Asked By: కరుణ
Ans:
- మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ శిక్షణ పూర్తిచేసినవారికి ప్రభుత్వ వైద్య, ఆరోగ్యశాఖలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్‌గా ఉద్యోగావకాశాలుంటాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో, వైద్య, ఆరోగ్యరంగాల్లో పనిచేసే స్వచ్ఛంద సేవాసంస్థల్లో, కమ్యూనిటీ హెల్త్ ఆర్గనైజేషన్లలో, వృద్ధాశ్రమాల్లో కొలువుల్లో చేరొచ్చు. మీరు ఒకవేళ డిగ్రీ పూర్తి చేస్తే మాస్టర్స్ ఇన్ పబ్లిక్‌హెల్త్, ఎంబీఏ- హెల్త్‌కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్, మాస్టర్స్ ఇన్ ఆప్టోమెట్రీ లాంటి కోర్సులు చేసే అవకాశం ఉంది. ఆసక్తి ఉంటే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఫిజియోథెరపీ, కార్డియాలజీ, రేడియాలజీ, హెల్త్ సైకాలజీ, ఆడియాలజీ, స్పోర్ట్స్ మెడిసిన్ లాంటి వాటిలో సర్టిఫికెట్/ డిప్లొమాలు చేయండి. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ కెరియర్ కౌన్సెలర్
Asked By: కరుణాకర్
Ans:
జూ క్యురేటర్‌గా పనిచేయాలంటే, జంతుశాస్త్రం లాంటి సబ్జెక్టులో కనీసం డిగ్రీ చదివి ఉండాలి. వీటితో పాటు జంతు ప్రవర్తన, వన్యప్రాణి నిర్వహణలపై అవగాహన ఉండాలి. జంతువులతో పనిచేసిన అనుభవం కూడా అవసరం. చాలా జంతు ప్రదర్శనశాలలు జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదివినవారిని క్యురేటర్లుగా నియమించుకొంటున్నాయి. జంతు ప్రవర్తన, ఎవల్యూషనరీ బయాలజీ, జెనెటిక్స్, ఫిజియాలజీ, ఎకాలజీ, మాలిక్యులర్ బయాలజీ సబ్జెక్టులపై కనీస అవగాహన అవసరం. వెటర్నరీ సైన్స్, యానిమల్ ఫీడ్ ప్రొడక్షన్, యానిమల్ బ్రీడింగ్, యానిమల్ వైరసెస్‌లో సర్టిఫికెట్/ డిప్లొమా చేస్తే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. జూ క్యురేటర్‌గా రాణించాలంటే విషయ పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, శారీరక దార్ఢ్యం, పరిశీలనా శక్తి.. మొదలైన నైపుణ్యాలు అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: prasanth
Ans:
- ఎంఏ ఇస్లామిక్ స్టడీస్ చదివితే ఇస్లామిక్ ట్రాన్స్‌లేటర్, ఇస్లామిక్ జర్నలిస్టు అవొచ్చు. బీఈడీ చేసి ఇస్లామిక్ టీచర్లుగా, పీహెచ్‌డీ చేసి ఇస్లామిక్ అధ్యాపకులుగా, ఇస్లామిక్ పరిశోధకులుగా, ఇస్లామిక్ కంటెంట్ రైటర్లుగా, ఇస్లాం మత ప్రచారకులుగా, క్యాలిగ్రాఫర్లుగా ఉద్యోగాలు చేయవచ్చు. ఇవేకాకుండా స్వచ్ఛంద సేవా సంస్థల్లో, వ్యాపార సంస్థల్లో, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆఫీసుల్లో, డిఫెన్స్, సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్లలో కొలువుల్లో చేరే అవకాశం ఉంది. వీటితో పాటు డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ప్రయత్నించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: పి.బాలకృష్ణ
Ans:
