Post your question

 

    Asked By: ఎం.అజయ్‌ కుమార్‌

    Ans:

    తెలుగు నుంచి ఇంగ్లిషుకు, ఇంగ్లిషునుంచి తెలుగుకు అనువాదాలు చేసే ఉద్యోగ, వ్యాపార సంస్థలు చాలానే ఉన్నాయి. కానీ అనువాదాల్లో శిక్షణ ఇచ్చే సంస్థలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఆ సంస్థల విశ్వసనీయత కూడా తక్కువే! కనీసం రెండు భాషల్లో ప్రావీణ్యం ఉండి, వాటి వ్యాకరణంపై మంచి పట్టువుండి, సృజనాత్మకత, అనువాదాలపై ఆసక్తి ఉంటే అనువాదాలు చేయటం కష్టమేమీ కాదు. మొదట్లో కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ అనుభవం పెరిగేకొద్దీ మెలకువలు పెంపొందించుకోవచ్చు.
    ఉద్యోగ అవకాశాల విషయానికి వస్తే గూగుల్‌ ట్రాన్స్‌లేషన్, ఇతర ఆన్‌లైన్‌ ట్రాన్సలేషన్‌ సేవలు అందుబాటులో లేని సమయాల్లో అనువాదకులకు చాలా డిమాండ్‌ ఉండేది. ప్రభుత్వ సంస్థల్లో అనువాదకులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి.  అనువాదంలో నైపుణ్యం ఉన్నవారికి అడ్వర్‌టైజింగ్‌ రంగంలో, పత్రికా, సాహిత్య రంగాల్లో, లీగల్‌ పరంగా ఉపాధి అవకాశాలు బాగానే ఉన్నాయి. మీకు ఈ రంగంలో చదవాలనే ఆసక్తి ఉంటే ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కూడా చేయవచ్చు. కానీ, ఈ అవకాశాలు కూడా పరిమిత విద్యాసంస్థల్లోనే అందుబాటులో ఉన్నాయి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: నరసింహారావు

    Ans:

    ప్రస్తుత పోటీ ప్రపంచంలో లక్ష్యాలను సాధించగల సామర్థ్యం ద్వారా మాత్రమే విజయాన్ని కొలుస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్నప్పటికీ, జీవితంలో ఎదుగుదల కోసం వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుకోవడం అవసరం. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ అంటే వ్యక్తిత్వాన్ని రూపొందించే నైపుణ్యాలను పెంపొందించడంపై మరింత దృష్టి పెట్టడం. ఇతరుల వ్యక్తిత్వాలను మెరుగుపరుస్తూ స్వీయ అవగాహన పొందే మెలకువలను ఎవరికి వారే స్వయంగా నేర్చుకోవడంలో వ్యక్తిత్వ వికాస కోచ్‌ సహాయపడతారు. అందుకు అవసరమైన వ్యూహాలను ప్రయోగిస్తారు. వ్యక్తి సామాజిక నైపుణ్యాలు, ఉత్పాదకత, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, పాజిటివ్‌ థింకింగ్, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ పెంపొందించడంపై దృష్టి పెడతారు. అదేసమయంలో లక్ష్యాలను నిర్దేశించుకోడానికీ, వాటి సాధనకూ మార్గదర్శకాలను అందిస్తారు. వ్యక్తుల బలాలు, బలహీనతలు, అవకాశాలు, ఇబ్బందులు గుర్తించడంలో సహాయపడతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జీవిత సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలనే విషయాలపై సలహాలు ఇస్తారు.
    కోచ్‌గా రాణించాలంటే ఈ రంగంపై విపరీతమైన ఆసక్తి, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, నెట్‌ వర్కింగ్‌ నైపుణ్యాలు, సానుకూల దృక్పథం, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్, సహానుభూతి, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, ఎంతో ఓపిక, దృఢమైన వ్యక్తిత్వం అవసరం. ముందుగా సైకాలజీ, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, స్వీయ చరిత్రలు చదవండి. వీలుంటే సైకాలజీలో పీజీ చేయండి. కౌన్సెలింగ్‌ సైకాలజీలో డిప్లొమా కూడా చేయండి. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కోర్సులను ఆన్‌  లైన్‌లో చేయండి. సంబంధిత కోచ్‌ దగ్గర అప్రెంటిస్‌గా చేరి ఈ రంగంలో నైపుణ్యాలు పెంపొందించుకొని, విశ్వసనీయత గల సంస్థ నుంచి సర్టిఫికేషన్‌ పొందే  ప్రయత్నం చేయండి. సరైన నైపుణ్యాలు లేకుండా ఈ రంగంలో ప్రవేశించకూడదని మర్చిపోవద్దు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


