Asked By: Bandla
Ans:
సిలబస్ ప్రకారం ముందుగా ఆరో తరగతి నుంచి పీజీ వరకు ఉన్న తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల కోసం తెలుగు అకాడమీ ప్రచురించిన జనరల్ స్టడీస్ పుస్తకాలు చదవచ్చు. పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ తెలుగు మీడియంలో లభిస్తోంది. ఆధునిక భారత దేశ చరిత్ర - బిపిన్ చంద్ర, మధ్యయుగ చరిత్ర - కృష్ణారెడ్డి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు, జాగ్రఫీ-తెలుగు అకాడమీ, భారతీయ సమాజం - తెలుగు అకాడమీ పుస్తకాలు ఉపయోగకరం.
ఎథిక్స్ అండ్ ఆప్టిట్యూడ్ కోసం మేజర్ పబ్లికేషన్ పుస్తకాలు, యోజన మ్యాగజీన్ లు, ప్రముఖ తెలుగు దినపత్రికలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తాజా బడ్జెట్ లు, సర్వేలు - ఇవన్నీ తెలుగు మీడియంలో లభిస్తున్నాయి.
కావాల్సిన పుస్తకాలు సేకరించుకున్న తర్వాత సిలబస్ ప్రకారం అధ్యాయాలను చూసుకొని చదువుకోవాలి.
ఈనాడు-ప్రతిభ వెబ్ సైట్ లో రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటాయి. వాటినీ వినియోగించుకోవచ్చు. ఇంకా అనేక రకాల గైడెన్స్ ఆర్టికల్స్ కూడా రెగ్యులర్ గా అప్ డేట్ అవుతుంటాయి. వాటినీ రిఫరెన్స్ కి ఉపయోగించుకోవచ్చు.
https://pratibha.eenadu.net/jobs/index/upsc/civil-services-exam/telugu-medium/2-1-1-1
Asked By: ఎ. వీరభద్రం
Ans:
వైద్యవిద్యార్థులు ఐఏఎస్ ఆఫీసర్లు కావడం సాధ్యమే. 1980వ సంవత్సరంలోనే మన తెలుగువారైన డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ సివిల్స్ పోటీలో అఖిల భారత స్థాయి 4వ ర్యాంకుతో ఐఏఎస్ సాధించారు. 2021లో వరంగల్‌కి చెందిన డాక్టర్ శ్రీజ అఖిల భారత స్థాయిలో 20వ ర్యాంకుతో ఐఏఎస్ సాధించారు. ఎంబీబీస్ చదువుతూ యూపీఎస్‌సీ పరీక్ష రాయడం కుదరదు. యూపీఎస్‌సీ పరీక్ష రాయాలంటే ఏదైనా డిగ్రీ పూర్తవ్వాలి. కానీ, మీరు ఎంబీబీఎస్ చదువుతూనే, యూపీఎస్‌సీ పరీక్షకు సన్నద్ధంకండి. ప్రణాళికాబద్ధ్దమైన శిక్షణ, కృషి, పట్టుదల ఉంటే ఎవరైనా కచ్చితంగా ఐఏఎస్ సాధించగలరు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: Dasari
Ans:
There is no specific group that is useful for Civil Services examinations. Any degree holder can apply. Any degree to a limited extent is useful for those examinatins. If you are aiming at IAS, you need to get an comprehensive idea on examination pattern, syllabus etc. and accordingly preparation.