మీకు నచ్చిన ఉద్యోగం చేయడం ఎప్పుడూ శ్రేయస్కరం. చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం చేయడం అదృష్టం కూడా! ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది చదివిన కోర్సుకూ, చేయాలనుకొన్న - చేస్తున్న కొలువుకూ ఎలాంటి సంబంధం ఉండట్లేదు. దీంతో కొందరు ఉద్యోగాలు మారే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. టూరిజం రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు హిస్టరీ అండ్ టూరిజంలో పీజీ చేశారు కాబట్టి ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం, బీబీఏ టూరిజం చదివినవారితో పోటీ పడాల్సి ఉంటుంది. మీరు ఈ రంగంలో రాణించాలంటే- కంప్యూటర్, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోండి. అవకాశం ఉంటే తెలుగు, ఇంగ్లిష్‌లతో పాటు హిందీ, మరో విదేశీ భాషను నేర్చుకొనే ప్రయత్నం చేయండి. టూరిజం రంగంలోనే స్థిరపడాలనుకొంటే ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ చదివే ప్రయత్నం కూడా చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: పి.బాలకృష్ణ
Ans:
మీకు నచ్చిన ఉద్యోగం చేయడం ఎప్పుడూ శ్రేయస్కరం. చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం చేయడం అదృష్టం కూడా! ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది చదివిన కోర్సుకూ, చేయాలనుకొన్న - చేస్తున్న కొలువుకూ ఎలాంటి సంబంధం ఉండట్లేదు. దీంతో కొందరు ఉద్యోగాలు మారే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. టూరిజం రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు హిస్టరీ అండ్ టూరిజంలో పీజీ చేశారు కాబట్టి ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం, బీబీఏ టూరిజం చదివినవారితో పోటీ పడాల్సి ఉంటుంది. మీరు ఈ రంగంలో రాణించాలంటే- కంప్యూటర్, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోండి. అవకాశం ఉంటే తెలుగు, ఇంగ్లిష్‌లతో పాటు హిందీ, మరో విదేశీ భాషను నేర్చుకొనే ప్రయత్నం చేయండి. టూరిజం రంగంలోనే స్థిరపడాలనుకొంటే ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ చదివే ప్రయత్నం కూడా చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: రోహిత్
Ans:
దాదాపుగా ఆరేళ్ల విరామం తరువాత ఎస్‌ఏపీ ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకొన్నారు. అంటే మీ వయసు దాదాపు ముప్పై సంవత్సరాలు ఉండవచ్చు. బీబీఏ/ ఎంబీఏలో మీరు ఏ స్పెషలైజేషన్ చదివారో, ఉద్యోగానుభవం ఉందో, లేదో చెప్పలేదు. సాధారణంగా ఎస్‌ఏపీ ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్‌ని ఫైనాన్స్ రంగంలో కొంత అనుభవం పొందాక చేయడం శ్రేయస్కరం. ఈ రంగంలో ఉద్యోగం పొందాలంటే ఫైనాన్స్ నైపుణ్యాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా చాలా అవసరం. ఈ కోర్సు చేసినవారికి కన్సల్టెంట్లుగా ఉద్యోగావకాశాలుంటాయి. ఈ రంగంలో తక్కువ ఉద్యోగాలు అందుబాటులో ఉండటం వల్ల పోటీ ఎక్కువే. మీరు