Post your question

 

    Asked By: ఎంవీఆర్‌ సుబ్బారావు

    Ans:

    మీరు యూఎస్‌లో ఏ సబ్జెక్టులో మాస్టర్స్‌ చేశారో చెప్పలేదు. అలాగే మాస్టర్స్‌ కాలవ్యవధి ఒక సంవత్సరమో, రెండు సంవత్సరాలో కూడా చెప్పలేదు. సాధారణంగా యూఎస్‌లో రెండు సంవత్సరాల మాస్టర్స్‌లో 36 నుంచి 42 క్రెడిట్‌లుంటాయి. మనదేశంలో రెండు సంవత్సరాల పీజీ కోర్సులో 72 నుంచి 80 క్రెడిట్‌లు ఉంటాయి. మనదేశంలో ఎంటెక్‌ కోర్సులో అయితే 68 క్రెడిట్‌లుంటాయి. మీరు ఆంధ్రా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేయాలంటే ముందుగా యూఎస్‌లో చేసిన మాస్టర్స్‌ డిగ్రీ, ఇండియా మాస్టర్స్‌ డిగ్రీకి సమానమని ఆంధ్ర యూనివర్సిటీ వారు అంగీకరించాలి. డిల్లీలో ఉన్న అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ (ఏఐయూ) వారు కోర్సు కాల వ్యవధి, క్రెడిట్ల సంఖ్య, సిలబస్‌ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని యూఎస్‌ డిగ్రీ, ఇండియన్‌ డిగ్రీకి సమానమని ఈక్వివలెన్స్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. ఏఐయూ వెబ్‌సైట్‌కి వెళ్ళి, మీరు చదివిన యూఎస్‌ యూనివర్సిటీ మాస్టర్స్‌ డిగ్రీకి ఇండియన్‌ మాస్టర్స్‌ డిగ్రీతో సమాన హోదా ఇచ్చారేమో చూడండి. లేని పక్షంలో ఏఐయూకి మీరే దరఖాస్తు చేసుకోండి. ఇదంతా చేసేముందు ఒకసారి ఆంధ్రా యూనివర్సిటీలో రీసెర్చ్‌ డీన్‌ని సంప్రదించి, మీ పీహెచ్‌డీ అవకాశాల గురించి చర్చించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: అబ్దుల్‌ హమీద్‌

    Ans:

    ఇస్లామిక్‌ స్టడీస్‌లో బి.ఎ. కోర్సు అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ అలీఘర్, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ దిల్లీ, జామియా హందర్డ్‌ యూనివర్సిటీ దిల్లీ, అలియా యూనివర్సిటీ, మౌలానా ఆజాద్‌ కాలేజ్‌ - కోల్‌కతా, బీఎస్‌ అబ్దుర్‌ రహమాన్‌ క్రెసెంట్‌ యూనివర్సిటీ చెన్నైల్లో అందుబాటులో ఉంది. మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (హైదరాబాద్‌) ఇస్లామిక్‌ స్టడీస్‌లో బి.ఎ. కోర్సును దూరవిద్యలో అందిస్తోంది. బి.ఎ. ఇస్లామిక్‌ స్టడీస్‌ తరువాత ఎంఏ ఇస్లామిక్‌ స్టడీస్‌ చదివే అవకాశం ఉంది. ఎంబీఏ ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ కూడా చదవొచ్చు. ఇవే కాకుండా - బి.ఎ. డిగ్రీ అర్హతతో చదివే పీజీ కోర్సులన్నిటికీ అర్హులవుతారు.
    బి.ఎ. తరువాత బీఈడీ చేసి ఉపాధ్యాయులుగా, ఎంఏతో కళాశాలలో అధ్యాపకులుగా, పీహెచ్‌డీ చేసి యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా స్థిరపడవచ్చు. డిగ్రీ తరువాత జర్నలిజం చేసి జర్నలిస్టులుగా చేరవచ్చు. డిగ్రీ అర్హత ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు అనువాదకులుగానూ పనిచేయవచ్చు. కేంద్రప్రభుత్వ మైనారిటీస్‌ అఫైర్స్‌ మంత్రిత్వశాఖ  ‘మోమా’ స్కాలర్‌షిప్, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు, వివిధ యూనివర్సిటీలు అందించే మెరిట్‌ కమ్‌ మీన్స్‌ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: ఎం.శ్రీలత

