మరిస్తూ.. సముద్రాల్లో పెద్దఎత్తున తరంగాలను సృష్టిస్తూ.. ఉత్తరార్ధగోళంలో అపసవ్యదిశలోనూ, దక్షిణార్ధగోళంలో సవ్యదిశలోనూ శక్తిమంతమైన గాలులతో సుడులు తిరిగే వాతావరణ అలజడినే చక్రవాతం (సైక్లోన్) అని పిలుస్తారు. చక్రవాతాలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఇలా ప్రాంతీయంగా అనేక పేర్లతో పిలుస్తున్నా, వీటి రూపురేఖలు ఒకేవిధంగా ఉంటాయి. వీటి ప్రభావంతో అపారమైన ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవిస్తుంటుంది. అంతటి బలమైనవీ చక్రవాతాలు.

 

ఇవే సైక్లోన్లు

  చక్రవాతాలను ఆంగ్లంలో సైక్లోన్స్ అంటారు. 'సైక్లోస్' అనే గ్రీకు పదం నుంచి సైక్లోన్ పదం పుట్టింది. సైక్లోస్ అంటే పాము మెలిక చుట్ట (కాయిల్ ఆఫ్ స్నేక్) అని అర్థం. చక్రవాతం అనేది సమశీతోష్ణ, ఉష్ణమండల అక్షాంశాల వేడి, సముద్ర ప్రవాహాల వల్ల సంభవించిన అల్పవాతావరణ పీడన ప్రభావం. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన ఉష్ణమండల తుపాన్లు సర్పిలాకారంగా తిరిగి అలజడిని సృష్టిస్తాయి. ఈ అలజడులను గమనించిన బ్రిటన్ వాతావరణ శాస్త్రవేత్తలు వీటికి సైక్లోన్ అని నామకరణం చేశారు.

సముద్రంలోని అధిక ఉష్ణోగ్రత, అధిక సాపేక్ష ఆర్ద్రత, వాతావరణ అస్థిరతల కలయిక వల్ల ఏర్పడే ఒక సంక్లిష్ట ప్రక్రియే చక్రవాతం. సముద్రంలో అధిక ఉష్ణోగ్రత వల్ల దానిపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతానికి అన్ని వైపుల నుంచీ అధిక పీడన గాలులు చేరతాయి. ఫలితంగా వాయుగుండంగా మారి, చక్రవాత కేంద్రం (ఐ ఆఫ్ సైక్లోన్) ఆ మధ్యలో ఏర్పడుతుంది. చక్రవాత వ్యాసం కొన్ని వందల కిలో మీటర్లు ఉండగా, చక్రవాత కేంద్ర వ్యాసం 20-30 కి.మీ.ల వరకూ ఉంటుంది. చక్రవాత కేంద్ర పరిమాణం తగ్గుతున్న కొద్దీ చక్రవాత బలం అంతకంతకూ పెరుగుతుంది. చక్రవాత కేంద్రం పెరుగుతున్న కొద్దీ దాని బలం క్రమంగా తగ్గిపోతుంది.

 

మూడు దశల్లో..

 

1. రూపకల్పన దశ

బాష్పీభవనం ద్వారా గాలికి సమృద్ధిగా నీటి ఆవిరిని అందించడం కోసం 26°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న సముద్రపు నీరు 60 మీటర్ల లోతు వరకూ సముద్రంలో ఉన్నప్పుడు చక్రవాత రూపకల్పన జరుగుతుంది. ఈ దశలో గాలి సంతృప్తం చెంది వాతావరణంలో 7000 మీటర్ల ఎత్తు వరకూ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి.

 

2. సంపూర్ణ దశ

క్యుములోనింబస్ మేఘాలకు దిగువనే ఉన్న తీవ్ర అల్పపీడనానికి అన్ని వైపుల నుంచీ అధిక పీడన గాలి చేరుతుంది. ఇది గాలిని కల్లోలితం చేసి గాలివానతో కూడిన చక్రవాతంలా మారుతుంది.

 

3. బలహీన దశ

చక్రవాతం అధిక ఉన్నతిని చేరడం లేదా మరొక అల్పపీడనం వల్ల అది నేలను తాకినప్పుడు గాలి వెంటనే ఛేదనం చెందడం వల్ల చక్రవాతం బలహీనమైపోతుంది.

 

కాలచక్రం

  చక్రవాతం 24 గంటల కంటే తక్కువ వ్యవధిలో ప్రారంభమై 3 వారాల వరకూ ఉండవచ్చు. సగటున ఒక చక్రవాతం మూడు దశలు పూర్తవడానికి 6 రోజులు పడుతుంది. ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడిన చక్రవాతాలు సాధారణంగా 5-6 రోజులు కొనసాగుతాయి. అరుదైన సందర్భాల్లో 3 వారాల కంటే ఎక్కువ రోజులు కూడా కొనసాగవచ్చు.

 

భారత్‌లో తుపాన్ల ప్రభావం

తుపాన్ల తాకిడి ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. 10% తుపాన్లు ఇక్కడే సంభవిస్తున్నాయి. భారతదేశం మొత్తం తీరరేఖ(7,516 కి.మీ.లు) కూడా చక్రవాతాలకు అనుకూలంగా ఉంటుంది. దేశంలోని మొత్తం భూవైశాల్యంలో సుమారుగా 8% భూభాగం చక్రవాతాల విలయాన్ని ఎదుర్కొంటోంది. మొత్తంగా 84 తీరప్రాంత జిల్లాలు చక్రవాతాలను ఎదుర్కొంటున్నాయి. మొత్తం చక్రవాతాల్లో మూడింట రెండొంతులు బంగాళాఖాతంలోనే ఏర్పడుతున్నాయి. దేశంలో ఎక్కువ చక్రవాతాలు అక్టోబరు, నవంబరుల్లో సంభవిస్తాయి. బంగాళాఖాతంలో అల్పపీడనాలు సాధారణంగా ఆగ్నేయ దిశలో ఏర్పడి చక్రవాతాలుగా మారి వాయవ్యం వైపు నడుస్తాయి. అప్పుడప్పుడూ తూర్పున ఏర్పడి పశ్చిమానికి కూడా నడిచి తీరం దాటుతుంటాయి.

 

ఒడిశా, ఏపీలకు తాకిడి

  అండమాన్, నికోబార్ దీవుల ప్రాంతంలో ఆవిర్భవించిన తుపాన్లే కాకుండా కొన్ని సమయాల్లో పసిఫిక్ మహాసముద్రంలో బలహీనపడిన వాయుగుండాలు కూడా బంగాళాఖాతంలోకి వచ్చి బలం పుంజుకుని తుపాన్లుగా మారతాయి. ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్టుమెంట్ లెక్కల ప్రకారం 1891 నుంచి 2012 వరకూ 73 తుపాన్లు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకాయి. దీనికి కారణం సముద్రపు లోతు తక్కువగా ఉండటమే.. అంతేకాకుండా ఖండతీరపు అంచు ఆకారం కూడా వాటికి అనుకూలంగా ఉంది.

  1999, అక్టోబరు 29వ తేదీన ఒడిశా తీరాన్ని తాకిన 'సూపర్ సైక్లోన్' వల్ల 10 వేల మంది చనిపోగా, 15 లక్షల ఇళ్లు నాశనమయ్యాయి. ఇది గంటకు 250 కి.మీ.ల వేగంతో వీచింది. 1977లో ఆంధ్రప్రదేశ్ తీరంలో దివిసీమ విలయానికి 10 వేల మంది చనిపోయారు. 2013, అక్టోబరు 12న ఏర్పడిన 'పైలిన్' తుపాను ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల మధ్య ప్రభావం చూపించి 25 మందిని బలిగొంది. 2013, అక్టోబరు 22న ఏర్పడిన 'హెలెన్' తుపాను కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలను తాకింది. దీనివల్ల 11 మంది చనిపోయారు. 2014, అక్టోబరు 12న విశాఖపట్నం, విజయనగరాలను కుదిపేసిన హుద్‌హుద్ తుపాను ఆరుగురిని బలితీసుకోగా, అపారమైన ఆస్తినష్టం వాటిల్లింది. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వీటి రాకను ముందుగా గుర్తించడంతో ప్రాణ నష్టాలను చాలావరకు తగ్గించగలుగుతున్నాం.

 

నామకరణం కూడా..

  తొలిసారిగా 20వ శతాబ్దంలో ఆస్ట్రేలియా వాతావరణ పరిశీలకుడొకరు తుపాన్లకు తనకు నచ్చిన రాజకీయ నాయకుల పేర్లు పెట్టారు. అప్పటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 5 ప్రాంతీయ బోర్డులు ఆయా ప్రాంతాలకు చెందిన దేశాల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా పేర్లను నిర్ణయిస్తాయి. 2000 సంవత్సరంలో ఓమన్‌లోని మస్కట్‌లో జరిగిన ప్యానల్ ఆన్ ట్రోపికల్ సైక్లోన్స్ 27వ సమావేశంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడే తుపాన్లకు పేర్లు ఖరారు చేశారు. ఉత్తర హిందూ మహాసముద్రం తీరంలోని తుపాను ప్రభావిత దేశాలైన భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్థాన్, ఓమన్‌లు ఇచ్చిన పేర్లను వరుస క్రమంలో రాబోయే తుపానుకు ముందుగానే నిర్ణయిస్తారు. పైలిన్, హెలెన్, హుద్‌హుద్.. ఇవన్నీ అలా పెట్టిన పేర్లే.

 

ముందస్తు హెచ్చరికలు

  భారత ప్రభుత్వ భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖలో వాతావరణ శాఖ ఒక విభాగం. ఇండియన్ మెటిరియోలాజికల్ డిపార్టుమెంట్(ఐఎమ్‌డీ)ను 1875లో కలకత్తాలో ఏర్పాటు చేశారు. వాతావరణ పరిశీలనలు, పరిస్థితులను ముందస్తుగా వెల్లడించడం; భూకంపాల గురించిన సమాచారాన్ని అందించడం దీని ప్రధాన విధి. ఐఎమ్‌డీకి దేశ వ్యాప్తంగా 6 ప్రాంతీయ కేంద్రాలున్నాయి. తుపాను రాక హెచ్చరికలు కోల్‌కతా, చెన్నై, ముంబయిలోని ఏరియా సైక్లోన్ వార్నింగ్ సెంటర్ల నుంచి; విశాఖపట్నం, భువనేశ్వర్, అహ్మదాబాద్‌లలో ఉన్న వార్నింగ్ సెంటర్ల నుంచి ఐఎమ్‌డీకి చేరతాయి. సైక్లోన్ హెచ్చరికలను ఇన్‌శాట్ ఉపగ్రహం ద్వారా స్థానిక భాషల్లో ప్రచారం చేసేందుకు ఒక ప్రత్యేక విపత్తు వ్యవస్థ ఉంది. ఈ హెచ్చరికలను రేడియో, టెలివిజన్, టెలీఫోన్ లాంటి సాధనాల ద్వారా ప్రచారం చేస్తారు.

 

ముఖ్యాంశాలు

* ఇంతవరకూ చరిత్రలో అతి సుదీర్ఘ చక్రవాతం 'టైఫూన్ జాన్'. ఇది 1994 పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడి 31 రోజులపాటు కొనసాగింది.
* 1971లో అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన 'హరికేన్ జింజర్' 28 రోజులు కొనసాగి రెండో స్థానంలో నిలిచింది.
* 1970లో బంగ్లాదేశ్‌లో గంటకు 205 కిలో మీటర్ల వేగంతో సంభవించిన బోలా చక్రవాతం వల్ల 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
* గంటకు 222 కిలో మీటర్ల పైబడిన వేగంతో ఏర్పడే తుపాన్లను సూపర్ సైక్లోన్లు అంటారు.

Posted Date : 20-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చ‌క్ర‌వాతాలు

మాదిరి ప్రశ్నలు

 

1. కిందివాటిలో ప్రకృతి విపత్తుల్లో భాగమైనవి ఏవి?

ఎ) గాలివాన బి) వాయుగుండం సి) అల్పపీడనం డి) పైవన్నీ
జ: డి(పైవన్నీ)

 

2. సైక్లోన్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
జ: గ్రీకు

 

3. ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్‌మెంట్ ఎక్కడ ఉంది?
జ: దిల్లీ

 

4. ప్రపంచంలో అత్యధిక ఆస్తినష్టం కలిగించిన తుపాను ఏది?
జ: కత్రినా తుపాను - 2005

 

5. చైనా, జపాన్ దగ్గర ఏర్పడిన చక్రవాతాలను ఏమంటారు?
జ: టైఫూన్‌లు

 

6. తుపాన్ల ప్రభావాన్ని తగ్గించడానికి సహజసిద్ధ వాయు నిరోధకాలు?
జ: తీరప్రాంత చెట్లు

 

7. కిందివాటిలో చక్రవాతాలకు సంబంధం లేనిది?
ఎ) బలమైన గాలులు బి) అసాధారణ వర్షం సి) ఉప్పెన డి) ఓడరేవులు
జ: డి(ఓడరేవులు)

 

8. చక్రవాత కేంద్రం ఎలా ఉంటుంది?
జ: ప్రశాంతంగా

 

9. టోర్నడోలు ఎక్కువగా ఎక్కడ సంభవిస్తాయి?
జ: అమెరికా

 

10. చక్రవాతం సరాసరి కాలం ఎంత?
జ: 6 రోజులు

 

11. భారతదేశంలో ఎంత తీరంలో చక్రవాతాల ప్రభావం ఉంది?(సుమారుగా)
జ: 7500 కి.మీ.

 

12. తుపాన్లను అంచనా వేసే నోడల్ వ్యవస్థ ఏది?
జ: భారత వాతావరణ శాఖ

 

13. భారతదేశంలో చక్రవాతాలు ఎక్కువగా ఏ కాలంలో సంభవిస్తాయి?
జ: అక్టోబరు - నవంబరు

 

14. చక్రవాతం ఎలాంటి విపత్తు?
జ: వాతావరణ జల సంబంధ

 

15. బంగాళా ఖాతం, అరేబియా సముద్రాల్లో సంభవించే చక్రవాత విపత్తుల నిష్పత్తి?
జ: 4 : 1

Posted Date : 20-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప‌ర్యావ‌ర‌ణ సంక్షోభం

* పరిరక్షణ అత్యవసరం
* మూడోవంతు అడవులతో ముప్పు నివారణ

జనాభా పెరుగుదల.. పెరుగుతున్న అవసరాలు.. మానవ తప్పిదాలు.. తదితర అంశాల నేపథ్యంలో పర్యావరణం విధ్వంసానికి గురవుతోంది. ఓజోన్ పొర ఛిద్రమవుతోంది.. భూమి వేడెక్కిపోతోంది.. అడవులు నాశనమై పోతున్నాయి.. కాలుష్యం పెరిగిపోతోంది.. ఇవన్నీ పర్యావరణాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. మానవాళిని భయంకర విపత్తుల్లోకి తీసుకెళుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పర్యావరణానికి ఎన్నటికీ పూడ్చలేని నష్టం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలా పర్యావరణం దెబ్బతినడానికి కారణాలేమిటి? ఎలాంటి దుష్ఫలితాలుంటాయి? నివారణ చర్యలేమిటి? తెలుసుకుందామా!
జీవావరణ వ్యవస్థలోని జనాభా పెరుగుదల వల్ల పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి. జనాభా పెరిగే కొద్దీ మానవ నివాసానికి; వ్యవసాయ భూమి, వంటచెరకు కోసం అడవులను, పచ్చిక బయళ్లను నాశనం చేస్తుండటం వల్ల భూమి మృత్తికలు, వాటిలోని సారం కొట్టుకుపోతున్నాయి. సాగుచేయడం ద్వారా మిగిలే వ్యర్థ, ఘన, ద్రవ పదార్థాలు.. అనాగరిక పారిశుద్ధ్య అలవాట్ల వల్ల పర్యావరణ సంక్షోభం ఏర్పడుతోంది. ఈ వ్యర్థాలను తగిన విధంగా నియంత్రించకపోవడంతో శిలావరణ, జల, వాయు సంక్షోభానికి దారి తీస్తోంది. కొన్ని వ్యవసాయ విధానాలతోపాటు పురుగుమందులు, రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి రసాయన, జైవిక సంక్షోభానికి గురవుతోంది.

 

ఓజోన్ పొర (O3)

  ఓజోన్ పొరలో రంధ్రాలు లేదా ఛిద్రాలు ఏర్పడటం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. భూగోళాన్ని ఆవరించి ఉన్న వాతావరణాన్ని 5 పొరలుగా విభజించారు. వీటిని రెండు భాగాలుగా వర్గీకరించవచ్చు. అవి..

 

జలహారం

  ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమమే జలహారం. దీన్నే 'వాటర్ గ్రిడ్' పథకం అంటారు. ఈ పథకం కింద గ్రామాల్లో ప్రతి వ్యక్తికి 100 లీటర్లు, పట్టణాల్లో 130 లీటర్ల చొప్పున నీటిని అందించాలనేది లక్ష్యం. దీన్ని మొదట నల్గొండ జిల్లా చౌటుప్పల్ వద్ద ఏర్పాటు చేశారు. దీనికి జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'హడ్కో అవార్డు' లభించింది. 

ఎ. సమరూప ఆవరణాలు: ఇందులో ట్రోపో, స్ట్రాటో, మీసో ఆవరణాలు 90 కి.మీ.ల లోపు ఉండి సమాన నిష్పత్తులు, ధర్మాలు ఉన్నందున వీటిని సమరూప ఆవరణాలు అంటారు.

 

బి. బహురూప ఆవరణాలు: ఇందులో థర్మో, ఎక్సో ఆవరణాలు 90 కి.మీ.ల పైన వేర్వేరు నిష్పత్తుల్లో ఉన్నందున వీటిని బహురూప ఆవరణాలు అంటారు.

  భూఉపరితలంపై 18-50 కి.మీ.ల వరకు ఉన్న ఆవరణాన్ని స్ట్రాటో ఆవరణం అంటారు. ఈ ఆవరణంలో 25-40 కి.మీ.ల మధ్య ఒక దట్టమైన పొర ఉంటుంది. దీన్నే ఓజోన్ పొర అంటారు. ఆక్సిజన్‌కు మరో రూపమే ఓజోన్. ఆక్సిజన్‌లోని ఒక కణంలో రెండు అణువులుంటే, ఓజోన్‌లో మూడు అణువులు ఉంటాయి. ఈ ఓజోన్ వాయువు పొర సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను అడ్డగించి, భూమికి చేరకుండా నిరోధిస్తుంది. ఫలితంగా ఆ కిరణాలు భయంకర వినాశకర విపత్తు నుంచి మానవాళిని రక్షిస్తాయి.

 

దుష్ఫలితాలు

అతినీలలోహిత కిరణాలు అధిక సంఖ్యలో భూమిని చేరితే కలిగే దుష్ఫలితాలు..
* జీవరాశుల చర్మం చిట్లిపోయి, జీవకణాలు సర్వనాశనం అవుతాయి.
* చర్మ సంబంధ క్యాన్సర్, కంటి వ్యాధులు, రోగనిరోధక శక్తి కోల్పోవడం లాంటి రుగ్మతలకు దారితీస్తుంది.
* మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియను మందగింపజేస్తుంది. తేలిగ్గా తెగుళ్లకు గురవుతాయి.
* ఈ కిరణాలు సముద్ర జలాల్లోని జీవరాశులకు కూడా హాని కలిగిస్తాయి.

 

మానవుడే కారణం

ఓజోన్ పొర విధ్వంసానికి మానవుడే ప్రధాన కారణం. ఈ విధ్వంసంలో 'క్లోరో ఫ్లోరో కార్బన్లు' ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటినే 'క్లోఫోకాలు' (ఈ ఒక కణం క్లోరిన్, ఫ్లోరిన్, కర్బనాల మిశ్రమం) అంటున్నారు. వీటితోపాటు బ్రోమిన్ కూడా ప్రమాదకారిగా మారింది. దీన్ని అగ్నిమాపక పరికరాల్లో ఉపయోగిస్తున్నారు.
పంటలపై చల్లే స్ప్రేలు, రిఫ్రిజిరేటర్లు, ప్లాస్టిక్, ఫోమ్, డిటర్జెంట్ల ఉత్పత్తుల తయారీ వల్ల వాతావరణంలో క్లోఫోకాలు ప్రతి సంవత్సరం ఒక మిలియన్ టన్నుకంటే ఎక్కువగా విడుదల అవుతున్నాయి. దీనివల్ల ఏటా లక్ష మందికి పైగా చర్మ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు.

 

85 శాతం ధ్వంసం

ఓజోన్ పొర మందం సన్నగిల్లుతున్నట్లు శాస్త్రవేత్తలు 1980 దశాబ్దంలోనే గమనించారు. ఆర్కిటిక్ ప్రాంతంపై ఉండే ఓజోన్ పొర 85 శాతం పైగా ధ్వంసమైందని తాజా పరిశీలనల్లో తేలింది. దీని ప్రభావం వల్ల ఉత్తర యూరప్ ప్రాంతంలో చర్మ క్యాన్సర్ పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఓజోన్ పొర ప్రస్తుతం 14 మిలియన్ చదరపు మైళ్ల మేర ఛిద్రమైందని ఓజోన్ పొరపై పరిశోధన చేసిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం తెలిపింది.
నివారణ : ఓజోన్ పొర నివారణలో భాగంగా ప్రపంచ దేశాలన్నీ ఒకేతాటిపైకి రావాలి. ఏరోసాల్ ప్రొపల్లెంట్లు, ప్లాస్టిక్ ఫోమ్స్, రిఫ్రిజిరేటర్లలో వాడే సింథటిక్ రసాయనాలను తగ్గించి ప్రత్యామ్నాయాల వైపు ప్రయాణించాలి. ఇందులో భాగంగా ఈ ప్రమాద తీవ్రతను, వాటి దుష్ఫలితాలను గుర్తించి అమెరికా, జపాన్ లాంటి దేశాలు 'క్లోఫోకాలకు' ప్రత్యామ్నాయ రసాయనాలను తయారు చేస్తున్నాయి. అయితే ఇవి చాలా ఖరీదైనవి. పేద, బడుగు, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా తయారు చేసుకోగలిగినప్పుడు పూర్తిగా క్లోఫోకాలను నిషేధించవచ్చు.
* ఇటీవల వోక్స్‌వ్యాగన్ కంపెనీ తయరుచేసిన కార్లలో పర్యావరణ సంక్షోభానికి దారితీసే వాయువులు ఉన్నట్లు తేలినందున అమెరికా ఆ కంపెనీపై ఆంక్షలు విధించింది.

 

భూతాపం (గ్లోబల్ వార్మింగ్)

భూగోళం వేడెక్కడాన్ని 'భూతాపం' అంటారు. ఇలా భూమిపై ఉష్ణోగ్రత పెరగడానికి గ్రీన్‌హౌస్ వాయువులు కారణమవుతున్నాయి. కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, క్లోఫోకాలు, ఓజోన్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి వాయువులను 'గ్రీన్‌హౌస్' వాయువులు అంటారు. ఇలా భూమిని చేరిన సూర్యరశ్మి ఉపరితలం నుంచి పై పొరల్లోకి వెళ్లకుండా ఈ వాయువులు అడ్డగించడం వల్ల భూమి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. ఈ గ్రీన్‌హౌస్ ప్రభావానికి సగానికి పైగా కార్బన్ డై ఆక్సైడ్ (CO2) కారణం. ముఖ్యంగా పశ్చిమ పారిశ్రామిక దేశాలే ఈ వాయువుల పెరుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

 

దుష్ఫలితాలు: గ్రీన్‌హౌస్ ప్రభావంతో భూమండలం వేడెక్కుతోంది. దీనివల్ల జీవావరణం తీవ్ర దుష్ఫలితాలకు లోనవుతోంది.
* ప్రాథమికంగా భూమిలో తేమ తరిగిపోయి ఆహారోత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల వ్యవసాయ సంక్షోభం తలెత్తుతుంది.
* సముద్ర జలాలు బాగా వ్యాకోచిస్తాయి. వీటివల్ల సముద్ర మట్టం పెరిగి, తీరప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు.
* ధ్రువ ప్రాంతాల్లోని మంచు కరగడం ప్రారంభిస్తే జల ప్రళయమే వచ్చి ప్రపంచంలో అనేక ప్రాంతాలు, దీవులు ముంపునకు గురై కొట్టుకుపోతాయి.
ఉదా: అంటార్కిటికా ఖండంలోని మంచు కరిగిపోతే సముద్ర నీటిమట్టం 55 మీటర్ల వరకు పెరుగుతుందని అంటార్కిటికా పరిశోధన సంస్థ అధ్యయనంలో తేలింది. మన దేశంలో అంటార్కిటికా పరిశోధన కేంద్రం గోవాలో ఉంది. దీనివల్ల హిందూ మహాసముద్రంలోని 'మాల్దీవులు' మునిగిపోయే ప్రమాదం ఉంది.

 

నివారణ చర్యలు: శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం భూమి వేడెక్కడం మానవుడు ఎదుర్కొంటున్న భయంకర విపత్తుల్లో ముఖ్యమైంది.
* ప్రపంచ దేశాలన్నీ ముందుగా అడవులను పరిరక్షించాలి. ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఆఫ్రికాల్లో జరుగుతున్న వన నిర్మూలనను వెంటనే ఆపాలి.
* అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ బీడు భూముల్లో వనీకరణ చేపట్టాలి. భారతదేశంలో సుమారు 12 లక్షల ఎకరాల భూమి వ్యర్థంగా ఉన్నట్లు అంచనా వేశారు. ఇలాంటి చోట్ల వనీకరణ జరగాలి.
* విద్యుదుత్పాదనకు బొగ్గు, సహజవాయువుల వాడకాన్ని తగ్గించాలి. వాటి స్థానంలో ఇతర మార్గాలను అన్వేషించాలి. సౌరశక్తి, అలల కదలిక, గాలి ప్రసరణ లాంటి మార్గాల్లో విద్యుదుత్పాదనను భారీ ఎత్తున చేపట్టాలి. ఉదాహరణకు.. మన దేశంలో పశ్చిమ్‌బంగ - టైడల్ శక్తి; ఉత్తర్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, రాజస్థాన్ - సౌరశక్తి; తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ - పవన శక్తి; తమిళనాడు, కేరళ - అలల శక్తి ద్వారా విద్యుదుత్పాదనలో ముందున్నాయి.
* రోడ్డు, రైలు మార్గాలకు ప్రత్యామ్నాయంగా జల మార్గ రవాణాను ప్రోత్సహించాలి.
* ఎయిర్ కండిషనింగ్, కార్లు లాంటి నిత్యావసరాలు కాని ఉపకరణాల వినియోగాన్ని తగ్గించాలి.

 

జనాభా పెరుగుదల, నగరీకరణ

  క్రీ.పూ. 8 వేల సంవత్సరాల కిందటే వ్యవసాయం ప్రారంభమైందని అంచనా. అప్పట్లో ప్రపంచ జనాభా కేవలం 40 లక్షలు ఉంటే అది క్రీ.శ.1750 నాటికి 50 కోట్లు. ప్రస్తుతం ప్రపంచ జనాభా 732 కోట్లకు చేరింది. ఇలా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నివాస, రవాణా, ఆరోగ్యం, ఆహారం తదితర సదుపాయాలను ప్రభుత్వాలు కల్పించాల్సి ఉంటుంది. వీటి కోసం భారీ పరిశ్రమలను స్థాపించాలి. ఫలితంగా ఆయా పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాల వల్ల కాలుష్యం పెరుగుతోంది. రెండో ప్రపంచ యుద్ధానంతరం రసాయన ప్రగతి కూడా విపరీతంగా పెరిగింది. దీంతో మూడో ప్రపంచ దేశాల్లో సాంప్రదాయిక సహజ వనరుల స్థానంలో కృత్రిమ పదార్థాల వినియోగం ఎక్కువైంది. ఇటీవల పత్తి, ఉన్ని, పట్టుకు బదులు నైలాన్, సింథటిక్ పదార్థాలు; కలపకు బదులు అల్యూమినియం; పొలాల్లో సేంద్రియ ఎరువులకు బదులు రసాయనిక ఎరువుల వినియోగం ఎక్కువ కావడం వల్ల పర్యావరణం సంక్షోభానికి గురైంది. 

  జనాభా పెరుగుతున్న కొద్దీ నివాసాలకు, వ్యవసాయ వినియోగం కోసం అడవులను నిర్మూలిస్తున్నారు. ఇలా జనాభా అవసరాల కోసం అడవులను నరికి వేయడంతో వన్యమృగాలు కూడా అంతరించి పోతున్నాయి. వాతావరణ తరంగాల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల గాలిలో తిరిగే పక్షి సంతతి అంతరించి పోయింది. ఫలితంగా ప్రకృతిలో సమతౌల్యత దెబ్బతిని పర్యావరణం, పరిసరాలు కలుషితమవుతున్నాయి.

 

దుష్ఫలితాలు

  'మనం' వనరుల సంక్షోభంలో ఉన్నాం.. ఎందుకంటే వైద్య సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపడటం వల్ల భూమ్మీద జనాభా భారం అధికమవుతోంది.. ఇలా అధిక జనాభా వల్ల, పదార్థాలను వృథా చేయడంతో పర్యావరణానికి ఎన్నటికీ పూడ్చలేని నష్టం పెరిగిపోయే గండం వస్తుందని హైస్టన్ క్లేడ్ అనే భూవిజ్ఞాన శాస్త్రవేత్త పేర్కొన్నారు.

* 1900 సంవత్సరం నాటికి ప్రపంచం మొత్తం మీద 700 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అడవులు 1975 నాటికి 290 కోట్ల హెక్టార్లకు పరిమితమైపోయాయి. 2010 నాటికి అవి మూడోవంతు అంతరించి పోతాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థలు హెచ్చరించాయి.
* ప్రపంచ జనాభాలో ప్రస్తుతం 17.7% భారతదేశంలో ఉంటే, ప్రపంచ అడవుల విస్తీర్ణంలో సుమారు ఒక శాతం మాత్రమే భారతదేశంలో ఉన్నాయి. ఇలా దేశంలో సగటున 15 లక్షల హెక్టార్లలో ప్రతి సంవత్సరం అటవీ ప్రాంతం అంతరిస్తోంది.

 

నివారణ చర్యలు

* ప్రకృతిలో పర్యావరణ సమతౌల్యతను కాపాడటానికి.. మొత్తం భూవిస్తీర్ణంలో మూడో వంతు అడవులు ఉండి తీరాలని తీర్మానం చేసుకున్నాం. ఇవి పర్వత, కొండచరియల్లో 60 శాతం, మైదాన ప్రాంతంలో 20 శాతం ఇతర ప్రాంతాల్లో మిగిలిన శాతం అడవులు ఉండాలని భారతదేశం 1952లో తీర్మానం చేసింది. ఈ ప్రకారం అడవుల పెంపకం, పరిరక్షణ దిశగా చర్యలు చేపట్టాలి.
* అడవులు తగ్గుతున్న కొద్దీ ప్రకృతిలో సమతౌల్యత దెబ్బతింటుంది. అందువల్ల మానవుడి దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న అడవులను పరిరక్షించడంతో పాటు కొత్త ప్రాంతాల్లో వన సమీకరణ చేపట్టాలి.
* జనాభా పెరుగుదలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అక్షరాస్యత శాతాన్ని పెంచి, స్త్రీ విద్యను నిర్బంధం చేయడం ద్వారా అధిక జనాభా సమస్యను నివారించవచ్చు.

 

నగరాలు, పట్టణాల్లో కాలుష్యం

  21వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో పరిశ్రమలు, వాహనాల రద్దీ, జనసాంద్రత భారీగా పెరిగింది. దీనికి తగ్గట్టే కాలుష్యం కూడా పెరిగింది. వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి తగ్గి, విషవాయువుల పరిమాణం పెరగడంతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది.

ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో తక్షణమే పరిష్కరించాల్సిన సమస్యల్లో జల, వాయు, ధ్వని కాలుష్యాలతోపాటు పరిసరాల కాలుష్యం కూడా ప్రధానమైంది.
పట్టణాల్లో ఇళ్లతోపాటు, మార్కెట్లు, హోటళ్లు, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కూడా తీవ్ర కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయి. వీటిని చాలా దూర ప్రాంతాలకు తరలించి శుద్ధి చేయాలి.

 

దుష్ఫలితాలు

* పట్టణాల్లో మురుగు నీటిపారుదల సౌకర్యాలు, మలమూత్ర విసర్జనకు సదుపాయాలు లేనందున.. వర్షాకాలంలో చెత్తాచెదారాలు, మురుగుతో మంచినీరు కలుషితం అవుతోంది. రోగకారక క్రిములు పెరుగుతున్నాయి.
* ఈగలు, దోమలు వ్యాప్తి చెందడం వల్ల అనేక అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి.
* మురికి గుంటలు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. మలేరియా, మెదడువాపు, బోదకాలు లాంటి వ్యాధుల వ్యాప్తికి ఇవి కారణమవుతున్నాయి.

 

నివారణ చర్యలు

* రసాయన ఎరువులు, క్రిమిసంహారకాల వాడకం తగ్గించడం ద్వారా పర్యావరణ పరిస్థితులను మెరుగు పరచవచ్చు.
* పారిశ్రామిక కాలుష్య నివారణ కోసం సైక్లోన్ సెపరేటర్స్, వెన్చూరి స్క్రూబర్స్, స్ప్రేటవర్స్, బ్యాగ్ ఫిల్టర్స్ లాంటి పరికరాలను అమర్చాలి.

 

పర్యావరణ సంక్షోభానికి కారణమవుతున్న ప్రధాన అంశాలు

* తరుగుతున్న ఓజోన్ పొర మందం
* భూమి వేడెక్కుతున్న ప్రక్రియ
* పరిశ్రమల ద్వారా జరిగే కాలుష్యాలు
* జనాభా విపరీతంగా పెరిగిపోవడం
50 సంవత్సరాల వయసున్న ఒక వృక్షం ఏటా ఒక టన్ను ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. 50 టన్నుల నీటిని నిల్వ చేస్తుందని అంచనా. ఈ లెక్కన దాని జీవిత కాలంలో దాదాపు రూ.15 లక్షల లాభాన్ని చేకూరుస్తుంది.

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స‌హ‌జ‌వ‌న‌రులు

* సహజ వనరులే మన సంపద
* సంరక్షణ అందరి బాధ్యత

 

  సమాజంలో ఎవరైనా నీతికి విరుద్ధంగా చేసే పనులన్నీ అనైతిక చర్యలు. గత కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి అక్రమ, అనైతిక చర్యలు పెరిగి పోతుండటంతో పర్యావరణంలో అసమతౌల్యం పెరిగిపోతోంది. మరోవైపు సహజ వనరులు తరిగి పోతున్నాయి.
ప్రకృతి ప్రసాదించిన గాలి, నీరు, భూమి, ఖనిజ సంపద, అడవులను సహజవనరులుగా పరిగణిస్తారు. సమాజ జీవనంలో వ్యవసాయం వంటి వాటికి ఉపయోగపడే జంతువులను కూడా సహజవనరులుగానే పరిగణిస్తాం. ఇవి కూడా పర్యావరణంలో ముఖ్య భాగం. అందుకే భారతీయ సంస్కృతిలో చాలామంది సంప్రదాయంగా జంతువులను ఆరాధిస్తుంటారు.

 

సహజ వనరులు.. రకాలు

బపునరుద్ధరణ వ్యూహం ఆధారంగా సహజ వనరులను 2 రకాలుగా వర్గీకరిస్తారు.

 

1. పునరుద్ధరించగల సహజ వనరులు

ఈ రకమైన వనరులను ప్రవాహ వనరులు అనికూడా అంటారు. ఇవి స్థిరంగా ఉండి తరిగిపోని వనరులు. తిరిగి సమకూర్చుకోగలిగిన లేదా సృష్టించుకోగలిగిన వనరులను పునరుద్ధరించగల సహజ వనరులు అంటారు. ఇవి పరిమితి లేకుండా సమకూరుతుంటాయి. ఇలాంటి పునరుద్ధరించగల సహజ వనరులను ఉపయోగించేటప్పుడు సంఘ ప్రయోజన దృక్పథం అవసరం. ఎందుకంటే ఒక వనరు ఉపయోగించే విధానం వేరొక వనరుపై ప్రభావాన్ని చూపుతుంటుంది.
ఉదా: నీరు, అడవులు, మత్స్యసంపద, సౌరశక్తి, తరంగశక్తి, జంతుజాలాలు.

 

2. పునరుద్దరించలేని సహజ వనరులు

ఇవి అంతరించిపోయే స్వభావం ఉన్న వనరులు. వీటిని తిరిగి సృష్టించుకునే అవకాశాలు ఉండవు. వినియోగ ప్రక్రియలో ఈ వనరులు అంతరించిపోతాయి. ఒక నిర్ణీత సమయంలో వీటి పరిమాణం స్థిరంగా ఉంటుంది. ఉదా: బొగ్గు నిల్వలు, పెట్రోలియం, గ్యాస్, ఖనిజ నిక్షేపాలు. వీటిలో కొన్ని ఖనిజపరమైన వనరులను పునఃచక్రీకరణ (రీసైక్లింగ్) చేయవచ్చు. మొదటిసారిగా ఉపయోగించినప్పుడు ఇవి నశించిపోతాయి. రీసైక్లింగ్ చేయడం ద్వారా తిరిగి వీటిని వేరొక రూపంలో ఉపయోగించుకోవచ్చు. ఉదా: రాగి, వెండి, బంగారం.

 

ప్రాధాన్యం
 

* సహజ వనరులు భౌతిక పర్యావరణంలో భాగంగా ఉంటూ మానవుడు, జంతువులు, ఇతర జీవరాశుల మనుగడకు తోడ్పడతాయి
* భూమి లాంటి సహజ వనరు వ్యవసాయం, పారిశ్రామిక, గృహనిర్మాణం, తృతీయరంగ కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది.
* సహజ సంపద ఒక దేశం భౌగోళిక ఉనికి, ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేస్తుంది.
* సౌరశక్తి, వాయుశక్తి, తరంగశక్తి, ప్రవాహ వనరులు నిరంతరం అందుబాటులో ఉంటాయి.
* ఆహారం, పశుగ్రాసం, వంటచెరుకు.. సహజ వనరులైన మొక్కలు, చెట్ల ద్వారా లభిస్తాయి. పర్యావరణ సమతౌల్యానికి, సకాల వర్షాలకు అడవులు ఎంతో తోడ్పడతాయి.
ఇలా సహజ వనరులు నిష్క్రియాత్మకంగా ప్రకృతిలో నిక్షిప్తమై ఉంటాయి. భారతదేశం, అర్జెంటీనా, బ్రెజిల్ లాంటి దేశాల్లో సహజ వనరులు ఎక్కువ. స్విట్జర్లాండ్, ఇంగ్లండ్, జపాన్ లాంటి దేశాల్లో సహజ వనరులు తక్కువ. దీన్నిబట్టి పరిశీలిస్తే నిరంతర పరిశోధన, నూతన వనరుల అన్వేషణకు ప్రతి దేశంలోనూ ప్రోత్సాహం ఉండాలి. వనరుల నిర్వహణలో జీవవైవిధ్యం, ఆవరణ సంతులన సాధించడానికి దేశాలన్నీ ప్రయత్నించాలి.

 

ప్రధాన వనరులు

 

భూమి

భూమి, సంబంధిత వనరులు అంటే విస్తృతార్థంలో జీవావరణపు స్వరూప స్వభావంతో విస్తరించిన భూ ఉపరితలభాగం. కొన్ని సందర్భాల్లో భూమిని సహజ, నశింపజేయ వీల్లేని మృత్తికాశక్తిగా నిర్వచించవచ్చు. భూమి అనేది నిర్ధారిత భౌతిక సంపద. సహజ వనరులన్నీ భూమిపైనా, అంతర్గతంగా ఆవరించి ఉండి, పరిమిత సరఫరా కలిగి ఉన్నాయి.
ఉదా: భౌగోళిక ప్రదేశాలు, ఖనిజ నిల్వలు

 

వృక్షాలు

వృక్షాలు, జంతుజాలం కలిసి పర్యావరణానికి ఒక సమగ్ర స్వరూపాన్ని కలుగజేస్తున్నాయి. ఈ రెండింటి పరిరక్షణ పర్యావరణ సమతౌల్యానికి చాలా అవసరం. వృక్షాలు వేర్లతో నేలను పట్టుకోవడం ద్వారా మృత్తికా క్రమక్షయాన్ని తగ్గించి నీటి నాణ్యతను పెంచుతున్నాయి. మనం పీల్చే గాలిని శుభ్రపరుస్తున్నాయి. జంతువులకు కావాల్సిన ఆహారాన్ని అందిస్తూనే, వన్యప్రాణులకు ఆవాసాలుగా మారుతున్నాయి. చెట్లు ప్రధానమైన సహజవనరులు. కాబట్టి ఎన్ని వీలైతే అన్ని చెట్లను నాటడం మన బాధ్యత. ఇవి పుస్తకాల తయారీకి కావాల్సిన కాగితపు గుజ్జునిస్తాయి. అడవుల ద్వారా పండ్లు, తేనె, కలప, వంట చెరుకు, సుగంధ ద్రవ్యాలు, పూలు, ఔషధాలు, ఇంధనం; బొమ్మలు, బూటుపాలిష్, టూత్‌పేస్టుల తయారీకి కావాల్సిన ముడిసరుకులు లభిస్తాయి.

 

నీరు

నీరు మనకు జీవనాధారం. నీటిలో ఉపరితల జలం, భూగర్భజలం అనే రెండు రకాలుంటాయి. భూ ఉపరితలంపై 79% నీరు ఆక్రమించి ఉంది. భూమి ఉపరితలంపై ఉన్న నీటిలో 97.25% ఉప్పునీరు, 2.75% మంచినీరు ఉంది. మూడింట రెండొంతుల నీటిని మంచు కప్పేసింది. జల విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు తయారీలో ఉపయోగపడుతూ, నీరు పునరుత్పాదక వనరుగా మెరుగైన పాత్ర పోషిస్తోంది.

 

గాలి

ఇది ప్రధానమైన సహజ వనరు. ఇది భూమిపై ఉన్న సకల జీవరాశికి అత్యావశ్యకం. ప్రతిప్రాణి మనుగడకు గాలి అవసరం. ఇంధనాలు మండటానికి, రసాయన చర్యలు జరగడానికి ఇది తప్పనిసరి. ప్రాణికోటికి జీవనాధారమైన గాలి తరిగిపోని సహజవనరు.

 

ప్లాస్టిక్, పురుగుమందుల వినియోగం

ప్లాస్టిక్: ప్లాస్టిక్ అనేది క్లిష్టమైన భార అణువులతో కూడిన పాలిమర్లు. ప్లాస్టిక్ పరిశ్రమల్లో తయారుచేసే కృత్రిమ లేదా పాక్షిక కృత్రిమ కర్బన ఘన పదార్ధాలు.

పర్యావరణ సమస్యలు తెచ్చిపెట్టే కొన్ని నూతన రసాయన పదార్థాల్లో ప్లాస్టిక్ ఒకటి. దీని తయారీలో పాలీఎథిలీన్, పాలీవినైల్ క్లోరైడ్, పాలీస్టిరీన్ అనే రసాయనాలు ఉపయోగిస్తారు. నదులు, ఉద్యానాలు, వీధులు, సముద్రాలు, తీరప్రాంతాలనూ ప్లాస్టిక్ కలుషితం చేస్తోంది. ఒకవేళ ప్లాస్టిక్‌ని మండించినట్లయితే అది గాల్లోకి విషవాయువులను చిమ్ముతుంది. చాలా జంతువులు ప్లాస్టిక్‌తో మిళితమైన ఆహారాన్ని తిని చనిపోతున్నాయి.
ప్లాస్టిక్ క్యాన్సర్ లాంటి వ్యాధులకు దారితీస్తుంది. దీన్ని పునశ్శుద్ధి చేసే విధానం కూడా చర్మ, శ్వాసకోశ సంబంధ సమస్యలతో ముడిపడి ఉంది. అందువల్ల అందరూ ప్లాస్టిక్ సంచులకు బదులు దుస్తుల సంచులను వాడి ప్లాస్టిక్‌ను నియంత్రించవచ్చు.

పురుగుమందులు: క్రిమి కీటకాలను చంపడానికి, నిరోధించడానికి, నియంత్రించడానికి పురుగుమందులను ఉపయోగిస్తారు. ఆహారోత్పత్తిలో విరివిగా యూరియా, పురుగుమందులను వాడటం వల్ల వాటి అవశేషాలు ఆ ఆహారాన్ని తీసుకునే వారిలోనూ కనిష్ఠ స్థాయిలో కనిపిస్తాయి. కీటకనాశినులను తరచూ వాడే రైతులు తలనొప్పి, అలసట, నిద్రలేమి, చేతులు వణకడం, నాడీ సంబంధ సమస్యలతో బాధ పడుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లల్లో ఈ పురుగుమందుల ప్రభావంతో నాడీ వ్యవస్థ దెబ్బతింటోంది.

 

ప్రత్యామ్నాయాలు:

* పురుగుల నియంత్రణలో సూక్ష్మజీవులు, వివిధ జీవ రసాయనాలను వాడాలి.
* కీటకాల పెరుగుదలను అరికట్టాలి.
* సేంద్రీయ వ్యర్థాలను వాడాలి.
* మిశ్రమ పంటలు, పంటమార్పిడి పద్ధతులను అవలంబించాలి.
* పురుగులను చంపే ఇతర జీవులను పంటల్లో వదలాలి.

 

తరిగిపోతున్నాయి జాగ్రత్త!

గత కొన్ని దశాబ్దాలుగా పర్యావరణం క్షీణిస్తోంది. ఫలితంగా సహజ వనరులు తరిగిపోతున్నాయి.

 

1. తరుగుదల లేదా క్షయం

సహజ వనరుల పునరుత్పత్తి కంటే వేగంగా వాటి వినియోగం జరిగితే దాన్ని సహజ వనరుల తరుగుదల అంటారు.

 

2. మృత్తికా క్రమక్షయం

గాలి లేదా నీరు వరద ప్రవాహం వల్ల భూ ఉపరితలంపై మట్టి, రాళ్లు ఉన్నచోటు నుంచి క్రమక్షయం చెంది మరోచోట నిలిచిపోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు. అధిక మృత్తిక క్షయం వల్ల నేలలు సారహీనమై ఎడారులుగా మారతాయి. నేలసారం తగ్గి వ్యవసాయోత్పత్తి కూడా తగ్గిపోతుంది. నేల సారహీనం కావడానికి గాలి, నీరు, ప్రాథమిక కారణాలు. ఇందులో 84% నేల సారహీనం కావడానికి కారణమైతే మిగతా 16% భౌగోళిక పర్యావరణ సమస్యల వల్ల ఉత్పన్నమవుతుంది. ఇలా మృత్తికాక్షయానికి గాలితోపాటు వర్షపాతం, నదులు, ప్రవాహాలు, తీరప్రాంతాలు, మంచుప్రాంతాలు, మంచుగడ్డ కట్టడం లాంటివి కారణాలుగా చెప్పవచ్చు.

 

నివారణ చర్యలు

* సాగు భూముల మధ్య గడ్డి పెంచడం
* సాగు నేలను అతిగా ఉపయోగించకుండా, ఎక్కువగా పశువులు మేయకుండా చూడటం.
* వివిధ రకాల మొక్కలను పెంచడం ద్వారా జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించడం.
* తడి నేలను పరిరక్షించడం.
* మొక్కలు, రకరకాల గడ్డి జాతులను పెంచడం.
* బంజరు భూముల్లో ఎక్కువ మొత్తంలో చెట్లు పెరిగేలా చూడటం.

 

3. అడవుల నరికివేత

మానవులు తమ అవసరాల కోసం అడవులు, సంబంధిత పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. పారిశ్రామిక యుగం నుంచి దాదాపుగా ప్రపంచంలోని సగభాగం అడవులు ధ్వంసం కావడంతో లక్షలాది జంతు, వృక్షజాతులు అంతరించిపోయాయి.
అడవుల నరికివేతకు చాలా కారణాలున్నాయి. నరికివేసిన అటవీ భూభాగాన్ని పశువుల దాణా, వ్యవసాయం, ఆవాసాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇలా అటవీ భూములకు ప్రత్యామ్నాయాలు లేకపోవడం వల్ల వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతోంది. జీవవైవిధ్యం లోపించడం వల్ల భూములు బంజర్లుగా మారుతున్నాయి.

 

నష్ట నివారణ చర్యలు

* అడవుల నరికివేత అవసరమైనప్పుడు మరొక ప్రాంతంలో తప్పనిసరిగా మొక్కలను పెంచాలి.
* చెట్లు, అడవుల పరిరక్షణ కోసం పాటుపడేవారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి.
* కచ్చితంగా, నిజాయతీగా ఉండే అధికారుల యాజమాన్యంతో అడవులను సంరక్షించాలి.

 

ముఖ్యాంశాలు

* ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ నివేదిక ప్రకారం.. ప్రతి సంవత్సరం సుమారు 15 కోట్ల చెట్లను నరికి వేస్తున్నారు.
* 1960లో 'ఏజెంట్ ఆరేంజ్' అనే రసాయనాన్ని యుద్ధ సమయంలో అమెరికా, వియత్నాంపై ప్రయోగించింది. ఈ రసాయన ప్రభావం వల్ల మొక్కల ఆకులు రాలిపోతాయి, ఎండిపోతాయి.
* అడవులను పెంపొందించి పర్యావరణాన్ని కాపాడటం కోసం భారత ప్రభుత్వం 5వ పంచవర్ష ప్రణాళికలో సామాజిక అడవుల కార్యక్రమాన్ని ప్రారంభించి, 6వ ప్రణాళికలో అభివృద్ధి చేసింది.
* తెలంగాణ ప్రభుత్వం తరిగిపోతున్న అడవులను పెంపొందించేందుకు 2015 జులై 3-7 తేదీల మధ్య 'హరితహారం' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
* మానవ వ్యర్థ పదార్థాలు సముద్రాల్లో కలిసిపోవడం వల్ల నత్రజని శాతం పెరిగి రకరకాల జలచరాలు మరణిస్తున్నాయి. ఫలితంగా ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. దీన్ని 'బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ)' అంటారు.

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స‌హ‌జ‌వ‌న‌రులు

మాదిరి ప్రశ్నలు

 

1. వాతావరణంలో అత్యధికంగా ఉన్న జడ వాయువు ఏది?
జ: ఆర్గాన్

 

2. ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు ఏవి?
ఎ) గాలి బి) నీరు సి) భూమి డి) ఇవన్నీ
జ: డి(ఇవన్నీ)

 

3. భౌగోళిక పర్యావరణ సమస్యల వల్ల ఎంత శాతం నేల సారహీనం అవుతుంది?
జ: 16%

 

4. భారత ప్రభుత్వం ఏ ప్రణాళికలో 'సామాజిక అడవుల కార్యక్రమాన్ని' ప్రారంభించింది?
జ: 5వ

 

5. వియత్నాంతో యుద్ధ సమయంలో అమెరికా అక్కడి అడవులను నాశనం చేయడానికి ఏ రసాయనాన్ని ఉపయోగించింది?
జ: ఏజెంట్ ఆరెంజ్

 

6. కింది వాటిలో ప్రపంచంలో సహజ వనరులు ఎక్కువ ఉన్న దేశమేది?
ఎ) బ్రెజిల్ బి) అర్జెంటీనా సి) భారతదేశం డి) పైవన్నీ
జ: డి(పైవన్నీ)

 

7. వాతావరణంలో ఆమ్లజని శాతం ఎంత?
జ: 21%

 

8. భూ ఉపరితలంపై ఉన్న మంచినీటి శాతం ఎంత?
జ: 2.75%

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సునామీ

మాదిరి ప్రశ్నలు

 

1. ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు, సునామీల శాతం ఎంత?
జ: 8%

 

2. భారతదేశంలో సునామీలు ఎక్కడ వస్తున్నాయి?
జ: బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో

 

3. ఇటీవల బంగాళాఖాతంలో సునామీ ఎప్పుడు ఏర్పడింది?
జ: 2004, డిసెంబరు 26

 

4. సునామీ అంటే ...?
జ: తీరాన్ని ముంచేసిన పెద్ద అలలు

 

5. సునామీ అనేది ఎలాంటి విపత్తు?
జ: భౌగోళిక

 

6. అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉంది?
జ: హోనలూలు

 

7. సునామీలు ఎక్కడ ఏర్పడతాయి?
ఎ) పసిఫిక్ మహాసముద్రం బి) అంట్లాటిక్ మహాసముద్రం
సి) హిందూ మహాసముద్రం డి) పైవన్నీ
జ: డి

 

8. సునామీలు ఏర్పడటానికి ప్రధాన కారణం?
జ: సముద్రాల్లో భూకంపాలు సంభవించడం

 

9. సునామీలు అధికంగా ఏర్పడే సముద్రం ఏది?
జ: పసిఫిక్ మహాసముద్రం

 

10. సునామీలు ఎలా ఏర్పడతాయంటే...?
ఎ) సముద్రాల్లో భూకంపాలు బి) సముద్రాల్లో అగ్నిపర్వత విస్ఫోటం
సి) సముద్రాల్లో భూపాతం డి) పైవన్నీ
జ: డి

 

11. సునామీ ఎప్పుడు సంభవిస్తుంది?
జ: రాత్రి, పగలు సమయాల్లో

Posted Date : 22-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ అంశాలు

  మానవుడు ఎదుర్కొంటున్న ప్రకృతి సిద్ధమైన విపత్తుల్లో భూకంపాలు అత్యంత విధ్వంసకరమైనవి. రోజురోజుకూ సాధిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని ఎదుర్కోవడానికి మనిషి ఎంత ప్రయత్నిస్తున్నా.. ఇవి సవాళ్లు విసురుతూనే ఉన్నాయి. భౌతిక, ఆర్థిక, సాంఘిక, పర్యావరణ అంశాల్లో ఎప్పటికప్పుడు మానవులను వెనక్కు నెట్టేస్తున్నాయి. ఇంతటి విపత్తు కారకాలైన భూకంపాలు ఎలా వస్తాయి? ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశంలో ఇవి సంభవించడానికి దారితీసే పరిస్థితులున్న ప్రాంతాలు ఏవి? హైదరాబాద్ నగరం పరిస్థితి ఏమిటి? భూకంపాలకు సంబంధించిన విపత్తు నిర్వహణ ఎలా ఉండాలి? టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో జనరల్ స్టడీస్ విభాగం - 'విపత్తు నిర్వహణ'లో భూకంపాలు కీలకాంశాల్లో ఒకటి. వీటిపై అభ్యర్థులు సమగ్ర అవగాహన సాధించాలి.

  సరైన సాంకేతిక పరిజ్ఞానం కొరవడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలకే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలు (సూపర్ కంట్రీలు)గా నిలవాలని ప్రయత్నిస్తున్న చైనా, జపాన్ లాంటి వాటికి కూడా భూకంపాలు పెద్ద ప్రశ్నార్థకంగా మారాయి. ఒక సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిగా చిన్న ప్రకంపనలు, భూకంపాలు సంభవిస్తుండగా.. ఒక మాదిరి నష్టం కల్పించే భూకంపాలు రెండెంకెల్లోను, తీవ్రమైన నష్టాలు మిగిల్చే భూకంపాలు ఒక అంకెలోనే ఏర్పడుతున్నాయి. ఇవి మానవుల అభివృద్ధిని కొన్ని దశబ్దాల వెనక్కు నెట్టేస్తున్నాయి. ఇవి వాటిల్లేటప్పుడు ఏమాత్రం ముందుస్తు హెచ్చరికలు జారీచేసే సమయం కూడా ఉండదు.

 

ఎలా సంభవిస్తాయి?

  భూమి ఉపరితలం ఆకస్మికంగా కదలడాన్నే భూకంపం అంటారు. ఖండ పలకల కదలికలు లేదా భూపటల కదలికలు లేదా విరూప కారక చలనాల (టెక్టోనిక్ చలనాలు) వల్ల ప్రధానంగా భూకంపాలు సంభవిస్తాయి. అయితే కొండ చరియలు విరిగి పడటం (భూపాతం), హిమశిఖరాలు విరిగి పడటం (హిమపాతం).. అగ్నిపర్వతాల విస్ఫోటం సందర్భాల్లో; భూమిలోపల యురేనియం, థోరియం లాంటివి విస్ఫోటనం చెందినప్పుడు.. భూపొరల మధ్య సర్దుబాటు జరిగినప్పుడు.. ఇలాంటి మరికొన్ని కారణాల వల్ల కూడా భూమి కంపిస్తుంది.
భూపటల పలకలు అంచుల వద్ద జారడం వల్ల, ఎదురుగా అభిసరణం (కన్వర్జెన్స్) చెందే ప్రాంతాల్లో భూమి పొరల లోపల సంచిత శక్తి విడుదలవుతుంది. ఇలాంటి ప్రాంతాలను భ్రంశ మండలాలు (ఫాల్ట్ జోన్స్) అంటారు. ఈ ప్రాంతాల్లో స్థితి స్థాపక శక్తి, నిరోధక స్థితి స్థాపకతగా మారి ప్రకంపనాలు విడుదలవుతాయి. అవి భూఉపరితలానికి శి, ళీ, లి అనే మూడు రకాల తరంగాలుగా చేరి భూమిని కంపింపజేస్తాయి. ఈ ప్రక్రియ అంతా ఒక్క నిమిషంలో పూర్తవుతుంది.

 

ఎలా గుర్తిస్తారు?

  భూకంపాలను, భూకంపన పరిమాణాన్ని గుర్తించడానికి సిస్మోగ్రాఫ్ (భూకంప లేఖిని) అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. భూకంపాల తీవ్రత / బలం / శక్తిని కొలిచే స్కేలే రిక్టర్ స్కేలు. ఈ మాట బాగా వాడుకలో ఉంది. భూకంపం వల్ల నష్టం జరిగే ప్రాంతాన్ని అధికేంద్రం (న్ప్ఞ్ఠ్థ్మ్ఠ్ిౖ) అంటారు. ఇది నాభికి నేరుగా భూ ఉపరితలంపై ఉండే బిందువు. భూమి లోపలి పొరల మధ్య ప్రకంపనాలు ఏర్పడే అంతర్భాగ కేంద్ర బిందువును నాభి (హైపో సెంటర్) అంటారు. ఈ రెండింటి మధ్య ఉన్న దూరం మీద భూకంప బలం ఆధారపడి ఉంటుంది. నాభిలోతు పెరుగుతుంటే భూకంపం బలం తగ్గుతుంది. నాభిలోతు తగ్గుతుంటే భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 1943లో ఇండోనేషియాలో జరిగిన భూకంప నాభి లోతు 720 కిలోమీటర్లుగా నమోదైంది.

 

భూకంపాలు - రకాలు

1. గాధ భూకంపాలు: భూకంప నాభిలోతు 60 కిలో మీటర్ల కన్నా తక్కువ ప్రాంతంలో ఏర్పడే భూకంపాలు. అధిక శాతం భూకంపాలు ఇవే.

2. మాధ్యమిక భూకంపాలు: నాభిలోతు 60 నుంచి 300 కి.మీ.ల మధ్య ఏర్పడే భూకంపాలు.

3. అగాధ భూకంపాలు: నాభిలోతు 300 నుంచి 700 కి.మీ.లు, ఆపైన జరిగే భూకంపాలు.

 

ఎలా కొలుస్తారు?

  భూకంపాల తీవ్రతను కొలవడానికి పురాతన, నవీన అనే రకాల స్కేళ్లు ఉన్నప్పటికీ మెర్కిలీ స్కేలు, రిక్టర్ స్కేలు ముఖ్యమైనవి. రిక్టర్ స్కేలులో 0-9 వరకూ పాయింట్లు ఉంటాయి. ఇది భూకంప నష్టాన్ని, బలాన్ని రెండింటినీ కొలవగలదు. అందువల్ల దీన్ని మాగ్నిట్యూడ్ స్కేలు అంటారు. ఎంఎస్‌కే స్కేలు (మెద్వదేవ్ స్పాన్ హువర్ - కార్నిక్ స్కేలు), మెర్కిలీ స్కేలు రెండూ ఒకే రకమైనవి. ఇందులో | - శ్రీ|| భాగాలుగా విడగొట్టి ఉంటాయి.
ఎక్కువ దేశాలు రిక్టర్ స్కేలును వాడుతున్నాయి. ఈ స్కేలు ప్రకారం 5.9 లేదా 6 పాయింట్లు దాటితే స్థలాన్ని బట్టి కొంత నష్టం ప్రారంభమవుతుంది. ట్రై నైట్రో టోలిన్ అనే రసాయన పదార్థ విస్ఫోటంతో సంతులనం చేస్తూ ఈ స్కేలును తయారు చేశారు.

