Post your question

 

    Asked By: వి. శ్రీలలిత, నెల్లూరు

    Ans:

    గతంలో బీఈడీ ప్రోగ్రామ్‌ దూరవిద్యా విధానంలో చాలా యూనివర్సిటీల్లో ఉండేది. బీఈడీ ప్రోగ్రామ్‌ కాలవ్యవధిని రెండు సంవత్సరాలకు పెంచాక, మారిన ఎన్‌సీటీఈ నిబంధనల దృష్ట్యా చాలా యూనివర్సిటీల్లో ఈ ప్రోగ్రామ్‌ ప్రస్తుతం లేదు. ఎన్‌సీటీఈ, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో అనుమతితో మాత్రమే బీఈడీ దూరవిద్య/ కరస్పాండెన్స్‌ విధానంలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో బీఈడీ ప్రోగ్రామ్‌ ఉంది. బీఈడీని దూరవిద్యలో చేయాలంటే రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ విద్యార్హతతో పాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలలో కనీసం రెండేళ్ల బోధనానుభవం కచ్చితంగా ఉండాలి. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తమిళనాడులో బీఈడీ ప్రోగ్రామ్‌ దూరవిద్య/ కరస్పాండెన్స్‌ విధానంలో లేదు. వివిధ యూనివర్సిటీల వెబ్‌సైట్‌లను తరచుగా సందర్శిస్తూ బీఈడీ ప్రోగ్రామ్‌ (దూరవిద్య/ కరస్పాండెన్స్‌) సమాచారాన్ని తెలుసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎన్‌.చైతన్య

    Ans:

    యూజీసీ ఇటీవల జారీ చేసిన రెగ్యులేషన్స్‌ ప్రకారం ఒకే సమయంలో ఒక డిగ్రీని రెగ్యులర్‌ పద్ధతిలో, మరో డిగ్రీని ఆన్‌లైన్‌/ డిస్టెన్స్‌/ ఓపెన్‌ పద్దతిలో చేయవచ్చు. కానీ బీఈడీ కోర్సు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నియంత్రణలో ఉన్నందువల్ల వారి మార్గదర్శకాలు అనుసరించవలసి ఉంటుంది. ఎన్‌సీటీఈ సంస్థ ఇప్పటివరకు డీ… ఈడీ/బీఈడీ/ ఎంఈడీలతో పాటు మరో డిగ్రీ చేయవచ్చనే విషయాన్ని చెప్పలేదు కాబట్టి, మీరు బీఈడీ పూర్తిచేసిన తరువాతే, ఎంఏ చదవండి. బీఈడీ ప్రొఫెషనల్‌ కోర్సు కాబట్టి, మీరు బీఈడీపై శ్రద్ధ పెట్టి, ఆ కోర్సులో సరైన శిక్షణ పొందండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: గాయత్రి

    Ans:

    మీరు నిరభ్యంతరంగా బీఈడీ కోర్సు చెయ్యొచ్చు. డిగ్రీలో మీరు తెలుగు, హిస్టరీ సబ్జెక్టులు చదివారు కాబట్టి, ఆ రెండు మెథడాలజీలతో బీఈడీ చేసే అవకాశం ఉంది. మీ ఐదు సంవత్సరాల డిగ్రీ కోర్సులో మొదటి రెండు సంవత్సరాలను పీడీసీ (ప్రీడిగ్రీ కోర్సు) అంటారు కాబట్టి, మీరు డీ…ఈడీ కూడా చేసే అవకాశం ఉంది. కాకపోతే, మీ పీడీసీ కోర్సును డీ…ఈఈసెట్‌ కమిటీ వారు ఇంటర్మీడియట్‌కు సమానమని నిర్ణయించాలి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: శ్రేయా యాదవ్‌

    Ans:

    పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. ఉపాధ్యాయ నియామకాల్లో ప్రమాణాలను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ  టెస్ట్‌ (సీటెట్‌)నూ, రాష్ట్ర ప్రభుత్వాలు టీచర్‌ ఎలిజిబిలిటీ  టెస్ట్‌ (టెట్‌)నూ నిర్వహిస్తున్నాయి. సీటెట్‌ విషయానికొస్తే, ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించడానికి సీటెట్‌ పేపర్‌ -1 లో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పేపరు ఐదు సెక్షన్‌లతో రెండున్నర గంటల వ్యవధితో ఉంటుంది.  ఈ పరీక్షలో చైల్డ్‌ డెవలప్‌ మెంట్‌ అండ్‌ పెడగాజీ, లాంగ్వేజ్‌-1, లాంగ్వేజ్‌-2, మేథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ల్లో, ఒక్కో సెక్షన్‌ లో 30 చొప్పున 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించడానికి సీటెట్‌ పేపర్‌ -2లో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పేపర్‌ నాలుగు సెక్షన్‌లతో రెండున్నర గంటల వ్యవధితో ఉంటుంది. ఈ పరీక్షలో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజీ, లాంగ్వేజ్‌-1, లాంగ్వేజ్‌-2, మేథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌/ సోషల్‌ స్టడీస్‌ ల్లో 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. సీటెట్‌లో తప్పు సమాధానాలకు నెగిటివ్‌ మార్కులు లేవు. చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజీలో విద్యా మనస్తత్వశాస్త్రంపై, 6-11/11-14 వయసు వారికి సంబంధించిన బోధన, విభిన్న అభ్యాసకుల లక్షణాలు, వారి అవసరాలను అర్థం చేసుకోవడం, మంచి బోధకుల లక్షణాలపై ప్రశ్నలుంటాయి. సీటెట్‌ పరీక్ష కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఉన్న సిలబస్‌కు అనుగుణంగా సొంతంగా నోట్స్‌ తయారు చేసుకోవాలి. సైకాలజీ, మేథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ల కోసం వైలీ, పియర్‌ సన్, అరిహంత్, దిశ లాంటి పబ్లిషర్లు ప్రచురించిన ప్రామాణిక పుస్తకాలను చదవండి. గత పరీక్షపత్రాల్లో వచ్చిన ప్రశ్నల సరళిని గమనించి, అందుకు తగ్గట్టుగా సన్నద్ధంకండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

     

    Asked By: జి. చరిత

    Ans:

    మీరు ఈ డిప్లొమాని ఇంటర్మీడియట్‌ తర్వాత చేసివుంటే, డిగ్రీ కూడా చదివే ప్రయత్నం చేయండి. డిగ్రీ చదివిన తరువాత బీఈడీ కూడా చేసే అవకాశం ఉంది. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా తరువాత నాలుగు సంవత్సరాల వ్యవధి ఉన్న ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఈడీ/ బీఎస్సీ బీఈడీ/ బీకామ్‌ బీఈడీ కోర్సు కూడా చేయొచ్చు. ఎలిమెంటరీ ఎడ్యుకేష న్‌లో డిప్లొమాతో పాటు ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ చేసినట్లయితే, బీఈడీ చేయకుండా నేరుగా ఎంఈడీ చేయడానికి అర్హులవుతారు.
    డీఈడీ/ బీఈడీ తరువాత టెట్‌లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ/ ప్రైవేటు పాఠశాలల్లో బోధన రంగంలోకి ప్రవేశించవచ్చు. మీరు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా తరువాత ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ, పీజీలతో పాటు ఎంఈడీ+ పీహెచ్‌డీ కూడా చేసినట్లయితే  బీఈడీ/ ఎంఈడీ కోర్సులను బోధించడానికి అర్హులవుతారు.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: SURESH BABU

    Ans:

    సంఘాన్ని సంస్కరించువాడు. ద్వితీయ తత్పురుష సమాసం

    Asked By: DEVADATTAM MEKALA

    Ans:

    రెండు అంకెలను కలిపి సంఖ్య అంటారు. అంకెలను సంఖ్యలు అనవచ్చు కానీ, సంఖ్యలను అంకెలు అనకూడదు. 0 - 9 అక్షరాలను అంకెలు అంటారు.