    Ans:

    మీరు డిగ్రీలో హిందీని ఒక ఆప్షనల్‌ సబ్జెక్టుగా చదివారో, ఒక లాంగ్వేజ్‌గా అయినా చదివారో లేదో తెలియదు. గతంలో హిందీ పండిట్‌ కోర్సు చేయాలంటే దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి ప్రవీణ/ విద్వాన్‌ చేసినవారికి కూడా అర్హత ఉండేది. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ద్వారా 2018లో జారీ అయిన జీఓ ప్రకారం- లాంగ్వేజ్‌ పండిట్‌ శిక్షణ పొందాలంటే డిగ్రీలో హిందీని ఒక ఆప్షనల్‌గా చదివుండాలి. బి.ఎ. (హిందీ లిటరేచర్‌) చేసినవారికీ, హిందీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఓరియంట్‌ లాంగ్వేజెస్‌ చేసినవారికీ, ఎంఏ హిందీ చేసినవారికీ కూడా ఎల్‌పీసెట్‌ (లాంగ్వేజ్‌ పండిట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) రాయడానికి అర్హత ఉంది. ఎల్‌పీసెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో హిందీ పండిట్‌ ట్రైనింగ్‌ కోర్సును రెగ్యులర్‌గా చేసే అవకాశం ఉంది. మీరు ప్రభుత్వ గుర్తింపు ఉన్న కళాశాల నుంచి హిందీ పండిట్‌ ట్రైనింగ్‌ చేస్తే, డీఎస్సీ రాయడానికి అర్హులవుతారు. హిందీ పండిట్‌ ట్రైనింగ్‌ కోర్సును ప్రైవేటుగా/ దూరవిద్య ద్వారా చేసే అవకాశం లేదు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: బి.వినీల

    Ans:

    ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో చేరడానికి ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఈ కోర్సు బాంబే/ కాన్పూర్‌/ మద్రాసు/ ఖరగ్‌పూర్‌ ఐఐటీల్లో, అతికొద్ది ప్రభుత్వ యూనివర్సిటీల్లో / ప్రైవేటు యూనివర్సిటీల్లో/ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అందుబాటులో ఉంది. ఐఐటీల్లో ప్రవేశానికి జేెఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు పొందాలి. ఐఐటీలతో పాటు తిరువనంతపురంలో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నాలుగు సంవత్సరాల బీటెక్‌ ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశానికి కూడా జేెఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకును ప్రాతిపదికగా తీసుకొంటారు. రాష్ట్రప్రభుత్వ యూనివర్సిటీ/ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకు పొందాలి. ప్రైవేటు యూనివర్సిటీలు తాము నిర్వహించే ప్రత్యేక ప్రవేశపరీక్షల్లో కనపర్చిన ప్రతిభ ఆధారంగా అడ్మిషన్లు నిర్వహిస్తాయి. కొన్ని ప్రైవేటు యూనివర్సిటీలు ఇంటర్మీడియట్‌ మార్కుల ఆధారంగా కూడా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: ఎల్‌. రాజు

    Ans:

    మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ డిప్లొమా పూర్తయిన తరువాత బీఎస్సీని మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌/మెడి కల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ/మైక్రో బయాలజీ/బయోకెమిస్ట్రీ/ బయోమెడికల్‌/ జెనెటిక్స్‌/ బయోటెక్నాలజీ లాంటి సబ్జెక్టులతో చదివి, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోసం విదేశాలకు వెళ్ళండి. విదేశాల్లో పీజీ చేయాలంటే జీఆర్‌ఈ, టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌ లాంటి పరీక్షలు రాసి మెరుగైన స్కోరు పొందాలి. సాధారణంగా డిగ్రీలో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు చదివినవారు పీజీలో మెడికల్‌ ల్యాబొరేటరీ సైన్స్‌ కాన్సంట్రేషన్, బయోమెడికల్‌ ల్యాబొరేటరీ సైన్స్, ల్యాబొరేటరీ మెడిసిన్, క్లినికల్‌ ల్యాబొరేటరీ సైన్స్‌ లాంటి కోర్సులు చేసే అవకాశం ఉంది. ఒకవేళ మీరు బీఎస్సీలో మైక్రో బయాలజీ/బయోకెమిస్ట్రీ/ బయోమెడికల్‌/జెనెటిక్స్‌/ బయోటెక్నాలజీ లాంటి సబ్జెక్టులు చదివితే, ఎంఎస్‌లో ఆ స్పెషలైజేెషన్‌లు చదివే అవకాశం కూడా ఉంది. మీరు ఏ దేశంలో, ఏ యూనివర్సిటీలో, ఏ కోర్సు చదవాలనుకొంటున్నారో -  ఆ కోర్సుకు అవసరమైన అర్హతలను సరిచూసుకొని దరఖాస్తు చేసుకోండి.