 

రెండు భూకంప ప్రాంతాలు

ప్రపంచంలో రెండు భూకంప ప్రాంతాలను నిర్ణయించారు.
1. ఫసిఫిక్ పరివేష్ఠిత మేఖల: ఇది పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ప్రాంతం. ఇందులో దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలోని పెరూ, ఈక్విడార్, చిలీ, కొలంబియా, వెనుజులా వంటి దేశాలున్నాయి. ఉత్తర అమెరికా పశ్చిమతీరంలోని మెక్సికో, కాలిఫోర్నియా, అలస్కా లాంటి అమెరికా రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అలాగే ఆసియా ఖండం తూర్పుతీరంలోని చైనా, జపాన్, రష్యా, ఫిలిప్పైన్స్, ఇండోనేసియా, మలేసియా, న్యూజిలాండ్ దేశాల్లో భూకంపాలు తరుచుగా సంభవిస్తున్నాయి.

2. మధ్యపర్వత మేఖల: ఈ భ్రంశ మండలం యూరప్ ఖండంలోని ఆల్ఫ్స్ పర్వతాల నుంచి, హిమాలయాల వరకూ విస్తరించి ఉంది. ఇందులో భారత్, పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్, ఇరాన్, ఇరాక్, టర్కీ, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలున్నాయి. ఈ విధంగా భూకంపాలన్నీ భ్రంశ మండలాలు, ముడుత పర్వతాలున్న ప్రాంతాల్లో సంభవిస్తున్నాయి.

 

భారతదేశంలో భూకంపాలు

  ప్రపంచంలో అత్యంత నవీన ముడుత పర్వతాలు హిమాలయాలు. నేపాల్‌లో 2015 ఏప్రిల్ 25, ఆ తరువాత సంభవించిన భూకంపాలకు కారణం ఇవే. భారతదేశాన్ని 5 భూకంప జోన్లు(మండలాలు)గా నిర్ణయించారు. అయితే 1997లో వల్నరబులిటీ అట్లాస్ (దుర్బలత్వ అట్లాస్) ప్రకారం ఒకటో జోన్‌ను రెండో జోన్‌లో కలిపేశారు.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రూపొందించిన మ్యాప్ ప్రకారం కింది జోన్‌లు మన దేశంలో ఉన్నాయి.
5వ జోన్: రిక్టర్ స్కేలు తీవ్రత 7 పాయింట్లు దాటిన భూకంప ప్రాంతం. ఇది అత్యంత అపాయకరమైన జోన్. ఇందులో ఉత్తర బిహార్, ఉత్తరాఖండ్ ఉత్తర భాగం, అన్ని ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌లో కొంతప్రాంతం, గుజరాత్‌లోని కచ్, బుజ్ ప్రాంతాలు ఉన్నాయి.
4వ జోన్: రిక్టర్ స్కేలు 6 నుంచి 7 పాయింట్ల తీవ్రత నమోదైన ప్రాంతం. ఇది అధిక అపాయం ఉన్న ప్రాంతం. ఇందులో దిల్లీ, సిక్కింతో పాటు బిహార్, ఉత్తరాఖండ్, గుజరాత్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాలున్నాయి. వీటితో పాటు మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతం ఉంది.
3వ జోన్: రిక్టర్ స్కేలు తీవ్రత 4 నుంచి 6 పాయింట్లున్న ప్రాంతాలు. ఇవి ఒక మాదిరి అపాయం ఉన్న భూకంప ప్రాంతాలు. ఇందులో పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌తోపాటు మధ్య, దక్షిణ భారతదేశం ఉంది. కోల్‌కతా, చెన్నై, ముంబయి నగరాలు కూడా ఉన్నాయి.
2వ జోన్(1, 2 జోన్లు కలిపి): ఈ ప్రాంతాలు అత్యల్ప అపాయం ఉన్నవి లేదా అపాయం లేనివి. ఇందులో రిక్టర్ స్కేలు తీవ్రత 4 పాయింట్ల కంటే తక్కువగా ఉంటుంది. ఈ జోన్ పరిధిలో దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఉన్నాయి.

 

ఉపశమన చర్యలు

సాంకేతిక రంగం అత్యంత అభివృద్ధి సాధించినా భూకంపాలను రాకుండా ఆపలేం. కొన్ని ఉపశమన చర్యలు మాత్రం చేపట్టవచ్చు.
నిర్మాణాత్మక చర్యలు: సరైన ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ పద్ధతులను పాటించడం ద్వారా భవన నిర్మాణాలు చేపడితే కొంత నష్టాన్ని నివారించే వీలుంది.
నిర్మాణేతర చర్యలు: భూకంప దుర్బలత్వం ఉన్న ప్రాంతాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇచ్చిన భవన నిర్మాణ నిబంధనలను అనుసరించడం. భవన నిర్మాణానికి ముందు నిర్మాణ ప్లాన్‌ను పురపాలక యంత్రాంగాలు క్షుణ్నంగా తనిఖీ చేయడం.
జాతీయ భవన నిర్మాణ కోడ్: సమగ్రమైన కోడ్‌ను 1970లో రూపొందించారు. దీన్ని 1987లో రెండుసార్లు, 1997లో ఒకసారి సవరించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో నియమాలను రూపొందించారు.
బిల్డింగ్ మెటీరియల్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్: ఇది భవనాల పునర్నిర్మాణానికి, ప్రాణాలు కాపాడే విధంగా నిర్మాణాలు చేపట్టడానికి సరైన సాంకేతిక పద్ధతులు, సరైన మెటీరియల్ వాడటానికి భాధ్యత వహిస్తుంది.

 

ఇతర నియమాలు:

* గట్టినేలపై ఇల్లు కట్టు కోవాలి.
* మూల మట్టాలన్నింటి వద్ద కనెక్షన్ దృఢంగా ఉండాలి.
* పటిష్ఠమైన పునాది నిర్మించుకోవాలి.
* పైకప్పు దృఢంగా వేయాలి.
* పైకప్పు ఒకే సమీకృత యూనిట్‌గా వేయాలి.
* భవనం సాధారణంగా దీర్ఘ చతురస్రాకార ప్రణాళికతో ఉండాలి.

 

ముఖ్యాంశాలు

* భారతదేశంలో భూకంపాల పర్యవేక్షణకు భారత వాతావరణ విభాగం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది.
* భారత వాతావరణ విభాగం నేషనల్ సిస్మలాజికల్ నెట్‌వర్క్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 55 అధ్యయన కేంద్రాలున్నాయి.
* మనదేశంలోని మెట్రో నగరాల్లో ఒక్క దిల్లీ మాత్రమే భూకంపాల పరిధిలో ఉంది.
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద భూకంపం 1969 ఏప్రిల్ 13న కిచ్చెన్నపల్లి
- గొల్లగూడెం ప్రాంతంలో సంభవించింది. దీన్నే భద్రాచలం భూకంపం అంటారు.
* హైదరాబాద్ నగరం భూకంపాల తీవ్రతలో రెండో జోన్ పరిధిలో ఉంది.
* భారతదేశంలో ఇంతవరకూ పెద్ద భూకంపం 1897లో షిల్లాంగ్ పీఠభూమిలో సంభవించింది. ఇది రిక్టర్‌స్కేలుపై 8.7గా నమోదయింది.
* ప్రపంచంలో ఇంతవరకూ పెద్ద భూకంపం చిలీ భూకంపం. 1960 మే 20న సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌స్కేలుపై 9.25గాను, మెర్కిలీ స్కేలుపై 9.5గాను నమోదైంది.
* ప్రపంచంలో ఇంతవరకు సంభవించిన భూకంపాల్లో రెండో అతిపెద్దది అలస్కా భూకంపం. 1965లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 9.1 గాను, మెర్కిలీ స్కేలుపై 9.2 గాను నమోదైంది.

Posted Date : 22-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ అంశాలు

మాదిరి ప్రశ్నలు

 

1. ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు, సునామీల భాగం ఎంత?
జ: 8%

 

2. భూకంపం అనేది?
జ: వేగంగా జరిగే విపత్తు

 

3. భారతదేశ మొత్తం విపత్తుల్లో భూకంపాల భాగం ఎంత?
జ: 11%

 

4. భూకంపం ఒక .......
జ: భౌగోళిక వైపరీత్యం

 

5. భూకంపాల నుంచి ఉత్పత్తి అయ్యేవి?
జ: ప్రకంపనాలు

 

6. సిస్మోగ్రాఫ్‌కు మొదట చేరే తరంగాలు?
జ: P తరంగాలు

 

7. కింది ఏ దేశంలో భూకంపాలు ఎక్కువ సంభవిస్తాయి?
జ: ఆస్ట్రేలియా

 

8. డిజాస్టర్స్ మిటిగేషన్ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
జ: అహ్మదాబాద్

 

9. భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం?
జ: పసిఫిక్ మహాసముద్రం చుట్టూ

 

10. పెద్ద భూకంపాలు మన దేశంలో కింది ఏ ప్రాంతాల్లో సంభవిస్తున్నాయి?
జ: ఈశాన్య రాష్ట్రాలు

 

11. కింది ఏ తరంగాలను - చీల్చే తరంగాలు అంటారు?
జ: S తరంగాలు

 

12. భారత్ భూభాగంలో ఎంత శాతం భూకంపాలకు అనుకూలంగా ఉంది?
జ: 58.6%

 

13. భూకంప దుర్బలత్వ మ్యాప్ ఆధారంగా కింది ఏ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి?
జ: శ్రీనగర్

 

14. భూకంపాలు ఏర్పడటానికి అవకాశం ఉన్న ప్రాంతాలను ఏమంటారు?
ఎ) భ్రంశ మండలాలు బి) అధికేంద్రాలు
సి) రంధ్ర మండలాలు డి) పైవన్నీ

 

15. భారతదేశంలో అర్బన్ ఎర్త్‌క్వేక్ వల్నరబులిటీ రిడక్షన్ ప్రాజెక్టుని కింది ఏ సంస్థలు నిర్వహిస్తున్నాయి?
జ: భారత ప్రభుత్వం

 

16. అంతర్జాతీయ భూకంప పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
జ: లండన్

 

17. భూకంపాల జోన్‌లో దృఢమైన ఇల్లు కట్టకోవడాన్ని ఏమంటారు?
జ: నిర్మాణాత్మక చర్య

Posted Date : 22-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం

మాదిరి ప్రశ్నలు

 

1. 1992లో 'ధరిత్రి సదస్సు' ఏ నగరంలో జరిగింది?
జ: రియోడి జనీరియో

 

2. 'ప్రపంచ పర్యావరణ దినోత్సవం' ఏ రోజున నిర్వహిస్తారు?
జ: జూన్ 5

 

3. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో హిరోషిమా, నాగసాకిలపై ఏ దేశం అణుబాంబులను వేసింది?
జ: అమెరికా

 

4. కింది వాటిలో ఏవి క్లోరోఫ్లోరోకార్బన్(సీఎఫ్‌సీ)లను విడుదల చేస్తాయి?
        ఎ) రిఫ్రిజిరేటర్లు         బి) వ్యర్థ పదార్థాలు        సి) సూర్యరశ్మి         డి) టెలివిజన్
జ: ఎ(రిఫ్రిజిరేటర్లు)

 

5. వీటిలో వాతావరణాన్ని కలుషితం చేస్తున్న హరిత గృహ వాయువు / వాయువులు ఏది? / ఏవి?
        i) కార్బన్ డై ఆక్సైడ్        ii) కార్బన్‌మోనాక్సైడ్
        ఎ) i మాత్రమే         బి) ii మాత్రమే         సి) i, ii         డి) ఏదీకాదు
జ: సి( i, ii )

 

6. గ్రీన్‌పీస్, ఎర్త్‌లాండ్, ఎర్త్‌ఫస్ట్ అనేవి ...... ?
జ: పర్యావరణ సంఘాలు

 

7. 1962లో పర్యావరణం కోసం 'నిశబ్ద వసంతం' రాసిన గ్రంథకర్త ఎవరు?
జ: రేచెల్ కార్సన్

 

8. 1970లో పర్యావరణాన్ని రక్షించేందుకు ఏ దేశ పార్లమెంటు చట్టాలు చేసింది?
జ: అమెరికా

 

9. 'గ్రీన్‌పీస్' స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
జ: అంటార్కిటికా

 

10. అంతర్జాతీయ పర్యావరణ మొదటి సదస్సు ఎప్పుడు జరిగింది?
జ: 1972

 

11. అంతర్జాతీయ పర్యావరణ సదస్సు ఎక్కడ జరిగింది?
జ: స్టాక్‌హోం

 

12. 1970లో అణ్యాయుధ పరీక్షలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఏది?
జ: గ్రీన్‌పీస్

 

13. పర్యావరణ ప్రత్యేక సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష కార్యాచరణ ఎప్పుడు మొదలైంది?
జ: 1980

 

14. ప్రపంచ 'ఓజోన్ దినం' ఎప్పుడు?
జ: సెప్టెంబరు 16

 

15. కిందివాటిలో 'గ్లోబల్ వార్మింగ్' ఫలితం?
        ఎ) శీతోష్ణస్థితిలో మార్పు         బి) జలమార్పు         సి) మానవ మార్పు         డి) పైవన్నీ
జ: ఎ(శీతోష్ణస్థితిలో మార్పు)

Posted Date : 22-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వైపరీత్యం

* విపత్తు నిర్వహణ
* అన్ని స్థితిగతులపై ప్రభావం

  విపత్తు అంటే అకస్మాత్తుగా సంభవించేది. ప్రకృతిసిద్ధంగా లేదా ప్రమాదవశాత్తూ లేదా నిర్లక్ష్యం వల్ల జరిగే ఈ విపత్తులతో వెంటనే కోలుకోలేనంత ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుంది. ప్రకృతి సహజంగా కావచ్చు లేదా మానవ తప్పిదం వల్ల కూడా కావచ్చు.. దానివల్ల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ప్రకృతి వైపరీత్యాలను నివారించలేం. ఈ వైపరీత్యాల ప్రభావం దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై ఉంటుంది. అసలు వైపరీత్యాలు అంటే ఏమిటి? అవి ఎలా సంభవిస్తాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? వీటన్నింటిపై టీఎస్‌పీఎస్పీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి సమగ్ర అవగాహన అవసరం. ఈ విభాగం నుంచి దాదాపు 8-10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

  మానవుడు భూమిపై ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైన వాటిలో విపత్తులు ఒకటి. 'విపత్తు' ప్రపంచ సమస్య అయితే 'ప్రాంతీయ పరిష్కారం' దీనికి నివారణోపాయం. ఒక సమూహం(ప్రజలు) నుంచి సహాయం పొందాల్సినంత ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగే సంఘటనను దేనినైనా విపత్తుగా పిలవవచ్చు. విపత్తులు ఆయా ప్రాంత ప్రజల ఆర్థిక, సాంఘిక, రాజకీయ, శారీరక, మానసిక స్థితిగతులు.. అన్నింటిపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇవి అనాది కాలం నుంచీ ఉన్నా గత కొన్నేళ్లుగా ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఆస్తినష్టం, ప్రాణనష్టం, పర్యావరణ హానికి కారణమవుతున్నాయి.

 

వైపరీత్యం అంటే...

  ఒక ప్రాంత ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాలకు, పర్యావరణ హానికి కారణమయ్యే సంఘటనను వైపరీత్యంగా భావించవచ్చు. ఎడారిలో భూకంపం సంభవిస్తే ఆస్తి, ప్రాణ నష్టం జరగదు. బంగ్లాదేశ్‌లో 2007లో సంభవించిన సిదర్ తుపానును దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. వరదలు, కరవు, అగ్ని ప్రమాదాలు, భూపాతం (ల్యాండ్ స్త్లెడ్) లాంటి సామాజిక, సహజ విపత్తులు ప్రకృతిసిద్ధంగా, మానవ కారణంగా ఏర్పడతాయి.

 

దుర్బలత్వం అంటే..

  ఒక ప్రాంతం / నిర్మాణం / సేవలు, వాటి స్వభావం రీత్యా అవి విపత్తుభరిత ప్రాంతానికి ఎంత దూరంలో ఉన్నాయి? అనే అంశంపైన దుర్బలత్వం ఆధారపడి ఉంటుంది. ఈవిధంగా వైపరీత్యాల ప్రభావానికి గురయ్యే సునిశితత్వాన్ని పెంచే స్థితిని దుర్బలత్వం అంటారు. ప్రజలపై వైపరీత్యం చూపే ప్రభావం భౌతిక అంశాలపై మాత్రమే కాకుండా ఆ ప్రాంత ప్రజల ఆర్థిక, సాంఘిక స్థితిగతులపై కూడా ఆధారపడి ఉంటుంది. ఆర్థికంగా, సాంకేతికంగా సరైన నిర్మాణాలు లేని పేద దేశాల్లో విపత్తు నష్టం ఎక్కువగా ఉంటుంది. 2001లో గుజరాత్‌లో జరిగిన భూకంపం వల్ల 3.3 బిలియన్ అమెరికన్ డాలర్ల నష్టం జరిగింది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైపరీత్యాల వల్ల అత్యధిక ప్రాణనష్టం జరుగుతుంది. 1970లో బంగ్లాదేశ్‌లో జరిగిన 'బోలా' అనే తుపాను వల్ల 3 లక్షల మంది చనిపోయారు.
భౌగోళిక, జల, జీవకారకమైన భూకంపాలు; సునామీలు, చక్రవాతాలు, వరదలు, వ్యాధులు లాంటి ప్రకృతిసిద్ధ విపత్తులను మానవుడు అడ్డుకోలేడు. నష్టానికి గురయ్యే అవకాశాలు ఉండటం, వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేకపోవడం అనే అంశాల కలయికపై విపత్తు నష్టం ఆధారపడి ఉంది. వాటిని ప్రతిఘటించే సామర్థ్యంపై మానవ పురోగమనం ఆధారపడుతుంది.

 

హ్యోగో కార్యచట్రం

  2005-15 మధ్యకాలంలో విపత్తుల తగ్గింపు, నివారణా కార్యాచరణ ప్రక్రియ కోసం జపాన్‌లోని హ్యోగో ప్రాంతంలోని కోబె వద్ద 2005 జనవరి 18 నుంచి 22 మధ్య ప్రపంచ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విపత్తులకు సంబంధించి ముందు తీసుకోవాల్సిన చర్యలు, తర్వాత చేపట్టాల్సిన తక్షణ కార్యక్రమాలను విపత్తు నిర్వహణతో అనుసంధానం చేసి ఈ వైపరీత్యాల నుంచి ప్రజలు తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పలు నిర్వహణ విధానాలను ప్రతిపాదించారు. అవి..

 

విపత్తు నిర్వహణ

  ఇది విపత్తులను ఎదుర్కొనే అనేక రకాల ప్రక్రియలను తెలియజేస్తుంది. ఇవి విపత్తు ముందు ప్రక్రియలు, తర్వాత ప్రక్రియలు అనే రెండు విధాలుగా ఉండాలని నిర్ణయించారు. విపత్తు ముందస్తు చర్యలు అపాయాన్ని కుదించే విధంగా ఉండాలి. విపత్తు తదనంతర చర్యలు తక్షణ ఉపశమనం, దీర్ఘకాలంలో క్రమంగా తేరుకోవడం అనే అంశాలుగా ఉండాలి.

 

రెండు రకాల చర్యలు

  విపత్తు అపాయ నిర్వహణ విపత్తుకు ముందు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన అంశాలను తెలియజేస్తుంది. ఇందులో సంసిద్ధంగా ఉండటం, తీవ్రతను తగ్గించడం అనే అంశాలకు సంబంధించిన ప్రక్రియలు కలిసి ఉంటాయి. ఈ ప్రక్రియలు నిర్మాణాత్మక, నిర్మాణేతర చర్యలు అనే 2 విధాలుగా ఉండాలి.

 

ఉపశమనం దిశగా..

  విపత్తు అపాయ నిర్వహణ తాత్కాలిక చర్యలకు సంబంధించిన అంశం. విపత్తు తీవ్రత, దాని స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఉపశమన చర్యలను విపత్తు జరిగిన క్షణం నుంచి కొన్ని వారాలు లేదా నెలలు నిర్వహిస్తారు.

 

తేరుకోవడం

  విపత్తుల నుంచి తేరుకునే నిర్వహణ దీర్ఘకాలిక చర్యలను తెలియజేస్తుంది. ఇందులో విపత్తు స్వభావాన్ని బట్టి పునర్నిర్మించడం, స్థిరత్వాన్ని కల్పించడం అనే చర్యలు చేపడతారు. ఇవి కొన్ని సంవత్సరాలు కొనసాగుతాయి.
మన దేశంలో విపత్తు నిర్వహణ మూడు స్థాయిల్లో జరుగుతోంది. అవి..
1. కేంద్రస్థాయిలో - ప్రధానమంత్రి అధ్యక్షతన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ)
2. రాష్ట్రాల స్థాయిలో - ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎస్‌డీఎంఏ)
3. జిల్లా స్థాయిలో - జిల్లా కలెక్టరు / జిల్లా మేజిస్ట్రేట్ / డిప్యూటీ కలెక్టరు / డిప్యూటీ మెజిస్ట్రేట్ అధ్యక్షతన జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (డీడీఎంఏ).
వీటితోపాటు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ఐడీఎం) కొన్ని బాధ్యతలను నిర్వర్తిస్తుంది. విపత్తు నిర్వహణను సంస్థాగతం చేయడం, విపత్తులపై పరిశోధన, విపత్తు నిర్వహణపై శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం, సమావేశాలు ఏర్పాటు చేసి బులిటెన్‌లు ప్రచురించడం వంటి కార్యక్రమాల నిర్వహణ కోసం మన దేశంలోని ఎన్ఐడీఎం పనిచేస్తోంది.

 

ముఖ్యాంశాలు

* ప్రకృతి విపత్తుల నివేదిక ప్రకారం ప్రపంచంలో జరుగుతున్న విపత్తుల్లో ఆసియా ఖండంలో సంభవిస్తున్నవి 37 శాతం. వీటివల్ల జరిగే నష్టం 49 శాతం.
* ప్రపంచంలో ఎక్కువగా విపత్తులకు గురవుతున్న మొదటి 10 దేశాల్లో భారత్ కూడా ఒకటి.
* 2003-2009 ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం సహజ విపత్తుల వల్ల భారతదేశం ఏటా స్థూల జాతీయోత్పత్తిలో 2 శాతం, ప్రభుత్వ ఆదాయంలో 12 శాతం నష్టపోతోంది.
* ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1990 దశకాన్ని అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది. తర్వాత మనదేశంలో విపత్తు నిర్వహణ విభాగాన్ని మొదట వ్యవసాయ శాఖలో ఏర్పాటు చేశారు. 2002లో దీన్ని హోం వ్యవహారాల శాఖకు తరలించారు.

Posted Date : 22-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తు - నిర్వహణ

1. అంతర్జాతీయ విపత్తు కుదింపు మూడో సదస్సు ఎక్కడ జరిగింది?
జ: 2015 మార్చి - సెండాయ్ ‌

 

2. కిందివాటిని జతపరచండి.

వాయువు అంశం/ప్రభావం
i) మిథైల్‌ ఐసోసైనేట్‌ a) జైవిక వ్యవస్థ
ii) ఏజెంట్‌ ఆరెంజ్‌ b) కిరణ ధార్మిక
iii) రేడియో తరంగాలు c) రసాయనిక
iv) మైకోటాక్సిన్స్‌ d) పారిశ్రామిక

జ: i - d, ii - c, iii - b, iv - a

 

3. రాస్టార్, వెక్టార్‌ నమూనాలు ఎందులో భాగాలు?
జ: భౌగోళిక సమాచార వ్యవస్థ

 

4. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ భూతల కేంద్రం (Earth Station) ఎక్కడ ఉంది?
జ: షాద్‌నగర్‌

 

5. కిందివాటిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగం కానిది?
1) పేదరికం, ఆకలిని నిర్మూలించడం             2) ఉత్పత్తి, వినియోగాన్ని పెంపొందించడం
3) క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం     4) లింగ సమానత్వం, మహిళా సాధికారత
జ: 3 (క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం)

 

6. గ్రీన్‌పీస్‌ ఉద్యమం మొదట దేనికి వ్యతిరేకంగా జరిగింది?
జ: అణు వ్యతిరేకత

 

7.  కిందివాటిలో జల కాలుష్యం  వల్ల రాని వ్యాధి?
1) కలరా      2) కామెర్లు      3) మలేరియా      4) డయేరియా
జ: 3 (మలేరియా)

 

8. కిందివాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి.
1) జాతీయ హరిత ట్రైబ్యునల్‌      2) జీవ వైవిధ్య చట్టం
3) జాతీయ వన్యప్రాణి చట్టం        4) జల కాలుష్య నియంత్రణ చట్టం
జ: 3421

 

9. పర్యావరణంపై భారత పార్లమెంట్‌ చేసిన చట్టాల్లో సరికానిది.   
1) పర్యావరణ పరిరక్షణ చట్టం - 1986                 2) బయోస్ఫియర్‌ చట్టం - 1988
3) వాయు కాలుష్య నియంత్రణ చట్టం - 1981      4) హాట్‌స్పాట్‌ చట్టం - 2006
జ: 2 (బయోస్ఫియర్‌ చట్టం - 1988)

 

10. కిందివాటిలో సరైంది? 
a) క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం వాతావరణ మార్పునకు సంబంధించింది. 
b) మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఓజోన్‌ తరుగుదలకు సంబంధించింది.
జ: a, b సరైనవి

 

11. కిందివాటిలో సరికానిది? 
1) అంతర్జాతీయ సునామీ దినోత్సవం - నవంబరు 5     2) అంతర్జాతీయ అటవీ దినోత్సవం - మార్చి 20
3) అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం - ఏప్రిల్‌ 22             4) అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం - మే 22
జ: 2 (అంతర్జాతీయ అటవీ దినోత్సవం - మార్చి 20)

 

12. కిందివాటిని జతపరచండి.

సమావేశం వేదిక
i) ఓజోన్‌ తగ్గుదల సదస్సు a) న్యూదిల్లీ
ii) అంతర్జాతీయ సౌర కూటమి సదస్సు b) కిగాలి
iii) COP - 24 సదస్సు c) న్యూయార్క్‌
iv) సుస్థిరాభివృద్ధి  లక్ష్యాల సదస్సు d) కెటోవీస్‌

జ: i-,b ii-a, iii-d, iv-c

 

13. కిందివాటిలో సరైంది ఏది?
1) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2015 - 30 వరకు వర్తిసాయి 
2) SDG లో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉప లక్ష్యాలు ఉన్నాయి
3) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2015, సెప్టెంబరు 25న ఆమోదించారు
జ: 1, 2, 3 సరైనవి

 

14. అప్పికో ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?
జ: కర్ణాటక

 

15. కిందివాటిలో పర్యావరణ ఉద్యమాలకు సంబంధించి సరికానిది?
1) క్షిపణులకు వ్యతిరేకంగా బాలియాపాల్‌ ఉద్యమం జరిగింది.
2) మేధాపాట్కర్‌ ‘నర్మద బచావో’ ఆందోళన చేపట్టారు.
3) ఝార్ఖండ్‌లో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా జంగిల్‌ బచావో ఉద్యమం జరిగింది. 
4) యురేనియం వ్యతిరేక ఉద్యమం నిశ్శ‌బ్ద లోయలో  జరిగింది.
జ: 4 (యురేనియం వ్యతిరేక ఉద్యమం నిశ్శ‌బ్ద లోయలో జరిగింది.)

 

16. కిందివాటిని జతపరచండి.

i) ధరిత్రీ సదస్సు a) జోహెన్నస్ ‌బర్గ్‌ - 2002
ii) పర్యావరణ సదస్సు b) హైదరాబాద్‌ - 2012
iii) జీవవైవిధ్య సదస్సు c) స్టాక్‌హోం - 1972
iv) సుస్థిరాభివృద్ధి సదస్సు d) రియో - 1992

జ: i - d, ii - c, iii - b, iv - a

 

17. జీవావరణ పిరమిడ్‌లో మొదటి మెట్టులో ఉన్నదెవరు?
జ: ఉత్పత్తిదారులు

 

18. కిందివాటిలో జాతీయ విపత్తు నిర్వహణ సపోర్ట్‌ ప్రోగ్రాంను నిర్వహించేది?
     1) ISRO      2) GIS      3) NRSA      4) NGRI
జ: 3 (NRSA)

 

19. క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
జ: 2005, ఫిబ్రవరి 16

 

20. జాతీయ కార్యాచరణ ప్రణాళిక వాతావరణ మార్పు కోసం 2016 డిసెంబరులో ఎన్ని జాతీయ ప్రణాళికలను అమలుపరిచింది?
జ: 8

 

21. కిందివాటిలో సరైనవి గుర్తించండి.  
1) 2016 కరవు నిర్వహణ కరదీపిక దీర్ఘకాలిక కరవు 33% ఉన్నట్లు పేర్కొంది.
2) కరవు పీడిత ప్రాంతం కింద 35% ఉన్నట్లు పేర్కొంది.
3) 10% కంటే ఎక్కువ అవపాతం లోపించినట్లయితే దాన్ని వాతావరణ కరవు అంటారు.
జ: 1, 2, 3 సరైనవి

 

22. కిందివాటిని జతపరచండి.

అంశం శాతం
i) కరవు ప్రభావం a) 10%
ii) వరద ప్రభావం b) 59%
iii) భూకంప ప్రభావం c) 12%
iv) తుపాన్ల ప్రభావం d) 68%

జ: i - d, ii - c, iii - b, iv - a

 

23. నైలోమీటర్‌ సాధనాన్ని దేన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు?
జ: వరదలు

 

24. కిందివాటిలో ఉష్ణ మండల చక్రవాత వర్గీకరణ వేగానికి సంబంధించి సరికానిది. 
1) తుపాన్‌ స్ట్రోమ్‌ : 62 - 88 కేఎంపీహెచ్‌         2) వాయుగుండం : 31 - 49 కేఎంపీహెచ్‌ 
3) అల్పపీడన ద్రోణి : 50 - 61 కేఎంపీహెచ్‌      4) సూపర్‌ సైక్లోన్‌ : 221 కేఎంపీహెచ్‌ పైన
జ: 3 (అల్పపీడన ద్రోణి : 50 - 61 కేఎంపీహెచ్‌) 

 

25. కొరియాలీస్‌ ఎఫెక్ట్‌ ప్రకారం చక్రవాతాల గమనానికి సంబంధించి సరైంది.
1) ఉత్తరార్ధ గోళంలో చక్రవాతాలు సవ్య పద్ధతిలో వీస్తాయి. 
2) దక్షిణార్ధ గోళంలో అపసవ్య పద్ధతిలో వీస్తాయి.
జ: 1, 2 రెండూ సరైనవికావు

 

26. కిందివాటిలో సరైంది ఏది? 
1) హజార్డ్‌ అనే పదం అరబిక్‌ భాష నుంచి వచ్చింది. 
2) డిజాస్టర్‌ అనే పదం ఫ్రెంచ్‌ భాష నుంచి ఆవిర్భవించింది.
జ: 1, 2 సరైనవి

 

27. కిందివాటిలో ప్రకృతి విపత్తుల్లో భాగం కానిది?
       1) హిమపాతాలు       2) ఉరుములు, పిడుగులు      3) వన నిర్మూలన      4) ఉష్ణశీతల గాలులు
జ: 3 (వన నిర్మూలన)

 

28. ప్రస్తుతం దేశంలోని ఎన్ని రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నాయి?
జ: 27

 

29. భారతదేశంలో భౌగోళికంగా కరవులు ఎక్కువగా ఏ ప్రాంతంలో సంభవిస్తున్నాయి?
జ: పశ్చిమ - దక్షిణ భారత్‌

 

30. విపత్తు సంభవించినప్పుడు అవసరమైనవి?
       1) అత్యవసర స్పందన, సహాయం        2) పునరావసం, పునర్నిర్మాణం
       3) సంసిద్ధత                                       4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

31. కిందివాటిలో సరికానిది.  
1) జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని (NDRF) విపత్తు చట్టం సెక్షన్‌ 44 ప్రకారం ఏర్పాటు చేస్తారు.
2) NDRF కేంద్ర హోంమంత్రి నిర్వహణలో ఉంటుంది.
3) NDRF లో ప్రస్తుతం 12 బెటాలియన్లు ఉన్నాయి.
4) ప్రస్తుతం 10వ CRPF బెటాలియన్‌ విజయవాడలో ఉంది. 4
జ:  4  

 

32. ప్రపంచంలో సంభవించే వైపరీత్యాల్లో కిందివాటిలో సరికానిది? 
1) భూకంపాల వల్ల 8% నష్టం కలుగుతుంది         2) వరదల వల్ల 30% నష్టం కలుగుతుంది
3) చక్రవాతాల వల్ల 21% నష్టం కలుగుతుంది.       4) కరవుల వల్ల 20% నష్టం కలుగుతుంది.
జ: 4 (కరవుల వల్ల 20% నష్టం కలుగుతుంది.)

 

33. ఏదైనా భౌగోళిక ప్రాంతంలో లేదా ఒక కమ్యూనిటీలో సంభవించే వైపరీత్యాల వల్ల జరిగే నష్ట తీవ్రత, పరిధి, పరిస్థితులు దేనికి దారితీస్తాయి?
జ: దుర్బలత్వం

 

34. 1999, ఆగస్టు 20న విపత్తు నిర్వహణపై అత్యున్నతాధికార కమిటీని ఎవరి అధ్యక్షతన వేశారు?
జ: జె.సి. పంత్‌

 

35. విపత్తు తీవ్రతను సాధారణంగా దేన్ని బట్టి అంచనా వేస్తారు?
జ: ప్రాణ, ఆస్తి నష్టం

 

36. కిందివాటిలో విపత్తులు, వాటి నోడల్‌ మంత్రి బాధ్యతలను జతపరచండి.

విపత్తు  మంత్రి
i) పరిశ్రమలు - రసాయనాలు A) హోంమంత్రి
ii) హిమపాతాలు B) వ్యవసాయ మంత్రి
iii) కరవులు C) రక్షణ మంత్రి
iv) NDRF D) పర్యావరణ - అటవీ మంత్రి

జ: i - D, ii - C, iii - B, iv - A

 

37. కింది అంశాల్లో సరైన వాటిని గుర్తించండి.
1) జాతీయ విపత్తు నిర్వహణ మొదటి సమావేశం న్యూదిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో 2006, నవంబరు 29న జరిగింది.
2) జాతీయ విపత్తు నిర్వహణ సమావేశాలకు ప్రధాన మంత్రి అధ్యక్షత వహిస్తారు.
జ: 1, 2 సరైనవి

 

38. కిందివాటిని జతపరచండి.

కమిటీ ఛైర్‌పర్సన్‌
i) కేబినెట్‌ కమిటీ A) కేంద్ర హోంమంత్రి
ii) జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ B) హోం కార్యదర్శి
iii) జాతీయ కార్యనిర్వహణ కమిటీ C) కేబినెట్‌ కార్యదర్శి
iv) విపత్తు సమన్వయ కమిటీ D) ప్రధానమంత్రి

జ: i - D, ii - C, iii - B, iv - A

 

39. అంతర్జాతీయ విపత్తు తగ్గింపు మూడో సదస్సు 2015, మార్చి 18న ఎక్కడ జరిగింది?
జ: సెండాయ్‌

 

40. నూతన జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (NDMP) ను 2016, జూన్‌ 1న న్యూదిల్లీలో ఎవరు విడుదల చేశారు?  
జ: ప్రధానమంత్రి  

 

41. కిందివాటిని జతపరచండి.

సంస్థ కార్యాలయం
i) అంతర్జాతీయ విపత్తు తగ్గింపు సంస్థ A) బ్యాంకాక్‌
ii) ఆసియా విపత్తు ప్రతిస్పందన సంస్థ B) జెనీవా
iii) సార్క్‌ విపత్తు తగ్గింపు సంస్థ C) నాగ్‌పుర్‌
iv) నేషనల్‌ సివిల్‌ డిఫెన్స్‌ కాలేజీ D) దిల్లీ


జ: i - B,  ii - A, iii - D, iv - C

 

42. కింది అంశాల్లో సరైనవాటిని గుర్తించండి.
       1) అంతర్జాతీయ సునామీ అవగాహన దినోత్సవం - నవంబరు 5
       2) జాతీయ విపత్తు అవగాహన దినోత్సవం - అక్టోబరు 29
       3) అంతర్జాతీయ విపత్తు కుదింపు దశాబ్దం - 1990 - 2000
జ: 1, 2, 3

 

43. దీర్ఘకాలిక విపత్తు ప్రణాళిక అభివృద్ధిని ఏ రకమైన విపత్తు స్థాయిలో సూచిస్తారు?
జ: L3

 

44. ‘జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక’ (NDMP)లో మొత్తం ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి?
జ: 14

 

45. కింది అంశాల్లో సరైనవి. 
     1) విపత్తు సహాయ నిధిని ఏర్పాటుచేయాలని 9వ ఆర్థిక సంఘం మొదట సిఫారసు చేసింది.
     2) 13వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు జాతీయ విపత్తు సహాయక నిధిని 2010, ఏప్రిల్‌ 1న ప్రారంభించారు.
     3) 14వ ఆర్థిక సంఘం 2015-20కి గాను ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,489 కోట్లను సిఫారసు చేసింది.
జ: 1, 2, 3

Posted Date : 22-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కాలుష్యం

  యావత్తు భూమండలం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటి. మానవ జీవనం ప్రశాంతంగా సాగిపోవడానికి తోడ్పడే ప్రకృతిని దారుణంగా దెబ్బతీస్తున్న కాలుష్యం ఫలితంగా ఎన్నో దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. ప్రధాన జీవాధారాలైన గాలి, నీరు, పర్యావరణం తీవ్రంగా కలుషితం అవుతున్నాయి. ఇందుకు దారితీసిన పరిస్థితులు, అనంతర పరిణామాలపై టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం అందిస్తున్న అధ్యయన సమాచారం..
భూగోళం నాలుగు ఆవరణాలతో కూడి ఉంది. అవి శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. ఈ ఆవరణాలన్నింటిని కలిపి పర్యావరణం అంటారు. ఒక జీవి చుట్టూ ఉండే భౌతిక, రసాయనిక, జీవ పరిస్థితులను పర్యావరణం లేదా పరిసరాలు అని చెప్పవచ్చు. ఈ పర్యావరణాన్ని అనేక రకాల కాలుష్యాలు దెబ్బతీస్తున్నాయి.

 

కాలుష్యం అంటే..?

  భౌతిక, థర్మల్, జైవిక, రేడియోధార్మిక ధర్మాల్లో సంభవించే మార్పులు జీవుల ఆరోగ్యం, భద్రతకు హాని కలిగించే విధంగా ఉంటే దాన్ని కాలుష్యంగా పరిగణిస్తారు. ప్రస్తుత సమాజంలో వేగంగా విస్తరిస్తున్న ఆరోగ్య సమస్యలకు కాలుష్యమే ప్రధానమైన కారణం. కాలుష్యానికి గురవుతున్నవారిలో మహిళలు, పిల్లలే ఎక్కువ. 1972 జూన్ 5న స్టాక్‌హోంలో ప్రపంచ పర్యావరణ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగంలో పర్యావరణ ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రకృతి, పర్యావరణం గురించి చర్చించిన అధర్వణ వేదంలోని కొన్ని అంశాలను ప్రస్తావించారు. పూర్వీకులు ప్రకృతిని ఆరాధించేవారని.. భూమి, గాలి, నీరు, ఆకాశం, అంతరిక్షం - వీటిలోని సమస్త జీవ జాతులన్నింటిలోనూ శాంతి పరిఢవిల్లాలని ప్రార్థించేవారని తన ప్రసంగంలో పేర్కొన్నారు. పర్యావరణం కలుషితం కాకుండా చూడాలని, ప్రకృతి సమతౌల్యం సాధిస్తేనే భూమండలంపై ఉన్న సమస్త జీవులు సురక్షితంగా ఉండగలుగుతాయని పిలుపునిచ్చారు.

 

కాలుష్య కారకాలు

  జనాభా విస్ఫోటమే అన్ని రకాల కాలుష్యానికి ప్రధాన కారణం. తారు, చెత్త లాంటి వ్యర్థ పదార్థాలు; సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్, అమ్మోనియం, ఫ్లోరిన్, క్లోరిన్, హైడ్రోజన్ లాంటి వాయువులు; ఫ్లోరైడ్ లాంటి రసాయన పదార్థాలు; సీసం, ఇనుము, జింకు, పాదరసం లాంటి మూలకాలు; హెర్బిసైడ్లు, క్రిమిసంహారక మందులు, కృత్రిమ ఎరువులు, రేడియో ధార్మిక పదార్థాలు, శబ్దం, అధిక ఉష్ణం.. ఇవన్నీ కాలుష్య కారకాలే. జనాభా విపరీతంగా పెరగడంతో నీటి వినియోగం కూడా ఎక్కువైంది. ఇది కూడా కాలుష్యానికి కారణమవుతోంది.

 

జల కాలుష్యం

  సమస్త జీవులకు నీరు ప్రాణాధారం. తాగడానికి, పంటలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు, మానవ నిత్యావసరాలకు నీరు చాలా అవసరం. జల కాలుష్యంతో నీటి స్వభావం మారిపోతోంది. ఉపయోగానికి పనికి రాకుండా పోతోంది. అంతేకాదు దాని ఉపయోగం ప్రమాదకరం కూడా. అన్ని ప్రాంతాల్లో కావాల్సినంత పరిమాణంలో మంచినీరు లభించడం లేదు.
  ప్రాణకోటికి ప్రమాదకరమైన అదనపు పదార్థాలు నీటిలో కలవడాన్ని జల కాలుష్యంగా నిర్వచించవచ్చు. ఇది జీవరాశులకు తీవ్రమైన హాని కలిగిస్తుంది. స్వచ్ఛమైన నీటిలో ఆక్సిజన్, హైడ్రోజన్, సేంద్రీయ సమ్మేళనాలు, ఫాస్ఫేట్‌లు, ఒండ్రుమట్టి, సూక్ష్మజీవులు లాంటివి కలిసి ఉంటాయి. కాలుష్యం వల్ల వీటి మధ్య సమతౌల్యం దెబ్బతింటుంది.

 

జల కాలుష్య కారకాలు
1) మురుగు వ్యర్థ పదార్థాలు
2) అంటు వ్యాధుల ఏజెంట్లు
3) విదేశీ సేంద్రీయ రసాయనాలు
4) రసాయనిక ఖనిజ పదార్థాలు, సమ్మేళనాలు

 

పర్యావరణ సమస్యలు 

 పరాన్నజీవులు, సూక్ష్మజీవులను తనలో ఇముడ్చుకుని నీరు కలుషితమవుతుంది. వాస్తవానికి ఎన్నో వ్యాధులు, ఇతర పర్యావరణ ప్రమాదాల కంటే నీటి కాలుష్యమే ప్రధానమైంది. విపరీతంగా పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ వల్ల స్వచ్ఛమైన నీటికి కొరత ఏర్పడుతోంది. కలుషిత నీరు వివిధ రోగాలకు కారణమవుతోంది. భారతదేశంలో 80 శాతం వ్యాధులు జల కాలుష్యం వల్ల సంభవిస్తున్నాయి.

 

నీటి కాలుష్య దుష్ఫలితాలు

* కలరా, టైఫాయిడ్, విరోచనాలు లాంటి వ్యాధులు సంక్రమించడం.
* జలచరాలు.. ముఖ్యంగా చేపలు చనిపోవడం. దాంతో జల ఆహార నిల్వలు తగ్గిపోవడం.
* నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో దంతాలపై ఉండే ఎనామిల్ ఊడిపోవడం, గారకట్టడంతోపాటు ఎముకలు దెబ్బతినడం.
* నైట్రేట్‌లు ఎక్కువగా ఉంటే చిన్నపిల్లల రక్తం నీలిరంగులోకి మారి ఒక రకమైన వ్యాధి బారిన పడటం.
* నీటిలో ఫాస్ఫేట్‌లు ఎక్కువై జలచరాలు చనిపోవడం.
* నీటిలో కొన్నిరకాల విష రసాయనాల ప్రమాణం ఎక్కువైన సందర్భాల్లో పిల్లలు కురూపులు, వికలాంగులుగా జన్మించడం.

 

నివారణ చర్యలు

* పారిశ్రామిక మురుగులో సేంద్రీయ పదార్థాలైన కర్బనం, నత్రజని, గంధకం, సీసం, పాదరసం లాంటి రసాయనాలు ఉంటాయి. ఈ మురుగు సహజ నీటివనరుల్లో కలిస్తే అవి కలుషితం అవుతాయి.
* పరిశ్రమలు విడుదల చేసే మురుగును శుద్ధిచేసే బాధ్యతను ఆయా పారిశ్రామిక యాజమాన్యాలే నిర్వహించి, మురుగు శుద్ధి కర్మాగారాలను నెలకొల్పాలి.
* ఇళ్లలోని మురుగుకోసం ఆక్సిడేషన్ సాండ్స్, సెప్టిక్ ట్యాంకులను ప్రతి ఇంటిలో నిర్మించుకోవాలి. మురుగునీటిని శుద్ధి చేయకుండా వదలడం శిక్షార్హమైన నేరం.
* కాలుష్య నియంత్రణ పట్ల ప్రజల్లో అవగాహన కలిగించాలి.
* కాలుష్య నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలి.

 

ధ్వని కాలుష్యం

మనం వినగలిగే శబ్దాల మోతాదుకు మించి వినే శబ్దాన్నే ధ్వని కాలుష్యం అనవచ్చు. వాహనాలు, పరిశ్రమలు, లౌడ్ స్పీకర్లు వంటివి ధ్వని కాలుష్య కారకాలు.
బహిరంగ ప్రదేశాల్లో ఉదయం 50 డెసిబుల్స్‌కి మించని ధ్వని ఆరోగ్యకరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నివేదికలు తెలుపుతున్నాయి. పర్యావరణ నిపుణులు ధ్వని కాలుష్యం సుమారు 70 డెసిబుల్స్ స్థాయిని మించి ఉండరాదని చెబుతున్నారు. వివిధ పట్టణాలు, నగరాల్లో రద్దీ సమయాల్లో ప్రధాన రహదారుల్లో ధ్వని కాలుష్యం 90 నుంచి 110 డెసిబుల్స్ వరకు ఉంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాలు, పరిమితుల ప్రకారం.. ధ్వని తీవ్రత పారిశ్రామిక వాడల్లో రాత్రి 65 డెసిబుల్స్, పగలు 75 డెసిబుల్స్; నివాస ప్రాంతాల్లో రాత్రి 45 డెసిబుల్స్, పగలు 55 డెసిబుల్స్; ఆస్పత్రుల వద్ద రాత్రి 45 డెసిబుల్స్, పగలు 50 డెసిబుల్స్ మించి ఉండకూడదు.
రైల్వేలు, పరిశ్రమలు, నిర్మాణ రంగ కార్యకలాపాలు, ప్రజా సమూహాలు, లౌడ్ స్పీకర్‌లు.. ఇవన్నీ ధ్వనిని వ్యాప్తి చేస్తాయి. ధ్వని ఎక్కువగా ఉన్నప్పుడు పర్యావరణంలో అసమతౌల్యం ఏర్పడుతుంది. ఇలా నిరంతర ధ్వని కాలుష్య ప్రభావం వల్ల శ్రామిక సామర్థ్యం, వారి వృత్తిపరమైన పనితీరు క్షీణిస్తుంది.

 

ధ్వని కాలుష్య సమస్యలు

* నిద్రలేమి
* తొందరగా అలసిపోవడం
* వికారం, అధిక రక్తపోటు
* అల్సర్లు, రక్తహీనత, నరాలపై తీవ్ర ప్రభావం
* తలనొప్పి, శ్వాస సంబంధ వ్యాధులు, వినికిడి సమస్యలు
* మెదడు, నాడీ వ్యవస్థ క్రమంగా దెబ్బతిని, చికాకు పెరగడం.

 

వాయు కాలుష్యం

వాతావరణంలో వాయువులు సాధారణ నిష్పత్తిలో ఉన్నంత వరకు కాలుష్యం ఉండదు. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్, ధూళి కణాలు, పొగ, పొగమంచు లాంటివి గాలిలో అధికంగా చేరడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది.

 

వాయు కాలుష్య కారణాలు

* నిబంధనలను పాటించని వ్యవసాయ కార్యకలాపాలు
* పదార్థాల దహనం
* యంత్రాల సహాయంతో జరిగే ఉత్పత్తి ప్రక్రియలు
* ద్రావణాల ఉపయోగం
* అణుధార్మిక పదార్థాల వినియోగం

 

దుష్ప్రభావాలు

వాయు కాలుష్యం మానవుడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇది శ్వాస, రక్త ప్రసరణ వ్యవస్థల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
* కార్బన్ మోనాక్సైడ్ రక్తంలోని హిమోగ్లోబిన్‌తో కలిసిపోయి శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకుండా చేస్తుంది.
* సల్ఫర్ డై ఆక్సైడ్ ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపుతుంది. ఆస్తమాకు కారణమవుతూ, మరణాల రేటును పెంచుతుంది.
* నైట్రోజన్ డై ఆక్సైడ్ - బ్రాంకైటీస్, ఆస్తామా వ్యాధులను కలిగిస్తుంది.
* గాలిలో అధిక పరిమాణంలో ఉన్న సీసం ఎముకలు, కాలేయం, గుండె, మూత్రపిండాల పనితీరుపై చెడుప్రభావాన్ని చూపుతుంది.
* శిలాజ ఇంధనం అధికంగా వాడటం వల్ల గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరిగి హరితగృహ ప్రభావానికి దారితీస్తుంది.

 

నివారణ చర్యలు

* వాయు కాలుష్యాన్ని నివారించేందుకు బ్యాగ్ ఫిల్టర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెస్పిటేటర్స్ లాంటి నియంత్రణ పరికరాలను ఉపయోగించాలి.

 

రేడియో ధార్మిక కాలుష్యం

రేడియేషన్‌కు గురికావడం ప్రకృతి సహజమే అయినా అణువిద్యుత్తు, అణ్వస్త్రాల ఉత్పత్తి భారీస్థాయిలో చేపట్టడం వల్ల మానవులు భారీ పరిమాణంలో రేడియేషన్‌కు గురవుతున్నారు. ఆయా సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ప్రత్యక్షంగా రేడియో ధార్మికతకు గురవుతున్నారు. ఫలితంగా క్యాన్సర్, జన్యు సంబంధ వ్యాధులబారిన పడుతున్నారు. పిల్లలు అనారోగ్యంతో జన్మిస్తున్నారు.

 

ముఖ్యాంశాలు

* ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతున్న ప్రధాన సమస్యల్లో పర్యావరణ కాలుష్యం ఒకటి.
* ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో తేలిందేమిటంటే.. ఒక్క భారతదేశంలోని ఆరు ప్రధాన నగరాల్లోనే ఏటా సుమారు 40-50 వేల మంది కాలుష్యం వల్ల చనిపోతున్నారు.
* భారతదేశంలోని సహజ నీటి వనరుల్లో సుమారు 80 శాతం నీరు కలుషితమై.. మనుషులు, జంతువులు, పశుపక్ష్యాదులకు కూడా తాగడానికి పనికిరావడం లేదని ఇటీవల ఒక సర్వేలో తేలింది.
* తెలంగాణలో గోదావరి నదీతీరం వెంబడి ఉన్న సిర్‌పూర్‌లో కాగితపు వ్యర్థాలు, అక్కడి ప్రజలు గోదావరిలోకి వదిలే కాలుష్యాలు ఏటూరునాగారం ప్రజలపై ప్రభావం చూపిస్తాయి. ఈ రెండు ప్రాంతాల కలుషితాల ప్రభావం భద్రాచలం మీద ఉంటుంది.
* ప్రపంచం మొత్తం వాతావరణ కాలుష్యంలో సగానికి పైగా కాలుష్యానికి ఒక్క అమెరికాయే కారణమవుతోంది.


అత్యంత కలుషితమై'నది' గంగా

భారతదేశంలోని గంగానది సుమారు 1760 కి.మీ.ల మేర కలుషితమై ప్రపంచంలో అత్యంత పొడమైన కలుషిత నదిగా మారడంతో.. ఈ పరిస్థితిని నివారించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం రూ. 10 వేల కోట్లను కేటాయించింది. 'గంగానది ప్రక్షాళన' పేరుతో కేంద్ర జలవనరుల సంఘం నివారణ చర్యలు చేపడుతోంది. దీనికి ప్రధాన కారణం.. దేశ విస్తీర్ణంలో గంగానది పరివాహక ప్రాంతం 8.61 లక్షల చదరపు కిలోమీటర్లు (1/4వ వంతు) ఉండి.. 45 కోట్ల మంది ప్రజలు జీవిస్తుండటమే.

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం

  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిర్వహిస్తున్న పరీక్షల సిలబస్‌లో కొత్తగా 'పర్యావరణ సమస్యలు' అనే అంశాన్ని చేర్చారు. గ్రూప్ - 1, 2, 3, 4; గెజిటెడ్, నాన్ గెజిటెడ్, టెక్నికల్ ఇతర పోటీ పరీక్షల్లో భాగంగా జనరల్ స్టడీస్ విభాగంలో ఈ అంశాన్ని చేర్చారు. ఈ పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులంతా మానవ మనుగడలో అత్యంత కీలకమైన పర్యావరణం గురించి తెలుసుకోవాలి. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పర్యావరణ సమస్యలపై మంచి అవగాహన సాధించాలి.
మానవ మనుగడకు మూలాధారం ప్రకృతి. ప్రతి అవసరానికీ మనిషి ప్రకృతిపై ఆధారపడాల్సిందే. ఈ క్రమంలో ప్రజలు తమ ఆర్థికావసరాల కోసం ప్రకృతిపై అన్నివైపుల నుంచీ దాడిచేస్తూ కొల్లగొడుతున్నారు. ఈ చర్యలన్నీ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రారంభంలో పరిశ్రమలు.. తర్వాత శాస్త్ర, సాంకేతిక విప్లవం.. విస్తారమైన వ్యవసాయ క్షేత్రాలు.. సింథటిక్ ఉత్పత్తుల వినియోగం, వాటి ఉత్పత్తి పద్ధతులు.. ఇవన్నీ ప్రకృతికి విఘాతం కలిగిస్తూ క్రమంగా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి. 1945లో హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబు వేసిన నాటి నుంచి ప్రపంచం ఈ 'భూగోళ సంక్షోభం'లోకి ప్రవేశించిందని చెప్పవచ్చు.

 

పర్యావరణం అంటే..

  మనలో ప్రతి ఒక్కరికి మన చుట్టూ ఉన్న పరిసరాలతో పరిచయం ఉంటుంది. ఈ పరిసరాలే జీవుల మనుగడ మీద ప్రభావం చూపిస్తాయి. మనుగడకు అవసరమైన బాహ్య పరిస్థితుల (భూమి, గాలి, నీరు, ఆహారం, వెలుతురు, వేడి, చలి) లభ్యతనే పర్యావరణం అంటారు. ఒక జీవరాశిని ప్రభావితం చేసి, మార్పులకు గురిచేస్తూ ఉన్న సజీవ, భౌతిక మూలక పదార్థాల మిశ్రమాన్ని పర్యావరణంగా చెప్పవచ్చు. సూక్ష్మంగా చెప్పాలంటే మన చుట్టూ ఆవరించి ఉన్న అంశాలే (జీవ, భౌతిక, రసాయన) పర్యావరణం. పర్యావరణంలోని జీవుల మనుగడకు ముప్పు వాటిల్లే విధంగా పరిస్థితుల్లో మార్పులు సంభవిస్తే.. నివారణకు మానవుడు చేపట్టే చర్యలే 'పర్యావరణ పరిరక్షణ'.

 

రకాలు, సమస్యలు

పర్యావరణాన్ని 2 రకాలుగా చెప్పవచ్చు.

 

1. భౌతిక / సహజ పర్యావరణం:

  జీవరాశులను ప్రభావితం చేసే భూమి, నీరు, గాలి, వాతావరణం.. ఇవన్నీ నిర్జీవ భౌతిక అంశాలు. అలాగే వర్షపు నీరు, సూర్యకిరణాలు, తేమ, వాయు తరంగాల వేగం లాంటి వాతావరణ పరమైన కారకాలు కూడా ఇందులో అంశాలే.
భౌతిక / సహజ పర్యావరణం ప్రయోజనాలు, ప్రాధాన్యాలు..
* గృహ నిర్మాణం, పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి లభ్యమవుతుంది.
* జీవరాశులకు అవసరమైన భూమి, నీరు, గాలి.. పోషక మూలకాలను అందిస్తుంది.
* వాతావరణ కారకాలను నియంత్రిస్తుంది.
* వాతావరణం జీవరాశులకు ఆమ్లజని, ఇతర వాయువులను అందజేస్తుంది.
* భూగోళంలోని జలసంపద ఈ భౌతిక వాతావరణంపైనే ఆధారపడి ఉంటుంది.

 

2. జీవ పర్యావరణం:

  దీన్ని జీవుల సజీవ పర్యావరణం అంటారు. జీవరాశుల మనుగడకు ఇది సహాయపడుతుంది. భూమిపై ఉన్న సూక్ష్మజీవులు, జలచరాలు, పక్షులు, జంతువులు, వృక్ష సంపద, మానవులు దీనిలోని అంతర్భాగాలు.

 

సమస్యల ప్రభావం

1. శీతోష్ణస్థితిలో మార్పుల వల్ల గ్లోబల్ వార్మింగ్ (భూతాపం), సముద్ర నీటిమట్టం పెరగడం, గ్రీన్‌హౌస్ వాయువులు విడుదలవడం, వరదలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లవచ్చు.
2. పర్యావరణం దెబ్బతినడం వల్ల గాలిలో స్వచ్ఛత లోపిస్తుంది. ఫలితంగా మానవులకు శ్వాస సంబంధ వ్యాధులు సంక్రమిస్తాయి. అంగవైకల్యంతో పాటు అంతర్గత, బాహ్య అవయవాల ఆరోగ్యం దెబ్బ తింటుంది. సహజ లోపాలు కూడా తలెత్తవచ్చు.
3. జన్యుపర సమస్యలు ఏర్పడవచ్చు.
4. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధిక జనాభా కారణంగా అనేక సమస్యలు..
5. కాలుష్యం: నేల (భూమి), గాలి (వాయు), నీరు (జల) కలుషితం అవుతున్నాయి. పర్యావరణం దెబ్బతినడంతో కాంతిపై ఆ ప్రభావం పడుతుంది. దృష్టి దోషాలు తలెత్తుతాయి. ధ్వని కాలుష్యం, ఓజోన్ పొర దెబ్బతినడం, అంతరిక్షంలో సమస్యలు తలెత్తవచ్చు.
6. జీవ వ్యర్థపదార్థాల నాశనం వల్ల తలెత్తే సమస్యలు.