ఎస్‌ఏపీ ఎఫ్‌ఐసీఓ నేర్చుకొనేముందు ఫైనాన్స్ రంగంలో కనీసం రెండు సంవత్సరాలు పనిచేసి, ఆ విభాగానికి సంబంధించిన విషయాలపై పట్టు సాధించండి. ఈ కోర్సును మంచి శిక్షణ సంస్థ నుంచి నేర్చుకుంటే మెరుగైన ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఇందులో రాణించాలంటే అనలిటికల్, ప్రాబ్లం సాల్వింగ్, కమ్యూనికేషన్, ఇంటర్ పర్సనల్ నైపుణ్యాలు చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎన్ అభిషేక్
Ans:
బీకాం బిజినెస్ అనలిటిక్స్ కోర్సు తరువాత డేటా అనలిస్ట్ అవ్వాలన్న మీ నిర్ణయం సరైందే. బీకాం తరువాత, అవకాశం ఉంటే ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ కోర్సు కూడా చదవండి. డేటా అనలిస్ట్ అవ్వడానికి సంబంధించిన ప్రాథమిక మెలకువలను మీరు బిజినెస్ అనలిటిక్స్ డిగ్రీలో చదువుతారు. అవకాశం ఉంటే ఐఐటీ మద్రాస్ అందిస్తున్న ఆన్‌లైన్ బీఎస్‌సీ డేటా సైన్స్ డిగ్రీని కూడా పూర్తి చేయండి. అలా కాకపోతే డిగ్రీ చేస్తూనే, డేటా సైన్స్ కోర్సులను ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా చేయండి. డేటా అనలిస్ట్ అవ్వాలంటే మేథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రామింగ్, కోడింగ్‌లపై మంచి పట్టుండాలి. మీరు ఇంటర్ ఒకేషనల్ కోర్సు చదివారు కాబట్టి, ఇంటర్ మ్యాథ్స్‌పై పట్టు సాధించండి. బీకాం డిగ్రీతో పాటు డేటా సైన్స్‌లో సర్టిఫికెట్/ డిప్లొమా కోర్సులు చేస్తూ, లైవ్ ప్రాజెక్టులు కూడా చేస్తే మీ ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: వి.సాయికృష్ణ
Ans:
ఇటీవలి కాలంలో చాలామంది విద్యార్ధులు ఇంటర్ తరువాత బీకాం డిగ్రీపై ఆసక్తి చూపుతున్నారు. దానికి ముఖ్య కారణం- కామర్స్ చదివినవారికి పెరుగుతున్న ఉద్యోగావకాశాలే! ముందుగా ఉన్నత విద్యావకాశాల విషయానికొస్తే, బీకాం చదివినవారు ఎంకాం, ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ ఫైనాన్సియల్ అకౌంటింగ్, చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, సర్టిఫైడ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్, మాస్టర్స్ ఇన్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్, మాస్టర్స్ ఇన్ రిస్క్ మేనేజ్‌మెంట్, మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్, మాస్టర్స్ ఇన్ బ్యాంకింగ్ స్టడీస్, మాస్టర్స్ ఇన్ ఇన్సూరెన్స్ స్టడీస్, మాస్టర్స్ ఇన్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, మాస్టర్స్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్ స్టడీస్ లాంటి చాలా ప్రోగ్రామ్‌లు చేసే అవకాశం ఉంది. వీటితో పాటు లా, పబ్లిక్ పాలసీ, టూరిజం, రిటైలింగ్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, జర్నలిజం, సైకాలజీ, ఫైనాన్సియల్ ఎకనామిక్స్, ఇంగ్లిష్/ తెలుగు లిటరేచర్, బిజినెస్ అనలిటిక్స్, ఎడ్యుకేషన్ లాంటి సబ్జెక్టుల్లో డిగ్రీ/ పీజీ కూడా చేయవచ్చు.
