Asked By: ఎన్. అశోక్
Ans:
సీఎస్ఐఆర్ / యూజీసీ నెట్ (లైఫ్‌సైన్సెస్) పరీక్ష కోసం ఎకాలజీ (పీటర్ స్టిలింగ్), ప్లాంట్ ఫిజియాలజీ (టైజ్, జైగర్), మాలిక్యులర్ అండ్ సెల్ బయాలజీ (హార్వే లోడిష్), జెనెటిక్స్ (బెంజమిన్ ఫ్రాంక్లిన్), మాలిక్యులర్ బయాలజీ (కార్ప్స్), ఇమ్యునాలజీ (ఇవాన్ రోట్టిస్), ఇమ్యునాలజీ (క్యూబీ), బయోకెమిస్ట్రీ (లెహింగర్), బయోకెమిస్ట్రీ (వోట్), బయోకెమిస్ట్రీ (స్ట్రైయర్), డెవలప్మెంటల్ బయాలజీ (గిల్బర్ట్) పుస్తకాలను చదవండి. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను సేకరించి ప్రశ్నపత్ర నమూనాను పూర్తిగా అర్థం చేసుకోండి. ప్రతి విభాగానికీ నిర్దిష్ట సంఖ్యలో ఇచ్చిన ప్రశ్నలన్నింటినీ అధ్యయనం చేయండి. పైన చెప్పిన పుస్తకాల నుంచి ఆసక్తి ఉన్న విభాగాల్లో మాదిరి ప్రశ్నలు, సమాధానాలు తయారుచేసుకొని ఒక ప్రణాళిక ప్రకారం సంసిద్ధులు కండి. రుణాత్మక మార్కులుంటాయి కాబట్టి కచ్చితంగా జవాబులు తెలిసిన ప్రశ్నలనే రాయండి.సీఎస్ఐఆర్ / యూజీసీ నెట్‌కు రోజుకు 6 గంటలు చొప్పున కనీసం 6నెలలు నిరాటంకంగా చదివితే అనుకూల ఫలితం సొంతమవుతుంది.- ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్