Post your question

 

  Asked By: సురేష్‌

  Ans:

  బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను రెగ్యులర్‌గానే చదవాలి. ఒకవేళ రెగ్యులర్‌గా చదవడం కుదరకపోతే ఆన్‌లైన్‌లో చదివే ప్రయత్నం చేయండి. డిస్టెన్స్‌ మోడ్‌లో సర్టిఫికెట్‌/డిప్లొమా కోర్సుకు బదులు, ఎంబీఏ చేసే ప్రయత్నం చేయండి. సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సుల నాణ్యత- వాటిని అందించే సంస్థల విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు అందించే సర్టిఫికెట్‌లకు మార్కెట్లో ఎక్కువ గుర్తింపు ఉంటుంది. జనరల్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో కంటే, ఏదైనా స్పెషలైజేషన్‌ లో సర్టిఫికెట్‌/డిప్లొమా కోర్సు చేస్తే ఎక్కువ ఉపయోగకరం.
  మీరు సేల్స్‌ విభాగంలో పనిచేస్తున్నారు కాబట్టి, సేల్స్‌ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్, డిజిటల్‌ మార్కెటింగ్, అడ్వర్ట్టైజింగ్, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్, బ్రాండింగ్, కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ్స మేనేజ్‌మెంట్, రీటెయిలింగ్, ఈ-కామర్స్, సర్వీసెస్‌ మార్కెటింగ్‌ లాంటి కోర్సులు చేసినట్లయితే మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగ అనుభవం, ఉద్యోగ మెలకువలతో పాటు మెరుగైన విద్యాసంస్థ నుంచి పొందే సర్టిఫికెట్‌ సహాయంతో, మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. -
  ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: ఎ. సాయిపవన్‌

  Ans:

  మీరు బీఎస్సీ చదివేప్పుడే రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో పనిచేయాలని ఆలోచించడం అభినందనీయం. బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీలు రెండూ పరిశోధనకు బాగా అవకాశమున్న రంగాలే. లైఫ్‌ సైన్సెస్‌లో ముఖ్యమైన విభాగాలే. రెండు కోర్సుల్లో చదివే సిలబస్‌లో సారూప్యం ఉంటుంది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో రెండు నుంచి మూడు సెమిస్టర్లు.. ఈ రెండు కోర్సులవారు ఒకే తరగతి గదిలో కలిసే చదువుతారు. ఈ రెండు విభాగాల్లో పరిశోధనాంశాలు కూడా చాలావరకు ఒకేలా ఉంటాయి. మీకు అమితాసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకొని, ప్రాథ]మికాంశాలు, అప్లికేషన్స్‌ బాగా నేర్చుకొని మేలైన పరిశోధనలు చేసే ప్రయత్నం చేయండి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: మురళీ కిరణ్‌‌

  Ans:

  ఎమ్మెస్సీలో కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అండ్‌ మెరైన్‌ బయోటెక్నాలజీ, మెరైన్‌ బయాలజీ అండ్‌ ఫిషరీస్‌ల్లో ఏ కోర్సు చదివినా కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాలకు మాత్రమే అర్హత పొందుతారు. ఈ రెండు కోర్సులూ విభిన్నమైనవీ, ప్రత్యేకమైనవీ. మీకు ఏ రంగంపై ఆసక్తి ఉంది, ఏ రంగంలో స్థిరపడాలనుకొంటున్నారు అనే విషయాలను బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది. పరిశోధన, బోధన రంగాల్లో ఆసక్తి, విదేశాల్లో స్థిరపడాలన్న అభిలాష లాంటివీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి. ఏ యూనివర్సిటీల్లో చదవాలనుకొంటున్నారో, ఆ వర్సిటీల సిలబస్‌ను గమనించి ఆసక్తి ఉన్న కోర్సును ఎంచుకోండి.
  కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అండ్‌ మెరైన్‌ బయోటెక్నాలజీ అప్లైడ్‌ సైన్స్‌ కోర్సు అయితే మెరైన్‌ బయాలజీ అండ్‌ ఫిషరీస్‌ అనేది కొంతవరకు బేసిక్‌ సైన్స్‌ అని చెప్పవచ్చు. రెండు కోర్సుల్లోనూ పరిశోధనకు విస్తృత అవకాశాలున్నాయి. రెండు కోర్సులు చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి.
  - ప్రొ. బి.రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌
   

