Post your question

 

    Asked By: జి.వెంకట దుర్గ

    Ans:

    సాధారణంగా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఉద్యోగ పరీక్షలకు పోటీ ఎక్కువగానే ఉంటుంది. కనీసం ఒక సంవత్సరంపాటు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమైతే ఉద్యోగం పొందడం కష్టం కాదు. ఏదైనా పోటీ పరీక్ష రాయాలనుకున్నప్పుడు ముందుగా ఆ పరీక్షకు సంబంధించిన సిలబస్‌ వివరాలు సేకరించి అందులో ఉన్న వివిధ విభాగాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి.  పరీక్షకు సంబంధించిన పూర్వ ప్రశ్న పత్రాలను కూడా పరిశీలించి, మీ ప్రస్తుత సామర్థ్యంతో ఎన్ని మార్కులు తెచ్చుకోగలరు? ఉద్యోగం పొందాలంటే ఎన్ని మార్కులు అవసరం? అన్న విషయాలను ఆధారం చేసుకొని, సన్నద్ధత ఏ స్థాయిలో ఉండాలో అవగాహన ఏర్పర్చుకోండి. గతంలో ఈ పరీక్షలో విజయం సాధించిన వారితో మాట్లాడి పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలో తెలుసుకోండి. వీలుంటే, ఈ పోటీ పరీక్షకు శిక్షణ ఇచ్చే వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ పరీక్షకు అవసరమైన పుస్తకాల విషయానికొస్తే.. ఆర్‌ ఎస్‌ అగర్వాల్‌ చాంద్‌ పబ్లికేషన్స్‌.. ఏ మోడ్రన్‌ అప్రోచ్‌ టు వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బర్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లతో పాటు మలయాళ మనోరమ- మనోరమ ఇయర్‌ బుక్, మినిస్ట్రీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ పబ్లికేషన్‌ డివిజన్‌- ఇండియా ఇయర్‌ బుక్, ఎస్‌కే భక్షి- అబ్జెక్టివ్‌ జనరల్‌ ఇంగ్లిష్, లూసెంట్‌ పబ్లికేషన్స్‌- జనరల్‌ నాలెడ్జ్, అరుణ్‌ శర్మ- క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఫర్‌ క్యాట్, ఎంకే పాండే- అనలిటికల్‌ రీజనింగ్‌ పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయి. వీటితో పాటు దిశ పబ్లిషర్స్‌ లేదా కిరణ్‌ ప్రకాశన్‌  పబ్లికేషన్స్‌ ఎస్‌ఎస్‌సీ పూర్వ ప్రశ్నాపత్రాల పుస్తకాలను కూడా చదవండి. ఎస్‌ఎస్‌సీ లాంటి పోటీ పరీక్షలకు సరైన సమాధానాన్ని తక్కువ సమయంలో గుర్తించే నైపుణ్యం అవసరం. పుస్తకాలతో పాటు వార్తా పత్రికలను కూడా చదువుతూ సొంతంగా నోట్స్‌ తయారు చేసుకొని, వీలున్నన్ని నమూనా  పరీక్షలు రాస్తూ, మీ ఉద్యోగ ప్రయత్నంలో విజయం సాధించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: Vijay

    Ans:

    Study the SSC CGL exam pattern. Go through the SSC CGL study syllabus properly. Selection of what SSC CGL study material to study from is important. Study from the best books for SSC CGL 2023 exam.

    Asked By: Lakshmi Parise

    Ans:

    SSC exam is conducted in English/Hindi media only. This is an objective type exam. With basic knowledge of English you can easily understand the question paper. Nothing there to worry.