 

పర్యావరణ ఉద్యమాలు

  పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, పొగ, విషపూరిత రసాయనాలు వదలడం వల్ల కలుగుతున్న దుష్ప్రభావాన్ని ప్రపంచ దేశాల ప్రజలు గుర్తించారు. సముద్రాలు, ఎడారుల్లో అణు పరీక్షలు చేయడం లాంటి వాటివల్ల పర్యావరణానికి ఎదురవుతున్న ముప్పును గుర్తించారు. సరస్సులు ఎండిపోవడం, ఆమ్ల వర్షాలు వంటి విపరిణామాల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. ఇలా పర్యావరణ పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమాలన్నీ దాదాపు 20వ శతాబ్దంలోనే కొంత ఊపందుకున్నాయి. న్యూక్లియర్ వ్యర్థ పదార్థాలు పడేయడం, ఉష్ణోగ్రతల్లో మార్పులు, వాయు కాలుష్యం లాంటి వాటి గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఏర్పడింది.
* పర్యావరణ పరిరక్షణ కోసం మొదటగా 1962లో రేచల్ కార్సన్ రాసిన 'నిశబ్ద వసంతం' అమెరికా పర్యావరణ ఉద్యమంలో మైలురాయి లాంటిది.
* 1970లో మొదటిసారిగా ధరిత్రి దినోత్సవం నిర్వహించడంతోపాటు పర్యావరణాన్ని రక్షించేందుకు యూఎస్ఏ పార్లమెంటు చట్టాలు చేసింది.
* 1970లో అణ్వాయుధ పరీక్షలకు వ్యతిరేకంగా 'గ్రీన్‌పీస్' ఉద్యమం మొదలై.. ఆ తర్వాత అన్ని దేశాలకు విస్తరించింది. అంటార్కిటికాలో ఏర్పాటైన 'గ్రీన్‌పీస్' స్థావరం వివిధ దేశాల్లోని ఉద్యమాలను సమన్వయ పరిచింది.
* 1980లో పర్యావరణ ప్రత్యేక సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష కార్యాచరణ మొదలైంది. ఇందులో గ్రీన్‌పీస్, ఎర్త్‌లాండ్, ఎర్త్ ఫస్ట్ లాంటి సంఘాలు ఏర్పడ్డాయి.
* 1972, జూన్ 5న 'స్టాక్‌హోం'లో అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ సదస్సు జరిగింది. అప్పటి నుంచి జూన్ 5 ను ప్రతి సంవత్సరం 'ప్రపంచ పర్యావరణ దినం'గా యావత్ ప్రపంచం పాటించాలని ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించింది.
* 1982లో కెన్యాలోని 'నైరోబి'లో ప్రపంచ దేశాలు మళ్లీ సమావేశమయ్యాయి. ఇలా.. 1982 నాటికి వందకు పైగా దేశాల్లో పర్యావరణ సంస్థలు ఏర్పడ్డాయి.
* 1992లో 'ధరిత్రి సదస్సు'గా ప్రస్తావిస్తున్న రియోడి జనీరియో (బ్రెజిల్) సమావేశం నాటికి పర్యావరణ అంశాలు మొత్తం ప్రపంచాన్ని జాగృతం చేయడంలో సఫలమయ్యాయి. ఇందులో 150 దేశాలు భూగోళం వేడిమి, గ్రీన్‌హౌస్ వాయువుల గురించి చర్చించాయి. ఈ సమావేశంలో చర్చించిన రెండో అంశం జీవరాశుల సమతౌల్యానికి సంబంధించింది.
* నార్వే ప్రధానిగా విధులు నిర్వహించిన గ్రొహర్లెమ్ బ్రుంట్‌లాండ్ ఐక్యరాజ్య సమితి స్థాపించిన 'వరల్డ్ కమిషన్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్‌'కు ఛైర్మన్‌గా పనిచేశారు.

 

పర్యావరణంలో ఉత్పన్నమయ్యే సమస్యలు..

* మానవ జనాభా పెరుగుదల
* జల సంబంధమైన వరదలు, భూపాతాలు
* డ్రైనేజీ, వ్యవసాయ సమస్యలు
* జీవ నిర్మాణంలో సాంద్రత పెరగడం
* భూ వినియోగం.
* నానో టెక్నాలజీ, శాస్త్ర-సాంకేతిక మార్పులు
* న్యూక్లియర్, రేడియోధార్మిక శక్తిలో మార్పులు
' పర్యావరణానికి కలిగే ముప్పును నివారించడానికి జీవ వైవిధ్యం, జీవ భద్రత లాంటివి చేపట్టడం.. అటవీ సంపదను పెంచడం.. సహజ వనరులను కాపాడుకోవడం.. పలురకాల జంతు జాతులను పెంపొందించడం.. పర్యావరణ చట్టాలను పటిష్ఠంగా అమలు చేయడం లాంటి చర్యలు అవసరం. ఈ అంశాలపై అధ్యయనం చేయాలి.'

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తులు - రకాలు

  విపత్తు (Disaster) అనే పదం ఫ్రెంచ్‌భాషకు చెందింది. Desaster అనే ఫ్రెంచ్ పదం నుంచి Disaster అనే ఆంగ్ల పదం వచ్చింది. దీనికి 'చెడ్డ నక్షత్రం (Bad star)'అని అర్థం.
పర్యావరణం, సమాజం, సామాన్య ప్రజలకు ఆర్థికంగా అధిక నష్టం కలిగించి, సాధారణ కార్యకలాపాలను కూడా అడ్డుకునే తీవ్రమైన పరిస్థితిని 'విపత్తుగా' పరిగణించవచ్చు. ప్రకృతి వైపరీత్యాల (Natural Hazards) వల్ల అధిక మొత్తంలో ఆస్తి, ప్రాణ నష్టాలుంటాయి. జరిగిన నష్టం ఆధారంగా విపత్తు తీవ్రతను అంచనా వేస్తారు. ప్రజలకు హానికలిగే పరిస్థితి (Vulnerability) ఉన్నప్పుడు, వైపరీత్యాలను ఎదుర్కొనే ముందస్తు సమర్థ చర్యలు లేనప్పుడు విపత్తు తీవ్రత అధికంగా ఉంటుంది.

  విపత్తు సందర్భంలో ప్రజలు ప్రమాదకర లేదా సున్నితమైన స్థితిలో ఉన్నప్పుడు నష్టం ఎక్కువగా ఉంటుంది. విపత్తును ఎదుర్కొనే సామర్థ్యం ఎక్కువగా ఉండి, తక్షణ రక్షణ చర్యలు తీసుకున్నప్పుడు దీని ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఒక ప్రాంత ప్రజలకు హానికలిగే పరిస్థితి (Vulnerability), వయసు, పేదరికం, నిరక్ష్యరాస్యత, సరైన శిక్షణ లేకపోవడం, పర్యావరణ క్షీణత, నియంత్రించలేని అభివృద్ధి, సరైన వసతులు లేకపోవడం, ప్రమాదకర ప్రదేశాలు, నివాసాలు, ఆర్థికంగా పటిష్టంగా లేకపోవడం, పట్టణీకరణం, జనాభా పెరుగుదల లాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. 
వైపరీత్యం వల్ల అతి తక్కువ ప్రభావం ఉండి, ఆర్థిక, ప్రాణ నష్టాలు లేకపోతే అది విపత్తుగా మారే అవకాశం లేదు. ఉదాహరణకు ప్రాణులు, ఆవాసాలులేని ఏదైనా ఎడారి ప్రాంతంలో భూకంపం సంభవిస్తే, దాన్ని విపత్తుగా భావించలేం.

 

వైపరీత్యాలను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు.

అవి:
1) సహజ వైపరీత్యాలు (Natural Hazards)
2) మానవకారక వైపరీత్యాలు (Man made Hazards).

 

సహజ వైపరీత్యాలు: ఇవి ప్రకృతిలో సహజంగా సంభవిస్తాయి. తుపానులు, భూకంపాలు, అగ్ని పర్వతాలు బద్దలుకావడం, సునామీ, కొండచరియలు విరిగిపడటం, వరదలు, కరవు, చీడపీడలు ఎక్కువ కావడం లాంటివాటిని సహజ వైపరీత్యాలుగా పేర్కొనవచ్చు.
మానవకారక వైపరీత్యాలు: సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం; ఆనకట్ట కూలిపోవడం (Dam Failure); యుద్ధాలు; పరిశ్రమల నుంచి విషవాయువులు, హానికర పదార్థాలు వెలువడటం లాంటి మానవ చర్యల వల్ల మానవకారక వైపరీత్యాలు సంభవిస్తాయి.

  వైపరీత్యాలను అవి సంభవించే ప్రదేశం, కారణమయ్యే స్థితి ఆధారంగా కిందివిధంగా విభజించవచ్చు.

1) భౌగోళిక సంబంధ వైపరీత్యాలు (Geological Hazards): భూకంపాలు, సునామీ, అగ్ని పర్వతాలు బద్దలుకావడం, గనుల్లో మంటలు రావడం, ఆనకట్ట బద్దలు కావడం, కొండచరియలు విరిగిపడటం (Land side) లాంటివాటిని భౌగోళిక సంబంధ విపత్తులుగా పేర్కొనవచ్చు.

2) నీరు, వాతావరణ సంబంధ వైపరీత్యాలు (Water & Climatic Hazards): తుపానులు, టోర్నడోలు, హరికేన్లు, వరదలు, కరవు, వేడి గాలులు, మంచు చరియలు విరిగిపడటం(Snow Avalanche), సముద్రం వల్ల కలిగే కోత (Sea erosion), వడగళ్ల వాన, గాలితో కూడిన వర్షం(Cloud burst) లాంటివాటిని నీరు, వాతావరణ సంబంధ వైపరీత్యాలుగా పేర్కొనవచ్చు.

3) పర్యావరణ సంబంధ వైపరీత్యాలు (Environmental Hazards): పర్యా వరణ కాలుష్యం, ఎడారి విస్తరించడం (Desertification), చీడపీడల సంక్రమణ (Pest Infection), అడవులు నశించడం లాంటివి వీటికి ఉదాహరణ.

4) జీవన సంబంధ విపత్తులు: చీడపీడలు వ్యాపించడం (Pest Attacks), ఆహారం కలుషితమవడం, మానవులు, జంతువుల నుంచి అంటు వ్యాధులు (Human/ Animal Epidemics) వ్యాపించడం లాంటివి జీవసంబంధ వైపరీత్యాలకు ఉదాహరణ.

5) రసాయన, పారిశ్రామిక వైపరీత్యాలు: పెద్ద మొత్తంలో రసాయనాలు వెలువడటం, పారిశ్రామిక దుర్ఘటనలు, చమురు ఎక్కువగా ఒలికిపోవడం(Oil Spils), నూనెలవల్ల మంటలు చెలరేగడం, అణు దుర్ఘటనలు మొదలైనవాటిని వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు.

6) ప్రమాద సంబంధ వైపరీత్యాలు: రైలు, విమాన, వాహన, పడవ సంబంధ ప్రమాదాలు, జనావాసాల మధ్య మంటలు చెలరేగడం, ఒకేసారి అనేకచోట్ల బాంబులు పేలడం, అడవుల్లో కారుచిచ్చు, భవంతులు కూలిపోవడం, విద్యుత్ సంబంధ ప్రమాదాలు, పండగల సందర్భంలో జరిగే ప్రమాదాలు, గనుల్లోకి వరదరావడం లాంటివి ప్రమాద సంబంధ వైపరీత్యాలకు ఉదాహరణ. కొన్నిసార్లు సహజ, మానవ సంబంధ కారణాలు కలవడం వల్ల కూడా వైపరీత్యాలు రావచ్చు.
ఇలాంటి వాటిని సాంఘిక - సహజ వైపరీత్యాలు (Socio-Natural Hazards) అంటారు. ఉదాహరణకు పట్టణ ప్రాంతాల్లోని మురికి కాలువల్లో చెత్త, చెదారం పేరుకుపోవడం వల్ల వరదలు రావడం. కొన్నిసార్లు కరవు, మంటలు చెలరేగడం లాంటివి సహజ, మానవ కారణాలు రెండింటి ఫలితంగా సంభవించవచ్చు.

Posted Date : 23-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తులు - రకాలు

1. విపత్తు (Disaster) అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది?
జ: ఫ్రెంచ్

 

2. విపత్తు అనే పదానికి ఫ్రెంచ్ భాషలో అర్థం ఏమిటి?
జ: చెడ్డ నక్షత్రం

 

3. దేనికి తీవ్ర నష్టం వస్తే, ఆ సంఘటనను విపత్తుగా చెప్పవచ్చు?
జ: పర్యావరణం, సమాజం, వస్తువులు, ఆర్థిక రంగం

 

4. విపత్తు వేటి వల్ల వస్తుంది?
జ: వైపరీత్యం , ప్రజలు బలహీన స్థితిలో ఉండటం (Vulnerability), తీవ్రతను తగ్గించే చర్యలు లేకపోవడం

 

5. విపత్తుల వల్ల ప్రజలకు ఏవిధమైన నష్టాలు వస్తాయి?
జ: ఆస్తినష్టం, ప్రాణనష్టం

 

6. వైపరీత్యాన్ని ఎప్పుడు విపత్తుగా పేర్కొంటారు?
జ: దాని వల్ల ప్రజలకు ఎక్కువ హాని కలిగినప్పుడు

 

7. విపత్తుకు ఒక ఉదాహరణ  తెలపండి?
జ:   కార్చిచ్చు వల్ల అడవి తీవ్రంగా నష్టపోవడం

 

8. నీరు, వాతావరణ సంబంధిత వైపరీత్యానికి ఉదాహరణ?
జ: వరదలు, టోర్నడోలు, హరికేన్లు, కరవు

 

9. అడవుల్లో కార్చిచ్చు రావడం, గనుల్లోకి వరద రావడం అనేవి ఎలాంటి వైపరీత్యాలకు ఉదాహరణ?

జ: ప్రమాదానికి సంబంధించిన(Accident Related)

 

10. 26 జనవరి 2001న భారతదేశంలోని ఏ ప్రాంతంలో భూకంపం సంభవించి, పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు?
జ: భుజ్ (గుజరాత్)

 

11. 19 నవంబరు 1977లో ఆంధ్రప్రదేశ్‌లో ఏ రకమైన విపత్తు వల్ల 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు?
జ: తుపాను

 

12. మానవకారణ వైపరీత్యాలకి ఉదాహరణ ఏది?
జ: విష పదార్థాలు వెలువడటం, కాలుష్యం, యుద్ధాలు

 

13. విపత్తు నిర్వహణ (Disaster Management) చక్రంలో  ఏ అంశాలు ఇమిడి ఉంటాయి?
జ: విపత్తుకు ముందు తీసుకునే చర్యలు, విపత్తు సమయంలో తీసుకునే చర్యలు, విపత్తు తర్వాత తీసుకునే చర్యలు

 

14. భారతదేశంలో ఇప్పటివరకూ అత్యధికంగా 8.5 తీవ్రత (mangitude) తో ఏ ప్రాంతంలో భూకంపం సంభవించింది?
జ: అరుణాచల్‌ప్రదేశ్ - చైనా సరిహద్దు

 

15. కేంద్ర హోంశాఖ అధీనంలో ఏ విపత్తుకు సంబంధించిన నిర్వహణ కార్యకలాపాలుంటాయి?
జ: జీవసంబంధ విపత్తులు, రసాయనిక సంబంధ విపత్తులు, న్యూక్లియర్ (అణు) సంబంధ విపత్తులు

 

16. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ అధీనంలో ఏ రకమైన విపత్తు నిర్వహణ కార్యకలాపాలుంటాయి?
జ: కరవు

 

17. ఒక ప్రాంతానికి చెందిన ప్రజలకు ఏ కారణాల వల్ల హానికర లేదా బలహీన (Vulnerability) పరిస్థితులు ఉంటాయి?
జ: పేదరికం, తక్కువ సంపాదన, ప్రమాదకర ప్రాంతాలు

 

18. భౌగోళిక సంబంధ (Geological) వైపరీత్యానికి ఉదాహరణ-
జ: భూకంపం, సునామీ, కొండచరియలు విరిగిపడటం

 

19. మురికినీటి కాల్వల్లో చెత్తపేరుకుపోవడం లేదా కొండచరియలు విరిగి పడటం వల్ల వరదలు రావడం లాంటివి ఏ రకమైన వైపరీత్యానికి ఉదాహరణగా చెప్పవచ్చు?
జ: సాంఘిక - సహజ వైపరీత్యాలు (Socio - natural hazards)

Posted Date : 23-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

తుపాను

  సముద్రంపైన ఉష్ణోగ్రత, పీడనాల్లో తేడా వల్ల వేగంగా వీచేగాలిని తుపాను అంటారు. దీని వల్ల అధిక వర్షపాతం సంభవిస్తుంది. సముద్రంలో కెరటాల ఉధృతి పెరుగుతుంది. దీంతో సముద్ర తీరప్రాంతాలకు అధిక నష్టం వాటిల్లుతుంది. వేగంగా వీచే గాలుల వల్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోతాయి. జనావాసాలు దెబ్బతింటాయి. పండ్ల తోటలకూ అపార నష్టం.

  తుపాను వల్ల కలిగే వర్షంతో వరదలు సంభవించి ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తుపాను ప్రభావం తీవ్రతను బట్టి వందల సంఖ్య నుంచి వేల సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతుంది. పశుసంపదకు నష్టం వాటిల్లుతుంది. వరదల వల్ల ఆవరణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది.

  తుపానులను ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు. అట్లాంటిక్ సముద్రంపైన వచ్చే తుపానులను హరికేన్‌లనీ; పసిఫిక్ మహా సముద్రంపై కలిగే వాటిని టైఫూన్‌లనీ, ఆస్ట్రేలియాలో సంభవించే వాటిని విల్లి - విల్లిలనీ పిలుస్తారు. ప్రపంచంలో తుపాన్లు ఎక్కువగా సంభవించే 6 ప్రాంతాల్లో భారతదేశం కూడా ఒకటి. భారతదేశంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపానులు సంభవిస్తాయి. బంగాళాఖాతం తీరప్రాంతంలోని పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సాలకు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ తుపాను ముప్పు పొంచి ఉంది. అరేబియా తీరప్రాంతంలో ఉండే గుజరాత్, మహారాష్ట్రల్లో మిగతా వాటి కంటే ముప్పు కొద్దిగా ఎక్కువ. భారతదేశంలో 8.5 % ప్రాంతానికి తుపాను ముప్పు ఉంది.

  భారతదేశంలో 7516 కి.మీ. ప్రాంతానికి తుపాను ముప్పు పొంచి ఉంది. పాండిచ్చేరితోపాటు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లు తుపాను ప్రభావానికి గురవుతున్నాయి. వీటితోపాటుగా అండమాన్ నికోబార్, లక్ష ద్వీప్ కూడా తుపాను తాకిడికి గురయ్యే ప్రాంతాలు. ఏటా బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో దాదాపుగా 5 నుంచి 6 తుపానులు సంభవిస్తాయి.

  వీటిలో 2 నుంచి 3 ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి. అరేబియా సముద్రంతో పోలిస్తే బంగాళాఖాతంలో ఎక్కువ తుపానులు వస్తాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో సంభవించే తుపానుల నిష్పత్తి 4 : 1. సాధారణ తుపాను సమయంలో గాలి సరాసరి వేగం గంటకు 65 కి.మీ. నుంచి 117 కి.మీ. వరకు ఉండవచ్చు. 

  తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటే గాలివేగం గంటకు 119 కి.మీ. నుంచి 164 కి.మీ. వరకు, అంతకంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. 1999 అక్టోబరు 29 న ఒరిస్సాలో సంభవించిన సూపర్‌సైక్లోన్‌లో గంటకు 250 కి.మీ. వేగంతో గాలులు వీచాయి.

 

నష్టాన్ని తగ్గించడానికి చేపట్టాల్సిన చర్యలు

* తీరప్రాంతాల్లో ముఖ్యంగా తుపానులు తరచుగా సంభవించే ప్రాంతాల్లో చెట్లను పెంచాలి. ఇక్కడి అడవులను పరిరక్షించాలి. తీర ప్రాంతాల్లో ఉండే మాంగ్రూవ్ అడవులు (మడ అడవులు), ఎత్తయిన వృక్షాలు తుపాను తీవ్రతను తగ్గిస్తాయి. దీనివల్ల వరదలు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. సముద్రపు ఒడ్డుకు దగ్గరలో ఉన్న వృక్షసంపద సహజ కవచంలా పనిచేసి తుపాను నష్టాన్ని తగ్గిస్తుంది. తీరప్రాంతాల్లో అడవులను పూర్తిగా కొట్టివేయడం వల్ల తుపాను ముప్పు పెరిగి సహజ విపత్తు కాస్తా మానవ సంబంధ విపత్తుగా మారుతోంది.

* తరచుగా తుపాన్లు సంభవించే ప్రాంతాలను గుర్తించి పటాలను తయారుచేయాలి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక, శాశ్వత చర్యలను చేపట్టవచ్చు. తుపానులను ఉపగ్రహాల సహాయంతో ముందుగానే గుర్తించవచ్చు. గాలి వీచే దిశ, వేగాన్ని బట్టి అక్కడి ప్రజలను హెచ్చరించి తుపాను నష్టాన్ని తగ్గించవచ్చు.

* తుపాను సంభవించే ప్రాంతాల్లో తక్కువ నష్టతీవ్రత ఉన్న ప్రదేశాలను గుర్తించి అక్కడ నివాసాలు, వసతులను, ఏర్పాటు చెయ్యాలి. తుపాను తాకిడికి ఎక్కువగా గురయ్యే ప్రదేశాల్లో ఇళ్లు, భవనాల నిర్మాణాల్లో మార్పులు చెయ్యాలి. ఇవి తుపానును తట్టుకునే విధంగా ఉండాలి. గృహాలను నేలమట్టం నుంచి ఎత్తుగా నిర్మించాలి, పైకప్పు వేలాడినట్టుగా కాకుండా మూసినట్టుగా ఉండాలి. ఇంటి చుట్టూ చెట్లను నాటడం వల్ల అవి సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయి. సమాచార, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతినకుండా ఉండేందుకు వాటిని భూగర్భ కేబుల్స్ ద్వారా సరఫరా చెయ్యాలి. తుపాన్లు సంభవించేటప్పుడు వరదలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని ఎదుర్కొనే చర్యలను కూడా చేపట్టాలి.  

* భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) రుతుపవనాలు, వర్షపాతం, తుపాన్ల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాడార్‌లు, ఉపగ్రహాల ద్వారా గ్రహించి అందజేస్తోంది. ఈ సమాచారం అందుకున్న ఏరియా సైక్లోన్ వార్నింగ్ సెంటర్స్ (ACWCs) తగిన హెచ్చరికలను జారీ చేస్తాయి. భారతదేశ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఐ) తుపాన్ల గురించి సమాచారాన్ని తెలియజేస్తుంది.

* తుపాన్ల వల్ల జరిగే నష్ట తీవ్రతను తగ్గించడానికి, భారత పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 1990 జులైలో బిల్డింగ్ మెటీరియల్స్, టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. తీర ప్రాంతాల్లో ఉన్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీల ద్వారా తగిన సమాచారాన్ని అందిస్తూ రక్షణ చర్యలను చేపడుతున్నాయి.

* ఇన్‌శాట్ ఉపగ్రహాలు, 10 రాడార్‌ల సహాయంతో కేంద్రం తుపాను ముప్పులను గమనించి తీర ప్రాంతాల ప్రజలను 48 నుంచి 24 గంటల ముందుగా హెచ్చరిస్తోంది. స్థానిక భాషల్లో తుపాను హెచ్చరిక సూచనలు అందిస్తోంది.

 

జాతీయ తుపాను ముప్పు నియంత్రణా ప్రాజెక్ట్

  భారతదేశంలోని తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలను తుపాను బారి నుంచి రక్షించడానికి, వారి ఆస్తులను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. దీన్ని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రారంభించింది. దీన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) అమలు చేస్తోంది. హోంమంత్రిత్వశాఖ, ఎన్‌డీఎంఏ కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నాయి.

  2011 నుంచి 2015 మధ్య ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తారు. ప్రపంచ బ్యాంక్ దీనికి నిధులను సమకూరుస్తుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం రూ. 626.87 కోట్లు కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 165.13 కోట్లను సమకూర్చుకుంది. 

   ఇదేవిధంగా ఒరిస్సాకు కేంద్ర ప్రభుత్వం రూ. 520.93 కోట్లు కేటాయించగా ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ. 132.85 కోట్లు సమకూర్చుకుంది.

  మొదట విడతగా ఈ ప్రాజెక్ట్‌ను ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ల్లో అమలు చేయనున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ నిధులతో తుపాను సమయంలో తలదాచుకునే భవనాలు నిర్మిస్తారు. తుపాను వల్ల దెబ్బతిన్న రహదారులను, కరకట్టలను మరమ్మత్తు చేస్తారు. తుపాను విపత్తు గురించిన అవగాహనను ప్రజలకు కలిగిస్తారు.

  ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ (ఐసీజడ్ఎంపీ): కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖల సూచన మేరకు భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దీనిలో భాగంగా గుజరాత్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌ల తీర ప్రాంతాల రక్షణకు చర్యలు చేపడతారు. ఈ రాష్ట్రాల్లో తుపాను ముప్పు ప్రాంతాలను గుర్తించడం, మ్యాపింగ్ చేయడం, రాష్ట్రంలో తుపానును ఎదుర్కొనేందుకు పని చేస్తున్న శాఖలకు, సంస్థలకు నిధులను అందజేయడం ఈ ప్రాజెక్ట్ విధి. ఈ ప్రాజెక్టు కింద పశ్చిమ బెంగాల్‌కు రూ. 1425 కోట్లను కేటాయించారు.

  కోర్‌గ్రూప్ ఆన్ సైక్లోన్ మిటిగేషన్: తుపాను ముప్పును గమనించడానికి, నివారణకు జాతీయస్థాయిలో ముఖ్యమైన వ్యక్తులతో ఒక గ్రూపును ఏర్పరిచారు. దీనిలో భారత వాతావరణ శాఖ, కేంద్ర జల సంఘం, నేషనల్ రిమోట్‌సెన్సింగ్ ఏజెన్సీ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన నిపుణులు ఉంటారు. వీరితోపాటుగా తుపాను కార్యక్రమాలను పర్యవేక్షించే వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ఉంటారు. వీరు తుపాను, వరదలకు సంబంధించిన హెచ్చరికలను జారీచేయడం; రాష్ట్ర, జాతీయస్థాయిలో వివిధ శాఖలు, సంస్థలను సమన్వయపరచడం లాంటి పనులను చేస్తారు.

Posted Date : 23-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

తుపాను

1. 'కత్రినా' అనే తుపాను (హరికేన్) వల్ల ఏ దేశంలో సుమారు 1836 మంది మరణించారు?
జ: అమెరికా

 

2. 2008 లో తమిళనాడులో సంభవించిన తుపాను పేరేంటి?
జ: నిషా

 

3. 1999 లో ఏ రాష్ట్రంలో సంభవించిన సూపర్ సైక్లోన్ వల్ల 8913 మందికి పైగా ప్రజలు మరణించారు?
జ: ఒరిస్సా

 

4. పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌లో 5,00,000 మంది మరణానికి కారణమైన భోలా తుపాను ఎప్పుడు సంభవించింది?
జ: 1970

 

5. ఒక ప్రాంతంలో తుపాను వచ్చినప్పుడు జరిగే నష్టం ఏమిటి?
జ: వేగంగా వీచే గాలి వల్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోతాయి; వరదలొచ్చి గ్రామాలు ముంపునకు గురవుతాయి; రోడ్లు, భవనాలు దెబ్బతిని ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతుంది.

 

6. తుపాను సంభవించినపుడు కలిగే పరిణామాలేవి?
జ: గాలి అధిక వేగంతో వీస్తుంది; వర్షపాతం కలుగుతుంది; సముద్రంలో అలల ఉద్ధృతి పెరుగుతుంది.

 

7. భారతదేశంలోని ఏ సముద్రంలో తుపానులు ఎక్కువగా సంభవిస్తాయి?
జ: బంగాళాఖాతం

 

8. అరేబియా తీరప్రాంతంలో ఉండే ఏ రాష్ట్రాలకు తుపాను ముప్పు ఎక్కువ?
జ: గుజరాత్, మహారాష్ట్ర

 

9. బంగాళాఖాతం తీరప్రాంతంలో ఉండే ఏ రాష్ట్రానికి తుపాను వల్ల కలిగే నష్టం ఎక్కువ?
జ: ఒరిస్సా

 

10. భారతదేశంలో తుపాను విపత్తుకు గురయ్యే ప్రాంత పరిమాణం -
జ: 8.5%

Posted Date : 23-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కొండచరియలు విరిగిపడటం

భారతదేశంలో సహజంగా సంభవించే ప్రకృతి వైపరీత్యాల్లో కొండచరియలు విరిగిపడటం (Land slide) ఒకటి. కొండప్రాంతం నుంచి రాళ్లు, మట్టిపెళ్లలు లాంటివి కిందకు పడటాన్ని ఈ రకమైన వైపరీత్యంగా పేర్కొంటారు. మనదేశంలో హిమాలయ ప్రాంతం, పశ్చిమ కనుమలు (westren ghats), నీలగిరి కొండల ప్రాంతాల్లో ఇది ఎక్కువగా సంభవిస్తోంది. సిక్కిం, ఘర్వాల్ (Garwal) ప్రాంతాల్లో సరాసరి ఒక చదరపు కిలోమీటర్‌కు 2 సార్లు కొండచరియలు విరిగిపడుతుంటాయి.

  భారతదేశంలో ఈ వైపరీత్యం సంభవించే అవకాశం 22 రాష్ట్రాల్లో ఉంది. మనదేశంలోని 15 శాతం భూమిని కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతంగా గుర్తించారు. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఘర్వాల్, కౌమాన్ (Kumaon) ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది ఎక్కువగా వర్షాకాలంలో సంభవిస్తుంది.

 

నష్టాలు 

కొండచరియలు విరిగిపడటం వల్ల పర్యావరణానికి, ప్రజలకు తాత్కాలిక, దీర్ఘకాలిక నష్టాలుంటాయి.

ప్రాణ, ఆస్తి నష్టాలు; రోడ్లు దెబ్బతినడం లాంటివి తాత్కాలిక నష్టాలుగా పేర్కొనవచ్చు. ఈ వైపరీత్యం సంభవించిన ప్రాంత బాహ్య స్వరూపం మారిపోవడం; పంటపొలాలు, వ్యవసాయ భూమి నాశనం కావడం, నేల క్రమక్షయానికి గురవడం, ప్రజలకు పునరావాస సమస్యలు తలెత్తడం లాంటివి దీర్ఘకాలిక నష్టాలుగా పేర్కొనవచ్చు. హిమాలయ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం వల్ల రహదారులు, ఆనకట్టలు, టన్నెల్స్, కమ్యూనికేషన్ టవర్స్ లాంటివి తరచుగా దెబ్బతింటున్నాయి. దీని వల్ల మనదేశంలో ఏటా వందలాది మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, సుమారు రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్ల నష్టం వాటిల్లుతోందని అంచనా. కొన్నిసార్లు కొండచరియలు విరిగిపడటం వల్ల నదీప్రవాహానికి అడ్డంకులు ఏర్పడతాయి. 1970లో పాతాళగంగానదిని కొండచరియలు విరిగి అడ్డగించడం వల్ల అలకనందా ప్రమాదం జరిగింది. 2005లో ఇదేవిధంగా పరెచ్చు (Parechhu) నదికి అడ్డంకి ఏర్పడటం వల్ల హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలు వచ్చాయి. 

  ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో దీనికి సంబంధించిన నష్టాలు తక్కువగానే ఉన్నాయి. ఆగస్టు 2006లో అరకులోయలో కొండచరియలు విరిగిపడి 18 మంది మరణించారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కొండప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య పెరుగుతూ ఉండటం వల్ల భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి.

 

కారణాలు 

  భారతదేశంలో కొండచరియలు విరిగిపడటానికి కారణాలు 2 అవి:

1) సహజ కారణాలు,

2) మానవ కారణాలు.

  కొండ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు పడటం, కొండవాలుగా ఉండటం, కొండచరియలు వదులుగా అమరి ఉండటం, భూకంపాలు రావడం లాంటివి సహజ కారణాలు. అడవుల నిర్మూలన వల్ల నేల క్రమక్షయానికి గురవడం, సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలు లోపించిన కట్టడాలు, కొండ కింది ప్రాంతాల్లో జనావాసాల ఏర్పాటు, గనులు, క్వారీల తవ్వకం; నేలను ఉపయోగించే విధానాలు లాంటివి మానవ కారణాలుగా చెప్పవచ్చు.

 

వైపరీత్యాన్ని గుర్తించే విధానం 

  నేల, కొండ ప్రాంతాల్లో సంభవించే మార్పుల ఆధారంగా ఈ వైపరీత్యాలను కొద్ది గంటలు లేదా నిమిషాల ముందుగానే గుర్తించవచ్చు. కొండచరియలు విరిగిపడటానికి ముందుగా ఇంట్లోని తలుపులు, కిటికీలు వాటంతట అవే బిగుసుకుపోవడం, గోడలు, ఇతర నిర్మాణాల్లో పగుళ్లు రావడం, ఇంటిగోడలు కదలడం, నేలలో పగుళ్లు ఏర్పడటం, ఫెన్సింగ్, ప్రహారి గోడలు, స్తంభాలు, వృక్షాలు పక్కకు జరగడం, కొండ ప్రాంతాల నుంచి మట్టి, రాళ్లు కొద్దికొద్దిగా రాలుతూ ఉండటం లాంటి మార్పులను గమనించవచ్చు.

 

నివారణా చర్యలు 

* ఏటవాలు, కొండ ప్రాంతాలు, సాధారణ ప్రదేశాల్లో చెట్లు నాటడం.
* ఈ వైపరీత్యం సంభవించే ప్రాంతాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్మాణాలు చేపట్టడం
* రోడ్లు, కాల్వల లాంటివి నిర్మించేటప్పుడు నీటి సహజ ప్రవాహ మార్గానికి అడ్డంకులు ఏర్పడకుండా చూడటం.
* ప్రమాద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకోకుండా చూడటం.
* ప్రమాద తీవ్రతను తగ్గించడానికి కొండ ప్రాంతాల్లో గోడలను నిర్మించడం.
* కట్టడాల్లో సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటించడం.
* తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి మ్యాపులను తయారు చేయడం.
* పటిష్టమైన హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయడం.

 

భారతదేశం చేపడుతోన్న చర్యలు 

  కొండచరియలు విరిగిపడే విపత్తును ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం, వివిధ సంస్థలు అనేక నిర్వహణా చర్యలను చేపడుతున్నాయి. భారతదేశంలో 'జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జి.ఎస్.ఐ.) దీనిపై మొదటిసారిగా పరిశోధన నిర్వహించింది. ఈ విపత్తు నిర్వహణకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎమ్ఏ) మార్గదర్శకాలను రూపొందిస్తోంది.

  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్‌వో(బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్)తో కలసి మంచు విరిగిపడే ప్రమాద నియంత్రణా చర్యలను చేపడుతున్నాయి. వివిధ సంస్థలు కొండచరియలు విరిగిపడే ప్రాంతాల పటాలను రూపొందిస్తున్నాయి. ఈ వైపరీత్యాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేకమైన శిక్షణ, పరికరాలున్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్)ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ వైపరీత్యం సంభవించిన తర్వాత ప్రజలను గుర్తించి, రక్షణ చర్యల్లో పాల్గొంటుంది.

  రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎస్‌డీఎమ్ఏ)తో కలసి అవగాహనా కార్యక్రమాలను చేపట్టడం, పుస్తకాలు ప్రచురణ, కరపత్రాల పంపిణీ, స్థానిక భాషలో వీడియో చిత్రాలను చూపించడం, పారిశ్రామిక ప్రాంతాలు, కార్యాలయాల్లో మాక్‌డ్రిల్స్ నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేస్తోంది. 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఈ విపత్తును ఎదుర్కొనే చర్యలను చేపడుతోంది. అంతేకాకుండా ప్రజలను చైతన్యవంతం చేస్తూ, రాష్ట్రాలకు తగిన సహాయాన్ని అందిస్తోంది.

 

పరిశోధన, నిర్వహణ చేపడుతున్న సంస్థలు

* జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)

* సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ)

* సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీబీఆర్ఐ)

* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - రూర్కి (ఐఐటీ - ఆర్)

* వాడియో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ (డబ్ల్యూఐహెచ్‌జీ)

* డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ (డీవోఎస్)

* నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్‌సీ)

* డిఫెన్స్ టెర్రేయిన్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (డీటీఆర్ఎల్)

* బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఎస్ఐ)

* భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన స్నో అండ్ అవలాంచ్ స్టడీ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎస్ఏఎస్ఈ) సంస్థ మంచుచరియలు విరిగిపడటంపై పరిశోధన చేస్తోంది.

* బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) భారతదేశంలోని కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, నిర్వహణలను చేపడుతోంది.

* డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ వైపరీత్యం గురించి పరిశోధన, అభివృద్ధి కోసం నిధులను కేటాయిస్తోంది.

* సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐవో) కొండచరియలు విరిగి పడటాన్ని గుర్తించడానికి 2006లో హరిద్వార్‌లోని మానసదేవి ప్రాంతంలో ఇన్‌స్ట్రుమెంటేషన్ నెట్‌వర్క్‌ను నెలకొల్పింది.

* బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ (ఎంబీటీపీసీ), అన్నా యూనివర్సిటీ సంయుక్తంగా 2004లో కొండచరియలు విరిగిపడే వైపరీత్యానికి సంబంధించిన అట్లాస్‌ను ప్రచురించాయి.

* నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఆర్ఎన్ఎస్‌సీ) కొండచరియలు విరిగిపడే వైపరీత్యం ఉన్న ప్రాంతాల పటాలను (Land slide Hazard Zonation Maps) తయారు చేస్తోంది

Posted Date : 23-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ సంబంధ సమకాలీన అంశాలు

1. ఇటీవల NABARD (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) కింది ఏ పర్యావరణ సంబంధ సంస్థతో ప్రధాన గుర్తింపు ఒప్పందం (AMA - Accreditation Master Agreement) పై సంతకం చేసింది?
జ: GCF - గ్రీన్ క్లైమేట్ ఫండ్

 

2. GCF కి సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాలేవి?
i) దీన్ని దక్షిణ కొరియాలో స్థాపించారు.
ii) దీన్ని UNFCC (United Nations Framework Convention on Climate Change) అధీనంలో ఉన్న సంస్థగా పేర్కొనవచ్చు.
iii) 2015లో అమల్లోకి వచ్చిన పారిస్ ఒప్పందానికి ఇది కేంద్ర బిందువు.
iv) సుమారు 24 మంది సభ్యులు ఉన్న ఒక బోర్డు అధీనంలో దీని పరిపాలన సాగుతుంది.
v) అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులను నిరోధించడానికి దీన్ని స్థాపించారు.
జ: i, ii, iii, iv , v

 

3. పులుల సంరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టైగర్ డేని (Global Tiger or International Tiger day) సాధారణంగా ఏ రోజు నిర్వహిస్తారు?
జ: జులై 29

 

4. సెయింట్ పీటర్స్‌బర్గ్ డిక్లరేషన్ కిందివాటిలో దేనికి సంబంధించింది?
    ఎ) అంతరిస్తున్న పాముల సంరక్షణ, వాటి జనాభా పెంపుదల.
    బి) పులుల సంరక్షణ, 2022 నాటికి ద్విగుణీకృత పులుల సంఖ్యను సాధించడం.
    సి) ఖడ్గమృగాలను జాతీయ పార్కుల్లో సంరక్షించడం.
    డి) సింహాలను కొత్త ప్రదేశాలకు పంపి వాటి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం.
జ: బి (పులుల సంరక్షణ, 2022 నాటికి ద్విగుణీకృత పులుల సంఖ్యను సాధించడం)

 

5. సెయింట్ పీటర్స్‌బర్గ్ పులుల సదస్సు (St. Peters Burg Tiger Summit) ఎప్పుడు జరిగింది?
జ: 2010

 

6. 2017 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ పులుల దినోత్సవం ప్రధాన నినాదం ఏమిటి?
జ: పులుల సంరక్షణార్థం శుద్ధమైన ఆవరణ శాస్త్రం (Fresh Ecology for Tiger's Protection)

 

7. 'వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్' గణాంకాల ఆధారంగా పులుల జనాభాకు సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాలేవి?
i) 1915 నాటికి సుమారు ఒక లక్షగా ఉన్న పులుల సంఖ్య గడిచిన శతాబ్దంలో సుమారు 97 శాతం మేర నష్టానికి గురైంది.
ii) ప్రస్తుతం పులులు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ అగ్ర స్థానంలో ఉంది. సుమారు 2,226 పులులు ఉన్నాయని అంచనా.
iii) గడిచిన కొన్ని దశాబ్దాలతో పోల్చుకుంటే ఈ దశాబ్దంలో పులుల సంఖ్యలో పెరుగుదల కొంత ఆశాజనకంగా ఉంది.
iv) భారత్, బంగ్లాదేశ్ సంయుక్త భాగస్వామ్యంలో ఉన్న పెద్ద మడ అడవి సుందర్‌బన్ ప్రపంచంలోనే అత్యధికంగా పులులు ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందింది.
జ: i, ii, iii, iv

 

8. కిందివాటిలో ప్రపంచంలోనే మొదటి హరిత మెట్రో వ్యవస్థగా సంపూర్ణంగా తయారైన మెట్రో రైలు వ్యవస్థ ఏది?
    ఎ) న్యూయార్క్ మెట్రో రైల్వే కార్పొరేషన్ (NMRC)    బి) ఆస్ట్రేలియా మెట్రో రైల్ ప్రైవేట్ లిమిటెడ్ (AMRL)
    సి) దిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ (DMRC)                డి) జపాన్ మెట్రో రైల్వే ఏజెన్సీ (JMRA)
జ: సి (దిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ (DMRC))

 

9. ఇటీవల 'నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా' ఏడు ప్రాజె క్టులను ఆమోదించింది. అయితే 'నేషనల్ మిషన్ ఫర్ క్లీన్' గంగాకు సంబధించి కిందివాటిలో ఏది సత్యం?
   i) ఇది నేషనల్ గంగా కౌన్సిల్ కార్యశీలక శాఖ
   ii) దీన్ని 2011లో స్థాపించారు.
   iii) దీని నిర్వహణ శైలిలో పరిపాలన శాఖ, కార్యనిర్వాహక శాఖ అనే రెండంచెల వ్యవస్థ నిర్మాణం కనిపిస్తుంది.
జ: i, ii, iii

 

10. దోహా సవరణ (Doha Amendment) కింది ఏ పర్యావరణ ఒప్పందానికి సంబంధించింది?
జ: క్యోటో ప్రోటోకాల్

 

11. క్యోటో ప్రోటోకాల్‌కు సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాలు?
   i) క్యోటో ప్రోటోకాల్ మొదటి నిబద్ధతా సమయం 2008 నుంచి 2012 వరకు
   ii) క్యోటో ప్రోటోకాల్ ద్వితీయ నిబద్ధతా సమయం (Second Commitment) 2013 నుంచి 2020 వరకు
   iii) ఇది ఒక అంతర్జాతీయ హరిత గృహ ప్రభావ కారక వాయువుల ఉద్గార నియంత్రణా ఒప్పందం
   iv) ఇది 2005 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది
జ: i, ii, iii, iv

 

12. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇటీవల ఏ నగరంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న జీవక్షయం కాని ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని మధ్యంతరంగా రద్దు చేసింది?
జ: దిల్లీ

 

13. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
జ: ఆగస్టు 12

 

14. 2017లో ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మన దేశంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రి డా.హర్షవర్థన్ ప్రారంభించిన కార్యక్రమం?
జ: గజ యాత్ర

 

15. కింది వాయువుల్లో దేన్ని కాలుష్యకారకం కానిదిగా చెప్పవచ్చు?
      ఎ) కార్బన్ డై ఆక్సైడ్       బి) పొగ       సి) సల్ఫర్ డై ఆక్సైడ్       డి) నైట్రోజన్
జ: డి (నైట్రోజన్)

 

16. ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వత ప్రాంతాన్ని ఇటీవల ఆవిష్కరించారు. ఇది ఎక్కడ ఉంది?
జ: అంటార్కిటికా

 

17. 2017లో నిర్వహించిన ఏనుగుల జనాభా గణనలోని అంశాల ఆధారంగా మన దేశంలో కింది ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఏనుగులు ఉన్నట్లు పేర్కొనవచ్చు?
జ: కర్ణాటక

 

18. ఆవరణ వ్యవస్థ సేవా అభివృద్ధి పథకం (Eco System Service Improvement Project) ను నేషనల్ గ్రీన్ ఇండియా మిషన్‌లో భాగంగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE) ద్వారా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏయే రాష్ట్రాల్లో ప్రారంభించనుంది?
      i) చత్తీస్‌గఢ్       ii) మధ్యప్రదేశ్       iii) గుజరాత్
జ: i, ii మాత్రమే

 

19. గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ అనేది కింది ఏ సంస్థకు సంబంధించింది?
జ: ప్రపంచ బ్యాంకు (World Bank)

 

20. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్న Eco System Service Improvement Project కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు?
జ: 5

 

21. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్ట్ కిందివాటిలో దేనికి సంబంధించింది?
ఎ) సౌర, పవన, ఇతర పునరుద్ధరింపదగిన వనరుల నుంచి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌శక్తిని సమకాలీకరణం (Synchronisation) చేయడానికి నిర్దేశించింది.
బి) జీవ పునరుత్పత్తిని ప్రదర్శించే వనరుల ఉత్పత్తి, వినియోగానికి నిర్దేశించింది.
సి) పంటలు, పండ్ల వృక్షాల వ్యర్థ పదార్థాల నుంచి నవీన పద్ధతుల ద్వారా విద్యుత్ ఉత్పాదన మెరుగుపరచడానికి
డి) సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాశ్చాత్య సాంకేతికతను ప్రవేశపెట్టడానికి నిర్దేశించింది.
జ: ఎ (సౌర, పవన, ఇతర పునరుద్ధరింపదగిన వనరుల నుంచి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌శక్తిని సమకాలీకరణం (Synchronisation) చేయడానికి నిర్దేశించింది)

 

22. పర్యావరణ సమతాస్థితి కొనసాగాలంటే భూమిపై ఉండాల్సిన అటవీ శాతం ఎంత?
జ: 33

 

23. బయోస్ఫియర్ రిజర్వ్ ప్రాజెక్ట్‌ను మన దేశంలో ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1986

 

24. వృక్ష ప్లవకాలు (Phyto planktons) అనేవాటిని కింది ఏ ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల జాబితాలో చేర్చవచ్చు?
జ: జలావరణ వ్యవస్థ (Aquatic Eco - System)

 

25. పాదరసం వల్ల కలిగే మినామిటా వ్యాధిని (Minamita) మొదటిసారిగా ఏ దేశంలో గుర్తించారు?
జ: జపాన్

 

26. మన దేశంలో అత్యధికంగా టైగర్ రిజర్వ్‌లు ఉన్న రాష్ట్రం ఏది?
జ: మధ్యప్రదేశ్

 

27. భారతదేశానికి సంబంధించిన కింది ఏ ప్రాంతంలో మడ అడవులు అత్యధికంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి?
జ: పశ్చిమ్ బంగ

 

28. ప్రపంచంలో అత్యధికంగా కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను విడుదల చేస్తున్న జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశం?
జ: ఖతర్

 

29. సల్ఫర్ డై ఆక్సైడ్ వల్ల కలిగే కాలుష్యానికి ప్రధాన సూచికగా కింది ఏ జీవులను పేర్కొనవచ్చు?
జ: లైకెన్లు

 

30. కిందివాటిలో పర్యావరణంలో కర్బన వలయానికి, కార్బన్ డై ఆయాక్సైడ్ ప్రవేశానికి సంబంధమున్న అంశాలు ఏవి?
   i) కిరణజన్య సంయోగక్రియ    ii) శ్వాసక్రియ   iii) కర్బన పదార్థాల విచ్ఛిత్తి    iv) అగ్ని పర్వతాల విస్ఫోటనం
జ: ii, iii, iv మాత్రమే 

 

గజ యాత్ర 2017

* ఇది దేశవ్యాప్తంగా సుమారు 12 ఎలిఫెంట్ రేంజ్ రాష్ట్రాల్లో ఏనుగుల సంరక్షణార్థం నిర్వహించిన ప్రచార యాత్ర

* ఇందులో భాగంగా కళాకారులు ఏనుగులకు సంబంధించిన కళా రూపాలతో పర్యటిస్తారు

* గజు మస్కట్ (Gaju Mascot) ఈ యాత్రకు చుక్కానిలా వ్యవహరించనుంది.

* ఈ కార్యక్రమం వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (WTI) ఆధ్వర్యంలో సుమారు 15 నెలలు కొనసాగుతుంది.

Posted Date : 23-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వరదలు

1. గంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలను నియంత్రించడానికి భారత ప్రభుత్వం గంగా ఫ్లడ్ కంట్రోల్ కమిషన్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది?
జ:  1972

 

2. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధీనంలో పనిచేసే 'నేషనల్ వాటర్ అకాడమీ' (NWA)ను ఏ నగరంలో నెలకొల్పారు?
జ:  పుణే

 

3. వరదల వల్ల రోడ్లు, రైల్వే లైన్లకు కలిగే నష్టాన్ని తనిఖీ చేయడానికి ఏ సంస్థలు పనిచేస్తున్నాయి? 
జ:  బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ , నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ,  స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ

 

4. వరద హెచ్చరిక, నదీ ప్రవాహం ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి అపాయకరమైన స్థాయి కంటే తక్కువగా ఉంటే  ఆ ప్రవాహాన్ని ఏమంటారు?
జ:  తక్కువస్థాయి వరద

 

5. 2008లో బీహార్‌లోని ఏ నదికి వరదలు రావడం వల్ల 527 మంది మరణించారు? 
జ:  కోసి

 

6. భారతదేశంలో ఎంత శాతం భూ భాగం వరద ముప్పునకు గురయ్యే అవకాశం ఉంది?
జ:  8%

 

7. భారతదేశంలో ఏ నెలల మధ్యకాలంలో వరదలు వచ్చే అవకాశం ఎక్కువ?
జ:  జూన్-సెప్టెంబరు

 

8. భారతదేశంలో ఏ సంవత్సరంలో సంభవించిన వరదల ఫలితంగా అత్యధికంగా 11,316 మంది మరణించారు?
జ:  1977

 

9. మన దేశంలో వరదలు తరచుగా ఏ నదీ పరీవాహక ప్రాంతాల్లో వస్తుంటాయి?
జ:  గంగా-బ్రహ్మపుత్ర

 

10. ఏదైనా ప్రాంతంలో వరదలు రావడానికి కారణం- 
జ:  అధిక వర్షపాతం, తుపాన్లు , జలాశయాలకు గండ్లు పడటం , కొండచరియలు విరిగిపడటం, నదులు ప్రవాహ దిశను మార్చుకోవడం

 

11. హైదరాబాద్, ముంబయి లాంటి నగరాల్లో వరదలు రావడానికి కారణమేమిటి?
జ:  డ్రైనేజీలు ఘనపదార్థాలతో పూడుకుపోవడం

 

12. బ్రహ్మపుత్రా నదీ ప్రాంతంలో ఉండే ఏ రాష్ట్రాల్లో అక్కడి నదుల వల్ల ఎక్కువగా వరదలు వస్తున్నాయి?
జ:  అసోం, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్

 

13. జార్ఖండ్, బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ నది, దాని ఉపనదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి?
జ:  గంగానది

 

14. మధ్య భారతదేశం, దక్కన్ ప్రాంతంలోని ఏ నదుల వల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వరదలు సంభవిస్తున్నాయి?
జ:  గోదావరి, కృష్ణా, కావేరి

Posted Date : 01-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సహజ వనరులు - పరిరక్షణ

వాడుకుంటూ.. కాపాడుకుంటూ!


ఎంత ఉపయోగించుకున్నా తరగదు గాలి. తవ్విన కొద్దీ తగ్గిపోతుంది బొగ్గు. అవి ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు. జీవుల మనుగడకు మూలాధారాలు. వాటిని సక్రమంగా వాడుకొని ఆదిమానవుడు ఆరోగ్యంగా జీవిస్తే, విచక్షణారహితంగా వినియోగించుకుంటూ ఆధునిక జీవుడు పర్యావరణానికి ప్రమాదకరంగా మారాడు. స్థిరమైన అభివృద్ధికి పర్యావరణ పరిరక్షణ తప్పనిసరని ప్రపంచం గుర్తించింది. అందుకే వనరులను సరైన రీతిలో వాడుకుంటూ, కాపాడుకుంటూ ఉండాలని ప్రకటించింది. పర్యావరణాంశాల అధ్యయనంలో భాగంగా సహజ వనరులు, రకాలు, క్షీణత తదితర అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.  
 


మానవుడికి అవసరమైన వస్తుసేవల ఉత్పత్తికి ఉపయోగపడే పదార్థాలు, శక్తి లాంటి వాటిని సహజవనరుల రూపంలో ప్రకృతి ప్రసాదిస్తోంది. ఆవరణ వ్యవస్థలు, జీవ రాశులు తమ విధులను నిర్వహించడానికి, మానవ సమాజాల సాంఘిక, ఆర్థిక నాగరికతల మనుగడకు కావాల్సిన శక్తిని అందించే వనరులనే సహజ వనరులు అంటారు. వివిధ ప్రామాణికతల ఆధారంగా వాటిని విభజించవచ్చు.


లభ్యతను అనుసరించి!

లభ్యతను అనుసరించి వనరులను వర్గీకరించారు. 

జీవ వనరులు: జీవావరణంలో ప్రాణం ఉండే అడవులు, జంతువులు, అనేక జీవజాతులే జీవ వనరులు. వృక్షాలు, జంతువులు మిలియన్ల సంవత్సరాల క్రితం నశించి, రూపాంతరం చెందడం వల్ల ఏర్పడిన బొగ్గు, చమురు, సహజ వాయువు లాంటి శిలాజ ఇంధనాలు జీవ వనరుల తెగకు చెందినవి.

నిర్జీవ వనరులు: జీవం లేని అనుఘటకాలు, సేంద్రియ పదార్థాల నుంచి లభించే వనరులే నిర్జీవ వనరులు. భౌతికపరమైన గాలి, నీరు, నేల లాంటివి ఈ వనరుల కోవకే చెందుతాయి. కాంతి, ఉష్ణం, వర్షపాతం తదితర శీతోష్ణస్థితి సంబంధితాలూ నిర్జీవ వనరులే. సేంద్రీయపరమైన కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, లిపిడ్స్‌ను కూడా జీవరహిత వనరులుగానే పరిగణిస్తారు నిరేంద్రియపరమైన సోడియం, కాల్షియం, ఫాస్ఫరస్‌ లాంటి రసాయనాలు నిర్జీవ వనరుల కిందకే వస్తాయి. 


 పునరుత్పత్తి సామర్థ్యాన్ని బట్టి!

మళ్లీ ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఆధారంగా వనరులను వర్గీకరించారు. 

పునరుద్ధరించగలిగే సహజ వనరులు: వినియోగిస్తున్నప్పటికీ తిరిగి ఉత్పత్తి చెందే సామర్థ్యం ఉన్నవి, మానవ ప్రయత్నాల ద్వారా కొత్తగా ఉత్పత్తి చేయగలుగుతున్న వనరులను పునరుత్పత్తి చెందే సహజ వనరులుగా భావించవచ్చు. ఇవి సాధారణంగా కాలుష్యరహితమైనవి. అందువల్ల వీటిని హరిత ఇంధనాలు అని పిలుస్తారు.

ఉదా: అటవీ వనరులు, పంట పొలాలు, జీవజాతుల ఉత్పత్తి, జలవనరులు, సౌరశక్తి, పవనశక్తి, ఓషన్‌ ఎనర్జీ, జియో థర్మల్‌ ఎనర్జీ, జలవిద్యుత్తు లాంటివి.

పునరుద్ధరించలేని సహజ వనరులు: ఈ వనరులు వినియోగించే కొద్దీ తరిగిపోతుంటాయి. వీటికి పునరుత్పత్తి సామర్థ్యం ఉండదు. మానవ ప్రయత్నం ద్వారా పునరుద్ధరించడం వీలు కాదు. ఇవి కాలుష్య కారకాలు. ప్రస్తుతం ఎక్కువ వినియోగంలో ఉన్నాయి.

ఉదా: శిలాజ ఇంధనాలు (బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, సహజ వాయువు రూపాంతరాలైన షెల్‌ గ్యాస్, గ్యాస్‌ హైడ్రేట్స్, కోల్‌బెడ్‌ మీథేన్‌), అణు ఇంధన   వనరులు (యురేనియం, థోరియం, ప్లుటోనియం) ప్రస్తుతం మానవుని జీవన గమనాన్ని యంత్ర శక్తి, సాఫ్ట్‌వేర్‌ సామర్థ్యమే నిర్దేశిస్తున్నాయి. కానీ వాటిని నడిపించడానికి ఇంధనశక్తి తప్పనిసరి. ఆ ఇంధన వనరుల్లో నూతన పోకడలు, విధానాల్లో అనేక మార్పులు కాలానుగుణంగా సంభవిస్తూనే ఉన్నాయి. వినియోగించే కాలం ఆధారంగా వాటిని వివిధ రకాలుగా విభజించవచ్చు.

1) సంప్రదాయ ఇంధన వనరులు: అనాదిగా మానవుడు వినియోగిస్తున్న ఇంధన వనరులివి. ఉదా: బొగ్గు, డీజిల్, సహజ వాయువు ఆధారంగా ఉత్పత్తి చేసే థర్మల్‌ విద్యుత్తు, జల విద్యుత్తు, అణుశక్తి; చోదక శక్తి కోసం వాడే ముడిచమురు, సహజ వాయువు లాంటివి. వీటిలో జల విద్యుత్తు మాత్రమే  పునరుత్పాదక ఇంధన వనరు.

2) సంప్రదాయేతర ఇంధన వనరులు: ఇవి ఇటీవల కాలంలో అభివృద్ధి చేసిన, అధిక ప్రాచుర్యం పొందిన ఇంధన వనరులు. వీటిని మళ్లీ రెండు రకాలుగా పేర్కొంటున్నారు.

ఎ) పునరుత్పాదక ఇంధన వనరులు: సౌర శక్తి, పవన శక్తి, బయో గ్యాస్, బయో డీజిల్, బయోమాస్‌ పవర్, బయో ఇథనాల్, చిన్న  తరహా జలవిద్యుత్తు, బగస్సీ - కోజనరేషన్‌ లాంటి తిరిగి ఉత్పత్తి చేయగలిగే శక్తి వనరులు.

బి) నవీన శక్తి వనరులు: ఇటీవలి కాలంలో సాంకేతిక సామర్థ్యంతో తయారై, వినియోగంలోకి వస్తున్న శక్తివనరులు.

ఉదా: హైడ్రోజన్‌ శక్తి, జియో థర్మల్‌ శక్తి, టైడల్‌ ఎనర్జీ, సీవేవ్‌ ఎనర్జీ, ఓషన్‌ థర్మల్‌ గ్రేడియంట్‌ ఎనర్జీ, షెల్‌ గ్యాస్, కోల్‌బెడ్‌ మీథేన్, గ్యాస్‌ హైడ్రేట్స్, బ్యాటరీలతో నడిచే వాహనాలు వంటివి.


అధిక వినియోగంతో క్షీణత

ఆదిమానవుడు అందుబాటులో ఉన్న సహజ వనరులను సహజ జీవనానికి మాత్రమే వినియోగించుకుని మంచి వాతావరణంలో ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడిపేవాడు. కానీ ఆధునిక మానవుడు అమూల్యమైన సహజ వనరులను విచక్షణారహితంగా వినియోగిస్తూ, ప్రమాదకరమైన వాతావరణంలో దుర్భర జీవితాన్ని సాగిస్తున్నాడు. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతి క్షీణించకుండా పరిరక్షించాల్సిన  ఆవశ్యకతను ఐక్యరాజ్యసమితి ‘వరల్డ్‌ ఛార్టర్‌ ఆఫ్‌ నేచర్‌ 1982’లో గుర్తించింది. వ్యక్తి స్థాయి నుంచి, అంతర్జాతీయ స్థాయి వరకూ అన్ని స్థాయుల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పింది. స్థిరమైన వృద్ధిని సాధించడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి చట్టాల్లో పర్యావరణ పరిరక్షణను పొందుపరచాలని ఈ చార్టర్‌ వివరించింది.

సహజ వనరుల పరిరక్షణ విధానాలు: పునరుద్ధరించగలిగిన, పునరుద్ధరించలేని వనరుల వృద్ధి రేటు కంటే వినియోగ రేటు ఎక్కువగా ఉంటే దాన్ని సహజవనరుల క్షీణతగా పరిగణించవచ్చు. అది వ్యవసాయం, చేపల వేట, గనుల తవ్వకం, నీరు, శిలాజ ఖనిజాల వినియోగం లాంటి వాటిల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల వనరుల నిర్వహణలో మూడు ప్రక్రియలు పాటించాలి. 

1) తగ్గించడం (Reduce): వీలైనంత వరకూ సహజ వనరుల వాడకాన్ని తగ్గించాలి. అనవసరంగా వాడకూడదు.

ఉదా: విద్యుత్తు వాడకం, నీటి వాడకం లాంటివి.

2) పునఃచక్రీయం (Recycle): సహజ వనరులపై ఒత్తిడి తగ్గించడానికి అప్పటికే వినియోగించడం ద్వారా లభించిన వేస్ట్‌ పేపర్, ప్లాస్టిక్, గ్లాస్‌ లాంటి పదార్థాలను పునరుత్పత్తి చేసి వినియోగించవచ్చు.