    Asked By: సాయికృష్ణ

    Ans:

    బీఎస్‌సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌) చదివినవారు ఎమ్మెస్సీలో మ్యాథ్స్‌/స్టాటిస్టిక్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ డేటా సైన్స్‌/ ఆక్చూరియల్‌ సైన్స్‌ కోర్సులు చదవొచ్చు. ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కూడా చేసే అవకాశం ఉంది. ఎంసీఏ గురించి కూడా ఆలోచించవచ్చు. ఇవే కాకుండా- ఏదైనా డిగ్రీ అర్హతతో చదివే ఎంబీఏ, ఎంఏ (తెలుగు/ ఇంగ్లిష్‌/ హిందీ/సైకాలజీ/ జర్నలిజం/ ఎకనామిక్స్‌/, హిస్టరీ/ సోషియాలజీ/ఆంత్రొపాలజీ /పొలిటికల్‌ సైన్స్‌/ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌/ జాగ్రఫీ/ ఎడ్యుకేషన్‌/ ఫిలాసఫీ/ లింగ్విస్టిక్స్‌/ ఎల్‌ఎల్‌బీ/ పబ్లిక్‌ హెల్త్‌/ పబ్లిక్‌ పాలసీ/ బీఈడీ లాంటి కోర్సులు చదవొచ్చు. ఉద్యోగావకాశాల విషయానికొస్తే డిగ్రీలో మీరు  చదివుతున్న స్టాటిస్టిక్స్‌ విద్యార్హతతో అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌  ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత వస్తుంది. కేంద్ర/  రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు, డిగ్రీ విద్యార్హతతో నియామకం చేసే ప్రభుత్వ ఉద్యోగాలకూ అర్హులే. వీటితో పాటు పోలీసు, బ్యాంకు ఉద్యోగాలనూ ఆలోచించంచవచ్చు. కనీసం ఏడాదిపాటు కొన్ని సాఫ్ట్‌వేర్‌లు నేర్చుకొని ఐటీ కంపెనీల్లో ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: కె.హరనాథ్

    Ans:

    స్పీచ్‌ థెరపిస్ట్‌ అవ్వాలంటే మూడు సంవత్సరాల వ్యవధి ఉన్న బీఎస్సీ ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పెథాలజీ కోర్సు చేయాలి. ఈ కోర్సు అలీ యవార్‌ జంగ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ డిజేబిలిటీస్‌ సికింద్రాబాద్, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ మైసూరు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ చండీఘర్, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ న్యూడిల్లీ, బాంబే యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్, మణిపాల్‌ యూనివర్సిటీ, అమిటి యూనివర్సిటీ నోయిడా, క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌ వెల్లూర్, భారతీ విద్యాపీఠ్‌ పుణె లాంటి విద్యాసంస్థల్లో ఉంది. ఆటిజం, డిస్లెక్సియా లాంటి ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ప్రత్యేక ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేవు. కానీ, ఏ ప్రభుత్వ పాఠశాల కూడా ఇలాంటి పిల్లలకు అడ్మిషన్‌ని నిరాకరించకూడదు. కానీ చాలా  ప్రభుత్వ పాఠశాలల్లో వీరి ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా బోధించే ఉపాధ్యాయుల లేమి, వారికి అవసరమైన ప్రత్యేక బోధనా పరికరాల కొరత ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎ.మహేష్‌

    Ans:

    యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ఒకే సమయంలో రెండు డిగ్రీలు/ పీజీలు ఒకటి రెగ్యులర్‌గా, మరొకటి రెగ్యులర్‌/ ఆన్‌లైన్‌/ డిస్టెన్స్‌/ ఓపెన్‌ పద్ధతిలో చదివే అవకాశం ఉంది. డిగ్రీ/పీజీతోపాటు డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులు చేసే వెసులుబాటు గతంలో కూడా ఉంది. కానీ బీఈడీ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ అనే రెగ్యులేటరీ సంస్థ (ఎన్‌సీటీఈ) నియంత్రణలో ఉంది. ఇప్పటివరకైతే ఎన్‌సీటీఈ వారు బీఈడీతో పాటు మరో కోర్సు చేసే విషయంలో ఎలాంటి మార్గదర్శకాలూ విడుదల చేయలేదు. కాబట్టి మీరు బీఈడీ కోర్సు చేసే సమయంలో మరో కోర్సు చేయకపోవడమే శ్రేయస్కరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

     

    Asked By: కావ్య

    Ans:

    బీడీఎస్‌ తర్వాత యూఎస్‌లో పీజీ చేయాలంటే యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగన్, వాషింగ్టన్, బోస్టన్‌ యూనివర్సిటీ, టెక్సాస్‌ ఎ అండ్‌ ఎం యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఇలినాయిస్, నార్త్‌ కరోలినా, హార్వర్డ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా, బహాయో స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ అలబామాల్లో అవకాశం ఉంది. ఇక స్కాలర్‌షిప్‌ విషయానికి వస్తే.. ఏడీఈఏ/ క్రెస్ట్‌ ఓరల్‌ బి స్కాలర్‌షిప్‌ ఫర్‌ డెంటల్, డెంటల్‌ ట్రేడ్‌ అలయన్స్‌ ఫౌండేషన్, ఏడీఈఏ/గ్లాక్సో స్మిత్‌క్లిన్‌ కన్‌స్యూమర్‌ హెల్త్‌ కేర్‌ డెంటిస్ట్రీ స్కాలర్‌షిప్, ఏడీఈఏ ఫౌండేషన్‌ డెంటల్‌ స్టూడెంట్‌ స్కాలర్‌షిప్, బారిగోల్డ్‌ వాటర్, క్రాక్‌డాట్‌ ప్రి డెంటల్‌ స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. - ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: టి.సునీల్‌కుమార్‌

    Ans:

    ఎన్‌సీహెచ్‌ఎం - జేఈఈ (నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌)లో మెరుగైన ర్యాంకు సాధించినవారికి  బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌)లో ప్రవేశం లభిస్తుంది. ఈ  కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ సంవత్సరానికి ఒకసారి ఇంగ్లిష్‌/హిందీ మీడియాల్లో నిర్వహిస్తుంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎన్‌సీహెచ్‌ఎం- జేఈఈ నోటిఫికేషన్‌ ఇటీవలే విడుదలయింది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 27 ఏప్రిల్‌. జాతీయ విద్యా విధానం-2020 ప్రకారం ఈ కోర్సులో చేరడానికి గరిష్ట వయః పరిమితి లేదు.
    ఎన్‌సీహెచ్‌ఎం - జేఈఈలో న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ అనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌లో 30 ప్రశ్నలు, రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌లో 30 ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌లో 30 ప్రశ్నలు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 60 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్‌ ఫర్‌ సర్వీస్‌ సెక్షన్‌లో 50 ప్రశ్నల చొప్పున మొత్తం 200 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. మీకు హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ రంగంపై ఆసక్తి ఉంటే నిరభ్యంతరంగా ఈ పరీక్ష రాయవచ్చు. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌ సరళి ప్రకారం బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ లాంటి కోర్సులు చేస్తే త్వరగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. మీరు బీఎస్సీ (కంప్యూటర్స్‌) కోర్సు పూర్తిచేసి ఐదేళ్లు అయింది కాబట్టి, డిగ్రీలో చదివిన కంప్యూటర్‌ సబ్జెక్టులను మరొక్కసారి పూర్తిగా చదివి, ఎమ్మెస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) / ఎమ్మెస్సీ (డేటా సైన్స్‌) /ఎంసీఏ లాంటి పీజీ కోర్సులు చేయొచ్చు. మీకు ఎంబీఏ మీద ఆసక్తి ఉంటే ఎంబీఏ (బిజినెస్‌ అనలిటిక్స్‌) గురించీ ఆలోచించండి. ముందుగా మీరు ‘ఆర్‌’, ‘పైతాన్‌’ లాంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లపై గట్టి పట్టు సాధించండి. ఆ తరువాత ఆసక్తి ఉన్న రంగానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లను ప్రైవేటుగా నేర్చుకొని మీ ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోండి. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