బీకాం చదివినవారు అకౌంటెంట్, ట్యాక్స్ కన్సల్టెంట్, అకౌంట్స్ అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, రిస్క్ మేనేజర్ లాంటి చాలా ఉద్యోగాలకు అర్హులవుతారు. ప్రభుత్వ/ ప్రైవేటు బ్యాంకుల్లో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్‌లైన్ రిటైలింగ్ సంస్థల్లో, ఫైనాన్స్ సంబంధిత ఐటీ కంపెనీల్లో, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో, ఇన్సూరెన్స్ కంపెనీల్లో వివిధ ఉద్యోగాలకు బీకాం చదివినవారికి అవకాశాలుంటాయి. కామర్స్‌లో పీజీ చేసి, జూనియర్/డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా, పీహెచ్‌డీ చేసి యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా స్థిర పడవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: కె.రామకృష్ణ
Ans:
ఎంఎల్‌ఐఎస్‌సీ చదివినవారికి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, డిగ్రీ కళాశాలల్లో, యూనివర్సిటీల్లో వివిధ రకాలైన లైబ్రేరియన్ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. యూనివర్సిటీల్లో అయితే.. ప్రొఫెషనల్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, లైబ్రరీ అసిస్టెంట్, జూనియర్ లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్, లైబ్రేరియన్ లాంటి చాలా ఉద్యోగాలకు మీరు అర్హులవుతారు. వీటితో పాటుగా ఆర్కైవిస్ట్, ఇన్ఫర్మేషన్ సెంటర్ డైరెక్టర్, రికార్డ్ మేనేజర్, డాక్యుమెంటేషన్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాల గురించి కూడా ఆలోచించవచ్చు. బ్యాంకుల్లో, మ్యూజియాల్లో కూడా లైబ్రరీ సైన్స్ చదివినవారికి పరిమిత సంఖ్యలో అవకాశాలుంటాయి.
బోధన రంగంపై ఆసక్తి ఉంటే లైబ్రరీ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసి, అధ్యాపక ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్చు. విదేశాల్లో కూడా దాదాపుగా పైన పేర్కొన్న ఉద్యోగాలన్నీ అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు రంగానికొస్తే - యూనివర్సిటీల్లో, కళాశాలల్లో లైబ్రేరియన్ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. లైబ్రరీ సైన్స్ చదివినవారికి మీడియా రంగంలోనూ ఉపాధికి వీలుంటుంది. లైబ్రరీ సైన్స్ పరిజ్ఞానంతో పాటు, కొంత ఐటీ పరిజ్ఞానం కూడా పెంపొందించుకొంటే ఇన్ఫర్మేషన్ అనలిస్ట్, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్ట్ లాంటి ఉద్యోగాలకు అర్హులవుతారు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎం. రాజేష్
Ans:
ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్) చేసినవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ రకాలైన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు.. కంప్యూటర్ ప్రోగ్రామర్, సిస్టమ్స్ అనలిస్ట్, సిస్టమ్స్ మేనేజర్, సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్ ఇంజినీర్, కంప్యూటర్ సైంటిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ఐటీ ఆఫీసర్, ఐటీ కన్సల్టెంట్, కంప్యూటర్ అసోసియేట్..ఇలాంటివి. ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రభుత్వరంగ సంస్థలైన బీహెచ్‌ఈఎల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎన్‌ఎండిసీ‡, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, భారత్ పెట్రోలియం, సెయిల్, గెయిల్ లాంటి మరెన్నో సంస్థల్లో పైన పేర్కొన్న ఉద్యోగాలున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కూడా ఐటీ కొలువులు ఉంటాయి. ఈ సంస్థలన్నీ ప్రత్యేకమైన ఉద్యోగ నోటిఫికేషన్‌ల ద్వారా నియామకాలు చేపడుతున్నాయి.
మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే జవహర్ నవోదయ/ కేంద్రీయ విద్యాలయ లాంటి సంస్థల్లో కంప్యూటర్ టీచర్ ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్చు. ఆయా సంస్థల వెబ్‌సైట్‌లను తరచుగా సందర్శిస్తూ ఉద్యోగ ప్రకటన వచ్చినప్పుడు, దరఖాస్తు చేసుకోండి. అవసరమైన పరీక్ష రాసి ఇంటర్వ్యూ ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ప్రయత్నించండి. సాధారణంగా ప్రభుత్వ సంస్థల్లో కంప్యూటర్/ఐటీ ఉద్యోగాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఆ తక్కువ ఉద్యోగాలకు ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్) చేసినవారితో పాటు, ఎంసీఏ, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసినవారూ దరఖాస్తు చేస్తుండటం వల్ల పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలోపు ప్రైవేటు ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించి ఉద్యోగానుభవాన్ని పొందండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్