3) తిరిగి ఉపయోగించడం (Reuse): పచ్చళ్లకు, జామ్‌లకు వాడిన గాజు, ప్లాస్టిక్‌ బాటిళ్లను బయట పారేయకుండా తిరిగి వినియోగించవచ్చు. వార్తాపత్రికలను చదివిన తర్వాత ప్యాకింగ్‌ చేయడానికి వాడవచ్చు. ఈ విధంగా వాడిన వస్తువులనే మళ్లీ, మళ్లీ వినియోగించడం వల్ల సహజ వనరుల వృద్ధి, పరిరక్షణ సాధ్యమవుతుంది.


మాదిరి ప్రశ్నలు


1. కిందివాటిలో సంప్రదాయ ఇంధన వనరు కానిది ఏది?

1) బొగ్గు       2) అణువిద్యుత్‌      3) జలవిద్యుత్‌        4) కోల్‌బెడ్‌ మీథేన్‌

జ: 4

 


2. సహజ వనరుల పరిరక్షణ విధానాల్లో వరుస క్రమం ఏది?

  1) రెడ్యూస్‌ - రీసైకిల్‌ - రీయూజ్‌        2) రీసైకిల్‌ - రెడ్యూస్‌ - రీయూజ్‌ 

  3) రెడ్యూస్‌ - రీయూజ్‌ - రీసైకిల్‌        4) రీసైకిల్‌ - రీయూజ్‌- రెడ్యూస్‌ 

జ: 1

 

3. కిందివాటిలో కన్వెన్షనల్‌ శక్తి వనరు ఏది?

  1) జీవ ఇంధనాలు    2) సౌర శక్తి        3) జలవిద్యుత్‌       4) పవన శక్తి 

జ: 3

 

4. కిందివాటిలో సంప్రదాయేతర శక్తి వనరు ఏది?

  1) బయోగ్యాస్‌      2) సౌరశక్తి         3) టైడల్‌ శక్తి      4) పైవన్నీ

జ: 4 

 

5. కిందివాటిలో పునరుత్పాదక శక్తి వనరు కానిది?

  1) సౌర విద్యుత్‌       2) పవన విద్యుత్‌      3) ఓషన్‌ థర్మల్‌ ఎనర్జీ  4) ఏదీకాదు

జ: 4

 

6. సహజ వనరుల క్షీణత అంటే?

1) సహజ వనరుల పునరుద్ధరణ కంటే వాటి  వినియోగం ఎక్కువగా ఉండటం

2) సహజ వనరుల పునరుద్ధరణ కంటే వాటి వినియోగం తక్కువగా ఉండటం

3) సహజ వనరుల వినియోగం కంటే వాటి పునరుద్ధరణ ఎక్కువగా ఉండటం

4) ఏదీకాదు

జ: 1

 

7. కిందివాటిలో నవీన శక్తి వనరు ఏది?

  1) హైడ్రోజన్‌ ఎనర్జీ    2) టైడల్‌ ఎనర్జీ     3) సీవేవ్‌ ఎనర్జీ       4) పైవన్నీ

జ: 4

 

8. కిందివాటిలో సరికానిది?

1) ముడి చమురు సంప్రదాయ, పునరుత్పత్తి చెందని వనరు. 

2) పవన శక్తి సంప్రదాయేతర, పునరుత్పత్తి చెందే వనరు.

3) జియోథర్మల్‌ శక్తి నవీన, పునరుత్పత్తి చెందే వనరు.

4) సహజ వాయువు సంప్రదాయ, పునరుత్పత్తి చెందే వనరు.

జ: 4

 

9. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు?

   1) 1890       2) 1986      3) 1980        4) 1952

జ: 2

రచయిత: జల్లు సద్గుణరావు 

Posted Date : 27-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కరవు

పట్టి పీడించే కాటకం!

 

కావాల్సినంత కురవని వర్షం, బీటలు వారిన భూములు, అడుగంటిన చెరువులు, ఎండిపోయిన పంటలు, నిస్సారమైన నేలలు, వీటి ప్రభావంతో వస్తుసేవలు అందక జనం పడే ఇబ్బందులు. ఇదే విపత్తు. సమాజ పురోగతిని కుంగదీసే ప్రకృతి విపరిణామం. ఇలాంటి కాటక పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయి? నివారించే మార్గాలు ఏమిటి? తదితర అంశాలను ‘విపత్తు నిర్వహణ’ అధ్యయనంలో భాగంగా పరీక్షార్థులు తెలుసుకోవాలి.

  

 

ఒక భౌగోళిక ప్రాంతంలో సాధారణ పరిస్థితులకు భిన్నంగా కొంతకాలం వరకూ పూర్తిగా వర్షం లేకపోవడం లేదా అల్ప వర్షపాతం ఉండవచ్చు. ఇది శీతోష్ణస్థితి సాధారణ లక్షణం. దీనివల్ల నీరు, ఆహారం, పశుగ్రాసం కొరత ఏర్పడటం, ఉపాధి అవకాశాలు కొరవడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితినే కరవు లేదా దుర్భిక్షం అని పిలుస్తారు. ఈ వైపరీత్యంతో వ్యవసాయదారులతోపాటు మొత్తం సమాజం కూడా ఇబ్బందులకు గురవుతుంది. 


ప్రధాన కారణాలు: 

* దేశంలో రుతుపవనాలు అసమానంగా విస్తరించడం.

* మానవ అభివృద్ధి వల్ల వృక్షసంపద దెబ్బతిని నీరు భూమిలో ఇంకకపోవడం.

* అధిక జనాభా వల్ల నీటివనరులపై ఒత్తిడి పెరగడం.

* పట్టణీకరణ పెరగడంతో నీటి నిల్వ ప్రాంతాలు, నీటివనరుల పరీవాహక ప్రదేశాలు ఆక్రమణకు గురవడం.

* నీటి అవసరాలు, నిర్వహణ గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం.

 

నాలుగు రకాలు

భారత వ్యవసాయ కమిషన్‌ కరవును నాలుగు రకాలుగా విభజించింది.

వాతావరణ సంబంధ కరవు: ఒక ప్రదేశంలో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు సంభవించే కరవును వాతావరణ సంబంధ కరవుగా పేర్కొనవచ్చు. ఇలాంటి కరవు కారణంగా మిగతా కరవులు ఏర్పడతాయి. ఇది అన్ని కరువుల్లోనూ అతి తీవ్రమైంది.


జల సంబంధ కరవు: చాలాకాలం పాటు ఏర్పడే వాతావరణ కరవు కారణంగా భూఉపరితలంపైన, భూగర్భంలో నీటివనరుల లభ్యత తగ్గిపోవడాన్ని జలసంబంధ కరవుగా నిర్వచించవచ్చు.


వ్యవసాయ సంబంధ కరవు: జలసంబంధ కరవు ఎక్కువ కాలం కొనసాగితే మృత్తికల్లో తేమ తగ్గిపోయి మొక్కలు, పంటలు ఆరోగ్యకరమైన పెరుగుదలకు తోడ్పడలేని స్థితిని వ్యవసాయ సంబంధ కరవుగా భావించవచ్చు.


సామాజిక - ఆర్థిక కరవు: పై మూడు రకాల కరవులతో పాటు వస్తువులు, సేవల సరఫరా డిమాండ్‌పైన ప్రభావం చూపడాన్ని సామాజిక - ఆర్థిక కరవుగా పిలుస్తారు. ఇది సమాజంలోని ప్రతి వ్యక్తిపైనా ప్రభావం చూపుతుంది.


ఎలా కొలుస్తారు?


1) కరవు ఆరంభం: ఒక ప్రదేశంలో సాధారణ వర్షపాతంలో 25 శాతం తగ్గడం లేదా ఉండాల్సిన వర్షపాతంలో 75 శాతం వరకే నమోదైతే కరవు మొదలైనట్లు పరిగణిస్తారు.


2) మిత కరవు: సాధారణ వర్షపాతంలో 26% నుంచి 50% వరకు తగ్గడం లేదా ఉండాల్సిన వర్షపాతంలో 50% వరకు మాత్రమే కురిస్తే మిత కరవుగా పిలుస్తారు.


3) తీవ్ర కరవు: సాధారణ వర్షపాతంలో 50% కంటే తగ్గితే తీవ్ర కరవుగా వ్యవహరిస్తారు. మన దేశంలో వాయవ్య ప్రాంతంలో బలహీన రుతుపవనాల వల్ల, పర్యావరణం దెబ్బతినడంతో అతి తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడుతుంటాయి.


ప్రపంచ స్థితిగతులు


* ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం సహజ విపత్తుల్లో కరవు ద్వారా వచ్చే విపత్తు వాటా 19 శాతం ఉంటుంది. మొత్తంగా చూస్తే కరవు విపత్తు 3వ స్థానంలో ఉంది (మొదటి స్థానం వరదలు - 30%, రెండో స్థానం తుపాన్లు - 21%).

* ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఫర్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ (యూఎన్‌డీఆర్‌ఆర్‌- జెనీవా) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అన్నిరకాల సహజ విపత్తు మరణాల్లో కరవు, దుర్భిక్షం వల్ల అత్యధికంగా 45%, ఆ తర్వాత వరదల కారణంగా 16% మరణాలు సంభవిస్తున్నాయి.

* వరల్డ్‌ బ్యాంక్, యూఎన్‌ఓ సంయుక్తంగా విడుదల చేసిన సహజ వైపరీత్యాలు, అసహజ వైపరీత్యాల నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం సంభవించే విపత్తులు వరదలు, తుపాన్లు. అయితే ఆఫ్రికా దేశాల్లో మాత్రం కరవు తరచూ సంభవిస్తుంది.  

 

భారత్‌లో కరవు పరిస్థితులు

ఏటా దేశంలో 5 కోట్ల మంది ప్రజలు కరవు ప్రభావానికి గురవుతున్నారు. మొత్తం 640 జిల్లాల్లో 191 జిల్లాలు తీవ్ర కరవు ముప్పు ఎదుర్కొంటున్నాయి. దేశంలో మొత్తం వ్యవసాయ భూమిలో 68% భూమి క్షామం బారిన పడుతోంది. ఇది దేశం మొత్తం భూమిలో 16%. శుష్క, అర్ధశుష్క మండలాల్లో దాదాపు 8-9 ఏళ్లకు ఒకసారి తీవ్ర, అసాధారణ కరవు ఏర్పడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కరవు ఏటా సర్వసాధారణం.

ఉదా: రాజస్థాన్‌లో అత్యధిక ప్రాంతాల్లో 2000, 2001, 2002, 2003లలో వరుసగా నాలుగేళ్లు కరవు తాండవించింది.


కరవు తీవ్రత ఆధారంగా భారత వ్యవసాయ కమిషన్‌ దేశాన్ని అయిదు ప్రాంతాలుగా విభజించింది.


1. వాయవ్య భారతదేశం: రాజస్థాన్‌ తూర్పు, పశ్చిమ ప్రాంతాలు; గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాలు; పంజాబ్, హరియాణా, చండీగఢ్, దిల్లీ ప్రాంతాలను ఇందులో చేర్చారు. ఇది దేశంలో ఎక్కువగా కరవు ఎదుర్కొనే ప్రాంతం.


2. పశ్చిమ, మధ్య భారతదేశం: మహారాష్ట్రలోని మరట్వాడా, విదర్భ, ఉత్తర కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ భాగాలు; కొంకణి, గోవా ప్రాంతాలు, తెలంగాణ ఇందులో ఉన్నాయి.


3. ద్వీపకల్ప భారతదేశం: ఆంధ్రప్రదేశ్, దక్షిణ కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలు.


4. మధ్య ఈశాన్య భారతదేశం: ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌లో తూర్పు, పశ్చిమ భాగాలు.


5. ఈశాన్య భారతదేశం: అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపుర్, మిజోరం, త్రిపుర, హిమాలయాల దిగువనున్న పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాలు.

 

దేశంలో భూగర్భ జలాల వినియోగం ఆధారంగా రెండు ప్రాంతాలుగా విభజించారు.

డార్క్‌ జోన్‌: దేశంలో 40% ప్రాంతాన్ని డార్క్‌ జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను 50% కంటే ఎక్కువగా తోడేశారు.

ఉదా: రాజస్థాన్‌లోని సరిష్కా జాతీయ పార్కు ప్రాంతం.

గ్రే జోన్‌ ప్రాంతం: దేశంలో 30% ప్రాంతం గ్రే జోన్‌లో ఉంది. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను అక్కడి వర్షపాతం కంటే ఎక్కువ పరిమాణంలో తోడేస్తుంటారు.

 

కరవు తీవ్రతను తగ్గించే చర్యలు: * వర్షం నీటిని సరైన మార్గాల్లోకి మళ్లించే విధానాలు (వాటర్‌ హార్వెస్టింగ్‌) పాటించాలి.

* దేశంలో ఉత్తర భారత నదులను, దక్షిణ భారత నదులను కాల్వల ద్వారా అనుసంధానించాలి.

* గుజరాత్‌లో ఝలరా, రాజస్థాన్‌లోని బోలిస్‌ లాంటి మెట్ల బావుల విధానం, చెరువుల నిర్మాణం లాంటి సంప్రదాయ జలసంరక్ష పద్ధతులను ప్రోత్సహించాలి.

* ప్రజల్లో కరవుపై అవగాహన కల్పించాలి.

* వర్షపాతం, జలాశయాలు, సరస్సులు, నదులు లాంటి వాటిలో నీటి లభ్యతను గమనిస్తూ సరైన నీటి పర్యవేక్షణ చేపట్టాలి.

* పొలాల నుంచి వృథాగా పోతున్న నీటిని వ్యవసాయ కుంటల్లాంటి ఉమ్మడి జలాశయాల్లోకి చేరేలా చూడాలి.

* ముందుగానే కరవు ప్రణాళికను తయారు చేసుకోవాలి.

* కరవు ప్రాంతంలో జీవనోపాధి ప్రణాళికలు, పంటల బీమా పథకాలు అమలు చేయాలి.


మాదిరి ప్రశ్నలు


1. అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?

1) హైదరాబాద్‌     2) బెంగళూరు     3) ఇందౌర్‌     4) కోల్‌కతా

జ: హైదరాబాద్‌

 

2. ఝలరా, బోలిస్‌ అనే సంప్రదాయ నీటి సంరక్షణ విధానాలు కింది వాటిలో దేనికి చెందుతాయి? 

1) చెరువులు    2) మెట్ల బావులు    3) ఆనకట్టలు    4) నీటి కాలువలు

జ: మెట్ల బావులు

 

3. ఇంటి పైకప్పు నుంచి జారే వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం దేనికి ఉదాహరణ?

1) వాటర్‌షెడ్‌ విధానం       2) రైన్‌ షాడో విధానం

3) రైన్‌ ప్రిసిపిటేషన్‌ విధానం      4) వాటర్‌ హార్వెస్టింగ్‌ విధానం

జ: వాటర్‌ హార్వెస్టింగ్‌ విధానం

 

4. భారతదేశ వ్యవసాయ భూమిలో కరవు భూమి ఎంత?

1) 38%      2) 68%      3) 48%      4) 28%

జ:  68%

 

5. భూగర్భ జలాలను 50% కంటే ఎక్కువగా వాడేసే ప్రాంతాలను ఏ జోన్‌గా నిర్ణయించారు?

1) డార్క్‌ జోన్‌     2) గ్రే జోన్‌     3) ఎల్లో జోన్‌      4) రెడ్‌ జోన్‌

జ: డార్క్‌ జోన్‌

 

6. సాధారణ వర్షపాతంలో ఎంత శాతం తగ్గితే కరవుగా భావిస్తారు? 

1) 25% వరకు    2) 50% వరకు    3) 75% వరకు    4) 10% వరకు

జ: 50% వరకు

 

7. ప్రపంచ సహజ విపత్తుల్లో కరవు విపత్తు వాటా ఎంత?

1) 50%      2) 19%      3) 5%          4) 80%

జ: 19%

 

8. మహారాష్ట్రలో రాలెగావ్‌ సిద్ధి గ్రామంలో కరవును పారదోలిన అనుసంధానకర్త, సామాజిక కార్యకర్త ఎవరు?

1) అన్నాహజారే     2) రాజేంద్రసింగ్‌      3) మేధాపాట్కర్‌      4) పాలేకర్‌

జ: అన్నాహజారే

 

9. దేశంలో కరవు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం.

1) మధ్య భారతదేశం        2) ఈశాన్య భారతదేశం

 3) వాయవ్య భారతదేశం       4) హిమాలయ ప్రాంతం

జ: వాయవ్య భారతదేశం
 

10. భారత వ్యవసాయ పరిశోధనా మండలి కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?

1) దిల్లీ      2) ముంబయి      3) బెంగళూరు      4) కోల్‌కతా

జ: దిల్లీ

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 16-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అటవీ వనరులు - సంరక్షణ

తరగని సంపదకు.. తరాల సంక్షేమానికి!

 

భూగోళమనే శరీరానికి అడవులే ఊపిరితిత్తులు. అవి వాయు కాలుష్యాన్ని నివారించి జీవరాశికి స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారాన్ని అందిస్తాయి. అత్యంత విలువైన, ఎన్నటికీ తరిగిపోని ఆ సహజ సంపదను అందరూ కాపాడుకోవాలి. వనాలు క్షీణించే కొద్దీ కాలుష్యం, భూతాపం పెరిగిపోతాయి. వర్షాలు గతి తప్పుతాయి. దాంతో ఆహార సంక్షోభం సంభవిస్తుంది. అలాంటి సమస్యల నిరోధానికి, భవిష్యత్తు తరాల సంక్షేమానికి అడవులను రక్షించుకోవడం చాలా అవసరం. అందుకే మన దేశంలో అడవుల స్థితిగతులు, వాటిలో రకాలు, సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలను కాబోయే ప్రభుత్వ ఉద్యోగులు తెలుసుకోవాలి.

 

 

ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపదలో అడవులు, ఉద్భిజ్జ సంపద అత్యంత ప్రధానమైనవి. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో సహజసిద్ధంగా పెరిగే వృక్షాలను అడవులుగా భావిస్తే, వాటితో పాటు ఉండే గడ్డి మైదానాలు, పొదలు, మొక్కలు, లతలు అన్నింటినీ కలిపి ఉద్భిజ్జ సంపదగా పరిగణిస్తారు. ఫారెస్ట్‌ అనే పదం ఫోరెస్‌ (Fores) అనే లాటిన్‌ పదం నుంచి పుట్టింది. అడవులు పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా, మానవుడి ఆర్థిక, సామాజిక అవసరాలను తీరుస్తున్నాయి. మన దేశంలో 1987 నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి అడవుల లెక్కలను ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సేకరిస్తోంది. 2021లో సేకరించిన 17వ ఇండియన్‌ స్టేట్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌ ప్రకారం (ISFR) దేశంలో 7,13,789 చ.కి.మీ. (71.37 మిలియన్ల హెక్టార్లు) మేర అడవులున్నాయి. దేశ వైశాల్యంలో 21.71% విస్తరించాయి. 2019 నాటి ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ లెక్కలతో పోలిస్తే 1,540 చ.కి.మీ. మేర అడవులు పెరిగాయి. ఈ పెరుగుదల అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో, ఆ తర్వాత తెలంగాణ, ఒడిశాలలో ఉంది.

 

విస్తరణ స్థితిగతులు

మన దేశ అడవులు ప్రపంచ అడవుల్లో 2% మాత్రమే ఉన్నప్పటికీ 10వ స్థానంలో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ వారి గ్లోబల్‌ ఫారెస్ట్‌ రిసోర్సెస్‌ అంచనా ప్రకారం ప్రపంచంలో అత్యధిక అడవులు ఉన్న దేశాలు వరుసగా 1) రష్యా 2) బ్రెజిల్‌ 3) కెనడా.

దేశంలో అడవులు అత్యధికంగా విస్తరించిన రాష్ట్రం మధ్యప్రదేశ్‌ అయితే, అడవుల శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం మిజోరం.


అడవుల విస్తీర్ణం రాష్ట్రాల్లో..

అత్యధికం అత్యల్పం
1. మధ్యప్రదేశ్‌ 1. హరియాణా
2. అరుణాచల్‌ప్రదేశ్‌ 2. పంజాబ్‌
3. ఛత్తీస్‌గఢ్‌ 3. గోవా

             

కేంద్రపాలిత ప్రాంతాల్లో..

అత్యధికం అత్యల్పం
1. జమ్ము-కశ్మీర్‌ 1. చండీగఢ్‌
2. అండమాన్‌ నికోబార్‌ దీవులు 2. లక్షదీవులు
3. లద్దాఖ్‌ 3. పుదుచ్చేరి


అడవుల శాతం రాష్ట్రాల్లో..

అత్యధికం అత్యల్పం
1. మిజోరం (85%) 1. హరియాణా (3.63%)
2. అరుణాచల్‌ ప్రదేశ్‌ (79%) 2. పంజాబ్‌ (3.67%)
3. మేఘాలయ (76%) 3. రాజస్థాన్‌ (4.87%)


కేంద్రపాలిత ప్రాంతాల్లో...

అత్యధికం అత్యల్పం
1. లక్షదీవులు (90.33%) 1. లద్దాఖ్‌ (1.35%)
2. అండమాన్‌ నికోబార్‌ దీవులు (82%) 2. పుదుచ్చేరి (11%)
3. జమ్ము-కశ్మీర్‌ (39%) 3. దిల్లీ (13%)

                      

దేశంలో అడవుల ప్రాంతీయ వర్గీకరణను గమనిస్తే అత్యధిక శాతం అడవులు ద్వీపకల్ప పీఠభూమిపై (57%) ఉన్నాయి. హిమాలయాలపైన 18%; పశ్చిమ కనుమలు, పశ్చిమ తీరంలో 10%; తూర్పు కనుమలు, తూర్పు తీరంలో 10%; మిగిలిన 5 శాతం ఉత్తర మైదానాల మీద విస్తరించి ఉన్నాయి.


అడవుల్లో రకాలు 

సాధారణంగా అడవులు వర్షపాతం, గాలిలో తేమ, ఉష్ణోగ్రత, సముద్ర మట్టం నుంచి ఎత్తు వంటి వాటిపై ఆధారపడి పెరుగుతాయి. భారతదేశంలో అనేక నిమ్నోన్నతాలు, శీతోష్ణ స్థితిగతుల్లో ప్రాంతాల మధ్య వ్యత్యాసాల వల్ల వివిధ రకాల అడవులు విస్తరించి ఉన్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు భారతదేశ అడవులను ఎన్నో విధాలుగా విభజించినప్పటికీ సాధారణ అవగాహన కోసం దేశంలో అడవులను కింది విధంగా వర్గీకరించవచ్చు.

 

ఉష్ణ మండల సతతహరిత అరణ్యాలు: ఈ రకం దేశంలో 21 శాతం విస్తరించి ఉన్నాయి. ఇవి పెరగడానికి 200 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం, సముద్ర మట్టం నుంచి 500 - 1500 మీ. కంటే ఎత్తయిన ప్రాంతం కావాలి. అందువల్ల ఇవి పశ్చిమ కనుమల పశ్చిమ భాగాల్లోనూ, అన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ, అండమాన్‌ - నికోబార్‌ దీవుల్లో విస్తరించి ఉంటాయి. ఈ అడవుల్లో మహాగని, ఎబోని, రోజ్‌వుడ్, సింకోనా, సేముల్, ఇరులా లాంటి పొడవైన కాండాలు, వెడల్పయిన ఆకులు, గట్టి కలపనిచ్చే చెట్లు పెరుగుతాయి.

 

ఉష్ణమండల ఆకురాల్చు అడవులు: మన దేశ అడవుల్లో ఈ రకం అత్యధికంగా 65 శాతం ఉన్నాయి. 100 - 200 సెం.మీ. వర్షపాతం, సముద్ర మట్టం నుంచి 500 మీటర్ల ఎత్తు వరకు ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. కొండవాలులు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు వీటికి అనుకూలం. ద్వీపకల్పం మీద, అన్ని పీఠభూముల్లో, తూర్పు కనుమల వెంబడి శివాలిక్‌ హిమాలయాల్లోనూ, లక్షదీవులు, అండమాన్‌ నికోబార్‌ తూర్పు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లోనూ గట్టి కలప, వెడల్పు ఆకులుండే టేకు, మద్ది, సాల్, గంధపు చెట్లు, వెదురులాంటి వృక్ష సంపద ఉంటుంది.

 

ఉష్ణమండల పొదలు లేదా ఎడారి పొదలు: ఇవి ఎక్కువగా వాయవ్య భారత దేశంలోనూ, ద్వీపకల్పంలో కొండల తూర్పు భాగాల్లోని వర్షచ్ఛాయా ప్రాంతాల్లో 2% మేర విస్తరించి ఉన్నాయి. వీటికి 100 సెం.మీ. కంటే తక్కువ వర్షం సరిపోతుంది. ఇందులో తాటి, ఈత, కర్జూరం చెట్లు, బ్రహ్మజెముడు, నాగజెముడు వంటి పొదలు, చిన్న ఆకులు, దళసరి ఆకులుండే వృక్ష సంపద పెరుగుతుంది. ఇవి బాష్పోత్సేకాన్ని నిరోధిస్తాయి. కాబట్టి వీటిని ‘జీరోఫైట్స్‌’ వృక్షసంపద అంటారు.

 

హిమాలయ పర్వత అడవులు: ఎత్తయిన హిమాలయాల్లో పెరిగే వృక్షసంపద. ఇవి మిగతా ప్రాంతాలతో పోలిస్తే మంచులో పెరిగే ఆల్ఫైన్‌ అడవులు, సమశీతల శృంగాకార అడవుల వృక్ష సంపద ఉంటాయి. ఉదా: విల్లో, ఆల్టర్, దేవదారు, ఓక్‌ సిల్వర్‌ పర్‌.

 

మడ అడవులు: ఇవి ఉప్పు నీరు కలిసిన డెల్టాలు, ఈస్చ్యురీల్లో (నదీముఖాలు) పెరుగుతాయి. వీటినే టైడల్‌ ఫారెస్ట్‌ లేదా క్షారజల అరణ్యాలు అంటారు. ఇవి మన దేశంలో 2% మాత్రమే ఉన్నాయి. సముద్రతీరం ఉన్న 9 రాష్ట్రాలు, అండమాన్‌-నికోబార్‌ దీవులు, పుదుచ్చేరి, దాద్రానగర్‌ హవేలి ప్రాంతాల్లో అక్కడక్కడా విస్తరించి ఉన్నాయి. ఇవి సునామీలకు సహజ అడ్డుగోడలుగా ఉపయోగపడతాయి. వీటికి శ్వాసవేళ్లు, కాండాలలో గాలి గదులు ఉంటాయి. వీటితో చేపల వేటకు వాడే సంప్రదాయ పడవలను ఎక్కువగా తయారు చేస్తుంటారు.


అటవీ సంరక్షణకు ప్రభుత్వ చర్యలు

* అటవీ చట్టం - 1927

* వన్యప్రాణి సంరక్షణ చట్టం - 1972

* పులిని జాతీయ జంతువుగా ప్రకటించిన సంవత్సరం - 1972

* మొదటిసారిగా పులుల సంరక్షణ ప్రాంతాలను ఏర్పాటు చేసిన సంవత్సరం - 1973

* అటవీ పరిరక్షణ చట్టం - 1980

* పర్యావరణ చట్టం - 1986

* జీవ వైవిధ్య చట్టం - 2002

* వన మహోత్సవ కార్యక్రమం - ప్రతి సంవత్సరం జులైలో

* 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అడవులను ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఆదేశిక సూత్రాల్లో కూడా పొందుపరిచారు.

* సామాజిక అడవుల కార్యక్రమం - 1980-82


మాదిరి ప్రశ్నలు


1. కిందివాటిలో మడ అడవులు లేని రాష్ట్రం ఏది?

1) పశ్చిమ బెంగాల్‌     2) తమిళనాడు     3) ఆంధ్రప్రదేశ్‌       4) అస్సాం

జ: అస్సాం

 

2. అడవుల విస్తీర్ణం అత్యధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది?

1) లద్దాఖ్‌      2) జమ్ము-కశ్మీర్‌      3) అండమాన్‌ - నికోబార్‌ దీవులు     4) లక్షదీవులు

జ: జమ్ము-కశ్మీర్‌

 

3. కింది ఏ అడవుల్లో జీవవైవిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది?

1) దట్టంగా పెరిగే సతతహరిత అరణ్యాలు 

2) గడ్డి భూములు ఎక్కువగా ఉండే ఆకురాల్చు అడవులు

3) ముళ్ల పొదలు ఎక్కువగా ఉండే ఎడారి పొదలు

4) హిమాలయాల్లోని అడవులు

జ: గడ్డి భూములు ఎక్కువగా ఉండే ఆకురాల్చు అడవులు

 

4. కోరింగ అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?

1) ఒడిశా      2) తమిళనాడు     3) కేరళ     4) ఆంధ్రప్రదేశ్‌

జ: ఆంధ్రప్రదేశ్‌​​​​​​​

 

5. జాతీయ అటవీ విధాన తీర్మానం ప్రకారం దేశంలో ఎంత శాతం అడవులు ఉండాలి?

1) 33.3%     2) 23.3%    3) 43.3%     4) 53.3%

జ: 33.3%

 

6. ఫారెస్ట్‌ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది?

1) గ్రీకు      2) అరబ్బీ     3) లాటిన్‌      4) స్పానిష్‌

జ: లాటిన్‌​​​​​​​

 

7. మన దేశంలో 90% కి మంచి అడవులు ఉన్న ప్రాంతం ఏది?

1) మిజోరం      2) లక్షదీవులు      3) అండమాన్‌ - నికోబార్‌      4) మధ్యప్రదేశ్‌

జ: లక్షదీవులు​​​​​​​

 

8. కింది ఏ దేశం మొదటిసారిగా అడవుల నరికివేతను నిషేధించింది?

1) డెన్మార్క్‌       2) నార్వే       3) అమెరికా      4) రష్యా

జ: నార్వే​​​​​​​

 

9. అడవి గాడిదల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?

1) కచ్, గుజరాత్‌     2) రాంచి, ఝార్ఖండ్‌     3) జోర్హాట్, అస్సాం    4) ఎర్నాకులం, కేరళ

జ: కచ్, గుజరాత్‌​​​​​​​

 

10. దేశంలో అత్యల్పంగా అడవులున్న రాష్ట్రం?

1) పంజాబ్‌       2) హరియాణా      3) రాజస్థాన్‌        4) సిక్కిం

జ: హరియాణా​​​​​​​


రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 25-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వరద విపత్తులు


     మానవ మనుగడకు ప్రకృతి ప్రాణాధారం.. అది వికృత రూపం దాలిస్తే మాత్రం ప్రమాదకర పరిణామం.. ఇలాంటి ప్రమాదకర విపత్తుల్లో వరదలు ఒకటి. వివిధ రీతుల్లో ముంచుకొచ్చే ఈ వరదల కారణంగా భూమండలంపై ఎన్నో ప్రాంతాల్లో అపార నష్టం వాటిల్లుతోంది. భారతదేశంలోనూ వీటి ప్రభావం తీవ్రంగానే ఉంది. తెలుగు రాష్ట్రాలకూ అప్పుడప్పుడూ ఈ ముప్పు తప్పడం లేదు. అసలు వరదలెలా సంభవిస్తాయి? ఏవిధంగా తీవ్ర నష్టాలకు కారణమవుతున్నాయి? తదితర అంశాలు తెలుసుకుందామా!
ప్రకృతి సహజ వికృత రూపాల్లో వరదలు ఒకటి. ఏటా వరదల వల్ల ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, పర్యావరణ పరంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రాణ నష్టం కూడా ఎక్కువే. సూర్యపుటం (సూర్యుడి నుంచి భూమి గ్రహించే ఉష్ణోగ్రత) వల్ల భూమి వేడెక్కి.. నేల మీద ఉన్న తేమ, జలాశయాల్లోని నీరు ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడతాయి. ఈ మేఘాలు అనుకూల పరిస్థితుల్లో వర్షం లేదా మంచు లేదా వడగళ్లుగా మారి నేలపై అవపాతం చెందుతాయి. ఈ ప్రక్రియ విపరీతంగా జరిగి అధిక వర్షాలు పడినప్పుడు సాధారణంగా వరదలు ఏర్పడతాయి. ఏదైనా ప్రాంతంలో సాధారణ ప్రవాహస్థాయిని మించి నీరు ప్రవహించినప్పుడు వరదలు సంభవిస్తాయి. వరద ఉద్ధృతి పెరగడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. అయితే ఆనకట్టలు తెగిపోవడం, భారీ వర్షాలు తదితర ప్రక్రియల వల్ల ఎలాంటి హెచ్చరిక లేకుండానే అకస్మాత్తుగా వరదలు వస్తాయి.

 

వరదలు.. రకాలు

1. నదీ వరదలు
     నది తనలో ఉంచుకోగల నీటి పరిమాణాన్ని పారుదల సామర్థ్యం (ఛానెల్ కెపాసిటీ) అంటారు. సముద్రంలోకి పంపే నీరు కంటే ఎక్కువ నీరు నదిలో ఉన్నప్పడు ఆ నీరు పొంగి నది గట్టును దాటి వరదలు సంభవిస్తాయి. వీటిని 'నదీ వరదలు అంటారు.
2. మెరుపు వరదలు
     కుండపోత వర్షాలు.. మంచు హఠాత్తుగా కరిగి నదిలో చేరడం.. ఆనకట్టలు విరిగిపోవడం లాంటివి జరిగినప్పుడు అకస్మాత్తుగా వచ్చే వరదలను 'మెరుపు వరదలు అంటారు.
3. తీర ప్రాంత వరదలు
     సముద్రంలో ఉప్పెనలు, సునామీలు వచ్చినప్పుడు తీర ప్రాంతంలో ఏర్పడిన వరదలను 'తీర ప్రాంత వరదలు అంటారు.
4. నదీ ముఖద్వార వరదలు
     సముద్రంలోని ఉప్పెన కారణంగా సముద్రంలోని అలలు నదీ నీటి ప్రవాహాన్ని వెనక్కి నెడతాయి. ఫలితంగా నదులు సముద్రంలో కలిసే ప్రదేశాల్లో ఏర్పడిన వరదలను 'నదీ ముఖద్వార వరదలు అంటారు.
5. పట్టణ వరదలు
     సరైన మురుగునీటి వ్యవస్థ లేని నగరాలు, పట్టణాల్లో భారీ వర్షాలు సంభవించినప్పుడు ఏర్పడిన వరదలను 'పట్టణ వరదలు అంటారు.
6. ప్రమాద కారణ వరదలు
     అధిక పరిమాణంలో నీటిని సరఫరా చేసే గొట్టాలు పగిలిపోయినప్పుడు చుట్టు పక్కల ప్రాంతాలు నీటిలో మునిగిపోతాయి. ఇలా ఏర్పడే వరదలే 'ప్రమాద కారణంగా ఏర్పడిన వరదలు.

 

కొత్త సవాళ్లు

     ప్రాచీన కాలంలో మానవులు జలాశయాలకు దగ్గరలోనే నివసించేవారు. అయితే వరదల ప్రభావాన్ని తప్పించుకోవడానికి తగినంత దూరంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకునేవారు. నాగరకతలు అభివృద్ధి చెందిన కాలంలో మానవులు నదీలోయ ప్రాంతాల్లో జీవించేవారు. యూఫ్రటిస్, టైగ్రిస్ నదీ లోయల్లో మెసపటోమియా నాగరకత; నైలు నదీలోయలో ఈజిప్టు నాగరకత; సింధు నదీ ప్రాంతంలో సింధు నాగరకత; యాంగ్జీ, పసుపు నదీ ప్రాంతంలో చైనా నాగరకత ఇలాంటివే. 21వ శతాబ్దంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల మానవుడి జీవిత కాలం పెరిగింది. అదే సమయంలో అనేక విపత్తుల వల్ల ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. అభివృద్ధి, జనాభా, నగరీకరణ తరచూ వరదలు రావడానికి కారణమవుతున్నాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ సహజ వనరులపై ఒత్తిడి అధికమవుతోంది. ఇది మానవ జీవితాలను అత్యంత అపాయంలోకి నెడుతోంది. కొన్ని చోట్ల సరైన అభివృద్ధి ప్రణాళిక లేకపోవడం వల్ల వరదలు ఏర్పడుతుండగా మరికొన్ని చోట్ల అతి అవస్థాపనా సౌకర్యాల కల్పన వల్ల వరదలు సంభవిస్తున్నాయి. మెక్సికోలోని మిసిసిపీ నదీ ప్రాంతం, బంగ్లాదేశ్‌లోని హోండూరస్ పర్వత ప్రాంతాల్లోని అభివృద్ధి చెందుతున్న (జనసాంద్రత ఎక్కువగా ఉన్న) ప్రాంతాల్లో ఈ వరదల బీభత్సం ఎక్కువగా ఉంది. ఈ విధంగా మానవుడి అభివృద్ధి కూడా కొత్త సవాళ్లను విసురుతోంది.
 

రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీ

     వివిధ రకాల విపత్తుల వల్ల జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాలను లెక్కించడానికి, నమోదు చేయడానికి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సంస్థ పనిచేస్తోంది. వాతావరణ విపత్తుల్లో వరద విపత్తు వల్ల ప్రపంచంలో అత్యధిక ఆస్తి, ప్రాణ నష్టాలు, అత్యధిక ప్రాంతాల్లో సంభవిస్తున్నాయని ఈ సంస్థ పేర్కొంది.
 

భారతదేశంలో వరదల ప్రభావం

     ప్రపంచ వ్యాప్తంగా వరదల కారణంగా మరణిస్తున్నవారిలో 20% భారతదేశంలోనే ఉన్నారు. ఇక్కడ వరద ముప్పునకు గురయ్యే ప్రదేశాలు కూడా ఎక్కువే. ఇక్కడ దాదాపు అన్ని నదీ పరీవాహక ప్రదేశాల్లోనూ వరదలు సంభవిస్తున్నాయి.
1. గంగానదీ పరీవాహక ప్రాంతం
     ఉపనదుల వల్ల గంగానదీ పరీవాహక ప్రాంతంలో ఉత్తర భాగం తీవ్ర వరదలకు గురవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ్ బంగ రాష్ట్రాల్లోని ఉత్తర భాగాలు ప్రతి సంవత్సరం వరదల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో శారద, గాగ్రా నదులు వరదలకు కారణమవుతున్నాయి. బిహార్‌లో ఏటా కోసి, గండక్ నదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి. పశ్చిమ్ బంగలోని దామోదర్, అజయ్ నదుల చుట్టుపక్కల ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి.
2. బహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతం
     బ్రహ్మపుత్ర, బరాక్ నదులు.. వాటి ఉపనదుల కారణంగా అసోం ఎక్కువగా వరదలకు గురవుతోంది. జల్దాకా, తీస్తా, తోర్సా నదుల వల్ల పశ్చిమ్‌బంగ ఉత్తర ప్రాంతం నీటి ముంపునకు గురవుతోంది.
3. వాయవ్య నదీ పరీవాహక ప్రాంతం
     వాయవ్య భారతదేశంలో జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్, గగ్గర్ నదుల పరీవాహక ప్రాంతాలు జలసమాధి అవుతున్నాయి.
4. మధ్య, దక్కన్ భారతదేశం
     గోదావరి, కృష్ణా, కావేరి, పెన్నా, తుంగభద్ర, నర్మదా తదితర నదులు.. మధ్య, దక్కన్ భారతదేశంలో ఏటా వరదలకు కారణమవుతున్నాయి. ఒడిశాలో మహానది, వైతరణి, బ్రాహ్మణి నదీపరీవాహక ప్రాంతాలు కూడా వరదల బీభత్సాన్ని ఎదుర్కొంటున్నాయి.
5. ముప్పు ముంగిట తెలుగు రాష్ట్రాలు
     తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులు ప్రధానంగా వరదలకు కారణమవుతున్నాయి. ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో నాగావళి, వంశధార నదులు; దక్షిణ ఆంధ్రాలో పెన్నా నదీ ప్రాంతం వరదలకు కారణమవుతున్నాయి. 2009లో కృష్ణానదికి వచ్చిన వరదల వల్ల మహబూబ్‌నగర్, కర్నూలు, నల్గొండ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు అపార నష్టం వాటిల్లింది. ముంబయి, కోల్‌కత లాంటి పెద్ద నగరాల్లోనూ మురుగునీటి వ్యవస్థ ప్రణాళికాయుతంగా లేదు. అధిక వర్షాలు వచ్చినప్పుడు నగరాలు నీట మునుగుతున్నాయి. 2005లో ముంబయిలో ఒకే రోజున 10 సెంటీ మీటర్ల వర్షం కారణంగా ఆ మహానగరాన్ని వరదలు ముంచెత్తాయి.
ముఖ్యాంశాలు
* జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం భారతదేశ భూభాగంలో 12.8 శాతం (40 మిలియన్ల హెక్టార్లు) వరదలకు గురవుతోంది. ఇందులో అధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 21.9 శాతం, బిహార్‌లో 12.7 శాతం భూభాగంలో వరదలు సంభవిస్తున్నాయి.
* వరదల కారణంగా 1953-2009 మధ్య భారతదేశం ఏడాదికి సగటున రూ.1,650 కోట్లను నష్టపోయింది. ప్రతి సంవత్సరం సగటున 1,464 మంది చనిపోతుండగా, 86,288 పశువులు మృత్యువాత పడుతున్నాయి.
* మన దేశంలో వరద ఉద్ధృతిని తెలుసుకోవడానికి శాటిలైట్, రిమోట్ సెన్సింగ్ పరికరాలు లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
* మన దేశంలో వరదల హెచ్చరికలను కేంద్ర జలసంఘం లేదా సాగునీరు, వరద నియంత్రణ శాఖ లేదా జలవనరుల శాఖ జారీ చేస్తాయి.
* సహజ వైపరీత్యమైన వరదలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధంగా ఉండాలి. అప్పుడే అవి విపత్తులుగా మారకుండా ఉంటాయి. తద్వారా విలువైన సంపదను కాపాడుకోవచ్చు.

Posted Date : 30-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సామాజిక ఉద్యమాలు

సామాజిక ఉద్యమాల ప్రధాన లక్ష్యం మార్పు. అంటే.. ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి మార్పును ఆశించడం. మన దేశంలో ఇలాంటి సామాజిక ఉద్యమాల పరిధి విస్తృతం. దానికి ప్రధాన కారణం మన దేశ సామాజిక వ్యవస్థ స్వభావం. ప్రపంచంలోని చాలా దేశాల కంటే భిన్నమైన సామాజిక నిర్మాణం మనది.
1960వ దశకం నుంచి అమెరికా, యూరప్ దేశాల్లో కొత్త తరహా ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ కాలంలో వచ్చిన పర్యావరణ, శాంతి, స్త్రీవాద ఉద్యమాలను నూతన ఉద్యమాలుగా వర్గీకరించవచ్చు. భారతదేశంలో తలెత్తిన దళిత, ఆదివాసీ, స్త్రీవాద, మానవ హక్కుల, పర్యావరణ ఉద్యమాలను కూడా 'నూతన సామాజిక ఉద్యమాలు'గానే పేర్కొనవచ్చు. అయితే ఈ ఉద్యమాల లక్ష్యం రాజ్యాధికారం కాదు.

 

పర్యావరణం - సంవేదన దశ

భారతదేశంలో అనేక సామాజిక ఉద్యమాలు పర్యావరణ సమస్యలను తమ అజెండాలో చేర్చాయి. పర్యావరణ అంశాలు సామాజిక ఉద్యమాల్లో 20వ శతాబ్దపు రెండోభాగంలో.. 1970 దశకం తర్వాత వచ్చినప్పటికీ, వాటి మూలాలు వలస పాలన కాలంలోనే ఉన్నాయి.
* అడవులు - అటవీ ఉత్పత్తులు, సముద్ర సంపదపై హక్కులు..
* చేపల చెరువుల పెంపకం, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, పెద్ద ఆనకట్టల నిర్మాణాన్ని వ్యతిరేకించడం..
* అణు విద్యుత్తు, అణుశక్తి కేంద్రాల ఏర్పాటు, అణుయుద్ధాలను వ్యతిరేకించడం..
ఇలాంటి పర్యావరణ అంశాలను వివిధ సామాజిక ఉద్యమాలు తమ అజెండాలో చేర్చాయి. సామాజిక ఉద్యమాలైన గిరిజన, మహిళ, పౌరహక్కుల, రైతుల, కార్మిక ఉద్యమాల అజెండాలో పర్యావరణ అంశాలు కనిపిస్తాయి.

 

అటవీ హక్కుల కోసం..

గిరిజన ఉద్యమాల్లో చిప్కో, అప్పికో ముఖ్యమైనవి. గిరిజనుల అవసరాలు, మనుగడ.. అటవీ ఉత్పత్తులు, అటవీ సంపదపై ఆధారపడి ఉన్నందున గిరిజనులకు వాటిపై హక్కులు ఉండాలని ఈ ఉద్యమాలు పేర్కొన్నాయి.

 

చిప్కో ఉద్యమం

చారిత్రక నేపథ్యం: చిప్కో ఉద్యమం ప్రాచీన భారతీయ సంస్కృతి నుంచి ఉద్భవించింది. చారిత్రకంగా, తాత్వికంగా గాంధేయ సత్యాగ్రహ విధానాల్లోనే నడిచినందున ఈ ఉద్యమాన్ని ఆ రోజుల్లో 'అడవి సత్యాగ్రహం అని పిలిచేవారు. గిరిజనులు అడవులను రక్షించుకోవాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం మొదలైంది. మొదట చెట్లను రక్షించే ఉద్యమంగా, తర్వాత ఆర్థిక ఉద్యమంగా మారి చివరకు పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. బ్రిటిష్ పరిపాలనలో 1927లోని అటవీ చట్టం వల్ల గ్రామ ప్రజల హక్కులను నిరాకరించడం, గ్రామీణ జీవనోపాధి లేకపోవడం, వాణిజ్యం కోసం అడవులను కొల్లగొట్టడంతో దేశమంతటా ఈ ఉద్యమం వ్యాపించింది.

 

చిప్కో అంటే.. : చిప్కో అనే పదం హిందీ నుంచి వచ్చింది. ఇది ఆలింగనం చేసుకోవడం/హత్తుకుపోవడం అనే అర్థాన్ని ఇస్తుంది. ప్రస్తుత ఉత్తరాఖండ్ అడవుల్లో నివసించే బిష్నోయ్ తెగకు చెందిన గిరిజన మహిళలు అక్కడి అడవులను నరకకుండా వాటిని రక్షించుకోవడానికి చేపట్టిన ఉద్యమమే చిప్కో ఉద్యమం. వృక్ష ఆలింగన పద్ధతి ద్వారా చెట్లను హత్తుకుని వాటిని నరకకుండా కాపాడుకున్నారు.

 

స్వాతంత్య్రానంతరం: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చిప్కో ఉద్యమం గాంధేయ విధానంతో 'మీరా బెహన్, సరళ బెహన్' లాంటి గాంధేయవాదులతో సాగింది. వీరు మొదలుపెట్టిన పర్యావరణ ఉద్యమాలు ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ కొండల్లో వ్యాపించాయి. తర్వాత కాలంలో చండీ ప్రసాద్ భట్, సుందర్‌లాల్ బహుగుణ ద్వారా ఈ ఉద్యమం విస్తృతమై ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది.

 

సర్వోదయ మండల్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గిరిజనులు సరళ బెహన్ ఆధ్వర్యంలో 1961లో 'ఉత్తరాఖండ్ సర్వోదయ మండల్‌'ను నెలకొల్పారు. తర్వాత గోపేశ్వర్ జిల్లాలోని 'దషోలి' గ్రామంలో చండీ ప్రసాద్ భట్ నాయకత్వంలో 'దషోలి గ్రామ్ స్వరాజ్ మండల్' అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. వీరు పర్యావరణ పరిరక్షణ కోసం శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు. హిమాలయాల్లోని వివిధ అటవీ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం, అక్కడి వృక్షాలను నరకడాన్ని వ్యతిరేకిస్తూ చిప్కో పద్ధతిని చేపట్టారు. ఈ విషయంపై 1972, 1973లో విస్తృత ఉద్యమాలు సాగాయి.

 

సుందర్‌లాల్ బహుగుణ: 1973లో ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో గోపేశ్వర్ గ్రామంలో చండీప్రసాద్ భట్ నాయకత్వంలో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 1989లో కర్ణ ప్రయోగ్ దగ్గర అడవుల్లో చెట్లను కొట్టివేసి 'ఫైన్' చెట్లను పెంచుదామని ప్రభుత్వ అధికారులు ప్రయత్నించినప్పుడు అక్కడి ప్రజలతో కలిసి సుందర్‌లాల్ బహుగుణ ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా నిరోధించగలిగారు. ఇలా బహుగుణ నేతృత్వంలో ఈ ఉద్యమం ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ అంతటా వ్యాపించింది. అంతకు ముందు పర్యావరణవేత్తగా ఉన్న ఆయన 1981 నుంచి 1983 దాకా హిమాలయ ప్రాంతంలో దాదాపు 5000 కి.మీ.ల మేర పాదయాత్ర చేశారు. చివరకు దిల్లీ చేరి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసి అటవీ వినియోగ పద్ధతులు మార్చాలని కోరారు. ఫలితంగా ప్రధాని ఆజ్ఞానుసారం అప్పటి నుంచి 15 సంవత్సరాల దాకా హిమాలయ ప్రాంతాల్లో చెట్లు కొట్టడాన్ని నిషేధించారు.

 

కర్ణాటకలో అప్పికో

1983 సెప్టెంబరులో కర్ణాటక రాష్ట్రంలో చిప్కో ఉద్యమానికి బదులు 'అప్పికో' ఉద్యమంగా ప్రారంభమైంది. ఈ ఉద్యమకారులు కూడా చెట్లను కౌగిలించుకుని చెట్టుని నరికే ప్రయత్నాన్ని ఆపు చేశారు.

 

'చిప్కో' విజయాలు

* ప్రజల హక్కులను కాపాడి, అడవులకు ప్రకృతికి ఉన్న తాత్విక సామీప్యాన్ని రక్షించి శాస్త్రీయంగా వీటికి కొత్త రచన చేయడమే చిప్కో ఉద్యమ లక్ష్యం.
* ఈ ఉద్యమం గిరిజనుల ఐక్యతను చాటిచెప్పి ఇతర రాష్ట్రాల ప్రజలకు మార్గదర్శకంగా నిలిచింది.
* ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాలయాలతోపాటు రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక వరకు ఈ ఉద్యమం వ్యాపించింది.
* నిరక్షరాస్యులైన గిరిజనులు నడిపిన ఉద్యమ స్ఫూర్తి అక్షరాస్యులు, నగరవాసులతోపాటు ప్రజలందరిలో పర్యావరణ జాగృతిని కలిగించింది.

 

నర్మదా బచావో

  పర్యావరణ పరిరక్షణ కోసం.. వనరుల విధ్వంసానికి వ్యతిరేకంగా దేశంలో చెలరేగిన ఉద్యమాలన్నింటిలోకి 'నర్మదా బచావో ఆందోళన్ తలమానికమైంది.

  1961లో నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నర్మద, దాని ఉపనదులపైన సుమారు 3000 చిన్న, 135 మధ్య తరహా, 30 పెద్దతరహా ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించారు. వీటన్నింటిని కలిపి 'సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్' అంటారు. ఇందులో భాగంగా గుజరాత్, దక్షిణ రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 1964లోనే కేంద్ర ప్రభుత్వం నర్మదానదిపై 'సర్దార్ సరోవర్ పేరుతో భారీ ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే క్షామ ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని ప్రభుత్వం భావించింది. అలాగే తాగునీరు, సాగునీరుతో పాటు 12,200 మెగావాట్ల విద్యుత్తు ఉత్పిత్తి జరుగుతుందని భావించి నర్మదానదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. 1969లో కేంద్రం మూడు రాష్ట్రాలకు నదీ జలాల వినియోగం అంటే పంపిణీ నిమిత్తం 'నర్మద జలవివాద న్యాయ ట్రైబ్యునల్‌'ను నియమించింది.

  1987లో ప్రపంచ బ్యాంకు ఈ భారీ ప్రాజెక్టుకు 450 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేయడంతో డ్యామ్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ ఆనకట్ట నిర్మాణాన్ని నిలిపి వేయాలని 1988లో ప్రముఖ పర్యావరణవేత్త మేధా పాట్కర్ నాయకత్వలో 'నర్మదా బచావో ఆందోళన్' అనే పర్యావరణ పరిరక్షణ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో మేధా పాట్కర్‌తోపాటు సుందర్‌లాల్ బహుగుణ, బాబా ఆమ్టే (ప్రముఖ సంఘ సేవకులు), అరుంధతీ రాయ్ (ప్రముఖ రచయిత్రి) ఉన్నారు.

 

'ఆందోళన్' ఎందుకంటే..?

* పర్యావరణ సమతౌల్యం దెబ్బతిని అడవులు నశించిపోతాయి.
* భూకంపాలు సంభవించవచ్చు.
* నదీ పరివాహక ప్రాంతాల్లో జీవావరణం దెబ్బతిని నేల నాణ్యత తగ్గిపోతుంది.
* లక్షల మంది ఆదివాసులు నిరాశ్రయులవుతారు.
ఈ దుష్ఫలితాలను వివరిస్తూ 1989 నాటికి వీరు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. దీంతో ప్రపంచ బ్యాంకు రుణ మొత్తాన్ని ఇవ్వకుండా వెనక్కి తీసుకుంది.

 

ప్రముఖుల మద్దతు

* 1989లో హర్యుద్ నగరంలో మేధాపాట్కర్, బాబా ఆమ్టే, సుందర్ లాల్ బహుగుణ ఆధ్వర్యంలో నర్మదా ఆనకట్ట నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.
* 1990, డిసెంబరు 25న బాబా ఆమ్టే ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌గాట్ నగరం నుంచి గుజరాత్ సరిహద్దుల్లోని ఫెర్కునా గ్రామం (సర్దార్ సరోవర్ డ్యామ్) వరకు 250 కి.మీ. మార్గంలో 'సంఘర్ష్ యాత్ర' పేరుతో పాదయాత్ర చేసి సంచలనం సృష్టించారు.
* 1991 జనవరిలో మేధాపాట్కర్, ఆమ్టే అమరణ నిరాహార దీక్ష తలపెట్టారు. అయితే ఆరోగ్య దృష్ట్యా దీక్షను 1991, జనవరి 28న విరమింపజేశారు.
* 1991లో స్వీడన్ దేశం మేధా పాట్కర్ సేవలకు గుర్తింపుగా 'రైట్ లైవ్లీహుడ్ అవార్డ్' అనే అత్యున్నత పురస్కారంతో గౌరవించింది.
* 'ది ఫ్రెండ్స్ ఆఫ్ రివర్ నర్మదా' అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది.
* ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ 'ది గ్రేటర్ కామన్ గుడ్' అనే తన పుస్తకం ద్వారా మద్దతు పలికి, భారీ ఆనకట్టల వల్ల కలిగే నష్టాలు, విధ్వంసాల గురించి ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు.
* డ్యామ్ ఎత్తును 122 మీటర్లకు పెంచాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 2006 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఆనకట్ట ఎత్తును 90 మీటర్ల కంటే ఎక్కువ పెంచరాదని తీర్పునిచ్చింది.
* 2006 సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా గుజరాత్ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ప్రాజెక్టు ప్రారంభించింది.

 

తెహ్రీ డ్యామ్ ఉద్యమం

ఉత్తరాఖండ్‌లోని గడ్వాల్ జిల్లా తెహ్రీ గ్రామానికి సమీపంలో భగీరథ, భిలాం గంగా నదులపై రష్యా సాంకేతిక సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా డ్యామ్ నిర్మాణానికి తలపెట్టాయి. ఇది భూకంప జోన్ పరిధిలో ఉంది. దీని ఎత్తు 260.5 మీటర్లు. ఇది ఆసియా ఖండంలోనే అతి పెద్దది. 1988 జులైలో రష్యా ఆర్థిక సహకారం (రూ. 3000 కోట్లు)తో 'తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (టీహెచ్‌డీసీ)' నెలకొల్పింది. ఈ డ్యామ్ వల్ల 2,70,000 హెక్టార్ల భూమికి సాగునీరు.. 346 మెగావాట్ల విద్యుత్తు.. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు తాగునీటిని సమకూర్చవచ్చని అంచనా వేశారు. చేపల పెంపకం, వలస పక్షులకు కూడా కేంద్రమవుతుంది.
ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సుందర్‌లాల్ బహుగుణ నాయకత్వంలో 'తెహ్రీ బాంధ్ విరోధి సంఘర్ష్ సమితి' ఆధ్వర్యంలో తెహ్రీ డ్యామ్ నిర్మాణాన్ని ఆపాలని ఉద్యమం నడిపిస్తున్నప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెహ్రీ గ్రామంతోపాటు 96 గ్రామాలు పాక్షికంగా మునిగిపోతాయని, 85 వేల మంది ప్రజలు నిర్వాసితులవుతారని అంచనా వేశారు.

 

నిశ్శబ్ద లోయ ఉద్యమం

కేరళలోని పశ్చిమ కనుమల్లోని నీలగిరి పర్వతాల్లో నిశ్శబ్ద లోయ (Silent Valley) ఆవరించి ఉంది. ఈ ప్రాంతంలో కీచురాళ్లు లేకపోవడం వల్ల నిశ్శబ్దంగా ఉంటుంది. అందువల్ల దీనికి నిశ్శబ్దలోయ అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉన్నవి సతత హరిత వనాలు. వేల సంవత్సరాల నుంచి ఈ అడవులు అరుదైన, అతి విలువైన జంతు, వృక్ష జాతులకు నిలయంగా ఉన్నాయి. దేశంలోనే అపురూప సంపదగా ఈ లోయను భావిస్తారు.
1976లో కేరళ ప్రభుత్వం 240 మెగావాట్ల జల విద్యుత్తు కేంద్రాన్ని నీలగిరి పర్వతాల సమీపంలో నిర్మించాలని నిర్ణయించింది. ఈ నిర్మాణం వల్ల 1000 హెక్టార్ల అరణ్యం నశించిపోతుందని, దీనివల్ల పర్యావరణ సమతౌల్యానికి విఘాతం కలుగుతుందని, అరుదైన వృక్ష సంపద నశించి పోతుందని, అరణ్య సంపదను నాశనం చేసుకోవడం సమర్థనీయం కాదని కేరళ ప్రజలు 'శాస్త్ర సాహిత్య పరిషత్' అనే స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో పెద్ద ఉద్యమం నడిపారు. ఈ ఉద్యమం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కేరళ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేసింది. అంతేకాకుండా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ లోయను జాతీయపార్కుగా ప్రకటించారు.

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సునామీ

* తీవ్ర భౌగోళిక వైపరీత్యం
* తీర ప్రాంతాల్లో విధ్వంసం

సునామీ.. పేరు చెప్పగానే భయకంపితులను చేసేంత తీవ్రమైన విధ్వంసకర విపత్తు. మీటర్ల కొద్దీ ఎత్తులో.. ఒకదాని వెంబడి మరొకటిగా.. ఊహకు అందనంత వేగంగా.. దూసుకొచ్చే సముద్రపు అలలు తీర ప్రాంతాల్లో విలయాన్ని సృష్టిస్తాయి. ఒకేసారి కొన్ని దేశాలపై ప్రభావం చూపించగలిగేంత తీవ్ర శక్తిమంతమైన ఈ సునామీలు ఎలా పుడతాయి? ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? వీటిని ముందుగా గుర్తించగలమా? తీవ్రతను తగ్గించడానికి ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాలి? ఎదుర్కోవడం ఎలా? - తెలుసుకుందాం..
అత్యంత ఎక్కువగా ఆస్తి, ప్రాణ నష్టాలను మిగిల్చి.. తీవ్ర విధ్వంసాన్ని సృష్టించి.. పర్యావరణానికి తీవ్రహాని కలిగించే భౌగోళిక వైపరీత్యాల్లో సునామీ ఒకటి. ప్రధానంగా భూకంపాల కారణంగా ఏర్పడే సునామీలను ముందుగా ఊహించగలిగినా వాటివల్ల వచ్చే నష్టాన్ని మాత్రం పూర్తిగా తగ్గించలేకపోతున్నాం. సాధారణ భాషలో 'రాకాసి అలలుగా వీటిని పిలుస్తుంటారు. భారీ పరిమాణంలో స్థానభ్రంశం చెందిన నీటి వల్ల ఉవ్వెత్తున ఎగిసిపడే నీటి తరంగాల వరుసను సునామీ అంటారు. మహా సముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు... చివరకు ఈత కొలను (స్విమ్మింగ్ పూల్)ల్లో కూడా సునామీలు ఏర్పడవచ్చు. 2015 ఏప్రిల్ 25న నేపాల్‌లో భూకంపం సంభవిచ్చినప్పుడు ఒక స్విమ్మింగ్‌పూల్‌లో ఏర్పడిన సునామీని మీడియా ద్వారా చూడగలిగాం.

