Asked By: Swetha patnaik
Ans:
Please click on the following link
https://pratibha.eenadu.net/previouspapers/paperslist/intermediate/2-1001-44-448-32
Asked By: Sai
Ans:
Click on the following link and go through the stories, you will get the required information.
https://pratibha.eenadu.net/careersandcourses/lessons/after-inter/courses/2-14-265-578
Asked By: ఎస్.కె.నాగుర్బాషా
Ans:
- సాధారణంగా పదో తరగతి తరువాత చదివే మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులను ఇంటర్‌తో సమానంగానే పరిగణిస్తారు. ఈ మేరకు తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలను కూడా జారీ చేశాయి. డిప్లొమా పూర్తయిన తరువాత మీరు నిరభ్యంతరంగా డిగ్రీ లో చేరవచ్చు. చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడవచ్చు. కొన్ని ప్రత్యేక విద్యా/ ఉద్యోగ నోటిఫికేషన్లలో మాత్రమే ఇంటర్ కచ్చితంగా చదివి ఉండాలన్న నిబంధన విధిస్తున్నారు. మరికొన్ని ప్రత్యేక ఉద్యోగ నోటిఫికేషన్లలో ఇంటర్ రెగ్యులర్‌గా చదివివుండాలన్న నిబంధన కూడా ఉంటుంది. అలాంటి అతికొద్ది ఉద్యోగాలకు మినహా మిగిలిన అన్ని ఉద్యోగాలకూ దూరవిద్యలో చదివే ఇంటర్మీడియట్‌ను రెగ్యులర్ ఇంటర్మీడియట్‌కు సమానంగా పరిగణిస్తారు. ఇటీవల యూజీసీ జారీ చేసిన నిబంధనల్లో ఏకకాలంలో రెండు డిగ్రీలు చేయవచ్చని మాత్రమే ప్రస్తావించారు. ఇంటర్, డిప్లొమాలు ఒకేసారి చదవడం గురించి ఎలాంటి సమాచారమూ అందుబాటులో లేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం మీరు డిప్లొమా చదువుతూనే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్‌లో ఇంటర్ చదివితే, రెండు సర్టిఫికెట్‌లను ఒకేసారి ఉపయోగించుకోలేరు. మూడు సంవత్సరాల తరువాత ఇంటర్ విద్యార్హతతో రాయబోయే పోటీ పరీక్షలకంటే ముందు, ప్రస్తుతం చదువుతున్న డిప్లొమా కోర్సుపై శ్రధ్ధ పెట్టండి. విషయపరిజ్ఞానం పెంపొందించుకొని, మెరుగైన ఉద్యోగాలకోసం ప్రయత్నించండి.
Asked By: ఇ. తరుణి
Ans:
ఇంటర్ (ఎంపీసీ) పాసై సీఏలో చేరాను అన్నారు. ఆ ఆలోచన మార్చుకొని మళ్ళీ ఇంజినీరింగ్ వైపునకు ఎందుకు వెళ్లాలనుకొంటున్నారో కనీసం మూడు కారణాలు రాసుకోండి. ఆ కారణాలను మీ కుటుంబ సభ్యులతో, మీ శ్రేయోభిలాషులతో పంచుకొని, అవి సహేతుకమైనవో కావో నిర్ధారించుకోండి. ఆపైనే నిర్ణయం తీసుకోండి. సీఏ కోర్సు, ఇంజినీరింగ్ కంటే తక్కువేమీ కాదు. ప్రతి సంవత్సరం ఇంజినీర్లు లక్షల్లో మార్కెట్‌లోకి వస్తూ ఉంటే, సీ‡ఏలు మాత్రం కొన్ని వేలమంది మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. ఇంజినీరింగ్ చదివినవారిలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. కానీ, సీఏ కోర్సు చేసినవారికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఒకవేళ సీఏ చదవడం కష్టమనిపిస్తే, మీ సీనియర్‌ల సలహాలు తీసుకొని ముందుకెళ్లండి. ముందుగా మీ జీవితం, భవిష్యత్తుపై మీకో స్పష్టత అవసరం. మీకు ఏ రంగంపై ఆసక్తి ఉంది, జీవితంలో ఎలా స్థిరపడాలనుకొంటున్నారు అనేవి దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: జి. అరుణ్‌కుమార్
Ans:
ఇంటర్మీడియట్‌లో ఆర్ట్స్ గ్రూపు చదివినవారు డిగ్రీలో సైన్స్ చదివే అవకాశం లేదు కానీ, సైన్స్ గ్రూప్ చదివినవారు, డిగ్రీలో ఆర్ట్స్‌లో చేరొచ్చు. జాతీయ విద్యావిధానం- 2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక ఈ అవకాశం ఉండొచ్చు. కాకపోతే చదవబోయే సైన్స్ కోర్సుకు సంబంధించిన కొన్ని ముందస్తు సబ్జెక్టులు చదివివుండాలనే నిబంధన పెట్టే అవకాశం ఉంది. కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు మాత్రం ఇంటర్మీడియట్‌లో ఆర్ట్స్ గ్రూపు చదివినవారికి బీఎస్‌సీ ఇంటీరియర్ డిజైన్, బీఎస్‌సీ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, బి. డిజైన్ లాంటి కోర్సులు అందిస్తున్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: SANTOSH KUMAR MELLACHERUVU
Ans:
In AP and Telangana very few colleges offer BSc/ BA Psychology. Telangana Degree colleges admissions are based on DOST. Refer DOST website for more details.
https://dost.cgg.gov.in/
Few deemed universities are also offering these courses. You can directly contact to those institutes for admission