Post your question

 

    Asked By: పి. నూకరాజురెడ్డి

    Ans:

    సివిల్స్, ఏపీపీఎస్సీ గ్రూప్‌-1, గ్రూప్‌-2 లాంటి పరీక్షలకు శిక్షణ ఎంత ముఖ్యమో ఆ శిక్షణ సంస్థ విశ్వసనీయత కూడా అంతే ముఖ్యం. సాధ్యమైనంతవరకు గ్రూప్స్‌/సివిల్స్‌ శిక్షణను ఆఫ్‌లైన్‌లో తీసుకోవడం శ్రేయస్కరం. గ్రూప్స్‌/ సివిల్స్‌ శిక్షణలో తరగతి గదిలో నేర్చుకొనే సబ్జెక్టుతో పాటు, తోటి అభ్యర్ధుల నుంచీ చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఆఫ్‌లైన్‌ అవకాశం లేకపోతేనే ఆన్‌లైన్‌ శిక్షణ తీసుకోండి. గత రెండు సంవత్సరాలుగా కొవిడ్‌ కారణంగా చాలా సంస్థలు ఆన్‌లైన్‌లో సివిల్స్‌/గ్రూప్స్‌ కోచింగ్‌ను అందిస్తున్నాయి. ఆఫ్‌లైన్‌లో నాణ్యమైన శిక్షణ అందించే సంస్థల నుంచే ఆన్‌లైన్‌ శిక్షణ పొందండి.

    ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థ ఎంపికలో ఏ విషయాలు గమనించాలంటే.. 1. కంటెంట్‌ నాణ్యత 2. పరీక్షల నాణ్యత 3. వ్యక్తిగత శ్రద్ధ 4. విశ్లేషణాత్మక వీడియో పరిష్కారాలు 5. సాంకేతిక సేవలు 6. ఇతర అభ్యర్థులతో చర్చించగలిగే డిస్కషన్‌ ఫోరమ్‌ 7. అధ్యాపకుల విషయ పరిజ్ఞానం/ అనుభవం  8. నిరంతర ఆన్‌లైన్‌ సహాయం. వీటిని దృష్టిలో పెట్టుకొని గత రెండు, మూడు సంవత్సరాలుగా ఆన్‌లైన్‌ శిక్షణ పొందినవారిని సంప్రదించి, వారి సూచనల ప్రకారం మంచి శిక్షణ సంస్థను ఎంచుకోండి.

    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,

    Asked By: జి. వాణీప్రియ

    Ans:

    ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి ముందుగా క్వాలిఫయింగ్‌ పరీక్ష ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణత సాధించినవారు మాత్రమే రెండో దశ పరీక్షకు అర్హులు అవుతారు. క్వాలిఫయింగ్‌ పరీక్షలో వచ్చిన మార్కులు తుది ఎంపికలో పరిగణించరు. క్వాలిఫయింగ్‌ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. అందులో మొదటిది జనరల్‌ ఇంగ్లిష్, రెండోది మేథమెటిక్స్‌ (10వ తరగతి స్థాయి). జనరల్‌ ఇంగ్ల్లిష్‌ కోసం ఆబ్జెక్టివ్‌ జనరల్‌ ఇంగ్లిష్‌ (ఎస్‌ చాంద్‌), ఆబ్జెక్టివ్‌ ఇంగ్లిష్‌ ఫర్‌ జనరల్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామినేషన్స్‌ (పియర్‌సన్‌), ఆబ్జెక్టివ్‌ జనరల్‌ ఇంగ్లిష్‌ (అరిహంత్‌), ఇంగ్లిష్‌ ఫర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామినేషన్స్‌ (ఎస్‌ చాంద్‌) లాంటి పుస్తకాలను చదవండి. మేథమెటిక్స్‌ కోసం హైస్కూల్‌ మేథమెటిక్స్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (ఎస్‌ చాంద్‌), టీచ్‌ యువర్‌ సెల్ఫ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (మెక్‌ గ్రాహిల్‌) లాంటి పుస్తకాలను చదవండి. రెండో దశలో జనరల్‌ స్టడీస్, ఒక ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లో రెండు పరీక్షలుంటాయి. జనరల్‌ స్టడీస్‌ కోసం తెలుగు అకాడెమీ, అరిహంత్, లూసెంట్‌ లాంటి పబ్లిషర్లు ప్రచురించిన పుస్తకాలను చదవండి. ఆప్షనల్‌ పేపర్‌ విషయానికొస్తే, మీరు ఎంచుకొన్న ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ సిలబస్‌ను అనుసరించి ప్రామాణిక పుస్తకాలను చదివి సొంత నోట్స్‌ ఆధారంగా తయారవ్వండి. - ప్రొ. బెల్లకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: శ్రీకాంత్‌