 

ఒకటి కాదు.. పదికి పైగా..

  బలమైన భూకంపాల వల్ల సముద్రపు అగాధాల్లో ఏర్పడిన సునామీ కెరటాలు వందల కిలోమీటర్ల పొడవునా (సుమారుగా 800 కి.మీ. వేగంతో) ప్రయాణిస్తుంటాయి. సునామీ అంటే ఒక పెద్ద తరంగం కాదు. పది లేదా అంతకంటే ఎక్కువ తరంగాలు ఉండొచ్చు. వాటిని 'సునామీ తరంగ రైలు అంటారు. ఒక్కో తరంగం ఒకదాని తర్వాత ఒకటి 5 నిమిషాల నుంచి 90 నిమిషాల వ్యవధిలో మరొకదాన్ని అనుసరిస్తాయి.
సునామీ మహాజల కుడ్యం (Huge wall of water) తీరానికి చేరిన తర్వాత ఒక వ్యక్తి పరుగెత్తే వేగం కంటే చాలా ఎక్కువ వేగంగా (50 కి.మీ.ల వేగంతో) ప్రయాణిస్తుంది. ఈ దూరాన్ని 'రన్ అప్ అంటారు. ఇది తీరాన్ని బట్టి కొన్ని కిలోమీటర్లు ఉంటుంది. సునామీ ప్రారంభ ప్రాంతంలో తరంగాల ఎత్తు కొన్ని సెంటీమీటర్లుగా ఉండి, తీరానికి చేరే కొద్దీ 30 మీటర్ల ఎత్తువరకు కూడా ఉండొచ్చు. అందువల్ల సముద్రంపై ఓడలో ప్రయాణిస్తున్న వారికి సునామీ గురించి తెలియదు.
సునామీ తీరాన్ని చేరుతున్నప్పుడు వేగం తగ్గుతూ అల ఎత్తు పెరుగుతుంది. దీన్నే 'షోలింగ్ ప్రభావం అంటారు. సునామీ ప్రారంభమైన చోట తక్కువ డోలన పరిమితితో ఉంటుంది. తీరానికి చేరే కొద్దీ డోలన పరిమితి పెరుగుతుంది. కొన్నిసార్లు తీరం వద్ద నీరు వెనక్కు తగ్గి సముద్ర తీరం భూతలం బయటకు కనిసిస్తుంది. దీన్ని సునామీ రావడానికి అవకాశం ఉన్న సహజ సిద్ధమైన హెచ్చరికగా భావించవచ్చు.

 

జపాన్ సునామీ విలయం

  2011, మార్చి 11వ తేదీ మధ్యాహ్నం 2.46 గంటల సమయంలో జపాన్‌లోని ఈశాన్యప్రాంతంలోని తోహోకు ప్రాంతానికి 130 కి.మీ.ల దూరంలో (పసిఫిక్ మహాసముద్రంలో రిక్టర్ స్కేలుపై 9 తీవ్రత కూడిన పెను భూకంపం వల్ల) సునామీ సంభవించింది. దీంతో ఫుకిషిమా దైచీలోని అణువిద్యుత్తు ప్లాంటులో విస్ఫోటం జరిగింది. కొన్ని పరిశ్రమల్లో మంటలు రేగాయి. ఇలా ఈ భూకంపం వల్ల అనేక గొలుసు కట్టు విపత్తులు సంభవించాయి.

 

11 దేశాలపై ప్రభావం

  2004, డిసెంబరు 26న ఇండోనేషియాలోని జావా, సుమత్రా దీవుల మధ్య సుండా అగాధంలో సునామీ ఏర్పడింది. ఇది చుట్టూ ఉన్న 11 దేశాలను నష్టపరిచింది. మన దేశంలో తమిళనాడు తీరంలోని నాగపట్నం ఎక్కువగా దెబ్బతింది. దీంతోపాటు అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి; కేరళ రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించాయి.

 

భారత్ తీరరేఖకూ..

  ఒకచోట ఏర్పడిన సునామీ కెరటాల ప్రభావం వాటి తీవ్రతను బట్టి అన్ని మహాసముద్రాల్లోనూ కనిపించవచ్చు. భారతదేశ తీరరేఖ మొత్తం సునామీ ముప్పును కలిగి ఉంది. మనదేశ భూపటల పలక (క్రస్ట్ ప్లేట్) ఆస్ట్రేలియన్ పలక నుంచి దూరంగా జరుగుతున్నందున మన దేశానికి తరచుగా సునామీలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. భారతదేశానికి దూరంగా రెండు చోట్ల ఏర్పడుతున్న భూకంపన అధికేంద్రాల వద్ద సునామీలు ఏర్పడి మనదేశ తీరాన్ని తాకుతున్నాయి.
1. అండమాన్ నికోబార్ దీవులు, సుమత్రాదీవి వంపు దగ్గర ఏర్పడిన సునామీలు భారత్‌తో సహా ప్రధాన దేశాలను చేరడానికి 3 నుంచి 5 గంటల వ్యవధి పడుతుంది.
2. అరేబియన్ మైక్రో పలక భారత్ భూపటల పలకను ఢీ కొడుతున్నందున అరేబియా సముద్రంలోని మక్రాన్ ప్రాంతంలో సునామీ ఏర్పడుతుంది. ఇది ప్రధాన భారత తీరానికి అంటే గుజరాత్ తీరాన్ని చేరడానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది.

 

అంతర్జాతీయ హెచ్చరిక వ్యవస్థ

  సునామీ ఏ తీరాన్నైనా తాకే ప్రమాదం ఉంది. అలాగే అవి ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతుంటాయి. ఈమేరకు అంతర్జాతీయ సునామీ హెచ్చరిక వ్యవస్థను హవాయి దీవుల్లోని హోనలూలు వద్ద 1946లో ఏర్పాటు చేశారు. దీన్ని పసిఫిక్ సునామీ వార్నింగ్ (Pasific Tsunamy Warning System - PTWS)సెంటర్ అంటారు. ఇది సునామీ రావడానికి గంటల ముందు సంబంధిత దేశాలను అప్రమత్తం చేస్తుంది. కొన్ని దేశాల్లో ప్రాంతీయ హెచ్చరిక కేంద్రాలు కూడా ఉన్నాయి.

 

భారత్‌లోనూ...

  గతంలో జరిగిన భూకంపాల సమాచారం ఆధారంగా ప్రస్తుత భూకంపం వల్ల సునామీ ముప్పును అంచనా వేసేవారు. ఈ సమాచారం 15 నిమిషాల ముందు మాత్రమే హెచ్చరిక జారీ చేయడానికి పరిమితం అయ్యేది. తర్వాత సర్వే ఆఫ్ ఇండియా తీరం వెంబడి టైడ్‌గేజ్ విధానాన్ని అమలు చేసింది. ఇది కూడా చాలా ఆలస్యంగానే సమస్య తీవ్రతను తెలియజేసేది.
2004లో ఏర్పడిన సునామీని రాడార్ల సహకారంతో తెలుసుకున్నారు. ఇది భూకంపం వచ్చిన రెండు గంటల తర్వాత మాత్రమే తరంగాల ఎత్తును నమోదు చేయగలిగింది.
2007, అక్టోబరు 15న ఐఎన్‌సీవోఐఎస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్)లో సత్వర సునామీ హెచ్చరిక కేంద్రాన్ని (సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ - టీఈడబ్ల్యూసీ) ఏర్పాటు చేశారు. ఇది హైదరాబాద్‌లో ఉంది.

 

తీవ్రతను తగ్గించాలంటే..

* తీరం వెంబడి జపాన్‌లా గోడలు నిర్మించి సునామీ తీవ్రతను తగ్గించవచ్చు. మడ అడవులను పెంచడం ద్వారా కూడా ప్రయోజనం ఉంటుంది.
* తీరం సమీపంలో నిర్మాణాలను దృఢంగా, ఎత్తయిన ప్రాంతాల్లో నిర్మించాలి.
* విపత్తు సమయంలో సహాయ కేంద్రాలుగా పనిచేసే కమ్యూనిటీ హాల్స్‌ను ఎత్తయిన ప్రాంతంలో నిర్మించాలి.
* సరైన వరద నివారణ చర్యలు ముందుగానే కలిగి ఉండాలి.
* సరైన భూ వినియోగ ప్రణాళిక అవసరం.

 

సునామీలెలా ఏర్పడతాయి?

  జలాశయాల్లో ఆకస్మిక చలనం వల్ల సునామీ తరంగాలు ఏర్పడతాయి. ఇవి ముఖ్యంగా సముద్ర తీరాల వద్ద ఎక్కువ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. సునామీల వల్ల వాటిల్లే నష్టం, అవి ఏర్పడే స్థానం, ప్రయాణం చేసే దూరం, తాకే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. అవి ఏర్పడే ప్రాంతం నుంచి 30 నిమిషాల్లో తీరాన్ని తాకే సునామీలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయి.
* సముద్రం దగ్గర లేదా లోపల బలమైన భూకంపాలు వచ్చినప్పుడు ఏర్పడిన భ్రంశ చలనాల వల్ల సునామీలు సర్వసాధారణంగా సంభవిస్తాయి. పెద్దఎత్తున ఏర్పడిన సునామీ తరంగాలు మహాసముద్రాలను కూడా దాటే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 1960 చిలీలో రిక్టర్ స్కేలుపై 9.5 గా నమోదైన భూకంపం వల్ల ఏర్పడిన సునామీ తరంగాలు జెట్ వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రం అవతల ఉన్న జపాన్ తీరంలోని మత్స్య పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగించాయి. సాధారణంగా సముద్ర గర్భంలో భూకంపం వచ్చినప్పుడు దాని తీవ్రత రిక్టర్ స్కేలు మీద 7.5 గా నమోదైనప్పుడు సునామీలు సంభవిస్తాయి.
* సముద్రం కింద లేదా సముద్రానికి దగ్గరలో భూపాతం (ల్చ్థ్టి ళ్ద్ట్ఠీౖ) జరిగి కొండచరియలు నీటిలో పడినప్పుడు సునామీ ఏర్పడవచ్చు. 1958లో అలస్కాలోని లిటుయా బేలో సంభవించిన భూపాతం వల్ల 50-150 మీటర్లు ఎత్తున సముద్ర కెరటాలు తీరాన్ని తాకాయి.
* సముద్రాల్లో అగ్నిపర్వతాల విస్ఫోటం జరిగినప్పుడు కూడా సునామీలు ఏర్పడవచ్చు. 1883లో ఇండోనేషియాలోని కాక్రటోవా అగ్నిపర్వతం విస్ఫోటం చెందినప్పుడు జావా, సుమత్రా దీవుల్లో 40 మీటర్ల ఎత్తున సునామీ ఏర్పడింది.
సునామీ (Tsunami) అనేది జపాన్ పదం. జపాన్ భాషలో గ్బ్యి అంటే హార్బర్ (ఓడరేవు), nami అంటే వేవ్ (కెరటం) అని అర్థం. ఈ రెండు పదాల కలయికే సునామీ. తమిళంలో సునామీని ఆఝి పెరలై (Aazhi peraial) అని కూడా అంటారు.

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వరదలు

  నదీప్రవాహ మార్గాల హద్దులు (గట్లు)జల ప్రవాహాన్ని నిలువరించలేకపోవడం వల్ల పరీవాహక ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితిని 'వరద' అంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల భౌగోళిక పరిస్థితులు, శీతోష్ణస్థితులు, వర్షపాతం ఉండటంవల్ల ఏటా ఏదో ఒక ప్రాంతంలో వరదలు సంభవిస్తూ ఉంటాయి. అధిక వర్షపాతం ఉండే జూన్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో వరదలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
తుపాను, వాయుగుండాలు వచ్చినప్పుడు కూడా వరదలు వస్తాయి. అధిక వర్షపాతం, కూడా వరదలు రావడానికి కారణమవుతుంది. భారతదేశంలోని సుమారు 3290 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని భూమి వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉంది.

  ఏటా సరాసరి 75 లక్షల హెక్టార్ల భూమి వరదల ప్రభావానికి గురవుతోంది. సుమారు 1600 మంది వరదల వల్ల మరణిస్తున్నారు. సాలీనా రూ.1805 కోట్ల రూపాయల ఆస్తి, పంటనష్టం జరుగుతోంది. ఇళ్లు, రోడ్లు దెబ్బతింటున్నాయి. 1977లో అత్యధికంగా 11,316 మంది మృత్యువాత పడ్డారు. భారతదేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వివిధ ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉంది. దేశ విస్తీర్ణంలో 8 శాతం వరకూ భూభాగం వరదలకు గురయ్యే అవకాశముంది. గంగా, బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు ఎక్కువగా వస్తుంటాయి.

 

వరదలు రావడానికి కారణాలు

* నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటం, నది ప్రవాహ దిశను మార్చుకోవడం వల్ల వరదలు సంభవిస్తాయి.

* అధిక వర్షపాతం, వాయుగుండాలు, తుపాన్లు వరదలకు కారణమవుతాయి.

* నదులు, చెరువులు, కాల్వలకు గండ్లు పడటం; నదీ ప్రవాహ మార్గాలు పూడికతో నిండిపోవడం వల్ల వరదలు సంభవిస్తున్నాయి.

* అతిగా అడవులను నరికివేయడం, పర్వత ప్రాంతాల్లో నేల క్రమక్షయానికి గురవడం వల్ల వరదల ఉద్ధృతి పెరుగుతోంది.

* కొండ చరియలు విరిగిపడటంతో నదులు తమ ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వల్ల వరదలు సంభవిస్తాయి.

* చెరువులు, ఆనకట్టలు, గట్ల నిర్మాణంలో సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటించకపోవడం వల్ల కూడా వరదలు రావొచ్చు.

* మహానగరాల్లోని నాలాలు ప్లాస్టిక్ కవర్లు, చెత్త, ఇతర ఘన పదార్థాలతో నిండిపోవడం వల్ల అవి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి. హైదరాబాద్, ముంబయి లాంటి నగరాల్లో ఈకారణంగానే వరదలు సంభవించాయి.

* వర్షం పడినప్పుడు నీరు నేలలోకి సరైనవిధంగా ఇంకకపోవడం వల్ల వరదలు ఎక్కువవుతాయి. నగరాల్లో నీరు ఇంకే మార్గాలకు పూర్తిగా అడ్డుపడటం వల్ల తరచుగా వర్షాకాలంలో వరదల తాకిడిని, వేసవిలో నీటి కొరతను ఎదుర్కొంటున్నాం.

 

వరద విపత్తు ఆధారంగా భారతదేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించవచ్చు.

 

బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతం

  బ్రహ్మపుత్ర, బారక్ నదులు, వీటి ఉపనదుల ప్రాంతాలు దీని కిందకు వస్తాయి. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లోని నదీ పరీవాహక ప్రాంతాల్లో జూన్ నుంచి సెప్టెంబరు వరకు అధిక వర్షపాతం (1100 మి.మీ. నుంచి 6350 మి.మీ.) నమోదవుతోంది. అందువల్ల సర్వసాధారణంగా ఈ ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ఇక్కడి నదులు పర్వత ప్రాంతాల్లో పుట్టి, దిగువకు రావడం వల్ల నేల క్రమక్షయానికి గురవడం, కొండచరిచయలు విరిగి పడటం కూడా ఎక్కువగా ఉంటోంది.

 

గంగానదీ పరీవాహక ప్రాంతం 

  గంగా దాని ఉపనదులైన యమున, సోన్, గండక్, కోసి, మహానంద, రాఫ్తి లాంటి నదీ పరీవాహక ప్రాంతాలు దీని కిందికి వస్తాయి. వీటి వల్ల ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్‌ని కొన్ని ప్రాంతాలు, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో వరద ముప్పు ఉంది. ఇక్కడ సంవత్సరానికి 600 మి.మీ. నుంచి 1900 మి.మీ. వరకూ వర్షం కురుస్తుంది. ఈ రాష్ట్రాల్లో గంగానది వల్ల వరదలు ఎక్కువగా వస్తాయి.

 

ఉత్తర-పశ్చిమ నదీ పరీవాహక ప్రాంతం

  బియాస్, రావి, చీనాబ్, జీలమ్ లాంటి నదుల ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. జమ్మూ-కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రాంతాల్లో ఈ నదుల వల్ల వరదలు సంభవిస్తాయి. గంగా పరీవాహక ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ వరద ముప్పు తక్కువే అయినప్పటికీ పూడిక సమస్య ఎక్కువ.

 

మధ్య భారతదేశం - దక్కన్ ప్రాంతాలు

  నర్మదా, తిరుపతి, మహానంది, గోదావరి, కృష్ణా, కావేరి నదుల ప్రాంతాలు దీని కిందకు వస్తాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఒడిషా రాష్ట్రాలు ఈ నదుల వల్ల వరదల బారిన పడతాయి.

  ఒడిషాలోని కొన్ని జిల్లాల్లో వరదలు తరచుగా వస్తుంటాయి. ఈ రాష్ట్రాల్లో రుతుపవనాల సమయంలో, తుపాన్లు సంభవించినప్పుడు వరదలు వచ్చే అవకాశం ఎక్కువ.

 

వరదలకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  నదీతీర ప్రాంతాల్లో, తరచుగా వరదలకు గురవడానికి అవకాశమున్న ప్రజలు వరదలు రావడానికి ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల వరదల సమయంలో తక్కువ నష్టం జరుగుతుంది.

* దగ్గరలోని పునరావాస కేంద్రాన్ని గుర్తించి అక్కడికి తొందరగా చేరే మార్గాన్ని తెలుసుకోవాలి.

* ప్రథమ చికిత్స పెట్టెలో మందులు, ఇతర సామాగ్రి ఉన్నాయా లేవో చూసుకోవాలి. ప్రత్యేకంగా డయేరియా, పాముకాటుకు సరైన ఔషధాలను సిద్ధం చేసుకోవాలి.

* రేడియో, టార్చిలైటు, బ్యాటరీలు, తాళ్లు, గొడుగు లాంటివి సమకూర్చుకోవాలి.

* మంచినీరు, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు, ఇంధనం లాంటివి ముందుగానే సమకూర్చుకుని నిల్వ చేసుకోవాలి.

* నీరు తాకినా తడవని సంచుల్లో (water proof bags) దుస్తులు, ఇతర విలువైన వస్తువులను భద్రపరచుకోవాలి.

* గ్రామీణ ప్రాంతాల్లో ఎత్తయిన ప్రదేశాలను గుర్తించి, పశువులను అక్కడికి తీసుకు వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలి.

 

వరద వచ్చిన ప్రాంతంలో ఉండేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

* సురక్షిత (కాచి వడపోసిన) నీటినే తాగాలి. లేకపోతే కలరా, డయేరియా లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.

* ఆహార పదార్థాలను వరదనీటిలో తడవకుండా చూడాలి. వరద నీటిలో తడిసిపోయిన ఆహార పదార్థాలను తినకూడదు.

* నీటిని శుభ్రపరచడానికి బ్లీచింగ్ పౌడరు కలపాలి. పరిసరాల్లో సున్నాన్ని చల్లాలి.

* వరదనీటిలోకి వెళ్లకూడదు. వరదల సమయంలో పాముకాటు ప్రమాదాలు ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తెగిపడిన విద్యుత్ తీగలను తాకకూడదు.

Posted Date : 01-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భూ సంపాతాలు

అమాంతం విరిగిపడే ఆపద! 


కొండచరియలు విరిగిపడ్డాయని, మంచు ప్రవాహాలు ముంచుకొచ్చాయని, రాతి ఖండాలు అమాంతం కూలిపోయాయని, అపార ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయని తరచూ వార్తలు వస్తుంటాయి. వీటికి భారీ వర్షాలు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాల వంటి ప్రకృతి ప్రకోపాలతోపాటు, అడవుల నరికివేత, అస్తవ్యస్త ఇంజినీరింగ్‌ విధానాల వంటి మానవ తప్పిదాలు కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ ప్రమాదాలను నిరోధించడానికి, నష్టతీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వాలు నిరంతరం కృషిచేస్తుంటాయి. భవిష్యత్తు ఉద్యోగులుగా అభ్యర్థులు ఈ విపత్తు నిర్వహణ విధానాల గురించి అవగాహన పెంచుకోవాలి. 

 


ఎత్తయిన పర్వతాలు, కొండలు, వాలు ప్రాంతాల నుంచి రాళ్లు, మట్టి, బురద జారిపడటం, నెమ్మదిగా పడటం లేదా కిందికి దొర్లుతూ వచ్చే ప్రక్రియను భూపాతం లేదా కొండచరియలు విరిగిపడటం అంటారు. ఇలా అన్నిరకాల బృహత్‌ చలనాలను భూసంపాతం (Land Slides)అంటారు.

భూపాతాలు ఎక్కువగా పర్వత ప్రాంతాల్లోనే సంభవిస్తాయి. గనుల తవ్వకాలు, భూకంపాలు, వరదలు, అగ్నిపర్వతాల విస్ఫోటాల సమయంలోనూ భూపాతాలు జరగవచ్చు. భారీ వర్షాలు కురిసినప్పుడు కూడా కొండల ప్రాంతాల్లో భూపాతాలు ఏర్పడవచ్చు. ఇలాంటప్పుడు నదీ ప్రవాహాలను కొండచరియలు అడ్డుకోవడంతో వరదలు వస్తుంటాయి.

 

ప్రకృతి సంబంధ కారణాలు:

* కొండ ప్రాంతాలు ఎక్కువ వాలు కలిగి ఉండటం.

* వాలు ప్రాంతాలు గట్టిగా ఉండి చిన్న కదలికలకు కూడా విరిగిపడటం.

* తీవ్రమైన వర్షపాతం.

* రాతి ప్రదేశాలు బాగా క్రమక్షయానికి గురికావడం.

* భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, వరదలు.

* నీటిపారుదల వ్యవస్థ సరైన దిశలో లేకపోవడం.

 

మానవ సంబంధ కారణాలు:

* చెట్లను విచక్షణారహితంగా కొట్టివేయడంతో జరిగే మృత్తికా క్రమక్షయం.

* సరైన ప్రణాళికలు లేకుండా వాలు ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించడం.

* సరైన ఇంజినీరింగ్‌ విధానాలు లేకుండా తవ్వకాలు జరపడం.

* ఇష్టానుసారంగా గనుల తవ్వకం.

* సమర్థ భూవినియోగ ప్రణాళికలు కొరవడటం.

 

భూపాతం రకాలు

1. ప్రపాతం (Falls): ఎత్తయిన వాలు లేదా శిఖరాల నుంచి వేరుపడిన శిలలు ఎగురుతూ, దొర్లుతూ రావడం వంటి అనూహ్య చలనాలను ప్రపాతం అంటారు.

2. శిథిల ప్రవాహం (Derbis flow): వదులైన మట్టి, రాళ్లు, సేంద్రియ పదార్థం లాంటివి గాలి, నీటితో కలిసి ముద్దగా ఏర్పడి వేగంగా దిగువకు ప్రవహించడం.

3. లహర్‌ ప్రవాహం (Lahar flow): అగ్నిపర్వతాల విస్ఫోటం వల్ల జ్వాలాబిల సరస్సులు విచ్ఛిన్నమై ఏర్పడిన బురద ప్రవాహం లేదా మంచు కరగడం వల్ల ఏర్పడిన శిథిల పదార్థం కిందికి ప్రవహించడం.

4. సర్పణం లేదా పాకడం (Creep): మట్టి లేదా శిలలు నెమ్మదిగా, నిటారుగా కిందికి జారడం. ఇవి రిటైనింగ్‌ గోడలు, కంచెలు, స్తంభాలను కిందికి నెట్టుకు వస్తాయి.

5. పంక ప్రవాహం (Mud flow): 50% ఇసుక, బురద మట్టి కలిగిన తడిపదార్థం వేగంగా ప్రవహించడాన్ని పంక ప్రవాహం అంటారు.

6. కూలిపోవడం (Topple): ఒక రాతి ఖండం ముందుకు వంగుతూ అమాంతంగా పడిపోవడాన్ని కూలిపోవడం అంటారు.

 

ప్రపంచ భూపాతాల దుర్బలత్వం: ప్రపంచంలో మొత్తం విపత్తుల్లో 4% భూపాతాల బెడద ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్య అన్ని ఖండాల్లోనూ ఏదో ఒక ప్రాంతంలో సంభవిస్తూ ఉంటుంది.

 

 

భారత్‌లో స్థితిగతులు:

* దేశంలో మొత్తం విపత్తుల్లో భూపాతాల దుర్బలత్వం 11%గా ఉంది.

* దేశంలో అధికశాతం భూపాతాలు కొండచరియలు విరిగిపడటం వల్లే జరుగుతున్నాయి.

* దాదాపు 0.49 మిలియన్‌ చ.కి.మీ.ల్లో భూపాతాలు సంభవిస్తున్నాయి. ఈ విస్తీర్ణం దేశ భూభాగంలో 0.15%.

* అత్యధికంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో, ఆ తర్వాత పశ్చిమ కనుమలు, వింధ్య పర్వతాల్లో భూసంపాతాలు జరుగుతున్నాయి.

* ప్రపంచంలో మొత్తం భూపాతాల్లో 30% హిమాలయాల్లోనే నమోదవుతున్నాయి.

* నీలగిరి లోయను శిథిల సంపాత లోయ అంటారు. 1978లో అసాధారణ వర్షాలతో ఇక్కడ వంద సార్లు భూపాతాలు వచ్చాయి.

* దేశంలో దాదాపు 20 రాష్ట్రాల్లో భూపాతాల ప్రభావం ఉంది. సిక్కిం, ఉత్తరాఖండ్‌ అధిక ప్రభావిత రాష్ట్రాలు.

* శాస్త్రీయ అంచనాల ప్రకారం సిక్కిం, ఉత్తరాఖండ్‌లలో ప్రతి చ.కి.మీ.కు రెండు భూపాతాలు జరుగుతున్నాయి.

* ద్వీపకల్ప భారతదేశంలో కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని కొండ ప్రాంతాల్లో భూపాతం కారణంగా తక్కువ నుంచి ఒక మోస్తరు ప్రమాద అవకాశాలు ఉన్నాయి.

* భారతదేశంలో భూపాతం/ కొండచరియలు విరిగిపడే విపత్తులకు సంబంధించి జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) 2004 నుంచి నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తోంది. ఇది భూపాతపు ప్రాంతాలను పటచిత్రీకరణ చేయడం, అధ్యయనాలు నిర్వహించడం, నివారణ చర్యలు, జాగ్రత్తల గురించి సలహాలు, హెచ్చరికలు జారీ చేస్తుంది.

 

 

ఉపశమన వ్యూహాలు:

* వాలు ప్రాంతాల్లో నీటిపారుదల సరైన మార్గంలో ప్రవహించే విధంగా వరద కాలువలను ఏర్పాటు చేయాలి.

* శిలాశకలాలు కిందికి జారే ప్రాంతాల్లో వాటిని అడ్డుకోవడానికి రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మించాలి.

* భూపాతాలను ఆపడానికి వృక్ష సంపదను పెంచాలి. చెట్లు నేలకోతను ఆపి భూపాతాన్ని నిరోధిస్తాయి.

* భూపాత దుర్బలత్వ ప్రాంతాలను గుర్తించి, సరైన విపత్తు నివారణ వ్యూహాన్ని (హజార్డ్‌ మ్యాపింగ్‌) ముందుగా తయారు చేసుకోవాలి.

* ప్రజలకు అవగాహన కల్పించడం, వర్షాల సమయంలో ముందుగానే సమాచారం అందించడం లాంటివి చేయాలి.

 

మాదిరి ప్రశ్నలు


1. భారతదేశంలో భూపాతాలు ఎక్కువగా జరిగే చోటు

1) హిమాలయాలు       2) ఆరావళి పర్వతాలు      3) నీలగిరి కొండలు       4) తూర్పు కనుమలు

జ: హిమాలయాలు

 

2. భూపాత దుర్బలత్వంపై సత్వర హెచ్చరికలు జారీ చేసే సంస్థ ఏది?

1) భారత వాతావరణ శాఖ             2) బోర్డర్‌ మేనేజ్‌మెంట్‌ శాఖ

3) జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా               4) రహదారుల శాఖ

జ: జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా

 

3. భారతదేశ మొత్తం విపత్తుల్లో కొండచరియలు విరిగి పడే విపత్తు భాగం ఎంత?

1) 0.15 శాతం      2) 11 శాతం      3) 30 శాతం      4) 20 శాతం

జ: 11 శాతం

 

4. ప్రపంచ మొత్తం విపత్తు నష్టాల్లో భూపాత నష్టం ఎంత?

1) 4 శాతం      2) 10 శాతం      3) 20 శాతం      4) 11 శాతం

జ: 4 శాతం

 

5. మట్టి, రాళ్లు, సేంద్రియ పదార్థం కలిసి ముద్దలుగా వేగంగా దిగువకు ప్రవహించడం ఏ రకమైన భూపాతం?

1) శీఘ్రపాతం      2) శిథిల ప్రవాహం      3) కూలిపోవడం              4) పాకడం

జ: శిథిల ప్రవాహం​​​​​​​

 

6. శిథిల సంపాత లోయ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?

1) హిమాలయాలు      2) పశ్చిమ కనుమలు      3) వింధ్య పర్వతాలు      4) నీలగిరి కొండలు

జ: నీలగిరి కొండలు​​​​​​​

 

7. మన దేశంలో భూపాతాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాలు

1) సిక్కిం, ఉత్తరాఖండ్‌         2) మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌

3) అస్సాం, పశ్చిమ బెంగాల్‌       4) తమిళనాడు, కేరళ

జ: సిక్కిం, ఉత్తరాఖండ్‌​​​​​​​

 

8. శిలాశకలాలు దొర్లడం, ఎగిరిపడటం వంటి భూపాతాన్ని ఏమంటారు?

1) శిథిల సంపాతం      2) శిథిల ప్రవాహం       3) ప్రపాతం       4) లహర్‌

జ: ప్రపాతం​​​​​​​

 

9. కిందివాటిలో భూపాతాలకు కారణాలేవి?

ఎ) కొండవాలు ఎక్కువగా ఉండటం          బి) కొండల క్రమక్షయం జరగడం

సి) కొండలు వృక్షాలతో కప్పి ఉండటం        డి) కొండలపై వృక్షాలు లేకపోవడం

1) ఎ, బి, సి, డి           2) బి, సి        3) ఎ, బి, డి        4) బి, సి, డి

జ: ఎ, బి, డి​​​​​​​

 

10. మన దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో భూపాతాలు జరిగే అవకాశం ఉంది?

1) 20        2) 10       3) 4          4) అన్ని రాష్ట్రాలు 

జ: 20

 రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 10-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జలవనరులు

సమస్త జీవులకు సర్వాధారం!


ప్రకృతి వనరుల్లో ప్రధానమైంది, ప్రాణికోటి జీవనానికి అత్యంత అవసరమైంది జలం. జీవుల ఆవిర్భావం నుంచి నాగరికతా వికాసం వరకు అన్నింటికీ నీరే ప్రధానం. దేశంలో వ్యవసాయ ప్రగతి, నగరీకరణ విస్తరణ అంతా ఆ వనరుపైనే ఆధారపడి సాగుతోంది. అందుకే అతి విలువైన నీటి లభ్యత, వినియోగం, నిర్వహణ తీరుతెన్నులను పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.


 

విశ్వంలో ఇప్పటివరకు గుర్తించిన నీరున్న గ్రహం భూమి మాత్రమే. మొత్తం భూవైశాల్యం 510 మిలియన్ల చ.కి.మీ. ఉంటే అందులో సుమారు 361 మిలియన్ల చ.కి.మీ (70.7%) జలం ఆవరించి ఉంది. భూమిపై పర్యావరణ సమతౌల్యానికి ప్రధాన కారణం నీరే. ఒక జాతి ఆర్థికాభివృద్ధి, సామాజిక, సాంఘిక, రాజకీయ స్థితిగతులు అక్కడి నీటివనరులతో ముడిపడి ఉంటాయి. భూమి మీద ఉన్న జలావరణంలో అత్యధిక జలం (97.25%) మహా సముద్రాల్లో ఉప్పునీటి రూపంలో ఉంది. మిగిలిన మంచినీరులో మంచు, హిమానీనదాల రూపంలో 2.05%, భూగర్భ జలంగా 0.68%, సరస్సుల్లో 0.01%, నదుల్లో ప్రవాహ నీరుగా 0.0001% మేర విస్తరించి ఉంది. ప్రపంచంలో బ్రెజిల్, రష్యా, చైనా, కెనడా, ఇండొనేసియా, అమెరికా, భారత్, కొలంబియా, కాంగో లాంటి దేశాల్లో 60% నీటి లభ్యత ఉండగా, మిగిలిన దేశాలన్నింటిలో 40% నీటి లభ్యత ఉంది.


యునెస్కో విడుదల చేసిన ‘యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌’ నివేదిక 2022 ప్రకారం ప్రపంచంలోని పట్టణ ప్రజల్లో 50% మంది భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 69% వ్యవసాయం భూగర్భ జలాలపైనే సాగుతోంది. 22% గృహావసరాల కోసం భూగర్భ జలాలనే వినియోగిస్తున్నారు. 9% పారిశ్రామిక రంగ అవసరాలకు భూగర్భ జలాలు ఉపయోగపడుతున్నాయి.

 

భారత్‌లో లభ్యత

నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ (NCIWRD) ప్రకారం.. 329 మిలియన్ల హెక్టార్లున్న దేశ భూభాగంపై సాలీనా జలచక్రం ద్వారా 4 వేల బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల (బీసీఎం) నీరు లభిస్తోంది. ఇందులో 40% (1600 బీసీఎం) ఆవిరైపోగా, 9% (360 బీసీఎం) నేలలో తేమ రూపంలో, 10% (400 బీసీఎం) భూగర్భజలంగా ఉంటుంది. మిగిలిన 41% (1640 బీసీఎం) నదులు, చెరువులు, సరస్సుల్లో ఉపరితల జలంగా నిల్వ ఉంటుంది.

* దేశంలో ఉపరితల, భూగర్భ జలాలుగా ఉన్న మొత్తం 2040 బీసీఎం నీరు.. దేశ వ్యవసాయ, గృహ, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతోంది.

ప్రపంచ జనాభాలో భారత్‌లో 17.5% ఉంది. అలాగే ప్రపంచ పశు జనాభాలో 15% ఇక్కడ ఉంది. కానీ ప్రపంచ నీటి లభ్యతలో భారత్‌ వాటా 4% మాత్రమే. జలవనరులు దేశమంతటా అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా అందుబాటులో లేవు. భూగర్భజలాల పరంగా చూస్తే అవక్షేప శిలలతో, నిక్షేపణ పదార్థాలతో నిండిన ఉత్తర మైదానంలోని గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదుల పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ నీరు లభ్యమవుతోంది. దీనికి భిన్నంగా ద్వీపకల్ప పీఠభూమి కఠిన శిలలతో ఉండటంతో నీటి లభ్యత తక్కువ ఉంటుంది.


ఆసియాలోనే అత్యధిక వ్యవసాయ భూమి ఉన్న దేశం భారతదేశమే. ఇక్కడి నీటిలో 93.37% వ్యవసాయానికి, 3.73% గృహావసరాలకు వినియోగమవుతోంది. పరివాహక ప్రాంతాల్లో నీటి ఉపరితల లభ్యత ఆధారంగా చూస్తే అయిదు అతి పెద్ద నదుల్లోనే 60% నీరు చేరుతోంది. మిగిలిన 250 నదుల్లో 40% ఉపరితల జలాలు అందుబాటులో ఉన్నాయి.


దేశంలో నైరుతి రుతుపవన కాలంలో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు తక్కువ కాలంలోనే 75% వర్షం కురుస్తుంది. దీంతో అధికభాగం నీరు  వరదల రూపంలో నదుల ద్వారా సముద్రాల్లో కలిసిపోతుంది.


నిర్వహణ చర్యలు

జాతీయ జలవిధానం: నీటి సంరక్షణ, సక్రమ పంపిణీ, క్రమబద్ధీకరణ లాంటి ఆశయాలతో మొదటి జాతీయ జల విధానాన్ని 1987లో తీసుకొచ్చారు. దీని తర్వాత 2002, 2012తో కలిపి ఇప్పటివరకూ మూడు జాతీయ జల విధానాలు వచ్చాయి.


అమృత్‌ పథకం: 500 నగరాల్లో గృహ వినియోగానికి నీరు అందించే ఈ పథకాన్ని కేంద్రం నిర్వహిస్తోంది.


జలక్రాంతి అభియాన్‌: జలవనరుల నిర్వహణ, సంరక్షణ దృష్ట్యా నీటి సరఫరాను మరింత సమర్థంగా అమలుచేసేందుకు 2015 - 16లో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు.


జల్‌ జీవన్‌ మిషన్‌: ప్రతి గ్రామంలో ఇంటింటికీ కొళాయి ద్వారా నీరు అందించే కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక ఇది. రూ.3.60 లక్షల కోట్లతో ఈ పథకాన్ని అమలుచేస్తోంది.


వేగవంతమైన నీటిపారుదల ప్రయోజన పథకం (ఏఐబీపీ): కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఇప్పటివరకు అనుమతించిన ప్రాజెక్టులను తక్షణం పూర్తి చేయాలనే లక్ష్యంతో 1996 - 97లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.


ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం: సమగ్ర వరద  నిర్వహణ కోసం 11వ ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.


నమామి గంగే కార్యక్రమం: గంగా నది కాలుష్యాన్ని 2020 నాటికి పూర్తిగా నిర్మూలించేందుకు చేపట్టిన కార్యక్రమం.


ప్రధానమంత్రి కృషి సించాయి యోజన: పంట పొలాలకు నీటి లభ్యతను పెంచి దేశంలో సాగునీటి సదుపాయం ద్వారా సాగు విస్తీర్ణం పెంచాలన్న లక్ష్యంతో 2015 - 16లో హర్‌ ఖేత్‌ కో పానీ (ప్రతి పొలానికి నీరు) నినాదంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.


కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్, వాటర్‌  మేనేజ్‌మెంట్‌: నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా వ్యవసాయ దిగుబడిని పెంచి రైతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్రం 1974 - 75లో దీన్ని అమలు చేసింది. 2015-16 నుంచి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకంలో భాగంగా అమలు చేస్తున్నారు.


అంతరాష్ట్రీయ నదీ జలాల చట్టం: రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకంలో వివాదాల పరిష్కారానికి 1956లో ఈ చట్టం తీసుకొచ్చారు.


నదుల అనుసంధానం: ఉత్తర భారతదేశంలో వరదల నియంత్రణ, దక్షిణ భారతదేశంలో కరవు నివారణ కోసం ఉత్తర భారతంలోని 16 నదులను, దక్షిణ భాగంలో 14 నదులను కాల్వల ద్వారా అనుసంధానించాలని 2002లో కేంద్రం నిర్ణయించింది. 

 

 

మాదిరి ప్రశ్నలు


1. గంగానదీ జల కాలుష్య నిర్మూలన కోసం భారత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమం ఏది?

1) నమస్తే గంగా     2) నమామి గంగే     3) పవిత్ర గంగ     4) మిషన్‌ గంగ


2. నీటి సంరక్షణ, సక్రమ పంపిణీ కోసం మొదటి జాతీయ జల విధానాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

1) 1987     2) 1978      3) 1952      4) 1990


3. జలకాలుష్య నివారణ, నియంత్రణ చట్టాన్ని ఎప్పుడు చేశారు?

1) 1980      2) 1974      3) 1950     4) 1998


4. జల వనరులను అభిలషణీయ స్థాయిలో వినియోగించుకోవడానికి నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1982      2) 1999    3) 1965       4) 1986


5. ప్రపంచ నీటిలభ్యతలో భారతదేశ వాటా ఎంత?

1) 10%      2) 20%     3) 4%     4) 15%


6. మన దేశంలో ఏ నదీ పరివాహక ప్రాంతంలో వార్షిక నీటిలభ్యత అధికంగా ఉంది?

1) గంగా      2) గోదావరి     3) సింధూ     4) బ్రహ్మపుత్ర 


7. ఏ నది నీరు సముద్రంలో అత్యధికంగా కలిసిపోతుంది?

1) బ్రహ్మపుత్ర     2) గంగ    3) మహానది, గోదావరి     4) నర్మద, తపతి 


8. దేశంలో ప్రతి గ్రామీణ గృహానికి కొళాయి ద్వారా నీరు అందించే కార్యక్రమం పేరేంటి?

1) అమృత్‌ పథకం     2) జల్‌ జీవన్‌ మిషన్‌    3) జలక్రాంతి అభియాన్‌    4) అమృత్‌ జల క్రాంతి


9. భారతదేశ భూ విస్తీర్ణం 329 మి.హెక్టార్లలో జలచక్రం ద్వారా లభిస్తున్న నీరు ఎంత?

1) 1000 బి.సి.ఎం.    2) 4000 బి.సి.ఎం.   3) 3000 బి.సి.ఎం.   4) 400 బి.సి.ఎం.


10. భారతదేశంలో లభిస్తున్న అన్ని జలవనరుల్లో వ్యవసాయ రంగానికి వినియోగిస్తున్న నీటి శాతం ఎంత?

1) 90%     2) 93%    3) 50%      4) 60%

 

సమాధానాలు: 1-2, 2-1, 3-2, 4-1, 5-3, 6-4, 7-1, 8-2, 9-2, 10-2.

రచయిత: జల్లు సద్గుణరావు


 

 

 

 

Posted Date : 17-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం-పరిచయం

పర్యావరణ అంశాలు (Components of the Environment)

* పర్యావరణ అంశాలను సహజ, మానవ, మానవ నిర్మిత అంశాలు అనే మూడు భాగాలుగా వర్గీకరించవచ్చు.

సహజ పర్యావరణం 

సహజ పర్యావరణంలో భూమి, నీరు, గాలి, మొక్కలు, జంతువుల లాంటి జీవులు ఉంటాయి.పర్యావరణాన్ని నాలుగు భాగాలుగా విభజించవచ్చు. అవి. 

1. శిలావరణం     2. జలావరణం   3. వాతావరణం     4. జీవావరణం 

* వీటిని భూమి సహజ ఆవరణాలు అంటారు.

శిలావరణం (Lithosphere) :

Litho(లిథో),Sphaira(స్పైరా) అనేవి గ్రీకు పదాలు. ఈ భాషలో లిథో అంటే రాయి, స్పైరా అంటే గోళం లేదా బంతి అని అర్థం.

* భూమి రాతి పొరను శిలావరణం అంటారు. 

* ఇది రాళ్లు, ఖనిజాలతో రూపొంది, పలుచని మట్టి పొరతో కప్పి ఉంటుంది. 

*పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, డెల్టాలు, ఎడారులు, వివిధ భూభాగాలతో కూడిన క్రమరహిత ఉపరితలం.

శిలావరణాన్ని మూడు భాగాలుగా విభజించారు. అవి.

i. భూపటలం (crust)

ii. భూప్రావారం (mantle)

iii. భూకేంద్రం (core)
భూపటలం: మనం నివసిస్తూ ఉన్న భూమి బయటి పొరను భూపటలం అంటారు. 

* ఈ పొర భూఉపరితలం నుంచి 30100 కి.మీ. వరకు విస్తరించి ఉంటుంది. 

* భూపటలంలో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్‌.

* ఈ పటలంలో ఉండే మూలకాలు (శాతాల్లో)

1. ఆక్సిజన్‌ - 49%                  2.సిలికాన్‌ - 26.03% 

3. అల్యూమినియం - 7.28%      4. ఐరన్‌ - 4.12%

* భూపటల మందం పర్వతాల్లో ఎక్కువగా, సముద్ర ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది.

* అత్యధికంగా ఉండే లోహ మూలకం - అల్యూమినియం.

* ఉపరితల పొర నుంచి సమస్త జీవులకు కావాల్సిన పోషక పదార్థాలు లభ్యమవుతాయి.

* దీని సాంద్రత 2.27 గ్రా/ఘ.సెం.మీ.

భూప్రావారం: ఈ పొర భూమి లోపల 100 కి.మీ నుంచి 2900 కి.మీ. వరకు ఉంటుంది. భూప్రావారంలో పైభాగం మెత్తగా ఉంటుంది. దీనిపై పైపొర తేలుతూ ఉంటుంది.

* దీని సాంద్రత 3.2 గ్రా/ఘ.సెం.మీ.

* భూప్రావారం ద్రవ, ఘన స్థితిలో కాకుండా కొల్లాయిడ్‌ రూపంలో ఉంటుంది.

* ఈ పొరలో సిలికా (Si), మెగ్నీషియం(Mg) అనే మూలకాలు ఎక్కువగా ఉంటాయి. 

* దీని రసాయన సాంకేతిక నామం సిమా(sima)

* భూకంపాలు భూప్రావారం వరకు మాత్రమే పరిమితమై ఉంటాయి.

భూకేంద్ర మండలం:  ఇది భూమి లోపల 2900 కి.మీ. నుంచి 6376 కి.మీ. వరకు ఉంటుంది.

*ఈ పొరలో ప్రధానంగా నికెల్‌ (Ni), ఫెర్రస్‌ (Fe)లేదా ఇనుము లాంటి భార ఘన పదార్థాలు ఉంటాయి. దీని రసాయన సాంకేతిక నామం నిఫె (Nife).

* దీన్ని తిరిగి రెండు ఉప పొరలుగా విభజించవచ్చు.

అవి : 1) బయటి కేంద్ర భాగం      2) లోపలి కేంద్ర భాగం

* బయటి కేంద్ర భాగం 2900 కి.మీ. నుంచి 5100 కి.మీ. వరకు ఉంటుంది. ఈ పొరలో ఇనుము, నికెల్‌ లాంటి లోహాలు ద్రవ రూపంలో ఉంటాయి.

*లోపలి కేంద్ర భాగం 5100 కి.మీ. నుంచి 6376 కి.మీ. వరకు ఘన రూపంలో విస్తరించి ఉంటుంది. ఈ పొరలో ఇనుము లోహ మిశ్రమాలు, బంగారం లాంటి భార పదార్థాలు ఉంటాయి.

* భూమి ఘనపరిమాణంలో భూపటలం 1% మాత్రమే. భూప్రావారం 16%, భూకేంద్ర మండలం 83% ఉంటాయి.

*భూకేంద్ర మండలం సాంద్రత 12 గ్రా/ ఘ.సెం.మీ.

* భూకేంద్రం వద్ద ఉష్ణోగ్రత 60000C గా ఉంటుంది.

* వ్యవసాయం, మానవ నివాసాల కోసం మనం ఉపయోగించే ఆవరణం శిలావరణం. 

* శిలావరణ పలుచటి నేలపొర వ్యవసాయ అభివృద్ధికి సహాయపడుతుంది. మనకు ఆహారాన్ని అందిస్తుంది.

* శిలావరణం రాతిపొర పరిశ్రమలకు ఖనిజాలను అందిస్తూ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతుంది.

వాతావరణం (Atmosphere):

గ్రీకు భాషలో అట్మాస్‌ అంటే ఆవిరి (Vapour).

* భూమి చుట్టూ ఉన్న గాలి పలుచటి పొరను వాతావరణం అంటారు. ఇది భూఉపరితలం నుంచి సుమారు 600 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది.

*వాతావరణం అనేక వాయువుల మిశ్రమం. నైట్రోజన్‌(78%), ఆక్సిజన్‌(21%), కార్బన్‌డైఆక్సైడ్‌(0.03%), ఆర్గాన్‌(0.93%)ఇతర వాయువులు(0.04%) ఉంటాయి. ఇందులో ఆక్సిజన్‌ ప్రాణవాయువు.

* భూమిపై జీవజాతి ఆవిర్భావం, మనుగడకు కావాల్సిన అనువైన శీతోష్ణస్థితిని ఏర్పరచడంలో వాతావరణం ప్రధాన పాత్ర వహిస్తుంది.

* వాతావరణాన్ని సాధారణంగా భూఉపరితలం నుంచి అయిదు పొరలుగా విభజించారు.

అవి: 1. ట్రోపో ఆవరణం        2. స్ట్రాటో ఆవరణం        3. మీసో ఆవరణం  

         4. థర్మో ఆవరణం       5. ఎక్సో ఆవరణం

* వాతావరణ పొరల మధ్య కచ్చితమైన సరిహద్దు లేదు.

* కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో మొక్కలకు కార్బన్‌డైఆక్సైడ్‌ సహాయపడుతుంది.

* సూర్యుడి హానికరమైన కిరణాలు, తీవ్రమైన వేడి నుంచి వాతావరణం మనల్ని రక్షిస్తుంది.

* వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి, ధూళి కణాలు మేఘాలను ఏర్పర్చి వర్షాలు పడేలా చేస్తాయి.

జీవావరణం (Biosphere):

* గ్రీకు భాషలో బయోస్‌ అంటే జీవం.

*భౌతిక పరిసరాల్లో నివసించే సమస్త జీవజాతిని జీవావరణం అంటారు.

*జీవావరణం భూఉపరితలం నుంచి సుమారు 200 మీటర్ల లోతు వరకు, భూఉపరితల వాతావరణంలో దాదాపు 7 నుంచి 8 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది.

* జీవావరణంతో మిగిలిన భౌతిక ఆవరణాలైన జలావరణం, శిలావరణం, వాతావరణం ఒకదానితో ఒకటి సమన్వయ పరచుకుంటాయి.

* భూమి ప్రత్యేక సహజ ఆవరణంగా జీవావరణాన్ని పరిగణిస్తారు.

* ప్రతి సంవత్సరం ఓజోన్‌ దినోత్సవాన్ని సెప్టెంబరు 16న నిర్వహిస్తారు.

* ఏటా ప్రపంచ జల దినోత్సవాన్ని (World water day) మార్చి 22న జరుపుకుంటారు.

* ప్రతి సంవత్సరం ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని (World earth day) ఏప్రిల్‌ 22న నిర్వహిస్తారు.

జలావరణం (Hydrosphere):
హైడ్రోస్పియర్‌ అనే పదం హైడర్‌(Hydro),  స్పైరా (sphaira) అనే రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. గ్రీకు భాషలో హైడర్‌ అంటే నీరు. 

* భూమి ఉపరితలంలోని అన్ని నీటి వనరులను సమష్టిగా జలావరణం అంటారు. 

* నీరు సమృద్ధిగా ఉన్న ఏకైక గ్రహం భూమి. అందుకే దీన్ని జలయుత గ్రహం (water planet) అంటారు.

*మన గ్రహం మీద జీవం ఉనికి ప్రధానంగా నీరు, గాలిపైనే ఆధారపడి ఉంది. 

*భూమి ఉపరితలం సుమారు 2/3వ వంతు నీటితో ఆవరించి ఉంది. కానీ కేవలం 1% నీరు మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతుంది. మిగిలిన 99% నీరు మంచు, ఉప్పునీరు తదితర రూపాల్లో ఉంటుంది.

జలచక్రం/జలవలయం (water cycle):

నీరు తేమ రూపంలో వాతావరణంలో చేరి, తర్వాత వర్షం/వడగళ్లు/మంచు రూపాల్లో తిరిగి భూమిని చేరే ప్రక్రియను జలవలయం అంటారు.

* నీటి చక్రాన్ని గణిత రూపంలో కింది విధంగా తెలియజేస్తారు.
వర్షపాతం = ఉపరితలంపై వాన నీటి ప్రవాహం + నీరు ఆవిరి కావడం, బాష్పోత్సేకం.

జలచక్రంలో ఆరు దశలు ఉంటాయి.

అవి: 1. బాష్పీభవనం     2. రవాణా        3. ద్రవీభవనం     

4. అవపాతం     5. ఉపరితల ప్రవాహం    6. భూగర్భ జలం

* ప్రధానంగా జలావరణాన్ని కార్బన్‌ సింక్‌ అంటారు.

* జలావరణం భూగోళ ఉష్ణోగ్రతలను క్రమపరుస్తుంది.

పర్యావరణంలోని అంశాలు


 

Posted Date : 11-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సంస్థాగత ఏర్పాట్లు

 

సమస్త యంత్రాంగం సంసిద్ధం!

 

ఇటీవల ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన వెంటనే ఎక్కడెక్కడి నుంచో అనేకమంది సిబ్బంది గంటల్లో మోహరించారు. వేగంగా సహాయక చర్యలను చేపట్టి ప్రాణ నష్టం మరింత తీవ్రం కాకుండా నివారించారు. విపత్తు అనివార్యం. కానీ  దాని వల్ల కలిగే ఇబ్బందులను అడ్డుకునే అవకాశం ఉంది. అందుకోసం ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించింది. అది విపత్తు నివారణ, ఉపశమన కార్యక్రమాలను నిర్వహించే అధికారాన్ని సంబంధిత అధికార వర్గాలకు అందిస్తుంది. వివిధ స్థాయుల్లో సమన్వయాన్ని సులభతరం చేస్తుంది. సమస్త యంత్రాంగం సమష్టి బాధ్యతతో సంసిద్ధమయ్యే విధంగా చూస్తుంది. ఆ వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 

 

విపత్తు నిర్వహణ అమలు విధానం రూపకల్పన, పర్యవేక్షణకు అవసరమైన వ్యవస్థాగత యంత్రాంగాలను సిద్ధం చేయడానికి భారత ప్రభుత్వం 2005, డిసెంబరు 23న విపత్తు నిర్వహణ చట్టాన్ని రూపొందించింది. విపత్తు నివారణ, దాని ప్రభావ మదింపు, ఏదైనా విపత్తు తలెత్తినప్పుడు ప్రభుత్వంలోని వివిధ విభాగాలు చేపట్టాల్సిన చర్యలను ఈ చట్టం వివరిస్తుంది. 

 

చట్టం ప్రకారం సంస్థాగత ఏర్పాట్లు

1) ప్రాధికార సంస్థలు: విపత్తు నిర్వహణ మూడు దశల్లో జరుగుతుంది. 

* ప్రధాన మంత్రి అధ్యక్షతన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎమ్‌ఏ - నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ).

* ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎస్‌డీఎమ్‌ఏ - స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ).

* జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (డీడీఎమ్‌ఏ - డిస్ట్రిక్ట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ). 

 

2) కార్యనిర్వాహక కమిటీలు: విధి నిర్వహణ కోసం జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో కార్యనిర్వాహక కమిటీలను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని చట్టం కల్పించింది. ఎన్‌డీఎమ్‌ఏ ఆధ్వర్యంలో జాతీయ కార్యనిర్వాహక కమిటీ, ఎస్‌డీఎమ్‌ఏ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేస్తారు.

 

3) సామర్థ్య నిర్మాణం కోసం: ఎన్‌డీఎమ్‌ఏ సామర్థ్య నిర్మాణం కోసం కేంద్రం స్థాయిలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎమ్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌)ను ఏర్పాటు చేస్తారు.

 

4) సహాయక చర్యలు చేపట్టేందుకు: విపత్తుల సమయంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి కేంద్ర స్థాయిలో జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళాన్ని (ఎన్‌డీఆర్‌ఎఫ్‌ - నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) ఏర్పాటు చేయాలి. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందనా దళాన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు.

 

 

5) ప్రణాళికలు రూపొందించడం: విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ ప్రణాళికకు అనుగుణంగా రాష్ట్రాలు, జిల్లాలు, అన్ని రకాల మంత్రిత్వ శాఖలు, వాటి విభాగాలు తమ సొంత విపత్తు నిర్వహణ ప్రణాళికలు రూపొందించుకోవాలి.

 

వివిధ సంస్థల కూర్పు

జాతీయ విపత్తు ప్రాధికార సంస్థ: విపత్తు నిర్వహణ చట్టం చేసిన తర్వాత 2006, సెప్టెంబరు 27న ప్రధానమంత్రి అధ్యక్షుడిగా లాంఛనంగా ఈ సంస్థను ఏర్పాటు చేశారు. మరో తొమ్మిది మంది సభ్యులను నియమించి అందులో ఒకరిని ఉపాధ్యక్షులుగా ఎంపిక చేస్తారు. ఈ కార్యాలయంలో ఒక ఆర్థిక సలహాదారు,  అయిదుగురు సంయుక్త కార్యదర్శులు, పది మంది జాయింట్‌ అడ్వైజర్లు, మరికొంత మంది సిబ్బంది ఉంటారు. ఈ సంస్థ విపత్తు నిర్వహణ విధానాలను రూపొందిస్తుంది. జాతీయ ప్రణాళికలను ఆమోదిస్తుంది. విపత్తు నిర్వహణలో రాష్ట్ర ప్రాధికార సంస్థలు రాష్ట్ర స్థాయి ప్రణాళికల రూపకల్పనలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను జారీ చేస్తుంది. 

 

జాతీయ కార్యనిర్వాహక కమిటీ: ఎన్‌డీఎమ్‌ఏకు విధి నిర్వహణలో సాయపడేందుకు జాతీయ కార్య నిర్వాహక కమిటీ ఉంటుంది. దీనికి కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. వ్యవసాయం, విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం-అడవులు, రక్షణ శాస్త్ర సాంకేతిక రంగం తదితర శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. రక్షణ దళాల సంయుక్త అధిపతి అయిన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) కూడా సభ్యులుగా ఉంటారు.

 

రాష్ట్ర విపత్తు ప్రాధికార సంస్థ: అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ అథారిటీల ఏర్పాటును చట్టంలోని చాప్టర్‌-3 సెక్షన్‌-14 వివరిస్తోంది. 2003 నుంచి గుజరాత్, డామన్, డయ్యూ ఆ విధమైన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. 

 

రాష్ట్ర కార్య నిర్వాహక కమిటీ: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేయవచ్చని విపత్తు నిర్వహణ చట్టం చెబుతోంది. ఆయనతో పాటు మరో నలుగురు ఇతర ప్రభుత్వ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.

 

 

జిల్లా విపత్తు ప్రాధికార సంస్థ: జిల్లా కలెక్టర్‌ దీనికి ఛైర్మన్‌. జిల్లా పరిషత్తు అమల్లో ఉంటే జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ ఈ సంస్థకు సహ ఛైర్మన్‌గా ఉంటారు. ఛైర్మన్‌ నియామకం జరగపోతే, జిల్లా స్థానిక సంస్థలకు ఎన్నికైన ఒక ప్రతినిధి (జడ్పీటీసీ) సహ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇందులో జిల్లా ప్రధాన కార్యనిర్వాహక అధికారి (జడ్పీ సీఈఓ), జిల్లా సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్, జిల్లా ముఖ్య వైద్యాధికారి, ఇద్దరు జిల్లా స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు.

 

మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఏర్పాటు: రెండో పరిపాలనా సంస్కరణల సంఘం సిఫార్సు ప్రకారం 25 లక్షలు పైబడిన జనాభా ఉన్న పెద్ద నగరాల్లో సంక్షోభాల నిర్వహణకు మేయర్‌ ప్రత్యక్ష బాధ్యత వహిస్తారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్, నగర పోలీసు కమిషనర్‌ సహకారం అందిస్తారు.

 

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎమ్‌): విపత్తును సమర్థంగా ఎదుర్కోవడానికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు, విపత్తు నిర్వహణ పరిశోధన, విద్యా సంబంధ కోర్సులు, సమావేశాలు, సెమినార్లు తదితరాలను జరిపే అవకాశాన్ని చట్టం కల్పించింది. అందుకోసం ఏర్పాటైన ఈ సంస్థకు కేంద్ర హోంశాఖ మంత్రి అధ్యక్షుడిగా, ఎన్‌డీఎమ్‌ఏ వైస్‌ ఛైర్మన్‌ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. 

 

జాతీయ ప్రతిస్పందనా దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌): పారా మిలిటరీ దళాల నుంచి తీసుకున్న 12 బెటాలియన్ల దళాన్ని విపత్తులకు స్పందించి సహకారం అందించడానికి సిద్ధంగా ఉంచుతారు. ఒక బెటాలియన్‌లో వెయ్యి మంది ఉంటారు. వీరు దేశవ్యాప్తంగా 12 కేంద్రాల్లో సిద్ధంగా ఉంటారు. ఎన్‌డీఎమ్‌ఏ వైస్‌ ఛైర్మన్‌ ఈ దళానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

 

జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్‌సీఎమ్‌సీ): విపత్తుల సందర్భంగా పునరావాస, సహాయక చర్యలను సమర్థంగా సమన్వయం చేయడానికి జాతీయ స్థాయిలో జాతీయ క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఉంటుంది. దీనికి కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ ఛైర్మన్‌గా ఉంటారు. 15 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. 

 

రాష్ట్ర సంక్షోభ నిర్వహణ కమిటీ: దీనికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడిగా ఉంటారు. రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.