  Asked By: - ఎం.సునీత

  Ans:

  మీటీయొరాలజీ కోర్సులో వాతావరణ పరిశీలనల రికార్డింగ్, వాతావరణ డేటాను విశ్లేషించడం, వాతావరణ వ్యవస్థల అంచనాకు కావాల్సిన సాంకేతికత పరికరాలపై శిక్షణ అందిస్తారు. వీటితో పాటుగా ఉష్ణమండల తుపానులు, పట్టణ వరదలు, నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు, కరువు, భూకంపాలు, వేడి తరంగాలు, చల్లని తరంగాలు, రిమోట్‌ సెన్సింగ్, భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్‌), వాతావరణ రాడార్లు, వాతావరణ ఉపగ్రహాల ప్రత్యేకత, రోజువారీ వాతావరణ మార్పులు, భూతాప ప్రభావాల గురించీ నేర్చు కొంటారు. మీరు డిగ్రీ స్థాయిలో ఫిజిక్స్‌ చదివారు కాబట్టి మీటీయొరాలజీ కోర్సులో పీజీ/ డిప్లొమా చదవడానికి అర్హులే.
  వాతావరణ శాస్త్రం లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను దూరవిద్యలో కాకుండా రెగ్యులర్‌గా చదవడమే మంచిది. డిప్లొమా కంటే పీజీ చదివితే ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయి. మీటీయొరాలజీలో పీజీ కోర్సు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, ఆంధ్ర యూనివర్సిటీ, కొచ్చిన్‌ యూనివర్సిటీ, బెర్హాంపుర్‌ లాంటిచోట్ల అందుబాటులో ఉంది. వీటితో పాటు కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలూ ఈ కోర్సును అందిస్తున్నాయి. ఎమ్మెస్సీ చదివారు కాబట్టి గేట్‌ రాసి ఎంటెక్‌ కోర్సు చేసినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. మీటీయొరాలజీలో ఎంటెక్‌ కోర్సు ఐఐఎస్సీ బెంగళూర్, ఐఐటీ దిల్లీ, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ భువనేశ్వర్, సావిత్రిబాయి ఫూలే పుణె వర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, కొచ్చిన్‌ యూనివర్సిటీలాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో అందుబాటులో ఉంది.
  - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: ఎ. సాయి పవన్‌

  Ans:

  సాధారణంగా ఎంఎస్‌సీ అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ చదవడానికి డిగ్రీలో అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌/ ఫారెస్ట్రీ/ అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ/ సెరికల్చర్‌ లాంటి సబ్జెక్టులు చదివివుండాలి. మీరు బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీలతో డిగ్రీ చదివారు కాబట్టి, చాలా యూనివర్సిటీల్లో ఎంఎస్‌సీ అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ చదవడానికి మీరు అర్హులు కారు. కానీ జీబీ పంత్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీలో ప్రవేశానికి రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ వారు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌- బయోటెక్నాలజీ (GAT-B) పరీక్ష రాయవలసి ఉంటుంది. రామకృష్ణ మిషన్‌ వివేకానంద ఎడ్యుకేషనల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల్లో కూడా అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ పీజీకి అర్హత ఉంది. ఎంఎస్‌సీ అగ్రికల్చర్‌ మైక్రోబయాలజీ చదవాలంటే డిగ్రీలో అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌/ ఫారెస్ట్రీ/ అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ/ సెరికల్చర్, డైరీ సైన్సెస్‌/ బీవీఎస్‌సీ/ హోమ్‌ సైన్స్‌ లాంటివి చదివివుండాలి. అందుకని మీరు ఎంఎస్‌సీ అగ్రికల్చర్‌ మైక్రోబయాలజీ చదవలేరు.
  ఎంఎస్‌సీ ప్లాంట్‌ బయోటెక్నాలజీ చదవడానికి మీరు అర్హులే. ఈ కోర్సు ఎంజీఎం యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లతో పాటు కొద్ది ప్రైవేటు కళాశాలల్లో అందుబాటులో ఉంది. మీ ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోవాలంటే ఎంఎస్‌సీ బయోటెక్నాలజీ కోర్సు ఎంచుకోండి. ఎంఎస్‌సీ సీడ్‌ సైన్స్‌ టెక్నాలజీ చదవాలంటే డిగ్రీలో అగ్రికల్చర్‌ సంబంధిత కోర్సులు చదివివుండాలి. బీఎస్‌సీ అర్హతతో కొన్ని ప్రైవేటువర్సిటీల్లో మాత్రమే ఈ కోర్సును చదివే అవకాశం ఉంది. ఆయా విద్యాసంస్థల్లో చేరేముందు, ఆ సంస్థల విశ్వనీయతను తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. -
  ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: ఆర్. కీర్తి