     

    Asked By: దుర్వ బిల్లా

    Ans:

    సాధారణంగా ఎవరైనా రెండు డిగ్రీలు ఒకే సమయంలో చేస్తే, అందులో కచ్చితంగా ఒకటి దూరవిద్య/ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా చేసి ఉంటారు. కానీ, మీరు రెండు రెగ్యులర్‌ డిగ్రీలను ఒకే సమయంలో, రెండు వేర్వేరు రాష్ట్రాలనుంచి చేశారు. ఇది ఎలా సాధ్యం అయింది? ఈ రెండు డిగ్రీల్లో మీరు ఏ డిగ్రీని రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లి, నిర్దేశిత హాజరుతో పూర్తిచేశారు? ఒకే సమయంలో రెండు డిగ్రీలు, రెండు రాష్ట్రాల్లో చేసినట్లు మీరు దరఖాస్తులో రాస్తే, ఆ విషయం మీ ఉద్యోగావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకని మీరు నిజాయతీగా చేసిన డిగ్రీతో మాత్రమే ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. రెండో డిగ్రీ విషయం పూర్తిగా మర్చిపోండి. ఇటీవల యూజీసీ జారీ చేసిన నిబంధనల ప్రకారం రెండు రెగ్యులర్‌ డిగ్రీలను ఒకే సమయంలో చేసే అవకాశం ఉంది. కానీ మీరు డిగ్రీలు చదువుతున్న రెండు కళాశాలల పని సమయాలు వేర్వేరుగా ఉండాలి. రెండు కళాశాలల్లో కూడా నిర్దేశిత హాజరు శాతం కచ్చితంగా ఉండాలి. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఉండాలంటే, యూజీసీ నిబంధనలను పాటిస్తూ మీ ఉద్యోగ ప్రయత్నాలు/ఉన్నత విద్యను కొనసాగించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    ఇటీవలికాలంలో చాలా ఉద్యోగ/ప్రవేశ పరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)గానే నిర్వహిస్తున్నారు. కొన్ని సంవత్సరాలపాటు పెన్ను, పేపర్‌ పరీక్షలకు అలవాటుపడిన తరానికి మొదటిసారి సీబీటీ రాయడం కొంత కంగారు కలిగించవచ్చు. కానీ కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని, మాక్‌ టెస్ట్‌లను కంప్యూటర్‌పై సాధన చేస్తే సీబీటీని సులువుగా రాయవచ్చు. సాధారణ రాత పరీక్షలో అభ్యర్థులు తమకు కేటాయించిన బెంచి/ కుర్చీపై కూర్చొని రైటింగ్‌ ప్యాడ్‌/ టేబుల్‌పై