మాదిరి ప్రశ్నలు
1. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
ఎ) జూన్ 5 బి) మార్చి 21 సి) మార్చి 8 డి) మే 22
జ: (డి)
2. ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలంగాణలో ఏ ప్రాంతాన్ని పర్యావరణ పరిరక్షణ పార్కుగా ప్రకటించింది?
ఎ) మంజీర బి) ప్రాణహిత సి) అలీసాగర్ డి) కిన్నెరసాని
జ: (బి)
3. కిందివాటిలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో పర్యావరణంతో సంబంధం లేనిది ఏది?
ఎ) ఆసరా బి) జలహారం సి) స్వచ్ఛ తెలంగాణ డి) హరితహారం
జ: (ఎ)
4. తెలంగాణలో అత్యధిక పారిశ్రామిక, రసాయన కేంద్రాలు ఉన్న జిల్లాలు ఏవి?
ఎ) రంగారెడ్డి బి) మెదక్ సి) హైదరాబాద్ డి) పైవన్నీ
జ: (డి)
5. తెలంగాణ పర్యావరణ పరిశోధన సంస్థ అధ్యయనంలో 75% నుంచి 80% రసాయన, క్రిమి, ఔషధ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు ఏ రకమైన కాలుష్యానికి కారణమవుతున్నాయని తెలిపింది?
ఎ) నీటి బి) వాయు సి) ధ్వని డి) రేడియోధార్మిక
జ: (ఎ)
6. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
ఎ) మే 22 బి) మార్చి 21 సి) డిసెంబరు 10 డి) జూన్ 21
జ: (బి)
7. 'ఫ్లోరైడ్ (F2)' సమస్య అధికంగా ఉన్న తెలంగాణ జిల్లా ఏది?
ఎ) మెదక్ బి) రంగారెడ్డి సి) నల్గొండ డి) వరంగల్
జ: (సి)
8. తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిశ్రమల మొత్తంలో కాలుష్యం లేని పరిశ్రమల శాతం ఎంత?
ఎ) 29.58% బి) 64.98% సి) 5.43% డి) 0.033%
జ: (సి)
9. తెలంగాణలో 'స్వచ్ఛ తెలంగాణ - హైదరాబాద్' కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు?
ఎ) ఈఎస్ఎల్ నరసింహన్ బి) కె.చంద్రశేఖర్ రావు సి) కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా డి) రాజీవ్ శర్మ
జ: (ఎ)
10. తెలంగాణలో 'స్వచ్ఛ తెలంగాణ - హైదరాబాద్' కార్యక్రమాన్ని ఏ రోజున చేపట్టారు?
ఎ) 2015, మే 10 - 14 బి) 2015, మే 16 - 20 సి) 2015, మే 20 - 24 డి) 2015, మే 1 - 4
జ: (బి)
11. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'హడ్కో అవార్డు' కిందివాటిలో దేనికి లభించింది?
ఎ) హరితహారం బి) స్వచ్ఛ తెలంగాణ సి) జలహారం డి) మన ఊరు - మన ప్రణాళిక
జ: (సి)
12. 'క్లీన్ ఇండియా మిషన్'లో ఇటీవల భారతదేశ 476 నగరాల్లో తెలంగాణలోని గ్రేటర్ వరంగల్ నగరం ఎన్నో స్థానం దక్కించుకుంది?
ఎ) 275 బి) 34 సి) 33 డి) 13
జ: (సి)
13. తెలంగాణలో హరితహారం కార్యక్రమం ఎప్పుడు చేపట్టారు?
ఎ) 2015, జులై 3 - 7 బి) 2015, జులై 7 - 10 సి) 2015, ఆగస్టు 3 - 7 డి) 2015, సెప్టెంబరు 7-10
జ: (ఎ)