  Ans:

  ఎంఎస్సీ (ఆర్గానిక్‌ కెమిస్ట్రీ) చదివినవారికి ప్రైవేటు ఫార్మా, ఫర్టిలైజర్, ఆగ్రో కెమికల్, ఆయిల్, గ్యాస్, బయోటెక్నాలజీ లాంటి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఇస్రో, డీఆర్డీఓ, ఓఎన్‌జీసీ, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం, ఆయిల్‌ ఇండియా లాంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో, ప్రయోగశాలల్లో, కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోని కెమిస్ట్రీ ప్రయోగశాలల్లో చేరవచ్చు. సైంటిస్ట్, సైంటిఫిక్‌ ఆఫీసర్, టెక్నికల్‌ ఆఫీసర్, సైంటిఫిక్‌ అసిస్టెంట్, ల్యాబ్‌ అసిస్టెంట్, రిసెర్చ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించవచ్చు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. బోధనరంగంపై ఆసక్తి ఉంటే బీఈడీ చేసి స్కూల్‌ అసిస్టెంట్‌గా, టీజీటీగా, పీజీటీగా పాఠశాలల్లో ఉద్యోగాలు దొరుకుతాయి. ఇవే కాకుండా జూనియర్‌ కళాశాలల్లో  కెమిస్ట్రీ లెక్చరర్‌గా స్థిరపడవచ్చు. నెట్‌/సెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే డిగ్రీ కళాశాలల్లో కెమిస్ట్రీ సహాయ ఆచార్యులుగా ఉద్యోగం లభిస్తుంది. ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసి విద్యాసంస్థల్లో సహాయ ఆచార్యులుగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. మీకు పరిశోధనలపై ఎక్కువ ఆసక్తి ఉంటే విదేశాల్లో పోస్ట్‌ డాక్టొరల్‌ పరిశోధన కోసం కూడా ప్రయత్నించవచ్చు. ఎంఎస్సీ (ఆర్గానిక్‌ కెమిస్ట్ర్టీ) తరువాత గేట్‌ రాసి ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఎంటెక్‌ చేసి ఇంజినీరింగ్‌ సంస్థల్లో ఉద్యోగాలకు అర్హత సాధించవచ్చు. 

  Asked By: - నాగేంద్ర, విజయనగరం

  Ans:

  మెడికల్‌ డ్రగ్స్, పాలిమర్, ఎలక్ట్రానిక్‌ పరికరాల రంగాల్లో ఈ కోర్సు విజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. దీన్ని పూర్తి చేసినవారికి సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్, అనలిటికల్‌ కెమిస్ట్రీ అసోసియేట్, రిసెర్చ్‌ కెమిస్ట్, టాక్సాలజిస్ట్‌ ఉద్యోగాలు లభిస్తాయి. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, జి.ఎస్‌.ఐ, ఫెడరల్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్, ఫుడ్‌ కార్పొరేషన్, ఓఎన్‌జీసీ, ఐఐసీటీ లాంటి ప్రభుత్వరంగ సంస్థల్లో, ఆర్‌ అండ్‌ డీ శాఖల్లో ఉద్యోగ అవకాశాలున్నాయి. ప్రైవేటు రంగంలో జి.ఎస్‌.కె., డాక్టర్‌ రెడ్డి లాబ్స్, అరబిందో ఫార్మా, హెటిరో, సన్, బేయర్స్‌ లాంటి కంపెనీలు అవకాశాలు కల్పిస్తున్నాయి. పీ‡హెచ్‌డీ చేసి పరిశోధనా సంస్థల్లో శాస్త్రవేత్తగా, విద్యాసంస్థల్లో అధ్యాపకుడిగా స్థిరపడవచ్చు. పీహెచ్‌డీ తరువాత విదేశాల్లో పోస్ట్‌ డాక్టొరల్‌ ఫెలోషిప్‌కీ అవకాశాలున్నాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