పరీక్ష రాస్తారు. కానీ సీబీటీలో వారికి కేటాయించిన కంప్యూటర్‌ ముందు కూర్చుంటారు. కేటాయించిన ఐడీ…, పాస్‌వర్డ్‌లతో లాగిన్‌ అవ్వాలి. ఆపై తెరపై ఉన్న వివరణాత్మక సూచనలను జాగ్రత్తగా చదవాలి. పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నలు కంప్యూటర్‌ తెర మీద కనిపిస్తాయి. ప్రశ్నను జాగ్రత్తగా చదివి, సరైన సమాధానాన్ని మౌస్‌తో గుర్తించాలి. పరీక్ష అయ్యేవరకు కీబోర్డ్‌ పనిచేయదు. ఒకవేళ మీరు తప్పు సమాధానాన్ని గుర్తించినట్లు భావిస్తే, పరీక్ష పూర్తయ్యేలోపు ఎప్పుడైనా దాన్ని సరిచేసుకోవచ్చు. ఈ  వెసులుబాటు పెన్ను, పేపర్‌ పరీక్షల్లో ఉండదు.  ఏదైనా కంప్యూటర్‌/మౌస్‌ సరిగా పనిచేయకపోతే, ఆ అభ్యర్ధికి వెంటనే మరొక కంప్యూటర్‌/మౌస్‌ను కేటాయిస్తారు. ఈ మార్పిడిలో కోల్పోయిన సమయం సర్వర్‌లో సర్దుబాటు చేస్తారు. రాత పరీక్షలోలాగా మీరు ప్రతిసారీ టైమ్‌ చూసుకొనే పని లేకుండా, మానిటర్‌పై ఇంకా ఎంత  టైమ్‌ మిగిలి ఉందో కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి టైమర్‌ సున్నాను చూపించగానే పరీక్ష పూర్తవుతుంది. మీరు గుర్తించిన సమాధానాలు వాటికవే అప్‌ లోడ్‌ అయిపోతాయి. ప్రత్యేకించి పరీక్షను క్లోజ్‌ చేయాల్సిన అవసరం లేదు. పరీక్ష రాసేప్పుడు సమయంతో పాటు, ఎన్ని ప్రశ్నలు చదివారు, ఎన్ని  సమాధానాలు రాశారు, ఎన్నింటికి సమాధానాలు రాయలేదు, ఎన్ని సమాధానాలను రివ్యూ చేయాలని భావించారు అనే వివరాలు కూడా డిస్‌ ప్లే అవుతాయి. ఒకవేళ పరీక్ష సమయం పూర్తయ్యేలోపు మీరు రివ్యూ చేయాలనుకున్న సమాధానాలను రివ్యూ చేయలేకపోతే, ఆ సమాధానాలను కూడా మూల్యాంకనం చేస్తారు. మీరు పరీక్ష రాసేప్పుడు అవసరమైన కాలిక్యులేషన్స్‌ అన్నింటినీ ఇచ్చిన రఫ్‌షీట్‌లో మాత్రమే చేయాలి. పరీక్ష పూర్తయిన తర్వాత రఫ్‌ షీట్లను తప్పనిసరిగా విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని సీబీటీని ధైర్యంగా రాయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: స్వరూప్

