Post your question

 

  Asked By: సురేష్‌ ముదావత్‌

  Ans:

  డిగ్రీ చదువుతూనే పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నందుకు అభినందనలు. చాలామంది విద్యార్థులు సెమిస్టర్‌ పరీక్షలు/ఉద్యోగ నోటిఫికేషన్‌లు వచ్చేవరకు కనీస అవగాహన పెంచుకోరు. చివరి నిమిషంలో సరైన సన్నద్ధత లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. డిగ్రీ పరీక్షలైనా, పీజీ ఎంట్రెన్స్‌ అయినా, పోలీస్‌ పరీక్ష అయినా సమయ నిర్వహణ అత్యంత ప్రధానం.

  డిగ్రీ పరీక్షలో సమాధానాలు వ్యాస రూపంలో రాయాలి. పోటీ పరీక్షల్లో అయితే ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధ్దతిలో ఉంటాయి. డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణత అనేది పూర్తిగా మీ ప్రతిభ పైనే ఆధారపడి ఉంటుంది. పోటీ పరీక్షల్లో మీ విజయం మీ ప్రయత్నం పైనే కాకుండా ఇతర అభ్యర్థుల సన్నద్ధతపై కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని పోటీ పరీక్షల్లో తప్పు సమాధానాలకు నెగిటివ్‌ మార్కులుంటాయి. కాబట్టి, మీకు ఏ ప్రశ్నలకు సమాధానాలు తెలుసో, ఏ ప్రశ్నలకు సమాధానాలు తెలియవో ఒక అవగాహన ఉండాలి.

  ఏదైనా పరీక్ష రాసే ముందు, ఆ పరీక్షకు సంబంధించిన సిలబస్‌ క్షుణ్ణంగా పరిశీలించండి. ఆ తరువాత పాత ప్రశ్నపత్రాలను చూసి ప్రశ్నల సరళిని గమనించి, అవగాహన పెంచుకోండి. గతంలో ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారిని కలిసి వారి విజయగాథలను తెలుసుకోండి. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులను కలిసి సందేహాలను నివృత్తి చేసుకోండి. సిలబస్‌కు అనుగుణంగా వివిధ ప్రామాణిక పుస్తకాలు చదివి, స్వయంగా నోట్స్‌ తయారుచేసుకొని సన్నద్ధత మొదలుపెట్టండి. మీ సన్నద్ధతని అంచనా వేసుకోవడానికి, టైం మేనేజ్‌మెంట్‌ కోసం ఎక్కువ సంఖ్యలో మాక్‌ టెస్ట్‌ లను రాయండి. పోటీ పరీక్షలు రాస్తున్న ఇతర అభ్యర్థులతో కలిసి కంబైన్డ్‌ ప్రిపరేషన్‌ చేయండి. వీటితో పాటు నాణ్యమైన కోచింగ్‌ అందించే శిక్షణ సంస్థ నుంచి కోచింగ్‌ తీసుకొనే ప్రయత్నం కూడా చేయండి. -
  ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: Mahender

  Ans:

  బీఎస్సీ ఎంపీసీ (కంప్యూటర్‌ సైన్స్‌) చేసినవారికి కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల దరఖాస్తుకు అర్హత ఉంటుంది. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు మే 26తో  ముగిసింది.

  Asked By: SUNIL

  Ans:

  పోలీస్‌ కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ముగియడంతో ఎడిట్‌ కావడంలేదు. ప్రభుత్వం ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చినప్పుడు మీరు సవరణ చేసుకోవచ్చు.

  Asked By: Mangi

  Ans:

  10+3 (డిప్లొమా) అనేది ఇంటర్మీడియట్‌తో సమానం కాబట్టి మీరు నిస్సంకోచంగా పోలీస్‌  కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

  Asked By: Hussain

  Ans:

  కొత్త నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కువ ఎక్కడ చదివితే అదే లోకల్‌ అవుతుంది. దాని ప్రకారం మీకు సూర్యాపేట జిల్లా, యాదాద్రి జోన్‌ స్థానికత వర్తిస్తుంది.

  Asked By: Mounika

  Ans:

  కుల ధ్రువీకరణ పత్రం అయితే తండ్రి ఇంటి పేరు మీద ఉండాలి. రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌తో ఎలాంటి సంబంధం ఉండదు. భర్తకు సంబంధించిన ఆదాయాన్ని చెప్పవచ్చు.

  Asked By: pushpa

  Ans:

  ఎస్‌ఐ ఉద్యోగానికి జనరల్‌ స్టడీస్‌ అంశాలను బాగా చదవాలి. మ్యాథ్స్, ప్యూర్‌ మ్యాథ్స్, అరిథ్‌మెటిక్‌పై పట్టు సాధించడం పరీక్ష ప్రిపరేషన్‌లో కీలకమైన అంశం.