Post your question

 

    Asked By: ఎం. ఖ్యాతి

    Ans:

    చార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ) పూర్తి చేసినవారికి  ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో  మెరుగైన ఉద్యోగావకాశాలున్నాయి. నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, గ్యాస్‌ అథారిటీ అఫ్‌ ఇండియా లిమిటెడ్‌ లాంటి ప్రభుత్వ సంస్థలతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో కూడా సీఏగా అవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు రంగంలో ఫైనాన్స్‌ మేనేజర్, అకౌంట్స్, ఆడిట్‌ మేనేజర్‌ లాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి. సీఏ పూర్తి చేసినవారు బ్యాంకింగ్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల్లో ఎంబీఏ చదివిన నిపుణులతో పోటీ పడుతున్నారు. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలుగా, క్రెడిట్‌ అనలిస్టులుగా, ఆడిట్‌ బాధ్యులుగా ప్రభుత్వ రంగ సంస్థలు సీఏలను తీసుకుంటాయి. వీరు సొంతంగానూ ప్రాక్టీస్‌ నిర్వహించుకొనే అవకాశం ఉంది.