    Ans:

    You can take the study certificates from DEO or MEO office. Or else you can take residensial certificate from your MRO office.

    Asked By: వంశీ గంగా

    Ans:

    డిగ్రీ స్థాయిలో బాంబే స్టాక్‌ ఎక్స్చేంజి ఇన్‌స్టిట్యూట్‌ వారు అందించే బీఎమ్మెస్‌ ఇన్‌ కాపిటల్‌ మార్కెట్స్, బీబీఏ ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, బీబీఏ ఇన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్‌ అనలిటిక్స్, బీబీఎ ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అనలిటిక్స్, బీఎస్సీ ఇన్‌ డేటా సైన్సెస్, బాచిలర్స్‌ ఇన్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్స్, బీబీఏ ఇన్‌ కాపిటల్‌ మార్కెట్స్‌ లాంటి కోర్సుల్లో మీకు నచ్చిన డిగ్రీ చేసి బాంబే స్టాక్‌ ఎక్స్చేంజిలో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి.

     

    ఒకవేళ మీరు డిగ్రీ పూర్తి చేసివుంటే బాంబే స్టాక్‌ ఎక్స్చేంజి ఇన్‌స్ట్టిట్యూట్‌ అందించే పీజీ డిప్లొమా ఇన్‌ గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్స్, పీజీ సర్టిఫికెట్‌ ఇన్‌ డేటా అనలిటిక్స్‌ అండ్‌ బిజినెస్‌ ఇంటెలిజెన్స్, పీజీ సర్టిఫికెట్‌ ఇన్‌ ఫైనాన్సియల్‌ టెక్నాలజీ, పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్, పీజీ డిప్లొమా ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ, పీజీ డిప్లొమా ఇన్‌ ప్రెడిక్టివ్‌ అనలిటిక్స్, పీజీ డిప్లొమా ఇన్‌ డేటాసైన్స్‌ అండ్‌ అనలిటిక్స్, పీజీ డిప్లొమా ఇన్‌ కాపిటల్‌ మార్కెట్స్‌ లాంటి వాటిలో మీకు ఆసక్తి ఉన్న కోర్సు చదవండి. మీరు ఏదైనా ఉద్యోగంలో ఉంటే, బాంబే స్టాక్‌ ఎక్స్చేంజి ఇన్‌స్టిట్యూట్‌ అందించే వివిధ ఎగ్జిక్యూటివ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను చేయడం ద్వారా బాంబే స్టాక్‌ ఎక్స్చేంజిలో పనిచేయాలనే మీ కోరికను నెరవేర్చుకోండి. ఇవే కాకుండా బాంబే ఎక్స్చేంజి ఇన్‌స్ట్టిట్యూట్‌వివిధ సర్టిఫికెట్‌ కోర్సులూ, అంతర్జాతీయ పీజీ కోర్సులనూ అందిస్తోంది.  - ప్రొ. బెల్లకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సుమన్ తేజ్ బదావత్

    Ans:

    - ప్రపంచవ్యాప్తంగా ఇటీవలికాలంలో మల్టీ డిసిప్ల్లినరీ పరిశోధనలకు ప్రాధాన్యం పెరుగుతోంది. కానీ మనదేశంలో ఐఐటీ/ యూనివర్సిటీల్లో, ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ నిబంధనల ప్రకారం, మేథమెటిక్స్‌లో పీహెచ్‌డీ చేయాలంటే గణితంలో కచ్చితంగా ఎంఎస్సీ/ఎంఏ చదివి ఉండాలి. జాతీయ విద్యావిధానం-2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే మాత్రం ఈ విషయంలో వెసులుబాటు ఇవ్వొచ్చు. బీటెక్‌ డిగ్రీతో పాటు, మేథమెటిక్స్‌ సబ్జెక్ట్‌లో అత్యంత విషయపరిజ్ఞానం కలిగినవారికి టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్, చెన్నై మేథమెటికల్‌ ఇన్‌స్ట్టిట్యూట్, ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమెటికల్‌ సైన్సెస్‌ లాంటి అతికొద్ది పరిశోధన సంస్థల్లో మేథమెటిక్స్‌లో పీహెచ్‌డీ చేయడానికి అర్హత ఉంది. అయితే, మీరు ప్రవేశ పరీక్ష/ ఇంటర్వ్యూల్లో ఎంఎస్సీ/ఎంఏ మేథమెటిక్స్‌ చదివినవారితో పోటీపడవలసి ఉంటుంది. విదేశాల్లో చాలాచోట్ల నాలుగు సంవత్సరాల డిగ్రీ తరువాత పీజీ చేయకుండానే నచ్చిన సబ్జెక్టులో పీహెచ్‌డీ… చేసే అవకాశం ఉంటుంది.

    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,  కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: vamsi

    Ans:

    Dear Vamsi,

    First of all congratulations for having an idea and being particular about your career at this age.  Here are some links provided for your information. Hope this will clear doubts. Ignore about application dates, just note the core content and note about the months of application process, because notifications every year come on those months.

    After going through the articles,if you still doubts then don't hesitate to post your question again.

    https://www.eenadupratibha.net/careersandcourses/lesson/courses/designing/education/2-14-97-702-21010001220

    https://www.eenadupratibha.net/careersandcourses/lesson/courses/designing/iiad-notification/2-14-97-702-21010000458

    https://www.eenadupratibha.net/careersandcourses/lesson/courses/designing/nid-admission/2-14-97-702-21010000386