Post your question

 

    Asked By: Divya

    Ans:

    If you fulfil eligibility rules then you can get job. Click on the following link to get complete information about SBI jobs.

    https://pratibha.eenadu.net/jobs/index/sbi/sbi-clerks/2-1-5-30

    Asked By: కె.ధనరాజు

    Ans:

    - మీరు బ్యాంకులో ప్రమోషన్‌కి అవసరమైన కోర్సులను ఇప్పటికే పూర్తిచేశారు కాబట్టి, రెగ్యులర్‌గా మీకొచ్చే పదోన్నతులు అందుబాటులో ఉన్న ఖాళీలను బట్టి వస్తాయి. అలా కాకుండా, మీ బ్యాంకులో కానీ, ఇతర బ్యాంకుల్లో కానీ మెరుగైన ఉద్యోగాలకోసం చార్టెడ్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్, ఐఐబీఎఫ్‌ సర్టిఫై చేసిన సర్టిఫైడ్‌ క్రెడిట్‌ ప్రొఫెషనల్, ఎస్‌ఎంఈ ఫైనాన్స్, ట్రేడ్‌ ఫైనాన్స్, ఫారెక్స్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సులు చేయొచ్చు. ఐఐబీఎఫ్‌ నిర్వహించే డిప్లొమా ఇన్‌ ఇన్వెస్ట్‌మెంట్, ట్రెజరీ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ల గురించీ ఆలోచించవచ్చు. వీటితోపాటు డిజిటల్‌ బ్యాంకింగ్, రిటైల్‌ బ్యాంకింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్సు కూడా చేసే అవకాశం ఉంది. ఇవే కాకుండా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ల్లో ఎంబీఏ/ పీజీ డిప్లొమాలను దూరవిద్య/ ఆన్‌లైన్‌ ద్వారా చేయొచ్చు. భవిష్యత్తులో ఏ రంగంలో  స్థిరపడాలని అనుకుంటున్నారో, ఎందులో ఆసక్తి ఉందో అన్న విషయాలను ఆధారం చేసుకొని సరైన కోర్సును ఎంచుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: Harijana

    Ans:

    తెలుగు మీడియంలో చదువుకున్నారని కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న బ్యాంకుల్లో తెలుగు మీడియంలో చదువుకున్నవారు చాలామంది పని చేస్తున్నారు. అలాగే ఈసారి ఎస్‌బీఐ అసోసియేట్‌ఉద్యోగ పరీక్షను హిందీ, ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, ఉర్దూ మీడియంలలో కూడా నిర్వహిస్తున్నారు.

    Asked By: Kollu

    Ans:

    Understand the syllabus, follow a preperation plan, Practice Previous Years' Question Papers and Model papers,  Revise with Short Tutorials, Build a section-wise SBI PO Preparation Tips, Analyse Mock Tests, Be Clear with Concepts, Learn Shortcuts, Increase Practice. If required join a coaching centre.

    Asked By: ఎం. ఖ్యాతి

    Ans:

    చార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ) పూర్తి చేసినవారికి  ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో  మెరుగైన ఉద్యోగావకాశాలున్నాయి. నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, గ్యాస్‌ అథారిటీ అఫ్‌ ఇండియా లిమిటెడ్‌ లాంటి ప్రభుత్వ సంస్థలతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో కూడా సీఏగా అవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు రంగంలో ఫైనాన్స్‌ మేనేజర్, అకౌంట్స్, ఆడిట్‌ మేనేజర్‌ లాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి. సీఏ పూర్తి చేసినవారు బ్యాంకింగ్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల్లో ఎంబీఏ చదివిన నిపుణులతో పోటీ పడుతున్నారు. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలుగా, క్రెడిట్‌ అనలిస్టులుగా, ఆడిట్‌ బాధ్యులుగా ప్రభుత్వ రంగ సంస్థలు సీఏలను తీసుకుంటాయి. వీరు సొంతంగానూ ప్రాక్టీస్‌ నిర్వహించుకొనే అవకాశం ఉంది.