    Ans:

    పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేప్పుడు నిర్ధారిత సిలబస్‌ కంటే ఎక్కువే చదవాలి. సాధారణంగా ఉద్యోగ నోటిఫికేషన్‌లో ఇచ్చే సిలబస్‌ విశాల పరిధిలో ఉంటుంది. కొన్నిసార్లు పరీక్షలో ఇచ్చే ప్రశ్నలు సిలబస్‌ పరిధి దాటినట్లు అనిపించినా సాంకేతికంగా నిరూపించడం కష్టమే. పదోతరగతి పాఠ్య పుస్తకాలు చదివి అర్థం చేసుకోవాలంటే, అందుకు సంబంధించిన ప్రాథమిక విషయాలు దిగువ తరగతుల్లో ఉంటాయి కాబట్టి, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ పుస్తకాలు కూడా చదవండి. మీరు గ్రూప్‌-4 కు దరఖాస్తు చేసుకుంటే, ఆ సిలబస్‌ తోపాటు, అంతకంటే పై స్థాయి సిలబస్‌నూ చదవడం శ్రేయస్కరం. ఉదాహరణకు మెంటల్‌ ఎబిలిటీ సబ్జెక్ట్‌ సిలబస్‌లో డిగ్రీ, ఇంటర్, పదో తరగతి స్థాయిలో వివిధ రకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కానీ పరీక్షలో ఇచ్చే ప్రశ్న ఏ స్థాయిలో ఉందో కచ్చితంగా నిర్థÄరించడం కొన్నిసార్లు కష్టమవుతుంది. ప్రాథమిక అంశాలపై గట్టి పట్టు, నిరంతర కృషి ఉంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించడం అంత కష్టమేమీ కాదు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: Gamingi

    Ans:

    Till this date, no official announcement on Group 4 examination date.

    Asked By: ఎస్‌. పవన్‌

    Ans:

    - పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫై చేసే ఉద్యోగాల్లో కొంత శాతం ఉద్యోగాలను లోకల్, నాన్‌ లోకల్, కుల రిజర్వేషన్‌లతో సంబంధం లేకుండా ఓపెన్‌ మెరిట్‌తో నింపుతారు. ఆ ఉద్యోగాలకు, స్వరాష్ట్రానికి చెందినవారితో పాటు, ఏ రాష్ట్రానికి చెందినవారైనా పోటీపడవచ్చు. ఉదాహరణకు ఏపీపీఎస్‌సీ 60 ఎండోమెంట్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌  ఇస్తే, అందులో 15% అంటే- 9 ఉద్యోగాలకు లోకల్‌/ నాన్‌ లోకల్‌/ క్యాస్ట్‌/విమెన్‌  రిజర్వేషన్‌లతో సంబంధం లేకుండా ఎవరైనా పోటీపడవచ్చు. అంటే, ఆ ఉద్యోగపరీక్షకు హాజరైన కొన్ని వేలమందిలో మీకు రాష్ట్ర వ్యాప్తంగా 9వ ర్యాంకులోపు రావాలి. నాన్‌ లోకల్‌లో ఉద్యోగం తెచ్చుకోవడం కష్టంతో కూడుకొన్నప్పటికీ, అసాధ్యం మాత్రం కాదు. ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా చదివి మీ ఆశయాన్ని నెరవేర్చుకోండి.   