 

పౌరరక్షణ దళం: పౌర రక్షణ చట్టం 1968 ప్రకారం అత్యవసర ఉపశమన వ్యవస్థ పథకంలో భాగంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో పౌర రక్షణ చర్యలు తీసుకోవడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన పౌర రక్షణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. ప్రజలకు స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని కల్పించడానికి వీలుగా 2010లో ఈ చట్టాన్ని సవరించారు.

 

మాదిరి ప్రశ్నలు

 

1. భారత ప్రభుత్వం విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎప్పుడు చేసింది?

1) 2005  2) 2007  3) 2003  4) 2015

 

2. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు ఛైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?

1) ప్రధానమంత్రి  2) హోంశాఖ మంత్రి  3) హోంశాఖ సెక్రటరీ  4) వ్యవసాయశాఖ మంత్రి

 

3. జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఎవరు?

1) కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ  2) హోంశాఖ సెక్రటరీ  3) ఎన్‌డీఎమ్‌ఏ ఉపాధ్యక్షుడు 4) ఎన్‌డీఎమ్‌ఏ అధ్యక్షుడు

 

4. జాతీయ విపత్తు నిర్వహణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?

1) ఆగస్టు 15  2) నవంబరు 5  3) అక్టోబరు 5 4) అక్టోబరు 29

 

5. జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళానికి ఛైర్‌పర్సన్‌ ఎవరు?

1) ఎన్‌డీఎమ్‌ఏ ఛైర్మన్‌ 2) ఎన్‌డీఎమ్‌ఏ వైస్‌ ఛైర్మన్‌ 3) హోం సెక్రటరీ  4) కేబినెట్‌ సెక్రటరీ

 

సమాధానాలు: 1-1; 2-2; 3-1; 4-4; 5-2.

 

రచయిత: జల్లు సద్గుణరావు 
 

 

Posted Date : 14-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవవైవిధ్య సంరక్షణ

జీవజాతులను కాపాడుకుందాం!

 


   సృష్టిలోని ప్రతి జీవి సహజ ఆవరణ వ్యవస్థలో భాగమే. పరస్పర ఆధారితమే. మనిషి చేసే అభివృద్ధి కార్యకలాపాలు, మితిమీరిన వనరుల వినియోగం వల్ల ఎన్నో జీవజాతుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పటికే కొన్ని వేల రకాల జంతు, వృక్ష జాతులు కనుమరుగయ్యాయి. చాలా జాతుల ఉనికి ప్రమాదపుటంచుల్లో కొనసాగుతోంది. ఈ పరిస్థితిపై అవగాహన పెంచి జీవవైవిధ్యాన్ని సంరక్షించేందుకు ప్రపంచవ్యాప్త కృషి జరుగుతోంది. అందులోనూ భూభాగం కంటే జీవ వైవిధ్య వాటా నాలుగు రెట్లున్న భారతదేశంలో గట్టి ప్రయత్నమే సాగుతోంది. పర్యావరణ పరిరక్షణను పౌరుల ప్రాథమిక విధిగా, వన్యప్రాణుల సంరక్షణను ప్రభుత్వాల బాధ్యతగా రాజ్యాంగం నిర్దేశించింది. ప్రమాద పరిస్థితుల్లో ఉన్న జాతుల వర్గీకరణ, వాటి సంరక్షణకు చేపడుతున్న చర్యలను పోటీపరీక్షల అభ్యర్థులు తెలుసుకోవాలి.

 

 
  అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ -IUCN) అనేది ప్రకృతి, వనరుల పరిరక్షణ కోసం పాటుపడుతుంది. ఈ సంస్థ అధ్యయనం, విశ్లేషణల ద్వారా ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లో మోర్గెస్‌లోని గ్లాండ్‌ ప్రాంతంలో ఉంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మానవ చర్యల వల్ల ప్రమాద స్థితిలో ఉన్న వృక్ష, జంతు జాతులను గుర్తించి, వాటి సంరక్షణ, నిర్వహణ చర్యలను సూచిస్తూ మొదటిసారిగా రెడ్‌ డేటా బుక్‌ను 1966లో ప్రచురించింది. ఈ బుక్‌లోని గులాబీ రంగున్న పేజీల్లో తీవ్రంగా అంతరించే స్థితిలో ఉన్న జీవజాతులను నమోదు చేస్తారు. ఆకుపచ్చ పేజీల్లో గతంలో అంతరించే స్థాయిలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆ స్థితిలో లేని జాతులను పేర్కొంటున్నారు. ఈ ఆకుపచ్చ పేజీలు పెరుగుతూ ఉంటే జీవసంరక్షణ చర్యలు అధికమవుతున్నట్లు భావించవచ్చు. IUCN సంస్థ వివిధ జాతుల వివరాల ఆధారంగా వాటిని రకరకాలుగా విభజించింది.

 


1) అంతరించిపోయిన జాతులు: వీటినే విలుప్తం చెందిన జీవులు అని కూడా అంటారు. ఒక జాతికి చెందిన జీవి ప్రాంతీయంగా/దేశాల్లో/ఖండాల్లో/ప్రపంచంలో ఎక్కడా జీవించే ఆనవాళ్లు లేని లేదా చివరి జీవి కూడా అంతరించినట్లయితే దాన్ని గతించిన జాతిగా గుర్తిస్తారు. ఉదా: డైనోసార్లు, దొడా పక్షి, ఆసియా చిరుతలు, ఊదారంగు తల ఉండే బాతు.

 


2) తీవ్ర అంతర్థాన స్థితిలో ఉన్న జాతులు: వీటినే విలుప్త స్థితికి దగ్గరగా ఉన్న జీవులు అంటారు. దాదాపు అంతరించే స్థితికి చేరిన జీవులను ఈ జాబితాలో చేరుస్తారు. అంటే మనిషి ప్రత్యక్షంగా వాటిని సంరక్షిస్తే తప్ప వాటి మనుగడ సాధ్యం కాని స్థితిలో ఉన్న జీవజాతులు అని అర్థం. ఈ జాతి జీవులుగా పేర్కొనాలంటే వాటికి కొన్ని లక్షణాలు ఉండాలి.


ఎ) గత పదేళ్లలో వాటి సంఖ్య 90% కంటే తగ్గిపోయి ఉండాలి. 


బి) వాటి జనాభా సంఖ్య 50 కంటే తక్కువగా ఉండాలి.


సి) అటవీ జీవులు అయితే పదేళ్లలో వాటి సంఖ్య 50% తగ్గిపోయి ఉండాలి.


ఉదా: ఇండియన్‌ వైల్డ్‌యాస్, ఇండియన్‌ రైనో, లయన్‌ టైల్డ్‌ మకాక్, మలబార్‌ కెవిట్, అతిచిన్న అడవి పంది, ఎగిరే ఉడుత (అరుణాచల్‌ప్రదేశ్‌లో నమ్‌దపా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కనిపిస్తుంది), శేషాచలం అడవుల్లో కనిపించే పునుగు పిల్లి, బంగారు బల్లి, ఉడుము, హిమాలయాల్లో కనిపించే కస్తూరి మృగం, బట్టమేకల పక్షి, అండమాన్‌ స్రౌ, గుడ్లగూబలు.

 


3) అంతర్థాన స్థితిలో ఉన్న జీవులు: ఆవాసాల ఆక్రమణలు, వేటాడటం లాంటి చర్యల వల్ల కొన్ని జాతుల్లో అక్కడక్కడా మిగిలి ఉన్నజీవులు ఇవి. వీటిని కాపాడకపోతే భవిష్యత్తులో విలుప్త స్థితికి దగ్గరవుతాయి. ఈ విభాగానికి కొన్ని లక్షణాలు ఉండాలి.


ఎ) గత పదేళ్లలో వీటిసంఖ్య 70% కంటే తక్కువకు పడిపోవాలి.


బి) ప్రస్తుతం వీటి సంఖ్య 250 వరకు ఉండాలి.


సి) అవి క్రూర జీవులైతే గత 20 ఏళ్లలో 20% వరకు అంతరించి ఉండాలి.

ఉదా: బెంగాల్‌ టైగర్, రెడ్‌ పాండా, బ్లూవేల్, ఇండియన్‌ ఎలిఫెంట్, సాంగై దుప్పి, గంగానది డాల్ఫిన్, ఏషియాటిక్‌ లయన్, గ్రీన్‌ టర్టిల్, ఈజిప్ట్‌ రాబందు లాంటివి.

 


4) దుర్బల స్థితిలోని జీవులు: ఎలాంటి పరిరక్షణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ప్రమాదస్థితికి చేరే జీవులు. ఈ జాబితాలో చేర్చడానికి నిర్దేశిత లక్షణాలు ఉండాలి.


ఎ) గత పదేళ్లలో ఆ జీవులు 50 శాతానికి తగ్గిపోయి ఉండాలి.


బి) ఆ జాతి సంఖ్య 10,000 కంటే తక్కువ ఉండాలి.


సి) క్రూర జీవులైతే గత వందేళ్లలో 10% తగ్గిపోయి ఉండాలి.


ఉదా: నాలుగు కొమ్ముల దుప్పి, బరసింగా దుప్పి, బ్రౌన్‌ బేర్, స్లాత్‌ బేర్, అడవిదున్న, యాక్, మంచు పులి, సారస్‌క్రేన్, ఆలివ్‌రిడ్లే తాబేళ్లు.


5) ప్రమాదపుటంచులో ఉన్న జీవులు: తీవ్ర అంతర్థాన స్థితి, అంతర్థాన స్థితి, దుర్భల స్థితుల్లో ఉన్న జీవులన్నీ ప్రమాదపుటంచులో ఉన్న జీవులే.


6) సమీప భవిష్యత్తులో ప్రమాదంలో పడే జీవులు: తీవ్ర అంతర్థాన స్థితి, అంతర్థాన స్థితి, దుర్భల స్థితుల జాబితాల్లో చేరనివి. కానీ, భవిష్యత్తులో ఆ జాబితాల్లో చేరే అవకాశం ఉన్న జాతులు. వీటిని కాపాడుకోవాలి.

 


భారత్‌లో జీవసంరక్షణ చర్యలు


భారతదేశంలో చాలా కాలం నుంచీ జీవవైవిధ్య సంరక్షణ చర్యలు చేపడుతున్నారు.

 


వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు: వన్యప్రాణుల సంరక్షణ కోసం మొదటగా 1895లో తమిళనాడులోని వేదాంతగళ్‌ ప్రాంతంలో పక్షుల సంరక్షణ కేంద్రం ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో 567 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కొనసాగుతున్నాయి.

 


జాతీయ పార్కులు: ఆవరణ వ్యవస్థను కాపాడటానికి, ప్రాంతీయ వృక్ష, జంతు జాతులకు రక్షణ కల్పించే ప్రాంతాలు. మొదట 1935లో ఉత్తరాఖండ్‌లో జిమ్‌కార్బెట్‌ నేషనల్‌ పార్కును ప్రారంభించారు. ఇప్పుడు దేశంలో 106 జాతీయ పార్కులు కొనసాగుతున్నాయి.

 


టైగర్‌ ప్రాజెక్టులు: పులుల సంరక్షణ కోసం 1973 నుంచి పులుల సంరక్షణ ప్రాజెక్టులు ప్రారంభించారు. దేహ్రాదూన్‌లోని ‘వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రకారం 2023, జనవరి నాటికి దేశంలో 53 టైగర్‌ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పులుల జనాభా లెక్కించడానికి M-STIPES (మానిటరింగ్‌ సిస్టమ్‌ ఫర్‌ టైగర్స్‌ ఇంటెన్సివ్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఎకలాజికల్‌ స్టేటస్‌) అనే సాఫ్ట్‌వేర్‌ వాడుతున్నారు.

 


ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌: ఏనుగుల రక్షణ కోసం 1992లో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో 33 ఎలిఫెంట్‌ ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. ఏనుగులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారత పర్యావరణశాఖ ‘హాథీ మేరా సాథీ’ (ఎలిఫెంట్‌ ఈజ్‌ మై ఫ్రెండ్‌) కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.


ప్రాజెక్ట్‌ గిర్‌ లయన్‌: గుజరాత్‌లోని కథియావార్‌ ప్రాంతంలోని ఆకురాల్చే గిర్‌ అటవీ ప్రాంతాన్ని సింహాల పరిరక్షణ ప్రాంతంగా కొనసాగిస్తున్నారు. దేశంలో ఇక్కడ మాత్రమే ఈ జాతి సింహాలు కనిపిస్తాయి. ఇవి ప్రస్తుతం 674 ఉన్నాయి.


ప్రాజెక్ట్‌ రైనోస్‌ విజన్‌: దీన్ని 2005లో ప్రకటించారు. దేశంలో రైనోల సంఖ్యను 3 వేల వరకు పెంచాలని నిర్ణయించారు. పశ్చిమ బెంగాల్‌లోని జలదాపరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ‘ఎ హోమ్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ వరల్డ్‌ రైనోస్‌’ అంటారు.


ప్రాజెక్ట్‌ క్రొకడైల్స్‌: దీన్ని 1975లో ప్రకటించారు. అత్యంత వేగంగా అంతరించిపోతున్న జాతిగా ఘరియల్‌ మొసళ్లని నిర్ణయించారు. ఇవి మధ్యప్రదేశ్‌లోని చంబల్‌ ప్రాంతంలో ప్రసిద్ధి. ఒడిశాలోని బిత్తరకనిక ప్రాంతం రాకాసి ఉప్పునీటి మొసళ్లకు ప్రసిద్ధి.


ప్రాజెక్ట్‌ సీ టర్టిల్‌: ఒడిశాలోని తీర ప్రాంతానికి ఏటా శీతాకాలంలో గాలపోగస్‌ దీవుల నుంచి ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు వలస వస్తుంటాయి. మనదేశంలో గ్రీన్‌ తాబేళ్లు, నక్షత్ర తాబేళ్ల లాంటి జాతులు కూడా నివసిస్తున్నాయి. వీటి రక్షణ కోసం 1999లో యూఎన్‌ఓతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టారు.


ప్రాజెక్ట్‌ స్నో లెపర్డ్స్‌: మన దేశంలో జమ్ము-కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో మాత్రమే మంచు చిరుతలు ఉన్నాయి. వీటి రక్షణ కోసం 2009లో ఈ ప్రాజెక్టుని ప్రారంభిస్తారు.

 


ప్రాజెక్ట్‌ చీతా: చీతాల ‘రీ ఇంట్రడక్షన్‌’ పేరుతో మన దేశంలో అంతరించిపోయిన చిరుత పులులను తిరిగి ప్రజననం చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం ఆఫ్రికాలోని నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి రెండు విడతలుగా చీతాలు తీసుకొచ్చారు. వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో ప్రవేశపెట్టారు. చివరి చీతాను 1948లో వేటాడి చంపిన తర్వాత 1952లో భారత ప్రభుత్వం ఈ జాతి దేశంలో అంతరించిపోయినట్లు ప్రకటించింది.

 


రచయిత: జల్లు సద్గుణరావు


 

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తు నిర్వహణలో అవశిష్ట నైపుణ్యాలు

ప్రాణాలు కాపాడే నేర్పరితనం!

 


  
  హఠాత్తుగా అనుకోని సంఘటనలు ఎదురైతే దాదాపు అందరూ కాసేపు స్తంభించిపోతారు. అలాంటిది పెద్ద ప్రమాదమే జరిగితే దాన్ని చూసిన, అందులో ఉన్న బాధితుల మానసిక స్థితిని ఊహించడం కష్టం. కానీ ఆ విధమైన విపత్కర పరిస్థితుల్లో కూడా విపరీత భావోద్వేగాలకు గురికాకుండా, పరిస్థితులకు అనుగుణంగా, సృజనాత్మకంగా ఆలోచించడం, అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవడం, సరైన సమాచారాన్ని అందించడం, సమన్వయం చేసుకోవడం వంటి చర్యలను అవశిష్ట నైపుణ్యాలు అంటారు. విపత్తు నిర్వహణలోని ఆ నేర్పరితనం ప్రాణాలను కాపాడుతుంది. ఆస్తులు సహా ఇతర నష్టాలను గణనీయంగా తగ్గిస్తుంది. 

 


  విపత్తు ఎప్పుడు, ఎక్కడ సంభవించినా మొదట స్పందించేది స్థానికులే. వారే వేగంగా తక్షణ, రక్షణ చర్యలు మొదలుపెడతారు. శిక్షణ, సరైన వనరులు లేకుండా విపత్తుల నుంచి బాధితులను రక్షించడం స్థానికులకు కష్టతరమైన అంశం. విపత్తు తర్వాత అక్కడి భౌతిక, పర్యావరణ పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో శోధన, రక్షక చర్యలు (సెర్చ్, రెస్క్యూ) కీలకపాత్ర పోషిస్తాయి. ఎక్కువ మంది ప్రాణాలు కాపాడటం శోధన, రక్షక చర్యల బృందాల బలం, సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది.

 


  అత్యంత అననుకూల పరిస్థితుల్లో కూడా ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన వ్యక్తి/వ్యక్తుల సమూహం నిర్వహించే ఒక సాంకేతిక చర్యను శోధన, రక్షక చర్యలుగా నిర్వచించవచ్చు. వీటిని కమ్యూనిటీ సాన్నిహిత్య సహకారం, బృంద దృక్పథంతో నిర్వహిస్తారు

 


శోధన, రక్షక చర్యల బృందం కూర్పు: నిజాయతీ, భావోద్వేగం, వృత్తిపరంగా తిరుగులేని నైపుణ్యం, శారీరక దారుఢ్యం, ప్రదర్శనా సామర్థ్యం, అత్యవసర పరిస్థితుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉండే స్త్రీ, పురుష వాలంటీర్లతో రక్షక బృందాన్ని ఏర్పాటు చేస్తారు. వీరికి 18 ఏళ్లు నిండి, స్థానిక భాషలో చదివే, రాయగలిగే సామర్థ్యం ఉండాలి. మాజీ సైనిక సిబ్బందికి ప్రాధాన్యం ఉంటుంది.

 


ప్రధాన లక్ష్యాలు:  * కూలిన భవనాల శిథిలాల నుంచి లేదా తుపాను, సునామీ, వరదలు లాంటి కల్లోలాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడటం.


* బాధితులకు ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యచికిత్సకు పంపడం.

 

* కూలేందుకు సిద్ధంగా/ప్రమాదంలో ఉన్న భవనాలను తాత్కాలికంగా కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవడం.


* ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించి, అక్కడినుంచి తొలగించి, సంబంధీకులకు అందజేయడం.


* స్థానిక వనరులను ఎలా ఉపయోగించుకోవాలో శిక్షణ, ప్రదర్శన ద్వారా కమ్యూనిటీ ప్రజలకు అవగాహన కల్పించడం.

 


విధులు: దుర్ఘటన ఏ ప్రాంతంలో జరిగిందో తెలుసుకుని వేగంగా సహాయక చర్యలు చేపట్టడం బృంద సభ్యుల ప్రాథమిక విధి. ఇది సమర్థ రక్షణకు ఉపయోగపడుతుంది. నష్టం జరిగిన ప్రాంతం పరిధి, వివరాలు, ఇంకా ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా లాంటి సమాచారం సేకరించడం చాలా ముఖ్యం.

 


మూడు కీలక సూత్రాలు: బృంద సభ్యులు శోధన, రక్షక చర్యల్లోకి దిగే ముందు కింది సూత్రాలు పాటించాలి.

 


పరిశీలించు (Look): జరిగిన సంఘటన ఏ రకమైందో కళ్లతో చూసి తనిఖీ చేయాలి.

 


విను (Listen): జరిగిన సంఘటన వివరాలు కమ్యూనిటీ (స్థానిక ప్రజలు) నుంచి లేదా ప్రభుత్వ రికార్డులు, మీడియా వంటి వనరుల నుంచి పూర్తిస్థాయిలో సేకరించి చర్యల్లోకి దిగాలి.

 


స్పందించు (Feel): ప్రమాద తీవ్రత గురించి వాస్తవాన్ని గ్రహించి, దానికి ప్రతిస్పందించి చర్యల్లోకి దిగే ముందు వనరులను, సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి.

 


రక్షక బృందం వద్ద ఉండాల్సిన వస్తువులు: 1) తాడు  2) నిచ్చెన  3) కత్తిరించే చిన్న సాధనాలు  4) ప్రథమ చికిత్స పెట్టె  5) గునపం 6) సుత్తి  7) బాధితుడిని మోసుకెళ్లే జోలె (స్ట్రెచర్‌). అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి సామగ్రి బృందానికి అందుబాటులో లేనప్పుడు స్థానికంగా లభించే పీపాలు, టిన్‌ డబ్బాలు, గొట్టాలు, కర్రలు లాంటి వస్తువులు వినియోగించుకునే సమయస్ఫూర్తి ఉండాలి.

 


రక్షక బృందం సభ్యుడి వద్ద ఉండాల్సిన వస్తువులు: 1) హెల్మెట్‌  2) టార్చ్‌లైట్‌  3) గమ్ముతో అతికించిన బూట్లు  4) లైఫ్‌ జాకెట్‌  5) విజిల్‌

 


ప్రథమ చికిత్సే ప్రధానం: ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముందుగా ప్రజల ప్రాణాలు కాపాడటానికి చేయాల్సిన అత్యంత ముఖ్యమైన చర్య ప్రథమ చికిత్స. గాయం తగిలిన లేదా అకస్మాత్తుగా జబ్బు పడిన బాధితుడికి అధునాతన వైద్యం అందించడానికి ముందు ప్రమాదం జరిగిన చోట లభించే మానవ, ఇతర వనరులతో తొలి సంరక్షణ అందించడమే ప్రథమ చికిత్స. దీనికి బంగారు సూత్రం.. ‘ప్రశాంతంగా ఉండాలి, భయాందోళన చెందవద్దు.’

 


కార్యాచరణ ప్రణాళిక: ప్రథమ చికిత్స అవసరమా, లేదా అని మదింపు చేసుకోవడంలో బృంద సభ్యులకు ఒక కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. లేదంటే ప్రాణం పోయిన శవాన్ని ఆస్పత్రిలో చేర్చినట్లవుతుంది. అందుకోసం రక్షక చర్యల బృందం సభ్యులు ముందుగా కింది పరిశీలనలు చేయాలి. వీటినే DRABC అంటారు.


* D - డేంజర్‌ (ప్రమాదం): మీకు/బాధితులకు/ఇతరులకు ఏదైనా ప్రమాదం ఉందేమో గమనించాలి.


* R - రెస్పాన్స్‌ (ప్రతిస్పందన): బాధితుడు స్పృహలో ఉన్నాడా లేదా అచేతనంగా ఉన్నాడా అని పరిశీలించాలి.


* A - ఎయిర్‌వే (వాయునాళం): ముక్కు తెరచుకుని ఉందో లేదో చూడాలి.


* B - బ్రీతింగ్‌ (శ్వాస): బాధితుడి శ్వాస శబ్దం వినిపిస్తుందా, గుండె కొట్టుకుంటుందా అనేది పరిశీలించాలి.


* C - సర్క్యులేషన్‌ (రక్తప్రసరణ): బాధితుడి నాడీ కొట్టుకుంటుందో లేదో పరిశీలించాలి.



ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాల్సిన 12 వస్తువులు: 1) దూది  2) టేపు  3) బ్యాండేజ్‌  4) డ్రెస్సింగ్‌ క్లాత్‌  5) ట్రయాంగులర్‌ బ్యాండేజ్‌ 6) థర్మామీటర్‌ 7) కత్తెర  8) గ్లౌజులు 9) సబ్బు  10) నొప్పి నివారణ మందులు 11) యాంటాసిడ్‌ 12) ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు.

 


స్పృహ కోల్పోయిన వ్యక్తికి ప్రథమ చికిత్స:


ఆ వ్యక్తిని పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. తల వెనక్కి వంచి, చేతులు శరీరానికి లంబకోణంలో ఉంచాలి.


* కాలిని 8 నుంచి 12 అంగుళాలు ముందుకు జరపాలి. దీనివల్ల మెదడుకు రక్తప్రవాహం పెరుగుతుంది.


* దుస్తులు బిగుతుగా ఉంటే తొలగించాలి.


* బాధితుడి చుట్టూ జనం గుమికూడనీయకూడదు. 

 


కాలిన గాయాలకు చికిత్స: * కాలిన భాగాన్ని వెంటనే చల్లటి నీటిలో ముంచిన వస్త్రాలతో తుడవాలి.

 

* మంటల్లో చిక్కుకున్నట్లయితే వెంటనే బయటకు లాగి వస్త్రంతో కప్పి దొర్లించాలి. లేదా తక్షణమే దుప్పటి చుట్టాలి.


* కాలిన ప్రాంతంలో వెన్న, నూనె, ఐస్‌ లాంటివి పూయకూడదు.


* గాయంపై నేరుగా నీటిని ధారాళంగా పోయకూడదు.

 


ఎముకలు విరగడం లేదా బెణకడం:  * విరిగిన ప్రదేశంలో దన్నుగా సరైన ప్యాడింగ్‌ చేయాలి.


* విరిగిన ప్రదేశాన్ని కదలకుండా ఉంచాలి.


* గాయం తగిలిన ప్రాంతంలో నొప్పి తగ్గే విధంగా వాపు రాకుండా ఐసు ముక్కతో రుద్దాలి.


* గాయంపై షాక్‌ తగలకుండా చికిత్స చేయాలి.

 


విద్యుదాఘాతం జరిగినప్పుడు: * కరెంట్‌ షాక్‌ తగిలిన వ్యక్తికి చికిత్స చేయడానికి ముందు విద్యుత్తు ప్రవాహాన్ని నిలిపివేయాలి.


* విద్యుత్తు నిరోధకం సాయంతో బాధితులను అక్కడి నుంచి తీయాలి.


* ఆసుపత్రికి తీసుకెళ్లే వరకు షాక్‌ తగిలిన భాగాన్ని శుభ్రమైన వస్త్రంతో కప్పి ఉంచాలి.


*  DRABC ని పాటించాలి.

 


పాము కాటుకు గురైనప్పుడు: 


* పాము కాటుకు గురైన భాగాన్ని గుండె ఉన్న ఎత్తు కంటే తక్కువ ఎత్తులో ఉండేలా చూడాలి.


* కాటు వేసిన భాగం నుంచి 15 నుంచి 30 సెకన్ల వరకు రక్తం కారనివ్వాలి.


* కాటు వేసిన ప్రాంతానికి రెండు అంగుళాలపైన బిగువైన రోలర్‌ బ్యాండ్‌ వేయాలి.


* కాటు వేసిన భాగాన్ని శుభ్రంగా సబ్బుతో కడగాలి.


* పాము కాటు వేసిన వెంటనే అక్కడి రక్తాన్ని నోటితో పీల్చి ఉమ్మివేయాలి. అలా చేసిన తర్వాత నీళ్లతో నోటిని పుక్కిలించాలి.


ఈ విధంగా చేసే ప్రథమ చికిత్స అనేక సందర్భాల్లో మరణం నుంచి వ్యక్తులను కాపాడుతుంది.

 


రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 06-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవావరణ మండలాలు

సకల జీవ సమూహాలకు సంరక్షణ!

 

 జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి.  సుస్థిరాభివృద్ధిని సాధించాలి. అందుకు తగిన సహజ, భౌగోళిక పరిస్థితులు ఉండాలి. అవసరమైన శాస్త్రీయ పరిశోధనలు జరగాలి. అప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. ఈ లక్ష్యంతోనే ప్రపంచ వ్యాప్తంగా నిర్ణీత ప్రాంతాలను జీవావరణ మండలాలుగా గుర్తించారు. అంతరించి పోతున్న జాతులను అక్కడ రక్షిస్తారు. సహజ పర్యావరణ ప్రక్రియలను ప్రోత్సహిస్తారు. దాని కోసం భూమిని, వనరులను సమీకరిస్తారు. నిర్వహణ విధానాలను రూపొందిస్తారు. జీవావరణాన్ని సంరక్షిస్తారు. పర్యావరణ అంశాల అధ్యయనంలో భాగంగా ఆ విశిష్ట మండలాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


    విశాల ప్రపంచంలోని జీవులన్నింటినీ జీవావరణం అంటారు. ప్రతి జీవికి తన చుట్టూ ఉన్న సహజ, భౌగోళిక అంశాలతో అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే మనిషితోపాటుగా అన్ని జీవజాతులకు అంతర్జాతీయ ప్రాధాన్యం ఇచ్చేందుకు యునెస్కో కృషి చేస్తోంది. యునెస్కోలోని ఇంటర్నేషనల్‌ కోఆర్డినేషన్‌ కౌన్సిల్‌ నియమించిన టాస్క్‌ఫోర్స్‌ నిర్ణయం మేరకు జీవావరణ మండలాల గుర్తింపు కోసం ‘మ్యాన్‌ అండ్‌ బయోస్ఫియర్‌ ప్రోగ్రామ్‌’ MAB ని 1974లో ఆమోదించింది. 1976 నుంచి అమలు ప్రారంభించింది. దేశాలు నిర్ణయించిన జీవావరణ మండలాల్లో ఆయా దేశాలు చేపట్టిన సుస్థిరాభివృద్ధి కార్యకలాపాల ఆధారంగా కొన్నింటిని యునెస్కో ఎంపికచేసి MAB లో చేర్చింది.


* అన్ని జీవజాతులతో పాటు, పర్యావరణంలో మనిషి మనుగడను కూడా పరిశీలనలోకి తీసుకుంటూ నిర్ణయించిన భూ, సముద్ర ప్రాంతాలు జీవావరణ మండలాల్లో భాగమవుతాయి. అంతర్జాతీయ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వాటి పరిరక్షణకు దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చు.


* జీవావరణ మండలాలు సహజ జీవ మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అనేక జీవవైవిధ్య సమూహాల ఏకత్వాన్ని ఒక ప్రాంతంగా సంరక్షణ అవసరాన్ని తెలియజేస్తాయి.


* జీవావరణ మండలాల్లో మొత్తం పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా పరిశోధన, విద్య, శిక్షణ లాంటి కార్యక్రమాలను చేపడతారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కుల్లో ఇందుకు అవకాశం ఉండదు.


* ఈ ప్రాంతాల్లో సహజత్వాన్ని, ఆవరణ వ్యవస్థను, జాతులు, జెనిటిక్‌ వైవిధ్యాన్ని సంరక్షిస్తారు.


* ప్రపంచం మొత్తంలో మ్యాన్‌ అండ్‌ బయోస్ఫియర్‌ నెట్‌వర్క్‌లో 134 దేశాల నుంచి 738 ప్రాంతాలను యునెస్కో గుర్తించింది. వీటిలో భారత్‌ నుంచి 12 ప్రాంతాలున్నాయి.

భారతదేశంలో జీవావరణ మండలాలు: భారత ప్రభుత్వం జాతీయ జీవావరణ రిజర్వు ప్రోగ్రామ్‌ని 1986లో ప్రారంభించింది. మొదటి జీవావరణ మండలంగా నీలగిరి ప్రాంతాన్ని 1986లో ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం 18 జీవావరణ మండలాలున్నాయి.



జీవావరణ మండలాల ఎంపిక - లక్షణాలు:

* ఈ ప్రాంతాలు మృత్తికలు, సూక్ష్మ శీతోష్ణ పరిస్థితుల వైవిధ్యంతో ఉండి అనేక రకాల స్థానీయ జీవజాతులకు ఆలవాలమై ఉండాలి.


* కొద్దికాలంలో అంతరించిపోయేందుకు దగ్గరలో ఉన్న, అరుదైన, ప్రమాదపు అంచులో ఉన్న జీవులు నివసిస్తూ ఉండాలి.


* పర్యావరణంతో సామరస్యపూర్వక జీవనం సాగించే సంప్రదాయక గిరిజన జాతులు ఆ ప్రాంతాల్లో అధికంగా నివసిస్తూ ఉండాలి.


* ఒక ఆవరణ వ్యవస్థలోని వృక్షజాతులు, జంతు జాతుల మధ్య వైవిధ్యాన్ని, సమగ్రతను కాపాడటం ఈ ప్రాంతాల ప్రధాన లక్షణం.


* జాతుల జెనిటిక్‌ వైవిధ్యానికి రక్షణ కవచంగా ఉంటూ వాటి ప్రజన ప్రక్రియను కొనసాగించడానికి ఆటంకం లేకుండా చర్యలు చేపడతారు.


* ఈ ప్రాంతాల్లో జీవజాతుల సంరక్షణకు, పర్యావరణ పరిరక్షణకు కావాల్సిన బహుముఖ పరిశోధన, విద్య, శిక్షణ కార్యకలాపాలు చేపడతారు.


* సుస్థిరాభివృద్ధితో కూడిన సరైన సాంకేతికత వినియోగం ద్వారా సహజ వనరులను స్థానిక ప్రజల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే విధంగా పర్యవేక్షిస్తారు.

 

జీవావరణం - విభాగాలు: జీవులు, జన్యు ఆధారాలు, గిరిజనుల జీవన శైలి, సహజసిద్ధ పరిసరాల పరిరక్షణ మొదలైన బహుళ ప్రయోజనకర పరిరక్షణ ప్రాంతాలైన బయోస్ఫియర్‌ రిజర్వులను మూడు మండలాలుగా విభజిస్తారు.

1) కోర్‌ జోన్‌: ఈ ప్రాంతం పూర్తిగా మానవ కార్యకలాపాల నిషిద్ధ ప్రాంతం. ప్రశాంతతను దెబ్బతీసే కార్యకలాపాలు చేపట్టడానికి వీల్లేదు. ఈ ప్రాంతాల శిఖర స్థాయిలో వేట ద్వారా ఆహారాన్ని సేకరించే జీవులతో పాటు అనేక రకాల జంతు, వృక్ష జాతులు వాటి స్థలాలకు పరిమితమై జీవిస్తుంటాయి. సహజత్వానికి, అటవీ జీవన విధానానికి ఆటంకం కలగకుండా పరిశోధన, నిర్వహణ లాంటి అంశాలకు అవకాశం కల్పిస్తారు.


2) తటస్థ మండలం (Buffer Zone): ఈ ప్రాంతం కోర్‌ జోన్‌ చుట్టూ విస్తరించి ఉంటుంది. ఇందులో కోర్‌ జోన్‌ పరిరక్షణే ధ్యేయంగా కార్యకలాపాలు చేపడతారు. ఈ ప్రాంతంలో పరిశోధన, విద్యా కార్యకలాపాలకు అవకాశం ఉంటుంది. ఆవరణ వైవిధ్యానికి ఎలాంటి ఆటంకం లేకుండా సహజ మానవ కార్యకలాపాలకు అవకాశం ఇస్తారు. సహజవనరుల విలువను పెంచే విధంగా పునరుద్ధరణ, ప్రదర్శన, విహారం, వినోదం, చేపల పెంపకం, పశుగ్రాసం పెంపకం లాంటి కార్యకలాపాలు కోర్‌ జోన్‌ ప్రశాంతతను కాపాడుతూ చేపట్టే అవకాశం ఉంటుంది.


3) పరివర్తన మండలం (Transition Zone): ఇది జీవావరణ మండలంలో పూర్తిగా బయట విస్తరించి ఉన్న ప్రాంతం. నివాసాలు, వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. వినోద, ఆర్థిక కార్యకలాపాలు చేపట్టవచ్చు. పరివర్తన మండలానికి సరిహద్దులు నిర్ణయించి ఉండవు. సంరక్షణ, నిర్వహణ సామరస్యపూర్వకంగా, సహకార స్ఫూర్తితో ఉంటుంది. జీవావరణ మండలాల ఆశయానికి అనుకూలంగా కార్యకలాపాలు నిర్వహిస్తారు.


ప్రత్యేకతలు:

* జాతులు, జెనిటిక్స్, జీవులు, మానవసహిత సహజత్వాన్ని మొత్తంగా పర్యావరణాన్ని కాపాడే ప్రాంతాలివి.

 

* విశాలమైన జీవావరణ మండలాల్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, నేషనల్‌ పార్కులు అంతర్భాగంగా ఉంటాయి.

 

* స్నేహపూర్వక, పర్యావరణహిత అభివృద్ధితో కూడిన సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యం ఉంటుంది.


* ఈ ప్రాంతాల అభివృద్ధికి, సంరక్షణకు మధ్య సమస్యలు తలెత్తకుండా తీవ్రతను తగ్గించే చర్యలు తీసుకుంటారు.

 

* ఈ ప్రాంతాల సంరక్షణ కోసం బహుళ భాగస్వామ్య వ్యవస్థలు కలిసి పనిచేయడమే కాకుండా విశాల దృక్పథంతో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తారు.

 

* వీటిలో కొన్నింటిని సహజత్వమే ప్రపంచం అనే దృక్పథంతో యునెస్కో మ్యాన్‌ అండ్‌ బయోస్ఫియర్స్‌ నెట్‌వర్క్‌లో చేర్చడం ప్రపంచీకరణకు అద్దం పడుతోంది.

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 18-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ కాలుష్యం

కలుషిత పరిసరాల్లో జీవావరణ వధ!

వాతావరణంలో ఆకస్మిక మార్పులతో వ్యవసాయంలో వ్యతిరేక ఫలితాలు. ఆస్తమా, ఎలర్జీ అందరికీ వచ్చే ఆరోగ్య సమస్యలు. ఒత్తిడి, నిద్ర పట్టకపోవడం తదితరాలు తరచూ ఎదురయ్యే ఇబ్బందులు. ఇవన్నీ పర్యావరణ కాలుష్యం వల్ల కలిగే పరిణామాలు. ప్రకృతి సహజ స్వభావానికి అంతరాయం ఏర్పడి, జీవులకు ప్రతికూలంగా పరిసరాలు ప్రభావం చూపడమే పర్యావరణ కాలుష్యం. మనిషి సాధించిన పారిశ్రామిక ప్రగతి, కనుగొనే కొత్త ఉపకరణాల వల్ల పలువిధాలుగా పరిసరాలు కలుషితమవుతున్నాయి. శాస్త్ర, సాంకేతికత అభివృద్ధి చెందేకొద్దీ కాలుష్యం అధికమై జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ప్రస్తుతం ప్రపంచానికి పెద్ద విపత్తుగా మారిన ఈ పర్యావరణ కాలుష్యం రకాలు, జరిగే నష్టాలు, నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఉద్యోగార్థులు తెలుసుకోవాలి.


ఉత్పత్తి, వినియోగ కార్యకలాపాలతో వచ్చే వ్యర్థాలను అనేక విధాలుగా పర్యావరణంలోకి వదిలివేస్తున్నారు. ఈ వ్యర్థాలను జీర్ణించుకునే శక్తి పర్యావరణానికి ఒక స్థాయి వరకే ఉంటుంది. ఆ స్థాయి దాటి వ్యర్థాలు పెరిగితే దాని నాణ్యత తగ్గుతుంది. ఆ విధంగా ఏర్పడే పర్యావరణ క్షీణతను పర్యావరణ కాలుష్యం అంటారు. భారత పర్యావరణ పరిరక్షణ చట్టం - 1986 ప్రకారం ‘‘ఘన, ద్రవ, వాయు స్థితిలో ఉన్న ఏవైనా అవాంఛనీయ పదార్థాలు పరిమితికి మించి గాలి, నీరు, నేల అనుఘటకాల్లోకి చేరి, వాటి సహజ సంఘటనంలో మార్పు తీసుకొచ్చి మానవుడికి, ఇతర జీవుల మనుగడకు అంతరాయం కలిగించే స్థితే పర్యావరణ కాలుష్యం’’. కాలుష్యాన్ని ఆంగ్లంలో పొల్యూషన్‌ అంటారు. ఇది పొల్యుటోనియం అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. దీనర్థం ‘అపరిశుభ్రత’.


పారిశ్రామిక, హరిత విప్లవాల వల్ల ముందు తరం కంటే తర్వాత తరం జీవన నాణ్యత పెరుగుతూ వచ్చింది. అయితే దాని వెనుక తలెత్తిన పర్యావరణ సంక్షోభాలు మానవ జీవనానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నాయి. పీల్చే గాలి, తాగే నీరు, నివసించే నేల కలుషితమై జీవరాశుల మనుగడకే అంతరాయం కలుగుతోంది. ఈ విధంగా మనిషి జీవనసరళి వల్ల తటస్థపడే పరిసరాల క్షీణత క్షయాన్ని ‘జీవావరణ వధ’గా 1972లో స్టాక్‌హోమ్‌లో జరిగిన ‘మానవుడు-పర్యావరణం’ అనే అంతర్జాతీయ సదస్సులో అభివర్ణించారు. కాలుష్యానికి కారణమైన పదార్థాలను కాలుష్యకాలు అంటారు. ఉదా: సీసం, పాదరసం, కార్బన్‌ మోనాక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్‌ లాంటివి.

ఉనికి: ఉనికి ఆధారంగా కాలుష్యాలు రెండు రకాలుగా ఉన్నాయి.

1) పరిమాణాత్మక కాలుష్యకాలు: సహజసిద్ధంగా పర్యావరణంలో ఉండి పరిమితికి మించి పర్యావరణం అనుఘటకాల్లోకి ప్రవేశించి వాటి నిష్పత్తిలో మార్పు తీసుకొచ్చి నష్టపరిచేవి. ఉదా: కార్బన్‌ డయాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్‌ లాంటివి.

2) గుణాత్మక కాలుష్యకాలు: ఇవి సహజసిద్ధంగా పర్యావరణంలో ఉండవు. మానవ చర్యల వల్ల పర్యావరణంలోకి విడుదలై కాలుష్య కారకాలవుతాయి.

ఉదా: రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, పరిశ్రమల నుంచి వెలువడే వాయువులు, వ్యర్థాలు.

స్వభావం: క్షయ స్వభావం ఆధారంగా కాలుష్యకాలను రెండు రకాలుగా పేర్కొన్నారు. 

1) జీవక్షయం చెందే కాలుష్యకాలు: కొన్ని వ్యర్థాలు సూక్ష్మజీవుల చర్యల వల్ల పర్యావరణ విభాగాల్లో కలిసిపోతాయి. ఆ విధంగా పర్యావరణానికి అనుకూలంగా మారిపోయే కాలుష్యాలను జీవక్షయం చెందే కాలుష్యకాలుగా భావిస్తారు. ఉదా: చెత్త, వృక్ష, జంతు సంబంధ అవశేషాలు, వ్యవసాయ సంబంధ వ్యర్థాలు.

2) జీవక్షయం చెందని కాలుష్యకాలు: సూక్ష్మజీవుల చర్యల వల్ల క్షయం కాకుండా కొన్ని వందల ఏళ్ల వరకు వాతావరణ విభాగాల్లో అదే స్థితిలో ఉండి పర్యావరణానికి హాని కలిగించేవి. ఉదా: ప్లాస్టిక్‌ సంబంధ వస్తువులు, గాజు, పాలిథీన్‌ సంచులు, క్లోరినేటెడ్‌ హైడ్రోకార్బన్స్‌

మార్పు: పర్యావరణంలో మార్పు చెందే కాలుష్యకాలు రెండు రకాలు.

1) ప్రాథమిక కాలుష్యకాలు: పర్యావరణంలోకి విడుదలకాక ముందు ఏ స్థితిలో ఉన్నాయో, విడుదలయ్యాక కూడా అదే స్థితిలో ఉండి పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యేవి. ఉదా: డీడీటీ, పాదరసం లాంటివి.

2) ద్వితీయ కాలుష్యకాలు: ప్రాథమిక కాలుష్యకాలు పర్యావరణంలోకి విడుదలైన తర్వాత రసాయనిక మార్పుల కారణంగా కొత్త కాలుష్యకాలుగా మారడం.

ఉదా: వాతావరణంలోని నైట్రోజన్‌ ఆక్సైడ్, హైడ్రోకార్బన్లు కాంతి సమక్షంలో చర్య జరిపి పైరోగ్జిఎసిటైల్‌ నైట్రేట్‌గా మారుతుంది.

కాలుష్యంలోని విభాగాలు: పర్యావరణంలో ఏ భాగమైతే కాలుష్యానికి గురవుతుందో వాటి ఆధారంగా కాలుష్యాన్ని వివిధ రకాలుగా విభజించవచ్చు. 1) వాయు కాలుష్యం 2) నీటికాలుష్యం 3) భూమి కాలుష్యం 4) ఘన వ్యర్థ కాలుష్యం 5) సముద్ర కాలుష్యం 6) ధ్వని కాలుష్యం 7) ఉష్ణ కాలుష్యం 8) కిరణధార్మిక కాలుష్యం.


ప్రపంచంలో పెద్ద పర్యావరణ ప్రమాదాలు:

భోపాల్‌ గ్యాస్‌ దుర్ఝటన: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌ అనే క్రిమిసంహారక మందులు తయారుచేసే పరిశ్రమ నుంచి 1984, డిసెంబరు 2 - 3 తేదీల్లో అర్ధరాత్రి సమయంలో మిథైల్‌ ఐసోసైనేట్‌ (ఎమ్‌ఐసీ) అనే విషవాయువు విడుదలైంది. పరిశ్రమ చుట్టూ 40 చ.కి.మీ. ప్రాంతంలో ప్రభావం చూపించడంతో, సుమారు 3,700 మంది చనిపోయారు, వెయ్యి మంది అంధులయ్యారు. 5,58,000 మంది విషవాయువు బారిన పడ్డారు.

చెర్నోబిల్‌ అణుప్రమాదం: ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ అణు విద్యుత్తు కేంద్రంలో 1986, ఏప్రిల్‌ 26న అణు రియాక్టర్‌ పేలిపోయింది. రేడియో అయోడిన్‌-131, సీజియం-137 లాంటి రేడియోధార్మిక పదార్థాలు విడుదలైన వెంటనే 31 మంది మరణించగా, ఆస్పత్రిలో 239 మంది చనిపోయారు. అణు రేడియేషన్‌ చుట్టుపక్కల ఉన్న పోలండ్, డెన్మార్క్, నార్వే దేశాలకూ విస్తరించింది. పాలల్లో కూడా రేడియేషన్‌ విస్తరించి పాలు తాగే చాలామంది చిన్నారులు చనిపోయారు.

సామూహిక విధ్వంస ఆయుధాలు: రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అమెరికా అణ్వాయుధాల దాడి పర్యావరణాన్ని అతలాకుతలం చేసింది. 1945, ఆగస్టు 6న మొదటిసారిగా లిటిల్‌ బాయ్‌ అనే అణుబాంబును బాంబర్‌ ఎనోలాగే అనే యుద్ధ విమానం నుంచి హిరోషిమా నగరంపై జారవిడిచారు. ఈ ఘటనలో 66 వేల మంది చనిపోగా 90% పట్టణం నాశనమైంది. 10 చ.కి.మీ. ప్రాంతం ప్రభావితమైంది. రెండోసారి ఆగస్టు 9న ప్యాట్‌ మాన్‌ అనే బాంబును అదే యుద్ధవిమానంతో నాగసాకి నగరంపై వేశారు. ఈసారి 1/3వ వంతు నగరం నాశనం కాగా 39 వేల మంది చనిపోయారు.


ముఖ్యమైన పర్యావరణ చట్టాలు

అటామిక్‌ ఎనర్జీ చట్టం      1962

వన్యప్రాణి సంరక్షణ చట్టం  1972

నీటి కాలుష్య నివారణ చట్టం  1974

గాలి కాలుష్య నివారణ చట్టం  1981

అటవీ పరిరక్షణ చట్టం       1980

పర్యావరణ చట్టం           1986

జాతీయ పర్యావరణ ట్రైబ్యునల్‌ చట్టం  1995

బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 1999

పట్టణ ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2000

శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు 2000

జీవవైవిధ్య చట్టం           2002

అటవీ హక్కుల చట్టం         2006

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ చట్టం    2010

రచయిత: జల్లు సద్గుణరావు

 

Posted Date : 27-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 వాయు కాలుష్యం


శాస్త్రీయ విధానాలతో స్వచ్ఛమైన శ్వాస!

ప్రపంచదేశాలన్నీ భూతాపం, వాతావరణ మార్పులతో సతమతమవుతున్నాయి. ప్రజలకు మంచి ఆహారం, గాలి దొరకడం కష్టమవుతోంది. సగటు మనిషి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ అనర్థాలన్నింటికీ కారణం వాయుకాలుష్యం. భూమిపై జంతుజాలాన్ని, మొక్కలను, నీటిలోని జలచరాలను, చివరకు కట్టడాలను కూడా ఇది ప్రభావితం చేస్తోంది. వృక్షాల్లో కిరణజన్య సంయోగక్రియను సరిగా సాగనీయడం లేదు. ఇళ్లు, వాహనాల రంగులను మార్చేస్తోంది. సహజసిద్ధ ప్రకృతి రమణీయ ప్రాంతాల నాణ్యతను క్షీణింపజేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన శ్వాసను అందించాలంటే శాస్త్రీయ విధానాలను అవలంబించాలి. ఆ వివరాలతోపాటు వాయు కాలుష్య రకాలు, వాటి నివారణ చర్యలను పోటీపరీక్షల అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.
 

భూమి చుట్టూ ఆవరించిన వాయు పొరలను వాతావరణం అంటారు. ఇందులో నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్‌ డయాక్సైడ్, హీలియం, నియాన్‌ లాంటి అనేక వాయువులు సహజంగా పర్యావరణానికి సరిపడా రీతిలో ఉంటాయి. అయితే ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉన్న కొన్ని అవాంఛనీయ పదార్థాలు వాతావరణంలో పరిమితికి మించి చేరి వాతావరణ సంఘటనంలో మార్పులు తీసుకొస్తాయి. ఫలితంగా వీటి ద్వారా జీవజాతులు, వాటి పరిసరాలకు హాని కలిగే స్థితి ఏర్పడుతుంది. దీన్నే ‘వాయుకాలుష్యం’గా పేర్కొంటారు. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు విడుదలైన వాయువులు, అడవులు తగలబడిపోవడం వల్ల మార్స్‌ గ్యాస్, మీథేన్‌ లాంటి ప్రకృతిపరమైన కాలుష్యకాలు ఒక వైపు; వాహనాలు, పరిశ్రమలు, ఇంధనాలు మండించడం వంటి వాటితో విడుదలవుతున్న కార్బన్‌ డయాక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్, పొగ లాంటి మానవ కారక కాలుష్యాలు మరోవైపు స్వచ్ఛమైన గాలిని కలుషితం చేస్తున్నాయి. వాయు కాలుష్యాలను కణరూప, వాయు రూప కాలుష్యకాలుగా విభజించవచ్చు.


1) కణరూప కాలుష్యకాలు: గాలిలో తేలియాడుతూ, 10 మైక్రాన్ల కంటే తక్కువ వ్యాసార్ధం ఉండే ఘన, ద్రవ రూప రేణువులను కణరూప కాలుష్యకాలు అంటారు. రేణువులు, ద్రవ బిందువులు వాయువులతో కలిసి ఏర్పడే మిశ్రమాన్ని ‘ఏరోసాల్స్‌’ అంటారు. ఇవి రెండు రకాలు.


ఎ) సూక్ష్మ కణరూప కాలుష్యకాలు: 2.5 మైక్రాన్ల లోపు పరిమాణంలో ఉండే కణరూప కాలుష్యకాలివి. వాహనాలు, పరిశ్రమల నుంచి; జీవపదార్థాలు మండించినప్పుడు, వ్యవసాయ సంబంధ] వ్యర్థాల నుంచి విడుదలవుతాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) సూచనల ప్రకారం గాలిలో PM 2.5 స్థాయికి మించితే జీవులకు చాలా హానికరం. ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తే ఉబ్బసం, దీర్ఘకాలిక శ్వాసనాళాల వాపు (బ్రాంకైటీస్‌), గుండె స్పందనలో వ్యత్యాసాలు లాంటి అనారోగ్యాలకు కారణమవుతాయి.


బి) స్థూల కణరూప కాలుష్యకాలు:   PM 10 గా పిలిచే 2.5 - 10 మైక్రాన్ల పరిమాణం ఉన్న కాలుష్యకాలు. ఇవి లోహ ఆక్సైడ్‌లు, సల్ఫర్, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ లాంటి కాలుష్యాలు.


కణరూప కాలుష్యకాల దుష్ప్రభావాలు: వీటితో శ్వాసకోశ, గొంతు, కళ్ల సంబంధిత వ్యాధులు వస్తాయి.
 

1. సిలికోసిస్‌ వ్యాధి: స్టోన్‌క్రషింగ్‌ పరిశ్రమల నుంచి విడుదలైన సిలికా సంబంధ ఏరోసాల్స్‌ ఊపిరితిత్తుల్లో చేరి సిలికోసిస్‌ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి మొక్కలకు సోకితే పత్రాలు వడలిపోతాయి. పంట పెరుగుదల దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది.

2. బయాప్సినోసిస్‌ వ్యాధి (వైట్‌ లంగ్స్‌): నూలు వస్త్ర పరిశ్రమ నుంచి విడుదలయ్యే కాటన్, ధూళి వల్ల కార్మికులకు బయాప్సినోసిస్‌ అనే దగ్గు, శ్వాసకోశ సంబంధ వ్యాధి వస్తుంది.

3. ఆస్‌బెస్టాసిస్‌ వ్యాధి: ఆస్‌బెస్టాస్‌ తవ్వకాలు, ఆస్‌బెస్టాస్‌ సిమెంట్‌ రేకుల పరిశ్రమల నుంచి విడుదలైన ధూళి ఊపిరితిత్తుల వ్యాధికి కారణమవుతోంది. అందుకే ఈ ఖనిజం తవ్వకాలను ప్రపంచవ్యాప్తంగా అరికట్టారు.

4. బెరీలియోసిస్‌ వ్యాధి: బాక్సైట్‌ గనుల్లో పనిచేసే వారికి ఈ రకం ఊపిరితిత్తుల వ్యాధి వస్తుంది.

5. న్యూమోనియోసిస్‌ (బ్లాక్‌ లంగ్స్‌): బొగ్గు గనుల్లో పనిచేసే వారికి వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి.

2) వాయు రూప కాలుష్యకాలు:


1. కార్బన్‌ డయాక్సైడ్‌: గ్లోబల్‌ వార్మింగ్‌కు ప్రధాన కారణమైన వాయువు కార్బన్‌ డయాక్సైడ్‌. శిలాజ ఇంధనాలు పూర్తిగా దహనం కాకపోవడం వల్ల; విద్యుత్తు కేంద్రాలు, పరిశ్రమల నుంచి ఈ వాయువు విడుదలవుతుంది. కేవలం శిలాజ ఇంధనాల వినియోగం వల్లే ఏటా సుమారు 2.5 × 10*13 టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ వాతావరణంలో కలుస్తోంది.


2. కార్బన్‌ మోనాక్సైడ్‌: ఇది చాలా ప్రమాదకర విషవాయువు. శిలాజ ఇంధనాలు అసంపూర్తిగా దహనమవడం, వంట చెరకును మండించినప్పుడు, బొగ్గును కాల్చినప్పుడు ఎక్కువగా విడుదలవుతుంది. దీన్ని పీల్చడం వల్ల రక్తంలోని ‘హీమోగ్లోబిన్‌’ ఆక్సిజన్‌కు బదులు, ఈ వాయువుతో ఆక్సీకరణం చెంది ‘కార్బాక్సీ హీమోగ్లోబిన్‌’గా మారుతుంది. దీంతో శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. దీన్నే ‘హైపోక్సియా’ అంటారు. ఇంకా మెదడు దెబ్బతినడం, కంటిచూపు మందగించడం, మతి భ్రమించడం లాంటి మస్తిష్క వ్యాధులకు దారితీస్తుంది.


3. సల్ఫర్‌డయాక్సైడ్‌: ప్రధానంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గును మండించినప్పుడు, మోటారు వాహనాల నుంచి విడుదలవుతుంది. దీనిస్థాయి వాతావరణంలో 1 PPM దాటినప్పుడు చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. దీనివల్ల ఆమ్లవర్షాలు కురుస్తాయి. ఫలితంగా చర్మక్యాన్సర్లు రావచ్చు. ఈ వ్యాధికారక గాలి మొక్కల పెరుగుదలను నిరోధిస్తుంది. చారిత్రక కట్టడాలు దెబ్బతింటాయి.

ఉదా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర ఆయిల్‌ రిఫైనరీ నుంచి విడుదలైన సల్ఫర్‌డయాక్సైడ్‌ వల్ల తెల్లని తాజ్‌మహల్‌ క్రమేపీ పసుపు రంగులోకి మారుతోంది. మరిన్ని చారిత్రక కట్టడాల గోడలు పగుళ్లు బారుతున్నాయి. దీన్నే రాతి కుష్ఠువ్యాధి అంటారు.


4. నైట్రోజన్‌ ఆక్సైడ్‌: పెట్రోల్, డీజిల్‌తో నడిచే మోటారు వాహనాలు; విద్యుత్తు జనరేటర్లు, పంట పొలాల్లో వాడిన నత్రజని ఎరువుల వాడకం ద్వారా సాధారణంగా నైట్రోజన్‌ ఆక్సైడ్‌ గాలిలో కలుస్తుంది. దీనివల్ల గ్రీన్‌హౌస్‌ వాయువులు విడుదలై భూతాపానికి (గ్లోబల్‌ వార్మింగ్‌) కారణమవుతున్నాయి. కాలేయం, మూత్రపిండాలకు నష్టం కలగడం, ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.


5. క్లోరోఫ్లోరో కార్బన్లు: మస్కిటో కాయిల్స్, ఫ్రిజ్‌లు, అత్తరు నుంచి ఇవి విడుదలై భూతాపాన్ని పెంచుతున్నాయి. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతినడం; అధిక రక్తపోటు, ఆస్తమా లాంటి వ్యాధులకు కారణమవుతాయి. వీటితో పాటు భార లోహలైన మెర్క్యూరీ, లెడ్, కాడ్మియం లాంటివి వాతావరణంలోకి విడుదలై కేంద్ర నాడీవ్యవస్థ, మెదడు దెబ్బతింటాయి. కాడ్మియం నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తుంది. మెర్క్యూరీ ప్రభావంతో జింజివాటా, మినిమాటా లాంటి వ్యాధులు వస్తాయి.


వాయు కాలుష్య నివారణ పద్ధతులు:

* వాహనాల్లో సీసం లేని పెట్రోల్‌ను వాడాలి.

* సంప్రదాయ ఇంధన వనరులకు బదులుగా బయోడీజిల్, బయోగ్యాస్, బయోమాస్‌ లాంటివి వినియోగించాలి.

* థర్మల్‌ విద్యుత్తు పరిశ్రమల నుంచి వెలువడే రేణు రూప పదార్థాలను తొలగించడానికి ఎలక్ట్రోస్టాటిక్‌ ప్రెసిపిటేటర్స్‌ అనే ఫిల్టర్‌లను తప్పనిసరిగా వాడాలి.

* పరిశ్రమల నుంచి వెలువడే కొన్ని సూక్ష్మ రేణువుల్లాంటి వాయుకాలుష్య కారకాలను తీసివేయడానికి స్క్రబ్బర్‌ వాడాలి. అంటే సున్నపురాయి తెట్టు లేదా సిమెంట్‌ బూడిద స్లర్రీ వినియోగించాలి.

* వాహనాల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి, వాయు నాణ్యత ప్రమాణాలను ప్రజలకు తెలియజేయడానికి భారత్‌/యూరో ఇంధన ప్రమాణాలను మరింత కఠినతరం చేయాలి. ఇప్పటివరకు యూరో - 6 ప్రమాణాలు అమల్లో ఉన్నాయి.

* ఇళ్లలో వంటచెరకుగా పిడకలు, కర్రలకు బదులుగా ఎల్‌పీజీ గ్యాస్‌ వాడకం పెంచాలి. శీతలీకరణ యంత్రాల్లో సి.ఎఫ్‌.సి. లకు బదులుగా ద్రవ నత్రజని వినియోగించాలి.

* దేశవ్యాప్తంగా రైల్వేట్రాకులను విద్యుదీకరించాలి.

* రవాణా రంగంలో చమురు ఆధారిత పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ కంప్రెసర్, నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) హైడ్రోజన్‌ ఇంధనం, బ్యాటరీ ఆపరేటెడ్‌ వెహికల్స్‌ వినియోగాన్ని పెంచాలి.

* వాయు ఉద్గారాల్లో 20 శాతం మేరకు ఉద్గారాలను భారీ స్థాయిలో చెట్ల పెంపకం ద్వారా కార్బన్‌ సింక్‌ చేయవచ్చని యూఎన్‌ఓ చెబుతోంది. దీనికోసం UNO - REDD (Reducing Emissions from deforestation and Degradation) అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. భారీ స్థాయి అటవీకరణ ద్వారా కార్బన్‌ డయాక్సైడ్‌ను తొలగించే ప్రక్రియను కార్బన్‌ సీక్వెస్ట్రేషన్‌ అంటారు.

