• facebook
  • whatsapp
  • telegram

గాంధీ యుగం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. జలియన్ వాలాబాగ్ దురంతంపై విచారణ కోసం బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కమీషన్ ఏది?
జ: హంటర్ కమిషన్
 

2. తిలక్ మరణించినప్పుడు ''నా బలమైన రక్షకుడు (bulwark) వెళ్లిపోయాడు" అన్న జాతీయ నాయకుడు ఎవరు?
జ: గాంధీజీ
 

3. అలీ సోదరులకు సంబంధమున్న ఉద్యమం / సంస్థ ఏది?
జ: ఖిలాఫత్
 

4. గాంధీజీని మొదటిసారిగా జాతిపితగా పిలిచింది ఎవరు?
జ: సుభాష్ చంద్రబోస్
 

5. 1919లో అఖిల భారత ఖిలాఫత్ సమావేశం జరిగిన ప్రదేశం ఏది?
జ: దిల్లీ
 

6. రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్‌హుడ్ (kinghthood) బిరుదును త్యజించడానికి కారణం?
జ: జలియన్ వాలాబాగ్ దురంతం
 

7. తిలక్ మరణించిన సంవత్సరం ఏది?
జ: 1920
 

8. సురేంద్రనాథ్ బెనర్జీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంవత్సరం?
జ: 1918
 

9. కృష్ణా పత్రిక సంపాదకుడు ఎవరు?
జ: ముట్నూరి కృష్ణారావు
 

10. గాంధీజీని ప్రభావితం చేసిన లియో టాల్‌స్టాయ్ గ్రంథం ఏది?
జ: కింగ్‌డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు
 

11. గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించిన ప్రదేశం?
జ: అహ్మదాబాద్
 

12. అరాచకత్వ, విప్లవాత్మక నేరాల చట్టానికి మరోపేరు?
జ: రౌలత్ చట్టం
 

13. 1920లో కోల్‌కతాలో జరిగిన ఖిలాఫత్ సదస్సుకు అధ్యక్షత వహించింది ఎవరు?
జ: మహమ్మద్ అలీ
 

14. చౌరీచౌరా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఏ జిల్లాలో ఉంది?
జ: గోరఖ్‌పూర్
 

15. జలియన్ వాలాబాగ్‌ను ఏర్పాటు చేసిన పండిత్ జల్లా ఎవరి ఆస్థానంలో ఉండేవారు?
జ: మహారాజా రంజిత్‌సింగ్
 

16. సహాయ నిరాకరణ ఉద్యమం సందర్భంగా గాంధీజీ 1921లో ఏ వైస్రాయితో జరిపిన చర్చలు విఫలమయ్యాయి?
జ: రీడింగ్
 

17. కలకత్తా జాతీయ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన వ్యక్తి ఎవరు?
జ: సుభాష్ చంద్రబోస్

Posted Date : 13-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