    Asked By: ప్రశాంత్‌

    Ans:

    చాలామంది డిగ్రీ పూర్తయ్యాక ఉపాధికి ప్రయత్నాలు చేయడం, ఉన్నతవిద్యను అభ్యసించడంలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ దిశలో ప్రయత్నాలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంతమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకోసం మాత్రమే ప్రయత్నిస్తే, మరికొంతమంది రాష్ట్ర ప్రభుత్వ కొలువుల కోసం సన్నద్ధమవుతారు. చాలామంది రెండింటికీ తయారవుతారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఎక్కువ పోస్టులు అందుబాటులో ఉంటాయి. ఇక మీరు అడిగిన గ్రూప్‌ -2 తరహా నోటిఫికేషన్‌కు మీరు ఊహించేదానికంటే పోటీ ఎక్కువగానే ఉంటుంది. రాబోయే నోటిఫికేషన్‌ కోసం మాత్రమే కాకుండా అందుబాటులో ఉన్న అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కొలువుల కోసం కృషి చేయండి.
    ఏదైనా ఒక ఉద్యోగం పొందిన తరువాత మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. గతంలో జరిగిన గ్రూప్‌-1, గ్రూప్‌-2 నియామకాల్లో చాలామంది ఏదో ఒక ప్రభుత్వ/ ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే గ్రూప్స్‌ కోసం సన్నద్ధమై ఉద్యోగాలు పొందారు. సమయం వృథా కాకుండా ఉండాలంటే కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన జనరల్‌ స్టడీస్, కరెంట్‌ అఫైర్స్, మెంటల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్, డేటా విశ్లేషణ లాంటి అంశాలను అధ్యయనం చేసి వాటిపై పట్టు సాధించండి. ఆత్మవిశ్వాసం, నిరంతర కృషి, పట్టుదల, కఠోర శ్రమ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న మీ కల కచ్చితంగా నెరవేరుతుంది.
    కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన జనరల్‌ స్టడీస్, కరెంట్‌ అఫైర్స్, మెంటల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్, డేటా విశ్లేషణ లాంటి అంశాలను అధ్యయనం చేసి వాటిపై పట్టు సాధించండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌  

    Asked By: అనిత

    Ans:

    ఏపీపీఎస్‌సీ నిర్వహించే గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షలు రాయడానికి ఏదైనా బాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బీఎస్‌సీ నర్సింగ్‌ కూడా బాచిలర్‌ డిగ్రీనే కాబట్టి, ఏపీపీఎస్‌సీ అయినా, మరే సంస్థ అయినా బాచిలర్‌ డిగ్రీ అర్హతతో నిర్వహించే అన్నీ పోటీ పరీక్షలను మీరు నిరభ్యంతరంగా రాయవచ్చు. మీరు బీఎస్‌సీ నర్సింగ్‌లో చదివే సిలబస్‌ గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షల సిలబస్‌లు వేరు వేరుగా ఉంటాయి. అందుకని ఎక్కువ ప్రిపరేషన్‌ అవసరం ఉంటుంది. రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు ప్రణాళికాబద్ధంగా చదివితే మీ ఆశయాన్ని నెరవేర్చుకోవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: education tech channel

    Ans:

    మీరు అడిగిన సమాచారం మన వెబ్ సైట్ ఏపీపీఎస్సీ లో అందుబాటులో ఉంది.  పరిశీలించండి.

    ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి.

    https://www.eenadupratibha.net/appsc

    Asked By: Bheemavarapu Murali

    Ans:

    First read high school books to get good hold on basics. Then read Intermediate and Degree level books as per prescribed syllabus for Group-1. Read at least two news papers daily for Current Affairs. Prepare own notes on all subjects, which help you to make quick revisions. Topics related Disaster Management and Environment refer NCERT school books. 

    Asked By: Lokesh Naidu

    Ans:

    తెలుగు సబ్జెక్టుకి సంబంధించి అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. భాషపై ఇష్టం ఉంటే ఆ మార్గంలోనే ఉద్యోగాన్ని పొంది భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. డిగ్రీలో తెలుగు ప్రత్యేక సబ్జెక్టుగా చదివి, తెలుగు మెథడాలజీతో బీఈడీ చేస్తే ఉపాధ్యాయ ఉద్యోగాలు అందుకోవచ్చు. తెలుగులో పీజీ చేస్తే జూనియర్ లెక్చరర్ లుగా చేరవచ్చు. పీజీ తర్వాత జాతీయ స్థాయిలో యూజీసీ-నెట్, రాష్ట్రస్థాయిలో సెట్ లో అర్హత సాధిస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరిశోధనలు చేయవచ్చు. పీహెచ్ డీ కూడా చేస్తే మరెన్నో ఉద్యోగావకాశాలను పొందవచ్చు.