* కాలుష్య బాధితులకు నష్టపరిహారం ఇవ్వడం అనే ‘పొల్యూటర్‌ పే’ సూత్రాన్ని పర్యావరణ చట్టం (1986)లో చేర్చాలని సుప్రీంకోర్టు 1996లో సూచించింది. ఈ సూచనను అన్ని మంత్రిత్వ శాఖల్లో అమలుచేయాలి.

* వాహనాల పొగ గొట్టాల్లో కెటాలిటిక్‌ కన్వర్టర్లను అమర్చాలి. వీటితోపాటు ఇంకా అనేక శాస్త్రీయ విధానాలు అమలు చేసి, ప్రజలను అప్రమత్తం చేస్తేనే భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన శ్వాస అందుతుంది.

రచయిత: జల్లు సద్గుణరావు

 

 

Posted Date : 15-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జలకాలుష్యం

 హానికర జలాలు.. అనర్థాలకు మూలాలు!

 



 

జలుబు చేయడం, జ్వరం రావడం, శ్వాసకు ఇబ్బంది కలగడం, నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం, అతిసారం, జలాశయాల్లో వ్యర్థాల తెట్టు ఏర్పడటం, సముద్రపు అలలు ఎర్రగా మారడం, మొక్కలు పెరగకపోవడం, పంటల దిగుబడులు తగ్గిపోవడం తదితరాలన్నింటికీ కారణం కలుషిత జలాలు. మనిషి ఆరోగ్య సమస్యలకు, మరెన్నో జీవరాశుల ప్రాణాలకు నీరు ప్రమాదకరంగా పరిణమించడానికి మూలం కాలుష్యం.  ఈ నేపథ్యంలో జలకాలుష్యం రకాలు, దాని వల్ల కలిగే వ్యాధులు, నివారణకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలపై పోటీ పరీక్షార్థులకు తగిన అవగాహన ఉండాలి. 

భూమిని ఆవరించి ఉన్న జలావరణంలోని సముద్రాలు, మహాసముద్రాల్లో 97.25% ఉప్పునీరు, మిగిలిన 2.75% మంచినీరు ఉంది. ఆ మంచినీటిలోనూ 2% హిమం, హిమానీ నదాల్లోనే ఉంది. వాస్తవానికి జలావరణంలో సుమారు 1% మాత్రమే మనిషి అవసరాలకు భూగర్భం, భూఉపరితలం నుంచి మôచినీరుగా లభిస్తోంది. ఇదే సమస్త జీవరాశుల మనుగడకు ఆధారం. కానీ మనిషి అదుపు లేని అభివృద్ధి కార్యకలాపాల వల్ల అందుబాటులో ఉన్న ఆ కాస్త నీరు కూడా కలుషితమైపోతోంది.  

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నిర్వచనం ప్రకారం ‘ఏవైనా అవాంఛనీయ పదార్థాలు నీటిలో కలిసి భౌతిక, రసాయనిక, జీవసంబంధ మార్పులకు కారణమై, ఆ నీటిని తాగడానికి, మొక్కలు ఆహ్లాదకరంగా పెరగడానికి వీలు లేకుండా చేయడాన్ని జలకాలుష్యం అంటారు’. భారతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్‌ఐ) ప్రకారం నాణ్యమైన తాగునీటికి రంగు, రుచి, వాసన అనే లక్షణాలు ఉండవు. నీటి గాఢత 6.0  9.0 pH మధ్యలో ఉంటుంది. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ 3 ppm (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) ఉండాలి.

 పరిశ్రమల నుంచి వెలువడే అనేక కర్బన, అకర్బన పదార్థాలు; విషతుల్య రసాయనాలు జలాలను కలుషితం చేస్తున్నాయి. గృహ సంబంధ వ్యర్థాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం వల్ల వచ్చిన వ్యవసాయ సంబంధ వ్యర్థాలు, అణు రియాక్టర్ల నుంచి వెలువడే రేడియోధార్మిక పదార్థాలు, సముద్రాలపై పేరుకుపోయిన చమురు తెట్టులాంటి అనేక వ్యర్థాలు నిత్యం స్వచ్ఛ జలాలు కాలుష్యం బారిన పడేందుకు కారణమవుతున్నాయి.

వివిధ అంచనాలు: జలకాలుష్యాన్ని రకరకాలుగా అంచనా వేస్తారు.

1) విలీన ఆక్సిజన్‌ (DO - డిజాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌): నీటిలో కరిగిన ఆక్సిజన్‌ను విలీన ఆక్సిజన్‌ అంటారు. ఇది నీటి నాణ్యతను నిర్ధారించేందుకు మంచి కొలమానం. జలాల్లో ఆక్సిజన్‌ పరిమాణం 5ppm కంటే ఎక్కువగా ఉన్నప్పుడే ఆ నీరు తాగడానికి, వ్యవసాయానికి, జలచరాల నివాసానికి ఉపయోగపడుతుంది. విలీన ఆక్సిజన్‌ 5ppm కంటే తగ్గితే ఆ జలాలు కాలుష్యం బారిన పడినట్లు పేర్కొంటారు.

2) జీవ ఆక్సిజన్‌ గిరాకీ (BOD - బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌): నిర్ణీత ఘనపరిమాణం ఉన్న నీటిలో కర్బన వ్యర్థ పదార్థాలను సూక్ష్మజీవులు జీవ, రసాయన ఆక్సీకరణ చర్య జరపడంలో వినియోగించుకునే ఆక్సిజన్‌ పరిమాణాన్ని జీవ ఆక్సిజన్‌ గిరాకీ అంటారు. నీటిలో ఆక్సిజన్‌ పరిమాణం సూక్ష్మజీవులు 5 లేదా 7 రోజులకు వినియోగించుకోగలిగిన అవధి ఆధారంగా జీవ ఆక్సిజన్‌ గిరాకీని కొలుస్తారు. 

3) రసాయన ఆక్సిజన్‌ గిరాకీ (COD- కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌): నిర్ణీత ఘనపరిమాణం ఉన్న నీటిలో కర్బన పదార్థాలను ఆక్సీకరించడానికి, బలమైన రసాయన కారకాలకు అవసరమైన ఆక్సిజన్‌కు సమానంగా పొటాషియం డై క్రోమేట్‌ ద్రావణం నుంచి పొందగలిగే ఆక్సిజన్‌ను రసాయన ఆక్సిజన్‌ గిరాకీ అంటారు. గంటల వ్యవధిలో ఎంత ఆక్సిజన్‌ అవసరం ఉంటుందనే అంశం ఆధారంగా రసాయన ఆక్సిజన్‌ డిమాండ్‌ను లెక్కిస్తారు.

4) యూట్రోఫికేషన్‌: జలాశయాల్లో పోషకాల పరిమాణం పెరిగినప్పుడు ఆకుపచ్చని శైవలాలు, అకశేరుకాలు గుంపుగా నీటిపై చేరి తెట్టు మాదిరిగా తేలియాడుతుంటాయి. దాంతో నీరు చిక్కగా, ఆకుపచ్చగా మారి చెడు వాసనను వెదజల్లుతుంది. ఈ స్థితిని యూట్రోఫికేషన్‌ అంటారు. దీన్నే శైవల మంజరులుగా వ్యవహరిస్తారు. ఈ చర్య వల్ల నీటిలోని ఆక్సిజన్‌ తగ్గి చేపలు, జలచరాలు చనిపోతాయి. పంట పొలాలు, రొయ్యలు, చేపల చెరువుల నుంచి వెలువడే ఫాస్ఫేట్స్, నైట్రేట్స్‌ లాంటి పోషకాల వల్ల; నివాస, పారిశ్రామిక ప్రాంతాల నుంచి విడుదలయ్యే మురుగు నీటి వల్ల యూట్రోఫికేషన్‌ కాలుష్యం ఏర్పడుతుంది. ఫలితంగా నీటి ద్వారా సంక్రమించే పోలియో, అతిసారం, టైఫాయిడ్, కామెర్ల లాంటి వ్యాధులు వస్తాయి. టెర్రర్‌ ఆఫ్‌ బెంగాల్‌గా పిలిచే నీటి ‘హైయాసింత్‌’ ప్రపంచంలోనే అత్యంత సమస్యాత్మకమైన నీటి కలుపు మొక్క. పోషకాలు ఎక్కువగా ఉన్న యూట్రోఫిక్‌ నీటి ఆవాసాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. తద్వారా నీటి కుంటల జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. 

5) ఓలిగోట్రోఫికేషన్‌: ఇది యూట్రోఫికేషన్‌కు వ్యతిరేకమైన స్థితి. కొత్తగా తవ్విన బావులు, చెరువులు, సరస్సుల్లో సాధారణంగా నీరు నిలకడగా ఉంటుంది. సరైన పోషక పదార్థాలు ఉండక యూట్రోఫికేషన్‌ కాలుష్యం జరగదు. నీరు స్వచ్ఛంగా ఉంటుంది. జలాశయాలకు ఉండే ఈ స్థితినే ఓలిగోట్రోఫికేషన్‌ అంటారు.

6) రెడ్‌ టైడ్స్‌: సముద్రాల్లోకి మానవ జనిత ఉద్గారాలు చేరినప్పుడు ఆ వ్యర్థాలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో అక్కడి డైనోఫ్లాజెల్లేట్స్‌ అనే సూక్ష్మజీవులు కొన్ని రసాయనాలను నీటిలోకి విడుదల చేస్తాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో సముద్రపు నీరు ఎర్రగా మారుతుంది. దీని ప్రభావం వల్ల తీరం వద్ద అలలు ఎర్రగా కనిపిస్తాయి. వీటిని రెడ్‌ టైడ్స్‌ అంటారు. 

7) భారలోహ కాలుష్యం: పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు నీటిలో కలవడంతో జింక్, కాపర్, కాడ్మియం, మెర్క్యురీ, ఆర్సెనిక్, క్రోమియం, కోబాల్ట్‌ లాంటి భార లోహాల వల్ల మానవులు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. 

8) చమురు కాలుష్యం: సముద్ర నీటిపై ఓడల నుంచి ఆయిల్‌ స్పిల్‌ జరిగి సముద్ర జలాలు చమురుతో కలుషితమవుతున్నాయి. వీటి నుంచి విడుదలయ్యే పారాఫిన్, మీథేన్, ఈథేన్‌ లాంటి వాయువులను పీల్చినప్పుడు శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. ఆక్సిజన్‌ నీటిలో కరగకుండా చమురు తెట్టు అడ్డుకుంటుంది. దాంతో ఆక్సిజన్‌ డిమాండ్‌ పెరిగి సముద్ర జలచరాలకు ప్రాణహాని కలుగుతుంది. సముద్ర జలాల్లో పేరుకుపోయిన చమురును సూడోమోనాస్‌ బ్యాక్టీరియా ద్వారా విక్షాళనం చెందించవచ్చు. భారత సంతతికి చెందిన ఆనంద చక్రవర్తి అనే అమెరికన్‌ శాస్త్రవేత్త సముద్ర జలాల్లోని చమురు కాలుష్యాన్ని తొలగించే ‘ఆయిల్‌ ఈటింగ్‌ బ్యాక్టీరియా’ అనే సూపర్‌ బగ్‌ను రూపొందించారు.


వ్యాధులు: కొన్ని రకాల భార లోహాలు కరిగిన నీటిని తాగడం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి. 

పాదరసం: సాధారణంగా నీటిలో 0.001 మి.గ్రా./లీటర్‌ పాదరసం కరిగి ఉండటం వల్ల ఎలాంటి హాని ఉండదు. కానీ ఆ మోతాదుకు మించి పాదరసం నీటిలో కలిస్తే పెదవులు, చేతులు స్పర్శజ్ఞానాన్ని కోల్పోవడం, వినికిడి సామర్థ్యం, కంటి చూపు తగ్గిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. జపాన్‌లోని మినమాటా గ్రామంలో ఇలాంటి వ్యాధి లక్షణాలు గమనించడం వల్లే దీన్ని మినమాటా వ్యాధి అంటారు. కాగితం, రంగుల పరిశ్రమల నుంచి వచ్చే మెర్క్యురీ జలాల్లో కలిసి డై మిథైల్‌ మెర్క్యురీగా నీటిలో కరుగుతుంది. ఈ నీటిలోని చేపలను ఆహారంగా తీసుకునే మనిషిలోకి ఇది ప్రవేశిస్తుంది.

కాడ్మియం: ఇది సాధారణంగా జలాల్లో 0.01 మి.గ్రా./లీటర్‌ కరిగి ఉంటే ప్రమాదం లేదు. అంతకుమించి ఉంటే మూత్రపిండాలు, కేంద్రీయ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఎముకలు విరూపణ చెందడం, రక్తహీనత, స్త్రీలలో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. జింక్‌ తయారు చేసే పరిశ్రమల నుంచి కాడ్మియం విడుదలవడం వల్ల జపాన్‌లోని ఇటాయ్‌ ప్రాంతంలో దీని ప్రభావాన్ని మొదట కనుక్కున్నారు. అందుకే ఆ వ్యాధిని ఇటాయ్‌ ఇటాయ్‌ అంటారు.

నైట్రేట్స్‌: తాగునీటిలో సాధారణంగా 4.5 మి.గ్రా/లీటర్‌ పరిమాణంలో నైట్రేట్స్‌ ఉంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉంటే అవి రక్తంలోని హిమోగ్లోబిన్‌తో కలిసి మెటా హిమోగ్లోబినియాగా మారి శరీర కణజాలాలకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోతుంది. దాంతో దుష్ప్రభావాలు కలుగుతాయి. శిశువులు నీలి రంగులో జన్మించడం, క్యాన్సర్‌ వ్యాధులు ప్రబలడం లాంటి పరిణామాలు జరుగుతాయి. తాగునీటిలో నైట్రేట్‌ మలినాలు ఎక్కువగా చేరడానికి కారణం పరిమితికి మించి ఎరువులను వినియోగించడం, భూగర్భజలంలో నైట్రేట్స్‌ గాఢత పెరిగిపోవడమే.

కాపర్‌: తాగేనీటిలో కాపర్‌ అధికంగా ఉంటే అధిక రక్తపోటు, అప్పుడప్పుడు జ్వరం రావచ్చు.

క్రోమియం: తాగునీటిలో ఎక్కువ పరిమాణంలో క్రోమియం ఉంటే క్యాన్సర్, కేంద్రనాడీ మండలానికి సంబంధించిన రుగ్మతలు, మూత్రపిండాల వాపు లాంటివి సంభవిస్తాయి.

కోబాల్ట్‌: పరిమితికి మించి కోబాల్ట్‌ నీటిలో కరిగి ఉంటే ఆ నీటిని స్వీకరించడం వల్ల పక్షవాతం, అతిసారం, రక్తపోటు తగ్గడం,  ఎముకల బలహీనత లాంటివి వస్తాయి.


జల కాలుష్య నివారణ చర్యలు:

ట్రిక్లింగ్‌ ఫిల్టర్‌: ఇదో రకమైన మురుగు నీటి శుద్ధి వ్యవస్థ. చిన్న గులకరాళ్లతో తయారుచేసిన బెడ్‌ లాంటి నిర్మాణం. దీనిపైకి మురుగు నీటిని ప్రవేశపెట్టినప్పుడు నీరు వడపోతకు గురై పరిశుభ్రమైన నీరుగా మారుతుంది.

రొటేటింగ్‌ బయలాజికల్‌ కాంటాక్టర్‌: వలయాకార ప్లాస్టిక్‌ ఫలకలు ఒకదాని పక్కన మరొకటి అమరి ఉంటాయి. వీటిపై మురుగు నీరు ప్రవేశించినప్పుడు సూక్ష్మజీవులు సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేస్తాయి.

తిరోగమన ద్రవాభిసరణ: ఇది నీటిలో కరిగి ఉన్న అవాంఛనీయ లవణాలను తొలగించే ప్రక్రియ. ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకు అయాన్లు, అణువులను రవాణా చేసి నీటిని శుద్ధి చేసే కార్యక్రమం.

అడ్వాన్స్‌డ్‌ సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌: ఇది యంత్రాల ద్వారా జరిగే నీటి శుద్ధి కార్యక్రమం. ఇదొక ఆధునిక మురుగు శుద్ధి ప్రక్రియ.


నీటి కాలుష్య నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు: 

* జల కాలుష్య నియంత్రణ చట్టం - 1974 

* గంగా కార్యాచరణ ప్రణాళిక - 1985 

* జాతీయ నదీ సంరక్షణ కార్యక్రమం - 1995 

* జాతీయ గంగానది పరీవాహక అథారిటీ - 2009 

* నమామి గంగే - 2015 - 22

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 23-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

నేల కాలుష్యం

 
భూసారం ఆగమాగం!

 

 


నేలలు సారాన్ని కోల్పోతున్నాయి. పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఆహార కొరత ఏర్పడుతోంది. అందరి ఆరోగ్యాలు పాడవుతున్నాయి. కారణం నేల కాలుష్యం. పరిశ్రమల విషపూరిత వ్యర్థాలను భూమిలోకి వదిలేస్తున్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. రేడియో ధార్మికాలను నేలలోకి నెట్టేస్తున్నారు. దీంతో మట్టి సహజత్వాన్ని కోల్పోయి హానికరంగా మారుతోంది. భూసారం ఆగమాగమైపోతోంది. అది అన్ని రకాల విపరిణామాలకు దారితీస్తోంది. పర్యావరణం అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఈ అంశాలను, నివారణ మార్గాలను తెలుసుకోవాలి. పలు రకాల పోటీ పరీక్షల్లో వాటిపై ప్రశ్నలు అడుగుతున్నారు. 

సహజ వనరుల్లో మృత్తికలు/నేలలు అత్యంత ప్రధానమైనవి. భూమిని ఆవరించి ఉన్న శిలావరణంపై జీవ సంబంధమైన పదార్థాలు, అనేక లవణాలు, రసాయనాలతో కూడిన వదులుగా ఉండే పొరను నేలగా పిలుస్తారు. నేలలో ఉన్న భౌతిక, రసాయనిక ధర్మాల ఆధారంగా ఎర్రనేలలు, నల్లనేలలు, ఒండ్రు నేలలు, పర్వతాలపై ఉండే లేటరైట్‌ నేలలు లాంటి ఎన్నో రకాలు భూగోళాన్ని ఆవరించి ఉంటాయి. మనిషికి ఆహారాన్ని ఇచ్చే పంటలు, అవసరాలు తీర్చే వృక్షాలు ఈ నేలల ఆధారంగానే వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. రాతిపై ఒక సెంటీమీటరు మందం ఉన్న మృత్తిక ఏర్పడాలంటే కనీసం 400 ఏళ్లు పడుతుందని ఒక అంచనా. అంత ప్రాముఖ్యం ఉన్న మృత్తికల్లో వివిధ రకాల వ్యర్థ పదార్థాలు కలవడంతో సహజ లక్షణాలను కోల్పోయి నేల కాలుష్యం లేదా భూకాలుష్యం జరుగుతోంది.


వ్యవసాయ, పారిశ్రామిక, గృహ సంబంధ వ్యర్థాలు; మురుగు నీరు, భార లోహాలు, ఘనపదార్థాలు నేలలో కలవడం వల్ల ఏర్పడే దాన్ని ధనాత్మక నేల కాలుష్యంగా పిలుస్తారు. అడవుల నరికివేత, పశువులు అతిగా మేత మేయడం, గనుల తవ్వకాలు, బ్లాస్టింగ్, మట్టి తవ్వకాలు, అశాస్త్రీయ వ్యవసాయ విధానాల కారణంగా నేల సహజ నిర్మాణం దెబ్బతినడం కూడా నేల కాలుష్యమే. దీన్ని రుణాత్మక నేల కాలుష్యం అంటారు.


నేల కాలుష్య కారకాలు


పారిశ్రామిక వ్యర్థాలు: ఆధునిక మానవుడి అభివృద్ధికి పరిశ్రమలే సోపానాలు. అయితే పరిశ్రమల నుంచి వెలువడే ఆమ్లాలు, క్షారాలు, విష సేంద్రియ పదార్థాలు, పాదరసం, సీసం, రాగి, జింక్, కాడ్మియం, సైనైడ్లు, థియోసైనేట్స్‌ లాంటి అనేక రసాయన పదార్థాలు నేలపై వ్యర్థాలుగా పడేయడం నేల కాలుష్యానికి ప్రధాన కారణం.


ఎరువులు, క్రిమిసంహారక మందులు: ప్రస్తుత వ్యవసాయ రంగంలో అధిక పంట దిగుబడికి ఎరువులు, పురుగుమందులు, కలుపు మొక్కల నివారిణులు, శిలీంధ్రనాశనుల వినియోగం తప్పనిసరిగా మారింది. వీటి అవశేషాలు నేలలో కలిసి నేల కలుషితంగా మారడమే కాకుండా భూగర్భ జలాల్లో చేరి మానవ మనుగడను దెబ్బతీస్తున్నాయి.


మానవ వినియోగ వ్యర్థాలు: గృహావసరాలకు లేదా వాణిజ్యపరంగా వినియోగించగా మిగిలిన వ్యర్థాలను నేలపై చెత్తకుప్పల దగ్గర పారవేయడంతో నేల కాలుష్యం పెరిగిపోతోంది.


ఉదా: పాలిథిన్‌ కవర్లు, ప్లాస్టిక్‌ బాటిళ్లు, గ్లాసులు, పేపరు వేస్ట్‌లు, గృహ నిర్మాణంలో మిగిలే కాంక్రీట్, మిగిలిన ఆహార పదార్థాలు లాంటివన్నీ కాలుష్య కారకాలే.


రేడియోధార్మిక వ్యర్థాలు: అణు విద్యుత్తు కేంద్రాలు, అణు రియాక్టర్ల నుంచి వెలువడిన యురేనియం, థోరియం లాంటి రేడియోధార్మిక పదార్థాలు, ద్రావణాలు నేలలో కలిసి భూమిని కలుషితం చేస్తుంటాయి.


జీవన సంబంధ కారకాలు: మానవులు, జంతువులు, పక్షుల మలమూత్రాలు నేలను చేరతాయి. ఈ విసర్జకాల్లో రోగకారక సూక్ష్మజీవులు ఉండటం వల్ల నేల కలుషితమవుతుంది. ఈ విధంగా నేల స్వభావాన్ని మార్చి మొక్కల వేర్లపై దాడి జరిగి పంటల సామర్థ్యం తగ్గుతుంది.


గనుల తవ్వకాలతో కాలుష్యం: ఇనుము, బొగ్గు లాంటి గనుల తవ్వకాలు జరిగినప్పుడు వెలువడే భారలోహ, కర్బన, ధూళి కణాలు నేల మీద పోగుపడి నేల కాలుష్యానికి దారిదీస్తాయి. ఇవి నేల గాఢతను మారుస్తాయి. దానివల్ల గనుల ప్రాంతాల్లో వ్యవసాయ ఫలసాయం తగ్గిపోతుంది.
 

వ్యర్థ పదార్థం నేలలో విచ్ఛిన్నానికి పట్టే కాలం (సుమారుగా)
కాగితం నెల
ఊలు ఒక సంవత్సరం
చెక్క 10-15 సంవత్సరాలు
తోలు వస్తువులు 50 సంవత్సరాలు
అల్యూమినియం వస్తువులు 100 సంవత్సరాలు
డిస్పోజబుల్‌ డైపర్స్‌ 500 సంవత్సరాలు
పాలిథీన్‌ క్యారీ బ్యాగులు లక్ష సంవత్సరాలు


నేల కాలుష్య ప్రభావాలు:


వ్యవసాయంపై: నేల కాలుష్యానికి గురైతే మొదట వ్యవసాయంపై ప్రభావం చూపుతుంది. వివిధ కాలుష్యాలతో నేలల సారం తగ్గిపోతుంది. తద్వారా పంట దిగుబడి తగ్గి ప్రజలకు ఆహార కొరత ఏర్పడుతుంది. నేలలో నైట్రోజన్‌ సార్ధకత, లవణాలు తగ్గుతాయి. నేల క్రమక్షయం పెరిగి చెరువులు, జలాశయాల్లో పూడిక చేరుతుంది.


ఆరోగ్యంపై: ప్రమాదకరమైన రసాయనాలు భూగర్భ జలాల్లో కలిసిపోతాయి. కొన్ని భార లోహాలు మొక్కల ద్వారా మానవ, జంతు శరీరాల్లోకి బయోమాగ్నిఫికేషన్‌ జరిగి వ్యాధులు వస్తాయి. వ్యర్థాలు కుళ్లి హానికర వాయువులు విడుదలై వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. రేడియోధార్మిక పదార్థాలు విడుదల చేసే కిరణాలు జీవుల మనుగడకు ప్రమాదకరంగా మారతాయి.


పర్యావరణంపై: నేల కాలుష్యం వల్ల వృక్ష సంపద తగ్గి పర్యావరణ అసమతౌల్యత ఏర్పడుతుంది. జీవజాతుల మధ్య సమగ్రత దెబ్బతింటుంది. ఆహార గొలుసులు విచ్ఛిన్నమవుతాయి.

నగరాలపై ప్రభావం: నగరాల్లోని వ్యర్థాల కారణంగా మురుగు నీటిపారుదల పెద్ద సమస్యగా మారుతుంది. జనాభా పెరగడం వల్ల  నగరపాలక సంస్థలకు వ్యర్థాల నిర్వహణ పెనుభారంగా మారుతుంది. నగరాల్లో మురికివాడలు పెరిగిపోతున్నాయి.

ఉదా: మన దేశంలో అతిపెద్ద మురికివాడ సెంట్రల్‌ ముంబయిలోని ధారావి ప్రాంతం. ఇది ప్రపంచంలోని పెద్ద మురికి వాడల్లో ఒకటి.


నివారణ మార్గాలు


* పురుగుమందుల వాడకాన్ని తగ్గించి వీటికి ప్రత్యామ్నాయంగా జీవామృతం, బీజామృతం లాంటి పర్యావరణ హితమైన క్రిమిసంహారిణులు వాడాలి.


రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సహజ ఎరువులు, వర్మీకంపోస్టు లాంటి ఎరువులు వినియోగించాలి.


* కలుపు మొక్కల నివారణ ఔషధాలను నియంత్రించి అవి మొక్కలు పెరగకుండా యాజమాన్య పద్ధతుల్లో మార్పు తీసుకురావాలి.


* పారిశ్రామిక విసర్జితాలను భూమిలోకి విడుదల చేయకుండా వాటిని శుద్ధి చేసి పునర్వినియోగంలోకి తీసుకురావాలి.


పారిశ్రామిక ప్రాంతాల్లో బఫర్‌ జోన్‌గా వృక్షాలను విరివిగా పెంచాలి.


పారిశ్రామిక వ్యర్థాల నుంచి రసాయనాలను తొలగించి భూమిలో చిన్న గుంతల్లో విడిచిపెట్టాలి.


గృహాల నుంచి వెలువడిన బయోగ్యాస్, బయోమాస్‌ లాంటి వ్యర్థాలను విద్యుత్తు ఉత్పత్తికి వినియోగించాలి.


* వినియోగ వ్యర్థాలను రీసైక్లింగ్‌ విధానంలో వినియోగించుకోవడం వల్ల నేలపై కాలుష్యాలను సమర్థంగా తగ్గించడం సాధ్యమవుతుంది.


* సూపర్‌ థర్మల్‌ కేంద్రాల నుంచి వెలువడిన బూడిదను (ఫ్లైయాష్‌) ఇటుకల నిర్మాణంలో వినియోగించవచ్చు.


* న్యూక్లియర్‌ రియాక్టర్ల నుంచి విడుదలైన రేడియోధార్మిక పదార్థాలను కాలుష్య రహిత పదార్థాలుగా చేయడంలో తగిన చర్యలు చేపట్టాలి.


మాదిరి ప్రశ్నలు

1. కాడ్మియం కాలుష్యం ఏ వ్యాధికి కారణం అవుతుంది?

 1) బ్లాక్‌ ఫుట్‌           2) మినమాటా 

3) మలేరియా           4) ఇటాయి-ఇటాయి 


2. బెంగాల్‌ మైదాన ప్రాంతాలు ప్రధానంగా ఏ భూకాలుష్యానికి గురవు తున్నాయి?

 1) కాడ్మియం    2) క్రోమియం    3) కాపర్‌    4) సీసం


3. భూకాలుష్యాల్లో సుదీర్ఘకాలం నిర్వీర్యం కాని వ్యర్థ పదార్థం ఏది?

1) ఖనిజోద్గ్రహణ వల్ల వెలువడే వ్యర్థాలు    2) అణుధార్మిక వ్యర్థం

 3) బయోమెడికల్‌ వ్యర్థాలు        4) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం


4. ఇటీవల జపాన్‌ ప్రభుత్వం ఏ మహా సముద్రంలోకి ఫుకుషిమా దైచి అనే అణు రియాక్టర్‌ నుంచి అణుధార్మిక వ్యర్థ జలాలను విడుదల చేస్తోంది?

1) పసిఫిక్‌ మహాసముద్రం        2) హిందూ మహాసముద్రం

3) అట్లాంటిక్‌ మహాసముద్రం        4) ఆర్కిటిక్‌ మహాసముద్రం


5. ఏ వ్యర్థాలు భూమిలో విచ్ఛిన్నం కావడానికి సుదీర్ఘకాలం పడుతుంది?

 1) అల్యూమినియం వస్తువులు    2) ఊలు వస్తువులు

  3) తోలు వస్తువులు        4) ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు


6. అశాస్త్రీయ వ్యవసాయ విధానాల వల్ల నేల సహజ నిర్మాణం దెబ్బతినడాన్ని ఏవిధంగా భావిస్తారు?

 1) రుణాత్మక నేల కాలుష్యం        2) ధనాత్మక నేలకాలుష్యం

 3) న్యూట్రల్‌ నేల కాలుష్యం        4) అసాధారణ నేలకాలుష్యం


7. కిందివాటిలో ప్రాథమిక కాలుష్యకాలు ఏవి?

  1) హైడ్రో కార్బన్లు  2) నైట్రేట్స్‌ 3) సల్ఫేట్స్‌  4) పైవన్నీ


8. హరిత విప్లవం సందర్భంలో పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అధికంగా రసాయన ఎరువులు వినియోగించడం వల్ల నేల కాలుష్యానికి గురై ఏర్పడిన నిస్సారమైన నేలలను ఏమని పిలుస్తారు?

1) రే నేలలు   2) కల్లార్‌ నేలలు   

3) ఉషర్‌ నేలలు   4) రకర్‌ నేలలు


9. నేల కాలుష్యం వల్ల ఏర్పడిన ప్రతిఫల కాలుష్యం ఏది?

1) వాయు కాలుష్యం  2) భూగర్భ జలాల కాలుష్యం

3) ఓజోన్‌ కాలుష్యం  4) జీవ కాలుష్యం


10. పరిశ్రమల నుంచి విడుదలయ్యే కణయుత కాలుష్యాన్ని తొలగించడానికి ఏ సాంకేతిక పద్ధతి సరైంది?

1) ఎలక్ట్రో డయాలసిస్‌   2) వెట్‌ స్క్రబ్బర్స్‌

3) ఫ్యాబ్రిక్‌ ఫిల్టర్స్‌  4) ఎలక్ట్రోస్టాటిక్‌ ప్రెసిపిటేటర్స్‌


సమాధానాలు

1-4; 2-1; 3-2; 4-1; 5-4; 6-1; 7-4; 8-1; 9-2; 10-4. 


 


రచయిత: జల్లు సద్గుణ
 

Posted Date : 04-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆ నగరం అత్యంత కలుషితం!


పర్యావరణ కాలుష్యం

ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పర్యావరణ కాలుష్యం ఒకటి. రోజు రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం మనిషి జీవనానికి మహా విపత్తుగా మారుతోంది. అనేక రకాల సవాళ్లను విసురుతోంది. ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కాలుష్యం రకాలు, కారకాలు, దాని వల్ల కలిగే రుగ్మతలు, నివారణ చర్యలపై పోటీ పరీక్షార్థులకు పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. దేశంలో కాలుష్యాన్ని కొలిచేందుకు ఉన్న ప్రమాణాలు, నియంత్రణకు జరుగుతున్న ప్రయత్నాలపై కూడా అవగాహన పెంచుకోవాలి. 

 ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 


1.    దేశంలో జాతీయ వాయు కాలుష్య సూచిక ఎప్పటినుంచి ప్రారంభమైంది?

    1) 2014  2) 2016  3) 2017  4) 2018


2.     2023లో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత కలుషితమైన నగరం ఏది?

1) న్యూదిల్లీ 2) కాన్పుర్‌ 3) హసన్‌ 4) అసోపుర్‌


3.     నీటి కాలుష్యాన్ని కొలవడానికి తొలిసారిగా ఏ దేశంలో బయోకెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీఓడీ)ను ఉపయోగించారు?

1) బ్రిటన్‌  2) అమెరికా  3) ఫ్రాన్స్‌  4) భారత్‌


4.     ఏ భారీ లోహ కాలుష్యం ద్వారా మనిషిలో ఇటాయి-ఇటాయి వ్యాధి సంభవిస్తుంది?

1) ఆర్సెనిక్‌     2) పాదరసం 

3) కాడ్మియం     4) మాంగనీస్‌


5.     ప్రపంచంలో అత్యధిక మోతాదులో ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను విడుదల చేస్తున్న దేశం- 

1) చైనా  2) అమెరికా   3) జపాన్‌  4) జర్మనీ


6.     సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) ముంబయి 2) న్యూదిల్లీ 3) చెన్నై 4) హైదరాబాద్‌


7.     హిమోగ్లోబిన్‌ తయారీని అడ్డుకునే భార లోహం-

1) పాదరసం 2) సీసం 3) మాంగనీస్‌ 4) బేరియం


8.     పారిస్‌ ఒప్పందంలో భాగంగా భారత్‌ తనవంతు చర్యలను తెలిపే Nationally Determined Contributions (NDCs) ను తొలుత ఎప్పుడు ప్రకటించింది?

1) అక్టోబరు 2, 2015    2) అక్టోబరు 2, 2014

3) అక్టోబరు 2, 2016     4) అక్టోబరు 2, 2017


9.     ఘన వ్యర్థాల సమస్యను తగ్గించడానికి కిందివాటిలో ఏ పద్ధతి మెరుగైంది?

1) చెత్త కుప్పలను కాల్చేయడం     2) పునర్వినియోగం (పునఃచక్రీయం)

3) సముద్రంలో పారవేయడం    4) ఒత్తిడి ద్వారా కుదించడం


10. దిల్లీలోని వాయు కాలుష్యానికి కిందివాటిలో ఏది ఎక్కువ కారణం?

1) రాజస్థాన్‌లో పంట కోసిన తర్వాత గడ్డి మోళ్లను తగలబెట్టడం

2) పంజాబ్‌లో పంట కోసిన తర్వాత మోళ్లను తగలబెట్టడం

3) పంజాబ్‌లో వంటచెరకు వాడకం

4) రాజస్థాన్‌లో వంటచెరకు వాడకం


11.    భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనకు కారణమైన విషవాయువు?

1) మిథైల్‌ ఐసో సయనైడ్‌    2) మీథేన్‌ ఐసో సయనైడ్‌

3) మిథైల్‌ ఐసో సయనేట్‌    4) మీథేన్‌ ఐసో సయనేట్‌


12. ‘ర్యాలీ ఫర్‌ రివర్స్‌’ (నదుల కోసం యాత్ర) అంటే ఏమిటి?

1) నదులను రక్షించేందుకు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ చేపట్టిన జాతీయ ఉద్యమం.

2) నదులను రక్షించేందుకు ఈశా ఫౌండేషన్‌ చేపట్టిన జాతీయ ఉద్యమం.

3) కేరళలోని వార్షిక బోటు ర్యాలీ

4) ‘నమామి గంగే’ కార్యక్రమం ద్వారా నదుల ప్రక్షాళనకు ప్రభుత్వం చేపట్టిన పథకం.


13. పారిస్‌ వాతావరణ మార్పు ఒప్పందం ప్రకారం భారతదేశం కర్బన ఉద్గారాల విషయంలో తన కోసం నిర్దేశించుకున్న దేశీయ నిర్ధారిత వాటా (INDC) ఎంత? 

1) 2030 నాటికి 2005 స్థాయి కంటే 33-35% తక్కువ 

2) 2020 నాటికి 1990 స్థాయి కంటే 20-25% తక్కువ

3) 2020 నాటికి 2000 స్థాయి కంటే 23-25% తక్కువ

4) 2030 నాటికి 1990 స్థాయి కంటే 15-20% తక్కువ 


14. భూమిపై ఓజోన్‌ పొరకు అతిపెద్ద రంధ్రం ఏ ప్రాంతంలో ఏర్పడింది?

1) ఆర్కిటిక్‌ ప్రాంతం     2) అంటార్కిటిక్‌ ప్రాంతం

3) భూమధ్యరేఖా ప్రాంతం    4) ఉత్తర అమెరికా


15. వ్యర్థాల పునర్‌ నిర్వహణలో ళిళిళిలు ఏవి?

1) తగ్గించడం, పునర్వినియోగం, పునఃచక్రీయం (Reduce, Reuse, Recycle)

2) సరిగ్గా, పునఃచక్రీయం, పునరుద్ధరణ (Right, Recycle, Revive)

3) సరిగ్గా, తొలగించడం, పునఃచక్రీయం (Right, Removes, Recycle)

4) తగ్గించడం, పునఃప్రేరేపం, పునఃచక్రీయం (Reduce, Reactive, Recyle)


16. కాలుష్య నివారణకు అతి సమర్థ సాధనం?

1) కాలుష్య పన్ను                  2) కాలుష్య ప్రోత్సాహం (సబ్సిడీ) 

3) నైతికంగా నచ్చజెప్పడం       4) సామాన్య న్యాయం


17. ‘కేటలిటిక్‌ కన్వర్టర్‌’ ఉపకరణాన్ని దేనిలో ఉపయోగిస్తారు? 

1) పాలిమర్‌ తయారీ కేంద్రం                2) న్యూక్లియర్‌ రియాక్టర్‌

3) ఆటోమొబైల్‌ ఎగ్జాస్ట్‌ యూనిట్‌-1        4) నీటిశుద్ధి ప్లాంటు 


18. బయోకెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ దేన్ని కొలుస్తుంది?

1) పారిశ్రామిక కాలుష్యం    2) వాయు కాలుష్యం

3) అకర్బన కాలుష్యం

4) సేంద్రియ వ్యర్థాలను డీకంపోజ్‌ చేసే సూక్ష్మజీవులకు కావాల్సిన కరిగి ఉన్న O2 


19. బొగ్గును పర్యావరణానికి అత్యంత హానికర కారకంగా పరిగణిస్తారు. ఎందుకంటే దాన్ని దహనం చేయడం వల్ల ఎక్కువ మోతాదులో వెలువడేది?

ఎ) బొగ్గుపులుసు వాయువు    బి) సల్ఫర్‌ డయాక్సైడ్‌

సి) నైట్రోజన్‌ ఆక్సైడ్‌             డి) మీథేన్‌

1) ఎ, డి         2) ఎ, బి, సి, డి    3) ఎ, బి, సి         4) ఎ, సి, డి 


20. కిందివాటిలో ఏ దేశానికి సొంతంగా గ్రీన్‌హౌస్‌ వాయువులను పర్యవేక్షించే ఉపగ్రహం లేదు?

1) యూఎస్‌ఏ       2) జపాన్‌        3) భారత్‌         4) చైనా


21. ‘కార్బన్‌ మోనాక్సైడ్‌’కి సంబంధించి కింద పేర్కొన్న వాటిలో సరైంది?

ఎ) మానవ శరీరంలో ఉత్పత్తి అవుతుంది.

బి) సికిల్‌సెల్‌ ఎనీమియా చికిత్సకు సహాయపడుతుంది.

సి) న్యూరో ట్రాన్స్‌మీటర్‌లా పనిచేస్తుంది.

1) ఎ, బి, సి     2) ఎ మాత్రమే 

3) ఎ, సి     4) సి మాత్రమే


22. కిందివాటిని జతపరచండి.

ఎ) గంగా కార్యాచరణ ప్రణాళిక 1) 1986
బి) వాయు (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం  2) 1974
సి) పర్యావరణ (సంరక్షణ) చట్టం 3) 1985
డి) జల (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం 4) 1980
  5) 1981

1) ఎ-2, బి-1, సి-5, డి-3              2) ఎ-2, బి-3, సి-5, డి-1

3) ఎ-3, బి-5, సి-1, డి-2              4) ఎ-3, బి-4, సి-1, డి-5


23. పెట్రోల్‌ యంత్రాల నుంచి విడుదలయ్యే ప్రధాన కాలుష్యాలు-

ఎ) కాల్చని హైడ్రోకార్బన్లు    బి) సల్ఫర్‌ డై ఆక్సైడ్‌

సి) కార్బన్‌ మోనాక్సైడ్‌   డి) సీసం (లెడ్‌)

సరైన జవాబును ఎంపిక చేయండి.

1) ఎ, బి, డి        2) ఎ, బి, సి            3) ఎ, సి, డి         4) ఎ, బి, సి, డి


24. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ మార్పులకు కారణమయ్యే గ్రీన్‌హౌస్‌ వాయువులు-

ఎ) కార్బన్‌ డైఆక్సైడ్‌       బి) మీథేన్‌

సి) క్లోరోఫ్లోరో కార్బన్‌లు     డి) ఆర్గాన్‌  ఇ) నీటిఆవిరి

సరైన జవాబులను ఎంపిక చేయండి.

1) బి, సి, డి        2) ఎ, బి, సి

3) ఎ, సి, ఇ       4) ఎ, బి, సి, ఇ


25. భూమి ఉపరితల ఉష్ణోగ్రత పెరగడానికి తోడ్పడే ‘గ్రీన్‌హౌస్‌ వాయువు’ ప్రధాన పాత్ర?

1) సూర్యకాంతి రావడానికి, ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ పోవడానికి పారదర్శకంగా ఉండటం.

2) సూర్యకాంతి రావడాన్ని, ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ పోవడాన్ని రెండింటినీ ఆపగలగడం.

3) ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ పోవడానికి తోడ్పడి, సూర్యకాంతి రావడాన్ని ఆపడం.

4) సూర్యకాంతి రావడానికి తోడ్పడి, ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ పోవడాన్ని ఆపడం.


26. కిందివాటిని జతపరచండి.

ఎ) చెర్నోబిల్‌ విపత్తు  1) పెరాక్సీ ఎసిటైల్‌ నైట్రేట్‌

బి) భోపాల్‌ విషాదం   2) క్లోరోఫ్లోరో కార్బన్‌లు

సి) ఓజోన్‌ రంధ్రం   3) రేడియోధార్మిక పదార్థాలు

డి) కాంతి రసాయన స్మాగ్‌  4) మిథైల్‌ ఐసోసైనేట్‌

1) ఎ-4, బి-3, సి-1, డి-2         2) ఎ-3, బి-4, సి-2, డి-1

3) ఎ-2, బి-1, సి-4, డి-3         4) ఎ-2, బి-4, సి-1, డి-3


27. కిందివాటిలో జీవక్షయం చెందని కాలుష్యకాలు ఏవి?

ఎ) క్లోరినేటెడ్‌ హైడ్రోకార్బన్‌ కీటక నాశకాలు

బి) పాలీ ఎథిలీన్‌ సంచులు

సి) మార్కెట్‌లో ఏర్పడే చెత్త, కుళ్లిన పండ్లు, కూరగాయలు

డి) మున్సిపల్‌ సీవేజ్‌ (మురుగు)

 పైవాటిలో సరైనవి గుర్తించండి.

1) ఎ, బి           2) ఎ, సి          3) బి, సి        4) సి, డి 


28. కిందివాటిలో కణయుత పదార్థాలు (Particulate matter)  అని వేటిని పిలుస్తారు?

ఎ) మసి                      బి) పొగ     

సి) దుమ్ము, ధూళి     డి) ఆస్బెస్టాస్‌ నారపోగులు

పైవాటిలో సరైనవి గుర్తించండి.

1) ఎ, బి         2) ఎ, బి, సి           3) బి, సి          4) ఎ, బి, సి, డి


29. కిందివాటిలో ‘మినమాటా’ వ్యాధికి కారణమైన కాలుష్యకం ఏది?

1) మెర్క్యురీ       2) కాడ్మియం        3) లెడ్‌        4) జింక్‌


30. కిందివాటిలో ఆమ్ల వర్షానికి కారణమైన వాయు కాలుష్యకాలు ఏవి?

1) కార్బన్‌ డయాక్సైడ్‌    2) కార్బన్‌ మోనాక్సైడ్‌

3) ప్రొపేన్‌                     4) నైట్రోజన్, సల్ఫర్‌ ఆక్సైడ్‌లు


31. తాగునీటిని శుభ్రం చేయడానికి ఉపయోగించే వాయువు ఏది?    

1) హీలియం            2) క్లోరిన్‌      

3) ఫ్లోరిన్‌                  4) కార్బన్‌ డయాక్సైడ్‌


32. కిందివాటిని జతపరచండి.

 కాలుష్యకం  వ్యాధి
1) ఆర్సెనిక్‌ ఎ) ఫ్లోరోసిస్‌
2) ఫ్లోరైడ్‌ బి). మెలనోసిస్‌
3) సిలికా ధూళి సి) ప్రెస్‌బైక్యూసిస్‌
4) శబ్దాలు డి) సిలికోసిస్‌

1) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి  2) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి

3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి     4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి

 

 


సమాధానాలు

11; 23; 31; 43; 51; 62; 72; 82; 92; 102; 113; 122; 131; 142; 151; 161; 173; 184; 193; 203; 211; 223; 233; 244; 254; 262; 271; 284; 291; 304; 312; 323.

 

రచయిత: ఇ.వేణుగోపాల్‌ 

 

 ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


 

Posted Date : 08-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఘన వ్యర్థ కాలుష్యం - నిర్వహణ

పోగుపడే వ్యర్థాలతో పొంచి ఉన్న ప్రమాదాలు!

 పర్యావరణ వ్యవస్థకు, మనిషి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిన వాటిలో ఘన వ్యర్థ కాలుష్యం ఒకటి. అభివృద్ధి పోకడలు, వస్తు వినియోగం, ఆహార వృథాతో వ్యర్థాలూ పెరిగిపోతున్నాయి. గాలి, నీరు, నేలలను కలుషితం చేస్తున్నాయి. పరిసరాలు దెబ్బతినడానికి, అంటువ్యాధులు ప్రబలడానికి ఈ పరిణామమే ప్రధాన కారణం. ప్లాస్టిక్, విద్యుత్తు, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల వంటివి మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు సవాలు విసురుతున్నాయి. సమస్త జీవజాలానికి సమస్యలు సృష్టిస్తున్న ఈ ఘన వ్యర్థాలు, వాటి మూలాలు, రకాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. వాటి నిర్వహణ, దుష్ప్రభావాలను తగ్గించగలిగే శాస్త్రీయ విధానాల గురించి అవగాహన పెంచుకోవాలి.

ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి, ఆధునిక జీవనశైలి అలవరుచుకుంటున్నారు. దాంతో వస్తు వినియోగం అధికమైంది. ‘ఉపయోగించు-పారవేయు’ పద్ధతిలోనే వస్తువులను తయారు చేస్తుండటంతో వాటి ఉత్పత్తి పెరుగుతోంది. ఫలితంగా ఘన వ్యర్థాల సమస్య అంతకంతకూ ఎక్కువవుతోంది. పట్టణ, నగర జనావాసాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ‘జాతీయ కాలుష్య నియంత్రణ బోర్డు’ నివేదిక ప్రకారం మన దేశంలో రోజుకు సుమారు 1.60 లక్షల టన్నుల వ్యర్థాలు పోగు పడుతున్నాయి. ఇందులో 95.4% సేకరిస్తున్నారు. అత్యధిక వ్యర్థాలు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నగరాలపరంగా దిల్లీ, ముంబయి, చెన్నై ముందంజలో ఉన్నాయి.


దుష్ప్రభావాలు: ఘనవ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోతే అనేక రకాల పర్యావరణ, ఆరోగ్య, ఆర్థికపరమైన దుష్ప్రభావాలు తలెత్తుతాయి.


* ఘనవ్యర్థాలు పోగుపడటం వల్ల భూ, జల వనరులు కలుషితమవుతాయి. ఫ్లోరిన్, పాదరసం, సీసం లాంటి భారలోహ కాలుష్యాలు మానవ ఆహార శృంఖలాల్లో జీవ ఆవర్తనం చెంది ప్రజలు ఫ్లోరోసిస్, డయేరియా, మతిభ్రమించడం లాంటి వ్యాధులకు గురవుతారు.


* ఘనవ్యర్థాలు కుళ్లి గాలి విషవాయువులతో దుర్గంధమై వ్యాధులు సంక్రమిస్తాయి.


* ఘనవ్యర్థాలు పేరుకుపోయి పరిసరాలు సహజ సౌందర్యాన్ని కోల్పోతాయి.


* ఎలుకలు, పందికొక్కులు లాంటి పరాన్నబుక్కులు ఎక్కువై సూక్ష్మజీవుల ప్రవాహకాలుగా మారి ప్లేగు తదితర వ్యాధులు విజృంభించడానికి కారణమవుతాయి.


* గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం స్థానిక సంస్థలకు ఆర్థిక భారంగా మారుతోంది.


ఘన వ్యర్థ మూలాలు


1) గృహసంబంధ వ్యర్థాలు: మున్సిపాలిటీలు, మెట్రో నగరాల్లో గృహ సంబంధ వ్యర్థాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వంటింట్లో మిగిలిన, పాడైన ఆహార పదార్థాలు, చిరిగిన దుస్తులు, కాగితం, లెదర్‌ లాంటి జీవక్షయం చెందే వస్తువులు/పదార్థాలు ఇందులో ఉంటాయి. ప్లాస్టిక్, పాలిథిన్, గ్లాసు, లోహ సంబంధమైన జీవక్షయం చెందని వస్తువులూ ఉంటాయి.


2) పారిశ్రామిక వ్యర్థాలు: ఇనుము, ఉక్కు, అల్యూమినియం కర్మాగారాలు; రబ్బరు, ప్లాస్టిక్, గాజు తయారుచేసే పరిశ్రమల్లో మిగిలిపోయిన వ్యర్థాలు; సిమెంట్‌ కర్మాగారాల నుంచి వెలువడే ఫ్లైయాష్‌ లాంటి పారిశ్రామిక ఘనవ్యర్థాలు భూమి, జలాలను కలుషితం చేస్తాయి.


3) రేడియోధార్మిక వ్యర్థాలు: యురేనియం, థోరియం మూలకాలను భూమి నుంచి వెలికి తీసినప్పుడు లేదా వాటిని శుద్ధి చేసినప్పుడు వెలువడే వ్యర్థాలను నీటిలో/భూమిలో కలపకూడదు. భూమి లోపల ప్రత్యేక జాలీల్లో భద్రపరచాలి.


4) మైనింగ్‌ వ్యర్థాలు: గనుల తవ్వకాల్లో, ఖనిజాల్లోని మలినాలు తొలగించినప్పుడు ఏర్పడిన స్లాగ్‌ కూడా భారీగా పోగుపడిన ఘన వ్యర్థమే. బొగ్గు, ఇనుప గనుల నుంచి వెలువడే ధూళి తీవ్రస్థాయి శ్వాసకోస వ్యాధులను కలగజేస్తుంది.


5) వ్యవసాయ సంబంధ వ్యర్థాలు: వ్యవసాయ రంగంలో ఉత్పత్తులను పెంచుకోవడానికి విచక్షణారహితంగా ఉపయోగిస్తున్న రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు నేల, నీటిపై పేరుకుపోతాయి. వీటివల్ల నేలలు నిస్సారంగా మారుతున్నాయి. జీవజాతులకు పలు అనారోగ్యాలకు గురవుతున్నాయి.


6) బయో మెడికల్‌ వ్యర్థాలు: ఆస్పత్రుల్లో వాడేసిన సిరంజీలు, సెలైన్‌ బాటిళ్లు, బ్యాండేజీలు, బ్లేడ్‌లు, రక్తవ్యర్థాలు లాంటి వాటిని బయోమెడికల్‌ వ్యర్థాలు అంటారు. ఘన వ్యర్థాలన్నింటిలో ఇవి చాలా హానికరమైనవి. వీటిని సరైన పద్ధతిలో నిర్వహించాలి.


7) ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌: కాలం చెల్లిన, పాడైపోయిన కంప్యూటర్లు, టెలివిజన్లు, ప్రింటర్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఉపయోగించే విషపూరిత రసాయనాలు; లోహ సంబంధ భాగాల ద్వారా చేరిన వ్యర్థాలను ఈ-వేస్ట్‌ లేదా ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌ అంటారు. వీటి నుంచి ఆర్సెనిక్, బేరియం, కాడ్మియం, కోబాల్ట్, సీసం, పాదరసం, జింక్‌ లాంటి హానికర మూలకాలు విడుదలై తిరిగి మానవ జీవనంపై దుష్ప్రభావం చూపుతాయి.


8) కెమికల్‌ వేస్ట్‌: వినియోగించని ఔషధాలు, నెయిల్‌ పాలిష్‌ టిన్నులు, పెర్‌ఫ్యూమ్‌ బాటిళ్లు, టాయిలెట్‌ కెమికల్స్, కాస్మోటిక్‌ వ్యర్థాలు లాంటి వాటిని కెమికల్‌ వేస్ట్‌ అంటారు. ఈ రసాయన మూలకాల వ్యర్థాల వల్ల హాని కలుగుతుంది. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా ప్రభావానికి గురవుతారు.


ఘన వ్యర్థాల నిర్వహణ: ఇది మున్సిపాలిటీలకు భారంగా మారుతోంది. వ్యర్థాలను సేకరించడం, తరలించడం, నిల్వ చేయడం ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారుతోంది. అయితే కొన్ని నిర్వహణ విధానాల ద్వారా వాటి దుష్ప్రభావాన్ని తగ్గించవచ్చు.


వ్యర్థాలను వేరుచేసే ప్రక్రియ: వ్యర్థ పదార్థాలను సేకరించినప్పుడే తడి, పొడి చెత్తను వేరు చేయాలి. ఆ తర్వాత అందులోని జీవక్షయం చెందే తడి చెత్తను గుంతలు తీసి పూడ్చివేయాలి. ఇది క్రమంగా కుళ్లిపోయి ఎరువుగా మారుతుంది. ఈ విధానం వల్ల చెత్త పరిమాణం తగ్గించుకోవచ్చు.


5 R విధానం: ఘన వ్యర్థాల నిర్వహణకు ఇది అత్యంత శాస్త్రీయమైన పద్ధతి. ఈ విధానంపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలి.


1) Refuse -  చెత్త వేయకూడదు.


2) Reduce - చెత్త ఉత్పత్తిని తగ్గించుకోవాలి


3) Re-use - నీళ్ల సీసాలు, ప్యాకింగ్‌ మెటీరియల్స్‌ లాంటివి తిరిగి ఉపయోగించుకోవాలి.


4) Re-purpose - ఇతర ప్రయోజనాలకు ఉపయోగించాలి.


ఉదా: మెటల్‌ క్యాన్లు, బకెట్‌లను మొక్కలు పెంచుకోవడానికి వాడాలి.


5) Recycle - వ్యర్థాలను పునఃచక్రీయం చేయాలి.


ఉదా: కాగితం, ప్లాస్టిక్, లోహాలు, గాజు లాంటి వ్యర్థాలతో పరిశ్రమల ద్వారా తిరిగి కొత్త వస్తువులు తయారుచేయాలి.

పల్వరైజేషన్‌: సేకరించిన వ్యర్థాలను గ్రైండింగ్‌ మిషన్స్‌ ద్వారా ముక్కలు చేసి వాటి భౌతిక స్వరూపాన్ని, పరిమాణాన్ని మార్చే విధానం. ముక్కలైన వ్యర్థాలు రుచి, లక్షణాలు మారి కీటకాలను ఆకర్షించలేని విధంగా తయారవుతాయి. ఈ పదార్థాలను గుంతల్లో పూడ్చవచ్చు. అయితే ఈ ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది.


లోతట్టు ప్రాంతాల్లో పూడ్చవచ్చు: జీవక్షయం కాని, పునర్వినియోగానికి, పునఃచక్రీకరణకు పనికిరాని వ్యర్థాలను లోతట్టు ప్రాంతాల్లో మట్టితో కప్పివేయాలి. దీన్ని ల్యాండ్‌ ఫిల్లింగ్‌ అంటారు.


సముద్రాలకు దూరంగా పారబోయడం: ప్రపంచంలో సముద్రాల్లోకి అత్యధికంగా వ్యర్థాలను విడుదల చేస్తున్న దేశాల్లో చైనా, భారత్‌ ముందంజలో ఉన్నాయి. ఇది జలచరాలకు అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. తీర ప్రాంత పట్టణాల్లోని చెత్తను తీరానికి 20 కి.మీ. దూరంలో, 30 మీటర్ల లోతైన ప్రాంతాల్లోకి తరలించాలి.


ఉపాధి సృష్టి: జీవక్షయం చెందే వ్యర్థాలను కంపోస్ట్‌ చేయడం ద్వారా ఎరువు, మీథేన్‌ వాయువును ఉత్పత్తి చేయవచ్చు. వ్యర్థాన్ని వానపాముల చర్య ద్వారా వర్మికంపోస్ట్‌గా మార్చొచ్చు. ఆస్పత్రి సంబంధ వ్యర్థాలను 800 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద వేడి చేసి ‘ఇన్సినరేషన్‌’ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు.


బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణ

ఎ) తెలుపు రంగు డబ్బాలు: సూదులు, బ్లేడ్లు వేయాలి.


బి) నీలి రంగు డబ్బాలు: గాజు సీసాల వ్యర్థాలు వేయాలి.


సి) పసుపు రంగు డబ్బాలు: జంతు, మానవ, ప్రయోగశాలల వ్యర్థాలు; శరీర ద్రవాలు వేయాలి.


డి) ఎరుపు రంగు డబ్బాలు: సిరంజీలు, సెలైన్‌ బాటిళ్లు, ట్యూబ్‌లు, క్యాథటర్స్‌ లాంటివి వేయాలి.

 

ఈ-వేస్ట్‌ నిర్వహణ: కాలం చెల్లిన, ఉపయోగంలో లేని ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్‌ సంబంధ వ్యర్థాలను ఈ-వేస్ట్‌ అంటారు. అసోచామ్‌ గ్రూప్‌ నివేదిక ప్రకారం మన దేశం ఏటా 20 లక్షల టన్నుల ఈ-వేస్ట్‌ ఉత్పత్తితో ప్రపంచంలో అయిదో స్థానంలో ఉంది. దేశంలో ఈ-వేస్ట్‌ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర, నగరం ముంబయి.


ఈ-వేస్ట్‌లు మూడు రకాలు 


1) White Goods: పాడైపోయిన వాషింగ్‌ మిషిన్లు, గ్రైండర్లు, రిఫ్రిజిరేటర్లు.

 

2) Brown Goods:వాణిజ్య సముదాయాలు, గృహాల నుంచి ఉత్పత్తయ్యే పాడైపోయిన టెలివిజన్లు, కెమెరాలు.

 

3) Grey Goods: ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల్లోని పాడైపోయిన కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు, మొబైల్‌ ఫోన్లు.

 

రచయిత: జల్లు సద్గుణరావు

 

Posted Date : 25-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గ్లోబల్‌ వార్మింగ్‌ (భూతాపం)

భూగోళం భగభగ!

ఏటేటా ప్రపంచం అంతటా ఉష్ణోగ్రతలు తీవ్రమైపోతున్నాయి. వేసవిలో వడగాలులు, శీతాకాలంలో చలితీవ్రత అంతకంతకు అధికమవుతూ జీవుల మనుగడకు సవాలు విసురుతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు ఏర్పడి పర్యావరణ సమతౌల్యత ప్రమాదంలో పడిపోతోంది. నదులతో పాటు సముద్రాల్లోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువై జలచరాలు, భూమిపై కొన్ని సున్నిత జీవజాతులు అంతరించిపోతున్నాయి. తుపాన్లు, వరదలు, దుర్భిక్షంతో మానవ జీవనం రోజురోజుకూ దుర్భరమైపోతోంది. ఇన్ని అనర్థాలకు కారణం భూగోళ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమే. మనిషి విపరీత చర్యలతో తలెత్తుతున్న ఈ భూతాపానికి ప్రధాన కారణాలు, వాటి పర్యవసానాలు, నివారణ చర్యలపై పరీక్షార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.

