Asked By: యశ్వంత్
Ans:
గ్రూప్-4లో చాలా వరకు ఉద్యోగాలు ఇంటర్ అర్హతతోనే ఉంటాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏటా విడుదల చేసే కొన్ని నోటిఫికేషన్లకు ఇంటర్ సరిపోతుంది. ఇంటర్మీడియట్ తర్వాత పలు రకాల ఉద్యోగ అవకాశాల వివరాల కోసంఈ లింక్‌ను క్లిక్ చేసి చూడండి
https://pratibha.eenadu.net/notifications/latestnotifications/government-jobs/2-8-27
Asked By: విష్ణువర్ధన్
Ans:
బోనఫైడ్ సర్టిఫికెట్లు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకటి, రెండు తరగతులకు సంబంధించి ఓటీఆర్‌లో ప్రైవేట్ అని నింపండి. దీంతోపాటు ఆ సంవత్సరాలకు సంబంధించి తహసీల్దార్ సంతకం చేసిన రెసిడెన్స్ సర్టిఫికెట్‌ను సిద్ధం చేసుకోండి. వెరిఫికేషన్ సమయంలో బోనఫైడ్కు బదులు రెసిడెన్స్ సర్టిఫికెట్‌ను చూపించాలి.