వేసవికాలం పెరిగిపోయి ఎండలు మండిపోతున్నాయి. శీతాకాలం తగ్గిపోయి రుతువులు క్రమం తప్పుతున్నాయి. అకాల వర్షాలతో వరదలు, వర్షాభావ పరిస్థితులతో కరవు కాటకాలు వంటి పరిస్థితులను శీతోష్ణస్థితి మార్పులుగా అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. వాటి ప్రభావం భూమిపై అన్ని ప్రాంతాల్లో స్పల్ప నుంచి తీవ్రస్థాయికి చేరినట్లు అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. శీతోష్ణస్థితి మార్పుల అధ్యయనానికి వరల్డ్‌ మెటిరియోలాజికల్‌ ఆర్గనైజేషన్‌ (WMO), యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రోగ్రామ్‌(UNEP) సంయుక్త ఆధ్వర్యంలో 1988లో జెనీవా వేదికగా ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌(IPCC)ను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ఇచ్చిన వివరాల ప్రకారం ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతలు 1.80Cనుంచి  40C వరకూ పెరగవచ్చని అంచనా. సాధారణంగా భూగోళం సగటు ఉష్ణోగ్రత 15.4oC ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత పెరగడాన్ని గ్లోబల్‌ వార్మింగ్‌ (భూగోళం వేడెక్కడం లేదా భూతాపం)గా పిలుస్తారు.


సూర్యుడి నుంచి నిరంతరం బయటకు వెలువడే సౌరశక్తిని సౌర వికిరణం అంటారు. ఇందులో చాలా తక్కువ పరిమాణంలో శక్తి భూమిని చేరుతుంది. ఈ సౌరశక్తిని సూర్యపుటం అంటారు. దీని ద్వారా భూమి వేడెక్కిన తర్వాత కొంత శక్తిని భూమి నుంచి పరారుణ కిరణాల రూపంలో, దీర్ఘ తరంగాలుగా వాతావరణం తిరిగి తీసుకుంటుంది. దీనినే భూవికిరణం అంటారు. మానవ కార్యకలాపాల వల్ల వాతావరణంలోకి విడుదలవుతున్న కార్బన్‌ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్‌ ఆక్సైడ్‌ లాంటి హరిత గృహ వాయువులు భూవికిరణాన్ని అడ్డుకుని తిరిగి భూమి వేడెక్కడానికి కారణమవుతున్నాయి. ఈ విధంగా భూవికిరణం వల్ల భూమి చల్లబడటానికి బదులు తిరిగి భూవాతావరణం వేడెక్కడాన్ని గ్లోబల్‌ వార్మింగ్‌ లేదా భూతాపంగా పిలుస్తారు.


అతిశీతల వాతావరణంలో పెరగడానికి అనుకూలంగా లేని సున్నిత మొక్కలను ఆకుపచ్చని గాజు గదిలో పెంచినప్పుడు లోపలి వేడి పైకి వెళ్లకుండా కాపాడి మొక్కల పెరుగుదలకు సహకరించినట్లు గ్రీన్‌హౌస్‌ వాయువులు కూడా భూమి చుట్టూ వేడిని పెంచుతాయి. అయితే ఈ హరితగృహ వాయువులు పెరిగే కొద్దీ భూగోళ సగటు ఉష్ణోగ్రతలు అధికమై క్రమంగా గ్లోబల్‌ వార్మింగ్‌కు దారితీస్తుంది. దీనినే హరితగృహ ప్రభావం అంటారు. హరితగృహ వాయువు ఉద్గారాల్లో ఇంధన రంగం నుంచే అధికంగా విడుదలవుతున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌కు ప్రధానంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ (72%), మీథేన్‌ (21%), నైట్రస్‌ ఆక్సైడ్‌ (7%) కారణమవుతున్నాయి.

కర్బన ఉద్గారాలను అధికంగా విడుదల చేస్తున్న దేశాలు: 1) చైనా (29.18%), 2) అమెరికా (14.02%), 3) ఇండియా (7.09%), 4) రష్యా (4.65%).


గ్రీన్‌హౌస్‌ ఘన కారకాలు:

1) బ్లాక్‌ కార్బన్‌: ఇది వాతావరణాన్ని వేడి చేసే ఘన స్థితిలోని  ప్రధాన కాలుష్యం, వాతావరణంలోని పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ లేదా ఏరోసాల్‌. దీనినే మసి (Sooty) గా పిలుస్తారు. ఇది కార్బన్‌డై ఆక్సైడ్‌ తర్వాత వాతావరణాన్ని వేడెక్కించే రెండో ప్రధాన కారకం. జీవ సంబంధ పదార్థాలు/బొగ్గు/పెట్రోలియం అసంపూర్తిగా మండినప్పుడు బ్లాక్‌ కార్బన్‌ ఎక్కువగా విడుదలవుతుంది. సూర్యుడి నుంచి భూమి గ్రహించిన సౌరశక్తికి, భూమి వెనుకకు పంపిన భూవికిరణానికి మధ్య నిష్పత్తిని తెలియజేసే అల్బిడో సామర్థ్యాన్ని ఇది తగ్గిస్తుంది. అంటే బ్లాక్‌ కార్బన్‌ సౌర వికిరణాన్ని ఎక్కువగా గ్రహించి మంచు ప్రాంతాల్లో నిక్షిప్తం చేస్తుంది. దాంతో హిందూ కుష్, హిమాలయాల్లో గ్లేసియర్స్‌ హెచ్చు పరిమాణంలో కరిగిపోతున్నాయి.

2) బ్రౌన్‌ కార్బన్‌: ఆర్గానిక్‌ ఏరోసాల్స్‌నే బ్రౌన్‌ కార్బన్‌ అంటారు. కర్ర, పంట అవశేషాలు; బొగ్గు, పిడకలు లాంటి జీవసంబంధ పదార్థాలను మండించినప్పుడు ఏర్పడతాయి. ఇవి కూడా వాతావరణంలోకి చేరి గ్లోబల్‌ వార్మింగ్‌కు కారణమవుతాయి.

 

గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల నష్టాలు:

* భూమి చుట్టూ వేడి అధికమవడంతో ధ్రువాల్లో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయి. దాంతో మాల్దీవులు లాంటి కొన్ని దీవులు సముద్రంలో మునిగిపోతాయి. 

* సైబీరియా భూభాగంలో కప్పి ఉన్న శాశ్వత మంచుపొర అయిన ‘ఫెర్మాప్రాస్ట్‌’ కరిగిపోతే అందులోని మీథేన్‌ వాయువు విడుదలై భూతాపాన్ని మరింత పెంచుతుంది.

* వ్యవసాయ దిగుబడులు తగ్గి ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది.

* వరదలు, సునామీలు, టోర్నడోలు, తుపాన్లు లాంటి విపత్తులు మరింత విరుచుకుపడతాయి. 

* అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొన్నిరకాల సూక్ష్మజీవుల వ్యాప్తి ఎక్కువై సంక్రమణ వ్యాధులు పెరుగుతాయి.

* హిమనీనదాలు త్వరగా కరిగిపోయి గంగానది లాంటి కొన్ని నదుల్లో స్వల్పకాల వ్యవధిలో వరదలు వస్తాయి. ఈ పరిస్థితి దీర్ఘకాలంలో దుర్భిక్షానికి దారితీస్తుంది.

* వాతావరణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ అధికమైన కొద్దీ సముద్రపు నీటిలో దాని మోతాదు కూడా పెరుగుతుంది. సముద్రపు నీటిలో కార్బానిక్‌ ఆమ్లం ఎక్కువై నీటి ఆమ్లత్వం పెరుగుతుంది. దీనినే ‘ఓషన్‌ ఎసిడిఫికేషన్‌’ అంటారు. ఫలితంగా సముద్ర జీవవైవిధ్యం దెబ్బతింటుంది.

 

గ్లోబల్‌ వార్మింగ్‌ నియంత్రణ వ్యూహాలు:

1) కార్బన్‌ ట్రేడింగ్‌ విధానం: హరిత విధానాన్ని అనుసరించే వర్ధమాన, పేద దేశాల్లోని పరిశ్రమలు తమ ప్రాజెక్టుల నుంచి తగ్గించే ప్రతి టన్ను కార్బన్‌ డై ఆక్సైడ్‌కు ఒక కార్బన్‌ క్రెడిట్‌ను పొందుతాయి. ఆ విధంగా సంపాదించిన పాయింట్లను అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలు నిర్ధారించిన కర్బన వాయు ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను చేరుకోలేనప్పుడు వర్ధమాన దేశాలు విక్రయించే ఈ కర్బన క్రెడిట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఏటా జరిగే కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ ్బదివీశ్శి సదస్సుల్లో ఈ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను నిర్ణయిస్తుంటారు.

2) కార్బన్‌ శోషక విసర్జిత విధానం: దీన్నే కార్బన్‌ శోషక నిల్వ విధానం అంటారు. వాతావరణంలో పరిమితికి మించి చేరిన కర్బన ఉద్గారాలను తగిన సాంకేతిక విధానం ద్వారా సేకరించి సముద్రాలు, అడవులు, ఎండిపోయిన ముడిచమురు బావులు, తవ్వకాలు చేపట్టని, మిగిలిపోయిన గనులు లాంటి ప్రాంగణాల్లో నిల్వ చేస్తారు. లేదా భూగర్భంలో పాతిపెడతారు.

3) జీవసంబంధ కార్బన్‌ శోషక విధానాలు: వృక్ష జాతులు కిరణజన్య సంయోగక్రియ ద్వారా కార్బన్‌ను గ్రహించి కార్బోహైడ్రేట్స్‌గా మార్చి తమలో విలీనం చేసుకుంటాయి. దీనినే గ్రీన్‌ కార్బన్‌ శోషకం అంటారు. అడవులను పెంచడం వల్ల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు. తీర ప్రాంతాలు, మంచి నీటి ప్రాంతాల్లో పెరిగే మాంగ్రూవ్, సర్గోసా, నాచు లాంటి జలావరణ వ్యవస్థలో పెరిగే వృక్షజాతులు వాతావరణం, సముద్రాల్లోని కార్బన్‌ను తొలగించి వాటిని నిల్వ చేసుకుంటాయి లేదా వాటి నేల అడుగున సహజ ప్రక్రియ ద్వారా నిక్షిప్తం చేస్తాయి. దీన్నే బ్లూకార్బన్‌ శోషక విధానం అంటారు. గ్లోబల్‌ వార్మింగ్‌ తగ్గించడానికి తీర ప్రాంత ఆవరణ వ్యవస్థను పెంచాలి.

4) కార్బన్‌ ట్యాక్స్‌ విధానం: కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి అనుసరించే అత్యంత సమర్థ విధానమిది. ఇందులో కార్బన్‌ డయాక్సైడ్‌ను విడుదల చేసే పరిశ్రమలు, మైనింగ్‌ సంస్థలు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలకు కర్బన పన్ను (కార్బన్‌ ట్యాక్స్‌) విధిస్తారు. ఈ విధంగా చేయడాన్ని Cap and Trade అంటారు. దీనివల్ల ఉత్పిత్తిదారులను కర్బన ఉద్గారాలను వెదజల్లే ఇంధన వినియోగం నుంచి కర్బన రహిత ఇంధనాల వినియోగం వైపు మళ్లించవచ్చు.

5) జియో ఇంజినీరింగ్‌: ఇదొక ప్రయోగాత్మక నూతన సాంకేతిక విధానం. భూమి వైపు ప్రసరించే సౌర వికిరణ పరిమాణాన్ని తగ్గించడానికి అంతరిక్షంలో గ్లాస్‌ రూమ్‌ను ఏర్పాటు చేయడం, సల్ఫేట్‌ ఏరోసాల్స్‌ను స్ట్రాటోస్ఫియర్‌లోకి పంపించడం ద్వారా ఆ ప్రాంతాన్ని తెల్లగా చేయవచ్చు. నివాసాల పైకప్పులకు వైట్‌వాష్‌ చేయడం, ఇనుము సంబంధిత ప్లేట్స్‌ను సముద్రంలో ఉంచడం ద్వారా ఆల్గే లాంటి నాచు మొక్కలు ఒక చోట ఎక్కువగా పెరిగే విధంగా చూడవచ్చు. ఈ తరహా సాంకేతిక విధానాలను గ్లోబల్‌ వార్మింగ్‌ నియంత్రణకు అనుసరిస్తారు. అధిక సాంకేతికత గ్లోబల్‌ వార్మింగ్‌కు కారణమైతే, అత్యాధునిక సాంకేతికతతో దాన్ని నివారించాల్సిన అవసరం ఉంది.

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 05-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శీతోష్ణ మార్పులు

ప్రకృతి రక్షణ కవచాలకు తూట్లు!

 


చెట్ల ఆకుల్లో పచ్చదనం తగ్గిపోతోంది. ఎండిపోయి రాలిపోతున్నాయి. పంటచేలు బీడుబారి, వ్యవసాయ ఉత్పత్తులు క్షీణిస్తున్నాయి. చారిత్రక కట్టడాల్లో పగుళ్లు ఏర్పడుతున్నాయి. జలాశయాల్లో ఆమ్లత్వం పెరిగి జీవరాశులు అంతరించిపోతున్నాయి. ఇవన్నీ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల సంభవించే విపరిణామాలు. మనిషి ఆధునిక జీవన విధానంతో శీతోష్ణస్థితిపై పడుతున్న ప్రభావం వల్ల పర్యావరణానికి కలుగుతున్న హాని, దుష్ఫలితాలు, వాటి నివారణ చర్యల గురించి పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు, నిర్వహించిన సదస్సులు, చేసిన నిర్ణయాలపై అవగాహన పెంచుకోవాలి. 

ఒక భౌగోళిక ప్రాంతంలో గాలిలోని తేమ, ఉష్ణోగ్రత, మేఘాలు, పవనాలు, వర్షపాతం లాంటి వాతావరణ అంశాలను దీర్ఘకాలంలో సగటుగా తీసుకుని శీతోష్ణస్థితిగా పేర్కొంటారు. భూమిపై జీవరాశి అవతరించిన నాటి నుంచి వాటికి శీతోష్ణస్థితితో అన్యోన్యత కొనసాగుతూనే ఉంది. అయితే గత రెండు శతాబ్దాల నుంచి మనిషి సున్నిత, యాంత్రికమైన జీవితం వల్ల కలుషిత వాయువులు గాలిలోకి విడుదలై వికృతీకరణ జరుగుతోంది. ఫలితంగా ఆమ్లవర్షాలు, ఓజోన్‌ పొర క్షీణత లాంటి శీతోష్ణ మార్పులు ఏర్పడి జీవజాతుల మనుగడకు ప్రమాదంగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత, జీవనోపాధి, సుస్థిర అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి.


ఆమ్ల వర్షాలు: థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గును మండించినప్పుడు విడుదలైన సల్ఫర్‌ డయాక్సైడ్, వాహనాల నుంచి విడుదలవుతున్న నైట్రోజన్‌ ఆక్సైడ్, అగ్నిపర్వత విస్ఫోటాల ద్వారా బయటపడిన సల్ఫర్, నైట్రోజన్‌ వాయువులు వాతావరణంలోని తేమ, కాంతితో రసాయన చర్య జరుపుతాయి. ఇవి వెంటనే సల్ఫ్యూరిక్‌ ఆమ్లం, నత్రికామ్లం, హైడ్రోక్లోరిక్‌ ఆమ్లంగా మారి వర్షపు నీటితో కలిసి భూమిని చేరతాయి. ఆ విధంగా కురిసిన వర్షాలను ఆమ్ల వర్షాలు అంటారు. ఒక శతాబ్దం క్రితమే ఇంగ్లండులోని మాంచెస్టర్‌ నగరంలో ఆమ్ల వర్షాలను మొదటిసారిగా గుర్తించారు. అప్పట్లో ఈ సమస్య తీవ్రతను అంతగా పట్టించుకోలేదు. తర్వాత అది పెనుసవాలుగా మారింది. మన దేశంలో మొదటి ఆమ్ల వర్షాన్ని 1974లో ముంబయిలో గుర్తించారు. ఆమ్ల వర్షం అనే పదాన్ని మొదట 1852లో స్కాట్‌లాండ్‌కు చెందిన రాబర్ట్‌ అంగస్‌ స్మిత్‌ అనే రసాయన శాస్త్రవేత్త ఉపయోగించారు.


ఆమ్ల వర్షాల ప్రభావం:

* మొక్కల్లో పత్రహరితం క్షీణించి పంటల ఉత్పాదకత తగ్గుతుంది.


* మానవుల్లో నాడీవ్యవస్థ దెబ్బతింటుంది. శ్వాస సంబంధ వ్యాధులు, చర్మ క్యాన్సర్‌లు వస్తాయి.


* నేలలో ఆమ్లత్వం పెరిగి నిస్సారంగా మారతాయి.


* జలాశయాల్లో ఆమ్లత్వం పెరిగి ఆల్గల్‌ బ్లూమ్‌ ఎక్కువగా వ్యాపిస్తుంది. దాంతో బ్యాక్టీరియాలు నశించి, జీవులకు ఆక్సిజన్‌ అందక జలచరాలూ చనిపోతాయి.


* అడవుల్లో ఈ వర్షాలు కురిసినప్పుడు సున్నితమైన కోనిఫెరస్‌ లాంటి వృక్షజాతులు నశించిపోతాయి.


* తాజ్‌మహల్‌ లాంటి చారిత్రక కట్టడాలు కళావిహీనమై, పగుళ్లు, గుంతలు లాంటి స్టోన్‌ లెప్రసీకి గురవుతున్నాయి.


ఆమ్ల వర్షాల ప్రభావాన్ని తగ్గించే చర్యలు


* ఆమ్లత్వం కలిగిన నీటిని, దానిలో గాఢతను నియంత్రించడానికి కాల్షియం ఆక్సైడ్, కాల్షియం కార్బొనేట్‌ రూపంలో సున్నాన్ని కలపాలి.


* సల్ఫర్‌ తక్కువగా ఉండే ఇంధనాలను వాడాలి. బొగ్గును మండించినప్పుడు అందులోని సల్ఫర్‌ని తొలగించాలి.


* శిలాజ ఇంధనాలకు బదులుగా సౌర, పవన, తరంగ ఆధారిత శక్తిని, హైడ్రోజన్‌ లాంటి హరిత ఇంధనాలను వినియోగించాలి.


* కలుషిత వాయువులను ఎక్కువగా విడుదల చేసే యంత్రాలను నవీకరించాలి.


* సల్ఫర్, నైట్రోజన్‌లను ఆధునిక సాంకేతికతను వినియోగించి హానిరహిత వాయువులుగా మార్చాలి.

ఓజోన్‌ క్షీణత: O3 రూపంలో లేత నీలిరంగులో ఉండే ఓజోన్‌ భూమి ఉపరితలం నుంచి రెండో వాతావరణ పొర అయిన స్ట్రాటో ఆవరణంలో విస్తరించి ఉంటుంది. దీనిని 1913లో ఫ్రెంచి భౌతిక శాస్త్రవేత్తలు ఛార్లెస్‌ ఫాబ్రి, హెన్రీ బుయేసన్‌ కనుక్కున్నారు. ఓజోన్‌ ధర్మాలను జి.ఎమ్‌.బి.డాబ్సన్‌ అనే బ్రిటిష్‌ శాస్త్రవేత్త వివరించాడు.ఓజోన్‌ పొర మందాన్ని ‘డాబ్సన్‌ యూనిట్‌’లలో కొలుస్తారు. అందుకు వినియోగించే పరికరాన్ని ‘డాబ్సన్‌ ఓజోన్‌ స్పెక్ట్రో ఫొటో మీటర్‌’ అంటారు. ఓజోన్‌ పొర స్ట్రాటో ఆవరణంలో 25-35 కి.మీ. ఎత్తులో 90% కేంద్రీకృతమై ఉంటుంది. మిగిలిన 10% ట్రోపో ఆవరణంలో విస్తరించి ఉంటుంది. ఓజోన్‌ పొర సూర్యుడి నుంచి వస్తున్న సౌర వికిరణంలో శక్తిమంతమైన అతినీలలోహిత కిరణాలను వడపోసి, శక్తిని మాత్రమే భూమి పైకి పంపిస్తుంది. అందువల్ల ఓజోన్‌ పొరను భూమికి రక్షణ కవచం అంటారు.ఓజోన్‌ పొర క్షీణతకు ప్రధాన కారణం రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్లు, కంప్యూటర్లు, ప్లాస్టిక్, ఫోమ్‌ల నుంచి విడుదలవుతున్న క్లోరోఫ్లోరో కార్బన్లు (CFC). ఈ ఫ్రియాన్‌ వాయువులకు అత్యధిక స్థిరత్వం ఉండటంతో ఓజోన్‌ను ఎక్కువగా నాశనం చేస్తున్నాయి. ఒక క్లోరిన్‌ పరమాణువు రెండేళ్లపాటు స్ట్రాటో ఆవరణంలో ఉండి O3 ని క్షీణింపజేస్తుంది. పరిశ్రమలు, ఎరువుల కర్మాగారాల నుంచి విడుదలయ్యే నైట్రస్‌ ఆక్సైడ్‌ కూడా ఓజోన్‌ను హరింపజేస్తుంది. మంటలార్పడానికి ఉపయోగించే బ్రోమిన్‌ విడుదల చేసే బ్రోమో ఫ్లోరో కార్బన్లు (BFC) క్లోరిన్‌ కంటే మరింత సమర్థంగా ఓజోన్‌ పైన ప్రభావం చూపిస్తాయి. బెలూన్ల ద్వారా డాబ్సన్‌ ఓజోన్‌ స్పెక్ట్రో ఫొటో మీటర్‌ను పంపించడం ద్వారా తెలుసుకున్న వివరాల ప్రకారం 1970 నుంచి యూరప్‌పై 8% ఓజోన్‌ క్షీణించింది. అంటార్కిటికాపైన ఓజోన్‌కు పెద్ద రంధ్రం ఏర్పడింది. ఇప్పటివరకు భూమి ఉపరితలంపై సరాసరిగా 4% ఓజోన్‌ క్షీణించినట్లు తేలింది.

ఓజోన్‌ క్షీణత - ప్రభావాలు: 

* 4% ఓజోన్‌ తగ్గడం వల్ల 3% అతినీలలోహిత కిరణాలు భూమిని చేరుతున్నాయి. వీటి వల్ల మానవుల్లో కార్సినోమా, మెలనోమా అనే క్యాన్సర్లు వస్తున్నాయి.


* రక్తనాళాల్లో రక్తప్రవాహ రేటు పెరిగి, చర్మం ఎర్రబారి బొబ్బలు ఏర్పడుతున్నాయి.


* ల్యూకేమియా (బ్లడ్‌ క్యాన్సర్‌), స్త్రీలలో రొమ్ము క్యాన్సర్లు వస్తున్నాయి. కంటి సంబంధ వ్యాధులు కలుగుతున్నాయి.  


* డీఎన్‌ఏ ప్రభావితమై రోగనిరోధక శక్తి తగ్గుతోంది.


* మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ రేటు, పత్రాల్లో పత్రహరితం తగ్గి త్వరగా రాలిపోతున్నాయి. దాంతో ఉత్పాదకత, వృక్షసంపద తగ్గుతోంది.


* జీవ ఎరువుల్లో ఉపయోగించే సయనో బ్యాక్టీరియా అతినీల లోహిత కిరణాల వల్ల క్షీణించి పంట దిగుబడి తగ్గిపోతుంది. 


* ఓజోన్‌ పొర పలుచగా మారడం వల్ల భౌగోళిక ఉష్ణోగ్రతలు అధికం కావడంతో పాటు ధ్రువాల్లో మంచు కరిగి సముద్రనీటి మట్టం పెరుగుతుంది. ఆ విధంగా జరిగితే అనతికాలంలోనే మాల్దీవులు లాంటి ద్వీప దేశాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. 


ఓజోన్‌ క్షీణత అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు


వియన్నా కన్వెన్షన్‌: ఆస్ట్రియా రాజధాని వియన్నాలో 1985లో జరిగిన సమావేశంలో ఓజోన్‌ క్షీణతకు సంబంధించి పలు సూచనలతో ఒప్పందం రూపొందింది. దీనిపై భారత్‌ సహా 20 దేశాలు సంతకాలు చేశాయి.


మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఒప్పందం: కెనడాలోని మాంట్రియల్‌ నగరంలో 1987లో జరిగిన అంతర్జాతీయ ఒప్పందాన్ని 197 దేశాలు ఆమోదించాయి. దీనిపై 1992లో మనదేశమూ సంతకం చేసింది. 2000 నాటి కల్లా ప్రపంచవ్యాప్తంగా క్లోరోఫ్లోరో కార్బన్ల వినియోగాన్ని నిలిపేయాలని ఈ ప్రోటోకాల్‌లో నిర్ణయించారు. ఈ సమావేశం జరిగిన సెప్టెంబరు 16వ తేదీని ‘అంతర్జాతీయ ఓజోన్‌ దినోత్సవం’గా పాటించాలని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. దీని ఆధ్వర్యంలో ‘గ్లోబల్‌ క్లైమేట్‌ అబ్జర్వింగ్‌ సిస్టమ్‌’, ‘వరల్డ్‌ వెదర్‌ వాచ్‌’ సంస్థలు పనిచేస్తుంటాయి. ఇవి ప్రపంచ శీతోష్ణ మార్పులపై వివరాలను సేకరిస్తాయి.


లండన్‌ సదస్సు: క్లోరోఫ్లోరో కార్బన్‌లకు ప్రత్యామ్నాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని, అభివృద్ధి చెందిన దేశాలు ఆ పరిజ్ఞానాన్ని తృతీయ ప్రపంచ దేశాలకు బదిలీ చేయాలని 1992లో లండన్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు వీటిని పూర్తిగా నిషేధించాయి. 2030 కల్లా ఓజోన్‌ క్షీణతకు కారణమైన హైడ్రో ఫ్లోరో కార్బన్ల విడుదలను పూర్తిగా నియంత్రిస్తామని భారత్‌ ప్రకటించింది. ఈ మేరకు క్లోరోఫ్లోరో కార్బన్లకు బదులుగా 134-ఎ పదార్థాన్ని తయారుచేసి రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్లలో ఉపయోగిస్తున్నారు.


కిగాలి ఒప్పందం: హైడ్రో ఫ్లోరో కార్బన్లను నియంత్రించడమే లక్ష్యంగా 2016, అక్టోబరులో రువాండా రాజధాని కిగాలిలో ఒప్పందం కుదిరింది. ఇది మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ ఒప్పందానికి జరిగిన సవరణ. క్లోరోఫ్లోరో కార్బన్లకు బదులుగా హైడ్రో ఫ్లోరో కార్బన్లు వాడిన దేశాలకు కూడా నష్టాన్ని వివరించి, నిషేధించాల్సిందిగా ఒప్పందం చేశారు. ఈ సమావేశంలో 197 దేశాలు పాల్గొన్నాయి. సభ్యదేశాలను మూడు గ్రూపులుగా విభజించారు. భారత్‌ను వీటిలో 3వ గ్రూప్‌లో చేర్చారు. ఓజోన్‌ పొర పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక సమావేశాలు, ఒప్పందాలు జరుగుతూనే ఉన్నప్పటికీ వాటి అమలులో చిత్తశుద్ధి కరవవుతోంది. ప్రతి దేశం సామాజిక బాధ్యతతో మెలిగి ఒప్పంద నియమాలను అమలుచేస్తేనే ప్రపంచానికి మేలు జరుగుతుంది.


 

రచయిత: జల్లు సద్గుణరావు


 

 

Posted Date : 16-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ ఉద్యమాలు

రక్షించు.. పెంచు.. ఉపయోగించు!

 

 

ఆధునిక ప్రగతి పేరుతో పర్యావరణానికి కలిగిస్తున్న హానికి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో ప్రజలు ఉద్యమించారు. భావితరాల భద్రతకు, సుస్థిరాభివృద్ధికి పోరాటాలు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను హత్తుకొని కాపాడుకున్నారు. పాలకులను ఎదిరించి ఎందరో ప్రాణాలను పోగొట్టుకున్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరిగిన అలాంటి ఉద్యమాలు, వాటి సారథులు, ప్రజా భాగస్వామ్యం, నైతిక మద్దతు, సాధించిన ఫలితాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.

 

ప్రకృతి వనరులను అవసరం మేరకు వినియోగించుకుంటూ, కొంత భావితరాలకు మిగిల్చే సుస్థిర అభివృద్ధి విధానాలకు వ్యతిరేకంగా అపరిమిత ప్రగతి ధ్యేయంతో భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారు. అభివృద్ధితో పాటు పెరుగుతున్న కాలుష్య కారకాలు, నేల క్రమక్షయం, ఆమ్ల వర్షాలు, గ్లోబల్‌ వార్మింగ్, ఓజోన్‌ క్షీణత లాంటి సమస్యలకు కారణమవుతున్నాయి. ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టినప్పటికీ తగిన ఫలితాలు ఉండటం లేదు. ఈ నేపథ్యంలో భూగోళ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అనేక ఉద్యమాలు జరిగాయి. 1962లో అమెరికాలోని సిల్వర్‌స్ప్రింగ్‌ ప్రాంతంలో పంట తెగుళ్ల నివారణకు డి.డి.టి. పురుగుమందులు ఎక్కువగా వినియోగించారు. అందులోని అవశేషాలు పంట మొక్కల్లో జీవ సాంద్రీకృతమై పర్యావరణాన్ని ఏ విధంగా దెబ్బతీశాయో ‘రేచల్‌ కార్సన్‌’ అనే ప్రపంచ పర్యావరణవేత్త ‘సైలెంట్‌ స్ప్రింగ్‌’ అనే పుస్తకంలో వివరించారు. ఇదే ఒరవడిలో భారతదేశంలో పలు పర్యావరణ ఉద్యమాలు పుట్టుకొచ్చాయి.


బిష్ణోయి ఉద్యమం: ఇది భారతదేశంలో తొలి పర్యావరణ ఉద్యమంగా చరిత్రకెక్కింది. 1730లో రాజస్థాన్‌లోని జోథ్‌పుర్‌ జిల్లాలో ఖెజార్లీ/ఖెజాడ్లి గ్రామానికి చెందిన ఉద్యమం. బిష్ణోయి జాతి (కమ్యూనిటీ) ప్రజలకు ఖేజ్రీ వృక్షాలు చాలా పవిత్రమైనవి. అయితే అప్పటి మార్వాడీ పాలకుడు మహారాజా అభయ్‌ సింగ్‌ ఆదేశంతో సైనికులు ఖేజ్రీ వృక్షాలను నరికేయడానికి సిద్ధమయ్యారు. అమృతాదేవి నాయకత్వంలో బిష్ణోయి ప్రజలు చెట్లను కౌగిలించుకుని సైనికులు వాటిని  నరకకుండా అడ్డుకున్నారు. దాంతో సైనికులు అమృతాదేవితో పాటు 363 మందిని నరికివేశారు. నిశ్చేష్టుడైన రాజు వెంటనే బిష్ణోయి గ్రామాల్లో చెట్లు నరకకుండా నిషేధం విధించాడు.


చిప్కో ఉద్యమం: చిప్కో అంటే చెట్లను హత్తుకోవడం అని అర్థం. చిప్కో ఉద్యమకారులు చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తూ, వాటిని హత్తుకుంటూ ఉద్యమం చేశారు. సుందర్‌లాల్‌ బహుగుణ, గౌరీదేవి, చండీప్రసాద్‌ బట్‌ మొదలైనవారు నాయకత్వం వహించారు. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా 1964లో ఏర్పాటుచేసిన ‘దశోలి గ్రామ స్వరాజ్య మండల్‌’ ఈ ఉద్యమానికి నాంది పలికింది. 1927లో ఆంగ్లేయులు చేసిన అటవీ చట్టంలోని ఆంక్షలను వ్యతిరేకిస్తూ 1930లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని తిలారి ప్రాంతంలో భారీ ఊరేగింపు జరిగింది. ఈ సందర్భంగా 17 మంది సామాన్య ప్రజలను రాజ సైనికులు చంపేశారు. క్రమక్రమంగా ఈ ఉద్యమం బలపడి 1970 నాటికి చిప్కో ఉద్యమంగా మారింది. 1974 నుంచి గిరిజన మహిళలు గౌరీదేవి నాయకత్వంలో చెట్లను నరకకుండా రేయింబవళ్లు కాపలా కాశారు. 1980 నాటికి హిమాలయ అడవుల్లో చెట్లు నరకడాన్ని నిషేధించడంతో చిప్కో ఉద్యమం విజయం సాధించింది.


సైలెంట్‌ వ్యాలీ రక్షణ ఉద్యమం: సైలెంట్‌ వ్యాలీ అనేది కేరళలో పలక్కాడు జిల్లాలోని ఒక ఉష్ణమండల సతతహరిత అటవీ ప్రాంతం. 1973లో కేరళ ప్రభుత్వం ఈ ప్రాంతం మీదుగా ప్రహిస్తున్న కుంతిపూజ నదిపై జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టింది. దీనివల్ల ఆ ప్రాంతం పర్యావరణం దెబ్బతింటుందని, అనేక రకాల మొక్కలు, జంతువులు ముఖ్యంగా అరుదైన సింహం తోక ఉండే కోతులు అంతరించిపోతాయని శాస్త్ర సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో ఉద్యమం ప్రారంభమైంది. చివరికి 1985లో ఆ ప్రాంతాన్ని ‘సైలెంట్‌  వ్యాలీ నేషనల్‌ పార్కు’గా ప్రకటించారు.


అప్పికో ఉద్యమం: అడవుల సంరక్షణ కోసం చిప్కో ఉద్యమం తరహాలోనే కర్ణాటకలోని ఉత్తర కన్నడ ప్రాంతంలోని సాల్కానిలో 1983లో ఈ ఉద్యమం మొదలైంది. కన్నడంలో ‘అప్పికో’ అంటే కౌగిలించుకోవడం అని అర్థం. పాండురంగ హెగ్డే దీనికి నాయకత్వం వహించారు. ఈ ప్రాంతంలో 81% అడవులు విస్తరించి ఉన్నాయి. అయితే ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కొన్ని కాగితం, కలప తయారీ పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ గ్రామ పిల్లలు, పెద్దలు చెట్లను హత్తుకుని కాంట్రాక్టర్ల బారి నుంచి వాటిని రక్షించారు. ఈ ఉద్యమం నినాదం ‘రక్షించు, పెంచు, హేతుబద్ధంగా ఉపయోగించు’.


జంగిల్‌ బచావో ఆందోళన: బిహార్‌ ప్రభుత్వం 1980లో అడవుల్లో ఉండే సాల్‌ వృక్షాల స్థానంలో టేకు వృక్షాలు పెంచాలని ప్రయత్నిచడంతో సింగ్‌బమ్‌ జిల్లాకు చెందిన గిరిజనులు సాల్‌ వృక్షాలను నరకకుండా వాటిని హత్తుకుని నిరసన తెలియజేశారు. ఈ ఉద్యమం క్రమంగా ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు విస్తరించింది.


ఝార్ఖండ్‌ జంగిల్‌ బచావో ఉద్యమం: జీవనోపాధి అందించే అటవీ వనరులను సంరక్షించుకోవడానికి, వారి పోడు వ్యవసాయ విధానాలను కొనసాగించడానికి ఝార్ఖండ్‌లోని ఆదివాసీ తెగలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగించిన ఉద్యమం. దీని తీవ్రతను గుర్తించిన భారత ప్రభుత్వం 2006లో అటవీ భూములపై గిరిజనుల హక్కులను గుర్తిస్తూ ‘అటవీ హక్కుల చట్టం’ రూపొందించింది.


బీస్‌-నౌ ఉద్యమం:  శ్రీ జంబేశ్వర్‌ అనే మత గురువు పర్యావరణ పరిరక్షణకు 29 సూత్రాలను ప్రతిపాదించారు. అందువల్ల దీనికి బీస్‌-నౌ ఉద్యమం అని పేరొచ్చింది. ఈ ఉద్యమం ఉద్దేశం పంజాబ్, సింధు ప్రాంతాల్లో విస్తరించిన థార్‌ ఎడారి ప్రాంత వృక్ష, జంతుజాలాల రక్షణ, పర్యావరణ పరిరక్షణ. ఈ సూత్రాల ఆరోగ్య పరిరక్షణ, సామాజిక పరివర్తన, దేశభక్తిని ప్రబోధించడం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం, పశుసంవర్థక పెంపుదలకు సంబంధించినవి. అవి తర్వాత కాలంలో అమృతాదేవి నాయకత్వంలో జోథ్‌పుర్‌లో బిష్ణోయి ఉద్యమానికి ప్రేరణగా నిలిచాయి.


గంగా పరిరక్షణ ఉద్యమం: గంగానది స్వచ్ఛత కోసం సాధువులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు ప్రారంభించిన గాంధియన్‌ అహింసా ఉద్యమం. స్వామి నిగమానంద సనంద్‌ లాంటి సాధువులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగాలు చేశారు. ఈ ఉద్యమానికి గంగాసేవా అభియాన్‌ లాంటి సంస్థలు మద్దతుగా నిలిచాయి. భారత ప్రభుత్వం గంగా నదిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు చేరకుండా ‘అవిరళ్‌’ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. అవిరళ్‌ అంటే హిందీలో కొనసాగని అని అర్థం. అంటే గంగానదిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు చేరకుండా నదీ ప్రవాహం కొనసాగాలని చేపట్టిన ప్రాజెక్టు.


నర్మదా బచావో ఆందోళన: నర్మదా నది మధ్యప్రదేశ్‌లో పుట్టి మహారాష్ట్ర, గుజరాత్‌ మీదుగా ప్రయాణిస్తూ చివరగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నది పగులు లోయ ద్వారా ప్రయాణిస్తుంది. దీనిపై గుజరాత్‌ ‘సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌’తో పాటు అనేక బహుళార్థ సాధక ప్రాజెక్టులు నిర్మించాలని తలపెట్టినప్పుడు ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల్లో పర్యావరణానికి హాని కలుగుతుందని 1985 నుంచి మేధా పాట్కర్‌ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతోంది. ఈమెతో పాటు బాబా ఆమ్టే, అరుంధతిరాయ్‌ లాంటి ప్రముఖులు కూడా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. మేధా పాట్కర్‌ ఏర్పాటు చేసిన సంస్థ నర్మదా థరన్‌గ్రస్త్‌ సమితి. ఈ ఉద్యమం కోసం చేసిన కృషికి ఫలితంగా మేధాపాట్కర్‌కు 1991లో స్వీడన్‌కు చెందిన రైట్‌ లైవ్లీ హుడ్‌ అవార్డు లభించడం విశేషం.


నవధాన్య ఉద్యమం: జీవ వైవిధ్య సంరక్షణకు, సేంద్రియ వ్యవసాయానికి రక్షణ కల్పిస్తూ, జన్యు సాంకేతిక పరిజ్ఞానానికి వ్యతిరేకంగా 1982 నుంచి ఈ ఉద్యమం ప్రారంభమైంది. సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆహార భద్రతలో ప్రముఖ పాత్ర వహించే నవధాన్యాల పేరుతో ఉద్యమం రూపొందింది. ఇదొక ఎన్జీవో సంస్థ. దీని స్థాపకురాలు వందనా శివ. ఈ సంస్థ ఆధ్వర్యంలో దేశంలో దాదాపు 50కి పైగా విత్తన నిల్వల బ్యాంకులను స్థాపించారు. వేలమంది రైతులకు శిక్షణ ఇచ్చి సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించారు.


కోయల్‌కరో ఉద్యమం: ఇది కోయల్‌ కరో జలవిద్యుత్తు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఝార్ఖండ్‌లోని కోయల్‌ - కరో బేసిన్‌లో ముండా, బరావన్‌ తెగలు జరిపిన ఉద్యమం. ఈ ఉద్యమంలో భాగంగా ‘కామ్‌ రోకో అభియాన్‌’ను ప్రారంభించారు. ఇది భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన ఉద్యమంగా నిలిచింది.


నందిగ్రామ్‌ రసాయన ఫ్యాక్టరీ వ్యతిరేక ఆందోళన: ఆర్థిక మండళ్ల ఏర్పాటులో భాగంగా కోల్‌కతా సమీపంలో నందిగ్రామ్‌ ప్రాంతంలో ఇండొనేసియీ కంపెనీ రసాయన ఫ్యాక్టరీ ఏర్పాటుకు 10 వేల ఎకరాల భూసేకరణ సందర్భంలో 2007లో జరిగిన ఆందోళన.


అవతార్‌ ఉద్యమం: ఒడిశాలో గనుల తవ్వకానికి వేదాంత కంపెనీకి అనుమతి ఇచ్చిన సందర్భంలో అక్కడి కొండ తెగలవారు వారి కులదైవమైన అవతార్‌ పేరున పర్యావరణాన్ని, వారి జీవన వనరులను పరిరక్షించుకోవడానికి చేసిన ఉద్యమం


సింగూర్‌-టాటా నానో ఫ్యాక్టరీ వివాదం: పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో టాటా నానో ఫ్యాక్టరీ స్థాపనకు భూముల సేకరణ వివాదాస్పదమైంది. తృణమూల్‌ పార్టీ అధినేత మమతా బెనర్జీ వ్యవసాయ భూమి పరిరక్షణ అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేశారు. అరుంధతీ రాయ్, అనురాధ తల్లావో, మేధాపాట్కర్‌ మద్దతు ప్రకటించారు. చివరికి ఆ కంపెనీ గుజరాత్‌లోని ఆనంద్‌ ప్రాంతానికి తరలివెళ్లింది.


కూడంకుళం అణు విద్యుత్తు ప్రాజెక్టు వివాదం: తమిళనాడులోని కూడంకుళం వద్ద నిర్మించ తలపెట్టిన అణువిద్యుత్తు ప్రాజెక్టు వల్ల అక్కడి మత్స్యకారులు జీవనోపాధి కోల్పోవడమే కాకుండా రేడియో ధార్మిక విషవాయువులు ఆరోగ్యానికి హానికరమనే ఆందోళనలతో ఈ ఉద్యమం జరిగింది.


సోంపేట ఉద్యమం: శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలంలో బీల భూముల్లో థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మించడానికి నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి ఏపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అయితే అక్కడి రైతులు, గ్రామస్థులు తమ జీవనోపాధి పోతుందని, అక్కడ విశాలంగా విస్తరించి ఉన్న కొబ్బరి తోటలు నాశనమవుతాయని, పర్యావరణపరంగా నష్టం జరుగుతుందని తిరుగుబాటు చేశారు. 2009, డిసెంబరు 5న రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. పోలీస్‌ కాల్పులు కూడా జరిగాయి. చివరికి ప్రభుత్వం ఆ నిర్మాణాన్ని విరమించింది.


కాజెన్‌ట్రిక్స్‌ వ్యతిరేక ఉద్యమం: కర్ణాటకలో మంగుళూరు ప్రాంతంలోని నందకూరులో నిర్మించబోయే థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్‌కు వ్యతిరేకంగా గ్రామస్థులు ఉద్యమించారు. 


ఈ విధంగా దేశంలో అనేక సందర్భాల్లో పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, పర్యావరణాన్ని, తమ జీవనోపాధిని కాపాడుకోవడానికి చేసిన ఉద్యమాలు ఎనలేని ప్రజామోదాన్ని పొందాయి.


రచయిత: జల్లు సద్గుణరావు
 

Posted Date : 14-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలు

భావితరాల క్షేమం కోరే ప్రగతి సుస్థిరం!

ప్రకృతి సిద్ధంగా లభించిన వనరులను అభివృద్ధి పేరుతో ఎన్నో దేశాలు విచ్చలవిడిగా వినియోగించుకుంటున్నాయి. స్వార్థం, తాత్కాలిక ప్రయోజనాల కోసం భవిష్యత్తు తరాల ఉనికిని ప్రమాదంలో పడేస్తున్నాయి. దీని పర్యవసానంగా పర్యావరణ క్షీణత, భూతాపం పెరిగిపోయి సమస్త మానవాళి దుష్పరిణామాలను ఎదుర్కొంటోంది. ప్రకృతి బాగుంటేనే మనిషి బాగుంటాడని, భవిష్యత్తు తరాల ప్రయోజనాలకు విఘాతం లేకుండా ప్రస్తుత అవసరాలను తీర్చేదే అసలైన అభివృద్ధి అన్న స్పృహ ఇప్పుడిప్పుడే క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు అమలుచేస్తున్న పర్యావరణ అనుకూల విధానాల గురించి పోటీ పరీక్షల అభ్యర్థులకు అవగాహన ఉండాలి. వనరులను సమర్థంగా వినియోగించుకునే పద్ధతులు, ఆధునిక పునరుత్పాదక వనరులు, వాటి ప్రయోజనాలు, జీవన నాణ్యతను పెంచే పరిణామాలను తెలుసుకోవాలి.

 

ప్రస్తుత ప్రజల కనీస అవసరాలు తీరుస్తూ భవిష్యత్తు తరాలకు వనరులను మిగిల్చే విధంగా, వాటిని వివేకవంతంగా (జ్యుడీషియస్‌ యుటిలైజేషన్‌) వినియోగిస్తూ సాధించే అభివృద్ధినే ‘సుస్థిరాభివృద్ధి’ అంటారు. అంటే భావితరాల అవసరాలను విస్మరించకుండా ఇప్పటి అభివృద్ధి ఉండాలని అర్థం. అయితే మానవ సంక్షేమాన్ని పెంపొందించుకోవడానికి అభివృద్ధి ఒక్కటే సరిపోదు. పర్యావరణ సంరక్షణతో కూడిన వనరుల వినియోగం, పునఃకల్పనల మధ్య సమతౌల్యతను ఏర్పరిచి అభివృద్ధి కొనసాగిస్తే నిజమైన సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది. పెరుగుతున్న జనాభా అవసరాల కోసం సహజ వనరులను పరిమితికి మించి వినియోగించడం వల్ల భూ, జలవనరులు; వాతావరణం కలుషితమై అనేక పర్యావరణ సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ సుస్థిరాభివృద్ధి సాధించడం అవసరంగా మారింది. సమగ్ర అభివృద్ధి సాధించడానికి వివిధ నూతన పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలను ఆయా రంగాల్లో అనుసరిస్తున్నారు.

సేంద్రియ వ్యవసాయం: వ్యవసాయ పంటలు, పశుసంపదలో ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచుకోవడానికి పర్యావరణానికి హాని చేసే రసాయనిక పురుగు మందులు, ఎరువులు, జన్యుమార్పిడి జీవులు, వృద్ధి హార్మోన్లను ఇటీవల ఉపయోగిస్తున్నారు. వీటి స్థానంలో పర్యావరణానికి అనుకూలమైన జీవ ఎరువులను వినియోగించి చేసే వ్యవసాయ విధానాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. సేంద్రియ వ్యవసాయ పితామహుడిగా ‘సర్‌ ఆల్బర్ట్‌ హూవార్డ్‌’ని పిలుస్తారు. మన దేశంలో సిక్కింను మొదటి సేంద్రియ వ్యవసాయ (ఆర్గానిక్‌ ఫార్మింగ్‌) రాష్ట్రంగా ప్రకటించారు. ఈ తరహా వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకే ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ సంస్థ’ను స్థాపించారు.


జీవ ఎరువులు: పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భూసారాన్ని పెంచే సూక్ష్మజీవులు, వాటి మిశ్రమాన్ని జీవ ఎరువులు అంటారు. ఈ సూక్ష్మజీవులు మొక్కలతో సహజీవనం చేస్తూ పంటకు కావాల్సిన అనేక పోషకాలను అందజేస్తాయి. వీటిలో పలు రకాలున్నాయి.


ఉదా: 

* జనుము, సుబాబుల్‌ చెట్ల ఆకులు, కొమ్మలను ఎరువుగా వాడుకునే హరిత ఎరువు.

 * నాస్టాక్, అనబీనా లాంటి నీలి ఆకుపచ్చ శైవలాలు. 

* వేరు బుడిపెల్లో నివసించే రైజోబియం, స్వేచ్ఛాయుత నత్రజని స్థాపన జరిపే అజటోబాక్టర్, క్లాస్ట్రీడియం లాంటి బ్యాక్టీరియాలు.

* ఎత్తయిన మొక్కల వేర్లపై పెరిగి భూమి నుంచి ఫాస్ఫేట్లు, సల్ఫేట్లు, కాపర్, జింక్, ఇనుము లాంటి పోషకాలను మొక్కలకు అందించే శిలీంధ్రాలు జీవ ఎరువులుగా ఉపయోగపడతాయి.

* వరి పంట పొలాల్లో జీవ ఎరువుగా వాడే మొక్క ‘అజొల్లా లేదా టెరిడోఫైట్‌’.


జీవ క్రిమిసంహారాలు: పర్యావరణానికి హానిచేసే రసాయన క్రిమిసంహారాల స్థానంలో పర్యావరణ అనుకూల క్రిమిసంహారాలను వినియోగించడాన్ని జీవ క్రిమిసంహారాలు అంటారు. పంట మొక్కలు, ఉత్పత్తులను నష్టపరిచే తెగుళ్లు, క్రిమికీటకాలు, కీటక డింభకాలను అరికట్టే క్రిమిసంహారిణులను; మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు లాంటి ప్రకృతిపరమైన వాటి నుంచి తీసే ఉత్పత్తులను జీవ క్రిమిసంహారాలు అంటారు.


ఉదా: పత్తి పంటను నష్టపరిచే బోల్‌వార్మ్‌ నివారణకు వాడే బాసిల్లస్‌ తురింజియెన్సిస్‌ లాంటి బ్యాక్టీరియాలు, విరిడే కుటుంబానికి చెందిన వైరస్‌లు, బావేరియా బాసియానా, ట్రైకోడెర్మా లాంటి శిలీంధ్రాలు; కలుపు మొక్కల నివారిణిగా ఉపయోగించే యూకలిప్టస్‌ నూనె, టమాట పంటలో కీటక నాశినిగా ఉపయోగించే లెగ్యూమ్‌ జాతి మొక్కల వేర్ల నుంచి తయారుచేసిన రొటెనాన్‌ లాంటి ఉత్పత్తులను జీవ క్రిమిసంహారాలుగా వాడటం వల్ల పర్యావరణ కాలుష్యం, బయోమాగ్నిఫికేషన్‌ జరగదు.


పునరుత్పాదక ఇంధన వనరులు: వాడేకొద్దీ తిరిగి పునరుత్పత్తి చెందే సామర్థ్యం ఉన్న కాలుష్య రహితమైన ఇంధన వనరులను పునరుత్పత్తి ఇంధన వనరులు అంటారు. కాలుష్య కారకాలైన బొగ్గు, పెట్రోలియం, షెల్‌ గ్యాస్‌ లాంటి సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో పునరుత్పాదక ఇంధన వనరులైన సౌరశక్తి, పవనశక్తి, సముద్ర అలలశక్తి, సముద్ర పోటు-పాట్ల శక్తి, భూతాప శక్తి, హైడ్రోజన్‌ ఇంధనశక్తి లాంటివి వినియోగించడం పర్యావరణ అభివృద్ధికి దోహదం చేస్తుంది.


జీవ ఇంధనాల వాడకం: ఇంధన వనరుల్లో కాలుష్య రహితమైన, తక్కువ ఖర్చుతో కూడిన, సుస్థిరాభివృద్ధిని పెంపొందించేవి జీవ ఇంధన వనరులు. జీవ వ్యర్థాలను నేరుగా మండించడం లేదా సూక్ష్మజీవుల సమక్షంలో కిణ్వన ప్రక్రియకు గురిచేయడం ద్వారా శక్తిని పొందే వనరులను జీవ ఇంధనాలు అంటారు. ప్రపంచంలో అత్యధికంగా పశుసంపద భారతదేశంలోనే ఉండటం, ప్రధానంగా వ్యవసాయ దేశం కావడంతో జీవ ఇంధనాల ఉత్పత్తికి కావాల్సిన జీవ వ్యర్థాలు బాగా లభిస్తాయి. భారత ప్రభుత్వం 2018లో కొత్త జీవ ఇంధన విధానాన్ని ప్రకటించింది.


ఎ) బయోగ్యాస్‌: పశువుల పేడను ఆక్సిజన్‌ రహితంగా కుళ్లబెట్టడం లేదా పట్టణ, చెట్ల వ్యర్థాలను మిథనోమోనాస్, మిథనోకోకస్‌ లాంటి బ్యాక్టీరియాల సమక్షంలో కిణ్వన ప్రక్రియకు గురిచేయడం ద్వారా బయోగ్యాస్‌ను తయారుచేస్తారు. ఇది 60% మీథేన్, 40% కార్బన్‌ డై ఆక్సైడ్‌లతో ఉంటుంది.


బి) బయో డీజిల్‌: జట్రోపా, కానుగ, సోయాబీన్స్, పామాయిల్, రెడ్‌ సీడ్స్‌ లాంటి మొక్కల విత్తనాల నుంచి తీసిన నూనెలను ఆల్కహాల్‌ లేదా ఆమ్లాలను ఉపయోగించి చర్యనొందించే ట్రాన్స్‌ ఎస్టరిఫికేషన్‌ ప్రక్రియ ద్వారా జీవ ఇంధనాన్ని తయారుచేస్తారు. దీన్ని డీజిల్‌తో కలిపి బయోడీజిల్‌గా వినియోగించడం వల్ల పర్యావరణ మిత్రుడిగా మారుతుంది.


సి) బయో ఇథనాల్‌: చెరకు, స్వీట్‌ కార్న్, స్వీట్‌ క్యారెట్, చిలగడ దుంప, గోధుమలు, మొక్కజొన్న లాంటి వాటి నుంచి గ్రహించిన గ్లూకోజ్‌కు ఈస్ట్‌ కలిపి కిణ్వన ప్రక్రియ (మురగబెట్టడం)కు గురిచేస్తే బయో ఇథనాల్‌ తయారవుతుంది. దీన్ని పెట్రోల్‌తో కలిపి బయోపెట్రోల్‌గా వాడొచ్చు. భారత ప్రభుత్వం 2022 నాటికి పెట్రోల్‌లో 10% ఇథనాల్‌ను కలిపి విజయం సాధించింది. 2030 నాటికి 20% ఇథనాల్‌ కలపాలని నిర్ణయించింది.


డి) బయో బ్యుటనాల్‌: బయో ఇథనాల్‌ మాదిరిగా చెరకు లేదా మొక్కజొన్న మొలాసిన్‌ను క్లాస్ట్రీడియం ఎసిటోబ్యుటలికం అనే బ్యాక్టీరియా సమక్షంలో కిణ్వన ప్రక్రియ జరిపినప్పుడు ఎసిటో బ్యుటనాల్‌ ఏర్పడుతుంది. దీన్ని గృహ సంబంధ అవసరాలు, ఇంటర్నల్‌ ఇంజిన్‌ కంబుషన్‌లో వాడవచ్చు. 


ఇ) బయో హైడ్రోజన్‌ గ్యాస్‌: బయోమాస్‌ను హైడ్రోజోనోమోనాస్‌ బ్యాక్టీరియా సమక్షంలో కిణ్వన ప్రక్రియకు గురిచేసినప్పుడు హైడ్రోజన్‌ వాయువు విడుదలవుతుంది. దీన్ని రాకెట్ల ఇంధనంగా, వాహనాలు నడవడానికి ఉపయోగపడే హైడ్రోజన్‌ బ్యాటరీలోనూ వాడవచ్చు.


హరిత నగరాలు: పునరుద్ధరించదగిన కార్బన్‌ రహిత శక్తి వనరులను వినియోగించడం, ప్రత్యేకమైన, వ్యవస్థీకృత వనరులు వినియోగించగలిగేలా రహదారులు ఉండటం, పరిశ్రమలకు దూరంగా, వృక్ష సహిత నగరాలను నిర్మించడం నవీన పట్టణ అభివృద్ధికి సూచిక. ఎకోసిటీ భావనను 1975లో రిచర్డ్‌ అనే పర్యావరణవేత్త ప్రతిపాదించారు. ప్రపంచంలో మొదటి జీరో కార్బన్‌ పట్టణంగా 2008లో అబుదాబిలోని మస్టర్డ్‌ నగరాన్ని అభివృద్ధి చేశారు.


జాతీయ పర్యావరణ విధానం: భారతదేశం జాతీయ పర్యావరణ విధానాన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో భాగంగా 2006లో ప్రకటించింది. సాంఘిక న్యాయాన్ని సాధించడానికి ఆవరణ పరిమితులు తొలగించి సుస్థిరాభివృద్ధిని సాధించడం జాతీయ పర్యావరణ విధాన ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ విధానాలు, పథకాలు, ప్రాజెక్టుల్లో పర్యావరణ అంశాలను చేర్చి ఆర్థిక, సాంఘిక అభివృద్ధిని సాధించడం; జీవనోపాధికి పర్యావరణంపై ఆధారపడే పేదలకు పర్యావరణ వనరులు అందుబాటులో ఉండేలా సహజ వనరులను సంరక్షించడం; జీవనానికి ఆధారమైన సంక్షేమానికి దోహదపడే ఆవరణ వ్యవస్థను సంరక్షించడం.. లాంటి ముఖ్య ఉద్దేశాలతో జాతీయ పర్యావరణ విధానాన్ని రూపొందించారు.


ఎకో ఎఫీషియన్సీ: ‘వరల్డ్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌’ ఎకో ఎఫీషియన్సీని నిర్వచించింది. జీవన నాణ్యతను పెంచుతూ, మానవ అవసరాలను తీరుస్తూ, వస్తుసేవలను అందించే పోటీదారులను సమాజానికి అందించడమే ఎకో ఎఫీషియన్సీ. దీనిలో పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గిస్తూ, సహజవనరులు నాశనం కాకుండా చూస్తూ, వ్యర్థాలను భూమి శోషించుకునే శక్తి నిర్వహించేలా ప్రణాళికలు ఉండాలి.


గ్రీన్‌ జీడీపీ: పారిశ్రామిక వృద్ధి స్థూల దేశీయోత్పత్తిని పెంచుతున్నప్పటికీ పర్యావరణానికి నష్టం చేస్తోంది. పర్యావరణ క్షీణత పారిశ్రామిక ప్రక్రియ, సహజ వనరుల సేకరణ, వ్యవసాయోత్పత్తులను పెంచడం, పారిశ్రామిక వస్తువుల వినియోగంలో అనేక విధాలుగా అంతర్లీనంగా తిరిగి మానవాభివృద్ధికి విఘాతం కలిగిస్తోంది. సంప్రదాయ జీడీపీ పర్యావరణ నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే సంప్రదాయ జీడీపీని పర్యావరణ నష్టానికి సర్దుబాటు చేస్తే గ్రీన్‌ జీడీపీ వస్తుంది.


గ్రీన్‌ జీడీపీ (గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌) = సంప్రదాయ జీడీపీ - ఎన్విరాన్‌మెంటల్‌ (లేదా) ఎకలాజికల్‌ కాస్ట్‌


పర్యావరణ వనరుల నష్టం, పర్యావరణ నష్టాన్ని నిరోధించడానికి, నష్టపోయిన వనరుల పునరుద్ధరణకు, పర్యావరణాన్ని నిర్వహించడానికి చేసే వ్యయం ఎన్విరాన్‌మెంటల్‌ కాస్ట్‌లో ఇమిడి ఉంటుంది. 2006లో చైనా ప్రభుత్వం గ్రీన్‌ జీడీపీని ప్రకటించింది. గాలి, నీరు, ఘనపదార్థాల వల్ల ఏర్పడిన కాలుష్యం; సహజ వనరుల క్షీణత కారణంగా కలిగిన వ్యయాన్ని తీసుకుని దీన్ని గణించింది.


భారత ప్రణాళికా సంఘం గ్రీన్‌ నేషనల్‌ ఎకౌంట్‌ను తయారుచేయడానికి ప్రొఫెసర్‌ పార్థదాస్‌ గుప్తా ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ జాతీయ వనరులపై రుణాత్మక ప్రభావాన్ని లెక్కలోకి తీసుకుని జాతీయ ఉత్పత్తిని తగ్గిస్తుంది. సహజ, మానవ, భౌతిక ఆస్తులను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక ప్రగతిని అంచనా వేసేందుకు రోడ్‌ మ్యాప్‌ తయారుచేసింది. భారతదేశం గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఫెసిలిటీ వ్యవస్థాపక సభ్యదేశంగా కొనసాగుతోంది. 1991లో స్థాపితమైన ఈ సంస్థకు 183 దేశాల నుంచి ఆర్థిక సాయం అందుతోంది. ఈ నిధులను ప్రపంచ పర్యావరణ ప్రయోజనాల కోసం వివిధ దేశాలకు అందిస్తున్నారు.

 

 

రచయిత: జల్లు సద్గుణరావు

 

 

Posted Date : 29-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